2024వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ ఏడాదిలో కొన్ని వింత ఘటనలు చోటుచేసుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఎవరూ ఎప్పుడూ చూడని వంటకాలు కూడా కనిపించి అందరికీ కంగుతినిపించాయి. అవి వైరల్‌గా మారి కొందరికి నవ్వు తెప్పించగా, మరికొదరికి అసహ్యం కలిగించాయి. మరికొందరైతే ఇలాంటి వంటకాలు కూడా ఉంటాయా అని తెగ ఆశ్చర్యపోయారు. మరి 2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ వంటకాలేమిటో ఇప్పుడు చూద్దాం.
చాక్లెట్ పాస్తా
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటాలియన్ పాస్తాకు కొత్త ట్విస్ట్ ఇస్తూ, నూతన వంటకం ప్రత్యక్షమయ్యింది. దీనిని కోకో పౌడర్, స్నికర్స్ చాక్లెట్, పాలను మిక్స్ చేసి తయారు చేశారు. ఈ స్నికర్స్ పాస్తా రిసిపీని చూసి జనాలు షాక్ అయ్యారు.
చాక్లెట్ గ్రీన్ పీస్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్‌మేకేస్కల్‌హ్యాపీ అనే పేజీలో చాక్లెట్ కొత్తగా, ఎప్పుడూ చూడని గ్రీన్ పీస్ రెసిపీ దర్శనమిచ్చింది. ఇందులో ఆ ఫుడ్ బ్లాగర్ ఒక చాక్లెట్‌ను మైక్రోవేవ్ బౌల్‌లో ఉంచిన తర్వాత, దానికి బఠానీలను జోడించి, కొన్ని నిమిషాలు మైక్రోవేవ్‌లో ఉంచి, తరువాత ఆనందంగా తిన్నాడు.
మటన్ కీమా కేక్
ఇప్పటి వరకు మీరు చాక్లెట్, పైనాపిల్, బటర్‌స్కాచ్ వంటి కేక్‌లను తినే ఉంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక బేకర్.. మటన్ కీమా కేక్‌ని తయారు చేశారు. ఇందుకోసం మటన్ మిన్స్‌ను తయారు చేశాడు. దానిని స్పాంజ్ కేక్‌పై స్ప్రెడ్ చేసి, దానిని అలంకరించేందుకు ఫ్రెష్‌క్రీమ్‌తో పాటు మటన్ మిన్స్‌ను ఉంచి రెడ్ చిల్లీ, కొత్తిమీరతో అలంకరించాడు. దీనిని చూసినవారంతా ఇదేందిది అనుకుంటూ తెగ ఆశ్చర్యపోయారు.
గుడ్డు హల్వా
సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన కోడిగుడ్డు హల్వాను చూసిన జనానికి మతిపోయింది. ఈ రెసిపీలో ఒక గిన్నెలో గుడ్లు గిలక్కొట్టి, దానిలో చక్కెర, పాలపొడి వేసి, దానిని ఎలక్ట్రిక్ బ్లెండర్ వేసి మెత్తగా చేశారు. తరువాత దానిని ఒక గిన్నెలోకి తీసుకుని, స్టవ్‌పై పెట్టి దానిలో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి సన్నని మంటపై ఉడికించారు.
గులాబ్ జామున్ చాట్
చాట్- గులాబ్ జామూన్.. ఈ రెండు విభిన్న వంటకాలు ఒకటి తీపి వంటకం. మరొకటి స్పైసీ వంటకం. అయితే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గులాబ్ జామూన్ చాట్ తయారు చేశాడు. దానిపై పెరుగు, చింతపండు చట్నీ వేసి వినియోగదారునికి అందించాడు. దీనిని చూసి నెటిజన్లకు దిమ్మతిరిగిపోయింది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్
Comments
Please login to add a commentAdd a comment