Foods
-
Sankranti Special: సంక్రాంతి పిండి వంటలకు ఫిదా
-
అల్లుడికి 250 రకాల వంటకాలతో విందు
-
ఆహ.. ఏమి రుచి!
సాక్షి, అమరావతి: భారతీయ వంటకాలు ప్రపంచ ఆహార ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచస్థాయి వంటకాలు, ఐకానిక్ రెస్టారెంట్ల క్యూరేటెడ్ జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. టేస్ట్ అట్లాస్ ఇటీవల 2024–25 ప్రపంచ ఆహార అవార్డులను ప్రకటించింది. ఇందులో భారతీయ వంటకాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. సంప్రదాయం, రుచుల్ని మిళితం చేసే భారతదేశం పాకశాస్త్ర సంస్కృతికి అద్దం పట్టాయి. భారతీయ వంటకాలు సుగంధ ద్రవ్యాలతో కూడినవని విమర్శకులు పేర్కొన్నప్పటికీ.. ప్రపంచంలోని అత్యంత ఇష్టపడే వంటకాల్లో అగ్రస్థానంలో నిలవడం విశేషం. మొఘల్, పంజాబీ, దక్షిణాది వంటకాల రుచి అనేక రెస్టారెంట్లకు సైతం ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చాయి.దక్షిణాదిలో దోశ.. ఉప్మా రెస్టారెంట్ టేస్ట్ అట్లాస్ 100 మోస్ట్ లెజెండరీ రెస్టారెంట్లలో ఐకానిక్ వంటకాలు, గొప్ప వంటలో భారతీయ ఆహార మార్కెట్ సత్తా చాటింది. కలకత్తాలోని పీటర్ క్యాట్ రెస్టారెంట్‌కు 7వ ర్యాంక్ రాగా.. ఇక్కడ దొరికే ‘చెలో కబాబ్’కు ఆదరణ లభిస్తోంది. ముర్తల్లోని అమ్రిక్ సుఖ్‌దేవ్ రెస్టారెంట్‌కు 13వ ర్యాంక్‌లో ఆలూ పరాటా అందిస్తూ ఆకట్టుకుంటోంది. న్యూఢిల్లీలోని కరీం రెస్టారెంట్ 1,913 నుంచి కోర్మా వంటకం ద్వారా భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది.దీనికి 59వ ర్యాంక్ రావడం విశేషం. బెంగళూరులోని సెంట్రల్ టిఫిన్ రూమ్ మసాలా దోశ మంచి క్రేజ్ సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా 69వ ర్యాంక్‌లో నిలిచింది. న్యూఢిల్లీలోని గులాటి రెస్టారెంట్ 77 ర్యాంక్‌తో బట్టర్ చికెన్.. ముంబైలోని రామ్ ఆశ్రమం ఉప్మాకు 78వ ర్యాంక్ సంపాదించింది.హైదరాబాద్ బిర్యానీ అదుర్స్ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాను వెల్లడించింది. భారత్ నుంచి ముర్గ్ మఖానీ 29వ, హైదరాబాద్ బిర్యానీ 31 స్థానాల్లో నిలిచాయి. చికెన్–65 సైతం 97వ స్థానంలో, కీమా 100వ స్థానం పొందాయి. ముర్గ్ మఖానీ, హైదరాబాద్ బిర్యానీ గ్లోబల్ ఆహార ప్రియుల నుంచి వరుసగా 5, 4.52 స్టార్ రేటింగ్ అందుకున్నాయి. మరోవైపు చికెన్ 65, కీమాకు 4.44 స్టార్ రేటింగ్ వచ్చింది.కొలంబియా లెచోనా.. ఇటలీ పిజ్జా టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్‌లో కొలంబియాకు చెందిన లెచోనా (పోర్క్) వంటకం 4.78 రేటింగ్‌తో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానంలో ఇటలీకి చెందిన పిజ్జా 4.75 రేటింగ్‌తో రెండో స్థానంలో, బ్రెజిల్‌కు చెందిన పికాన్హా 4.69 రేటింగ్‌తో మూడో స్థానం, ఆ తరువాత స్థానాల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఫనాంగ్ కర్రీ, అర్జెంటీనాకు చెందిన అసడో వంటకాలు 4.65 రేటింగ్‌ను పొందాయి. -
బిర్యానీయే బాస్!
సాక్షి, హైదరాబాద్: వంటకాల్లోకెల్లా బిర్యానీయే మరోసారి బాస్‌గా నిలిచింది. దేశంలోని ఆహారప్రియుల ఫేవరేట్ డిష్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఆర్డర్లలో అత్యధికం మంది వినియోగదారులు కోరుకున్న వంటకంగా వరుసగా తొమ్మిదో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో జనవరి 1 నుంచి నవంబర్ 22 మధ్య తమకు 8.3 కోట్ల బిర్యానీల ఆర్డర్లు వచి్చనట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఈ లెక్కన సెకనుకు 2 బిర్యానీల చొప్పున నిమిషానికి 158 బిర్యానీల ఆర్డర్లు నమోదైనట్లు తెలిపింది. ఈ మేరకు వివిధ రకాల ఆర్డర్ల వివరాలతో కూడిన దేశవ్యాప్త ఆహార ట్రెండ్స్‌తో వార్షిక నివేదికను విడుదల చేసింది.నివేదికలోని విశేషాలు ఇవీ.. ⇒ దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఆర్డర్లతో బిర్యానీ తర్వాత దోశ రెండో స్థానంలో నిలిచింది. ⇒ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ సమయాలతో పోలిస్తేడిన్నర్ టైంలో ఏకంగా 21.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. ఇది లంచ్ ఆర్డర్ల కంటే దాదాపు 29% ఎక్కువ. ⇒ అత్యధికంగా ఆర్డర్ చేసిన తీపి వంటకాలుగా రసమలై, సీతాఫల్ ఐస్‌క్రీం చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ⇒ బెంగళూరులో ఓ వినియోగదారుడు పాస్తా కోసం ఈ ఏడాదిలో ఏకంగా రూ. 49,900 ఖర్చు చేశాడు. ⇒ ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో రాజధాని షిల్లాంగ్ ప్రజలు అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం నూడుల్స్. ⇒ స్విగ్గీ డెలివరీ బాయ్స్ 196 కోట్ల కిలోమీటర్ల మేర ఆర్డర్ల డెలివరీలు పూర్తి చేశారు. ఇది కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు 5.33 లక్షలసార్లు డ్రైవింగ్ చేయడంతో సమానం. ⇒ ముంబైకి చెందిన కపిల్ కుమార్ పాండే అనే స్విగ్గీ రైడర్ ఈ ఏడాది అత్యధికంగా 10,703 ఆర్డర్లను అందించగా, కోయంబత్తూరుకు చెందిన కాళీశ్వరి 6,658 ఆర్డర్లతో మహిళా డెలివరీ విభాగంలో తొలి స్థానంలో నిలిచారు. ⇒ బ్రేక్‌ఫాస్ట్‌గా 85 లక్షల దోసెలు, 78 లక్షల ఇడ్లీలతో దక్షిణాదివాసులు తమ ఆహార అలవాట్లను మరోసారి చాటారు. ⇒ బెంగళూరువాసులు 25 లక్షల మసాలా దోశలను ఆస్వాదించగా.. ఢిల్లీ, చండీగఢ్, కోల్‌కతా నగరాల ప్రజలు చోలే, ఆలూ పరాటా, కచోరీలను ఆరగించారు. ⇒ 24.8 లక్షల ఆర్డర్లతో దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన స్నాక్‌గా చికెన్ రోల్ నిలిచింది. చికెన్ మోమోస్ 16.3 లక్షల ఆర్డర్లను, ఆలూ ఫ్రై 13 లక్షల ఆర్డర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ⇒ చికెన్ బర్గర్ 18.4 లక్షల మిడ్నైట్ ఆర్డర్లలో టాప్‌లో నిలవగా రెండవ స్థానాన్ని చికెన్ బిర్యానీ దక్కించుకుంది. ⇒ ఢిల్లీలో ఓ కస్టమర్ ఒకే ఆర్డర్లో ఏకంగా 250 ఆనియన్ పిజ్జాలను ఆర్డర్ చేశాడు. -
ఆ నాలుగు 'వైట్ ఫుడ్స్'ని నివారిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!
ఈ బిజీ లైఫ్‌లో సంపూర్ణ ఆరోగ్యంగాన్ని ఎలా పొందగలమని చాలామంది బాధపడుతుంటారు. కొద్దిపాటి చిట్కాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండొచ్చట. ఇక్కడ కొద్దిపాటి శ్రద్ధ ఉంటే చాలంటున్నారు నిపుణులు. వర్కౌట్లు, డైట్లు చేయకపోయినా.. తినే ఆహారంపై కాసింత స్ప్రుహ ఉంటే చాలు..సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దామా..!.మైదాతో చేసిన పదార్థాలకు దూరంగా ఉంటే సగం వ్యాధుల దరిచేరవట.అలాగే పంచదారను నివారించటం అంటే..టీ, కాఫీల్లో పర్లేదని లైట్‌గా తీసుకోకూడదట. వాటిల్లో కూడా పూర్తిగా నివారించి దానికి బదులుగా ఫ్రూట్ స్వీట్స్ లేదా బెల్లం జోడించండి చాలు.మరొకటి బంగాళ దుంపలు ఆరోగ్యకరమైన రీతిలో తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదట. డీఫ్ ఫై, చిప్స్ రూపంలో అయితే అస్సలు వద్దని చెబుతున్నారు. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందటచివరిగా తెల్లబియ్యం నివారించాలట. బాగా పాలిష్ పెట్టిన బియ్యం కాకుండా పొట్టు తక్కువగా తీసిని బియ్యం, ముడిబియ్యం లేదా బ్రౌన్ రైస్ తీసుకోమంటున్నారు. అలాగే ఒకవేళ తినాలనుకున్న వైట్ రైస్‌ని మితంగా తీసుకునే యత్నం చేసినా చాలు. ఎలాంటి అనారోగ్య సమస్యలు బారినపడే అవకాశం ఉండదని చెబుతున్నారు నిపుణులు. దీంతోపాటు పొగ, మద్యపానం వంటి చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండమని సూచిస్తున్నారు.ఒకవేళ పైన చెప్పిన ఆ ఆహారాలను పూర్తిగా నిషేధించలేకపోయినా..కనీసం పరిమిత స్థాయిలో మితంగా తీసుకునే యత్నం చేసినా..సత్ఫలితాలను పొందగలరని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులను సంప్రదించి అనుసరించటం మంచిది. (చదవండి: ఛీ.. ఫేషియల్ కోసం అదా? హాలీవుడ్ తారల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే..) -
ఎగతాళి నుంచి సంతాలి రుచుల దాకా...
మధుస్మిత సోరెన్ ముర్ము ఓ ట్రెండ్‌సెట్టర్. సంతాలి ఆదివాసీ వంటకాలను, ఇటాలియన్ వంటకాల శైలితో మేళవించి కొత్త రుచులను ఆవిష్కరిస్తోంది. సంతాలి సంప్రదాయ వంటల గురించి బ్లాగ్‌లో రాస్తోంది. కొద్దిరోజుల్లోనే ఓ సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది మధుస్మిత. బాల్యంలో ఎదురైన చిన్న చూపు నుంచి ఎదిగిన విజయ కిరణం ఆమె. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా, రాయ్‌రంగపూర్ అమ్మాయి మధుస్మిత.పోటీలో విజయంఆదివాసీల ఆహారపు అలవాట్లు నాగరక సమాజానికి భిన్నంగా ఉంటాయి. అడవుల్లో దొరికే చీమలు, నత్తలు, ఇతర కీటకాల వంటలు వారి ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. లంచ్ బాక్సులో ఆమె ఆహారాన్ని చూసిన ఇతర విద్యార్థులు ఆమెను తక్కువగా చూసేవారు. అప్పటినుంచి ఆమెలో తమ ఆహారపు అలవాట్లను నాగరకులు ఎందుకు తక్కువగా చూస్తారు... అనే సందేహం కలిగింది. ఆమెతోపాటే ఆమె సందేహం కూడా పెద్దదైంది. ‘ఒడిశా హోమ్‌ఫుడ్ షెఫ్’ పోటీల్లో గెలవడం మధుస్మితలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తమ సంప్రదాయ వంటకాలను ఇతర ప్రాంతాల వంటకాల శైలితో మేళవించి వండడం అనే ప్రయోగం కూడా విజయవంతమైంది. బీటెక్ చదివేనాటికి ఆమెకు ఒక పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం విజయవంతం అవుతుందా లేదా అనే ప్రశ్నకు కోవిడ్ లాక్డౌన్ చక్కటి సమాధానాన్ని చెప్పింది. లాక్డౌన్ సమయంలో వంటల మీద పరిశోధనలు మొదలుపెట్టింది. లాక్డౌన్ తర్వాత సంతాలి వంటలు ఎన్ని రకాలున్నాయో తెలుసుకోవడానికి ఆ గ్రామాల్లో పర్యటించింది. ఎలా వండుతున్నారో తెలుసుకుంది. తెలుసుకున్న విషయాలను బ్లాగ్‌లో రాయడం మొదలుపెట్టింది.ఇప్పుడామె చెఫ్‌లకు శిక్షణనిస్తోంది. ప్రముఖ రెస్టారెంట్లలో సంతాలి తెగ వంటకాలు ప్రముఖ స్థానంలో కనిపిస్తున్నాయి. 2022లో మాస్టర్ షెఫ్ పోటీల్లో పాల్గొంది. ఆమె చేసిన రెండు వంటలు న్యాయనిర్ణేతల జిహ్వను మైమరిపించాయి. ఇటాలియన్ వంటకం పోలెంతాని మధుస్మిత స్థానిక పద్ధతిలో ఎర్రబియ్యంతో చేసింది. వేయించిన చికెన్‌కు తోడుగా ఎర్ర చీమల చట్నీ వడ్డించింది. అలాగే పాల్వా చట్నీతో పాట్లపీత వంటకం కూడా. ఎండిన చింతాకు ΄పొడితో చేసిన వంటకాలను నగరవాసులు లొట్టలేసుకుని తింటున్నారు.గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఎక్కువ‘‘మా తల్లిదండ్రుల ఆలోచనలు చాలా సంప్రదాయబద్ధమైనవి. నేను బాగా చదువుకుని ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునేవారు. కానీ నేను మాత్రం మా సంతాలి తెగ మీద సమాజంలో నెలకొని ఉన్న తేలిక అభి్రపాయాన్ని తొలగించాలనుకున్నాను. సంతాలి వంటకాలను తెలియచేసే ఫుడ్ బ్లాగర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యాను. మా వంటలను పరిచయం చేశాను.ప్రపంచç ³టంలో వంటకాల్లో ఇటలీకున్న స్థానంలో మా సంతాలి వంటకాలను చేర్చగలిగాను. పెద్ద పేరున్న రెస్టారెంట్లు మా వంటకాలకు మెనూ కార్డులో ‘ట్రైబల్ క్విజిన్’ అని ప్రత్యేక కేటగిరీ కల్పిస్తున్నారు. ఇప్పుడు మా సంతాలి వంటకాలు ప్రపంచ ఆహారపట్టికలో ఉన్నాయి. నేను అనుకున్నది సాధించాను’’ అని సంతోషంగా చె΄్తోంది 32 ఏళ్ల మధుస్మిత. బాల్యంలో మనసుకైన గాయంతో తమ సంతాలి తెగకు ప్రపంచస్థాయి గౌరవాన్ని తెచ్చి పెట్టింది మధుస్మిత సోరెన్ ముర్ము. -
సోషల్ మీడియాను షేక్ చేసి.. ఇదేందిది అనిపించిన వంటకాలు!
2024వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ ఏడాదిలో కొన్ని వింత ఘటనలు చోటుచేసుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఎవరూ ఎప్పుడూ చూడని వంటకాలు కూడా కనిపించి అందరికీ కంగుతినిపించాయి. అవి వైరల్‌గా మారి కొందరికి నవ్వు తెప్పించగా, మరికొదరికి అసహ్యం కలిగించాయి. మరికొందరైతే ఇలాంటి వంటకాలు కూడా ఉంటాయా అని తెగ ఆశ్చర్యపోయారు. మరి 2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ వంటకాలేమిటో ఇప్పుడు చూద్దాం.చాక్లెట్ పాస్తాఇన్స్టాగ్రామ్లో ఇటాలియన్ పాస్తాకు కొత్త ట్విస్ట్ ఇస్తూ, నూతన వంటకం ప్రత్యక్షమయ్యింది. దీనిని కోకో పౌడర్, స్నికర్స్ చాక్లెట్, పాలను మిక్స్ చేసి తయారు చేశారు. ఈ స్నికర్స్ పాస్తా రిసిపీని చూసి జనాలు షాక్ అయ్యారు.చాక్లెట్ గ్రీన్ పీస్ఇన్స్టాగ్రామ్లో ఫుడ్మేకేస్కల్హ్యాపీ అనే పేజీలో చాక్లెట్ కొత్తగా, ఎప్పుడూ చూడని గ్రీన్ పీస్ రెసిపీ దర్శనమిచ్చింది. ఇందులో ఆ ఫుడ్ బ్లాగర్ ఒక చాక్లెట్‌ను మైక్రోవేవ్ బౌల్లో ఉంచిన తర్వాత, దానికి బఠానీలను జోడించి, కొన్ని నిమిషాలు మైక్రోవేవ్‌లో ఉంచి, తరువాత ఆనందంగా తిన్నాడు.మటన్ కీమా కేక్ఇప్పటి వరకు మీరు చాక్లెట్, పైనాపిల్, బటర్‌స్కాచ్ వంటి కేక్‌లను తినే ఉంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక బేకర్.. మటన్ కీమా కేక్‌ని తయారు చేశారు. ఇందుకోసం మటన్ మిన్స్‌ను తయారు చేశాడు. దానిని స్పాంజ్ కేక్‌పై స్ప్రెడ్ చేసి, దానిని అలంకరించేందుకు ఫ్రెష్క్రీమ్తో పాటు మటన్ మిన్స్‌ను ఉంచి రెడ్ చిల్లీ, కొత్తిమీరతో అలంకరించాడు. దీనిని చూసినవారంతా ఇదేందిది అనుకుంటూ తెగ ఆశ్చర్యపోయారు.గుడ్డు హల్వాసోషల్ మీడియాలో హల్చల్ చేసిన కోడిగుడ్డు హల్వాను చూసిన జనానికి మతిపోయింది. ఈ రెసిపీలో ఒక గిన్నెలో గుడ్లు గిలక్కొట్టి, దానిలో చక్కెర, పాలపొడి వేసి, దానిని ఎలక్ట్రిక్ బ్లెండర్ వేసి మెత్తగా చేశారు. తరువాత దానిని ఒక గిన్నెలోకి తీసుకుని, స్టవ్‌పై పెట్టి దానిలో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి సన్నని మంటపై ఉడికించారు.గులాబ్ జామున్ చాట్చాట్- గులాబ్ జామూన్.. ఈ రెండు విభిన్న వంటకాలు ఒకటి తీపి వంటకం. మరొకటి స్పైసీ వంటకం. అయితే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గులాబ్ జామూన్ చాట్ తయారు చేశాడు. దానిపై పెరుగు, చింతపండు చట్నీ వేసి వినియోగదారునికి అందించాడు. దీనిని చూసి నెటిజన్లకు దిమ్మతిరిగిపోయింది. ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..!
చాలా మంది సరిగా భోజనం చేయరు. ఏమీ తినాలనిపించడం లేదనీ, తమకు అన్నం సయించడం లేదనీ చెబుతుంటారు. సాధారణంగా కాస్త పెద్దవయసు వచ్చాక ఇలాంటి మార్పు చాలామందిలో కనిపిస్తుంది. ఇలాంటివారు ఎలా తినాలో, ఎలా తినడం వల్ల తమకు అందాల్సిన పోషకాలు అందుతాయో తెలుసుకుందాం.అన్న సయించనివారు ఏదో తినడం కోసమంటూ చాలా తక్కువగానే తింటున్నప్పటికీ ఆ భోజనం అన్ని పోకాలూ అందేలాంటి బ్యాలెన్స్డ్ డైట్‌తో కూడిన మీల్ గా ఉండాలి. అంటే అందులో దేహానికి అవసరమైన పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు వంటివి పుష్కలంగా అందేలా కాయధాన్యాలూ, పప్పుధాన్యాలు, తినేవారైతే మాంసాహారంలోని వేటమాంసం, కోడిమాంసం, చేపలు, ఇక మిగతా అందరూ ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పాల ఉత్పాదనలు, తాజా పండ్లు ఇవన్నీ.ఎంత ఆహారం అవసరమంటే... ఓ వ్యక్తికి ఇంత ఆహారం అవసరమని నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే... ఓ వ్యక్తికి ఎన్ని క్యాలరీల ఆహారం అవసరం అన్నది... వారి వయస్సు, వారు పురుషుడా/వుహిళా, వాళ్ల బరువు, వాళ్లు రోజువారీ చేపే పనులు, అవి శ్రమతో కూడినవా, లేక ఒకేచోట కూర్చుని చేసేవా... ఇలాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.అన్నం సయించని వారు తినే వాటిల్లోనే రుచిగా... అన్నం సయించడం లేదంటూ పెద్దగా ఆహారం తీసుకోనివారు... తాము తినే ఆ కొద్దిపాటి ఆహారంలోనే వీలైనన్ని రకరకాల పదార్థాలు రకరకాల పద్ధతుల్లో కాస్తంత నాలుకకు రుచిగా వండినవి, తినేందుకు ప్రయత్నించాలి. ఆహారంలోనూ అనేక రకాలు (వెరైటీస్) వండి తీసుకోవడం వల్ల ... అవి కొన్నీ, ఇవి కొన్నీ తీసుకుంటూ చాలా రకాలు ఉండటం వల్ల తీసుకోవాల్సిన పరిమాణం అంతో ఇంతో భర్తీ అయ్యే అవకాశం ఉంది. దాంతో వారు తీసుకోవాల్సిన రోజువారీ ఆహారపు పరిమాణం చాలావరకు అందే అవకాశముంది.ఇదీ సాధారణ డైట్ ప్లాన్... అన్నం సయించనివారు ఈ కింది సాధారణ డైట్ ప్లాన్ అవలంబిస్తే మంచిది. ఇలాంటివాళ్లంతా రోజూ తమ రోజువారీ ఆహారంలో చపాతీ లేదా అన్నంతోపాటు పప్పులు (దాల్) లేదా శెనగలు, రాజ్మా వంటివి తీసుకోవడం మంచిది. వీటి కారణంగా వారికి అవసరమైన కార్బోహైడ్రేల్లు,ప్రోటీన్లు సమకూరుతాయి. భోజనం చివర్లో ఓ కప్పు పెరుగుతో పెరుగన్నం తినాలి. భోజనానికి ముందు క్యారట్, కీర, దోస వంటి కూరగాయలను సలాడ్స్‌గా తీసుకోవాలి. ప్రతిరోజూ పడుకోబోయే వుుందు ఓ కప్పు పాలు తాగితే కొద్దిమేర ఆరోగ్యకరమైన కొవ్వులు, క్యాల్షియమ్ సమకూరుతాయి. తినే పరివూణం తక్కువైనా, అందులోనే ఆ సీజన్లో దొరికేవైన తాజా పండ్లను సాధ్యమైనన్ని తీసుకోవాలి. చాలా తరచుగా అప్పుడప్పుడూ తృణధాన్యాలతో ఏవైనా వంటకాలను చిరుతిండ్లలా చేయించుకుని తినాలి. చిరుతిండి కాబట్టి ఈ శ్నాక్స్ రుచిగా ఉండి, బాగా తినాలని అనిపిస్తాయి.ఇలా ఇన్ని వెరైటీలుగా రకరకాల ఆహారాల్ని తీసుకోవడం వల్ల ఒంటికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజలవణాలూ, మైక్రో, మ్యాక్రో న్యూట్రియెంట్లు... అన్నీ అందేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ తీసుకుంటే తక్కువగానే తింటున్నప్పటికీ అవసరమైన పోషకాలన్నీ చాలావరకు దొరుకుతాయి. (చదవండి: గుండెకు మేలు చేసే పండ్లు..!) -
చెదురుతున్న గుండెకు అండగా...!
గుండె తన పూర్తి సామర్థ్యాన్ని కనబరచకుండా అది విఫలమయ్యే కండిషన్‌ను ‘హార్ట్ ఫెయిల్యూర్’గా చెబుతారు. హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు... తాము కొద్దిగా నడవగానే వారికి ఊపిరి సరిగా అందకపోవడం, తీవ్రంగా ఆయాసం రావడం వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. హార్ట్‌ఫెయిల్యూర్ బాధితులు ఈ కింద సూచించిన జీవనశైలి మార్పులు చేసుకోవడం చాలా మంచిది. ద్రవాహారానికి దూరంగా ఉండటం: హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల్లో ఒంట్లోకి నీరు చేరుతుంటే వాళ్లు ద్రవాహారం తీసుకోవడం తగ్గించాలి. ఒంట్లోకి నీరు చేరనివాళ్లు మాత్రం రోజు లీటరున్నర వరకు ద్రవాహారాలు తీసుకోవచ్చు. ఉప్పు బాగా తగ్గించడం : ఒంట్లో నీరు చేరడం, ఆయాస పడటం, ఊపిరి అందక΄ోవడం వంటి లక్షణాలు కనబడితే ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. వీళ్లు తినే వంటల్లో ఉప్పు వేయకపోవడం మేలు. పచ్చళ్లు, బేకరీ ఐటమ్స్, బయటి చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి. డ్రైఫ్రూట్స్, పండ్లు, పాలు : బాదాం, జీడిపప్పు, ఆక్రోటు వంట్ నట్స్, పాలు, పండ్ల వంటివి తీసుకోవచ్చు. వీటిల్లో ఆరోగ్యానికి చేటు చేసే లవణాలు తక్కువ. విశ్రాంతి : హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చాలామందిలో ఓ అపోహ. అయితే ఇది సరికాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత మేరకు, ఆయాసం రానంత వరకు శరీరాన్ని మరీ కష్టపెట్టకుండా శ్రమ చేయవచ్చు. తేలికపాటి నడక, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలూ చేయవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉండటం: హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు తమ సమస్య కారణంగా చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలెక్కువ. ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలకూ లోనుకావచ్చు. వారు ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇందుకు యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది. ఈ మందులు వద్దు : హార్ట్ఫెయిల్యూర్తో బాధపడేవారు కొన్ని మందులకు... ముఖ్యంగా నొప్పి నివారణ కోసం వాడే... ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్ఎస్ఏఐడీ రకం మందులకు దూరంగా ఉండాలి. స్టెరాయిడ్స్ కూడా వాడకూడదు. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.నాటు మందుల్లో ఏ పదార్థాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మేలు. ఇంకా చెప్పాలంటే కార్డియాలజిస్ట్‌కు చెప్పకుండా ఎలాంటి మందులూ వాడకపోడమే మంచిది. ఇక నొప్పులు మరీ భరించలేనంతగా ఉన్నప్పుడు అవి తగ్గేందుకు డాక్టర్‌ను ఒకసారి సంప్రదించి పారాసిటమాల్ వంటి సురక్షిత మందుల్ని వాడుకోవచ్చు. ∙వైద్యపరమైన జాగ్రత్తలు బాధితులు తమ గుండె వైఫల్యానికి వాడుతున్న మందులతోనూ అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. అందుకే ఎప్పటికప్పుడు డాక్టర్ ఫాలో అప్‌లో ఉంటూ, అవసరాన్ని బట్టి వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందుకే తరచూ గుండెవైద్య నిపుణులను సంప్రదిస్తూ, వారు చెప్పే సూచనలు, జాగ్రత్తలు అనుసరించాలి. (చదవండి: మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!) -
సమోసా, చిప్స్ తింటున్నారా!
సమోసా.. పకోడీ.. ఫ్రైడ్ చికెన్.. చిప్స్.. బిస్కెట్లు.. కేక్స్.. రెడీమేడ్ మీల్స్.. మయోనైజ్, గ్రిల్డ్ చికెన్.. డ్రై నట్స్.. వేయించిన వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలు డయాబెటిస్ పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశోధనలో వెల్లడైంది. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎండీఆర్ఎఫ్)తో కలిసి ఐసీఎంఆర్ ఇటీవల నిర్వహించిన పరిశోధనలో విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. మరోవైపు కేంద్రంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బయోటెక్నాలజీ విభాగం నిర్వహించిన తాజా క్లినికల్ ట్రయల్ రన్‌లోనూ మధుమేహం ముప్పునకు పైన పేర్కొన్న ఆహార పదార్థాలే కారణమని స్పష్టమైంది. – సాక్షి, అమరావతిఏజీఈ అధికంగా ఉండటం వల్లే..సమోసా, పకోడీ, ఫ్రైడ్ చికెన్, చిప్స్, నూడిల్స్, సూప్‌లు, ఇతర ప్యాక్డ్ ఆహార పదార్థాలను పిల్లల నుంచి పెద్దలు ఇష్టంగా తింటున్నారు. ఈ తరహా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్) దేశంలో మధుమేహం ముప్పును రోజురోజుకూ పెంచుతోంది. భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధానికి ఉండటానికి హానికరమైన ఆహారపు అలవాట్లే కారణమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 10.10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అధికంగా ఉంటుంది. ఈ ఆహారాలు రక్తంలో చక్కెరను పెంచుతున్నాయని తేలింది.అధునాతన గ్లైకేషన్ ముగింపు ఉత్పత్తులు (ఏజీఈ) హానికరమైన సమ్మేళనాలు. గ్లైకేషన్ అనే ప్రక్రియ ద్వారా ప్రోటీన్లు లేదా కొవ్వులు చక్కెరలతో సంకర్షణ చెందుతున్నప్పుడు మధుమేహం ఏర్పడుతుంది. ఏదైనా ఆహార పదార్థాన్ని వేయించినప్పుడు లేదా కాల్చినప్పుడు, అందులో ఏజీఈలు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల వినియోగం ఊబకాయాన్ని పెంచుతోందని.. ఇది మధుమేహానికి ప్రధాన కారణమవుతోందని వెల్లడైంది. ఈ పరిశోధన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్లో ప్రచురించబడింది.ఆయుర్దాయంపై ప్రభావం టైప్–2 డయాబెటిస్ మనిషి ఆయుర్దాయంపైనా ప్రభావం చూపుతోంది. అధిక ఆదాయ వర్గానికి చెందిన 19 దేశాల్లో 15 లక్షల మంది జనాభా ఆరోగ్య రికార్డులపై అధ్యయనానికి సంబంధించిన అంశాలను ఇటీవల ది లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రైనాలజీలో ప్రచురించారు. 30 ఏళ్లలో టైప్–2 బారినపడిన వ్యక్తి సగటు ఆయుర్దాయం 14 ఏళ్లు క్షీణిస్తుందని, 40 ఏళ్ల వయసులో సమస్య తలెత్తితే పదేళ్లు, 50 ఏళ్లకు కనిష్టంగా ఆరేళ్ల చొప్పున ఆయుర్దాయం తగ్గుతోందని పరిశోధకులు తేల్చారు.38 మందిపై.. 12 వారాల పరీక్ష పరిశోధన నిమిత్తం ఎంపిక చేసిన 38 మందిపై 12 వారాలపాటు పరీక్షలు నిర్వహించారు. మధుమేహం లేనివారిని రెండు సమూహాలుగా విభజించారు. 12 వారాల పాటు ఒక సమూహానికి అడ్వాన్డ్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్డ్స్ (ఏజీఈ) తక్కువగా ఉండే ఆహారం, మరో సమూహానికి ఏజీఈ అధికంగా ఉండే ఆహారాన్ని అందించారు. 12 వారాల అనంతరం పరిశీలిస్తే అధిక ఏజీఈ ఆహారం తిన్న సమూహంతో పోలిస్తే తక్కువ ఏజీఈ ఆహారం తిన్న సమూహంలోని వ్యక్తుల్లో టైప్–2 మధుమేహం ముప్పు తక్కువగా ఉందని గుర్తించారు. వీరిలో ఇన్సులిన్ నిరోధకతæ గణనీయంగా పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. కేకులు, కుక్కీలు వంటి కాల్చిన ఆహారాల్లో ఏజీఈలు ఎక్కువగా ఉంటాయి.చిప్స్, సమోసాలు, పకోడీలు, వేయించిన చికెన్ వంటి వాటిలో పెద్ద పరిమాణంలో ఏజీఈ ఉంటోంది. అలాగే రెడీమేడ్ ఆహార పదార్థాల రూపంలో వచ్చే వనస్పతి, మయోనైస్ కూడా చక్కెరను పెంచుతాయి. కాల్చిన మాంసాలు, కాల్చిన గింజలలో ఏజీఈలు సమృద్ధిగా ఉంటాయి. వీటి వాడకం వల్ల చక్కెర వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రైడ్ ఫుడ్స్ స్థానంలో తక్కువ ఏజీఈ డైట్ తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి వాటిని చేర్చుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.ఏమిటీ అడ్వాన్డ్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రాడక్ట్స్ఫ్రై, రోస్ట్ (బాగా వేడి) చేసిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్) ఆహారాన్ని తిన్నప్పుడు కార్పొహైడ్రేట్స్ శరీరంలో నేరుగా ప్రొటీన్స్, కొవ్వులతో కలిసి అడ్వాన్డ్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రాడక్ట్స్(ఏజీఈ)లుగా రూపాంతరం చెందుతాయి. వీటివల్ల శరీరంలో హానికరమైన మాలిక్యుల్స్ తయారవుతాయి. ఇవి ఎక్కువ కావడంతో శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోతుంది. శరీరంలోని కణాల్లోకి గ్లూకోజ్‌ను అందించడంలో ఇన్సులిన్ తాళం చెవి మాదిరిగా పనిచేస్తుంది. ఏజీఈ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో తిన్న ఆహారంలోని చక్కెర పదార్థాలు కణాలకు అందకుండా రక్తంలోని ఉండిపోయి టైప్–2 మధుమేహానికి దారి తీస్తుంది. అంతేకాకుండా ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఏజీఈ అధికంగా ఉండే బేకరీ, హోటల్స్‌లో తయారు చేసే కేక్స్, చిప్స్, ఐస్‌క్రీమ్స్, ఇంట్లో డీప్ ఫ్రై, ఫ్రై ఆహార పదార్థాలు తినడం తగ్గించాలని పరిశోధకులు స్పష్టం చేశారు.మిలమిలలాడే ఆహార పదార్థాలను వినియోగించొద్దు పూరీ్వకులు పాలిష్ చేయని దంపుడు బియ్యం, కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకునే వారు. ప్రస్తుతం బియ్యం, చక్కెర, ఉప్పు ఇలా ప్రతీది తెల్లగా మిలమిలలాడేలా పాలిష్ చేస్తున్నారు. ఈ పాలిష్ ఆహార పదార్థాలను విడనాడాలి. – పి.శ్రీనివాసులు, హెచ్‌వోడీ ఎండోక్రినాలజీ విభాగం, కర్నూలు మెడికల్ కాలేజీ జీవన శైలిలో మార్పు రావాలి టైప్–2 మధుమేహం అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా వస్తుంది. దీనికి తోడు హానికరమైన ఆహారపు అలవాట్లు తోడై పిల్లలు సైతం మధుమేహం బారినపడుతున్నారు. చదువు, వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమించడానికి ప్రయతి్నంచాలి. మధుమేహం అని తేలాక అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి.– డాక్టర్ వెంకట సందీప్, ఎండోక్రినాలజిస్ట్, గుంటూరు -
ఓటీటీ స్నాక్స్ ట్రెండింగ్..!
థియేటర్లో నచ్చిన స్నాక్స్ తింటూ ఫేవరెట్ మూవీని ఎంజాయ్ చేయడం కామన్! ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా దొరుకుతుండటంతో వినోదం ఇంట్లోనే మూడు సినిమాలు ఆరు వెబ్ సిరీస్‌లుగా వెలిగిపోతోంది. యువతరానికి ముఖ్యంగా జెన్ జెడ్‌కు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు బాగా కనెక్ట్ కావడంతో ఫుడ్, స్నాక్స్ బ్రాండ్లు దీన్ని ఒక సరికొత్త వ్యాపారావకాశంగా మార్చుకుంటున్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ–హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 తదితర ఓటీటీ దిగ్గజాలతో జట్టుకట్టి సరికొత్త కో–బ్రాండెడ్ ప్యాక్‌లతో పాప్‌కార్న్ నుంచి ఐస్‌క్రీమ్ వరకూ అన్నింటినీ ప్రత్యేకంగా చేతికందిస్తున్నాయి.ఓటీటీ స్ట్రీమింగ్ దుమ్మురేపుతుండటంతో స్నాక్స్, పుడ్ బ్రాండ్స్ దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా ప్రీమియం పాప్‌కార్న్ బ్రాండ్ 4700బీసీ ప్రత్యేకంగా ఓటీటీ యూజర్ల కోసం కో–బ్రాండెడ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టేందుకు నెట్‌ఫ్లిక్స్‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని ఈ–కామర్స్, క్విక్ కామర్స్‌తో పాటు రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులోకి తెస్తోంది. ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మునిగితేలే జెన్ జెడ్ కుర్రకారును టార్గెట్ చేసేందుకు ఇది సరైన మార్గం’ అని 4700బీసీ ఫౌండర్, సీఈవో చిరాగ్ గుప్తా చెబుతున్నారు. ఇదొక్కటేకాదు కిట్‌క్యాట్, కారి్నటోస్, ప్రింగిల్స్, కోకాకోలా, ఓరియో, థమ్సప్‌తో పాటు సఫోలా మసాలా ఓట్స్ తదితర స్నాక్స్ బ్రాండ్స్ సైతం సేల్స్ పెంచుకోవడం కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో జట్టుకట్టిన వాటిలో ఉన్నాయి.అల్టీమేట్ ‘బ్రేక్’.. వినోదంతో పాటు రుచికరమైన మంచింగ్ కూడా ఉంటే ‘ఆహా’ అదిరిపోతుంది కదూ! అందుకే నెస్లే తన కిట్ క్యాట్ చాక్లెట్లను ఓటీటీ యూజర్ల చెంతకు చేర్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ‘సబ్స్క్రిప్షన్’ తీసుకుంది. ‘అల్టీ మేట్ బ్రేక్’ పేరుతో కో–బ్రాండెడ్ ప్రచారానికి తెరతీసింది. తద్వారా ప్రత్యేక ఓటీటీ కిట్‌క్యాట్ ప్యాక్‌లను విడుదల చేయడంతో పాటు నెట్‌ఫ్లిక్స్ షోలు.. స్క్విడ్ గేమ్, కోటా ఫ్యాక్టరీతో జతకట్టింది. గిఫ్టింగ్ సంస్థ అల్యూరింగ్ బాస్కెట్ అయితే ప్రింగిల్స్, కిట్‌క్యాట్, కోకాకోలాతో కూడిన బండిల్డ్ ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ’నెట్‌ఫ్లిక్స్ – చిల్’, ‘జస్ట్ వన్ మోర్ ఎపిసోడ్’ పేరుతో ఓటీటీ లవర్స్ కోసం వీటిని విక్రయిస్తోంది.ఓటీటీ వినోదంతో పాటు స్నాక్స్‌ను ప్రమోట్ చేసే విధంగా బీన్ ట్రీ ఫుడ్స్ కూడా ప్రత్యేక ప్యాక్‌లను అందిస్తోంది. ఇక మాండెలెజ్ కుకీ బ్రాండ్ ఓరియో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’తో జట్టుకట్టడం ద్వారా ఓరియో రెడ్ వెల్వెట్‌ను ప్రవేశపెట్టేలా ఒప్పందం కుదుర్చుకుంది. కోకాకోలా థమ్సప్.. డిస్నీ–హాట్‌స్టార్‌తో కలిసి ‘థమ్సప్ ఫ్యాన్ పల్స్’ ప్రచారం నిర్వహిస్తుండగా.. మారికో తన సఫోలా మసాలా ఓట్స్ కో–బ్రాండెడ్ ప్యాక్స్ విక్రయానికి జీ5తో డీల్ కుదుర్చుకుంది.’స్నాక్స్ బ్రాండ్ల అమ్మకాల ఆధారంగా లాభాల పంపకం లేదా సంస్థలు ఒకరికొకరు తమ యాడ్లలో ప్రచారం కల్పించుకోవడం, లేదా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా లింక్‌లను ఇవ్వడం ద్వారా స్నాక్స్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను విక్రయించడం వంటి మార్గాల్లో డీల్స్ కుదురుతున్నాయి’ అని ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ‘కంటెంట్‌ను చూస్తూ, నచి్చన స్నాక్స్ తినే అలవాటు ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. ప్రత్యేకంగా ఓటీటీ యూజర్లను దృష్టిలో పెట్టుకుని 4700బీసీ ఇతర బ్రాండ్లతో జట్టుకట్టాం’ అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా మార్కెటింగ్ పార్ట్నర్షిప్స్ హెడ్ పూరి్ణమ శర్మ చెప్పారు. ఓటీటీ జోరు.. ఫుడ్ ఆర్డర్ల తోడు! దేశంలో కరోనా కాలంలో బంపర్ హిట్ కొట్టిన ఓటీటీ స్ట్రీమింగ్.. ముఖ్యంగా యువత, మహిళలకు బాగా చేరువైంది. కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ’బాక్సాఫీస్’ కళకళలాడిపోతోంది. గతేడాది 70.7 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా కంటెంట్‌ను చూసినట్లు ఇంటర్నెట్ ఇన్ ఇండియా–2023 నివేదిక అంచనా వేసింది. మరోపక్క, ఈ వీడియో ఆన్ డిమాండ్ సబ్‌్రస్కిప్షన్ మార్కెట్ 2027 నాటికి 2.77 బిలియన్ డాలర్లకు ఎగబాకనున్నట్లు లెక్కగట్టింది.ఇదిలా ఉంటే, రెడీ–టు–ఈట్ లేదా రెడీ–టు–కుక్ ఆహారోత్పత్తుల వృద్ధికి తోడు డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్‌తో స్నాక్స్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ విస్తరణ జోరుతో చిన్న పట్టణాల్లోనూ స్నాక్న్ బ్రాండ్స్ రెండంకెల అమ్మకాల వృద్ధిని సాధిస్తున్నాయి. 2023లో దాదాపు రూ.43,000 కోట్లుగా ఉన్న భారతీయ స్నాక్స్ మార్కెట్ 2032 నాటికి రూ.95,000 కోట్లకు పైగా ఎగబాకుతుందనేది మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐమార్క్ గ్రూప్ అంచనా. – సాక్షి, బిజినెస్ డెస్క్ఫుల్ చిల్!70.7 కోట్లు: గతేడాది ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఉపయోగించుకున్న ఇంటర్నెట్ యూజర్లు2.77 బిలియన్ డాలర్లు: 2027 నాటికి వీడియో ఆన్ డిమాండ్ సబ్ర్స్కిప్షన్ మార్కెట్ వృద్ధి అంచనా.రూ. 95,520 కోట్లు: 2032 నాటికి భారతీయ స్నాక్స్ మార్కెట్ పెరుగుదల అంచనా. -
‘అక్షయపాత్ర’ రోజూ పంపిన లక్ష భోజనాలు ఏమయ్యాయి?
సాక్షి, అమరావతి: వరద బాధితుల భోజనాలపై కూటమి ప్రభుత్వం రూ.368 కోట్లు ఖర్చు చేస్తే.. అక్షయపాత్ర ఫౌండేషన్ రోజూ లక్ష మందికి అందించిన భోజనాలు ఏమయ్యాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయం మాటేమిటని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నిలదీశారు. సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు లెక్కలతో రూ.534 కోట్లను కూటమి నేతలు దోచేశారని ధ్వజమెత్తారు. ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండా రూ.1.39 కోట్లు,మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపిందన్నారు. ఏ కాంట్రాక్టర్ ద్వారా ఆ ఏర్పాట్లు చేశారో ప్రభుత్వంవివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.బాధితులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ప్రభుత్వం నిజంగా బాధితులకు సాయం చేసి ఉంటే.. ఇప్పుడు కలెక్టరేట్ వద్దకు వేలా దిమంది ఎందుకు పోటెత్తుతున్నా రని అవినాష్, భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికులకు రూ.51 కోట్లు ఇచ్చామంటున్న ప్రభుత్వం ఎవరి ద్వారా అవి చెల్లించారో చెప్పాలన్నారు. ఆహారం పంపిణీ కోసం 412 డ్రోన్లు ఉపయోగించి, అందుకోసం రూ.2 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారని, నిజానికి అప్పుడు కనీసం 10 డ్రోన్లు కూడా కనపడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూ.534 కోట్లకు సరైన లెక్కలు చెప్పే వరకు ఊరుకోబోమని, వరద బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటించారు. -
టేస్టీ టేస్టీగానే తింటూ..గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం ఇలా..!
గుండెకు బలం పెంచేందుకూ... టేస్టీ టేస్టీగానే తింటూ, గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పదార్థాలను తీసుకోవచ్చు. అవేంటో సవివరంగా తెలుసుకుందాం..!.టొమాటోలలో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెకు చాలా మంచిది. ∙బచ్చలి, ΄ాలకూర లాంటి ఆకుకూరలన్నీ గుండెకు మంచి బలాన్నిస్తాయి. విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల వంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్లీ పైనుంచి చక్కెర కలుపుకోకూడదు. దానిమ్మ గుండెకెంతో మేలు చేస్తుంది. యాపిల్ పండ్లు కూడా గుండెకు మంచివే. బాదంపప్పు, అక్రోటు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినవచ్చు. వాటిలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల వంటి బెర్రీజాతి పండ్లు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి. చేపల్లో గుండెకు మేలు చేసే ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ çసమృద్ధిగా ఉంటాయి. కాబట్టి అన్ని చేపలూ గుండె మేలు చేస్తాయి. అయితే సాల్మన్ ఫిష్ లాంటివి మరింత ఆరోగ్యకరం. వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు... అందునా సాల్మన్ఫిష్ తింటే మేలు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది పరిమితంగా తినే డార్క్ చాక్లెట్లతో గుండెకు మేలు జరుగుతుంది. వాటితో హైబీపీ, రక్తం గట్టకట్టుకు΄ోయే రిస్క్‌లు తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీలతో గుండెకు మేలు చేకూరదు. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం గుండెకు మేలు చేస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. -
మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
మహిళలు తమ కుటుంబ సంక్షేమం పట్టించుకున్నంతగా తమ వ్యక్తిగత ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. అలాగే ఇంటిల్లపాదికి ఇష్టమైనవి, ఆరోగ్యకరమైన ఆహారాలు ఓపిక తెచ్చుకుని మరీ వండిపెడతారు. తమ వద్దకు వచ్చేటప్పటికీ నాకెందుకు అనే భావన లేక త్యాగమో తెలియదు గానీ సరైన పోషకాహారం మాత్రం అస్సలు తీసుకోరు. ఇలా భావించే మహిళలు ప్రతి ఇంటిలోనూ ఉంటారు. అంతేగాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం దాదాపు 1.2 మిలియన్ల మంది బాలికలు, మహిళలు పోషకాహార లోపాలతో బాధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. దీనిపై ప్రతి స్త్రీకి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఏటా సెప్టెంబర్ 25న జాతీయ మహిళల ఆరోగ్యం, ఫిట్నెస్ దినోత్సవం పేరుతో ఓ రోజుని ఏర్పాటు చేసి మరీ చైతన్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు తమ ఆరోగ్యం కోసం తప్పనిసరిగా తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్స్ ఏంటో సవివరంగా చూద్దామా..!.పాలకూరపాలకూరలో ఐరన్ సమృద్ధిఆ ఉంటుంది. ఇది ఋతుస్రావం కారణంగా ఎదురయ్యే రక్తహీనతను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరమైన ఫోలేట్‌ను కూడా ఉంటుంది. దీనిలో విటమిన్ ఏ,సీ, కే, సీలు ఉంటాయి. అందువల్ల తప్పనిసరి మహిళలు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.పెరుగు కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉన్న పెరుగు ఎముకలను బలోపేతం చేయడానికి, కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి సహాయపడుతుంది. స్త్రీలకు, ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మోనోపాజ్ దశలో కాల్షియం తగ్గిపోతుంటుంది. దీని వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడానికి ఇది తోడ్పడుతుంది. అంతేగాదు దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.బెర్రీలుబ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటివి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి జీర్ణక్రియ, బరువు నిర్వహణలో సహాయపడే ఫైబర్ మూలం.సాల్మన్సాల్మన్ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల పవర్‌హౌస్. ఇది గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మద్దతు ఇస్తుంది, వాపును తగ్గిస్తుంది. ఒమేగా -3 లు మహిళలకు అత్యంత అవసరమైనవి. ఇవి మహిళల్లో మరణానికి ప్రధాన కారణం అయిన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.పప్పుకాయధాన్యాలు మొక్కల ఆధారిత ప్రోటీన్, ఐరన్ సంబంధిత మూలం. శాఖాహారం లేదా శాకాహారి ఆహారాన్ని అనుసరించే వారికి పరిపూర్ణంగా ఉంటాయి. కాయధాన్యాలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది.అక్రోట్లనువాల్నట్లు మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా-3లతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. మహిళలకు మంచి చిరుతిండిగా పేర్కొనవచ్చుస్వీట్ పొటాటోస్వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి, దృష్టికి తోడ్పడుతుంది. ఇవి ఫైబర్, పొటాషియంతో నిండి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవన్నీ మహిళలకు పోషకమైన శక్తిని పెంచే కార్బోహైడ్రేట్లుగా పనిచేస్తాయి.చియా విత్తనాలుచియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, కాల్షియంను కూడా అందిస్తాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు, గుండె ఆరోగ్యానికి, గర్భధారణ తోపాటు వృద్ధాప్యంలో ఉన్న మహిళలకు అత్యంత ముఖ్యమైనవి.(చదవండి: అవోకాడో వర్సెస్ ఆలివ్ ఆయిల్: ఆరోగ్యానికి ఏది మంచిది?) -
ప్యాక్ చూస్తే సన్న బియ్యం.. విప్పి చూస్తే రేషన్ బియ్యం!
పిఠాపురం : వరద కారణంగా సర్వం కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వరద బాధితులను కూటమి ప్రభుత్వం హీనంగా చూస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఇలాకాలో వరద బాధితులకు అందించిన రేషన్ సరకులు నాసిరకంగా ఉండటంతో బాధితులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలైన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో ప్రభుత్వం వరద బాధితులకు రెండు రోజులుగా బియ్యం, నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను పంపిణీ చేస్తోంది. వాటిని అందుకున్న బాధితులు విప్పి చూసి అవాక్కవుతున్నారు. పాడైపోయిన ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, నల్ల రంగులో పులిసిన వాసనతో చక్కెర, సైరస్ కంపెనీ 25 కేజీల బియ్యం బ్యాగ్‌లో రేషన్ బియ్యం కనిపిస్తుండటంతో వరద బాధితులు విస్తుబోతున్నారు. బ్యాగ్ చూసి ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చిందని సంతోషించిన వరద బాధితులు అందులో రేషన్ బియ్యాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వండిన వంట జావగా మారడంతో ఇవి తిని ఆస్పత్రి పాలవమంటారా.. అని ప్రశ్నిస్తున్నారు. పాడైన ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెరను చెత్తలో పారేస్తున్నారు. చంద్రబాబు.. పవన్‌కళ్యాణ్ ఇవి తింటారా అని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరికి వరద సాయం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. -
నటుడు ఆశిష్ విద్యార్థి ఇష్టపడే బెస్ట్ ఫుడ్ ప్లేస్‌లు ఇవే..!
నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్‌గా, సహానటుడిగా నటనలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన ఇటీవల యూట్యూబర్‌గా, పబ్లిక్ స్పీకర్‌గా ప్రజలకు మరింత చేరువయ్యాడు. అంతేగాదు ఫుడ్ వ్లాగింగ్ పేరుతో దేశంలోని ప్రసిద్ద రుచికరమైన వంటకాల గురించి అన్వేషించడం, వాటిని తన అభిమానులకు తెలియజేయడం వంటివి చేస్తాడు. చెప్పాలంటే చాలామందికి తెలియని కొంగొత్త తినుబండారాల గురించి పరిచయం చేస్తాడు. అంతేగాదు ఒక ఇంటర్యూలో వివిధ ప్రాంతాల్లో తనకు ఇష్టమైన ఫుడ్ ప్లేస్‌లు గురించి షేర్ చేసుకున్నారు కూడా. అవేంటంటే..ఫుడ్ వ్లాగింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో భారతదేశంలో ట్రై చేయగల బెస్ట్ ఫుడ్ ప్లేస్‌లు గురించి చెప్పుకొచ్చారు. కోల్‌కతా ఆహారం అద్భుతమైనదని, అక్కడ కచోరిలతో రోజుని ప్రారంభించమని చెప్పాడు. అందుకోసం మహారాజా(చంగని పప్పి మహారాజ్, బారా బజార్, నింబుతల్లాలో ఉంది), శర్మ టీ స్టాల్ (భవానీపూర్‌లో).రెండు కూడా ప్రసిద్ధ తినుబండారాలే. అలాగే ఆల్ టైం ఫేవరెట్ తినుబండారం అయిన బిర్యానీ కోసం అర్సలాన్ రెస్టారెంట్, హంగ్లాథెరియం (లేక్ గార్డెన్స్‌లో) రెండింటిని ప్రయ్నత్నించొచ్చని చెప్పాడు. బెంగళూరులో 1943లో స్థాపించిన శాఖాహర రెస్టారెంట్లో తినొచ్చని అన్నారు. అక్కడ ప్రసిద్ద కన్నడ ఫుడ్ మంచి రుచిగా అందిస్తారని అన్నారు. నిజానికి దీన్ని సమీపంలోని పాఠశాలల్లోని విద్యార్థుల కోసం శ్రీ వెంకటరమణ ఉరల్చే చిన్న క్యాంటీన్‌గా ప్రారంభించారు. ఆ తర్వత బెంగళూరుని సందర్శించే వాళ్లకు బెస్ట్ ఫుడ్ ప్లేస్‌గా పేరుగాంచింది. అలాగే కేరళలోని పాలక్కాడలో తనకు నచ్చిన బిర్యానీ స్పాట్ గురించి చెప్పారు. హసిన్ కిచెన్‌లో చేసే తలస్సేరి దమ్ బిరియానీ, రుచికరమైన చేపల కూర, నోరూరించే మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇక హిమచల్ప్రదేశానికి వస్తే.. బరోగ్లోని చాచు డా ధాబాలో పరాథే ప్రయత్నించమని, అలాగే చండీగఢ్‌లోని పష్తున్ రెస్టారెంట్ రాన్ ప్లేట్‌ను ఆస్వాదించమని సూచించారు.(చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!) -
హోటల్స్ లో వేడివేడిగా టేస్టీ టేస్టీ పాయిజన్..
-
అనంత్ రాధిక వెడ్డింగ్: మెనూలో ఏకంగా పది లక్షలకు పైగా వెరైటీలు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ-నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికాల వివాహం ఇవాళే(జూలై 12న) అంగరంగ వైభవోపేతంగా జరుగుతోంది. ఓ పక్క పెళ్లి కోలాహాలంతో వేడుకులు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. ఈ వేడుకలో సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు, రాజకీయనాయకులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఆ ఆతిధులకు అందించే ఆతిథ్య మెనూలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయంటే..ఈ విలాసవంతమైన పెళ్లి మెనూలో అతిథుల కోసం దాదాపు 10 లక్షలకు పైగా వంటకాలు సిద్ధమవుతున్నాయి. టిక్కీ, వడపావో, టోమాటో చాట్, పాలక్ చాట్, పూరీ, గట్టేకి సబ్జీ, పనీర్ కి సబ్జీ, రైతా, వెజ్ పులావ్, ధోక్లా వంటి వివిధ రాష్ట్రాల వంటకాలు కూడా ఉన్నాయి. ఈ వంటకాల్లో ఇండోర్ ఫేమస్ గరడు చాట్ కూడా మెనూలో భాగం కావడం విశేషం. గరడు చాట్ అంటే..?కర్ర పెండలంతో చేసే ఒక విధమైన చాట్. ఇది ఇండోర్‌లో బాగా ఫేమస్. అక్కడ ఈ గరడు చాట్ తోపాటు షకర్జంద్ చాట్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంతకమునుపు ఇటలీలో క్రూయిజ్‌లో జరిగిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 1200 మంది అతిథులు హాజరు కాగా, అప్పటి మెనూలో వివిధ దేశాల రెసీపీలతో సహా మొత్తం 40 వెరైటీలు ఉన్నాయి. ఇక ఇవాళ జరుగుతున్న వివాహ ఈవెంట్లో మరింత గ్రాండ్‌గా వివాహ మెనూ ఉండొచ్చు.(చదవండి: రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో ఎవర్ గ్రీన్‌గా ఉన్న నీతా లుక్..!) -
కుకింగ్ ఈజ్ థెరపిటిక్
ఆకాష్ మురళీధరన్‌కు చిన్న వయసులోనే వంటలపై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోయి ప్రపంచ వంటకాల గురించి కూడా తెలుసుకునేలా చేసింది. ప్రపంచ వంటకాల గురించి కాచి వడబోసిన చెన్నైకి చెందిన ఆకాష్ దక్షిణ భారతీయ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి నడుం కట్టాడు. ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నాడు. ‘కుకింగ్ ఈజ్ థెరపిటిక్’ అంటున్న ఆకాష్‌కు వంటలు చేయడం పాషన్ మాత్రమే కాదు. ప్రాణవాయువు కూడా...వంటగదిలో బామ్మ స్వీట్ తయారు చేస్తుంటే చిన్నప్పుడెప్పుడో చూశాడు ఆకాష్. ‘ఇక్కడ నీకు ఏం పని?’ అని గద్దించలేదు బామ్మ. ‘ఈ స్వీటును ఇలా తయారు చేయాలి నాయనా’ అంటూ వివరించింది. ఇక అప్పటి నుంచి రకరకాల వంటలు. స్వీట్ల తయారీపై ఆకాష్‌కు ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి, నేర్చుకున్న విద్య ఊరకే పోలేదు. బెంగళూరులో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో బాగా ఉపయోగపడింది. తనకు ఇష్టమైన వంటలు చేసి ఆ రుచులను ఆస్వాదించడంతో పాటు వంటల్లో రకరకాల ప్రయోగాలు చేసేవాడు.రుచుల ఆస్వాదనలో ఆనందమే కాదు వంట చేస్తున్న సమయంలో ఏకాగ్రత పెరగడం, మనసు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉండడం గమనించాడు ఆకాష్. ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేసిన ఆకాష్ ఒక ఆర్కిటెక్చర్ ఫర్మ్‌లో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. యానిమేషన్లో డిప్లామా కూడా చేసిన ఆకాష్ ఆ తరువాత వంటలపై తన పాషన్ను సీరియస్‌గా తీసుకున్నాడు. కొత్త కొత్త వంటకాల గురించి మరింత ఆసక్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టాడు.ఇటలీలోని మిలాన్‌లో ఫుడ్ డిజైన్‌లో మాస్టర్స్ చేశాడు. పాత వంటకాలకు కొత్త ఫ్లేవర్ జోడించడాన్ని తన ప్రత్యేకతగా చేసుకున్నాడు. యూరప్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఎన్నో వంటకాల గురించి తెలుసుకునే అవకా«శం వచ్చింది. ఇది తన భవిష్యత్ బాటకు బాగా ఉపయోగపడింది. ‘ఇండియాకు ఆవల ఫుడ్‌ను ఎలా చూస్తారు?’ అనే విషయాన్ని లోతుగా తెలుసుకోవడానికి కూడా తన ప్రయాణాలు ఉపయోగపడ్డాయి.నెదర్లాండ్స్‌లో ఒక ఫుడ్ డిజైనర్‌తో కలిసి పనిచేశాడు. ‘ప్రపంచంలోని ఎన్నో వంటకాల గురించి తెలుసుకున్న నాకు దక్షిణ భారత వంటకాల రుచులను ప్రపంచానికి పరిచయం చేయాలని గట్టిగా అనిపించింది’ అంటాడు ఆకాష్. మనం ఆస్వాదించే వంటకాలకు సంబంధించిన ఆసక్తికరమైన కథలను ఆధునిక పద్ధతులలో చెప్పడానికి ‘విజా మెడై’ పేరుతో మల్టీడిసిప్లినరి స్టూడియోను మొదలు పెట్టాడు. ఈవెంట్ డిజైన్, డెకర్, మెనూ క్యురేషన్, ఔట్ఫిట్ డిజైన్, స్టైలింగ్, క్రియేటివ్ డైరక్షన్లు ఈ స్టూడియో ప్రత్యేకత.తన ‘100–డే కుకింగ్ ప్రాజెక్ట్’లో భాగంగా మనం మరచిపోయిన ఎన్నో కూరగాయలను వెలుగులోకి తెచ్చాడు. సౌత్ ఇండియన్ ఫుడ్ రుచుల గురించి వివరంగా చెప్పడానికి ‘మాస్టర్‌చెఫ్ ఇండియా–తమిళ్’ షోలో పాల్గొన్నాడు. ఆకాష్ వంటనైపుణ్యానికి ఫిదా అయిన జడ్జీలు స్టాండింగ్ వొవేషన్ ఇచ్చారు. ‘మాస్టర్‌చెఫ్ ఇండియా–తమిళ్’ టైటిల్ గెలుచుకున్నాడు ఆకాష్. చిన్నప్పుడు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్‌డీ)తో బాధ పడిన ఆకాష్‌కు వంట చేయడం అనేది చికిత్సలా ఉపయోగపపడింది. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. -
రాహుల్ గాంధీ ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్స్ ఇవే..!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించారు. ఆయన గతేడాది చేపట్టిన జోడో యాత్ర మంచి ఫలితాన్నిచి ఈ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మెజార్టీ సీట్లను గెలుచుకునేలా చేసింది. ఈ నేపథ్యంలో మంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేసే రాహుల్ ఇష్టపడే ఆహార పదార్థాలేంటో చూద్దామా..!రాహుల్ గాంధీ ఒక జర్నలిస్ట్‌తో కలిసి రాజధాని ఢిల్లీలోని ఒక ఐకానిక్ రెస్టారెంట్లో ఫుడ్‌ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఆ జర్నలిస్ట్‌తో జరిపిన సంభాషణలో తనకు ఇష్టమైన ఆహార పదార్థాల గురించి పంచుకున్నాడు. తనకు బటర్ చికెన్, సీక్ కబాబ్ రోట్ అంటే మహా ఇష్టమని చెప్పారు. ఆలూ టిక్కకి తన ఇష్టమైన స్నాక్ ఐటెం అని చెప్పారు. తాను బోర్డింగ్స్కూల్లో ఉన్నప్పడు తన స్నేహితులతో కలిసి సమీపంలో ఉన్న ట్రక్ షాప్ నుంచి ఈ ఆలూ టిక్కిని ఇష్టంగా కొనుక్కుని తినేవాడనని అన్నారు. అంతేగాదు ఆ సంభాషణలో తాను తన చిన్నతనంలో తన తండ్రితో కలిసి చైనీస్ రెస్టారెంట్ ఫుజియాకు వెళ్లి ఇష్టంగా తిన్న నాటి మధురానుభూతలను కూడా షేర్ చేసుకున్నారు. ఇక తాను ఇలా ఢిల్లీలో స్నాక్ ఐటెమ్స్ తిని రెండేళ్లు అవుతుందని అన్నారు. తనకు కుల్ఫీ అంటే కూడా మహా ఇష్టమని అన్నారు. అలాగే ప్రాంతీయ వంటకాల వద్దకు వచ్చేటప్పటికీ దక్షిణ భారతీయ వంటకాలను ఇష్టంగా తింటనని, ముఖ్యంగా పంజాబీ వంటకాల్లో చోలే భటుర్, పరాఠాలు అంటే నాకు మహా ఇష్టమని అన్నారు. ఇష్టమైన కర్రీ దగ్గరకు వచ్చేటప్పటికీ బటర్ చికెన్, తందూరి చికెన్ అంటే ఇష్టమని తెలిపారు. రోజుని మంచి ఘుమఘమలాడే కాఫీతో ప్రారంభిస్తానని, సాయంత్రం మంచి టీ తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Khaane Mein Kya Hai? (@khaanemein_kyahai) (చదవండి: పోలాండ్లోని రహదారులకు, స్కూళ్లకు భారతీయ రాజు పేరు ఎందుకు పెట్టారో తెలుసా..!) -
లోక్‌సభ ఎన్నికలు 2024: ప్రధాని మోదీకి ఇష్టమైన సాత్విక ఆహారాలివే..!
ఈ రోజు (జూన్ 4, 2024) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సర్వత్ర ఉత్కంఠగా ఉంది. యావత్తు ప్రజల దృష్టి ఫలితాలపైనే ఉంది. ఏం జరుగుతుంది? ప్రజల ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు అనే ప్రశ్నలతో టెన్షన్..టెన్షన్‌గా ఉంది దేశమంతా. ఈ ప్రజా తీర్పు ఎటువైపు ఉందోనని కొందరూ అభ్యర్థులో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏం జరిగినా ..చివరికి పాజిటివ్ స్పిరిట్‌తో ముందుకు పోవాల్సిందే. ఈ రసవత్తరమైన ఆందోళనలో నేపథ్యంలో మన దేశాన్ని ఏల్లే నేతలు ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో చూద్దామా. ముఖ్యంగా మన ప్రధాని మోదీ ఇష్టపడే ఆహారాలు ఏంటో సవివరంగా తెలుసుకుందాం.ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 31న తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద దాదాపు 45 గంటలు సుదీర్ఘ ధ్యాన సెషన్లో పాల్గొన్నారు. పైగా జూన్ 1వ తేదీ వరకు కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకున్నారు. శాంతియుత జీవనాన్ని ఇషపడే మోదీ సాత్విక ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆయన ఎక్కువగా గుజరాత్‌లోని వాద్నగర్లో తన ఇంటి స్థానిక రుచికరమైన వంటకాలను ఇష్టపడతాడు. మోదీకి ఇష్టమైన ఎనిమిది ఆహారాలివే..వెజ్ థాలీనివేదికల ప్రకారం, ప్రదాని మోదీ పార్లమెంటు క్యాంటీన్లో రెగ్యులర్‌గా భోజనం చేస్తారు. ఆయన ఇక్కడ ఎక్కువగా ఆర్డర్ చేసేది సాధారణ శాఖాహారం థాలీ.ఫ్రూట్ చాట్అతను స్మార్ట్ స్నాక్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి చట్పాటా చాట్ మసాలా చిలకరించిన పండ్ల మిశ్రమం అంటే చాలా ఇష్టం మోదీకి.ఖిచ్డీఒక సాధారణ గిన్నె ఖిచ్డీ, పప్పు, అన్నం మిశ్రమంలతో చేసే ఖిచ్డీ కడుపు నిండిన ఫీల్ కలిగించడమే కాకుండా మనసుకు హాయిని ఇచ్చే మంచి ఆహారం. సెవ్ తమటార్ కర్రీగుజరాతీ ఫేవరెట్, ఈ టాంగీ టొమాటో గ్రేవీ, కరకరలాడే సెవ్‌తో అగ్రస్థానంలో ఉంటుంది. మోతీ ఇష్టపడు ఆహారంలో ఇది ఒకటి. బజ్రా రోటీతన కుక్ బద్రీలాల్ మీనా తయారుచేసిన కిచ్డీతో జత చేసిన బజ్రా రోటీ తనకు ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్ అని ఒక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీనే స్వయంగా వెల్లడించారు.ధోక్లాఈ మెత్తటి ఆవిరి గుజరాతీ చిరుతిండి కూడా మోదీకి ఇష్టమైన ఆహారాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఇది పులియబెట్టిన బేసన్ పిండితో తయారు చేయడం జరుగుతుంది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. ఖాండ్విగుజరాతీ అల్పాహారం యొక్క మరొక ప్రత్యేకత, బేసన్ యొక్క మాయాజాలంతో తయారు చేయబడిన ఈ ఆవిరి పిండి యొక్క గట్టిగా చుట్టబడిన స్పైరల్స్. ధోక్లా మరియు ఖాండ్వీని కొంచెం చాయ్‌తో సరిపోల్చండి మరియు మీకు సరైన మధ్యాహ్నం ఉంటుంది.బాదం హల్వాప్రదాని మోదీ ఇష్టపడే స్వీట్లలో బెల్లం, నెయ్యిలతో చేసే బాదం హల్వా అంటే మహా ఇష్టం. (చదవండి: మాయిశ్చరైజర్లను ఇంజెక్ట్ చేయడం గురించి విన్నారా..?) -
వ్యాయామం చేయని మహిళలు తీసుకోవాల్సిన డైట్ ఇదే!
మహిళలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అత్యంత ముఖ్యంగా. అందులోనూ వ్యాయామం చేయని మహిళలు తినే ఆహారం విషయంలో పట్ల శ్రద్ద వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతోంది. అలాంటి మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదే ఐసీఎంఆర్ కొన్ని మార్గదర్శకాలు కూడా అందించింది. అవేంటో చూద్దామా..!వ్యాయామం చేయని మహిళలు తినే ఫుడ్‌పై శ్రద్ధ పెట్టడం కీలకం. అతిగా తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లతో ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ నూనెతో కాల్చినవి, ఆవిరిపై ఉడికించినవి తీసుకోవాలిన చెబుతున్నారు. అలాగే వాటి తోపాటు లీన్ ప్రోటీనఖ కూడా అవసరం. స్కిన్లెస్ చికెన్, చేపలు, అప్పడప్పుడూ రెడ్ మీట్ వంటివి తీసుకోవాలని సూచించారు. అదనప్పు కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు,లేకుండా చేసుకోవాలి. కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. హెర్బల్ టీలు వంటివి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు చక్కెర పానీయాలకు దూరంగా ఉండటమే బెటర్బరువు అదుపులో ఉంచుకునే యత్నం చేయాలి. ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా తృణధాన్యాలు, కాలానుగుణంగా పండ్లకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అనారోగ్యకరమైన చిరుతిండ్లకు దూరంగా ఉండటం మంచిది. భోజనాని కంటే వివిధ రకాల పచ్చి కూరగాయలు తినడానికి యత్నం చేయాలి. మిల్లెట్స్ , బ్రౌన్‌రైస్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా బీన్స్, కాయధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన గింజలను(బాదం పప్పులు, జీడిపప్పులు)కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా గానీ తీసుకునే ఆహారాన్ని మనస్పూర్తిగా ఆస్వాదిస్తూ తినాలి, సమతుల్యతకు ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే.. మీ చేతుల్లోనే ఆరోగ్యం పదిలంగా ఐసీఎంఆర్ చెబుతోంది. వ్యాయామం చేయని మహిళలు ఈ విషయాలు గుర్తించుకుని మంచి డైట్ పాటిస్తే చాలని చెబుతోంది.(చదవండి: తొలి పోస్టల్ సర్వీస్ నుంచి .. సరికొత్త ట్యూన్ వరకు ఎన్నో ఘటనలకు సాక్షి 'మే 31'!) -
Anti tobacco day: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!
‘పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’ అని అప్పుడెప్పుడో గిరీశం సెలవిచ్చాడు కానీ... అదెంత అబద్ధమో... పొగ ఆరోగ్యానికి ఎంత హానికరమో ఇప్పుడు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకవైపు పొగాకు వినియోగంపై అవగాహన పెరుగుతున్నా... ఇంకా అజ్ఞానంలో ఉన్నవారూ కొనసాగుతున్నారు. ఒకరకంగా చూస్తే పెరిగిపోతున్నారు. ఇలాంటి వారిలోనూ ధూమపానం వ్యతిరేక ప్రభావాలపై అవగాహన పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమే ఈ నాటి పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ లక్ష్యాన్ని సాధించామనుకోండి... ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం 80 లక్షలుగా ఉన్న పొగాకు సంబంధిత మరణాలను గణనీయంగా తగ్గించవచ్చున్నమాట!ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే..1987లో, డబ్యూహెచ్ఓలోని సభ్య దేశాలు ఏప్రిల్ 7ని ప్రపంచ ధూమపాన నిరోధక దినోత్సవంగా గుర్తించాయి. అయితే పొగాకు సంబంధిత సమస్యలన్నింటిపై అవగాహన పెంపొందించే ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని 1988లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి డబ్యూహెచ్ఓ దాని సభ్య దేశాలు ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.పొగాకు వినియోగ గణాంకాలు:వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం ఏటా పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా దాదాపు 8 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నట్లు పేర్కొంది. అలాగే దాదాపు 1.3 మిలియన్ల మంది ధూమపానం చేయనివారు సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కి గురయ్యి, అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు ప్రపంచంలోని దాదాపు 1.3 మిలియన్ల పోగాకు వినియోగదారుల్లో సుమారు 80% మంది మధ్య ఆదాయ దేశాల్లో నివశిస్తున్నారు. కేవలం 2020లో ప్రపంచ జనాభాలో 22.3% మంది పొగాకును ఉపయోగించినట్లు అంచనా. వారిలో 36.7% మంది పురుషులు, 7.8% మంది మహిళా వినియోగదారులు ఉన్నాట్లు వెల్లడయ్యింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ల మంది యువకులు ధూమాపానాన్ని సేవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది థీమ్:ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 థీమ్ “పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లలను రక్షించడం”. ఈ థీమ్‌ని ఇతివృత్తంగా చేసుకుని పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ఆరోగ్య ప్రభావాల గురించి అవగాహన పెంచడం, ధూమపానం దూరంగా ఉండేలా ప్రజలను ప్రోత్సహించేలా చేయడం వంటివి చేస్తారు అధికారులు. అంతేగాదు ఈ పొగాకు అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి వంటి అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతారు. ఈ పొగాకులో దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల రసాయనాలు ఉంటాయి. అవి సుమారు 50 నుంచి 60 రకాల కేన్సర్ కారకాలని నిపుణులు చెబుతున్నారు. పొగాకులో ఉండే నికోటిన్ అనే రసాయనం డోపమైన్, అసిటైల్కోలిన్, నోర్పైన్ఫ్రైన్, సెరోటోనిన్ వంటి ఆనందకరమైన హార్మోన్లను విడుదల చేసి వ్యసపరుడిగా మారుస్తుంది. ఇది క్రమేణ అధిక రక్తపోటు, పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగాకు అడిక్షన్ నుంచి బయటపడాలంటే..మన వంటింటిలో ఉపయోగించే వాటితోనే పొగాకు అడిక్షన్‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..ధూమపానం సేవించాలనే కోరిక గలిగనప్పుడూ ప్రత్నామ్నాయ మార్గాలను ఎంచుకోండి. ఆ కోరికను అదుపులో పెట్టుకోలేనట్లు అనిపించనప్పుడూ ఈ క్రింది ఆహార పదార్థాలను పత్యామ్నాయంగా ఉపయోగించండని చెబుతున్నారు నిపుణులు.పుదీనా ఆకులు నమలడం, లేదా పుదీనా నీళ్లు తాగడం. పండ్లు, పచ్చి కూరగాయలు తినడంనీళ్లు ఎక్కువగా తాగడందాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు వంటివి నమలడంగోరు వెచ్చని పాలు తాగడంనిమ్మకాయ నీళ్లు వంటివి తాగాలిపైవాటిలో మీకు నచ్చినవి తాగేందుకు ప్రయత్నిస్తూ ఆ కోరికను నియంత్రించడం వంటివి చేస్తే సులభంగా పొగాకు అడిక్షన్ నుంచి బయటపడతారు. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా.. రాను మీకు తెలియకుండానే మంచి ఆహారపు అలవాట్లకు అలవాటు పడతారు. దీంతో పాటు చక్కటి వ్యాయమం లేదా ఏదైనా వర్కౌట్లతో మైండ్‌ని డైవర్ట్ చేస్తూ.. ఉంటే శారీకంగానూ, మానిసకంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: అంతరిక్ష వ్యర్థాలకు చెక్ పెట్టేలా 'చెక్క ఉపగ్రహం'..ప్రపంచంలోనే..!) -
బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
బరువు తగ్గే ప్రయాణంలో చాలా మంది పలు రకాల వర్కౌట్లు, డైట్‌పై దృష్టిపెడతారు. కానీ ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతున్నాం అనేదాన్ని గమనించరని పోషకాహార నిపుణురాలు ఖ్యాతి రూపాని అంటున్నారు. మన తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరంగా ఉండే ఆహారాలు మన బరువు తగ్గేందుకు ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు. అలాంటి వాటిని ఎంత మేర వరకు తీసుకుంటే బెటర్ అనేది అంచనా వేసి తీసుకోవాలని తెలిపారు. అలాగే ఎక్కువ కేలరీల ఆహారం తీసుకున్న రోజు కచ్చితంగా బాగా హెల్తీగా ఉండే ఆహారాలను తీసుకోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటిస్తే బరువు ఈజీగా తగ్గుతారని చెబుతున్నారు. ఈ సందర్భంగా తన వెయిట్ లాస్ జర్నీలో తాను ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలను దూరం పెట్టడం వల్ల ఎంత తొందరగా బరువు తగ్గగలిగానే అనే విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం, బరువు తగ్గడానికి తినడం అనేవి రెండు వేర్వేరు పరిస్థితులని నొక్కి చెప్పారు. వాటితో సరిగా వ్యవహరించాలని, అన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తక్కువ కేలరీలు లేదా కొవ్వు రహిత పదార్థాలుగా భావించడం బరువు తగ్గే ప్రయత్నాలకు ప్రధాన ఆటంకాలని అన్నారు. అంతేగాదు క్యాలరీలు మనల్ని ఎలా తికమకకు గురిచేస్తాయో కూడా వివరించారు. మన ఆహారంలో కొవ్వులు కీలకమైనవే కానీ ఇవి కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్‌తో పోలిస్తే గ్రాముకు రెట్టింపు క్యాలరీలను ప్యాక్ చేస్తాయి. ఉదాహరణకు ఒక గ్రాము కొవ్వు 9 కేలరీలను ఇస్తుంది. అయితే ఒక గ్రాము కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్ 4 కేలరీలను మాత్రమే ఇస్తుంది. ఇలాంటప్పుడు విజయవంతంగా బరువు తగ్గాలనుకుంటే సముతుల్యత పాటిస్తూ..తక్కువ కేలరీలు, ఫైబర్లు, ప్రోటీన్లు అధికంగా ఉండేలా, కొవ్వు లేకుండా చేసుకోవాలని చెబుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక టేబుల్ స్పూన్ వెన్నలో 50 కేలరీల కంటెంట మొత్తం మీకు ఒక యాపిల్‌తో విభేదిస్తుంది. ఎందుకుంటే..? ఇందులో ఏకంగా 90 కేలరీలు ఉంటాయి, పైగా కొవ్వు ఉండదు, ఫైబర్ పుష్కలంగా ఉండి ఎక్కువ సేపే ఆకలి లేకుండా చేస్తుంది. అందువల్ల వెయిట్ లాస్ జర్నీలో బరువుని ఆటంకపరిచే ఐదు ఆరోగ్యకరమైన ఆహారాల గురించి సవివరంగా వెల్లడించారు పోషకాహార నిపుణులు ఖ్యాతి రూపానీ. అవేంటంటే..అవోకాడో: ఆరోగ్యకరమైన కొవ్వులు కోసం తరుచుగా సూపర్‌ఫుడ్‌గా పేర్కొన్నప్పటికీ..కేలరీల పంచ్ ప్యాక్‌ని అందిస్తుంది. ఇవి 100 గ్రాముల అవోకాడోకి సుమారు 200 కేలరీలు, 19 గ్రాముల కొవ్వులు ఉంటాయి. అందువల్ల దీన్ని డైట్లో చేర్చుకునేటప్పుడూ మితంగా ఉండేలా చూసుకోవటం ముఖ్యం.స్మూతీస్: ఈ స్మూతీస్‌లో మంచి తృణధాన్యాలు, వెన్న, పాలతో లోడ్ చేసే కేలరీల లోడ్. దీన్ని ఆస్వాదించేటప్పుడూ కూడా జాగురుకతతో వ్యవహరించాలి. సమతుల్యంగా తీసుకోవాలి. నట్ బట్టర్: ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉన్నప్పటికీ నట్ బట్టర్ శరీరానికి అదనపు కేలరీలను అందించేస్తుంది. చెప్పాలంటే వంద గ్రాములకు సుమారు 600 కేలరీలను పొందుతాం కాబట్టి తీసుకునేటప్పుడూ ఆ రోజు వర్కౌట్ల రీత్యా ఎంతమేర బెటర్ అనేది అంచనా వేసి మితంగా తీసుకుంటే మంచిది.వేయించిన స్నాక్స్: వేయించిన అల్పాహారం అంటే అరటిపండు చిప్స్ వంటి రకరకాల ఐటెమ్స్ విషయంలో కేలరీల కంటెంట్‌పై దృష్టిపెట్టాలని చెబుతున్నారు. ఇవి బాగా రుచిగా ఉండటంతో ఒకేసారి ఎక్కువ మోతాదులో శరీరం కేలరీను ఈజీగా పొందుతుంది.షుగర్ ఫ్రీ స్వీట్స్: షుగర్-ఫ్రీ స్వీట్స్ కదా పెద్ద క్యాలరీలు ఉండవని చాలామంద పొరపడతారు. ఇవి కొవ్వు రహితం మాత్రం కాదు. వంద గ్రాముల షుగర్ ఫ్రీ స్వీట్స్‌లో దాదాపు 317 కేలరీలు ఉంటాయని చెబుతున్నారు పోషాకాహార నిపుణురాలు ఖ్యాతి రూపానీ. అందువల్ల ఇలాంటి హెల్తీ ఆహారాలను తీసుకునే విషయంలో కాస్త జాగురకతతో వ్యవహరిస్తూ మితంగా తీసుకుంటే తక్కువ సమయంలోనే ఈజీగా బరువు తగ్గుతారని అంటున్నారు. View this post on Instagram A post shared by Diet Plans by Nutritionist Khyati Rupani (@balancenutrition.in) (చదవండి: బరువు తగ్గాలని రైస్‌కి దూరంగా ఉంటున్నారా? ఫిట్నెస్ కోచ్ ఏమంటున్నారంటే..) -
వేసవిలో ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉంటే మేలు!
సమ్మర్లో ఏదీ పడేతే అది తినకూడదు. సూర్యుడి భగ భగలకి దాహం దాహం అన్నట్లు ఉంటుంది. ఎక్కువ ఆహారం తినలేం. చల్లటి పానీయాలే తీసుకోవాలని పిస్తుంది. అలా అని కూల్‌డ్రింక్స్ వంటివి తాగితే ఇక అంతే సంగతులు. చేజేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నవారవ్వుతారు. ఇలాంటి హాట్ సమ్మర్లో ఎలాంటి పదార్థాలు తింటే మంచిది, వేటికి దూరంగా ఉంటే బెటర్ తెలుసుకుందామా!. వేసవి అనగానే వాతావరణం ఉక్కపోతలతో చిరాకు తెప్పిస్తుంటుంది. దీంతో చాలా మంది చల్లదనం కోసం తహతహలాడుతుంటారు. ఈ సమయంలో ఎక్కువగా దాహం వేస్తుంది. అయితే కొందరు కారం, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల విపరీతమైన దాహం వేస్తుంది. దీంతో ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల డైజేషన్ సమస్యలు వస్తాయి. కుడుపు ఉబ్బరంగా ఉండి అలసట ఏర్పడుతుంది. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగా స్పైస్ ఫుడ్‌ను అవైడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు అవితీసుకోకుండా ఉండటమే మంచిది. వేసవి కాలంలో శరీరం ఎక్కువగా డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఇలాంటి సమయంలో శరీరానికి చల్లదనం చేసే ద్రవపదార్థాలు తీసుకోవాలి. అంటే టీ, కాఫీలు తగ్గించాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరం తేమ కోల్పోయిన నిర్జీవంగా తయారై అనారోగ్యం ఏర్పడవచ్చు. మాంసాహారం అనగానే చాలా మంది లొట్టలేసుకొని తింటారు. వేసవిలో ఇవి తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇవి జీర్ణక్రియను మందగించడమే కాకుండా ఒక్కోసారి కడుపులో సమస్యలు వచ్చి విరేచనాలు రావొచ్చు. అలాగే వేపుళ్లు, పచ్చళ్లను సైతం ఈ కాలంలో అవైడ్ చేయాలి. వీటికి బదులు పెరుగన్నం, తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. లేకపోతే అనేక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. వేసవిలో ఫ్రైడ్‌ఫుడ్స్, జంక్ ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. అసలే ఎండాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుందంటే.. ఇక వీటిని తింటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. చాలామంది ఎండలోంచి ఇంటికి రాగానే.. లేదంటే బయటికి వెళ్లినప్పుడు ఎండ వేడికి తట్టుకోలేక చల్లదనం కోసం ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్.. వంటివి తీసుకుంటుంటారు. అయితే ఇవి వేసవి వేడి నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ శరీరంలో అత్యధికంగా వేడి ఉత్పత్తయ్యేలా చేస్తాయి. (చదవండి: ఏసీ నీటిని ఉపయోగించొచ్చా! ఆరోగ్యానికి మంచిదేనా?) -
భానుడి భగ భగ: ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
మార్చి మాసం ముగియుకుండానే భానుడి భగ భగలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో మండే ఎండలు, వేడిగాలులు తట్టుకొని నిలబడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే వేసవిలో వడ దెబ్బ ప్రమాదం పెరుగుతుంది. మరి వడదెబ్బ, ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో పిల్లా పెద్దా అంతా అప్రతమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా, నీరు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగాలి. వీటితోపాటు రకరకాల ద్రవపదార్థాలు, పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యాన్నిచ్చే వివిధరకాల తాజా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెరుగు, మజ్జిగ, సీజనల్ పండ్లు, ద్రాక్ష, బొప్పాయి వంటివి ఈ సీజన్లో తీసుకోవడం మేలు చేస్తుంది. అతిగా ఆహారం తీసుకోవడం హానికరం. నీటిని ఎక్కువగా వాడాలి.దాహంగా ఉంది కదా అని రసాయన సహిత కూల్ డ్రింక్స్, శుభ్రమైన ఐస్ వాడని డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులతో బాధపడేవారు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎండలోకి వెళ్లకుండా చూడాలి. తప్పదు అనుకుంటే, ఎండను తట్టుకునేలా తలపై టోపీ లేదా గొడుగు వాడాలి. బార్లీని నీటిలో నాన బెట్టి మరిగించి తయారు చేసిన నీళ్లు తాగితే వడదెబ్బ తగలదు. ఉల్లి పాయ రసం తాగితే వడదెబ్బ తగలకుడా చేస్తుంది. దీనితో పాటు, ఉల్లిపాయ రసాన్ని అరికాళ్ళపై పూయడం కూడా మంచిదే. చెమటలు పట్టేటప్పుడు చల్లటి నీరు ఎక్కువగా తాగడం ప్రమాదకరం. అలాగే ఎండలోంచి లోపలికి వచ్చిన వెంటనే గట గటా చల్లని నీళ్లు తాగకూడదు. ఒకవేళ ఏదైనా అనారోగ్యంగా అనిపించినా, వాంతులు, కళ్లు తిరగడం, తలనొప్పి, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. తక్షణమే చికిత్స తీసుకోవాలి. -
Maha Shivratri: నేడు తినాల్సినవి/తినకూడని ఆహారాలు ఇవే!
మహా శివరాత్రి పర్వదినం కావడంతో అందరూ తమ శక్తి మేరకు ఎంతో కొంత ఉపవాసం ఉంటారు. కొందరూ మధ్యహ్నాం వరకు తినరు మరికొందరూ రోజంతా ఏం తినకుండా రాత్రి జాగరం కూడా చేసి మరసటి రోజు ఉదయం గానీ తినరు. ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు పళ్లు, పాలు వంటివి తీసుకోని ఆ భోళా శంకరుడుని ప్రార్థించొచ్చు. అలాంటి వారు ఈ పర్వదినం రోజు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో చూద్దామా!. సగ్గుబియ్యం: ఇది తక్షణ శక్తి ఇస్తుంది. ఉపవాసం చేసే వాళ్లకు చాలా మంచిది. ఈ సగ్గుబియ్యందో చేసిన జావా లేదా పాలతో చేసే సగ్గుబియ్యం జావా తాగితే మంచిది. ఉపవాసం ఉన్న వాళ్లకు మంచి ఎనర్జీ బూస్టప్‌గా ఉంటుంది. బంగాళ దుంప!: ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా ఉడక బెట్టుకుని లేదా దానికి సంబంధించిన రెసిపీలు తీసుకుంటే మంచిది. అయితే ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయాలు లేకుండా నచ్చిన రెసిపీ చేసుకుంటే మంచిది పాల సంబంధిత రెసిపీలు.. శివుడికి పాల సంబంధిత పదార్థాలను నైవద్యంగా పెట్టడం జరుగుతంది. అలాంటివి తీసుకుంటే ఉపవాసం ఉన్నవాళ్లు కళ్లు తిరగడం వంటివి తలెత్తవు. పండ్లు, డ్రైఫ్రూట్స్ పండ్లు తినడం మంచిదే కానీ, మరీ సిట్రస్ ఎక్కువగా ఉండే పుల్లటి పండ్లు తినకపోవడమే మంచిది. ఉపవాసం కారణంగా పొట్టలో ఆటోమేటిగ్గా యాసిడ్లు ఫామ్ అవుతాయి. ఇక ఇలాంటి పుల్లటి పళ్లు తీసుకుంటే మరింత గ్యాస్ ఫామ్ అయ్యే ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంది. తీసుకోకూడని పదార్థాలు.. తృణ ధాన్యాలు.. గోధుమలు, అరికెలు, జొన్నలు, సామలు వంటి తృణ ధాన్యాలకు సంబంధించిన పదార్థాలు వినియోగించకూడదు. అలాగే ఎలాంటి పిండి పదార్ధాలు వినియోగించ కూడదు. ఉల్లి, వెల్లుల్లి.. సాధారణంగా ఇలాంటి పర్వదినాల్లో ఉల్లి, వెల్లుల్లి జోలికిపోరు. ఇవి తమో రజో గుణాలను ప్రేరిపిస్తుందని మునులు వీటిని ఇలాంటి పర్వదినంలో త్యజించమని సూచించారు. ఉప్పు ఉప్పు లేని పదార్థాలే తీసుకోవాలి. అదికూడా సైంధవ లవణమైతే వినియోగించొచ్చు. స్సైసీ ఫుడ్స్ మసాలతో కూడిన పదార్థాలు నిషిద్ధం. నాన్ వెజ్ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్‌వెజ్ జోలికి పోకూడదు. మహా శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఉపవాసంతో ఆ ముక్కంటి అనుగ్రహం పొందేలా చేసుకునే పవిత్రమైన రోజు. (చదవండి: లావుగా ఉన్నావంటూ భార్యతో సహా బిడ్డను వదిలేశాడు..కానీ ఆమె..!) -
Israel-Hamas war: గాజాకు అమెరికా మానవతా సాయం
వాషింగ్టన్: ఒకవైపు ఇజ్రాయెల్ భీకర దాడులు.. మరోవైపు ఆహారం దొరక్క ఆకలి కేకలు.. గాజాలో లక్షలాది మంది పాలస్తీనియన్ల దుస్థితి ఇది. వారికి సాయం అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచి్చంది. బాధితులకు మానవతా సాయం పంపిణీని ప్రారంభించింది. ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమెరికా సైన్యానికి చెందిన సి–130 సరుకు రవాణా విమానాల ద్వారా శనివారం ఉదయం గాజాలో 38 వేల ఆహార ప్యాకెట్లను జారవిడిచారు. 66 పెద్ద బండిళ్లలో ఈ ప్యాకెట్లను భద్రపర్చి, బాధితులకు చేరేలా కిందికి జారవిడిచారు. ఇందుకోసం జోర్డాన్ సహకారంతో మూడు విమానాలను ఉపయోగించినట్లు అమెరికా సైనికాధికారులు తెలిపారు. గాజాలో విమానం ద్వారా ఆహార పదార్థాలు అందించిన అనుభవం జోర్డాన్‌కు ఉంది. -
మూడ్‌ని మార్చి రిఫ్రెష్ అయ్యేలా చేసే సూపర్ ఫుడ్స్ ఇవే!
శరీరంలో స్రవించే హార్మోన్లలో ఒక్కోసారి చోటు చేసుకునే కొన్ని రకాల అసమతౌల్యతల కారణంగా చాలా ఒత్తిడికి లోనవుతుండటం లేదా మూడ్ ఆఫ్ కావడం మామూలే. అయితే దాన్ని సరిచేయడానికి మందులు మింగే బదులు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాలు దృఢంగా ఉంటాయి. ఆ ఆహారాలేమిటో తెలుసుకుని, మూడ్ బాగుండనప్పుడు వాటిని తీసుకుంటే సరి! మూడ్‌ని మార్చే ఫుడ్ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మూడ్ పాడవుతుంది. ఏదో పోగొట్టుకున్నట్లు... వెలితిగా... ఒకలాంటి బాధగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వెంటనే మూడ్ సరవుతుంది. అవేమిటో తెలుసుకుందాం... పాలకూర.. ఐరన్ పాళ్లు అధికంగా ఉండే పాలకూర సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి పనిచేస్తుంది. అంతేకాదు, ఇందులో ఫైబర్, విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూర స్మూతీ, సూప్ లేదా పాలకూరను ఏదో ఒక రూపంలో ఆహారంలో తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మష్రూమ్స్.. మష్రూమ్స్ యాంటి డిప్రెసెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ డి మానసిక స్థితిని నియంత్రిస్తుంది. ఇది సెరటోనిన్ సంశ్లేషణ స్థాయికి సంబంధించినది. దీని కారణంగా వ్యక్తి సంతోషకరమైన భావోద్వేగాలను అనుభవించగలడు. మీ మూడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, మష్రూమ్ రెసిపీని తినడం వల్ల తిరిగి మంచి మూడ్‌లోకి వచ్చేసే అవకాశం మెండుగా ఉంది. ప్రయోజనకరంగా ఉంటుంది. అవకాడో.. కొద్దికాలం క్రితం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ బి3 ,ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు సంతోషకరమైన హార్మోన్ అయిన సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. రోజంతా సంతోషంగా ఉండటానికి సలాడ్, శాండ్విచ్ లేదా అల్పాహారంలో అవకాడోను చేర్చవచ్చు. డ్రై ఫ్రూట్స్.. ప్రతిరోజూ కొన్ని బాదం లేదా వాల్నట్లను తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఇలా జరుగుతుంది. డార్క్ చాకొలేట్.. ఓ నివేదిక ప్రకారం డార్క్ చాకొలేట్ తినడం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ స్థాయులను పెంచుతుంది. ఫలితంగా వెంటనే మూడ్ సరవుతుంది. మూడ్ బాగుండనప్పుడు ఈ ఫుడ్ ప్రయత్నించండి. (చదవండి: మాంసంతో బియ్యం తయారీ..!సరికొత్త హైబ్రిడ్ వరి వంగడం!) -
పోషకాల పిండివంటలు
సంక్రాంతికి మనం రకరకాల పిండివంటలు చేసుకుంటాం. అయితే అవన్నీ ఈ రుతువుకు తగినవనీ, శరీరానికి బలాన్నిస్తాయనే ఉద్దేశంతోనే మన పెద్దలు ఈ పండక్కి ఈ పిండివంటలను నిర్దేశించి ఉండచ్చని వీటిలోని పోషకాలను బట్టి తెలుస్తోంది. ఏయే పిండివంటల్లో ఏయే పోషకాలున్నాయో చూద్దాం. అరిసెలు సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి అరిసెలు. వీటిని పంచదారతో, బెల్లంతో కూడా చేస్తారు కానీ, బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి మంచిది. వీటి తయారీలో కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులు వాడతారు. ఇందులో వాడే బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు, ఐరన్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. కొబ్బరి బూరెలు అరిసెల తరవాత అంతటి ప్రధానమైన వంటకం కొబ్బరి బూరెలు. దీంట్లో కొత్త బియ్యపుపిండి, కొబ్బరి, యాలకుల పోడి, బెల్లం వాడతారు. అరిసెలలో ఉన్న పోషకాలతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఈ కొబ్బరి బూరెల్లో లభిస్తాయి. నువ్వుల ఉండలు పరస్పరం నువ్వుల ఉండలు పంచుకోవడం సంక్రాంతి సంప్రదాయాలలో ఒకటి. మంచి బలవర్థకమైన ఆహారం నువ్వుల ఉండలు. శీతాకాలంలో శరీరం పోడిబారిపోతూ ఉంటుంది. ఈ సమయంలో నువ్వులు ఆహారంగా తీసుకోవడం ద్వారా దానిలో ఉండే నూనె శరీరాన్ని కాంతిమంతంగా ఉండేలా దోహదం చేస్తుంది. టీనేజీ బాలికల్లో రక్తహీనతను నివారించడానికి ఉపకరిస్తుంది. శరీరంలో వేడి పుట్టించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. విటమిన్ ఎ, డి, ఇ, కెలు లభిస్తాయి. దేహదారుఢ్యానికి నువ్వుండలను మించింది లేదు. జంతికలు తియ్యటి పదార్థాలు తిన్న జిహ్వ, ఆ వెంటనే కార కారంగా ఉండే వాటిని తినాలనుకోవడం సహజం. కారపు పిండివంటల్లో జంతికలు లేదా సకినాలు ప్రధానమైనవి. బియ్యపు పిండి, శనగపిండి, నువ్వులు, వాము ఇందులో వాడతారు. శనగపిండి, బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్లను అందిస్తే నువ్వులు చర్మాన్ని కాంతివంతం చేసేందుకు సహకరిస్తాయి. చిన్నపిల్లలు వీటిని ఎక్కువ తింటారు. వీటిలో వాడే వాము సుఖ విరోచనానికి తోడ్పడి.. జీర్ణప్రక్రియ చురుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది. సున్ని ఉండలు బలవర్థకమైన ఆహారంలో సున్నిఉండలు మొదటిస్థానంలో ఉంటాయి. మినపపిండి, నెయ్యి, బెల్లం వాడతారు. బెల్లం రక్తాన్ని శుద్ధిచేస్తే, సున్ని, నెయ్యి ద్వారాప్రోటీన్లు, పలు రకాల పోషకాలను, శక్తిని అందిస్తాయి. కొత్త అల్లుళ్లకు సున్ని ఉండలు కొసరి కొసరి వడ్డిస్తారు. హోర్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి సహకరిస్తుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు ఇవి ఎంతో తోడ్పడతాయి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. అంటే దేనిలోనూ అతి పనికి రాదు. వంటికి మంచిది కదా.. రుచిగా ఉన్నాయి కదా అని మధుమేహులు, శరీర తత్త్వానికి పడని వాళ్లు తగిన మోతాదులో తీసుకోవడమే ఆరోగ్యకరం అని గుర్తుంచుకోవడం మంచిది. కజ్జికాయలు అరిసెలు అంతగా పడని వారు, అంత శ్రమ తీసుకోలేనివారు కజ్జికాయలు చేసుకుంటారు. ఇవి కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండటంతోపాటు పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. దీనిలో కొబ్బరి, రవ్వ, పంచదార లేదా పల్లీలు, పుట్నాలు, నువ్వులతో పాటు సుగంధ ద్రవ్యాలైన యాలకులు, జీడిపప్పు వంటివి కూడా వినియోగిస్తారు. కజ్జికాయల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, ఐరన్ , ఖనిజ లవణాలు అందుతాయి. గారెలు సంక్రాంతికి తప్పనిసరిగా వండుకునే వాటిల్లో గారెలు ఒకటి. కనుము నాడు మినుము తింటే మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే మినుము తిన్నవాళ్లు ఇనుములా ఉంటారని మరో సామెత. పోట్టు తియ్యని మినుముల్లో పోషకాలు చాలానే ఉంటాయి. రాను రాను పోట్టు తీసిన మినప్పప్పు గారెలకు వాడుతున్నారు. కానీ మినప పోట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్ఠం. మినుములో మాంసకృత్తులతోపాటు అనేక రకాలప్రోటీన్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి. -
న్యూ ఇయర్ రోజున ఇవి తింటే..అదృష్టానికి, డబ్బుకి ఢోకా ఉండదట!
కొత్త ఏడాది 2024 వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అందరూ ఈ న్యూ ఇయర్‌ని తమదైన పద్ధతిలో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం సంతోషకరంగా సాగిపోవాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్లుగానే మంచిగా ప్లాన్ చేసుకుంటారు కూడా. అయితే కొత్త ఏడాది రోజున ఇవి తింటే ఏడాదంతా అదృష్టం కలిసొచ్చి సంతోషకరంగా సాగుతుందని కొన్ని దేశాల ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. అవేంటో తెలుసుకుందామా! ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతులు ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. అంతా కలిసి సెలబ్రెట్ చేసుకునేది మాత్రం న్యూ ఇయర్ నాడే. ఈ రోజున కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఈ న్యూ ఇయర్‌ని ప్రారంభిస్తే ఆ ఏడాదంతా బావుండటమే కాకుండా అదృష్టం వస్తుందని కొందరి ప్రగాఢి నమ్మకం. ఇంతకీ మరీ ఈ రోజు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలంటే.. ద్రాక్ష ప్రేమను: స్పెయిన్, లాటిన్ అమెరిక దేశాలలో న్యూఇయర్ రోజున వీటిని తినడం అక్కడ అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇలా న్యూ ఇయర్ రోజు ద్రాక్ష తింటే ప్రతి నెలా అదృష్ట కలిసొస్తుందని ఒక నమ్మకం కూడా. అంతేగాదు సోషల్ మీడియాలో దాదాపు 12 ద్రాక్ష పండ్లను తింటే మిమ్మల్ని ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలుస్తారనే ట్రెండ్ తెగ నడుస్తోంది కూడా. కాయధాన్యాలు దీర్ఘాయుష్షును: ఈ రోజున పప్పుతో చేసిన రెసిపీలు లేదా సూప్ తినడం మంచిదట. ముఖ్యంగా ఇలా తింటే ఆర్థిక సమృద్ధి పుష్కలంగా ఉంటుందని భావిస్తారు. ఇటలీలో ఎక్కువగా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దానిమ్మ పండు సంతానం: గ్రీకు సంప్రదాయంలో దానిమ్మని సంతానోత్పత్తి, శ్రేయస్సు, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. న్యూ ఇయర్ రోజున ఇవి తింటే సంతానం, సంపద, అదృష్టం వస్తాయని ఎక్కువమంది నమ్ముతారు. చేపలు తింటే లక్కు: వివిధ సంస్కృతుల్లో చేపలను అదృష్టవంతమైన వాటిగా పరిగణిస్తారు. అవి పురోగతి, సమృద్ధికి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారట. అందుకే కొన్ని ప్రదేశాల్లో నూతన సంవత్సరం రోజున చేపలు తినడంతో ప్రారంభిస్తారట కూడా. ఆకుకూరలు సంపదలు ఇస్తాయి: యూఎస్ఏలోని అనేక కుటుంబాలు కొల్లార్డ్ గ్రీన్స్ లేదా క్యాబేజీ వంటి ఆకుకూరలను తినడంతో న్యూ ఇయర్ రోజుని ప్రారంభిస్తారు. అలా చేస్తే సంపదలు పెరుగుతాయనేది వారి ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ఆకుపచ్చ రంగును సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఆరోజు ఆకుకూరలు తింటే ఆర్థిక సమస్యలనేవే ఉండవనేది వారి విశ్వాసం. నూడుల్స్ అదృష్టాన్ని తెస్తాయి: చైనాలో పొడవైన నూడుల్స్ దీర్ఘాయువును సూచిస్తాయి. అందువల్ల న్యూ ఇయర్ రోజున న్యూడిల్స్ తింటే దీర్ఘాఆయుష్షు ఉంటుందనేది వారి నమ్మకం. చైనా సంస్కృతి ప్రకారం ఆ రోజు ఇవి తింటే అదృష్టం వస్తుందని చెబుతారు. కేక్ లేదా డోనట్స్: గుండ్రని ఆకారంలో మధ్యలో చిల్లు ఉండే ఇవి తింటే సంవత్సరాంతం బాగుటుందని, లక్ కలిసోస్తుందని కొందరూ భావిస్తారు. (చదవండి: 'ఆరెంజ్ మార్మాలాడే' రెసిపీ చేసిన సోనియా, రాహుల్! వీడియో వైరల్) -
వంట అయిపోగానే దానంతట అదే ఆఫ్ అయిపోతుంది
వండివార్చేవాళ్లకు ఈ ఎలక్ట్రిక్ పోర్టబుల్ స్టవ్ దొరికితే పండుగే! ఎందుకంటే దీనిపై ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పాత్రతోనైనా సులభంగా వండుకోవచ్చు. ఏ వంటకాన్నయినా నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. ఈ మినీ ఎలక్ట్రిక్ స్టవ్‌ని పవర్‌తో కనెక్ట్ చేసుకుని.. కుడివైపు ముందు భాగంలో ఉన్న రెగ్యులేటర్‌ను సెట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన.. రైస్ ఐటమ్స్ దగ్గర నుంచి కూరలు, సూప్స్, టీ, కాఫీలన్నిటినీ తయారు చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ క్లోజింగ్ ఫంక్షన్‌తో రూపొందటంతో ఔట్ డోర్ క్యాంపింగ్ బర్నర్‌గా యూజ్ అవుతుంది. స్టీల్, గ్లాస్, అల్యూమినియం.. ఇలా అన్నిపాత్రలూ దీనికి సెట్ అవుతాయి. ఇలాంటి మోడల్స్.. అనేక రంగుల్లో అమ్ముడుపోతున్నాయి. పవర్ వాట్స్ లేదా సెట్టింగ్స్‌లో చిన్న చిన్న మార్పులతో లభించే ఇలాంటి స్టవ్‌లకు మంచి గిరాకే ఉంది. ధర కూడా తక్కువే. కేవలం15 డాలర్లు (రూ.1,251) మాత్రమే. -
ఉత్తమ ఆహార నగరాల జాబితాలో ఐదు భారత నగరాలకు చోటు!
పర్యాటకులు ఏ నగరం వెళ్లినా.. ముందుగా తెలుసుకునేది ఆహారం గురించే. ఎలాంటి ఆహారం దొరుకుతుందని తెలుసుకుని అప్పుడూ స్టే చేయగలమా లేదా నిర్ణయించుకుంటారు. అలా అత్యుత్తమ ఆహారం అందించే నగరాల జాబితా తెలిస్తే పర్యాటకలుకు మరితం ఈజీ అవుతుంది. అలాంటి ఉత్తమ ఆహార నగరాల జాబితా ఒకటి ఇటీవలే విడుదలైంది. దీన్నిఆ నగర సంస్కృతిక, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్థానిక ఆహారాన్ని రుచిగా అందించే... గల్లీలోని స్టాల్స్ నుంచి ఐకానిక్ రెస్టారెంట్ల వరకు ఏం ఉన్నాయి, ఆహార ప్రియులు ఇష్టపడే నగరాలు, ఆ రెస్టారెంట్లకు ఉన్న రేట్లు తదితరాలను పరిగణలోనికి తీసుకుని మరీ ఈ ఉత్తమ ఆహార నగరాల జాబితాను ఇచ్చారు. ఈ ఉత్తమ ఆహారాల జాబితాను ట్రావెల్ ఆన్లైన్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ఇటీవలే విడుదల చేసింది. ఆ జాబితాలో ఐదు భారతీయ మహానగరాలు చోటు దక్కించుకోవడం విశేషం. ఆ నగరాలు ఏంటంటే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, లక్నో టాప్ 100 జాబితాలో స్థానం దక్కించుకోగా, టాప్ 50లో ముంబై 35వ స్థానం, హైదరాబాద్ 39వ స్థానం నిలాచాయి. ఇక ఢిల్లీ 56వ స్థానానికి, చెన్నై(65), లక్నో(92) స్థానాలను దక్కించుకున్నాయి. ఇక ఈ జాబితాలో తాజా పదార్థాలతో రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధిగా రోమ్(ఇటలీ) నిలిచింది. బోలోగ్నా, నేపుల్స్, రెండు ఇటాలియన్ నగరాలు రెండు, మూడు ర్యాంక్‌లు దక్కించుకున్నాయి. కాగా, టాప్ 10 జాబితాలో స్థానం దక్కించుకున్న ఇతర నగరాలు వియన్నా(ఆస్ట్రియా), టోక్యో(జపాన్), హాంకాంగ్(చైనా), టురిన్ (ఇటలీ), గాజియాంటెప్ (టర్కీ) , బాండుంగ్ (ఇండోనేషియా) తదితరాలు. (చదవండి: అత్యంత తక్కువ పగటి కాలం ఉండేది ఈ రోజే! ఎందుకలా జరుగుతుందంటే..?) -
2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్ కోసం వెతికారో తెలుసా?
ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే 2024లో అడుగు పెట్టబోతున్నాం. కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. 2023లో ఫ్యాషన్, బ్యూటీ, ఫుడ్ విషయంలో అనేక కొత్త ట్రెండ్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఫుడ్ రెసిపిల్లోనూ వెరైటీ ప్రయోగాలెన్నో చూశాం. అలా 2023లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 ఆహార పదార్థాలుఏంటో చూసేద్దాం. మిల్లెట్స్ 2023 సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆహార పదార్థాల్లో మిల్లెట్స్ పేరు ముందుంది. మిల్లెట్స్ తయారీ విధానం, దాని ప్రయోజనాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. దీనికి ప్రధాన కారణం.. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడమే. అవకాడో అవకాడో ఒక అమెరికన్ ఫ్రూట్. దీన్ని తెలుగులో వెన్నపండు అంటారు. గూగుల్‌లో అత్యధికంగా వెతిక ఆహార పదార్థాల్లో అవకాడో ఒకటి. అవకాడలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫ్రూట్‌కి బాగా డిమాండ్ ఉంది. అరటిపండు కంటే అవోకాడోలో ఎక్కువ పొటాషియం ఉంది. అవకాడో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అవకాడోను పలు స్మూతీల్లో, సలాడ్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కాస్త కాస్ట్లీ అయినప్పటికీ అవకాడోలోని పోషకాలు, హెల్తీ ఫ్యాట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కారణంగానే గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ ఫుడ్ ఐటెమ్స్‌లో ఒకటిగా నిలిచింది. మటన్ రోగన్ జోష్ గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఫుడ్ ఐటమ్స్‌లో మటన్ రోగన్ జోష్ మూడో స్థానం దక్కించుకుంది. ఇది పాపులర్ కశ్మీరీ వంటకం. నాన్ లేదా రైస్‌తో తినే ఈ స్పైసీ ఫుడ్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ ఏడాది ఎక్కవుగా సెర్చ్ చేసిన టాప్-3 ఐటెం ఇది. కతి రోల్స్ 2023లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఆహార పదార్థాల్లో కతి రోల్స్ నాలుగో స్థానంలో నిలిచింది. కోల్‌కతాలోని పాపులర్ స్ట్రీట్‌ఫుడ్స్‌లో ఇది ఒకటి. రోల్స్‌లో స్టఫింగ్ కోసం వెజ్ లేదా నాన్‌వెజ్‌ను ఎంచుకోవచ్చు. వీటిని చట్నీ లేదా సాస్‌తో వడ్డిస్తారు. టిన్ట్ ఫిష్ చేపల్లో ప్రోటీన్, ఒమేగా-2 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. 2023లో ఎక్కువగా సెర్చ్ చేసిన వంటకాల్లో టిన్ట్ ఫిష్ కూడా ఉంది. సలాడ్,శాండ్విచ్, పాస్తా,,క్యాస్రోల్ వంటకాల్లో ఎక్కువగా టిన్ట్ ఫిష్‌ను ఉపయోగిస్తారు. -
మీల్మేకర్ స్టఫ్డ్ చపాతీ.. భలే రుచిగా ఉంటాయి
మీల్మేకర్ స్టఫ్డ్ చపాతీ తయారీకి కావలసినవి: మీల్మేకర్ – పావు కప్పు (మెత్తగా ఉడికించుకుని, చల్లారాక తురుములా చేసుకోవాలి), గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు, వేడి నీళ్లు, నూనె – సరిపడా, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు చొప్పున, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, కారం – 1 టీ స్పూన్ , అల్లం– వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పూన్ , టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నవి), కరివేపాకు, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, మూడు గరిటెల నూనె, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కొద్దికొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకుని, తడి గుడ్డ పరచి 20 నిమిషాల పాటు పక్కనపెట్టుకోవాలి. ఈలోపు ఒక కళాయిలో 2 గరిటెల నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను దోరగా వేయించుకుని.. మీల్మేకర్ తురుమునూ వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి.. పసుపు, కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర తురుము వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం చపాతీలు చేసుకుని, ఒక్కోదానిలో కొద్దికొద్దిగా మీల్మేకర్ మిశ్రమాన్ని పెట్టుకుని.. ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
కమ్యూనిటీ కిచెన్: వంట చేసే పనిలేదు, ఇంటికే భోజనం వచ్చేస్తుంది
పది కుటుంబాలకు నలుగురు వండి పెడతారు. రోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వండీ వండీ వండీ అలసిపోయేవారూ ఉద్యోగాల వల్ల టైమ్ లేని వారు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నవారు ఇదేదో బాగుందే అనుకుంటున్నవారు కేరళలో కమ్యూనిటీ కిచెన్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. అంటే పది కుటుంబాలు కలిసి ఓ నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆ మహిళలు ఆ పది కుటుంబాలకు వంట చేసి పంపిస్తున్నారు. ఇది రోజు రోజుకూ పెరుగుతున్న ట్రెండ్. 'ప్లాన్ చేస్తే పోయేదేమీ లేదు వంట చేసే బాధ తప్ప’ అంటున్నారు కేరళ వాసులు. ‘వంట గది వద్దు. వంట మీద ఆదాయం ముద్దు’ అనే నినాదం కూడా ఇస్తున్నారు. ఇదంతా గత ఒకటి రెండేళ్లలో జరిగిన మార్పు. కేరళలోని పొన్నాని’ అనే టౌన్లో ఇద్దరు స్నేహితుల కుటుంబాలకు వచ్చిన ఆలోచన ‘సహకరణ కిచెన్’ (కమ్యూనిటీ కిచెన్) ఉద్యమానికి కారణం అయ్యింది. వంట చేసి పెడతారా? పొన్నానిలో రమేష్ వలియిల్ అనే బ్యాంక్ ఎంప్లాయే రోజూ వంట కోసం భార్య పడే బాధలు చూసేవాడు. ఉదయాన్నే ఆమె బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు లంచ్ వండి బాక్స్ కట్టివ్వాల్సి వచ్చేది. కొన్నాళ్లకు ఆమె జబ్బు పడింది. డాక్టర్లు వంట చేయవద్దన్నారు. ఏం చేయాలో రమేష్‌కు ΄పాలుపోలేదు. మరోవైపు అదే ఊళ్లో ఉన్న కలీముద్దీన్, అతని భార్య మాజిద అడ్వకేట్లు. ఉదయాన్నే ఇంటికొచ్చే క్లయింట్లను చూసుకోవాలా వంట గొడవలో ఉండాలా అనేది సమస్య అయ్యింది. ఈ కుటుంబాలు రెండూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనుక తమకెవరైనా వండిపెట్టే వాళ్లుంటే బాగుండు అనుకున్నారు. అది కూడా ఇంటికొచ్చి కాదు. ఎక్కడైనా వండి పెట్టి అందించే వారు కావాలి. అందుకని వారే ఇద్దరు స్త్రీలను వెతికారు. వారికోసమని ఒక ఖాళీ స్థలం వెతికి షెడ్ వేశారు. తమ కుటుంబాలతో పాటు మరో ఎనిమిది కుటుంబాలను కలిపారు. మొత్తం పది కుటుంబాల కోసం అలా కమ్యూనిటీ కిచెన్ మొదలయ్యింది. వంట బాధ నుంచి పెద్ద ఉపశమనం లభించింది. మొదటి రోజే మెను రోజూ ఉదయాన్నే 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తయారయ్యి ఈ పది కుటుంబాల గడపలకు చేరేవి. వంట చేసే మనుషులకు ఇలా చేరవేసే మనుషులు తోడయ్యారు. వంట ఖర్చు అన్ని కుటుంబాలు సమానంగా పంచుకున్నా నెలకు వంట చేసి పెట్టేవారికి మంచి గిట్టుబాటుగానే ఉంది. కాకుంటే వీళ్లు ఉదయాన్నే నాలుగ్గంటలకంతా లేచి వంట మొదలుపెట్టాలి. మెనూ వాట్సాప్ గ్రూప్‌లో మొదటిరోజు పోస్ట్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పూరి, పుట్టు, ఆపమ్, ఉప్మా లాంటివి ఉంటాయి. భోజనంలో నాలుగు రకాల కూరలు చికెన్, ఫిష్ ఉంటాయి. ఈ కుటుంబాల వాళ్లు ఫోన్లు చేసి వాట్సప్ కాల్స్ చేసి వంటను అజమాయిషీ చేస్తారు. మసాలాలు ఏవి వేయాలో చెప్తారు. అంతా ఆరోగ్యకరమైన తిండి లభించేలా చూస్తారు. లాభాలు ఎన్నో వంట తప్పితే మొదట చాలా టైము అందరి దగ్గరా మిగులుతోంది. ‘ఇంతకుముందు పిల్లలు స్పెషల్‌గా ఏదైనా చేసిపెట్టమంటే రోజువారి వంటతో ఓపిక లేక చేసేదాన్ని కాదు. ఇప్పుడు చేసి పెడుతున్నాను’ అని ఒక తల్లి చెప్పింది. ‘పది ఇళ్ల వంట వల్ల అయ్యే ఇంధనం, వచ్చే చెత్త కంటే కమ్యూనిటీ కిచెన్ వల్ల అయ్యే ఇంధనం, మిగిలే చెత్త తక్కువ. డబ్బు ఆదా అవుతుంది కూడా’ అంది మరో గృహిణి. అదీగాక దీనివల్ల మరో నలుగురికి పని దొరకడం మంచి విషయంగానే చూస్తున్నారు. ఊరూరూ వ్యాపించాయి మలబార్ జిల్లాలోని పొన్నాని నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఆ వెంటనే పక్క జిల్లా అయిన కోళికోడ్‌కు వ్యాపించింది. ప్రస్తుతం మలప్పురం, బలుస్సేరి, కన్నూర్, చెవరంబలమ్... ఇలా ఒక్కో ఊరిలో కమ్యూనిటీ కిచెన్లు వెలుస్తున్నాయి. సూత్రం ఒకటే– నలుగురు కలిసి కిచెన్ నడుపుతారు. కేవలం పది లేదా 11 కుటుంబాలకు వండుతారు. ఈ సంఖ్య వల్ల పెద్ద పెద్ద వంట పాత్రలు, భారీ పొయ్యి, ఎక్కువ శ్రమ, సిబ్బంది అవసరం తప్పుతోంది. ఇద్దరు ముగ్గురు గృహిణులు కలిసి తమ ఇళ్లలోనే వండి బాక్సులు పంపిస్తున్నారు. ఇవి సక్సెస్ అవుతున్నాయి కూడా! మహిళలే... వండాలా? ఈ కిచెన్ల మీద ఒకటి రెండు విమర్శలు ఉన్నాయి. అవేమిటంటే ‘కమ్యూనిటీ కిచెన్స్‌లో కూడా ఆడవాళ్లే వండాలా’ అని ప్రగతివాదులు అంటుంటే ‘ఇంట్లో వంట మానేసి ఈ వేషాలా’ అని మగ దురహంకారులు అంటున్నారు. విమర్శలు ఎలా ఉన్నా ఏదో ఒకరోజు ఇళ్లలో వంట చేయడం కంటే ఇలాంటి కిచెన్ల మీద అందరూ ఆధారపడే రోజు తప్పక వస్తుంది. మంచిదే. -
మలబద్దకం.. లైట్ తీసుకుంటే బోలెడన్ని సమస్యలు
చాలామంది పైకి చెప్పుకోలేరు కానీ ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్యలలో మలబద్ధకం కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, దానిని అసలు ఒక సమస్యగా కూడా గుర్తించకపోవడం! మలబద్ధకాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే మాత్రం శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీర్ఘకాల మలబద్ధకం వల్ల కిడ్నీ సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, పైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు మొదలవుతాయి. అందువల్ల రోజువారీ మన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటూ డైట్లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే.. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకంతో బాధపడే వారికి కడుపులో అసౌకర్యంగా... ఇబ్బందిగా ఉంటుంది. మలద్వారం కోసుకుపోవడం, రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతాయి. కదలకుండా కూర్చునే జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్, తగినన్ని నీరు తాగకపోవడం, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, బలహీనమైన జీవక్రియలు, రాత్రిళ్లు ఆలస్యంగా తినడం లేదా అసలే తినకపోవడం వంటి కారణాల వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలం ఉంటే.. కిడ్నీ సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, పైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు మొదలవుతాయి. దీనిని నివారించడానికి ఎన్నో చికిత్సలు, ఔషధాలు ఉన్నాయి. మీ డైట్లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే.. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ఆహారంలో మెంతులు మలబద్ధకం సమస్య ఉంటే.. చెంచాడు మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తినండి లేదంటే పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచాడు మెంతిపొడిని కలుపుకుని తాగడం వల్ల తెల్లారేసరికి సుఖ విరేచనం అవుతుంది. పండ్లు, కూరగాయలు ఉదయానే టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనానికి ముందు, సాయంత్రం మీకు ఇష్టమైన కూరగాయలతో చేసిన గ్లాసుడు వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మలబద్ధకం బారిన పడకుండా ఉంటారు. బచ్చలికూర, టొమాటో, బీట్రూట్, నిమ్మరసం, అల్లం కలిపి జ్యూస్‌ను తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తాజాపండ్లు ముఖ్యంగా బొప్పాయి పండు తినడం మంచిది. సబ్జానీళ్లు మలబద్ధకంతో బాధపడేవారు రోజూ ఉదయం నానబెట్టిన సబ్జా గింజలను చెంచాడు ఖాళీ కడుపుతో తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. నానబెట్టిన బాదం పప్పులు, వాల్నట్, ఎండు ద్రాక్షలను తీసుకున్నా మంచిది. అంజీర్ అంజీర్‌లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. రాత్రిపూట నానబెట్టిన అంజీర పండ్లను ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంజీర్ పేగు కదలికలను సులభతరం చేస్తుంది. బొప్పాయి ప్రతి రోజూ ఉదయం 11 గంటల ప్రాంతంలో, భోజనానికి ముందు కప్పుడు బొప్పాయి ముక్కలు తీసుకుంటే మంచిది. అలాగే జామపండు ముక్కలు, దోసబద్దలు తీసుకున్నా మంచిదే. భోజనానికి అరగంట ముందు గ్లాసు మజ్జిగ, అర స్పూన్ అవిసెగింజలు తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. ఓట్స్ ఓట్స్‌లో బీటా–గ్లూకాన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కరిగే ఫైబర్, ఇది కడుపు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఓట్స్ ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో కూడా సహాయపడతాయి. ఓట్స్ పేగుల పనితీరును ప్రోత్సహించడంలో, మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య త్వరగా తగ్గుతుంది. నెయ్యి నెయ్యికి ఉండే.. సహజమైన జిడ్డు తత్త్వం పేగుల కదలికలను వేగవంతం చేస్తుంది. రోజూ ఆహారంలో నెయ్యి వేసుకని తింటే మలబద్ధకం నుంచి విముక్తి పొందచ్చు. జామపండ్లు, దోసకాయ, కాకరకాయ, చిక్కుళ్లు మలబద్ధకాన్ని నివారించడంలో ముందుంటాయి కాబట్టి అవి ఆహారంలో ఉండేలా చూసుకుంటే మంచిది. -
బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇండియాలోనే నెం1 ప్లేస్
స్ట్రీట్ఫుడ్స్కి ఇప్పుడు ప్రాధాన్యత బాగా పెరిగింది. వెరైటీ స్టైల్లో, రుచికరమైన టేస్ట్‌తో స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్ బాగా ఫేమస్ అవుతుంది. ఇటీవలె Borzo గ్లోబల్ ఇంట్రా-సిటీ డెలివరీ సర్వీస్ స్ట్రీట్ ఫుడ్స్‌పై సర్వేను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ఏయే ప్రాంతాల్లో ఏ స్ట్రీట్‌ఫుడ్ ఫేమస్, టాప్10 స్ట్రీట్ ఫుడ్స్ ఏంటన్నదానిపై ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. టాప్-10 స్ట్రీట్ ఫుడ్స్.. 1. బిర్యానీ 2. వడపావ్ 3. మోమోస్ 4. చోలేబతురే 5. సమోసా 6. పావ్‌భాజీ 7. మసాలా దోశ 8. టుండే కబాబ్ 9. పోహ జలేబి 10. కచోరి టాప్10 స్ట్రీట్ జ్యూస్‌లు, షేక్స్: 1. మ్యాంగో మిల్క్ షేక్ 2. కోల్డ్ కాఫీ 3. మోసంబి జ్యూస్ 4. ఫలూదా 5. లస్సీ 6. నిమ్మరసం 7. ఆపిల్ జ్యూస్ 8. బాదం షేక్ 9. కాలా ఖట్టా 10. చెరకు రసం -
సాల్మన్ చేపలు తింటున్నారా?,ఇందులోని విటమిన్ బి6 వల్ల జుట్టుకు..
అందం అంటే చర్య సౌందర్యం మాత్రమే కాదు.. జుట్టు సౌందర్యం కూడా. అందుకే అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కాస్త జుట్టు ఊడిపోతున్నా తెగ ఫీల్ అవుతుంటారు. ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లమ్. రకరకాల షాంపులు, ఆయుల్స్, పొల్యూషన్ వల్ల చాలామందిలో జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. మరి వెంట్రుకలు బాగా పెరిగి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మీ డైట్లో ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచిది అన్నది ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఖనిజాలను కోల్పోవడం. ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి తదితర పోషకాల లోపం వల్ల జుట్టు బాగా రాలుతుంది. కాబట్టి ఇవి డైట్లో ఉండేలా చేసుకోవాలి. అందకు పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి.పాలకూరలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయ పడతాయి. పాలకూర జుట్టుకు సహజసిద్ధమైన కండిషనింగ్‌ను అందిస్తుంది. పాలకూరలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్ ఆహారంలో ప్రతిరోజూ నట్స్ తీసుకోవలి. బాదంపప్పు, పిస్తాపప్పు, కాజు మొదలైన డ్రైఫ్రూట్స్‌ని ప్రతిరోజూ డైట్లో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్ సహా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు, చర్మం ఆరోగ్యానికి గొప్పగా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజూ బాదం తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లను బలంగా, సిల్కీగా ఉండేలా చేస్తుంది. గుడ్లు కోడిగుడ్లలో ప్రొటీన్, విటమిన్ బి12, ఐరన్, జింక్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కురుల పెరుగుదలకు సహాయపడతాయి. గుడ్డు పచ్చసొనలో ఉండే.. విటమిన్ A,E, బయోటిన్, ఫోలేట్ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడతాయి. అందువల్ల ప్రతిరోజూ ఓ గుడ్డు తినాలి. చేపల్లో ఒమెగా 3, ఒమెగా 6 తదితర ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ డి, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చూస్తాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. గుడ్డులోని జింక్, బయోటిన్ ఆరోగ్యవంతమైన జుట్టుకు తోడ్పడుతుంది. చేపలు సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా డెడ్ హెయిర్ సెల్స్‌ను తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. సాల్మన్, సార్డినెస్, మాకెరెల్ వంటివి ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉండే చేపలు. ఈ చేపల్లో ప్రొటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి6 కూడా అధికంగా లభిస్తాయి. వీటన్నింటిలో సాల్మన్ చేపలు మరీ ఆరోగ్యకరమైనవి. చిలగడదుంప జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతుంటే ఆహారంలో చిలగడదుంపను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ A లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి జుట్టు పెరుగుదలకు చిలగడదుంపను మీ డైట్లో ఉండేలా చూసుకోండి. బెర్రీలు బెర్రీలు ప్రతిరోజూ బెర్రీలను తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఎందుకంటే బెర్రీస్‌లో జుట్టుకు ఉపయోగపడే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ బెర్రీలను డైట్లో చేర్చుకోండి. పెరుగు పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు, ఔషధ గుణాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి మెరుపును అందిస్తాయి. పెరుగును తినడమే కాకుండా ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యలను కంట్రోల్లో ఉంచుతుంది. చుండ్రుతో బాధపడుతున్న వాళ్లు వారానికి ఒకసారి పెరుగుతో ప్యాక్ వేసుకుంటే చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది. -
చలికాలంలో వెచ్చగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
చలికాలం వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. చలి తీవ్రత పెరిగినప్పుడు గాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దరిచేరనీయకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు చాలామంది ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఫోలిక్ ఆమ్లం కూడా ఎక్కువే. చలికాలంలో వచ్చే వ్యాధులను నివారించడంలో ఆకుకూరలు చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల హెమోగ్లోబిన్ పెరగడానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంది. కాల్షియం స్థాయి ఎక్కువగా ఉండటంతో కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. పసుపు పాలు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపును వేసుకొని ప్రతిరోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా చలికాలంలో శరీరానికి కావల్సిన వెచ్చదనాన్ని అందిస్తుంది. అజీర్ణం, జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఈ గోల్డెన్ మిల్క్‌ను తీసుకోవాల్సిందే. హెర్బల్ గ్రీన్‌టీ తులసి, అల్లం, లెమన్‌గ్రాస్‌తో చేసిన హెర్బల్ గ్రీన్ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు రెండుసార్లు ఈ హెర్బల్ టీని తాగితే చాలా మంచిది. నెయ్యి చలికాలంలో నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని పాలలో 3 స్పూన్ల నెయ్యిని కలుపుకుని తీసుకోవటం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. నెయ్యితో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరనియ్యవు. నువ్వులు ఈ సీజన్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెచ్చదనం కోసం నువ్వులను తీసుకోవాలి. నువ్వుల్లో వేడిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఐరన్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ దానిమ్మలో ఎర్ర రక్తకణాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. బెల్లం బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడంతో పాటు శరీరంలో వేడిని పెంచుతుంది. వేరుశనగ ఇందులో విటమిన్ బీ 3, విటమిన్ ఈ వంటి కీలక పోషకాలు ఉంటాయి. మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినడం వల్ల గుండెకు మేలు చేస్తాయి. చర్మంలో తేమ శాతాన్ని పెంచే గుణం వేరుశనగలో ఉంటుంది. రాత్రి నానాబెట్టుకొని ఉదయాన్నే వీటిని తీసుకోవడం మంచిది. సిట్రస్ పండ్లు చలికాలంలో వీటిని తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జొన్నలు జొన్నల ద్వారా శరీరానికి పుష్కలమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చలికాలంలో జొన్నతో చేసిన రొట్టెలు తింటే చాలా మంచిది. -
స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా?
విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మకాయతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. రోజూ నిమ్మరసాన్ని సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే నిమ్మకాయను కొన్ని పదార్థాలతో కలిపి సేవించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పనీర్ తయారు చేసేటప్పుడు మరిగే పాలలో నిమ్మరసం పిండుతారు. అయితే ఇందులో ఉండే యాసిడ్ ప్రోటీన్లను దెబ్బతీస్తుంది. ఫలితంగా యాసిడ్ రిఫ్లెక్షన్ ఏర్పడి గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే పనీర్‌లో నిమ్మరసం కలపడం మంచిది కాదు. చాలామంది సలాడ్‌లో ఎక్కువగా నిమ్మరసం ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని రకాల పండ్లతో నిమ్మరసం కలవడం రియాక్షన్ ఇస్తుంది. ముఖ్యంగా బొప్పాయిని నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లతో కలిపితే నష్టం వాటిల్లుతుంది. యాసిడ్ రిఫ్లెక్షన్ ఏర్పడి ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అదేవిధంగా చాలామంది... ముఖ్యంగా మద్యపాన ప్రియులు కాక్టెయిల్స్, బీర్లతో నిమ్మకాయను ఉపయోగిస్తారు. కానీ నిమ్మ, రెడ్ వైన్ కాంబినేషన్ ఏ మాత్రం మంచిది కాదు. నిమ్మలోని ఎసిడిటీ రెడ్వైన్లోని టానిన్లను ప్రభావితం చేయడం వల్ల వైన్ చేదెక్కడంతోపాటు దుష్ఫ్రభావాలూ కలుగుతాయి. నిమ్మలో ఉండే ఎసిడిటీ స్వభావం వల్ల స్పైసీ ఫుడ్స్‌తో కలిపి తిన్నప్పుడు శరీరంలో వేడి పెరగడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. అందుకే స్పైసీ ఫుడ్స్‌లో నిమ్మ వినియోగం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేడి వేడి ఆహారంలో నిమ్మరసం అసలు కలపకూడదు. అలా కలపడం వల్ల నిమ్మలోని విటమిన్ సి దూరమవుతుంది. (చదవండి: డయాబెటిస్ పేషెంట్లకు ఈ పండ్లు..కూరగాయాలతో మేలు!) -
ప్రపంచ ఆకలి సూచీలో...మనకు 111వ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సూచీ–2023లో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదల చేసిన ఈ సూచీలో మొత్తం 125 దేశాల్లో మనకు ఈ ర్యాంకు దక్కింది. దీన్ని లోపభూయిష్టమైనదిగా కేంద్రం కొట్టిపారేసింది. ‘ఇది తప్పుడు ర్యాంకింగ్. దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన బాపతు‘ అంటూ మండిపడింది. అన్ని రకాలుగా పీకల్లోతు సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్ (102), అంతే సంక్షోభంలో ఉన్న శ్రీలంక (60)తో పాటు బంగ్లాదేశ్ (81), నేపాల్ (61) మనకంటే చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 28.7 స్కోరుతో ఆకలి విషయంలో భారత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక చెప్పుకొచ్చింది. 27 స్కోరుతో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో టాప్‌లో ఉన్నట్టు చెప్పింది. ‘భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతం, 15–24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత ఉన్నవారి సంఖ్య ఏకంగా 58.1 శాతం ఉన్నాయి‘ అని పేర్కొంది. వాతావరణ మార్పులు, కల్లోలాలు, మహమ్మారులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఆకలి సమస్యను ఎదుర్కోవడంలో అవరోధాలుగా నిలిచాయని సర్వే పేర్కొంది. ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది. ‘ఇది తప్పుడు పద్ధతులు వాడి రూపొందించిన సూచీ. కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఆధారంగా పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడం క్షమార్హం కాని విషయం. దాంతో బాలల్లో వాస్తవంగా కేవలం 7.2 శాతమున్న పౌష్టికాహార లోపాన్ని ఏకంగా 18.7గా చిత్రించింది. దీని వెనక దురుద్దేశాలు ఉన్నాయన్నది సుస్పష్టం‘ అంటూ విమర్శించింది. -
Maunika Govardhan: నచ్చేలా మెచ్చేలా ఘనంగా గరిట పట్టేలా
‘తినడం కోసం బతకడం కాదు. బతకడం కోసం తినాలి’ అని కాస్త గంభీరంగా అనుకున్నాసరే, ‘వంటల రుచుల కోసం కూడా బతకవచ్చు సుమీ!’ అనిపిస్తుంది కొన్నిసార్లు. పసందైన వంటకాలు జీవనోత్సాహాన్ని కలిగిస్తాయి. చురుకుదనాన్ని నింపుతాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లండన్‌లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని చెఫ్‌గా మారి ప్రవాస భారతీయులకు అపూర్వమైన భారతీయ వంటకాలను పరిచయం చేయడంతో పాటు, వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేదానిపై పుస్తకాలు రాస్తోంది మౌనికా గోవర్ధన్... ముంబైలోని దాదర్ ప్రాంతంలో పుట్టి పెరిగిన మౌనిక ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. చెఫ్‌గా సంప్రదాయ భారతీయ వంటకాల రుచులను విదేశీయులకు పరిచయం చేస్తుంది. ‘సులభంగా చేసుకునేలా... ఆరోగ్యంగా ఉండేలా...’ అనేది ఆమె వంటల పాలసీ. ప్రతి కుటుంబానికి తరతరాలుగా తమవైన ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కొన్నిసార్లు కాలంతోపాటు అవి కనుమరుగు అవుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌనిక తమ కుటుంబంలో ఎన్నో తరాల విలువైన వంటకాలను సేకరించింది. పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, లైవ్ ఈవెంట్స్, సోషల్ మీడియా ద్వారా మన వంటకాలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తోంది. లండన్‌లో ఉంటున్నప్పటికీ మౌనికకు మన దేశంలోని పాతతరం వంటకాలపై ఆసక్తి తగ్గలేదు. ఏమాత్రం సమయం దొరికినా మన దేశానికి వచ్చి మధ్యప్రదేశ్ నుంచి మణిపుర్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళుతుంటుంది. ‘అందరిలాగే అమ్మ వంటకాలు అంటే నాకు ఇష్టం. అయితే కేవలం ఇష్టానికి పరిమితం కాకుండా అమ్మ చేసే వంటకాలను ఓపిగ్గా నేర్చుకున్నాను. నేను చేసే వంటకాలు కూడా అమ్మకు బాగా నచ్చేవి’ గతాన్ని గుర్తు చేసుకుంది మౌనిక. ఆమె అమెరికాలాంటి దేశాలకు వెళ్లినప్పుడు ప్రవాస భారతీయులతో మాట్లాడుతున్న సందర్భంగా మన వంటకాలను గుర్తు చేస్తున్నప్పుడు వారి నోట్లో నీళ్లు ఊరేవి. ప్రతివ్యక్తికి ‘సోల్ ఫుడ్’ అనేది ఒకటి ఉంటుంది అని చెబుతుంటుంది మౌనిక. మౌనిక తాజాపుస్తకం ‘తందూరీ హోమ్ కుకింగ్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ పుస్తకంలో రకరకాల రుచికరమైన తందూరీ వంటకాలతో పాటు ఆయా వంటకాల చరిత్రను ఆసక్తికరంగా వివరిస్తుంది మౌనిక. ఇదంతా సరే, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ మౌనిక ఎందుకు చెఫ్‌గా మారింది? ఆమె మాటల్లోనే... ‘లండన్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో స్నేహితుల కోసం సరదాగా వంటలు చేసి పెట్టేదాన్ని. ఆ వంటకాలు వారికి విపరీతంగా నచ్చేవి. ఆ రుచుల మైమరుపులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మరచి పోయేవారు. కుకింగ్‌ను ప్రొఫెషనల్‌గా తీసుకుంటే తిరుగులేని విజయం సాధిస్తావు అని చెప్పేవాళ్లు. నేను ఆ మాటలను పెద్దగా సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. అయితే పదే పదే ఇలాంటి మాటలు వినిపించడంతో ఒకసారి ట్రై చేద్దామని కార్పొరేట్ జాబ్‌ను వదులుకొని కుకింగ్‌ను ఫుల్–టైమ్ జాబ్ చేసుకున్నాను. అయితే ఇది మా కుటుంబ సభ్యులకు నచ్చలేదు. కొందరైతే లండన్‌కు వెళ్లింది వంటలు చేయడానికా? అని వెక్కిరించారు. దీనికి కారణం కుకింగ్ అనేది వారికి ఒక ప్రొఫెషన్‌గా కనిపించకపోవడమే. కుకింగ్ అంటే ఇంట్లో ఆడవాళ్లు చేసే పని మాత్రమే అనేది వారి అభిప్రాయం. కుకింగ్కు సంబంధించిన రోల్‌మోడల్స్ గురించి కూడా వారికి తెలియదు. అయితే తరువాత మాత్రం వారిలో మార్పు వచ్చింది’ అంటుంది మౌనిక. మౌనిక ఇంట్లో ఆ రోజుల్లో ఒకే ఒక వంటల పుస్తకం కనిపించేది. ఆ పుస్తకాన్నే పదేపదే తిరగేసేది అమ్మ, ఈ పుస్తకాలు కూడా కొన్ని వంటకాలకు సంబంధించినవే ఉండేవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వంటలు ఎలా చేయాలో నేర్పించడం కోసం పుస్తకాలు కూడా రాయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా వెబ్‌సైట్‌ను మొదలుపెట్టింది. ఆ తరువాత ‘ది న్యూయార్క్ టైమ్స్’ ‘ది డెయిలీ మెయిల్’లో మన వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేది. వంటకాల తయారీలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న మౌనిక ఇండియన్ కిచెన్, థాలీ, తందూరీ హోమ్ కుకింగ్ అనే మూడు పుస్తకాలు రాసింది. ‘వంటలు చేసే సమయంలో నా దృష్టి మొత్తం తయారీ ప్రక్రియపైనే ఉంటుంది. ఆ సమయంలో వేరే విషయాల గురించి ఆలోచించడం తాలూకు ప్రభావం రుచిపై పడుతుంది. అందుకే వంటగదిలోకి వెళ్లినప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా భావిస్తాను’ అంటుంది మౌనిక. మౌనిక లండన్‌లో చదువుకునే రోజుల్లో ‘అన్ని భారతీయ వంటకాలకు ఒకటే రెస్టారెంట్’ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు కొత్తిమీర దొరకడం గగనంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ‘మన వంటకాల కోసం రెస్టారెంట్లపై మాత్రమే ఆధారపడడం ఎందుకు? ఆడుతూ పాడుతూ మన ఇంట్లో చేసుకోవచ్చు కదా’ అనుకునే ప్రవాస భారతీయులకు మౌనిక గోవర్ధన్ పుస్తకాలు అపురూపంగా మారాయి. చెఫ్‌గా మౌనికా గోవర్థన్ అపూర్వ విజయానికి కారణం అయ్యాయి. -
గురక ఇబ్బంది పెడుతోందా!..వెంటనే తగ్గిపోవాలంటే..
గురక చాలామందికి ఓ పీడలా వెంటాడుతుంది. అంత తేలిగ్గా అది వదలదు. లావుగా ఉండటం వల్ల గురక వస్తుందనుకుంటారు గానీ సన్నగా ఉన్నా కూడ కొందరికి గురక వస్తుంది. దీని వల్ల మీకే గాక మీతో పాటు పడుకునేవాళ్లు కూడా ఇబ్బంది పడ్తుంటారు. గురక అనేది మనకు తెలియకుండా నిద్రలో వచ్చేది. కంట్రోల్ చేయడం అసాధ్యం. అలాంటి ఈ గురకను ఎలా నివారించాలంటే?.. గురక వ్యాధి కాదు. శ్వాస సంబంధ సమస్యల వల్ల వస్తుంది. ఇది తగ్గాలంటే ఈ కింది చిట్కాలు పాటించండి గురక రాకూడదంటే.. తేనెతో ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లలో చికిత్స చేయడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ తేనె నాసికా రంధ్రాలను క్లియర్‌గా తెరుస్తుంది. గాలి స్వేచ్ఛగా ప్రవహించేలా చేస్తుంది. పైగా దీనిలో యాంటి మైక్రోబయల్స్ ఉంటాయి. అందువల్ల రాత్రి నిద్రపోయేటప్పుడూ తేనెను సేవించినా లేదా పాలల్లో కలిపి తీసుకుని తాగిన చక్కటి ఫలితం ఉంటుంది. పుదీనా దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఈ ఆకుల్లో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ముక్కు, గొంతు లోపల మంటను తగ్గిస్తాయి. పడుకునే ముందు పిప్పరమెంటు టీ తాగడం లేదా కొన్ని ఆకులను వేడి నీటిలో వేసి తీసుకోవడం వల్ల గురక తగ్గిపోతుంది. మీ చుట్టూ ఉన్నవారు కూడా హాయిగా నిద్రపోతారు. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడేందుకు ఖాళీ కడుపున వెల్లుల్లిని తినమని సలహ ఇస్తారు. రాత్రిపూట పచ్చి వెల్లుల్లి తింటే గుక వెంటనే తగ్గుతుంది. ఉల్లి లేని కూర, వంటిల్లు ఉండదు. ప్రతి రోజు రాత్రి ఉల్లిపాయను మీ ఆహారంలో చేర్చి చూడండి గురక అస్సలు రాదు. ఈ చిట్కాలను పాటించి గురక సమస్య నుంచి త్వరగా బయటపడండి. (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
FSSAI: న్యూస్ పేపర్లో ఆహారం ప్యాక్ చేయొద్దు
న్యూఢిల్లీ: వార్తా పత్రికలను (న్యూస్ పేపర్) ఆహార పదార్థాలకు వినియోగించే విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. న్యూస్ పేపర్‌ను ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు వినియోగించొద్దని వ్యాపారులను కోరింది. అలాగే, న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన, నిల్వ చేసిన పదార్థాలను తినవద్దంటూ వినియోగదారులకు సూచనలు చేసింది. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన నిబంధనల కఠిన అమలుకు రాష్ట్రాల ఆహార నియంత్రణ సంస్థలతో కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు న్యూస్ పేపర్ వినియోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో జి.కమలవర్ధనరావు కోరారు. ‘‘వార్తా పత్రికల్లో వినియోగించే ఇంక్‌లో ఎన్నో బయోయాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఆహారాన్ని కలుíÙతం చేస్తాయి. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు’’అని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ప్రింటింగ్‌కు వాడే ఇంక్‌లో లెడ్, భార లోహాలు, రసాయనాలు ఉంటాయని, అవి ఆహారం ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయని వెల్లడించింది. ‘‘వార్తా పత్రికల పంపిణీ వివిధ పర్యావరణ పరిస్థితులకు లోబడి ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్లు లేదా ఇతర సూక్ష్మజీవులు వాటి ద్వారా ఆహారంలోకి చేరి.. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను కలిగించొచ్చు’’అని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. వార్తా పత్రికలను ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు వినియోగించకుండా నిషేధిస్తూ ఎఫ్ఎస్ఎస్ఏఐ 2018లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఆహార పదార్థాల్లో నూనె అధికంగా ఉన్నప్పుడు, దాన్ని వార్తా పత్రికల్లో సాయంతో తొలగించడాన్ని కొందరు చేస్తుంటారు. ఇలా చేయడాన్ని సైతం చట్టం నిషేధించింది. కస్టమర్ల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, చట్ట ప్రకారం అనుమతించిన ప్యాకింగ్ మెటీరియల్‌నే ఆహార పదార్థాలకు వినియోగించాలని కమలవర్ధనరావు కోరారు. -
మిల్లెట్ ఫుడ్స్‌కు పీఎల్ఐ: కేంద్ర ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి
మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తుల శుద్ధి పరిశ్రమకు కేంద్ర సర్కారు రెండో విడత ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) ప్రకటించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి అనితా ప్రవీణ్ తెలిపారు. ఈ పథకం ఆమోదం దశలో ఉందని, దీని కింద రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు కల్పించనున్నట్టు చెప్పారు. కోల్‌కతాలో ఓ కార్యక్రమం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. (ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!) ఆహారోత్పత్తుల శుద్ధి పరిశ్రమకు మొదటి దశ పీఎల్ఐ కింద రూ.800 కోట్లు ప్రకటించగా, గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇది ఆరంభమైనట్టు చెప్పారు. మొదటి దశలో 30 సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని, పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ అయినట్టు వెల్లడించారు. ఇప్పుడు రెండో విడత కింద మరో రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆహార శుద్ధి యూనిట్లకు సాయం అందించేందుకు వీలుగా కేంద్రం నుంచి రూ.10,900 కోట్ల నిధులకు ఆమోదం లభించినట్టు చెప్పారు. దీన్నుంచి రూ.800 కోట్లను మొదటి దశ పీఎల్ఐ కింద మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులకు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద ఆహార శుద్ధి పరిశ్రమలోని చిన్న యూనిట్లకు సాయం చేస్తున్నట్టు అనితా ప్రవీణ్ వెల్లడించారు. -
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించుకోవాలంటే..!
ఆయుర్వేదం ప్రకారం, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ రెండూ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పైగా అవి ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. ట్రైగ్లిజరైడ్ పెరుగుదల చెడు కొలెస్ట్రాల్‌కి సంబంధించిన ప్రధాన కారణాలలో ఒకటిగా ఊబకాయం, కదలిక లేకపోవడం, చెడు ఆహారాల వినియోగం, చెడు అలవాట్లు, ఇవన్నీ శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి దారితీస్తాయి (బాగా). ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి మొదటి అడుగు ఆయుర్వేదం. జీవనశైలి ఆహారంలో మార్పులతో ఈ సమస్యను సులభంగా బయటపడవచ్చు అటున్నారు నవీన్ నడిమింటి. ముందుగా సాధారణ కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించండి. డెజర్ట్‌లు, చక్కెర, శుద్ధి చేసిన లేదాప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి సాధారణ కార్బోహైడ్రేట్ల వినియోగం ద్వారా ట్రైగ్లిజరైడ్ల పరిమాణం పెరుగుతుంది. ఈ ఆహారాలకు బదులుగా, తృణధాన్యాలు, చిక్కుళ్ళు తీసుకోవడం పెంచాలని ఆయుర్వేదం సలహా ఇస్తుంది. వ్యాయామం రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, పరుగు, యోగా లేదా శ్వాస వ్యాయామాలు చేయాలి. ఇలా చేస్తే రక్తప్రవాహంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గేందుకి దారితీస్తుంది. కేలరీలను తీసుకోవడం తగ్గించండి. మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాస్తా, సోడాలు, ఆల్కహాల్ ఇతర ఆహారాలు తోపాటు అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించండి, బరువుపై ట్రైగ్లిజరైడ్స్ ప్రభావం బరువుపై ట్రైగ్లిజరైడ్లు అధికంగా ప్రభావం చూపుతాయి. వీటి స్థాయిలు పెరిగిన వ్యక్తుల పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోతుంది. తినడం, నిద్రించడం వంఇ వాటి వల్ల టాక్సిన్లు పేరుకుపోతాయి. ఇది కాస్త చెడు కొలస్ట్రాల్‌కి దారితీస్తుంది. ఆహారాన్ని తయారు చేసే విధానంలో ఉపయోగించే నూనెల విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. లేదంటే ట్రైగ్లిజరైడ్స్ పెరిగే ప్రమాదం ఉందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ట్రైగ్లిజరైడ్లను తగ్గించే ఆహారాలు, ఆయుర్వేద మూలికలు తేనె తేనె ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్స్ చెడు కొలెస్ట్రాల్‌తో విజయవంతంగా పోరాడుతుంది. ఒక చెంచా తేనెను ఒక గ్లాసు వేడి నీటిలో కరిగించి, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను సాధారణీకరించి చెడు కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే నీటిలో 8 నుంచి 10 చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా ½ టీస్పూన్ నిమ్మరసాన్ని కూడా జోడించవచ్చు. వెల్లుల్లి: ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి, ఆయుర్వేదం వెల్లుల్లి వినియోగాన్ని గట్టిగా సిఫార్సు చేస్తుంది. వెల్లుల్లిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, అలిసిన్, అజోయిక్ ఇతర సల్ఫర్ సమ్మేళనాలు వంటి సేంద్రీయ సల్ఫేట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. తురిమి లేదా ఒలిచిన, వెల్లుల్లిని వంటలలో చేర్చమని అంటున్నారు నిపుణులు. వెల్లుల్లి పాలు కూడా మంచిదే అని చెబుతున్నారు. ఇది ఎలా చేయాలంటే..వెల్లుల్లి 5 నుంచి ఆరు తీసుకుని, రెండు లవంగాలు చూర్ణం చేసి 50 మి.ల్లీ లీటర్ల దేశీయా ఆవు పాలల్లో కలిపి వేడి చేయండి. సగం అయ్యేంత వరకు మరగినిచ్చి ఫిల్టర్ చేసి వేడిగా తాగండి చక్కటి ఫలితం ఉంటుంది. ఆమ్లా ఉసిరికాయలో విటమిన్ సి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి యాంటీఆక్సిడెంట్. ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ధమనులను శుభ్రం అవ్వడమే గాక ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అర్జునుడు ఇది చాలా శక్తివంతమైన ఆయుర్వేద మూలిక, ఇది కొలెస్ట్రాల్‌ను కరిగించి ధమనులను శుభ్రంగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అర్జునుడిని తెల్లవారుజామునే నీటిలో కరిగించి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. గుగ్గులు ఆయుర్వేదంతో ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడే మరొక మూలిక. గుగ్గులు. గుగ్గుల్ స్టెరోన్లను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను చురుకుగా నిరోధిస్థాయి. ఈ ఆయుర్వేద మూలికను ప్రతిసారి భోజనం తర్వాత తీసుకోవచ్చు కూడా. మీ ట్రైగ్లిజరైడ్లను సాధారణంగా ఉంచడానికి 25 మిల్లీగ్రాం సరిపోతుంది. సెలెరీ ఈ కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలతో సంబంధం ఉన్న గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సెలెరీని సలాడ్‌గా తినవచ్చు, వంటలలో చేర్చవచ్చు లేదా రసంగా త్రాగవచ్చు. రోజుకు 2 కాడల ఆకుకూరల వినియోగం చెడు కొలెస్ట్రాల్‌ను 7 పాయింట్లు తగ్గిస్తుందని ఆధారాలు ఉన్నాయి . అవకాడో అవోకాడోస్‌లో గణనీయమైన మొత్తంలో ఫైబర్, ఒలేయిక్ యాసిడ్ వంటి మంచి కొవ్వులు ఉంటాయి, ఇది అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అవోకాడో సాధారణ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నిర్వహించడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, దీనిలో కొవ్వులు అధికం అనే విషయం గుర్తుంచుకోవాలి. గ్రీన్_టీ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించగలవు. ఒక గ్లాసు గ్రీన్ టీలో కూరగాయలు, పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్ల కంటే చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదం గ్రీన్ టీని రోజుకు మూడు సార్లు తాగాలని సిఫార్సు చేస్తోంది. బ్రౌన్‌రైస్ మీరు మీ సాధారణ ట్రైగ్లిజరైడ్లను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, బ్రౌన్‌తో కూడిన వైట్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్‌లో అనేక ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి అనే వాస్తవం పక్కన పెడితే, ఇందులో ఫైబర్, సంతృప్త కొవ్వులు కూడా ఉన్నాయి. ఇది శరీరాన్ని టాక్సిన్స్ నుంచి శుద్ధి చేయడానికి, బరువును తగ్గించడానికి ముఖ్యంగా శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది . యాపిల్స్ ఈ రుచికరమైన పండ్లలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. వీటిని ఫ్లేవనాయిడ్స్ అని పిలుస్తారు. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి ఊపిరితిత్తులు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. సగటు యాపిల్‌లో పెద్ద మొత్తంలో విటమిన్లు ఏ, సీ ఉంటాయి. సుమారు 4 గ్రాముల ఫైబర్‌లో కేలరీలు కేవలం 100 మాత్రమే. యాపిల్స్ తోపాటు, ఆయుర్వేదం బేరి, దానిమ్మ, ద్రాక్షపండ్లు, నారింజలను తీసుకోవడం ద్వారా ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి సిఫార్సు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. . బ్రోకలీ బ్రోకలీలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా, అవి యాంటీఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. బ్రోకలీతో కలిపి తీసుకుంటే, అందులో ఉండే ఫైబర్లు జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన పిత్త ఆమ్లాలతో బంధించి వాటిని సహజంగా శరీరం నుంచి బయటకు తీస్తాయి. బ్రోకలీ సాధారణ ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. బార్లీ బార్లీ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి రక్తంలో చక్కెరను సాధారణీకరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. తృణధాన్యంలో బీటా -గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను 4-10% తగ్గిస్తుంది. అదనంగా, బార్లీ గోధుమలకు చాలా మంచి ప్రత్యామ్నాయం. మీరు దీన్ని బ్రెడ్‌కు ప్రత్యామ్నాయంగా క్రమం తప్పకుండా తినవచ్చు. చేప చేప నూనె, చేప ట్యూనా, మాకేరెల్, ట్రౌట్, సాల్మన్, హెర్రింగ్, సార్డినెస్ వంటి చేపలు ఒమేగా 3 యాసిడ్లతో నిండి ఉంటాయి, ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించి గుండె జబ్బులను నివారించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆయుర్వేదం వారానికి కనీసం రెండుసార్లు చేపలను తినాలని అలాగే ప్రతిరోజూ 1 నుంచి 4 గ్రాముల చేప నూనెను తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది. దుంప దీని ఆకులలో సినారైన్ ఉంటుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది పేరుకుపోయిన టాక్సిన్ని వేగవంతంగా తొలగిస్తుంది. తత్ఫలితంగా కొలెస్ట్రాల్ తగ్గి ధమనులను శుభ్రం అవుతాయి . పాలకూర బచ్చలికూర వీటిలో ల్యూటిన్ ఉంటుంది. ఇది ట్రైగ్లిజరైడ్స్‌ని ధమనుల గోడలకు అంటుకోకుండా, మూసుకుపోకుండా నిరోధిస్తుంది. బచ్చలికూరలో ఉండే విటమిన్ ఇ, ఫలకం తొలగింపుపై శ్రద్ధ చూపుతుంది తద్వారా గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. అలాగే బీన్స్, బఠానీలు, చిక్పీస్, కాయధాన్యాలు మరియు ఇతర ఫైబర్ అధికంగా ఉండే చిక్కుళ్ళు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫ్లాక్స్ సీడ్లో లిగ్నన్లు ఉంటాయి, ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. గుండె సమస్యలను దూరంగా ఉంచుతాయి. ఫ్లాక్స్ సీడ్లో ఫైబర్ ఒమేగా 3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ఉత్పత్తి, శోషణను నియంత్రిస్తాయి. (చదవండి: ఈ పొరపాటు చేస్తే.. మీరు ఏజ్డ్ పర్సన్‌లా కనిపించడం ఖాయం!) -
భద్రాచలం వద్ద తగ్గిన వరద ఉధృతి
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం/ధరూరు: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపినివ్వడంతో ఎగువ గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో మూడో ప్రమాద హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్దకు ప్రవాహం 12,79,307 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం 56 అడుగుల నుంచి 50.4 అడుగులకు తగ్గింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు ఆగిపోవడంతో గోదావరిలో వరద తగ్గుతోంది. మరోవైపు, శ్రీరాంసాగర్‌లోకి ప్రవాహం 8,100 క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 44,354, పార్వతి బ్యారేజ్ వద్ద 30,150, సరస్వతి బ్యారేజ్ వద్ద 43,615 క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 5.71 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజ్ నుంచి 9.15 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. శ్రీరామ్ సాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి ప్రవాహం తక్కువగా ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద సోమవారం మరింతగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. జూరాలలో..: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఉదయం 7 గంటలకు 1,58,655 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. 9 గంటల వరకు 37 వేలకు తగ్గడంతో 25 క్రస్టు గేట్లనూ మూసివేశారు. మళ్లీ రాత్రి 8 గంటలకు 68,500 క్యూసెక్కులకు వరద పెరగడంతో 6 గేట్లను తెరిచి 23,184 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల నుంచి విద్యుదుత్పత్తి, గేట్ల ద్వారా కలిపి 64,474 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 846.90 అడుగుల వద్ద 73.6744 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!
ప్రస్తుతం చాలా మంది చేతులు, తుంటి, వెన్నెముక, మోకాళ్లు, కీళ్లలో నొప్పులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా కీళ్ల నొప్పులు, వాపుల సమస్యల బారిన పడుతున్నారు. వ్యాయామాలు చేయడం కారణంగా ఈ నొప్పులు తీవ్ర తరమవుతున్నాయి. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో బాదం, వేరుశెనగ, వాల్నట్స్ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో పుష్కలంగా లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఉ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. ఎక్కువగా వినియోగించడం వల్ల కీళ్లనొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. బెర్రీలు బ్లబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ప్రతిరోజు తినడం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెర్రీల వల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కూరగాయలు సల్ఫోరాఫేన్ కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా సులభంగా యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు బ్రోకలీ, కాలీఫ్లవర్లను ఆహారంలో తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ కీళ్ల నొప్పులున్నవారు ఆలివ్ ఆయిల్‌ను వినియోగించి తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మార డంతోపాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. డార్క్ చాక్లెట్ ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మధుమేహం ఉన్నవారు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. (చదవండి: దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా? ఎలాంటప్పుడూ అవసరం?..) -
ఇలా చేస్తే శరీరంలో ఉన్న కొవ్వును ఈజీగా తగ్గించుకోవచ్చు!
ఇటీవల కాలంలో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువయ్యాయి. దీంతో అధిక బరువు పెరగడమే గాక ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. సరైన వ్యాయామం, పౌష్టికాహారం లేకపోవడంతో శరీరంలో తొడలు,పిరుదులు, చేతులు భాగంలో కొవ్వు పెరిగిపోయి చూసేందుకు కూడా అసహ్యంగా ఉంటాయి. దీన్ని తగ్గించుకోవాలంటే మంచి డైట్ ఫాలో అవ్వుతూ..శరీరానికి తగినంత వ్యాయామం చేయాలి. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఇవన్నీ పాటించాలంటే అసాధ్యం. అందుకని ఈ ఆహార పదార్థాలను రోజువారి ఆహరంలో భాగం చేసుకుంటే సులభంగా కొవ్వు తగ్గించుకోవడమే కాదు బరువు కూడా తగ్గిపోతారు. కొవ్వుని కరిగించుకోవాలనుకుంటే తీసుకోవాలసినవి.. సెనగలు ఇవి స్నాక్స్ రూపంలో తీసుకుంటే ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పోటాషియం, మాంగనీస్, ఫైబర్ వంటవి శరీరాని అందడమే గాక కొవ్వుని ఈజీగా బర్న్ చేస్తుంది. క్వినోవా డైట్ ప్లాన్‌లో భాగంగా దీన్ని తీసుకుంటే రోజంతా నిండుగా ఉన్న ఫీలింగ్ ఉండి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోరు. ఇక ఇందులో గ్లూటెన్ ఉండదు.. గ్లూటెన్ పడని వారికి క్వినోవా బెస్ట్ ఆప్షన్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, సీలియాక్ డిసీజ్ లాంటి సమస్యలు ఉన్నవారికి క్వినోవా తీసుకోవచ్చు. క్వినోవా తీసుకుంటే.. శరీరానికి కావలసిన ప్రోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం పుష్కలంగా అందుతుంది. బాదం పప్పులు వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది. బాదం పప్పులు వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది. టోఫు: ఇది తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్ కలిగిన శాఖాహారం. దీనిలో కొలెస్ట్రాల్ కూడా ఉండదు. తద్వారా బరువు ఈజీగా తగ్గొచ్చు. అలాగే ఆడవారి ఆరోగ్యానికి ఇది పలు విధాల మేలు కలుగుతుంది. టోఫులోని ఐసోఫ్లేవోన్లు అనే పోషకాలను ఫైటో ఈస్ట్రోజెన్లుగా చెప్తారు. అంటే ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్లా పని చేస్తాయి. కాబట్టి నెలసరి క్రమాన్ని సరిచేసే, పీరియడ్స్ మంటను తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయి. బ్రకోలీ: దీనిలో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కే, సీ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో సహాయపడతాయి. మొలకలు వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రెగ్యులర్ వ్యాయామం తోపాటు మొలకలు తీసుకోవడం వల్ల పొత్తికడుపులో ఉండే కొవ్వు తగ్గుతుంది. (చదవండి: ఖననం చేసే సమయంలో..శవపేటిక నుంచి శబ్దం అంతే..) -
ఆకాశమే హద్దుగా.. ఎగుమతుల్లో ఏపీ దూకుడు
సాక్షి, అమరావతి: ఆకాశమే హద్దుగా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దూకుడు కనబరుస్తోంది. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల్లో రికార్డు స్థాయిలో ఎగుమతులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు.. పెద్ద ఎత్తున కల్పిస్తున్న మార్కెటింగ్ సౌకర్యాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ 2018–19లో రూ.8,929 కోట్లు ఉండగా 2022–23లో ఈ మొత్తం రూ.22,761.99 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలోనే రెండున్నర రెట్లు పెరిగింది. 2021–22లో జరిగిన ఎగుమతుల విలువతో పోలిస్తే 2022–23లో రూ.2,860 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు అధికంగా ఎగుమతయ్యాయి. ఇక జాతీయ స్థాయిలో 2022–23లో రూ.2.21 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల టన్నుల ఉత్పత్తులను ఎగుమతి చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి రూ.24,826 కోట్ల విలువైన 80.86 లక్షల టన్నులు ఎగుమతయ్యాయి. వాటిలో ఒక్క మన రాష్ట్రం నుంచే రూ.22,762 కోట్ల విలువైన 79.25 లక్షల టన్నుల ఉత్పత్తులు ఉండటం విశేషం. తెలంగాణ నుంచి కేవలం రూ.2,064 కోట్ల విలువైన 1.61 లక్షల టన్నుల ఉత్పత్తులు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డులు తిరగరాస్తోందని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) చెబుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గరిష్టంగా ఒక ఏడాదిలో జరిగిన ఎగుమతులను 2022–23లో తొలి అర్ధ సంవత్సరంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం అధిగమించడం విశేషం. చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఎగుమతులు జరగలేదని చెబుతున్నారు. పురుగు మందుల అవశేషాల్లేని వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తే లక్ష్యంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేయనున్నందున 2023–24లో కోటి లక్షల టన్నులకు పైగా ఎగుమతులు జరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తొలిసారి గోధుమలు, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతి రాష్ట్రం నుంచి ప్రధానంగా నాన్ బాస్మతి రైస్, మొక్కజొన్న, జీడిపప్పు, బెల్లం, అపరాలు, శుద్ధి చేసిన పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలు పెద్ద ఎత్తున ఎగుమతవుతున్నాయి. మొత్తం ఎగుమతుల్లో సింహభాగం నాన్ బాస్మతి రకం బియ్యమే. 2018–19లో రూ.7,324 కోట్ల విలువైన 29.22 లక్షల టన్నులు నాన్ బాస్మతి రైస్ ఎగుమతి అయితే.. 2022–23కు వచ్చేసరికి రూ.18,693 కోట్ల విలువైన 67.32 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. నాన్ బాస్మతి రైస్ తర్వాత మొక్కజొన్న 2018–19లో రూ.130.77 కోట్ల విలువైన 91,626 టన్నులు ఎగుమతి కాగా, 2022–23లో ఏకంగా రూ.1,845.73 కోట్ల విలువైన 7.24 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. కాగా రాష్ట్రం నుంచి తొలిసారి గోధుమలు, ఆయిల్ కేక్స్, పౌల్ట్రీ, పశుదాణా ఉత్పత్తులు ఎగుమతి చేశారు. రూ.829.71 కోట్ల విలువైన 3.23 లక్షల టన్నుల గోధుమలు, రూ.317 కోట్ల విలువైన 1,906.89 టన్నుల పశుదాణా, రూ.17.6 కోట్ల విలువైన 8,371 టన్నుల పౌల్ట్రీ ఉత్పత్తులు, రూ.4.68 కోట్ల విలువైన 3,028 టన్నుల ఆయిల్ కేక్స్ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. రాష్ట్రం నుంచి ఎక్కువగా మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుండగా.. గతేడాది అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్, అరబ్ దేశాలకు కూడా పంపారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పోటీపడుతున్న వ్యాపారులు.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రోత్సాహం, గ్రామస్థాయిలో కల్పించిన సౌకర్యాలతో గత నాలుగు సీజన్లలో వ్యవసాయ విస్తీర్ణంతోపాటు నాణ్యమైన దిగుబడులు పెరిగాయి. నాలుగేళ్లలో ఏటా సగటున 14 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తుల దిగుబడులు అదనంగా వచ్చాయి. కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఆహార ఉత్పత్తులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించడం, ధరలు తగ్గిన ప్రతిసారీ రైతులు నష్టపోకుండా మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారులు సైతం పోటీపడి కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్లో రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు లభిస్తున్నాయి. మిరప, పత్తి వంటి వాణిజ్య పంటలే కాదు.. అపరాలు, చిరు ధాన్యాలు, అరటి, బత్తాయి వంటి ఉద్యాన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. ఎగుమతులను ప్రోత్సహించేలా సంస్కరణలు సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు, కల్పించిన మార్కెటింగ్ సౌకర్యాల ఫలితంగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏటా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవడం సంతోషదాయకం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి ‘గ్యాప్’ సర్టిఫికేషన్‌తో మరిన్ని ఎగుమతులు గతంలో ఎన్నడూలేని విధంగా 79.25 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతయ్యాయని ఎపెడా ప్రకటించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు ‘గ్యాప్’ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికేషన్ జారీ చేయబోతున్నాం. దీంతో 100కుపైగా దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం లభిస్తుంది. –గోపాలకృష్ణ ద్వివేది, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
రిటైల్ ధరలు దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: కూరగాయలు, నూనెలు తదితర ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ పరిమితి లక్ష్యానికి కాస్త చేరువగా 4.7 శాతానికి పరిమితమైంది. చివరిసారిగా 2021 అక్టోబర్‌లో ఇది 4.48 శాతం స్థాయిలో నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఇలా తగ్గడం ఇది వరుసగా రెండో నెల. గతేడాది ఏప్రిల్‌లో ఇది 7.79 శాతంగా ఉండగా ఈ ఏడాది మార్చ్‌లో 5.66 శాతానికి పరిమితమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (రెండు శాతం అటూ ఇటుగా) కట్టడి చేయాలని రిజర్వ్ బ్యాంక్‌ను కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన డేటా ప్రకారం ఏప్రిల్‌లో ఆహారోత్పత్తుల బాస్కెట్ ద్రవ్యోల్బణం 3.84 శాతంగా ఉంది. ఇది ఈ ఏడాది మార్చ్‌లో 4.79 శాతంగా, గత ఏప్రిల్‌లో 8.31 శాతంగా ఉంది. నూనెల ధరలు 12.33 శాతం, కూరగాయల రేట్లు (6.5 శాతం), మాంసం..చేపలు (1.23 శాతం) తగ్గాయి. అటు సుగంధ ద్రవ్యాలు, పాలు.. పాల ఉత్పత్తులు మొదలైన వాటి రేట్లు పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 4.68 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 4.85 శాతంగా ఉంది. ఎంపిక చేసిన 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామాల నుంచి క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా ఎన్ఎస్వో ఈ డేటా రూపొందించింది. మే–జూన్ మధ్యకాలంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4.7–5 శాతం శ్రేణిలో తిరుగాడవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల పెంపును నిలిపే అవకాశాలు ఎక్కువే కనిపిస్తున్నాయని, అయితే రేట్ల తగ్గింపునకు మాత్రం చాలా కాలం పట్టేయవచ్చని పేర్కొంది. సరైన దిశలోనే పరపతి విధానం: ఆర్బీఐ గవర్నర్ ఏప్రిల్‌లోనూ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం ‘చాలా సంతృప్తినిచ్చే’ అంశమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇది .. ద్రవ్యపరపతి విధానం సరైన దిశలోనే సాగుతోందనే నమ్మకం కలిగిస్తోందని పేర్కొన్నారు. అయితే, దీని ఆధారంగా పరపతి విధానంలో ఏవైనా మార్పులు ఉండవచ్చా అనే ప్రశ్నకు.. తదుపరి పాలసీ సమీక్ష రోజైన జూన్ 8న దీనిపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. -
ఇలాంటి ఫుడ్ తింటే క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే
-
ఆసియాలోనే అతిపెద్ద ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేయడమే తెలంగాణ ఫుడ్స్ లక్ష్యమని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను మంత్రులు సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజీవ్ సాగర్ మాట్లాడుతూ పోషకాహార లోపం లేని తెలంగాణ కోసం కృషి చేయడమే తెలంగాణ ఫుడ్స్ లక్ష్యమన్నారు. దాదాపుగా 30 లక్షల మంది ఆరోగ్యవంతమైన జీవితం కోసం సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కోసం నడుం బిగించిందని వివరించారు. ఆధునిక సాంకేతికత తో ఏర్పాటు చేసిన అతి పెద్ద ప్లాంట్ ఆసియాలోనే ఇదే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ముందు చూపుతో సంస్థ ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ 1975 లో నిర్మించింది కాబట్టి రానున్న భవిష్యత్ దృష్యా నూతన ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 18,404 అడుగుల స్థలంలో నిర్మిస్తున్న ఈ ఫ్లాంట్ ద్వారా గంటలకు 4 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరగనుందని తెలిపారు. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం రూ. 42 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ నూతన ప్లాంట్ ద్వారా ఇప్పుడు సరఫరా చేస్తున్న మన రాష్ట్రం, ఏపీతో పాటు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు మనం పోషకాహారం అందించవచ్చన్నారు. ఈ ప్లాంట్ ద్వారా రానున్న మరో 40 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అవసరం మేర పోషకాహారం ఉత్పత్తి జరుగుతుందన్నారు. అంతే కాకుండ సివిల్ సప్లై వారికి అందించే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉత్పత్తి చేసి అందించే సామర్ధ్యం నూతన ప్లాంట్‌కు ఉందన్నారు. సంస్థ ఉత్పత్తి చేసే బాలామృతం, బాలామృతం+, స్నాక్స్ వల్ల తెలంగాణలోని 33 జిల్లాల్లోని 35,699 అంగన్వాడీ సెంటర్ల ద్వారా దాదాపు 15.5 లక్షల మంది లబ్ధిపొందుతున్నారని వివరించారు. అదే విధంగా ఏపీలోని 55,605 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 16.12 లక్షల మంది పోష్టికాహారం అందుకుంటున్నారని తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించాక ఉద్యోగులకు 20 శాతం వేయిజేస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి సోలార్ పవర్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు -
ఎక్స్పైరీ డేట్ ఎందుకు? ఆ తర్వాత వాడితే ఏమవుతుందో తెలుసా!
వివిధ రకాల ఉత్పత్తులపై ఎక్స్పైరీ డేట్ ఎందుకు వేస్తారు? కాలం చెల్లిన తర్వాత వాటిని వాడితే ఏమౌతుంది? కొన్ని రకాల ఆహారపదార్థాల పైన యూజ్ బై లేదా బెస్ట్ బిఫోర్ అని రాసి ఉంటుంది. దాని అర్థం ఆ తేదీ దాటిని తర్వాత వాటిని వినియోగించకూడదా? ఒకవేళ వాడితే ఏమవుతుంది? తెలుసుకుందామా..? ఇంటి అవసరాల కోసం మనం ఒకోసారి కొన్ని నెలలకు సరిపడా అన్ని రకాల కిరాణా సామాన్లు ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం. అయితే కొద్దిరోజుల తర్వాత వాటిలో కొన్నింటికి ఎక్స్పైరీ డేట్ చూసి, అయ్యో, ఇది ఈ తేదీలోగా గమనిస్తే వాటిని అలాగే వాడుతున్నారా, లేక ఎక్స్పైరీ అయిపోయాయని పాడేస్తున్నారా తెలుస్తుంది. మన ఇండ్లల్లో కూడా తాతాల కాలం నుంచే కారం, పసుపు, చింతపండు అని ఎన్నో రకాల పదార్థాలను ఒకేసారి కొనుగోలు చేసి వాటినే భద్రంగా దాచుకొని సంవత్సరాల పాటు వాడటం మనకు తెలుసు. మరి ఇంతకాలంగా లేనిది ఇప్పుడు ఇప్పుడు ప్రతీదానికి ఈ ఎక్స్పైరీ తేదీతో సంబంధం ఏమిటి? ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తే ప్రతి దానిపై ధరతో పాటు ఎప్పుడు తయారు చేశారు(Manufacture Date), అది ఎప్పటిలోగా వాడాలో తెలిపే ఎక్స్పైరీ డేట్ ముద్రించి ఉంటుంది. అయితే ఏదైనా వస్తువు దాని కాలపరిమితి దాటిపోయింది అంటే అది పూర్తిగా పాడైపోయింది ఇక వినియోగించకూడదు అని కాదు. ఆ పదార్థం ప్యాకింగ్ చేసేటపుడు ఏదైతే తాజాదనం ఉంటుందో ఆ తేదీ దాటిన తర్వాత తిరిగి అదే తాజాదనం ఉండదు అని అర్థం. చదవండి: Health: పెళ్లి సంబంధాలు చూస్తున్నారు... కానీ ఆ సమస్య! పిల్లలు పుట్టే అవకాశాలు!? వాస్తవానికి ఏ వస్తువైనా మనం భద్రపరుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఉండి, ప్యాకింగ్ సరిగా లేకుంటే అది కూడా వెంటనే పాడవవచ్చు. ఉప్పులాంటి పదార్థాలను సంవత్సరాల కొద్దీ వాడుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ లాంటివి కూడా సరిగ్గా భద్రపరిస్తే సంవత్సరం వరకూ నిల్వ ఉంటాయి. ఏదైనా వస్తువు చెడిపోయింది అంటే అది దాని నుంచి వచ్చే వాసన, దాని స్వభావాన్ని చూసి మనం పసిగట్టవచ్చు. అలా అని ఇకపై ఎక్స్పైరీ డేట్ ఉన్నవన్నీ తినేయకండి. ఎందుకంటే, సాధారణంగా ఆహార పదార్థాలు కొద్ది కాలం వరకు మాత్రమే బాగుంటాయి. గడువు ముగిసే కొద్ది ఆహార పదార్థాలు పాడవుతాయి. మందుల విషయంలో ఎక్స్పైరీ తేదీని జాగ్రత్తగా గమనించాలి. ఆ తేదీ దాటిపోయిన తర్వాత వాడటం వల్ల ఆ మందు సమర్థంగా పని చేయకపోవచ్చు లేదా దానివల్ల మరింత ప్రమాదం ఏర్పడవచ్చు. అందువల్ల మందుల విషయంలో మాత్రం ఎక్స్పైరీ తేదీ దాటకముందే వాడటం మంచిది. -
జన్యుమార్పిడి పంటలకు ఊతమా?
భారత్‌కు వ్యతిరేకంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో అమెరికా ఫిర్యాదు చేసింది. బియ్యం, ఆపిల్లతోపాటు అన్ని రకాల జన్యుమార్పిడి ఆహార దిగుమతు లపై భారత్ నియంత్రణలు విధించడాన్ని ప్రశ్నించింది. జన్యుమార్పిడి ఆవాల పంటకు ‘పర్యావరణ అనుమతులు’ మన దేశంలో ఇచ్చినప్పుడే ఈ పరిణామాలు జరగడం గమనార్హం. సురక్షితం కాని జన్యుమార్పిడి ఆహార దిగుమతులను అనుమతించేలా మన చట్టాలను మార్చుకోమని బలవంత పెట్టడం కంటే... తమ దేశ వ్యవసాయ రంగాన్ని అమెరికా ఎందుకు సరిచేసుకోదు? క్యాన్సర్ కారకమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్డిమందుల విషయంలోనూ అమెరికా వైఖరి ఇదే. తమకు జన్యుమార్పిడి మొక్కజొన్న వద్దని మెక్సికో కరాఖండీగా చెప్పింది. అంత స్పష్టత మన దేశానికీ ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు జన్యు మార్పిడి పంటల దిగుమతికి అనుమతిచ్చేలా అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆహారంపై ‘జన్యుమార్పిడి పంటలు కాదు’ అన్న లేబుల్ తగిలించాలని భారత్ డిమాండ్ చేస్తూండటం అమెరికా వ్యవసాయ ఎగుమతులకు నష్టం కలిగి స్తోందని అమెరికా ఫిర్యాదు. ఈ పరిణామాలన్నీ భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జన్యుమార్పిడి ఆవాల పంటకు ‘పర్యావరణ అనుమతులు’ ఇచ్చినప్పుడే జరగడం గమనార్హం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో అమెరికా ఫిర్యాదు చేసింది ఒక్క భారతదేశంపై మాత్రమే కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు జన్యు మార్పిడి పంటలు, దిగుమతులు, టెక్నాలజీపై నిషేధం తొలగించేలా చేసేందుకు అమెరికా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. యూరో పియన్ యూనియన్‌తోపాటు ఇండియా, మెక్సికో, కెన్యా, ఇండోనేసి యాలను లక్ష్యంగా చేసుకుని పని చేస్తోంది. మెక్సికో అధ్యక్షుడు ఆడ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్పై అమెరికా పెట్టిన ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందంటే– తమకు జన్యు మార్పిడి మొక్కజొన్న అస్సలు వద్దు. స్వేచ్ఛాయుతమైన, సార్వభౌమ అధికారులున్న దేశం కావాలని కరాఖండీగా చెప్పేంత. గత ఏడాది మెక్సికో ఒక అధ్యక్ష ఉత్తర్వు జారీ చేస్తూ... జన్యుమార్పిడీ మొక్క జొన్నను దశలవారీగా తొలగిస్తామని స్పష్టం చేసింది. హానికారక గ్లైఫాసేట్ వాడకాన్ని కూడా 2024 నాటికి నిషేధిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయాల ప్రభావం అమెరికా నుంచి దిగుమతి అవుతున్న కోటీ డెబ్భై లక్షల టన్నుల మొక్కజొన్నలపై ఉంటుంది. మెక్సికో తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు మిగిలిన దేశాలు వ్యవహరించడం కష్టం. అశోకా యూనివర్సిటీ అసోసియేట్ అధ్యా పకుడు అనికేత్ ఆఘా ఇలాంటి వ్యవహారాన్ని వ్యవసాయ పెట్టుబడి దారీ విధానం అంటారు. కెన్యా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మోజెస్ కురియా చేసిన ప్రకటన అందరినీ నిర్ఘాంత పరిచింది. ‘‘ఈ దేశంలో ఉన్నామంటే చావుకు సిద్ధమైన వ్యక్తిగా ఉన్నట్లే. చావుకు పోటీ పడుతున్నవాటికి జన్యుమార్పిడి పంటలను కూడా చేర్చడం తప్పేమీ కాదు. అందుకే ఉద్దేశపూర్వకంగానే ఈ దేశంలోకి జన్యుమార్పిడి పంటలను అనుమతించాం’’ అన్నారు మోజెస్. ఆ తరువాత పదేళ్ల నిషేధాన్ని ఎత్తివేయడమే కాకుండా, ఆరు నెలలపాటు జీఎం మొక్క జొన్న, సాధారణ మొక్కజొన్నల దిగుమతులపై పన్నులను కూడా ఎత్తేశారు. ఈ ప్రకటన జరిగిన కొన్ని వారాల్లో 32 మంది సభ్యులున్న అమెరికా వాణిజ్య బృందం నైరోబీలో పర్యటించింది. మెక్సికో నిషేధం తరువాత అమెరికన్ రైతులపై ఉన్న జీఎం పంటల భారాన్ని కెన్యా కొంత భరిస్తుందని వారి నమ్మకం మరి. ఇండొనేసియా విషయానికొస్తే... అక్కడ వ్యవసాయ సంబంధిత సంఘాల తీవ్ర వ్యతిరేకత మధ్య అధ్యక్షుడు జోకో వైడోడో దేశంలో పడిపోతున్న సోయాబీన్ దిగుబడులు పెంచేందుకు జన్యుమార్పిడి పంటల సాగు చేపట్టాలనీ, అవసరమైతే జీఎం విత్తనాలను దిగుమతి చేసుకోవాలనీ అంటూండటం గమనార్హం. అసురక్షితమైన, ప్రమాదాలతో కూడిన జన్యుమార్పిడి ఆహారపు దిగుమతులను అనుమతించేలా మన చట్టాలను మార్చుకోమని అమెరికా బలవంత పెట్టడం కంటే... తమ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఎందుకు సరిచేసుకోదు? అమెరికా తన ప్రజల కోసం జన్యుమార్పిడి పంటలను సాగు చేసుకోవాలనుకుంటే మనకేమీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ... ఎగుమతి అవసరాల కోసం సాధారణ బియ్యం, ఆపిల్లను సాగు చేయడం ఎందుకు మొదలుపెట్టదు? యూరోపియన్ యూనియన్, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు హానికారక జన్యుమార్పిడి పంటల నుంచి రక్షణకు చేసుకున్న ఏర్పాట్లను బలహీనపరచాలని అమెరికా ఎందుకు ఒత్తిడి చేస్తోంది? ఈ జన్యుమార్పిడి ఉత్పత్తులు గడ్డి మందులను తట్టుకోగలవు కాబట్టి. వీటిని వాడటం మొదలుపెడితే విషపూరిత మైన కీటకనాశినుల విక్రయాలు గణనీయంగా పెరుగుతాయి. భారత్‌లో 2002లో బీటీ కాటన్ ప్రవేశించింది మొదలు పత్తిపై చల్లే కీటకనాశినుల ఖర్చు హెక్టారుకు 37 శాతం పెరిగింది. సాధారణ మొక్కజొన్నల విషయంలో మెక్సికో డిమాండ్‌ను తాము తీర్చగలమని అమెరికాలోని రైతులు కొందరు ప్రకటించిన విషయాన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గుర్తుంచుకోవాలి. నిజానికి భారత్ కూడా అమెరికా నుంచి జన్యుమార్పిడి ఆహార దిగుమతులను అడ్డుకునే విషయంలో గట్టిగా నిలుస్తుందని భావిస్తున్నాను. అలా చేయగలిగితే సాధారణ పంటలవైపు మళ్లాల్సిందిగా అమెరికాలోని జీఎం రైతులకు ఒక స్పష్టమైన సందేశం పంపినట్లు అవుతుంది. ప్రపంచానికి కావాల్సింది కూడా అదే. పైగా అభివృద్ధి చెందుతున్న దేశాల భద్రత, ఆరోగ్యాన్ని కాపాడటం, ఆహార అవసరాలను తీర్చడం కంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు అమెరికా వాణిజ్య ప్రయో జనాలు తీర్చడం ముఖ్యం కాబోదు. తమకు ఏది అవసరం లేదో దాన్ని విస్పష్టంగా చెప్పే హక్కు ఆయా దేశాలకు ఉండాలి. ఈ అంశాల్లో బలహీనంగా ఉన్న కారణంగానే చాలా దేశాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు దూరంగా జరుగుతున్నాయి. అమెరికా ఈ వైఖరి ఒక్క జన్యుమార్పిడి ఆహారానికే పరిమితం కాదు. క్యాన్సర్ కారకమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్డి మందుల విషయంలో వందల కోట్ల డాలర్ల జరిమానాలు పడ్డా, వేల సంఖ్యలో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నా ఆ పరిశ్రమ ఎగుమతుల కోసం అతురతతో ఎదురు చూస్తోంది. ఈ కారణంగానే ఏమో... జీఎం టెక్నాలజీకి అనూహ్యంగా భారత్, కెన్యా, ఇండోనేసియాల్లో మంచి మద్దతు లభిస్తోంది. తక్కువ దిగుబడులిచ్చే జన్యుమార్పిడి ఆవాల విషయాన్నే తీసుకుందాం. భారత్‌లో ఇదో అర్థం లేని వంగడం. భారత్ తన వంటనూనె అవసరాల్లో దాదాపు 55 శాతాన్ని దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటోంది. ఈ దిగుమతులు సుమారు కోటీ ముప్ఫై లక్షల టన్నుల వరకూ ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక వంటనూనె దిగుమతిదారుల్లో ఇటీవలే భారత్ రెండో స్థానానికి చేరింది. తగినంత వంటనూనె సొంతంగా ఉత్పత్తి చేసుకోలేక కాదు... ప్రభుత్వ ప్రాథమ్యాల్లో, విధానాల్లో తేడాలు ఇందుకు కారణం. చౌక దిగుమతులకు అనుమతులివ్వడం, దిగుమతి సుంకాలను తగ్గించడం సరేసరి. ఈ చర్యల ద్వారా వంటనూనెల విషయంలో స్వావలంబన సాధించేందుకు 1993 – 94లో మొదలుపెట్టిన పసుపు విప్లవం కాస్తా నిర్వీర్యమవుతోంది. తక్కువ దిగుబడినిచ్చే జన్యుమార్పిడి ఆవాల వంగడాన్ని డీఎంహెచ్–11 అని పిలుస్తున్నారు. దీంట్లో కీటకనాశినులను తట్టు కునే మూడు జన్యువులుంటాయి. దీని ద్వారా హెక్టారుకు 2,626 కిలోల దిగుబడి వస్తుందని అంచనా. దాదాపు 3,012 కిలోలతో ఇప్పటికే డీఎంహెచ్–4 వంగడం డీఎంహెచ్–11 కంటే 14.7 శాతం ఎక్కువ దిగుబడి ఇస్తోంది. ఇలాంటివే ఇంకో నాలుగు వంగడాలు ఉండటం గమనార్హం. విచిత్రమైన విషయం ఏమంటే– డీఎంహెచ్–11 వంగడాన్ని అతితక్కువ దిగుబడినిచ్చే వరుణ వంగ డంతో పోల్చి, తమది 25 – 30 శాతం ఎక్కువ దిగుబడి ఇస్తుందని చెప్పడం! ఇంకోపక్క అందుబాటులో ఉన్న వంగడాలతోనే కొన్ని కొత్త టెక్నాలజీల సాయం (సిస్టమ్ ఆఫ్ మస్టర్డ్ ఇంటెన్సిఫికేషన్)తో మధ్య ప్రదేశ్‌లో ఆవాల దిగుబడి హెక్టారుకు 4,693 కిలోల స్థాయికి తేగల మని ఇప్పటికే నిరూపితమైంది. ఎల్లో రివల్యూషన్‌ను మళ్లీ పట్టా లెక్కించేందుకు ఇలాంటి పద్ధతులను దేశవ్యాప్తంగా ప్రచారంలో పెట్టడం, సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించడం అవసరం. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
రోడ్డు పక్కన ఫుడ్డును కూడా స్విగ్గీ, జొమాటోల నుంచే ఆర్డర్లు చేసుకోవచ్చట!
బంజారాహిల్స్: స్విగ్గీ, జొమాటో అంటే కేవలంహోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్ డెలివరీ తీసుకొని భోజన ప్రియులకు అందిస్తుంటారు. ఇదే స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌లు రోడ్ల పక్కన ఆహార పదార్థాలు విక్రయించే చిరు వ్యాపారుల నుంచి టిఫిన్లు, మీల్స్ కూడా కోరుకున్న భోజన ప్రియులకు అందజేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పథకాన్ని జీహెచ్ఎంసీలో సర్కిల్–17, 18లలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్వనిధి సే సమృద్ధి క్యాంప్స్ పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకంలో భాగంగా రోడ్ల పక్కన ఫుడ్ వెండర్స్‌ను కూడా స్విగ్గీ, జొమాటోలలో భాగస్వామ్యం చేయనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని జీహెచ్ఎంసీ సిటీ మేనేజర్ ట్రైనింగ్ సెంటర్లో ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు, స్ట్రీట్వెండర్లతో జీహెచ్ఎంసీ సర్కిల్–18 యూసీడీ డీపీవో హిమబింధు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, సనత్‌నగర్, అమీర్‌పేట, షేక్‌పేట డివిజన్ల పరిధిలోని రిసోర్స్పర్సన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ ముఖ్య ఉద్దేశాన్ని అవగాహన చేసుకొని వీధి వ్యాపారులకు అవగాహన కల్పించి వారిని ఈ పథకంలో భాగస్వాములు చేసే విధంగా ఆర్పీలు పని చేయాలని అధికారులు సూచించారు. ఆయా ప్రాంతాల్లో వీధి వ్యాపారులను, ఫుడ్ వెండర్స్‌ను కలుసుకొని వారికి మరింత ఆదాయం చేకూర్చేలా ఈ పథకం ఉద్దేశాన్ని తెలియజేయాలని సూచించారు. -
గల్లా ఫుడ్స్‌కి ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకోండి..
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనాపల్లి, పేట అగ్రహారం గ్రామాల పరిధిలో పరిశోధనాభివృద్ధి కేంద్రం(ఆర్ అండ్ డీ) ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి 2011లో 28 ఎకరాల భూమి తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన గల్లా ఫుడ్స్ ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలు పెట్టకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒప్పందం మేరకు ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు చేయనందున ఆ ఒప్పందాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పూతలపట్టు మండలం నల్లగట్లపల్లికి చెందిన గాలి పురుషోత్తంనాయుడు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీఐఐసీ చైర్మన్ అండ్ ఎండీ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, గల్లా ఫుడ్స్ లిమిటెడ్‌లకు నోటీసులిచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పి.హేమచంద్ర వాదనలు వినిపిస్తూ.. ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు ఒప్పందంతో భూమి తీసుకున్న గల్లా ఫుడ్స్.. ఆ భూమిలో ఎలాంటి కేంద్రాన్నీ ఏర్పాటు చేయలేదన్నారు. ఒప్పందం ప్రకారం రెండేళ్లలో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆ భూమిని ఉపయోగించనప్పుడు తిరిగి స్వాధీనం చేయాల్సిన బాధ్యత గల్లా ఫుడ్స్‌పై ఉందన్నారు. అయితే ఇప్పటి వరకూ భూమి స్వాధీనానికి అటు గల్లా ఫుడ్స్ గానీ, ఇటు ఏపీఐఐసీ అధికారులు గానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని హేమచంద్ర వివరించారు. చదవండి: ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
లాక్‌డౌన్‌లోనూ భలే లాగించేశారు..!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కాలంలోనూ మనోళ్లు తెగ లాగించేశారు. దేశంలోని తమకు నచ్చిన రెస్టారెంట్ల నుంచి ఇష్టమైన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి తమ జిహ్వ చాపల్యాన్ని భోజనప్రియులు సంతృప్తిపరుచుకున్నారు. వాటిలో అగ్రస్థానం బిర్యానీకే దక్కింది. కోవిడ్ వ్యాప్తి కారణం గా విధించిన లాక్డౌన్ కాలంలో కేవలం బిర్యానీ డెలివరీ కోసమే 5.5 లక్షల ఆర్డర్లు వచ్చాయట. బట్టర్ నాన్లు, మసాలా దోశలను మూడున్నర లక్షల మార్లు భోజనప్రియులు తెప్పించుకున్నారు. మూడున్నర లక్షల ‘రెడీటు కుక్ ఇన్స్టెంట్ నూడుల్స్ ప్యాకెట్స్’డెలివరీ అయ్యాయి. చాక్లెట్ లావా కేక్‌ను 1.3 లక్షల సార్లు, గులాబ్ జామూన్ ను 85 వేల పర్యాయాలు, మౌస్సె కేక్‌ను 28 వేల మార్లు ఆర్డర్ చేశారు. కరోనా వ్యాప్తి నిరోధకం దృష్ట్యా మాస్క్‌లు, శానిటైజర్లతో పాటు వ్యక్తు ల మధ్య దూరం పాటించడం తప్పనిసరి కావడంతో పుట్టినరోజు, పెళ్లిరోజుల వేడుకలు తగ్గిపోయాయి. పలు వురు పుట్టినరోజు వే డుకలను వీడియో కాల్స్, ఆన్లైన్లో వర్చువల్ కేక్ కటింగ్ సెష న్స్ ద్వారా జరుపుకున్నారట. ఇలా లాక్డౌన్ కాలం లో 1.2 లక్షల కేక్‌లు డోర్ డెలి వరీ అయ్యాయి.ఇక భారతీయులు తమకిష్టమైన ఏయే ఆహారపదార్ధాలను, ఎన్నిసార్లు తెప్పించుకున్నారన్న దానిపై ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ‘‘స్టాట్‘ఈట్’ఇస్టిక్స్ రిపోర్ట్.. ది క్వారంటైన్ ఎడిషన్’’ పేరిట తన తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా నాలుగో ఏడాది కూడా అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహారపదార్థాల్లో బిర్యానీనే అగ్రస్థానంలో నిలిచినట్టు ఈ సంస్థ తెలిపింది. మొత్తం 4 కోట్ల ఆర్డర్ల డెలివరీ..: భారత్‌లో దాదాపు రెండున్నర నెలల పాటు అమల్లో ఉన్న లాక్డౌన్ కాలంలో ఫుడ్, సరుకులు, మెడిసిన్స్,ఇతర వస్తువులు కలిపి 4 కోట్ల ఆర్డర్లను స్విగ్గీ డెలివరీ చేసింది. ఇవేకాకుండా 73 వేల శానిటైజర్, హాండ్ వాష్ బాటిళ్లు, 47 వేల ఫేస్‌మాస్క్‌లు కూడా ఇళ్లకు చేరవేసింది. లాక్డౌన్లో రోజూ రాత్రి 8 గంటలకు సగటున 65 వేల వంతున ‘మీల్ ఆర్డర్లు’వచ్చేవని పేర్కొంది. 32.3 కోట్ల కేజీల ఉల్లిపాయలు, 5.6 కోట్ల కేజీల అరటిపండ్లు: కరోనా టైంలో ఇంటి వంటనే అస్వాదించుకునే వారి కోసమూ వివి«ధ రకాల ఆహార పదార్ధాలు, నిత్యావసర సరుకులను సైతం స్విగ్గీ సరఫరా చేసింది. దేశంలో ఇంట్లోనే వంట చేసుకున్న వాళ్లు తమకిచ్చిన ఆర్డర్ల మేరకు 32.3 కోట్ల కిలోల ఉల్లిపాయలు, 5.6 కోట్ల కిలోల అరటిపండ్లను డెలివరీ చేసినట్టు ఈ సంస్థ తెలిపింది. లాక్డౌన్ సమయంలో తమ నిత్యావసర సరుకుల విభాగం ద్వారా ఈ పంపిణీ చేసినట్టు నివేదికలో తెలిపింది. -
హెల్థీ ఫుడ్ విక్రయాలు రెట్టింపు
లాక్డౌన్ కాలంలో రోగ నిరోధకతను పెంచే ఆహార ఉత్పత్తుల విక్రయాలు 20-40 శాతం పెరిగాయని గూగుల్ ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్-19నుంచి తమను తాము రక్షించుకునేందుకు రోగనిరోధకత పెంచే ఆహార పదార్థాలు ఏమేం ఉన్నాయో తెలుసుకునే ఆన్లైన్ యూజర్ల సంఖ్య 6 రెట్లు పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఆయుర్వేద వంటింటి మూలికలు, తిప్పతీగ, విటమిన్ C లభించే ఆహార పదార్థాల గురించి అధికంగా అన్వేశించారని గూగుల్ తెలిపింది.ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, వాట్సాప్ వంటి వాటిలో ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన సమాచారాన్ని సేకరించి వాటి ద్వారా గూగుల్‌లో ఆయా పదార్థాలు వెతుకుతున్నారు. చవన్‌ప్రాశ్, హెల్త్‌బార్స్, ప్రముఖ బ్రాండెడ్ హెల్త్ సాల్ట్‌ల కొనుగోళ్లు రెట్టింపు అయ్యాయని స్పెన్సర్స్ రిటైల్ అండ్ నేచుర్స్ బాస్కెట్ చీఫ్ ఎక్సిక్యూటివ్ దేవేంద్ర చావ్లా వెల్లడించారు.రాబోయే రోజుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారంతోపాటు, రోగ నిరోధక శక్తిని పెంచే విభాగంలో మరిన్ని కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు.ఇప్పటికే ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ కొత్తగా వస్తున్న ఉత్పత్తులను సైతం వినియోగదారులు ఆదరిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్-19 తర్వాత.. కోవిడ్ తర్వాత ఆరోగ్యసంరక్షణ, ముఖ్యంగా ఆయుర్వేదం ప్రాముఖ్యతతోపాటు, వ్యక్తిగత పరిశుభ్రతపై వినియోగదారుల్లో మంచి అవగాహన పెరుగుతోందని డాబర్ ఇండియా చీఫ్ ఎక్సిక్యూటివ్ మొహిత్ మల్హోత్రా అన్నారు. వినియోగదారులు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మరింత ఆరోగ్య సంరక్షణ అందించే ఉత్పత్తులను కొనుగోలు చేస్తుండడంతో హల్త్‌కేర్ ఇండస్ట్రీ లాభాల్లో నడుస్తుందన్నారు. ఇక వ్యక్తిగత శుభ్రతలో ప్రముఖ పాత్ర వహించే ఉత్పత్తులైన హ్యాండ్ శానిటైజర్లు నేటి జీవన శైలిలో నిత్యవసరాలయ్యాయి.నెలవారి గ్రాసరీ బాస్కెట్లో ఇప్పుడు ఇది చేరపోయింది. దీంతో శానిటైజర్ల విభాగంలో వృద్ధి భారీగా నమోదైందని మల్హోత్రా అన్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న విప్రో కూడా ఇప్పటికే శానిటైజర్‌కు బదులుగా సూక్ష్మ జీవుల నుంచి రక్షణ కల్పించే యార్డ్లే ఫ్రాగ్రెన్స్ అనే పాకెట్ ఫెర్ఫ్యూమ్ను అందుబాటులోకి తెచ్చినట్లు విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ వీపీ వ్యాపార ముఖ్య అధికారి మనిష్ వ్యాస్ వెల్లడిచారు. ఈ స్ప్రేను ఒక్కసారి కొట్టుకుంటే గంట పాటు కంటికి కనిపించని క్రిముల నుంచి రక్షణ పొందవచ్చని మనిష్ తెలిపారు. వెజ్జీక్లీన్.. పారాచూట్ ఆయిల్ తయారీ కంపెనీ మారికో కూడా కూరగాయలు, పండ్లను శుభ్రం చేసే వెజ్జీ క్లిన్ ఆయల్‌ను అదుబాటులోకి తెచ్చింది.ఐటీసీ రూ.50 పైసలకే ఒకసారి వాడి పడేసే శానిటైజర్ సాచెట్స్‌ను మార్కెట్లోకి తీసుకురాగా, రూ.1కి లభించే శానిటైజర్‌ను కెవిన్‌కేర్ అందిస్తోంది. కాగా ఏప్రిల్ నెలలో 56 శాతం మంది వినియోగదారులు తమఖర్చులలో ఎక్కువ భాగం ఆరోగ్యం, ఆర్గానిక్ ఫుడ్, మెడికల్ అవసరాలు, ఫిట్నెస్, మెడికల్ ఇన్సురెన్స్ వంటివాటికి వెచ్చిస్తున్నట్లు చెప్పారని మార్కెట్ పరిశోధనా సంస్థ నెల్సన్ ఓ నివేదికలో తెలిపింది. హ్యాండ్ శానిటైజర్స్,ఫ్లోర్క్లీనర్స్, హ్యాండ్ వా ష్‌లకు భారీగా డిమాండ్ పెరిగిందని, ఈ నేపథ్యంలో 152 కోత్త కంపెనీలు మార్కెట్లోకి అడుగుపెట్టడంతో హ్యాండ్ శానిటైజర్ల ఉత్పత్తి నాలుగురెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. మరోపక్క రోగనిరోధకతను పెంచే బిస్కెట్లు, స్నాక్స్, సాల్ట్ వాటర్, ఖాక్రా వంటి అన్ని ఉత్పత్తుల తయారీ తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్్స అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలకు అనుగుణంగా జరగాలని చెబుతోంది. అంతేగాకుండా ఈ నిబంధనలకు తమ వెబ్సైట్లో కోవిడ్ పేజిని ప్రత్యేకంగా నడుపుతున్నామని దీనిలో అన్ని నిబంధనలు సవివరంగా ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఒకరు వెల్లడించారు.ఈ-ఇన్స్పెక్షన్స్ అనే ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉత్పత్తులకు అప్రూవల్స్ ఇస్తున్నట్లు తెలిపారు. -
కింది నుంచి గ్యాస్పోతోందా?
కింది నుంచి గ్యాస్ పోయే సమస్య కేవలం ఆరోగ్యపరమైనది మాత్రమే కాదు. ఇది సామాజికంగా కూడా చాలా ఇబ్బందికరమైనదే. సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులను సైతం నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది. కొన్ని కొన్ని చిన్న సూచనలతో దీన్ని చాలావరకు నివరించవచ్చు. ఆ సూచనలివే... సరిపడని ఆహారాలకు దూరంగా ఉండాలి : మనకు సరిపడని ఆహారాల కారణంగా కూడా కింది నుంచి గ్యాస్ పోతుంటంది. ఉదాహరణకు కొందరికి పాలతో అలర్జీ ఉంటుంది. వారు పాలు తాగగానే కింది నుంచి గ్యాస్ పాస్ కావడం మొదలవుతుంది. మనకు సరిపడని ఆహారపదార్థాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండటం వల్ల ఈ ముప్పు తప్పిపోతుంది. కొన్ని రకాల కూరలకు దూరంగా ఉండండి : చాలామందికి క్యాబేజీ, బీన్స్, కాలీఫ్లవర్ వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్ నిండుతుంది. కింది నుంచి గ్యాస్ పోయేవారు మాత్రం ఇలాంటి ఆహారాలకు కాస్తంత దూరంగా ఉండటం లేదా బాగా తగ్గించి తినడం అవసరం. మిగతావారికి ఈ ఆహారాలు చాలా ఆరోగ్యకరమని గుర్తించండి. కేవలం గ్యాస్ ఇబ్బందిని తగ్గించుకోవడం కోసం మాత్రమే వీటిని చాలా పరిమితంగా తీసుకోవాలి. ఉప్పు తగ్గించాలి : ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడటం కూడా కింది నుంచి గ్యాస్‌పోయే సమస్యకు ఒక కారణం. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడినప్పుడు అది కడుపు ఉబ్బరం ఎక్కువ కావడానికి దారితీస్తుంది. అందుకే ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలవంటివి తగ్గించాలి. అలాగే కూరల్లో, పెరుగులో వేసుకునే ఉప్పు కూడా తగ్గించడం మంచిది. మలబద్దకం నివారణతో : తగిననన్ని పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇందుకోసం పొట్టుతీయని కాయధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. రోజూ కనీసం అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయడం వల్ల మలబద్దకం తగ్గి కింది నుంచి గ్యాస్ పాస్ కావడం కూడా తగ్గుతుంది. చ్యూయింగ్‌గమ్ నమలడం మానేయండి : చ్యూయింగ్‌గమ్ నమిలే అలవాటు ఉన్నవారిలో అది నమిలే సమయంలో గాలిని ఎక్కువగా మింగడమూ జరుగుతుంటుంది. ఇలా మింగిన గాలే చాలాసందర్భాల్లో గ్యాస్ రూపంలో కింది నుంచి పోతూ ఉంటుంది. అలాగే మనం ఆహారాన్ని నమిలి మింగే సమయంలోనూ గాలిని మింగుతూ ఉంటాం. అయితే ఇలా మింగే గాలితో పోలిస్తే చ్యూయింగ్ గమ్ నమిలే సమయంలో మింగే గాలి మరీ ఎక్కువ. అందుకే చ్యూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉన్నవారిలో గ్యాస్ ఎక్కువగా పోతుంటే... వారు ఆ అలవాటు తగ్గించుకోవాలి. కృత్రిమ చక్కెరలు / గ్యాస్ ఉండే కార్బొనేటెడ్ డ్రింక్‌లతో : కృత్రిమ చక్కెరలు/గ్యాస్ నిండి ఉండే కూల్‌డ్రింక్స్ వంటి శీతలపానియాల వల్ల కూడా కింది నుంచి గ్యాస్ పోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. మనం శీతలపానియాలు తాగగానే కడుపు ఉబ్బరంగా ఉండటం చాలామంది గమనించే ఉంటారు. ఇలా చేరిన గాలి కూడా చాలా సందర్భాల్లో కింది నుంచి పోతూ ఉంటుంది. అందుకే కింది నుంచి గ్యాస్పోయేవారిలో శీతలపానియాలు తాగుతుంటే... ఆ అలవాటును బాగా పరిమితం చేసుకుంటే మంచిది. బాగా నమిలి మింగాలి : వేగంగా నమిలి మింగడం కంటే... నెమ్మదిగా, నింపాదిగా నమిలి మింగేవారిలో గాలి లోపలికి చాలా తక్కువగా ప్రవేశిస్తుంది. అదే గబగబా నమిలి మింగుతుంటే కడుపులోకి గాలి ఎక్కువగా వెళ్లి... అది కింది నుంచి పోయే అవకాశం ఉంది. అందుకే మనం తినే ఆహారాన్ని వీలైనంత నెమ్మదిగా, నింపాదిగా నమిలి మింగాలి. అలాగే ఒకేసారి ఎక్కువగా తినడం కంటే... తక్కువ (చిన్న చిన్న) మోతాదుల్లో ఎక్కువ సార్లు తింటుండాలి. ►ఇక ఆహారంలో కొవ్వులు జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయమే పడుతుంది. అందుకే జీర్ణమయ్యే వ్యవధి పెరుగుతున్నకొద్దీ కింది నుంచి గ్యాస్‌పోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆహారంలో కొవ్వులను తగ్గించాలి. కొవ్వులు తీసుకున్నప్పుడు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించవచ్చు. ►స్థూలకాయం ఉన్నవారిలో, ఒంటి బరువు ఎక్కువగా ఉన్నవారిలో కింది నుంచి గ్యాస్ పోవడం ఎక్కువ. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలి. ఆహారంలో అల్లం, పుదీనా వంటివి గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. అందుకే కింది నుంచి గ్యాస్‌పోయే వారు వాటిని ఎక్కువగా వాడటం మంచిది. -
అక్రమాల బాలసదన్..!
మంకమ్మతోట(కరీంనగర్): అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని.. విద్యాబుద్దులు చెప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపాల్సిన బాలసదన్ అక్రమాల పుట్టగా మారింది. జిల్లాకేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో ఐసీడీఎస్ పరిధిలో నడుస్తున్న బాలసదన్ అధికారులు పిల్లల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా ఏటా బాలల వారోత్సవాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. అనాథ బాలలు ఉంటున్న బాలసదన్లు, ఆ శాఖ అధికారుల పనితీరుపై మాత్రం దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం బాలసదన్‌లో ఉంటున్న బాలల పట్ల సంరక్షణ కరువై రోగాలపాలవుతున్నారు. ప్రభుత్వం ఏటా బాలసదన్ నిర్వహణకు కాస్మోటిక్ చార్జీల పేరుతో రూ.కోట్లు కేటాయిస్తున్నా.. పిల్లలకు చేరడం లేదు. వారి పరిశభ్రత పట్ల అధికారులు శ్రద్ధ తీసుకోకపోవడంతో చర్మవ్యాధులు, ఇతర రోగాలతో సతమతమవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. జిల్లాకేంద్రంలోని బాలసదన్‌లో 30మంది అనాథ పిల్లలు ఆశ్రయం ఉంటున్నారు. వీరికి ఆశ్రయం కల్పించడంతోపాటు విద్యాబుద్దులు నేర్పించి మంచి పౌరులుగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడ పనిచేస్తున్న అధికారి బాలల సంరక్షణ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆ శాఖ సిబ్బంది బాహాటంగా ఆరోపిస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఆవిర్భావ దినోత్సవాలతోపాటు నాయకులు, సినీ నటుల ఫ్యాన్స్ వేడుకలను బాలసదన్‌లో జరుపుకునేందుకు వస్తుంటారు. వీరంతా పిల్లల మధ్య వేడుకలు జరుపుకొని స్వీట్లు, పండ్లు, ఆట వస్తువులు, దుస్తులు, దుప్పట్లు, బియ్యం, పప్పులు వంటివి పంపిణీ చేయడంతోపాటు వారందరికి ఉపయోగపడే వస్తువులు ఫ్యాన్లు, కూలర్లు, గీజర్లు, వాషింగ్ మిషన్లు వంటివి కానుకలుగా ఇస్తుంటారు. మరికొంత మంది అవసరమైన వాటిని కొనుక్కోవాలని విరాళాలు అందిస్తుంటారు. ఇలా దాతలు ఇచ్చిన నగదుకు లెక్కలు ఉండకపోగా.. వస్తువులు మాయం అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దాతలు ఇచ్చిన వాటిలో చాలావరకు కనిపించకపోగా.. మరికొన్ని కొత్తవాటిస్థానంలో పాతవి దర్శనం ఇస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. చెడిపోయిందని మూలనపెట్టి కొద్ది రోజుల తర్వాత వీటిని రిపేర్లపేరుతో బయటికి తీసుకుపోయి పాతవి బాగుచేసి పెడుతున్నట్లు సమాచారం. మొక్కల పెంపకం పేరుతో.. బాలసదన్ ఆవరణలో మొక్కలునాటి వారి సంరక్షించేందుకు దాతల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సిబ్బంది తెలుపుతున్నారు. వర్షాకాలంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతోపాటు అందుకు అవసరమైన మొక్కలు, కంచెవంటివి పంపిణీ చేసింది. ఈ మొక్కల పెంపకం సాకుగా చూపి బాలల మధ్య వేడుకలు జరుపుకోవడానికి బాలసదన్‌కు వచ్చిన దాతల నుంచి విరాళాలు వేలల్లో వసూలు చేసినట్లు ప్రజలు తెలుపుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించాలి.. బాలసదన్‌కు విరాళంగా ఇచ్చిన నగదు, వస్తువుల రికార్డులు ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అసవరం ఉంది. దాతలు ఇచ్చినపుడే రికార్డుల్లో రాసి వారికి రశీదు వంటివి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆకు‘పచ్చ’ని విషం!
సాక్షి, హైదరాబాద్: ఆహార పదార్థాల్లో కాలుష్య ఆనవాళ్లు గ్రేటర్ నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు, నగరాలతో పోలిస్తే ఇక్కడ విక్రయిస్తున్న పలు రకాల కూరగాయలు, ఆకుకూరల్లో 9 నుంచి 30 శాతం అధికంగా క్రిమిసంహారకాల ఆనవాళ్లు ఉన్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తాజా పరిశోధనలో తేలింది. దీంతో జీవనశైలి వ్యాధుల ముప్పు పెరుగుతోందని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న పలు రకాల కూరల్లో ప్రధానంగా ఆర్గానో క్లోరిన్ అనే క్రిమి సంహారక మోతాదు అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది. శరీరంలోని కొవ్వుల్లో నిల్వ.. ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే క్రిమిసంహారకాలు ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తే సుమారు 20 ఏళ్లపాటు అలాగే తిష్టవేసే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం హెచ్చరించింది. కొన్ని రకాల క్రిమిసంహారకాల అవశేషాలు దేహంలోని కొవ్వు కణాల్లో నిల్వ ఉంటాయని.. పలు రకాల అనారోగ్య సమస్యలకు ఇవి కారణమౌతాయని తేలింది. దేశం లో సరాసరిన 10 శాతం మధుమేహ బాధితు లుండగా.. హైదరాబాద్‌లో సుమారు 16 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో మధుమేహ బాధితులు పెరిగేందుకు ఆర్గానో క్లోరిన్ ఆనవాళ్లు ఉన్న ఆహార పదార్థాలు తినడమే కారణమని జర్నల్ ఆఫ్ ఎండోక్రైన్ సొసైటీ తాజా జర్నల్‌లోనూ ప్రచురితమవడం గమనార్హం. 9 - 30 - రాష్ట్రంలోని ఆహార పదార్థాల్లో విష రసాయనాల శాతం 10% - దేశంలో సరాసరిన మధుమేహ బాధితులు 16% -నగరంలో మధుమేహంతో బాధపడుతున్నవారు ఆర్గానోక్లోరిన్... ఆకుకూరలు, కూరగాయల పంటలకు పట్టిన చీడపీడల నివారణకు క్రిమిసంహారకంగా ఉపయోగించే క్లోరినేటెడ్ హైడ్రోకార్భన్స్ ఆధారిత రసాయనాన్ని ఆర్గానోక్లోరిన్ అని పిలుస్తారు. ప్రధానంగా వీటిల్లో.. పాలకూర, గోంగూర, తోటకూర, క్యాబేజి, బెండకాయ, వంకాయ. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో ఇలా.. తమిళనాడులో విక్రయిస్తున్న ఆకుకూరలు, కూరగాయల్లో మూడు నుంచి 9 శాతం ఆర్గానో క్లోరిన్ అవశేషాలుండగా.. హైదరాబాద్‌లో బహిరంగ మార్కెట్లు, సంతల్లో విక్రయిస్తున్న కూరగాయల్లో సుమారు 9 నుంచి 30 శాతం అధికంగా వీటి అవశేషాలున్నట్లు ఈ అధ్యయనం హెచ్చరించింది. మధుమేహానికి దోహదం.. తెలుగు రాష్ట్రాల్లో శరీర బరువు తక్కువగా ఉన్నవారు.. రక్తంలో కొవ్వు మోతాదు తక్కువ ఉన్నవారు సైతం మధుమేహవ్యాధి బారిన పడేందుకు ఆర్గానో క్లోరిన్ క్రిమిసంహారక ఆనవాళ్లు ఆహార పదార్థాల్లో చేరడమే ప్రధాన కారణమని వెల్లడించింది. మరోవైపు ఆర్గానో క్లోరిన్ క్రిమిసంహారకాల తయారీ దేశంలో అధికంగా జరుగుతోందని.. లిండేన్ వంటి నిషేధిత క్రిమిసంహారకాన్ని సైతం దేశంలో పలు ప్రాంతాల్లో విరివిగా వినియోగిస్తుండటంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయంది. తలసరి క్రిమిసంహారకాల వినియోగంలోనూ తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉండటం గమనార్హం. పరిష్కారం ఇదే.. బహిరంగ మార్కెట్లు, సంతల్లో కొనుగోలు చేసిన కూరగాయలను ఉప్పునీళ్లతో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆయా కూరగాయలు, ఆకుకూరలను బాగా ఉడికించి తినాలి. -
వాటి ధరలు మారిస్తే..లక్షల ప్రాణాలు మిగులుతాయి..
ఆరోగ్యంగా ఉండాలంటే... కాయగూరలు, పండ్లు బాగా తినాలని డాక్టర్లు చెబుతారు. పేదలకు ఇది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో కనీసం ఏడు రకాల ఆహార పదార్థాల ధరలు తగ్గించగలిగితే.. గుండెపోటు, మధుమేహం, గుండెజబ్బుల కారణంగా సంభవించే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చునని అంటున్నారు టఫ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. తాజా అధ్యయనం ప్రకారం... గింజధాన్యాలు, కాయగూరలు, పండ్లు, నట్స్, విత్తనాల వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు.. ప్రాసెస్ చేసిన మాంస ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్ వంటి అనారోగ్య కారక పదార్థాల ధరల్లో పదిశాతం హెచ్చు తగ్గులు చేస్తే ఒక్క అమెరికాలోనే గుండె సంబంధిత జబ్బులతో వచ్చే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. ధరల్లో మార్పులు 30 శాతం వరకూ ఉంటే, అంటే.. అనారోగ్య కారక ఆహార పదార్థాలపై ఎక్కువ పన్నులు వేసి ధరలు పెంచితే.. ఈ సంఖ్య మరింత తగ్గుతుందని టఫ్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు లెక్కకట్టారు. కాయగూరలు, పండ్లు వంటి హెల్దీఫుడ్ తీసుకో(లే)కపోవడానికి ఉన్న కారణాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. యాంటీబయాటిక్స్తోనే క్యాన్సర్‌కు చికిత్స? చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికారని సామెత. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి చికిత్స విషయంలోనూ ఇలాగే జరిగిందని అనిపిస్తుంది ఈ విషయం తెలిస్తే... మన నోటిలో ఉండే ఓ బ్యాక్టీరియాకు క్యాన్సర్ కణాలను చంపేసే సామర్థ్యం ఉన్నట్లు బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఫూసో బ్యాక్టీరియాను యాంటీబయాటిక్ మందులతో నియంత్రించినప్పుడు క్యాన్సర్ కణుతులు చాలా నెమ్మదిగా పెరగడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనల ద్వారా క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స అందించే వీలు ఏర్పడుతుందని భావిస్తున్నారు. క్యాన్సర్ కణాల్లో బ్యాక్టీరియా ఉండటం కొత్త కాకపోయినప్పటికీ నోటిలో ఉండే ఫూసో బ్యాక్టీరియా పేగు, కాలేయాలకూ విస్తరించడం మాత్రం శాస్త్రవేత్తల్లో కుతూహలాన్ని పెంచింది. ఆరేళ్ల క్రితం తొలిసారి పేగు క్యాన్సర్ కణుతుల్లో వీటిని గుర్తించారు. తాజాగా దాదాపు సగం మంది రోగుల్లో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు స్పష్టమైంది. ఈనేపథ్యంలో ఎలుకలపై కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. నోటిలోని బ్యాక్టీరియాను నియంత్రించేందుకు వినియోగించే రెండు రకాల మందులను ఉపయోగించి చూసినప్పుడు... మెట్రోనిడాజోల్ అందించిన ఎలుకల్లో క్యాన్సర్ కణుతులు చాలా నెమ్మదిగా పెరిగితే... ఎరిత్రోమైసిన్ అందించిన ఎలుకల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీన్ని బట్టి యాంటీబయాటిక్స్తోనే క్యాన్సర్ విస్తరణ వేగాన్ని నెమ్మదిందప చేయవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశోధన వివరాలు సైన్స్ సైంటిఫిక్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. వానపాములు అక్కడా పెరుగుతాయి! భూమి మీద బతికే పరిస్థితులు లేకపోతే దగ్గరున్న అంగారకుyì పైకి ఎగిరిపోవాలని మనిషి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వాగెనిగెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ సానుకూల వార్తను మోసుకొచ్చారు. వాతావరణం దాదాపుగా లేని అరుణగ్రహపు మట్టిలోనూ వానపాములు మనగలగవని... పునరుత్పత్తి సాధించగలవని వీరు నిరూపించారు. మట్టిని సారవంతం చేయడం... తద్వారా పంటలు పండించేందుకు వానపాములు ఉపయోగపడతాయన్నది తెలిసిందే. అంగారకుడిపై ఉండే ధూళి చాలా పొడిగా ఉంటుంది. సేంద్రియ పదార్థాలేవీ ఉండవు కాబట్టి.. దాన్ని మట్టి అనేందుకు కూడా శాస్త్రవేత్తలు ఇష్టపడరు. ఆ గ్రహంపై మనిషి బతకాలంటే ఆహారం కోసం పంటలు పండించుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆ మట్టిలో వానపాములు బతుకుతాయా? లేదా? అన్నది పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. క్యూరియాసిటీ రోవర్ పంపిన అక్కడి మట్టి వివరాలను పరిశీలించినప్పుడు హవాయి ప్రాంతంలోని అగ్నిపర్వతం పరిసరాల్లో ఉండే మట్టి దాదాపు ఇలాగే ఉన్నట్లు తెలిసింది. ఆ మట్టికి పంది వ్యర్థాలను కలిపి వానపాములను కూడా చేర్చారు. అచ్చం భూమిపై మాదిరిగానే వానపాములు ఆ మట్టినీ గుల్లగా మార్చి.. నీరు లోతులకు చేరేలా చేశాయి. ఈ ప్రయోగాల ఆధారంగా భవిష్యత్తులో అంగారకుడిపై మట్టిపై వ్యర్థాలు, వానపాముల ఆధారంగా పంటలు పండించడం సాధ్యమే అన్న అంచనాలు బలపడ్డాయి. -
తెలంగాణ ఫుడ్స్‌లో సమ్మె నిషేధం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఫుడ్స్‌లో సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. నిత్యావసర సేవల కేటగిరీలో భాగంగా హైదరాబాద్‌లోని ఐడీఏ నాచారంలో ఉన్న తెలంగాణ ఫుడ్స్ సంస్థలో సమ్మెను ఆర్నెల్లపాటు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. -
హెరిటేజ్ ఫుడ్స్‌తో బ్యాంక్ ఆఫ్ బరోడా అవగాహన
-
రోబోలు ప్రపంచాన్ని శాసిస్తాయా?
కార్టలన్ః యాంత్రీకరణ పలు రకాల ఉద్యోగాలు అంతర్థానమయ్యేలా చేస్తోంది. వీటి ప్రభావం ఉపాధిని భారీగా దెబ్బతీస్తోంది. కంప్యూటరరీకరణ వల్ల ఉపాధి శాతం ఇప్పటికే తగ్గిపోగా.. ఆధునిక రోబోట్లు ఆ సమస్యను మరింత జఠిలం చేస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదే కొనసాగితే వచ్చే 20 ఏళ్ళలో ప్రపంచమే రోబోట్ లా మారిపోతుందేమోనన్న ఆందోళనా వ్యక్తమౌతోంది. ఇటీవల ఓ ఫుడ్ కంపెనీలో పనికోసం ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల బ్రిటన్ బార్న్ స్లే లోని కారల్టన్.. ప్రిమియర్ ఫుడ్ ఫ్యాక్టరీలో కొత్తగా ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో.. అనేకమంది కార్మికుల ఉపాధిని కొల్లగొట్టింది. ఆ సరికొత్త యంత్రం.. వందలకొద్దీ మిస్టర్ క్లిప్పింగ్ కేక్ లను సునాయాసంగా బాక్స్ లలో పెట్టి ప్యాక్ చేసేస్తోంది. ఇక్కడ ఈ యంత్రానికి సంబంధించిన అన్ని పనులు ఆపరేషన్ప్ మేనేజర్ డారన్ రైనే చూసుకుంటాడు. పని సరిగా చేయడం లేదు, ప్యాకింగ్ సరిగా లేదు అంటూ కార్మికులపై అరవాల్సిన పని ఇప్పుడతడికి లేదు. పనికోసం అధికశాతం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అనేక చేతులున్న మనుషుల్లాగా పనిచేసే ఆరోబో... ఎంతోమంది కార్మికులు చేయాల్సిన పనిని స్వయంగా చేసేస్తోంది. ప్రిమియర్ ఫుడ్స్ ఫ్యాక్టరీ కొత్తగా ప్రవేశపెట్టిన డజన్లకొద్దీ చేతులున్న ఆ యంత్రం.. సుమారు వెయ్యి కేక్ ముక్కలను కేవలం ఒక్క నిమిషంలోనే ప్యాక్ చేసేస్తుంది. రోబోకి ఏర్పాటు చేసిన కళ్ళు.. కేక్ ఆకారాన్ని గుర్తుపట్టగల్గుతాయి. దీంతో ట్రేలో సర్దుకునే ముందే వాటిలో లోపాలను గుర్తించి, ఏమాత్రం తేడా కనిపించినా వాటిని పక్కకు నెట్టేస్తుంది. ఈ మిషన్ తో కేవలం ఒక్క నిమిషంలో 1000 వరకూ కేక్ లు ప్యాక్ అయిపోవడం చూసినవారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోబోకు ఏర్పాటు చేసిన చేతులు అతి వేగంగా ఒక్కో ముక్కను ఎంచుకోవడం, ట్రేలో పెట్టి నిమిషాల్లో ప్యాక్ చేసేయడం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ కార్మికులు కేవలం మిషన్ ను ఆపరేట్ చేయడానికి, క్లీన్ చేయడానికి మాత్రమే అవసరం అవుతారు. దీంతోపాటు రోబో తీసుకోకుండా వదిలేసిన ముక్కలు, ప్లాస్టిక్ పేపర్లను తొలగించి ఫ్యాక్టరీ ఉద్యోగుల షాప్ కు తరలిస్తారు. బ్రిటన్ ఫ్యాక్టరీల్లో ఈ ఆటోమేషన్ ఉపయోగం ఇటీవల చాలా మామూలైపోయింది.ఇటువంటి అత్యాధునిక రోబోలు నిజంగా అద్భుతమే అనిపించినప్పటికీ, ఇక్కడ కార్మిక శక్తి తగ్గిపోవడం, ఉపాధి మార్గాలు కరువవ్వడం మాత్రం కొంత నిరాశను కలిగిస్తుంది. చివరికి మనుషులు.. ఫ్యాక్టరీల్లో చెత్తను క్లీన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతారా అన్న అనుమానం వ్యక్తమౌతుంది. -
విష వంటకాలతో వివాహ విందు
బైలైన్ వివాహ వ్యసవ్థ ప్రవర్థిల్లుతుండటానికి కారణం అద్భుతమైన విడాకుల చట్టాలుండటమేనని బెర్నార్డ్ షా అన్నాడు. ఇంగ్లిష్‌లో షేక్స్పియర్ తర్వాత చక్కటి నాటక రచయితైన షా మన దేశంలో బ్రిటిష్‌వాళ్లు బహదూర్ షా జఫర్‌ను కూలదోయాడానికి ఒక ఏడాది ముందు, 1856లో జన్మించాడు. మనం స్వాతంత్య్రం సాధించుకున్న తర్వాత మూడేళ్లకు 1950లో మరణించాడు. ఆయన చెప్పిన నానుడి 2015 బిహార్ ఎన్నికలకు సరిగ్గా సరిపోతుందంటే ఆయనైతే పగలబడి నవ్వి ఉండేవాడే. షాలోని ఆ ఉద్వేగం అణుచుకోశక్య మైనది కాదు. అలా అని ఆయన ఎన్నడూ బాధ్యతారహితంగానూ ఉండేవాడు కాదు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌ల పెళ్లి అనేక లక్ష్యాలకు గురిపెట్టినది. కొన్ని పెళ్లిళ్లకు వివాహపూర్వ విడాకుల ఒప్పందం నిబంధన ఉండటమూ అవసరమమేననే షా తరహా సూక్తిని అది ధృవీకరిస్తుంది. ఏమాట కామాటే చెప్పాలి, లాలూ ఎలాంటి భ్రమలకు లోనుకాలేదు. బాధితునికి ఉండాల్సిన ఉద్వేగ మంతటితో ఆయన పెళ్లి విందులో తాను ఆరగించింది విషమంటూ మెల్లగా చెప్పి, పెళ్లి సంబరాలను చప్పగా చల్లార్చారు. నితీష్ రాజకీయాల్లో పూసల్లో దారంలా కనిపించే సారాన్ని గ్రహించగలిగితే ఈ సమస్య మరీ అంత సంక్లిష్టమైనదేమీ కాదు. పెళ్లి ఊరే గింపు ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనేదానిపై పట్టింపేమీ లేదు. కాకపోతే పెళ్లి కొడుకు మాత్రం నితీష్ కుమారే కావాలి లేదా అసలు పెళ్లే లేదు. రాజకీయాల్లో అలాంటి వాదన మనగలగాలంటే క్షేత్రస్థాయి వాస్తవికత అందుకు దోహదం చేసి తీరాలి. సంక్షిప్తంగా ప్రస్తుత బిహార్ చిత్తరువు ఇది: నితీష్ పార్టీ లేని నేత. ఇక లాలూ పార్టీ, గడ్డి కుంభకోణంలోని ఆయనకు పడ్డ శిక్ష పుణ్యమాని నాయకుడు లేని పార్టీ. ఆచరణాత్మక పరి భాషలో చెప్పాలంటే వారి మధ్య ఒప్పందం ఇది: ఓట్లు సంపాదించడం అనే భారీ బరువును మోయడం లాలూ చేయాల్సి ఉంటుంది. కాగా అత్యున్నత పదవి అనే ఊరించే పండును మాత్రం నితీష్ కుమార్ తీసుకుంటారు. అందుకే నితీష్ కుమార్ అనే పెళ్లికొడుకు ఎప్పుడూ ఎక్కడానికి ఎవరి గుర్రం దొరుకుతుందా అని తెగ అన్వేషిస్తుంటారు. ఒంటరిగా, ఆయన ఎక్కడికీ పోలేరు. ఒక దశాబ్దిన్నర పాటూ ఆయన బీజేపీని తన గుర్రంగా వాడుకున్నారు. దాన్నుంచి కలిగే మేలునంతా రాబట్టుకోవడం బాగానే చేశారు. పాట్నాలో ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన ఢిల్లీలో ఒక ముఖ్య క్యాబినెట్ మంత్రి పదవిని అనుభవించారు. 2013లో లెక్కలు తప్పుగా వేసి 2014 ఎన్నికల తర్వాత తాను ప్రధానమంత్రి కావచ్చని ఆయన భావించారు. తప్పు చేస్తున్నాననే చింత రవ్వంతైనా లేకుండా ఆయన బీజేపీతో హఠాత్తుగా తెగదెంపులు చేసుకున్నారు. బీజేపీని వదిలిపెట్టేయ డానికి నితీష్‌కు పదిహేనేళ్లు పడితే, ఆయన తనను వదిలేయడానికి కేవలం 15 రోజులు చాలని లాలూ ప్రసాద్ యాదవ్‌కు తెలుసు. వాడుకున్నాక తనను తిట్టిపోయడం ఆయన కళ్లకు కనబడుతూనే ఉంది. సుదీర్ఘమైన క్రీడ ఇప్పటికే మొదలైంది. ఇద్దరు ‘‘భాగస్వాములు’’ సీట్ల పంపకంలో తమ ఎమ్మెల్యే అభ్య ర్థుల వాటాను సాధ్యమైనంత ఎక్కువ చేసుకోవడం ద్వారా తమ ప్రయోజ నాలను పరిరక్షించుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. వర్షాకాలపు అడవుల్లోని పొదల్లాంటి తెలివైన చిన్న కథనాలను నాటారు. వాటిలోకెల్లా అత్యంత భావనాత్మకమైన కథనం మాత్రం.. గాలిపోయిన కాంగ్రెస్ కూడా తమ కూటమిలో భాగస్వామి కావాలని ఆశిస్తున్న నితీష్ శిబిరం నుంచి వెలువడింది. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణలు కాంగ్రెస్‌కు రెండు నుంచి ఐదు సీట్లు దక్కవచ్చని భావిస్తున్నాయి. కానీ ఆ పార్టీ దాదాపు 60 వరకు సీట్లలో పోటీ చేయాలని అనుకుంటోంది. దానికివ్వడానికి ఆ సీట్లు ఎక్కడ నుంచి లభిస్తాయి? అవి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న స్థానాలేనని నితీశ్ శిబిరానికి చెందిన కథకుల అభిప్రాయం. చాలా తెలివైన కథనమే. గత శాసనసభ ఎన్నికల్లో నితీష్ బీజేపీకి మిత్రు డు. మరోవిధంగా చెప్పాలంటే ఐదేళ్ల క్రితం తాను గెలుచుకున్న స్థానాల్లో ఏ ఒక్కదాన్నీ ఆయన వదులుకోవడానికీ సిద్ధంగా లేరు. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రెండో స్థానంలో నిలిచిన సీట్లు నిజానికే దానికే దక్కాలి. వాటిని కాంగ్రెస్‌కు వదిలేసే విషయంలో ఆయన మహా ఉదారంగా ఉన్నారు. అనుభవజ్ఞుడైన ఆ యాదవ నేత మూర్ఖుడేమీ కాదనేది స్పష్టమే. ఈ వంటకమంతే నమ్మశక్యంకాని మరో కథనం ప్రకారం ఈ కూటమి మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది రాహుల్‌గాంధీ అని. వారి ప్రయోజనాలకు ఫలానాది మంచి అని రాహుల్ ఇచ్చే ఆదేశాలను లాలూ, నితీష్లకు పాటిస్తారని నమ్మేది బ్రెయిన్ డెడ్ అయిన వారు మాత్రమే. ఇలాంటి మీడియా వ్యవసా యాన్ని ఎన్నికల సమయం నాటి మీడియా కోర్సుకు సమానమై నదని నా ప్రతిపాదన. మొదట చెప్పిన భాష్యం పాత తప్పునే పునరావృతం చేసింది. ఎన్నికలంటే అంకగణితం కాదు. హాస్యాస్పదమైన కొన్ని లెక్కలు వేస్తున్నారు: జనాభాపరమైన కూడికల ప్రాతి పది కపై ఈ సంఖ్యకు ఆ సంఖ్యను కలపండి, లేదా ఇంత సంఖ్యను ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి, సత్వరం! అది అంత సరళ మే అయితే ఎన్నికల కమిషన్ ఓటర్లను కాక గణాంక శాస్త్రవేత్తల ను సంప్రదిస్తుంది. ప్రతి ఎన్నికలు నూతన వాస్తవాల ప్రాతి పదికపైనే జరుగుతాయి. అంతకుమించి కుల విధేయతకు అతీ తంగా ఓటు చేసే వారి శాతం, ప్రత్యేకించి యువతలో పెరుగు తోంది. వారి నిర్ణయమే అంతిమ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. సుపరిపాలనకు ముందు షరతైన స్థిరమైన ప్రభుతాన్ని ఎవరు అందిం చగలుగుతారు? అనే అత్యంత మౌలిక ప్రశ్నపైనే వచ్చే బిహార్ ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. దీర్ఘకాలికమైన అస్థిరతకు బిహార్ భారీ మూల్యాన్నే చెల్లించింది. లాలూ యాదవ్‌కు సుస్థిరమైన ప్రజాతీర్పే లభించింది. కానీ ఆయన పరిపాలనను అందించలేకపోయారు. నితీష్ కూల్చే వరకు బీజేపీ, నితీష్‌కుమార్ కూటమి బిహార్‌కు సుస్థిర పాలనను అందించింది. బిహార్ రాజకీయ చిత్రపటం ఎన్నో ఎగుడుదిగుడులను చూసింది. జాతీ య నాయకునిగా నరేంద్రమోదీ ఆవిర్భావం, నితీష్ కుమార్ ఊపిరి ఎగ బోస్తూ, ఎంతో చిత్ర హింసననుభవిస్తూ బద్ధశత్రువైన లాలూ ప్రసాద్‌తో కల వడాన్ని, నితీష్, జీతన్‌రాం మాంజీని గద్దెనెక్కించడం, దించడాన్ని కాంచింది. లాలూ సీఎం ఆశలకు దూరం కావడం, తత్పర్యవసానంగా తన కుటుంబంలోని తర్వాతి తరానికి అధికారాన్ని బదలాయించడం వంటి మార్పులను గమనించింది. ఎన్నో గణనీయమైన ఈ ఎగుడుదిగుడుల తదుపరి ఇవి మొట్టమొదటి ఎన్నికలు కాబోతున్నాయి. అనూహ్యమైన అంశాలు ప్రజాస్వామ్యాన్ని అద్భుతమైన ఉత్కంఠభరితమైన ప్రక్రియను చేస్తాయి. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
మెదడుకు మేత...
మెదడుకు మేత అనగానే బ్రెయిన్‌ను చురుగ్గా ఉంచేందుకు గళ్ల నుడికట్లూ, ప్రహేళికలూ అని అనుకోవద్దు. ఇది నోటి ద్వారా తీసుకునే ఆహారమే. కాకపోతే ఏ ఆహారపదార్థాలు మెదడును మందకొడిగా లేకుండా చేస్తాయో, ఏవి చురుగ్గా ఆలోచించేలా చూస్తాయో, ఏవి ఒక వయసు దాటాక మనిషిలో పెరిగే మతిమరపు లాంటి మెదడుకు సంబంధించిన రుగ్మతలను మరింత ఆలస్యం అయ్యేలా దూరంగా నెడతాయో ఆ ఆహారం అన్నమాట. ఆ ఆహారపదార్థాలను గురించి తెలుసుకుంటే ముందునుంచీ వాటిని తీసుకుంటూ వృద్ధాప్యంలో మెదడుకు వచ్చే అనేక సమస్యల నుంచి దాన్ని దూరంగా ఉంచవచ్చు. ఆ అవగాహన కోసమే ఈ కథనం. మీకు తెలుసా... మన మొత్తం శరీర బరువులో మెదడు బరువు కేవలం 2 శాతమే. కానీ గుండె నుంచి పంప్ అయిన రక్తంలో 15 శాతం దానికి విధిగా వెళ్లాల్సిందే! మనం పీల్చే ఆక్సిజన్‌లో 20 శాతం అది స్వీకరించాల్సిందే. అంతేకాదు... మనకోసం తయారయ్యే శక్తిలో ఐదోవంతు అది వినియోగించాల్సిందే. తాను సక్రమంగా పనిచేయాలంటే అవసరమైన భాగమది! పంపకాల్లో ఎక్కువమొత్తాన్ని ‘సింహభాగం’ అంటుంటారు కదా... అలాగే శరీరంలో ఏయే భాగాలు ఎంతెంత తీసుకుంటాయన్న ప్రాతిపదికన దీన్ని ‘మేధభాగం’ అనవచ్చు. ఆరోగ్యకరమైన వ్యక్తి మొత్తం బరువు 60 నుంచి 70 కిలోలు అనుకుంటే, అందులో మెదడు బరువు కేవలం 1400 గ్రాములు. అయినప్పటికీ, మెదడు ఇంత పెద్దమొత్తంలో ఆక్సిజన్, రక్తం, శక్తి ఎందుకు తీసుకుంటుంది? ఎందుకంటే... బరువు ప్రకారం చూస్తే ఇంత చిన్నదైనప్పటికీ, తాను నిర్వహించే విధుల ప్రకారం చూస్తే మాత్రం మన ప్రతి కదలికా, మన ప్రతి ఆలోచనా, మన ప్రతి పనీ లెక్కప్రకారం అన్నీ దానివే! అందుకే మన ఆహారంలో అంతటి భాగాన్ని అది డిమాండ్ చేస్తుంది. అలాంటి మెదడు చురుగ్గా ఉండటానికి, పదికాలాలపాటు హాయిగా పనిచేయడానికి, దీర్ఘకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేమిటో తెలుసుకుందాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ : మెదడు చురుగ్గా సక్రమంగా పనిచేస్తూ దాని పనిలో సునిశితత్వం, వేగం ఉండాలంటే తొలుత దానికి శక్తినిచ్చే గ్లూకోజ్ సరిగా అందాలి. అంటే గ్లూకోజ్ దానికి తొలి ఇంధనం అన్నమాట. అయితే మనం వాడే పెట్రోల్‌లో కలుషిత పదార్థాలుంటే అది మళ్లీ వాహనం పై ప్రభావం చూపినట్లే... దానికి అందే ఫ్యూయల్లోనూ వీలైనంత తక్కువ కాలుష్యాలు ఉండి, ఎక్కువ ప్యూర్‌గా ఉండాలి. అందుకోసం మనం తీసుకోవాల్సిన ఆహారపదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇవి మనకు పొట్టుతీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదాహరణకు దంపుడుబియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు వంటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లలో మనం తీసుకోదగ్గ వాటిలో ప్రధానమైనవి. పాస్తా వంటివీ ఇందులో భాగంగా పేర్కొనదగినప్పటికీ మన ప్రాంతంలో వాటివాడకం పెద్దగా ఉండదు. పొట్టుతీయకపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే... పొట్టుతీసిన ఆహారం నుంచి వచ్చిన గ్లూకోజ్ తక్షణం వినియోగితమైపోతుంది. ఆ తర్వాత మళ్లీ గ్లూకోజ్ అవసరమవుతుంది. కానీ పొట్టుతీయని ఆహారం ద్వారా అందిన గ్లూకోజ్ ఒక క్రమమైన పద్ధతిలో దీర్ఘకాలం పాటు మెదడుకు అందుతూ ఉంటుంది. ఇక తీపి ఎక్కువగా ఉండే పదార్థాలు, చక్కెరతో చేసిన మిఠాయిల నుంచి కూడా గ్లూకోజ్ అందుతుంది. కానీ అది మెదడుకు అందాల్సిన ఆరోగ్యకరమైన గ్లూకోజ్ రూపంలో మాత్రం కాదు. అందుకే దాన్ని కేవలం మన రుచి కోసమే తప్ప... మెదడు కోసం కాదని గుర్తుంచుకోవాలి. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ (అత్యవసరమైన కొవ్వులు) : కొవ్వులు పరిమిత మోతాదుకు మించితే ఒంటికీ, ఆరోగ్యానికీ మంచిది కాదన్న విషయం తెలిసిందే. మెదడు చురుగ్గా పనిచేయడానికి మాత్రం పరిమిత స్థాయిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కావాల్సిందే. అందుకే మెదడుకు అవసరమైన కొవ్వులను ‘ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్’ అంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... సాంకేతికంగా చూస్తే మెదడు కణాలన్నీ ‘కొవ్వు’పదార్థాలే! మెదడు బరువులో 60 శాతం పూర్తిగా కొవ్వే. ఇక మిగతా దానిలోనూ మరో 20 శాతం ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్‌ను శరీరం తయారుచేసుకోలేదు. కాబట్టి వాటిని విధిగా ఆహారం నుంచి స్వీకరించాల్సిందే. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి వాటితో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అనుకోవచ్చు. అవి మనకు మాంసాహారం (ప్రధానంగా కోడి మాంసం), గుడ్లు, చేపలు, నట్స్, అవిసెనూనె నుంచి లభ్యమవుతాయి. ఏ కొవ్వులు మంచివి కావంటే... మెదడు సక్రమంగా, చురుగ్గా పనిచేయడానికి కొవ్వులు కావలసినా, మళ్లీ అన్ని కొవ్వులూ మెదడుకు మంచిది కాదు. కొన్ని కొవ్వులు దాన్ని మందకొడిగా చేస్తాయి. సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే ట్రాన్స్‌ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజనేటెడ్ కొవ్వులు మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన (పైన పేర్కొన్న) మంచి కొవ్వులను (అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్‌ను) అడ్డుకుంటాయి. ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ కృత్రిమంగా తయారుచేసే డాల్డావంటి పదార్థాలలో ఉంటాయి. వీటిద్వారా తయారుచేసే కేక్‌లు, బిస్కెట్లు మెదడును చురుగ్గా ఉంచలేవు. కాబట్టి మనం కొనే పదార్థాలపై ఉండే పదార్థాల జాబితా (ఇన్‌గ్రెడియెంట్స్ లిస్ట్)ను పరిశీలిస్తే అందులో హైడ్రేజనేటెడ్ ఫ్యాట్స్/ఆయిల్స్ ఉంటే వాటిని కేవలం రుచికోసం పరిమితంగానే తీసుకోవాలన్నమాట. అమైనో ఆసిడ్స్: మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే వాటిని న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఇదెంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తున్నట్లు లెక్క. ఇందుకు దోహదపడేవే ‘అమైనోఆసిడ్స్’. ఈ అమైనో ఆసిడ్స్ అన్నవి ప్రోటీన్స్ నుంచి లభ్యమవుతాయి. ఇక ఈ న్యూరోట్రాన్స్మిటర్స్ పైనే మన ధోరణులు (మూడ్స్) కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు నిద్ర బాగా పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టొఫాన్ అనే అమైనో ఆసిడ్ అవసరం. ఈ ట్రిప్టొఫాన్ పాలలో పుష్కలంగా ఉంటుంది. అందుకే మంచినిద్రపట్టాలంటే నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలు తాగాలని సలహా ఇస్తుంటారు డాక్టర్లు. దీనితో పాటు ‘ఓట్స్’లో కూడా ట్రిప్టొఫాన్ ఎక్కువ. విటమిన్లు / మినరల్స్ (ఖనిజాలు): మన మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజాలు. ఇవి అమైనోఆసిడ్స్ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మార్చడంలోనూ విశేషంగా తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి బీకాంప్లెక్స్‌లోని బి1, బి6, బి12 ప్రధానంగా అవసరమవుతాయి. ఇవి ప్రధానంగా తాజా కూరగాయల్లో, ఆకుపచ్చని ఆకుకూరల్లో, పాలలో పుష్కలంగా ఉంటాయి. అయితే వీటన్నింటిలోనూ మెదడు చురుకుదనానికి దోహదం చేసే బి12 మాంసాహారంలోనే ఎక్కువ. స్ట్రిక్ట్ వెజిటేరియన్స్‌లోనూ, ఎండకు సోకని వారిలో విటమిన్ ‘డి’, బి12 .. ఈ రెండింటి లోపం వల్ల మెదడు, నరాలు, కండరాలు అంత చురుగ్గా పనిచేయవు. ఇటీవల ఈ కండిషన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటివారు విధిగా విటమిన్ డి తోపాటు విటమిన్ బి12 పాళ్లను పెంచే సప్లిమెంట్లను బయటి నుంచి తీసుకోవాలి. నీళ్లు: మెదడులోని ఘనపదార్థమంతా కొవ్వులే అయితే... మొత్తం మెదడును తీసుకుంటే అందులో ఉండేది 80 శాతం నీళ్లే. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. మీకు తెలుసా...? మనం మన మూత్రం ద్వారా, ఉచ్ఛాస్వనిశ్వాసల ద్వారా ఒక రోజులో కనీసం 1.5 నుంచి 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తుంటాం. నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం అవసరం. దీనికోసం అంత నీటినీ తీసుకోవాలి. ఇక ఎంతగా తక్కువ మోతాదులో నీళ్లు తీసుకునే వారైనా కనీసం 1.5 లీటర్లను తీసుకోవాలి. మిగతాది మనం తీసుకునే ఘనాహారంలోంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటి నుంచి భర్తీ అవుతుంది. ఒకరు తాము రోజువారీ తీసుకునే నీళ్లు 1.5 లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం ఎంతోకొంత తగ్గుతుందని గుర్తుంచుకోండి. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది మీ మూడ్స్‌పై కూడా ప్రభావం చూపుతుందని తెలుసుకోండి. అందుకే రోజూ 6-8 గ్లాసుల నీళ్లతో పాటు... పాలు, మజ్జిగ, పండ్లరసాలు, రాగి జావ వంటివి మెదడును చురుగ్గా ఉంచే ద్రవాహారాలని గుర్తుపెట్టుకోండి. ఇక టీ, కాఫీ అనే ద్రవాహారం చాలా పరిమితంగా (రోజుకు రెండు కప్పులు) ఉంటే పరవాలేదు. అంతకు మించితే అది మెదడును తొలుత చురుగ్గా చేసినా, వేగంగా అలసిపోయేలా చేస్తుంది. చక్కెర కలిపిన పానీయాలతోనూ అదే జరుగుతుంది. పై జాగ్రత్తలతో ఆహారం తీసుకుంటే మెదడు కలకాలం చురుగ్గా పనిచేస్తుంది. -నిర్వహణ: యాసీన్ మేలు చేసే ఆహారాలు మీ మెదడు చురుగ్గా పనిచేయాలనుకుంటే ఈ కిందివి మీరు తినేవాటిల్లో ఉండేలా చూసుకోండి. చేపల్లో : పండు చేప / పండు గప్ప, వంజరం, కనగర్తలు (మాకరెల్) ... వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ. నూనెల్లో : ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వులను అరికడుతుంది. కాబట్టి మెదడుకు వచ్చే పక్షవాతం, అల్జైమర్స్ వ్యాధులను నివారిస్తుంది. నట్స్: అక్రోట్ (వాల్నట్) మెదడుకు చాలా మేలు. ఇది అచ్చం మెదడు ఆకృతిలో ఉండటం ఒక విశేషం. పండ్లలో: మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీలు మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మంచివి. ఆకుకూరలు, కూరగాయల్లో : పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచి, అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. డార్క్చాకొలెట్ (కోకో), గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి. హాని చేసే ఆహారాలు నిల్వ ఉంచిన ఉప్పటి పదార్థాలైన చిప్స్, టిన్డ్ సూప్స్ మెదడుకు హానికరంగా పరిణమిస్తాయి. కాబట్టి వాటిని పరిమితంగా తీసుకోవాలి. ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యంతో పాటు మెదడుకూ కీడే. ద్రవాహారాల్లో : కోలా డ్రింక్స్, తీపి ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్, అన్నిరకాల శీతల పానీయాలు త్వరితంగా శక్తినిచ్చినా, మెదడును అలిసిపోయేలా చేసి ఆ తర్వాత చాలాసేపు మందకొడిగా మారుస్తాయి. కొవ్వుల్లో డాల్డా, మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. మాంసాహారం తినేవారు కొవ్వు తక్కువగా ఉండే స్కిన్లెస్ చికెన్, చేపలే తీసుకోవాలి. బటర్, క్రీమ్ కూడా పరిమితంగా వాడాలి. ఆల్కహాల్ మెదడుకు హాని చేస్తుంది. ఇది తీసుకున్నప్పుడు తక్షణ ప్రభావంగా మెదడును చురుగ్గా ఉన్నట్లు చేసినా... దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరపు) వంటి మెదడు సమస్యలకు దోహదం చేస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మానేయాలి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి చీఫ్ న్యూరో ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.