ఓటీటీ స్నాక్స్‌ ట్రెండింగ్‌..! | Snack brand 4700BC collaborates with Netflix | Sakshi
Sakshi News home page

ఓటీటీ స్నాక్స్‌ ట్రెండింగ్‌..!

Published Wed, Oct 9 2024 12:49 AM | Last Updated on Wed, Oct 9 2024 8:03 AM

Snack brand 4700BC collaborates with Netflix

ఆన్‌లైన్‌లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు పెరుగుతున్న క్రేజ్‌ 

స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో ఫుడ్‌ బ్రాండ్స్‌ జట్టు 

పాప్‌కార్న్‌ నుంచి ఐస్‌క్రీమ్‌ వరకూ కో–బ్రాండెడ్‌ ప్యాక్‌లు.. 

క్విక్, ఈ–కామర్స్, రిటైల్‌ స్టోర్స్‌లోనూ లభ్యం

జెన్‌ జెడ్, యువ కస్టమర్లే టార్గెట్‌...

థియేటర్లో నచ్చిన స్నాక్స్‌ తింటూ ఫేవరెట్‌ మూవీని ఎంజాయ్‌ చేయడం కామన్‌! ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని కోరుకున్న కంటెంట్‌ కుప్పలుతెప్పలుగా దొరుకుతుండటంతో వినోదం ఇంట్లోనే మూడు సినిమాలు ఆరు వెబ్‌ సిరీస్‌లుగా వెలిగిపోతోంది. యువతరానికి ముఖ్యంగా జెన్‌ జెడ్‌కు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు బాగా కనెక్ట్‌ కావడంతో ఫుడ్, స్నాక్స్‌ బ్రాండ్లు దీన్ని ఒక సరికొత్త వ్యాపారావకాశంగా మార్చుకుంటున్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ–హాట్‌స్టార్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, జీ5 తదితర ఓటీటీ దిగ్గజాలతో జట్టుకట్టి సరికొత్త కో–బ్రాండెడ్‌ ప్యాక్‌లతో పాప్‌కార్న్‌ నుంచి ఐస్‌క్రీమ్‌ వరకూ అన్నింటినీ ప్రత్యేకంగా చేతికందిస్తున్నాయి.

ఓటీటీ స్ట్రీమింగ్‌ దుమ్మురేపుతుండటంతో స్నాక్స్, పుడ్‌ బ్రాండ్స్‌ దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా ప్రీమియం పాప్‌కార్న్‌ బ్రాండ్‌ 4700బీసీ ప్రత్యేకంగా ఓటీటీ యూజర్ల కోసం కో–బ్రాండెడ్‌ ప్యాక్‌లను ప్రవేశపెట్టేందుకు నెట్‌ఫ్లిక్స్‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని ఈ–కామర్స్, క్విక్‌ కామర్స్‌తో పాటు రిటైల్‌ స్టోర్లలోనూ అందుబాటులోకి తెస్తోంది. ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మునిగితేలే జెన్‌ జెడ్‌ కుర్రకారును టార్గెట్‌ చేసేందుకు ఇది సరైన మార్గం’ అని 4700బీసీ ఫౌండర్, సీఈవో చిరాగ్‌ గుప్తా చెబుతున్నారు. ఇదొక్కటేకాదు కిట్‌క్యాట్, కారి్నటోస్, ప్రింగిల్స్, కోకాకోలా, ఓరియో, థమ్సప్‌తో పాటు సఫోలా మసాలా ఓట్స్‌ తదితర స్నాక్స్‌ బ్రాండ్స్‌ సైతం సేల్స్‌ పెంచుకోవడం కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో జట్టుకట్టిన వాటిలో ఉన్నాయి.

అల్టీమేట్‌ ‘బ్రేక్‌’.. 
వినోదంతో పాటు రుచికరమైన మంచింగ్‌ కూడా ఉంటే ‘ఆహా’ అదిరిపోతుంది కదూ! అందుకే నెస్లే తన కిట్‌ క్యాట్‌ చాక్లెట్లను ఓటీటీ యూజర్ల చెంతకు చేర్చేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ‘సబ్‌స్క్రిప్షన్‌’ తీసుకుంది. ‘అల్టీ మేట్‌ బ్రేక్‌’ పేరుతో కో–బ్రాండెడ్‌ ప్రచారానికి తెరతీసింది. తద్వారా ప్రత్యేక ఓటీటీ కిట్‌క్యాట్‌ ప్యాక్‌లను విడుదల చేయడంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌ షోలు.. స్క్విడ్‌ గేమ్, కోటా ఫ్యాక్టరీతో జతకట్టింది. గిఫ్టింగ్‌ సంస్థ అల్యూరింగ్‌ బాస్కెట్‌ అయితే ప్రింగిల్స్, కిట్‌క్యాట్, కోకాకోలాతో కూడిన బండిల్డ్‌ ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ’నెట్‌ఫ్లిక్స్‌ – చిల్‌’, ‘జస్ట్‌ వన్‌ మోర్‌ ఎపిసోడ్‌’ పేరుతో ఓటీటీ లవర్స్‌ కోసం వీటిని విక్రయిస్తోంది.

ఓటీటీ వినోదంతో పాటు స్నాక్స్‌ను ప్రమోట్‌ చేసే విధంగా బీన్‌ ట్రీ ఫుడ్స్‌ కూడా ప్రత్యేక ప్యాక్‌లను అందిస్తోంది. ఇక మాండెలెజ్‌ కుకీ బ్రాండ్‌ ఓరియో నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌ సిరీస్‌ ‘స్ట్రేంజర్‌ థింగ్స్‌’తో జట్టుకట్టడం ద్వారా ఓరియో రెడ్‌ వెల్వెట్‌ను ప్రవేశపెట్టేలా ఒప్పందం కుదుర్చుకుంది. కోకాకోలా థమ్సప్‌.. డిస్నీ–హాట్‌స్టార్‌తో కలిసి ‘థమ్సప్‌ ఫ్యాన్‌ పల్స్‌’ ప్రచారం నిర్వహిస్తుండగా.. మారికో తన సఫోలా మసాలా ఓట్స్‌ కో–బ్రాండెడ్‌ ప్యాక్స్‌ విక్రయానికి జీ5తో డీల్‌ కుదుర్చుకుంది.

’స్నాక్స్‌ బ్రాండ్‌ల అమ్మకాల ఆధారంగా లాభాల పంపకం లేదా సంస్థలు ఒకరికొకరు తమ యాడ్‌లలో ప్రచారం కల్పించుకోవడం, లేదా క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా లింక్‌లను ఇవ్వడం ద్వారా స్నాక్స్‌ బ్రాండ్లు తమ ఉత్పత్తులను విక్రయించడం వంటి మార్గాల్లో డీల్స్‌ కుదురుతున్నాయి’ అని ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ‘కంటెంట్‌ను చూస్తూ, నచి్చన స్నాక్స్‌ తినే అలవాటు ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. ప్రత్యేకంగా ఓటీటీ యూజర్లను దృష్టిలో పెట్టుకుని 4700బీసీ ఇతర బ్రాండ్లతో జట్టుకట్టాం’ అని నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా మార్కెటింగ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ హెడ్‌ పూరి్ణమ శర్మ చెప్పారు. 

ఓటీటీ జోరు.. ఫుడ్‌ ఆర్డర్ల తోడు! 
దేశంలో కరోనా కాలంలో బంపర్‌ హిట్‌ కొట్టిన ఓటీటీ స్ట్రీమింగ్‌.. ముఖ్యంగా యువత, మహిళలకు బాగా చేరువైంది. కోరుకున్న కంటెంట్‌ కుప్పలుతెప్పలుగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ’బాక్సాఫీస్‌’ కళకళలాడిపోతోంది. గతేడాది 70.7 కోట్ల మంది ఇంటర్నెట్‌ యూజర్లు ఓటీటీ స్ట్రీమింగ్‌ ద్వారా కంటెంట్‌ను చూసినట్లు ఇంటర్నెట్‌ ఇన్‌ ఇండియా–2023 నివేదిక అంచనా వేసింది. మరోపక్క, ఈ వీడియో ఆన్‌ డిమాండ్‌ సబ్‌్రస్కిప్షన్‌ మార్కెట్‌ 2027 నాటికి 2.77 బిలియన్‌ డాలర్లకు ఎగబాకనున్నట్లు లెక్కగట్టింది.

ఇదిలా ఉంటే, రెడీ–టు–ఈట్‌ లేదా రెడీ–టు–కుక్‌ ఆహారోత్పత్తుల వృద్ధికి తోడు డైరెక్ట్‌ టు కన్జూమర్‌ బ్రాండ్స్‌తో స్నాక్స్‌ మార్కెట్‌ దూసుకుపోతోంది. ఈ–కామర్స్, క్విక్‌ కామర్స్‌ విస్తరణ జోరుతో చిన్న పట్టణాల్లోనూ స్నాక్న్‌ బ్రాండ్స్‌ రెండంకెల అమ్మకాల వృద్ధిని సాధిస్తున్నాయి. 2023లో దాదాపు రూ.43,000 కోట్లుగా ఉన్న భారతీయ స్నాక్స్‌ మార్కెట్‌ 2032 నాటికి రూ.95,000 కోట్లకు పైగా ఎగబాకుతుందనేది మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ ఐమార్క్‌ గ్రూప్‌ అంచనా. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

ఫుల్‌ చిల్‌!
70.7 కోట్లు: గతేడాది ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఉపయోగించుకున్న ఇంటర్నెట్‌ యూజర్లు

2.77 బిలియన్‌ డాలర్లు: 2027 నాటికి వీడియో ఆన్‌ డిమాండ్‌ సబ్ర్‌స్కిప్షన్‌ మార్కెట్‌ వృద్ధి అంచనా.

రూ. 95,520 కోట్లు: 2032 నాటికి భారతీయ స్నాక్స్‌ మార్కెట్‌ పెరుగుదల అంచనా.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement