సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు! | Here's The List Of 16 New Movies And Web Series Releasing In OTT On January 2nd Week, 2025 | Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!

Published Mon, Jan 13 2025 8:34 AM | Last Updated on Mon, Jan 13 2025 11:08 AM

This Pongal Week Ott Release Movies List Here

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. నగరాలు వదిలి పల్లె చేరుకున్న ప్రజలు పండుగ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇవాల్టి నుంచి భోగితో మొదలైన.. కనుమతో ఈ సంక్రాంతి మూడు రోజుల పాటు సాగనుంది. ఇంకేముంది కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసే సినిమాలు కూడా రెడీ అ‍య్యాయి. ఈ సంక్రాంతిని మరింత సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేందుకు థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ ఇప్పటికే విడుదలయ్యాయి. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వ‍స్తున్నాం పండుగ రోజే బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.

ఈ పండుగ వేళ కుటుంబంతో కలిసి సినిమాలను ఆస్వాదించేందుకు ఓటీటీలే సరైన వేదిక. ఈ సంక్రాంతి వేళ సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ సినిమాలు సిద్ధమైపోయాయి. అయితే ఈ పండుగు ఓటీటీల్లో పెద్ద సినిమాలు లేకపోవడం మైనస్. విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించిన విడుదల పార్ట్‌-2 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ మూవీ. దీంతో బాలీవుడ్‌ ఐ వ్యాంట్ టు టాక్ అనే సినిమాతో పాటు పలు హాలీవుడ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి.  ఈ వారంలో ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్‌

సింగిల్స్ ఇన్‌ఫెర్నో(కొరియన్ రియాలిటీ షో) సీజన్ 4-  14 జనవరి
విత్ లవ్ మెగాన్- హాలీవుడ్- జనవరి 15
జో కిట్టీ సీజన్-2 - కొరియన్ వెబ్ సిరీస్- 16 జనవరి
బ్యాక్ ఇన్ యాక్షన్-(హాలీవుడ్ మూవీ)- 17 జనవరి
ది రోషన్స్- హిందీ డాక్యుమెంటరీ సిరీస్- 17 జనవరి


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఐ వ్యాంట్ టు టాక్- హిందీ సినిమా- జనవరి 17
పాతల్ లోక్ సీజన్-2- 17 జనవరి

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

పవర్ ఆఫ్ పాంచ్- (హిందీ వెబ్ సిరీస్)- 17 జనవరి

జీ5

విడుదల పార్ట్-2- తమిళ సినిమా- జనవరి 17

 

సోని లివ్

పణి- మలయాళ సినిమా- 16 జనవరి

అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్

చిడియా ఉద్- హిందీ సిరీస్- జనవరి 15

ఎపిక్ ఆన్

గృహ లక్ష్మి- హిందీ సిరీస్- జనవరి 16

జియో సినిమా

స్పీక్ నో ఈవిల్- హాలీవుడ్ సినిమా- జనవరి 13
హర్లీ క్వీన్- సీజన్ -5(హాలీవుడ్)- జనవరి  17

లయన్స్ గేట్ ప్లే

హెల్ బాయ్- ది క్రూక్‌డ్ మ్యాన్-(హాలీవుడ్ మూవీ)-  జనవరి 17

మనోరమ మ్యాక్స్

ఐ యామ్ కథలాన్(మలయాళ సినిమా)- జనవరి  17

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement