మరో వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గంగం గణేశా, కార్తికేయ భజేవాయువేగం బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. గతవారంలో అంతా చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ సారి మాత్రం కాస్తా ఇంట్రెస్టింగ్ పెంచేస్తున్నాయి.
మరోవైపు ఓటీటీల్లోనూ సినిమాల సందడి చేయనున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు త్వరలోనే ముగియనున్నాయి. సమ్మర్‌ను క్యాష్ చేసుకునేందుకు రిలీజైన సినిమాలను కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. ఈ వీకెండ్‌లో మీరు ఓటీటీల్లో చూసేందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెడీగా ఉన్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. మీకు నచ్చిన సినిమా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి.
నెట్‌ఫ్లిక్స్
ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31
రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) - మే 31
లంబర్‌జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 01
అమెజాన్ ప్రైమ్
బుజ్జి అండ్ భైరవ(యానిమేటేడ్ సిరీస్)- మే 31
హాట్‌స్టార్
జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31
జియో సినిమా
దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) - మే 31
లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) - మే 31
ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31
ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 01
జీ5
హౌస్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) - మే 31
సైనా ప్లే
పొంబలై ఒరుమై (మలయాళ సినిమా) - మే 31
ఆహా
ప్రాజెక్ట్- జెడ్- మే 31
Comments
Please login to add a commentAdd a comment