ZEE5
-
ఓటీటీ సెన్సేషన్.. జాన్వీ కపూర్ కంటే గొప్ప నటి.. అయినా పట్టించుకోరే?
ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్న సినిమా మిసెస్ (Mrs). మలయాళంలో వచ్చిన 'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' సినిమా (The Great Indian Kitchen Movie)కి ఇది హిందీ రీమేక్. సన్యా మల్హోత్రా (Sanya Malhotra) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జీ5లో అందుబాటులో ఉంది. జీ5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌తో పాటు గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాగా మిసెస్ రికార్డు సృష్టించింది. ఓటీటీలో సూపర్ హిట్ సినిమాగా మిసెస్పెళ్లి తర్వాత ఎంతోమంది అమ్మాయిల జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ మూవీలో సన్యా.. రిచా పాత్రలో జీవించేసింది. ఇంతకుముందు కూడా ఆమె విభిన్నరకాల పాత్రలు పోషించింది. దంగల్, హిట్: ద పస్ట్ కేస్ (హిందీ), కాథల్, పాగ్లైట్ (Pagglait) వంటి పలు చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అయినప్పటికీ ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఇంకా సెకండ్ హీరోయిన్ ఏంటి?'ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దమవుతోంది. తొమ్మిదేళ్లకాలంలో ఆమె హీరోయిన్గా చేసిన రెండే రెండు సినిమాలు థియేటర్లో రిలీజయ్యాయి. ఇప్పుడు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' సినిమా చేస్తోంది. అందులో జాన్వీ (Janhvi Kapoor) ఫస్ట్ హీరోయిన్ అయితే సన్యా సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇది నిజంగా హాస్యాస్పదంగా ఉంది' అని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. జనాలకు ఏం కావాలో బాలీవుడ్ అస్సలు పట్టించుకోదు. జాన్వీ కంటే కూడా సన్యా చాలా గొప్ప నటి, పెద్ద సినిమాల్లో తనకు కథానాయికగా అవకాశాలివ్వొచ్చుగా అంటున్నారు. ఇలాంటివారు దొరకడమే అరుదు'దర్శకుల కంటికి ఈమె ఎందుకు కనిపించడం లేదో అర్థం కావట్లేదు. తను నటించగలదు, అద్భుతంగా డ్యాన్స్ కూడా చేయగలదు. ఈ జనరేషన్లో ఇలాంటి రెండు లక్షణాలున్నవారు దొరకడం చాలా అరుదు. పైగా తను ఎలాంటి జానర్లోనైనా ఇట్టే ఇమడగలదు', 'ఇప్పుడు ఇండస్ట్రీలో సన్యా ఉత్తమ నటి. కానీ తనకు మంచి అవకాశాలు రావడం లేదు' అని కామెంట్లు చేస్తున్నారు. మిసెస్ సినిమా విషయానికి వస్తే.. దీనికి అరతి కడవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నిశాంత్ దహియా, కన్వల్జిత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Cinematic Syndicate (@cinematic.syndicate) చదవండి: తెలుగు సినిమా సెట్లో పదేపదే ఇబ్బంది పెట్టారు: శ్వేతా బసు ప్రసాద్ -
ఓటీటీకి కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్
శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమాను వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 15 నుంచే జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మొదట ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్కు రానుందని భావించారు. కానీ వారం రోజుల ముందుగానే ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఈ మేరకు ప్రత్యేత పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకులను అలరించనుంది మ్యాక్స్ మూవీ. ఈ చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ అభిమానులను మెప్పించారు.మ్యాక్స్ కథేంటంటే..సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. The MAXxive blockbuster from Kannada cinema!Premieres 15th February@KicchaSudeep @theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shekarchandra71 @ganeshbaabu21 @shivakumarart @dhilipaction @kevinkumarrrr @ChethanDsouza @shobimaster @saregamasouth @ZeeKannada pic.twitter.com/ox5wN6U4OO— ZEE5 Telugu (@ZEE5Telugu) February 13, 2025 -
ఓటీటీకి 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఇలాంటి ట్విస్ట్ ఊహించలేదు భయ్యా!
అయితే సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం కోసం ఓటీటీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు కావొస్తోంది. దీంతో సినీ ప్రియులంతా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఆడియన్స్‌కు బిగ్ ట్విస్టే ఇచ్చారు మేకర్స్. ఇంతకీ అదేంటో చూసేయండిట్విస్ట్ ఇచ్చిన మేకర్స్..అయితే ఓటీటీ రిలీజ్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రకటన రాలేదు. ఫిబ్రవరి రెండో వారంలోనైనా ఓటీటీకి వస్తుందేమోనని సినీ ప్రేక్షకులు భావించారు. కానీ స్ట్రీమింగ్కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో కాస్తా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఆడియన్స్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్..త్వరలోనే సంక్రాంతి వస్తున్నాం మీ ముందుకు వస్తుందని జీ తెలుగు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఫస్ట్ టీవీలో వస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఓటీటీ కంటే ముందుగా టీవీలోనే వెంకీమామ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. అయితే ఓటీటీ విడుదలపై మాత్రం ఎలాంటి తేదీని రివీల్ చేయలేదు. ఈ లెక్కను చూస్తే ఈ వారంలోనే టీవీల్లో సంక్రాంతికి వస్తున్నాం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. Get ready to relive the Sankranthi vibe again 💥😁#SankranthikiVasthunnam Coming Soon On #ZeeTelugu #SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam#FirstTVloVasthunnam #TVbeforeOTT #SVonTV@VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/pIP6UUoNIY— ZEE TELUGU (@ZeeTVTelugu) February 10, 2025 -
ఓటీటీలో సంక్రాంతి సినిమాలు.. ఫిబ్రవరిలో మళ్లీ పోటీ
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా విడుదలైన టాప్ సినిమాలు ఫిబ్రవరి నెలలో ఓటీటీకి రానున్నాయి. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ విడుదలయ్యాయి. అయితే, వీటన్నింటిలో వెంకటేశ్ మూవీనే సంక్రాంతి విన్నర్‌గా నిలిచిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో కూడా ఈ చిత్రమే పైచెయి సాధించింది. ఇప్పుడు మళ్లీ ఈ మూడు సినిమాలు ఓటీటీలో పోటీ పడనున్నాయి.'గేమ్ ఛేంజర్'-- అమెజాన్ ప్రైమ్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్ ఛేంజర్ (Game Changer) చేరిపోయింది. అయితే, ఫేక్ కలెక్షన్స్ ఇచ్చారంటూ నెట్టింట భారీగా ట్రోల్స్ రావడంతో తరువాతి రోజుల్లో వాటి వివరాలు ప్రకటించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ఫిబ్రవరి 14న గేమ్ ఛేంజర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.'డాకు మహారాజ్'--నెట్ఫ్లిక్స్నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్'(Daaku Maharaaj) బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే, నైజాం, హిందీ ఏరియాలో ఏమాత్రం కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. బాబీ లొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న విడుదలైంది. సుమారు రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ డేట్‌పై రూమర్లు స్ట్రాంగ్‌గానే వినిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్(Netflix) వేదికగా ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ వంటి స్టార్స్ నటించారు.'సంక్రాంతికి వస్తున్నాం'-- జీ5విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam). ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ మార్క్‌కు దగ్గరలో ఉంది. ఈ సినిమాతో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్‌కు మంచి లాభాలు వచ్చాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకుంది. వాస్తవంగా ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలోకి రావాలి. కానీ, థియటర్ రన్ మెరుగ్గా ఉండటంతో వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కావచ్చు. -
ఓటీటీకి వచ్చేసిన త్రిష థ్రిల్లర్.. వారం రోజుల్లోనే ఎంట్రీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పెద్దగా కనిపించట్లేదు. గతేడాది విజయ్ సరసన ది గోట్ చిత్రంలో కనిపించిన త్రిష.. ప్రస్తుతం అజిత్ కుమార్ మూవీ విదాముయార్చితో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఇదిలా ఉండగా.. త్రిష మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది. మాలీవుడ్‌లో ఐడెంటిటీ అనే మూవీలో నటించింది. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంలో టొవినో థామస్ హీరోగా నటించారు. సంక్రాంతికి కానుకగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు.మలయాళంలో హిట్ టాక్ రావడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. జనవరి 24న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజైంది. ఈ మూవీకి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోయింది. రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ. 18 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.వారంలోనే ఓటీటీకి..గత శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 31 నుంచే జీ5 వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ చిత్రంలో హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో నటించారు. -
ఓటీటీలో రియల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్టు’(The Sabarmati Report) సినిమా సడెన్‌గా తెలుగు వర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటి వరకు కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ.. తాజాగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో విక్రాంత్ మాస్సే(Vikrant Massey), రిథి దిగ్రా, రాశిల్ ఖన్నా(Raashii Khanna) ప్రధాన పాత్రలు పోషించారు. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రానికి ధీరజ్ శర్నా దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్ 15న ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది.తెలుగులో స్ట్రీమింగ్ జీ5 ఓటీటీలో ‘ది సబర్మతి రిపోర్టు’ మూవీ జనవరి 10 నుంచే హిందీ వర్షన్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా శుక్రవారం నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈమేరకు జీ5 ఒక పోస్టర్‌ను కూడా పంచుకుంది. 12th ఫెయిల్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విక్రాంత్ మాస్సే.. ఈ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.మోదీ మెచ్చిన చిత్రంగుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియంలో వీక్షించనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు సభ్యులతో మోదీ ఈ చిత్రాన్ని చూశారు. ఆపై చిత్ర యూనిట్‌ను ఆయన ప్రశంసించారు. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్ర ప్రదర్శనకు పన్ను రాయితీ ప్రకటించాయి. గోద్రా రైలు దహనకాండపై.. ఫిబ్రవరి 27, 2002న జరిగిన గోద్రా రైలు దహనం సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోద్రా రైల్వేస్టేషన్లో ఆగివున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పంటించడంతో ఎస్-6 బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గుజరాత్లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. దాదాపు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. కాగా ఆ సమయంలో ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 22ఏళ్లుగా చరిత్రలో దాగి ఉన్న రహస్యాలు, నిజాలు వెలుగులోకి రాబోతున్నాయని సినిమా విడుదల సమయంలో చిత్ర యూనిట్ భారీగా ప్రచారం చేసింది. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని ‘ది సబర్మతి రిపోర్టు’ సినిమాని తెరకెక్కించారు. (ఇదీ చదవండి: సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్‌బాబు, ప్రియాంక) -
ఓటీటీలో మాధవన్ ‘హిసాబ్ బరాబర్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
విలక్షణ నటుడు ఆర్.మాధవన్ (R Madhavan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హిసాబ్ బరాబర్’. నీల్ నితిన్, కీర్తి కుల్హారి ఇతర పాత్రలు పోషించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జీ5లో జనవరి 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓ బ్యాంక్ చేసే చిన్న పొరపాటు ఓ వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేస్తే .. అతనెలా స్పందించాడు? న్యాయం కోసం ఎలాంటి పోరాటం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆర్థిక మోసం, అవినీతి, న్యాయం కోసం చేసే పోరాటం ఇవన్నీ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అశ్విన్ ధీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, ఎస్పి సినీకార్ప్ నిర్మించాయి. దర్శకుడు అశ్విన్ ధీర్ మాట్లాడుతూ .. సమాజంలో అవినీతి, మోసాలను ఓ సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన ‘హిసాబ్ బరాబర్’ అందర్నీ ఆలోచింపజేసే చిత్రం. సామాజిక అంశాలతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన డ్రామా, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మాధవన్, నీల్ నితిన్, కీర్తి కుల్హారి వంటి వారు తమదైన నటనతో మెప్పిస్తారు. జనవరి 24న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అన్నారు.ఆర్.మాధవన్ మాట్లాడుతూ.. జీ5తో నేను చేసిన తొలి సినిమా ఇది. ఇలాంటి ఓ సినిమాలో భాగం కావటం ఎంతో సంతోషంగా ఉంది. సామాన్యుడైన రాధే మోహన్ శర్మ పాత్రలో నటించటాన్ని ఎంజాయ్ చేశాను. ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. మనలో ఉండే కామన్‌మ్యాన్ అవినీతికి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేశాడనేదే కథ. ఇలాంటి వాస్తవ కథనాలతో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.నీల్ నితిన్ మాట్లాడుతూ.. హిసాబ్ బరాబర్ చిత్రంలో మిక్కీ మెహతా అనే బ్యాంకర్ పాత్రతో మెప్పిస్తాను. యాక్టర్‌గా నాకు సవాలు విసిరిన పాత్ర ఇది. మాధవన్ వంటి నటుడితో కలిసి యాక్ట్ చేయడం చాలా సంతోషం. తనొక అద్భుమైన వ్యక్తి. స్క్రీన్‌పై మా ఇద్దరి మధ్య పోటాపోటీగా ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి అన్నారు.కీర్తి కుల్హారి మాట్లాడుతూ ‘‘హిసాబ్ బరాబర్ వంటి చిత్రంలో నటిగా సవాలు విసిరిన వైవిధ్యమైన పాత్రలో నటించటం ఎంతో సంతోషంగా ఉంది. మాధవన్‌గారితో నటించటం మంచి ఎక్స్‌పీరియె్స్. అశ్విన్ ధీర్ సినిమాను ఎంతో గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. అన్నీ అంశాలను మేళవించి తెరకెక్కించిన ఎంటైర్‌టైనర్ ఇది. అందరినీ ఆలోచింప చేసే చిత్రం. జనవరి 24 నుంచి ప్రీమియర్ కానున్న ఈ సినిమాను ఆదరించాలని కోరుకంటున్నాను’’ అన్నారు. చదవండి: ప్రముఖ కమెడియన్‌కు బ్రెయిన్ స్ట్రోక్ -
థియేటర్లలో గేమ్ ఛేంజర్.. ఓటీటీల్లో ఏకంగా 7 చిత్రాలు రిలీజ్!
అప్పుడే సంక్రాంతి సీజన్ మొదలైంది. వరుసగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అంతేకాకుండా ఈ శుక్రవారం నుంచే పొంగల్ సినిమాల సందడి స్టార్ట్ అయింది. థియేటర్లలో రామ్ చరణ్ గేమ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రెండు రోజుల గ్యాప్‌లో వరుసగా రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు పోటీపడనున్నాయి.అయితే ఈ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అందరికీ సెలవులు రావడం, పండుగ వాతావరణంలో కుటుంబంతో మూవీని వీక్షించడం మంచి ఎక్స్పీరియన్స్. అందుకే ఈ సంక్రాంతికి మీకోసం సరికొత్త కంటెంట్ అందించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో వచ్చే చిత్రాలపై బజ్ ఉన్నప్పటికీ.. అందరికీ వీలుపడదు. ఎంచక్కా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.ఈ సంక్రాంతికి తెలుగు చిత్రం హైడ్ అండ్ సీక్ ఓటీటీకి రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో విశ్వంత్, శిల్పా మంజునాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు బాలీవుడ్ నుంచి విక్రాంత్ మాస్సే నటించిన సబర్మతి రిపోర్ట్, విక్రమాదిత్య మోత్వానే డైరెక్షన్లో తెరకెక్కించిన బ్లాక్ వారెంట్ అనే మరో మూవీ ఓటీటీకి రానున్నాయి. దీంతో ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 7 చిత్రాలు రానున్నాయి. థియేటర్లలో గేమ్ ఛేంజర్, సోనూ సూద్ ఫతే సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఏ ఓటీటీలో రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ, థియేటర్ చిత్రాలు..థియేటర్స్..గేమ్ ఛేంజర్(తెలుగు సినిమా)-జనవరి 10ఫతే(హిందీ సినిమా)-జనవరి 10ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్యాడ్ విటమ్- జనవరి 10బ్లాక్ వారెంట్ -జనవరి 10ఆల్ఫా మేల్స్ సీజన్ 3- జనవరి 10డిస్నీ+ హాట్స్టార్గూస్బంప్స్: ది వానిషింగ్ -జనవరి 10జీ5సబర్మతి రిపోర్ట్- జనవరి 10ఆహాహైడ్ అండ్ సీక్- జనవరి 10 హోయ్చోయ్నిఖోజ్- సీజన్ 2-(బెంగాలీ వెబ్ సిరీస్) జనవరి 10 -
ఓటీటీకి వచ్చేస్తోన్న ప్రధాని మెచ్చిన సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
12th ఫెయిల్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో విక్రాంత్ పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి వ్యక్తి ఐఏఎస్‌గా ఎదిగిన రియల్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఇటీవల విక్రాంత్ మాస్సే నటించిన చిత్రం సబర్మతి రిపోర్ట్. బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. 2002లో గుజరాత్లో జరిగిన గోద్రా రైలు దహనం ఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ధీరజ్ సర్నా దర్శకత్వం వహించారు.జీ5లో స్ట్రీమింగ్..తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 10న నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్న తెలియజేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే జర్నలిస్ట్ పాత్రలో కనిపించారు.సబర్మతి రిపోర్ట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు..ఈ చిత్రాన్ని మన ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు. వివిధ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పన్ను రహితంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ బీజేపీ రాజకీయ నాయకులు ఈ చిత్రాన్ని వీక్షించారు.సిబ్బందితో పాటు హాజరయ్యారు.రిటైర్మెంట్ అంటూ రూమర్స్..అయితే ఈ చిత్రం విడుదలైన తర్వాత విక్రాంత్ మాస్సే నటనకు విరామం ప్రకటించారని వార్తలొచ్చాయి. కానీ కొద్ది రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇది చూసిన కొందరు పర్మినెంట్‌గా సినిమాలకు గుడ్ బై చెప్పారని కథనాలు రాసుకొచ్చారు. ఆ తర్వాత దీనిపై విక్రాంత్ మాస్సే క్లారిటీ కూడా ఇచ్చారు.తన కుమారుడు వర్దన్‌తో సహా తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు విక్రాంత్ మాస్సే పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతను రొమాంటిక్ కామెడీ చిత్రం ఆంఖోన్ కి గుస్తాఖియాన్లో షానాయ కపూర్ సరసన కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. విక్రాంత్ మాస్సే సినీ కెరీర్..బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన విక్రాంత్.. 2017లో 'ఎ డెత్ ఇన్ ది గంజ్' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్ అవార్డ్‌తో పాటు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా గుర్తింపు పొందారు.పర్సనల్ లైఫ్విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. The nation’s biggest cover-up unravels, revealing the truth—only on #ZEE5. 📰Watch #TheSabarmatiReport premiering on 10th Jan, only on #ZEE5!#TheSabarmatiReportOnZEE5@VikrantMassey #RaashiiKhanna @iRidhiDogra @balajimotionpic @VikirFilms @ZeeMusicCompany @ZeeStudios… pic.twitter.com/4QggdFUSDT— ZEE5 (@ZEE5India) January 8, 2025 -
ఓటీటీలో 'విడుదల 2' స్ట్రీమింగ్.. సంక్రాంతికి ప్లాన్
విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్‌లో నటించిన ‘విడుదల 2’ సినిమా డిసెంబరు 20న విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్ 1’ చిత్రం 2023లో రిలీజ్ కాగా తమిళ్, తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెట్రిమారన్ ‘విడుదల 2’ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ముఖ్య తారలుగా నటించారు.విడుదలై 2 బాక్సాఫీస్ వద్ద ఊహించనంతగా మెప్పించలేదు. దీంతో పెద్దగా కలెక్షన్స్ కూడా సాధించలేకపోయింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే, ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారట. 2025 జనవరి 17వ తేదీన ‘విడుదల 2’ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకొచ్చే ప్లాన్‌లో జీ5 ఉన్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు వర్షన్స్ రెండూ ఒకే రోజు అందుబాటులోకి రానున్నట్లు టాక్. అయితే, ఈ విషయంలో 'జీ5' ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు రూ. 50 కోట్ల మార్క్‌ను అందుకుంది.కథేంటంటే.. ప్రజాదళం నాయకుడు పెరుమాళ్(విజయ్ సేతుపతి) అరెస్ట్‌తో 'విడుదల -1' ముగుస్తుంది. కస్టడీలో ఉన్న పెరుమాళ్ విచారణతో పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. పెరుమాళ్ అరెస్ట్ విషయం బయటకు తెలియడంతో అతన్ని మరో క్యాంపుకు తరలించి, అక్కడే ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ క్యాంపుకి అడవి మార్గం ద్వారానే వెళ్లాలి. కొమరన్(సూరి)తో కలిసి మరికొంత మంది పోలీసులు పెరుమాళ్‌ని తీసుకెళ్తారు.మార్గమధ్యలో పెరుమాళ్ తన ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ చెబుతాడు. స్కూల్ టీచర్‌గా ఉన్న పెరుమాళ్ దళంలోకి ఎలా చేరాడు? జమిందారి వ్యవస్థ చేసే అరచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేకే(కిశోర్) పరిచయం పెరుమాళ్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? తను పని చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు మహాలక్ష్మి(మంజు వారియర్)తో ప్రేమాయణం ఎలా సాగింది? ప్రజాదళం ఆశయం ఏంటి? ప్రజల కోసం పెరుమాళ్ చేసిన పోరాటం ఏంటి? ప్రజాదళాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి జమీందార్లు చేసిన కుట్ర ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? పోలీసు కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా లేదా? సూరి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
వికటకవి.. ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్: అజయ్ అరసాడ
మా ఇంట్లో అత్తలు, అక్క వీణ వాయిస్తూ ఉండేవారు. అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని. అలా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చాను. ముందు గిటార్ నేర్చుకోవాలనుకున్నాను. అందుకని శరత్ మాస్టర్ దగ్గర రెండున్నర నెలల పాటు బేసిక్స్ నేర్చుకున్నాను. తర్వాత నాకు నేనుగా సొంతంగా ప్లే చేస్తూ నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్‌కి పనిచేయడం వల్లే నాకు సినిమా చాన్స్ లభించింది’ అన్నారు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. ఆయన సంగీతం అందించిన వెబ్ సిరీస్ వికటకవి. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ట్ ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సంగీత దర్శకుడు అజయ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నేను పుట్టి పెరిగిదంతా వైజాగ్‌లోనే. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాను. టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా 2011 నుంచి 2018వరకు జాబ్ చేశాను. ఉద్యోగం మానేసిన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను.→ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూన్న సమయంలో షార్ట్ ఫిల్మ్స్‌కు వర్క్ చేసేవాడిని. ఇలా చేయటం వల్ల నాకు మంచి ప్రాక్టీస్ దొరికినట్లయ్యింది. ఈ క్రమంలో ప్రదీప్ అద్వైత్ నన్ను జగన్నాటకం డైరెక్టర్ ప్రదీప్‌కు పరిచయం చేశారు. నేను అంతకు ముందు చేసిన ఓ ముప్పై సెకన్ల మ్యూజిక్ బిట్ విని నాకు జగన్నాటకం మూవీలో చాన్స్ ఇచ్చారు. అలా సినీ ఇండస్ట్రీలోకి నా తొలి అడుగు పడింది.→ నా చిన్ననాటి స్నేహితుడు.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల నన్ను గూఢచారి సినిమాలో కీ బోర్డ్ ప్రోగ్రామింగ్ కోసం వర్క్ చేయమని అడగటంతో వర్క్ చేశాను. ఆ తర్వాత క్షీర సాగర మథనం, నేడే విడుదల, మిస్సింగ్, శ్రీరంగనీతులు సినిమాలకు వర్క్ చేశాను. సేవ్ ది టైగర్స్ సీజన్1, సీజన్2లకు సంగీతాన్ని అందించాను. రీసెంట్గా వికటకవి సిరీస్‌కు వర్క్ చేశాను.→ నేను సంగీతాన్నందించిన మిస్సింగ్ మూవీలో ఓ బీజీఎం బిట్ నిర్మాత బన్నీవాస్‌కి బాగా నచ్చింది. అందుకే నాకు ఆయ్ మూవీకి వర్క్‌చేసే చాన్స్ ఇచ్చాడు. ముందుగా ఓ స్పెషల్ సాంగ్ కోసం పని చేయమని చెప్పారు. నేను కంపోజ్ చేసిన సాంగ్ బాగా నచ్చడంతో ఆ సినిమా మొత్తానికి మ్యూజిక్ అందించే అవకాశం ఇచ్చాడు. ఆయ్ వంటి కామెడీ మూవీకి బీజీఎం చేయటం మామూలు విషయం కాదు. అయితే సినిమా హిట్ అయినప్పుడు పడ్డ కష్టమంతా మరచిపోయాను.→ ఆయ్ సినిమాకు వర్క్ చేసేటప్పుడే వికటకవి సిరీస్‌లో మూడు ఎపిసోడ్స్‌కు మ్యూజిక్ చేశాను. ఆయ్ రిలీజ్ తర్వాత మరో మూడు ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేశాను. వికటకవికి వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. నేను డైరెక్టర్స్ టెక్నిషియన్.. వాళ్లకి కావాల్సిన ఔట్పుట్ ఇవ్వటమే నా ప్రయారిటీ.. అది ఏ జోనర్ సినిమా అయినా, సిరీస్ అయినా మ్యూజిక్ చేయటానికి సిద్ధమే.→ ప్రస్తుతం త్రీరోజెస్ సీజన్ 2తో పాటు ఆహాలో మరో రెండు వెబ్ సిరీస్‌లకు వర్క్ చేస్తున్నాను. కొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తాను. -
ఓటీటీలో విజయ్ సేతుపతి సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న తాజా చిత్రం విడుదల-2 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుతలై(విడుదల) మూవీకి కొనసాగింపుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే, తాజాగా జీ5 ఓటీటీ సంస్థ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సీక్వెల్ రిలీజ్‌కు ముందు 'విడుదల-1' సినిమాను జీ5 ఓటీటీలో ఉచితంగా చూడొచ్చని తెలిపింది.విడుదల పార్ట్ 1 సినిమా 2003లో థియేటర్లో సందడి చేసింది. ఆపై జీ5 ఓటీటీలో రిలీజైన ఈ భారీ యాక్షన్ డ్రామా మూవీ వంద మిలియన్లకుపైగానే వ్యూస్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు జీ5 సబ్స్క్రిప్షన్ ఉన్న వారు మాత్రమే ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. అయితే, పార్ట్-2 విడుదల నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీని ఉచితంగానే చూడొచ్చని ప్రకటన వచ్చింది. ఈ అవకాశం డిసెంబర్ 20 వరకు మాత్రమే ఉంటుంది. తెలుగు, తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది.పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన విడుదల పార్ట్-1 సినిమా సుమారు రూ. 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో విజయ్ సేతుపతి, సూరి ప్రధానపాత్రలలో కనిపించారు. అయితే, పార్ట్-2లో మాత్రం మంజు వారియర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సీక్వెల్లో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. -
Vikkatakavi Review: ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: వికటకవి (ఆరు ఎపిసోడ్లు)నటీనటులు: నరేశ్అగస్త్య, మేఘా ఆకాశ్, షైజు, అమిత్ తివారీ, తారక్ పొన్నప్ప, రఘుకుంచె, నిమ్మల రవితేజ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామ్ తాళ్లూరిదర్శకత్వం: ప్రదీప్ మద్దాలిఓటీటీ: జీ5 (నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)‘వికటకవి’ కథేంటంటే..ఈ సినిమా కథ 1940-70ల మధ్యకాలంలో సాగుతుంది. రామకృష్ణ(నరేశ్ అగస్త్య) డిటెక్లివ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ.. డబ్బు కోసం డిటెక్టివ్‌గా మారతాడు. పోలీసులకు సైతం అంతుచిక్కని కొన్ని కేసులను తన తెలివితేటలతో పరిష్కరిస్తాడు. అతని గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్.. రామకృష్ణను అమరగిరి ప్రాంతానికి పంపిస్తాడు. అమరగిరిలో ఓ వింత ఘటన జరుగుతుంటుంది. రాత్రివేళలో అక్కడి దేవతల గుట్టకు వెళ్లిన జనాలు గతాన్ని మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం కారణంగానే ఇలా జరుగుతుందని ఆ ఊరి జనాలు భావిస్తారు. అందులో నిజమెంత ఉందని తెలుసుకునేందుకు రామకృష్ణ దేవతల గుట్టకు వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అందరి మాదిరే రామకృష్ణ కూడా గతాన్ని మర్చిపోయాడా? దేవతల గుట్టకు వెళ్లిన రామకృష్ణకు తెలిసిన నిజమేంటి? అతనితో పాటు అమరగిరి సంస్థాన రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్ రషీద్) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్) కూడా దేవతల గుట్టకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజా నరసింహ కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప), కోడలు గౌరీ (రమ్య దుర్గా కృష్ణన్) వల్ల అమరగిరికి వచ్చిన శాపం ఏమిటి? అమరగిరి ప్రాంతానికి రామకృష్ణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే..?డిటెక్టివ్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ మాత్రం ‘వికటకవి’ అనే చెప్పాలి. కథ 1970 నుంచి 40కి వెళ్లడం..అక్కడ నుంచి మళ్లీ 90లోకి రావడంతో ఓ డిఫరెంట్ వెబ్ సీరీస్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభమైన కాసేపటికే దేవతలగుట్ట సమస్య వెనుక ఎవరో ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. కానీ అది ఎవరు అనేది చివరి వరకు తెలియజేకుండా కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు ప్రదీప్ మద్దాలి సఫలం అయ్యాడు. కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా... ఎంగేజ్ చేసేలా కథనాన్ని నడిపించాడు. రచయిత తేజ దేశరాజ్ ఈ కథను సాధారణ డిటెక్టివ్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా అనేక క్లిష్టమైన ఉపకథలను, చారిత్రక సంఘటనలను చక్కగా మిళితం చేసి ఓ డిఫరెంట్ స్టోరీని క్రియేట్ చేశాడు. ఆ స్టోరీని అంతే డిఫరెంట్‌గా తెరపై చూపించడాడు దర్శకుడు. ఓ భారీ కథను పరిమితమైన ఓటీటీ బడ్జెట్‌తో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడు ప్రదీప్‌ను అభినందించాల్సిందే. తొలి ఎపిసోడ్‌లోనే ఒకవైపు అమరగిరి ఊరి సమస్యను పరిచయం చేసి, మరోవైపు రామకృష్ణ తెలివితేటలను చూపించి అసలు కథను ప్రారంభించాడు. ఇక హీరో అమరగిరికి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. దేవతల గుట్టపై ఉన్న అంతుచిక్కని రహస్యాన్ని చేధించేందుకు రామకృష్ణ చేసే ప్రయత్నం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోగా.. కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపులో ఈ సిరీస్‌కి కొనసాగింపుగా ‘వికటకవి 2’ ఉంటుందని ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. ‘వికటకవి 2’ చూడాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. లాజిక్స్‌ని పట్టించుకోకుండా చూస్తే ఈ సిరీస్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేశ్ అగస్త్య ఒదిగిపోయాడు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ చూస్తే..నిజమైన డిటెక్టివ్‌ని స్క్రీన్ మీద చూసినట్లే అనిపిస్తుంది. మేఘా ఆకాశ్‌కు ఓ మంచి పాత్ర లభించింది. తెరపై ఆమె చాలా హుందాగా కనిపించింది. అమిత్ తివారీ, షైజు, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సిరీస్ చాలా బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్‌కి మరో ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1940-70నాటి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
OTT: తెలంగాణ నేపథ్యంలో డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
తెలంగాణ నేపథ్యంలో ఓటీటీ కోసం మొదటిసారి ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్‌గా 'వికటకవి' అనే టైటిల్‌తో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్,ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. సుమారు నాలుగు దశాబ్ధాలుగా పట్టి పీడించే శాపానికి సంబంధించిన కథతో 'వికటకవి' వెబ్ సిరీస్ ఉన్నట్లు సమాచారం.'వికటకవి' తెలుగు వెబ్ సిరీసులో నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరించారు. ఇకపోతే ఈ సిరీస్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ యాసతో, హైదారాబాద్ విలీనం తర్వాత ఇక్కడ జరిగిన సంఘటనలతో చాలా గ్రిప్పింగ్‌గా కథను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.స్వాతంత్య్రం రాక మునుపు మన దేశంలో చాలా సంస్థానాలుండేవి. అలాంటి వాటిలో తెలంగాణకు చెందిన అమరగిరి ప్రాంతం ఒకటి. రైటర్ తేజ డిఫరెంట్ కథను చెప్పాలనుకున్నప్పుడు తన మైండ్‌లో వచ్చిన ఐడియానే ఇది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్న క్రమంలో కొన్నాళ్లలో ఆ ప్రాంతంలోని ఒక ఊరు మునిగిపోతుంది.. ఈ బ్యాక్ డ్రాప్ కథతో వికటకవి అనే ఫిక్షనల్ పాయింట్‌ను మేకర్స్ తీసుకున్నారు. -
ఓటీటీలో నాన్న సినిమా.. అధికారిక ప్రకటన
యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. గత నెలలో దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎందుకనో ప్రేక్షకులు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)తండ్రీకొడుకుల అనుబంధం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాని నవంబర్ 15 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే ఈ వీకెండ్లో వచ్చేస్తుంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.'మా నాన్న సూపర్ హీరో' విషయానికొస్తే.. చిన్నతనంలో తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), కొన్ని పరిస్థితుల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి చిన్నప్పుడే దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతున్న ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ మంచిగా చూసుకోడు. ఓ రోజు పెంచిన తండ్రిని జైలు నుంచి విడిచిపించాలంటే కోటి రూపాయలు జానికి అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే కథ.(ఇదీ చదవండి: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్) -
పిల్లలను మెప్పించే 'హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్' సినిమా
చిన్న పిల్లలకు గీతలు గీయడమన్నా, బొమ్మలు వేయడమన్నా ఎంతో ఇష్టం. పూర్వం బలపాలు, పెన్సిళ్లు వాడేవాళ్ళు. ఇప్పటి జెనరేషన్ క్రేయాన్స్ వాడుతున్నారు. పిల్లలు ఒక్కోసారి పిచ్చి గీతలు గీస్తారు. ఒక్కోసారి పేరు లేని ఆకారాలను వేస్తారు. ఏది గీసినా, రాసినా వాటికి జీవమొస్తే..? అన్న చిలిపి ఆలోచన హాలీవుడ్ దర్శకుడు కార్లోస్‌కు వచ్చింది. ఇంకేముంది ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్‘ అనే సినిమాను రూపొందించాడు. కథాపరంగా ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్’లో హెరాల్డ్ అనే బాలుడు ఓ పుస్తకంలోని పాత్ర. అతనితో పాటు మూస్, పోర్క్పైన్ అనే మరో రెండు పాత్రలు ఉంటాయి. హెరాల్డ్ తన మానాన తాను ఉండగా బయటి ప్రపంచంలో అతనికి తెలిసిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోతాడు. దాంతో హెరాల్డ్ ఆ వృద్ధుణ్ణి వెతకడానికి పర్పుల్ క్రేయాన్‌తో ఓ తలుపు బొమ్మ గీసి పుస్తకంలో నుంచి మానవ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అతనితో పాటు తోడుగా మూస్, పోర్క్పైన్ కూడా బయటకు వస్తాయి. ఇక అక్కడ నుండి మానవ ప్రపంచంలో అతడు ఏది గీస్తే అది నిజమైపోయి కథను నడిపిస్తుంది. హెరాల్డ్ ఆ ముసలివాడిని కనుగొంటాడా, మానవ ప్రపంచంలో తన మాయాజాలంతో ఎదుర్కోన్న ఇబ్బందులేంటి అన్నది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాలో కారు బొమ్మ, హెలికాప్టర్ బొమ్మ ఇలా ఏది క్రేయాన్‌తో గీసినా అది నిజంగా అయిపోవడం పిల్లలకు బాగా నచ్చుతుంది. విజువల్‌గా గ్రాఫిక్స్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళను ఆకట్టుకుంటాయి. పండుగ సెలవలకు పిల్లలతో పాటు పెద్దలు కూడా సరదాగా చూడగలిగిన సినిమా ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్‘. వర్త్ టు వాచ్ ఇట్. అమెజాన్ ప్రైమ్‌తో పాటు జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. – ఇంటూరు హరికృష్ణ -
OTT: ‘రఘు తాత’ మూవీ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘రఘు తాత’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ భూమి పై జీవన ఉనికికి భాష అనేది ఆయువు. ప్రస్తుత ప్రపంచంలో 7000కు పైచిలుకు భాషలు ఉండగా వాటిలో 200 నుండి 300 వరకు అధికారికంగా గుర్తించబడ్డాయి. కానీ ఈ భాషల వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో పోరాటాలు జరిగాయి... జరుగుతున్నాయి కూడా. ఇటువంటి సున్నితమైన అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు సుమన్ కుమార్ ఇటీవల ‘రఘు తాత’ చిత్రాన్ని రూపొందించారు. (చదవండి: సత్యం సుందరం మూవీ రివ్యూ)తీసుకున్న పాయింట్ సీరియస్ అయినా చక్కటి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించారు దర్శకుడు. సినిమాలోని పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పాలి. ఈ సినిమాలో నాయకురాలి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కీర్తీ సురేష్ నటించారు. తన అద్భుతమైన నటనా ప్రతిభతో ఈ సినిమాలోని ప్రధాన పాత్ర అయిన కయల్విళి పాండియన్ పాత్రకు ప్రాణం పోశారు కీర్తీ సురేష్. మరో ప్రధాన పాత్ర అయిన రఘు తాత పాత్రలో యం.యస్. భాస్కర్ ఇమిడియారు. (చదవండి: ‘దేవర మూవీ రివ్యూ)ఇక కథాంశానికొస్తే... కయల్విళి పాండియన్ మద్రాస్ సెంట్రల్ బ్యాంక్‌లో క్లర్కు ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటూనే కా పాండియన్ అనే కలం పేరుతో రచనలు కూడా చేస్తుంటుంది. అంతేనా హిందీ భాష వద్దు, మన భాష ముద్దు అనే పేరుతో ఉద్యమాలు చేస్తూ సమాజంలో భాషాభివృద్ధికి చేస్తున్న పోరాటంలో కీలక పాత్ర వహిస్తుంది. కయల్విళికి ఓ తాత ఉంటాడు. ఆయనే రఘు తాత. కయల్ చేసే ఉద్యమమంతా రఘు తాత నుండి వచ్చిందే. అంతవరకు కథ బాగున్నా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తన బ్యాంక్ ప్రమోషన్ కోసం హిందీ పరీక్ష దొంగతనంగా రాయవలసి వస్తుంది. ఓ పక్క హిందీ ఉద్యమం చేస్తూ మరో పక్క హిందీ పరీక్ష రాయడం కయల్విళి పెళ్ళిలో అందరికీ తెలిసిపోతుంది. అసలు కయల్ హిందీ పరీక్ష ఎందుకు రాయాల్సి వచ్చింది ? రాసినది అందరికీ తెలిసిన తరువాత తన పెళ్ళిలో ఏం జరిగింది? ఇలాంటివన్నీ జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘రఘు తాత’లోనే చూడాలి. కొసమెరుపేంటంటే... ఈ సినిమా మాతృక తమిళం, పోరాటం చేసింది హిందీ భాషపై, కానీ మనం మాత్రం మన తెలుగు భాషలో ఈ సినిమా చూడడం. ఎందుకంటే భాష ఏదైనా భావం ముఖ్యం కాబట్టి.– ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో హిట్ సిరీస్.. తెలుగు వర్షన్ విడుదల
'గ్యారా గ్యారా' సిరీస్ ఇప్పటికే జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్‌గా తెరకెక్కిన మూవీకి మంచి ఆధరణ లభించింది. ఈ క్రమంలో జీ5 ఓటీటీలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.కొరియన్ డ్రామా హిట్ సినిమా 'సిగ్నల్' స్ఫూర్తితో గ్యారా గ్యారా వెబ్ సిరీస్ నిర్మించారు. హిందీలో ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9 నుంచి జీ5 ఓటీటీలో హిందీ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా సెప్టెంబర్ 20 నుంచి తెలుగు, తమిళ్ వర్షన్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.ధర్మ ప్రొడక్షన్స్, సిఖియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన 'గ్యారా గ్యారా' వెబ్ సిరీస్‌ను ఉమేష్ బిస్త్ డైరెక్ట్ చేశారు. ఇందులో కృతికా కామ్రా, రాఘవ్ జుయల్, ధైర్య కార్వా, ఆకాశ్ దీక్షిత్ నటించారు. 8 ఎపిసోడ్లతో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠతతో సాగుతుందని ప్రేక్షకుల నుంచి ఆధరణ లభిస్తుంది. ఇక నుంచి తెలుగు వర్షన్ గ్యారా గ్యారా చూసేయండి. -
ఓటీటీలో హారర్ మూవీ.. నిద్రలేని రాత్రి కోసం సిద్ధమా?
బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. అరుళ్ నిధి, ప్రియ భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డీమాంటి కాలనీ 2. ఇది 2015లో వచ్చిన హిట్ మూవీ డీమాంటి కాలనీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళనాట ఆగస్టు 15న విడుదలై దాదాపు రూ.55 కోట్లు రాబట్టింది. దీంతో అదే నెల 23న తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ మిశ్రమ స్పందన అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జీ5లో తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు.సినిమా విషయానికి వస్తే..క్యాన్సర్‌తో పోరాడుతున్న సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్)ను డెబీ (ప్రియ భవానీ శంకర్) ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అతడిని క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ, అంతలోనే సామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. అతడి ఆత్మహత్య వెనక కారణం తెలియక మానసికంగా సతమతమవుతుంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో సామ్ చదివిన ఓ పుస్తకమే అతడి చావుకు కారణమని, ఈ తరహాలోనే పలువురూ మరణించారని తెలుసుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? వరుస చావులకు చెక్ పెట్టేందుకు ఆమె ఏం చేసింది? ఈ పుస్తకానికి, డిమాంటి కాలనీకి ఉన్న లింకేంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! View this post on Instagram A post shared by ZEE5 Tamil (@zee5tamil) చదవండి: హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్ కాదు: హీరో సుదీప్ -
డైరెక్ట్‌గా ఓటీటీకి శోభిత ధూళిపాళ్ల చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్కినేని హీరో నాగచైతన్యతో ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత ధూళిపాళ్ల నటించిన తాజా చిత్రం 'లవ్, సితార'. ఈ సినిమాను వందన కటారియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు.చైతూతో ఎంగేజ్మెంట్టాలీవుడ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగతచైతన్యతో శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమంక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని హీరో నాగార్జున అధికారికంగా ట్విటర్లో పంచుకున్నారు.A tale of love, heartbreak, and self-discovery! Watch #LoveSitara, premiering on 27th September, only on #ZEE5. #LoveSitaraOnZEE5 pic.twitter.com/zHGnSUmUmr— ZEE5 (@ZEE5India) September 10, 2024 -
డైరెక్ట్‌గా ఓటీటీకి కీర్తి సురేశ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రఘుతాత. ఈ మూవీకి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో టాలీవుడ్లో విడుదల కాలేదు.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రఘు తాత అందుబాటులోకి రానుంది. ఈ సినిమా హక్కులను జీ5 దక్కించుకోగా.. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ట్విటర్ వేదికగా పంచుకుంది.ఆగష్టు 15న తమిళంలో విడుదలైన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలతో ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో కీర్తి సురేశ్ హిందీకి వ్యతిరేకంగా పోరాడే మహిళ పాత్ర పోషించింది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు నిర్ణయం తీసుకుందో ఈ మూవీ చూస్తేనే తెలుస్తుంది. Kayal is coming to your home for blasting entertainment!😂🔥 #RaghuThatha will be streaming from September 13th only on ZEE5 in Tamil, Telugu, and Kannada. @KeerthyOfficial @hombalefilms @vkiragandur @sumank @vjsub @yaminiyag @RSeanRoldan @rhea_kongara @editorsuresh pic.twitter.com/XY1fO7HT55— ZEE5 Telugu (@ZEE5Telugu) September 9, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఓటీటీల్లో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ జానర్ సినిమాలే కాదు.. వెబ్ సిరీస్‌లు సైతం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. అందువల్లే క్రైమ్ జానర్లో ఎక్కువగా వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నారు. తాజాగా మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.విలక్షణ నటుడు కెకె మీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ముర్షిద్. ఈ సిరీస్‌లో ఆయన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈనెల 30 నుంచే జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. కాగా.. కెకె మీనన్ ఈ మధ్యే శేఖర్ హోమ్ అనే మరో సిరీస్‌లోనూ కనిపించారు. అంతేకాకుండా ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో తనూజ్ వీర్వానీ, వేదికా భండారీ, అనంగ్ దేశాయ్, జాకిర్ హుస్సేన్ కీలక పాత్రలు పోషించారు.Dushmanon ke liye bura waqt bankar, 20 saal baad, Bambai ka raja - Murshid Pathan apni takht par laut raha hai! 👑🔥#Murshid premieres 30th August, only on #ZEE5. Trailer out now! #MurshidOnZEE5 pic.twitter.com/mlh1I8skXS— ZEE5 (@ZEE5India) August 20, 2024 -
కీర్తి సురేష్ 'రఘు తాత' సినిమా.. ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఆ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కథానాయకిగా దుమ్ము రేపుతున్న నటి కీర్తి సురేష్. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా ఆమె చేస్తుంటారు. ఆమె నటించిన కొత్త సినిమా రఘు తాత ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానుందన ప్రచారం జరుగుతుంది. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగష్టు 15న తమిళ్ వర్షన్ విడుదల అయింది.రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కాగా, రఘు తాత మూవీ ఓటీటీ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ స్ట్రీమింగ్ హక్కులను జీ5 మంచి ధరకు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం లేదా సెప్టెంబర్ 14న ఓటీటీలో తెలుగు వర్షన్ డైరెక్ట్‌గా విడుదల అవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా రఘుతాత సినిమా ఉంది. హిందీకి వ్యతిరేకంగా ఈ సినిమాలో కీర్తి పోరాడుతుంది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు పూనుకుంటుంది అనేది సినిమా. -
ఓటీటీలో మరో క్రేజీ టైమ్ ట్రావెల్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
థియేటర్లలో ఎలాంటి సినిమాలొచ్చినా చూస్తారు కానీ ఓటీటీల్లో మాత్రం చాలావరకు థ్రిల్లర్స్‌ని చూసేందుకు జనాలు ఇష్టపడతారు. అందుకు తగ్గట్లే అన్ని భాషల్లోని దర్శకులు డిఫరెంట్ స్టోరీలతో మూవీస్ తీస్తుంటారు. అలా టైమ్ ట్రావెల్ అనేది మంచి కాన్సెప్ట్. హాలీవుడ్లో ఈ తరహావి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు హిందీలోనూ ఇలాంటి ఓ క్రేజీ వెబ్ సిరీస్‌ని రెడీ చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి మరీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)గ్యారా గ్యారా (11:11) పేరుతో తీసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ బట్టి చూస్తే.. 1990లోని ఓ పోలీస్, 2001లోని అంటే భవిష్యత్ కాలంలోని పోలీస్తో వాకీ టాకీ ద్వారా మాట్లాడుతుంటాడు. ఇది కూడా ప్రతిరోజు రాత్రి 11 గంటల 11 నిమిషాలకు మాత్రమే సాధ్యపడుతుంది. ఇలానే వీళ్లు మర్డర్ మిస్టరీలని పరిష్కరిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎదుర్కొంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.ఇలా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన వాటిలో 'డార్క్' అనే వెబ్ సిరీస్ నం.1 అని చెప్పొచ్చు. 'గ్యారా గ్యారా' ట్రైలర్ చూస్తుంటే.. 'డార్క్' సిరీస్‌ని స్ఫూర్తిగా తీసుకుని ఇది తీశారా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నట్లు 'గ్యారా గ్యారా' కూడా 1990, 2001, 2016 టైమ్ లైన్స్‌లో జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 9 నుంచి జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా) -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ మర్డర్ మిస్టరీ.. టాప్‌లో ట్రెండింగ్!
అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా చిత్రం సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ చిత్రాన్ని విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంటోంది.ఓటీటీలో విడుదలై 10 వారాలైనా కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ప్రకటించిన రేటింగ్స్‌లో ఈ మూవీకి చోటు దక్కింది.దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన తెలుగు సినిమాలు/వెబ్ సిరీస్ జాబితాలో సిట్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 2.8 మిలియన్ల వీక్షకులతో టాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకోవడంపై దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు.స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్‌గా అరవింద్ కృష్ణ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చారు. ఎంతో ఛాలెంజింగ్ కారెక్టర్ అయినా చక్కగా నటించి మెప్పించారు. గ్రే షేడ్స్‌తో అరవింద్ కృష్ణ అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన నటించిన ఓ సూపర్ హీరో చిత్రం “ఎ మాస్టర్‌పీస్” త్వరలోనే విడుదల కానుంది. -
ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది.. ఇంత దూరం వస్తాననుకోలేదు!
నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘రౌతు కా రాజ్’. ఆనంద్ సుర్పూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలిపారు. ఇంకా ‘సాక్షి’తో నవాజుద్దీన్ పంచుకున్న విశేషాలు. → హీరో పాత్ర, అతను ఓ కేసును పరిశోధన చేసే విధానం... ఈ రెండూ ‘రౌతు కా రాజ్’లో వీక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. సినిమాలోని మర్డర్ మిస్టరీ, గ్రామీణ నేపథ్యం ఆసక్తికరంగా, సహజత్వంతో ఉంటుంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ వచ్చిందంటే ఈ ఫలితం నా ఒక్కడిదే కాదు... దర్శకుడు, ఇందులో భాగమైన నటీనటులు అందరి భాగస్వామ్యం వల్లే సాధ్యమైంది. → నేను ప్రధానంగా లీడ్ రోల్స్‌లోనే నటిస్తున్నాను. ఏదైనా కథ, అందులోని పాత్ర ఎగ్జైట్ చేసినప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాను. కథలోని నా పాత్రకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలనుకుంటాను. ఆ లక్షణాలకు నా నటన తోడైనప్పుడు ప్రేక్షకులు మెచ్చుకుంటారు. ఆడియన్స్‌ను మెప్పించే క్రమంలో నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నా ఓకే. నటుడుగా నాకెలాంటి పశ్చాత్తాపం లేదు. ఇండస్ట్రీలో ఇంత దూరం వస్తానని, ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. → ప్రస్తుతం కస్టమ్ ఆఫీసర్‌గా ఓ సినిమా, సెక్షన్ 108 మూవీలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. దక్షిణాదిలో రజనీకాంత్‌గారి ‘పేటా’, వెంకటేశ్‌గారి ‘సైంధవ్’ సినిమాలో నటించాను. మళ్లీ దక్షిణాది సినిమాలు చేయాలని ఉంది. కథలు వింటున్నాను. ఇక యాక్టింగ్ కాకుండా వ్యవసాయం అంటే ఇష్టం. వీలైనప్పుడల్లా మా ఊరు వెళ్లిపోయి (ఉత్తరప్రదేశ్‌లోని బుడానా) వ్యవసాయం చేస్తుంటాను. -
వేశ్య పాత్రలో టాలీవుడ్ హీరోయిన్.. అంచనాలు పెంచేసిన ట్రైలర్!
టాలీవుడ్ భామ అంజలి ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో అభిమానులను అలరించింది. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌తో ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తోంది. అంజలి లీడ్ రోల్లో వస్తోన్న వెబ్ సిరీస్ బహిష్కరణ. ముకేశ్ ప్రజాపతి దర్శకత్వంలో రూపొందించిన ఈ సిరీస్‌ను జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్లపై ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు.విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో వస్తోన్న సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. 'మంచోడు చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా..? చెడ్డోడి చరిత్ర తెలుసుకోవడమే..' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో అంజలి వేశ్యపాత్రలో కనిపించనుంది. దీంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌లో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఈనెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. Thrilled to Launch the trailer for #BahishkaranaOnZee5! Always was impressed with the director @iamprajapathi with his work in BiggBoss and now this!!Anjali looking good bringing strength and depth to her character Pushpa!!https://t.co/ewhjAwzSFD@yoursanjali @ZEE5Telugu…— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 10, 2024 -
మరోసారి వేశ్య పాత్రలో టాలీవుడ్ హీరోయిన్.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్!
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన నటి అంజలి. ఇటీవల విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో మెప్పించింది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.అంజలి ప్రస్తుతం మరోసారి అలాంటి విభిన్నమైన పాత్రతో అభిమానులను పలకరించనున్నారు. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ బహిష్కరణ. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ ఈనెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ గురించి అంజలి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.అంజలి మాట్లాడుతూ..'పుష్ప పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాత్ర చేయడంతో నాకు సంతృప్తి కలిగింది. ఒక అమాయకపు వేశ్య నుంచి సమాజంలో అసమానతలను ఎదుర్కొనే స్త్రీ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. పుష్ప అంటే ఓ మిస్టరీ అని.. ఇందులో ఆమె చేసిన ప్రయాణం, వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ సిరీస్‌లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు, బేబీ చైత్ర కీలక పాత్రలు పోషించారు.A tale of misused power and enraged beauty.Get ready for #Bahishkarana on 19th July#BahishkaranaOnZee5 @PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @yoursanjali @AnanyaNagalla @RavindraVijay1 @prasannadop @SidharthSadasi1 pic.twitter.com/bvtplrLhgV— ZEE5 Telugu (@ZEE5Telugu) July 4, 2024 -
నేరుగా ఓటీటీకి హారర్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల కాలంలో హారర్, కామెడీ చిత్రాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీల్లో ఇలాంటి కంటెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. తాజాగా అలాంటి చిత్రం ద్వారా అలరించేందుకు వస్తోంది బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. కకుడా అనే మూవీతో అభిమానులను పలకరించునుంది. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్, సాక్విబ్ సలీమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారర్ కామెడీ కథాంశంతో మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోట్దర్ ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. జూలై 12వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. తాజా పోస్టర్ చూస్తే దెయ్యం ప్రధాన అంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది సోనాక్షి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ తారలు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. Purushon Ke Hit Mein Jaari ⚠️- #Kakuda aa raha hai ‘12 July’ ko, toh ghar pe rahein aur theek 7:15 baje, darwaza khula rakhna naa bhoolein. 👻Kyunki #AbMardKhatreMeinHai, #Kakuda only on #ZEE5#KakudaOnZEE5 pic.twitter.com/wzHOVtE4j8— ZEE5 (@ZEE5India) June 21, 2024 -
వీకెండ్లో సినిమాల జాతర.. ఒక్క రోజే ఏకంగా పది చిత్రాలు!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇప్పుడిప్పుడే ఎన్నికల హడావుడి ముగిసింది. శుక్రవారం వస్తోందంటే చాలు బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీలపై అందరి దృష్టి ఉంటుంది. కొత్త సినిమాలు ఏం వస్తున్నాయో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎప్పటిలాగే ఈ వీకెండ్లో కొత్త సినిమాలు, సిరీస్‌లు సందడి చేసేందుకు వస్తున్నాయి.హన్సిక నటించిన 105 మినిట్స్, మిరల్ లాంటి సినిమాలు ఓటీటీకి రానున్నాయి. వీటితో పాటు తమిళ, మలయాళ చిత్రాలు, పలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. మీకిష్టమైన చిత్రాలు ఓటీటీలో చూసేయండి.నెట్ఫ్లిక్స్హైరార్కీ- (కొరియన్ వెబ్ సిరీస్)- జూన్ 07హిట్ మ్యాన్-(హాలీవుడ్ మూవీ)- జూన్ 07ఫెర్ఫెక్ట్ మ్యాచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 07ఆహా105 మినిట్స్- (తెలుగు హారర్ మూవీ)- జూన్ 07మిరల్-(తెలుగు సినిమా)- జూన్ 07బూమర్ అంకుల్(తమిళ సినిమా)- జూన్ 07సోని లివ్వర్షంగాలక్కు శేషం- (మలయాళ సినిమా)- జూన్ 07గుల్లక్ 4- హిందీ (వెబ్ సిరీస్)- జూన్ 07జియో సినిమాబ్లాక్ ఔట్ (హిందీ మూవీ) - జూన్ 07ద ఎండ్ వుయ్ స్టార్ట్ ఫ్రమ్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 08బుక్ మై షోఎబిగైల్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 07 -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గంగం గణేశా, కార్తికేయ భజేవాయువేగం బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. గతవారంలో అంతా చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ సారి మాత్రం కాస్తా ఇంట్రెస్టింగ్ పెంచేస్తున్నాయి.మరోవైపు ఓటీటీల్లోనూ సినిమాల సందడి చేయనున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు త్వరలోనే ముగియనున్నాయి. సమ్మర్‌ను క్యాష్ చేసుకునేందుకు రిలీజైన సినిమాలను కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు. ఈ వీకెండ్లో మీరు ఓటీటీల్లో చూసేందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెడీగా ఉన్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. మీకు నచ్చిన సినిమా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. నెట్‌ఫ్లిక్స్ ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31 రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) - మే 31 లంబర్‌జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 01అమెజాన్ ప్రైమ్బుజ్జి అండ్ భైరవ(యానిమేటేడ్ సిరీస్)- మే 31హాట్‌స్టార్ జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31జియో సినిమా దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) - మే 31 లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) - మే 31 ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31 ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 01జీ5 హౌస్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) - మే 31సైనా ప్లే పొంబలై ఒరుమై (మలయాళ సినిమా) - మే 31ఆహాప్రాజెక్ట్- జెడ్- మే 31 -
ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా తాజా చిత్రం సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ చిత్రాన్ని విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 10 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంటోంది. తమ చిత్రానికి మంచి ఆదరణ వస్తుండటంతో దర్శకుడు విజయ భాస్కర్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.విజయ భాస్కర్ రెడ్డి.. 'కడప జిల్లాలోనే పుట్టి పెరిగా. అక్కడే విద్యాభ్యాసం జరిగింది. మాది ఉమ్మడి కుటుంబం. రైతుల కష్టం నాకు తెలుసు. మా నాన్న పడ్డ కష్టాలు మేం పడకూడదని ఉన్నత చదువులు చదివించారు. నా డిగ్రీ తరువాత హైద్రాబాద్‌కు వచ్చా. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ చేశాను. ఆ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చాను. అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా చేసి సిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నా. సినిమాల్లోకి రావడం నా ఫ్యామిలీకి ఇష్టం లేదు. కానీ మా పెద్దన్న నాకు అండగా నిలిచారు. ఆయన వల్లే పదిహేనేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.' అని అన్నారు.అనంతరం మాట్లాడుతూ.. 'నా డిగ్రీ ఫ్రెండ్స్ ఫండింగ్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ కథను వెబ్ సిరీస్ కంటే సినిమా తీస్తేనే బాగుంటుందని అన్నారు. నాగి రెడ్డి, బాల్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్ కలిసి ఈ మూవీని ఇక్కడి వరకు తీసుకొచ్చారు.ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ అద్భుతంగా నటించారు. ఆయన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. నటాషా చక్కగా నటించారు. అందరి సహకారంతోనే ఈ మూవీని బాగా తీయగలిగా. ఓటీటీ కంటెంట్ కాబట్టి.. ముందు నుంచి కూడా మేం ఓటీటీ కోసమే ప్రయత్నాలు చేశాం.సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండో పార్ట్, మూడో పార్ట్ ఎప్పుడు? అని అంతా అడుగుతున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రీచ్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం మా చిత్రం టాప్ 5లో ట్రెండ్ అవుతోంది. చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. -
డైరెక్ట్‌గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిట్. ఈ సినిమాను ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించగా..విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజగా ఈ మూవీ ట్రైలర్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ను విశ్వక్ సేన్ అభినందించారు.చిత్ర ట్రైలర్ చూస్తుంటే.. మొదట ఓ అమ్మాయి మర్డర్ కేసు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆ కేసును ఎలా చేధించారనే సస్పెన్స్ కోణంలో ఈ సినిమా ఉండబోతోంది. ట్రైలర్ చివర్లో పోలీసాఫీసర్‌గా అరవింద్ కృష్ణ చెప్పడం హైలెట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు వరికుప్పల యాదగిరి సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇవాల్టి నుంచే ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) -
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
‘ది కేరళ స్టోరీ’తో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది అదాశర్మ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో హార్ట్ అటాక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినా.. అదా శర్మను మాత్రం స్టార్ హీరోయిన్గా చేయలేకపోయింది. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు లేడి ఓరియెంటెండ్ చిత్రాల్లో నటించినా.. ఫేమ్ రాలేదు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘ది కేరళ స్టోరీ’తో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాదిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో పాటు అదా శర్మను పాన్ ఇండియా హీరోయిన్గా మార్చేసింది. అదే జోష్‌లో ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తోసేన్తోనే ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ అనే సినిమా చేసింది. ఈ ఏడాది మార్చి 15న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకొని అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందు ఈ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో కేవలం మావోయిస్టుల హింసనే ఎక్కువ చూపించారని, సంచలనం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే విమర్శలు వచ్చాయి. విడుదల తర్వాత ప్లాప్ టాక్ రావడంతో ఎవరూ ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మే 17 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ 5 సంస్థ ఎక్స్(ట్విటర్) వేదికగా తెలియజేస్తూ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఇందులో అదాశర్మ మావోయిస్టులను అణచివేయడానికి నియమితురాలైన ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్గా నటించింది. An internal war that has the country divided into two fractions. Watch the gruesome story of Naxal violence.#Bastar premieres 17th May, only on #ZEE5. Available in Hindi and Telugu. #BastarOnZEE5 pic.twitter.com/IUFXrNnkqq— ZEE5 (@ZEE5India) May 8, 2024 -
ఓటీటీలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రిలీజ్
అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ్ హీరోలుగా నటాషాదోషి ప్రధాన పాత్ర పోషించిన కొత్త చిత్రం 'యస్. ఐ. టి'. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) పేరుతో జీ5లో స్ట్రీమింగ్ కానుంది.యంగ్ ఇండియా సినిమాతో హీరోగా పరిచయమైన అరవింద్ కృష్ణ ఇప్పటికే ఇట్స్ మై లవ్ స్టోరీ, రుషి వంటి చిన్న చిత్రాల్లో మెప్పించాడు. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కూడా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో మెరిశాడు. తాజాగా 'యస్. ఐ. టి' (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చిత్రం ద్వారా వస్తున్నాడు. వి.బి.ఆర్. (VBR) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. మే 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. -
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
గతేడాదిలో 'సలార్'తో ట్రెండింగ్‌లోకి వచ్చిన శ్రియా రెడ్డి తాజాగా 'తలైమై సేయలగం' వెబ్ సిరీస్‌తో రానుంది. తమిళంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో కాంతార ఫేమ్ కిషోర్ మరో లీడ్రోల్లో నటిస్తోన్నాడు. జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ సిరీస్‌ను రిలీజ్ చేస్తున్నారు.తలైమై సేయలగం పేరుతో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్ డ్రామా సిరీస్‌ను భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో శ్రియారెడ్డితో పాటు కస్తూరి, భరత్, రమ్య నంబీశీన్, దర్శన గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ వసంత బాలన్ ఈ పొలిటికల్ మ్యాజిక్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ గురించి కీలక సమాచారాన్ని మేకర్స్ ప్రకటించారు. మే 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోందని తెలిపారు.రీసెంట్గా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాధిక శరత్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా లోకసభ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాడాన్ మీడియా వర్క్స్ పతాకంపై ఆమె నిర్మిస్తుంది. ఈ సిరీస్‌కు గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. -
ఓటీటీలో సరికొత్త రికార్ట్ క్రియేట్ చేసిన 'గామి'
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5 ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. తాజాగా ‘గామి’ చిత్రంతో ZEE5 ప్రేక్షకులను అలరిస్తోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది. విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని జీ 5 ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. జీ 5లో గామి చిత్రానికి అపూర్వ ఆదరణ దక్కుతోంది. 72 గంటల్లోపే ఈ చిత్రం 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టుకోవటం విశేషం. హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు అభినందనీయం. నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరమైన కథనం, చక్కటి విజువల్స్ అన్ని ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి ఇప్పుడు ఈ విజువల్, ఎమోషనల్ వండర్ జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. కేవలం 72 గంటల్లోనే 50Million Streaming Minutes తో సరికొత్త రికార్డ్ సృష్టించిన 'గామి'. Zee5 లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది వెంటనే చూడండి. pic.twitter.com/pEkVqzRhTn — ZEE5 Telugu (@ZEE5Telugu) April 15, 2024 -
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా తెలుగు వర్షన్
కన్నడలో గతేడాది రిలీజ్ అయిన కాటేరా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దర్శన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ సినిమా ప్రభాస్ సలార్‌తో పోటీ పడి రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వర్షన్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. కేజీఎఫ్ సినిమాకు పోటీగా కాటేరా సినిమాను నిర్మించారని కన్నడనాట భారీగా ప్రచారం జరిగింది. దీంతో కేజీఎఫ్ రికార్డులను కాటేరా బీట్ చేస్తుందని ప్రచారం జరిగింది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా కాటేరా చిత్రాన్ని దర్శకుడు తరుణ్ సుధీర్ తెరకెక్కించాడు. తాజాగా తెలుగుతో పాటు తమిళ వెర్షన్ జీ5 అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఆదివారం నుంచి కాటేరా చిత్రాన్ని జీ5 విడుదల చేసింది. థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి మేకర్స్ తీసుకొచ్చారు. కాటేరా సినిమాలో దర్శన్ సరసన ఆరాధన రామ్ హీరోయిన్గా మెప్పించింది. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు అయిన ఆరాధన రామ్ కాటేరాతోనే సాండల్‌వుడ్‌లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సాధారణ కథనే అయినప్పటికీ కన్నడ ఆడియెన్స్‌కి ఎక్కేసింది. మరీ తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం రీచ్ అవుతుందో చూడాల్సి ఉంది. -
అక్కడ శవాలు కాలుతున్నా 20 నిమిషాలు షూట్ చేశాం: విశ్వక్ సేన్
విశ్వక్ సేన్, చాందినీ చౌదని హీరో హీరోయిన్లుగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘గామి’. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ మూవీకి నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8లో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ స్నో కింగ్డమ్లో మీడియాతో ముచ్చటించింది. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో ఇలా స్నో కింగ్డమ్లో నిర్వహించాలనే ఐడియా అంతా కూడా జీ5 టీందే. ఇలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదని అనుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా ఇలా చలిలోనే చేసేవాడ్ని. గామిలాంటి సినిమాలకు మామూలుగా అవార్డులు, ప్రశంసలు వస్తుంటాయి.. కలెక్షన్లు రావని అంతా అనుకుంటారు. కానీ ఇది నా కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్లను సాధించింది. గామిలో కమర్షియల్ అంశాలేవీ ఉండవు. అయినా ఆడియెన్స్ చాలా బాగా ఆదరించారు. వారణాసిలోని ఘాట్‌లో శవాలు కాలుతున్నా కూడా ఓ 20 నిమిషాలు షూట్ చేశాం. చావుని వాళ్లు సెలెబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు నాకు జీవితం చాలా చిన్నది అనిపించింది. ఇలాంటి కథను నమ్మాలి. నాకు పెద్ద రిస్క్ అనిపించలేదు. ఓ ఫ్లాప్ సినిమాను తీయడం కంటే.. ఇలాంటి కథను నమ్మడం బెటర్. గామిని థియేటర్లో అందరూ చూశారు. మాకు మంచి రివ్యూలు ఇచ్చారు. ఏప్రిల్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోనూ మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు. డైరెక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ.. ‘థియేటర్లో మా సినిమా కొంత మందికి అర్థం కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. మూడు నాలుగు సార్లు చూస్తే మా థీమ్ ఏంటి? మా కాన్సెప్ట్ ఏంటి? అన్నది అందరికీ ఈజీగా అర్థం అవుతుంది. మేం ఎప్పుడూ ఈ సినిమా కోసం లెక్కలు వేసుకోలేదు. చిన్నా, పెద్దా.. బడ్జెట్ అంటూ ఇలా లెక్కలేసుకుండా సినిమా తీశాం. జీ5లో ఏప్రిల్ 12 నుంచి మా స్ట్రీమింగ్ అవుతుంది.. అందరూ వీక్షించండి’ అని అన్నారు. లాయిడ్ జేవియర్ (జీ 5 సౌత్, వైస్ ప్రెసడెంట్ - మార్కెటింగ్) మాట్లాడుతూ.. ‘గామిలాంటి మంచి చిత్రాన్ని తీసిన విద్యాధర్, విశ్వక్ సేన్‌లకు థాంక్స్. ఈ రోజు ఇలా వినూత్నంగా ఆలోచించి ఈవెంట్‌ను నిర్వహించాం. స్నో కింగ్డమ్లో ప్రెస్ మీట్ నిర్వహించటం ఇండియాలోనే ఇదే తొలిసారి. అందరూ ఎంజాయ్ చేసుంటారని భావిస్తున్నాం. చాలా కొత్తగా ఉంటుందని ఇలా స్నో కింగ్డమ్లో ఈవెంట్ పెట్టాం. ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ్, కన్నడలో జీ5లో గామి స్ట్రీమింగ్ అవుతోంది. అందరూ వీక్షించండి. 2024లో వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఇదొకటి’ అని అన్నారు. -
ఓటీటీలో ఒకేరోజు నాలుగు హిట్ సినిమాలు.. ఈ వారం పండగే
‘ఓమ్ భీమ్ బుష్’: అమెజాన్ ప్రైమ్ శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఓమ్ భీమ్ బుష్’ హిట్ టాక్‌తో భారీ హిట్ కొట్టింది. మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా ప్రేక్షకుల చేత ఔరా అనిపించింది.లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. గామి: జీ5 టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే గామి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో అఘోరా పాత్రలో మెప్పించారు. శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన గామి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన గామి సినిమాను దాదాపు ఆరేళ్ల పాటు తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 'లాల్ సలామ్': నెట్ ఫ్లిక్స్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమా ఓటీటీ కష్టాలు దాటుకుని స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. రజనీ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లలో కొద్దిరోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'లాల్ సలామ్' స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ప్రేమలు: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమలు. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి తనయుడు కార్తికేయ. అదే పేరుతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ.. తెలుగులో మార్చి 8న వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 12న ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళం, హిందీ, తమిళ వెర్షన్లు అందుబాటులోకి రానున్నాయి. -
This Week OTT Releases: అసలే పండుగ సీజన్.. ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. అసలే వేసవి సెలవులు. అంతే కాకుండా వరుసగా ఉగాది, రంజాన్ పండుగలు వస్తున్నాయి. దీంతో సినీ ప్రియులు కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అలాంటి వారి కోసం ఓటీటీలు సైతం రెడీ అయిపోయాయి. ఈ వారం మిమ్మల్ని అలరించేందుకు సరికొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో అఘోరా పాత్రలో విశ్వక్ సేన్ నటించిన గామి ఈ వారంలోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ప్రేమలు మూవీ సైతం స్ట్రీమింగ్కు సిద్ధమైంది. వీటితో పాటు బాలీవుడ్లో పరిణీతి చోప్రా నటించిన మూవీ అమర్ సింగ్ చమ్కిలా ఓటీటీలో రిలీజ్ కానుంది. అంతే కాకుండా హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు, యానిమేషన్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ స్పిరిట్ రేంజర్స్- సీజన్- 3 (కిడ్స్ యానిమేటెడ్ సిరీస్)- ఏప్రిల్ 08 నీల్ బ్రెన్నాన్: క్రేజీ గుడ్ (స్టాండ్-అప్ కామెడీ స్పెషల్)- ఏప్రిల్ 09 ఆంత్రాసైట్- (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10 ది హైజాకింగ్ ఆఫ్ ఫ్లైట్ 601 -(కొలంబియా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10 అన్లాక్డ్: ఏ జైల్ ఎక్స్పెరిమెంట్- (డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 10 జెన్నిఫర్ వాట్ డిడ్ - (బ్రిటిష్ రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 10 యాజ్ ది క్రో ఫైల్స్- సీజన్ 3- (టర్కిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11 హార్ట్‌బ్రేక్ హై -సీజన్ 2 (ఆస్ట్రేలియన్ టీన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11 మిడ్ సమ్మర్ నైట్ -సీజన్ 1 -(నార్వే థ్రిల్లర్ సిరీస్)- ఏప్రిల్ 11 అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12 గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్కామ్)- ఏప్రిల్ 12 లవ్ డివైడెడ్ - (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12 స్టోలెన్ - (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12 ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్ టూ క్యాంప్ (2024) (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్) జీ5 గామి(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రేమలు(మలయాళ వర్షన్)- ఏప్రిల్ 12 అమెజాన్ ప్రైమ్ అన్‌ఫర్‌గాటన్ సీజన్-5(వెబ్ సిరీస్) - ఏప్రిల్ 08 ది ఎక్సార్సిస్ట్: బిలీవర్(హారర్ మూవీ)- ఏప్రిల్ 09 ఫాల్ అవుట్(అమెరికన్ సిరీస్)- ఏప్రిల్ 11 ఎన్డబ్ల్యూఎస్ఎల్(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)- ఏప్రిల్ 12 -
ఓటీటీకి టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే గామి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో అఘోరా పాత్రలో మెప్పించారు. శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన గామి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన గామి సినిమాను దాదాపు ఆరేళ్ల పాటు తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారంలోనే ఓటీటీకి రానుందని రూమర్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Fasten your seatbelts! The journey into the intriguing world of Gaami continues on ZEE5. ❄️@VishwakSenActor @iChandiniC @KarthikSabaresh @nanivid @mgabhinaya #NareshKumaran @_Vishwanath9 @Synccinema @vcelluloidsoffl @UV_Creations @adityamusic#MassKaDasOnZEE5 #Gaami pic.twitter.com/p5SmeyINrx — ZEE5 Telugu (@ZEE5Telugu) April 3, 2024 -
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న 'మిస్టరీ థ్రిల్లర్' సినిమా
మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటించిన 'సైలెన్స్' (Silence... Can You Hear It?) అనే మిస్టరీ థ్రిల్లర్ సినిమా 2021లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అది కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్నడం విశేషం. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి సైలెన్స్ చిత్రం మెప్పించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'సైలెన్స్ 2 ది నైట్ ఔల్ బార్ షూటౌట్' మీ ముందకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అబన్ బరూచా దేవ్‌హన్స్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయీ, ప్రాచీ దేశాయ్ కలిసి నటించారు. ఏప్రిల్ 16 నుంచి సైలెన్స్ 2 సినిమా జీ5లో డైరెక్ట్‌గా విడుదల కానుంది. ప్రస్తతం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. జీ స్టూడియోస్, క్యాండిడ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నగరంలో జరుగుతున్న వరుస హత్యల వెనకున్న హంతకులను పట్టుకునే మిస్టరీని ఏసీపీ అవినాష్ వర్మగా నటించిన మనోజ్ ఏ విధంగా చేదించాడనేది కథకు ప్రధాన మూలం. కథలో ఎన్నో ట్విస్ట్‌లతో పాటు థ్రిల్లింగ్‌ను పంచే సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 16న విడుదల కానున్న సైలెన్స్ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందన జీ5 ప్రకటించింది. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 15 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఇక రాబోయే రెండు నెలల్లో విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. ఈ హాలీడేస్‌లో ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యేది ఒక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ముఖ్యంగా సినీ ప్రియుల కోసం ఈ వారంలో అలరించేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. ఈ వారం థియేటర్లలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ చిత్రం మాయవన్ ఏడేళ్ల తర్వాత టాలీవుడ్లో ప్రాజెక్ట్-జెడ్ పేరుతో రిలీజవుతోంది. వీటితో పాటు భరతనాట్యం, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బహుముఖం లాంటి చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అయితే ఈ వారంలో ఓటీటీలోనూ సందడి చేసేందుకు పలు చిత్రాలు వచ్చేస్తున్నాయి. గోపీచంద్ నటించిన భీమా, టాలీవుడ్ భామ దివి చిత్రం లంబసింగి, హనుమాన్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. దీంతో పాటు బాలీవుడ్ మూవీ ఫర్రీ ఓటీటీకి వచ్చేస్తోంది. అంతే కాకుండా పలు వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగా కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ టుగెదర్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 02 ఫైల్స్ ఆప్ ది ఆన్ఎక్స్ప్లెయిన్డ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03 రిప్ లే(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 04 పారాసైట్- ది గ్రే(కొరియన్ సిరీస్)- ఏప్రిల్ 05 స్కూప్- హాలీవుడ్ సినిమా- ఏప్రిల్ 025 అమెజాన్ ప్రైమ్ మ్యూజికా(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 04 యే మేరీ ఫ్యామిలీ(వెబ్ సిరీస్)- సీజన్ 3- ఏప్రిల్ 04 హౌ టూ డేట్ బిల్లీ వాల్ష్- (హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లంబసింగి- (తెలుగు సినిమా)- ఏప్రిల్ 02 భీమా (టాలీవుడ్ చిత్రం) ఏప్రిల్ 5 హనుమాన్(తమిళం, కన్నడ, మలయాళం వర్షన్)- ఏప్రిల్ 05 జీ5 ఫర్రీ- (బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 05 యాపిల్ టీవీ ప్లస్ లూట్ సీజన్- 2(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03 సుగర్(హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05 సోనీలివ్ ఫ్యామిలీ ఆజ్ కల్(హిందీ సినిమా)- ఏప్రిల్ 03 -
బాక్సాఫీస్ సంచలనం.. ఓటీటీలో కేవలం 11 గంటల్లోనే!
బాక్సాఫీస్ సంచలనం హనుమాన్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈనెల 17న సడన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసిన ఈ చిత్రం ఓటీటీ దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్కు వచ్చేసిన 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించింది. జీ5 ఓటీటీ చరిత్రలో తొలి రోజున ఉన్న రికార్డులను తిరగరాసింది. 2024లో జీ 5ను ప్రపంచ వ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలబెట్టింది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది. వ్యూస్‌తో గ్లోబల్‌గా జీ5లో నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని జీ5 తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. విజువల్స్, భక్తి పారవశ్యంలో మునిగిపోయే సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే యాక్షన్‌తో పాటు పాటలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. హనుమాన్ కథేంటంటే... అంజనాద్రి ప్రాంతంలో ఉండే హనుమంతు (తేజ సజ్జ) అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. తల్లిదండ్రి లేని హనుమంతుని అక్క అంజనమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) అన్నీ తానై హనుమంతుని పెంచి పెద్దచేస్తుంది. ఆ ప్రాంతంలో అన్యాయం చేస్తోన్న గజపతిని ఓ సందర్భంలో హనుమంతు ఆ ఊళ్లో వైద్యం చేయటానికి వచ్చిన డాక్టర్ మీనాక్షి కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనాక్షిని హనుమంతు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంటాడు. గజపతి కారణంగా హనుమంతు ప్రమాదంలో చిక్కుకుంటే అతని ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓ అపూర్వశక్తి దొరుకుతుంది. దాంతో అతను ప్రజలకు మంచి చేస్తుంటాడు. చివరకు విషయం విలన్ వరకు చేరుతుంది. అపూర్వ దైవశక్తిని సంపాదించుకోవటానికి ప్రతినాయకుడు ఏం చేశాడు?.. అతన్ని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. చివరకు ఆంజనేయస్వామి భక్తుడి కోసం ఏం చేశాడనే కథే హనుమాన్. RECORDS BROKEN AND HEARTS WON! HanuMan now streaming on ZEE5 in Telugu with English subtitles. https://t.co/TfUtuuoNTx @tejasajja123 @PrasanthVarma @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @GowrahariK @AsrinReddy @Primeshowtweets @tipsofficial pic.twitter.com/8EymDJjKbU — ZEE5 Telugu (@ZEE5Telugu) March 18, 2024 -
ఓటీటీకి హనుమాన్.. ఇంతలోనే సడన్‌గా ఏమైంది?
టాలీవుడ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హనుమాన్ ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసింది. మొదట హిందీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించిన మేకర్స్.. తెలుగులో ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మొదట్లో శివరాత్రి సందర్భంగా ఓటీటీకి వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాతనైనా మార్చి 16న హిందీ వర్షన్‌తో పాటే సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ భావించారు. దీంతో హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్స్ వెయిట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కానీ ఎవరూ ఉహించని విధంగా హిందీ వర్షన్ స్ట్రీమింగ్ అయిన కొద్దిగంటల్లోనే చెప్పా పెట్టకుండా తెలుగులోనూ స్ట్రీమింగ్ చేశారు. అసలు హనుమాన్ ఓటీటీకి వచ్చిందన్న విషయం జీ5లో చూస్తే కానీ అభిమానులకు తెలియరాలేదు. కానీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న సినిమాను సడన్‌గా స్ట్రీమింగ్ ఎందుకు చేశారు? ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ కోసం తేదీని ప్రకటించకుండా స్ట్రీమింగ్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ విషయంలో నెటిజన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావడంతో ఆడియన్స్‌కు ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా పోతుందనే సడన్ స్ట్రీమింగ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు హనుమాన్ ఓటీటీ రిలీజ్ తర్వాత నెటిజన్స్ కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. థియేటర్లలో అలరించిన హనుమాన్కు.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌కు వచ్చేసరికి నెగెటివిటీ స్ప్రెడ్ కావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరేమో కావాలనే ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన మూవీ అని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా థియేటర్లలో మెప్పించిన ఈ సినిమాకు ఓటీటీలో ఇలాంటి టాక్ రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. All of Sudden Negativity on #HanuMan What is the reason? pic.twitter.com/7lTcGKec1P — Telugu Bit (@telugubit) March 17, 2024 Why, suddenly people are spreading negativity on #HanuMan cinema, after releasing it in OTT What is making them cry 🤔 pic.twitter.com/Aa90IxjIq6 — 🚩అజ్ఞాతవాసి Ãgnathavasì 🕉️ (@myselfBharath__) March 17, 2024 -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన హనుమాన్.. ఎక్కడంటే?
ఒకప్పుడు థియేటర్లో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూసేవారు. ఇప్పుడు థియేటర్‌తో పాటు అటు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఏ ఓటీటీలోకి వస్తుందా? అని ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. గత కొన్నాళ్లుగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం వెబ్ వీక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ జియో సినిమాలో హనుమాన్ హిందీ వర్షన్ రిలీజ్ చేశారు. జియోలో స్ట్రీమింగ్ నిన్న (మార్చి 16) రాత్రి 8 గంటల నుంచే జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో నార్త్ ఇండియన్స్ వీకెండ్లో సినిమా చూస్తూ తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ సీన్ అదుర్స్, ఆ సీన్ సూపర్బ్ అంటూ కొన్ని సన్నివేశాల క్లిప్పింగ్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. అయితే సడన్‌గా మరో ఓటీటీలోనూ హనుమాన్ను తీసుకొచ్చేశారు. జీ5లో హనుమాన్ మూవీని అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. జీ5లోకి వచ్చేసిన హనుమాన్ అంతా ఓకే కానీ చివర్లో దీన్ని ఫ్రీగా ఇవ్వట్లేదని కొనుక్కోమని చెప్పారు. ఇది చూసిన అభిమానుల ఫ్యూజులెగిరిపోయాయి. సబ్‌స్క్రైబర్స్‌కు ఫ్రీగా ఇవ్వాలి కానీ మళ్లీ ఇలా ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనుక్కోమని తిరకాసులేంటో అని తిట్టిపోశారు. కానీ కాసేపటికే రెంట్ పద్ధతి తీసేసి ఫ్రీగా చూడొచ్చని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్‌లో తేజ సజ్జ హీరోగా నటించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల మేర రాబట్టింది. HanuMan is now streaming on @ZEE5Telugu 😊@tejasajja123 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsofficial @tipsmusicsouth @ThePVCU @RKDStudios #HanuMan #HanuManOnZEE5 pic.twitter.com/PLf0lF3Lfw — Prasanth Varma (@PrasanthVarma) March 17, 2024 చదవండి: త్వరలో ఎలక్షన్స్.. మన్సూర్‌కు కోలుకోలేని దెబ్బ.. అధ్యక్ష పదవి ఊస్ట్ -
'హనుమాన్' ఓటీటీ రిలీజ్‌పై డైరెక్టర్ ట్వీట్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో పెద్ద సినిమాలతో పాటు ఎలాంటి అంచనాలు లేకుండా 'హనుమాన్' సినిమా విడుదలైంది. యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే పలు ఓటీటీలలో వచ్చేశాయి. కానీ ‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూసే వారికి మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పట్లో ఓటీటీలోకి హనుమాన్ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. హనుమాన్ ఓటీటీ విడుదలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. 'హనుమాన్ ఓటీటీ విడుదల ఆలస్యం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తోంది కాదు. వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావడానికి మా యూనిట్ విరామం లేకుండా పనిచేస్తోంది. మీకు ఉత్తమమైనది అందిచాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఆలస్యం విషయంలో దయచేసి అర్థం చేసుకోవడానికి అందరూ ప్రయత్నించండి. ఇప్పటి వరకు మా చిత్ర యూనిట్‌కు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.' అని తెలిపారు. తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన పోస్ట్‌పై నెటిజన్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన సినిమాకు కొత్తగా మీరు యాడ్ చేసేది ఏంటి..? ఆలస్యానికి కారణాలు ఏంటి..? కనీసం ఎప్పుడు వస్తుందో అంచనా తేదీనైనా ప్రకటించలేనంత స్థితిలో ఉన్నారా..? మీరు చేస్తున్న అతికి సినిమాపై ఉన్న ఆసక్తి కూడా పోతుంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొదట హనుమాన్ సినిమా మార్చి 2 నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ వినిపించింది. అప్పుడు జరగలేదు. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల అన్నారు. అప్పుడూ లేదు. తాజాగా మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదీ లేదు.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్ట్‌తో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో కూడా తెలయని పరిస్థితి అని అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. భారీ సినిమాల మధ్య రిలీజ్ అయిన సినిమాకు తాము ఎంతగానో సోషల్‌మీడియాలో ప్రమోట్ చేస్తే ఇప్పుడు ఇలా గేమ్స్ అడుతున్నారా అంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికి అయితే హనుమాన్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అనే విషయంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వలేదు. #HanuMan OTT streaming delay was not intentional! We have been working tirelessly round the clock to sort things and bring the film to you asap! Our intention is always to give you nothing but the best! Please try to understand and continue supporting us! Thank you! 🤗… — Prasanth Varma (@PrasanthVarma) March 15, 2024 -
ఓటీటీకి హనుమాన్.. ప్రశాంత్ వర్మ లేటేస్ట్ అప్డేట్.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!!
టాలీవుడ్ మూవీ హనుమాన్ సంక్రాంతికి రిలీజైన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీపడి రికార్డ్ స్థాయి వసూళ్లతో అదరగొట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హిందీ వర్షన్ తేదీ ఖరారు చేశారు. ఈనెల 16 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే స్ట్రీమింగ్ డేట్‌పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటనైతే రాలేదు. మరో వైపు గతంలోనే మహా శివరాత్రికి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓటీటీ రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన రానుందని పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో వెయిటింగ్ అన్న అంటూ కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరేమో ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా కూడా పోయిందని పోస్ట్ చేస్తున్నారు. మరీ హిందీ స్ట్రీమింగ్‌తో పాటే ఈ నెల 16 నుంచైనా ఓటీటీకి వస్తుందేమో వేచి చూద్దాం. #HanuMan OTT streaming date announcement is coming! 😊👍🏼 — Prasanth Varma (@PrasanthVarma) March 11, 2024 -
ఓటీటీకి మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న బయోపిక్ మెయిన్ అటల్ హూన్. రవి జాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఈ మూవీ హక్కులను ఇప్పటికే సొంతం చేసుకున్న జీ5 స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈనెల 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఇందులో పంకజ్ త్రిపాఠి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఆయన పర్సనల్ లైఫ్, రాజకీయ జీవితం గురించి చూపించారు. ఈ చిత్రంలో పీయూష్ మిశ్రా, దయా శంకర్ పాండే, రాజా సేవక్, ఏక్తా కౌల్ పలువురు నటించారు. జనవరి 19, 2024న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రెండు నెలల్లోపే ఓటీటీకి వచ్చేస్తోంది. Shuru karo taiyaari, aa rahe hain Atal Bihari! #MainAtalHoon premieres on 14th March, only on #ZEE5#AtalOnZEE5#MainAtalHoon@TripathiiPankaj @meranamravi @vinodbhanu @thisissandeeps #KamleshBhanushali @thewriteinsaan #BhaveshBhanushali @directorsamkhan @BSL_Films… pic.twitter.com/so934WIZOu — ZEE5 (@ZEE5India) March 10, 2024 -
బ్లాక్‌బస్టర్ సినిమా 'గామి' ఓటీటీ వివరాలు ఇవే
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'గామి'. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ఈ చిత్రం విడుదల అయింది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు గామి టీమ్‌ను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో హీరోగా నటించిన విశ్వక్ సేన్‌కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సుమారు 30 రోజులు పట్టే అవకాశం ఉంది. 'గామి' ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు జీ5 నెట్వర్క్ వారు దక్కించుకున్నారు. ట్రైలర్‌తో అందరినీ మెప్పించిన 'గామి' రైట్స్ కోసం చాలా ఓటీటీ సంస్థలు పోటీ పడినట్లు సమాచారం. వాటన్నింటిని దాటుకుని ఫైనల్‌గా భారీ వ్యయం వెచ్చించి 'గామి' హక్కులను జీ5 సొంతం చేసుకుందట. ఏప్రిల్ రెండో వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావచ్చు అనే వార్తలు వస్తున్నాయి. విద్యాధర్ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాందినీ చౌదరి కథానాయికగా నటించారు. క్రౌడ్ ఫండింగ్‌తో కార్తీక్ శబరీష్ 'గామి' చిత్రాన్ని నిర్మించారు. రొటీన్ మూస సినిమాల నడుమ ఓ కొత్తదనం, ప్రయోగం గామిలో కనిపిస్తాయి. తక్కువ బడ్జెట్‌తోనే మనవాళ్లు ఇంతటి ప్రమాణాలతో సినిమాను చూపించగలరా అని ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. నిజానికి హీరో విశ్వక్ షేన్ను మెచ్చుకోవాలి.. 'గామి' సమయానికి ఆయన ఎవరో కూడా తెలియదు అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకుని ఉంటాడు.. ఇప్పుడైతే ఈ భిన్నమైన పాత్రను అంగీకరించేవాడో కాదో తెలియదు. ఏదేమైనా శభాస్ విశ్వక్ అంటూ సినీ అభిమానులు ప్రశంసిస్తున్నారు. -
శివరాత్రికి ఓటీటీల్లో సినిమాల జాతర.. ఒక్క రోజే 9 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ సారి ఏకంగా వీకెండ్ సెలవులు వచ్చేస్తున్నాయి. అంతే కాకుండా మహాశివరాత్రికి కూడా సెలవు రావడంతో మూడు రోజులు ఇక పండగే. ఈ నేపథ్యంలో వీకెండ్ ప్లాన్ ఇప్పటికే వేసుకుని ఉంటారు. ఏయే సినిమాలు చూడాలి? ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి? థియేటర్లకు రానున్న చిత్రాలేంటి? అనే తెగ వెతికేస్తుంటారు. మీరు ఆశించినట్టే ఈ సెలవుల్లో ఫుల్ ఎంటర్టైన్ చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. టాలీవుడ్లో భీమా, గామి లాంటి పెద్ద చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండగా.. మరో రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. మరీ ఓటీటీల సంగతేంటీ అనుకుంటున్నారా? థియేటర్ల మాదిరే సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీల్లో సందడి చేసేందుకు స్పెషల్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్, మలయాళ హిట్ మూవీ అన్వేషిప్పిన్ కండేతుమ్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. కానీ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హనుమాన్ ఈనెల 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరీ సడన్‌గా స్ట్రీమింగ్ చేసి సర్ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. లేదంటే నెక్ట్స్ వీకెండ్ దాకా ఆగాల్సిందే. వీటితో రజినీకాంత్ లాల్ సలామ్, సందీప్ కిషన్ మూవీ ఊరు పేరు భైరవకోన కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. నెట్‌ఫ్లిక్స్ మేరీ క్రిస్మస్(హిందీ సినిమా)- మార్చి 08 లోన్ అవే(వెబ్ సిరీస్)- సీజన్ 4- మార్చి 08 డామ్ సెల్ (యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 08 అన్వేషిప్పిన్ కండేతుమ్(మలయాళ డబ్బింగ్ మూవీ)- మార్చి 08 లాల్ సలామ్(తమిళ సినిమా)- మార్చి 08 ది క్వీన్ ఆఫ్ టియర్స్(కొరియన్ సిరీస్)- మార్చి 09 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్రూ లవర్(తమిళ సినిమా)- మార్చి 08 షోటైమ్ (హిందీ సినిమా)- మార్చి 08 అమెజాన్ ప్రైమ్ ఊరుపేరు భైరవకోన(తెలుగు సినిమా)- మార్చి 08 జీ5 హనుమాన్(తెలుగు సినిమా)- మార్చి 08 (రూమర్ డేట్) -
ఇది అయ్యే పని కాదు.. ఇప్పట్లో హనుమాన్ లేనట్లేనా?!
సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి.. ఒక్కటి తప్ప! అవును హనుమాన్ ఒక్కటే ఇంకా ఏ ఓటీటీలోనూ అందుబాటులోకి రాలేదు. గుంటూరు కారం.. నెట్‌ఫ్లిక్స్‌లో, సైంధవ్.. అమెజాన్ ప్రైమ్‌లో, నా సామిరంగ.. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. కానీ హనుమాన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తూ ఓటీటీని లైట్ తీసుకుంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుందని కొంతకాలంగా తెగ ప్రచారం జరుగుతోంది. అదిగో రిలీజ్.. ఇదిగో రిలీజ్.. అంటూ ఊరిస్తున్నారే తప్ప నిజంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితి! దీంతో ఓ నెటిజన్.. హనుమాన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి అని ఎక్స్(ట్విటర్)లో మొర పెట్టుకున్నాడు. ఇది చూసిన జీ5.. సదరు ట్వీట్‌కు స్పందించింది. 'హనుమాన్ రిలీజ్ విషయంలో మాకే ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు' అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కే క్లారిటీ లేనప్పుడు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో? ఏంటో? అని నిరాశ చెందుతున్నారు. రేపు రిలీజ్ చేస్తే సినిమా చూస్తూ అర్ధరాత్రి జాగారం చేసేవాళ్లంగా అని కామెంట్లు చేస్తున్నారు. Hi! We have not received any update in this regard. Please keep an eye on our website and social handles for more updates! — ZEE5 (@ZEE5India) March 7, 2024 -
ఓటీటీలోకి హిట్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే రానుందా?
హిట్ సినిమా అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రానుందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే రిలీజ్ ప్లాన్ మారిందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఓటీటీ ప్రేమికులకు పండగే. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు వచ్చే అవకాశముంది? (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) తెలుగు సినిమాలకు ఫిబ్రవరి నెల.. డ్రై సీజన్ లాంటిది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ ముగిసి కొన్నిరోజులే అయ్యింటుంది. అలానే పిల్లలకు పరీక్షల కాలం దగ్గర పడుతుంది కాబట్టి పేరెంట్స్ బయటకు వచ్చేది తక్కువే. దీంతో స్టార్ హీరోలు ఎవరూ ఫిబ్రవరిలో తమ చిత్రాల్ని ప్లాన్ చేసుకోరు. అలా మీడియం రేంజ్ చిత్రాలు వస్తుంటాయి. ఈసారి అలా వచ్చి హిట్ అయిన సినిమా 'ఊరిపేరు భైరవకోన'. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ నటించిన ఓ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇకపోతే ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని జీ5 సంస్థ దక్కించుకుంది. నాలుగు వారాల ఒప్పందం ప్రకారం మార్చి 15 తర్వాత అలా వచ్చే అవకాశముందని అనుకున్నారు. కానీ ఈ వారం చివర్లో అంటే మార్చి 8 లేదా 9వ తేదీన సర్ప్రైజ్ స్ట్రీమింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. అలానే ఈ వీకెండ్లోనే 'హనుమాన్' కూడా ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ ఉందని అంటున్నారు. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) -
ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే.. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వచ్చేసింది. గతవారంలో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. అలాగే ఈ సారి థియేటర్లలో అలరించేందుకు గోపిచంద్ భీమా, విశ్వక్ సేన్ గామి లాంటి పెద్ద చిత్రాలు వచ్చేస్తున్నాయి. అంతే కాకుండా వీటితో మలయాళ డబ్బింగ్ సినిమా ప్రేమలు కూడా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అలాగే ఓటీటీ ప్రియులు కోసం ఈ వారంలో అలరించేందుకు సినిమాలు, వెబ్ సిరీసులు సిద్ధమైపోయాయి. అయితే టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హనుమాన్ స్ట్రీమింగ్ రానుంది. మహా శివరాత్రి సందర్భంగా జీ5లో సందడి చేయనుంది. దీంతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమా అన్వేషిప్పిన్ కండేతుమ్, కన్నడ డబ్బింగ్ సినిమా 'బ్యాచిలర్ పార్టీ' కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా వచ్చేస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్.. హాట్ వీల్స్ లెట్స్ రేస్(ఇంగ్లీష్)- మార్చి 04 హన్నా గాడ్స్‌బీస్ జెండర్ అజెండా- మార్చి 05 ఫుల్ స్వింగ్(నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ -సీజన్ 2- మార్చి 06 ప్రోగ్రామ్: కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్- మార్చి 06 సూపర్ సెక్స్- మార్చి 06 ది జెంటిల్మెన్- మార్చి 07 పోకెమాన్ హారిజన్స్-(వెబ్ సిరీస్)- మార్చి 07 ది సిగ్నల్- మార్చి 07 బ్లోన్ అవే(వెబ్ సిరీస్)- సీజన్ 4- మార్చి 08 డామ్ సెల్- (యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 08 ది క్వీన్ ఆఫ్ టియర్స్(కొరియన్ సిరీస్)- మార్చి 09 అన్వేషిప్పిన్ కండేతుమ్(మలయాళ డబ్బింగ్ మూవీ)- మార్చి 8 అమెజాన్ ప్రైమ్ 'బ్యాచిలర్ పార్టీ'(కన్నడ డబ్బింగ్ సినిమా)- మార్చి 04 జీ5 హనుమాన్(తెలుగు సినిమా)- మార్చి 8 -
ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈసారి సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజైతే 'హనుమాన్' మాత్రమే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే పలు థియేటర్లలో ఇంకా ఈ మూవీ రన్ అవుతూనే ఉంది. జనాలు చూడటానికి వెళ్తూనే ఉన్నారు. తాజాగా టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే థియేట్రికల్ రన్ చివరకొచ్చేసినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ బయటకొచ్చింది. (ఇదీ చదవండి: హనుమాన్ మూవీ.. భారీ ఆఫర్ ప్రకటించిన మేకర్స్!) తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' సినిమా ఎప్పుడో థియేటర్లలోకి రావాల్సింది. కానీ గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ ఈ సంక్రాంతికి రిలీజైంది. అయితే మహేశ్, వెంకటేశ్, నాగార్జున సినిమాలు ఇదే టైంకి విడుదలకు రెడీ అయ్యాయని.. 'హనుమాన్'ని వాయిదా వేసుకోవాలని బెదిరించారు. కానీ తగ్గకుండా బరిలో నిలిబడ్డారు. పండగ విజేతగా నిలిచారు. (ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) 'హనుమాన్' చిత్ర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5 సంస్థ.. తొలుత 3-4 వారాల గ్యాప్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ దృష్ట్యా డిజిటల్ స్ట్రీమింగ్‌ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు థియేట్రికల్ రన్ చివరకొచ్చేయడంతో ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 2 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఓటీటీలోకి వచ్చేసిన సంచలన సినిమా.. అప్పుడే ట్రెండింగ్!
కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్నే కాదు ఇన్ఫర్మేషన్నూ ఇస్తాయి. అలాంటి కోవలోకే వస్తుంది ది కేరళ స్టోరీ. కేరళలో ఓ వర్గానికి చెందిన యువతులను మతం మార్చి ఉగ్రవాదులుగా తయారు చేసిన ఉదంతాలను ఆధారంగా తీసుకుని తెరకెక్కిందీ చిత్రం. ఈ సినిమా ప్రకటించిననాటి నుంచే ఎన్నో విమర్శలు చుట్టుముట్టాయి. రిలీజైనప్పుడు కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. మే నెలలో రిలీజ్.. అయినప్పటికీ అన్నింటినీ దాటుకుంటూ ప్రేక్షకాదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించాడు. గతేడాది మేలో రిలీజైన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఫిబ్రవరి 16న జీ5లో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అప్పుడే ట్రెండింగ్‌లో.. ముందుగా చెప్పినట్లుగానే శుక్రవారం నాడు ది కేరళ స్టోరీని జీ5లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అలా ఓటీటీలో విడుదలైందో లేదో ఇలా ట్విటర్లో ట్రెండ్ అవుతోందీ సినిమా. థియేటర్లో చూడటం మిస్ అయినా లేదంటే మరోసారి చూడాలనిపించినా ఆలస్యం చేయకుండా వెటనే ఓటీటీలో ది కేరళ స్టోరీపై ఓ లుక్కేయండి.. She said yes to love but what followed was nothing short of a nightmare.#TheKeralaStory streaming now, only on #ZEE5#TheKeralaStoryOnZEE5 #VipulAmrutlalShah pic.twitter.com/YcQgNb8zlQ — ZEE5 (@ZEE5India) February 16, 2024 చదవండి: హీరోయిన్ కన్నడ సీరియల్ నటి.. త్వరలోనే అక్కడ కూడా! -
ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ నాలుగు హైలెట్
మరో వారం వచ్చేసింది. రేపు (ఫిబ్రవరి 16) సందీప్ కిషన్ నటించిన భైరవకోన విడుదల కానుంది. గత వారంలో విడుదలైన రవితేజ ఈగల్, యాత్ర- 2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఓటీటీలోకి రాబోయే రెండు రోజుల్లో నా సామిరంగా, ది కేరళ స్టోరీ చిత్రాలు రానున్నాయి. దాదాపు 9 నెలల తర్వాత వివాదస్పద కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోవడంతో ఆ సినిమాపైనే అందరి గురి ఎక్కువగా ఉంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారంలో అందుబాటులో ఉండనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. డంకీ, నా సామిరంగ, సబా నాయగన్, ది కేరళ స్టోరీ నాలుగు చిత్రాలు ప్రత్యేకం. నెట్‌ఫ్లిక్స్ • డంకీ (నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది) • హౌస్ ఆఫ్ నింజాస్ (వెబ్‌సిరీస్) - ఫిబ్రవరి 15 • ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్- సీజన్-2(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 • లిటిల్ నికోలస్- హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15 • రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15 • ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 • ది క్యాచర్ వాజ్ ఏ స్పై - ఫిబ్రవరి 15 • క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 15 • ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16 • కామెడీ చావోస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 • ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) - ఫిబ్రవరి 16 • ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ • నా సామిరంగ (తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17 • సబా నాయగన్ ( తమిళ్,తెలుగు,మలయాళం,హిందీ మూవీ)- స్ట్రీమింగ్ అవుతుంది • సలార్ (హిందీ వర్షన్) - ఫిబ్రవరి 16 • ది స్టోరీ ఆఫ్ అజ్ (వెబ్ సిరీస్- 1)- - ఫిబ్రవరి 16 అమెజాన్ ప్రైమ్ వీడియో • రూట్ నం.17 ( తమిళ్ మూవీ) - ఫిబ్రవరి 15 • అమవాస్ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 16 • లవ్‌స్టోరీ యాన్ (హిందీ వెబ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది జీ5 • ది కేరళ స్టోరీ (బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16 • క్వీన్ ఎలిజిబెత్ (తమిళ్,మలయాళం మూవీ) - స్ట్రీమింగ్ అవుతుంది -
ఓటీటీల్లో సినిమాల జాతర.. ఈ వారంలో ఏకంగా 21 సినిమాలు!
మరో వారం వచ్చేసింది. గతవారంలో బాక్సాఫీస్ వద్ద ఈగల్ లాంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. అంతే కాకుండా సంక్రాంతికి రిలీజైన చిత్రాలు సైతం ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. మరీ ఈ వారంలో ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో తెలుసుకోవాలని ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ వారంలో తెలుగు ప్రేక్షకులను అలరించేదుకు నాగార్జున వచ్చేస్తున్నాడు. సంక్రాంతికి సందర్భంగా రిలీజైన నా సామిరంగ ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా దాదాపు 9 నెలల తర్వాత వివాదస్పద కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోయింది. ఆ రెండు సినిమాలే ప్రేక్షకులకు కాస్తా ఇంట్రెస్ట్ పెంచేస్తున్నాయి. వీటితో పాటు పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఈ వారంలో అలరించనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ కిల్ మీ ఇఫ్ యూ డేర్(నెట్‌ఫ్లిక్స్ మూవీ) - ఫిబ్రవరి 13 సదర్లాండ్ టిల్ ఐ డై -సీజన్-3(డాక్యుమెంటరీ సిరీస్) - ఫిబ్రవరి 13 టేలర్ టామ్లిన్సన్ : హ్యావ్ ఇట్ ఆల్(కామెడీ సిరీస్) - ఫిబ్రవరి 13 ఏ సోవేటో లవ్ స్టోరీ - ఫిబ్రవరి 14 గుడ్ మార్నింగ్ వెరోనికా- సీజన్-3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14 ది హార్ట్ బ్రేక్ ఏజెన్సీ - ఫిబ్రవరి 14 లవ్ ఇజ్ బ్లైండ్- సీజన్ 6(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14 ప్లేయర్స్(నెట్‌ఫ్లిక్స్ మూవీ) - ఫిబ్రవరి 14 ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్- సీజన్-2(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 హోస్ ఆఫ్ నింజాస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 లిటిల్ నికోలస్- హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15 రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15 ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 ది క్యాచర్ వాజ్ ఏ స్పై - ఫిబ్రవరి 15 క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 15 ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16 కామెడీ చావోస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) - ఫిబ్రవరి 16 ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నా సామిరంగ(తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17 జీ5 ది కేరళ స్టోరీ(బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16 -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం వస్తోందంటే చాలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న దానిపై ఆసక్తితో ఉంటారు ఆడియన్స్. అలాగే ఓటీటీలోనూ ఏయే సినిమాలు వస్తున్నాయో అని ఎదురు చూస్తుంటారు. అయితే ఈ వారంలో పెద్ద సినిమాల సందడి చేయనున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలు ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైపోయాయి. సంక్రాంతి రిలీజైన సినిమాల్లో ఇప్పటికే సైంధవ్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మహేశ్ బాబు గుంటూరు కారం, ధనుశ్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ ఈ వీకెండ్లో అలరించనున్నాయి. వీటితో పాటు భూమి పెడ్నేకర్ భక్షక్ క్రైమ్ థ్రిల్లర్, సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. మరీ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఓ లుక్కేయండి. అంతే కాకుండా ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు మాస్ మహారాజా రవితేజ ఈగల్ వచ్చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న యాత్ర-2 ఈ వారంలోనే థియేటర్లకు రానుంది. ఈనెల 8న యాత్ర-2 థియేటర్లలో విడుదలవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08 గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09 భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09 లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09 యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09 ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09 ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09 హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10 బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 అమెజాన్ ప్రైమ్ కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-09 జీ5 కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09 జియో సినిమా హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8 సన్ నెక్ట్స్ అయలాన్- (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి 09 -
ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఎట్టకేలకు 'ద కేరళ స్టోరీ' సినిమా ఓటీటీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. గతేడాది వేసవిలో థియేటర్లలోకి వచ్చినప్పుడు పలు వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడు ఇప్పుడని అన్నారు. కానీ చివరకు ఇప్పుడు అధికారికంగా ఓటీటీ పార్ట్నర్, స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన అదాశర్మ.. 'ద కేరళ స్టోరీ' మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. థియేటర్ రిలీజ్‌కి ముందే డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5.. కాంట్రవర్సీ వల్లో ఏమో గానీ స్ట్రీమింగ్ తేదీ లాంటివి ఏం చెప్పకుండా వచ్చింది. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక.. తెలుగులో ఈమెనే టాప్?) ఫైనల్ ఇప్పుడు ముహూర్తం కుదిరినట్లు ఉంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని అధికారికంగా ట్వీట్ పెట్టి మరీ ప్రకటించింది. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అయిపోతున్నారు. నెక్స్ట్ వీకెండ్లో పక్కా చూసేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు. 'ద కేరళ స్టోరీ' సినిమా కథ విషయానికొస్తే.. ముగ్గురు అమ్మాయిలు ప్రధానంగా ఉంటుంది. ఇందులో షాలినీ (అదా శర్మ) కథ మెయిన్ పార్ట్. ఈ అమ్మాయిలు ముగ్గురిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి వేసుకొని ఇస్లాం మతంలోకి మార్చి విదేశాలకు తీసుకెళ్లి ఉగ్రవాదులుగా మార్చాలని కొందరు ప్రయత్నిస్తారు. షాలినీని అఫ్గానిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. అలానే పెళ్లి చేసుకొని తీసుకెళతాడు. చివరకు షాలినీ పరిస్థితి ఏమైంది? తప్పించుకోగలిగిందా? అనేదే ఈ మూవీ. (ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన) The wait is officially over! The most anticipated film is dropping soon on ZEE5!#TheKeralaStory premieres on 16th February, only on #ZEE5#TheKeralaStoryOnZEE5 #VipulAmrutlalShah pic.twitter.com/4mBGyTTp4S — ZEE5 (@ZEE5India) February 6, 2024 -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు.. ఆ మూడు మాత్రం స్పెషల్!
మరోవారం రానే వచ్చింది. వీకెండ్ ముగియడంతో సినీ ఆడియన్స్ ఎప్పటిలాగే వర్క్ మోడ్‌లోకి వెళ్లిపోతారు. దీంతో ఓటీటీల్లో వచ్చే సినిమాల కోసం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. కాగా.. గతవారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఒకటి, రెండు చిత్రాలు మినహా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వచ్చేవారంలో ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో అన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వారంలో ముఖ్యంగా సంక్రాంతికి సందడి చేసిన సినిమాలు వచ్చేస్తున్నాయి. అందులో మహేశ్ బాబు గుంటూరు కారం, కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ కెప్టెన్ మిల్లర్, కన్నడ స్టార్ దర్శన నటించిన కాటేరా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. వీటితో భూమి ఫెడ్నేకర్ క్రైమ్ థ్రిల్లర్ భక్షక్, సుస్మితా సేన్ ఆర్య-3 వెబ్ సిరీస్ ఆసక్తి పెంచుతున్నాయి. అంతే కాకుండా ఈ వారంలో మాస్ మహారాజా నటించిన ఈగల్ థియేటర్ల వద్ద సందడి చేయనుంది. మరీ ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్)- ఫిబ్రవరి 05 ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్డమ్ - ఫిబ్రవరి 05 మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్)- ఫిబ్రవరి 05 మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్)-ఫిబ్రవరి 05 ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్)-ఫిబ్రవరి 05 లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్)- ఫిబ్రవరి 07 రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 07 లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07 వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08 గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09 భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09 లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09 యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09 ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09 ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09 హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10 బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 అమెజాన్ ప్రైమ్ కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-0 9 జీ5 కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09 జియో సినిమా ది ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్) - ఫిబ్రవరి 6 ది నన్ 2 - ఫిబ్రవరి 7 హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8 -
సలార్‌తో పోటీ పడిన సూపర్ హిట్ మూవీ.. ఓటీటీకి వచ్చేస్తోంది!
కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన చిత్రం కాటేరా. గతేడాది సలార్‌కు పోటీగా కర్ణాటకలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తరుణ్ సుధీర్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 9న నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. కన్నడలో సలార్ మూవీకి పోటీగా డిసెంబర్ 29న కాటేరా రిలీజైంది. పెద్ద సినిమాతో పోటీ కలెక్షన్స్ రాబట్టింది. ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సలార్‌ను పక్కకు నెట్టి భారీ వసూళ్లు సాధించింది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఫిబ్రవరి 9న ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అయితే మొదట దర్శన్ బర్త్ డే సందర్భంగా ఈనెల 16న ఓటీటీకి తీసుకురావాలని నిర్ణయించారు. కానీ వారం రోజులు ముందుగానే స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. అయితే ఈనెల 9న కేవలం కన్నడలోనే అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం వర్షన్లు మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా.. కాటేరా 2023లో శాండల్‌వుడ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నిలిచింది. కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాల్లో ఏడో స్థానంలో నిలిచింది.ఈ చిత్రంలో సీనియర్ కథానాయిక మాలాశ్రీ కూతురు ఆరాధన రామ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే ఆమె కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రాక్‌లైన్ వెంకటేష్ ఈ మూవీని నిర్మించాడు. -
Hanuman OTT Rights: భారీ ధరకు 'హనుమాన్' ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా నేడు (జనవరి 12న) విడుదలైన హనుమాన్ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఒకరోజు ముందే అంటే నిన్ననే భారీగా ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. తెలుగులో 'సూపర్‌మ్యాన్' జోనర్ చిత్రాలు రావడం చాలా అరుదు. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రంతో ఆ లోటు తీర్చడమే కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇందులో కథానాయకుడు తేజ సజ్జా రోల్ చాలా చక్కగా ఉంటుంది. తనలోని ఉన్న టాలెంట్ మొత్తాన్ని ఈ సినిమా కోసం ఉపయోగించాడు. అందుకే అతను తెరపై కనిపించినప్పుడు విజిల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా చాలా తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన సినిమాను ప్రశాంత్ వర్మ తీశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 దక్కించుకుంది. పాన్ ఇండియా రేంజ్‌కు తగ్గట్లు సినిమా ఉండటంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీలోకి వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయమే పడవచ్చని సమాచారం. (ఇదీ చదవండి: Hanu Man Review : ‘హను-మాన్’ మూవీ రివ్యూ) ఏదేమైనా మార్చి నెలలో హనుమాన్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉన్నట్లు సినిమా ఎండ్ కార్డ్‌లో ఉంటుంది. 2025లో జై హనుమాన్ పేరుతో పార్ట్-2 వస్తుందని దర్శకుడు ప్రకటించాడు. తేజ సజ్జ, అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్,సముద్రఖని వంటి నటీనటులు హనుమాన్‌లో నటించారు. చిన్న సినిమాగా మొదలైనప్పటికీ క్రమంగా స్కేల్‌ని పెంచుకొని 12 భాషల్లో విడుదల అయ్యేలా ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. పెద్ద సినిమాలకు దీటుగా సంక్రాంతి బరిలో హనుమాన్ నిలిచి హిట్ టాక్‌తో దూసుకుపోతున్నాడు. ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే.. హనుమాన్ సినిమాపై విడుదల ముందు నుంచే భారీ క్రేజ్ ఏర్పడింది. ఓటీటీ హీందీ వర్షన్ రూ. 5కోట్లు, తెలుగు వర్షన్ రూ. 11 కోట్లకు హనుమాన్కు సంబంధించిన హక్కులు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఎంటర్టైనింగ్ సంస్థ 'జీ5' ఈ హక్కుల్ని దక్కించుకుంది. ఓ యువ హీరో నాలుగో సినిమానే ఇంత భారీ ధర పలకటం విశేషమని అప్పట్లో సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. -
ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం రిలీజై నెలలు గడుస్తున్నా ఓటీటీలో రాలేదు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా కొత్త ఏడాదిలో ఈ చిత్రం ఓటీటీ రానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఈ మూవీ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారు మేకర్స్. చిన్న సినిమాగా వచ్చిన ది కేరళ స్టోరి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. వివాదాలు ఎదురైనప్పటికీ అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కొత్త ఏడాదిలో సంక్రాంతి కానుకగాా ఈ చిత్రాన్ని జనవరి 12న లేదా జనవరి 19న స్ట్రీమింగ్ వచ్చే అవకాశమున్నట్లు సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా.. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రలలో నటించారు. వివాదాస్పదంగా మారిన ఈ సినిమా 2023 మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!
సినీ ఆడియన్స్ ప్రస్తుతం ఓటీటీల పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే వారంలో సంక్రాంతి సందడి మొదలు కానుంది. ఇప్పటికే పొంగల్‌కు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. ఈ వారంలో దాదాపు థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రం రిలీజ్ కానున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీల్లో ఏయే చిత్రాలు వస్తున్నాయో తెలుసుకోవాలనే ఆరాటంతో ఉన్నారు. ఈ వీకెండ్లో మిమ్మల్ని అలరించేందుకు పలు చిత్రాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అయితే ఈ వారంలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ -2 లాంటి సినిమాలు కాస్తా ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీకీ రానుందో ఓ లుక్కేద్దాం. ఈ వీకెండ్లో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04 హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04 సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04 ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04 కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05 గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియోంగ్‌సోంగ్ క్రియేచర్ పార్ట్ 2(దక్షిణ కొరియా సిరీస్)- జనవరి 5 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03 పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05 అమెజాన్ ప్రైమ్ ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05 లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05 జీ5 తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05 బుక్ మై షో ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05 వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియో సినిమా మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03 సోనీ లివ్ క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05 సైనా ప్లే ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05 క్రంచీ రోల్ సోలో లెవెలింగ్- (సౌత్ కొరియా సిరీస్)- జనవరి 6 -
ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరోయిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్. 2006లో బాలీవుడ్ హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగింది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చే రేంజ్‌కు చేరుకుంది. అయితే సినిమాలతో పాటు అంతేస్థాయిలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తోన్న కంగనా.. ఈ ఏడాది తేజస్ మూవీతో అభిమానులను పలకరించింది. అక్టోబర్ 27న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చంద్రముఖి -2 తర్వాత నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి జీ5 స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించగా.. ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. View this post on Instagram A post shared by ZEE5 (@zee5) -
ఓటీటీలోకి వచ్చేసిన వీరప్పన్ సిరీస్.. ఇందులో అదే స్పెషల్!
కూసీ మునిసామి వీరప్పన్ అంటే చాలా మందికి తెలియదు. అదే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అంటే తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈయన అసలు పేరు కూసీ మునిసామి వీరప్పన్. ఈయన గురించి ఇప్పటికే పలు చిత్రాలు, సీరియల్స్ రూపొందాయి. తాజాగా ఆయన నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'కూసీ మునిసామి వీరప్పన్' అనే డాక్యుమెంటరీ సిరీస్ తెరకెక్కింది. దీన్ని నక్కీరన్ గోపాల్(ఈయన టీమ్.. వీరప్పన్‌ను అప్పట్లో ఇంటర్వ్యూ చేశారు) కూతురు ప్రభావతి.. ధీరన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. శరత్ జ్యోతీ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ సిరీస్ నేటి(డిసెంబర్ 14) నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. నక్కిరన్ గోపాలన్‌తో ఆయన కూతురు ప్రభావతి చాలామంది నా దగ్గరకు వచ్చారు ఈ సందర్భంగా యూనిట్ వర్గాలు చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న నక్కీరన్ గాపాలన్ మాట్లాడుతూ.. నక్కీరన్ అంటే ధైర్యం కావాలనీ, ఆ తరువాత వీరప్పన్ అంటే ఇంకా ధైర్యం కావాలని అన్నారు. కూసీ మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్‌తో ఈ రెండింటినీ సాధ్యం చేశారని పేర్కొన్నారు. వీరప్పన్ కథతో చిత్రాన్ని చేయడానికి చాలా మంది తన వద్దకు వచ్చారని, తన కూతురు అడగడానికి ముందు దివంగత దర్శకుడు బాలు మహేంద్ర కూడా తనను అడిగారనీ చెప్పారు. అయితే దాన్ని సరిగా చేయాలన్న ఉద్దేశంతో తాను వీరప్పన్‌ను ఇంటర్వ్యూ చేసిన వీడియోను ఎవరికీ ఇవ్వలేదని చెప్పారు. వీరప్పన్‌కు నేనంటే ఇష్టం ఈ వీడియో కోసం తన టీమ్ చాలా కోల్పోయినట్లు పేర్కొన్నారు. వీరప్పన్ గురించి ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాలు, సీరియల్స్ అన్నీ పోలీసుల కథనాలతో రూపొందాయన్నారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ మాత్రమే వీరప్పన్ స్వయంగా చెప్పిన సంఘటనలతో రూపొందించబడిందన్నారు. దీన్ని తన కూతురు టీమ్ చాలా బాగా రూపొందించిందని చెప్పారు. తనకు వీరప్పన్ అంటే ఇష్టం అనీ, ఆయనకు తానంటే ఇష్టం అనీ, అలాగని తాను ఈ సిరీస్‌తో వీరప్పన్‌కు అనుకూలంగా రిపోర్ట్ చేయలేదనీ చెప్పారు. తాము బాధింపుకు గురైన ప్రజల తరపునే నిలిచామని చెప్పారు. చదవండి: ఆ సీన్ లేకుంటే ‘యానిమల్’ ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు: బాబీ డియోల్ -
'మొసళ్లు సిద్ధంగా ఉన్నాయి'.. సూపర్ స్టార్‌కు స్వీట్ వార్నింగ్!
జైలర్ మూవీ సక్సెస్ కావడంతో సూపర్ స్టార్ తలైవా మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా డిసెంబర్ 12న ఆయన తన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విషెస్ తెలిపారు. అయితే రజినీకాంత్ గతంలో రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తలైవా పక్కకు తప్పుకున్నారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్.. గతంలోనే తలైవాను హెచ్చరించినట్లు తాజాగా ఓ వీడియో వైరలవుతోంది. ఎంజీఆర్‌లాగే రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో వీరప్పన్ ముందు జాగ్రత్తగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కూసే మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ సందర్భంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 రిలీజ్ చేసిన వీడియోలో కనిపించింది. కానీ అందులో.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తల నేపథ్యంలో వీరప్పన్ తనదైన శైలిలో స్పందించినట్లు తెలుస్తోంది. ఆయనను దోచుకునేందుకు.. మింగేసేందుకు చాలా మొసళ్లు వేచి చూస్తున్నాయని రజినీకాంత్‌ను వీరప్పన్ ఆ వీడియోలో హెచ్చరించారు. అయితే ఈ వీడియో మూవీ ప్రమోషన్స్‌లో భాగమే అయినప్పటికీ.. అందులో వీరప్పన్ మాట్లాడిన మాటలు నిజమేనని తెలుస్తోంది. వీడియోలో వీరప్పన్ మాట్లాడుతూ..'అప్పట్లో ఎంజీఆర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశారు. కానీ ఎంజీఆర్ లాంటి వాళ్లు మళ్లీ పుట్టడం కష్టం. రజినీకాంత్ కూడా అలా అవుతారని నాకు బాగా తెలుసు. ఆయన దేవుడిని బాగా నమ్ముతారు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. కానీ నేను మీకు విషయం చెప్పదలచుకున్నా. అయ్యా రజనీకాంత్.. మీరు రాజకీయాల్లోకి రావద్దు. ఎవరికీ సపోర్ట్ చేయొద్దు. మిమ్మల్ని మింగడానికి అక్కడ మొసళ్లు రెడీగా ఉన్నాయి. ఒక్కసారిగా నీపై దాడి చేస్తాయి. దయ చేసి నువ్వు బలికావద్దు' అంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో తెగ వైరలవుతోంది. వీరప్పన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన కూసే మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్ ఈ నెల 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. -
‘ప్రేమ విమానం’ మూవీ రివ్యూ
టైటిల్: ప్రేమ విమానం నటీనటులు: అనసూయ భరద్వాజ్, సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, 'వెన్నెల' కిశోర్ తదితరులు నిర్మాణ సంస్థలు: అభిషేక్ పిక్చర్స్, జీ 5 నిర్మాత: అభిషేక్ నామా దర్శకత్వం: సంతోష్ కట్టా సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి విడుదల తేది: అక్టోబర్ 12, 2023 ఓటీటీ వేదిక: జీ5 ‘ప్రేమ విమానం’ కథేంటంటే.. రాము(దేవాన్ష్ నామా), లక్ష్మణ్ అలియాస్ లచ్చి (అనిరుధ్ నామా) చిన్న పిల్లలు. విమానం ఎక్కాలనేది వారిద్దరి కోరిక. తమ కోరికను తండ్రి(రవివర్మ)కి చెబితే..పంటలు పండిన తర్వాత కచ్చితంగా విమానం ఎక్కిస్తా అని మాటిస్తాడు. కొన్నాళ్లకే అప్పుల బాధతో తండ్రి ఉరేసుకొని మరణిస్తాడు. తల్లి శాంతమ్మ(అనసూయ భరద్వాజ్) కూలి పనికెళ్తూ పిల్లలను పోషించుకుంటుంది. వాళ్లు మాత్రం విమానం ఎక్కాలనే కోరికతో తల్లికి తెలియకుండా రకరకాలు పనులు చేస్తుంటారు. కట్ చేస్తే.. మణికంఠ అలియాస్ మణి(సంగీత్ శోభన్)కు ఆ ఊరి సర్పంచ్ కూతురు అభిత(శాన్వీ మేఘన)అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆమెకు కూడా మణిని ప్రేమిస్తుంది. ఆ కారణంగానే మణి ఉర్లోనే ఉంటూ తండ్రి(గోపరాజు రమణ)తో కలిసి కిరాణం కొట్టు రన్ చేస్తుంటాడు. అభితకు అమెరికా నుంచి సంబంధం రావడంతో తండ్రి ఆ పనుల్లో బిజీగా ఉంటాడు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని అభిత..మణితో కలిసి ఊరి నుంచి పారిపోతారు. దుబాయ్‌కి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసమే హైదరాబాద్ వస్తారు. మరోవైపు విమానం ఎక్కాలనే పిచ్చితో ఇంట్లో తల్లి దాచిన డబ్బును దొంగిలించి రాము, లక్ష్మణ్ హైదరాబాద్‌కు వస్తారు. ఎయిర్పోర్ట్ కోసం వెతుకుతుంటారు. అప్పుడు వారికి ఎదురైన సమస్యలు ఏంటి? రాము, లక్ష్మణ్‌లు.. మణి, అభితలకు ఎలా కలిశారు? విమానం ఎక్కాలనే వారి కోరిక నెరవేరిందా లేదా? ఊర్లో నుంచి కూతురు పారిపోయిన తర్వాత సర్పంచ్ ఏం చేశాడు? మణి, అభితలు దుబాయ్‌కి వెళ్లారా లేదా? చివరకు ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. టైటిల్‌కు దగ్గట్టే ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు విమానం స్టోరీ రెండూ ఉంటాయి. విమానం ఎక్కాలనే ఇద్దరి పిల్లల కోరిక.. ప్రేమను దక్కించుకోవాలనే ఓ జంట తపన ఈ చిత్రంలో చూడొచ్చు. ఓ వైపు పిల్లలు, మరో వైపు ప్రేమ జంట.. ఒకే సమయంలో రెండు డిఫరెంట్ కథలను చెబుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు కొంతమేర సఫలం అయ్యాడు. ఒకే సమయంలో రెండు డిఫరెంట్ సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా క్లైమాక్స్‌లో ఈ రెండు కథలను ముడిపెడుతూ అల్లుకున్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే పిల్లల కథ చూస్తున్నంత సేపు మనకు ఈ మధ్యే వచ్చిన ‘విమానం’సినిమా గుర్తుకొస్తుంది. మణి, అభితల లవ్‌స్టోరీలో కొత్తదనం లేదు కానీ బోర్ కొట్టదు. విమానం ఎక్కాలనే చిన్న పిల్లల కోరికను తెలుపుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. రైతు ఆత్మహత్యతో కథ ఎమోషనల్ వైపు టర్న్ తీసుకుంటుంది. డబ్బును చెల్లించేందుకు శాంతమ్మ పడే కష్టాలు భావోద్వేగానికి గురిచేస్తే.. విమానం ఎక్కేందుకు పిల్లలు చేసే పనులు.. స్కూల్ టీచర్ గోపాల్(వెన్నెల కిశోర్)ని అడిగే ప్రశ్నలు నవ్వులు పూయిస్తాయి. మరోవైపు మణి, అభిత లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. కథపై ఆసక్తి వచ్చేలోపు శుభం కార్డు పడుతుంది. రెండు వేరు వేరు కథలను బ్యాలెన్స్ చేయడంలో సఫలమైన దర్శకుడు..ఎమోషన్స్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చూపించడంలో మాత్రం విఫలం అయ్యాడు. సినిమాల్లో గుండెల్ని పిండేసే సన్నివేశాలు చాలా ఉన్నాయి కానీ వాటిని లైట్‌గా చూపించి వదిలేశాడు. స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త ఫోకస్ చేసి బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ముందుగా ఈ చిత్రంలో రాము, లచ్చి పాత్రల్లో దేవాన్ష్ నామా, అనిరుధ్ నామాల గురించి చెప్పుకోవాలి. వీరిద్దరికి తొలి సినిమా అయినా చక్కగా నటించారు. ముఖ్యంగా అనిరుధ్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. ఇక ఈ మధ్యే ‘మ్యాడ్’ చిత్రంతో అలరించిన సంగీత్ శోభన్.. ఇందులో ప్రేమికుడుగా నటించి మెప్పించాడు. అతని కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సంగీత్‌కు జోడీగా శాన్వీ మేఘన తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. శాంతమ్మగా అనసూయ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. వెన్నెల కిశోర్, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రైట్స్ ఫిక్స్.. సినీ చరిత్రలో ఇదే టాప్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ మళ్లీ పట్టాలెక్కనుంది. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ ఇందులో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో చరణ్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ కార్యక్రమం అంతా కూడా హైదరాబాద్ పరిసరప్రాంతాల్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: కుమార్తెను తలుచుకుని విజయ్ ఆంటోనీ భార్య ట్వీట్.. చచ్చిపోతున్నా అంటూ..) 2024 వేసవిలో గేమ్ ఛేంజర్ విడుదల కానుందని సమాచారం. అయితే, ఈ సినిమాపై మరోక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పాన్ ఇండియా రేంజ్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ OTT రైట్స్‌ను ZEE5 సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ డిజిటల్ హక్కుల కోసం ZEE5 ప్లాట్‌ఫామ్ అన్ని భాషలకు కలుపుకుని సుమారు రూ.250 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేసినట్లు రికార్డుకెక్కనుంది. రామ్ చరణ్ చిత్రానికి సంబంధించిన అత్యధిక డీల్‌గా ఇదీ చరిత్రలో నిలిచిపోతుంది. జూ.ఎన్టీఆర్ ‘దేవర’ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ. 90 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది రానుంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్.జే.సూర్య, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి అయింది. -
ఉచితంగా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు.. అదిరిపోయే జియో కొత్త ప్లాన్స్
రిలయన్స్ జియో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్లు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తాయి. అపరిమిత కాలింగ్, డేటా అలాగే సోనీ లివ్ (SonyLiv), జీ5 (Zee5) కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. రూ. 3662 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 2.5 GB డేటా, అపరిమిత 5G డేటా, రోజుకు 100 SMSలతో వస్తుంది. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు ఉచితంగా వస్తాయి. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ. 3226 ప్లాన్: ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMSలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు సోనీలివ్ సబ్స్క్రిప్షన్లు ఇతర ప్రయోజనాలు. రూ. 3225 ప్లాన్: ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా కోటా, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు ఈ ప్లాన్‌లో జీ5 సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇక ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వద్దనుకున్నవారికి తక్కువ ధరకు మరో వార్షిక ప్లాన్ అందుబాటులో ఉంది. అదే రూ. 1,999 ప్లాన్. ఇది అపరిమిత 5G డేటా, కాలింగ్‌తో వస్తుంది. వీటితో పాటు 2.5GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMS కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో థర్డ్-పార్టీ ఓటీటీ ప్రయోజనాలేవీ లేవు కానీ ఇందులో జియో యాప్‌లు, సేవలకు యాక్సెస్ ఉంటుంది. -
సినీ ప్రియులకు పండగే.. ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు!
సినీ ప్రియులకు ఈ వారంలో సందడే సందడి. ముఖ్యంగా మిమ్మల్ని అలరించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాల జాతర కొనసాగనుంది. ఈసారి ఏకంగా 20 సినిమాలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఓటీటీ రిలీజెస్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మీకిష్టమైన సినిమాలేవీ? ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేయండి. అలాగే ఓటీటీతో పాటు థియేటర్లలోనూ నాలుగు చిన్న సినిమాలు ఈ వారంలో సందడి చేయనున్నాయి. పెద్ద సినిమాలు అన్ని సెప్టెంబర్ చివరి వారానికి మారిపోవడంతో చిన్న సినిమాల హవా నడవనుంది. అందులో సప్త సాగారాలు దాటి, నెల్లూరి నెరజాణ, చీటర్, నేనే సరోజ లాంటి చిత్రాలు ఈనెల 22న రిలీజ్ కానున్నాయి. నెట్ ఫ్లిక్స్ 1. ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ - సెప్టెంబరు 19 (స్ట్రీమింగ్ అవుతోంది) 2. లవ్ ఎగైన్ - సెప్టెంబరు 20 (స్ట్రీమింగ్ అవుతోంది) 3. జానే జాన్- సెప్టెంబరు 21 4. కెంగన్ అసుర సీజన్ 2 - సెప్టెంబరు 21 5. సిజర్ సెవన్ సీజన్ 4 - సెప్టెంబరు 21 6. సెక్స్ ఎడ్యుకేషన్- సీజన్ 4 - సెప్టెంబరు 21 7. హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ - సెప్టెంబరు 22 8. లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 - సెప్టెంబరు 22 9. సాంగ్ ఆఫ్ బండిట్స్ - సెప్టెంబరు 22 10. స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ - సెప్టెంబరు 22 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 11. అతిథి - సెప్టెంబరు 19 (స్ట్రీమింగ్ అవుతోంది) 12. దిస్ ఫుల్ సీజన్ 2 - సెప్టెంబరు 20( స్ట్రీమింగ్ అవుతోంది) 13. కింగ్ ఆఫ్ కొత్త - సెప్టెంబరు 22 14. నో వన్ విల్ సేవ్ యూ - సెప్టెంబరు 22 15. ద కర్దాషియన్స్ సీజన్ 4 - సెప్టెంబరు 23 అమెజాన్ ప్రైమ్ 16. కసండ్రో - సెప్టెంబరు 22 17. ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్విక్ - సెప్టెంబరు 22 18. బ్లడ్ అండ్ చాక్లెట్- సెప్టెంబర్ 19 (స్ట్రీమింగ్ అవుతోంది) ఆపిల్ ప్లస్ టీవీ 19. స్టిల్ అప్ - సెప్టెంబరు 22 లయన్స్ గేట్ ప్లే 20. హీల్స్ సీజన్-2- సెప్టెంబర్ 22 హోయ్‌చోయ్ 21. శిబ్పూర్ - సెప్టెంబర్ 22 -
ఓటీటీలోకి హాస్టల్ కుర్రాళ్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అలానే బాగుంటే.. ప్రాంతీయ సినిమాల్ని భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో ఓ కన్నడ సినిమా.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. కొన్నిరోజుల ముందు మన దగ్గర థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. చాలా త్వరగానే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. పైన చెప్పినదంతా కూడా 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' గురించే. కన్నడలో జూలై 21న రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెద్దగా స్టార్స్ ఎవరూ నటించలేదు. సినిమాలో ఉన్నదంతా కుర్రాళ్లే. అయినా సరే హాస్టళ్ల కుర్రాళ్ల కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మూడు రెట్ల లాభాలు అందించారు. దీంతో తెలుగులోని డబ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) ఓటీటీ డేట్ అదే కన్నడలో రిలీజైన దాదాపు నెల రోజుల తర్వాత అంటే ఆగస్టు 26న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 'బాయ్స్ హాసల్' పేరుతో రిలీజ్ చేశారు. ఏమైందో ఏమో గానీ తెలుగు ప్రేక్షకులు.. దీన్ని థియేటర్లలో చూడటానికి పెద్దగా ఇష్టపడలేదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు జీ5లో సెప్టెంబరు 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. ఓటీటీలో కాబట్టి తెలుగు ప్రేక్షకులు అస్సలు మిస్సవరు. కథేంటి? హాస్టల్ రూంలో ఉండే స్టూడెంట్స్‌లో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది. పరీక్షలు ఉన్నాయని ఫ్రెండ్స్ వద్దంటారు. ఓ రోజు హఠాత్తుగా వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకి వీళ్లే కారణమని, సదరు వార్డెన్ ఈ ఐదుగురు అబ్బాయిల పేర్లు ఓ నోట్లో రాసి ఉంటాడు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు ఈ కుర్రాళ్లు, ఓ సీనియర్ని హెల్ప్ అడుగుతారు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: మంచు విష్ణు సినిమాలో ప్రభాస్.. కారణం అదా?) -
ట్రాన్స్‌జెండర్‌గా స్టార్ హీరో.. ఓటీటీలో సినిమా డైరెక్ట్ రిలీజ్
ఈ మధ్య హిందీలో 'తాలీ' అనే వెబ్ సిరీస్ రిలీజైంది. ఇందులో స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్, హిజ్రాగా నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఓ స్టార్ హీరో ట్రాన్స్‌జెండర్ సినిమాతో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇది కూడా నేరుగా ఓటీటీలోనే విడుదల కానుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేయడంతో పాటు ట్రైలర్ రిలీజ్ చేశారు. దీంతో స్టోరీ ఏంటనేది రివీల్ అయింది. ట్రైలర్ టాక్? సాధారణంగా హిజ్రా గెటప్‌తో సినిమా అనగానే సెంటిమెంట్ లేదా రివేంజ్ స్టోరీలే దాదాపుగా ఉంటాయి. 'కాంచన', 'తాలీ' ఇవన్నీ కూడా ఇలాంటివే. అయితే బాలీవుడ్ స్టార్ హీరో నవాజుద్దీన్ సిద్దిఖీ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్న 'హడ్డీ' మాత్రం గ్యాంగస్టర్ తరహా మూవీలా అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ఇదే వైబ్స్ వచ్చాయి. (ఇదీ చదవండి: 'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!) స్టోరీ ఏంటి? హరి(నవాజుద్దీన్) అనే కుర్రాడు అమ్మాయిగా మారాలనుకుంటాడు. అలానే ఔరంగబాద్‌లో చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేసుకుంటూ బతుకుతుంటాడు. అక్కడ నుంచి దిల్లీకి వచ్చిన హరి.. ట్రాన్స్‌జెండర్‌గా మారతాడు. కానీ అతడికి అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. దీంతో తనకు ఆశ్రయమిచ్చిన హిజ్రా కమ్యూనిటీపై రివేంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు. చివరకు ఏమైందనేదే 'హడ్డీ' మెయిన్ స్టోరీ. ఓటీటీలోకి అప్పుడే ఇకపోతే నవాజుద్దీన్ హీరోగా నటిస్తున్న 'హడ్డీ' సినిమా.. జీ5లో సెప్టెంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీలో డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్న ఇతడు.. వెంకటేశ్ 'సైంధవ్' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా.. డిసెంబరు 23న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: రిస్క్ చేస్తున్న 'ఖుషి'.. ఆ ఒక్కటి మాత్రం!) -
ఓటీటీకి వచ్చేసిన 'విమానం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విమానం'. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో జూన్ 9న ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. (ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!) జూన్ 30 నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. థియేటర్లలో చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
ఒటీటీ నుంచి వస్తున్న మొదటి స్పై థ్రిల్లర్ మూవీ ఇదే..
వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ ప్లాట్‌ఫాం జీ 5. ఇప్పుడు సరికొత్త యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ తషాఫి’ ఒరిజినల్‌తో ఆకట్టుకోవటానికి సిద్ధమవుతోంది. ఎంగేజింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీష్ కురువిల్లా, ఛత్రపతి శేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రధాన తారాగణంగా నటించబోయే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. హై ఇంటెన్స్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘మిషన్ తషాఫి’ ఒరిజినల్ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. (ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్) 8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను ఫిల్మ్ రిపబ్లిక్ బ్యానర్‌పై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని విధంగా ఈ హై ఇన్టెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌ను జీ 5 భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్రముఖ అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చిత్రీకరించని సరికొత్త లొకేషన్స్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న హీరోయిన్ లిప్‌లాక్ వీడియో) -
ఈ ఫ్రైడే ఓటీటీలో 15 సినిమాలు.. ఏవి ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఫ్రైడే.. సినిమా లవర్స్‌కు మాత్రం ఇది సినీ డే. ఎందుకంటే బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రత్యేకంగా శుక్రవారమే రిలీజవుతాయి. ప్రతి ఫ్రైడే పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతాయి. కొన్ని థియేటర్లలో సందడి చేస్తే మరికొన్ని మాత్రం ఓటీటీని షేక్ చేస్తుంటాయి. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు బయటకు వెళ్లడం కష్టం అనుకుంటున్నవాళ్లకు ఓటీటీ కూర్చున్నచోటే కావాల్సినంత వినోదాన్ని ఇస్తోంది. మరి ఈ శుక్రవారం (జూన్ 2) ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లేంటో చూద్దామా.. అమెజాన్ ప్రైమ్ వీడియో ► ఉగ్రం ► డెడ్ లాక్ - ఇంగ్లీష్ సిరీస్ జీ5 ► విశ్వక్ ► ఘర్ బందూక్ బిర్యానీ- మరాఠి చిత్రం ► హత్యాపురి - బెంగాలీ సినిమా ► తాజ్: రిజిన్ ఆఫ్ రివేంజ్ సీజన్ 2 (నాలుగు ఎపిసోడ్లు) హాట్‌స్టార్ ► స్కూల్ ఆఫ్ లైస్- హిందీ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ► మేనిఫెస్ట్ సీజన్ 4 పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ ► స్కూప్- హిందీ సిరీస్ ► వలరియా సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ జియో సినిమా ► ముంబైకర్ ► గోదావరి - మరాఠీ చిత్రం -జూన్ 3 బుక్ మై షో ► ఈవిల్ డెడ్ రైజ్ - ఇంగ్లీష్ సినిమా సైనా ప్లే ► మీ కల్పా- మలయాళ చిత్రం చదవండి: పెళ్లి పీటలెక్కనున్న జబర్దస్త్ కమెడియన్ -
ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!
మీరు ఓటీటీ సినీ ప్రియులా? సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లోనే చూస్తున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఈ వారంలో పలు చిత్రాలు విడుదల అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈవేసవిలో మీకు ఆనందాన్ని పంచేందుకు వస్తున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వస్తున్న పలు ఆసక్తికర సినిమాలు, వెబ్సిరీస్లేవో ఓ లుక్కేయండి. హారర్ మూవీ 'బూ' విశ్వక్సేన్, రకుల్ ప్రీత్ సింగ్, మోనికా, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ 'బూ'. ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈనెల 27 నుంచి జియో సినిమాలోస్ట్రీమింగ్ కానుంది. సత్తిగాని రెండెకరాలు ఏమయ్యాయి? పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవగా మెప్పించిన నటుడు జగదీష్ ప్రతాప్ భండారి. జగదీశ్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు అభినవ్ తెరకెక్కించిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. ఈ సినిమా ఈ నెల 26న నేరుగా ఆహాలో విడుదల కానుంది. కిసీ కా భాయ్.. కిసీ కి జాన్ సల్మాన్‌ఖాన్, పూజా హెగ్డే జంటగా ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'. తెలుగు హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ ‘వీరమ్’కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మే 26వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఎట్టకేలకు వస్తున్న తోడేలు వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హారర్ కామెడీ మూవీ భేడియా. ఈ చిత్రాన్ని తెలుగులో తోడేలు పేరుతో విడుదల చేశారు. అమర్ కౌశిక్ తెరకెక్కించారు. ఈ చిత్రం మే 26వ తేదీ నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. సిటాడెల్ ఫైనల్ ఎపిసోడ్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్. ఈ సిరీస్ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో రిచర్డ్ మ్యాడన్, జోన్స్, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరిసీ చివరి ఎపిసోడ్ మే 26 స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ విక్టిమ్/సస్పెక్ట్- (హాలీవుడ్) స్ట్రీమింగ్ అవుతోంది. మదర్స్ డే -(హాలీవుడ్)- స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యూబర్- (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది. దసరా -(హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది. ఆపరేషన్ మేఫెయిర్- (హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది. బీడ్ (హిందీ) -స్ట్రీమింగ్ అవుతోంది. బ్లడ్ అండ్ గోల్డ్ -(జర్మన్) మే 26 టిన్ అండ్ టీనా- (స్పానిష్) మే 26 టర్న్ ఆఫ్ ది టైడ్ -(పోర్చుగీస్) నెట్‌ఫ్లిక్స్ సిరీస్-1 మే26 చోటా భీమ్- (హిందీ) సిరీస్-18 మే 26 బ్లడ్ అండ్ గోల్డ్- (హాలీవుడ్) మే 26 అమెజాన్ ప్రైమ్ మిస్సింగ్- ఒరిజినల్ మూవీ ‘పంచువమ్ అద్భుత విళక్కుమ్-మలయాళం/తెలుగు-మే 26 జియో సినిమా థగ్స్ -తెలుగు/తమిళ్/హిందీ క్రాక్ డౌన్ -వెబ్‌సిరీస్-సీజన్2 చిత్రకూట్ -హిందీ) మే 27 జీ5 సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై- ఒరిజినల్ మూవీ- మే 23 విడుదల: పార్ట్-1 -తెలుగు డిస్నీ+హాట్‌స్టార్ అమెరికన్ బోర్న్ చైనీస్- వెబ్‌సిరీస్- మే 24 సిటీ ఆఫ్ డ్రీమ్స్ -వెబ్‌సిరీస్ -3- మే 26 ఆహా గీతా సుబ్రహ్మణ్యం- తెలుగు సిరీస్-3 - మే 23 -
జీ5 ఐదో వార్షికోత్సవం.. వేదికపై మెరిసిన బాలీవుడ్ భామలు (ఫొటోలు)