ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ మర్డర్ మిస్టరీ.. టాప్‌లో ట్రెండింగ్! | Tollywood Thriller Movie Top Place In Most Viewed On In Ott | Sakshi
Sakshi News home page

Tollywood Movie: ఓటీటీలో టాలీవుడ్ మర్డర్‌ మిస్టరీ.. ఆ లిస్ట్‌లో టాప్‌!

Published Fri, Jul 19 2024 9:16 PM | Last Updated on Sat, Jul 20 2024 8:56 AM

Tollywood Thriller Movie Top Place In Most Viewed On In Ott

అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా  చిత్రం సిట్‌(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ చిత్రాన్ని విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంటోంది.

ఓటీటీలో విడుదలై 10 వారాలైనా కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ప్రకటించిన రేటింగ్స్‌లో ఈ మూవీకి చోటు దక్కింది.దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన తెలుగు సినిమాలు/వెబ్ సిరీస్ జాబితాలో సిట్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 2.8 మిలియన్ల వీక్షకులతో టాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకోవడంపై దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు.

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్‌గా అరవింద్ కృష్ణ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చారు. ఎంతో ఛాలెంజింగ్‌ కారెక్టర్ అయినా చక్కగా నటించి మెప్పించారు. గ్రే షేడ్స్‌తో అరవింద్ కృష్ణ అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన నటించిన ఓ సూపర్ హీరో చిత్రం “ఎ మాస్టర్‌పీస్” త్వరలోనే విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement