ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు వన్డేల(Ind vs Eng ODI Series)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది. ఇదే జట్టు ఒక్క మార్పుతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) బరిలోకి దిగుతుందని వెల్లడించింది
ఓపెనర్‌గా ఎవరు?
కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) వైస్ కెప్టెన్‌గా ఎంపికకాగా.. మరో యంగ్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఈ ఇద్దరిలో ఎవరు తుదిజట్టులో ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్ అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో దుమ్ములేపాడు. అనంతరం రెండు ద్విశతకాలు కూడా బాది సత్తా చాటాడు. అదే టూర్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలోనూ జైసూ ఎంట్రీ ఇచ్చాడు.
బుమ్రా బదులు హర్షిత్ రాణా
ఇక ఇప్పటి వరకు ఓవరాల్‌గా టీమిండియా తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. టెస్టుల్లో 1798, టీ20లలో 723 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. వెన్నునొప్పితో బాధపడుతున్న పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేనట్లు తెలుస్తోంది.
అందుకే ఇంగ్లండ్‌తో వన్డేలకు బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు టీమిండియా సెలక్టర్లు. అయితే, ఫిట్‌నెస్ ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా జట్టుతో చేరనుండగా.. హర్షిత్ పక్కకు తప్పుకొంటాడు.
షమీతో పాటు వారు కూడా
ఇక ఈ జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ స్థానం సంపాదించగా.. స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇక పేసర్ల విభాగంలో మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు.
కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మొత్తం ఐదు టీ20లు(జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2) జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 6,9, 12 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్లను ప్రకటించింది.
ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు భారత జట్టు
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.
ఇంగ్లండ్‌తో టీ20లకు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్).
భారత్‌తో వన్డేలకు/చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టు
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
భారత్‌తో టీ20లకు ఇంగ్లండ్ జట్టు
జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
చదవండి: CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్‌కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment