Yashasvi Jaiswal
-
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ అతడేనంటూ బ్రూక్‌ను కొనియాడాడు. స్వదేశంలోనే.. విదేశీ గడ్డపై కూడా అతడు బ్యాట్ ఝులిపించే తీరు చూడముచ్చటగా ఉంటుందని ప్రశంసించాడు.అగ్రపీఠం అధిరోహించిన బ్రూక్కాగా 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుత ఫామ్‌తో పరుగుల వరద పారిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ (898 రేటింగ్ పాయింట్లు)గా నిలిచాడు.ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బ్రూక్ వరుసగా 171, 123, 55 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నంబర్‌వన్‌గా ఉన్న మరో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (898)ను వెనక్కి నెట్టి అగ్రపీఠం అధిరోహించాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ గురించి ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే‘‘ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే అనుకుంటున్నా. కేవలం సొంతగడ్డ మీద మాత్రమే కాదు.. విదేశాల్లోనూ అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు దేశాల్లో ఏకంగా ఏడు శతకాలు నమోదు చేశాడు. అతడొక క్లాస్ ప్లేయర్. బ్రూక్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే చూడటం నాకు ఎంతో ఇష్టం’’ అని రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్‌ను కొనియాడాడు.ఏడు సెంచరీలు విదేశీ గడ్డపైనే కాగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇప్పటి వరకు టెస్టుల్లో ఎనిమిది శతకాలు బాదాడు . ఇందులో ఏడు సెంచరీలు విదేశీ గడ్డపై చేసినవే. అదే విధంగా అతడి ఖాతాలో ద్విశతకం, ఒక త్రిశతకం కూడా ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ హ్యారీ బ్రూక్ పేరిట ఒక సెంచరీ ఉంది.మొత్తంగా ఇప్పటి వరకు తన కెరీర్లో హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 2280, 719, 707 పరుగులు సాధించాడు.మనోళ్ల పరిస్థితి ఏంటి?ఇదిలా ఉంటే.. ఐసీసీ టాప్–10 టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (4వ స్థానం), రిషభ్ పంత్ (9వ స్థానం) ఉండగా...శుబ్‌మన్ గిల్ 17వ, విరాట్ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (890) తన నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కగిసో రబాడ (856), హాజల్‌వుడ్ (851) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ ర్యాంక్ 4 నుంచి 5కు పడిపోగా, జడేజా 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్రౌండర్లలో జడేజా (415) అగ్ర స్థానం, అశ్విన్ 3వ స్థానం (283) పదిలంగా ఉన్నాయి. చదవండి: యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఫైర్
టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డ కారణంగా అతడి తీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.మూడో టెస్టు ఆడేందుకు బ్రిస్బేన్కుఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమిండియా.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా భారత జట్టుకు భంగపాటు తప్పలేదు. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.ఫలితంగా ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్- భారత్ మధ్య శనివారం(డిసెంబరు 14) నుంచి మూడో టెస్టు జరుగనుంది. ఇందుకోసం టీమిండియా అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ చేరుకునే క్రమంలో జైస్వాల్ చేసిన పొరపాటు రోహిత్ ఆగ్రహానికి కారణమైనట్లు వార్తలు వచ్చాయి.అతడు లేకుండానే వెళ్లిపోయిన బస్!అడిలైడ్‌లో తాము బస చేసిన హోటల్ నుంచి ఎయిర్‌పోర్టుకు బయల్దేరేటపుడు యశస్వి జైస్వాల్ ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. సహచర ఆటగాళ్లు, హెడ్ కోచ్ గౌతం గంభీర్ తదితరులు అతడి కోసం సుమారు 20 నిమిషాల పాటు ఎదురుచూడాల్సి వచ్చిందట. అయినప్పటికీ యశస్వి రాకపోవడంతో టీమ్ బస్ అతడు లేకుండానే నిష్క్రమించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో టీమిండియా భద్రతా అధికారి.. హోటల్‌కు చెందిన కారులో యశస్వి జైస్వాల్ ఒక్కడిని ప్రత్యేకంగా ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లినట్లు సమాచారం. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు కోపమొచ్చినట్లు తెలుస్తోంది.కోహ్లి, బుమ్రా కుటుంబాలు ప్రత్యేక విమానంలోఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా తమ కుటుంబాలను కూడా ఆస్ట్రేలియాకు తీసుకువచ్చారు. కోహ్లి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌లతో పాటు బుమ్రా సతీమణి సంజనా గణేషన్, కుమారుడు అంగద్.. అంతా కలిసి చార్టెడ్ ఫ్లైట్‌లో బ్రిస్బేన్ చేరుకున్నట్లు సమాచారం. ఇక తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో జైస్వాల్‌ది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. భారీ శతకం(161) బాది అతడు జట్టు గెలుపులో భాగమయ్యాడు.చదవండి: IND vs AUS: 'రోహిత్ శర్మ ఓవర్ వెయిట్ ఉన్నాడు.. టెస్టు క్రికెట్‌కు పనికిరాడు'Adelaide ✅Hello Brisbane 👋#TeamIndia | #AUSvIND pic.twitter.com/V3QJc3fgfL— BCCI (@BCCI) December 11, 2024 -
జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. విరాట్ కోహ్లి రియాక్షన్ వైరల్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ యశస్వీ జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. అద్బుతమైన క్యాచ్‌తో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను యశస్వి పెవిలియన్‌కు పంపాడు.గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న లబుషేన్ ఈ మ్యాచ్‌లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ వంటి బౌలర్లు సైతం సమర్ధవంతంగా ఎదుర్కొంటూ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. మరో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు నితీశ్ రెడ్డిని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎటాక్‌లో తీసుకువచ్చాడు. అయితే రోహిత్ ప్లాన్ సఫలమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ 55వ ఓవర్ వేసిన నితీష్ మూడో బంతిని షార్ట్ అండ్ వైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. ఆ బంతిని లబుషేన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న జైశ్వాల్ అద్బుతం చేశాడు. తన పొజిషన్‌కు కుడివైపునకు కదులుతూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన లబుషేన్(64) బిత్తరపోయాడు.కోహ్లి రియాక్షన్ వైరల్..ఇక జైశ్వాల్ క్యాచ్ అందుకోగానే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కోహ్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆసీస్ ప్రేక్షకుల వైపు చూస్తూ సైలెంట్‌గా ఉండమని సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.చదవండి: IND vs AUS:బుమ్రా మాస్టర్ మైండ్.. ట్రాప్‌లో చిక్కుకున్న స్మిత్! వీడియో pic.twitter.com/e9HmixGbG2— Sunil Gavaskar (@gavaskar_theman) December 7, 2024 -
తొలి బంతికే ఔట్.. జైశ్వాల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు
అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే జైశ్వాల్ పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన జైశ్వాల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా గడ్డపై తొలి బంతికే ఔటైన నాలుగో ప్లేయర్‌గా జైశ్వాల్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు నమోదు చేసిన జాబితాలో యశస్వి కంటే ముందు ఆర్చీ మాక్లారెన్ (ఇంగ్లండ్), స్టాన్ వర్తింగ్టన్ (ఇంగ్లండ్), రోరీ బర్న్స్ (ఇంగ్లండ్) ఉన్నారు.ఓవరాల్‌గా ఓ టెస్టు మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన ఏడో భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. చివరగా జైశ్వాల్ కంటే ముందు కేఎల్ రాహుల్ 2017లో గోల్డెన్ డకౌటయ్యాడు. కాగా జైశ్వాల్ తొలి టెస్టులో కూడా మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. కానీ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుమైన సెంచరీతో చెలరేగాడు.టెస్టుల్లో గోల్డెన్ డకౌటైన భారత ఆటగాళ్లు వీరే..సునీల్ గవాస్కర్, 1974 vs ఇంగ్లండ్ఎస్ నాయక్, 1974 vs ఇంగ్లండ్సునీల్ గవాస్కర్, 1983 vs వెస్టిండీస్సునీల్గవాస్కర్, 1987 vs పాకిస్తాన్వి రామన్, 1990 vs న్యూజిలాండ్ఎస్ దాస్, 2002, వెస్టిండీస్వసీం జాఫర్, 2007 vs బంగ్లాదేశ్కేఎల్ రాహుల్, 2017 vs శ్రీలంకచదవండి: IND vs AUS: ఏంటి రాహుల్ ఇది?.. ఒకే ఓవర్లో రెండు ఛాన్స్‌లు వచ్చినా! వీడియో -
ఆ రోజు జైశ్వాల్ ఏమన్నాడో వినలేదు.. కానీ అతడికి అస్సలు భయం లేదు: స్టార్క్
పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆసీస్ స్టార్ పేసర్ మిచిల్ స్టార్క్‌ను భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ స్లెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా "నువ్వు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నావు" అని స్టార్క్ అన్నాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. అయితే ఆ సమయంలో స్టార్క్ నుంచి మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా, నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఇదే విషయంపై మిచిల్ స్టార్క్ స్పందించాడు. ఆ సమయంలో యశస్వి అన్న మాటలను తను వినలేదని స్టార్క్ చెప్పుకొచ్చాడు.వాస్తవానికి ఆ రోజు నేను చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తానని జైశ్వాల్ చెప్పడం నేను వినలేదు. ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలనుకోవడం లేదు. కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముంది. మూడో రోజు ఆటలో ఓ షార్ట్ పిచ్ డెలివరీని జైశ్వాల్ ప్లిక్ షాట్ ఆడాడు.ఆ బంతిని అతడు సిక్సర్‌గా మలిచాడు. మరోసారి దాదాపుగా అలాంటి బంతినే వేశాను. కానీ ఈసారి అతడు డిఫెన్స్ ఆడాడు. వెంటనే అతడి వద్దకు వెళ్లి ఫ్లిక్ షాట్ ఎక్కడ? అని అడిగాను. అతడు నన్ను చూసి నవ్వాడు. దీంతో ఆ విషయాన్ని ఇద్దరం అక్కడితో వదిలేశామని" స్టార్క్ క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదేవిధంగా జైశ్వాల్‌పై స్టార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో భయంలేని బ్యాటర్లలో జైశ్వాల్ ఒకడిని, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతున్నాడని స్టార్క్ కొనియాడాడు.చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే -
ఆసీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా ఓపెనర్లుగా వారే: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ‘పింక్ బాల్’ టెస్టులో భారత ఓపెనింగ్ జోడీపై స్పష్టతనిచ్చాడు. యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.ఇక.. తాను మిడిలార్డర్లో బరిలోకి దిగుతానని చెప్పిన రోహిత్ శర్మ.. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. తనకు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమేనని.. అయినా జట్టు కోసం ఓపెనింగ్ స్థానం త్యాగం చేయక తప్పలేదని పేర్కొన్నాడు.పితృత్వ సెలవులుకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. తన భార్య రితికా సజ్దే కుమారుడు అహాన్‌కు జన్మనివ్వడంతో పితృత్వ సెలవులు తీసుకున్నాడు. అయితే, మొదటి టెస్టు మధ్యలోనే ముంబై నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు హిట్‌మ్యాన్.జైస్వాల్‌తో కలిసి రాణించిన రాహుల్ఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులో రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించగా.. యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం(161) బాదాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్(26, 77) సైతం మెరుగ్గా రాణించాడు.అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనింగ్ జోడీని మారుస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. రాహుల్‌ను మిడిలార్డర్‌లోకి పంపి రోహిత్ ఓపెనర్‌గా వస్తాడేమోనని అంతా భావించారు. అయితే, తానే మిడిలార్డర్లో వస్తానని రోహిత్ శర్మ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. పింక్ బాల్తోకాగా అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టు డే అండ్ నైట్ మ్యాచ్. దీనిని పింక్ బాల్‌తో నిర్వహిస్తారు. ఇక ఇందుకోసం రోహిత్ సేన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో మిడిలార్డర్లో వచ్చిన రోహిత్ శర్మ(3) విఫలం కాగా.. ఓపెనర్లు జైస్వాల్ 45, రాహుల్ 27(రిటైర్డ్ హర్ట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
జైస్వాల్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకిన హ్యారీ బ్రూక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ రెండో స్థానానికి ఎగబాకాడు. బ్రూక్.. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వెనక్కు నెట్టి ఈ స్థానానికి చేరుకున్నాడు. గడిచిన వారంలో బ్రూక్, జైస్వాల్ ఇద్దరూ మంచి ప్రదర్శనలే చేసినప్పటికీ.. ర్యాంకింగ్స్‌లో మాత్రం బ్రూక్ ముందుకెళ్లాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో యశస్వి 161 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా.. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బ్రూక్ 171 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తాజా ర్యాంకింగ్స్‌లో యశస్వి ర్యాంక్ దిగజారినప్పటికీ అతని రేటింగ్ పాయింట్లు మాత్రం మెరుగుపడ్డాయి.మరోవైపు ఆస్ట్రేలియాతోనే జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సైతం సెంచరీ చేసినప్పటికీ ఓ ర్యాంక్ కోల్పోయి 14వ స్థానానికి పడిపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా ఏకంగా 14 స్థానాలు మెరుగపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. లంక ఆటగాడు కమిందు మెండిస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. భారత్ తరఫున రిషబ్ పంత్ ఆరో నంబర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రబాడ, హాజిల్‌వుడ్, అశ్విన్ టాప్-4లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో కమిన్స్, రవీంద్ర జడేజా, నాథన్ లయోన్ తలో స్థానం మెరుగుపర్చుకుని 5, 6, 7 స్థానాలకు చేరుకోగా.. దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జన్సెన్ ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. జన్సెన్ ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్‌లో కొనసాగుతుండగా.. జన్సెన్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు. -
రోహిత్ వచ్చాడు!.. మరి మీ పరిస్థితి ఏంటి?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న పింక్ బాల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఇక ఈ టెస్టు కోసం రెగ్యులర్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరడంతో.. భారత తుదిజట్టు కూర్పుపై చర్చలు నడుస్తున్నాయి.రాణించిన రాహుల్కాగా పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ గైర్హాజరైన నేపథ్యంలో.. పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు. ఈ పేస్ బౌలర్ కెప్టెన్సీల్లో భారత్ కంగారూలను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక ఈ విజయంలో.. బ్యాటింగ్ విభాగంలో ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(161), కేఎల్ రాహుల్(77)లతో పాటు విరాట్ కోహ్లి(100 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ రాకతో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అడిలైడ్ టెస్టులో ఈ కర్ణాటక బ్యాటర్ ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే మిడిలార్డర్లో బరిలోకి దిగుతాడా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తుదిజట్టులో చోటు ఉండాలి కదా!‘‘ముందుగా నాకు తుదిజట్టులో చోటు దక్కడమే ముఖ్యం. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలోనైనా ఆడతా. ఓపెనర్‌గా అయినా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా అయినా జట్టును గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తా.మొదట్లో కాస్త కష్టంగా ఉండేది..ఇప్పటి వరకు నా కెరీర్లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. మొదట్లో కాస్త కష్టంగా ఉండేది. అయితే, అది కూడా టెక్నిక్ పరంగా కాకుండా.. మానసికంగా కాస్త ఇబ్బందిగా ఉండేది. తొలి 20 -25 బంతుల పాటు కఠినంగా తోచేది.ఇక ఇప్పటికి చాలాసార్లు నేను టెస్టుల్లో, వన్డేల్లో వేర్వేరు స్థానాల్లో ఆడాను కాబట్టి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ స్థానంలో ఎలా ఆడాలో నాకు స్పష్టత ఉంది. తొలి 30- 40 బంతుల పాటు నిలదొక్కుకోగలిగితే.. ఆ తర్వాత నా రెగ్యులర్ స్టైల్లో ముందుకు సాగడం తేలికవుతుంది’’ అని స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.విదేశీ గడ్డపై ఐదుకాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు తన కెరీర్లో 54 టెస్టులు ఆడి 3084 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది శతకాలు ఉండగా.. వీటిలో రెండు సౌతాఫ్రికా, రెండు ఇంగ్లండ్, ఒకటి ఆస్ట్రేలియాలో సాధించినవి. ఇక పెర్త్ టెస్టులోనూ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన అర్ధ శతకం(77)తో రాణించాడు.శుబ్‌మన్ గిల్ కూడా వచ్చేశాడుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మతో పాటు శుబ్‌మన్ గిల్ కూడా రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ మారటంతో పాటు.. ధ్రువ్ జురెల్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
వాళ్లు కూడా స్లెడ్జ్ చేశారు.. ఈసారి గనుక ఛాన్స్ ఇస్తే: ఆసీస్ మాజీ క్రికెటర్ వార్నింగ్
ప్యాట్ కమిన్స్ బృందంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ విమర్శల వర్షం కురిపించాడు. పెర్త్ టెస్టులో టీమిండియా యువ ఆటగాళ్ల చేతిలోనూ మానసికంగా ఓడిపోయారంటూ ఎద్దేవా చేశాడు. జట్టులో ఏ ఒక్కరిలోనూ పోరాటపటిమ కనబడలేదని.. ఇకనైనా కాస్త ఆటపై దృష్టి పెట్టి విజయాల బాటపట్టాలని సూచించాడు. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాషెస్ సిరీస్ మాదిరేఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ మాదిరే కంగారూ జట్టుకు ఈ సిరీస్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఇక టీమిండియాతో టెస్టు అంటే కేవలం ఆటకే పరిమితం కాకుండా ప్లేయర్లు స్లెడ్జింగ్ చేయడంలోనూ ముందే ఉంటారు. అందుకు తగ్గట్లుగా భారత ఆటగాళ్లూ బదులిచ్చిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.స్లోగా బౌల్ చేస్తున్నాడుఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులోనూ ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకున్నా.. వాటి తీవ్రత మాత్రం తక్కువగానే ఉంది. అయితే, ఈ టీజింగ్ మూమెంట్లలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఉద్దేశించి చాలా స్లోగా బౌల్ చేస్తున్నాడంటూ వ్యాఖ్యానించడం హైలైట్‌గా నిలిచింది.295 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిమరోవైపు.. స్టార్క్.. భారత అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాను ఉద్దేశించి.. ‘‘నీకంటే నేనే ఫాస్ట్‌గా బౌల్ చేస్తాను’’ అని వ్యాఖ్యానించాడు. అయితే, రాణా చిరునవ్వుతోనే స్టార్క్‌కు బదులిచ్చాడు. అయితే, అతడిని అవుట్ చేసి తన సత్తా చాటడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఆసీస్ 295 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.ఆప్టస్ స్టేడియంలో మీరేం చేశారు?ఈ నేపథ్యంలో మిచెల్ జాన్సన్ స్పందిస్తూ.. ‘‘బయటి నుంచి ప్రేక్షకుడిగా మ్యాచ్ చూస్తున్న నాకు.. ఆస్ట్రేలియా జట్టు నుంచి ఏమాత్రం పోరాటపటిమ కనిపించలేదు. ముఖ్యంగా ఓ అరంగేట్ర ఆటగాడు.. యువ ఓపెనర్.. మన సొంతగడ్డ మీద.. మిచెల్ స్టార్క్‌ను స్లెడ్జ్ చేస్తూ.. స్లోగా బౌలింగ్ చేస్తున్నావనడం.. అయినా మనలో చలనం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.బ్యాట్‌తోనూ.. బాల్‌తోనూ మనం సమాధానం ఇవ్వలేకపోయాం. అసలు ఆప్టస్ స్టేడియంలో మీరేం చేశారు?’’ అని ది వెస్టర్న్ ఆస్ట్రేలియన్‌కు రాసిన కాలమ్‌లో ఆసీస్ జట్టును విమర్శించాడు. ఇక టీమిండియాకు భయపడితే పనులు జరగవని.. అడిలైడ్‌లో మాత్రం తప్పక విజృంభించాలని కమిన్స్ బృందానికి మిచెల్ జాన్సన్ సూచించాడు.ఈసారి గనుక ఛాన్స్ ఇస్తేలేనిపక్షంలో వాళ్లను ఎదుర్కోవడం మరింత కష్టమవుతుందని టీమిండియా గురించి ఆసీస్‌కు మిచెల్ జాన్సన్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య డిసెంబరు 6- 10 వరకు రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పింక్ బాల్‌తో జరిగే ఈ టెస్టులోనూ గెలుపొందాలని పట్టుదలగా ఉన్న టీమిండియా.. అందుకు తగ్గట్లుగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో గులాబీ బంతితో సాధన చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పీఎం ఎలెవన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.ఇక తొలి టెస్టుకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, గాయం నుంచి కోలుకున్న శుబ్‌మన్ గిల్ రెండో టెస్టు కోసం భారత జట్టుతో చేరారు. మరోవైపు.. జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ గాయాల రూపంలో ఆసీస్‌కు షాక్ తగిలింది. కాగా ఆసీస్- భారత్ మధ్య మొత్తం ఐదు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: వెళ్లు వెళ్లు.. వెనక్కి వెళ్లు: రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! -
రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! ఆఖరికి..
ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్(Prime Ministers XI)తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. తద్వారా భారత ఇన్నింగ్స్‌లో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. పీఎం ఎలెవన్‌తో మ్యాచ్ సందర్భంగా జైస్వాల్‌కు కోపమొచ్చింది.తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించిన ఆసీస్ పేసర్ జాక్ నిస్బెట్(Jack Nisbet)కు బ్యాట్‌తో పాటు.. నోటితోనూ గట్టిగానే సమాధానమిచ్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు.. డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు ఆడనుంది.తొలిరోజు ఆట టాస్ పడకుంగానే అయితే, పింక్ బాల్‌తో నిర్వహించే ఈ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో.. ఆసీస్ ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. రెండురోజుల పాటు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా శనివారం నాటి తొలిరోజు ఆట టాస్ పడకుంగానే ముగిసిపోగా.. రెండో రోజు సవ్యంగా సాగింది. అయితే, ఈ మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించారు.కాన్స్టాస్ శతకంకాన్బెర్రా వేదికగా ఆదివారం టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పీఎం ఎలెవన్ జట్టు ఓపెనర్ సామ్ కాన్స్టాస్ శతకం(107)తో చెలరేగగా.. మిగతా వాళ్లలో హనో జాకబ్స్(61), జాక్ క్లేటన్(40) మెరుగ్గా రాణించారు. మిగతా వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పీఎం జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో పేసర్లు హర్షిత్ రాణా నాలుగు వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ రెండు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజకు తలా ఒక వికెట్ దక్కింది. 42.5 ఓవర్లలోనే ఛేదించినాఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ శుభారంభం అందించగా.. కేఎల్ రాహుల్(27 రిటైర్డ్ హర్ట్), శుబ్‌మన్ గిల్(50- రిటైర్డ్ హర్ట్) రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ(3) మాత్రం విఫలం కాగా.. నితీశ్ రెడ్డి(42), వాషింగ్టన్ సుందర్(42 నాటౌట్) అదరగొట్టారు. మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా(27) ఫర్వాలేదనిపించగా.. సర్ఫరాజ్ ఖాన్(1) పూర్తిగా విఫలమయ్యాడు. దేవ్పడిక్కల్ నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నిజానికి రోహిత్ సేన 42.5 ఓవర్లలోనే 241 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించినా... ప్రాక్టీస్ కోసం పూర్తి ఓవర్లు ఆడటం గమనార్హం.ఇదిలా ఉంటే.. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌ను పీఎం ఎలెవన్ పేసర్ జాక్ నిస్బెట్ వేశాడు. అతడి బౌలింగ్‌లో తొలి రెండు బంతులను యశస్వి జైస్వాల్ బౌండరీకి తరలించగా.. నిస్బెట్ జైస్వాల్‌ను చూస్తూ ఏదో అన్నాడు. వెనక్కి వెళ్లు..ఇందుకు బదులుగా.. ‘‘వెనక్కి వెళ్లు.. వెళ్లి బౌలింగ్ చెయ్’’ అని జైస్వాల్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో చిరునవ్వుతోనే వెనక్కి వెళ్లిన నిస్బెట్ ఆఖరి వరకు రాకాసి బౌన్సర్లతో జైస్వాల్‌ను తిప్పలు పెట్టాడు.దీంతో ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఆఖరి వరకు తగ్గేదేలే అన్నట్లు తలపడ్డారు. ఇక నిస్బెట్ ఓవర్లో జైస్వాల్ ఎనిమిది పరుగులు రాబట్టగా.. అతడు మాత్రం వికెట్‌లెస్‌గా వెనుదిరిగాడు. జైస్వాల్‌ను అవుట్ చేయాలన్న అతడి కల నెరవేరలేదు. అంతే కాదు మ్యాచ్ మొత్తంలో ఆరు ఓవర్లు వేసిన 21 ఏళ్ల నిస్బెట్ 32 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, ఎనిమిదో ఓవర్లో మరోసారి బరిలోకి దిగిన నిస్బెట్ జైస్వాల్‌ను పరుగులు రాబట్టకుండా అడ్డుకోగలిగాడు.చదవండి: బీసీసీఐ మ్యాచ్.. 10కి 10 వికెట్లు సాధించిన 18 ఏళ్ల యువ కెరటం Yashasvi Jaiswal took it up to Jack Nisbet in Canberra but the fiery NSW quick wasn't backing down! 👀 #PMXIvIND pic.twitter.com/tX3O86wEv2— cricket.com.au (@cricketcomau) December 1, 2024 -
కోహ్లి అద్భుతం.. జైస్వాల్ దూసుకుపోతున్నాడు.. ఇంకా: ద్రవిడ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడం శుభసూచకమని.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనే సెంచరీ చేయడం అద్భుతమని కొనియాడాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కోహ్లి మరింత చెలరేగడం ఖాయమని ద్రవిడ్ పేర్కొన్నాడు.కోహ్లి శతకాలు@81 కాగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోహ్లి టెస్టుల్లో శతకం బాదిన విషయం తెలిసిందే. దాదాపు 491 రోజుల తర్వాత అతడు ఓ ఇన్నింగ్స్‌లో వంద పరుగులు సాధించాడు. తద్వారా తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 81కి పెంచుకున్నాడు. ఆసీస్‌తో పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా కోహ్లి ఈ ఘనత సాధించాడు.కోహ్లి అద్భుతంకఠిన పరిస్థితుల్లో తన అనుభవాన్ని రంగరించి జట్టు భారీ విజయం సాధించడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. తద్వారా విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆరు నెలల క్రితం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.సఫారీ గడ్డపై కఠినమైన పిచ్‌లపై కూడా బ్యాట్‌తో అదరగొట్టాడు. తను మళ్లీ టచ్‌లోకి రావడం సంతోషంగా ఉంది. సిరీస్ ఆరంభంలోనే శతకం బాదడం శుభసూచకం. ఈ సిరీస్‌లో మరోసారి కోహ్లి తనదైన మార్కు వేయబోతున్నాడని అనిపిస్తోంది’’ అని కోహ్లిని ప్రశంసించాడు.అందరికీ సాధ్యం కాదుఇక ఇదే మ్యాచ్‌లో 161 పరుగులతో దుమ్ములేపిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై కూడా ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోజురోజుకూ అతడు ఊహించనిరీతిలో ఆటను మెరుగుపరచుకుంటున్నాడని కొనియాడాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదని.. జైస్వాల్ మాత్రం పక్కా ప్రణాళికతో తన వ్యూహాలను అమలు చేసిన తీరు ఆకట్టుకుందని ద్రవిడ్ కితాబులిచ్చాడు.బుమ్రా ఆటగాడిగా, సారథిగా సూపర్ హిట్అదే విధంగా.. పెర్త్ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ద్రవిడ్ ఈ సందర్భంగా అభినందించాడు. తన అసాధారణ బౌలింగ్ నైపుణ్యాలతో జట్టును ఎన్నోసార్లు ఒంటిచేత్తో గెలిపించాడని కొనియాడాడు. కెప్టెన్‌గానూ విజయవంతంగా జట్టును ముందుకు నడిపించాడంటూ హ్యాట్సాఫ్ చెప్పాడు.భారీ విజయంతో మొదలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఎడిషన్‌లో ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో పెర్త్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ గైర్హాజరు కాగా.. బుమ్రా టీమిండియాకు సారథ్యం వహించాడు.ఈ మ్యాచ్‌లో జైస్వాల్, కోహ్లి సెంచరీలతో రాణించగా.. బుమ్రా ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో టీమిండియా ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య కాన్బెర్రా వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: అప్పుడు రూ. 20 లక్షలు.. ఇప్పుడు రూ. 11 కోట్లు.. టీమిండియా రైజింగ్ స్టార్ ‘భారీ’ రికార్డు -
జైశ్వాల్ ఒక అద్భుతం.. 40కి పైగా టెస్టు సెంచరీలు చేస్తాడు: మాక్స్వెల్
టెస్టు క్రికెట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై సత్తాచాటిన జైశ్వాల్.. ఇప్పుడు ఆస్ట్రేలియాపై కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై తను ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తాచాటాడు. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో యశస్వీ అద్బుతమైన సెంచరీ సాధించాడు. మిచెల్ స్టార్క్, హాజిల్ వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అలోవకగా ఎదుర్కొంటూ దిగ్గజాలను సైతం జైశ్వాల్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 297 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 161 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో జైశ్వాల్‌పై ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ 40కి పైగా టెస్టు సెంచరీలు సాధిస్తాడని మాక్సీ జోస్యం చెప్పాడు."జైశ్వాల్ ఒక అద్బుతమైన ఆటగాడు. టెస్టు క్రికెట్లో నలభై కంటే ఎక్కువ సెంచరీలు చేసే సత్తా అతడికి ఉంది. విభిన్న రికార్డులను తిరిగి రాస్తాడని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడే టాలెంట్ జైశ్వాల్ దగ్గర ఉంది.ఈ సిరీస్‌లో రాబోయే మ్యాచ్‌ల్లో అతడిని మా బౌలర్లు అడ్డుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. జైశ్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంటుంది. అన్ని రకాల షాట్లు ఆడగలడు. స్పిన్ కూడా బాగా ఆడగలడు. అతడొక ఫుల్ ప్యాకెజ్ ప్లేయర్" అని గ్రేడ్ క్రికెటర్ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్స్వెల్ పేర్కొన్నాడు. -
సత్తాచాటిన జైశ్వాల్.. నెం1 ర్యాంక్‌కు ఒక్క అడుగు దూరంలో
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ సంచలనం యశస్వీ జైశ్వాల్ సత్తాచాటాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జైశ్వాల్ రెండో స్ధానానికి చేరుకున్నాడు. యశస్వి జైశ్వాల్‌కు కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం గమనార్హం.కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు జైశ్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్ధానంలో ఉన్నాడు. అయితే పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 297 బంతుల్లో 161 పరుగులు చేసిన జైశ్వాల్.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే యశస్వీ రెండు స్ధానాలు ఎగబాకి సెకెండ్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతడి ఖాతాలో 825 పాయింట్లు ఉన్నాయి.మరోవైపు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 9 స్ధానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి కూడా ఆజేయ శతకంతో మెరిశాడు. ఇక టాప్ ర్యాంక్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(903) పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-10 బ్యాటర్లు వీరే..1.జో రూట్- 903 పాయింట్లు2. యశస్వి జైస్వాల్ 8253.కేన్ విలియమ్సన్ 8044. హ్యారీ బ్రూక్ 7785. డారిల్ మిచెల్ 7436. రిషబ్ పంత్ 7367. స్టీవెన్ స్మిత్ 7268. సౌద్ షకీల్ 7249. కమిందు మెండిస్ 71610. ట్రావిస్ హెడ్ 713 -
వాళ్లిద్దరు అద్భుతం... గర్వంగా ఉంది.. ఇంతకంటే ఏం కావాలి: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్‌గా తొలి టెస్టులోనే విజయం సాధించడం పట్ల జస్ప్రీత్ బుమ్రా హర్షం వ్యక్తం చేశాడు. పెర్త్‌లో తమ జట్టు ప్రదర్శనతో పూర్తి సంతృప్తిగా.. గర్వంగా ఉన్నానని చెప్పాడు. ఆత్మవిశ్వాసం ఉంటే అనుభవంతో పనిలేదని భారత యువ ఆటగాళ్లు ఈ మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపించారని కొనియాడాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. అయితే, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. పేసర్ బుమ్రా భారత జట్టు సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఆడిన టీమిండియా.. ఆసీస్‌ను ఏకంగా 295 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా కంగారూ గడ్డపై అతిపెద్ద విజయం నమోదు చేసింది.ఈ నేపథ్యంలో విజయానంతరం తాత్కాలిక కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా మాట్లాడుతూ.. ‘‘విజయంతో సిరీస్ ఆరంభించడం సంతోషంగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో మేము బాగా ఒత్తిడికి లోనయ్యాం. అయితే, ఆ తర్వాత తిరిగి పుంజుకున్న తీరు పట్ల నాకెంతో గర్వంగా ఉంది.2018లో ఇక్కడ ఆడాను. ఇక ఈ పిచ్ మాకు సవాళ్లు విసిరింది. అయితే, అనుభవం కంటే.. సామర్థ్యాన్నే మేము ఎక్కువగా నమ్ముకున్నాం. పూర్తిస్థాయిలో మ్యాచ్ కోసం సిద్ధమయ్యాం. ఆత్మవిశ్వాసం ఉంటే.. ప్రత్యేకంగా ఏదైనా సాధించగలమని విశ్వసించాం. ఇంతకంటే మాకు ఇంకేం కావాలి’’ అని బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు.ఇక సెంచరీ వీరులు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిల గురించి ప్రస్తావన రాగా.. ‘‘జైస్వాల్ టెస్టు కెరీర్ అద్భుతంగా సాగుతోంది. టెస్టుల్లో ఇదే అతడికి మొదటి అత్యుత్తమ ఇన్నింగ్స్ అనుకుంటున్నా. బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ అతడు అటాక్ చేసిన విధానం అద్భుతం.ఇక విరాట్.. అతడు ఫామ్‌లో లేడని నేనెప్పుడూ అనుకోను. ఇలాంటి కఠినమైన పిచ్‌లపైనే కదా.. బ్యాటర్ అసలైన ఫామ్ తెలిసేది’’ అంటూ బుమ్రా వారిద్దరిపై ప్రశంసలు కురిపించాడు. కాగా పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్, కోహ్లి నిరాశపరిచిని విషయం తెలిసిందే. జైస్వాల్ డకౌట్ కాగా.. కోహ్లి 5 పరుగులే చేశాడు.అయితే, రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టాండ్ బ్యాటర్ జైస్వాల్.. 161 పరుగులతో దుమ్ములేపగా.. కోహ్లి 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఎనిమిది వికెట్లు కూల్చాడు.ఇక తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక పెర్త్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగియగా.. ఇరుజట్ల మధ్య డిసెంబరు 6- 10 వరకు అడిలైడ్‌లో రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పెర్తు టెస్టు స్కోర్లు👉భారత్ తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 104 ఆలౌట్👉భారత్ రెండో ఇన్నింగ్స్:487/6 డిక్లేర్డ్👉ఆసీస్ లక్ష్యం: 534 పరుగులు👉ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 238 ఆలౌట్👉ఫలితం: ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో బుమ్రా సేన భారీ విజయం -
ఆసీస్‌ను మట్టికరిపించిన టీమిండియా.. బుమ్రాకు చిరస్మరణీయం
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా శుభారంభం చేసింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందేప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా ఆసీస్‌తో తమ ఆఖరి సిరీస్ ఆడుతోంది. ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌పై కచ్చితంగా నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి టెస్టుకు దూరమయ్యాడు.బాధ్యతలు తీసుకున్న బుమ్రాఅయితే, సారథిగా ఉంటానంటూ బాధ్యతలు తీసుకున్న వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. తన పనిని సమర్థవంతంగా నెరవేర్చాడు. కెప్టెన్సీతో పాటు, ఆటగాడిగానూ అదరగొట్టిన ఈ పేస్ దళ నాయకుడు ఆసీస్ గడ్డపై కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు.అప్పుడు ఆదుకున్న పంత్, నితీశ్ రెడ్డిపెర్త్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, పూర్తిగా సీమర్లకే అనుకూలించిన పిచ్‌పై భారత బ్యాటర్లు ఆరంభంలో తడబడ్డారు. టాపార్డర్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(0), వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(0) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు.అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(26) పట్టుదలగా నిలబడినా.. వివాదాస్పద రీతిలో థర్డ్ అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి(5) సైతం నిరాశపరచగా.. రిషభ్ పంత్(37), అరంగేట్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) రాణించడం కలిసి వచ్చింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లలో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్, కెప్టెన్ కమిన్స్. మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు పడగొట్టారు.చెలరేగిన బుమ్రా.. కుప్పకూలిన ఆసీస్అనంతరం తొలిరోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు బుమ్రా తన పేస్ పదునుతో చుక్కలు చూపించాడు. అతడికి తోడుగా మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా రాణించడంతో మొదటిరోజు కేవలం 67 పరుగులే చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 104 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌట్ అయింది. బుమ్రాకు ఐదు, రాణాకు మూడు, సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.జైస్వాల్ భారీ సెంచరీ.. శతక్కొట్టిన కోహ్లిఫలితంగా 46 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో యశస్వి భారీ శతకం(161) పూర్తి చేసుకోగా.. రాహుల్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భారీ భాగస్వామ్యంతో పెర్త్‌లో పట్టు బిగించిన టీమిండియా.. కోహ్లి అజేయ సెంచరీ(100)కి తోడు నితీశ్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 38 నాటౌట్)కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచింది.534 పరుగుల భారీ లక్ష్యం.. చేతులెత్తేసిన ఆసీస్ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఉండగా.. రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తద్వారా ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. అయితే, ఆది నుంచే మరోసారి అటాక్ ఆరంభించిన భారత బౌలర్లు ఆసీస్‌ను 238 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా జయభేరి మోగించి ఆసీస్‌కు సొంతగడ్డపై భారీ షాకిచ్చింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ మూడేసి వికెట్లు కూల్చగా.. వాషింగ్టన్ సుందర్ రెండు, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం నమోదు చేసింది.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు👉వేదిక: పెర్త్ స్టేడియం, పెర్త్👉టాస్: టీమిండియా.. బ్యాటింగ్👉టీమిండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 104 ఆలౌట్👉టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు:487/6 డిక్లేర్డ్👉ఆసీస్ లక్ష్యం: 534 పరుగులు👉ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 238 ఆలౌట్👉ఫలితం: ఆసీస్‌పై 295 పరుగుల తేడాతో టీమిండియా భారీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(8 వికెట్లు)👉నాలుగురోజుల్లోనే ముగిసిన మ్యాచ్.చదవండి: IPL Auction 2025: అతడికి ఏకంగా రూ. 18 కోట్లు.. కారణం మాత్రం కావ్యానే!.. పాపం ప్రీతి!Big wicket for India! Siraj with a beauty! #AUSvIND pic.twitter.com/NEJykx9Avj— cricket.com.au (@cricketcomau) November 25, 2024History Made Down Under! 🇮🇳✨Team India seals a memorable victory, becoming the FIRST team to defeat Australia at the Optus Stadium, Perth! 🏟💥A moment of pride, determination, and unmatched brilliance as #TeamIndia conquers new heights in the 1st Test & secures No.1 Spot in… pic.twitter.com/B61Ic9qLuO— Star Sports (@StarSportsIndia) November 25, 2024 -
బెంబేలెత్తించిన బుమ్రా.. విజయం వాకిట్లో టీమిండియా
కంగారూలకు పెట్టని కోటలాంటి పెర్త్‌లో టీమిండియా అదరగొడుతోంది. బౌలర్ల స్ఫూర్తికి బ్యాటర్ల జోరు తోడవడంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి విజయానికి చేరువైంది. యశస్వి జైస్వాల్ భారీ సెంచరీకి... కోహ్లి సమయోచిత శతకం తోడవడంతో ఆ్రస్టేలియా ముందు టీమిండియా 534 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.మన ఆటగాళ్లు చెడుగుడు ఆడుకున్న పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఫలితంగా 4.2 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆశలు వదులుకున్న ఆసీస్ ఆటగాళ్లు నాలుగో రోజు ఎంత సమయం క్రీజులో నిలుస్తారో వేచి చూడాలి!పెర్త్: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు తొలి టెస్టులో విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగడంతో ఆ్రస్టేలియా ముందు కొండంత లక్ష్యం నిలిచింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (297 బంతుల్లో 161; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... విరాట్ కోహ్లి (143 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కళాత్మక శతకంతో విజృంభించాడు. ఓవర్‌నైట్ స్కోరు 172/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 487/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (176 బంతుల్లో 77; 5 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (27 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కోహ్లి సెంచరీ పూర్తి కాగానే భారత కెపె్టన్ బుమ్రా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా ఆ్రస్టేలియా ముందు 534 పరుగుల లక్ష్యం నిలిచింది. లయన్ 2... స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్, మార్ష్తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. బుమ్రా (2/1), సిరాజ్ (1/7) ఆసీస్‌ను దెబ్బ కొట్టారు. మెక్‌స్వీనీ (0), కమిన్స్ (2), లబుషేన్ (3) అవుట్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (9 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆసీస్... విజయానికి ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్ల జోరు ఇలాగే సాగితే సోమవారం తొలి సెషన్లోనే ఆసీస్ ఆట ముగిసే అవకాశాలున్నాయి. ‘జై’స్వాల్ గర్జన సుదీర్ఘ ఫార్మాట్లో భారీ సెంచరీలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న యశస్వి జైస్వాల్... ఆ్రస్టేలియా గడ్డపై ఆడుతున్న తొలి టెస్టులోనే సత్తా చాటాడు. బౌన్సీ పిచ్‌పై రాణించేందుకు ప్రత్యేకంగా సాధన చేసి బరిలోకి దిగిన 22 ఏళ్ల జైస్వాల్... నాణ్యమైన పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డపై తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రాహుల్‌తో కలిసి రికార్డుల్లోకెక్కిన జైస్వాల్.. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టార్క్ వేసిన బౌన్సర్‌ను అప్పర్ కట్‌తో జైస్వాల్ సిక్సర్‌గా మలిచిన తీరు హైలైట్. తొలి ఇన్నింగ్స్‌లో చెత్త షాట్‌కు పెవిలియన్ చేరిన జైస్వాల్... ఈసారి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకు సాగాడు. క్లిష్టమైన పిచ్‌పై మెరుగైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న రాహుల్‌ను స్టార్క్ అవుట్ చేయగా... దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.రెండో కొత్త బంతి తీసుకున్న అనంతరం పడిక్కల్ పెవిలియన్ చేరగా... జైస్వాల్ 275 బంతుల్లో 150 మార్క్ దాటాడు. 23 ఏళ్లలోపు వయసులో నాలుగుసార్లు 150 పైచిలుకు పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన జైస్వాల్ చివరకు మార్ష్బౌలింగ్లో వెనుదిరిగాడు. ‘కోహ్లి’నూర్ ఇన్నింగ్స్... చాన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న విరాట్ కోహ్లి... ‘క్లాస్ శాశ్వతం, ఫామ్ తాత్కాలికం’ అని నిరూపించాడు. పిచ్ బౌన్స్‌కు సహకరిస్తున్న సమయంలో సంయమనం చూపి... కుదురుకున్నాక ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌లతో కట్టి పడేశాడు. స్వల్ప వ్యవధిలో జైస్వాల్‌తో పాటు పంత్ (1), జురేల్ (1) అవుట్ అయిన దశలో కోహ్లి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (29; ఒక సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అనూహ్య బౌన్స్‌తో కంగారూలు పరీక్షించినా... కోహ్లి ఏమాత్రం తడబడలేదు. పదే పదే వికెట్ పక్క నుంచి షాట్లు ఆడుతూ చకచకా పరుగులు రాబట్టాడు. సుందర్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టి20ల తరహాలో రెచి్చపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో బౌండరీతో కోహ్లి టెస్టుల్లో 30వ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (29)ను అధిగమించిన కోహ్లి... ఆసీస్ గడ్డపై ఏడో సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 104; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) మార్ష్161; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 77; పడిక్కల్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 25; కోహ్లి (నాటౌట్) 100; పంత్ (స్టంప్డ్) కేరీ (బి) లయన్ 1; జురేల్ (ఎల్బీ) (బి) కమిన్స్ 1; సుందర్ (బి) లయన్ 29; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 55; మొత్తం (134.3 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 487. వికెట్ల పతనం: 1–201, 2–275, 3–313, 4–320, 5–321, 6–410. బౌలింగ్: స్టార్క్ 26–2–111–1; హాజల్‌వుడ్ 21–9–28–1; కమిన్స్ 25–5–86–1; మార్ష్12–0–65–1; లయన్ 39–5–96–2; లబుషేన్ 6.3–0–38–0; హెడ్ 5–0–26–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 0; ఖ్వాజా (బ్యాటింగ్) 3; కమిన్స్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 2; లబుషేన్ (ఎల్బీ) (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (4.2 ఓవర్లలో 3 వికెట్లకు ) 12. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–12, బౌలింగ్: బుమ్రా 2.2–1–1–2; సిరాజ్ 2–0–7–1.201 ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. ఆ్రస్టేలియా గడ్డపై టీమిండియాకు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. 1986 సిడ్నీ టెస్టులో గావస్కర్–శ్రీకాంత్ నమోదు చేసిన 191 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానానికి చేరింది. 3 ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. 1968లో జయసింహ, 1977లో గావస్కర్ ఈ ఘనత సాధించారు. -
‘కోహ్లి.. జైస్వాల్‌ను చూసి ఎలా ఆడాలో నేర్చుకో’
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సత్తాచాటాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన మొదటి టెస్టు మ్యాచ్‌లోనే జైశ్వాల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైనా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కంగారులను కంగరెత్తించాడు.స్టార్క్, హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను ఆలోవకగా ఎదుర్కొని శెభాష్ అన్పించుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్హగ్ను గుర్తు చేసేలా సిక్సర్‌తో తన సెంచరీ మార్క్‌ను జైశ్వాల్ అందుకున్నాడు. ఓవరాల్‌గా జైశ్వాల్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం.ఓవరాల్‌గా 297 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 161 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో జైశ్వాల్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితుల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని మంజ్రేకర్ కొనియాడాడు. అదేవిధంగా బ్యాక్ ఫుట్‌లో జైశ్వాల్ అద్బుతంగా ఆడుతున్నాడని అతడు మెచ్చుకున్నాడు."జైశ్వాల్ ఒక సంచలనం. అతడు షాట్ సెలక్షన్ చాలా బాగుంది. ఈ మ్యాచ్‌లో అతడు కట్ షాట్ వైట్‌బాల్ క్రికెట్లో ఆడినట్లు ఆడాడు. సాధారణంగా ఆటగాళ్ళు కట్‌షాట్ ఆడేందుకు ముందుగానే పొజిషన్లోకి వస్తారు. కానీ జైశ్వాల్ మాత్రం చాలా ఆలస్యంగా ఆడుతున్నాడు.అదే అతడి స్పెషల్. బ్యాక్‌ఫుట్‌లో నుంచి అద్బుతంగా కట్ షాట్ ఆడుతున్నాడు. బ్యాక్‌ఫుట్ నుంచి షాట్ ఆడి స్క్వేర్ వెనక దిశగా పరుగులు రాబడుతున్నాడు. విరాట్ కోహ్లి కంటే జైశ్వాల్ బాగా కట్ షాట్ ఆడుతున్నాడు.విరాట్ కోహ్లి మాత్రం ఫ్రంట్ ఫుట్‌లో ఉండి ఆడేందుకు ఇష్టపడతాడు. అందువల్ల పెద్దగా పరుగులు సాధించలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా వంటి పరిస్థితుల్లో బ్యాక్‌ఫుట్‌లో ఎలా ఆడాలన్నది యశస్వి నుంచి కోహ్లి నేర్చుకోవాలి" అని స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో సంజయ్ పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన జైస్వాల్.. టీమిండియా తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు!
పెర్త్ టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపాడు. సిక్సర్‌తో వంద పరుగుల మార్కు అందుకున్న జైస్వాల్.. ఆస్ట్రేలియా గడ్డ మీద తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో తనకిది నాలుగో శతకం.What a way to bring up the ton! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/okMDAno5tE— cricket.com.au (@cricketcomau) November 24, 2024 ఈ క్రమంలో ఎన్నెన్నో అరుదైన రికార్డులను యశస్వి జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పెర్త్ టెస్టులో శతకం బాది టీమిండియా దిగ్గజాలుగా ఎదిగిన సునిల్ గావస్కర్, విరాట్ కోహ్లి మాదిరి జైస్వాల్ కూడా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్)గా పేరొందుతాడంటూ అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభం కాగా.. మూడో రోజు ఆటలో భాగంగా యశస్వి జైస్వాల్ భారీ శతకం సాధించాడు. 205 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్న 22 ఏళ్ల ఈ లెఫ్టాండర్.. మరో 92 బంతులు ఎదుర్కొని ఓవరాల్‌గా 161 రన్స్ సాధించాడు.జైస్వాల్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇవ్వడంతో జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా పెర్త్ టెస్టులో టీమిండియా ఇప్పటికే నాలుగు వందలకు పైగా ఆధిక్యం సంపాదించి పట్టు బిగించింది.పెర్త్ టెస్టులో సెంచరీ చేసి యశస్వి జైస్వాల్ సాధించిన రికార్డులు👉23 ఏళ్ల వయసు కంటే ముందే టెస్టుల్లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో.. సునిల్ గావస్కర్(4), వినోద్ కాంబ్లీ(4)ల సరసన యశస్వి నిలిచాడు. ఈ లిస్టులో సచిన్ టెండుల్కర్ 8 శతకాలతో మొదటి స్థానంలో ఉండగా.. రవిశాస్త్రి(5) రెండో స్థానంలో ఉన్నాడు.👉అదే విధంగా.. 23 ఏళ్ల వయసులోపే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలోనూ జైస్వాల్ చోటు సంపాదించాడు. ఈ ఏడాది జైస్వాల్ ఇప్పటికి మూడు శతకాలు బాదాడు.👉ఆస్ట్రేలియా గడ్డమీద తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన మూడో బ్యాటర్ జైస్వాల్. అతడి కంటే ముందు ఎంఎల్ జైసింహా(101- బ్రిస్బేన్- 1967-68), సునిల్ గావస్కర్(113- బ్రిస్బేన్-1977-78)లో ఈ ఘనత సాధించారు.మరో అరుదైన ఘనత.. భారత తొలి క్రికెటర్గాపెర్త్ టెస్టులో భారీ శతకంతో యశస్వి జైస్వాల్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఆడిన మొదటి పదిహేను టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో విజయ్ హజారే(1420)ను అతడు వెనక్కినెట్టాడు. కాగా 2023లో వెస్టిండీస్ గడ్డ మీద జైస్వాల్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అతడి ఖాతాలో నాలుగు శతకాలు. రెండు డబుల్ సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఫోర్ల సంఖ్య 178, సిక్సర్లు 38.ఆడిన తొలి 15 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు👉డాన్ బ్రాడ్‌మన్- 2115👉మార్క్ టేలర్- 1618👉ఎవర్టన్ వీక్స్- 1576👉యశస్వి జైస్వాల్- 1568👉మైకేల్ హస్సీ- 1560.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా పెర్త్ టెస్టు👉టాస్: టీమిండియా.. తొలుత బ్యాటింగ్👉టీమిండియా తొలి ఇన్నింగ్స్- 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్- 104 ఆలౌట్.చదవండి: IPL 2025 Mega Auction: పేరు మోసిన స్టార్లు.. హాట్‌కేకులు వీళ్లే.. 116 మందిపైనే వేలం వెర్రి -
యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 161 పరుగులు చేసి ఔటైన జైస్వాల్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటి నాలుగు సెంచరీలను 150 ప్లస్ స్కోర్లుగా మలిచిన తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అలాగే 23 ఏళ్లు రాక ముందే నాలుగు 150 ప్లస్ స్కోర్లు చేసిన మూడో ఏషియన్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి ముందు సచిన్, జావిద్ మియాందాద్ 23 ఏళ్లు రాక ముందే నాలుగు 150 ప్లస్ స్కోర్లు చేశారు.టెస్ట్‌ల్లో యశస్వి జైస్వాల్ 150 ప్లస్ స్కోర్లు..ఇంగ్లండ్‌పై 214 (2024లో రాజ్‌కోట్ టెస్ట్‌లో)ఇంగ్లండ్‌పై 209 (2024లో వైజాగ్ టెస్ట్‌లో)వెస్టిండీస్‌పై 171 (2023లో డోమినికా టెస్ట్‌లో)ఆస్ట్రేలియాపై 161 (2024లో పెర్త్ టెస్ట్‌లో)మ్యాచ్ విషయానికొస్తే.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 201 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం రాహుల్ (77) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ ఔటైన అనంతరం దేవ్‌దత్ పడిక్కల్ (25) కాసేపు నిలకడగా ఆడాడు. ఆతర్వాత అతను కూడా ఔటయ్యాడు. 161 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద యశస్వి జైస్వాల్ అనవసరమైన షాట్ ఆడి డబుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం భారత్ పరుగు వ్యవధిలో రిషబ్ పంత్ (1), ధృవ్ జురెల్ (1) వికెట్లు కోల్పోయింది. 100 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 326/5గా ఉంది. విరాట్ కోహ్లి (20), వాషింగ్టన్ సుందర్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 372 పరుగులుగా ఉంది. భారత్ మరో 100 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్, మార్ష్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా (5/30), హర్షిత్ రాణా (3/48), సిరాజ్ (2/20) చెలరేగిపోయారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో నాథన్ మెక్‌స్వీని (10), ట్రవిస్ హెడ్ (11), అలెక్స్ క్యారి (21), మిచెల్ స్టార్క్ (26) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (26), రిషబ్ పంత్ (37), ధృవ్ జురెల్ (11), నితీశ్ రెడ్డి (41) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మిచ్ మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
పెర్త్ టెస్ట్ లో యశస్వి జైశ్వాల్ సెంచరీ
-
IND VS AUS 1st Test: చరిత్ర సృష్టించిన జైస్వాల్-రాహుల్ జోడీ
పెర్త్ టెస్ట్‌లో భారత ఓపెనింగ్ జోడీ (యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై 200 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 201 పరుగులు జోడించారు. ఆసీస్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన రికార్డు గతంలో సునీల్ గవాస్కర్-క్రిస్ శ్రీకాంత్ జోడీ పేరిట ఉండేది. వీరిద్దరు 1986 సిడ్నీ టెస్ట్‌లో తొలి వికెట్‌కు 191 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.ఆసీస్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన భారత ఓపెనింగ్ జోడీలు..కేఎల్ రాహుల్-యశస్వి జైస్వాల్ (201 పరుగులు)సునీల్ గవాస్కర్-కృష్ణమాచారి శ్రీకాంత్ (191)సునీల్ గవాస్కర్-చేతర్ చౌహాన్ (165)కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు తొలి సెషన్లో భారత స్కోర్ 267/1గా ఉంది. కేఎల్ రాహుల్ (77) ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (141), దేవ్‌దత్ పడిక్కల్ (17) క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్ వికెట్ మిచెల్ స్టార్క్‌కు దక్కింది. ప్రస్తుతం టీమిండియా 313 పరుగల ఆధిక్యంలో కొనసాగుతుంది.భారత్ తొలి ఇన్నింగ్స్-150 ఆలౌట్ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్-104 ఆలౌట్సిక్సర్తో సెంచరీ పూర్తి చేసిన యశస్విఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశాడు. యశస్వికి ఆసీస్ గడ్డపై ఇది తొలి టెస్ట్ సెంచరీ. ఈ సెంచరీతో యశస్వి దిగ్గజాల సరసన చేరాడు. తొలి ఆస్ట్రేలియా పర్యటనలోనే సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లి తమ తొలి ఆసీస్ పర్యటనలోనే సెంచరీలు సాధించారు. -
జైశ్వాల్ అరుదైన ఫీట్.. 16 ఏళ్ల గంభీర్ రికార్డు బద్దలు
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీ దిశగా సాగుతున్నాడు.తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్న జైశ్వాల్.. స్టార్క్, హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం అలోవకగా ఎదుర్కొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 90 పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 172 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసాదరణ ఇన్నింగ్స్ ఆడుతున్న జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్‌లో టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 12 టెస్టులు ఆడిన జైశ్వాల్..1170* పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ పేరిట ఉండేది. 2008లో గంభీర్ ఒక క్యాలెండర్ ఈయర్‌లో 8 టెస్టులు ఆడి 1,134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గంభీర్ ఆల్‌టైమ్ రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. 2024లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా యశస్వి కొనసాగుతున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇంగ్లండ్ లెజెండ్ జోరూట్(1,338*) ఉన్నాడు.చదవండి: IND vs AUS: జైశ్వాల్, రాహుల్‌కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్ -
జైశ్వాల్, రాహుల్‌కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటలో కూడా ఆతిథ్య జట్టుపై భారత్ పై చేయి సాధించింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 90 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(153 బంతుల్లో 4 ఫోర్లతో 62 బ్యాటింగ్) అద్బుతమైన ఆరంభం ఇచ్చారు.వీరిద్దరూ తొలి వికెట్‌కు 172 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటై నిరాశపరిచిన జైశ్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. తొలిసారి ఆసీస్ గడ్డపై ఆడుతున్నప్పటకి తన అద్భుత ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు.ఆస్ట్రేలియాతో తన తొలి టెస్టు సెంచరీకి ఈ ముంబైకర్ చేరువయ్యాడు. మరోవైపు రాహుల్ సైతం తన క్లాస్‌ను చూపిస్తున్నాడు. రోహిత్ శర్మ స్ధానంలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్.. తనను తను మరోసారి నిరూపించుకున్నాడు. మూడో రోజు ఆటలో వీరిద్దరూ లంచ్ సెషన్ వరకు క్రీజులో ఉంటే భారత్ భారీ స్కోర్ సాధించడం ఖాయం.సెల్యూట్ చేసిన కోహ్లి.. ఇక ఈ ఓపెనింగ్ జోడీ ప్రదర్శనకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఫిదా అయిపోయాడు. రెండో రోజు ఆట అనంతరం ప్రాక్టీస్ కోసం మైదానంలో వచ్చిన కోహ్లి.. రాహుల్, యశస్వీలకు సెల్యూట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఆసీస్ గడ్డపై భారత ఓపెనర్లు 100 ప్లస్ రన్స్ భాగస్వామ్యం నెలకొల్పడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.చదవండి: IPL 2025: రిషబ్ పంత్‌కు రూ.33 కోట్లు.. సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్!? Virat Kohli immediately came out for practice after the day's play and appreciated Jaiswal and KL Rahul #INDvAUS pic.twitter.com/kvG1caIUXp— Robin 𝕏 (@SledgeVK18) November 23, 2024 -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఆసీస్ గడ్డపై తొలిసారి ఆడుతున్న జైశ్వాల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.జైశ్వాల్ ప్రస్తుతం 90 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. కేఎల్ రాహుల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను జైశ్వాల్ అద్భుతంగా ముందుకు నడపిస్తున్నాడు. జైశ్వాల్ వరల్డ్ రికార్డు..ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఈయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్లో జైశ్వాల్ ఇప్పటివరకు 34 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉండేది. మెక్కల్లమ్ 2014 ఏడాదిలో టెస్టుల్లో 33 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌లో నాథన్ లియోన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన జైశ్వాల్.. మెకల్లమ్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(26) ఉన్నారు.ఇక రెండో రోజు ఆటలో కూడా ఆసీస్‌పై భారత్ పై చేయి సాధించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్(90), కేఎల్ రాహుల్(62) నాటౌట్‌గా ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: కేఎల్ రాహుల్ అవుట్‌పై రగడ.. స్పందించిన స్టార్క్ -
Ind vs Aus: ఆ ఇద్దరు డకౌట్.. కోహ్లి మరోసారి విఫలం.. కష్టాల్లో టీమిండియా
టెస్టుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. స్వదేశంలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆస్ట్రేలియాలోనూ శుభారంభం అందుకోలేకపోయాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఐదు పరుగులకే కోహ్లి అవుటయ్యాడు.ఫలితంగా మరోసారి కోహ్లి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా తమ ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సీమర్లకు స్వర్గధామమైన పెర్త్ పిచ్‌పై భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తేలిపోయాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ సైతం డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి క్రీజులోకి రాగానే ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ.. భారత ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్ రెండో బంతికి కోహ్లి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.ఐదు పరుగులకే అవుట్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోహ్లి.. ఫ్రంట్‌ఫుట్ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఉస్మాన్ ఖవాజా చేతిలో పడింది. అలా షార్ట్ లెంగ్త్‌తో వచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసి కోహ్లి వికెట్ పారేసుకున్నాడు. మండిపడుతున్న ఫ్యాన్స్మొత్తంగా పన్నెండు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో కోహ్లిపై టీమిండియా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న కారణంగా తనకు వరుస అవకాశాలు ఇస్తున్నా బాధ్యతాయుతంగా ఆడకపోతే ఎలా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారుకష్టాల్లో టీమిండియాఇదిలా ఉంటే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కేవలం 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(0) విఫలం కాగా.. కేఎల్ రాహుల్(26) ఫర్వాలేదనిపించాడు. పడిక్కల్(0), కోహ్లి(5) మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. తొలిరోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25).చదవండి: IND VS AUS 1st Test: అశ్విన్, జడేజా లేకుండానే..! తుదిజట్లు ఇవేవిధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకుExtra bounce from Josh Hazlewood to dismiss Virat Kohli. pic.twitter.com/dQEG1rJSKA— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024We need to start a serious discussion now on kohli pic.twitter.com/WMmAlfdZ8h— Div🦁 (@div_yumm) November 22, 2024