ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. దీంతో పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ చేజారిపోయింది.
అయితే ఈ సిరీస్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన యశస్వి.. మిచెల్ స్టార్క్, కమ్మిన్స్, హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించాడు.
మొత్తం ఐదు మ్యాచ్‌లలో ఓ సెంచరీ, 2 అర్ధసెంచరీలు సహా అతను 43.44 సగటుతో 391 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ (448) తర్వాత ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైశ్వాల్ రెండో స్ధానంలో నిలిచాడు. తాజాగా తన తొలి ఆస్ట్రేలియా పర్యటనపై జైశ్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
‘ఆ్రస్టేలియా గడ్డపై ఎంతో నేర్చుకున్నాను. దురదృష్టవశాత్తూ మేం ఆశించిన ఫలితం రాలేదు. అయితే మున్ముందు మరింత బలంగా పైకి లేస్తాం. మీ అందరి మద్దతు ఎంతో ప్రోత్సాహించింది’ అని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో యశస్వి ఈ పోస్ట్ చేశాడు. కాగా జైశ్వాల్ పోస్ట్‌పై ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా స్పందించాడు. నీ పనిని ప్రేమించు బ్రదర్ అంటూ ఖావాజా కామెంట్ చేశాడు.
చదవండి: PAK vs SA: రెండో టెస్టులో పాకిస్తాన్ చిత్తు.. దక్షిణాఫ్రికాదే సిరీస్
Comments
Please login to add a commentAdd a comment