దక్షిణాఫ్రికా(South Afrcia) గడ్డపై వన్డే సిరీస్ ‘క్లీన్‌స్వీప్’ చేసి చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు... టెస్టు సిరీస్‌లో మాత్రం తేలిపోయింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పర్యాటక పాకిస్తాన్ ‘వైట్‌వాష్’కు గురైంది. కేప్‌టౌన్ వేదికగా సోమవారం(జనవరి 6) ముగిసిన రెండో టెస్టులో పాక్‌పై 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో సౌతాఫ్రికా సొంతం చేసుకుంది.
ఫాలో ఆన్‌లో అదుర్స్..
కాగా తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన పాకిస్తాన్ ఫాలో ఆన్‌లో మాత్రం అద్భుతమైన పోరాటం పటమకనబరిచింది. ఓవర్‌నైట్ స్కోరు 213/1తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆఖరికి 122.1 ఓవర్లలో 478 పరుగులకు ఆలౌటైంది. దీంతో సఫారీల ముందు పాకిస్తాన్ కేవలం 58 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచగల్గింది.
పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాన్ మసూద్ (251 బంతుల్లో 145; 17 ఫోర్లు) భారీ సెంచరీతో ఆకట్టుకోగా... ఆఘా సల్మాన్ (95 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (75 బంతుల్లో 41; 2 ఫోర్లు), ఆమేర్ జమాల్ (34; 7 ఫోర్లు) రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడ, కేశవ్ మహరాజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
ఊదిపడేసిన సౌతాఫ్రికా..
ఇక 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలో ఊదిపడేసింది. డేవిడ్ బెడింగ్‌హమ్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్క్‌రమ్ (14 నాటౌట్) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించారు.
దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగుల భారీ స్కోరు చేయగా... పాకిస్తాన్ మాత్రం తమ మొదటి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలోనే పాక్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన రికెల్టన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మార్కో యాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.
కాగా దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న తుది పోరులో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది.
చదవండి: Jasprit Bumrah: భయం పుట్టించాడు!
Comments
Please login to add a commentAdd a comment