టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) రంజీ ట్రోఫీ 2024-25లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈ టోర్నీ సెకెండ్ రౌండ్‌లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌తో జరగనున్న మ్యాచ్ కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కింది. 2015లో చివరిసారి రంజీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హిట్‌మ్యాన్.. మళ్లీ పదేళ్ల తర్వాత ఈ ప్రాతిష్టత్మక టోర్నీలో ఆడనున్నాడు.
రెడ్ బాల్ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో హిట్‌మ్యాన్ దారుణంగా నిరాశపరిచాడు. అంతకముందు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ అదే తీరును కనబరిచాడు. ఈ క్రమంలో రోహిత్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని పలువురు క్రికెటర్లు డిమాండ్ చేశారు.
దీంతో రోహిత్ తన పూర్వ వైభావాన్ని ఎలాగైనా పొందాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రంజీల్లో ఆడాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాకుండా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే.. సీనియర్ ఆటగాళ్లు సైతం దేశీవాళీ క్రికెట్‌లో ఆడాలని భారత క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది.
వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే రోహిత్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. ఇక జట్టులో విధ్వంసకర ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌ను కూడా ముంబై సెలక్టర్లు చేర్చారు. ఈ జట్టుకు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ జనవరి 23 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది.
పదేళ్ల తర్వాత..
రోహిత్ శర్మ చివరగా 2015లో ముంబై తరపున రంజీల్లో ఆడాడు. ముంబై వాంఖడే స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరిగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్(114) సెంచరీతో మెరిశాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది.
ఇప్పటివరకు 128 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబైకర్ 9287 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 29 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్‌తో మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సన్నద్దం కానున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
జమ్మూ కాశ్మీర్‌తో మ్యాచ్‌కు ముంబై జట్టు ఇదే..
అజింక్య రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఆయుష్ మ్హత్రే, శ్రేయాస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), తనుష్ కొటియన్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ ఠాకూర్ , సిల్వెస్టర్ డిసౌజా, రొయిస్టన్ ద్యాస్, కర్ష్ కొఠారి
చదవండి: IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ ప్రకటన..
Comments
Please login to add a commentAdd a comment