ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్... ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశారు. ఇటీవల ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో రోహిత్ పేలవ ప్రదర్శన కనబర్చగా... యశస్వి టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆసీస్‌తో ప్రతిష్టాత్మక సిరీస్‌లో భారత జట్టు పరాజయం పాలవగా... ప్లేయర్లందరూ దేశవాళీ టోర్నీ ల్లో ఆడాలనే డిమాండ్ పెరిగింది.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ‘అందుబాటులో ఉన్నవాళ్లందరూ రంజీ ట్రోఫీలో ఆడాలి’ అని ఆటగాళ్లకు చురకలు అంటించాడు. ఈ నేపథ్యంలో రోహిత్, యశస్వి ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ముంబై రంజీ కెపె్టన్ రహానేతో కలిసి రోహిత్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో గడపగా... బుధవారం జైస్వాల్ ప్రాక్టీస్ చేశాడు. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుండగా... జమ్ముకశ్మీర్‌తో ముంబై తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 20 వరకు జట్టును ప్రకటించే అవకాశం ఉందని... ఆ సమయంలో ఆటగాళ్లందరినీ అందుబాటులో ఉంటారా లేదా అని అడిగి ఎంపిక చేస్తామని ముంబై క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు. ‘రోహిత్‌ను కూడా అడుగుతాం. అతడు అందుబాటులో ఉంటానంటే జట్టులోకి ఎంపిక చేస్తాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment