Indian team
-
CT 2025 IND Vs BAN: శుభారంభంపై భారత్ గురి
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పోరు నేటి నుంచి మొదలవుతోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగే తమ తొలి మ్యాచ్‌లో గురువారం బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. బలాబలాలు, ఫామ్ పరంగా చూసుకుంటే రోహిత్ సేన ప్రత్యర్థికంటే ఎంతో బలంగా ఉంది. అయితే ఎప్పటిలాగే బంగ్లాదేశ్ తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చి సంచలనాన్ని ఆశిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు స్పిన్ ప్రధాన బలంగా భారత్ బరిలోకి దిగుతుండగా... బంగ్లాదేశ్ తమ పేస్ బౌలింగ్‌పై ఆశలు పెట్టుకుంది. సమష్టిగా చెలరేగితే... భారత్ తుది జట్టు కూర్పు విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఓపెనర్లుగా రోహిత్, గిల్ శుభారంభం అందిస్తే ఆ తర్వాత కోహ్లి దానిని కొనసాగించగలడు. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో చక్కటి అర్ధసెంచరీ సాధించిన కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ కూడా రాణిస్తే తిరుగుండదు. గత సిరీస్‌లో వరుస ప్రయోగాలతో రాహుల్ స్థానం పదే పదే మారింది. అయితే ఈసారి మాత్రం అతనికి అచ్చొచ్చిన ఐదో స్థానంలోనే ఆడించే అవకాశం ఉంది. పాండ్యా, జడేజా, అక్షర్‌ల ఆల్‌రౌండ్ నైపుణ్యం జట్టుకు అదనపు బలం.కుల్దీప్ చాలా కాలంగా చక్కటి ఆటతీరు కనబరుస్తున్నాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో అతడిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు సవాల్. అనుభవజు్ఞడైన షమీతో పాటు అర్ష్ దీప్ ఆరంభంలో బంగ్లాదేశ్‌ను కట్టిపడేయగల సమర్థులు. బలహీన బ్యాటింగ్... తమ దేశపు స్టార్ ఆటగాడు షకీబ్ లేకుండా 2004 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఒక పెద్ద టోర్నీ ఆడుతోంది. లిటన్ దాస్ కూడా ఈ టోర్నీలో లేడు. అయితే ఇతర సీనియర్లు ముషి్ఫకర్, మహ్ముదుల్లా లాంటి ప్లేయర్లు మరోసారి జట్టు భారం మోయాల్సి ఉంది. యువ బ్యాటర్లలో తన్జీద్, తౌహీద్ ఇటీవల పెద్దగా ప్రభావం చూపలేదు.కెప్టెన్ నజు్మల్ చాలా కాలంగా ఫామ్‌లో లేడు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాటింగ్ లైనప్ భారత బౌలింగ్‌ను ఏమాత్రం సమర్థంగా ఎదుర్కోగలదనేది సందేహమే. పేసర్లు ముస్తఫిజుర్, నాహిద్ రాణా, తస్కీన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది. స్పిన్ ఆల్‌రౌండర్ మెహదీ మిరాజ్ కీలకం కానున్నాడు. తుది జట్లు (అంచనా): భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, షమీ, అర్ష్ దీప్. బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్), తన్జీద్, సౌమ్య సర్కార్, తౌహీద్, ముషి్ఫకర్, మహ్ముదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్, తస్కీన్, నాహిద్, ముస్తఫిజుర్.పిచ్, వాతావరణంఈ వేదికపై వన్డేలు అరుదుగా జరుగుతున్నాయి. దాదాపు అన్ని మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. నెమ్మదైన పిచ్‌పై స్పిన్నర్ల ప్రభావం ఖాయం. వర్ష సమస్య లేదు.41 భారత్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 41 వన్డేలు జరిగాయి. భారత్ 32 మ్యాచ్‌ల్లో...బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. ఒక మ్యాచ్ రద్దయింది. చాంపియన్స్ ట్రోఫీలో ఒకే ఒక్కసారి 2017 సెమీఫైనల్లో ఇరు జట్లు తలపడ్డాయి. భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. -
ICC Champions Trophy: సై అంటే సై... ఏ జట్టు ఎలా ఉందంటే...
వన్డే క్రికెట్లో మరో ‘ప్రపంచ’ పోరుకు సమయం ఆసన్నమైంది. వరల్డ్ కప్ కాని వరల్డ్ కప్‌గా గుర్తింపు తెచ్చుకున్న చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. ప్రపంచ కప్‌తో పోలిస్తే తక్కువ జట్లతో టాప్–8తో పరిమితమైన ఈ ఐసీసీ టోర్నీలో జరగబోయే హోరాహోరీ సమరాలు ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఒక ఐసీసీ టోర్నీకి వేదిక అవుతుండగా... భారత జట్టు పాకిస్తాన్ గడ్డపై ఆడకుండా దుబాయ్‌కే పరిమితమవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం చివరిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన పాక్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... రెండుసార్లు టైటిల్ సాధించిన భారత్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దాటి ఈ ఫార్మాట్లో మళ్లీ ‘చాంపియన్’ హోదా కోసం రెడీ అంటోంది. కరాచీ: ఐసీసీ 2017లో చాంపియన్స్ ట్రోఫీని ఇంగ్లండ్‌లో నిర్వహించింది. లెక్క ప్రకారం 2021లో తర్వాతి టోర్నీ జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా కోవిడ్ కారణంగా ఐసీసీ అన్ని షెడ్యూల్లలో మార్పులు చేయాల్సి వచ్చింది. 2020లో జరగాల్సిన టి20 ప్రపంచ కప్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో 2021కి మార్చారు. ఈ నేపథ్యంలో ఒకే ఏడాది రెండు ఐసీసీ టోర్నీల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి 2021 టోర్నీని పూర్తిగా రద్దు చేసేశారు. మరో నాలుగేళ్లకు ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు దీనికి నేరుగా అర్హత సాధించాయి. దాంతో మాజీ చాంపియన్ శ్రీలంక దూరం కాగా... అసలు వరల్డ్ కప్ ప్రధాన పోటీలకే క్వాలిఫై కాని మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్ కూడా ఈ టోర్నీలో కనిపించడం లేదు. అఫ్గానిస్తాన్ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో భాగంగా నాలుగు వేదికల్లో కలిపి మొత్తం 12 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. భారత్ ఆడే 3 లీగ్ మ్యాచ్‌లు మినహా మిగతా వాటికి పాకిస్తాన్ వేదిక కాగా... భారత్ తమ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడుతుంది. టీమిండియా సెమీఫైనల్, ఆపై ఫైనల్ చేరితే ఆ రెండు మ్యాచ్‌లూ దుబాయ్‌లోనే జరుగుతాయి. మరో సెమీఫైనల్‌కు మాత్రం పాక్ ఆతిథ్యమిస్తుంది. భారత్ ఫైనల్ చేరకపోతే మాత్రం టైటిల్ పోరును పాకిస్తాన్ గడ్డపైనే నిర్వహిస్తారు. ఏ జట్టు ఎలా ఉందంటే...» ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఇంగ్లండ్ జట్టు రెండు సార్లు ఫైనల్స్‌లో ఓడింది. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తాము నమ్ముకున్న విధ్వంసక ఆట ఇప్పుడు ఏమాత్రం పనికి రాక కుప్పకూలిపోతోంది. బ్యాటింగ్‌లో రూట్, కెప్టెన్ బట్లర్, బ్రూక్ రాణించడం కీలకం. పేసర్లు ప్రభావం చూపలేకపోతుండగా... బలమైన స్పిన్నర్ జట్టులో లేడు. ఫామ్‌పరంగా వరల్డ్ కప్ తర్వాత 14 వన్డేలు ఆడితే 4 మాత్రమే గెలి చింది. వెస్టిండీస్, భారత్‌ల చేతిలో చిత్తయింది. » 2000లో తమ ఏకైక ఐసీసీ టోర్నీ నెగ్గిన న్యూజిలాండ్... 2009లో ఫైనల్ చేరింది. వైవిధ్యమైన ఆటగాళ్ల కూర్పుతో జట్టు ఇతర అన్ని టీమ్లకంటే మెరుగ్గా కనిపిస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, లాథమ్‌లతో బ్యాటింగ్ బలంగా ఉండగా, కెప్టెన్ సాంట్నర్‌తో కలిపి ముగ్గురు స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. ఫెర్గూసన్ దూరం కావడం లోటే అయినా హెన్రీ పదునైన పేస్ కీలకం కానుంది. గత మూడు సిరీస్‌లలో రెండు గెలిచిన జట్టు... తాజాగా ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్‌ను ఓడించి విజేతగా నిలిచింది. » టోర్నీలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా గత రెండుసార్లు సెమీస్ కూడా చేరలేకపోయింది. ముగ్గురు ప్రధాన పేసర్లు కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ లేకుండా బరిలోకి దిగడం బౌలింగ్‌ను బలహీనపర్చింది. దాంతో బ్యాటింగ్‌పైనే భారం ఉంది. కెప్టెన్ స్మిత్, హెడ్, మ్యాక్స్‌వెల్ కీలకం కానున్నారు. పేసర్లు జాన్సన్, ఎలిస్‌లతో పాటు స్పిన్నర్ జంపా రాణించాల్సి ఉంది. 2023 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిచిన ఆసీస్... పాక్, శ్రీలంక చేతుల్లో ఓడింది.» తొలిసారి 1998లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఆ తర్వాత నాలుగుసార్లు సెమీస్ చేరినా ముందంజ వేయలేకపోయింది. వరల్డ్ కప్ తర్వాత 14 మ్యాచ్‌లలో నాలుగే గెలిచినా... ఎక్కువసార్లు ద్వితీయ శ్రేణి జట్టే బరిలోకి దిగింది. కాబట్టి కీలక ఆటగాళ్లు రాణిస్తే సెమీస్ కచి్చతంగా చేరగలమని ఆశిస్తోంది. క్లాసెన్ అద్భుత ఫామ్‌లో ఉండగా... కెప్టెన్ బవుమా డసెన్, మార్క్రమ్ తమ వన్డే ఆటను ప్రదర్శించాల్సి ఉంది. రబడ మినహా బౌలింగ్‌లో పదును లేదు. » డిఫెండింగ్ చాంపియన్‌గా పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. గత టైటిల్ మినహా అంతకు ముందు పేలవ రికార్డు ఉంది. సొంతగడ్డపై జరుగుతుండటం పెద్ద సానుకూలత. ఫామ్‌లో లేకపోయినా ఇప్పటికీ బాబర్ ఆజమే కీలక బ్యాటర్. కెప్టెన్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా ప్రత్యర్థి స్పిన్‌ను ఎలా ఆడతారనే దానిపైనే జట్టు అవకాశాలు ఉన్నాయి. సయీమ్ అయూబ్ దూరం కావడం ఇబ్బంది పెట్టే అంశం. షాహీన్, నసీమ్, రవూఫ్‌లతో బౌలింగ్ ఇప్పటికీ సమస్యే. అబ్రార్ నాణ్యమైన స్పిన్నర్ కాదు.» టోర్నీ చరిత్రలో బంగ్లాదేశ్ 12 మ్యాచ్‌లు ఆడితే గెలిచింది 2 మాత్రమే. ఇటీవల వరుసగా వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ చేతుల్లో సిరీస్‌లు ఓడింది. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ లేదు. అయితే టెస్టులు, టి20లతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగ్గా ఆడుతుండటంతో కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త తరం పేస్ బౌలర్లు తన్జీమ్, నాహిద్ చెప్పుకోదగ్గ రీతిలో ఆకట్టుకున్నారు. షకీబ్, తమీమ్ ఇక్బాల్‌ల తరాన్ని దాటి ఐసీసీ ఈవెంట్లో నజ్ముల్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఈసారి కాస్త కొత్తగా కనిపిస్తోంది. » అఫ్గానిస్తాన్ జట్టుకు ఇదే తొలి చాంపియన్స్ ట్రోఫీ. వరల్డ్ కప్‌లో టాప్–8లో నిలిచి అర్హత సాధించడంతోనే ఆ జట్టు ఎంత మెరుగైందో చెప్పవచ్చు. వరల్డ్ కప్ తర్వాత ఐదు సిరీస్‌లు ఆడితే నాలుగు గెలిచింది. టి20 వరల్డ్ కప్‌లో కూడా సెమీస్ చేరిన టీమ్ తాము ఎలాంటి జట్టునైనా ఓడించగలమనే నమ్మకాన్ని కలిగిస్తోంది. గుర్బాజ్, కెప్టెన్ హష్మతుల్లా, అజ్మతుల్లా బ్యాటింగ్‌లో ప్రధానం కాగా...బౌలింగ్‌లో రషీద్ పెద్ద బలం. సీనియర్లు నబీ, నైబ్లకు గెలిపించగల సామర్థ్యం ఉంది. -
అబ్బాయిల ఓటమి...అమ్మాయిల గెలుపు
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ 1–3 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడింది. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత జట్టు చేతిలో ఎదురైన పరాజయానికి స్పెయిన్ బదులు తీర్చుకున్నట్లైంది. భారత్ తరఫున సుఖ్జీత్సింగ్ (25వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. స్పెయిన్ తరఫున బోర్జా లాకల్లె (28వ నిమిషంలో), ఇగ్నాషియా కొబొస్ (38వ ని.లో), బ్రూనో అవిలా (56వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. భారత జట్టు పదే పదే దాడులు చేసినా స్పెయిన్ రక్షణ పంక్తి సమర్థవంతంగా అడ్డుకుంది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా... గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్‌ను ఇరు జట్లు మరింత దూకుడుగా ప్రారంభించాయి. ఈ క్రమంలో సుఖ్జీత్ సింగ్ గోల్‌తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లగా... మూడు నిమిషాల వ్యవధిలోనే గోల్ కొట్టిన స్పెయన్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా రెండు క్వార్టర్స్‌లో ఒక్కో గోల్ బాదిన స్పెయిన్ మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం మరోసారి స్పెయిన్‌తో భారత్ ఆడనుంది. హోరాహోరీ పోరులో భారత అమ్మాయిల విజయం ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం హోరాహోరీగా సాగిన తొలి పోరులో భారత్ 3–2 పాయింట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. కళింగ స్టేడియంలో జరిగిన పోరులో తమకన్నా మెరుగైన ర్యాంక్ ఉన్న ఇంగ్లండ్ జట్టుపై భారత్ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబర్చింది. భారత్ తరఫున వైష్ణవి (6వ నిమిషంలో), దీపిక (25వ ని.లో) నవ్‌నీత్ కౌర్ (59వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. వైష్ణవి, దీపిక పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచగా... ఆట ఆఖరి నిమిషంలో అదిరిపోయే ఫీల్డ్‌గోల్‌తో నవ్‌నీత్ జట్టుకు విజయాన్ని అందించింది. ఇంగ్లండ్ తరఫున డార్సీ బౌర్నె (12వ నిమిషంలో), ఫియానా క్రాక్లెస్ (58వ ని.లో) చెరో గోల్ కొట్టారు. ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్.. వైష్ణవి గోల్‌తో తొలి క్వార్టర్‌లోనే ఖాతా తెరిచింది. అయితే కాసేపటికే ఏడో ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్లో దీపిక గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్... సునాయాసంగానే మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఈ క్రమంలో గోల్‌కీపర్ సవిత పూనియా కొన్ని చక్కటి సేవ్‌లతో ప్రత్యర్థికి స్కోరు చేసే అవకాశం ఇవ్వలేదు. చివర్లో ఇంగ్లండ్ స్కోరు సమం చేసినా... నిమిషం వ్యవధిలోనే మరో గోల్ కొట్టిన భారత్ విజయం సాధించింది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో మరోసారి ఇంగ్లండ్‌తో భారత అమ్మాయిల జట్టు తలపడుతుంది. -
ఐదుగురు స్పిన్నర్లా?
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉండటంపై భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎలా చూసినా ఈ సంఖ్య ఎక్కువేనని అతను అభిప్రాయ పడ్డాడు. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో... టీమిండియా ఆడే మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘దుబాయ్‌లో ఐదుగురు స్పిన్నర్లు అవసరమా? అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌తో పాటు పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు తుది జట్టులో చోటు దక్కొచ్చు. వరుణ్ చక్రవర్తిని కూడా ఆడించాలనుకుంటే... ఒక పేస్ బౌలర్‌ను తగ్గించి పాండ్యానే రెండో పేసర్‌గా పరిగణించాల్సి ఉంటుంది. అదనపు పేసర్‌ను బరిలోకి దింపాలంటే ఒక స్పిన్నర్‌ను తగ్గించుకోక తప్పదు’ అని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అక్షర్, జడేజా, కుల్దీప్, వరుణ్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్... టీమిండియాలో ‘సూపర్ స్టార్ కల్చర్’పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘భారత జట్టులో సూపర్ సెలబ్రిటీ విధానాన్ని తగ్గించాలి. దాన్ని ఏమాత్రం ప్రోత్సహించకూడదు. జట్టులో ఉండేది ఆటగాళ్లే... సూపర్ స్టార్లు కాదు. కెరీర్లో ఎంతో సాధించిన కోహ్లి, రోహిత్ ఇప్పుడు మరో సెంచరీ కొట్టినా అదేమీ పెద్ద ఘనత కాదు, మీ వ్యక్తిగత రికార్డు కూడా కాదు. అంతా జట్టు కోసమే’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ప్లేయర్లు వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోకుండా జట్టు ప్రయోజనాల కోసమే ఆడాలని అశ్విన్ సూచించాడు. జాతీయ జట్టు తరఫున 106 టెస్టులాడి 537 వికెట్లు పడగొట్టిన అశ్విన్... 116 వన్డేల్లో 156 వికెట్లు తీశాడు. 65 టి20ల్లో 72 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మూడో టెస్టు అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. -
కుటుంబసభ్యులు లేకుండానే...
న్యూఢిల్లీ: పాక్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడేందుకు వెళ్లనున్న భారత జట్టు తమవెంట కుటుంబసభ్యులను తీసుకెళ్లడం లేదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సిఫార్సుల మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే కొత్త పాలసీని తీసుకొచి్చన సంగతి తెలిసిందే. దీనిప్రకారం ఎన్నో ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో స్టార్లు, దిగ్గజ హోదా పక్కనబెట్టి కెపె్టన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తమ రాష్ట్ర జట్లకు ఆడిన సంగతి తెలిసిందే! అలాగే ఇప్పుడు తాజాగా విదేశీ ప్రయాణం విషయంలోనూ ఈ పాలసీ అమలవుతోంది. దుబాయ్‌లో ఈ నెల 20న బంగ్లాదేశ్, 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్‌లతో భారత్ లీగ్ దశ మ్యాచ్‌ల్ని ఆడనుంది. నాకౌట్ దశ, ఫైనల్స్ కలిపినా మార్చి 9న టోర్నీ ముగుస్తుంది. అంటే మూడు వారాల్లోపే ముగియనున్న ఈ టోర్నీ కోసం కొత్త నియమావళి ప్రకారం భార్యబిడ్డలను అనుమతించరు. కొత్త పాలసీ ప్రకారం ఏదైనా విదేశీ పర్యటన 45 రోజులు, అంతకుమించి జరిగితేనే గరిష్టంగా రెండు వారాల పాటు కుటుంబసభ్యుల్ని క్రికెటర్ల వెంట వెళ్లేందుకు అనుమతిస్తారు. కానీ 8 దేశాలు ఆడే చాంపియన్స్ ట్రోఫీ కనీసం నెల రోజుల పాటైనా జరగకపోవడంతో దుబాయ్ స్టేడియంలో ఆట, ఇది పూర్తయ్యాక భార్యబిడ్డలతో సరదాగా దుబాయ్ వీధుల్లో సయ్యాట ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. అలాగే స్టార్ ఆటగాళ్ల వెంట పరిమిత సంఖ్యలో అనుమతించే వ్యక్తిగత సిబ్బందికి జట్టు, కోచింగ్ సిబ్బంది బస చేసిన హోటల్లో కాకుండా వేరే హోటల్లో బస ఏర్పాట్లు చేస్తారు. గతంలో వ్యక్తిగత ట్రెయినర్, మేనేజర్, షెఫ్‌లకు కోచింగ్ బృందంలో కలిపి వసతి ఏర్పాటు చేసేవారు. -
భారత్ X జపాన్
కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని నిలబెట్టుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్ జట్టుతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. గురువారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ద్వయం 21–11, 12–21, 15–21తో కి డాంగ్ జు–జియోంగ్ నా యున్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో మాళవిక బన్సోద్ 9–21, 10–21తో సిమ్ యు జిన్ చేతిలో పరాజయం పాలైంది. దాంతో భారత్ 0–2తో వెనుకబడింది. మూడో మ్యాచ్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్ 17–21, 21–18, 21–19తో చో జియోన్‌యోప్‌పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 19–21, 21–16, 21–11తో కిమ్ ఇన్ జి–కిమ్ యు జుంగ్ జంటను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సాతి్వక్ సాయిరాజ్–అర్జున్ జంట 14–21, 21–23తో జిన్ యోంగ్–నా సుంగ్ సెయోంగ్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. -
మకావును మట్టికరిపించి...
కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. మకావు జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–0 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓడిన మకావు జట్టు వరుసగా రెండో ఓటమితో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన దక్షిణ కొరియా నేడు భారత జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలుస్తుంది. తొలి మ్యాచ్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్యా వరియత్ జోడీ 21–10, 21–9తో లోక్ చోంగ్ లియోంగ్–వెంగ్ చి ఎన్జీ జంటను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–16, 21–12తో పాంగ్ ఫాంగ్ పుయ్‌పై గెలవడంతో భారత ఆధిక్యం 2–0కు పెరిగింది.మూడో మ్యాచ్‌లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–15, 21–9తో హావో వాయ్ చాన్‌ను ఓడించడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది.నాలుగో మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి–అర్జున్ ద్వయం 21–15, 21–19తో చిన్ పోన్ పుయ్–కోక్ వెన్ వోంగ్ జోడీపై... ఐదో మ్యాచ్‌లో ట్రెసా జాలీ–పుల్లెల గాయత్రి జంట 21–10, 21–5తో ఎన్జీ వెంగ్ చి–పుయ్ చి వా ద్వయంపై గెలుపొందడంతో భారత విజయం 5–0తో సంపూర్ణమైంది. 2023లో దుబాయ్‌లో జరిగిన ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. -
చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం... జట్టులోకి హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. టాప్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ ఐసీసీ ఈవెంట్‌కు దూరమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతను పూర్తిగా కోలుకోలేదు. జాతీయ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్ అనంతరం అతని ఫిట్‌నెస్‌పై వైద్యులు బీసీసీఐకి నివేదిక అందించారు. ఇందులో గాయం తీవ్రతపై వివరాలు లేకున్నా... ఇప్పుడు బౌలింగ్ చేసే స్థితిలో లేడని మాత్రం స్పష్టమైంది. బుమ్రా ఆడటంపై చాలా రోజులుగా సందేహాలు ఉన్నా... ఇప్పుడు మాత్రమే బోర్డు దీనిని అధికారికంగా ధ్రువీకరించింది. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను సెలక్టర్లు ఎంపిక చేశారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా 15 మంది సభ్యుల చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి తీసుకున్నారు. వరుణ్ కోసం యశస్వి జైస్వాల్‌ను టీమ్ నుంచి తప్పించారు. స్థిరమైన ఓపెనర్లుగా రోహిత్, గిల్ ఉండటంతో జైస్వాల్‌పై వేటు వేయాల్సి వచి్చంది. అయితే నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్లుగా జైస్వాల్, సిరాజ్, శివమ్ దూబేలను ఎంపిక చేశారు. వీరు అవసరమైతేనే దుబాయ్‌కు ప్రయాణిస్తారు. -
భవిష్యత్ బాగుంది!
ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్ ఆసాంతం రాణించిన భారత జట్టు... డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో వరుసగా రెండోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ప్రత్యర్థికి పైచేయి సాధించే అవకాశం కాదు కదా... కనీసం కోలుకునే చాన్స్ కూడా ఇవ్వకుండా చెలరేగిపోయింది. వరల్డ్‌కప్ మొత్తం పరాజయం అన్నదే ఎరగకుండా ముందుకు సాగిన యువ భారత్... ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ చాంపియన్‌గా నిలిచింది.ఫైనల్‌కు ముందు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట ఛేజింగ్ చేసిన టీమిండియా... అన్నీ మ్యాచ్‌ల్లోనూ రెండు వికెట్లు కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని అధిగమించింది. తొలుత బ్యాటింగ్ చేసే చాన్స్ వస్తే దంచి కొట్టడం... బౌలింగ్ చేయాల్సి వస్తే ప్రత్యర్థిని కట్టిపడేయడం టోర్నీ మొత్తం ఇదే ప్రణాళిక అవలంబించి విజయవంతమైంది.బ్యాటింగ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగితే... తమిళనాడు అమ్మాయి కమలిని ఆమెకు చక్కటి సహకారం అందించింది. బౌలింగ్‌లో స్పిన్ త్రయం వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పారుణిక సిసోడియా యువ భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది. మెగా టోర్నీలో మన యంగ్ ‘స్టార్ల’ ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం కమలిని కమాల్ టోర్నీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన తమిళనాడుకు చెందిన కమలిని 7 మ్యాచ్‌లాడి 143 పరుగులు చేసింది. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానం దక్కించుకున్న కమిలిని 35.75 సగటుతో పరుగులు రాబట్టింది. అందులో 2 అర్ధశతకాలు ఉన్నాయి. లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కమలిని ‘సూపర్ సిక్స్’లో స్కాట్లాండ్తో పోరులో 51 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో దంచికొట్టిన కమలిని 56 పరుగులు చేసి అజేయంగా జట్టును ఫైనల్‌కు చేర్చింది. ఈ టోర్నీలో త్రిష విజృంభించడంతో ఆమె మెరుపుల ముందు కమలిని ప్రదర్శన మరుగున పడినా... జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలో ఈ తమిళనాడు వికెట్ కీపర్ రాణించింది. అండర్–19 ఆసియా కప్‌లోనూ ఆకట్టుకున్న కమలినిని మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ రూ. 1 కోటీ 60 లక్షలకు కొనుగోలు చేసుకుంది. ఇంట్లో సోదరులను చూసి క్రికెట్ ఆడటం నేర్చుకున్న కమలిని కొంత కాలం తర్వాత ఆటనే కెరీర్‌గా ఎంచుకోవాలని భావించి తీవ్ర సాధన చేసింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని నిలకడగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే తదుపరి లక్ష్యంగా కమలిని ముందుకు సాగుతోంది. ‘సూపర్’ సనిక దక్షిణాఫ్రికాతో తుదిపోరులో ఫోర్ కొట్టి భారత జట్టును విజయతీరాలకు చేర్చిన సనిక చాల్కె కూడా... ఈ టోర్నీలో తనదైన ముద్ర వేసింది. వెస్టిండీస్‌తో జరిగిన టోర్నీ ఆరంభ పోరులో రైజింగ్ స్టార్ త్రిష త్వరగా అవుటైన సమయంలో అజేయంగా జట్టును గెలిపించిన ముంబైకి చెందిన సనిక... ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతిసారి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. దక్షిణాఫ్రికాతో తుదిపోరులోనూ ఓపెనర్ కమలిని తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... త్రిషతో కలిసి చక్కటి భాగస్వామ్యం నమోదు చేసింది. వరల్డ్‌కప్‌లో వైస్కెపె్టన్గానూ వ్యవహరించిన సనిక... మున్ముందు కూడా ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్నట్లు వెల్లడించింది. వైష్ణవి స్పిన్ మాయ మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన వైష్ణవి శర్మ... తన లెఫ్టార్మ్ స్పిన్ మాయాజాలంతో భారత అండర్–19 జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. టోర్నీ ఆసాంతం రాణించిన వైష్ణవి 17 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఐసీసీ అండర్–19 వరల్డ్‌కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వైష్ణవి రికార్డుల్లోకెక్కింది. మలేసియాలోపై హ్యాట్రిక్ సహా కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన వైష్ణవి... మరో మూడు మ్యాచ్‌ల్లో మూడేసి వికెట్లు పడగొట్టింది. బంగ్లాదేశ్‌పై 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన వైష్ణవి, స్కాట్లాండ్పై 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు ఖాతాలో వేసుకుంది. ‘సూపర్ సిక్స్’ దశలో స్కాట్లాండ్పై 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఈ మధ్యప్రదేశ్ స్పిన్నర్... ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో 23 పరుగులిచ్చి 2 వికెట్లు ఖాతాలో వేసుకుంది. దాదాపు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ స్పిన్‌తో తనదైన ముద్రవేసిన వైష్ణవి శ్రీలంకపై మ్యాచ్‌లో 3 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టింది. పారుణిక ప్రతాపం భారత అండర్–19 జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవడంలో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించగా... అందులో పారుణిక కూడా ఉంది. వైష్ణవి, ఆయుశికి తోడు తన లెఫ్టార్మ్ స్పిన్‌తో ఢిల్లీకి చెందిన పారుణిక సిసోడియా ప్రత్యరి్థని వణికించింది. 6 మ్యాచ్‌లాడిన పారుణిక 5.80 సగటుతో 10 వికెట్లు పడగొట్టింది. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో 21 పరుగలిచ్చి 3 వికెట్లు పడగొట్టిన పారుణిక... ఫైనల్లో ప్రత్యరి్థని తన స్పిన్‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. 4 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి... దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు వేయకుండా అడ్డుకట్ట వేసింది. ఆయుశి అదరహో ఒకవైపు తన స్పిన్‌తో వైష్ణవి ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుంటే... ఆమెకు ఆయుశీ శుక్లా తోడవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. గింగిరాలు తిరిగే బంతులతో బ్యాటర్లను తికమిక పెట్టిన ఆయుశి వరల్డ్‌కప్‌లో 7 మ్యాచ్‌లాడి 5.71 సగటుతో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. స్కాట్లాండ్తో పోరులో 8 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసిన ఆయుశి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది. వైష్ణవి బౌలింగ్‌లోనైనా ప్రత్యర్థులు అడపాదడపా భారీ షాట్లు ఆడగలిగారు కానీ... ఆయుశి మాత్రం బ్యాటర్లను స్వేచ్ఛగా ఆడనివ్వకుండా కట్టిపడేసింది. వైవిధ్యమైన బంతులతో ఫలితం సాధించింది. వెస్టిండీస్‌పై 2 వికెట్లు, మలేసియాపై 3 వికెట్లు, శ్రీలంకపై ఒక వికెట్, ఇంగ్లండ్‌పై 2 వికెట్లు తీసి సత్తా చాటింది. షబ్నమ్ సత్తా... భారత మహిళల జట్టు వరుసగా రెండోసారి అండర్–19 ప్రపంచకప్ గెలవడంలో... మరో తెలుగమ్మాయి పాత్ర కూడా ఉంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 17 ఏళ్ల షబ్నమ్ షకీల్ తన మీడియం పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకుంది. గత ప్రపంచకప్‌లోనూ బరిలోకి దిగిన ఈ తెలుగమ్మాయి. ఈసారి ఏడు మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు పడగొట్టింది. స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించిన ఈ టోర్నీలో పేసర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించింది. మెరుగైన ఎకానమీ నమోదు చేయడంతో పాటు... ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచి సహచర బౌలర్లకు వికెట్లు దక్కడంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు కేరళకు చెందిన జోషిత 6 మ్యాచ్‌లాడి 6 వికెట్లు పడగొట్టింది. -
తిలక్ సూపర్ ఇన్నింగ్స్.. రెండో టీ20 భారత్‌దే (ఫోటోలు)
-
భారత్ ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్రామీణ క్రీడ ఖోఖో తొలి ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. మహిళల విభాగంతోపాటు పురుషుల విభాగంలోనూ భారత జట్టే విజేతగా అవతరించింది. తొలుత జరిగిన మహిళల ఫైనల్లో భారత జట్టు 78–40 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టును ఓడించగా... పురుషుల ఫైనల్లో టీమిండియా 54–36 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టుపైనే విజయం సాధించింది. భారత జట్టుకు చెందిన ప్రియాంక, ప్రతీక్ ‘బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెల్చుకున్నారు. -
ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్... ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశారు. ఇటీవల ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో రోహిత్ పేలవ ప్రదర్శన కనబర్చగా... యశస్వి టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆసీస్‌తో ప్రతిష్టాత్మక సిరీస్‌లో భారత జట్టు పరాజయం పాలవగా... ప్లేయర్లందరూ దేశవాళీ టోర్నీ ల్లో ఆడాలనే డిమాండ్ పెరిగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ‘అందుబాటులో ఉన్నవాళ్లందరూ రంజీ ట్రోఫీలో ఆడాలి’ అని ఆటగాళ్లకు చురకలు అంటించాడు. ఈ నేపథ్యంలో రోహిత్, యశస్వి ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ముంబై రంజీ కెపె్టన్ రహానేతో కలిసి రోహిత్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో గడపగా... బుధవారం జైస్వాల్ ప్రాక్టీస్ చేశాడు. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుండగా... జమ్ముకశ్మీర్‌తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 20 వరకు జట్టును ప్రకటించే అవకాశం ఉందని... ఆ సమయంలో ఆటగాళ్లందరినీ అందుబాటులో ఉంటారా లేదా అని అడిగి ఎంపిక చేస్తామని ముంబై క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు. ‘రోహిత్‌ను కూడా అడుగుతాం. అతడు అందుబాటులో ఉంటానంటే జట్టులోకి ఎంపిక చేస్తాం’ అని అన్నారు. -
షమీ పునరాగమనం
న్యూఢిల్లీ: సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ భారత జట్టులోకి 14 నెలల తర్వాత పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టి20 సిరీస్ కోసం సెలక్టర్లు శనివారం ఎంపిక చేసిన జట్టులో షమీకి చోటు లభించింది. ముందుగా కాలి మడమ, ఆపై మోకాలి గాయంతో బాధపడిన షమీ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. 2023 నవంబర్ 19న ఆ్రస్టేలియాతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన తర్వాత టీమిండియాకు ప్రాతినిధ్యం వహించలేదు. గాయంతో కోలుకొని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్ తర్వాత దేశవాళీ క్రికెట్లోకి అడుగు పెట్టిన షమీ వరుసగా మూడు ఫార్మాట్లలో కూడా ఆడి మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ టి20 టోర్నీలతో ప్రస్తుతం గురువారం విజయ్‌హజారే వన్డే టోర్నీ ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో కూడా షమీ బరిలోకి దిగాడు. ఇటీవల ఆ్రస్టేలియాతో ముగిసిన ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం షమీని ఎంపిక చేసే అంశంపై చర్చ జరిగింది. అయితే పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతడిని జట్టులోకి తీసుకునేందుకు సెలక్టర్లు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత షమీ ఫిట్‌గా ఉన్నట్లు తేలింది. నిజానికి భారత్ తరఫున నవంబర్ 2022 తర్వాత అతను టి20 మ్యాచ్ ఆడలేదు. ఈ ఫార్మాట్లో యువ పేసర్ల రాకతో షమీ దాదాపుగా జట్టుకు దూరమైపోయాడు. అయితే ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తోనే జరిగే వన్డే సిరీస్, ఆపై చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్లను ఎంపిక చేయనున్న నేపథ్యంలో వాటికి ముందు టి20ల ద్వారా షమీ ఫిట్నెస్ను పూర్తి స్థాయిలో పరీక్షించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అందుకే ఈ ఫార్మాట్లో అతనికి చోటు లభించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15 మంది సభ్యుల ఈ బృందం ఎంపికలో ఎలాంటి భారీ మార్పులు, సంచలనాలు చోటు చేసుకోలేదు. అయితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడిన రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతినివ్వగా...గాయంపై స్పష్టత లేకపోవడంతో బుమ్రాను కూడా ఎంపిక చేయలేదు. భారత జట్టు తమ చివరి సిరీస్ ఆడిన టీమ్‌లో (దక్షిణాఫ్రికాతో) ఉన్న ఐదుగురు ఆటగాళ్లు తమ స్థానాలు నిలబెట్టుకోలేకపోయారు. రమణ్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్, విజయ్‌కుమార్ వైశాక్‌లను పక్కన పెట్టిన సెలక్టర్లు ఆసీస్‌తో టెస్టులు ఆడిన నితీశ్, హర్షిత్, సుందర్, జురేల్‌లను ఈ టి20 టీమ్‌లోకి తీసుకున్నారు. భుజం గాయంతో బాధపడుతున్న రియాన్ పరాగ్నూ పక్కన పెట్టారు. ఈ నెల 22, 25, 28, 31, ఫిబ్రవరి 2న జరిగే ఐదు టి20 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. భారత జట్టు వివరాలు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్ ), సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, మొహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్. -
క్రికెట్ ‘మనసు’ చదివింది!
చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన అమ్మాయి... మరోవైపు అంతే స్థాయిలో క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం... ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం అంత సులువు కాదు కాబట్టి ఏదో ఒకదానిని ఎంచుకోమని సన్నిహితులు చెప్పారు. కానీ ఇష్టంలో కష్టం ఉండదని ఆ అమ్మాయి నమ్మింది. అందుకే ఒకవైపు చదువులో ఉత్తమ విద్యారి్థనిగా ఉంటూనే తనకు నచ్చిన రీతిలో క్రికెట్లో కూడా సాధనను కొనసాగించింది. ఫలితంగా ప్లస్ టు స్థాయిలో మంచి మార్కులు సాధించడం మాత్రమే కాదు... ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కూడా మారింది. ఇప్పుడు సైకాలజీ చదువుతూనే ఏకంగా భారత సీనియర్ జట్టులోకి ఎంపికైంది. ఓపెనర్‌గా భారత్ తరఫున ఆడిన 4 వన్డేల్లో 2 అర్ధసెంచరీలు సాధించిన ఢిల్లీ అమ్మాయి ప్రతీక రావల్ భవిష్యత్తులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. –సాక్షి క్రీడా విభాగం భారత జట్టులో స్మృతి మంధానతో పాటు మరో ఓపెనర్‌గా షఫాలీ వర్మ ఐదేళ్ల పాటు రెగ్యులర్‌గా జట్టులో ఉంది. 16 ఏళ్లు పూర్తి కాక ముందే జట్టులోకి వచ్చిన షఫాలీ సంచలన బ్యాటింగ్, దూకుడైన శైలితో దూసుకుపోయింది. అయితే వరుస వైఫల్యాల తర్వాత సెలక్టర్లు షఫాలీపై వేటు వేసి కొత్త ఓపెనర్‌గా ప్రతీక రావల్‌ను ఎంపిక చేశారు. షఫాలీ స్థానంలో వచ్చిన ప్లేయర్ నుంచి సహజంగానే అలాంటి ధాటిని అంతా ఆశిస్తారు. ఇప్పుడు నిలకడైన ప్రదర్శనతో 24 ఏళ్ల ప్రతీక తాను అందుకు తగిన దానినే అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ఆడిన 4 వన్డేల్లో ఆమె 82 స్ట్రయిక్‌రేట్‌తో వరుసగా 40, 76, 18, 89 పరుగులు సాధించి కెరీర్లో శుభారంభం చేసింది. దేశవాళీలో నిలకడైన ప్రదర్శన ఆమెకు ఈ అవకాశం కల్పించింది. మూడేళ్ల క్రితం వన్డే టోర్నీలో 155 బంతుల్లో 161 పరుగులు చేసి ఢిల్లీని నాకౌట్ చేర్చడంతో ప్రతీకకు తొలిసారి గుర్తింపు లభించింది. ఆ తర్వాత బీసీసీఐ అండర్–23 టోర్నీలో 7 ఇన్నింగ్స్‌లలో 411 పరుగులతో టోర్నీలో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలవడంతో పాటు ఢిల్లీ సెమీఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. తండ్రి అండదండలతో... ఢిల్లీలోని పశ్చిమ పటేల్ నగరంలో ఉండే ప్రదీప్ రావల్ కుటుంబం కేబుల్ టీవీ వ్యాపారంలో ఉంది. ప్రదీప్ అటు బిజినెస్‌లో భాగం కావడంతో పాటు ఢిల్లీ క్రికెట్ సంఘంలో బీసీసీఐ సర్టిఫైడ్ అంపైర్‌గా కూడా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి చాలాసార్లు మైదానానికి వెళ్లిన ప్రతీకకు సహజంగానే క్రికెట్‌పై ఆసక్తి ఏర్పడింది.దాంతో 10 ఏళ్ల వయసు ఉన్న తన కూతురిని కోచ్ శ్రవణ్ కుమార్ వద్ద శిక్షణ కోసం ప్రదీప్ చేరి్పంచారు. భారత ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, నితీశ్ రాణా తదితరులకు కోచ్‌గా వ్యవహరించిన శ్రవణ్‌కు మంచి గుర్తింపు ఉంది. శ్రవణ్ శిక్షణ ఇచి్చన తొలి అమ్మాయి ప్రతీకనే కావడం విశేషం. ఆ తర్వాత స్కూల్ స్థాయి నుంచి కాలేజీ వరకు వేర్వేరు చోట్ల చక్కటి ప్రదర్శనలతో ఆమె ఆకట్టుకుంది. క్రికెట్‌తో పాటు బాస్కెట్‌బాల్ కూడా బాగా ఆడుతూ వచ్చిన ప్రతీక 2019 జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలిచిన ఢిల్లీ జట్టులో సభ్యురాలిగా కూడా ఉంది. సీబీఎస్ఈ ప్లస్ 2 పరీక్షల్లో 92.5 శాతం మార్కులతో ఆమె ఉత్తీర్ణురాలు కావడం విశేషం. నిలకడైన ప్రదర్శనతో... భిన్న రంగాల్లో సత్తా చాటుతున్నా... ప్రతీక అసలు లక్ష్యం మాత్రం క్రికెట్ వైపే సాగింది. దాంతో అండర్–17 స్థాయిలో మరింత మెరుగైన శిక్షణ అవసరమని భావించిన ఆమె రైల్వే కోచ్ ధ్యాని వద్ద చేరి తన ఆటకు మరింత మెరుగులు దిద్దుకుంది. 2022–23 దేశవాళీ వన్డే సీజన్లో 14 మ్యాచ్‌లలో కలిపి 552 పరుగులు చేయడం ద్వారా తన స్థాయిని పెంచుకుంది. మరోవైపు ఢిల్లీ మహిళల జట్టు కోచ్, మాజీ ఆటగాడు దిశాంత్ యాజ్ఞిక్ కూడా ఆమె ఆటను తీర్చిదిద్దడంలో సహకరించాడు. బీసీసీఐ అండర్–23 స్థాయి టి20 టోర్నీలో కూడా రాణించిన ప్రతీక ఢిల్లీ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ ప్రదర్శనలు చూస్తే జాతీయ జట్టుకు ఎంతో దూరంలో లేదని అందరికీ అర్థమైంది. మానసికంగా దృఢంగా... ‘నేను ఒకప్పుడు క్రికెటర్ కావాలని కలగన్నాను గానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు నా కూతురి రూపంలో నా కోరిక తీరింది’ అని ప్రదీప్ రావల్ గర్వంగా చెప్పుకుంటున్నారు. బీసీసీఐ విధుల్లో భాగంగా తండ్రి వడోదరలో ఉన్న సమయంలోనే ఆమెకు తొలి వన్డే ఆడే అవకాశం రావడం యాదృచ్చికం. తన కళ్ల ముందు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రతీకను చూస్తూ ఆ తండ్రి పుత్రికోత్సాహంతో కన్నీళ్లపర్యంతమయ్యారు. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతీక... తన చదువు క్రికెట్ కెరీర్‌కూ ఉపయోగపడుతోందని చెప్పుకుంది. ‘మనుషుల మనస్తత్వాలను చదవడం గురించి నాకు బాగా తెలుసు. దానిని అర్థం చేసుకోగలిగితే అటు మైదానంలో, మైదానం బయట కూడా పని సులువవుతుంది. మ్యాచ్‌కు ముందు ఇప్పుడు ఏం చేయాలో, తర్వాత ఏం చేయాలో అనే విషయంపై నాతో నేను సానుకూలంగా మాట్లాడుకుంటా. బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా నేను అత్యుత్తమ ప్లేయర్‌గా, ఏదైనా చేయగలనని భావించుకుంటా. అది నాకు సైకాలజీనే నేర్పింది’ అని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుత జోరును కొనసాగించి ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో భాగం కావాలని ప్రతీక ప్రస్తుత లక్ష్యంగా పెట్టుకుంది. -
హెచ్ఐఎల్తో ఆర్థిక స్థిరత్వం
హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని... దీని వల్ల యువ ఆటగాళ్లు హాకీని కెరీర్‌గా ఎంచుకునేందుకు మక్కువ చూపుతారని భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్, మాజీ కెప్టెన్ సవితా పూనియా అభిప్రాయపడింది. ఈ నెల 12 నుంచి 26 వరకు మహిళల కోసం తొలిసారి హెచ్ఐఎల్ నిర్వహిస్తుండగా... దీని వల్ల ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని సవిత ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సవిత... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకు ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించింది.కెరీర్ విశేషాలు, భవిష్యత్తు లక్ష్యాలు, దేశంలో హాకీ భవిష్యత్తుపై సవిత తన అభిప్రాయాలు వెల్లడించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ప్రతి ప్లేయర్‌కు ఆర్థిక స్థిరత్వం ముఖ్యం. హాకీ ఇండియా లీగ్ వల్ల అది సాధ్యమవుతుంది. క్రీడా సామాగ్రి కొనుగోలు చేసేందుకు కూడా తల్లిదండ్రులపై ఆధార పడాల్సి వస్తే ఆ కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతుంది. జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసినప్పుడు అవార్డులు, రివార్డులు లభిస్తాయి. అదే జూనియర్ స్థాయిలో ఆడేవాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్లకు హెచ్ఐఎల్ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. » ఆర్థిక ఇబ్బందులు లేననప్పుడే ప్లేయర్లు తమ లక్ష్యంపై దృష్టి సారించగలుగుతారు. సీనియర్ ప్లేయర్‌గా జూనియర్లకు ఎప్పుడూ లక్ష్యాన్ని వదలొద్దనే చెబుతా. హాకీ అనే కాదు ఏ క్రీడలోనైనా అంతే. » హాకీని కెరీర్‌గా ఎంపిక చేసుకుంటే గతంలో తల్లిదండ్రులు ఆర్థిక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు కనీసం వాళ్లు సంతోషిస్తారు. పిల్లలు మంచి ప్రదర్శన చేస్తే వారికి మెరుగైన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం అయితే వస్తుంది. » 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని అనుకుంటున్నా. అప్పటి వరకు రిటైర్మెంట్ గురించి ఆలోచించను. నా నిర్ణయాన్ని మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కాదనలేదు. పెళ్లి తర్వాత భర్త కూడా నన్ను అర్థం చేసుకున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది. » ప్రస్తుతం 2026 ప్రపంచకప్‌తో పాటు ఆసియా క్రీడలపైనే ప్రధానంగా దృష్టి పెట్టా. ఆటను ఆస్వాదిస్తున్నా. » మహిళల హాకీలో హెచ్ఐఎల్ పెను మార్పులు తీసుకువస్తుంది. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దీనికి మంచి గుర్తింపు దక్కడం ఖాయం. ఎందరో అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఇందులో పాల్గొంటున్నారు. వారి అనుభవాల నుంచి భారత యువ క్రీడాకారిణులు పాఠాలు నేర్చుకుంటారు. » భారత జట్టులో సీనియర్ ప్లేయర్‌గా నా బాధ్యతలేంటో తెలుసు. యువ ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడంతో పాటు... గోల్ కీపర్‌గా ఆటను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. -
పరిస్థితి గంభీరం!
శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌లో ఓటమి... 36 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఒక టెస్టులో పరాజయం... భారత టెస్టు చరిత్రలో స్వదేశంలో తొలిసారి 0–3తో క్లీన్‌స్వీప్... ఇన్నింగ్స్‌లో 46కే ఆలౌట్... ఇప్పుడు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని కోల్పోవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరే అవకాశం చేజార్చుకున్న పరిస్థితి... హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియాకు ఎదురైన నిరాశాజనక ఫలితాలు ఇవి. ఒక్క బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ విజయం మినహా హెడ్ కోచ్‌గా అతను చెప్పుకోదగ్గ ఘనమైన ప్రదర్శన ఏదీ భారత జట్టు నుంచి రాలేదు. మైదానంలో జట్టు పరాజయాలకు ఆటగాళ్ల వైఫల్యం కారణం కావచ్చు. కానీ జట్టు కోచ్ కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీమిండియాకు ఓటములు ఎదురైనప్పుడు అప్పటి కోచ్‌లంతా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నవారే. అన్నింటికి మించి ఎంతో ఇష్టంతో బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసిన కోచ్... గతంలో జట్టుకు కోచ్‌గా పని చేసిన వ్యక్తులను విమర్శిస్తూ తానైతే అద్భుతాలు సాధిస్తానంటూ పదే పదే చెబుతూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు కోచ్‌గా ఫలితాలు రాబట్టలేకపోతే కచ్చితంగా తప్పు పట్టాల్సిందే. గంభీర్ వాటికి అతీతుడేమీ కాదు! –సాక్షి క్రీడా విభాగంభారత జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపిక కాకముందు గంభీర్ ఏ స్థాయిలో కూడా కోచ్‌గా పని చేయలేదు. ఏ జట్టు సహాయక సిబ్బందిలోనూ అతను భాగంగా లేడు. 2018లో ఆట నుంచి రిటైర్ అయిన తర్వాత మూడు ఐపీఎల్ సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లకు మెంటార్‌గా పని చేశాడు. ఇందులో 2024లో అతను మెంటార్‌గా వ్యవహరించినప్పుడు కోల్‌కతా జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. సాధారణంగా ఏ జట్టు కోచ్‌లైనా చేసే పనులు అతనేవీ చేయలేదు. ప్రాక్టీస్ సెషన్లలో నేరుగా భాగమై ప్రణాళికలు రూపొందించడం, త్రోడౌన్స్ ఇవ్వడం, ఆటగాళ్ల టెక్నిక్లను చక్కదిద్దే పని చేయడం... ఇవన్నీ గంభీర్ చూపించలేదు. ఒక టి20క్లబ్ టీమ్‌కు మెంటార్‌గా పని చేస్తూ అప్పుడప్పుడు మార్గనిర్దేశనం ఇవ్వడంతో పోలిస్తే ఒక జాతీయ జట్టుగా కోచ్ అనేది పూర్తిగా భిన్నమైన బాధ్యత. అయితే ఆటగాడిగా గంభీర్ రికార్డు, జట్టు పట్ల అతని అంకితభావం చూసిన వారు కోచ్‌గా కొత్త తరహాలో జట్టును తీర్చిదిద్దగలడని నమ్మారు. అయితే అతను రాక ముందు వరకు వరుస విజయాల్లో శిఖరాన ఉన్న టీమ్ మరింత పైకి లేవడం సంగతేమో కానీ ఇంకా కిందకు పడిపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు భారత జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడంపై ఎలాంటి సందేహాలు లేవు. కానీ 8 టెస్టుల్లో 6 పరాజయాలతో దానికి జట్టు దూరమైంది. ఆ ముగ్గురు ఏం పని చేశారో?నిజానికి తాను పూర్తి స్థాయిలో కోచ్‌గా పని చేయలేదనే విషయం గంభీర్‌కూ తెలుసు. అందుకే అతను సహాయక సిబ్బందిని ఎంచుకునే విషయంలో తనకు సన్నిహితులైన వారిని తీసుకున్నాడు. ఐపీఎల్లో తనతో కలిసి పని చేసిన మోర్నీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా), అభిషేక్ నాయర్ (భారత్), టెన్ డస్కటే (నెదర్లాండ్స్) బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్‌లుగా వచ్చారు. వీరిని స్వయంగా ఎంచుకునేందుకు బీసీసీఐ గంభీర్‌కు అవకాశం ఇచ్చింది. అయితే ఆటగాడిగా మోర్కెల్‌కు మంచి రికార్డు ఉన్నా... మిగతా ఇద్దరికి పెద్దగా పేరు లేదు. అసలు గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ఏం పని చేశారో, ఎలాంటి ప్రభావం చూపించారో కూడా తెలీదు. కొన్నేళ్లు వెనక్కి వెళితే ఇంగ్లండ్ సిరీస్‌లో వరుసగా ఘోరమైన ప్రదర్శన తర్వాత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సూచనలతో తనను తాను మార్చుకొని మంచి ఫలితాలు సాధించానని, అందుకు కృతజ్ఞుడినని కోహ్లి స్వయంగా చాలాసార్లు చెప్పుకున్నాడు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఒకే తరహాలో కోహ్లి అవుటవుతున్న సమయంలో కనీసం అతని ఆటలో స్టాన్స్ మొదలు ఆడే షాట్ విషయంలో మార్పు గురించి చర్చ అయినా జరిగిందా అనేది సందేహమే. ఐదు టెస్టుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లను గమనిస్తే ఒక్కసారి కూడా గంభీర్ మైదానంలో చురుగ్గా ఆటలో భాగమైనట్లు ఎక్కడా కనిపించలేదు. అసలు కోచ్‌గా అతని ముద్ర ఎక్కడా కనిపించనే లేదు. దిగితే కానీ లోతు తెలీదు... కొంత కాలం క్రితం వరకు కామెంటేటర్‌గా పని చేసినప్పుడు, టీవీ షోలలో మాజీ ఆటగాళ్లను విమర్శించడంలో గంభీర్ అందరికంటే ముందు ఉండేవాడు. అప్పటి వరకు పని చేసిన వారిని తక్కువ చేసి మాట్లాడుతూ జట్టులో మార్పులపై సూచనలు చేసేవాడు. ముఖ్యంగా ‘ఇది భారత అత్యుత్తమ టెస్టు జట్టు’ అని చెప్పుకున్న కోచ్ రవిశాస్త్రిని అతను బాగా తప్పు పట్టాడు. కెరీర్లో ఆయన ఏం సాధించాడని, ఇలాంటి వారే అలాంటి మాటలు మాట్లాడతారని కూడా గంభీర్ వ్యాఖ్యానించాడు. అయితే శాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడే భారత్ వరుసగా రెండుసార్లు ఆ్రస్టేలియా గడ్డపై సిరీస్ గెలిచిందనే విషయాన్ని అతను మర్చిపోయాడు. రవిశా్రస్తికి కూడా కోచ్‌గా అనుభవం లేకున్నా జట్టులో స్ఫూర్తి నింపడంలో అతని తర్వాతే ఎవరైనా. ప్లేయర్లకు స్నేహితుడి తరహాలో అండగా నిలిచి మైదానంలో సత్తా చాటేలా చేయడం అతనికి బాగా వచ్చు. ‘అడిలైడ్ 36 ఆలౌట్’ తర్వాత టీమ్ అంతా కుంగిపోయి ఉన్న దశలో శాస్త్రి ‘మోటివేషన్ స్పీచ్’ వల్లే తాము కొత్త ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగి సిరీస్ గెలిచే వరకు వెళ్లగలిగామని ఆటగాళ్లంతా ఏదో ఒక సందర్భంలో చెప్పుకున్నారు. గంభీర్ ఇలాంటి పని కూడా చేయలేకపోయాడు.కోచ్‌గా ఎంత వరకు! గంభీర్ బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి భారీ వ్యాఖ్యలైతే చాలా చేశాడు. బంగ్లాదేశ్‌పై గెలిచిన తర్వాత ‘ఒకే రోజు 400 పరుగులు చేయగలిగే, అవసరమైతే రెండు రోజులు నిలిబడి ‘డ్రా’ చేయగలిగే జట్టును తీర్చిదిద్దుతా’ అని అతను అన్నాడు. న్యూజిలాండ్, ఆ్రస్టేలియాతో సిరీస్‌లలో ఇందులో ఏదీ జరగలేదు. ఈ రెండు సిరీస్‌లలో కలిపి రెండుసార్లు మాత్రమే స్కోరు 400 దాటింది. తన మాటలకు, వ్యాఖ్యలకు దేశభక్తి రంగు పులమడం గంభీర్‌కు అలవాటుగా మారింది. కోచ్‌గా ఎంపికైన సమయంలోనూ ‘దేశానికి సేవ చేయబోతున్నా. 140 కోట్ల భారతీయుల దీవెనలు ఉన్నాయి’ తదితర మాటలతో ముందుకు వచ్చిన అతను సిడ్నీ టెస్టులో పరాజయం తర్వాత జట్టు ముఖ్యం అనే వ్యాఖ్యతో ఆగిపోకుండా ‘దేశం అన్నింటికంటే ముఖ్యం’ అంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. సాధారణంగా ఇలాంటి వరుస పరాజయాల తర్వాత సహజంగానే కోచ్‌పై తప్పుకోవాలనే ఒత్తిడి కూడా వస్తుంది. అయితే బీసీసీఐ పెద్దల అండ ఉన్న గంభీర్‌పై ఇప్పటికిప్పుడు వేటు పడకపోవచ్చు. కాంట్రాక్ట్ 2027 వరల్డ్‌కప్ వరకు ఉన్నా... ఆలోగా ఎలాంటి ఫలితాలు అందిస్తాడనేది చూడాలి. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌ను పక్కన పెడితే చాంపియన్స్ ట్రోఫీ కోచ్‌గా గంభీర్‌కు పెద్ద పరీక్ష. ఇక్కడా విఫలమైతే ఇక తన వల్ల కాదంటూ తప్పుకునే అవకాశామూ -
స్టార్స్ ఫ్లాప్ షో...
ఆఫ్‌స్టంప్ అవతల పడ్డ బంతులను ఆడే విషయంలో తీరు మార్చుకోని విరాట్ కోహ్లి... బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలో బరిలోకి దిగినా వైఫల్యాల బాట వీడని రోహిత్ శర్మ... అడపా దడపా మెరుపులు తప్ప నిలకడగా ఆకట్టుకోలేక ఇబ్బంది పడ్డ కేఎల్ రాహుల్... ఆల్‌రౌండరే అయినా అటు బ్యాట్‌తో, ఇటు బంతితోతనదైన ముద్ర వేయలేకపోయిన రవీంద్ర జడేజా... పేరుకు ప్రధాన పేసరే అయినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్ సిరాజ్... ఇలా ఒకరిని మించి మరొకరు పేలవ ప్రదర్శన కనబరిస్తే ఫలితం ఇలా కాక మరెలా ఉంటుంది! స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ‘వైట్‌వాష్’ నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండానే... ఆ్రస్టేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో కనీస ప్రదర్శన కనబర్చలేకపోయింది. గత రెండు పర్యాయాలు అద్వి తీయ ఆటతీరుతో కంగారూలను మట్టికరిపించి ప్రతిష్టాత్మక సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా... ముచ్చటగా మూడోసారి అదే మ్యాజిక్ చేయాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ‘కర్ణుడి చావుకు కారణాలు అనేకం’ అన్నట్లు... భారత జట్టు సిరీస్ కోల్పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పరాజయానికి ప్రధాన కారణం బ్యాటింగే అనడంలో సందేహం లేదు. గత రెండు పర్యటనల్లో ఆ్రస్టేలియాపై భారత జట్టు పైచేయి సాధించడంలో అటు బౌలర్లతో పాటు బ్యాట్‌తో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి కంగారూ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన పుజారా వంటి ఆటగాడు తాజా జట్టులో లేకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బ కొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లు.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో సిరీస్‌లో ఏ దశలోనూ భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబర్చలేకపోయింది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ ఆ తర్వాత వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో 3, 6, 10, 3, 9 పరుగులు చేశాడు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన తర్వాత నిలకడ పెరగడంతో పాటు విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు సాధించిన ‘హిట్ మ్యాన్’... వరుస వైఫల్యాలతో చివరి మ్యాచ్ నుంచి తనంతట తానే తప్పుకున్నాడంటే అతడి ఫామ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో అందరికంటే సీనియర్ అయిన విరాట్ కోహ్లి తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత వరుసగా 7, 11, 3, 36, 5, 17, 13 స్కోర్లు చేశాడు. విరాట్ అంకెల కన్నా అతడు అవుటైన తీరే సగటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఆఫ్‌స్టంప్ అవతల బంతి వేయడం... విరాట్ దాన్ని ఆడాలా వద్దా అనే సంశయంలో బ్యాట్ తాకించడం... వికెట్ల వెనక క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం... ఈ సిరీస్ మొత్తం ఇదే తంతు సాగింది. టన్నుల కొద్దీ పరుగులు చేసి ‘రన్ మెషిన్’ అనిపించుకున్న విరాట్ ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమవడం... జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. నిలకడలేమే ప్రధాన సమస్య రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమయ్యాడు. 26, 77, 37, 7, 84, 4, 24, 0, 4, 13 ఈ సిరీస్‌లో రాహుల్ గణాంకాలివి. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించిన అతడు చివరి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో జట్టుకు మెరుగైన ఆరంభాలు లభించలేదు. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమయ్యాడు.సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సిరీస్ మధ్యలోనే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా... జడ్డూ తన వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. ఆసీస్ పిచ్‌లపై మెరుగైన రికార్డు, మంచి అనుభవం ఉన్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కంగారూల వెన్నులో వణుకు పుట్టిస్తుంటే... దాన్ని సొమ్ము చేసుకుంటూ వికెట్లు పడగొట్టాల్సింది పోయి... ప్రత్యరి్థకి సులువుగా పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 20 వికెట్లు తీసినా... ఈ ప్రదర్శన అతడి స్థాయికి తగ్గదని చెప్పలేం. జట్టు పరిస్థితులతో సంబంధం లేకుండా పదే పదే తప్పుడు షాట్ సెలెక్షన్ కారణంగా వికెట్ సమర్పించుకున్న రిషబ్ పంత్ విమర్శల పాలైతే... వచ్చిన కొన్ని అవకాశాలను శుబ్‌మన్ గిల్ ఒడిసి పట్టలేకపోయాడు. టెస్టు ఫార్మాట్లో ఇంటా బయట నిలకడైన ఆటతీరు కనబరుస్తూ గత రెండు పర్యాయాలు ‘ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్’ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టు... ఈసారి మాత్రం నిరాశ పరిచింది. చివరగా ఆడిన ఎనిమిది టెస్టుల్లో టీమిండియా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు దూరం కాక తప్పలేదు. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోవడం టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నితీశ్, యశస్వి అదుర్స్ పదేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయినప్పటికీ ఈ సిరీస్ ద్వారా భారత జట్టుకు కొంత మేలు కూడా జరిగింది. స్టార్ ఆటగాళ్లు అంచనాలకు అందుకోలేకపోతున్న సమయంలో మేమున్నామంటూ యువ ఆటగాళ్లు బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటకట్టుకోగా... ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేసిన జైస్వాల్ భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, బోలండ్ వంటి పేసర్లను జైస్వాల్ అలవోకగా ఎదుర్కొన్న తీరు భవిష్యత్తుపై భరోసా పెంచుతోంది. ఇక పేస్ ఆల్‌రౌండర్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న టీమిండియాకు నితీశ్ రెడ్డి రూపంలో జవాబు దొరికింది. మీడియం పేస్‌కు తోడు చక్కటి బ్యాటింగ్‌తో అతడు ఈ సిరీస్‌పై తనదైన ముద్రవేశాడు. 9 ఇన్నింగ్స్‌లు కలిపి నితీశ్ మొత్తం 298 పరుగులు సాధించి సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. టి20 ఫార్మాట్లో ధనాధన్ షాట్లు ఆడే నితీశ్... సుదీర్ఘ ఫార్మాట్‌కు పనికిరాడని విమర్శించిన వారికి మెల్బోర్న్ సెంచరీతో బదులిచ్చాడు. తనలో దూకుడుగా ఆడే శక్తితో పాటు క్రీజులో సుదీర్ఘ సమయం గడపగల సంయమనం కూడా ఉందని నిరూపించాడు. ఈ ప్రదర్శనతో నితీశ్ రెడ్డి టెస్టు జట్టులో చోటు నిలబెట్టుకోవడం ఖాయం కాగా... బౌలింగ్‌లో అతడు మరింత రాటుదేలితే భారత జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. ఇక ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన అంటే అది బుమ్రాదే. తొలి టెస్టులో సారథిగా జట్టును గెలిపించిన బుమ్రా... సిరీస్ ఆసాంతం టీమ్ భారాన్ని భుజాల మీద మోశాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 32 వికెట్లు తీసిన బుమ్రా... చివరి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు చేయలేకపోవడంతోనే టీమిండియా పరాజయం పాలైందనడంలో అతిశయోక్తిలేదు. ‘బుమ్రా ఎడం చేత్తో బౌలింగ్ చేసేలా చట్టం తీసుకొస్తాం’ అని ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ అన్నాడంటే ఈ సిరీస్‌లో జస్ప్రీత్ జోరు ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. -
ఆఫ్‌స్పిన్‌ను పక్కనపెట్టి... పేస్ ఆల్‌రౌండర్‌గా
అచ్చొచ్చిన సొంత మైదానంలో స్టీవ్ స్మిత్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... టీమిండియాపై దంచి కొట్టే హెడ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు! టీనేజ్ కుర్రాడు కొన్‌స్టాస్ మెరుపులు 3 బౌండరీలకే పరిమితం కాగా... మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా వైఫల్యాన్ని కొనసాగించాడు! ఆదుకుంటాడనుకున్న లబుషేన్ ఆరంభంలోనే చేతులెత్తేయగా... అలెక్స్ కేరీ మరోసారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు!అయినా ఆ్రస్టేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది అంటే అదంతా అరంగేట్ర ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్ చలవే. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్న మిషెల్ మార్ష్ ను తప్పించి... చివరి టెస్టులో వెబ్‌స్టర్‌కు అవకాశం ఇవ్వగా... అతడు భారత జట్టుకు ప్రధాన అడ్డంకిగా నిలిచి భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నాడు. ఆఫ్‌స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించి... ఆ తర్వాత పేస్ ఆల్‌రౌండర్‌గా మారిన ఆ్రస్టేలియా నయా తార వెబ్స్టర్పై ప్రత్యేక కథనం... – సాక్షి, క్రీడావిభాగం సుదీర్ఘ దేశవాళీ అనుభవం... వేలకొద్దీ ఫస్ట్‌క్లాస్ పరుగులు... బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉన్నా... ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయిన వెబ్‌స్టర్... ఎట్టకేలకు జాతీయ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి ప్రధాన ఆటగాళ్లే నిలవలేకపోతున్న చోట... చక్కటి సంయమనంతో ఆడుతూ విలువైన పరుగులు చేశాడు. గత మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్యామ్ కొన్‌స్టాస్ తన బ్యాటింగ్ విన్యాసాలతో పాటు నోటి దురుసుతో వార్తల్లోకెక్కగా... వెబ్‌స్టర్ మాత్రం నింపాదిగా ఆడి తనదైన ముద్ర వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లపాటు బౌలింగ్ చేసిన అతడు... 2.23 ఎకానమీతో 29 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. బౌలింగ్‌లో వికెట్ తీయలేకపోయినా... స్టార్క్, కమిన్స్ వంటి స్టార్ బౌలర్ల కంటే తక్కువ పరుగులు ఇచ్చుకొని ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులో అడుగుపెట్టిన వెబ్‌స్టర్... తనలో మంచి బ్యాటర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. మరో ఎండ్‌లో స్టీవ్ స్మిత్ ఉండటంతో ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ అతడికే ఎక్కువ స్ట్రయిక్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించిన అనంతరం స్మిత్ అవుట్ కాగా... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత భూజానెత్తుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నది తొలి మ్యాచే అయినా... దేశవాళీల్లో వందల మ్యాచ్‌ల అనుభవం ఉండటంతో లోయర్ ఆర్డర్‌తో కలిసి జట్టును నడిపించాడు. అతడు ఒక్కో పరుగు జోడిస్తుంటే... టీమిండియా ఆధిక్యం కరుగుతూ పోయింది. ఆరో వికెట్‌కు అలెక్స్ కెరీతో 41 పరుగులు, ఏడో వికెట్‌కు కెపె్టన్ కమిన్స్‌తో కలిసి 25 పరుగులు జోడించాడు. ఇక కింది వరుస బ్యాటర్ల అండతో పరుగులు చేయడం కష్టమని భావించి భారీ షాట్లకు యత్నించిన వెబ్‌స్టర్... చివరకు తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. గత నాలుగు టెస్టుల్లో పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న మిషెల్ మార్‡్ష ఒక్క మ్యాచ్‌లోనూ అటు బ్యాట్‌తో కానీ, ఇటు బంతితో కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా... తొలి మ్యాచ్‌లోనే వెబ్‌స్టర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనూహ్య బౌన్స్, అస్థిర పేస్ కనిపించిన సిడ్నీ పిచ్‌పై వెబ్‌స్టర్ గొప్ప సంయమనం చూపాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు ఒక్కరు కూడా 40 పరుగులు దాటి చేయలేకపోయిన చోట ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ శతకం నమోదు చేసిన వెబ్‌స్టర్... ఆ తర్వాత బంతితోనూ ఆకట్టుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు వేసిన వెబ్‌స్టర్ అందులో కీలకమైన శుబ్‌మన్ గిల్ వికెట్ పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టాడు. కామెరూన్ గ్రీన్ వంటి ప్రధాన ఆల్‌రౌండర్ అందుబాటులో లేకపోవడంతో మిషెల్ మార్ష్ జట్టులోకి రాగా... ఇప్పుడు వెబ్‌స్టర్ ప్రదర్శన చూస్తుంటే ఇక మార్ష్ జట్టులో చోటుపై ఆశలు వదులుకోవడమే మేలనిపిస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం... స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన 31 ఏళ్ల వెబ్‌స్టర్... ఆ తర్వాత పేస్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. 6 అడుగుల 7 అంగుళాలున్న వెబ్‌స్టర్‌కు బంతిని స్పిన్ చేయడం కంటే... వేగంగా విసరడం సులువు అని కోచ్‌లు సూచించడంతో తన దిశ మార్చుకున్నాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్ నుంచే నిలకడ కొనసాగించిన వెబ్‌స్టర్... 2014లో తన 20 ఏళ్ల వయసులో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ భారీగా పరుగులు రాబట్టినా... జాతీయ జట్టులో పోటీ కారణంగా అతడికి ఆసీస్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా దేశవాళీల్లో రాణించిన వెబ్‌స్టర్ ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ తరఫున బరిలోకి దిగి అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించాడు. 2023–24 షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వెబ్‌స్టర్ విశ్వరూపం ప్రదర్శించాడు. సీజన్ ఆసాంతం ఒకే తీవ్రత కొనసాగించిన అతడు... 58.62 సగటుతో 938 పరుగులు చేయడంతో పాటు... 30.80 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీ చరిత్రలో గ్యారీ సోబర్స్ తర్వాత ఒకే సీజన్లో రెండు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాకిస్తాన్‌తో జరిగిన ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్ జట్టుకు ఎంపిక చేశారు. అక్కడ కూడా రాణించిన వెబ్‌స్టర్ తనను పక్కన పెట్టలేని పరిస్థితి కల్పించాడు. కెరీర్లో ఇప్పటి వరకు 93 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన వెబ్‌స్టర్ 5297 పరుగులు సాధించాడు. అందులో 12 సెంచరీలు, 24 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 148 వికెట్లు పడగొట్టాడు. -
అండర్–9 జాతీయ చెస్ విజేత నిధీశ్
పుణే: జాతీయ అండర్–9 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ చిన్నారులు నిదీశ్ శ్యామల్, అదుళ్ల దివిత్ రెడ్డి అదరగొట్టారు. గురువారం ముగిసిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో నిధీశ్ చాంపియన్‌గా అవతరించగా... దివిత్ రెడ్డి మూడో స్థానాన్ని సంపాదించాడు. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో నిదీశ్, ఆరిత్ కపిల్ (ఢిల్లీ) 9.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... నిదీశ్‌కు టైటిల్ ఖరారైంది. ఆరిత్ రన్నరప్‌గా నిలిచాడు. 9 పాయింట్లతో దివిత్ రెడ్డి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది వరల్డ్ క్యాడెట్ అండర్–8 చాంపియన్‌షిప్‌లో దివిత్ రెడ్డి స్వర్ణ పతకం గెలిచాడు. విజేతగా నిలిచిన ని«దీశ్కు విన్నర్స్ ట్రోఫీతోపాటు రూ. 50 వేలు ప్రైజ్‌మనీ లభించింది. హైదరాబాద్‌లోని మ్యాస్ట్రో చెస్ అకాడమీలో క్యాండిడేట్ మాస్టర్ (సీఎం) అమిత్‌పాల్ సింగ్ వద్ద నిదీశ్ శిక్షణ తీసుకుంటున్నాడు. జాతీయ చాంపియన్ హోదాలో నిదీశ్ ఈ ఏడాది జరిగే ప్రపంచ, ఆసియా అండర్–9 చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. -
గెలుపు పంచ్ ఎవరిదో?
ఆ్రస్టేలియా పర్యటనలో భారత జట్టు మరో కీలక పోరుకు సమాయత్తమైంది. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో కంగారూలను కట్టిపడేసేందుకు టీమిండియా అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంది.ఈ ఏడాదిని విజయంతో ముగించడం... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని చేజిక్కించుకోవడం... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మార్గం సుగమం చేసుకోవడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో రోహిత్ బృందం మైదానంలో అడుగు పెట్టనుంది. గత రెండు పర్యటనల్లో మెల్బోర్న్లో జయకేతనం ఎగరవేసిన టీమిండియా ఈ మైదానంలో ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేయగా... భారత జోరుకు అడ్డుకట్ట వేయాలని కంగారూలు కృతనిశ్చయంతో ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం రసవత్తర పోరును ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి! మెల్బోర్న్: గత రెండు ‘బాక్సింగ్ డే’ టెస్టుల్లోనూ ఆ్రస్టేలియాను చిత్తు చేసిన భారత జట్టు... ముచ్చటగా మూడోసారి కంగారూలను మట్టికరిపించేందుకు రెడీ అయింది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్, ఆ్రస్టేలియా మధ్య గురువారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగనున్న ఈ పోరుకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు తరలి రానుండగా... అశేష జనసందోహం ముందు ఆసీస్‌పై ఆధిపత్యం కనబర్చేందుకు రోహిత్ బృందం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరగగా ... ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే... చివరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని చేజిక్కించుకుంటుంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టిన భారత్... అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు (డే–నైట్)లో పరాజయం చవిచూసింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించగా... చివరకు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమ ఉజ్జీగా ఉన్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలంటే... ఈ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ టీమిండియాకు విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో భారత జట్టు మెల్బోర్న్లో శక్తియుక్తులన్నీ ధారపోయడానికి సిద్ధమైంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న రోహిత్ ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనేది ఆసక్తికరంగా మారింది. పేస్‌కు సహకరించే మెల్బోర్న్ పిచ్‌పై రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా... లేక మిడిలార్డర్లోనే కొనసాగుతాడా చూడాలి!మరోవైపు అరంగేట్ర సిరీస్‌లోనే తీవ్రంగా తడబడ్డ ఓపెనర్ మెక్‌స్వీనీని తప్పించిన ఆ్రస్టేలియా... టీనేజర్ స్యామ్ కొంటాస్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసింది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన హాజల్‌వుడ్ స్థానంలో బోలండ్ జట్టులోకి రానున్నాడు. రోహిత్ రాణించేనా! ‘జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధమే’ అని రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేసినా... ‘హిట్‌మ్యాన్’ మిడిలార్డర్లో బరిలోకి దిగడం వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. వికెట్లు పడుతున్న దశలో క్రీజులోకి వచ్చిన రోహిత్ కనీసం ఎదురుదాడి చేసి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీసే ప్రయత్నం కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. నాలుగో టెస్టులోనూ అతడు మిడిలార్డర్లోనే దిగే సూచనలున్నా... మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో భారీ షాట్లు ప్రాక్టీస్ చేసిన రోహిత్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. గత పదేళ్లుగా మెల్బోర్న్ స్టేడియంలో పరాజయం లేకుండా సాగుతున్న టీమిండియా... అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌పై భారీ అంచనాలు ఉండగా... యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. కోహ్లికి మెల్బోర్న్లో మంచి రికార్డు ఉంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన కోహ్లి... ఆ తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. పదే పదే ఆఫ్‌స్టంప్ ఆవల పడ్డ బంతికి వికెట్ సమర్పించుకోవడం అభిమానులను కలవరపెడుతోంది. అయితే ప్రాక్టీస్‌లో దీనిపై దృష్టి పెట్టిన విరాట్... ‘ఫోర్త్ స్టంప్’ లోపాన్ని అధిగమించేందుకు గట్టిగానే ప్రయత్నించాడు. మిడిలార్డర్లో పంత్ మంచి టచ్‌లో ఉండగా... పేస్ ఆల్‌రౌండర్‌గా ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి జట్టులో ఉండటం ఖాయమే. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తే వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రావచ్చు. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... ఒంటి చేత్తో బౌలింగ్ భారాన్ని మోస్తున్న ఏస్ పేసర్ బుమ్రా మరోసారి కీలకం కానున్నాడు. బుమ్రాతో కలిసి సిరాజ్, ఆకాశ్‌దీప్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లి, పంత్, జడేజా, నితీశ్ రెడ్డి/సుందర్, ఆకాశ్‌దీప్, బుమ్రా, సిరాజ్. ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, సామ్ కొంటాస్, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్ , కేరీ, స్టార్క్, లయన్, బోలండ్.హెడ్ ఆట కట్టిస్తేనే...సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టు కూడా కొన్ని సమస్యలతో సతమతమవుతోంది. వార్నర్ రిటైరయ్యాక సరైన ప్రత్యామ్నాయం లభించక ఇబ్బంది పడుతున్న ఆసీస్... ఈ సిరీస్ తొలి మూడు టెస్టులకు మెక్‌స్వీనీని ప్రయతి్నంచింది. అతడు విఫలమవ్వడంతో మరో యువ ఆటగాడు కొంటాస్ ను ఎంపిక చేసింది.లబుషేన్లో నిలకడ లోపించగా... గత మ్యాచ్‌లో సెంచరీతో స్టీవ్ స్మిత్ ఫామ్‌లోకి వచ్చాడు. వీళ్లంతా ఒకెత్తు అయితే... భారత్ పాలిట కొరకరాని కొయ్య మాత్రం ట్రవిస్ హెడ్ అనే చెప్పాలి. ఇటీవల టీమిండియాపై హెడ్ విజృంభిస్తున్న తీరు చూస్తుంటే మరోసారి అతడి నుంచి రోహిత్ జట్టుకు ప్రమాదం పొంచి ఉంది. బోలండ్కు సొంత మైదానమైన ఎంసీజీలో అతడికి ఘనమైన రికార్డు ఉంది. మరోవైపు స్టార్క్, కమిన్స్ బౌలింగ్‌లో ఏమరపాటుగా ఉంటే జరిగే నష్టం ఏంటో ఈ పాటికే టీమిండియాకు తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఎంసీజీ టెస్టులో మళ్లీ గెలవాలంటే టీమిండియా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది.పిచ్, వాతావరణంమెల్బోర్న్ పిచ్ పేస్‌కు అనుకూలం. వికెట్‌పై 6 మిల్లీమీటర్ల పచ్చిక ఉంటుందని క్యూరేటర్ వెల్లడించాడు. తొలి రోజుఎండ అధికంగా ఉండనుంది. రెండో రోజు చిరు జల్లులు కురవొచ్చు. వర్షం వల్ల ఆటకు పెద్దగా ఆటంకం కలగకపోవచ్చు.4 భారత్ ఆ్రస్టేలియా మధ్య మెల్బోర్న్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 4 టెస్టుల్లో గెలిచింది. ఆ్రస్టేలియా 8 టెస్టుల్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.6 బుమ్రా మరో ఆరు వికెట్లు తీస్తే (44 టెస్టుల్లో) భారత్ తరఫున వేగంగా 200 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ అవుతాడు. అశ్విన్ 37 టెస్టుల్లో ఈ మైలురాయి దాటాడు.6 గత ఆరేళ్ల కాలంలో మెల్బోర్న్ మైదానంలో ఆరు సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. -
టీమిండియాకు గుడ్ న్యూస్
-
చైనాపై భారత్‌దే పైచేయి
మస్కట్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత మహిళల హాకీ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్ చాంపియన్‌గా టీమిండియా నిలిచింది. మూడుసార్లు చాంపియన్ చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో జ్యోతి సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ‘షూటౌట్’లో 3–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున సాక్షి రాణా, ఇషిక, సునెలిత టొప్పో సఫలమయ్యారు. ముంతాజ్ ఖాన్, కనిక సివాచ్ విఫలమయ్యారు. చైనా తరఫున గువోటింగ్ హావో, లియు టాంగ్జీ సఫలంకాగా... వాంగ్ లిహాంగ్, లి జింగీ, దన్దన్ జువో విఫలమయ్యారు. ముగ్గురు చైనా ప్లేయర్ల షాట్లను భారత గోల్‌కీపర్ నిధి నిలువరించి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ఫైనల్ చేరుకునే క్రమంలో లీగ్ దశలో చైనా చేతిలో మాత్రమే ఓడిపోయిన భారత జట్టుకు టైటిల్ పోరులోనూ గట్టిపోటీ ఎదురైంది. తొలి 29 నిమిషాల వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను చైనా జట్టు సద్వినియోగం చేసుకుంది. టాన్ జిన్జువాంగ్ గోల్ చేయడంతో మాజీ చాంపియన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 41వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కనిక సివాచ్ గోల్‌గా మలచడంతో భారత్ స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయడానికియత్నించినా ఫలితం లేకపోయింది. -
దీపిక ‘హ్యాట్రిక్’
మస్కట్ (ఒమన్): జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మలేసియా జట్టుతో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ నేతృత్వంలోని భారత జట్టు 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపిక మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. దీపిక 37వ, 39వ, 48వ నిమిషాల్లో గోల్స్ చేసింది. వైష్ణవి ఫాల్కే (32వ నిమిషంలో), కనిక సివాచ్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు... రెండు పెనాలీ స్ట్రోక్‌లు లభించాయి. ఇందులో మూడు పెనాల్టీ కార్నర్లను, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను భారత జట్టు గోల్స్‌గా మలిచింది. మిగతా ఐదు పెనాల్టీ కార్నర్లను, మరో పెనాల్టీ స్ట్రోక్‌ను భారత్ లక్ష్యానికి చేర్చి ఉంటే విజయం తేడా మరింత భారీగా ఉండేది. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 7–2 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును ఓడించింది. ఐదు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో రెండేసి విజయాలు సాధించిన భారత్, చైనా జట్ల ఖాతాలో ఆరు పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే చైనా చేసిన గోల్స్ (27) సంఖ్యకంటే భారత్ చేసిన గోల్స్ (17) తక్కువగా ఉండటంతో చైనా టాప్ ర్యాంక్‌లో, భారత్ రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. బుధవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడుతుంది. -
మెరిసిన ముంతాజ్
మస్కట్ (ఒమన్): జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 13–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముంతాజ్ ఖాన్ (27వ, 32వ, 53వ, 58వ నిమిషాల్లో) అత్యధికంగా నాలుగు గోల్స్ సాధించింది. కనిక (12వ, 51వ, 52వ నిమిషాల్లో), దీపిక (7వ, 20వ, 55వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున చేశారు. బ్యూటీ డుంగ్‌డుంగ్ (33వ నిమిషంలో), మనీషా (10వ నిమిషంలో), వైస్ కెప్టెన్ సాక్షి రాణా (43వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. బంగ్లాదేశ్ జట్టుకు ఒర్పితా పాల్ (12వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 12 పెనాల్టీ కార్నర్లు లభించగా... నాలుగింటిని గోల్స్‌గా మలిచింది. ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను వృధా చేసింది. అన్ని పెనాల్టీ కార్నర్లను టీమిండియా సది్వనియోగం చేసుకొనిఉంటే విజయం తేడా మరింత భారీగా ఉండేది. నేడు జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. -
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెంగళూరు: జూనియర్ ఆసియా కప్ టైటిల్ నిలబెట్టుకునేందుకు భారత మహిళల హాకీ జట్టు మంగళవారం ఒమన్‌కు బయల్దేరింది. ఒమన్ రాజధాని మస్కట్‌లో ఈ నెల 7 నుంచి 15 వరకు ఆసియా టోర్నీ జరుగుతుంది. ఇందులో రాణించి టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు వచ్చే ఏడాది జూనియర్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత అమ్మాయిల జట్టు సన్నద్ధమై వెళ్లింది. మస్కట్ టోర్నీలో స్వర్ణ, రజత, కాంస్య పతక విజేతలు (టాప్–3 జట్లు) శాంటియాగో (చిలీ)లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తారు. ఆసియా కప్ ఈవెంట్లో భారత్ పూల్ ‘ఎ’లో ఉంది. ఈ పూల్‌లో భారత్‌తో పాటు చైనా, మలేసియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ జట్లున్నాయి. పూల్ ‘బి’లో దక్షిణ కొరియా, జపాన్, చైనీస్ తైపీ, హాంకాంగ్, శ్రీలంకలు పోటీపడతాయి. జ్యోతి సింగ్ నేతృత్వంలోని భారత జట్టులో పలువురు ప్రతిభావంతులు నిలకడగా రాణిస్తున్నారు. వైష్ణవి విఠల్ ఫాల్క, సునేలిత టొప్పొ, ముంతాజ్ ఖాన్, దీపిక, బ్యూటీ డుంగ్డుంగ్లకు సీనియర్లతో కలిసి ఆడిన అనుభవం ఉంది. ఈ జట్టుకు భారత మాజీ కెప్టెన్ తుషార్ ఖండ్కేర్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఒమన్‌కు బయలుదేరే ముందు మీడియాతో కెపె్టన్ జ్యోతి సింగ్ మాట్లాడుతూ జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైందని, కొన్ని నెలలుగా జట్టు సన్నాహాల్లో చెమటోడ్చుతుందని తెలిపింది. అక్కడే ఉన్న పురుషుల జట్టు నాకౌట్‌కు చేరడం ఆనందంగా ఉందని, మేం కూడా వారిలాగే రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. -
భారత్‌కు రెండో విజయం
ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మస్కట్‌లో గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున థోక్చోమ్ కింగ్సన్ సింగ్ (12వ నిమిషంలో), రోహిత్ (36వ నిమిషంలో), అరిజిత్ సింగ్ హుండల్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ జట్టుకు నియో సాటో (15వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు. ఈ మ్యాచ్‌లో జపాన్ జట్టుకు ఏకంగా 16 పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే జపాన్ రెండింటిని మాత్రమే గోల్స్‌గా మలిచింది. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు దక్కగా ఇందులో రెండింటిని సది్వనియోగం చేసుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత జట్టు ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. శనివారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టుతో భారత్ తలపడుతుంది. -
భారీ విజయంతో భారత్ బోణీ
మస్కట్ (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 11–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ హుండల్ (2వ, 24వ నిమిషాల్లో), గుర్జోత్ సింగ్ (18వ, 45వ నిమిషాల్లో), సౌరభ్ ఆనంద్ కుశ్వాహ (19వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు.దిల్‌రాజ్ సింగ్ (21వ నిమిషంలో), ముకేశ్ టొప్పో (59వ నిమిషంలో), శారదానంద్ తివారీ (10వ నిమిషంలో), రోహిత్ (29వ నిమిషంలో), అర్‡్షదీప్ సింగ్ (8వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. -
బెంబేలెత్తించిన బుమ్రా.. విజయం వాకిట్లో టీమిండియా
కంగారూలకు పెట్టని కోటలాంటి పెర్త్‌లో టీమిండియా అదరగొడుతోంది. బౌలర్ల స్ఫూర్తికి బ్యాటర్ల జోరు తోడవడంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి విజయానికి చేరువైంది. యశస్వి జైస్వాల్ భారీ సెంచరీకి... కోహ్లి సమయోచిత శతకం తోడవడంతో ఆ్రస్టేలియా ముందు టీమిండియా 534 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.మన ఆటగాళ్లు చెడుగుడు ఆడుకున్న పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఫలితంగా 4.2 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆశలు వదులుకున్న ఆసీస్ ఆటగాళ్లు నాలుగో రోజు ఎంత సమయం క్రీజులో నిలుస్తారో వేచి చూడాలి!పెర్త్: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు తొలి టెస్టులో విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగడంతో ఆ్రస్టేలియా ముందు కొండంత లక్ష్యం నిలిచింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (297 బంతుల్లో 161; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... విరాట్ కోహ్లి (143 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కళాత్మక శతకంతో విజృంభించాడు. ఓవర్‌నైట్ స్కోరు 172/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 487/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (176 బంతుల్లో 77; 5 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (27 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కోహ్లి సెంచరీ పూర్తి కాగానే భారత కెపె్టన్ బుమ్రా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా ఆ్రస్టేలియా ముందు 534 పరుగుల లక్ష్యం నిలిచింది. లయన్ 2... స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్, మార్ష్తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. బుమ్రా (2/1), సిరాజ్ (1/7) ఆసీస్‌ను దెబ్బ కొట్టారు. మెక్‌స్వీనీ (0), కమిన్స్ (2), లబుషేన్ (3) అవుట్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (9 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆసీస్... విజయానికి ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్ల జోరు ఇలాగే సాగితే సోమవారం తొలి సెషన్లోనే ఆసీస్ ఆట ముగిసే అవకాశాలున్నాయి. ‘జై’స్వాల్ గర్జన సుదీర్ఘ ఫార్మాట్లో భారీ సెంచరీలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న యశస్వి జైస్వాల్... ఆ్రస్టేలియా గడ్డపై ఆడుతున్న తొలి టెస్టులోనే సత్తా చాటాడు. బౌన్సీ పిచ్‌పై రాణించేందుకు ప్రత్యేకంగా సాధన చేసి బరిలోకి దిగిన 22 ఏళ్ల జైస్వాల్... నాణ్యమైన పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డపై తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రాహుల్‌తో కలిసి రికార్డుల్లోకెక్కిన జైస్వాల్.. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టార్క్ వేసిన బౌన్సర్‌ను అప్పర్ కట్‌తో జైస్వాల్ సిక్సర్‌గా మలిచిన తీరు హైలైట్. తొలి ఇన్నింగ్స్‌లో చెత్త షాట్‌కు పెవిలియన్ చేరిన జైస్వాల్... ఈసారి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకు సాగాడు. క్లిష్టమైన పిచ్‌పై మెరుగైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న రాహుల్‌ను స్టార్క్ అవుట్ చేయగా... దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.రెండో కొత్త బంతి తీసుకున్న అనంతరం పడిక్కల్ పెవిలియన్ చేరగా... జైస్వాల్ 275 బంతుల్లో 150 మార్క్ దాటాడు. 23 ఏళ్లలోపు వయసులో నాలుగుసార్లు 150 పైచిలుకు పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన జైస్వాల్ చివరకు మార్ష్బౌలింగ్లో వెనుదిరిగాడు. ‘కోహ్లి’నూర్ ఇన్నింగ్స్... చాన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న విరాట్ కోహ్లి... ‘క్లాస్ శాశ్వతం, ఫామ్ తాత్కాలికం’ అని నిరూపించాడు. పిచ్ బౌన్స్‌కు సహకరిస్తున్న సమయంలో సంయమనం చూపి... కుదురుకున్నాక ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌లతో కట్టి పడేశాడు. స్వల్ప వ్యవధిలో జైస్వాల్‌తో పాటు పంత్ (1), జురేల్ (1) అవుట్ అయిన దశలో కోహ్లి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (29; ఒక సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అనూహ్య బౌన్స్‌తో కంగారూలు పరీక్షించినా... కోహ్లి ఏమాత్రం తడబడలేదు. పదే పదే వికెట్ పక్క నుంచి షాట్లు ఆడుతూ చకచకా పరుగులు రాబట్టాడు. సుందర్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టి20ల తరహాలో రెచి్చపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో బౌండరీతో కోహ్లి టెస్టుల్లో 30వ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (29)ను అధిగమించిన కోహ్లి... ఆసీస్ గడ్డపై ఏడో సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 104; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) మార్ష్161; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 77; పడిక్కల్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 25; కోహ్లి (నాటౌట్) 100; పంత్ (స్టంప్డ్) కేరీ (బి) లయన్ 1; జురేల్ (ఎల్బీ) (బి) కమిన్స్ 1; సుందర్ (బి) లయన్ 29; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 55; మొత్తం (134.3 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 487. వికెట్ల పతనం: 1–201, 2–275, 3–313, 4–320, 5–321, 6–410. బౌలింగ్: స్టార్క్ 26–2–111–1; హాజల్‌వుడ్ 21–9–28–1; కమిన్స్ 25–5–86–1; మార్ష్12–0–65–1; లయన్ 39–5–96–2; లబుషేన్ 6.3–0–38–0; హెడ్ 5–0–26–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 0; ఖ్వాజా (బ్యాటింగ్) 3; కమిన్స్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 2; లబుషేన్ (ఎల్బీ) (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (4.2 ఓవర్లలో 3 వికెట్లకు ) 12. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–12, బౌలింగ్: బుమ్రా 2.2–1–1–2; సిరాజ్ 2–0–7–1.201 ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. ఆ్రస్టేలియా గడ్డపై టీమిండియాకు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. 1986 సిడ్నీ టెస్టులో గావస్కర్–శ్రీకాంత్ నమోదు చేసిన 191 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానానికి చేరింది. 3 ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. 1968లో జయసింహ, 1977లో గావస్కర్ ఈ ఘనత సాధించారు. -
స్వయంకృతమే.. భారత సీనియర్ ఆటగాళ్ల ఘోరవైఫల్యం
బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లను ఎదుర్కోలేక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో తిరిగి కోలుకునే ప్రయత్నం చేసినా మ్యాచ్ మాత్రం చేజారింది! దీంతో 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు ఒక టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ‘అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే’ అని కెప్టెన్ అంటే... అభిమానులు కూడా అతడికి అండగా నిలిచారు.సిరీస్‌లో వెనుకబడ్డ టీమిండియా రెండో టెస్టు కోసం పుణేలో స్పిన్ పిచ్‌ను సిద్ధం చేసింది. అది ముందే పసిగట్టిన న్యూజిలాండ్ పేసర్లను పక్కన పెట్టి స్పిన్నర్లను రంగంలోకి దింపి ఫలితం రాబట్టింది. మామూలు స్పిన్నర్లను సైతం ఎదుర్కోలేకపోయిన టీమిండియా... ఈసారి తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌట్ కాగా... మరో ఓటమి తప్పలేదు. ఈ విజయంతో భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు తొలిసారి టెస్టు సిరీస్ గెలిచింది.కనీసం మూడో టెస్టులోనైనా భారత జట్టు విజయం సాధించక పోతుందా అని ఆశపడ్డ అభిమానులకు వాంఖడే స్టేడియంలోనూ గుండెకోత తప్పలేదు. 147 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 121 పరుగులకే పరిమితమై సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఒకవైపు మ్యాచ్ మ్యాచ్‌కూ పరిణతి చెందుతూ ముందుకు సాగిన న్యూజిలాండ్ మ్యాచ్‌కు ఒకటి చొప్పున ఘనతలు ఖాతాలో వేసుకుంటే... టీమిండియా మాత్రం చెత్త రికార్డు లిఖించుకుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆత్మపరిశీలన చేసుకోకుండా అంతకుమించిన పొరబాటు మరొకటి ఉండదు! సాక్షి క్రీడా విభాగం విదేశాల్లో ప్రదర్శనల సంగతి పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియాకు తిరుగులేదనేది జగమెరిగిన సత్యం. పుష్కరకాలంగా దీనికి మరింత బలం చేకూర్చుతూ భారత జట్టు... ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ వరుస సిరీస్‌లు గెలుస్తూ వస్తోంది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఇలా ప్రత్యర్థులు మారుతున్నారు తప్ప ఫలితం మాత్రం మారలేదు. ఈ జోరుతోనే వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన భారత్... ముచ్చటగా మూడోసారీ తుదిపోరుకు అర్హత సాధించడం ఖాయమే అనిపించింది. 12 ఏళ్లుగా స్వదేశంలో పరాజయం ఎరగకుండా జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా... ఈ క్రమంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టించింది. ఇదే జోష్‌లో ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందనుకుంటున్న దశలో న్యూజిలాండ్ జట్టు సమష్టి ప్రదర్శనతో చెలరేగి టీమిండియాను నేలకు దించింది. మెరుగైన వ్యూహాలకు, మెరికల్లాంటి ప్లేయర్లు తోడైతే భారత్‌ను భారత్‌లో ఓడించడం పెద్ద కష్టం కాదని కివీస్ ప్లేయర్లు నిరూపించారు. ఇన్నాళ్లు భారత ప్లేయర్ల ప్రధాన బలమనుకున్న స్పిన్‌తోనే టీమిండియాను ఎలా దెబ్బకొట్టవచ్చో న్యూజిలాండ్ అచరణలో చూపింది. శ్రీలంకలో క్లీన్‌స్వీప్‌నకు గురై... కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు అనే స్థితిలో భారత్‌లో అడుగు పెట్టిన న్యూజిలాండ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ సిరీస్ క్లీన్‌స్వీప్ చేస్తే... అదే సమయంలో చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తూ టీమిండియా 91 ఏళ్ల తమ టెస్టు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన దశలో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్... అత్యుద్భుత ప్రదర్శనతో టీమిండియాపై సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. తమ ప్రధాన ఆటగాడు కేన్ విలియమ్సన్ లేకుండానే భారత్‌పై కివీస్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చితే... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లున్న టీమిండియా మాత్రం నాసిరకం ఆటతీరుతో ఉసూరుమనిపించింది. ఆ ఏకాగ్రత ఏది? సుదీర్ఘ ఫార్మాట్లో సంయమనం ముఖ్యం అనేది మరిచిన భారత ప్లేయర్లు... క్రీజులోకి అడుగు పెట్టడంతోనే భారీ షాట్లకు పోయి వికెట్ సమర్పించుకోవడం చూస్తుంటే మనవాళ్లు టి20ల మాయలో పడ్డట్లు కనిపిస్తోంది. ఇదే నిజం అనుకుందాం అంటే ముంబై టెస్టులో 147 పరుగుల లక్ష్యఛేదనలో తలా రెండు భారీ షాట్లు ఆడిన టీమిండియా గెలవాల్సింది కానీ అదీ జరగలేదు. తొలి ఇన్నింగ్స్‌లో మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయిన కోహ్లి... రెండో ఇన్నింగ్స్‌లో అసలు నిలిచే ప్రయత్నం కూడా చేయలేకపోగా... రెండు ఫోర్లు బాదిన రోహిత్ అదే జోష్‌లో మరో చెత్త షాట్ ఆడి అప్పనంగా వికెట్ సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో గొప్ప పోరాట పటిమ చూపిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా టర్న్ అయిన బంతికి బౌల్డ్ కాగా... యశస్వి వికెట్ల ముందు దొరికిపోయాడు. మిడిలార్డర్లో ఆకట్టుకుంటాడనుకున్న సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. పంత్ ఒక్కడే సిరీస్ మొత్తం నిలకడ కనబర్చాడు. పక్కా గేమ్ ప్లాన్‌తో బరిలోకి దిగితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు రాబట్టడం పెద్ద కష్టం కాదని పంత్ నిరూపించాడు. ఇక మన స్పిన్నర్లు విజృంభిస్తారు అనుకొని సిద్ధం చేసిన పిచ్‌లపై ప్రత్యర్థి అనామక స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకుంటుంటే... అనుభవజ్ఞులైన మనవాళ్లు మాత్రం కింద వరుస బ్యాటర్లను సైతం అడ్డుకోలేక ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఎలాంటి పిచ్‌పైనైనా మొండిగా నిలబడి పోరాడగల చతేశ్వర్ పుజారా, రహానే వంటి ఆటగాళ్లు లేని లోటు ఈ సిరీస్‌తో స్పష్టం కాగా... ఆ్రస్టేలియా పర్యటనకు ముందు టీమిండియాకు ఈ సిరీస్ చాలా పాఠాలు నేరి్పంది. ఈ జట్టుతోనే ఆసీస్ టూర్‌కు వెళ్లనున్న టీమిండియా... లోపాలను అధిగమించకపోతే ‘బోర్డర్–గవాస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. -
భారత్‌కు చుక్కెదురు
కట్మండు: దక్షిణాసియా సీనియర్ మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు చాంపియన్ భారత జట్టు వరుసగా రెండోసారి సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. ఆతిథ్య నేపాల్ జట్టుతో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు ‘పెనాల్టీ షూటౌట్’లో 2–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. -
పృథ్వీ షాపై వేటు
ముంబై: భారత జట్టు మాజీ సభ్యుడు, టాపార్డర్ బ్యాటర్ పృథ్వీ షాను ముంబై రంజీ జట్టు నుంచి తప్పించారు. ఫామ్‌లో లేకపోవడం, ఫిట్నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా అతనిపై వేటు పడింది. టీమిండియా ఓపెనర్‌గా అంతర్జాతీయ కెరీర్లో ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడిన 24 ఏళ్ల పృథ్వీ ఇటీవలి కాలంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం కూడా ముంబై సెలక్టర్ల ఆగ్రహానికి కారణమైంది. తరచూ జట్టు ట్రెయినింగ్ సెషన్లకు డుమ్మా కొట్టడంతో పాటు బరువు పెరిగి మ్యాచ్ ఫిట్నెస్ను కోల్పోవడంతో అతనికి ఉద్వాసన పలికారు. ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 7, 12, 1, 39 నాటౌట్ స్కోర్లు చేశాడు. ఫిట్నెస్ సమస్యలతో ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా స్పందించడం లేదు. దీంతో అతన్ని తప్పించి 29 ఏళ్ల ఎడంచేతి ఓపెనింగ్ బ్యాటర్ అఖిల్ హేర్వడ్కర్ను ముంబై జట్టులోకి తీసుకున్నారు. అతను 41 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 36.51 సగటు నమోదు చేశాడు. ఏడు సెంచరీలు, పది అర్ధసెంచరీలు బాదాడు. ముంబై తదుపరి మ్యాచ్‌ను త్రిపురతో ఆడనుంది. అగర్తలాలో ఈ నెల 26 నుంచి 29 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత టి20 కెపె్టన్, మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చారు. -
యువ భారత్‌కు రెండో విజయం
జోహర్ బహ్రు (మలేసియా): సుల్తాన్ జోహర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో భారత కుర్రాళ్లు 6–4 గోల్స్ తేడాతో బ్రిటన్ జట్టును కంగుతినిపించారు. మ్యాచ్ ఆరంభమైన కొన్ని నిమిషాలకే ఆటగాళ్ల దాడులు మొదలయ్యాయి. ఈ క్రమంలో బోణీ బ్రిటన్ 2వ నిమిషంలో కొడితే... ఆఖరుదాకా భారత్ అదరగొట్టింది. మొహ్మద్ కొనయిన్ దాద్ ఏడో నిమిషంలో భారత్ ఖాతా తెలిచాడు. మొదటి పది నిమిషాల్లోపే ఒకసారి 1–1తో... తర్వాత 20వ నిమిషంలో రెండో సారి 2–2తో స్కోరు సమమైంది. ఇక అక్కడి నుంచి భారత్ ప్రతాపానికి పైమెట్టుగా సాగింది. దిల్‌రాజ్ సింగ్ (17వ, 50వ నిమిషాల్లో), శారదానంద్ తివారీ (20వ, 50వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయడంతో బ్రిటన్ ఇక మ్యాచ్‌లో తేరుకోలేకపోయింది. మధ్యలో మన్మీత్ సింగ్ (26వ ని.లో) గోల్ సాధించడంతో ఒక దశలో భారత్ 4–2తో ఆధిక్యాన్ని అమాంతం పెంచుకుంది. ప్రత్యర్థి జట్టులో రోరి పెన్రోజ్ (2వ, 15వ ని.లో), మైకేల్ రాయ్‌డెన్ (46వ, 59వ ని.లో) చెరో రెండు గోల్స్‌లో చేసి అంతరాన్ని అయితే తగ్గించగలిగారు కానీ... భారత్ ధాటి నుంచి పరాజయాన్ని తప్పించలేకపోయారు. ఆరంభంలోనే బ్రిటన్ శిబిరం గోల్ చేయడంతో భారత రక్షణ పంక్తి తమ లోపాలను వెంటనే సరిదిద్దుకుంది. దీనికితోడు స్ట్రయికర్లు కూడా క్రమం తప్పకుండా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై విజయవంతంగా లక్ష్యంపై గురిపెట్టడంతో భారత్ విజయం సులువైంది. తొలిమ్యాచ్‌లో భారత్ 4–2తో జపాన్ను చిత్తు చేసింది. -
పిచ్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం: గంభీర్
బెంగళూరు: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో భారత జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగి మంచి ఫలితాలు సాధించింది. బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ కూడా తమ బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని న్యూజిలాండ్‌పై కూడా టీమిండియా అమలు చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ తర్వాత జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనకు కూడా పేసర్లకు ఇది సన్నాహకంగా పనికొస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జట్టు ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ‘పరిస్థితులు, పిచ్, ప్రత్యర్థిని బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది. మా డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ ఆటగాళ్లు ఉండటం సానుకూలాంశం. వారిలోంచి ఎవరినైనా ఎంచుకోవచ్చు. అందరూ జట్టును గెలిపించగల సమర్థులే అని మా నమ్మకం. చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌ను చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అని జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇటీవల శ్రీలంక చేతిలో 0–2తో టెస్టు సిరీస్‌లో ఓడిన కివీస్... 37 వికెట్లను స్పిన్నర్లను సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో కుల్దీప్, అక్షర్‌లకు కూడా తొలి టెస్టులో చోటు ఇస్తారా అనేది ఆసక్తికరం. ‘వారిద్దరూ ప్రతిభావంతులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరినీ మేం పక్కన పెట్టడం లేదు. అయితే జట్టును గెలిపించగల 11 మందిని ఎంపిక చేయడమే అన్నింటికంటే ముఖ్యం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. -
బంగ్లాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు
ముంబై: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును శనివారం రాత్రి ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో స్థానం లభించింది. ఐపీఎల్లో తన పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న మయాంక్ యాదవ్‌కు కూడా తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడేళ్ల తర్వాత భారత టి20 జట్టులోకి పునరాగమనం చేశాడు. విశాఖపట్నంకు చెందిన 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి గత జూలైలో జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే జట్టును ప్రకటించాక నితీశ్ గాయపడటంతో అతను జింబాబ్వే పర్యటనకు దూరం కావాల్సి వచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నితీశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 13 మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 142.92 స్ట్రయిక్‌రేట్‌తో 303 పరుగులు సాధించి ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును గెల్చుకున్నాడు. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ అక్టోబర్ 6న గ్వాలియర్‌లో... రెండో మ్యాచ్ అక్టోబర్ 9న న్యూఢిల్లీలో... మూడో మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. ఆరు మార్పులు... గత నెలలో శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లో పాల్గొన్న ఆరుగురు భారత క్రికెటర్లను బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ కోసం ఎంపిక చేయలేదు. శ్రీలంకతో సిరీస్‌లో శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, రిషభ్ పంత్, సిరాజ్, ఖలీల్ అహ్మద్ ఆడారు. వీరి స్థానాల్లో అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్‌లకు చోటు దక్కింది. భారత టి20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిõÙక్ శర్మ, సంజూ సామ్సన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్‡్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్. -
భారత మహిళ క్రికెటర్లను సర్ప్రైజ్ చేసిన రానా దగ్గుబాటి (ఫొటోలు)
-
India vs Bangladesh 1st Test: పంత్, గిల్ సెంచరీల మోత
దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రిషభ్ పంత్ అంచనాలను అందుకుంటూ తనదైన శైలిలో సాధించిన శతకం... శుబ్‌మన్ గిల్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఆడుతూ పూర్తి చేసుకున్న సెంచరీ...ఆపై చెపాక్ బాయ్ అశి్వన్ మూడు కీలక వికెట్లతో ప్రత్యర్థి పని పట్టిన తీరు... చెన్నై టెస్టులో మూడో రోజు భారత్ హవానే కొనసాగింది. ముందుగా పంత్, గిల్ సెంచరీల తర్వాత తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్‌కు భారత్ సవాల్ విసరగా... తడబడుతూ ఆడిన బంగ్లా కుప్పకూలిపోకుండా కాస్త నిలవగలిగింది. వెలుతురులేమితో బంగ్లా ఓటమి ఆలస్యమైనట్లు కనిపించినా... ఆదివారం మిగిలిన ఆరు వికెట్లు తీయడం భారత్‌కు కష్టం కాకపోవచ్చు. చెన్నై: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయంపై గురి పెట్టింది. భారత్ విధించిన 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లా శనివారం ఆట ముగిసే సమయానికి 37.2 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కెపె్టన్ నజ్ముల్ హసన్ (60 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), షకీబ్ అల్ హసన్ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అశి్వన్‌కు మూడు వికెట్లు దక్కాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా బంగ్లా మరో 357 పరుగులు చేయాల్సి ఉంది. వెలుతురులేమి కారణంగా ఆటను అంపైర్లు కాస్త ముందుగా నిలిపివేశారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 81/3తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 64 ఓవర్లలో 4 వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శుబ్‌మన్ గిల్ (176 బంతుల్లో 119 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో ఐదో సెంచరీ... రిషభ్ పంత్ (128 బంతుల్లో 109; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో ఆరో సెంచరీ సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 167 పరుగులు జోడించారు. శనివారం భారత్ మొత్తం 41 ఓవర్లు ఆడి 206 పరుగులు జత చేసింది. శతకాల జోరు... మూడో రోజు ఆటలో పంత్, గిల్‌ను బంగ్లా బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ప్రత్యర్థి పేలవ బౌలింగ్‌ను సొమ్ము చేసుకున్న భారత బ్యాటర్లిద్దరూ దూకుడుగా ఆడారు. మిరాజ్ ఓవర్లో రెండు సిక్స్‌లు బాది గిల్ ముందుగా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 72 పరుగుల వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ నజ్ముల్ వదిలేశాడు. షకీబ్ ఓవర్లో పంత్ రెండు వరుస ఫోర్లు కొట్టడంతో తొలి సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత కూడా షకీబ్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది పంత్ దూసుకుపోయాడు. ఎట్టకేలకు అభిమానులు ఎదురు చూసిన క్షణం వచి్చంది. షకీబ్ ఓవర్లో లాంగాఫ్ దిశగా దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 124 బంతుల్లో పంత్ సెంచరీ పూర్తి కాగా...భారత శిబిరం మొత్తం తమ సహచరుడిని చప్పట్లతో అభినందించింది. తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే గిల్ కూడా 161 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. మరో నాలుగు ఓవర్లకు రోహిత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. నజ్ముల్ హాఫ్ సెంచరీ... భారీ లక్ష్యం ముందుండగా బంగ్లా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు జాకీర్ హసన్ (47 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), షాద్మన్ ఇస్లామ్ (68 బంతుల్లో 35; 3 ఫోర్లు) దూకుడుగా ఆరంభించారు. సిరాజ్ ఓవర్లో జాకీర్ 2 ఫోర్లు, సిక్స్‌తో 14 పరుగులు రాబట్టాడు. దాంతో స్కోరు 62/0కు చేరింది. అయితే టీ విరామం తర్వాత బుమ్రా చక్కటి బంతితో జాకీర్‌ను అవుట్ చేసి తొలి దెబ్బ కొట్టాడు. షాద్మన్ వికెట్ అశి్వన్ ఖాతాలో చేరింది. మరో వైపు నజు్మల్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో అశ్వి న్ కూడా నాలుగు సిక్స్‌లు సమరి్పంచుకున్నాడు. ఆ తర్వాత అశ్విన్ మరో రెండు వికెట్లు తీయడంతో స్కోరు 86/1 నుంచి 146/4కు చేరింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 376; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 149; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) దాస్ (బి) నాహిద్ 10; రోహిత్ (సి) జాకీర్ (బి) తస్కీన్ 5; గిల్ (నాటౌట్) 119; కోహ్లి (ఎల్బీ) (బి) మిరాజ్ 17; పంత్ (సి) అండ్ (బి) మిరాజ్ 109; రాహుల్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (64 ఓవర్లలో 4 వికెట్లకు డిక్లేర్డ్) 287. వికెట్ల పతనం: 1–15, 2–28, 3–67, 4–234.బౌలింగ్: తస్కీన్ 7–1–22–1, హసన్ మహమూద్ 11–1–43–0, నాహిద్ రాణా 6–0–21–1, షకీబ్ 13–0–79–0, మెహదీ హసన్ మిరాజ్ 25–3–10–3–2, మోమినుల్ 2–0–15–0. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి (బి) బుమ్రా 33; షాద్మన్ (సి) గిల్ (బి) అశ్విన్ 35; నజు్మల్ (బ్యాటింగ్) 51; మోమినుల్ (బి) అశ్విన్ 13; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) అశి్వన్ 13; షకీబ్ (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (37.2 ఓవర్లలో 4 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–62, 2–86, 3–124, 4–146.బౌలింగ్: బుమ్రా 7–2–18–1, సిరాజ్ 3.2–1–20–0, ఆకాశ్ దీప్ 6–0–20–0, అశ్విన్ 15–0–63–3, జడేజా 6–0–29–0. -
‘మసాలా’ వార్తలకు ముగింపునిస్తున్నాం: కోహ్లి, గంభీర్
చెన్నై: మైదానంలో దూకుడైన స్వభావానికి వారిద్దరు చిరునామా... ఆటతోనే కాకుండా ప్రత్యర్థులపై మాటలతో దూసుకుపోయేందుకు ఎవరూ వెనుకాడరు... భారత ఆటగాళ్లుగా ఇతర జట్లతో తలపడిన సందర్భాలే కాదు... ఒకరికొకరు కూడా ఆవేశంతో మాటా మాటా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్లో అలాంటివి అభిమానులు చూశారు.అలాంటివారు ఒకరు ప్లేయర్‌గా, మరొకరు అదే జట్టుకు కోచ్‌గా కలిసి భారత జట్టును నడిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ‘ఢిల్లీ బాయ్స్’ విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ల మధ్య ఆసక్తకర సంభాషణ జరిగింది. తామిద్దరి మధ్య ఏదో వైరం ఉందంటూ మసాలా వార్తలు రాసుకునే వారికి ఈ సంభాషణ తర్వాత అలాంటి అవకాశం ఉండదని వారు ఈ ‘బీసీసీఐ’ వెబ్సైట్ రూపొందించిన వీడియోలో చెప్పేశారు. » మైదానంలో బ్యాటింగ్ సమయంలో దూషణలకు దిగితే అది బ్యాటింగ్‌పై ప్రభావం చూపి అవుటవుతారా లేక మరింత దూకుడుగా ఆడి ఆధిపత్యం ప్రదర్శించవచ్చా అని గంభీర్‌ను కోహ్లి అడిగాడు. దీనిపై గంభీర్ ‘ఇలాంటి తరహా అనుభవాలు నాకన్నా నీకే ఎక్కువగా ఉన్నాయి. నువ్వే బాగా చెప్పగలవు’ అని సమాధానం ఇవ్వడంతో నవ్వులు విరిశాయి. ‘ఇది తప్పు కాదు. ఇలా చేయవచ్చు అని నాకు మద్దతిస్తావని ఆశించా’ అంటూ కోహ్లి బదులిచ్చాడు. తన విషయంలో ఆ తరహా దూకుడు బాగా పని చేసిందని గంభీర్ అన్నాడు. » మెదానంలో మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాల్లో దైవభక్తి బాగా పని చేసిందని ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. తాను న్యూజిలాండ్‌పై నేపియర్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న సమయంలో ‘హనుమాన్ చాలీసా’ పారాయణం చేసినట్లు గంభీర్ చెప్పగా... అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసినప్పుడు ‘ఓం నమఃశివాయ’ అంటూ వచ్చానని కోహ్లి వెల్లడించాడు. » 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన క్షణాల వీడియో చూస్తుండటంతో వీరి సంభాషణ మొదలైంది. ఢిల్లీ గ్రౌండ్లో గంభీర్‌ను చూసి తాను ఎలా కెరీర్లో ఎదగాలో స్ఫూర్తిగా తీసుకున్న విషయాన్ని కోహ్లి చెప్పగా... కెరీర్ ఆరంభంలో కోహ్లి ఆడిన కొన్ని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లపై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. అనంతరం ఈ చర్చ భారత టెస్టు క్రికెట్ వైపు మళ్లింది. ఒక ఆటగాడి గొప్పతనాన్ని గుర్చించేందుకు టెస్టు క్రికెట్ మాత్రమే అసలైన వేదిక అని ఇద్దరూ అభిప్రాయ పడ్డారు. భారత జట్టు బ్యాటింగ్‌లో చాలా కాలంగా బలంగా ఉందని... అయితే బౌలింగ్‌ను శక్తివంతంగా మార్చి బౌలర్ల ద్వారా మ్యాచ్‌లను గెలిపించిన ఘనత కెపె్టన్‌గా కోహ్లిదేనని గంభీర్ వ్యాఖ్యానించాడు. రాబోయే తరంలో టెస్టులను ఇష్టపడేలా ఆటగాళ్లను ప్రోత్సహించాల్సిన బాధ్యత తమపై ఉందని వీరిద్దరు అభిప్రాయపడ్డారు. » లక్ష్య ఛేదన అంటేనే తనకు ఇష్టమని, తాను చేయాల్సిన పనిపై స్పష్టత ఉంటుందని కోహ్లి అన్నాడు. ఒక ఆటగాడు సొంత మైలురాళ్ల గురించి ఆలోచించకుండా టీమ్ కోసం ఏం కావాలో ఆలోచిస్తేనే ఛేదన సులువై జట్టుకు విజయాలు లభిస్తాయని గంభీర్ విశ్లేషించాడు. వరల్డ్ కప్ ఫైనల్లో తాను సెంచరీ గురించి ఆలోచించనే లేదని, అవుటైనప్పుడు కూడా ప్రత్యర్థి కోలుకునే అవకాశం ఇవ్వడం పట్ల బాధపడ్డానని గంభీర్ వివరించాడు. » తర్వాతి అతిథి రోహిత్ శర్మ అయితే ఏం ప్రశ్న వేయాలని గంభీర్ అడగ్గా... ఉదయమే నానబెట్టిన బాదం పలుకులు తిన్నావా లేదా అని అడగాలని (అతని మతిమరపును గుర్తు చేస్తూ)... ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకు రమ్మంటే రాత్రి 11 గంటలకు వస్తాడని కోహ్లి చెప్పడంతో నవ్వులతో సంభాషణ ముగిసింది. -
స్వీడన్ చేతిలో భారత్ ఆరో‘సారీ’
స్టాక్‌హోమ్: అగ్రశ్రేణి క్రీడాకారులు సుమిత్ నగాల్, యూకీ బాంబ్రీ లేకుండానే డేవిస్‌కప్ ప్రపంచ టీమ్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1లో పోటీపడ్డ భారత జట్టుకు నిరాశాజనక ఫలితం ఎదురైంది. స్వీడన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారతజట్టు 0–4తో ఓడిపోయింది. డేవిస్‌కప్ టోర్నీ చరిత్రలో స్వీడన్ జట్టు చేతిలో భారత జట్టుకిది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం. స్వీడన్‌తో పోటీపడ్డ ఆరుసార్లూ భారత జట్టు ఓడిపోయింది. ఈసారి మాత్రం భారత ఆటగాళ్లు నాలుగు మ్యాచ్‌లు ఆడినా కనీసం ఒక్క సెట్ కూడా గెలవలేకపోయారు. తొలి రోజు శనివారం రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత క్రీడాకారులు ఓడిపోయారు. ఫలితంగా తదుపరి దశకు అర్హత పొందాలంటే ఆదివారం మూడు మ్యాచ్‌ల్లోనూ (డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్) భారత ప్లేయర్లు తప్పనిసరిగా గెలవాలి. అయితే డబుల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ 3–6, 4–6తో ఆండ్రీ గొరాన్సన్–ఫిలిప్ బెర్గెవి జంట చేతిలో ఓటమి పాలైంది. దాంతో స్వీడన్ జట్టు 3–0తో విజయాన్ని ఖరారు చేసుకొని వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత పొందింది. ఫలితం తేలిపోవడంతో నాలుగో మ్యాచ్‌గా జరిగిన నామమాత్రమైన సింగిల్స్‌లో జాతీయ మాజీ చాంపియన్ సిద్ధార్థ్ విశ్వకర్మను బరిలోకి దించారు. డేవిస్‌కప్‌లో తొలిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధార్థ్ 2–6, 2–6తో ఇలియాస్ యామెర్ చేతిలో ఓడిపోయాడు. ఈ పరాజయంతో భారత జట్టు వచ్చే ఏడాది డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించేందుకు ప్లే ఆఫ్ దశ మ్యాచ్‌లు ఆడుతుంది. -
Intercontinental Cup 2024: సిరియాతో నేడు భారత్ పోరు... గెలిస్తేనే టీమిండియాకు టైటిల్
ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టైటిల్ కోసం నేడు భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో సిరియా జట్టుతో భారత్ తలపడనుంది. మూడు దేశాల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. మారిషస్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌ను భారత్ 0–0తో ‘డ్రా’ చేసుకోగా... సిరియా జట్టు 2–0తో మారిషస్ జట్టును ఓడించింది. ఈ నేపథ్యంలో నేడు భారత్‌తో జరిగే మ్యాచ్‌ను సిరియా ‘డ్రా’ చేసుకుంటే చాలు టైటిల్‌ను దక్కించుకుంటుంది. భారత జట్టుకు టైటిల్ లభించాలంటే సిరియాపై గెలవాలి. ఇప్పటి వరకు భారత్, సిరియా జట్లు ముఖాముఖిగా ఏడుసార్లు తలపడ్డాయి. 3 మ్యాచ్‌ల్లో సిరియా, 2 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచాయి. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో సిరియా 93వ స్థానంలో, భారత్ 124వ స్థానంలో ఉన్నాయి. నేడు రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్18–3 టీవీ చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
అదరగొట్టిన ఆంధ్ర ప్లేయర్లు: భార్గవ్‌కు రెండు టైటిల్స్
పుణే: ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు అరిగెల భార్గవ్ రామ్ రెండు టైటిల్స్‌తో అదరగొట్టాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో గుంటూరు జిల్లాకు చెందిన భార్గవ్ అండర్–19 పురుషుల డబుల్స్, అండర్–19 మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు.డబుల్స్లోనూపురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన గొబ్బూరు విశ్వతేజ్‌తో కలిసి ఆడిన భార్గవ్ రామ్ 21–13, 21–18తో అర్ష్ మొహమ్మద్–భవ్య్ ఛాబ్రా (భారత్) జోడీని ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో భార్గవ్‌రామ్–కలగొట్ల వెన్నెల (భారత్) ద్వయం 21–9, 21–12తో మొహమ్మద్ వితో అనాఫ్సా–కేలా అనీసా పుత్రి (ఇండోనేసియా) జంటను ఓడించి టైటిల్ దక్కించుకుంది.చాంపియన్ సూర్య చరిష్మాఇక అండర్–19 మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన సూర్య చరిష్మా తామిరి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో సూర్య చరిష్మా 18–21, 21–11, 21–15తో థాలిత రమధాని విర్యావాన్ (ఇండోనేసియా)పై గెలుపొందింది. అండర్–19 మహిళల డబుల్స్ ఫైనల్లో తారిణి సూరి–శ్రావణి వలేకర్ (భారత్) జంట 21–17, 23–21తో చైచానా–పొలియం (థాయ్‌లాండ్) జోడీపై గెలిచి విజేతగా నిలిచింది. -
హర్మన్‌ప్రీత్ సారథ్యంలో...
అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకునేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరగనున్న టి20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. అనుభవజు్ఞలు, యంగ్ ప్లేయర్లతో కూడిన ఈ జట్టుకు ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా... ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనున్న మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో అనూహ్య పరాజయంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత జట్టు నుంచి ఉమా ఛెత్రీ తప్ప మిగిలిన ప్లేయర్లందరూ టి20 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యూఏఈకి మార్చారు. ఆసియా కప్ సందర్భంగా వేలికి గాయమైన స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌తో పాటు మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న వికెట్ కీపర్ యస్తిక భాటియాను కూడా జట్టులోకి ఎంపిక చేశారు. అయితే వీరిద్దరూ ఫిట్నెస్ సాధిస్తేనే యూఏఈకి వెళ్లనున్నారు. టాపార్డర్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ కీలకం కానుండగా... హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ఫినిషర్ల పాత్ర పోషించనున్నారు. దీప్తి శర్మ, ఆశ శోభన, రాధ యాదవ్ రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండగా... రేణుక సింగ్, అరుంధతి రెడ్డి పేస్ బాధ్యతలు మోయనున్నారు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పూజ వస్త్రకర్ జట్టులో చోటు దక్కించుకుంది. ‘ఇది సమతూకమైన జట్టు. యస్తిక, శ్రేయాంక గాయాల నుంచి కోలుకొని టోర్నీ ఆరంభానికి సిద్ధమవుతారు’ అని భారత మాజీ కెపె్టన్ డయానా ఎడుల్జీ పేర్కొన్నారు. టోర్నీలో భాగంగా భారత జట్టు అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసీస్ అడ్డంకిని అధిగమిస్తేనే! ఐసీసీ టోరీ్నల్లో టైటిల్ నెగ్గలేకపోతున్న భారత జట్టు ఈసారైనా అడ్డంకులు అధిగమించి ముందడుగు వేయాలని భావిస్తోంది. 2020 టోర్నీ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్...తుది పోరులో ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహిస్తే... అందులో ఆరుసార్లు ఆస్ట్రేలియానే జట్టు విజేతగా నిలిచిందంటే ఆ జట్టు ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మరి హర్మన్ బృందం చాంపియన్‌గా నిలవాలంటే ముందుగా లీగ్ దశలో ఆసీస్‌ను ఓడించాలి. తుది పోరులోనూ ఆ జట్టుపై పైచేయి సాధించాలి. భారత టి 20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా, రిచా ఘోష్, యస్తిక , పూజ , అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, హేమలత, ఆశ శోభన, రాధ యాదవ్, శ్రేయాంక, సజన. ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా ఛెత్రీ, తనూజ కన్వర్, సైమా ఠాకూర్. -
తొడగొట్టి చెబుతున్నా...
ఓపెనర్‌గా శిఖర్ ధావన్ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అతని ఖాతాలో చేరాయి. ధావన్ కెరీర్లో కొన్ని ఆసక్తికర గణాంకాలను చూస్తే...‘నా క్రికెట్ ప్రయాణాన్ని ముగిస్తున్నాను. లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలు, అభిమానం మూటగట్టుకున్నాను. జీవితంలో ముందుకు వెళ్లాలంటే పేజీలకు తిప్పక తప్పదు. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఎన్నో ఏళ్లు భారత్ తరఫున ఆడగలిగినందుకు నా హృదయంలో ప్రశాంతత ఉంది. వెనక్కి తిరిగి చూస్తే అన్నీ గుర్తుంచుకునే క్షణాలే. ఆటను దాటి బయటకు చూస్తే అంతా కొత్త ప్రపంచమే. నా జీవితంలో భారత్‌కు ఆడాలనే ఒకే ఒక లక్ష్యం ఉండేది. అది సాధించగలిగాను. భారత్‌కు ఇకపై ఆడబోవడం లేదని బాధపడవద్దు. ఇన్నేళ్లు ఆడగలిగానని సంతోంచు అనేది నా మాట. దాని పట్ల గర్వంగా ఉన్నా. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. జై హింద్’ –శిఖర్ ధావన్ 187 తన తొలి టెస్టులో ధావన్ చేసిన పరుగులు. అరంగేట్ర టెస్టులో భారత్ తరఫున ఇదే అత్యధిక స్కోరు కాగా...85 బంతుల్లో సాధించిన శతకం భారత ఆటగాళ్లందరిలో వేగవంతమైంది. 65.15 ఐసీసీ టోరీ్నల్లో (వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ కలిపి) ధావన్ సగటు అందరికంటే అత్యధికం. 20 ఇన్నింగ్స్‌లలో అతను 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలతో 1238 పరుగులు చేశాడు.18 రోహిత్‌తో కలిసి నెలకొల్పిన సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య. సచిన్–గంగూలీ (21) తర్వాత ఇది రెండో స్థానం.109 తన 100వ వన్డేలో సెంచరీ సాధించిన ధావన్, ఈ ఫీట్ నమోదు చేసిన పది మంది ఆటగాళ్ళలో ఒకడు.12 విదేశాల్లో ధావన్ సెంచరీల సంఖ్య. భారత్‌లో 5 శతకాలు మాత్రమే అతను సాధించాడు. 6769 ఐపీఎల్లో ధావన్ పరుగులు. ఓవరాల్‌గా కోహ్లి (8004) తర్వాత రెండో స్థానం. 5 ఐపీఎల్లో ఐదు సీజన్లలో ధావన్ 500కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. వన్డేల్లో కనీసం 40కు పైగా సగటు, 90కి పైగా స్ట్రయిక్ రేట్‌తో 5 వేలకు పైగా పరుగులను సాధించిన ఎనిమిది మంది బ్యాటర్లలో ధావన్ ఒకడు -
PR Sreejesh: జెర్సీ నంబర్ 16కు వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత దిగ్గజ గోల్‌కీపర్ శ్రీజేశ్ ఇకపై హాకీ మైదానంలో కనిపించడు. అలాగే అతని జెర్సీ నంబర్ 16 కూడా కనిపించదు. గోల్‌పోస్ట్ ముందు ప్రత్యర్థులకు అడ్డుగోడలా నిలబడి భారత జట్టుకు విశేష సేవలందించిన శ్రీజేశ్ ఘనకీర్తికి గుర్తుగా ఆ జెర్సీకి అతనితోపాటే రిటైర్మెంట్ ఇవ్వాలని హాకీ ఇండియా (హెచ్ఐ) నిర్ణయించింది. బుధవారం ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టు సభ్యులను ఘనంగా సన్మానించారు. శ్రీజేశ్కు రూ. 25 లక్షల నగదు పురస్కారం చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ టిరీ్క, భోళానాథ్ సింగ్‌లు మాట్లాడుతూ శ్రీజేశ్‌ను ఆకాశానికెత్తారు. ఆధునిక భారత హాకీకి అతనొక దేవుడని కితాబిచ్చారు. భారత సీనియర్ పురుషుల జట్టులో 16వ నంబర్ జెర్సీని ఎవరికీ కేటాయించబోమని భోళానాథ్ చెప్పారు. ‘శ్రీజేశ్ త్వరలోనే జూనియర్ భారత జట్టు కోచ్‌గా వెళతారు. ఘనమైన కెరీర్‌కు అతను వీడ్కోలు పలికితే ... హాకీ ఇండియా అతని ఘనకీర్తికి గుర్తుగా జెర్సీ నంబర్ 16కు రిటైర్మెంట్ ఇచ్చింది. అయితే ఇది సీనియర్ స్థాయికే పరిమితం. జూనియర్ జట్టులో 16వ జెర్సీ యథాతథంగా కొనసాగుతుంది’ అని ఆయన వివరించారు. -
ఒలింపిక్ బృందాన్ని అభినందించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పారిస్‌లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందాన్ని బుధవారం అభినందించారు. రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండప్‌లో భారత బృందంతో భేటీ అయిన ముర్ము... దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పతకాలు తెచ్చిన క్రీడాకారులతో పాటు పతకాల కోసం పారిస్‌లో శ్రమించిన అథ్లెట్లను ఆమె ప్రశంసించారు. పలువురు అథ్లెట్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చటించిన ఫొటోలు, బృందంతో దిగిన ఫొటోల్ని రాష్ట్రపతి భవన్ అధికారిక ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. మరోవైపు ఈరోజు ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత క్రీడాకారులకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆహా్వనం అందింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులు కూడా ఆ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. -
పడి.. లేచి.. మరో పతకం వైపు...
2023 మార్చి... సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్‌లో భారత జట్టు అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. పేలవ ఆటతో సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచిన టీమ్... గతంలో ఏ ఆతిథ్య జట్టూ ఎదుర్కోని అవమానాన్ని భరించాల్సి వచ్చింది. దాంతో మరోసారి భారత హాకీ పాత రోజులు గుర్తుకొచ్చాయి. దాదాపు రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన జట్టు ఇదేనా అనిపించింది. అప్పుడప్పుడే మళ్లీ ఆటపై ఆసక్తి పెరుగుతున్న దశలో స్వదేశంలో జట్టు ఆట మళ్లీ నిరాశపర్చింది. దాంతో సహజంగానే జరిగిన మార్పుల్లో భాగంగా ముందుగా కోచ్ గ్రాహం రీడ్‌పై వేటు పడింది. కొత్త కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన క్రెయిగ్ ఫుల్టన్ వచ్చాడు. ఆటగాడిగా, కోచ్‌గా విశేష అనుభవం ఉన్న అతను భారత జట్టును మళ్లీ దారిలోకి తీసుకురాగలడని అంతా భావించారు. ఈ నమ్మకాన్ని ఫుల్టన్ నిలబెట్టుకున్నాడు. తనదైన శైలిలో ఆటగాళ్లను మరింత పదునుగా మార్చే పనిలో పడ్డాడు. అప్పటికే సీనియర్లుగా దేశం తరఫున ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు ఆడిన వారిని కూడా తనకు కావాల్సిన రీతిలో మలచుకున్నాడు. ముఖ్యంగా అవుట్‌ఫీల్డ్‌లో వేగం పెంచడం, ఆరంభం నుంచే దూకుడు పెంచి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడంవంటి విషయంలో ఆటగాళ్లలో కొత్త తరహా ఆటను తీసుకొచ్చాడు. ముందుగా ఆటగాళ్లు కొంత ఇబ్బంది పడ్డా మెల్లగా ఇవి మంచి ఫలితాలు అందించాయి.ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో స్వర్ణాలు గెలిచిన భారత్ ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆటగాళ్లందరిలోనూ కొత్త ఉత్సాహం కనిపించింది. వరల్డ్ కప్ వైఫల్యాన్ని దాటి మున్ముందు పెద్ద విజయం సాధించాలనే కసి, పట్టుదల వారిలో పెరిగాయి. ఒలింపిక్స్‌లో భారత జట్టు ఆట చూస్తే ఫుల్టన్ ప్రణాళికలు ఎంత అద్భుతంగా పని చేశాయో తెలుస్తుంది. సరిగ్గా చెప్పాలంటే ఒకే తరహా ఆటతో కాకుండా వేర్వేరు ప్రత్యర్థుల కోసం జట్టు వేర్వేరు వ్యూహాలు పన్నింది. బెల్జియం జట్టు తమ డిఫెన్స్‌ను పటిష్టంగా ఉంచుకుంటూనే దూకుడుగా ఆడింది. అదే ఆ్రస్టేలియాపై వచ్చేసరికి ఆట మారింది. క్షణకాలం డిఫెన్స్‌లో పడినా ప్రత్యర్థి పైచేయి సాధిస్తుందని తెలుసు కాబట్టి తొలి నిమిషం నుంచి పూర్తిగా అటాకింగ్‌పైనే దృష్టి పెట్టింది. మళ్లీ బ్రిటన్‌తో మ్యాచ్ వచ్చేసరికి డిఫెన్స్‌కు కట్టుబడింది. ఒక ఆటగాడు తగ్గినా కీపర్‌తో కలిసి గోల్స్‌ను కాపాడుకోవడంలో జట్టు సఫలమైంది. సెమీస్‌లో జర్మనీతో ఓడినా గతంలో ఎన్నడూ చూడని అటాకింగ్, ఓటమిని అంగీకరించకుండా పోరాడే తత్వం మన టీమ్ నుంచి కనిపించిందని మాజీ ఆటగాడు వీరేన్ రస్కిన్హా వ్యాఖ్యానించడం విశేషం. క్షణాల వ్యవధిలో వ్యూహాలు మార్చుకోవడం, పరిస్థితికి అనుగుణంగా అప్పటికప్పుడు ఆటతీరును మలచుకోవడం గతంలో భారత జట్టు విషయంలో ఎప్పుడూ చూడనిది. భారత జట్టు గెలుపు మరో వ్యక్తి ప్రధాన పాత్ర పోషించాడు. అతనే ప్యాడీ ఆప్టన్. స్పోర్ట్స్ సైకాలిజిస్ట్ అయిన ఆప్టన్ భారత హాకీ ఆటగాళ్లను మానసికంగా సంసిద్ధం చేయడంలో, ఒత్తిడిని ఎదుర్కోకుండా బలంగా నిలబడే విషయంలో సరైన దిశలో తీర్చిదిద్దాడు. 2011లో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన సమయంలో భారత జట్టు ఇదే ఆప్టన్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌గా వ్యవహరించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కోచ్‌ల వ్యూహాలను అమలు చేసే విషయంలో ఆటగాళ్లు ఎక్కడా గతి తప్పలేదు. ఒలింపిక్స్‌తో రిటైర్ అవుతున్న గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడలా ప్రత్యర్థులను నిలువరించాడు. ఎనిమిది మ్యాచ్‌లలో అతను 62 షాట్లను ఎదుర్కొంటే 50 షాట్లను ఆపడం విశేషం. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీలను గోల్స్‌గా మలచడంలో అద్భుత నైపుణ్యం చూపిస్తూ ఒలింపిక్స్‌లో 10 గోల్స్ నమోదు చేశాడు. డిఫెండర్లు రోహిదాస్, జర్మన్‌ప్రీత్‌లు అద్భుతంగా ప్రత్యర్థి ఆటగాళ్లను అడ్డుకున్నారు. అత్యంత సీనియర్ అయిన మాజీ కెపె్టన్ మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్ మిడ్‌ఫీల్డ్‌లో తన పదును చూపించగ, మరో సీనియర్ మన్దీప్ ఫార్వర్డ్‌గా జట్టును నడిపించాడు. అందరి సమష్టి ప్రదర్శన, పోరాటం, పట్టుదల భారత్‌కు వరుసగా రెండో కాంస్యాన్ని అందించాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులోని 11 మంది సభ్యులు ‘పారిస్’లోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. –సాక్షి క్రీడా విభాగం జ్యోతికి మళ్లీ నిరాశ పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ నిరాశ పరిచింది. గురువారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రేసులో జ్యోతి నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. అంతకుముందు బుధవారం హీట్స్‌లో ఏడో స్థానంలో నిలిచిన జ్యోతి... రెపిచాజ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన జ్యోతి 13.17 సెకన్లలో గమ్యానికి చేరింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల జ్యోతి గతంలో 12.78 సెకన్లతో 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది. వెనుకంజలో గోల్ఫర్లు పారిస్ ఒలింపిక్స్ గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో భారత గోల్ఫర్లు ఆకట్టుకోలేకపోయారు. గురువారం రెండు రౌండ్లు ముగిసేసరికి దీక్ష డాగర్, అదితి అశోక్ చెరో 143 పాయింట్లతో మరో ముగ్గురు గోల్ఫర్లతో కలిసి సంయుక్తంగా 14వ స్థానంలో ఉన్నారు. -
టీమిండియా ఓపెనర్ గా అభిషేక్ శర్మ..
-
కుర్రాళ్లు నిలవలేకపోయారు...
ఐపీఎల్ అనుభవంతో జింబాబ్వే గడ్డపై అడుగు పెట్టిన భారత యువ బృందం అంతర్జాతీయ వేదికపై ఆ మెరుపులు చూపించలేకపోయింది. తమతో పోలిస్తే టి20 క్రికెట్లో తక్కువ అనుభవం ఉన్న బలహీన ప్రత్యర్థిని నిలువరించడంలో విఫలమైంది. తమ ప్రధాన ఆటగాళ్లతో బరిలోకి దిగిన జింబాబ్వే ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాపై విజయాన్ని నమోదు చేసింది. తక్కువ స్కోర్ల మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతో సొంత అభిమానుల్లో ఆనందం పంచింది. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన టీమ్‌లోని ఒక్క ఆటగాడు కూడా ఈ మ్యాచ్‌లో ఆడకపోయినా... అధికారిక రికార్డుల ప్రకారం వరల్డ్ చాంపియన్ అయిన తర్వాత భారత్‌కు ఇది ఓటమి! హరారే: సొంత గడ్డపై ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. శనివారం జరిగిన పోరులో జింబాబ్వే 13 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. క్లైవ్ మదాందె (25 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా...మైర్స్ (23), బెన్నెట్ (22), మదివెరె (21) స్కోరులో తలా ఓ చేయి వేశారు. రవి బిష్ణోయ్ (4/13) అంతర్జాతీయ టి20ల్లో తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేయగా, సుందర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుబ్‌మన్ గిల్ (29 బంతుల్లో 31; 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (3/25), చటారా చెరో 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. రెండో టి20 నేడు ఇక్కడే జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. రవి బిష్ణోయ్‌కు 4 వికెట్లు... రెండో ఓవర్లోనే కయా (0) అవుటైనా...ఖలీల్ ఓవర్లో 4 ఫోర్లతో జింబాబ్వే బ్యాటర్లు 17 పరుగులు రాబట్టారు. అయితే ఆ తర్వాత ఈ జోరుకు బ్రేక్ పడింది. బిష్ణోయ్ తన తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లతో జింబాబ్వేను దెబ్బ తీశాడు. 10 ఓవర్లలో స్కోరు 69/3కి చేరింది. ఆ తర్వాత ఒకే స్కోరు వద్ద రెండు వికెట్లు కోల్పోయిన జట్టు 74/5 వద్ద నిలిచింది. కొద్ది సేపటికే సుందర్ కూడా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని పూర్తిగా నిలువరించాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన బిష్ణోయ్ కూడా మరో 2 వికెట్లు పడగొట్టడంతో జింబాబ్వే 100 లోపే ఆలౌట్ అయ్యేలా అనిపించింది. అయితే చటారా, మదాందె కలిసి తర్వాతి 27 బంతులను జాగ్రత్తగా ఆడి అభేద్యంగా 25 పరుగులు జోడించారు. 90/9 నుంచి స్కోరు 115 వరకు చేరింది. మ్యాచ్ తుది ఫలితంతో ఈ చివరి పరుగులే కీలకంగా మారాయి. టపటపా... తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (0) నాలుగు బంతులు ఆడితే, రియాన్ పరాగ్ (2) ఆట మూడు బంతుల్లో ముగిసింది. రుతురాజ్ (7) విఫలం కాగా, రింకూ సింగ్ (0) పేలవంగా నిష్క్రమించాడు. దాంతో స్కోరు 22/4. మరో అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురేల్ (6) విఫలం కావడంతో 9.5 ఓవర్లలో సగం టీమ్ పెవిలియన్‌కు! ఇదీ భారత జట్టు పరిస్థితి. మరో వైపు జాగ్రత్తగా ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. అయితే రజా బౌలింగ్‌లో అతను వెనుదిరగడంతో 47/6 వద్ద భారత్ ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో సుందర్ పోరాడినా లాభం లేకపోయింది. ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా 5 బంతుల్లో 2 పరుగులే చేసిన జట్టు చివరి వికెట్ కోల్పోయింది. స్కోరు వివరాలు: జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెరె (బి) బిష్ణోయ్ 21; కయా (బి) ముకేశ్ 0; బెన్నెట్ (బి) బిష్ణోయ్ 22; రజా (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 17; మయర్స్ (సి) అండ్ (బి) సుందర్ 23; క్యాంప్‌బెల్ (రనౌట్) 0; మదాందె (నాటౌట్) 29; మసకద్జ (స్టంప్డ్) జురేల్ (బి) సుందర్ 0; జాంగ్వే (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 1; ముజరబాని (బి) బిష్ణోయ్ 0; చటారా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–6, 2–40, 3–51, 4–74, 5–74, 6–89, 7–89, 8–90, 9–90. బౌలింగ్: ఖలీల్ 3–0–28–0, ముకేశ్ 3–0–16–1, రవి బిష్ణోయ్ 4–2–13–4, అభిõÙక్ 2–0–17–0, అవేశ్ 4–0–29–1, సుందర్ 4–0–11–2. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) మసకద్జ (బి) బెన్నెట్ 0; గిల్ (బి) రజా 31; రుతురాజ్ (సి) కయా (బి) ముజరబాని 7; పరాగ్ (సి) (సబ్) మవుతా (బి) చటారా 2; రింకూ సింగ్ (సి) బెన్నెట్ (బి) చటారా 0; జురేల్ (సి) మదెవెరె (బి) జాంగ్వే 6; సుందర్ (సి) ముజరబాని (బి) చటారా 27; బిష్ణోయ్ (ఎల్బీ) (బి) రజా 9; అవేశ్ (సి) రజా (బి) మసకద్జా 16; ముకేశ్ (బి) రజా 0; ఖలీల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 102. వికెట్ల పతనం: 1–0, 2–15, 3–22, 4–22, 5–43, 6–47, 7–61, 8–84, 9–86, 10–102. బౌలింగ్: బెన్నెట్ 1–1–0–1, మసకద్జ 3–0–15–1, చటారా 3.5–1–16–3, ముజరబాని 4–0–17–1, జాంగ్వే 4–0–28–1, రజా 4–0–25–3. -
భారత్ కు చేరుకున్న వరల్డ్ కప్ ఛాంపియన్స్.. ఘన స్వాగతం
-
భారత ఆర్చరీ జట్లకు టాప్ సీడింగ్
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీ కాంపౌండ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లకు టాప్ సీడింగ్ లభించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో ఆసియా క్రీడల చాంపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి, పర్ణిత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు 2100 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఫలితంగా టీమ్ విభాగంలో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. జ్యోతి సురేఖ 705 పాయింట్లతో రెండో స్థానంలో, అదితి 699 పాయింట్లతో 10వ స్థానంలో, పరీ్ణత్ 696 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. ప్రియాంశ్ (710 పాయింట్లు), అభిషేక్ వర్మ (710 పాయింట్లు), ప్రథమేశ్ (705 పాయింట్లు) లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు క్వాలిఫయింగ్ రౌండ్లో 2125 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
సూపర్ కపుల్: కనులు కనులను దోచాయంటే అంటున్న తుషార్- నభా.. ఫొటోలు
-
Paris Olympics 2024: ఒలింపిక్స్‌కు ఇషా సింగ్
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే భారత రైఫిల్, పిస్టల్ షూటింగ్ జట్టును మంగళవారం ప్రకటించారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 15 మంది షూటర్లు విశ్వ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో పోటీపడనుంది. గత ఆసియా క్రీడల్లో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 19 ఏళ్ల ఇషా సింగ్ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు గెలిచింది.ఇటీవల నిర్వహించిన ట్రయల్స్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఈ బృందాన్ని ఎంపిక చేశారు. షూటింగ్ క్రీడాంశంలో అందుబాటులో ఉన్న 24 బెర్త్‌లకుగాను భారత షూటర్లు 21 బెర్త్‌లు గెల్చుకున్నారు. షాట్‌గన్ విభాగంలో పాల్గొనే భారత జట్టును జూన్ 18న ఇటలీలో ప్రపంచకప్ ముగిశాక ప్రకటిస్తారు. చదవండి: 5000 మీటర్లలో గుల్వీర్ కొత్త జాతీయ రికార్డు -
భారత్ తరఫున చివరిసారి బరిలోకి సునీల్ ఛెత్రి... నేడు కువైట్‌తో భారత్ పోరు
ప్రపంచకప్ 2026 ఫుట్‌బాల్ టోర్నీ రెండో రౌండ్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నేడు కువైట్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మూడో రౌండ్‌కు అర్హత పొందే అవకాశాలు మెరుగవుతాయి. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి జరగనున్న ఈ మ్యాచ్ భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్లో చివరి మ్యాచ్ కానుంది. 2005లో తొలిసారి భారత సీనియర్ జట్టుకు ఆడిన 39 ఏళ్ల ఛెత్రి ఇప్పటి వరకు 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 94 గోల్స్ సాధించాడు. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్‌ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్‌ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఆసియా క్వాలిఫయర్స్ గ్రూప్ ‘ఎ’లో ప్రస్తుతం ఖతర్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, అఫ్గానిస్తాన్ జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. -
ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
బాలీవుడ్ దిగ్గజ లెజండరీ గాయని లతా మంగేష్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన మధురమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు గొప్ప క్రికెట్ అభిమాని కూడా. భారతదేశం ప్రపంచ క్రికెట్లో సూపర్ పవర్‌గా లేని రోజల్లో అనూహ్యంగా టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలుచుకుని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఆ ఘట్టం చరిత్రలో మర్చిపోని గొప్ప రోజు. అయితే ఆ రోజుల్లో బీసీసీఐ వద్ద సరిపడ నిధులు కూడా లేవు. ఇంతటి ఘన విజయం అందించిన ఆటగాళ్లుకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. ఆ టైంలో మన క్రికెటర్లను సత్కరించేందుకు తన వంతుగా మద్దతు ఇస్తూ ఏం చేశారో తెలుసా..!జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఆ రోజును ఎవరు మర్చిపోలేరు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ నిలిచి అందరికి షాక్ ఇచ్చింది. ఆ రోజు చిరస్మరణీయమైనది, ప్రత్యేకమైనది. భారత్‌లో క్రికెట్ ఉన్నంత కాలం ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేం. కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలో టీమిండియా తొలి ప్రపంచకప్ గెలిచి ఇప్పటికీ 40 ఏళ్లు. జూన్ 25, 1983న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్(World Cup) సాధించి మంచి ఊపుమీద ఉన్న వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 43 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచే భారత క్రికెట్లో కొత్త శకం మొదలైంది. ఈ వన్డే ప్రపంచకప్ గెలవడానికి ముందు, టీమ్ ఇండియా 1975 మరియు 1979 ప్రపంచకప్‌లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీల్లో భారత్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ రెండు టోర్నీల్లో వెస్టిండీస్(West Indies) ఛాంపియన్‌గా నిలిచింది. అయితే హ్యాట్రిక్ విజయంపై ఆశలు పెట్టుకున్న వెస్టిండీస్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. నిజానికి భారత్ లీగ్‌లోనే స్వదేశానికి చేరుకుంటారనేది అందరి ఊహగానాలు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ..ఈ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలిచి తొలి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. ఆ ఏడాది ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్(World Cup Final) జరిగింది. తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. కానీ ఆశించినంత స్థాయిలో స్కోర్ చేయలేదు. కేవలం 54.4 ఓవర్లలో 183 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్‌కు ఈ లక్ష్యం పెద్దది కాదు. మంచి మంచి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే బౌలర్లు మదన్ లాల్, మొహిందర్ అమర్నాథ్ ధాటికి విండీస్ 140 పరుగులకే ఆలౌటైంది. భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయి సంబరాలు చేసుకుంది. ఈ ఘన విజయంతో భారత్‌లో యువత ఆసక్తి క్రికెట్ వైపు మళ్లింది. అభిమానుల సంఖ్య పెరిగింది. గల్లీ గల్లీలో క్రికెట్ ఆడేంతగా ఆ ఆటపైక్రేజ్ పెరిగిపోయింది. అయితే అప్పట్లో బీసీసీ వద్ద నిధులు లేవు. కనీసం భారత్‌కి ఇంత ఘన కీర్తిని తెచ్చిపెట్టిన ఆటగాళ్లను సత్కరించేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులు లేవు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్‌కేపీ సాల్వే, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రాజ్‌సింగ్ దుంగార్పూర్లు లతా మంగేష్కర్‌ను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పారు. అందుకు మద్దుతు ఇవ్వడంతో దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో లతా మంగేష్కర్ కచేరిని ఏర్పాటు చేసి ఫండింగ్‌ని కలెక్ట్ చేశారు. ఈ కచేరీ ద్వారా అప్పట్లో దాదాపు రూ. 20 లక్షలు దాక నిధులను బీసీసీఐ సేకరించింది. జీవితకాల పాస్..ఆ మొత్తం నుంచి 14 మంది ఆటగాళ్లకు వారి అత్యుత్తమ ప్రదర్శనకు గానూ ప్రోత్సాహకంగా రూ. 1 లక్ష చొప్పున అందించారు. ఇక సంగీత కచేరి కోసం లతా మంగేష్కర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సమయంలో తమకు సహాయం చేసిన లతా మంగేష్కర్‌కు బీసీసీఐ పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా భారత క్రికెట్ జట్టు మ్యాచ్ జరుగుతున్నా.. లతా మంగేష్కర్ చూసేందుకు ఉచిత పాస్ అందించారు. అంటే జీవితకాల పాస్ అన్నమాట. ఆమె జీవితకాలం ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆమె ఉచితంగా చూడొచ్చు. కానీ ఆమె ఎప్పుడూ ఆ పాస్ ఉపయోగించలేదు. కానీ బీసీసీఐ మాత్రం ఆమె సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. లతా మంగేష్కర్ గౌరవ సూచకంగా భారతదేశంలో ఆడే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌కు బోర్డ్ ఎప్పుడూ రెండూ టికెట్లను లతా మంగేష్కర్ కోసం రిజర్వు చేసింది. ముఖ్యంగా ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ బృందం కోసం లతా మంగేష్కర్ సోదరుడు పండిట్ హృద్యనాథ్ ప్రత్యకంగా ఓ పాటే రాయడం విశేషం.ఇలాంటి వాళ్లు తమ కళతోనే గొప్పగొప్ప సేవకార్యక్రమాలు చేసి చరిత్రలో నిలిచిపోవడమే గాక భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా ఉంటారు.(చదవండి: యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్‌గా ప్రమాణ స్వీకారం..!) -
మెరిసిన షఫాలీ: భారత్‌దే టి20 సిరీస్
సిల్హెట్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే టి20 సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఓపెనర్ దిలారా అక్తర్ (27 బంతుల్లో 39; 5 ఫోర్లు), కెప్టెన్ నిగర్ సుల్తానా (36 బంతుల్లో 28; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ (2/22), శ్రేయాంక (1/25), రేణుక (1/25), పూజ (1/26) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 18.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (38 బంతుల్లో 51; 8 ఫోర్లు), స్మృతి మంధాన (42 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో విజయం మరింత సులువైంది. ఈ నెల 6న నాలుగో టి20 కూడా ఇదే వేదికపై జరుగనుంది. -
క్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసిన భారత్ పోరు
చెంగ్డూ: థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–3తో 10 సార్లు చాంపియన్ చైనా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ 21–15, 11–21, 14–21తో షి యుకి చేతిలో... రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 15–21, 21–11, 12–21తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 13–21, 21–8, 21–14తో లి షి ఫెంగ్‌పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్‌లో సాయిప్రతీక్–ధ్రువ్ కపిల 10–21, 10–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత పరాజయం ఖరారైంది. ఉబెర్ కప్ మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్లో ద్వితీయ శ్రేణి క్రీడాకారిణులతో బరిలోకి దిగిన భారత జట్టు 0–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో అషి్మత 10–21, 22–20, 15–21తో అయా ఒహోరి చేతిలో... ప్రియ–శ్రుతి మిశ్రా 8–21, 9–21తో నామి మత్సుయామ–చిహారు షిదా చేతిలో... ఇషారాణి 15–21, 12–21తో ఒకుహారా చేతిలో ఓడిపోయారు. -
India T20 WC Squad: ప్రపంచకప్ వేటకు సిద్ధం
టి20 ప్రపంచకప్ సమరాన్ని గెలిచేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరోసారి అనుభవాన్నే నమ్ముకుంది. ఐపీఎల్లో అద్భుత బ్యాటింగ్‌తో కొందరు కుర్రాళ్లు అదరగొడుతున్నా... సీనియర్లకు ప్రాధాన్యతనిచ్చింది. దీంతో పాటు ప్రస్తుతం ఫామ్ గొప్పగా లేకున్నా... అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇప్పటికే ఎంతో కొంత ప్రభావం చూపించిన వారిపైనే కమిటీ విశ్వాసం ఉంచింది. గత టి20 వరల్డ్ కప్‌లో ఆడిన 9 మందికి ఈసారి మళ్లీ అవకాశం కర్నీచింది. అందుకే వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్ దాదాపుగా అంచనాలకు తగినట్లుగానే సాగింది. ఒకరిద్దరు ఆటగాళ్ల ఎంపిక విషయంలో కాస్త ఆశ్చర్యకర నిర్ణయాలు కనిపించినా... మొత్తంగా అర్హత కలిగిన వారికే అమెరికా–వెస్టిండీస్ వీసా లభించింది. గత వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత పూర్తిగా కుర్రాళ్లతో టి20ల్లో బోర్డు కొత్త ప్రయోగాలు చేసినా... తర్వాతి మెగా టోర్నీకి వచ్చేసరికి మళ్లీ తమ పాత ప్రణాళికకే కట్టుబడటం చెప్పుకోదగ్గ అంశం. అహ్మదాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 9వ టి20 ప్రపంచకప్ కోసం భారత సెలక్టర్లు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బోర్డు సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశమై ఆటగాళ్లను ఎంపిక చేసింది. రోహిత్ శర్మ వరుసగా రెండో టి20 ప్రపంచకప్‌లో కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనుండగా... 2022లో ఆ్రస్టేలియా గడ్డపై టి20 వరల్డ్ కప్‌లో ఆడిన వారిలో 9 మంది ఈసారీ టీమిండియా చాన్స్ దక్కించుకున్నారు. గత టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. సెలక్టర్లు ప్రకటించిన జట్టులో నలుగురు బ్యాటర్లు, ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు, ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. మరో నలుగురు ఆటగాళ్లను ‘రిజర్వ్’లుగా కూడా ఎంపిక చేశారు. జూన్ 1 నుంచి 29 వరకు జరిగే వరల్డ్ కప్‌లో గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్ జూన్ 5న తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది.ఆ తర్వాత జూన్ 9, 12, 15 తేదీల్లో వరుసగా పాకిస్తాన్, అమెరికా, కెనడా జట్లను టీమిండియా ఎదుర్కొంటుంది. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ చేరని జట్ల ఆటగాళ్లతో కూడిన మొదటి బృందం ఈ నెల 21న ముందుగా కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు అమెరికాకు బయల్దేరుతుంది. జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్ ), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ సామ్సన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్‡్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. రిజర్వ్ ఆటగాళ్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్. ఐపీఎల్ ప్రదర్శనతోనే... జట్టు ఎంపికలో తాజా ఐపీఎల్ ప్రదర్శనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారా అంటే అవునని, కాదని కూడా సమాధానం వస్తుంది. చెన్నై తరఫున మిడిలార్డర్లో సిక్సర్లతో చెలరేగిపోతున్న శివమ్ దూబేకు ఐపీఎల్ కారణంగానే పిలుపు దక్కింది. ఈ టోర్నీలో అతను ఏకంగా 172.41 స్ట్రయిక్‌రేట్‌తో 350 పరుగులు సాధించాడు. భారత్‌కు ఆడిన 21 టి20ల్లో కూడా అతను ఆకట్టుకున్నాడు. ఇక కారు ప్రమాదం నుంచి కోలుకొని ఐపీఎల్లో రాణిస్తున్న రిషభ్ పంత్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. లీగ్‌లో అతను 158.58 స్ట్రయిక్‌రేట్‌తో 398 పరుగులు చేశాడు. అయితే పరుగులకంటే పూర్తి ఫిట్‌గా పంత్ కనిపించడం కూడా సానుకూలాంశంగా మారింది. మరోవైపు రెండో వికెట్ కీపర్‌గా కేరళకు చెందిన సంజూ సామ్సన్ కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా రాజస్తాన్ రాయల్స్ టీమ్‌ను సమర్థంగా నడిపించడంతో పాటు 161.08 స్ట్రయిక్‌రేట్‌తో సామ్సన్ 385 పరుగులు సాధించాడు. ఎవరు... ఎందుకు... ఎలా? 2022 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన ఆడిన జట్టుతో పోలిస్తే రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, పంత్, హార్దిక్, అక్షర్, అర్‡్షదీప్, చహల్, బుమ్రా (టోర్నీకి ముందు గాయంతో తప్పుకున్నాడు) తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. 2021, 2022లో వరల్డ్ కప్‌లలో ఆడిన జట్టులో దాదాపు అదే టాప్–6 ఇప్పుడు కూడా మళ్లీ ఎంపికయ్యారు. కేఎల్ రాహుల్ స్థానంలో యశస్వి రావడం మినహా ఎలాంటి మార్పూ లేదు. యశస్వి ఈ సీజన్ ఐపీఎల్లో వరుస వైఫల్యాల తర్వాత సెంచరీతో ఆకట్టుకోవడంతో అతనికి అవకాశం దక్కింది. బ్యాటింగ్‌లో ఇప్పుడు కావాల్సిన ‘ఫైర్’ లేదని ఎన్ని విమర్శలు వస్తున్నా అగ్రశ్రేణి బ్యాటర్లుగా రోహిత్, కోహ్లిల స్థానం ఎప్పుడూ ప్రశ్నార్ధకం కాదు. సూర్యకుమార్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. రవీంద్ర జడేజా కూడా గొప్ప ప్రదర్శన చేయకపోయినా ఆల్‌రౌండ్ నైపుణ్యం అతనికి కలిసొచ్చింది. జడేజా ఉన్న తర్వాత అక్షర్ పటేల్ ఎంపిక కూడా కాస్త ఆశ్చర్యకరమే. హార్దిక్ మళ్లీ... ఇటీవల ఆటలో వైఫల్యాలతో పాటు ముంబై కెప్టెన్సీ వ్యవహారాలతో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకు సెలక్టర్లు మాత్రం అండగా నిలిచారు. వన్డే వరల్డ్ కప్‌లో గాయపడి కోలుకున్న తర్వాత భారత్‌కు ఆడకపోయినా అతనిపై నమ్మకముంచారు. ఐపీఎల్‌లోనూ విఫలమైనా... అతని తరహాలో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్థానం కోసం ప్రత్యామ్నాయం లేక ఎంపిక చేయక తప్పలేదు. దూబే అస్సలు బౌలింగ్ చేయకపోవడం, హార్దిక్ ఎన్నో కొన్ని ఓవర్లు వేస్తుండటం వల్ల కూడా అతని స్థానానికి ఢోకా లేకుండా పోయింది. నలుగురు స్పిన్నర్లతో... అమెరికాలో తొలిసారి వరల్డ్ కప్ జరుగుతుండంతో కొత్తగా అక్కడ తయారు చేస్తున్న పిచ్‌లు ఎలా ఉంటాయో సరిగ్గా ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. అయితే స్పిన్‌కు అవకాశం ఉంటే తమ అన్ని అస్త్రాలను వాడుకునేందుకు భారత్ సిద్ధమైంది. జడేజా, అక్షర్‌లతో పాటు కుల్దీప్, యుజువేంద్ర చహల్‌లు జట్టులో ఉన్నారు. కుల్దీప్ చాలా కాలంగా మంచి ఫామ్‌లో ఉండగా... గత రెండు సిరీస్‌లలో భారత జట్టులో చోటు దక్కించుకోని చహల్ పునరాగమనం చేసి తొలిసారి టి20 వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు వీరిని వాడుకోవచ్చు. బుమ్రాకు తోడుగా అర్‡్షదీప్, సిరాజ్‌లను ఎంపిక చేశారు. ఈ ఫార్మాట్లో గొప్ప ప్రదర్శన లేకపోయినా, ఐపీఎల్‌లోనూ పెద్దగా రాణించలేకపోతున్నా... ప్రస్తుత స్థితిలో అనుభవం ఉన్న పేసర్ అతనే కావడంతో సిరాజ్‌కు తొలిసారి టి20 ప్రపంచకప్ ఆడే చాన్స్ లభించింది. లెఫ్టార్మ్ పేసర్ కావడమే అర్‡్షదీప్ బలం. కొంత కాలంగా లయ కోల్పోయి ఇబ్బంది పడుతున్నా అర్‡్షదీప్‌ను సెలక్టర్లు మళ్లీ నమ్మారు. గత వరల్డ్ కప్‌లో సెమీస్ ఓటమి తర్వాత మళ్లీ అంతర్జాతీయ టి20 ఆడని రాహుల్‌ను తప్పించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతని స్ట్రయిక్‌రేట్ కూడా అంతంత మాత్రమే. రాహుల్ తరహాలోనే శుబ్‌మన్ గిల్ కూడా ఈ ఫార్మాట్లో పెద్దగా ప్రభావం చూపించింది లేదు. పాపం రింకూ సింగ్... వరల్డ్ కప్ జట్టు ఎంపికలో అన్ని రకాలుగా చర్చకు దారి తీసిన విషయం రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడం. విధ్వంసకర బ్యాటింగ్‌తో గత ఏడాది ఐపీఎల్ నుంచి అతను తానేంటో నిరూపించుకున్నాడు. లోయర్ మిడిలార్డర్లో ఫినిషర్‌గా సత్తా చాటాడు.భారత్ తరఫున లభించిన పరిమిత అవకాశాల్లో (11 ఇన్నింగ్స్‌లు) ఏకంగా 176.23 స్ట్రయిక్ రేట్, 89 సగటుతో పరుగులు సాధించాడు. కానీ చివరకు వచ్చేసరికి అతనికి వరల్డ్ కప్ చాన్స్ లభించలేదు. ఈసారి ఐపీఎల్లో గొప్పగా ఆడకపోవడం వాస్తవమే అయినా కోల్‌కతా టాపార్డర్ రాణిస్తుండటంతో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. 9 మ్యాచ్‌లలో కేవలం 82 బంతులే ఆడే చాన్స్ దక్కింది. మిడిలార్డర్లో భారీ షాట్లు కొట్టే సామర్థ్యం ఉన్న బ్యాటర్ కోసం జరిగిన చర్చలో రింకూపై దూబేదే పైచేయి అయింది. ఒకవేళ తుది జట్టులో హార్దిక్‌ను తప్పించాల్సి వచ్చినా... దూబే బౌలింగ్ ఎంతో కొంత ఉపయోగపడగలదని సెలక్టర్లు భావించారు. రోహిత్ శర్మవయసు: 37 ఆడిన టి20లు: 151 చేసిన పరుగులు: 3974 అత్యధిక స్కోరు: 121 నాటౌట్ సెంచరీలు: 5 అర్ధ సెంచరీలు: 29 స్ట్రయిక్‌రేట్: 139.97 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 8 విరాట్ కోహ్లి వయసు: 35 ఆడిన టి20లు: 117 చేసిన పరుగులు: 4037 అత్యధిక స్కోరు: 122 నాటౌట్ సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 37 స్ట్రయిక్‌రేట్: 138.15 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 5సూర్యకుమార్వయసు: 33 ఆడిన టి20లు: 60 చేసిన పరుగులు: 2141 అత్యధిక స్కోరు: 117 సెంచరీలు: 4 అర్ధ సెంచరీలు: 17 స్ట్రయిక్‌రేట్: 171.55 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 2 హార్దిక్ పాండ్యా వయసు: 30 ఆడిన టి20లు: 92 చేసిన పరుగులు: 1348 అత్యధిక స్కోరు: 71 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 స్ట్రయిక్‌రేట్: 139.88 తీసిన వికెట్లు: 73 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 3 రిషభ్ పంత్ వయసు: 26 ఆడిన టి20లు: 66 చేసిన పరుగులు: 987 అత్యధిక స్కోరు: 65 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 స్ట్రయిక్‌రేట్: 126.37 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 2 శివమ్ దూబే వయసు: 30 ఆడిన టి20లు: 21 చేసిన పరుగులు: 276 అత్యధిక స్కోరు: 63 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 తీసిన వికెట్లు: 8 స్ట్రయిక్‌రేట్: 145.26 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ అర్‡్షదీప్ సింగ్వయసు: 25 ఆడిన టి20లు: 44 తీసిన వికెట్లు: 62 ఉత్తమ బౌలింగ్: 4/37 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 1 యుజువేంద్ర చహల్ వయసు: 33 ఆడిన టి20లు: 80 తీసిన వికెట్లు: 96 ఉత్తమ బౌలింగ్: 6/25 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ కుల్దీప్ యాదవ్ వయసు: 29 ఆడిన టి20లు: 35 తీసిన వికెట్లు: 59 ఉత్తమ బౌలింగ్: 5/17 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ రవీంద్ర జడేజావయసు: 35 ఆడిన టి20లు: 66 చేసిన పరుగులు: 480 అత్యధిక స్కోరు: 46 నాటౌట్ స్ట్రయిక్‌రేట్: 125.32 తీసిన వికెట్లు: 53 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 5 సంజూ సామ్సన్ యశస్వి జైస్వాల్ వయసు: 22 ఆడిన టి20లు: 17 చేసిన పరుగులు: 502 అత్యధిక స్కోరు: 100 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 4 స్ట్రయిక్‌రేట్: 161.93 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ జస్ప్రీత్ బుమ్రావయసు: 30 ఆడిన టి20లు: 62 తీసిన వికెట్లు: 74 ఉత్తమ బౌలింగ్: 3/11 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 2 మొహమ్మద్ సిరాజ్ వయసు: 30 ఆడిన టి20లు: 10 తీసిన వికెట్లు: 12 ఉత్తమ బౌలింగ్: 4/17 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ అక్షర్ పటేల్ వయసు: 30; ఆడిన టి20లు: 52 చేసిన పరుగులు: 361 తీసిన వికెట్లు: 49ఉత్తమ బౌలింగ్: 3/9 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ -
అమిత్‌కు పిలుపు హుసాముద్దీన్‌పై వేటు
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ వరల్డ్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ చివరి టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. గత నెలలో జరిగిన తొలి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు తొమ్మిది కేటగిరీల్లో బరిలోకి దిగినా ఒక్కరు కూడా ఒలింపిక్స్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయారు. తొలి టోర్నీలో పాల్గొన్న ఐదుగురు బాక్సర్లపై (దీపక్ భోరియా, హుసాముద్దీన్, శివ థాపా, లక్ష్య చహర్, జాస్మిన్) వేటు పడింది. దీపక్ స్థానంలో 2022 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అమిత్ పంఘాల్కు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కింది. తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ స్థానంలో సచిన్ సివాచ్‌ను ఎంపిక చేశారు. చివరి క్వాలిఫయింగ్ టోర్నీ మే 25 నుంచి జూన్ 2 వరకు బ్యాంకాక్‌లో జరుగుతుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి మహిళల విభాగంలో నలుగురు బాక్సర్లు (నిఖత్ జరీన్, ప్రీతి, పరీ్వన్, లవ్లీనా) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. భారత బాక్సింగ్ జట్టు: పురుషుల విభాగం: అమిత్ పంఘాల్ (51 కేజీలు), సచిన్ సివాచ్ (57 కేజీలు), అభినాష్ జమ్వాల్ (63.5 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), అభిమన్యు (80 కేజీలు), సంజీత్ (92 కేజీలు), నరేందర్ (ప్లస్ 92 కేజీలు). మహిళల విభాగం: అంకుశిత (60 కేజీలు), అరుంధతి (66 కేజీలు). -
మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని భారత్ గెలుపు
చాంగ్షా (చైనా): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు రెండో విజయం సాధించింది. చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1తో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోస్లే 6–3, 6–2తో హావో చింగ్ చాన్‌ను ఓడించింది. రెండో మ్యాచ్ లో అంకిత రైనా 6–2, 4–6, 4–6తో ఎన్ షువో లియాంగ్ చేతిలో ఓటమి పాలైంది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో అంకిత–ప్రార్థన జోడీ 4–6, 6–1, 15–13తో హావో చింగ్ చాన్–ఎన్ షువో లియాంగ్ జంటపై గెలిచి భారత్‌కు విజయాన్ని అందించింది. టైబ్రేక్‌లో అంకిత జోడీ మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. -
విజయమే లక్ష్యంగా...
అభా (సౌదీ అరేబియా): ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నేడు అఫ్గానిస్తాన్‌తో భారత జట్టు తలపడనుంది. తటస్థ వేదిక సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 12:30 నుంచి జరుగుతుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు రెండు మ్యాచ్ లు ఆడింది. ఒక మ్యాచ్‌లో నెగ్గి, ఒక మ్యాచ్‌లో ఓడి మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సునీల్ ఛెత్రి కెప్టెన్సీలో భారత జట్టుకు మరో విజయం లభిస్తే మూడో రౌండ్‌కు అర్హత పొందేందుకు తమ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. అఫ్గానిస్తాన్‌తో ముఖాముఖిగా 11 సార్లు తలపడ్డ భారత్ ఏడుసార్లు గెలిచింది. మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. -
Ind Vs Eng: బంతి గింగిరాలు.. మూడోరోజే ఇంగ్లండ్ కథ ముగిసేనా?
ధర్మశాల టెస్టు మ్యాచ్ రెండో రోజు ఊహించినట్లుగానే అంచనాలకు అనుగుణంగా సాగింది...పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్ ఇంగ్లండ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా శుక్రవారం ఆటలో 338 పరుగులు రాబట్టింది...రోహిత్, గిల్ సెంచరీలు పూర్తి చేసుకొని సగర్వంగా నిలవగా...యువ ఆటగాళ్లు పడిక్కల్, సర్ఫరాజ్ భారీ భాగస్వామ్యంతో తమ వంతు పాత్ర పోషించారు. ఒక దశలో ఒక పరుగు తేడాతో మూడు వికెట్లు కోల్పోయినా దాని ప్రభావం జట్టుపై పడలేదు... ఫలితంగా ఇప్పటికే 255 పరుగుల ఆధిక్యంలో నిలిచిన టీమిండియా విజయానికి కావాల్సిన సరంజామాను సిద్ధం చేసుకుంది. సుదీర్ఘ భారత పర్యటనలో తమ చివరి ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లను ఎదుర్కొని ఇంగ్లండ్ ఏమాత్రం పోరాటపటిమ కనబరుస్తుందనేది చూడాలి. ఒకవేళ భారత స్పిన్నర్లు రాణిస్తే మూడోరోజు భారత్ ఘన విజయం సాధించే అవకాశం కూడా ఉంది. ధర్మశాల: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 4–1తో ముగించే దిశగా భారత జట్టు వేగంగా దూసుకుపోతోంది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (150 బంతుల్లో 110; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు), రోహిత్ శర్మ (162 బంతుల్లో 103; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 171 పరుగులు జోడించారు. దేవ్‌దత్ పడిక్కల్ (103 బంతుల్లో 65; 10 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (60 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 97 పరుగులు జత చేయడం విశేషం. శతకాలు పూర్తి... రెండో రోజు ఆటను రోహిత్, గిల్ బౌండరీలతో దూకుడుగా మొదలు పెట్టారు. వీరిని నిలువరించేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. 68 పరుగుల వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను క్రాలీ వదిలేయడం భారత్‌కు కలిసి రాగా, 64 బంతుల్లో గిల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ముఖ్యంగా వుడ్, బషీర్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ధారాళంగా పరుగులు రాబట్టారు. ఇదే జోరును కొనసాగిస్తూ మూడు బంతుల వ్యవధిలో ఇద్దరూ శతకాలు పూర్తి చేసుకున్నారు. 154 బంతుల్లో రోహిత్ 12వ టెస్టు సెంచరీ రాగా, 137 బంతుల్లో గిల్ నాలుగో సెంచరీని అందుకున్నాడు. తొలి సెషన్లో భారత్ 30 ఓవర్లలో 129 పరుగులు చేయగా, ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. అయితే లంచ్ తర్వాత వరుస ఓవర్లలో వీరిద్దరు వెనుదిరిగారు. గత జూన్ తర్వాత తొలి సారి బౌలింగ్‌కు దిగిన స్టోక్స్ తన మొదటి బంతికే రోహిత్‌ను బౌల్డ్ చేయగా, తర్వాతి ఓవర్లో గిల్‌ను మరో చక్కటి బంతితో అండర్సన్ బౌల్డ్ చేశాడు. కుర్రాళ్ల జోరు... మూడో వికెట్‌గా గిల్ అవుటైన సమయంలో భారత్ ఆధిక్యం 61 పరుగులు మాత్రమే! రెండు కీలక వికెట్లు తీసి ఒత్తిడి పెంచేందుకు ఇంగ్లండ్ సిద్ధం కాగా...భారత యువ బ్యాటర్లు పడిక్కల్, సర్ఫరాజ్ దానిని సమర్థంగా అడ్డుకున్నారు. మూడో టెస్టు ఆడుతున్న సర్ఫరాజ్, అరంగేట్ర బ్యాటర్ పడిక్కల్ భాగస్వామ్యం ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లింది. అండర్సన్ ఓవర్లో మూడు ఫోర్లతో ధాటిని చూపిన పడిక్కల్ తొలి 30 పరుగుల్లో 7 ఫోర్లు ఉండటం విశేషం. మరో వైపు ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన సర్ఫరాజ్ ఆ తర్వాత జోరు పెంచాడు. వుడ్ బౌలింగ్‌లో అతను కొట్టిన 3 ఫోర్లు, సిక్స్ హైలైట్‌గా నిలిచాయి. బషీర్ ఓవర్లో 2 ఫోర్లతో సర్ఫరాజ్ 55 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో సెషన్లో భారత్ 24 ఓవర్లలో 112 పరుగులు రాబట్టింది. అయితే టీ విరామం తర్వాత తొలి బంతికే సర్ఫరాజ్ వెనుదిరిగాడు. అనంతరం 83 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్న పడిక్కల్ కూడా కొద్దిసేపటికే పెవిలియన్ చేరాడు. జురేల్ (15) ప్రభావం చూపలేకపోగా...హార్ట్లీ ఒకే ఓవ ర్లో జడేజా (15), అశ్విన్ (0)లను వెనక్కి పంపాడు. ఈ దశలో కుల్దీప్ (27 బ్యాటింగ్) పట్టుదల కనబర్చగా, బుమ్రా (19 బ్యాటింగ్) అండగా నిలిచాడు. వీరిద్దరు 18 ఓవర్ల పాటు మరో వికెట్ పడకుండా ఆటను ముగించారు. మూడోరోజు ఆటలో బంతే కీలకం.. భారత జట్టు ఇప్పటికే పటిష్ట స్థితిలో ఉంది. ఇక, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా భారత స్పిన్నర్లు చెలరేగితే నేడే దాదాపు భారత్ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొదటిరోజే కుల్దీప్, అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసింది భారత జట్టు. అదే విధంగా మూడో రోజు కూడా పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే మన బౌలర్లు తప్పకుండా సత్తా చాటుతారు. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 218; భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (స్టంప్డ్) ఫోక్స్ (బి) బషీర్ 57; రోహిత్ (బి) స్టోక్స్ 103; గిల్ (బి) అండర్సన్ 110; పడిక్కల్ (బి) బషీర్ 65; సర్ఫరాజ్ (సి) రూట్ (బి) బషీర్ 56; జడేజా (ఎల్బీ) (బి) హార్ట్లీ 15; జురేల్ (సి) డకెట్ (బి) బషీర్ 15; అశ్విన్ (బి) హార్ట్లీ 0; కుల్దీప్ (బ్యాటింగ్) 27; బుమ్రా (బ్యాటింగ్) 19; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (120 ఓవర్లలో 8 వికెట్లకు) 473. వికెట్ల పతనం: 1–104, 2–275, 3–279, 4–376, 5–403, 6–427, 7–427, 8–428. బౌలింగ్: అండర్సన్ 14–1–59–1, వుడ్ 15–1–89–0, హార్ట్లీ 39–3–126–2, బషీర్ 44–5–170–4, స్టోక్స్ 5–1–17–1, రూట్ 3–0–8–0. -
ప్రిక్వార్టర్స్‌లో భారత జట్ల ఓటమి
బుసాన్: పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారు కావడానికి అవసరమైన విజయాన్ని భారత మహిళల, పురుషుల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లు సాధించలేకపోయాయి. పటిష్ట జట్లతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత జట్లు ఓడిపోయి ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించాయి. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు 1–3తో చైనీస్ తైపీ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 0–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయాయి. అంతకుముందు జరిగిన నాకౌట్ దశ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 3–0తో ఇటలీపై... భారత పురుషుల జట్టు 3–2తో కజకిస్తాన్‌పై విజయం సాధించాయి. ఈ మెగా ఈవెంట్లో పురుషుల, మహిళల విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ చేరిన 8 జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాయి. మార్చి 5న విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–16లో చోటు సంపాదిస్తే భారత జట్లకు పారిస్ ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. ప్రస్తుతం భారత మహిళల జట్టు 17వ ర్యాంక్‌లో, భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్‌లో ఉన్నాయి. చైనీస్ తైపీతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ మనిక బత్రా 11–8, 8–11, 4–11, 11–9, 11–9తో ప్రపంచ 10వ ర్యాంకర్ చెన్ జు యుపై సంచలన విజయం సాధించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 6–11, 9–11, 5–11తో చెంగ్ ఐ చింగ్ చేతిలో... మూడో మ్యాచ్‌లో ఐహిక ముఖర్జీ 10–12, 13–15, 11–9, 2–11తో లి యు జున్ చేతిలో... నాలుగో మ్యాచ్‌లో మనిక బత్రా 10–12, 11–5, 9–11, 5–11తో చెంగ్ ఐ చింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. కొరియాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 10–12, 11–13, 7–11తో జాంగ్ వూజిన్ చేతిలో... రెండో మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 9–11, 5–11, 11–8, 4–11తో లిమ్ జాంగ్‌హూన్ చేతిలో... మూడో మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 8–11, 2–11తో లీ సాంగ్ హు చేతిలో ఓటమి పాలయ్యారు. -
పేస్ బౌలర్ల ప్రదర్శన వల్లే...
రాంచీ: ఇంగ్లండ్‌తో గత రెండు టెస్టుల్లో భారత జట్టు విజయం సాధించడంలో పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారని జట్టు బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. పిచ్‌లు అనుకూలంగా లేకపోయినా కీలక సమయాల్లో వారు చెలరేగడం వల్లే మ్యాచ్‌లు మనవైపు మొగ్గు చూపాయని అతను అన్నాడు. ఈ సిరీస్‌లో భారత స్పిన్నర్లు తీసిన 36 వికెట్లతో పోలిస్తే పేసర్లు 22 వికెట్లు తీశారు. ‘సాధారణంగా భారత్‌లో దాదాపు అన్ని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తూనే ఉంటాయి. అశ్విన్, జడేజాలు ఎలాగూ ఇక్కడ వికెట్లు తీయగలరు. కానీ మన ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శనే సిరీస్‌లో ఇరు జట్ల మధ్య ప్రధాన తేడాగా మారింది. పరిస్థితులకు తగినట్లుగా స్పందించి పేసర్లు జట్టును ముందంజలో నిలిపారు. నాలుగో టెస్టుకు బుమ్రాలాంటి స్టార్ బౌలర్ దూరం కావడం నిరాశ కలిగించేదే. అయినా ఇతర పేసర్లకూ మంచి అనుభవం ఉంది. సిరాజ్ తీసిన నాలుగు వికెట్ల ప్రదర్శనను మరచిపోవద్దు’ అని గిల్ ప్రశంసించాడు. పలువురు కీలక ఆటగాళ్లు దూరం కావడం వల్ల వచ్చిన అవకాశాలను కొత్త ఆటగాళ్లు సమర్థంగా వాడుకున్నారన్న గిల్... సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్‌లను ఉదాహరణగా చూపించాడు. తనపై తాను పెట్టుకున్న అంచనాల కారణంగానే కొన్నిసార్లు నిరాశను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇప్పుడు వాటిని అధిగమించి భారీ స్కోర్లపై దృష్టి పెట్టినట్లు అతను చెప్పాడు. తొలి టెస్టులో శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయినా భారత జట్టు...ఆ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకొని తర్వాతి రెండు టెస్టుల్లో ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచినట్లు గిల్ గుర్తు చేసుకున్నాడు. -
భారత్‌ను గెలిపించిన శ్రీజేశ్
పురుషుల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఆదివారం భువనేశ్వర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్’లో 4–2తో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్‌కు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో భారత్‌కిది రెండో విజయం. ‘షూటౌట్’లో గోల్‌కీపర్ శ్రీజేశ్ నెదర్లాండ్స్ జట్టు రెండు ప్రయత్నాలను నిలువరించి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. -
కోహ్లి ఆడటం లేదు!
న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి 13 ఏళ్ల టెస్టు కెరీర్లో క్రికెటేతర కారణాలతో తొలిసారి పూర్తిగా ఒక టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. వ్యక్తిగత సమస్యల కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆడని కోహ్లి ఇప్పుడు మిగిలిన మూడు టెస్టులనుంచి కూడా తప్పుకున్నాడు. అతను చివరి మూడు టెస్టులు ఆడటంపై మొదటినుంచీ సందేహంగానే ఉన్నా శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. కోహ్లి సమస్య ఏమిటనేది బయటకు తెలియకపోయినా బోర్డు ఉన్నతాధికారులకు అతని గైర్హాజరుపై స్పష్టత ఉంది. అయితే జట్టును ఎంపిక చేసే ముందు మరోసారి అతనితో మాట్లాడిన తర్వాతే సెలక్టర్లు టీమ్‌ను ప్రకటించారు. రోహిత్ శర్మ నాయకత్వంలో 17 మంది సభ్యుల బృందాన్ని మిగిలిన మూడు టెస్టుల కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. గాయాల కారణంగా వైజాగ్ టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలను జట్టులోకి ఎంపిక చేశారు. అయితే వీరు ఆడటం ఫిట్‌నెస్‌కు లోబడి ఉంటుందని సెలక్టర్లు స్పష్టం చేశారు. రాహుల్ ఇప్పటికే పూర్తిగా కోలుకున్నాడని సమాచారం ఉండగా జడేజా తన సొంత మైదానంలో మ్యాచ్ ఆరంభ సమయానికి కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. వరుస వైఫల్యాలతో... టీమ్ ఎంపికలో కీలక మార్పు శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టడమే. అతను వెన్ను నొప్పితో బాధపడుతూ మూడో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉందని రెండు రోజుల క్రితం వినిపించింది. అయితే అంతర్గత సమాచారం ప్రకారం శ్రేయర్ పూర్తి ఫిట్‌గా సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడని...అతని పేలవ ఫామ్ కారణంగానే వేటు పడినట్లు తెలిసింది. ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో అతను వరుసగా 35, 13, 27, 29 పరుగులు మాత్రమే చేశాడు. స్పిన్‌ను చాలా బాగా ఆడగలడని పేరున్న అయ్యర్ సొంత గడ్డపై ఇలా విఫలం కావడంతో సెలక్టర్లు పక్కన పెట్టక తప్పలేదు. గత 13 ఇన్నింగ్స్‌లలో అతను ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేదు. సిరాజ్ వచ్చేశాడు... పనిభారం కారణంగా గత టెస్టులో విశ్రాంతినిచ్చిన హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. మరో పేసర్ ముకేశ్ కుమార్ కూడా తన స్థానం నిలబెట్టుకున్నాడు. ముగ్గురు పేసర్లు అందుబాటులో ఉన్నా... సెలక్టర్లు మరో పేసర్ ఆకాశ్‌దీప్‌ను ఎంపిక చేశారు. బెంగాల్‌కు చెందిన ఆకాశ్ 29 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 103 వికెట్లు తీశాడు. ఇటీవల దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ఎంపికైనా...మ్యాచ్ అవకాశం రాలేదు. శనివారం ప్రకటించిన జట్టునుంచి అవేశ్, సౌరభ్ కుమార్‌లను తప్పించగా...జురేల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. రాహుల్ మైదానంలోకి దిగినా...అయ్యర్ స్థానంలో వీరిద్దరిలో ఒకరు ఆడటం ఖాయం. భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 15నుంచి రాజ్‌కోట్‌లో, 23నుంచి రాంచీలో, మార్చి 7నుంచి ధర్మశాలలో మూడు, నాలుగు, ఐదు టెస్టులు జరుగుతాయి. జట్టు వివరాలు: రోహిత్ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి, గిల్, రాహుల్, పటిదార్, సర్ఫరాజ్, జురేల్, భరత్, అశ్విన్, జడేజా, అక్షర్, సుందర్, కుల్దీప్, సిరాజ్, ముకేశ్, ఆకాశ్‌దీప్. -
విశాఖ టెస్ట్..భారత్ సిరీస్ సమం చేస్తుందా ?
-
Visakha Test Match: రోహిత్ పైనే భారం
విశాఖ స్పోర్ట్స్: ఒకవైపు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తదితర కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం... మరోవైపు అనుభవంలేని యువ ఆటగాళ్లు... తొలి టెస్టులో ఊహించని పరాజయం... ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టులో భారత ప్రదర్శన ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొని ఉంది. ఈ వేదికపై భారత జట్టు ఇప్పటి వరకు రెండు టెస్టులు ఆడింది. ఆ రెండింటిలోనూ భారత జట్టే గెలిచింది. కోహ్లి కెప్టెన్సీలో 2016 నవంబర్ 17 నుంచి 21 వరకు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 246 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం 2019 అక్టోబర్ 2 నుంచి 6 వరకు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కోహ్లి సారథ్యంలోనే భారత జట్టు 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్రితంసారి ఇక్కడ ఆడిన భారత టెస్టు జట్టు నుంచి కేవలం రోహిత్ , అశ్విన్ మాత్రమే ఈసారి ఆడుతున్నారు. నాటి టెస్టులో రోహిత్ రెండు సెంచరీలతో (తొలి ఇన్నింగ్స్‌లో 176; రెండో ఇన్నింగ్స్‌లో 127) అదరగొట్టాడు. ఫలితంగా బ్యాటింగ్ విషయంలో ఈసారీ రోహిత్ శర్మపైనే అధిక భారం పడనుంది. మరోసారి రోహిత్ మెరిసి... యశస్వి, అయ్యర్ ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తే విశాఖపట్నంలో భారత జట్టు ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంటుంది. సంయమనం అవసరం: కోచ్ రాథోడ్ యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు. ఒకట్రెండు మ్యాచ్‌లతో వారి సత్తాపై అంచనాకు రావొద్దని ఆయన కోరారు. బుధవారం ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. ప్రాక్టీస్ సెషన్ అనంతరం విక్రమ్ రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ప్రస్తుత భారత జట్టులోని శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. వారి విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. వారిపట్ల సంయమనంతో వ్యవహరించాలి. అయ్యర్ త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నా. పిచ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడటం అలవాటు చేసుకోవాలి. పరుగులు చేసేందుకు అవకాశాలు ఉంటే వాటిని సది్వనియోగం చేసుకోవాలి. షాట్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి’ అని రాథోడ్ వ్యాఖ్యానించారు. -
ఇస్లామాబాద్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
ఇస్లామాబాద్: డేవిస్‌కప్ గ్రూప్–1 ప్లేఆఫ్ పోరులో భాగంగా పాకిస్తాన్ జట్టుతో తలపడేందుకు 1964 తర్వాత భారత జట్టు మళ్లీ పాకిస్తాన్లో అడుగు పెట్టింది. రామ్‌కుమార్, శశికుమార్ ముకుంద్, యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ, దిగ్వి జయ్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని భారత బృందంలో ఉన్నారు. చివరిసారిగా భారత్, పాక్‌లు 1964లో పాక్ గడ్డపై పోటీపడ్డాయి. 2019లోనూ పాకిస్తాన్లో భారత జట్టు పర్యటించాల్సి ఉండగా... ఈ మ్యాచ్‌ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) తటస్థ వేదిక కజకిస్తాన్‌కు మార్చింది. ఈ పోరులో భారత్ 4–1తో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈసారి మాత్రం పాకిస్తాన్లో భారత జట్టు ఆడాల్సిందేనని, వేదిక మార్చడం వీలుకాదని ఐటీఎఫ్ స్పష్టం చేసింది. భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెపె్టన్‌రోహిత్ రాజ్‌పాల్ వ్యక్తిగత కారణాలతో పాకిస్తాన్‌కు వెళ్లలేకపోవడంతో జీషాన్ అలీ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. కోచ్‌గా వచ్చిన జీషాన్ నాన్ ప్లేయింగ్ కెపె్టన్‌గానూ వ్యవహరిస్తాడు. -
విజయమే లక్ష్యంగా సిరియాతో బరిలోకి...
ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత జట్టు నేడు జరిగే గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియా జట్టుతో ఆడుతుంది. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను జియో సినియా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌లో సిరియాపై తప్పనిసరిగా నెగ్గాలి. ఇతర గ్రూప్‌ల ఫలితాలు కూడా తమకు అనుకూలించాలని ఆశించాలి. -
స్పిన్ పిచ్లే సిద్ధం చేస్తే...
ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు అన్నీ స్పిన్ పిచ్లే తయారు చేస్తుందని భావించడం లేదని ఆ జట్టు సీనియర్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుతం భారత పేస్ బౌలింగ్ దళం చాలా పటిష్టంగా ఉందని, అన్నీ స్పిన్ పిచ్లే ఉంటే వారి ప్రభావం తగ్గిపోతుందని అతను అన్నాడు. భారత్‌లో జరిగిన గత సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో బెయిర్‌స్టో మూడు సార్లు డకౌటయ్యాడు. ‘సిరీస్‌లో మాకు వేర్వేరు తరహాలో పిచ్‌లు ఎదురవడం ఖాయం. అయితే అన్నీ టర్న్ కాకపోవచ్చు. వారి పేస్ బౌలింగ్ ఇటీవల ఎలా ఉందో మేం చూస్తున్నాం. ఇప్పుడు పేస్ కూడా వారి బలం కాబట్టి తొలి రోజునుంచే టర్న్ అయ్యే పిచ్‌లు తయారు చేయకపోవచ్చు. అయితే ఎలా ఉన్నా పరిస్థితులకు తగినట్లుగా మా బ్యాటింగ్‌ను మార్చుకునేందుకు మేం సిద్ధంగా ఉండాలి. అశ్విన్, జడేజా, అక్షర్... ఇలా బౌలర్ ఎవరైనా కావచ్చు. మేం అతిగా ఆలోచించడం లేదు. గత సిరీస్‌లో చెన్నైలో మేం కూడా టెస్టు మ్యాచ్ గెలిచామనే సంగతి మరచిపోవద్దు’ అని బెయిర్‌స్టో చెప్పాడు. 2021లో జరిగిన సిరీస్‌ను భారత్ 3–1తో సొంతం చేసుకుంది. -
భారత మహిళల విజయగర్జన
ముంబై: ఆ్రస్టేలియా మహిళలతో వన్డే సిరీస్‌ను 0–3తో చేజార్చుకున్న భారత జట్టు టి20 సిరీస్‌లో మెరుపు విజయంతో శుభారంభం చేసింది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో ఆసీస్‌ను కట్టడి చేసిన మన జట్టు... ఆపై అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబర్చింది. శుక్రవారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన తొలి టి20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 19.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. 2020 టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత ఆసీస్ జట్టు మళ్లీ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. ఫోబీ లిచ్‌ఫీల్డ్ (32 బంతుల్లో 49 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలైస్ పెరీ (30 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. పవర్‌ప్లే ముగిసేసరికి 33/4 స్కోరుతో ఆసీస్ ఇబ్బందుల్లో పడిన స్థితిలో లిచ్‌ఫీల్డ్, పెరీ ఐదో వికెట్‌కు 52 బంతుల్లోనే 79 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. యువ పేస్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిటాస్ సాధు (4/17) పదునైన బంతులతో ప్రత్యర్థిని కుప్పకూల్చగా... శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (44 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్మృతి మంధాన (52 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 93 బంతుల్లోనే 137 పరుగులు జోడించడం విశేషం. తొలి ఓవర్లో ఎక్స్‌ట్రాల రూపంలోనే 14 పరుగులు రావడంతో మొదలైన ఛేదనలో చివరి వరకు భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ముఖ్యంగా గత రెండు వన్డేల్లో తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన షఫాలీ ఇప్పుడు మళ్లీ అవకాశం రాగానే చెలరేగిపోయింది. విజయానికి ఐదు పరుగుల దూరంలో స్మృతి వెనుదిరిగినా... షఫాలీతో కలిసి జెమీమా (6 నాటౌట్) మ్యాచ్ ముగించింది. సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా, రెండో మ్యాచ్ ఆదివారం ఇదే మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో స్మృతి అంతర్జాతీయ టి20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకొని హర్మన్‌ప్రీత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచింది. -
IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని...
ముంబై: కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో... నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయింది. ఫలితంగా ఆ్రస్టేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి ఊరట చెందాలని భారత బృందం భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విశేషంగా రాణించి అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు వన్డే ఫార్మాట్‌కు వచ్చేసరికి తడబడింది. సమష్టి ప్రదర్శన కొరవడటంతో ఈ ప్రభావం మ్యాచ్ తుది ఫలితంపై పడింది. భారత్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండటం ప్రతికూలంగా మారింది. తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైన భారత్ చివర్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆఖరికి మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా రెండో మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచారు. కెపె్టన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైంది. తొలి మ్యాచ్‌లో 9 పరుగులు చేసిన హర్మన్ రెండో మ్యాచ్‌లో 5 పరుగులతో సరిపెట్టుకుంది. చివరిసారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్‌లో గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయపరంపరకు తెర దించాలంటే చివరి వన్డేలో భారత జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతోపాటు కెపె్టన్ హర్మ న్‌ప్రీత్ కూడా బ్యాటింగ్‌లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్‌తోపాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ్రస్టేలియా క్రికెటర్ల సొంతం. అందుకే రెండు వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడికిలోనైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబి లిచ్‌ఫీల్డ్, తాలియా మెక్‌గ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలీస్ పెరీ, కెపె్టన్ అలీసా హీలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే ఆ్రస్టేలియా వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సాధ్యమే. -
ఆసీస్‌ను ఓడించాం
ముంబై: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు పదకొండో ప్రయత్నంలో ఆ్రస్టేలియా మహిళల జట్టుపై భారత జట్టు తొలిసారి టెస్టు విజయాన్ని అందుకుంది. ఇక్కడి వాంఖెడె మైదానంలో ఆ్రస్టేలియాతో జరిగిన నాలుగు రోజుల ఏకైక టెస్టులో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా సమష్టిగా ఆడితే ఎంతటి మేటి జట్టునైనా ఓడించవచ్చని హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం నిరూపించింది. ఆ్రస్టేలియా నిర్దేశించిన 75 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 18.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. మ్యాచ్ మొత్తంలో ఏడు వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పటిష్టమైన ఇంగ్లండ్‌తో గత ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన భారత జట్టు... వారం తిరిగేలోపు మరో మేటి జట్టు ఆ్రస్టేలియాను బోల్తా కొట్టించి ఈ ఏడాదిని దిగ్విజయంగా ముగించింది. రాణించిన స్నేహ్, రాజేశ్వరి ఆట చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 233/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా కేవలం 28 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 261 పరుగుల వద్ద ఆలౌటైంది. యాష్లే గార్డ్నర్ (7)ను ఆట రెండో ఓవర్లోనే పూజ వస్త్రకర్ వికెట్లముందు దొరకబుచ్చుకోవడంతో ఆసీస్ పతనం మొదలైంది. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన అనాబెల్ సదర్లాండ్ (102 బంతుల్లో 27; 3 ఫోర్లు)ను...అలానా కింగ్ (0)ను వరుస బంతుల్లో స్నేహ్ రాణా అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ఎక్కువసేపు కొనసాగలేదు. చివరి రెండు వికెట్లను రాజేశ్వరి గైక్వాడ్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 261 పరుగులవద్ద ముగిసింది. 75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు తొలి ఓవర్లోనే దెబ్బ పడింది. షఫాలీ వర్మ (4) నాలుగో బంతికి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత రిచా ఘోష్ (32 బంతుల్లో 13; 3 ఫోర్లు)తో కలిసి స్మృతి మంధాన (61 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించింది. రిచా అవుటయ్యాక జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి స్మృతి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 219; భారత్ తొలి ఇన్నింగ్స్: 406; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: బెత్ మూనీ (రనౌట్) 33; లిచ్‌ఫెల్డ్ (బి) స్నేహ్ రాణా 18; ఎలీస్ పెరీ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 45; తాలియా మెక్‌గ్రాత్ (బి) హర్మన్‌ప్రీత్ 73; అలీసా హీలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్మన్‌ప్రీత్ 32; అనాబెల్ సదర్లాండ్ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 27; యాష్లే గార్డ్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పూజ 7; జెస్ జొనాసెన్ (బి) రాజేశ్వరి 9; అలానా కింగ్ (బి) స్నేహ్ రాణా 0; కిమ్ గార్త్ (బి) రాజేశ్వరి 4; లారెన్ చీట్లె (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–49, 2–56, 3–140, 4–206, 5–221, 6–233, 7–251, 8–251, 9–260, 10–261. బౌలింగ్: రేణుక 11–4–32–0, పూజ వస్త్రకర్ 11–1–40–1, స్నేహ్ రాణా 22–5–66–4, దీప్తి శర్మ 22–7– 35–0, రాజేశ్వరి గైక్వాడ్ 28.4–11 –42–2, జెమీమా 2–0–13–0, హర్మన్‌ప్రీత్ 9–0–23–2. భారత్ రెండో ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అలీసా (బి) గార్త్ 4; స్మృతి మంధాన (నాటౌట్) 38; రిచా ఘోష్ (సి) తాలియా (బి) గార్డ్నర్ 13; జెమీమా (నాటౌట్)12; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.4 ఓవర్లలో రెండు వికెట్లకు) 75. వికెట్ల పతనం: 1–4, 2–55. బౌలింగ్: కిమ్ గార్త్ 5–1–19–1, యాష్లే గార్డ్నర్ 9–2–18–1, తాలియా 2–0–14–0, జెస్ జొనాసెన్ 2.4–0–16–0. 7: ఓవరాల్‌గా టెస్టు ఫార్మాట్లో భారత మహిళల జట్టు గెలిచిన టెస్టుల సంఖ్య. 1976 నుంచి 2023 వరకు భారత జట్టు 40 టెస్టులు ఆడింది. ఇందులో ఏడింటిలో గెలిచి, ఆరింటిలో ఓడిపోయింది. మిగతా 27 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 11: ఆస్ట్రేలియా జట్టుతో 1977 నుంచి 2023 మధ్యకాలంలో భారత్ 11 టెస్టులు ఆడింది. ఈ మ్యాచ్‌కు ముందు ఆ్రస్టేలియా చేతిలో భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి, ఆరింటిని ‘డ్రా’ చేసుకుంది. 2: స్వదేశంలో భారత జట్టు ఒకే ఏడాది రెండు టెస్టుల్లో గెలవడం ఇదే తొలిసారి. భారత్ నెగ్గిన ఏడు టెస్టుల్లో నాలుగు స్వదేశంలో, మూడు విదేశీ గడ్డపై వచ్చాయి. హర్మన్‌ప్రీత్ కెపె్టన్సీలో భారత జట్టు ఆడిన రెండు టెస్టుల్లోనూ నెగ్గడం విశేషం. 9: గత 17 ఏళ్లలో భారత జట్టు తొమ్మిది టెస్టులు ఆడింది. ఇందులో ఒక టెస్టులో ఓడి, ఐదు టెస్టుల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. -
రన్నరప్ అశ్విని–తనీషా జోడీ
లక్నో: సయ్యద్ మోడి వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఈసారి భారత జట్టు క్రీడాకారులకు ఒక్క టైటిల్ కూడా లభించలేదు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అశ్విని–తనీషా ద్వయం 14–21, 21–17, 15–21తో రిన్ ఇవనాగ–కీ నకనిషి (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన అశ్విని–తనీషాలకు 7,980 డాలర్ల (రూ. 6 లక్షల 64 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యు జెన్ చి (చైనీస్ తైపీ) 20–22, 21–12, 21–17తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై సంచలన విజయం సాధించి టైటిల్ దక్కించుకున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) 21–19, 21–16తో లినె హొమార్క్ (డెన్మార్క్)ను ఓడించి విజేతగా నిలిచింది. -
మళ్లీ ఓడిన భారత మహిళలు
మహిళల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పూల్ ‘సి’ మ్యాచ్‌లో బెల్జియం 3–2 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. భారత్ తరఫున అన్ను 47వ, 51వ నిమిషాల్లో గోల్స్ సాధించింది. బెల్జియం తరఫున నోవా ష్రూయెర్స్ (5వ నిమిషం), ఫ్రాన్స్ డి మాట్ (42వ ని.), అస్ట్రిడ్ బొనామి (52వ ని.) గోల్స్ నమోదు చేశారు. తొలి, మూడో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించి ముందుగా బెల్జియం 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో అన్ను రెండు గోల్స్ సాధించి స్కోరును సమం చేసింది. అయితే చివర్లో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను సమర్థంగా ఉపయోగించుకున్న బెల్జియం మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో వైపు మంగళవారం మలేసియాలోని కౌలాలంపూర్‌లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అదే రోజు జరిగే తొలి మ్యాచ్‌లో కొరియాతో భారత్ తలపడుతుంది. -
రాహుల్‌కు వన్డే పగ్గాలు
న్యూఢిల్లీ: వచ్చే నెల దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడే మూడు ఫార్మాట్లకు భారత జట్లను ఎంపిక చేశారు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను సఫారీలోనూ కెప్టెన్‌గా కొనసాగిస్తున్నారు. ఈ పొట్టి ఫార్మాట్లో జడేజాకు వైస్ కెప్టెన్సీ అప్పజెప్పారు. వన్డే జట్టుకు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఈ రెండు జట్లకూ భారత టాప్‌స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కోహ్లిలు విశ్రాంతి తీసుకున్నారు. దీంతో వన్డేల్లో ఇద్దరు కొత్త ముఖాలు బి. సాయి సుదర్శన్, రింకూ సింగ్‌లకు టీమిండియాకు ఆడే అవకాశమిచ్చారు. మిడిలార్డర్లో డాషింగ్ బ్యాటర్ సంజూ సామ్సన్, స్పిన్నర్ చహల్‌లకు వన్డే జట్టులో తిరిగి చోటు లభించగా, రుతురాజ్ గైక్వాడ్ లక్కీఛాన్స్ కొట్టేశాడు. పూర్తిస్థాయిలో మూడు ఫార్మాట్లకూ ఎంపికయ్యాడు. సీమర్ ముకేశ్కూ ఇలాంటి అవకాశమే లభించింది. హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్‌ను టి20, టెస్టులకు ఎంపిక చేసినప్పటికీ వన్డేల నుంచి తప్పించారు. సఫారీలో ముందుగా భారత్ డిసెంబర్ 10, 12, 14తేదీల్లో మూడు టి20లు... 17, 19, 21 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది. చివరగా 26 నుంచి 30 వరకు తొలిటెస్టు, జనవరి 3 నుంచి 7వరకు జరిగే రెండో టెస్టుతో పర్యటన ముగుస్తుంది. -
ద్రవిడ్ బృందానికే జై
ముంబై: వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వరుస విజయాలతో ఫైనల్ వరకు చేర్చిన శిక్షణా బృందంపై బీసీసీఐ నమ్మకముంచింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా ఇతర ముగ్గురు కోచ్‌ల కాంట్రాక్ట్‌ను పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌లకు కూడా మళ్లీ అవకాశం దక్కింది. వీరందరి కాంట్రాక్ట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌తో ముగిసింది. పొడిగింపుపై అప్పటి వరకు బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే బృందాన్ని మరికొంత కాలం కొనసాగించడమే సరైందిగా బోర్డు భావించింది. ముందుగా దీనికి సంబంధించి ద్రవిడ్‌కు సమాచారం అందించింది. ద్రవిడ్ అంగీకరించకపోతే మరో ప్రత్యామ్నాయం వైపు బోర్డు చూసే ఆలోచనలో ఉండగా...ద్రవిడ్ కోచ్‌గా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. వీరి కాంట్రాక్ట్ ఎప్పటి వరకు అనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినా... వచ్చే ఏడాది జూన్–జూలైలో జరిగే టి20 ప్రపంచ కప్ వరకు ఉండే అవకాశం ఉంది. మరో వైపు వన్డే, టి20లకు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేరుపై కూడా చర్చ జరిగినా...నెహ్రా విముఖత చూపడంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు సమాచారం. అందుకే కొనసాగింపు... గత రెండేళ్లుగా ద్రవిడ్, అతని సహచర కోచింగ్ బృందం భారత జట్టులో తీసుకొచ్చిన మార్పులు, ఏర్పరచిన మంచి వాతావరణం మున్ముందూ కొనసాగించాలని బీసీసీఐ అనుకుంది. కొత్తగా వచ్చే కోచ్‌తో ఇవన్నీ ఒక్కసారి మారిపోతే కష్టమని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. కోచ్ మారితే అతనితో పాటు ఇతర సహాయక సిబ్బంది కూడా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ద్రవిడ్ బృందం భవిష్యత్తులో ఎప్పటి వరకు కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేకపోయినా... ఇదే జట్టు సహకారంతో కనీసం మరో ఐసీసీ టోర్నీలో జట్టు పాల్గొనడమే సరైందని వారు భావించారు. ‘రాహుల్ ద్రవిడ్‌కు బోర్డు అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. మూడు ఫార్మాట్లలో భారత జట్టు అద్భుతంగా ఆడుతూ అగ్రస్థానంలో ఉంది. ద్రవిడ్ దూరదృష్టి, ఆలోచన, ప్రణాళిక అందుకు కారణం. వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు ముందు వరుసగా పది మ్యాచ్‌లు గెలవడం అసాధారణ ప్రదర్శన. అందుకు హెడ్‌కోచ్‌ను తప్పకుండా అభినందించాలి. మున్ముందు మరిన్ని విజయాలు సాధించేందుకు వారికి అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. తనకు కొనసాగింపు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘భారత జట్టుతో నా ప్రయాణంలో ఎన్నో మధుర క్షణాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో విజయాలు, పరాజయాలతో ఎత్తుపల్లాలు చవిచూశాం. ఆటగాళ్లు, మా శిక్షణా బృందం మధ్య మంచి అనుబంధం ఉంది. డ్రెస్సింగ్ రూమ్‌లో మేం నెలకొల్పిన మంచి సంస్కృతి పట్ల గర్వంగా ఉన్నాం. అద్భుతమైన ప్రతిభ ఉన్న మా జట్టుకు సరైన మార్గనిర్దేశనం చేసి మంచి ఫలితాలు సాధించేలా చేయడంలో సఫలమయ్యాం. నాపై నమ్మకం ఉంచి మళ్లీ అవకాశం కల్పించిన బోర్డుకు కృతజ్ఞతలు. ప్రపంచకప్ తర్వాత రాబోయే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ద్రవిడ్ తన స్పందనను తెలియజేశాడు. -
‘ధోని నుంచి నేర్చుకున్నాను’
విశాఖపట్నం: ఆ్రస్టేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత జట్టు విజయంలో రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. చివర్లో దూకుడుగా ఆడాల్సిన స్థితిలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా నిలబడి అతను ఫినిషర్‌గా మ్యాచ్ పూర్తి చేశాడు. ఈ లక్షణాన్ని తాను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి నేర్చుకున్నట్లు రింకూ సింగ్ చెప్పాడు. ‘నేను ఇంత ప్రశాంతంగా ఉండగలిగానంటే అందుకు ప్రత్యేక కారణం ఉంది. ఇలాంటి స్థితిలో ఎలా ఆడాలని నేను మహి భాయ్ (ధోని)తో మాట్లాడాను. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఒత్తిడికి లోను కాకపోవడానికి ఆయన ఇచ్చిన సూచనలే కారణం. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండటంతో పాటు నేరుగా బౌలర్‌పైనే పూర్తి దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు’ అని రింకూ సింగ్ వెల్లడించాడు. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా రింకూ ఆత్మవిశ్వాసంతో దానిని చక్కటి సిక్సర్‌గా మలిచాడు. అయితే అబాట్ వేసిన ఆ బంతి నోబాల్ కావడంతో సిక్స్ లెక్కలోకి రాలేదు. ‘డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాక అక్షర్ చెప్పే వరకు ఈ విషయం నాకు తెలీదు. అయితే సిక్స్ కాలేకపోవడం పెద్ద అంశం కాదు. మ్యాచ్ గెలవడమే మనకు ముఖ్యం. అది జరిగింది చాలు’ అని రింకూ సింగ్ వ్యాఖ్యానించాడు. -
టీమిండియా శుభారంభం.. తొలి టీ20లో ఆసీస్‌పై విజయం
సాక్షి, విశాఖపట్నం: పరుగుల వరద పారిన మ్యాచ్‌లో చివరికి భారత జట్టుదే పైచేయిగా నిలిచింది. ఆ్రస్టేలియాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్–ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు రెండు వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా జట్టును ఓడించింది. తొలిసారి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మ్యాచ్‌లో సూర్యకుమార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు సాధించింది. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... ఓపెనర్‌గా వచ్చిన స్టీవ్ స్మిత్ (41 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. ఇన్‌గ్లిస్ 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఆ్రస్టేలియా తరఫున టి20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఆరోన్ ఫించ్ (47 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అనంతరం భారత జట్టు 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)– అర్ధ సెంచరీలతో అదరగొట్టగా... రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. భారత్ విజయానికి ఆఖరి బంతికి ఒక పరుగు అవసరంకాగా... సీన్ అబాట్ వేసిన బంతిని రింకూ సింగ్ సిక్సర్‌గా మలిచి భారత విజయాన్ని ఖరారు చేశాడు. అయితే టీవీ రీప్లేలో అబాట్ వేసిన బంతి నోబాల్ అని తేలడంతో అక్కడే భారత విజయం ఖాయమైంది. దాంతో రింకూ సింగ్ సిక్స్‌ను లెక్కలోకి తీసుకోలేదు. టి20ల్లో భారత జట్టుకిదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. సిరీస్‌లోని రెండో టి20 మ్యాచ్ ఈనెల 26న తిరువనంతపురంలో జరుగుతుంది. సూర్య, ఇషాన్ ధనాధన్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో సమన్వయలోపం కారణంగా మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) ఒక్క బంతి ఆడకుండానే తొలి ఓవర్లోనే రనౌటయ్యాడు. అనంతరం మూడో ఓవర్లో యశస్వి భారీ షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. ఈ దశలో ఇషాన్, సూర్యకుమార్ జత కలిశారు. వీరిద్దరు ఎక్కడా తగ్గకుండా ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో భారత్ స్కోరు 4.5 ఓవర్లలో 50 దాటింది. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 2 వికెట్లకు 63 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా ఇషాన్, సూర్య జోరు కొనసాగించడంతో భారత్ 9.1 ఓవర్లలో 100 పరుగులు చేసింది. ఇషాన్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి డీప్ ఎక్స్ట్రా కవర్లో షార్ట్ చేతికి చిక్కడంతో ఇషాన్ ఇన్నింగ్స్ ముగిసింది. తిలక్ వర్మ (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఈ దశలో సూర్య, రింకూ జతకలిసి ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించడంతో భారత్ 194/4తో విజయానికి చేరువైంది. అయితే ఇదే స్కోరు వద్ద సూర్య అవుటయ్యాడు. అప్పటికి భారత్ విజయానికి చేరువైంది. చివరి ఓవర్ డ్రామా... 12 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన దశలో 19వ ఓవర్లో భారత్ 7 పరుగులు చేసింది. దాంతో చివరి ఓవర్లో భారత్ గెలుపునకు 6 బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికే రింకూ ఫోర్ కొట్టాడు. రెండో బంతికి ‘బై’ రూపంలో పరుగు వచ్చింది. 4 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో భారత్ వరుసగా మూడు బంతుల్లో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ వికెట్లను కోల్పోయింది. రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో అర్ష్‌దీప్ అవుటయ్యాడు. దాంతో చివరి బంతికి భారత్ విజయానికి ఒక పరుగు అవసరమైంది. ‘సూపర్ ఓవర్’ అవసరం పడుతుందా అనే అనుమానం కలిగిన దశలో అబాట్ వేసిన ఆఖరి బంతిని రింకూ సిక్స్‌గా మలచడంతో భారత్ విజయం ఖరారైంది. అయితే అబాట్ బంతి నోబాల్ అని తేలడంతో రింకూ సిక్స్ షాట్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: స్టీవ్ స్మిత్ (రనౌట్) 52; మాథ్యూ షార్ట్ (బి) రవి బిష్ణోయ్ 13; జోష్ ఇన్‌గ్లిస్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ప్రసిధ్ కృష్ణ 110; స్టొయినిస్ (నాటౌట్) 7; టిమ్ డేవిడ్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–31, 2–161, 3–180. బౌలింగ్: అర్ష్‌దీప్ సింగ్ 4–0–41–0, ప్రసిధ్ కృష్ణ 4–0–50–1, అక్షర్ పటేల్ 4–0–32–0, రవి బిష్ణోయ్ 4–0–54–1, ముకేశ్ కుమార్ 4–0–29–0. భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) స్మిత్ (బి) షార్ట్ 21; రుతురాజ్ గైక్వాడ్ (రనౌట్) 0; ఇషాన్ కిషన్ (సి) షార్ట్ (బి) తన్వీర్ 58; సూర్యకుమార్ యాదవ్ (సి) ఆరన్ హార్డి (బి) బెహ్రన్‌డార్ఫ్ 80; తిలక్ వర్మ (సి) స్టొయినిస్ (బి) తన్వీర్ సంఘా 12; రింకూ సింగ్ (నాటౌట్) 22; అక్షర్ పటేల్ (సి అండ్ బి) సీన్ అబాట్ 2; రవి బిష్ణోయ్ (రనౌట్) 0; అర్ష్‌దీప్ సింగ్ (రనౌట్) 0; ముకేశ్ కుమార్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.5 ఓవర్లలో 8 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–11, 2–22, 3–134, 4–154, 5–194, 6–207, 7–207, 8–208. బౌలింగ్: స్టొయినిస్ 3–0–36–0, బెహ్రన్‌డార్ఫ్ 4–1–25–1, షార్ట్ 1–0–13–1, సీన్ అబాట్ 3.5–0–43–1, నాథన్ ఎలిస్ 4–0–44–0, తన్వీర్ సంఘా 4–0–47–2. -
CWC 2023: ఇంకా తేల్చుకోలేదు... అహర్నిశలు పనిచేశా
అహ్మదాబాద్: టీమిండియా హెడ్ కోచ్ పదవీ కాలాన్ని పొడిగించుకోవాలా లేదంటే ముగించుకోవాలనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ ఆయనతో కుదుర్చుకున్న రెండేళ్ల కాంట్రాక్టు నవంబర్ 19న వరల్డ్‌కప్ ఫైనల్‌తో ముగిసింది. టైటిల్ పోరులో పరాజయం అనంతరం భారమైన హృదయంతో ద్రవిడ్ మీడియా సమావేశానికి వచ్చాడు. నిరాశను దిగమింగి జట్టు ప్రదర్శన, ఫైనల్ పరాజయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ‘కొంతకాలంగా నేను పూర్తిగా ప్రపంచకప్‌పైనే దృష్టి పెట్టాను. జట్టు సన్నద్ధత కోసమే అహర్నిశలు పనిచేశాను. ఇది కాకుండా మరో ఆలోచనేది నేను చేయలేదు. భవిష్యత్ ప్రణాళికలపై ఆలోచించడానికి కూడా నేను సమయం వెచ్చించలేదు. నా రెండేళ్ల పదవీకాలంలోని జయాపజయాలు, ఘనతలు, విశేషాలపై విశ్లేషించుకోవడం లేదు’ అని 50 ఏళ్ల ద్రవిడ్ వివరించాడు. ‘అన్ని ఫార్మాట్లకు కోచ్‌గా పనిచేయడం చాలా బాగా అనిపించింది. వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ మార్గదర్శనంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. జట్టు కోసం, ప్రపంచకప్ కోసం నాయకుడిగా రోహిత్ శర్మ ఎంతో శ్రమించాడు. మున్ముందు భారత హెడ్ కోచ్‌గా కొనసాగడంపై ఏ నిర్ణయం తీసుకోని నేను 2027 వన్డే ప్రపంచకప్‌పై ఏం మాట్లాడగలను. అప్పటికి జట్టులో ఎవరు ఉంటారో... ఏవరు పోతారో ఎవరికీ తెలియదు. అలాంటి దానిపై స్పందించడం తగదు’ అని ద్రవిడ్ వివరించాడు. -
భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రధాని
అహ్మదాబాద్: వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఉరకలెత్తే ఉత్సాహంతో ముందంజ వేసిన భారత జట్టు ఫైనల్ పరాభవంతో షాక్‌కు గురైంది. నిశ్శబ్దం ఆవహించి... నిరాశలో కూరుకుపోయిన రోహిత్ శర్మ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓదార్చారు. ఆదివారం రాత్రి బహుమతి ప్రదానోత్సవం ముగిశాక కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి మోదీ భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ప్రతీ ఒక్క ఆటగాడిని సముదాయించారు. ఈ నిరాశ నుంచి కోలుకునేందుకు ఓదార్పు మాటలు చెప్పారు. ‘ప్రియమైన టీమిండియా... మీ ప్రతిభ, ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంకితభావంతో ప్రపంచకప్ గెలిచేందుకు టోర్నీ ఆసాంతం గొప్పగా ఆడారు. మీ కృషి వెలకట్టలేనిది. ప్రపంచకప్‌లో మీరు కనబరిచిన క్రీడాస్ఫూర్తిని చూసి జాతి గర్విస్తోంది. యావత్ దేశం మీ వెన్నంటే ఉంది. ఇకపై కూడా ఉంటుంది’ అని ఎక్స్‌లో ప్రధాని ట్వీట్ చేశారు. దీన్ని పలువురు క్రికెట్ అభిమానులు షమీని ప్రధాని ఓదారుస్తున్న ఫోటోను జతచేసి రీ ట్వీట్లతో అనుసరించారు. ‘టోర్నీలో గొప్పగా ఆడాం. ఆఖరి పోరులోనే ఓడిపోయాం. ఈ చేదు ఫలితం అందరి గుండెల్ని బద్దలు చేసింది. ఇలాంటి సమయంలో ప్రధాని మా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి కొండంత బలాన్నిచ్చేలా ఓదార్పు పలికారు. మోదీకి కృతజ్ఞతలు’ అని ఆల్‌రౌండర్ జడేజా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.