Intercontinental Cup 2024: సిరియాతో నేడు భారత్‌ పోరు... గెలిస్తేనే టీమిండియాకు టైటిల్‌ | Intercontinental Cup 2024: India face Syria in must-win game | Sakshi
Sakshi News home page

Intercontinental Cup 2024: సిరియాతో నేడు భారత్‌ పోరు... గెలిస్తేనే టీమిండియాకు టైటిల్‌

Published Mon, Sep 9 2024 6:23 AM | Last Updated on Mon, Sep 9 2024 6:23 AM

Intercontinental Cup 2024: India face Syria in must-win game

ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ కోసం నేడు భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో సిరియా జట్టుతో భారత్‌ తలపడనుంది. మూడు దేశాల మధ్య రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. మారిషస్‌ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌ను భారత్‌ 0–0తో ‘డ్రా’ చేసుకోగా... సిరియా జట్టు 2–0తో మారిషస్‌ జట్టును ఓడించింది. 

ఈ నేపథ్యంలో నేడు భారత్‌తో జరిగే మ్యాచ్‌ను సిరియా ‘డ్రా’ చేసుకుంటే చాలు టైటిల్‌ను దక్కించుకుంటుంది. భారత జట్టుకు టైటిల్‌ లభించాలంటే సిరియాపై గెలవాలి.  ఇప్పటి వరకు భారత్, సిరియా జట్లు ముఖాముఖిగా ఏడుసార్లు తలపడ్డాయి. 3 మ్యాచ్‌ల్లో సిరియా, 2 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలిచాయి. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.   ప్రపంచ ఫుట్‌బాల్‌ ర్యాంకింగ్స్‌లో సిరియా 93వ స్థానంలో, భారత్‌ 124వ స్థానంలో ఉన్నాయి. నేడు రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్‌18–3 టీవీ చానెల్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement