gachibowli stadium
-
టైటాన్స్ అదుర్స్.. తలైవాస్‌పై ఉత్కంఠ విజయం
హైదరాబాద్, నవంబర్ 6: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ 35-34 తేడాతో తమిళ్ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్-8వ సీజన్ తర్వాత తలైవాస్‌పై టైటాన్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో అదరగొట్టగా, అశిష్ నార్వల్(9), విజయ్ మాలిక్(4) ఆకట్టుకున్నారు. మరోవైపు తలైవాస్ జట్టులో సచిన్ 17 పాయింట్లతో టాప్‌స్కోరర్‌గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. సచిన్‌కు తోడు నితీశ్‌కుమార్(4), నరేందర్(3) ఫర్వాలేదనిపించారు. పీకేఎల్‌లో 1000 పాయింట్ల క్లబ్లో సచిన్ తాజాగా చేరాడు. వరుసగా హ్యాట్రిక్ విజయంతో టైటాన్స్ 21 పాయింట్లతో 4వ స్థానంలోకి దూసుకురాగా, తలైవాస్ 21 పాయింట్లతో మూడులో ఉంది.ఇరు జట్లు హోరాహోరీగా..లీగ్ సాగుతున్న కొద్దీ జట్ల మధ్య పోరు నువ్వానేన్నా అన్నట్లు హోరాహోరీగా సాగుతున్నది. గత సీజన్లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన తెలుగు టైటాన్స్ ఈసారి అంచనాలకు అనుగుణంగా ముందుకెళుతున్నది. స్థానిక అభిమానుల మద్దతుతో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. లీగ్‌లో ప్లేఆఫ్స్‌కు సాధించాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. ప్రతీ పాయింట్‌ను కీలకంగా భావిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య పోరులో తొలి అర్ధభాగం ఉత్కంఠగా సాగింది. తొలి 20 నిమిషాల ఆట ముగిసే సరికి టైటాన్స్ 20-17 తేడాతో తలైవాస్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ తనదైన జోరు కనబరుస్తూ టైటాన్స్ కీలక పాయింట్లు అందించాడు. తొలి రెండు రైడ్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన పవన్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. మ్యాచ్ 18వ నిమిషంలో విజయ్ మాలిక్ రైడ్‌తో టైటాన్స్ పాయింట్ల వేట ప్రారంభించింది. మరో ఎండ్‌లో పవన్ కూడా జతకలువడంతో టైటాన్స్ టాప్‌గేర్‌లోకి దూసుకొచ్చింది. మ్యాచ్ 12వ నిమిషంలో హిమాంశు, రోనక్ ఇద్దరిని పవన్ ఔట్ చేయడం ద్వారా తలైవాస్ తొలిసార ఆలౌటై టైటాన్స్‌కు నాలుగు పాయింట్లు సమర్పించుకుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సచిన్ 11వ నిమిషంలో కిషన్, అశిష్‌ను ఔట్ చేసి తలైవాస్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. ఇక్కణ్నుంచి పోటీ మరింత రంజుగా మారింది. 6వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన టైటాన్స్ రైడర్ అశిష్ నార్వల్..అభిషేక్‌ను ఔట్ చేసి పాయింట్ కొల్లగొట్టాడు. తొలి అర్ధభాగం మరో 4 నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్‌కు వెళ్లిన పవన్‌ను..నితీశ్‌కుమార్ సూపర్ ట్యాకిల్‌తో కట్టడి చేశాడు.పవన్, సచిన్ దూకుడుఓవైపు టైటాన్స్ తరఫున పవన్, మరోవైపు తలైవాస్‌కు సచిన్ పాయింట్ల వేటలో తమదైన దూకుడు ప్రదర్శించారు. రైడ్‌కు వెళ్లడం ఆలస్యం పాయింట్ పక్కా అన్న రీతిలో దూసుకెళ్లారు. ప్రథమార్ధంలో తలైవాస్‌పై ఒకింత పైచేయి సాధించిన టైటాన్స్..కీలకమైన ద్వితీయార్ధంలో తడపబడింది. ఇదే అదనుగా తలైవాస్ తమ దాడులకు పదునుపెట్టింది. ఈ క్రమంలో మ్యాచ్ 14వ నిమిషంలో టైటాన్స్ ఆలౌటైంది. రెండు జట్ల రైడర్లు, డిఫెండర్లు తుదికంటా పోరాడటంతో మ్యాచ్ రసపట్టుగా సాగింది. దాదాపు ఆఖరి రైడ్‌కు వెళ్లిన సచిన్ ఔట్ కావడంతో తలైవాస్ గెలుపు ఆశలపై టైటాన్స్ నీళ్లు చల్లింది. మొత్తంగా పవన్, సచిన్ రైడింగ్ జోరు అభిమానులను కట్టిపడేసింది. -
Intercontinental Cup 2024: సిరియాతో నేడు భారత్ పోరు... గెలిస్తేనే టీమిండియాకు టైటిల్
ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టైటిల్ కోసం నేడు భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో సిరియా జట్టుతో భారత్ తలపడనుంది. మూడు దేశాల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. మారిషస్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌ను భారత్ 0–0తో ‘డ్రా’ చేసుకోగా... సిరియా జట్టు 2–0తో మారిషస్ జట్టును ఓడించింది. ఈ నేపథ్యంలో నేడు భారత్‌తో జరిగే మ్యాచ్‌ను సిరియా ‘డ్రా’ చేసుకుంటే చాలు టైటిల్‌ను దక్కించుకుంటుంది. భారత జట్టుకు టైటిల్ లభించాలంటే సిరియాపై గెలవాలి. ఇప్పటి వరకు భారత్, సిరియా జట్లు ముఖాముఖిగా ఏడుసార్లు తలపడ్డాయి. 3 మ్యాచ్‌ల్లో సిరియా, 2 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచాయి. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో సిరియా 93వ స్థానంలో, భారత్ 124వ స్థానంలో ఉన్నాయి. నేడు రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్18–3 టీవీ చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
హైదరాబాద్‌లో ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా ఈ ఏడాది జూన్ 23 నుంచి జూలై 4 వరకు ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కే కేటాయించారని... ఆసియా నుంచి 12 లేదా 15 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటాయని భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. చదవండి👉🏾 Shreyas Iyer: మా ఓటమికి కారణం అదే.. మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే! -
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జెర్సీ ఆవిష్కరణ
Rupay Prime Volleyball League: Hyderabad Black Hawks- సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా జరిగే రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు జెర్సీని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీఎం అబ్రహమ్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు యజమాని అభిషేక్ రెడ్డి, బేస్‌లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా, డైరెక్టర్ యశ్వంత్ బియ్యాల తదితరులు పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు జరిగే ఈ లీగ్‌కు ఏ23 కంపెనీ సహ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. మొత్తం 24 మ్యాచ్‌లను సోనీ–టెన్ స్పోర్ట్స్ చానెల్స్‌లో ప్రసారం చేస్తారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ లీగ్‌లో మొత్తం ఏడు జట్లు హైదరాబాద్ బ్లాక్ హాక్స్, కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెడోస్, కోల్‌కతా థండర్‌బోల్ట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. చదవండి: టీమిండియాకు భారీ షాక్.. కరోనా బారిన పడిన స్టార్ ఆటగాడు -
గిన్నిస్ రికార్డు: గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు 30 వేల జతల బూట్లు
గచ్చిబౌలి (హైదరాబాద్): బాలల దినోత్సవం సందర్భంగా 6.118 కిలోమీటర్ల పొడవునా.. 30,107 జతల బూట్లను ప్రదర్శనకు పెట్టి రియల్‌పేజ్ ఇండియా సంస్థ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈ బూట్లను 100 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని పేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఆదివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ బూట్లను ప్రదర్శనకు ఉంచారు. రియల్ఎస్టేట్ రంగానికి సాఫ్ట్వేర్ సేవలు అందించే రియల్‌పేజ్ సంస్థ.. సామాజిక బాధ్యతలో భాగంగా ఇటీవల ‘రియల్ సోల్స్ ఫ్రమ్ రియల్ సోల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులోభాగంగా పేద విద్యార్థులకు ఉచితంగా బూట్లను అందిస్తోంది. అమెరికా రికార్డును అధిగమించి.. అత్యంత ఎక్కువ బూట్లను వరుసగా పేర్చిన రికార్డు ఇంతకుముందు అమెరికాలో నమోదైందని, అక్కడ 2011లో 24,962 జతల బూట్లతో ‘లాంగెస్ట్ లైన్ ఆఫ్ షూస్’గా రికార్డ్ ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ స్వప్నిల్ డంగరికర్ వెల్లడించారు. ఆదివారం గచ్చిబౌలిలో బూట్ల ప్రదర్శనను పరిశీలించి.. రియల్‌పేజ్ సంస్థ కొత్త రికార్డును సాధించిందని తెలిపారు. కాగా.. రియల్ పేజ్ సంస్థ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు పంపిణీ చేయడం అభినందనీయమని శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు. మరింత సాయం అందిస్తాం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరింత తోడ్పాటు అందిస్తామని రియల్ పేజ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ సందీప్‌శర్మ తెలిపారు. ప్రస్తుతం బూట్లు పంపిణీ చేస్తున్నామని.. బ్యాగులు, యూనిఫాం, బెంచీలు, కిచెన్ వంటివి కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
గచ్చిబౌలి స్టేడియం వద్ద ఉద్రిక్తత
-
గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాకారుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాకారులు అథ్లెట్లు శుక్రవారం ఆందోళనకు దిగారు. స్టేడియాన్ని కాపాడాలని ధర్నా చేపట్టారు. టిమ్స్ ఆసుపత్రి కోసం ఇప్పటికే 9 ఎకరాలు కేటాయించగా.. గచ్చిబౌలి స్టేడియంలోని మరో 5 ఎకరాలు టిమ్స్‌కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై అథ్లెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒకే ఒక స్టేడియం గచ్చిబౌలి స్టేడియమని, దాన్ని కూడా హాస్పిటల్‌కు ఇవ్వడం అన్యాయం అంటూ ఆందోళన చేపట్టారు. ఆరోగ్యంగా ఉండాలంటే స్పోర్ట్స్ ఫిట్నెస్ తప్పనిసరి అని అథ్లెట్లు చెబుతున్నారు. సిధూ ఒలంపిక్ పథకం సాధించింది అంటే అది గచ్చిబౌలి స్టేడియం వల్లనే అని, అలాంటి స్టేడియం విచ్చినం చేయడం సరైనది కాదని అంటున్న ఆధ్లెట్స్ , వారి తల్లిద్రందుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రంలో క్రీడా విధానమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఓ క్రీడా విధానమంటూ లేకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నిం చారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోకపోగా గచ్చిబౌలి స్టేడియంలోని స్థలాన్ని ఇతర సంస్థలకు ఇవ్వడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గచ్చిబౌలి స్టేడియం టవర్‌లో టిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి చెందాలని అనుకున్నామన్నారు. అయితే దానికి భిన్నంగా స్టేడియం మధ్యలో ఐదెకరాల స్థలాన్ని టిమ్స్‌కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించి, సంబంధం లేని వ్యక్తులతో పంచనామాపై సంతకం చేయించారని విమర్శించారు. దీన్ని అడ్డుపెట్టుకుని ఈ ప్రాంతం లోని 25 ఎకరాల స్థలాన్ని ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. దీనిపై మంగళవారం నుంచి క్రీడాకారులు, క్రీడా ప్రేమికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని స్టేడియాలని అభివృద్ధి చేయాల్సింది పోయి సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లో రూ.50 కోట్లతో స్టేడియం, ఆర్థికమంత్రి హరీశ్‌రావు నియోజకవర్గం సిద్దిపేటలో, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో స్టేడియాలు మంజూరు చేసుకోవడం ఏంటని రఘునందన్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో క్రీడా గ్రామాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ఏడేళ్ల కిందట చేసిన ప్రకటన ఏమైందని నిలదీశారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు, క్రీడలకు ఏం సంబంధం? ఒలింపిక్ అసోసియేషన్‌లో ఆయన ఎందుకు వేలు పెట్టారని నిలదీశారు. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై 20 నెలలు దాటినా ఎందుకు బాధ్యతలు తీసుకోలేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు. -
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కోవిడ్-19 ఆసుపత్రి
-
కరోనా కేసులు పెరిగితే...
-
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఐసోలేషన్ వార్డు
గచ్చిబౌలి : గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ వార్డును సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్పోర్ట్స్ విలేజ్‌లోని కాంప్లెక్స్‌ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సందర్శించారు. సోమవారం 100 మంది జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం కార్మికులు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని అంతస్తులను శుభ్రం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మెడికల్ ఆఫీసర్ ఐసోలేషన్ వార్డును పర్యవేక్షణ చేయనున్నారు. రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళను ఐసోలేషన్ వార్డుకు నోడల్ ఆఫీసర్‌గా నియమించినట్లు సమాచారం. -
గచ్చిబౌలి స్టేడియంలో సిధ్ శ్రీరాం మ్యూజిక్ హోరు
-
‘షీ సేఫ్ నైట్ వాక్’
-
వ్యక్తిగత చాంప్స్ రుత్విక్, సుహాస్
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు రుత్విక్ రెడ్డి, ఎం. సుహాస్ ప్రీతమ్ సత్తా చాటారు. గచ్చిబౌలిలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో గ్రూప్–1 బాలుర వ్యక్తిగత ఈవెంట్లో రుత్విక్ రెడ్డి, గ్రూప్–3 బాలుర కేటగిరీలో సుహాస్ ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారు. బాలుర విభాగంలో రుత్విక్, బాలికల విభాగంలో సువన భాస్కర్ చెరో 35 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. గ్రూప్–3 విభాగంలో సుహాస్ ప్రీతమ్, రేణుకాచార్య తలా 26 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారు. టీమ్ విభాగంలో కర్ణాటక 1279 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా, తమిళనాడు 611 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన పోటీల్లో తెలంగాణ స్విమ్మర్లు 4 రజతాలు, ఒక కాంస్యాన్ని గెలుచుకున్నారు. గ్రూప్–2 బాలుర 200 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో బి. సాయి నిహార్ (2ని:23.13సె.), గ్రూప్–1 బాలుర 200మీ. బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో వై. జశ్వంత్ రెడ్డి (2ని:18.68సె.), 100మీ. బ్రెస్ట్ స్ట్రోక్‌లో సూర్యాన్షు (1ని:12.32సె.), 400మీ. ఫ్రీస్టయిల్లో సీహెచ్ అభిలాశ్ (4ని:26.12సె.) తలా ఓ రజతాన్ని సాధించారు. జాహ్నవి గోలి గ్రూప్–1 బాలికల 200 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ను 2నిమిషాల 43.36 సెకన్లలో పూర్తిచేసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్లు 2 పతకాల్ని సాధించారు. గ్రూప్–4 బాలుర 100మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఎం. యజ్ఞసాయి (1ని:7.08సె.), గ్రూప్–2 బాలికల 100మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో వి. నాగ గ్రీషి్మణి (1ని:25.41సె.) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, నార్సింగి మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఓవరాల్ చాంపియన్ కర్ణాటక
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన కర్ణాటక జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 1279 పాయింట్లు సాధించిన కర్ణాటక జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో కర్ణాటక, తమిళనాడు జట్లు వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. వ్యక్తిగత విభాగం ఓవరాల్ చాంపియన్‌షిప్ జాబితాలో గ్రూప్–1 విభాగంలో రుత్విక్ రెడ్డి (తెలంగాణ), సువన భాస్కర్ (కర్ణాటక)... గ్రూప్–2 విభాగంలో ఉత్కర్ష్ వెంకటేశ్ (కర్ణాటక), నైనా వెంకటేశ్ (కర్ణాటక)... గ్రూప్–3 కేటగిరీలో సుహాస్ ప్రీతమ్ (తెలంగాణ), రేణుకాచార్య (కర్ణాటక), గ్రూప్–4 కేటగిరీలో పీవీ మోనిశ్ (కర్ణాటక), ధినిధి డేసింగు (కర్ణాటక) వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. తమిళనాడు జట్టు చివరి రోజు ఈవెంట్ల ఫలితాలు 1500మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–2 బాలురు: 1. సర్వేపల్లి కృష్ణ ప్రణవ్ (తమిళనాడు), 2. శివాంక్ విశ్వనాథ్(కర్ణాటక), 3. సంజిత్ (కర్ణాటక); బాలికలు: 1. అష్మిత చంద్ర (కర్ణాటక), 2. మహాలక్ష్మి (తమిళనాడు), 3. మేధ వెంకటేశ్ (కర్ణాటక). 400మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1 బాలురు: 1. సమర్థ రావు (కర్ణాటక), 2. సీహెచ్ అభిలాష్ (తెలంగాణ), 3. మోహిత్ వెంకటేశ్ (కర్ణాటక); బాలికలు: 1. ప్రీత వెంకటేశ్ (కర్ణాటక), 2. నిధి శశిధర (కర్ణాటక), 3. మిధుల జితేశ్ (కేరళ). 200మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–2 బాలురు: 1. ఉత్కర్ష్ పాటిల్ (కర్ణాటక), 2. సాయి నిహార్ (తెలంగాణ), 3. అక్షయ్ (కర్ణాటక); బాలికలు: 1. సనా మాథ్యూ (కేరళ), 2. నైషా శెట్టి (కర్ణాటక), మణి జాధవ్ (కర్ణాటక). గ్రూప్–1 బాలురు: 1. డారెల్ స్టీవ్ (తమిళనాడు), 2. జశ్వంత్ రెడ్డి (తెలంగాణ), 3. దీప్ వెంకటేశ్ (కర్ణాటక); బాలికలు: 1. సువన (కర్ణాటక), 2. భూమిక (కర్ణాటక), 3. జాహ్నవి (తెలంగాణ). 100మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–4 బాలురు: 1. మోనిశ్ (కర్ణాటక), 2. సాయి ఆదిత్య (తమిళనాడు), 3. యజ్ఞ సాయి (ఆంధ్రప్రదేశ్); బాలికలు: 1. ధినిధి డేసింగు (కర్ణాటక), 2. క్యారెన్ బెన్నీ (కేరళ), 3. ప్రమితి (తమిళనాడు). 100మీ. బ్రెస్ట్ స్ట్రోక్ గ్రూప్–2 బాలురు: 1. జాషువా థామస్, 2. విదిత్ శంకర్, 3. శుభాంగ్ కుబేర్; బాలికలు: 1. హితైశ్ (కర్ణాటక), 2. అన్విత (కర్ణాటక), 3. నాగ గ్రీష్మిణి(ఆంధ్రప్రదేశ్). గ్రూప్–1 బాలురు: 1. లితీశ్ గౌడ్ (కర్ణాటక), 2. సూర్యాన్షు (తెలంగాణ), 3. గిరిధర్ (కేరళ). రుత్విక్ రెడ్డి (తెలంగాణ), సుహాస్ ప్రీతమ్ (తెలంగాణ) -
రాణించిన తెలంగాణ స్విమ్మర్లు
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు రాణించారు. గచ్చిబౌలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో పోటీలకు రెండోరోజు శనివారం పలు ఈవెంట్లలో పాల్గొన్న తెలంగాణ స్విమ్మర్లు ఒక స్వర్ణం, 4 రజతాలు, 4 కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు రెండు పతకాలు లభించాయి. ఈవెంట్ల వారీగా విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. 800 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1 బాలురు: 1. దీప్ వెంకటేశ్ (కర్ణాటక), 2. మోహిత్ వెంకటేశ్ (కర్ణాటక), 3. సీహెచ్ అభిలాష్ (తెలంగాణ); బాలికలు: 1. నిధి (కర్ణాటక), 2. అనుమతి చౌగులే (కర్ణాటక), 3. కవియా (తమిళనాడు). గ్రూప్–2 బాలురు: 1. సర్వేపల్లి కృష్ణప్రణవ్ (తమిళనాడు), 2. శివాంక్ విశ్వనాథ్ (కర్ణాటక), 3. సంజిత్ (కర్ణాటక); బాలికలు: 1. అశ్మిత చంద్ర (కర్ణాటక), 2. వృత్తి అగర్వాల్ (తెలంగాణ), 3. రితిక (కర్ణాటక). గ్రూప్–3 బాలురు: 1. ఆర్. నవనీత్ (కర్ణాటక), 2. సుహాస్ ప్రీతమ్ (తెలంగాణ), 3. తనవ్ భరద్వాజ్ (కర్ణాటక); బాలికలు: 1. హషిక (కర్ణాటక), 2. విహిత (కర్ణాటక), 3. రోషిణి (తమిళనాడు). 200 మీ. వ్యక్తిగత మెడ్లే గ్రూప్–1 బాలురు: 1. రాజ్ వినాయక్ (కర్ణాటక), 2. లితీశ్ గౌడ (కర్ణాటక), 3. విశ్వాస్ రెడ్డి (తెలంగాణ); బాలికలు: 1.జాహ్నవి (తెలంగాణ) 2. గుణ్ మత్తా (కర్ణాటక), 3. అనుమతి (కర్ణాటక). గ్రూప్–2 బాలురు: 1. ఉత్కర్‡్ష (కర్ణాటక), 2. సాయి నిహార్ (తెలంగాణ), 3. తరుణ్ అరుణ్ (కర్ణాటక); బాలికలు: 1. లక్ష్య (కర్ణాటక), 2. నైషా షెట్టి (కర్ణాటక), 3. శ్రీయ మేరీ కమల్ (కేరళ). గ్రూప్–4 బాలురు: 1. సాయి ఆదిత్య (తమిళనాడు), 2. మోనిశ్ (కర్ణాటక), 3. గౌతమ్ శశివర్ధన్ (తెలంగాణ); బాలికలు: 1. ధినిధి డేసింగు (కర్ణాటక), 2. మెహ్రీన్ (కేరళ), 3. అలంకృతి (ఆంధ్రప్రదేశ్). 100 మీ. బటర్‌ఫ్లయ్ గ్రూప్–1 బాలురు: 1. రాజ్ వినాయక్ (కర్ణాటక), 2. సుదర్శన్ (కర్ణాటక), 3. విశ్వాస్ రెడ్డి (తెలంగాణ); బాలికలు: 1. విద్యశ్రీ (కర్ణాటక), 2. ఇన్చర (కర్ణాటక), 3. మరియా పడయత్ (కేరళ). గ్రూప్–2 బాలురు: 1. ఉత్కర్ష్ (కర్ణాటక), నయన్ విఘ్నేశ్ (కర్ణాటక), 3. కార్తికేయన్ (తమిళనాడు); బాలికలు: 1. నైనా (కర్ణాటక), 2. సంజన (తెలంగాణ), 3. అన్షు దేశ్‌పాండే (కర్ణాటక). గ్రూప్–3 బాలురు: 1. రేణుకాచార్య (కర్ణాటక), 2. తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్), 3. ఆర్యన్ పాటిల్ (కర్ణాటక); బాలికలు: 1. హషిక (కర్ణాటక), 2. సాబా సుహానా (కర్ణాటక), 3. రోషిణి (తమిళనాడు). -
గచ్చిబౌలిలో సౌత్‌జోన్ స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం
-
కర్ణాటక స్విమ్మర్ల పతకాల పంట
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల తొలి రోజు కర్ణాటక స్విమ్మర్లు పతకాల పంట పండించారు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో మొదటి రోజు ఏకంగా కర్ణాటక స్విమ్మర్లు 32 ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొత్తం 40 వేర్వేరు ఈవెంట్లలో పోటీలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 16 పతకాలు, ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 8 పతకాలు లభించాయి. తెలంగాణ పతకాల జాబితాలో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 10 కాంస్యాలు ఉండగా... ఏపీ పతకాల్లో 2 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. ఏపీకి మొదటి రోజు స్వర్ణం దక్కలేదు. ఆదివారం వరకు అక్వాటిక్స్ చాంపియన్‌షిప్ కొనసాగుతుంది. తెలంగాణ తరఫున బాలుర 200 మీటర్ల ఫ్రీస్టయిల్ గ్రూప్–1, బాలుర 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ గ్రూప్–1 ఈవెంట్లలో ఎస్. రుత్విక్ నాగిరెడ్డి స్వర్ణాలు గెలుచుకోవడం విశేషం. బాలికల 200 మీటర్ల ఫ్రీ స్టయిల్ గ్రూప్–2 ఈవెంట్లో కె. సంజనకు బంగారు పతకం లభించింది. తొలి రోజు ఫలితాలు బాలుర విభాగం: 1500 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1: 1. దీప్ వెంకటేశ్ గిల్డా (కర్ణాటక–17 ని.13.42 సె.), 2. సమర్థ రావు (కర్ణాటక), 3. సాయి గణేశ్ (తమిళనాడు). 400 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–2: 1. సర్వేపల్లి కృష్ణ్ణ (తమిళనాడు–4ని. 25.97 సె.), 2. తరుణ్ గౌడ (కర్ణాటక), 3. శివాంక్ విశ్వనాథ్ (కర్ణాటక). 200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–3 : 1. రేణుకాచార్య (కర్ణాటక–2 ని. 24.66 సె.), 2. లోకేశ్ రెడ్డి (కర్ణాటక), 3. డి. వర్షిత్ (తెలంగాణ). 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–1: 1. లితీశ్ గౌడ (కర్ణాటక–2 ని. 35.48 సె.), 2. అన్బు కథీర్ (తమిళనాడు), 3. బి. సూర్యాంశు (తెలంగాణ). 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–2: 1. జాషువా థామస్ (తమిళనాడు–2 ని. 34.76 సె.), 2. శుభాంగ్ కుబేర్ (కర్ణాటక), 3. విదిత్ శంకర్ (కర్ణాటక). 100 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–3: 1. నవనీత్ గౌడ (కర్ణాటక–1ని. 24.65 సె.), 2. యష్ కార్తీక్ (కర్ణాటక), 3. దర్శన్ (తమిళనాడు). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–4: 1.ఎస్. శ్రీనివాస్ (తమిళనాడు–40.68 సె.), 2. యష్‌రాజ్ (కర్ణాటక), 3. ఎంఎస్ నితీశ్ (తమిళనాడు). 50 మీ. బటర్‌ఫ్లయ్ గ్రూప్–1: 1. సాయి సమర్థ్ (కర్ణాటక–27.62 సె.), 2. మోహిత్ వెంకటేశ్ (కర్ణాటక), 3. బి. సూర్యాంశు (తెలంగాణ). 50 మీ. బటర్‌ఫ్లయ్ గ్రూప్–2: 1. నయన్ విఘ్నేశ్ (కర్ణాటక–28.18 సె.), 2. కార్తికేయన్ నాయర్ (కర్ణాటక), 3. అవినాశ్ (తమిళనాడు). 200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1: 1. ఎస్. రుత్విక్ నాగిరెడ్డి (తెలంగాణ–2ని. 0.96 సె.), 2. మోహిత్ వెంకటేశ్ (కర్ణాటక), 3. సీహెచ్ అభిలాష్ (తెలంగాణ). 200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–2: 1. తరుణ్ గౌడ (కర్ణాటక–2 ని. 6.53 సె.), 2. సర్వేపల్లి కృష్ణ్ణ (తమిళనాడు), 3. అక్షయ్ (కర్ణాటక). 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–3: 1. యష్ కార్తీక్ (కర్ణాటక–1 ని. 12.97 సె.), 2. ఆర్యన్ అప్టిల్ (కర్ణాటక), 3. ఎం.తీర్థు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్). 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–1: 1. ఎస్. రుత్విక్ నాగిరెడ్డి (తెలంగాణ–1 ని. 3.92 సె.), 2. వై. జశ్వంత్ రెడ్డి (తెలంగాణ), 3. డారెల్ స్టీవ్ (తమిళనాడు). 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–2: 1. ఉత్కర్‡్ష పాటిల్ (కర్ణాటక–1 ని. 4.50 సె.), 2. అక్షయ్ (కర్ణాటక), 3. ఎస్. ఆకాశ్ (తమిళనాడు). 50 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–4: 1. గోకులన్ (తమిళనాడు–36.86 సె.), 2. సర్వేపల్లి ఆదిత్య (తమిళనాడు), 3. శ్రీహరి కత్తి (కర్ణాటక). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–1: 1. అర్జున్ శంభు (కేరళ–30.38 సె.), 2. లితీశ్ గౌడ (కర్ణాటక), 3. బి. సూర్యాంశు (తెలంగాణ). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–2: 1. విదిత్ శంకర్ (కర్ణాటక–33.21 సె.), 2. షాన్ ఆంటోనీ (కేరళ), 3. జాషువా థామస్ (తమిళనాడు). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–3: 1. భువన్ రుద్రరాజు (కర్ణాటక–37.91 సె.), 2. నవనీత గౌడ (కర్ణాటక), 3. యష్ రాఠీ (ఆంధ్రప్రదేశ్). 4–200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1 రిలే: 1. కర్ణాటక, 2. తెలంగాణ, 3. కేరళ. 4–50 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–4 రిలే: 1. కర్ణాటక, 2. తమిళనాడు, 3. తెలంగాణ బాలికల విభాగం: 1500 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1: 1. నిధి శశిధర (కర్ణాటక–20 ని.12.88 సె.), 2. అనుమతి చౌగ్లే (కర్ణాటక), 3. ఎస్.కావ్య (తమిళనాడు). 400 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–2: 1. అష్మిత చంద్ర (కర్ణాటక–4 ని. 53.24 సె.), 2. వృత్తి అగర్వాల్ (తెలంగాణ), 2. కె. సంజన (తెలంగాణ). 200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–3: 1. హషిక (కర్ణాటక–2 ని. 27.30 సె.), 2. సబా సుహానా (కర్ణాటక), జి. శర్ష (తెలంగాణ). 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–1: 1. గున్ మటా (కర్ణాటక–2 ని 56.16 సె.), 2. ఆరాధన (కేరళ), 3. షానియా గ్రేస్ (కర్ణాటక). 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–2: 1. హితైషి (కర్ణాటక–2ని. 55.29 సె.), 2. అన్విత గౌడ (కర్ణాటక), 3. వి. నాగ గ్రీష్మిణి (ఆంధ్రప్రదేశ్). 100 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–3: 1. విహిత నయన (కర్ణాటక–1 ని. 22.37 సె.), 2. మనవి వర్మ (కర్ణాటక), 3. ఎన్. పావని సరయు (ఆంధ్రప్రదేశ్). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–4: 1. ధీనిధి (కర్ణాటక–39.53 సె.), 2. ఆకతి మాలిని (తమిళనాడు), 3. అక్షర (తమిళనాడు). 50 మీ. బటర్‌ఫ్లయ్ గ్రూప్–1: 1. సువన భాస్కర్ (కర్ణాటక–29.64 సె.), 2. ఇన్చర (కర్ణాటక), 3. కప (కేరళ). 50 మీ. బటర్‌ఫ్లయ్ గ్రూప్–2: 1. నీనా వెంకటేశ్ (కర్ణాటక–30.11 సె.), 2. రిషిక మంగ్లే (కర్ణాటక), 3. కె. సంజన (తెలంగాణ). 200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1: 1. బి. ఇన్చర (కర్ణాటక–2 ని. 22.33 సె.), 2. ప్రీత వెంకటేశ్ (కర్ణాటక), 3. నిర్మల (కేరళ). 200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–2: 1. కె. సంజన (తెలంగాణ–2 ని. 18. 27 సె.), 2. అష్మిత చంద్ర (కర్ణాటక), 3. హిత ఆనంద్ (కర్ణాటక). 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–3: 1. మానవి వర్మ (కర్ణాటక–1 ని. 16. 53 సె.), 2. నక్షత్ర గౌతమ్ (కర్ణాటక), 3. ఎస్. సంధ్య (తమిళనాడు). 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–1: 1. సువన భాస్కర్ (కర్ణాటక–1 ని. 9.66 సె.), 2. భూమిక (కర్ణాటక), 3. జాహ్నవి గోలి (తెలంగాణ). 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–2: 1. నీనా వెంకటేశ్ (కర్ణాటక–1 ని. 11.09 సె.), 2. నైషా శెట్టి (కర్ణాటక), 3. అక్షిత (తమిళనాడు). 50 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–4: 1. ధీనిధి (కర్ణాటక–36. 27 సె.), 2. బి. అలంకృతి (ఆంధ్రప్రదేశ్), 3. ప్రమితి జ్ఞానశేఖరన్ (తమిళనాడు). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–1: 1. గున్ మత్తా (కర్ణాటక–37. 77 సె.), 2. ఆరాధన (కేరళ), 3. షానియా గ్రేస్ (కర్ణాటక). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–2: 1. అన్విత గౌడ (కర్ణాటక–36.56 సె.), 2. వి. నాగ గ్రీష్మిణి (ఆంధ్రప్రదేశ్), 3. హితైషి (కర్ణాటక). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–3: 1. విహిత నయన (కర్ణాటక–37. 55 సె.), 2. మానవి వర్మ (కర్ణాటక), 3. ఎన్. పావని సరయు (ఆంధ్రప్రదేశ్). 4–200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1 రిలే: 1. కర్ణాటక, 2. కేరళ, 3. తమిళనాడు. 4–50 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–4 రిలే: 1. కర్ణాటక, 2. తమిళనాడు, 3. ఆంధ్రప్రదేశ్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సౌత్‌జోన్ స్విమ్మింగ్ టోర్నీకి రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌కు సర్వం సిద్ధమైంది. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అక్వాటిక్ కాంప్లెక్స్‌లో ఈ పోటీలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నమెంట్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన దాదాపు 600 మంది స్విమ్మర్లు పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన స్విమ్మర్లు పతకం కోసం పోటీపడనున్నారు. బాలబాలికల కేటగిరీలలో ఫ్రీస్టయిల్, మెడ్లీ, బటర్‌ఫ్లయ్, బ్యాక్‌స్ట్రోక్, రిలే ఈవెంట్లలో పోటీలు జరుగుతాయి. ఇందులో పాల్గొనే క్రీడాకారులను వయస్సు ప్రకారం గ్రూప్–1 (15, 16, 17 వయస్సు), గ్రూప్–2 (12, 13, 14 వయస్సు), గ్రూప్–3 (11 వయస్సు), గ్రూప్–4 (9, 10 వయస్సు)గా విభజించారు. తెలంగాణ నుంచి మొత్తం 105 మంది స్విమ్మర్లు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 52 మంది బాలికలు, 53 మంది బాలురు ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు జరుగనున్న టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభిస్తారు. తెలంగాణ జట్ల వివరాలు బాలికలు: ఇష్వి మతాయ్, ఎం. ప్రణతి, డి.సాయి కీర్తన, పి. స్తుతిశ్రీ, టి. సంవేద, నిషా గణేశ్, ఆయుషి గుప్తా, శ్రేయ పంజల, జాహ్నవి, పి. సింధుజ, డీఎం హర్షిత, ఫతీకా, సుదీక్ష, శ్రీమణి, కాత్యాయని, కశ్యపి, కె. సంజన, వృత్తి అగర్వాల్, సరయు రెడ్డి, వాణి జిందాల్, హాసిని రెడ్డి, ఎం. రిత్విక, ఆస్థ, జి. రాజలక్ష్మి, పి. చిన్మయి రెడ్డి, యోగిత, జి. రాజ్శ్రీ లాస్య, ప్రీతి సుసాన్, ఎ. మోక్షిత, వేదశ్రీ ఉప్పాల, శ్రీజని, గనగశ్రీ, హేమన్వర్షిణి, కె. సుదీక్ష, శ్రీ నిత్య, డి. రీతు, అదితి, టి. సాయి ప్రజ్ఞ, ఖనక్ జైన్, పి.షినేష్మ, ఇషితా రసమయి, అభిచందన, సిమ్రన్ పటేల్, కె. వర్షిణి ప్రియ, అక్షిత, కర్ణిక గుప్తా, నిహారిక, దీక్షిత, ఎస్. తేజస్వి, ఎన్. స్ఫూర్తి, వర్ష. బాలురు: రుత్విక్ రెడ్డి, టి. సాయి తరుణ్, సీహెచ్ అభిలాష్, వై. జశ్వంత్ రెడ్డి, వై. చార్లెస్ ఫిన్నే, వి. సాయి ప్రణీత్ కుమార్, కె. రాఘవేంద్ర, దువాన్‡్ష శర్మ, సాయి ప్రణయ్, సూర్యాన్షు బాషా, ఎం. విశ్వాస్ రెడ్డి, దిగ్విజయ్, అభిషేక్, పి. త్రిషిక్, ఎస్. రాజ్ లిఖిత్, బి. సాయి నిహార్, ఎన్. మహర్షిత్, ఎం. హనుమాన్, మొహమ్మద్ కమిలుద్దీన్, అర్జున్, ఆర్. సాత్విక్ రాజ్, ఇషాన్దూబే, ఉదిత్ కొతారి, కె. శశిధర్ రెడ్డి, ఇషాన్ అరోరా, అవినాశ్ కుమార్, ఆశ్రిత్ కుమార్, సుహాస్ ప్రీతమ్, జోర్డాన్ డోమ్నిక్ ఫ్రాంక్లిన్, అక్షిత్, వర్షిత్, స్టాష్ జోసెఫ్, ఎస్ఎస్ ప్రజ్వల్, హర్షిత్, వివేకానంద రెడ్డి, బి. గౌతమ్ శశివర్ధన్, అభయ్, తేజస్ కుమార్, నమన్, యశస్వీ, కె. సుజల్, కె. లలిత్ సాగర్, కె. రోహన్ రెడ్డి, ఆర్యమన్ సింగ్ పటేల్, జి. కార్తీక్, కె. మనీశ్ గౌడ్, పి. ఆదిత్య రాయ్, ఎం. అభిషేక్, జ్వాల తనయ్ సింగ్, అనిల్ శ్రీవాస్తవ్, జె. సాయితేజ, నవీన్ కృష్ణ, ఎల్. మణిదీప్. -
బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ‘ఆశ..ఆనందం.. ఐకమత్యం’
-
వావ్ ‘బ్రేవ్’
-
పంచ్ అదరాలి..
హైదరాబాద్ సిటీ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్‌కు వేదిక కానుంది.ఈ మేరకు ఈ నెల 22న గచ్చిబౌలి స్టేడియంలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ‘బ్రేవ్–20’ నిర్వహించనున్నారు. కండలు తిరిగిన ఫైటర్లు...కళ్లు చెదిరే పంచ్‌లతో రింగ్‌లో అద్భుతమైన విన్యాసాలు చూడొచ్చనినిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ పోరులో పాల్గొనేందుకు 15 దేశాల నుంచి ప్రముఖ ఫైటర్లు నగరానికి రానున్నారు.∙22న మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ‘బ్రేవ్–20’ ∙వేదికైన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ∙15 దేశాల నుంచి ఫైటర్స్ హాజరు∙మన దేశ ఫైటర్లకు గేమ్‌లో చోటు ∙21న నెక్లెస్ రోడ్డులో ఫ్రీ ట్రైల్ కండలు తిరిగిన ఫైటర్లు.. పళ్లు బిగించి రింగ్‌లో పంచ్‌లు విసురుతుంటే చూస్తున్న వారి ఒళ్లు జలదరించాల్సిందే. ఇటువంటి ఫైటింగ్ వీడియోలు చూసే ఉంటాం. లైవ్ ఫైట్స్ అన్నీ ఇప్పటి దాకా ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ చానల్లో మాత్రమే చూసి ఉంటాం. వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ విదేశాలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, కెన్యా, సౌతాఫ్రికా వంటి దేశాల్లో అత్యంత ప్రజాదరణ ఉన్నవాటిలో ఈ క్రీడలు ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సరికొత్త ఆట నగరవాసులను అలరించనుంది. భారతదేశంలో తొలిసారి ‘మెర్క్యుర్ స్పోర్ట్స్’ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22న జరిగే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ) ‘బ్రేవ్–20’కి గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. ఈ పోరులో పాల్గొనేందుకు 15 దేశాల నుంచి కండలు తిరిగిన ఫైటర్లు నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ‘ఎంఎంఏ’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – చైతన్య వంపుగాని ఎక్కడిది ఈ ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’ ‘బెహరైన్’ దేశంలో అక్కడి యువరాజు ‘షేక్ ఖాలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా’ మూడేళ్ల క్రితం ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’(ఎంఎంఏ)ను ‘బ్రేవ్–20’ పేరుతో ఈ ఆటను అక్కడ ప్రారంభించారు. ఇలా ఇప్పటి దాకా 22 దేశాల్లో 19 గేమ్స్ జరిగాయి. ఇప్పుడు ‘గ్లోబల్ ప్రమోషన్’ పేరుతో మన దేశంలో ఏర్పాటు చేసేందుకు ‘ఆల్ ఇండియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్’ అనుమతి ఇచ్చింది. దీంతో దీన్ని సిటీలో నిర్వహించేందుకు ‘మెర్క్యూర్ స్పోర్ట్స్’ సీఈఓ అక్బర్ రషీద్ ముందుకు వచ్చారు. ప్రమోటర్స్ వంశీరాజ్, శ్రీనివాస్, ఆదిత్యతో కలసి ఈ నెల 22న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆటను ప్రారంభించనున్నారు. భారతేదశంలో తొలిసారి నగర వేదికపై ఈ క్రీడ జరుగుతుండడంతో క్రేజ్ పెరిగిపోయింది. బాక్సింగ్‌ను పోలినట్టు.. అందరికీ తెలిసిన బాక్స్ంగ్ మాదిరిగానే ఈ ఆట కూడా ఉంటుంది. అయితే, ఇందులో ముష్టిఘాతాలతో పాటు కర్రసాము కూడా అదనం. ఈ క్రీడ మిడిల్ వెయిట్ బౌట్, లైట్ వెయిట్ బౌట్, బంటమ్ వెయిట్ బౌట్, స్ట్రావ్వెయిట్ బౌట్, ఫిదర్ వెయిట్ బౌట్.. ఇలా మొత్తం 12 కేటగిరీల్లో జరుగుతుంది. అండర్ కార్డ్ విభాగంలో ‘హైవెయిట్ బౌట్, బంటమ్ వెయిట్ బౌట్, మిడిల్ వెయిట్ బౌట్, లైట్ వెయిట్ బౌట్, ఫ్లైవైయిట్ బౌట్’ కేటగిరిల్లో ఇద్దరు చొప్పున తలపడతారు. ఐదు నిమిషాలకు ఓ రౌండ్ చొప్పున మూడు రౌండ్స్ ఉంటాయి. ఒక్కో గేమ్‌ను 15 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇందులో ఓ నిమిషం బ్రేక్ ఉంటుంది. 150 మంది ఆటగాళ్లు రాక గతంలో ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఆటగాళ్లు కూడా ఇప్పుడు జరిగే పోటీలో పాల్గొనేందుకు సిటీకి రానున్నారు. అలాంటి వారు 150 మంది ఉన్నట్టు అక్బర్ రషీద్ తెలిపారు. వీరిలో మన దేశానికి చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారు. వారిలో లియోన్ అలియూ, కాంతరాజ్ శంకర్, నెల్సన్ ఫయీస్, సతేందర్ బంకురా, జాసన్ సాల్మన్, సరబ్జిత్ సింగ్, సత్య బహారియా, నిథిన్ కోషీ ఉన్నారు. 21న ఆటగాళ్లతో పరిచయం ఈ ఆటను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ‘మెర్క్యూర్ స్పోర్ట్స్’ సిద్ధమైంది. క్రీడాకారులను నగరవాసులకు పరిచయం చేసేందుకు సన్నహాలు చేస్తున్నాం. ఈ నెల 21న మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో ట్రయల్ ఫైట్స్ ఉంటాయి. దీనికి ఎలాంటి ప్రవేశ రుసుం లేదు. – అక్బర్ రషీద్, మెర్క్యూర్ స్పోర్ట్స్ సీఈఓ టికెట్లు ఇలా.. ఈ ఆట టికెట్ ధరలు రూ.499 నుంచి రూ.4999 వరకు ఉన్నాయి. గ్యాలరీ టిక్కెట్ రూ.499, ప్రీమియం టిక్కెట్ రూ.3500, వీవీఐపీ టికెట్ రూ.4999. కావాల్సిన వారు www.meraevents.com లో బుక్ చేసుకోవచ్చు. -
సితారే జమీన్ పర్
-
రెహమానియా
అద్భుతమైన సంగీతంతో మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సిటీని ఉర్రూతలూగించాడు. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన రెహమాన్ మ్యూజిక్ ప్రోగ్రాంకు భారీ సంఖ్యలో సంగీతప్రియులు హాజరయ్యారు. ఈ షోలో పలువురు గాయనీ గాయకులు పాలుపంచుకున్నారు. గచ్చిబౌలి స్టేడియం సంగీత మాంత్రికుడి మాయలో ఓలలాడింది. పాటల సందడిలో మునిగిపోయింది. ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తాఫా అంటూ.. ఏఆర్ రెహమాన్ తన పాటలతో మైమరిపించాడు. ఆదివారం రెహమాన్ సంగీత ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు హాజరయ్యారు. జెంటిల్మన్, ప్రేమికుడు వంటి సినిమాల్లోని హిట్ సాంగ్స్ తో వీనులవిందు చేశాడు. వేదిక లేజర్ కాంతులతో కొత్త శోభను సంతరించుకుంది. వందేమాతరం పాటకు స్టేడియం ప్రాంగణం మొత్తం ఉద్వేగంతో కదిలిపోయింది. దాదాపు రెండున్నర గంటలపాటు షో కొనసాగింది. -
మ్యూజిక్.. మ్యాజిక్
-
సెలెబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్
-
ఉత్సాహంగా ఎంపికలు
అథ్లెటిక్స్ ఎంపికలకు 800 మంది క్రీడాకారులు హాజరు ఈ నెల 24 నుంచి గచ్చిబౌలిలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ మీట్ మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 24, 25తేదీల్లో జరిగే 3వ తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్–14, 16, 18, 20విభాగాల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను మంగళవారం స్థానిక స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలకు జిల్లావ్యాప్తంగా దాదాపు 800మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి కేటగిరీల వారీగా 100మీ., 200మీ., 400మీ., 600మీ., 800మీ., 1500మీ., 2000మీ., 3000మీ., 5000మీ., 10000మీటర్ల పరుగుతో పాటు 5కేఎం, 10కేఎం నడక, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలిన్‌త్రో అంశాల్లో ఎంపికలు నిర్వహించారు. అంతకుముందు ఎంపికలను డీఎస్డీఓ టీవీఎల్ సత్యవాణి, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీఓ నంబర్ 4 క్రీడాపాలసీని జారీ చేసినట్లు తెలిపారు. 50క్రీడాంశాల్లో అథ్లెటిక్స్‌కు అగ్రభాగాన ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. అథ్లెటిక్స్‌కు ఎనలేని గుర్తింపు ఉందని, క్రమశిక్షణ, ఏకాగ్రతతో సాధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఎంపికలకు బాలికలు కూడా అధికసంఖ్యలో రావడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ మీట్లో పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు రాజేశ్వర్, శ్రీనివాసులు, పీఈటీలు ఆనంద్, సునీల్‌కుమార్, శ్రీనివాసులు, సాధిక్ అలీ, స్వాములు తదితరులు పాల్గొన్నారు. -
బేటి బచావో-బేటీ పడావో:కేటీఆర్
-
గచ్చిబౌలి స్టేడియం చేరుకున్న సింధు
-
నజీబ్ ఖురేషీకి రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్ప్రింట్స్‌లో తెలంగాణ కుర్రాడు అబ్దుల్ నజీబ్ ఖురేషీ మెరిశాడు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 100 మీటర్ల పరుగులో నజీబ్ రజత పతకం గెలుచుకున్నాడు. 10.63 సెకన్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. షమీర్ మోన్ (మణిపూర్-10.60 సె.) స్వర్ణ పతకం సాధించగా, అనిరుధ గుంజాయ్ (మహారాష్ట్ర-10.66 సె.)కు కాంస్యం దక్కింది. -
తెల్లబోయిన రాత్రి
శ్వేతవర్ణం ఉదయించింది. చీకటి చిన్నబోయింది. రంగు మారిన తనను తాను చూసుకుని రాత్రి ‘తెల్ల’బోయింది. సిటీలో శనివారం రాత్రి జరిగిన వైట్ ఈవెంట్... నైట్ లుక్‌ని అమాంతం మార్చేసింది. వేదిక నుంచి వేడుక దాకా అంతా తెలుపే పులుముకుని కొత్త వెలుగుల్ని విరజిమ్మింది. కార్పొరేట్ కుర్రాళ్ల నుంచి సెలబ్రిటీ స్టార్ల దాకా అందర్నీ గచ్చిబౌలి స్టేడియంకు రప్పించిన వైట్ సెన్సేషన్... తెల్లని డ్రెస్‌కోడ్‌లో పార్టీ పీపుల్‌కి పీస్‘ఫుల్’ కలర్ ఇచ్చింది. ఆమ్స్టర్ డామ్ నుంచి తరలి వచ్చిన అద్భుతమైన ఆర్టిస్టుల ప్రదర్శనలు, ప్రపంచ టాప్ క్లాస్ డీజేల మ్యూజిక్ హోరు.. కలగలిసి ఈ సెన్సేషన్ ఓ మరపురాని స్వీట్ అండ్ వైట్ మెమరీ అని అతిథుల చేత అనిపించింది. -సాక్షి, వీకెండ్ ప్రతినిధి -
‘తెలుపే’ సెన్సేషన్!
హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి డ్యాన్స్ ఈవెంట్ * గచ్చిబౌలి స్టేడియంలో నేడు ‘వైట్ సెన్సేషన్’ * ఎటు చూసినా కేవలం ‘తెలుపు’ వర్ణమే సాక్షి, హైదరాబాద్: ఎటు చూసినా తెల్లని తెలుపు. కళ్లు జిగేల్మనిపించే లైటింగ్. అబ్బురపరిచే సెట్టింగులు. వీటన్నింటికీ మించి అదిరిపోయే సంగీత, నృత్య ప్రదర్శనలు... ఇదంతా ‘వైట్ సెన్సేషన్’. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఈ డ్యాన్స్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఉర్రూతలూగించనుంది. ఈ సెన్సేషన్ గురించిన కొన్ని విశేషాలు... నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ‘వైట్ సెన్సేషన్’ ఊపిరిపోసుకుంది. ఇప్పుడు దాదా పు 33 దేశాలకు విస్తరించింది. ఆసియా ఖం డంలోనే తొలిసారిగా ఇప్పుడు భారతదేశంలో అడుగుపెట్టింది. బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాలు పోటీపడినా ఈ ఈవెంట్‌ను హైదరాబాద్ దక్కించుకుంది. ఈ ఈవెంట్‌కు దాదాపు 20 వేల మంది హాజరవుతారని భావి స్తున్నట్లు హైదరాబాద్‌లో దీన్ని నిర్వహిస్తున్న వయోలా ఈవెంట్స్ నిర్వాహకుడు విజయ్ అమృత్‌రాజ్ చెప్పారు. మరో నాలుగేళ్ల పాటు దీన్ని ఏటా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకతో గచ్చిబౌలి స్టేడియం మొత్తం డ్యాన్స్ఫ్లోర్గా మారిపోతుందని అభివర్ణించారు. అధికారికంగా నిర్వాహకులు వెల్లడించనప్పటికీ ఈ ఈవెంట్‌కు కనీసం రూ.10 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఊగే వేదిక... ఉత్తేజమే కానుక ఈవెంట్‌కు అవసరమైన పరికరాలను ఆమ్స్టర్డామ్ నుంచి 13 కంటెయినర్లలో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. మొత్తం తమ పరికరాలే తప్ప స్థానికంగా లభించేవి ‘వైట్ సెన్సేషన్’ కోసం వినియోగించరు. దాదాపు 5 నెలల పాటు 30 మంది ఇంజనీర్లు శ్రమించి, షో డిజైనింగ్, వేదిక నిర్మాణం కోసం శ్రమించారు. ‘పైరో డిజైన్’లో రకరకాల పొగలు ఒకేసారి వెదజల్లేలా ఏర్పాట్లు చేశారు. 800కిపైగా ఎల్ఈడీ లైట్లు అమర్చారు. ఈవెంట్ వేదిక 360 డిగ్రీల కోణంలో సందర్శకుల మధ్యలో ఉంటుంది. ఇది నిమిషానికి మూడు సార్లు తిరుగుతూ ఉంటుంది. ఇందులో పాల్గొనే 20 మంది డ్యాన్సర్లు భారతీయులే. వారిని గత కొన్ని నెలలుగా పోటీ నిర్వహించి ఎంపిక చేశారు. ఇక ఇది పూర్తిగా శ్వేత లోకం. ఆర్టిస్ట్‌లు, డీజేలతో సహా అతిథులకు కూడా తెలుపురంగు డ్రెస్ కోడ్ తప్పనిసరి. ప్రపంచంలోనే మొత్తం శ్వేత వర్ణమయమై సాగే సంగీత, నృత్యోత్సవం ఇదొక్కటే. -
ద్యుతీ చంద్ రికార్డు
దోహా (ఖతార్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. ఒడిషాకు చెందిన ద్యుతీ 60 మీటర్ల విభాగంలో ఈ రికార్డు సృష్టించింది. శుక్రవారం జరిగిన ఈ ఈవెంట్లో ద్యుతీ 7.28 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో 7.81 సెకన్లతో అర్జిన ఖాతూన్ (భారత్) పేరిట ఉన్న జాతీయ రికార్డును ద్యుతీ సవరించింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణకు చెందిన కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ పొందుతున్న ద్యుతీ తన టైమింగ్‌తో చాంపియన్‌షిప్ రికార్డును కూడా నెలకొల్పింది. ఇప్పటివరకు ఈ రికార్డు 7.33 సెకన్లతో విక్టోరియా (కజక్‌స్తాన్) పేరిట ఉండేది. -
చైనాపై తొలిసారి...
టీమ్ ఈవెంట్లో భారత్ పురుషుల జట్టు విజయం ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జపాన్ చేతిలో ఓడిన మహిళల జట్టు సాక్షి, హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు చెలరేగింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం భారత్ 3-2 తేడాతో చైనాను ఓడించింది. మూడు సింగిల్స్ మ్యాచ్‌లలోనూ భారత్ నెగ్గగా...రెండు డబుల్స్ మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. అంతర్జాతీయ స్థాయిలో ఏ టోర్నీలో అయినా టీమ్ ఈవెంట్లో భారత్... చైనాపై విజయం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. శ్రీకాంత్ జోరు వరల్డ్ నంబర్ 8 టియాన్ హోవీ, తొమ్మిదో ర్యాంకర్ శ్రీకాంత్‌ల మధ్య జరిగిన తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ ఆద్యంతం ఆధిపత్యం కనబర్చాడు. సింగపూర్‌తో గత మ్యాచ్‌లో తడబడిన హైదరాబాద్ ఆటగాడు ఈ సారి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 33 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు శ్రీకాంత్ 21-11, 21-17తో విజేతగా నిలిచాడు. అనంతరం తొలి డబుల్స్‌లో చైనా జోడి జున్హుయ్ లి-జిహాన్ క్యు 22-20, 21-11తో భారత ద్వయం మను అత్రి-సుమీత్ రెడ్డిని ఓడించింది. ఆ తర్వాత గంట పాటు జరిగిన హోరాహోరీ పోరులో అజయ్ జైరాం 22-20, 15-21, 21-18తో జెంగ్‌మింగ్ వాంగ్‌పై గెలుపొందాడు. మళ్లీ డబుల్స్‌లో యిల్ వాంగ్-వెన్ జాంగ్ 21-10, 21-18తో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్పై గెలుపొందడంతో స్కోరు 2-2తో సమమైంది. ఈ దశలో కీలక సింగిల్స్ ఆడిన హెచ్ఎస్ ప్రణయ్ ఒత్తిడికి లోను కాకుండా 21-14, 21-10తో యుఖీ షిని చిత్తు చేయడంతో భారత జట్టు గెలుపు ఖాయమైంది. మహిళల జట్టు చిత్తు మరో వైపు మహిళల జట్టుకు మాత్రం జపాన్ చేతిలో పరాజయం ఎదురైంది. జపాన్ 5-0తో భారత్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ నొజొమి ఒకుహరా 18-21, 21-12, 21-12తో సింధుపై గెలుపొందింది. తొలి గేమ్‌ను గెలుచుకున్నా...సింధు ఆ తర్వాత ఏమాత్రం పోరాడలేకపోయింది. తర్వాత మహిళల సింగిల్స్‌లో సయాకా సటో 24-22, 21-14తో పీసీ తులసిపై, యు హషిమొటో 23-25, 21-14, 21-14తో రుత్విక శివానిపై గెలుపొందారు. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి 12-21, 18-21తో మిసాకి మట్సుటొమో-అయాకా టకహషి చేతిలో పరాజయం పాలు కాగా... ఆఖరి మ్యాచ్‌లో షిజుక మట్సువో-మామి నైటో 18-21, 21-11, 21-16తో సింధు-సిక్కిరెడ్డి ద్వయాన్ని ఓడించారు. -
స్కైఫెస్ట్ కోలాహలం..
-
ముగిసిన కూచిపూడి నాట్య సమ్మేళనం
-
నృత్యకారుల మువ్వల సవ్వడి
-
కన్నుల పండుగ చేసిన కూచిపూడి
-
రన్ అండ్ స్విమ్
కొలనులో ఈత కొట్టేసి... రోడ్లపై పరుగు పెట్టేసి... సైకిల్‌పై సవారీ చేసేసి... రెగ్యులర్ బీట్తో బోరెత్తిపోయిన సిటీజనులు ఈ ఆదివారాన్ని విభిన్నంగా ఎంజాయ్ చేశారు. గచ్చిబౌలి స్టేడియం, శంకర్పల్లి ఇక్ఫైలలో నిర్వహించిన ‘హైదరాబాద్ ట్రయథ్లాన్’ పోటీల్లో పిల్లలు, యువతే కాదు... ఏడు పదులు దాటిన గ్రాండ్ ఫాదర్స్ కూడా పోటీపడి సిటీ స్పిరిట్ ఏంటో చూపారు. వెయ్యి మందికి పైగా పాల్గొన్న ఈ మెగా ఈవెంట్‌కు... ఇతర రాష్ట్రాల నుంచి ప్రొఫెషనల్ క్రీడాకారులు, ఔత్సాహికులు కూడా తరలివచ్చారు. స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్‌తో పాటు హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ కొత్తగా పరిచయం చేసిన 3/4 ఐరన్, పవర్ డువథ్లాన్ మరింత జోష్ పెంచాయి. ‘నలభై ఏళ్ల వయసు నుంచీ అథ్లెటిక్స్‌లో పాల్గొంటున్నా. యువతకు రోల్ మోడల్‌గా ఉండాలన్నదే నా తాపత్రయం’ అని ఈ పోటీలో పాల్గొన్న 75 ఏళ్ల వృద్ధుడు, ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. -
సరదాగా ప్రీడమ్ రైడ్
స్వతంత్ర దినోత్సవ వేళ సిటీలో సైక్లింగ్ సందడి కనిపించింది. గచ్చిబౌలి స్టేడియంలో ద అట్లాంటా ఫౌండేషన్, వొడాఫోన్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన ఫ్రీడమ్ రైడ్‌లో పదివేల మందికిపైగా సైకిల్ రైడర్లు పాల్గొన్నారు. ఆరేళ్ల బుడతల నుంచి అరవై ఏళ్ల సీనియుర్ సిటిజన్ల వరకు అందరూ సైకిల్ రైడ్‌లో సరదాగా కదిలారు. 67 కిలోమీటర్ల ఈ రైడ్‌ను ఐటీ వుంత్రి కేటీఆర్, క్రికెటర్ ప్రజ్ఞా ఓజా, సినీనటి మంచు లక్ష్మి ప్రారంభించారు. ‘స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ నేషన్’ అంటూ ప్రత్యేకంగా మహిళా సైక్లింగ్ టీమ్, స్ట్రాంగ్ యూత్, స్ట్రాంగ్ నేషన్ అంటూ ప్రత్యేకంగా చిన్నారుల టీమ్‌లు పాల్గొన్నాయి. ప్రొఫెషనల్ సైక్లిస్ట్ల కోసం ‘టఫ్ క్రిటేరియం’ను నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన ఈ సిగ్నేచర్ రైడ్ మలేసియా టౌన్షిప్, ఇనార్బిట్ మాల్, లంగర్‌హౌస్ రోడ్, హిమాయత్ సాగర్ లేక్, వీఐఎఫ్ కాలేజీ మీదుగా మైక్రోసాఫ్ట్ వరకు సాగింది. - వాంకె శ్రీనివాస్ -
అనుమతి నిరాకరణ అన్యాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 28న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో తాము నిర్వహించతలపెట్టిన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ అడ్వొకేట్స్ యాక్షన్ కమిటీ ఫర్ సమైక్యాంధ్రప్రదేశ్ కన్వీనర్ సి.వి.మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తన ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఆర్.అశోక్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించేందుకు ఈ నెల 28న సీమాంధ్ర ప్రాంత న్యాయవాదులు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సమావేశం కావాలని నిర్ణయించారు, ఈమేరకు స్టేడియం నిర్వహకులైన శాప్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, సమావేశానికి వారు అనుమతినిచ్చారని, అయితే పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరని చెప్పడంతో, తాము ఈ విషయాన్ని సైబరాబాద్ కమిషనర్, మాదాపూర్ డీసీపీల దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరామని వివరించారు. అయితే తమ అభ్యర్ధనను పోలీసులు తిరస్కరించారని, గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండటం వల్ల అక్కడ సమావేశాలకు అనుమతినివ్వలేమని చెప్పారని, ఈ కారణం ఎంత మాత్రం సరైనది కాదని ఆయన తెలిపారు. సమావేశం కావాలనుకుంటున్నది న్యాయవాదులు మాత్రమేనని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమావేశం నిర్వహించుకుంటామంటే అనుమతినివ్వకపోవడం అన్యాయమని ఆయన కోర్టుకు నివేదించారు. అదే ప్రాంతంలో సమావేశం నిర్వహించుకునేందుకు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సైతం దరఖాస్తు చేసిందని పోలీసులు చెబుతున్నారని, వాస్తవానికి తమకు తెలిసి అటువంటి దరఖాస్తు ఏదీ లేదని ఆయన తెలిపారు. తమ సమావేశం నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, పోస్టర్లు విడుదల జరిగిందని, సీమాంధ్రలోని అన్ని బార్ అసోసియేషన్లకు సమాచారం వెళ్లిందని, సమావేశంలో పాల్గొనేందుకు న్యాయవాదులంతా తగిన ఏర్పాట్లు చేస్తున్నారని అశోక్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సమావేశం నిర్వహిస్తాం: మోహన్‌రెడ్డి శనివారం తాము నిర్వహించతలపెట్టిన సమావేశం యధాతధంగా జరుగుతుందని మోహన్‌రెడ్డి తెలిపారు. తమ సమావేశానికి అనుమతివ్వపోవడానికి పోలీసులు చెప్పిన కారణాలు ఎంత మాత్రం సహేతుకంగా లేవని చెప్పారు. కేసు విచారణ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శాంతియుతంగా తాము సమావేశం నిర్వహించుకుంటామని, ఈ విషయంలో కోర్టు తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. గతంలో కోర్టు ఇటువంటి సమావేశాలకు పలుమార్లు అనుమతులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. -
ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌కు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఘన నివాళి అర్పించారు. ఆయన 108వ జయంతి సందర్భంగా దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లోనూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ధ్యాన్‌చంద్ విగ్రహానికి శాప్ ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్, శాప్ ఎండీ రాహుల్ బొజ్జ, క్రీడాశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హాకీ మ్యాచ్ నిర్వహించారు. న్యూఢిల్లీలో ధ్యాన్‌చంద్‌పై తొలిసారి గ్రాఫిక్స్ రూపంలో జీవిత చరిత్రను ఆవిష్కరించారు. ‘ధ్యాన్‌చంద్-ది విజార్డ్ ఆఫ్ హాకీ’ పేరుతో రూపొందిన ఈ పుస్తకాన్ని గురువారం ఆయన 108వ జయంతి సందర్భంగా కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశి థరూర్ ఆవిష్కరించారు. ఒక క్రీడాకారుడిపై గ్రాఫిక్స్ రూపంలో పుస్తకం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లలో ధ్యాన్‌చంద్ అద్భుత ప్రదర్శనతో పాటు భారత్ తరఫున ఆయన సాధించిన ఘనతలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించారు. కామిక్ సిరీస్‌లు ప్రచురించడంలో గుర్తింపు ఉన్న అమర్ చిత్ ్రకథా సంపుటినుంచే ధ్యాన్‌చంద్ పుస్తకం కూడా వెలువడింది. ‘చిన్నారులకు స్ఫూర్తినిచ్చేందుకు ధ్యాన్‌చంద్ సరైన వ్యక్తి. ఆయన గురించి ఎక్కువ మంది తెలుసుకోవాలన్నదే మా ఆలోచన. ఇది ఆ మహనీయుడికి ఇస్తున్న నివాళిలాంటిది’ అని అమర్ చిత్రకథ ఎడిటర్ రీనాపురి చెప్పారు. హాకీ దిగ్గజంపై అనేక పరిశోధనలు చేసిన లూయిస్ ఫెర్నాండెజ్ స్క్రిప్ట్ రాసిన ఈ పుస్తకం వంద రూపాయల ధరకు మార్కెట్లో లభిస్తుంది. -
వరుసగా ఐదో మ్యాచ్ నెగ్గిన సైనా
ఆటలోనే కాదు ఆదరణలోనూ భారత బ్యాడ్మింటన్‌కు రాజధాని తానేనని హైదరాబాద్ నిరూపించుకుంది. ఐబీఎల్‌కు ఏ నగరంలోనూ లేనంత ఆదరణ భాగ్యనగరంలో లభించింది. సైనా... సైనా... స్టేడియమంతా ఈ పేరు జపిస్తుండగా... భారత స్టార్ క్రీడాకారిణి స్థాయికి తగ్గట్లుగా ఆడి లీగ్‌లో ఓటమి లేకుండా వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ గెలిచింది. సైనా రాణించినా... సహచరుల పేలవ ప్రదర్శనతో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్‌కు ఓటమి ఎదురైంది. కానీ పాయింట్ల పట్టికలో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. సాక్షి, హైదరాబాద్: సైనా నెహ్వాల్ నేతృత్వంలోని హైదరాబాద్ హాట్‌షాట్స్ జట్టు ఐబీఎల్ లీగ్ దశలో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగా బీట్స్ చేతిలో 2-3తో ఓడినా... లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ గెలవగా, మరో పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో బెంగళూరుకు విజయం దక్కింది. ఆసక్తికరంగా సాగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-17, 14-21, 11-8 స్కోరుతో యింగ్ తై జుపై విజయం సాధించింది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో హైదరాబాద్‌తో పాటు ముంబై, పుణే, అవధ్ సెమీస్ చేరగా, ఢిల్లీ, బంగా బీట్స్ నిష్ర్కమించాయి. హోరాహోరీ... ఐబీఎల్‌లో వరుస విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం...సొంత ప్రేక్షకుల మద్దతు...అన్ని అనుకూలతల మధ్య బరిలోకి దిగినా... సైనా నెహ్వాల్‌కు విజయం అంత సులభంగా దక్కలేదు. ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ క్రీడాకారిణి యింగ్ తై జు, సైనాకు గట్టి పోటీ ఇచ్చింది. సైనా ఎక్కువగా స్మాష్లపై ఆధార పడితే..తై జు చక్కటి సర్వీస్‌తో పాటు ప్లేసింగ్స్ను నమ్ముకుంది. మొదటి గేమ్‌లో ఆరంభంలో తై ఆధిక్యం ప్రదర్శించింది. అయితే కోలుకున్న సైనా ఆ వెంటనే చక్కటి స్మాష్‌లతో దూసుకుపోయింది. 7-4, 11-7, 15-10...ఇలా హాట్‌షాట్స్ షట్లర్ ముందంజలో నిలిచింది. మధ్యలో తై జు రెండు సార్లు వరుసగా మూడేసి పాయింట్లు నెగ్గి చేరువగా వచ్చింది. అయితే సైనా 18-17 వద్ద వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్ సొంతం చేసుకుంది. తై జు దూకుడు... రెండో గేమ్‌లో బంగా ప్లేయర్ యింగ్... సైనాను పూర్తిగా కట్టడి చేసింది. సుదీర్ఘమైన ర్యాలీలు జరగడంతో సైనా అలసినట్లుగా కనిపించింది. పైగా సైనా కొట్టిన ఎక్కువ షాట్లు అవుట్‌గా వెళ్లడంతో ప్రత్యర్థి ఖాతాలో పాయింట్లు చేరాయి. సైనా డ్రాప్షాట్లు కూడా విఫలమయ్యాయి. ఒక దశలో సైనా 11-10తో ముందుకు వెళ్లినా తై జు ఎదురుదాడి చేసింది. వేగంగా దూసుకుపోయి 16-14తో నిలిచింది. ఈ దశలో ఏకంగా ఐదు పాయింట్లు కొల్లగొట్టి గేమ్‌ను గెల్చుకుంది. మూడో గేమ్‌లో మొదటినుంచి సైనా ముందంజలో నిలిచింది. కొన్ని సార్లు ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నా ఒత్తిడిని తట్టుకొని హైదరాబాద్ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచింది. ఇదేం పద్ధతి? సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలచిన జట్టు ఆఖరి స్థానంలో నిలిచిన జట్టుతో సెమీస్ ఆడుతుంది. ఐబీఎల్ ఆరంభంలో ఈ లీగ్‌లోనూ ఇదే పద్ధతి అనుకున్నారు. కానీ సెమీస్‌కు రెండు రోజుల ముందు మాత్రం... హైదరాబాద్ సొంత నగరంలో సెమీస్ ఆడేలా చూడాలని భావించారు. ఇంత వరకు కూడా ఓకే. కానీ హైదరాబాద్ ప్రత్యర్థి ఎవరనే అంశాన్ని మాత్రం కాస్త విడ్డూరంగా నిర్ణయించారు. నిజానికి టాప్‌లో ఉన్న హైదరాబాద్, నాలుగో స్థానంలో ఉన్న ముంబై సెమీస్‌లో తలపడాలి. కానీ ఈ రెండు బలమైన జట్లు ఆడటం నిర్వాహకులకు ఇష్టం లేదు. దీంతో హడావుడిగా మంగళవారం రాత్రి... ఒక సమావేశం ఏర్పాటు చేసి మొదటి స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలో నిలిచిన జట్టుతో ఆడుతుందని నిర్ణయించేశారు. నాలుగు జట్ల మేనేజర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. దీనికి పుణే, అవధ్ జట్లు ఎలా అంగీకరించాయో...! మొత్తానికి లీగ్ ఆరంభం నుంచి ఏర్పాట్ల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న నిర్వాహకులు... చివరకు సెమీస్ లైనప్‌ను నిర్ణ యించడంలోనూ విమ ర్శల పాలయ్యారు. కశ్యప్ చిత్తు... ఐబీఎల్‌లో పారుపల్లి కశ్యప్ పేలవ ప్రదర్శన చివరి మ్యాచ్‌లోనూ కొనసాగింది. హాట్‌షాట్స్ కుర్రాడు తనోంగ్సక్ బూన్సాక్ 21-20, 21-18తో కశ్యప్‌ను చిత్తు చేశాడు. హైదరాబాద్ ప్రేక్షకులు అండగా నిలిచినా తన స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయాడు. పురుషుల డబుల్స్‌లో మాగన్సన్-అక్షయ్ దివాల్కర్ జోడి 21-15, 15-21, 11-1 తేడాతో గో వి షెమ్-వా లిమ్ కిమ్ జంటను చిత్తు చేసింది. అనంతరం రెండో పురుషుల సింగిల్స్‌లో బంగా ప్లేయర్ జాన్ జార్గన్సన్ 21-11, 21-8తో అజయ్ జయరామ్‌పై ఘన విజయం సాధించాడు. చివరగా జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో ప్రద్య్న గాద్రె-తరుణ్ కోన జంట 21-18, 16-21, 9-11తో మాగన్సన్-అపర్ణా బాలన్ చేతిలో ఓడిపోయారు. దీంతో బంగా బీట్స్ 3-2తో లీగ్‌ను విజయంతో ముగించింది. సెమీస్‌లో ఎవరితో ఎవరు నేడు: సెమీఫైనల్ 1 హైదరాబాద్ హాట్‌షాట్స్ x పుణే పిస్టన్స్ వేదిక: హైదరాబాద్ రేపు: సెమీఫైనల్ 2 అవధ్ వారియర్స్ x ముంబై మాస్టర్స్ వేదిక: బెంగళూరు శనివారం: ఫైనల్ వేదిక: ముంబై రాత్రి గం. 8 నుంచి ఈఎస్‌పీఎన్‌లో లైవ్ -
సైనా మానియా..!
భారత్‌లో బ్యాడ్మింటన్ రాజధాని హైదరాబాద్ ఐబీఎల్‌ను విశేషంగా ఆదరించింది. ఆటకు సైనా తెచ్చిన క్రేజ్ ఏంటో మరోసారి బయటపడింది. హైదరాబాద్ హాట్‌షాట్స్ మ్యాచ్‌కు గచ్చిబౌలి స్టేడియం కిక్కిరిసిపోయింది. సైనా... సైనా... అంటూ అభిమానులు హోరెత్తించారు. ఫుల్ ఖుష్...: ఊహించినట్లుగానే సైనా నెహ్వాల్ మ్యాచ్‌కు అద్భుత స్పందన లభించింది. సైనా కోర్టులో అడుగు పెట్టినప్పటినుంచి గెలిచే వరకు అభిమానుల జోష్ ఎక్కడా తగ్గలేదు. ఆట సాగినంత సేపు ప్రేక్షకుల అరుపులు, చప్పట్లతో ఇండోర్ స్టేడియం హోరెత్తిపోయింది. మ్యాచ్ అసాంతం స్టేడియంలో కెమెరా ఫ్లాష్‌లు నిరంతరాయంగా క్లిక్‌మన్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు తెచ్చుకోవడానికి ఎలాంటి నిబంధనలు అడ్డు రాకపోవడంతో ప్రతీ ప్రేక్షకుడు ఫొటోగ్రాఫర్‌గా మారిపోయాడు. క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా, సినీ నటి భూమిక, మంచు లక్ష్మిలతో పాటు పలువురు సినీ రంగానికి చెందిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. మ్యాచ్ నెగ్గిన వెంటనే సైనా తన రాకెట్‌ను ప్రేక్షకుల గ్యాలరీలోకి విసిరింది. ఆ తర్వాత మైదానమంతా కలియతిరుగుతూ హాట్‌షాట్స్ టీషర్ట్లు స్టాండ్స్‌లోకి విసిరింది. సైనా మ్యాచ్ ముగిసిన వెంటనే చాలా మంది వెళ్లిపోయారు. -
అదరగొట్టిన అవధ్ వారియర్స్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో అవధ్ వారియర్స్ మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం జరిగిన పోరులో వారియర్స్ 3-2తో పుణే పిస్టన్స్‌ను చిత్తు చేసింది. తొలి పురుషుల సింగిల్స్‌లో కె. శ్రీకాంత్, మహిళల సింగిల్స్‌లో సింధు నెగ్గగా...పురుషుల డబుల్స్‌లో కిడో-బో జోడి నెగ్గి అవధ్‌కు 3-0తో గెలుపు ఖాయం చేశారు. పుణే చివరి రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించి రెండు పాయింట్లు సాధించింది. చెలరేగిన సింధు..: జులియన్ షెంక్‌తో హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 21-20, 21-20తో గెలిచింది. ప్రపంచ మూడో ర్యాంకర్ షెంక్ ఆరంభంలో ఆధిక్యం ప్రదర్శించింది. తొలి పాయింట్‌తో మొదలు పెట్టి ఒక దశలో 7-6తో ముందంజలో నిలిచింది. అయితే చక్కటి స్మాష్‌తో స్కోరు సమం చేసిన సింధు.. ఆ తర్వాత ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. గేమ్ చివర్లో సింధు 20-19తో ముందంజ వేసినా షెంక్ డ్రాప్ షాట్‌తో స్కోరు సమం చేసింది. అయితే క్రాస్ కోర్ట్ షాట్‌ను షెంక్ కోర్టు బయటికి కొట్టడంతో గేమ్ సింధు వశమైంది. రెండో గేమ్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఇద్దరూ సుదీర్ఘ ర్యాలీలు ఆడారు. అయితే ఒక్కసారిగా చెలరేగిన షెంక్ వేగంగా దూసుకుపోయింది. 11-6, 14-7, 16-9...ఇలా భారీ అంతరంతో షెంక్ ఆధిక్యం ప్రదర్శించింది. కానీ స్వయంకృతంతో సింధుకు కోలుకునే అవకాశం ఇచ్చింది. డ్రాప్ షాట్లు విఫలం కావడంతో పాటు లైన్ కాల్స్‌ను అంచనా వేయడంలో పొరబడింది. షెంక్ 19-17తో ముందంజలో ఉన్న దశలో సింధు వరుసగా మూడు పాయింట్లు గెలిచి 20-19తో నిలిచింది. స్మాష్‌తో షెంక్ స్కోరు సమం చేసినా... సింధు చక్కటి ప్లేస్‌మెంట్‌తో పాయింట్ సాధించి మ్యాచ్ గెలిచింది. శ్రీకాంత్ సునాయాస విజయం: తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో వారియర్స్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21-18, 21-16 స్కోరుతో పుణే ఆటగాడు సౌరభ్ వర్మను చిత్తు చేశాడు. తొలి గేమ్‌లో వర్మ కాస్త పోటీ ఇచ్చినా...రెండో గేమ్‌లో మాత్రం నిలవలేకపోయాడు. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో అవధ్ ఆటగాళ్లు మార్కిస్ కిడో-మథియాస్ బో 21-15, 21-16తో అరుణ్ విష్ణు-సనవే థామస్‌లను ఓడించారు. ఈ గెలుపుతోనే అవధ్‌కు 3-0తో విజయం ఖాయమైంది. రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పిస్టన్స్ ప్లేయర్ టిన్ మిన్ యుగెన్ 21-12, 21-18తో గురుసాయిదత్ (అవధ్)ను చిత్తు చేసి వారియర్స్ ఆధిక్యాన్ని 3-1కి తగ్గించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, నీల్సన్ 21-16, 21-14తో అవధ్ జోడీ కిడో-పియాబెర్నాడెట్పై గెలిచి ఆధిక్యాన్ని 3-2కి తగ్గించారు. ఢిల్లీ, బంగా అవుట్! ఆఖరి లీగ్ మ్యాచ్ మిగిలుండగానే సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. 16 పాయింట్లతో పుణే, అవధ్... 15 పాయింట్లతో హైదరాబాద్, ముంబై సెమీస్‌కు చేరాయి. హైదరాబాద్‌కు మరో మ్యాచ్ మిగిలి ఉన్నందున అగ్రస్థానం సాధించే అవకాశం ఉంది. 13 పాయింట్లతో ఢిల్లీ రేసు నుంచి వైదొలిగింది. బంగా బీట్స్ ప్రస్తుతం 9 పాయింట్లతో ఉంది. నేడు హైదరాబాద్‌పై క్లీన్‌స్వీప్ చేస్తే ఆరు పాయింట్లు వస్తాయి. అప్పుడు ముంబై, హైదరాబాద్‌లతో కలిపి పోటీలో ఉంటుంది. కానీ ప్రస్తుత ఫామ్‌లో అది అసాధ్యం. కాబట్టి బంగా కూడా సెమీస్ రేసులో లేనట్లే.