సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌కు సర్వం సిద్ధమైంది. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అక్వాటిక్ కాంప్లెక్స్‌లో ఈ పోటీలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన దాదాపు 600 మంది స్విమ్మర్లు పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన స్విమ్మర్లు పతకం కోసం పోటీపడనున్నారు. బాలబాలికల కేటగిరీలలో ఫ్రీస్టయిల్, మెడ్లీ, బటర్‌ఫ్లయ్, బ్యాక్‌స్ట్రోక్, రిలే ఈవెంట్‌లలో పోటీలు జరుగుతాయి.
ఇందులో పాల్గొనే క్రీడాకారులను వయస్సు ప్రకారం గ్రూప్–1 (15, 16, 17 వయస్సు), గ్రూప్–2 (12, 13, 14 వయస్సు), గ్రూప్–3 (11 వయస్సు), గ్రూప్–4 (9, 10 వయస్సు)గా విభజించారు. తెలంగాణ నుంచి మొత్తం 105 మంది స్విమ్మర్లు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 52 మంది బాలికలు, 53 మంది బాలురు ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు జరుగనున్న టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభిస్తారు.
తెలంగాణ జట్ల వివరాలు
బాలికలు: ఇష్వి మతాయ్, ఎం. ప్రణతి, డి.సాయి కీర్తన, పి. స్తుతిశ్రీ, టి. సంవేద, నిషా గణేశ్, ఆయుషి గుప్తా, శ్రేయ పంజల, జాహ్నవి, పి. సింధుజ, డీఎం హర్షిత, ఫతీకా, సుదీక్ష, శ్రీమణి, కాత్యాయని, కశ్యపి, కె. సంజన, వృత్తి అగర్వాల్, సరయు రెడ్డి, వాణి జిందాల్, హాసిని రెడ్డి, ఎం. రిత్విక, ఆస్థ, జి. రాజలక్ష్మి, పి. చిన్మయి రెడ్డి, యోగిత, జి. రాజ్‌శ్రీ లాస్య, ప్రీతి సుసాన్, ఎ. మోక్షిత, వేదశ్రీ ఉప్పాల, శ్రీజని, గనగశ్రీ, హేమన్‌వర్షిణి, కె. సుదీక్ష, శ్రీ నిత్య, డి. రీతు, అదితి, టి. సాయి ప్రజ్ఞ, ఖనక్ జైన్, పి.షినేష్మ, ఇషితా రసమయి, అభిచందన, సిమ్రన్ పటేల్, కె. వర్షిణి ప్రియ, అక్షిత, కర్ణిక గుప్తా, నిహారిక, దీక్షిత, ఎస్. తేజస్వి, ఎన్. స్ఫూర్తి, వర్ష.
బాలురు: రుత్విక్ రెడ్డి, టి. సాయి తరుణ్, సీహెచ్ అభిలాష్, వై. జశ్వంత్ రెడ్డి, వై. చార్లెస్ ఫిన్నే, వి. సాయి ప్రణీత్ కుమార్, కె. రాఘవేంద్ర, దువాన్‡్ష శర్మ, సాయి ప్రణయ్, సూర్యాన్షు బాషా, ఎం. విశ్వాస్ రెడ్డి, దిగ్విజయ్, అభిషేక్, పి. త్రిషిక్, ఎస్. రాజ్ లిఖిత్, బి. సాయి నిహార్, ఎన్. మహర్షిత్, ఎం. హనుమాన్, మొహమ్మద్ కమిలుద్దీన్, అర్జున్, ఆర్. సాత్విక్ రాజ్, ఇషాన్‌దూబే, ఉదిత్ కొతారి, కె. శశిధర్ రెడ్డి, ఇషాన్ అరోరా, అవినాశ్ కుమార్, ఆశ్రిత్ కుమార్, సుహాస్ ప్రీతమ్, జోర్డాన్ డోమ్నిక్ ఫ్రాంక్లిన్, అక్షిత్, వర్షిత్, స్టాష్ జోసెఫ్, ఎస్‌ఎస్ ప్రజ్వల్, హర్షిత్, వివేకానంద రెడ్డి, బి. గౌతమ్ శశివర్ధన్, అభయ్, తేజస్ కుమార్, నమన్, యశస్వీ, కె. సుజల్, కె. లలిత్ సాగర్, కె. రోహన్ రెడ్డి, ఆర్యమన్ సింగ్ పటేల్, జి. కార్తీక్, కె. మనీశ్ గౌడ్, పి. ఆదిత్య రాయ్, ఎం. అభిషేక్, జ్వాల తనయ్ సింగ్, అనిల్ శ్రీవాస్తవ్, జె. సాయితేజ, నవీన్ కృష్ణ, ఎల్. మణిదీప్.
Comments
Please login to add a commentAdd a comment