కర్ణాటక స్విమ్మర్ల పతకాల పంట | Karnataka Swimmers Got 32 Gold Medals In South Zone Junior Aquatics Championships | Sakshi
Sakshi News home page

కర్ణాటక స్విమ్మర్ల పతకాల పంట

Published Fri, Jan 3 2020 10:56 PM | Last Updated on Sat, Jan 4 2020 10:06 AM

 Karnataka Swimmers Got 32 Gold Medals In South Zone Junior Aquatics Championships - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ జూనియర్‌ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల తొలి రోజు కర్ణాటక స్విమ్మర్లు పతకాల పంట పండించారు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో మొదటి రోజు ఏకంగా కర్ణాటక స్విమ్మర్లు 32 ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ స్విమ్మర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొత్తం 40 వేర్వేరు ఈవెంట్లలో పోటీలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 16 పతకాలు, ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 8 పతకాలు లభించాయి. తెలంగాణ పతకాల జాబితాలో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 10 కాంస్యాలు ఉండగా... ఏపీ పతకాల్లో 2 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. ఏపీకి మొదటి రోజు స్వర్ణం దక్కలేదు. ఆదివారం వరకు అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌ కొనసాగుతుంది. తెలంగాణ తరఫున బాలుర 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–1, బాలుర 100 మీటర్ల బ్యాక్‌ స్ట్రోక్‌ గ్రూప్‌–1 ఈవెంట్‌లలో ఎస్‌. రుత్విక్‌ నాగిరెడ్డి స్వర్ణాలు గెలుచుకోవడం విశేషం. బాలికల 200 మీటర్ల ఫ్రీ స్టయిల్‌ గ్రూప్‌–2 ఈవెంట్‌లో కె. సంజనకు బంగారు పతకం లభించింది.  

తొలి రోజు ఫలితాలు
బాలుర విభాగం: 
1500 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–1: 1. దీప్‌ వెంకటేశ్‌ గిల్డా (కర్ణాటక–17 ని.13.42 సె.), 2. సమర్థ రావు (కర్ణాటక), 3. సాయి గణేశ్‌ (తమిళనాడు).
400 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–2: 1. సర్వేపల్లి కృష్ణ్ణ (తమిళనాడు–4ని. 25.97 సె.), 2. తరుణ్‌ గౌడ (కర్ణాటక), 3. శివాంక్‌ విశ్వనాథ్‌ (కర్ణాటక).
200 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–3 : 1. రేణుకాచార్య (కర్ణాటక–2 ని. 24.66 సె.), 2. లోకేశ్‌ రెడ్డి (కర్ణాటక), 3. డి. వర్షిత్‌ (తెలంగాణ).
200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–1: 1. లితీశ్‌ గౌడ (కర్ణాటక–2 ని. 35.48 సె.), 2. అన్బు కథీర్‌ (తమిళనాడు), 3. బి. సూర్యాంశు (తెలంగాణ).
200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–2: 1. జాషువా థామస్‌ (తమిళనాడు–2 ని. 34.76 సె.), 2. శుభాంగ్‌ కుబేర్‌ (కర్ణాటక), 3. విదిత్‌ శంకర్‌ (కర్ణాటక).
100 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–3: 1. నవనీత్‌ గౌడ (కర్ణాటక–1ని. 24.65 సె.), 2. యష్‌ కార్తీక్‌ (కర్ణాటక), 3. దర్శన్‌ (తమిళనాడు).
50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–4: 1.ఎస్‌. శ్రీనివాస్‌ (తమిళనాడు–40.68 సె.), 2. యష్‌రాజ్‌ (కర్ణాటక), 3. ఎంఎస్‌ నితీశ్‌ (తమిళనాడు).
50 మీ. బటర్‌ఫ్లయ్‌ గ్రూప్‌–1: 1. సాయి సమర్థ్‌ (కర్ణాటక–27.62 సె.), 2. మోహిత్‌ వెంకటేశ్‌ (కర్ణాటక), 3. బి. సూర్యాంశు (తెలంగాణ). 
50 మీ. బటర్‌ఫ్లయ్‌ గ్రూప్‌–2: 1. నయన్‌ విఘ్నేశ్‌ (కర్ణాటక–28.18 సె.), 2. కార్తికేయన్‌ నాయర్‌ (కర్ణాటక), 3. అవినాశ్‌ (తమిళనాడు).
200 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–1: 1. ఎస్‌. రుత్విక్‌ నాగిరెడ్డి (తెలంగాణ–2ని. 0.96 సె.), 2. మోహిత్‌ వెంకటేశ్‌ (కర్ణాటక), 3. సీహెచ్‌ అభిలాష్‌ (తెలంగాణ). 
200 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–2: 1. తరుణ్‌ గౌడ (కర్ణాటక–2 ని. 6.53 సె.), 2. సర్వేపల్లి కృష్ణ్ణ (తమిళనాడు), 3. అక్షయ్‌ (కర్ణాటక).
100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ గ్రూప్‌–3: 1. యష్‌ కార్తీక్‌ (కర్ణాటక–1 ని. 12.97 సె.), 2. ఆర్యన్‌ అప్టిల్‌ (కర్ణాటక), 3. ఎం.తీర్థు సామదేవ్‌ (ఆంధ్రప్రదేశ్‌). 
100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌  గ్రూప్‌–1: 1. ఎస్‌. రుత్విక్‌ నాగిరెడ్డి (తెలంగాణ–1 ని. 3.92 సె.), 2. వై. జశ్వంత్‌ రెడ్డి (తెలంగాణ), 3. డారెల్‌ స్టీవ్‌ (తమిళనాడు).
100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ గ్రూప్‌–2: 1. ఉత్కర్‌‡్ష పాటిల్‌ (కర్ణాటక–1 ని. 4.50 సె.), 2. అక్షయ్‌ (కర్ణాటక), 3. ఎస్‌. ఆకాశ్‌ (తమిళనాడు). 
50 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ గ్రూప్‌–4: 1. గోకులన్‌ (తమిళనాడు–36.86 సె.), 2. సర్వేపల్లి ఆదిత్య (తమిళనాడు), 3. శ్రీహరి కత్తి (కర్ణాటక). 
50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–1: 1. అర్జున్‌ శంభు (కేరళ–30.38 సె.), 2. లితీశ్‌ గౌడ (కర్ణాటక), 3. బి. సూర్యాంశు (తెలంగాణ).
50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–2: 1. విదిత్‌ శంకర్‌ (కర్ణాటక–33.21 సె.), 2. షాన్‌ ఆంటోనీ (కేరళ), 3. జాషువా థామస్‌ (తమిళనాడు). 
50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–3: 1. భువన్‌ రుద్రరాజు (కర్ణాటక–37.91 సె.), 2. నవనీత గౌడ (కర్ణాటక), 3. యష్‌ రాఠీ (ఆంధ్రప్రదేశ్‌). 
4–200 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–1 రిలే: 1. కర్ణాటక, 2. తెలంగాణ, 3. కేరళ.
4–50 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–4 రిలే: 1. కర్ణాటక, 2. తమిళనాడు, 3. తెలంగాణ

బాలికల విభాగం:
1500 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–1: 1. నిధి శశిధర (కర్ణాటక–20 ని.12.88 సె.), 2. అనుమతి చౌగ్లే (కర్ణాటక), 3. ఎస్‌.కావ్య (తమిళనాడు). 
400 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–2: 1. అష్మిత చంద్ర (కర్ణాటక–4 ని. 53.24 సె.), 2. వృత్తి అగర్వాల్‌ (తెలంగాణ), 2. కె. సంజన (తెలంగాణ). 
200 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–3: 1. హషిక (కర్ణాటక–2 ని. 27.30 సె.), 2. సబా సుహానా (కర్ణాటక), జి. శర్ష (తెలంగాణ).
200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–1: 1. గున్‌ మటా (కర్ణాటక–2 ని 56.16 సె.), 2. ఆరాధన (కేరళ), 3. షానియా గ్రేస్‌ (కర్ణాటక).  
200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–2: 1. హితైషి (కర్ణాటక–2ని. 55.29 సె.), 2. అన్విత గౌడ (కర్ణాటక), 3. వి. నాగ గ్రీష్మిణి (ఆంధ్రప్రదేశ్‌).
100 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–3: 1. విహిత నయన (కర్ణాటక–1 ని. 22.37 సె.), 2. మనవి వర్మ (కర్ణాటక), 3. ఎన్‌. పావని సరయు (ఆంధ్రప్రదేశ్‌). 
50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–4: 1. ధీనిధి (కర్ణాటక–39.53 సె.), 2. ఆకతి మాలిని (తమిళనాడు), 3. అక్షర (తమిళనాడు). 
50 మీ. బటర్‌ఫ్లయ్‌ గ్రూప్‌–1: 1. సువన భాస్కర్‌ (కర్ణాటక–29.64 సె.), 2. ఇన్చర (కర్ణాటక), 3. కప (కేరళ). 
50 మీ. బటర్‌ఫ్లయ్‌ గ్రూప్‌–2: 1. నీనా వెంకటేశ్‌ (కర్ణాటక–30.11 సె.), 2. రిషిక మంగ్లే (కర్ణాటక), 3. కె. సంజన (తెలంగాణ). 
200 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–1: 1. బి. ఇన్చర (కర్ణాటక–2 ని. 22.33 సె.), 2. ప్రీత వెంకటేశ్‌ (కర్ణాటక), 3. నిర్మల (కేరళ).
200 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–2: 1. కె. సంజన (తెలంగాణ–2 ని. 18. 27 సె.), 2. అష్మిత చంద్ర (కర్ణాటక), 3. హిత ఆనంద్‌ (కర్ణాటక). 
100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ గ్రూప్‌–3: 1. మానవి వర్మ (కర్ణాటక–1 ని. 16. 53 సె.), 2. నక్షత్ర గౌతమ్‌ (కర్ణాటక), 3. ఎస్‌. సంధ్య (తమిళనాడు). 
100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ గ్రూప్‌–1: 1. సువన భాస్కర్‌ (కర్ణాటక–1 ని. 9.66 సె.), 2. భూమిక (కర్ణాటక), 3. జాహ్నవి గోలి (తెలంగాణ).
100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ గ్రూప్‌–2: 1. నీనా వెంకటేశ్‌ (కర్ణాటక–1 ని. 11.09 సె.), 2. నైషా శెట్టి (కర్ణాటక), 3. అక్షిత (తమిళనాడు).
 50 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ గ్రూప్‌–4: 1. ధీనిధి (కర్ణాటక–36. 27 సె.), 2. బి. అలంకృతి (ఆంధ్రప్రదేశ్‌), 3. ప్రమితి జ్ఞానశేఖరన్‌ (తమిళనాడు).
50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–1: 1. గున్‌ మత్తా (కర్ణాటక–37. 77 సె.), 2. ఆరాధన (కేరళ), 3. షానియా గ్రేస్‌ (కర్ణాటక).
50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–2: 1. అన్విత గౌడ (కర్ణాటక–36.56 సె.), 2. వి. నాగ గ్రీష్మిణి (ఆంధ్రప్రదేశ్‌), 3. హితైషి (కర్ణాటక).
50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ గ్రూప్‌–3: 1. విహిత నయన (కర్ణాటక–37. 55 సె.), 2. మానవి వర్మ (కర్ణాటక), 3. ఎన్‌. పావని సరయు (ఆంధ్రప్రదేశ్‌). 
4–200 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–1 రిలే: 1. కర్ణాటక, 2. కేరళ, 3. తమిళనాడు.
4–50 మీ. ఫ్రీస్టయిల్‌ గ్రూప్‌–4 రిలే: 1. కర్ణాటక, 2. తమిళనాడు, 3. ఆంధ్రప్రదేశ్‌.
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement