Swimming
-
‘కామన్వెల్త్’లో స్విమ్మింగ్, సైక్లింగ్లకు పెద్దపీట
గ్లాస్గో: వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో క్రీడల్ని కుదించినప్పటికీ కొన్ని క్రీడలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా సైక్లింగ్, స్విమ్మింగ్, పారా పోటీల్లో గణనీయంగా పతకాల ఈవెంట్లు పెంచారు. దీంతో వచ్చే ఏడాది గ్లాస్గో ఆతిథ్యమివ్వబోయే ఈ కామన్వెల్త్ మెగా ఈవెంట్లో 200కు పైగా బంగారు పతకాలు అథ్లెట్ల పరం కానున్నాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత మిక్స్డ్ 4–400 మీటర్ల రిలే విభాగాన్ని తిరిగి ఈ కామన్వెల్త్లో చేర్చారు. చివరిసారిగా 1966లో మిక్స్డ్ రిలే విభాగం పోటీలు నిర్వహించాక తదనంతరం క్రీడల్లో ఆ ఈవెంట్‌కు మంగళం పాడారు. దీనిపై ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో హర్షం వ్యక్తం చేశారు. 1930 నుంచి 1966 వరకు కామన్వెల్త్లో అలరించిన మిక్స్డ్ రిలే ఈవెంట్ మళ్లీ ఆరు దశాబ్దాల తర్వాత గ్లాస్గోలో పతకాల కోసం పరుగుపెట్టబోతోంది’ అని అన్నారు. పారా అథ్లెటిక్స్‌లోని 10 ఈవెంట్లలో ఏకంగా ఆరు క్రీడాంశాలకు గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రికార్డుస్థాయిలో 47 పతకాలు పారా అథ్లెట్లు అందుకోనున్నారు. సైక్లింగ్‌లో 26 పతకాల ఈవెంట్లు (పారా సైక్లింగ్ కలిపి), స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్‌లలో 56 పతకాలు ఈతకొలనులో కొల్లగొట్టనున్నారు. ఈ సారి కొత్తంగా 800 మీటర్ల ఫ్రీస్టయిల్, 1500 మీటర్ల మహిళల ఫ్రీస్టయిల్ రేసుల్ని చేర్చారు. 2026లో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు 11 రోజుల పాటు గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి. పది క్రీడాంశాలు జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, వీల్‌చైర్ బాస్కెట్‌బాల్, బాక్సింగ్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్ , బౌల్స్, పారా బౌల్స్ (ఇండోర్), జూడో, నెట్‌బాల్, ట్రాక్ సైక్లింగ్, పారా సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, పారా పవర్‌లిఫ్టింగ్‌లో పోటీలుంటాయి. కామన్వెల్త్ ఎరెనా, సర్ క్రిస్ హో వెలొడ్రోమ్, స్కాటిష్ ఎగ్జిబిషన్ సెంటర్ (ఎస్ఈసీ), స్కాట్స్టౌన్ స్టేడియం, టోల్క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్ వేదికల్లో పది రోజుల పాటు పోటీలు జరుగుతాయి. తొలి రోజు కేవలం ఆరంభ వేడుకలు నిర్వహిస్తారు. -
సముద్రంలో ఈతకు వెళ్లి ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతు
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా)/కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : స్నేహితులతో కలిసి సముద్రంలో ఈతకెళ్లి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతయ్యాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పట్టపుపాళెం ఏపీజెన్కో బ్రేక్ వాటర్స్ వద్ద ఈ ఘటన జరిగింది. కృష్ణపట్నం సీఐ రవినాయక్, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలు.. నెల్లూరులో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 9 మంది విద్యార్థులు ఆదివారం నేలటూరు పట్టపుపాళెం సముద్ర తీరానికి విహారానికి వెళ్లారు. ఆటపాటలతో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా ఈత కొట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వీరిలో విశాఖపటా్ననికి చెందిన షణ్ముగనాయుడు(19) ఈతకొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు లోతు ఉన్న చోట సముద్రపు నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. స్థానికులతో కలిసి రక్షించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విశాఖలో ఉన్న విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 30 మందికి పైగా మత్స్యకారులు పడవల ద్వారా షణ్ముగనాయుడి కోసం గాలించారు. మరో ఐదుగురు గజ ఈతగాళ్లను కూడా రప్పించారు. సాయంత్రం చీకటిపడే వరకూ అన్వేషించినా ఫలితం లేకపోయింది. మత్స్యకారుడు గల్లంతు కృష్ణా జిల్లా మచిలీపట్నం బండలం మంగినపూడి బీచ్‌లో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. బందరు మండలం సత్రవపాలేనికి చెందిన చింతా ఏడుకొండలు శనివారం సాయంత్రం తోటి మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లాడు. సముద్రంలో చేపలు పడుతుండగా రాత్రి 12 గంటల సమయంలో వలలాగే క్రమంలో సముద్రంలో పడిపోయాడు.బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారులు ఏడుకొండలును కాపాడేందుకు సముద్రంలోకి దూకి గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వేట ఆపి ఆదివారం ఉదయాన్నే ఒడ్డుకు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలపడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వైజాగ్ -కాకినాడ ఛాలెంజ్ : 52 ఏళ్ల తెలుగు మహిళ సాహసం
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల అరుదైన ఘనతను సాధించారు. విశాఖపట్నం (వైజాగ్) నుండి కాకినాడ వరకు బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈది చరిత్రకెక్కారు. ఐదు రోజుల పాటు సాగిన శ్యామల సాహస యాత్ర సాగింది. డిసెంబర్ 28న ఆర్.కె. వైజాగ్‌లోని బీచ్ నుంచి మొదలై కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌లో జనవరి 1న ముగిసింది. ఇలాంటి విజయాలను అలవోకంగా అందుకోవడం ఆమెకు కొత్తేమీ కాదు. వైజాగ్-కాకినాడ ఛాలెంజ్ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్యామలకు సముద్రాలను ఈదడం హాబీ. తాజాగా బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వరకూ 150 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా ఈదారు. వారం రోజుల తరువాత సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకోవడంతో ఆమె సాహస యాత్ర ముగిసింది. ఆమె భద్రత, విజయాన్ని నిర్ధారించేందుకు ఒక డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, ఫీడర్లు, స్కూబా డైవర్లు , కయాకర్లతో సహా 12 మంది సభ్యుల, రెండు పెద్ద పడవలు ఒక చిన్న నౌక ఆమె వెంట సాగాయి.52-Year-Old woman Goli Shyamala Swims 150 km from #Visakhapatnam to #Kakinada, Inspiring GenerationsGoli #Shyamala, a 52-year-old #WomanSwimmer from Samalkot in Kakinada district, #AndhraPradesh successfully completed an adventurous swim of 150 kilometers in the sea from… pic.twitter.com/DenfvFaHgr— Surya Reddy (@jsuryareddy) January 4, 2025 అంతకుముందు- తమిళనాడు- శ్రీలంక నార్త్ ప్రావిన్స్‌ను అనుసంధానించే పాల్క్ స్ట్రెయిట్‌ను 13 గంటల 43 నిమిషాల్లో అధిగమించి ఈ ఘనతను సాధించిన రెండో మహిళగా శ్యామలనిలిచారు. గతంలో రామసేతు సమీపంలో అలవోకగా ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అమెరికాలోని కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు ఇలాంటి సాహసాన్ని పూర్తి చేశారు. కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు గల 36 కిలోమీటర్ల దూరాన్ని 12 డిగ్రీల టెంపరేచర్లో 19 గంటల్లో అధిగమించారు. లక్షద్వీప్‌లో కీల్టన్ ఐలండ్- కడ్మట్ ఐలండ్, హుగ్లీ, గంగ, భాగీరథీ నదుల్లో రికార్డు సమయాల్లో ఈది రికార్డు సృష్టించిన చరిత్ర శ్యామలది. శ్యామల సృజనాత్మక దర్శకురాలు, రచయిత కూడా. అయితే తన యానిమేషన్ స్టూడియో సక్సెస్‌కాకపోవడంతో ఆమె స్విమ్మింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వేసవి ఈత శిబిరాల్లో పాల్గొనడం ద్వారా మరింత ఆసక్తి పెరిగింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ గురించి అవగాహన కల్పించడం, ప్రజలను ప్రోత్సహించడం ఆమె లక్ష్యంగా మారింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో విజయాలుపాక్ స్ట్రెయిట్: 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈదుతూ, ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచింది.కాటాలినా ఛానల్: కాటాలినా ద్వీపం నుండి లాస్ ఏంజిల్స్ వరకు 36 కిలోమీటర్లు 19 గంటల్లో గడ్డకట్టే 12°C ఉష్ణోగ్రతల మద్య స్విమ్మింగ్ చేశారు.లక్షద్వీప్ : లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది కిల్టన్ ద్వీపం నుండి కద్మత్ ద్వీపానికి 18 గంటల్లో 48 కిలోమీటర్లు ఈదారు.ఆమె స్విమ్మింగ్ చేసిన నదులు•కృష్ణా నది: 1.5 కి.మీ•హూగ్లీ నది: 14 కిలోమీటర్లు•గంగా నది: 13 కి.మీ•భాగీరథి నది: 81 కి.మీ -
55 ఏళ్లు.. 150 కిలోమీటర్లు
కొందరు ఓటమి నుంచి విజయాలు అందుకుంటారు. మరికొందరు తమ జీవితంలో ఎదురైన ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వారే స్విమ్మర్ గోలి శ్యామల. సామర్లకోటకు చెందిన శ్యామల భర్త మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు పనిచేశారు. దురదృష్టవశాత్తూ స్టూడియో ద్వారా తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 45 ఏళ్ళ వయసులో శరీరం సహకరించని స్థితిలో మనసును మళ్ళించేందుకు హైదరాబాద్‌లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్వతహాగా ఆమె స్విమ్మర్ కాదు... అయితేనేం, నాటి మనోవేదనకు ఉపశమనంగా ప్రారంభించిన స్విమ్మింగ్ నేడు ఐదు పదుల వయసులో ఆమెను సముద్రాలు దాటే సాహస యాత్రికురాలిగా తీర్చిదిద్దింది.150 కిలోమీటర్లు ఏడు రోజుల్లో అలవోకగా.. డిసెంబరు 28న విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర తీరంలో ఈత ప్రారంభించిన శ్యామల శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ యానిమేషన్ స్టూడియోలో నష్టం రావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తాను మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్విమ్మింగ్ప్రారంభించాననీ, కోచ్ జాన్ సిద్ధిక్ సహకారంతో జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల స్విమ్ చేసేలా తయారయ్యానని సగర్వంగా చెప్పారు. 2021లో శ్రీలంక నుంచి ఇండియా వరకు రామ్‌సేతు దాటానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానన్నారు. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడం ద్వారా ఆసియా స్థాయిలో ఘనత సాధించానన్నారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదాలని రెండేళ్ళ కిందటే నిర్ణయించుకున్నానని, అయితే రెండుసార్లు వాతావరణం అనుకూలించలేదనీ, ఎట్టకేలకు డిసెంబర్ 28న చిన్న ఫిషింగ్ బోట్, ఇద్దరు స్క్రూపర్ డ్రైవర్స్తోప్రారంభించానన్నారు. ఆర్కే బీచ్‌లో సముద్రంలో ప్రవేశించాక మళ్ళీ కాకినాడలో నేలపైకి వచ్చామన్నారు. మొదటి రోజు 7 గంటల్లోనే 30 కిలోమీటర్ల దూరం ఈదానన్నారు. తరువాత నుంచి ఈరోజు వరకు అనేక ఒడుదొడుకులను అధిగమిస్తూ ఈదుకుంటూ వచ్చానన్నారు. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు స్విమ్మింగ్ వల్లే ఆరోగ్యం కలుగుతుందని, స్విమ్మింగ్‌ను స్పోర్ట్‌గా కాకుండా సర్వైవల్ స్పోర్ట్‌గానే చెబుతానన్నారు. మహిళలు ఈత చేయడం వలన గైనిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. హేళన చేసిన వారే పొగుడుతున్నారుసముద్రంలో ఈత కోసం తొలి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. కొందరు యూ ట్యూబ్‌లో కామెంట్లు పెట్టారు. వాటిని పట్టించుకోలేదు. అరేబియా సముద్రం ఈదాను, శ్రీలంక నుంచి ఇండియా ఈత మరపురానిది, మేదీ స్ఫూర్తితో లక్షద్వీప్‌లో 18గంటల పాటు 48 కిలోమీటర్లు ఈదాను. వైజాగ్ నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఈదగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. – గోలి శ్యామల – స్విమ్మర్. – లక్కింశెట్టి శ్రీనివాసరావుసాక్షి ప్రతినిధి.. కాకినాడ.ఫోటోలు: విశ్వనాధుల రాజబాబు. కాకినాడ రూరల్ -
గచ్చిబౌలిలో ఫిన్ స్విమ్మింగ్ 2024
గచ్చిబౌలి: ఆలిండియా ఫిన్ స్విమ్మింగ్ ఫెడరేషన్ కప్–2024 పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలోని స్విమ్మింగ్‌పూల్‌లో ఈ పోటీలను బాలురు, బాలికల విభాగాల్లో వేర్వేరుగా నిర్వహించారు. ఇందులో 50 మీటర్లు, 100, 200, 400 మీటర్లు, 800 మిడ్ రిలే పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను అండర్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఇండియా ప్రధాన కార్యదర్శి మయూర్పటేల్, యూఎస్ఏఐ చీఫ్ జనరల్ సెక్రెటరీ కుల్దీప్పాటిల్, యూఎస్ఎఫ్ఏటీ అధ్యక్షురాలు జ్యోతి, ప్రధాన కార్యదర్శి దినేషరాజోరియా ప్రారంభించారు. ఈ పోటీలను మొదటిసారి నిర్వహిస్తున్నామని, దక్షిణ భారతదేశంలో నిర్వహణకు అవకాశం కల్పించడానికి ప్రభుత్వ సహకారం మరువలేనిదని జ్యోతి అన్నారు. మూడు రోజులపాటు గచి్చ»ౌలి స్టేడియంలో నిర్వహించే ఈ పోటీలు 11తో ముగుస్తాయన్నారు. 17 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని, పోటీలో ప్రతిభ చాటిన వారికి సర్టిఫికెట్లు, మెడల్స్ అందిస్తామని తెలిపారు. -
Madhurawada Nidhi: క్యాన్సర్‌ను ఓడించి..క్రీడల్లో మెరిసి..!
కష్టాలను జయించి.. స్వప్నాలను సాకారం చేసుకున్న పోరాట యోధురాలు ఆమె. చిన్న వయసులోనే క్యాన్సర్ తన జీవితాన్ని కుదిపేసినా ధైర్యంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో కాలు కోల్పోయినా.. ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు. తన బలహీనతను బలంగా మార్చుకుని.. పోరాటానికి సిద్ధమైంది. పారా క్రీడల్లో తనను తాను నిరూపించుకుంటూ.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ఆమే మధురవాడకు చెందిన నిధి. ఆమె ఒక క్రీడాకారిణిగానే కాకుండా.. కష్టాలను ఎలా అధిగమించాలనే దానికి ఒక సాక్ష్యం. ఆమె కథ మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఆమె విజయాలు ప్రేరణగా నిలుస్తాయి. భవిష్యత్తులో నిధి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం. – విశాఖ స్పోర్ట్స్విశాఖలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి పారా స్విమ్మింగ్ పోటీల్లో నిధి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ కాలుతో నడుస్తూ.. నాలుగు క్రీడాంశాల్లో పోటీపడుతున్న ఆమె చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. మధురవాడ ప్రాంతానికి చెందిన నిధి తండ్రి కేశవరావు, తల్లి జ్యోతి. ప్రస్తుతం ఆమె 10వ తరగతి చదువుతోంది. ఏడేళ్ల వయసులోనే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ బారిన పడింది. చికిత్సలో భాగంగా ఆమె ఎడమ కాలును కోల్పోయింది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. క్యాన్సర్‌ను జయించి మామూలు స్థితికి చేరుకుంది. అంగవైకల్యాన్ని మరిచిపోయేందుకు ఆటలను ఎంపిక చేసుకుంది. కృత్రిమ కాలుతో కదన రంగంలోకి దిగింది. పట్టుదలతో స్విమ్మింగ్, చదరంగం, రైఫిల్ షూటింగ్, రన్నింగ్‌లో శిక్షణ పొందింది. పారా క్రీడల్లో తాను తలపడుతున్న అన్ని అంశాల్లోనూ నేడు పతకాలు సాధించే స్థాయికి చేరుకుంది. ఇటీవల రష్యాలో జరిగిన పారా క్రీడల్లో నాలుగు పతకాలను సొంతం చేసుకుంది. మలుపు తిప్పిన సర్వేవర్స్ క్యాంప్ అంగవైకల్యం ఏర్పడినా క్యాన్సర్‌ను జయించిన నిధి నిబ్బరంగానే నిలిచింది. చదువుకుంటూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆటలపై ఆసక్తిని పెంచుకుంది. అప్పట్లో ముంబయిలో క్యాన్సర్ చికిత్స తీసుకున్న ఆమె.. క్యాన్సర్ సర్వేవర్స్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు నిర్వహించిన పోటీల్లో పాల్గొంది. తనలాంటి వారితో నిర్వహించే పోటీల్లో పోటీపడగలననే ధీమాతో.. వారిచ్చిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంది. అలా రాంచీలో జరిగిన జాతీయస్థాయి చదరంగం అండర్–19 పోటీల్లో తొలిసారి పాల్గొని సత్తా చాటింది. జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక 2019లో కరోనా కారణంగా పోటీల్లో పాల్గొనడం కాస్త తగ్గించింది నిధి. అప్పటికే ముంబయి నుంచి విశాఖకు తల్లిదండ్రులతో వచ్చేసిన నిధి తిరిగి గ్వాలియర్‌లో జరిగిన పారా స్విమ్మింగ్ పోటీల్లో తన కేటగిరీలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల రష్యాలో జరిగిన రైఫిల్ షూటింగ్లో కాంస్య పతకం, చెస్, స్విమ్మింగ్లతో పాటు రన్నింగ్‌లో స్వర్ణ పతకాలను అందుకుంది. ఆదివారం విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్విమ్మింగ్ పోటీల్లో ఎస్–9 కేటగిరీలో తలపడింది. 50 మీటర్ల ఫ్రీస్టయిల్, బ్యాక్ స్ట్రోక్, వంద మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీల్లో విజేతగా నిలిచింది. వచ్చే నెలలో గోవాలో జరగనున్న జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలకు సిద్ధమవుతోంది. -
ఐదు మహా సముద్రాలను ఈదిన యోధుడు.. అయినా పాపం! ఎవరీ మిహిర్?
ధ్యాన్ చంద్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, ప్రకాశ్ పదుకొణె, విశ్వనాథన్ ఆనంద్.. ఇలా భారత క్రీడా రంగంలో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నారు. అయితే, వీరిలా గుర్తింపునకు నోచుకోని ‘అన్సంగ్ హీరోలు’ కూడా చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలోని మేటి స్విమ్మర్ మిహిర్ సేన్ గురించి నేటి కథనంలో తెలుసుకుందాం!భారతీయులకేం తక్కువ?ఒకే ఏడాదిలో ఐదు ఖండాల్లోని మహా సముద్రాలను ఈదగల సత్తా భారతీయులకు ఉందని మిహిర్ సేన్ నిరూపించాడు. సాధారణ కుటుంబంలో జన్మించి.. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా చరిత్రకెక్కాడు. 1930లో బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించాడు మిహిర్ సేన్.తల్లిదండ్రులు రమేశ్ సేన్- లీలావతి. మిహిర్‌కు ఎనిమిదేళ వయసు ఉన్నపుడు వారు ఒడిశాకు మకాం మార్చారు. కుమారుడికి మెరుగైన విద్య అందించేందుకు లీలావతి ఎంతగానో కష్టపడేవారు. చికెన్, కోడిగుడ్లు, పాలు అమ్ముతూ జీవనోపాధి పొందుతూ... కొడుకు కోసం డబ్బు కూడబెట్టేవారు. తల్లి కష్టాన్ని చూసిన మిహిర్ సేన్.. చదువులో రాణించాడు.నైట్ పోర్టర్గాన్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం.. నాటి ఒడిశా ప్రభుత్వ సాయంతో ఉన్నత విద్య కోసం యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లాడు. అయితే, చదువు సాఫీగా సాగాలన్నా.. కడుపు నిండాలన్నా ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో మిహిర్ సేన్ ఓ రైల్వే స్టేషన్లో నైట్ పోర్టర్‌గా పనిచేసినట్లు కథనాలు ఉన్నాయి.అయితే, ఆ తర్వాత మిహిర్ ఇంగ్లండ్‌తో భారత రాయబారి క్రిష్ణ మెనన్ దగ్గర ఉద్యోగంలో చేరాడట. లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదువుకుంటూ.. 1954లో లింకన్స్ ఇన్‌లోని బార్లో అడ్వకేట్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడుఅంతగా నైపుణ్యం లేదు.. అయినాఅలా రోజులు గడుస్తుండగా.. స్విమ్మింగ్‌పై మక్కువ పెంచుకున్న మిహిర్ సేన్.. అమెరికన్ మహిళ ఫ్లోరెన్స్ చాడ్విక్ను చూసి స్ఫూర్తి పొందాడు. 1950లో ఫ్లోరెన్స్ ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన తొలి మహిళగా రికార్డు సృష్టించారంటూ వార్తా పత్రికలో వచ్చిన కథనం మిహిర్ దృష్టిని ఆకర్షించింది.అయితే, ఈతలో మిహిర్‌కు అంత నైపుణ్యం లేదు. అయినప్పటికీ దేశం కోసం ఈ ఘతన సాధించాలని భావించాడు. స్థానికంగా ఉన్న నిపుణుల దగ్గరకు వెళ్లి పాఠాలు నేర్చుకున్నాడు. అలా 1958, సెప్టెంబరు 27న అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. డోవర్ నుంచి కలస్ వరకు 14 గంటల 45 నిమిషాల్లో చానెల్(32 కిలో మీటర్లు)ను ఈదాడు. అత్యంత వేగంగా ఈ దూరాన్ని దాటిన నాలుగో స్విమ్మర్‌గా నిలిచాడు.ప్రధాని ఇందిరా గాంధీ మద్దతుఈ నేపథ్యంలో.. ఆ మరుసటి ఏడాది భారత ప్రభుత్వం మిహిర్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అయితే, ఆ ఒక్క చానెల్‌తో మిహిర్ స్మిమ్మింగ్ తృష్ణ తీరలేదు. ఐదు ఖండాల్లోని మహాసముద్రాలను ఈదాలని నిర్ణయించుకున్నాడు. కానీ అందుకు చాలా ఖర్చవుతుంది. ఎలాగోలా స్పాన్సర్లను సంపాదించిన మిహిర్‌కు నాటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా మద్దతుగా నిలిచారు.ఇక తన ప్రయాణంలో భాగంగా తొలుత 1966లో ఏప్రిల్ 5-6 మధ్య భారత్- శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని 25 గంటల 26 నిమిషాల్లో ఈదాడు మిహిర్. అనంతరం.. యూరోప్-ఆఫ్రికా నడుమ జిబ్రాల్టర్ జలసంధిని దాటడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. అదే ఏడాది ఆగష్టు 24న 8 గంటల ఒక నిమిషంలో ఈ టార్గెట్‌ను పూర్తి చేశాడు. ఆ తర్వాత సెప్టెంబరు 12న 40 మైళ్ల దూరం ఉన్న డర్డానెల్స్(గల్లిపొలి, యూరోప్- సెడుల్బహిర్,ఆసియా మైనర్) ఈది.. ప్రపంచంలో ఈ ఫీట్ నమోదు చేసిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సాధించాడు.అంతేకాదు.. అదే ఏడాది బొస్ఫరస్(టర్కీ)ను నాలుగు గంటల్లోనే ఈది ఈ ఘనత సాధించిన తొలి నానో-అమెరికన్‌గా నిలిచాడు. ఇక అక్టోబరు 29-31 మధ్య పనామా కాలువ(50 మైళ్ల పొడవు)ను 34 గంటల 15 నిమిషాల్లో ఈదేశాడు. తద్వారా గిన్నిస్ బుక్‌లో తన పేరును లిఖించుకున్నాడు. 1967లో పద్మవిభూషణ్ అవార్డు మిహిర్ సేన్ సొంతమైంది.ఉద్యమం.. విజయవంతంఅయితే, ఇండియాకు తిరిగి వచ్చిన తొలినాళ్ల(1958)లో క్లబ్స్‌లో ప్రవేశించేందుకు మిహిర్‌కు అనుమతి దొరకలేదు. కేవలం శ్వేతజాతీయులకు మాత్రమే ఎంట్రీ అనే నిబంధన ఇందుకు కారణం. దీంతో ఈ రూల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన మిహిర్.. దానిని ఎత్తివేయించడంలో సఫలమయ్యాడు. ఇక తొలుత కలకత్తా హైకోర్టులో క్రిమినల్ లా ప్రాక్టీస్ చేసిన మిహిర్ సేన్.. విజయవంతమైన వ్యాపారవేత్తగానూ రాణించాడు. అయితే, పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా 66 ఏళ్ల వయసులోనే మిహిర్ సేన్ ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోయాడు. -
కొలనులో కొత్త కెరటం
ఒలింపిక్స్‌లో ఈత పోటీలు అనగానే.. ఠక్కున గుర్తొచ్చే పేరు మైకేల్ ఫెల్ప్స్! మకుటం లేని మహారాజులా స్విమ్మింగ్‌పూల్‌ను ఏలిన ఈ అమెరికా స్విమ్మర్.. విశ్వక్రీడల్లో ఏకంగా 28 పతకాలు సాధించి అదుర్స్ అనిపించుకున్నాడు. అందులో 23 స్వర్ణాలు ఉన్నాయంటే.. విశ్వక్రీడల్లో అతడి హవా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రాన్స్ నయా స్విమ్మర్ లియాన్ మర్చండ్.. అమెరికా దిగ్గజం బాటలో దూసుకెళ్తున్నాడు. పాల్గొన్న తొలి ఒలింపిక్ క్రీడల్లోనే నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకొని ఫెల్ప్స్‌కు తానే సరైన వారసుడినని అనిపించుకుంటున్నాడు. రెండు గంటల వ్యవధిలో రెండు స్వర్ణాలు సాధించి అభిమానుల దృష్టిని ఆకర్షించిన మర్చండ్.. ‘పారిస్’ క్రీడల్లో నాలుగో పసిడి చేజిక్కించుకున్నాడు. నాలుగు భిన్న రేసుల్లో అగ్రస్థానంలో నిలిచిన మర్చండ్.. ఈ నాలుగింట ఒలింపిక్ రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. ఫ్రాన్స్ యువ స్విమ్మర్ లియాన్ మర్చండ్ బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్‌లోనే నాలుగో పసిడి పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే మూడు స్వర్ణాలు నెగ్గిన మర్చండ్.. ఆదివారం పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసులో 1 నిమిషం 54.06 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో పసిడి పతకాలు గెలుచుకున్న 22 ఏళ్ల మర్చండ్.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యమని అంటున్నాడు. మర్చండ్ పోటీపడ్డ తొలి రేసును కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మక్రాన్.. అతడి ప్రతిభకు ముగ్ధుడయ్యారు. వారం రోజుల వ్యవధిలో కొలనులో సంచలన ఫలితాలు సాధించి రికార్డులు తిరగరాసిన మర్చండ్కు తాను అభిమాని అయిపోయానని వెల్లడించారు.‘అభిమాన సందోహం మధ్య పతకం గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చొని అభివాదం చేస్తుంటే.. ఇన్నేళ్లు పడ్డ కష్టం అంతా మరిచిపోయినట్లు అనిపిస్తుంది’ అని నాలుగో పసిడి పతకం గెలిచిన అనంతరం మర్చండ్ అన్నాడు. తనను తాను సిగ్గరిగా చెప్పుకునే మర్చండ్.. తాజా క్రీడల్లో చివరగా బరిలోకి దిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే సమయంలో చాలా ప్రశాంతంగా కనిపించాడు. మూడు పతకాలు గెలిచిన గర్వం కానీ, మరో పతకం సాధించాలనే ఒత్తిడి కానీ ఏమాత్రం లేకుండా బరిలోకి దిగి బంగారు పతకం చేజిక్కించుకున్నాడు. ‘నాలుగు స్వర్ణాలు గెలవడం నమ్మశక్యంగా లేదు. మొదట ఒక పతకం గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆ తర్వాత వరుసగా మంచి ప్రదర్శనలు కనబర్చా. ఫలితం నాకు అనుకూలంగా వచ్చింది’ అని మర్చండ్ పేర్కొన్నాడు. ఫ్రెంచ్ ఫెల్ప్స్... ఈత కొలనులో సంచలనాలు నమోదు చేస్తున్న మర్చండ్ను అభిమానులు ముద్దుగా ‘ఫ్రెంచ్ ఫెల్ప్స్’ అని పిలచుకుంటున్నారు. అయితే అది తనపై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని.. ఒకింత ఆనందంగా కూడా ఉందని మర్చండ్ పేర్కొన్నాడు. దశాబ్దకాలం పాటు ఒలింపిక్స్‌లో ఏకఛత్రాధిపత్యం కనబర్చిన ఫెల్ప్స్ నమోదు చేసిన రెండు ఒలింపిక్ రికార్డుల (400 మీటర్ల మెడ్లే, 200 మీటర్ల మెడ్లే)ను మర్చండ్ తాజాగా బద్దలు కొట్టాడు. మరోవైపు ఫెల్ప్స్ కూడా మర్చండ్ ఫీట్‌కు ఫిదా అయిపోయాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, బ్రెస్ట్‌స్ట్రోక్‌లో మర్చండ్ స్వర్ణాలు గెలిచిన సందర్భంలో ఫెల్ప్స్ సంబరాలు జరుపుకున్న వీడియో వైరల్‌గా మారింది. ‘ఫెల్ప్స్తో పోల్చినప్పుడు గర్వంగా ఉంటుంది. స్విమ్మింగ్ రూపురేఖలను మార్చిన ఘనత అతడిది’ అని మర్చండ్ అన్నాడు. ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు సాధించేందుకు ఫెల్ప్స్ ఇచ్చిన సూచనలు కూడా పనిచేశాయని వెల్లడించాడు. అయితే ‘పారిస్’ క్రీడల్లో మర్చండ్తో పోటీపడిన సహచరులు మాత్రం.. ఫెల్ప్స్ కన్నా మర్చండ్ కఠిన ప్రత్యర్థి అని ప్రశంసించారు. మర్చండ్తో కలిసి 400 మీటర్లు, 200 మీటర్లు వ్యక్తిగత మెడ్లే విభాగంలో బరిలోకి దిగిన అమెరికా స్విమ్మర్ కార్సాన్ ఫాస్టర్ మాట్లాడుతూ.. ‘పోటీలో పాల్గొన్న వారందరికీ.. అత్యుత్తమ స్విమ్మర్తో బరిలోకి దిగిన అనుభవం ఎదురైంది. పోటీ పడిన నాలుగు ఈవెంట్లలోనూ స్వర్ణాలు గెలవడం మామూలు విషయం కాదు’ అని పేర్కొన్నాడు. –సాక్షి క్రీడా విభాగం -
డేరింగ్ దాది
బకుళాబెన్ పటేల్‌ను సూరత్‌లో అందరూ ‘డేరింగ్ దాదీ’ అని పిలుస్తారు. 80 ఏళ్ల వయసులో నదుల్లో, సముద్రంలో ఆమె చేపలా ఈదడమే కాదు ఈత పోటీల్లో వందల మెడల్స్ సాధించడమే కారణం. 57 ఏళ్ల వయసులో మొదలెట్టిన ఈత తనకు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అంటోంది బకుళాబెన్. పెద్ద వయసు వారికి పెద్ద స్ఫూర్తి ఆమె.సూరత్‌లోని తాపి నది ఒడ్డున ఏ ఉదయాన ఐదు, ఆరు గంటల మధ్యన వెళ్లినా డేరింగ్ దాది అని ఆ ఊళ్లో పిలుచుకునే బకుళా బెన్ కనిపిస్తుంది. 80 ఏళ్ల వయసులో ఆమె దినచర్య గమనించదగ్గది. తెల్లవారు జామున 4 గంటలకు లేస్తుంది. ఒక గంటసేపు ఇంట్లో తేలికపాటి యోగా చేస్తుంది. ఆ తర్వాత జాగింగ్‌కు వీలైన దుస్తుల్లోకి మారి సూరత్ దారుల గుండా కనీసం గంటసేపు జాగింగ్ చేస్తుంది. ఆ తర్వాత తాపి ఒడ్డున ఈత దుస్తుల్లోకి మారి నదిలోకి దూరి దాదాపు రెండు గంటల సేపు ఈత కొడుతుంది. ఆ తర్వాతే ఆమె ఇంటికి చేరుతుంది. ‘నేను రోజులో ఒక పూట భోజనం అయినా లేకుండా ఉంటాను కాని ఏ రోజూ ఈత కొట్టకుండా ఉండలేను’ అంటుంది బకుళా బెన్.కొత్త జీవితంబకుళా బెన్ది అందరు సగటు ఆడవాళ్ల జీవితం వంటిదే. పెళ్లి, పిల్లలు... ఆమెకు నలుగురు సంతానం. వారిని పెంచి పెద్ద చేయడంలో జీవితం గడిచిపో యింది. ఆమెకు 50 ఏళ్లు ఉండగా భర్త మరణించాడు. కొన్నాళ్లకు ఆమెకు జీవితం బోరు కొట్టింది. ‘ఏదో ఒకటి చేయాలి’ అని క్రీడల వైపు ఆసక్తి కనపరిచింది. ‘నాకు చిన్నప్పుడు నీళ్లంటే భయం. ఈత నేర్చుకోలేదు. కాని ఎన్నాళ్లు నీళ్లకు దూరంగా జరుగుతాను. ఈత నేర్చుకుందాం అనుకున్నాను.ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నా వయసు 58’ అని తెలిపింది బకుళా బెన్. కాని ఆమె ఈత నేర్చుకోవడం అంత సులువు కాలేదు. బంధువులు, ఇరుగు పొరుగు వారు ‘హవ్వ’ అని నోరు నొక్కుకున్నారు. హేళన చేస్తూ వెనుక మాట్లాడుకున్నారు. ‘అవన్నీ నా చెవిన పడుతున్నా ఈత నేర్చుకోవడం మానలేదు’ అంటుంది బకుళ. ఇలా నవ్విన వారే తాపీనదిలో చేపలా ఈదుతున్న బకుళను చూసి ఆశ్చర్యపో యారు. హేళన స్థానంలో గౌరవం వచ్చింది.అన్నీ భిన్నమేపిల్లలు సెటిల్ కావడం వల్ల దొరికిన తీరుబడిని బకుళ సంపూర్ణంగా జీవించదలుచుకుంది. ‘నేను నా 60వ ఏట బి.ఏ. కట్టాను. పాఠాలు చదవడం గుర్తు పెట్టుకోవడం కష్టమైంది. రోజుకు 10 గంటలు చదివేదాన్ని. అలాగే ఎప్పుడో వదిలేసిన రాత కూడా ప్రాక్టీసు చేసి పరీక్షలు రాసి డిగ్రీ ΄పొందాను. అలాగే యోగా నేర్చుకున్నాను. 80 ఏళ్ల వయసులో శీర్షాసనం వేయగలను. 75 ఏళ్ల వయసులో నాకు భరతనాట్యం నేర్చుకోవాలనిపించింది. మన దేశంలో ఆ వయసులో భరతనాట్యం చేసి అరంగేట్రం చేసింది నేనొక్కదాన్నే. ఆ ఆరంగేట్రం చూసి చాలామంది మెచ్చుకున్నారు’ అంటుంది బకుళ.500 మెడల్స్‘నన్ను చూసి అందరూ స్ఫూర్తి పొందాలని ఇన్ని పనులు చేస్తున్నాను. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉంది. ఆ వివక్షను ఎదిరించాలంటే ఇలాంటి కృషి చేయాలి. నేను జాతీయ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ ఈత పో టీల్లో ఇప్పటివరకు 500 మెడల్స్ గెలుచుకున్నాను. అట్లాంటిక్, పసిఫిక్, బంగాళాఖాతాల్లో ఈత కొట్టాను. అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా, మలేసియా దేశాల్లో ఈతపో టీల్లో పాల్గొన్నాను. ఇంగ్లిష్ చానల్ ఈది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరాలని నా కోరిక. ఇప్పటికి 400 మందికి ఈత నేర్పాను. ఈతలో ఉన్న ఆరోగ్యం, ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది బకుళా బెన్. -
ఈత సరదా ప్రాణం తీసింది
వైఎస్సార్: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఈత నేర్పమంటివి కదా కొడుకా..
బోయినపల్లి(చొప్పదండి): ‘సెలవులచ్చినయి దోస్తులు ఈత నేర్చుకుంటుండ్రు.. ఈత నేర్పమంటివి కదా కొడుకా.. కనిపించకుండా పోతివా కొడుకా..’ అని ఆ తల్లి రోదన అక్కడి వారి హృదయాలను కలచివేసింది. ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఏడో తరగతి విద్యార్థి చేపూరి మణితేజ(12) బావిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన చేపూరి తిరుమల–గంగయ్యలకు మణితేజ, రిత్విక్ కొడుకులు.పాఠశాలకు వేసవి సెలవులు రావడంతో ఈత నేర్చుకునేందుకు తండ్రి గంగయ్య, తాత రామయ్యలతో కలిసి గత మూడు రోజులుగా మణితేజ వెళ్తున్నాడు. గ్రామంలోని తాటివనం పరిసరాల్లోని వందురునూతిలో ఓ రోజు తాత, మరో రోజు తండ్రి ఈత నేర్పుతున్నారు. మణితేజ తాత రామయ్య శుక్రవారం గంగాధర మండలం చర్లపల్లికి వెళ్లగా.. తండ్రి గంగయ్యతో కలిసి ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. అదే బావిలో మరికొందరు సైతం ఈత కొడుతున్నారు.ఈక్రమంలో ఈత కొడుతుండగా మణితేజ మునిగిపోయాడు. పది గజాల లోతులో నీళ్లు ఉండడంతో ఎంత వెదికినా బాలుడి ఆచూకీ లభించలేదు. మోటార్లు పెట్టి నీరు తీసే ప్రయత్నం చేసినా ఖాళీ కాలేదు. ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇవ్వగా.. గజ ఈతగాళ్లు వచ్చి తెప్ప సాయంతో మణితేజ మృతదేహాన్ని బయటకు తెచ్చారు. బావిలో మణితేజ గల్లంతయ్యాడని తెలియడంతో గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీయగానే తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి
మాక్లూర్: చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్డేట్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్ (20), తిరుపతి(19), నరేశ్ (20), సాయితేజ, వినోద్‌లు శనివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే చెరువులో మొరం కోసం తవ్విన లోతైన గుంతలు ఉన్నాయి. ఈ విషయం తెలియని మహేశ్, తిరుపతి, నరేశ్ చెరువులోకి దిగిన వెంటనే లోతైన గుంతల్లోకి జారి మునిగి పోయారు. ఒడ్డునే ఉన్న సాయితేజ, వినోద్ వెంటనే తేరుకుని గ్రామంలోనికి వెళ్లి సమాచారం ఇచ్చారు. పెద్దఎత్తున గ్రామస్తులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ముగ్గురూ మృతిచెందడంతో గజ ఈతగాళ్లతో ముగ్గురి మృత దేహాలను బయటకు తీయించారు. మృతుల తల్లిదండ్రులకు వారు ఒక్కొక్కరే సంతానం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల్లో తిరుపతి 10వ తరగతి, నరేశ్, మహేశ్‌లు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మాక్లూర్ ఎస్సై సుధీర్‌రావు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని ట్రెయినీ ఐపీఎస్ అధికారి చైతన్యరెడ్డి, నార్త్‌జోన్ సీఐ సతీశ్ పరిశీలించారు. -
ప్రాణం తీసిన ఈత సరదా.. విద్యార్థి విషాదం!
కరీంనగర్: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఉన్నతంగా చదువుకొని కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్థి మృతి ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు. వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన గొల్లేని(ఆలకుంట) లక్ష్మి–వెంకటి దంపతులకు ఇద్దరు కొడుకులు రాజశేఖర్, హరికృష్ణ(15), ఒక కూతురు. రాజశేఖర్ దుబాయిలో ఉండగా, హరికృష్ణ ఇటీవలే పదోతరగతి పరీక్షలు రాశాడు. హరికృష్ణ తండ్రి వెంకటి అల్మాస్పూర్ గ్రామంలో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని, పంటలు సాగు చేస్తున్నాడు. తండ్రితోపాటు హరికృష్ణ సైతం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి సమీపంలోని రంగంచెరువులో ఈత కొట్టేందుకు ఒంటరిగా వెళ్లాడు. ఈత కొడుతుండగానే ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అప్పటి వరకు కళ్ల ముందు తిరిగిన కొడుకు జీవచ్ఛవంగా పడి ఉండడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అందరితో కలివిడిగా ఉంటే హరికృష్ణ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!
హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్సాహంగా హోలీ చేసుకుని.. కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్‌కు చెందిన పనస కమలాకర్(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్(25), ఎల్ములె ప్రవీణ్(23), మేడి నవీన్, పసుల సంతోష్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు. మద్యం తాగి స్నానానికి దిగి.. ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్, ఉప్పుల సంతోష్, ప్రవీణ్, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు. గమనించిన సంతోష్ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్‌పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణాలివే.. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్‌తో మాట్లాడారు. సీఐ సాదిక్ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్‌మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్ కొడుకా..’ అంటూ కమలాకర్ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది. మృతుల వివరాలు.. ఆలం శంకర్–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌లో డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్ పూర్తి చేసిన సంతోష్ రైస్‌మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. పనస వసంత్ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వాసుదేవ్ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు. ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య.. -
ఫండే: 'వానర జలక్రీడ'! మీరు విన్నది నిజమే!!
వానరాలు(కోతులు) చెట్లపైనుంచి దూకడం, గంతులేయడం, కీచుమంటూ అరవడంలాంటివి మనం ఎన్నో చూసుంటాం. అవి చేసే తమాషా చేష్టలకి మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ వానరాలు ఎప్పుడైనా ఈత కొట్టడం చూశారా! చెరువులో కాదు, బావిలో కాదు, ఏకంగా సముద్రంలో.. నమ్మలేకున్నారు కదూ..! అయితే ఈ దృశ్యం చూడండి.. వానరాలు ఈతకొడుతూ కనిపించడం చాలా అరుదు. మకాక్ జాతికి చెందిన ఈ మగ వానరం సముద్రంలో హాయిగా మునకీత కొడుతున్న అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. థాయ్‌లాండ్‌లోని ఫై ఫై దీవి తీరం వద్ద కనిపించిన ఈ దృశ్యాన్ని కువైట్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ సులేమాన్ అలాతికి తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటో ఇటీవల ‘అండర్ వాటర్ ఫొటోగ్రఫీ–2024’ పోటీలో బహుమతి దక్కించుకుంది. ఇవి చదవండి: ఈ ఖనిజం ధరెంతో మీకు తెలుసా! -
స్విమ్మింగ్ 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో కొత్త ప్రపంచ రికార్డు
ప్రపంచ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 4*100 మీటర్ల రిలే ఫైనల్లో చైనా స్విమ్మర్ పాన్ జాన్లె తన అంచెను 46.80 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో డేవిడ్ పోపోవిచి (రొమేనియా; 46.86 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పాన్ జాన్లె బద్దలు కొట్టాడు. చైనా బృందం రిలే రేసును 3ని:11.08 సెకన్లలో ముగించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటలీ జట్టుకు రజతం, అమెరికా జట్టుకు కాంస్య పతకం లభించాయి. కెన్యా స్టార్ అథ్లెట్ దుర్మరణం.. ఆమె పరిస్థితి విషమం నైరోబి: కెన్యా స్టార్ అథ్లెట్, పురుషుల మారథాన్‌లో ప్రపంచ రికార్డు నెలకొలి్పన కెల్విన్ కిప్టమ్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కిప్టమ్ స్వయంగా నడుపుతున్న కారు అదుపుతప్పి పల్టీ కొడుతూ బలంగా చెట్టును ఢీకొంది. దుర్ఘటన సమయంలో కోచ్ హకిజిమానా, ఓ మహిళ కారులో ప్రయాణించగా... కిప్టమ్, కోచ్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన మహిళను హాస్పిటల్లో చేరి్పంచినట్లు పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉంది. 24 ఏళ్ల కిప్టమ్ త్వరలో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించేందుకు శ్రమిస్తున్నాడు. అయితు, లక్ష్య చేరుకోకుండానే అతడు మృత్యువాతపడటం విషాదం. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన షికాగో మారథాన్ రేసులో (42.195 కిలోమీటర్లు; 2గం:00:35 సెకన్లు) కెల్విన్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఏప్రిల్‌లో జరిగిన లండన్ మారథాన్లోనూ కిప్టమ్ స్వర్ణ పతకం సాధించాడు. -
వారెవ్వా.. బామ్మా! ఒకేరోజు మూడు ప్రపంచ రికార్డులు
రికార్డులకు, అవార్డలుకు వయస్సుతో పనేముందని నిరూపించిందో బామ్మ. 99 ఏళ్ల వయసులో ఈజీగా ఈత కొట్టడం మాత్రమే కాదు. ఒకే రోజు ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. డచ్-కెనడియన్ బెట్టీ బ్రస్సెల్ ఈ నెల 20న అద్భుతమైన ఈ ఫీట్ సాధించింది. 400-మీటర్ల ఫ్రీస్టైల్, 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ 50-మీటర్ల బ్యాక్ అనే మూడు విభాగాల్లో తన సత్తా చాటింది. తనకు ఏజ్ అస్సలు మేటర్ కాదంటోంది. ఇదీ చదవండి: ఏకంగా రూ.7 కోట్ల భూమిని విరాళమిచ్చిన మహిళ, ఎందుకో తెలుసా? స్విమ్మింగ్ కెనడా లెక్కల ప్రకారం 12 నిమిషాల 50 సెకన్లతో ఉన్న 400-మీటర్ల ఫ్రీస్టైల్ రికార్డును దాదాపు నాలుగు నిమిషాల్లో బ్రేక్ చేసింది. అలాగే 50-మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ను ఐదంటే ఐదు సెకన్లలో ఛేదించి వాహ్వా అనిపించుకుంది. ‘‘నేను రేసులో ఉంటే ఇక దేన్నీ పట్టించుకోను. ఐ ఫీల్ లైక్ ఎ ఉమెన్!'‘ అని చెప్పిందామె. (Oyster Mushrooms: బెనిఫిట్స్ తెలిస్తే.. అస్సలు వదలరు!) బ్రస్సెల్ 60 సంవత్సరాల వయస్సు నుండి మాత్రమే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ ఉండటం విశేషం. కానీ ఇటీవలి అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను దక్కించుకుంది. ‘‘అమ్మా నీకు ముసలి తనం వచ్చేసిందని నా 70 ఏళ్ల చిన్న కొడుకుఅంటూ ఉంటాడు. కానీ నాకు అలా అనిపించదు. నిజంగా అలసి పోయినప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది. అంతే’’ అంటారామె. అలాగే రికార్డుల గురించి కూడా ఆలోచించను. చేయాల్సిన పనిని ధైర్యంగా చేసేస్తాను. గెలిస్తే సంతోషిస్తాను అంటుంది బోసి నవ్వులతో. బ్రస్సెల్స్ ఇప్పటికీ కనీసం వారానికి రెండుసార్లు స్విమ్మింగ్ చేస్తుంది. -
హైదరాబాద్ స్విమ్మర్ గౌతమ్‌కు ఐదు స్వర్ణాలు
తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్ జిల్లా జూనియర్, సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్విమ్మర్ గౌతమ్ శశివర్ధన్ ఐదు స్వర్ణ పతకాలతో అదరగొట్టాడు. విక్కీ స్విమ్మింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న 14 ఏళ్ల గౌతమ్ బరిలోకి దిగిన ఐదు ఈవెంట్లలోనూ విజేతగా నిలిచాడు. గ్రూప్–2 వయో విభాగంలో గౌతమ్ 50, 100, 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్, 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్లలో పసిడి పతకాలు గెలిచాడు. ఈ ప్రదర్శనతో గౌతమ్ ఈనెల 27 నుంచి 29 వరకు బెంగళూరులో జరిగే జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్íÙప్లో పాల్గొనే తెలంగాణ జట్టులోకి ఎంపికయ్యాడు. -
వ్రితి అగర్వాల్‌కు కాంస్యం.. తెలంగాణ ఖాతాలో 12వ పతకం
గోవాలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో 12వ పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో వ్రితి అగర్వాల్ (2ని:22.28 సెకన్లు) కాంస్య పతకం నెగ్గి ఈ క్రీడల్లో మూడో పతకం సాధించింది. ఓవరాల్‌గా తెలంగాణ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో 22వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 4 స్వర్ణాలు, 2 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 15 పతకాలతో 17వ స్థానంలో ఉంది. -
చరిత్ర సృష్టించిన కేటీ.. మైఖేల్ ఫెల్ప్స్ రికార్డు బద్ధలు
26 ఏళ్ల అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ చరిత్ర సృష్టించింది. జపాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 16 స్వర్ణ పతాకాలు సాధించి, ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన రికార్డు దిగ్గజ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ (15) పేరిట ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కేటీ.. ఫెల్ప్స్ రికార్డు బద్దలు కొట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇవాళ (జులై 30) జరిగిన 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్లో స్వర్ణం గెలవడం ద్వారా లెడెకీ ఈ ఘనత సాధించింది. 800 మీటర్ల ఈవెంట్లో స్వర్ణం కైవసం చేసుకున్న లెడెకీ మరో రికార్డును కూడా బద్దలు కొట్టింది. వరల్డ్ ఛాంపియన్షిప్ మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు (6) సాధించిన స్విమ్మర్‌గా రికార్డు నెలకొల్పింది. అలాగే ఒకే ఈవెంట్లో అత్యధిక ప్రపంచ ఛాంపియన్షిప్స్ బంగారు పతకాలు (6) సాధించిన స్విమ్మర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లోనూ స్వర్ణంతో మెరిసిన కేటీ.. ఇప్పటివరకు తన కెరీర్లో 20 వరల్డ్ ఛాంపియన్షిప్స్ స్వర్ణాలు, 7 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ సాధించింది. మహిళల స్విమ్మింగ్ చరిత్రలో ఏ సిమ్మర్ కేటీ సాధించినన్ని గోల్డ్ మెడల్స్ సాధించలేదు. -
31.29 గంటల్లో 72 కి.మీ. ఈత!
కాచిగూడ: భారత్‌కు చెందిన ఆరుగురు దివ్యాంగ ఈతగాళ్లు ఇంగ్లండ్–ఫ్రాన్స్ మధ్య ఉన్న ఇంగ్లిష్ చానల్ (అట్లాంటిక్ మహాసముద్రంలోని ఓ భాగం)ను రెండు వైపులా రిలేగా ఈది సరికొత్త రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్‌కు చెందిన కోచ్ రాజోరియా తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన దివ్యాంగుడు శివకుమార్‌తోపాటు ఎన్ఏ స్నేహన్ (తమిళనాడు), ఎల్విస్ అలీ హజారికా (అస్సాం), రిమో సాహా (పశ్చిమ బెంగాల్), సత్యేంద్రసింగ్ (మధ్యప్రదేశ్), జయంత్ దూబ్లే (మహారాష్ట్ర)తో కూడిన బృందం ఇంగ్లిష్ చానల్ ఈదడానికి ఈ నెల 8న లండన్‌కు వెళ్లారు. ఈ నెల 18న కెంట్లోని డోవర్లో సమీపంలో ఉన్న షేక్స్పియర్ బీచ్ నుంచి ఈత ప్రారంభించి ఉత్తర ఫ్రాన్స్‌లోని విస్సంట్ ఒడ్డును చేరుకొని తిరిగి డోవర్ వద్ద ఉన్న ఓల్డ్ సౌత్ ఫోర్‌ల్యాండ్ లైట్‌హౌస్ వద్దకు ఈ నెల 19న చేరుకున్నారు. భారీ అలలు, జెల్లీఫిష్‌లు సహా ఇతర ప్రమాదకర సముద్ర జీవుల నుంచి తప్పించుకుంటూ మొత్తం 72 కి.మీ. దూరాన్ని కేవలం 31 గంటల్లోనే ఈదారు. తద్వారా ఇంగ్లిష్ చానల్‌ను రిలేగా ఈదిన ఆసియా ప్రాంత వాసులుగా రికార్డు సృష్టించారు. -
రెక్కలిచ్చిన ఆసనం
మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెద్దయ్యాక ఇది అవ్వాలి, అది అవ్వాలి అని రకరకాల కలలు కంటాము. ఎంతో ఇష్టమైన కలను నిజం చేసుకునేందుకు ఎదురైన అడ్డంకులన్నింటిని దాటుకుని సాధిస్తాం. హమ్మయ్య చేరుకున్నాం అని కాస్త సంతోషపడేలోపు అనుకోని కుదుపులు కెరీర్‌ను పూర్తిగా నాశనం చేస్తాయి. తిరిగి కోలుకోలేని దెబ్బకొడతాయి. అచ్చం ఇలానే జరిగింది అన్షుక పర్వాణి జీవితంలో. తనకెంతో ఇష్టమైన కెరీర్‌ను వదిలేసినప్పటికీ... యోగా ఇచ్చిన ధైర్యంతో యోగానే కెరీర్‌గా మలుచుకుని సెలబ్రెటీ యోగా ట్రైనర్‌గా రాణిస్తోంది పర్వాణి. ముంబైకి చెందిన అన్షుక పర్వాణి విద్యావంతుల కుటుంబంలో పుట్టింది. అన్షుకకు చిన్నప్పటినుంచి ఆస్తమా ఉంది. అయితే మందులు మింగడం అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో డాక్టర్స్ అయిన తాతయ్య, నాయనమ్మలు... ‘‘రోజూ స్విమ్మింగ్ చేస్తుంటే నీ ఊపిరి తిత్తులు బలంగా మారతాయి’’ అని ప్రోత్సహించేవారు. మందులు మింగే బాధ ఉండదని, అన్షుక ఎంతో ఆసక్తిగా స్విమ్మింగ్ నేర్చుకుని రోజూ ఈతకొట్టేది. ఈతలో పట్టుసాధించి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్స్‌లో గోల్డ్‌మెడల్ గెలిచింది. స్విమ్మింగ్‌తోపాటు విమాన ప్రయాణం అన్నా అన్షుకకు చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే పైలట్ కావాలని కలలు కనేది. పైలట్ అయ్యి, ప్రపంచమంతా తిరిగిరావాలని... కష్టపడి కమర్షియల్ పైలట్ అయ్యింది. ► ఎగరలేకపోయింది అది 2008.. అన్షుక అనుకున్నట్టుగానే పైలెట్‌గా గాలిలో తేలిపోతున్న రోజులవి. ఒకరోజు బైక్ యాక్సిడెంట్లో అనుష్క కాళ్లు, తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఎటూ కదల్లేని పరిస్థితి. కొన్ని నెలలపాటు బెడ్‌కే పరిమితమైంది. దీంతో కమర్షియల్ పైలట్ ఉద్యోగానికి ఫిట్ కాదని జాబ్ నుంచి తొలగించారు. ఒకపక్క గాయాలతో గుచ్చుకుంటోన్న శరీరం, మరోపక్క విమానం నడపలేని పరిస్థితి అన్షుకను కలచివేసింది. ఇదే సమయంలో తల్లిదండ్రులు అండగా ఉండి, తమ సంపూర్ణ సహకారం అందించడంతో... ఫిజియోథెరపీ, యోగాలతో కొన్ని వారాలలోనే కోల్పోయిన మనోధైర్యాన్ని కూడదీసుకుంది. ఎలాగైనా లేచి నడవాలి అని నిర్ణయించుకుని ఆసనాలను కఠోరంగా సాధన చేసేది. తన తల్లి యోగా టీచర్ కావడం, చిన్నప్పటి నుంచి ఆస్తమాను ఎదుర్కోవడానికి యోగాసనాలు వేసిన అనుభవంతో ఎనిమిది నెలల్లోనే కోలుకుని తిరిగి నడవగలిగింది. ► యోగ శక్తిని తెలపాలని... యోగాతో సాధారణ స్థితికి వచ్చిన అన్షుక.. తిరిగి పైలట్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ యోగాపై ఏర్పడిన నమ్మకం, ఆసక్తితో ‘యోగాను ఎందుకు కెరీర్‌గా ఎంచుకోకూడదు? ఎగరలేక కిందపడిపోయిన తనని తిరిగి లేచి నyì చేలా చేసిన ఈ యోగా శక్తిని అందరికీ తెలియచేయాలి’ అనుకుని.. తొమ్మిది నెలల పాటు యోగాలో శిక్షణ తీసుకుని సర్టిఫికెట్ అందుకుంది. యోగాను మరింత లోతుగా తెలుసుకునేందుకు ముంబై యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పీజీ చేస్తూనే వివిధ రకాల సంప్రదాయ యోగాలను సాధన చేసి ఔపోసన పట్టింది. ఈ క్రమంలోనే పైలట్స్, బాలే, జుంబాను నేర్చుకుని సర్టిఫికెట్ పొందింది. 2015లో బాంద్రాలో యోగా ఇన్స్టిట్యూట్ను నెలకొల్పింది. సంప్రదాయ యోగాసనాలకు కొన్ని టెక్నిక్స్‌ను జోడించడంతో మంచి ఫలితాలు వచ్చేవి. దీంతో అన్షుక యోగా సెంటర్ బాగా పాపులర్ అయ్యింది. ► అన్షుక యోగా స్టూడియో! యోగాపై పెరిగిన అవగాహనతో సెలబ్రెటీలు సైతం తమ ఫిట్నెస్కోసం యోగాను ఎంచుకుంటున్నారు. అన్షుక ట్రైనింగ్ బావుండడంతో.. మలైకా అరోరా, హూమా ఖురేషి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, ఆలియాభట్, దీపికా పదుకోన్, రకుల్æప్రీత్ సింగ్, మిస్బా గుప్తా, అనన్య పాండే, జాహ్నవీ కపూర్, సోనాల్ చౌహాన్ వంటి సెలబ్రెటీలు అన్షుక దగ్గర యోగాలో శిక్షణ తీసుకున్నారు. ఎంతమంది సెలబ్రెటీలకు యోగా ట్రైనర్‌గా పనిచేసినా నాకు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. శిక్షణ ఇవ్వడమంటే ఇష్టం. ట్రైనింగ్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే, నేను మనసా వాచా కర్మణ్యా పనిచేస్తున్నాను. ఎవరికైనా సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు అవి కచ్చితత్వంతోనూ, సత్యంతోనూ ఉంటేనే వాటికి విలువ ఉంటుంది. అందుకే నేను యోగాసనాలు వేసి, వేయించి, దాని శక్తిని అందరికీ తెలిసేలా చేస్తున్నాను. అందుకే నా శిక్షణకు ఆదరణ లభిస్తోంది. -
వరల్డ్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్.. జలకన్యల విన్యాసాలు (ఫొటోలు)
-
ఈత రావాలి ప్రాణం నిలవాలి
ఇది వానల కాలం. వరదల కాలం. కేరళలో ఈ సమయంలో పడవ ప్రమాదాలు సాధారణం. ప్రమాద తీవ్రత కంటే ఈత రాకపోవడం వల్ల జనం మరణిస్తున్నారని సాజి వెలస్సిరల్ అనే వ్యక్తికి అనిపించింది. చిన్న ఫర్నిచర్ షాపు నడుపుకునే ఇతడు గొప్ప ఈతగాడు కూడా. ఇంకేముంది. ఊళ్లో ఉన్న పెరియార్ నదిని స్విమ్మింగ్ పూల్‌గా చేసుకుని అందులోనే ఈత నేర్పుతున్నాడు. ఇప్పటికి 6000 మంది ఈత నేర్చుకున్నారు. వీళ్లందరి ప్రాణాలను నీళ్ల నుంచి ఇతడు రక్షించినట్టే. ప్రతి చోటా ఇలాంటి వాళ్లుంటే వేల ప్రాణాలు బతుకుతాయి. గత మే నెలలో కేరళలోని తానురు దగ్గర బ్యాక్ వాటర్స్‌లో పడవ మునిగి 27 మంది చనిపోయారు. ‘వాళ్లకు ఈత వచ్చి ఉంటే అందరూ బతికి ఉండేవారు. తుఫాను లేదు.. సముద్రమూ కాదు. ఈత వచ్చి ఉంటే పడవ బోల్తా పడినా ఆ బ్యాక్ వాటర్స్‌లో హాయిగా ఈదుకుంటూ గట్టెక్కవచ్చు. లేదా సహాయకబృందాలు చేరేవరకూ మెల్లగా తేలుతూనే ఉండొచ్చు’ అంటాడు సాజి వెలస్సిరల్. ఈ ప్రమాదం కాదు ఇరవై ఏళ్ల క్రితం ఇతడు చూసిన ప్రమాదమే ఇతడి మనసు మార్చింది. కుమర్కోమ్లో పడవ బోల్తా పడి 29 మంది చనిపోయారు. అప్పుడు సాజి యువకుడు. తండ్రి మంచి స్విమ్మర్ కావడంతో ఆయన నుంచి ఈత నేర్చుకుని అద్భుతంగా ఈదుతున్నాడు. ఆ ప్రమాదంలో చనిపోయిన వారికి ఈత వచ్చి ఉంటే ప్రాణాలు మిగిలి ఉండేవి అనిపించింది. ‘ఈత ఎందుకు రాదు’ అని ప్రశ్నించుకున్నాడు. ‘నేర్పేవారు లేకపోవడం వల్ల’ అనే జవాబు వచ్చింది. ‘నేనెందుకు నేర్పకూడదు’ అనుకున్నాడు. అలా అతని ఈత సేవ మొదలైంది. పెరియార్ నదిలో సాజి వెలస్సిరల్ అలువా అనే చిన్న ఊరిలో ఉంటాడు. ఇది ఎర్నాకుళంకు 40 నిమిషాల దూరం. ఆ ఊళ్లో చిన్న ఫర్నీచర్ షాపు నడుపుకుంటూ జీవిస్తుంటాడు సాజి. అయితే అదే ఊరి నుంచి పెరియార్ నది ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపు నిలువ నీరులా ఉంటుంది ప్రవాహం. ‘దీనినే స్విమ్మింగ్‌పూల్‌గా చేసుకుని ఈత నేర్పిస్తాను’ అని నిర్ణయించుకున్నాడు సాజి. ‘ముందు నా కుటుంబం నుంచే మొదలెట్టాలి’ అనుకుని తన ఇద్దరు పిల్లల్ని, స్నేహితుడి పిల్లల్ని తీసుకుని నదిలో ఈత నేర్పడం మొదలెట్టాడు. మూడు వారాల్లోనే పిల్లలు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు (780 మీటర్లు) ఈదడం నేర్చుకున్నారు. దాంతో ఊరి దృష్టి సాజి మీద పడింది. అతడి దగ్గర ఈత నేర్చుకోవడానికి అందరూ క్యూ కట్టారు. వెలస్సిరల్ రివర్ స్విమ్మింగ్ క్లబ్ నేర్చుకునేవారు పెరిగే కొద్దీ సాజికి ఉత్సాహం వచ్చింది. తన ఈత కేంద్రానికి వెలస్సిరల్ రివర్ స్విమ్మింగ్ క్లబ్ అనే పేరు పెట్టాడు. ప్రత్యేక దినాల్లో, పండగ వేళల్లో సామూహిక ఈత కార్యక్రమాలు నిర్వహిస్తాడు. నది ఈదే పోటీలు నిర్వహిస్తాడు. విశేషం ఏమిటంటే 70 ఏళ్ల ఆరిఫా అనే మహిళ ఇతని దగ్గర ఈత నేర్చుకుని చేతులు వెనక్కు కట్టుకుని మరీ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఈదింది. శారీరకమైన అవకరాలు ఉన్నవారికి కూడా ఈత నేర్పే టెక్నిక్స్ ఇతని దగ్గర ఉన్నాయి. ఇతను ఈత నేర్పేటప్పుడు ఒక అంబులెన్సు ఒడ్డున, నదిలో రక్షణకు ఒక పడవ సిద్ధంగా ఉంటాయి. ‘ఈత నేర్వాలి. ప్రాణాలు నిలుపుకోవాలి. ప్రమాదవశాత్తు నీళ్లల్లో పడితే ఈదలేక మరణించడం దురదృష్టకరం’ అంటాడు సాజి. అతని హెచ్చరిక వినదగ్గది. -
Aquatic Championship: రజతం గెలిచిన తెలంగాణ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ మూడో పతకం సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మహిళల 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వ్రితి రజత పతకం గెలిచింది. వ్రితి 9ని:17.62 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. భవ్య సచ్దేవ (ఢిల్లీ; 9ని:15.59 సెకన్లు) స్వర్ణం, అనన్య (మహారాష్ట్ర; 9ని:24.67 సెకన్లు) కాంస్యం నెగ్గారు. క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయిలు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి తమ భాగస్వాములతో కలిపి డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. థాయ్‌లాండ్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–1, 6–3తో పవిని –జులాలక్ (థాయ్‌లాండ్) జంటపై... సహజ–సోహా (భారత్) జోడీ 6–3, 3–6, 10–6తో ఆన్ యుజిన్ (కొరియా)–ఇకుమి (జపాన్) ద్వయంపై గెలిచాయి. -
ప్రాణాల మీద ఆశ.. నడి సంద్రంలో 12 గంటల పాటు మృత్యు పోరాటం
పిఠాపురం: ప్రాణాల మీద ఆశ అతడిలో మనోధైర్యాన్ని తట్టి లేపింది. ఎలాగైనా బతకాలనే పట్టుదల నడి సంద్రాన్ని ఎదురీదేలా చేసింది. 12 గంటల పాటు సముద్రంలో ఆ మత్స్యకారుడు చేసిన సాహసమే అతడి ప్రాణాలను రక్షించింది. ఈ సంఘటన కాకినాడ సమీపంలో నడి సంద్రంలో జరిగింది. దీనికి సంబంధించి తోటి మత్స్యకారులు తెలిపిన వివరాలివీ.. కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన పలువురు కాకినాడ శివారు రేపూరుకు చెందిన గేదెల అప్పారావుతో కలిసి బోటుపై మంగళవారం రాత్రి సముద్రంలో వేటకు వెళ్లారు. కాకినాడ తీరానికి సుదూర సముద్రంలో రాత్రి 8 గంటలకు చేపల కోసం సముద్రంలో వల వేసి బోటులో అందరూ పడుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు అందరూ లేచి చూసేసరికి అప్పారావు కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని ఉప్పాడ, అంతర్వేదిలో తోటి మత్స్యకారులకు చెప్పగా వారు మరో బోటుపై వెళ్లి అప్పారావు కోసం గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఇంతలో అంతర్వేది తీరం నుంచి చిన్న తెప్పపై చేపల వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులకు నడి సంద్రంలో ఓ వ్యక్తి తేలియాడుతూ కనిపించాడు. వెంటనే అక్కడికి వెళ్లి అతడిని తమ తెప్పలోకి ఎక్కించుకోగా కొన్ని క్షణాల్లోన్నే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మత్స్యకారుల సపర్యలు.. దీంతో తోటి మత్స్యకారులు అతడి గుండెలపై బలంగా గుద్ది తాగిన నీటిని కక్కించి సపర్యలు చేయడంతో అతడిలో కదలికలు వచ్చాయి. వెంటనే అతడిని అంతర్వేది వద్ద ఒడ్డుకు చేర్చి 108లో రాజోలు ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడిని అప్పారావుగా గుర్తించారు. కాగా, చేపల కోసం వల వేసి అందరూ పడుకున్నాక తాను బహిర్భూమికి వెళ్లానని, ఇంతలో బోటు కదలడంతో ప్రమాదావశాత్తు సముద్రంలో పడిపోయానని అప్పారావు చెప్పాడు. 12 గంటల పోరాటం.. ఎంతసేపు ఈత కొట్టినా బోటు కనిపించకపోవడం..సముద్ర ఒడి ఎక్కువగా ఉండటంతో అలా ఈదుకుంటూ వచ్చానని తెలిపాడు. ఓపిక ఉన్నంత వరకు ఈదుకుంటూ తీరం వైపు వెళుతున్న తనకు ఎండ ఎక్కడంతో ఓపిక తగ్గిపోయిందని.. దీంతో మునిగిపోకుండా తానున్న స్థలంలోనే పైకి తేలి ఉండే విధంగా ప్రయత్నం చేశానని చెప్పాడు. 12 గంటల శ్రమ అనంతరం చివరకు తనకు దూరంగా ఒక తెప్ప కనిపించడంతో చేతులు పైకి ఊపుతూ రక్షించమని అడిగానని..ఆ తెప్పలో ఉన్నవారు తనని కాపాడారని అప్పారావు చెప్పాడు. ఇది కూడా చదవండి: 'ఫ్యామిలీ డాక్టర్' పథకంతో మంచి ఫలితాలు.. ఆరేళ్లు దాటాక కూడా ప్రత్యేక శ్రద్ద -
అయ్యో.. బిడ్డలారా..
ఓదెల/వీణవంక/జమ్మికుంట: వేసవి సెలవుల కోసం బంధువుల ఇంటికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు మానేరువాగులో మునిగి మృత్యువాత పడడం స్థానికంగా విషాదం నింపింది. వీణవంక మండలం కొండపాక చెక్‌డ్యాం, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి చెక్‌డ్యాం సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మూడు గ్రామాల ప్రజలను కలచివేసింది. జమ్మికుంట మండలం తనుగులకు చెందిన జూపాక అశోక్, భాగ్యలక్ష్మి కూతురు సింధు, సాత్విక్ (13)సంతానం. అదే గ్రామానికి చెందిన కాసర్ల సునీల్, వందనకు కూతురు నిత్య(12) కుమారుడు ధామన్ సంతానం. వేసవి సెలవుల కోసం మూడు రోజుల క్రితం కొండపాకలోని సంపత్ ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం కొండపాక శివారులోని చెక్‌డ్యాంలో స్నానం చేద్దామని వెళ్లారు. నిత్య, సాత్విక్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగారు. చదువులో ఇద్దరూ ముందంజ.. సాత్విక్ తనుగుల ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదివి ఆరో తరగతి కోసం ఇటీవల జరిగిన సోషల్ వెల్ఫేర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. నిత్య హుజూరాబాద్‌లోని బీసీ వెల్ఫేర్‌లో ఏడో తరగతి చదువుతోది. ఇద్దరూ చదువులో చురుగ్గా ఉండేవాళ్లని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తహసీల్దార్ రాజయ్య, ఎస్సై శేఖర్‌రెడ్డి, బ్లూకోల్ట్స్ సిబ్బంది రాజబాబు చిన్నారుల మృతదేహాలను బయటకు తీసేందుకు కృషి చేశారు. జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంతాపం సాత్విక్, నిత్య మృతి చెందడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్, సర్పంచ్ చిలుముల వసంత, ఎంపీటీసీ వాసాల నిరోష తదితరులు సంతాపం తెలిపారు. డేంజర్‌గా జోన్‌గా మానేరు పొత్కపల్లి వద్ద మానేరు వాగు డేంజర్‌జోన్‌గా మారింది. నెల రోజుల క్రితం ఇక్కడే ఓ చిన్నారి కూడా ఈతకోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా ఇద్దరు చనిపోయారు. పొత్కపల్లి మానేరు చుట్టు గ్రామాలైన వీణవంక, కోర్కల్, కొండపాక, మడక, కనగర్తి, మల్లారెడ్డిపల్లె, కల్లుపల్లె ప్రజలు మానేరులో ఈత కొట్టేందుకు వస్తుంటారు. మానేరులో చెక్‌డ్యాంల నిర్మాణాల కోసం ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో లోతైన గోతులు ఏర్పడ్డాయి. అవి నీటితో నిండిపోవడంతో చిన్నారులకు లోతు తెలియక మునిగిపోతున్నారు. మే 22న జీలకుంటలో జరిగిన భూలక్ష్మి ఉత్సవాలకు వచ్చిన వరంగల్ జిల్లా టేకుమట్ల మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన పింగిళి సదాశివరెడ్డి(24) ఇక్కడే మృతిచెందాడు. నెల తిరగకముందే సాత్విక్, నిత్య మానేరులో మునిగి మృతిచెందారు. ప్రమాదాలు జరగకుండా మానేరు చుట్టూ రక్షణ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. -
ఈతకు వెళ్లి నలుగురు మృత్యువాత
మానవపాడు/కర్నూలు: కృష్ణానదిలో సరదాగా ఈత కోసం వెళ్లిన వారు.. ప్రమాదవశాత్తు మునిగిపోయి మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు చివరికి నలుగురు మృతిచెందిన విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు శివారు మంగంపేటలో చోటుచేసుకుంది. కోదండాపురం ఎస్ఐ వెంకటస్వామి, స్థానికుల కథనం ప్రకారం.. ఇటిక్యాల మండలంలోని వల్లూరుకు చెందిన అన్నదమ్ములు ఇస్మాయిల్, ఇబ్రహింలు బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలు నగరంలోని వీకర్‌సెక్షన్ కాలనీకి వెళ్లి స్థిరపడ్డారు. వేసవిసెలవుల కావడంతో కుటుంబసభ్యులతో కలిసి మానవపాడు మండలంలోని బోరవెల్లిలో బంధువుల ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఈత కోసం మేనత్త కుమారుడైన ఇమాంతో కలిసి ఇస్మాయిల్ కుమారులు సమీర్(18), రియాన్(14), ఇబ్రహిం కూతుళ్లు ఆఫ్రిన్(17), నవసీన్ (13)తో పాటు మరో ఐదుగురు కలిసి ఆటోలో మంగంపేట శివారులో కృష్ణానదికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలో లోతు గమనించకుండా ముందుకు వెళ్లడంతో రియాన్ మునిగిపోగా.. ఆఫ్రిన్, నవసీన్ కాపాడటానికి వెళ్లగా.. ముగ్గురికీ ఈత రాకపోవడంతో గల్లంతయ్యారు. వెంటనే వీరిని కాపాడేందుకు వెళ్లిన సమీర్ సైతం నీటిలో మునిగిపోయాడు. నలుగురు గల్లంతవడంతో ఇమాం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సహాయంతో మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. విగతా జీవులుగా పడి ఉన్న పిల్లలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
స్వీమ్మింగ్ పూలో జలకాలాడుతున్న గేదలు
-
ఆహ...భలే జంప్ చేశారు.. Wow.. what a jump
-
అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
న్యూయార్క్: అమెరికాలో ఇండియానా రాష్ట్రంలో సరస్సులో ఈతకెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ నెల 15వ తేదీన సిద్ధాంత్ షా(19), ఆర్యన్ వైద్య(20)లు మరికొందరితో కలిసి మొన్రో సరస్సులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈదుతూనే ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు. అధికారులు ఎంతగా ప్రయత్నించినా వారి జాడ దొరకలేదు. ఈ నెల 18వ తేదీన ఇద్దరి మృతదేహాలు సరస్సులో తేలియాడుతూ కనిపించగా వెలికితీశారు. సిద్ధాంత్, ఆర్యన్లు ఇండియానా యూనివర్సిటీకి చెందిన కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులని అధికారులు వెల్లడించారు. వీరిద్దరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
5 స్వర్ణాలు సహా మొత్తం 7 పతకాలు సాధించిన నటుడు మాధవన్ తనయుడు
Khelo India Games 2023: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. అతని కుమారుడు, భారత అప్ కమింగ్ స్విమ్మర్ వేదాంత్ మాధవన్ ఖేలో ఇండియా గేమ్స్-2023లో పతకాల వర్షం కురిపించాడు. ఈ పోటీల్లో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన వేదాంత్.. 5 స్వర్ణ పతాకలు, 2 రజత పతకాలు సహా మొత్తం 7 పతకాలను కైవసం చేసుకున్నాడు. VERY grateful & humbled by the performances of @fernandes_apeksha ( 6 golds,1 silver,PB $ records)& @VedaantMadhavan (5golds &2 silver).Thank you @ansadxb & Pradeep sir for the unwavering efforts & @ChouhanShivraj & @ianuragthakur for the brilliant #KheloIndiaInMP. So proud pic.twitter.com/ZIz4XAeuwN — Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023 100, 200, 1500 మీటర్ల రేసులో స్వర్ణ పతకాలు సాధించిన వేదాంత్.. 400, 800 మీట్లర రేసులో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. వేదాంత్ కొలనులో బంగారు చేపలా రెచ్చిపోయి పతకాలు సాధించడంతో అతను ప్రాతినిధ్యం వహించిన మహారాష్ట్ర మొత్తంగా 161 పతకాలు (56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్యాలు) సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలుర విభాగంలో కూడా అత్యధిక పతకాలు సాధించిన మహారాష్ట్ర టీమ్ మరో ట్రోఫీని సాధించింది. With gods grace -Gold in 100m, 200m and 1500m and silver in 400m and 800m . 🙏🙏🙏👍👍 pic.twitter.com/DRAFqgZo9O — Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023 కొడుకు వేదాంత్ ప్రదర్శనతో ఉబ్బితబ్బిబైపోతున్న మాధవన్.. అతనికి, మహారాష్ట్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ట్వీట్లు చేశాడు. వేదాంత్, ఫెర్నాండెస్ అపేక్ష (6 గోల్డ్, 1 సిల్వర్) ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. వీరి ప్రదర్శన వెనుక తిరుగలేని కృషి చేసిన కోచ్ ప్రదీప్ సర్, చౌహాన్ శివ్‌రాజ్‌లకు ధన్యవాదాలు. ఖేలో ఇండియా గేమ్స్‌ను ఘనంగా నిర్వహించిన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ గారికి కృతజ్ఞతలు అంటూ తొలి ట్వీట్ చేశాడు. CONGRATULATIONS team Maharashtra for the 2 trophy’s .. 1 for boys team Maharashtra in swimming & 2nd THE OVERALL Championship Trophy for Maharashtra in entire khelo games. pic.twitter.com/rn28piOAxY — Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023 ఆ తర్వాత ట్వీట్లో మాధవన్ తన కుమారుడు సాధించిన పతకాల వివరాలను పొందుపరిచాడు. మరో ట్వీట్లో టీమ్ మహారాష్ట్ర, ఆ రాష్ట్ర బాయ్స్ టీమ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఇటీవల కాలంలో కొలనులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న వేదాంత్ దుబాయ్‌లో ఒలింపిక్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. వేదాంత్ కోసం మాధవన్ తన ఫ్యామిలీ మొత్తాన్ని దుబాయ్‌కు షిఫ్ట్ చేశాడు. కాగా, గతేడాది డానిష్ ఓపెన్‌లో బంగారు పతకం గెలవడం ద్వారా వేదాంత్ తొలిసారి వార్తల్లోకెక్కాడు. -
బంగారు చేప.. చరిత్రలో నిలిచిపోయిన ఆల్‌టైమ్ గ్రేట్ స్విమ్మర్
ఒకటి, రెండు, మూడు, నాలుగు.. ఆ సంఖ్య పెరిగుతూనే ఉంది.. పది దాటాయి, ఇరవై కూడా చిన్నదిగా మారిపోయింది.. చెబుతోంది అల్లాటప్పా విజయాల సంఖ్య కాదు..అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ పతకాల గురించి.. ప్రపంచ క్రీడా సంబరంలో ఒక్క పతకం సాధిస్తే జీవితం ధన్యమయినట్లుగా భావించే ఆటగాళ్లు ఎందరో! ఏకంగా 28 ఒలింపిక్స్ పతకాలు.. అందులో 23 స్వర్ణాలు అంటే అతను సాధించింది మహాద్భుతం! నీటి కొలనును.. రికార్డులను మంచినీళ్ల ప్రాయంలా మార్చుకున్న అతనే మైకేల్ ఫెల్ప్స్ .. ప్రపంచ స్విమ్మింగ్ చరిత్రలో ఆల్‌టైమ్ గ్రేట్ స్విమ్మర్!! ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఇయాన్ థోర్ప్‌ను టీనేజ్‌లో ఫెల్ప్స్ ఎంతగానో అభిమానించాడు, ఆరాధించాడు. ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో 5 స్వర్ణాలు సహా మొత్తం 9 పతకాలు థోర్ప్ సొంతం. సరిగ్గా థోర్ప్ ముగించిన చోటునుంచే ఫెల్ప్స్ కొనసాగించాడు. థోర్ప్లాంటి స్విమ్మర్ మళ్లీ రాకపోవచ్చని అనుకుంటున్న సమయంలో అమెరికా నుంచి ఫెల్ప్స్ దూసుకొచ్చాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో థోర్ప్తో పోటీ పడి పతకాలు గెలుచుకున్న అతను.. ఆ తర్వాతి మూడు ఒలింపిక్స్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ పతకాల పంట పండించాడు. ఫెల్ప్స్ ఎంత అద్భుతమైన స్విమ్మర్ అయినా ఒకే ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలు గెలవడం అసాధ్యమని థోర్ప్ పోటీలకు ముందు వ్యాఖ్యానించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో ఈ వ్యాఖ్యను తన గది లాకర్‌పై రాసుకున్న ఫెల్ప్స్.. దానిని చూస్తూ ప్రతిరోజూ స్ఫూర్తి పొందాడు. చివరకు దానిని చేసి చూపించాడు. ఏకంగా ఎనిమిది స్వర్ణాలతో సంచలనం సృష్టించాడు. వాటన్నింటిలోనూ అతను ఒలింపిక్స్ రికార్డులను నెలకొల్పి మరీ పతకాలు కొట్టాడు. తాను ఎనిమిదో స్వర్ణం గెలిచిన చివరి రేసు 4X100 మీటర్ మెడ్లీ రిలేలో ఫెల్ప్స్ రేస్ పూర్తి కాగానే స్విమ్మింగ్ పూల్ బయట అతడిని అందరికంటే ముందుగా అభినందించింది థోర్ప్ కావడం విశేషం. ‘మీరు కనే కలలు కూడా చాలా పెద్దవిగా ఉండాలి. ఎందుకంటే నా దృష్టిలో ఏదీ అసాధ్యం కాదు. నేనిప్పుడు అలాంటి కలల ప్రపంచంలో ఉన్నాను’ అని తన విజయాల అనంతరం 23 ఏళ్ల ఫెల్ప్స్ వ్యాఖ్యానించాడు. గురువు తోడుగా.. తొమ్మిదేళ్ల వయసులో ఫెల్ప్స్ తల్లిదండ్రులు విడిపోయారు. ఇది తర్వాతి రోజుల్లో తనపై, తన ఇద్దరు అక్కలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపించిందని అతను చెప్పుకున్నాడు. ఎవరూ పట్టించుకోకుండా వదిలేస్తే వచ్చే మానసిక వ్యాధి (అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్)కి కూడా ఒక దశలో ఫెల్ప్స్ గురయ్యాడు. అయితే అతడి అన్ని బాధలకు స్విమ్మింగ్‌పూల్‌లో ఉపశమనం లభించింది. సరదాగా ఈత నేర్చుకుంటే బాగుంటుందని సన్నిహితులు కొందరు చెప్పడంతో పూల్‌లోకి దిగిన అతనికి అప్పుడు తెలీదు దానితో తన జీవితమే మారిపోనుందని. తన స్వస్థలం బాల్టిమోర్‌లోని ఒక అక్వాటిక్ క్లబ్లో అతని ఈత మొదలైంది. అయితే అక్కడి కోచ్ బాబ్ బోమన్ ఈ కుర్రాడి ఈతలో అసాధారణ ప్రతిభను గుర్తించాడు. కేవలం సరదాగా ఆడుకొని వెళ్లిపోకుండా ఆ స్విమ్మింగ్ టైమింగ్‌ను నమోదు చేసి పోటీతత్వాన్ని పెంచాడు. దాంతో పదేళ్ల వయసులోనే ఫెల్ప్స్ పేరిట కొత్త జాతీయ రికార్డు నమోదైంది. అది మొదలు లెక్కలేనన్ని రికార్డులు అలవోకగా అతని వెంట వచ్చాయి. నీటి కొలనులో అలసట లేకుండా సాగిన ఆ ఈత అద్భుతాలను చూపించింది. ప్రపంచాన్ని శాసించే వరకు సాగిన ఈ మొత్తం ప్రయాణంలో అతను తన కోచ్ బోన్‌ను ఏనాడూ వీడలేదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి, ఎక్కడ కోచ్‌గా ఉంటే అక్కడికి వెళ్లి తన ఆటను కొనసాగించాడు. తనకు స్విమ్మర్‌గా అనుమతిలేని చోట కూడా కోచ్‌కు అసిస్టెంట్‌గా, స్వచ్ఛందంగా వెళ్లిపోయి ఆయనతో కలసి నడిచాడు. ఒలింపిక్ ప్రయాణం.. 15 ఏళ్ల వయసులోనే ఫెల్ప్స్ ఒలింపిక్స్ స్విమ్మింగ్ ప్రస్థానం మొదలైంది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అమెరికా స్విమ్మింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్న అతను ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ మెగా ఈవెంట్లో పతకం నెగ్గలేకపోయినా ఆ సమయంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ కుర్రాడు తర్వాతి ఒలింపిక్స్ సమయానికి మండుతున్న అగ్నికణికలా మారాడు. 2004 ఏథెన్స్‌లోనే ఆరు స్వర్ణాలతో అగ్రస్థానాన నిలిచిన అతను మరో నాలుగేళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తులో శిఖరాన నిలిచాడు. ఫేవరెట్‌గానే బరిలోకి దిగడంలో ఎలాంటి సందేహాలు లేకున్నా.. ఎనిమిది స్వర్ణాల ఘనత అందుకుంటాడా అనే సందేహాలు అందరిలో ఉండేవి. కానీ తానేంటో బీజింగ్ ఒలిపింక్స్‌లో చూపించాడు. ఆ జోరు 2012లో లండన్ ఒలింపిక్స్ మీదుగా 2016 రియో ఒలింపిక్స్ వరకు సాగింది. 2012 ఒలింపిక్స్ తర్వాత ఇక చాలు అంటూ రిటైర్మెంట్ ప్రకటించినా.. తనలో సత్తా తగ్గలేదని చూపిస్తూ మళ్లీ తిరిగొచ్చి ఒలింపిక్స్‌లో అదరగొట్టడం విశేషం. ఎట్టకేలకు రియో క్రీడల తర్వాత 31 ఏళ్ల వయసులో సగర్వంగా అతను పూల్‌కు గుడ్‌బై చెప్పాడు. రికార్డులే రికార్డులు.. మైకేల్ ఫెల్ప్స్ సాధించిన, సృష్టించిన రికార్డుల గురించి ఒక ప్రత్యేక అధ్యాయామే చెప్పవచ్చు. ఫ్రీస్టయిల్, బటర్‌ఫ్లయ్, బ్యాక్ స్ట్రోక్.. ఇలా ఈవెంట్ల పేర్లు మారవచ్చు.. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు.. పూల్‌లో దూరాల మధ్య తేడా ఉండవచ్చు. కానీ ఏ రికార్డు ఉన్నా వాటిపై ఫెల్ప్స్ పేరు మాత్రం ఘనంగా లిఖించి ఉంటుంది. ప్రపంచ స్విమింగ్ సమాఖ్య (ఫెనా) అధికారికంగా గుర్తించిన రికార్డులను చూస్తే.. ఫెల్ప్స్ ఖాతాలో ఒక దశలో 39 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. తాను రికార్డు సృష్టించడం, కొద్ది రోజులకు తానే వాటిని స్వయంగా బద్దలు కొట్టడం.. ఇదంతా ఫెల్ప్స్ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయాయి. వరల్డ్ స్విమ్మర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎనిమిదేళ్లు అతను తన ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. ఒలింపిక్స్‌లో 23 స్వర్ణాలు సహా మొత్తం 28 పతకాలు, ప్రతిష్ఠాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అంతకంటే మెరుగైన ప్రదర్శనతో 26 స్వర్ణాలు సహా మొత్తం 33 పతకాలు, పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో 16 స్వర్ణాలు సహా మొత్తం 21 పతకాలు.. ఈ జాబితాకు ఫుల్స్టాప్ లేదు. అతని ఆటలాగే అతని ఆటోబయోగ్రఫీ ‘బినీత్ ద సర్ఫేస్’ అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. చాలా మంది పాశ్చాత్య దేశపు అగ్రశ్రేణి అథ్లెట్లలో కనిపించే చిన్న చిన్న వివాదాలు (ఆల్కహాల్ డ్రైవింగ్, స్పీడింగ్)వంటివి ఫెల్ప్స్ ఖాతాలోనూ ఉన్నా.. అవేవీ అతని గొప్పతనాన్ని తగ్గించేవి కావు. -
ఈతకు వెళ్లి నలుగురు యువకులు మృతి
-
విషాదం మిగిల్చిన ఈత సరదా
ధారూరు: ఈత సరదా విషాదంగా మారింది. నలుగురు వ్యక్తులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ విషాదం నింపిన ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కోట్‌పల్లిలో చోటుచేసుకుంది. సీఐ అప్పయ్య కథనం ప్రకారం.. పూడూర్ మండలం మన్నెగూడకు చెందిన బాయికని పెంటయ్య కుమారులు లోకేశ్ (28), వెంకటేశ్(25), వీరి బాబాయి బుచ్చయ్య కొడుకు జగదీశ్(24), మేనత్త కొడుకు రాజేశ్ (24).. తమ కుటుంబ సభ్యులైన మరో 9 మందితో కలసి కోట్‌పల్లి ప్రాజెక్టుకు వచ్చారు. అక్కడి పరిసరాలను, అడవి అందాలను వీక్షించారు. అనంతరం సేదతీరేందుకు నీటి ఒడ్డుకు చేరుకున్నారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్న సమయంలో ఈత వచ్చిన లోకేశ్, జగదీశ్ నీటిలోకి దిగారు. వీరిని చూసి వెంకటేశ్, రాజేశ్ కూడా నడుములోతు వరకు వెళ్లి నీటిలో ఆడుకోవడం ప్రారంభించారు. కాగా, లోకేశ్, జగదీశ్ జలాశయంలో కొద్ది దూరంలో ఉన్న బండరాయి వద్దకు వెళ్లి వెనుదిరుగుతున్న సమయంలో ఈతరాని వెంకటేశ్, రాజేశ్‌లు వీరికి ఎదు రుగా వెళ్లేందుకు ప్రయత్నించి నీటిలో ముని గారు. వీరిని కాపాడేందుకు లోకేశ్, జగదీశ్‌లు ఒక్కొక్కరిని పట్టుకున్నారు. అయితే ఆందోళనకు గురైన వెంకటేశ్, రాజేశ్ వారిని గట్టిగా పట్టుకుని ఈత కొట్టే వీలులేకుండా చేశారు. దీంతో నలుగురూ నీటిలో మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న ఇతర కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేయడంతో కొద్ది దూరంలో ఉన్న బోటింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిలో మునిగిన వారి కోసం గాలించారు. అయితే అప్పటికే వారు మరణించడంతో మృతదేహాలను బయటకు తీశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బుచ్చయ్య కొడుకు జగదీశ్ స్వగ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నాడు. లోకేశ్ హైదరాబాద్‌లోని కూకట్పల్లి కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వెంకటేశ్, రాజేశ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. లోకేశ్, వెంకటేశ్, రాజేశ్ తమ కుటుంబాలతో హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. సంక్రాంతి పండుగ కోసం వీరంతా సొంతూరు మన్నెగూడకు వచ్చారు. (చదవండి: కి‘లేడీ’ ప్లాన్.. హోం డెలివరీ పేరిట మహిళ హనీ ట్రాప్) -
Viral Video: నదిలో ఈత కొడుతున్న పులి
-
బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్‌లో ప్రజలు
బ్రహ్మపుత్ర నది మీదుగా ఈదుకుంటూ వస్తోంది ఒక రాయల్ బెంగాల్ టెంగర్. అది గౌహతిలో పేరుగాంచిన ఉమానంద ఆలయానికి సమీపంలోని రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉంది. ఆ పులిని చూసిన ఆ ఆలయ భక్తులు, పూజారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బహుశా ఈ పులి సమీపంలోని ద్వీపకల్పం వద్ద ఉన్న ఒరంగా నేషనల్ పార్క్ నుంచి తప్పిపోయి ఉండవచ్చని భావించారు. బహుశా నీళ్లు తాగడానికి వచ్చి బహ్మపుత్ర నది ప్రవాహానికి కొట్టుకోపోయి ఉండవచ్చని అనుమానించారు అధికారులు. ఈమేరకు ఆ పులిని రక్షించేందుకు జాతీయ విపత్తు బృందం, అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఐతే ఆపులిని కాపాడటం అటవీ శాఖ రెస్క్యూ టీంకి, జాతీయ విపత్తు బృందానికి అత్యంత క్లిష్టమైన టాస్క్‌గా అనిపించింది. ఎందుకంటే ఆ పులిని కాపాడాలంటే ముందు అది ప్రశాంతంగా ఉండాలి. అదీగాక ఒకవేళ ఆ రెస్క్యూ టీం ఆపరేషన్ ఫెలయితే ఆ పులి నీటిలో మునిగిపోతుంది లేదా ఆ పులి ఆ రెస్క్యూ బృందంపై ఎటాక్ చేసే ప్రమాదము ఉంది. దీంతో రెస్య్కూ టీంకి ఆ పులిని రక్షించడం సుమారు 10 గంటలు పైనే పట్టింది. మొదటగా రెస్క్యూ టీం బోట్లతో ఆ పులి ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అది సహకరిస్తుంది అని నిర్ధారించుకున్నాక దాన్ని రక్షించి బోనులో ఉంచారు. ఈ పులిని రక్షించేంతవరకు ఆ ఆలయాన్ని మూసివేయడమే గాక సమీపంలోని దుకాణాలను సైతం మూసేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A full grown Royal Bengal tiger is found swimming in middle of Brahmaputra River in Guwahati. Tiger is now taking shelter in a rock gap in Umananda Temple in middle of the river. To my surprise, if he came swimming from Kaziranga in Assam, then he has crossed 160 km! 🐯 🐅 pic.twitter.com/OhwIkq5T9H — Inpatient Unit Khanapara (@Inpatient_Unit) December 20, 2022 (చదవండి: ఘోరంగా పెరుగుతున్న కేసులు..వైద్యం అందించలేక కుప్పకూలిన డాక్టర్) -
హైదరాబాద్‌లో విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్ గూడలోని పటేల్ కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈత కోసం వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు కుంటలోపడి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీశారు. మరణించిన చిన్నారులను షాబాజ్(15), దీపక్(12), పవన్(14)గా గుర్తించారు. -
హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో విషాదం
-
విషాదం.. చెరువులోకి మునిగి టీచర్‌తోపాటు ఐదుగురు విద్యార్థుల మృతి
సాక్షి, మేడ్చల్: ఈత సరదా ఐదుగురు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. వారిని రక్షించడానికి వెళ్లిన మదరసా టీచర్ సైతం మృత్యువాత పడ్డారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కాచిగూడ ప్రాంతానికి చెందిన హనీఫా మదరసాలో చదువుకునే దాదాపు 40 మంది విద్యార్థులు శనివారం డీసీఎం వాహనంలో వారి టీచర్ యహియా (25)తో కలసి జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో ఓ గృహప్రవేశానికి హజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో కొందరు ఫంక్షన్ జరుగుతున్న ఇంట్లోకి వెళ్లగా మరికొందరు బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థులు సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో సరదాగా ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన విద్యార్థులు ఈతరాక ఒక్కొక్కరుగా మునిగిపోయారు. వీరిని గమనించిన ఉపాధ్యాయుడు యహియా వేగంగా వచ్చి నీళ్లలోకి దిగి పిల్లలను కాపాడేప్రయత్నం చేశారు. అయితే పిల్లలు ఆయనను గట్టిగా పట్టుకోవడంతో అందరూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. వీరిలో ఒక విద్యార్థిని అక్కడే ఉన్న స్థానికుడు రక్షించి ఒడ్డుకు చేర్చాడు. ఈ లోగా టీచర్ యహియాతో పాటు ఐదుగురు విద్యార్థులు.. ఇస్మాయిల్ (11), జాఫర్ (10), సోహెల్ (09), అయాన్ (09), రియాన్(12)లు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న కుషాయిగూడ ఏసీపీ సాధన రశ్మీ పెరుమాల్, జవహర్‌నగర్ సీఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్లను రప్పించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చదవండి: నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా భయాందోళనలో తోటి విద్యార్థులు మదరసా నుంచి గృహప్రవేశానికి వచి్చన విద్యార్థులు సరదాగా గడుపుతున్న సమయంలో టీచర్‌తోపాటు ఐదుగురు స్నేహితులు జలసమాధి అయిన విషయం తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. తోటి విద్యార్థులు నీటిలో మునిగిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. ఆగ్రహించిన స్థానికులు ఎర్రగుంట చెరువులో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆ ప్రాంతంలోని చెరువుల్లో మునిగి చనిపోయారని, వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంబర్‌పేటలో విషాదఛాయలు మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో శనివారం ఈతకు వెళ్లి మృతి చెందిన ఐదుగురు విద్యార్థులు అంబర్‌పేట నియోజకవర్గం హడ్డికార్ఖానా, సుందర్‌నగర్, నెహ్రూనగర్ ప్రాంతాలతో పాటు అంబర్‌పేటకు చెందినవారు కావడంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాచిగూడ పోలీసులు హడ్డికార్ఖానా ప్రాంతంలోని మదరసా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌లు పరామర్శించారు. కాగా, గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ పిల్లల మృతదేహాలను చూసి భోరున విలపించారు. ఈ సందర్భంగా మృతదేహాలకు పోస్టుమార్టం వద్దని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు మార్చురీ అద్దాలను ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్యే, కార్పొరేటర్ నచ్చజెప్పడంతో వారు శాంతించారు. చదవడి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని.. యువకుడు మృతి -
77 ఏళ్ల వయసులో 1.5 కి.మీ. స్విమ్మింగ్
కంటోన్మెంట్: ఎమ్మెల్లార్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి 77ఏళ్ల వయసులో అరుదైన రికార్డు సాధించారు. ట్రయథ్లాన్ చాంపియన్‌గా పేరొందిన ఆయన ఇటీవల మహరాష్ట్ర లోనావాలాలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో 1.5 కిలో మీటర్ల దూరం ఈది సరికొత్త ఘనత సాధించారు. యువతకు స్ఫూర్తి కలిగించాలన్న లక్ష్యంతోనే తాను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ వెటరన్ స్పోర్ట్స్ జరిగినా హాజరవుతానని అన్నారు. ఇప్పటికీ నిరంతరం వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తూ ఉంటానని అన్నారు. యువత ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శరీరంపై పట్టు సాధిస్తే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం కలుగుతుందన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసమూ కలుగుతుందన్నారు. (చదవండి: టు లెట్.. టేక్ కేర్) -
'మెడల్స్ అక్కడే వదిలేసి రమ్మంటారా?'.. స్టార్ స్విమ్మర్‌కు అవమానం
భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. నటరాజ్‌తో పాటు అతని బృందానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది భారీ జరిమానా విధించింది. లగేజీ ఎక్కువగా ఉండమే దీనికి కారణం అని తెలిసింది. అయితే లగేజీలో ఉన్నవాటిలో ఎక్కువమొత్తంలో మెడల్స్ ఉన్నాయి. వాటి బరువు వల్లే లగేజీ బరువు పెరిగిపోయిందని శ్రీహరి నటరాజ్ బృందం పేర్కొంది. 36వ జాతీయ క్రీడలు ముగించుకొని వస్తున్న సమయంలో గుజరాత్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే విషయమై శ్రీహరి నటరాజ్ మాట్లాడుతూ.. '' గుజరాత్లో జరిగిన 36వ జాతీయ క్రీడలు ముగించుకొని మా బృందంతో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాను. కానీ ఇండిగో సిబ్బంది మాతో దురుసుగా ప్రవర్తించడమే గాక అదనపు లగేజీ కారణంగా భారీ జరిమానా విధించారు. అయితే అదనపు లగేజీగా భావిస్తున్న వాటిలో మెడల్స్, అథ్లెట్స్‌కు సంబంధించిన వస్తువులే ఉన్నాయి. నిజాయితీగా చెప్పాలంటే వారి విధించిన జరిమానా మాకు పెద్ద విషయం కాకపోవచ్చు..కానీ నాతో పాటు మా బృందాన్ని ట్రీట్ చేసిన తీరు బాగాలేదు. సిబ్బంది తీరు చూస్తుంటే ఎక్కడ మెడల్స్ గెలిచామో అదే స్థలంలో విడిచిపెట్టాలన్నట్లుగా ఉంది.'' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక జాతీయ క్రీడల్లో తొలిసారి పాల్గొన్న శ్రీహరి నటరాజ్ అదరగొట్టాడు. జాతీయ క్రీడల్లో కర్నాటక తరపున పాల్గొన్న నటరాజ్ వివిధ విభాగాలు కలిపి ఆరు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో మంచి ప్రదర్శన కనబరిచిన శ్రీహరి నటరాజ్ తృటిలో పతకం కోల్పోయినప్పటిక A-స్టాండర్డ్‌లో చోటు సంపాదించాడు. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పతకం సాధించడంలో విఫలమైనప్పటికి 100 మీ, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. Dear @IndiGo6E I was returning from the National Games held in Gujarat, and the staff not only behaved badly, but also charged us a hefty amount for excess baggage which was the medals and goodies that we athletes had won. — Srihari Nataraj OLY (@srihari3529) October 10, 2022 Honestly, the amount wasn't an issue, it's the the way they treated me and my teammates. Should we leave the medals we win back at the venue?🤔 @IndiGo6E — Srihari Nataraj OLY (@srihari3529) October 10, 2022 National Games Round Up: Srihari Nataraj finishes campaign with a flourish, claiming sixth gold with 100m Freestyle win@YASMinistry@IndiaSports @PIB_Indiahttps://t.co/bVhWkybCuu pic.twitter.com/3EhIB1yWbT — PIB in Tripura (@PIBAgartala) October 9, 2022 చదవండి: పుట్టినరోజున హార్దిక్ పాండ్యా ఎమోషనల్.. బెలూన్ వరల్డ్‌కప్.. క్రీడాకారిణి ప్రాణం మీదకు -
National Games 2022: వ్రిత్తి ఖాతాలో మరో పతకం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రిత్తి అగర్వాల్ కాంస్య పతకం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ విభాగంలో వ్రిత్తి 4 నిమిషాల 34.96 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఈ జాతీయ క్రీడల్లో వ్రిత్తికిది మూడో పతకం కావడం విశేషం. ఇప్పటి వరకు తెలంగాణ ఏడు స్వర్ణాలు, ఏడు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 18 పతకాలతో 14వ స్థానంలో ఉంది. -
ప్రాణం తీసిన ఈత సరదా.. నలుగురు చిన్నారుల మృత్యువాత
యాచారం: ఈత సరదా నలుగురు చిన్నారులను బలి తీసుకుంది. చెరువులో పెద్ద గుంత ఉన్న విషయం తెలియక ఈతకు వెళ్లిన వారిలో ఒకరు మునిగిపోతుండగా కాపాడబోయి ఒకరి తర్వాత మరొకరు వరుసగా నలుగురు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి అనుబంధ గ్రామం గొల్లగూడలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. యాచారం సీఐ లింగయ్య కథనం ప్రకారం.. గొల్లగూడకు చెందిన ఎండీ కాశీం, బీబీ జానీ దంపతుల కుమారుడు కహ్లీద్ (12), కూతురు సమ్రీన్ (14), కాశీం సోదరుడు రజాక్, హస్మ దంపతుల కుమారుడు రెహాన్ (10), వారి సమీప బంధువైన ఎస్కే హుస్సేన్, పార్‌జాన్ దంపతుల కుమారుడు ఇమ్రాన్(9) ఆదివారం మధ్యాహ్నం కొంతమంది బంధువులతో కలసి గ్రామ సమీపంలోని దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. తిరిగి గ్రామానికి వచ్చేటప్పుడు కహ్లీద్, సమ్రీన్, రెహాన్, ఇమ్రాన్ ముందుగా బయలుదేరారు. సమీపంలో ఉన్న ఎర్రకుంట వద్దకు వచ్చి సరదాగా ఈత కొట్టడానికి అందులోకి దిగారు. భారీ వర్షాలతో కుంట పూర్తిగా నిండిపోయి ఉంది. చెరువులో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈత కోసం కుంటలోకి దిగిన ఓ బాలుడు మునిగిపోతుండగా గమనించిన మిగతావారు కేకలు వేస్తూ అతడిని కాపాడబోయి ఒకరి తర్వాత ఒకరు నలుగురూ మునిగి పోయారు. అదే సమయంలో వారితో కలసి ఈత కొట్టడానికి కొంత ఆలస్యంగా వచ్చిన మరో బాలుడు అయాన్ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి గ్రామానికి వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, సమీపంలోని వ్యవసాయ బావి వద్ద పనిచేస్తున్న రైతు లక్ష్మయ్య చిన్నారుల అరుపులు విని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు వచ్చేసరికే నలుగురు చిన్నారులు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఒకేరోజు నలుగురు పిల్లల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న చిన్నారులను విగతజీవులుగా చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు. చదవండి: షాకింగ్ ఘటన.. రెండో భార్యను లాడ్జికి తీసుకెళ్లి.. -
చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
-
ప్రాణం తీసిన ఈత సరదా
పీలేరురూరల్: ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని జాండ్ల పంచాయతీ గుండాల మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం శ్రీనాథపురం కాలనీకి చెందిన షేక్ రియాజ్ కుమారుడు షేక్ సుహేల్ (18) తన స్నేహితుడు కట్టుకాలువ వీధికి చెందిన షేక్ మాలిక్ బాషా ఇద్దరూ పట్టణంలోని ఓ చికెన్ సెంటర్లో పని చేసేవారు. శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో సరదాగా ఈత కొట్టడానికి అడవిపల్లె గుండాల మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలోని వాగు వద్ద వెళ్లారు. పై నుంచి నీటిలో దూకాడు. నీటిలోపల ఉన్న రాళ్లలో ఇరుక్కుపోయాడు. ఎంతకు పైకిరాకపోవడంతో గట్టుపై ఉన్న మాలిక్ వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుహేల్ నీటిలోని రాళ్లలో ఇరుక్కుని మృతి చెంది ఉండగా గుర్తించి వెలుపలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు. -
CWG 2022: పతకాల పట్టికలో 56 దేశాలు ఆమె వెనకే..!
బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ క్రీడల్లో ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ ఓ ప్రత్యేకమైన రికార్డు నెలకొల్పింది. ఈ క్రీడల్లో 6 స్వర్ణాలు గెలిచిన ఎమ్మా.. పతకాల పట్టికలో 56 దేశాల కంటే ఎక్కువ పసిడి పతకాలు సాధించిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ఈ క్రీడల్లో మొత్తం 72 దేశాలు పాల్గొనగా.. కేవలం 13 దేశాలు మాత్రమే ఎమ్మాతో సమానంగా, అంత కంటే ఎక్కువ పసిడి పతకాలు సాధించాయి. ఎమ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా 67 స్వర్ణాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువగా.. ఇంగ్లండ్ (57), కెనడా (26), భారత్ (22), న్యూజిలాండ్ (20), స్కాట్లాండ్ (13), నైజీరియా (12), వేల్స్ (8), సౌతాఫ్రికా (7), మలేషియా (7), నార్త్రన్ ఐర్లాండ్ (7), జమైకా (6), కెన్యా (6) దేశాలు వరుసగా 2 నుంచి 13 స్థానాల్లో నిలిచాయి. ఎమ్మా (6 స్వర్ణాలు సహా 8 పతాకలు) ఈ 13 దేశాల తర్వాత 14వ స్థానంలో నిలిచింది. కాగా, ఎమ్మా గత మూడు కామన్వెల్త్ క్రీడల్లో ఏకంగా 14 స్వర్ణాలు సాధించి, ఈ క్రీడల చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 4 పసిడి పతకాలు సాధించిన ఈ బంగారు చేప.. 2024 పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా దూసుకుపోతుంది. చదవండి: CWG 2022: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు -
కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్ స్విమ్మర్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ మహిళల 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో బంగారు పతకం గెలవడం ద్వారా కామన్వెల్త్ క్రీడల చరిత్రలో అత్యంత విజయవంతమైన అథ్లెట్‌గా అవతరించింది. బర్మింగ్‌హామ్‌లో ఇప్పటికే 4 గోల్డ్ మెడల్స్ (మిక్స్డ్ 4*100 ఫ్రీస్టైల్, 4*100 ఫ్రీస్టైల్, 50 ఫ్రీస్టైల్, 50 బటర్‌ఫ్లై) సాధించిన ఎమ్మా.. గత రెండు కామన్వెల్త్ గేమ్స్‌లో 8 పతకాలు సాధించి, ఈ క్రీడల చరిత్రలో అత్యధిక గోల్డ్ మెడల్స్ సాధించిన అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. Australian swim sensation Emma McKeon won a record-extending 12th gold medal at the Commonwealth Games on Monday as cycling star Laura Kenny finished her campaign with an emotional gold. Read more: https://t.co/CotVw94x2E pic.twitter.com/snDQblFq5S — The Namibian (@TheNamibian) August 2, 2022 గతంలో ఆస్ట్రేలియాకే చెందిన ఇయాన్ థోర్ప్, సూసీ ఓ నీల్, లీసెల్ జోన్స్‌లు తలో 10 బంగారు పతకాలు సాధించారు. తాజాగా ఎమ్మా వీరి పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టి కామన్వెల్త్ ఆల్‌టైమ్ బెస్ట్ అథ్లెట్‌గా రికార్డల్లోకెక్కింది. 2014 గ్లాస్గో క్రీడల్లో అరంగేట్రం చేసిన ఎమ్మా ఇప్పటివరకు మొత్తం 17 పతకాలు సాధించింది. ఇందులో 12 స్వర్ణాలు, రజతం, 4 కాంస్యాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించిన ఎమ్మా.. 2024 పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా దూసుకుపోతుంది. చదవండి: CWG 2022: ఫ్రెంచ్ ఫ్రైస్ ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం! -
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్విమ్మర్.. తొలి పతకం దక్కేనా!
భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టాడు. పురుషుల స్విమ్మింగ్ 100 మీ బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో తొలిసారి ఫైనల్లో ప్రవేశించాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ సెమీఫైనల్ హాట్-2లో రేసును 54.55 సెకన్లలో పూర్తి చేసిన నటరాజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఏడో ప్లేయర్‌గా ఫైనల్లో అడుగుపెట్టిన నటరాజ్ పతకంపై ఆశలు పెంచాడు. ఇక ఫైనల్ రేసు ఆదివారం జరగనుంది. కాగా బెంగళూరుకు చెందిన నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ చేరిన నాలుగో భారత స్విమ్మర్‌గా నిలిచాడు. ఇంతకముందు 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో సందీప్ సెజ్వాల్, విరాద్వాల్ కాదేలు ఫైనల్ చేరగా.. 2018లో సాజన్ ప్రకాశ్ ఫైనల్లో అడుగుపెట్టినప్పటికి పతకాలు సాధించలేకపోయారు. మరి ఈసారైనా నటరాజ్ మెరిసి పతకం తెస్తాడని భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్ ప్రకాశ్ (50 మీ. బటర్‌ఫ్లయ్) హీట్స్‌లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్ (400 మీటర్ల ఫ్రీస్టయిల్) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు. చదవండి: Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
Commonwealth Games 2022: పతకాల బోణీ కొట్టేనా?
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ లాంఛనం ముగియడంతో... నేటి నుంచి క్రీడాకారులు ఇక పతకాల వేట మొదలుపెట్టనున్నారు. తొలి రోజు స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ట్రయాథ్లాన్ క్రీడాంశాల్లో మొత్తం 16 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి. ఈ నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు బరిలో ఉన్నారు. ట్రయాథ్లాన్ మినహాయిస్తే మిగతా మూడు ఈవెంట్స్‌లో భారత ఆటగాళ్లు క్వాలిఫయింగ్‌ను దాటి ముందుకెళితేనే పతకాల రేసులో ఉంటారు. ఇతర క్రీడాంశాల్లో తొలిరోజు పోటీపడనున్న భారత క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. పురుషుల బాక్సింగ్ (తొలి రౌండ్): శివ థాపా గీ సులేమాన్ (పాకిస్తాన్–63.5 కేజీలు; సాయంత్రం గం. 4:30 నుంచి) మహిళల టి20 క్రికెట్: భారత్ గీ ఆస్ట్రేలియా (మ. గం. 3:30 నుంచి). మహిళల హాకీ లీగ్ మ్యాచ్: భారత్ గీ ఘనా (సాయంత్రం గం. 6:30 నుంచి). బ్యాడ్మింటన్ (మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లీగ్ మ్యాచ్): భారత్ గీ పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 2 నుంచి) స్విమ్మింగ్ (హీట్స్; మధ్యాహ్నం గం. 3 నుంచి): సజన్ (50 మీటర్ల బటర్‌ఫ్లయ్), శ్రీహరి (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్), కుశాగ్ర (400 మీటర్ల ఫ్రీస్టయి ల్; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 11:35), ఆశిష్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్; పారా స్విమ్మింగ్). స్క్వాష్ (తొలి రౌండ్): అనాహత్ సింగ్ గీ జాడా రోస్ (సెయింట్ విన్సెంట్; రాత్రి గం. 11 నుంచి); అభయ్ సింగ్ గీ జో చాప్మన్ (బ్రిటిష్ వర్జీన్ ఐలాండ్స్; రాత్రి గం. 11:45 నుంచి). టేబుల్ టెన్నిస్ (టీమ్ లీగ్ మ్యాచ్‌లు): మహిళల విభాగం: భారత్ గీ దక్షిణాఫ్రికా (మధ్యాహ్నం గం. 2 నుంచి); భారత్ గీ ఫిజీ (రాత్రి గం. 8:30 నుంచి); పురుషుల విభాగం: భారత్ గీ బార్బడోస్ (సాయంత్రం గం. 4:30 నుంచి); భారత్ గీ సింగపూర్ (రాత్రి గం. 11 నుంచి). ట్రాక్ సైక్లింగ్: విశ్వజీత్, నమన్, వెంకప్ప, అనంత, దినేశ్ (పురుషుల టీమ్ పర్సూట్ క్వాలిఫయింగ్: మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). రోజిత్, రొనాల్డో, డేవిడ్, ఎసో (పురుషుల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). మయూరి, త్రియష, శశికళ (మహిళల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్; గం. 8:30 నుంచి). ట్రయాథ్లాన్: ఆదర్శ్, విశ్వనాథ్ యాదవ్ (పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3:30 నుంచి); ప్రజ్ఞా మోహన్, సంజన జోషి (మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3: 30 నుంచి). ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: యోగేశ్వర్, సత్యజిత్, సైఫ్ (క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 1:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 10 నుంచి). -
Knee pain: మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టండిలా..
మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వ్యాయామం చేస్తే... వారి మోకాలి కీళ్లు మరింతగా అరిగిపోయి, నొప్పులు పెరుగుతాయేమోనని చాలమంది అపోహ పడుతుంటారు. మరీ ఎక్కువ భారం పడకుండా, మరీ ఎక్కువగా శారీరక శ్రమ లేని వ్యాయామంతో మోకాళ్ల నొప్పులను అదుపులో పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈదే సమయంలో మోకాళ్లపైనే కాదు... అసలు శరీరంపై ఎలాంటి భారం పడదు. కాబట్టి ఈత అన్నింటికంటే మంచి వ్యాయామం. అంతేకాదు... మోకాళ్ళ నొప్పులతో, మరీ ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు కాస్తంత ఎక్కువగా నడిస్తే మోకాలి కీళ్లు అరిగిపోతాయనే మరో అపోహా ఉంది. ఇది నిజం కాదు. మోకాలి కీలు ప్రాంతంలో నేరుగా రక్తప్రసరణ జరగదు. అందుకే ఆ కీలు దగ్గర కదలికలు ఎంతగా ఉంటే అక్కడంత సమర్థంగా రక్తప్రసరణ ఉంటుంది. దాంతో కీళ్లకు పోషకాలు అందడమే కాక, కండరాలు, ఎముకలూ బలపడతాయి. కొంతమంది సైక్లింగ్ వల్ల మోకాళ్ల నొప్పులు మరింత పెరుగుతాయని అనుకుంటుంటారు. సైక్లింగ్‌లో దేహం బరువు మోకాళ్లపై పడదు. కాబట్టి అది కూడా మంచి వ్యాయామమే. ఇప్పుడిప్పుడే మధ్యవయసులోకి వస్తున్న/రాబోతున్నవారు మోకాళ్ల నొప్పులు రాకముందే వాకింగ్ చేయడం మేలు. అవి మోకాలికి శ్రమ కలిగించనంత మేరకే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అప్పటికే మోకాళ్లనొప్పులు మొదలై ఉంటే స్విమ్మింగ్ మంచిది. సైక్లింగ్ కూడా చేయవచ్చు. అయితే ఇలాంటి వ్యాయామాలు మొదలుపెట్టే ముందర ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి ప్రారంభించడం వల్ల వారిలో ఉన్న అపోహలు తొలగడమే కాకుండా... వారి వారి వ్యక్తిగత ఆరోగ్యపరిస్థితి ని అనుసరించి డాక్టర్లు మరికొన్ని సూచనలూ ఇస్తారు. ఇది వాళ్లకు మరింత మేలు చేస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. -
మొన్న స్విమ్మింగ్.. ఇవాళ రగ్బీ; ట్రాన్స్జెండర్లకు వరుస అవమానాలు
ప్రస్తుతం ప్రపంచంలో ట్రాన్స్జెండర్లకు దాదాపు అన్ని దేశాలు తమ పౌరులతో సమానంగా హక్కులు కల్పిస్తున్నాయి. అన్ని రంగాల్లో ట్రాన్స్జెండర్లు ముందుకు వెళ్తుంటే క్రీడల్లో మాత్రం వెనక్కి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ట్రాన్స్జెండర్లను ఆడించడం వల్ల ఆట సమతుల్యం దెబ్బతింటుందని అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఇటీవలే పేర్కొంది. లింగమార్పిడి చేసుకున్న స్విమ్మర్లు పురుషుల యుక్త వయస్సు దాటితే మహిళల ఎలైట్ రేసుల్లో పాల్గొనరాదని.. అందుకే స్విమ్మింగ్‌లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిషేధిస్తునట్లు నిర్ణయం తీసుకుంది. తాజాగా అంతర్జాతీయ రగ్బీ లీగ్(ఐఆర్ఎల్) కూడా అదే బాటలో నడిచింది. ఇక నుంచి జరగబోయే అంతర్జాతీయ మహిళల రగ్బీ మ్యాచ్‌ల్లో ట్రాన్స్‌జెండర్ ప్లేయర్లను ఆడించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్జెండర్లను రగ్బీ ఆడించేందుకు సరికొత్త పాలసీలు తీసుకు రావాల్సి ఉంది. ప్రపంచ క్రీడలో సంబంధిత పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. రగ్బీ లీగ్‌లో ట్రాన్స్జెండర్లను ఆడించే విషయంలో ఇంకా పూర్తిస్తాయిలో పరిశోధన జరగాల్సి ఉందని ఐఆర్ఎల్ అభిప్రాయపడింది. ఐఆర్ఎల్ తాజా నిర్ణయంతో అక్టోబర్ లో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న రగ్బీ లీగ్ మహిళల ప్రపంచకప్‌లో ట్రాన్స్‌జెండర్ కీడ్రాకారులు పాల్గొనే అవకాశం లేనట్లే. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, పపువా న్యూగినియా లాంటి జట్లు పోటీ పడుతున్నాయి. కాగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఈ ఏడాది ప్రారంభంలో ట్రాన్స్జెండర్లకు ఆటల్లో పాల్గొనే హక్కులకు సంబంధించిన విధానాలను రూపొందించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని క్రీడా సమాఖ్యలన్నీ ట్రాన్స్జెండర్లు క్రీడల్లో పాల్గొనేందుకు కొత్త నిబంధనలు రాసుకునే పనిలో ఉన్నాయి. ఇక ట్రాన్స్జెండర్లను రగ్బీ లీగ్ నుంచి నిషేధించడంపై క్రీడాలోకం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. కొందరేమో.. 'వారు ఆడకపోతే మంచిదని' పేర్కొనగా.. 'ట్రాన్స్జెండర్లకు ఇది అవమానమే' అని మరికొందరు తెలిపారు. ఈ విషయంలో ట్రాన్స్జెండర్లు స్పందిస్తూ.. ఇది క్రీడల ప్రాథమిక సూత్రానికి విరుద్ధమని .. సమానత్వం కోసం పాటుపడే క్రీడల్లో ఇలా వివక్ష చూపడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే వింబుల్డన్ ఆడేందుకు రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన టెన్నిస్ క్రీడాకారిణి -
ఈతకు వెళ్లి నలుగురు బాలల మృత్యువాత
అక్కచెరువుపాలెం (కొండపి, జరుగుమల్లి)/రణస్థలం: ఈత సరదా నలుగురు బాలల ప్రాణాలను బలిగొంది. ఈతకొట్టేందుకు చెరువులోకి దిగిన ఆరుగురిలో నలుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం అక్కచెరువుపాలెంలో శనివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చింతల కౌషిక్ (16), మద్దినేని సుబ్రహ్మణ్యం (16), మద్దినేని చందనశ్రీ (16), చీమకుర్తి మండలం బూసరపల్లికి చెందిన మున్నంగి శివాజీ (12), మున్నంగి చందన (14), దర్శి మండలం బసవన్నపాలెంకు చెందిన అబ్బూరి హరి భగవాన్ నారాయణ (11) శనివారం అక్కంచెరువుపాలెంలోని ఓ భవనం వద్ద ఆడుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత గ్రామానికి తూర్పున ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. ముందుగా చెరువులో కౌషిక్, సుబ్రహ్మణ్యం, శివాజీ, హరిభగవాన్ నారాయణ దిగారు. ఈతకొడుతున్నట్లుగా ముందుకు పోయారు. వారి తర్వాత చందనశ్రీ,, చందనలు సైతం చెరువులోకి దిగారు. చెరువులో ముందుకెళ్లిన బాలురు లోతులో మునుగుతూ భయంతో కేకలు వేశారు. బాలికలు సైతం మునిగిపోతూ కేకలు వేయటం ప్రారంభించారు. చెరువుకు కూతవేటు దూరంలో చేలో పని చేసుకుంటున్న ప్రసాద్ విషయం గమనించి.. పరుగున చెరువులోకి దిగి ఒడ్డుకు దగ్గరలో ఉన్న బాలికలను రక్షించి బయటకు తీశాడు. ఈతరాని ప్రసాద్ అప్పటికే అలసి కేకలు వేయడంతో గ్రామస్తులు చెరువు వద్దకు పరుగున వచ్చారు. ఈ క్రమంలో చెరువులోకి దిగి బాలురను బయటకు తీయగా అప్పటికే చింతల కౌషిక్, మున్నంగి శివాజీ మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న మద్దినేని సుబ్రహ్మణ్యం, అబ్బూరి హరి భగవాన్ నారాయణను కారులో కందుకూరు వైద్యశాలకు తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన చందనశ్రీ,, చందన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు. సముద్రంలో ముగ్గురు గల్లంతు కాగా, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్‌జీఆర్‌పురం పంచాయతీలో గల పోతయ్యపేట సముద్ర తీరంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలానికి చెందిన తిరుపతి గణేష్ శనివారం తన మేనకోడలు దీవెనను తీసుకుని అత్తవారింటికి వచ్చారు. సాయంత్రం పోతయ్యపేట సముద్ర తీరానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. అందరూ స్నానాలు చేస్తుండగా గణేష్‌తోపాటు ఆయన కుమార్తె మానస (9), మేనకోడలు దీవెన (18) ఒక్కసారిగా గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు పడవలపై వెళ్లి గాలించినా ఫలితం కనిపించలేదు. గాలింపు చర్యలను ఎస్ఐ జి.రాజేష్ పర్యవేక్షిస్తున్నారు. -
సరదాగా ఈతకు వెళ్లి కుటుంబంలో విషాదం నింపారు
సాక్షి, కర్నూల్: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సెలవు రోజుల్లో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో అక్కడ విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. కృష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు శుక్రవారం ఉదయం ఈతకు వెళ్లారు. వారు ఈత కొడుతుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తెగిపోయి నీటిలో పడటంతో నలుగురు చిన్నారులు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులు బోరునవిలపిస్తున్నారు. వారి మృతితో ఆలంకొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చదవండి: కారులో డ్రైవర్ మృతదేహం.. అసలేం జరిగిందో చెప్పిన ఎమ్మెల్సీ అనంతబాబు -
నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: వేదాంత్ షాకింగ్ కామెంట్స్
R Madhavan Son Vedaant Shocking Comments: నటుడు, హీరో ఆర్ మాధవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెలి, సఖీ వంటి ప్రేమకథ చిత్రాల్లో నటించి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు మాధవన్. ఈ క్రమంలో అతడికి సౌత్‌లో విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం సినిమాల్లో అతిథి పాత్రలు, ప్రతి కథానాయకుడిగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ తండ్రి బాటలో నడవకుండ స్పోర్ట్స్‌లో రాణిస్తోన్న సంగతి తెలిసిందే. స్విమ్మింగ్‌లో ఇప్పటికే అతడు జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. చదవండి: షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్ ఇటీవల జరిగిన డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో రెండు(గోల్డ్, సిల్వర్) పథకాలు సాధించి మెరిశాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో వేదాంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. తన తండ్రి నీడలోనే బతకాలనుకోవడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘నేను హీరో మాధవన్ కొడుకుగానే ఉండిపోవాలనుకోవడం లేదు. ఆయన నీడలోనే బతకాలి, ఎదగాలని లేదు. నాకంటూ సొంతంగా ఓ గుర్తింపు ఉండాలనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించాడు. చదవండి: హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. అలాగే ‘నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను సంరక్షిస్తూనే ఉన్నారు. నాకు కావాల్సినవన్ని సమకూరుస్తున్నారు. నా కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నా కోసమే దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యారు. 2026లో జరగబోయే ఒలింపిక్స్ కోసం నన్ను సన్నద్ధం చేస్తున్నారు. దానికోసం దుబాయ్‌లో నేను శిక్షణ తీసుకోవాల్సి ఉంది. అందుకోసం నాన్న, అమ్మ కూడా నాతో పాటు దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యారు’ అంటూ వేదాంత్ చెప్పుకొచ్చాడు. ఇక కొడుకు మాటలకు మాధవన్ మురిసిపోయాడు. వేదాంత్ సినిమా రంగంలోకి రాకపోవడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తనకు ఏది ఇష్టమో అదే చేయమన్నానని, తనకి పూర్తి స్వేచ్చా ఇవ్వడం తండ్రిగా తన బాధ్యత అని మాధవన్ పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Super Women: ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్
Swimming Under Ice: దక్షిణాఫ్రికాకు చెందిన ఓ స్విమ్మర్ సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పేందుకు ప్రాణాలనే రిస్క్‌లో పెట్టి స్టంట్ చేసింది. ఆమె ధైర్యానికి పలువురు ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, అంబర్ ఫిల్లరీ అనే మహిళ మంచు కింద 295 అడుగుల మూడు అంగుళాల దూరం ఈదుతూ రెండోసారి తన రికార్డును తానే బద్దలు కొట్టింది. కాగా, ఫిల్లరీ రెండేళ్ల క్రితం నార్వేలోని ఓప్స్జోలో 229 అడుగుల 7.9 అంగుళాల దూరం ఈది మొదటిసారి రికార్డు క్రియేట్ చేసింది. View this post on Instagram A post shared by Amber Fillary (@amber_fillary) తాజాగా కోంగ్స్బర్గ్లో డైవింగ్ సూట్ లేకుండా మంచు కింద నీటిలో ఆమె స్విమ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా.. క్రొయేషియాకు చెందిన విటోమిర్ మారిసిక్ అనే వ్యక్తి అంతకు ముందు 3 నిమిషాల 6 సెకన్లలో పూల్‌లో 351 అడుగుల 11.5 అంగుళాల దూరాన్ని ఈది గిన్నిస్ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఈ సందర్బంగా అంబర్ ఫిల్లరీ.. ఇప్పటి వరకు తనకు ఆర్థికంగా సహకరించిన , మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ రికార్డు సాధించేందుకు తనకు సహాయం చేసిన తన టీమ్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఇది కూడా చదవండి: అత్యంత ప్రత్యేకం.. ప్రళయమొచ్చినా.. లైట్ తీసుకుంటాయ్! -
యువ స్విమ్మర్ మృతి.. భౌతిక కాయం తరలించేందుకు డబ్బుల్లేని దుస్థితి
Former Swimming Champion Amartya Chakraborty Passed Away: మూడు జాతీయ అవార్డుల గ్రహీత, కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత స్విమ్మర్ అమర్త్య చక్రవర్తి (19) అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో మృతి చెందాడు. గత కొంతకాలంగా వెన్నెముక, మెదడు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అమర్త్య.. బుధవారం ఉదయం కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ కావడంతో కన్నుమూశాడు. భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించేందుకు కూడా డబ్బులు లేవని అమర్త్య తండ్రి అమితోష్ చక్రవర్తి కన్నీరుమున్నీరవడం అందరినీ కలచి వేసింది. కొడుకుని బతికించుకునేందుకు ఉన్నందంతా ఖర్చుచేయడమే కాక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయానని అమితోష్ వాపోయాడు. ఆర్ధిక సాయం కోసం కేంద్ర క్రీడా శాఖకు, భారత పారాలింపిక్ కమిటీకి ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, అమర్త్య చక్రవర్తి అనారోగ్యం కారణంగా ఐదేళ్ల కిందట పారా స్విమ్మింగ్ ఈవెంట్స్‌లో పాల్గొనే అర్హతను కోల్పోయాడు. అమర్త్య 2017 పారా నేషనల్స్‌లో ఉత్తమ స్విమ్మర్ అవార్డును గెలుచుకున్నాడు. చదవండి: బోణీ విజయం కోసం ముంబై.. రెండో విజయంపై కన్నేసిన చెన్నై -
'బంగారు' వేదాంత్.. డానిష్ ఓపెన్‌లో రెండో పతకం సాధించిన మాధవన్ కొడుకు
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్ వేదాంత్ మాధవన్ మరోసారి మెరిశాడు. నిన్న (ఏప్రిల్ 17) పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతం సాధించిన వేదాంత్.. ఇవాళ (ఏప్రిల్ 18) 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. వేదాంత్ 800 మీటర్ల లక్ష్యాన్ని 8 నిమిషాల 17:28 సెకెన్లలో పూర్తి చేశాడు. వేదాంత్ రజతం పతకం నెగ్గి రోజు తిరగకుండానే పసిడి సాధించడం విశేషం. సినీ నటుడు మాధవన్ కుమారుడైన వేదాంత్ (16) ఇటీవలి కాలంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వరుస పతాకలు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) గతేడాది జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించిన వేదాంత్.. లాత్వియా ఓపెన్‌లో కాంస్యం, తాజాగా డానిష్ ఓపెన్‌లో బంగారు, రజత పతకాలు సాధించాడు. వేదాంత్ అంతర్జాతీయ వేదికలపై వరుస పతకాలు సాధిస్తుండటంతో అతని తండ్రి మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. మరోవైపు వేదాంత్ సాధించిన విజయాల పట్ల యావత్ భారత చలనచిత్ర సీమ ఆనందం వ్యక్తం చేస్తుంది. దక్షిణాదికి చెందిన మాధవన్.. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. కాగా, డానిష్ ఓపెన్‌లో కొడుకు సాధించిన ఘనతకు సంబంధించిన వీడియోను మాధవన్ స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో కరోనా కల్లోలం.. విదేశీ ఆటగాడికి పాజిటివ్..? -
సజన్‌కు స్వర్ణం... వేదాంత్‌కు రజతం
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్లు సజన్ ప్రకాశ్, వేదాంత్ మెరిశారు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో కేరళకు చెందిన సజన్ ప్రకాశ్ స్వర్ణ పతకం సాధించగా... పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తమిళనాడుకు చెందిన వేదాంత్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. సజన్ 200 మీటర్ల లక్ష్యాన్ని ఒక నిమిషం 59.27 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. సినీ నటుడు మాధవన్ కుమారుడైన వేదాంత్ 1500 మీటర్ల లక్ష్యాన్ని 15 నిమిషాల 57.86 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ గత ఏడాది లాత్వియా ఓపెన్‌లో కాంస్యం నెగ్గగా... జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించాడు. -
‘కండలేరు’లో గల్లంతైనవారి మృతదేహాలు లభ్యం
పొదలకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) : కండలేరు జలాశయంలో మంగళవారం సాయంత్రం గల్లంతైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలను పోలీసు అధికారులు జాలర్ల సాయంతో బుధవారం వెలికితీశారు. పొదలకూరు సీఐ జి.సంగమేశ్వరరావు పర్యవేక్షణలో కండలేరు ఎస్ఐ అనూషా ఈతగాళ్లను రప్పించి మృతదేహాలను వెలికి తీయించారు. తమిళనాడుకు చెందిన పొన్నుకుమార్, బోసు కుటుంబాలకు చెందిన మొత్తం 8 మంది శ్రీరామనవమి పూర్తయిన సందర్భంగా కండలేరును తిలకించి స్నానాలు చేసేందుకు జలాశయం వద్దకు వెళ్లారు. అయితే జలాశయం లోతు, వివరాలు తెలియని వారు రివిట్మెంట్కు పట్టిన పాచి వల్ల జారిపోయి.. లోతుగా ఉన్న జలాశయంలో పడిపోయారు. బోసును అతడి భార్య చీర కొంగు అందించి ప్రాణాలు కాపాడింది. పొన్నుకుమార్(36), అతడి కుమార్తె పవిత్ర (7), బోసు కుమార్తె లక్ష్మి(11) గల్లంతయ్యారు. తమిళులైన వీరు చేజర్ల మండలం కొనపనాయుడుపల్లికి వలస వచ్చి చుట్టుపక్కల గ్రామాలకు తినుబండారాలను ద్విచక్రవాహనంపై వెళ్లి వేస్తుంటారు. కండలేరులో స్నానాలు నిషేధం : డీఎస్పీ కండలేరు జలాశయంలో స్నానఘట్టాలు లేవని, స్నానాలు, ఈత నిషేధమని ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. డీఎస్పీ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
స్విమ్ చేస్తే చర్మం పాడైపోతుందా? ఈ చిట్కాలు పాటిస్తే సరి!
Swim Safety And Skin Care Tips In Summer: వేసవి కాలంలో స్విమ్మింగ్ చేయడానికి చాలామంది ఇష్టపడ్డప్పటికీ, మరోవైపు చర్మం పాడైపోతుందని బాధపడతుంటారు. ఎటువంటి ఆందోళన చెందకుండా స్విమ్మింగ్ ఎలా చేయవచ్చో చూద్దాం.. ►ఉదయం పది గంటల లోపు లేదా సాయంత్రం నాలుగు గంటల తరువాత స్విమ్మింగ్ చేయాలి. ►పూల్‌లో దిగడానికి కనీసం ఇరవై నిమిషాల ముందు వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ►కళ్లను చక్కగా కవర్ చేసి, భద్రంగా కాపాడే కళ్లజోడుని తప్పనిసరిగా ధరించాలి. ►ఎటువంటి రంధ్రాలు లేని క్యాప్‌ను తలకు పెట్టుకోవాలి. ►దీనివల్ల నీటిలో ఉన్న రసాయనాలు, క్లోరిన్ వంటివి జుట్టుకు హాని చేయవు. ►స్విమ్మింగ్ అయిన వెంటనే తప్పనిసరిగా స్నానం చేయాలి. ►తరువాత తడిలేకుండా ఒంటిని తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ►డైమెథికోన్, గ్లిజరిన్, ఆయిల్ లేదా పెట్రోలేటియం ఉన్న మాయిశ్చరైజర్ వాడితే మరింత మంచిది. ►స్విమ్మింగ్‌కు వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తరువాత రెండుసార్లు మాయిశ్చరైజర్ రాసుకుంటే మరింత మంచిది. చదవండి: Health Tips: కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే! -
‘ఈత’రాన్ని మింగేసిన చెరువు
ధర్మపురి: ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి మృతి చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్తులు, పోలీసులు అందించిన వివరాలివి.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన మారంపెల్లి శరత్ (12), నవదీప్ (12)తో పాటు నల్గొండ జిల్లా దోసారం గ్రామానికి చెందిన గొలుసుల యశ్వంత్ (13) ఆదివారం ఉదయం పాఠశాల పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్లారు. గతేడాది మిషన్ కాకతీయ కింద చెరువులో మట్టి తీయడంతో నీటి లోతు తెలియలేదు. దీంతో చెరువులోకి దిగిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. కొంత సమయం తర్వాత గ్రామస్తులకు చెరువు పక్కన చెప్పులు కనిపించడంతో ఆందోళనతో కేకలు వేశారు. సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు.. గ్రామస్తుల కేకలు విని మూడు మృతదేహాలను బయటికి తీశారు. శరత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి, యశ్వంత్ ఎంపీపీఎస్ పాఠశాలలో 4వ, తరగతి, నవదీప్ ధర్మపురిలోని కేరళ ఇంగ్లిష్ మీడియంలో 4వ తరగతి చదువుతున్నారు. బతుకుతెరువు కోసం నవదీప్ తండ్రి కిషన్ రెండేళ్ల క్రితం, శరత్ తండ్రి సత్తయ్య 10 నెలల క్రితం దుబాయ్ వెళ్లారు. యశ్వంత్ తల్లిదండ్రులు వారం క్రితం స్వగ్రామం నల్గొండ జిల్లాకు వెళ్లారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు చెరువు వద్దకు తరలివచ్చి కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి, మెదక్(ధారూరు/బంట్వారం): ఈత సరదా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణం తీసింది. ఈ ఘటన కోట్‌పల్లి ప్రాజెక్టులో శనివారం జరిగింది. ధారూరు సీఐ తిరుపతిరాజు తెలిపిన మేరకు.. మేడ్చల్ జిల్లా రాంపల్లి ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఏడుగురు యువకులు శనివారం సరదాగా గడిపేందుకు ముందుగా అనంతగిరిగుట్టకు వచ్చారు. సాయంత్రం సమయంలో కోట్‌పల్లి ప్రాజెక్ట్‌కు వచ్చారు. ప్రాజెక్టు కట్ట వెనుక ఉన్న నీటిలో అందరూ కలిసి ఈత కొట్టడానికి దిగారు. వీరిలో సాయికుమార్‌రెడ్డి (28) ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు వెంటనే అతడిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు సాయికమార్‌రెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ తిరుపతిరాజు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. కేసును కోట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: పేదోడి ఫ్రిడ్జ్‌కు భలే గిరాకీ!) -
శభాష్.. శ్యామల! సముద్రంపై సాహ'షి'
కలలో కూడా అలలపై ఈదాలనే ఆలోచనే రాలేదు. సప్త సముద్రాలు పేర్లు విన్నప్పుడూ.. వాటిపై తన పేరున రికార్డులు సృష్టిస్తానని అనుకోలేదు. కానీ.. సరదాగా స్విమ్మింగ్ నేర్చుకున్న ఆమె ప్రపంచంలోని సముద్రాలను సైతం అలవోకగా ఈదేస్తున్నారు. అది కూడా 47 ఏళ్ల వయసులో. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలకు ఎదురొడ్డుతూ.. కారు చీకట్లలో సైతం నడి సంద్రాన్ని వెనక్కి నెట్టేస్తూ అంతర్జాతీయ స్విమ్మర్లను సైతం అబ్బుర పరుస్తున్నారు స్విమ్మర్ గోలి శ్యామల. సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సామర్లకోట గోలి శ్యామల స్వస్థలం. తండ్రి సాధారణ రైతు. చిన్నప్పటి నుంచి శ్యామలను చదువు వైపే ప్రోత్సహించారు. ఎంఏ సోషియాలజీ చేసిన ఆమె వివాహానంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కళలపై ఆసక్తితో యానిమేషన్ నేర్చుకుని.. ఒక సంస్థను కూడా స్థాపించారు. ఆశించినంత లాభాలు రాకపోవడంతో ఆ సంస్థను మూసేయాల్సి వచ్చింది. ఫలితంగా డిప్రెషన్లోకి వెళ్లిన శ్యామల దానినుంచి బయటపడేందుకు సరదాగా స్విమ్మింగ్ నేర్చుకున్నారు. తన స్విమ్మింగ్ శిక్షణ వృథా కాకూడదనే ఆలోచన ఆమెను శ్రీలంక–భారత్ మధ్య గల పాక్ జలసంధిని అధిగమించేలా చేసింది. గతేడాది మార్చిలో 30 కిలోమీటర్ల పొడవైన పాక్ జలసంధిని 13.47 గంటల్లో పూర్తి చేసిన ప్రపంచంలోనే రెండవ, తొలి తెలుగు మహిళగా రికార్డు నెలకొల్పారు. అంతకు ముందు భారత దేశానికి చెందిన ప్రముఖ స్విమ్మర్ అర్జున, పద్మశ్రీ అవార్డు గ్రహీత బులా చౌదురి 2004లో 35 ఏళ్ల వయసులో 14 గంటల్లో ఈ లక్ష్యాన్ని పూర్తి చేశారు. కఠినమైన ‘కాటాలినా’లోనూ విజయం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సెవన్ ఓపెన్ ఓషన్ వాటర్ స్విమ్లలో (సప్త సముద్రాల్లో ఈత అని కూడా అంటారు) ఒకటిగా పిలిచే కాటాలినా చానల్‌ను గత ఏడాది సెప్టెంబర్ 29న తొలి ప్రయత్నంలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు శ్యామల. కాలిఫోర్నియాలోని శాంటా కాటాలినా ద్వీపం నుంచి లాస్ ఏంజెల్స్ మధ్య విస్తరించి ఉన్న 36 కిలోమీటర్ల పొడవైన చానల్‌ను ఈదడం ఆషామాషీ కాదు. 15 డిగ్రీల చల్లని నీరు.. ఎముకలు కొరికే చలి.. సముద్రంలోకి దిగితే రక్తం గడ్డకట్టే వాతావరణం అక్కడ ఉంటాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఈదడం అంటే శీతల ప్రాంతాల నుంచి వచ్చిన సాహసికులు సైతం ఐదారు సార్లు ప్రయత్నించక తప్పదు. అలాంటిది ఉష్ణ మండల ప్రాంతం నుంచి వెళ్లిన శ్యామల అక్కడి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి 19.47 గంటల్లో కాటాలినా లక్ష్యాన్ని పూర్తి చేసి ఆశ్చర్యపరిచారు. కాటాలినాను అధిగమించిన 10 మంది భారతీయుల్లో ముగ్గురు మహిళలు ఉంటే అందులో తెలుగు గడ్డ నుంచి శ్యామల స్థానం సంపాదించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ‘కైవీ’ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కైవీ చానల్లో సాహసం చేసిన తొలి ఆసియా మహిళగా శ్యామల రికార్డు నెలకొల్పారు. అమెరికాలోని హవాయి దీవుల్లో 48 కిలోమీటర్ల పొడవైన ‘కైవీ చానల్‌ను ఈదడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్యామల ప్రయత్నించి విఫలమయ్యారు. కేవలం లక్ష్యానికి 4.5 కి.వీ. దూరంలో ఒక్కసారిగా సముద్రంలో చోటుచేసుకున్న మార్పులు.. ఆరు కిలోమీటర్ల వేగంతో వెనక్కి నెడుతున్న అలల మధ్య నాలుగు గంటలు శ్రమించినా మూడు కిలోమీటర్లు కూడా ముందుకు కదలలేని పరిస్థితుల్లో ప్రయత్నాన్ని అర్ధంతరంగా ముగించుకున్నారు. అయితే కైవీ సాహస యాత్రలో నిర్విరామంగా 22 గంటలపాటు 43.5 కిలోమీటర్ల సముద్రాన్ని ఈది ప్రశంసలు అందుకున్నారు. ‘ఇంగ్లిష్ చానల్’ దిశగా.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంగ్లిష్ చానల్ (ఉత్తర ప్రాన్స్–దక్షిణ ఇంగ్లండ్ మధ్య అట్లాంటిక్ సముద్రం)ను ఈదే లక్ష్యంతో శ్యామల కఠోర సాధన చేస్తున్నారు. జూన్‌లో చేసే ఈ సాహస యాత్రకు శ్యామల రోజుకు 8 గంటలు సాధనలో 6గంటలకు పైగానే స్విమ్మింగ్ పూల్‌లో ఉంటున్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా నేను సముద్రాన్ని ఈదుతా అన్నప్పుడు అన్నిచోట్లా హేళనకు గురయ్యాను. చాలామంది నీ వయసేంటి అన్నారు. కుటుంబ సభ్యులైతే స్విమ్మింగ్ దుస్తుల విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, నేను ఆత్మ విశ్వాసంతోనే ముందుకు వెళ్లాను. నా దృష్టిలో వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే. నేను కైవీని అధిగమిస్తున్నప్పుడు అతిపెద్ద వేల్ చేప నన్ను తాకుతూపోతుంటే గుండె ఝల్లుమంది. చాలాచోట్ల షార్క్ పిల్లలు వెంటపడేవి. ఒక్కోసారి భయం వేసేది. ఆర్థిక ఇబ్బందుల్లో ఈదుతున్న నాకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను. – గోలి శ్యామల, అంతర్జాతీయ ఓపెన్ వాటర్ స్విమ్మర్ -
తెలంగాణ: ఒక్కరోజే ఆరుగురి మృతి.. దాంతో ఆటలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘ఊరోడికి కాటి భయం... పొరుగోడికి నీటి భయం...’ నీరు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ నానుడి చాలు. సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఉదంతాల్లో ఏకంగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. వేసవి తాపానికి తోడు ఇతర పరిణామాల నేపథ్యంలో ఆహ్లాదం కోసం అనేక మంది ‘నీటి’ని ఆశ్రయిస్తున్నారు. ఆయా చెరువులు, కుంటలు, కాలువలు తదితరాలపై అవగాహన లేకపోవడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు... ఇలా వివిధ కారణాలతో అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇలా అశువులు బాస్తున్న వారిలో చిన్నారులు, యువతే ఎక్కువగా ఉంటున్నారు. కనిపించని అగాథాలు ఎన్నో... సాధారణంగా చెరువులు, కుంటలు ఓ దశలో ఎండిపోతుంటాయి. ఆ సమీపంలో నివసించే ప్రజలు ఆయా సమయాల్లో వాటిలోని మట్టిని తవ్వి చిన్న చిన్న అవసరాలకు వాడుతుంటారు. ఈ రకంగా ఆయా ప్రాంతాల్లో గోతులు ఏర్పడుతుంటాయి. ఎండిన సమయంలో ఈ గుంతలు కనిపించినా.. నీరు చేరినప్పుడు అవీ నిండిపోతున్నాయి. ఫలితంగా ఎక్కడ గొయ్య ఉందో, ఎక్కడ ఎత్తు ఉందో ఆ ప్రాంతంతో పరిచయం లేని వాళ్లు ఈ విషయాలు గుర్తించడం అసాధ్యం. ఈత రాని వారు నీళ్లల్లో దిగినప్పుడు మొల్లగా నడుచుకుంటూ మెడ లోతు వరకు వెళ్లి స్నానాలు చేస్తుంటారు. ఇలా నడుస్తున్న క్రమంలో హఠాత్తుగా నీటి లోపల ఉన్న గుంటలోకి వెళ్తే... తేరుకునే లోపే మునిగిపోతున్నారు. వచ్చీరాని ఈతతో ముప్పే... ఏ మాత్రం ఈతరాని వారి పరిస్థితి ఇలా ఉంటే... వచ్చీరాని ఈతతో చెరువులు, కుంటలు తదితరాల్లోకి దిగేవాళ్లూ మృత్యువాత పడుతున్నారు. ఈతపై పూర్తి పట్టులేకపోవడంతో కొంతసేపు జోష్‌తో చెరువులో కొంత దూరం వెళ్తున్నారు. ఆపై అలసిపోవడంతో వెనక్కు రాలేక నీట మునిగిపోతున్నారు. మరోపక్క తమ బృందంలో ఒకరు మునిగిపోతున్నట్లు గుర్తించిన ఇతరులు వారిని రక్షించడానికి సిద్ధమవుతున్నారు. ఇలా రక్షించే సమయాల్లో సమయస్ఫూర్తి, నైపుణ్యం లేక వీరు కూడా మునిగిపోయి చనిపోతున్నారు. ఈ జాగ్రత్తలు అవసరం... ►కొత్త ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో దిగేప్పుడు వాటి వివరాలు స్థానికుల్ని అడిగి తెలుసుకోవాలి. ►స్నానం/ఈత కోసం అంతా ఒకేసారి చెరువుల్లో దిగకూడదు. అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి కొందరైనా గట్టుపై ఉండాలి. ►ఈత రాని, దానిపై పట్టు లేని వాళ్లు నీటిలో దిగేప్పుడు ట్యూబు, గాలితో నింపిన ప్లాస్టిక్ సంచులు... కనీసం ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలను తమ వెంట ఉంచుకోవాలి. ►గట్టుపై ఉండే వాళ్లు తాడు, కర్రలు వంటిని సిద్ధంగా ఉంచుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపకరిస్తాయి. ►నీటిలో మునిగిపోతున్న వారిని అనాలోచితంగా, ఎలాంటి ఉపకరణాలు లేకుండా రక్షించడానికి ప్రయత్నించడమూ ప్రమాదహేతువే. ►నీళ్లల్లో మునిగిపోతున్న వారిని రక్షించేప్పుడు ముందుగా వారి వద్దకు వెళ్లిన వెంటనే కంగారు పడద్దని, రక్షించే వ్యక్తి కాళ్లు, చేతులు పట్టుకోవద్దని ధైర్యం చెప్పాలి. ►నీటిలో మునిగిపోతున్న వారిని వెనుక నుంచి పట్టుకుని రక్షించే ప్రయత్నం చేయాలి. తాడుతో పాటు ఈతకు ఉపకరించే ఉపకరణాలు అందించడం ఉత్తమం. ►ఇటీవల కాలంలో యువతకు సెల్ఫీ మోజు పెరిగింది. ఎక్కడపడితే అక్కడ ఈ ఫొటోలు దిగుతున్నాయి. అయితే చెరువులు వంటి వాటి వద్ద వీటికి దూరంగా ఉండటం ఉత్తమం. -
ప్రాణం తీసిన ఈత సరదా
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వలో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు పిల్లలతో పాటు ఓ వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకెళ్లారు. ఇందులో ఓ బాలుడు మృతి చెందగా, ముగ్గురిని స్థానిక రైతులు కాపాడారు. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని నందిమళ్లలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిమళ్లకు చెందిన మహమూద్ తన కొడుకు మౌలాలి, అదే గ్రామానికి చెందిన సలావుద్దీన్, ఆరిఫ్ (10) అనే పిల్లలను వెంట పెట్టుకుని జూరాల ఎడ మ కాల్వలో స్నానం చేయడానికి వెళ్లాడు. అందరూ కలసి ఈత కొడుతుండగా ఒక్క సారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ప్రవాహ వేగానికి మౌలాలి, సలావుద్దీన్, ఆరిఫ్ కొట్టుకుపోతుండడంతో.. మహమూద్ వెంటనే తన కొడుకు మౌలాలి, సలావుద్దీన్‌లను కాల్వ ఒడ్డువైపు నెట్టేశాడు. అదే సమయంలో మహమూద్ సైతం నీటి ప్రవాహం లో కొట్టుకుని పోతుండగా, చిన్నారుల కేకలకు అక్కడే ఉన్న కురుమూర్తి, లంకాల మల్లేశ్‌లు కాల్వలో దూకి మహమూద్‌ను, ఇద్దరు పిల్లలను కాపాడారు. అప్పటికే నీటి ప్రవాహానికి ఆరిఫ్ కొట్టుకుపోయాడు. 3 గంటల పాటు గాలింపు.. ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆరీఫ్ కోసం నందిమళ్లకు చెందిన జాలర్లు, యువకులు కాల్వలో గాలింపు చేపట్టారు. దాదాపు 3 గంటల పాటు వెతికి నీటిలో విగతజీవిగా పడి ఉన్న ఆరిఫ్ (10) మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. నీటిలో గల్లంతైన తమ కొడుకు ఆరి ఫ్ మృతి చెందాడనే వార్త వినగానే అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వారి రోద న పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మహేశ్‌గౌడ్ తెలిపారు. -
బరువు పెరుగుతున్నా.. మానసిక చికాకులను ఆపడానికైనా అదే సరైన ఔషదం
బరువు పెరుగుతున్నట్టు అనిపించినా, మానసిక చికాకులను ఆపడానికైనా వ్యాయామం సరైన ఔషధంగా పనిచేస్తుంది. అందులోనూ కరోనా మహమ్మారి కాలంలో శరీరానికి తగినంత శక్తిని అందించడానికి కూడా వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుందని తెలిసిందే. ఇక నేడు, రోజూ 8–9 గంటల పాటు ఉద్యోగం చేసేవారు తమ జీవన శైలిలో విపరీతమైన మార్పులను చవిచూస్తున్నారు. వీటన్నింటికీ సరైన సమాధానం శారీరక శ్రమను కలిగించే వ్యాయామం. వర్క్‌ఫ్రమ్ హోమ్ అయ్యాక బెడ్రూమ్, లివింగ్ రూమ్‌లలో పనిచేసే కొత్త సంస్కృతి వచ్చి చేరింది. ఈ గదులు సౌకర్యంగా అనిపించినా, వారి ఆరోగ్యంపై కనిపించని ప్రభావం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. చురుకుదనానికి.. నిద్రలో ఉన్నప్పుడు కూడా బరువు తగ్గడంలో సహాయపడే రోజువారీ అలవాటుగా వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. శరీరం తన శారీరక కదలికలను తగ్గించుకున్నప్పుడు రకరకాల సమస్యలు, వ్యాధులు ఎలాంటి హెచ్చరిక లేకుండా వచ్చి చేరిపోతాయి. అప్పుడు శరీరానికి పని లేకుండా గంటలతరబడి కూర్చోవడం వల్ల ఆరోగ్యం ఎలా పాడైందో గ్రహిస్తారు. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత మహిళలు శారీరక శ్రమ తగ్గితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం వల్ల గుండె సమస్యలు, మధుమేహం, కీళ్లనొప్పులు.. మొదలైన ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. నడకతో బలం కండరాలను బలపరచడంలోనూ, నిద్రను మెరుగుపరచడంలోనూ ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది నడక. అంతేకాదు ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అలై్జమర్స్ ప్రమాదాన్ని నివారిస్తుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలపై జరిగిన ఒక అధ్యయనంలో ప్రతిరోజూ 30 నిమిషాల నడక వారి తుంటి పగుళ్ల ప్రమాదాన్ని 40 శాతం తగ్గించిందని గుర్తించారు. హార్వర్డ్ హెల్త్ రీసెర్చ్ ప్రకారం 70 కిలోలు ఉన్న వ్యక్తి 30 నిమిషాల పాటు (గంటకు ఆరున్నర కిలోమీటర్ల వేగంతో) నడిస్తే 167 కేలరీలు ఖర్చు చేస్తారని అంచనా వేశారు. హానికారకాలకు దూరం 30 నిమిషాల పాటు నడవడం సౌకర్యంగా ఉంటే నడకను సాధారణ జాగింగ్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు. నడక కంటే జాగింగ్ ఇంకాస్త ప్రభావవంతంగా ఉంటుంది. ఇది హానికరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. వాకింగ్లాగానే జాగింగ్ చేయడానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ప్రారంభించడానికి ఒక జత బూట్లు ఉంటే చాలు. బరువును తగ్గించే సైక్లింగ్ సైక్లింగ్ చేయడం వచ్చినా మూడు పదుల వయసు దాటిన తర్వాత దానిని దాదాపుగా మూలన పడేస్తారు మహిళలు. కానీ, 30 ఏళ్ల తర్వాతనే సైక్లింగ్ వలన శరీరానికి మరిన్ని ప్రయోజనాలు అందుతాయి. హార్వర్డ్ హెల్త్ ఉదహరించిన ఒక పరిశోధనా ప్రకారం శారీరక శ్రమ, బరువులో మార్పులను అధ్యయనం చేయడానికి పరిశోధకులు 16 సంవత్సరాల పాటు 18,000 మందికి పైగా మహిళలను గమనించారు. వీరి అధ్యయనంలో వ్యాయామం చేయని మహిళలు సగటున 20 పౌండ్ల బరువు పెరిగారు. అదే రోజూ 30 నిమిషాలు సైక్లింగ్ చేసిన వారు 20 పౌండ్ల బరువు తగ్గారు. దీనివల్ల సైక్లింగ్ మిగతా వాటికన్నా అదనపు ప్రయోజనాలు ఇస్తుందని నిరూపించారు. మెరుగైన ఆనందానికి.. ఈత అనేది వినోదంతో పాటు ఆరోగ్యకరమైన చర్య. ఈత హృదయ స్పందన రేటును పెంచుతుంది. కండరాలను టోన్ చేస్తుంది. శరీరానికి మొత్తం వ్యాయామం అందిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి, ఇతర రకాల శారీరక శ్రమలు నొప్పిని తీవ్రతరం చేస్తాయి కానీ, ఈత మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది. ఆర్థ్రరైటిస్ ఉన్న వ్యక్తులకు కూడా ఈత ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. నీటి ఆధారిత వ్యాయామాల వల్ల కీళ్ల పనితనం మెరుగుపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం.. ఇది శారీరక శ్రమకు రూపం మాత్రమే కాదు. మానసిక ఒత్తిడిని నివారిస్తుంది. బరువును తగ్గించడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. యోగాలోని ధ్యానం అలై్జమర్స్ రాకుండా నిరోధించడమే కాదు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇతరులతో పోల్చితే యోగా చేసే వ్యక్తులు 43 శాతం తక్కువ వైద్య సేవలను ఉపయోగించుకుంటారని అధ్యయనాలు చూపుతున్నాయి. -
పూల్‌లోకి దూకి మెడ విరగ్గొట్టుకున్న నటి
ఆస్ట్రేలియన్ నటి, సింగర్, మోడల్ అలీ సింప్సన్ చావు చివరి అంచుల దాకా వెళ్లొచ్చింది. స్విమ్మింగ్ చేయబోయి మెడ విరగ్గొట్టుకున్న ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. 'ద మాస్క్డ్ సింగర్', 'ఐయామ్ ఏ సెలబ్రిటీ.. గెట్ మీ అవుట్ ఆఫ్ ఇయర్(2021)' సిరీస్‌లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న అలీ సింప్సన్ తాను ఆస్పత్రిపాలైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'కొన్నిసార్లు కళ్లు మూసి తెరిచేలోపు ఊహించనివి జరుగుతుంటాయి. నేనేతై నూతన సంవత్సరాన్ని విరిగిన మెడతో, కరోనా పాజిటివ్‌తో ప్రారంభించాను. స్విమ్మింగ్ పూల్‌లోకి దూకగానే నా తల కింద నేలకు గట్టిగా తగిలింది. నన్ను వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్‌రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అన్నీ చేస్తే నా మెడకు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అత్యవసర సర్జరీ ఏమీ చేయనవసరం లేదన్నారు. మెడకు పట్టీ వేసి ఇంటికి పంపించారు. నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. ఇంకా నయం.. నా వెన్నుపూసకు ఏమీ అవలేదు. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని బతికి బట్టగట్టినందుకు అదృష్టంగా ఫీలవుతున్నాను. నన్ను ఎంతో బాగా చూసుకోవడమే కాక భోజనం ఏర్పాటు చేస్తూ బహుమతులు పంపుతున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. నాకు వైద్యం చేస్తున్న ఆస్పత్రి సిబ్బందికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నాలా కాకుండా మీరందరూ గొప్పగా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. లోతు తెలియకుండా దేనిలోనూ దూకకండి' అని సూచించింది అలీ. View this post on Instagram A post shared by Alli Simpson (@allisimpson) -
సిద్ధూ.. ఒక్కసారి చూడు బాబూ..
వెంకటాచలం(నెల్లూరు జిల్లా): పెద్ద చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న కన్న కొడుకు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు ఆదూరు శీనయ్య – అపర్ణ తల్లడిల్లిపోయారు. కందలపాడు సమీపంలో సాగునీటి కాలువలో ఈతకు వెళ్లి మృతిచెందిన మండలంలోని కనుపూరుకు చెందిన బీటెక్ విద్యార్థి ఆదూరు సిద్ధూ, తిరుపతికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పర్నా అనుదీప్ మృతదేహాలకు శుక్రవారం ఉదయం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. దీంతో అనుదీప్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు తిరుపతికి తీసుకెళ్లగా సిద్ధూ మృతదేహాన్ని బంధువులు శుక్రవారం 12 గంటలకు కనుపూరుకు తీసుకువచ్చారు. చదవండి: రహస్యంగా భర్త రెండో పెళ్లి.. మళ్లీవచ్చి తీసుకెళ్తానని చెప్పి.. గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు కనుపూరు గ్రామానికి చెందిన ఆదూరు శీనయ్య – అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సిద్ధూ బీటెక్ చదువుతుండగా, రెండో కుమారుడు హర్ష నెల్లూరు నగరంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. వ్యవసాయ కుటుంబమైనప్పటికీ తమ ఇద్దరు కొడుకులను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా చూడాలని తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ విధి వికటించి పెద్ద కుమారుడు సిద్ధూ మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. సిద్ధూ మృతదేహం ఇంటికి చేరుకోగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల దుఃఖానికి అంతేలేదు. సిద్ధూ ఒక్కసారి నన్ను చూడు బాబూ.. అంటూ ఆ తల్లి పడిన ఆవేదన చూసిన వారిని కంటతడి పెట్టించింది. ఎమ్మెల్యే కాకాణి పరామర్శ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఆదూరు సిద్ధూ మృతిచెందాడని తెలియడంతో వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం కనుపూరుకు వెళ్లి సిద్ధూ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. -
చెరువులో ఈతకొడుతూ.. టీఆర్ఎస్ నాయకుడి కన్నుమూత
సాక్షి,ఇల్లెందు (ఖమ్మం): పట్టణంలోని కాకతీయ నగర్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు గండమళ్ల వెంకటేశ్వర్లు(55) చెరువులో ఈత కొడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం మండలంలోని లలితాపురం చెరువుకు ఈతకు వెళ్లాడు. చెరువులో ఈత కొడుతున్న క్రమంలో అకస్మాత్తుగా నీట మునిగిపోయాడు. గమనించి సహచరులు ఒడ్డుకు చేర్చారు. చికిత్స నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుదీర్ఘ కాలం ఏఐటీయూసీలో పనిచేసిన ఆయన కార్మిక నాయకుడిగా పట్టణ ప్రజలకు పరిచితుడు. అనంతరం టీఆర్ఎస్లో చేరాడు. మృతదేహాన్ని జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్‌నాయక్, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు సందర్శించారు. చదవండి: యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే.. -
కర్నూలులో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో విషాదం అలుముకుంది. అల్లూరు పెద్ద కుంటలో ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. ముగ్గురు మృతులు విశాల్,శరత్,మహేష్‌గా గుర్తించారు. విద్యార్థుల మృతదేహాలను గ్రామస్తులు కుంటలో నుంచి బయటకు తీశారు. విద్యార్థుల మృతదేహాలకు ఎమ్మెల్యే ఆర్థర్ నివాళులు అర్పించారు. చదవండి: తిరుపతి కేంద్రంగా ‘జియో నెక్ట్స్’.. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ.. -
హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అరుదైన రికార్డు, ఎంపీ ప్రశంస
హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ అవార్డులను గెలిచి అరుదైన ఘనత సాధించాడు. తన కృషితో కుటుంబంతో పాటు దేశం పేరును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాడు వేదాంత్. ఇటీవల ముగిసిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్స్ 2021లో మొత్తం ఏడు పతకాలను గెలుచుకున్నాడు. అతి చిన్న వయసులోనే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశంసిస్తూ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ ఓ ట్వీట్ చేశారు. చదవండి: యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు.. మాధవన్, వేదాంత్‌లు కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ ‘గుడ్ జాబ్ వేదాంత్. నువ్వు దేశం గర్వించేలా చేశావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. అలాగే నీ పెంపకం చూసి కూడా’ అంటూ ఈ సందర్భంగ తండ్రి మాధవన్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. కాగా బెంగళూరు వేదికగా బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో జరిగిన ఈ పోటీలో వేదాంత్ నాలుగు రజత పతకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఈ పోటీలో వేదాంత్ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 4×100 ఫ్రీస్టైల్ రిలే, 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పథకాలు గెలుచుకున్నాడు. చదవండి: భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నటుడు ఇదిలా ఉంటే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశసింస్తూ పలువురు నెటిజన్లు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘16 ఏళ్ల వేదాంత దేశం కోసం పతకం సాధిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించారు. ఇప్పుడు ఆర్యన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత మార్చిలో వేదాంత కాంస్య పతకాన్ని సాధించి తన తండ్రి గర్వపడేలా చేశాడు. లాత్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ ఈవెంట్లో వేదాంత్ పతకం సాధించాడు. మాధవన్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. Good job Vedant. We are proud of you and your upbringing. 🙏 pic.twitter.com/6SNVJI51w1 — Abhishek Singhvi (@DrAMSinghvi) October 24, 2021 -
పడిపోయాననుకున్నావా? ఈత కొట్టాలనిపించింది.. దూకేశా..
ఎటో చూస్తూ నడిస్తే ఎంతటి వారైనా బొక్కబోర్లా పడాల్సిందే! అందుకు ఎవరూ అతీతులు కాదని.. సాక్షాత్తు మృగరాజే నిరూపించింది. అసలేం జరిగిందంటే.. జర్మన్ జూ పార్క్‌లో రెండు సింహాలు ఒక నీటిగుంట గట్టు మీద క్యాజువల్‌గా నడుస్తున్నాయి. ఇంతలో ఒక సింహం ఎటో చూస్తూ, నిర్లక్ష్యంగా నడుస్తూ, స్లిప్ అయ్యి నీటి గుంటలో పడిపోయింది. ముందు షాకయినప్పటికీ తర్వాత తేరుకుని నింపాదిగా ఈదుకుంటూ పైకి వచ్చింది. అయితే దానితో పాటే ఉన్న మరో సింహం మాత్రం కంగారు పడిపోయింది. నీళ్లలోనుంచి బయటికి వచ్చేంతవరకూ హడావిడిగా తిరగసాగింది. 2018 నాటి ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం ఈ వీడియోకు సరదాగా తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు. ‘గర్వం పతనానికి దారితీస్తుంది’అని ఒకరు కామెంట్ చేస్తే, ‘బుద్ధిలేని సింహం’ అని మరొకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ నవ్వు వచ్చేలా ఉన్న ఈ వీడియో సన్నివేశాన్ని మాత్రం వేల సంఖ్యలో నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: ఈ రైళ్ల కూత కుక్కల అరుపులా ఉంటుంది.. ఐడియా అదుర్స్ కదూ.. -
అప్పటి వరకు స్నేహితులతో సరదాగా గడిపాడు.. అంతలోనే..
సాక్షి, బయ్యారం(వరంగల్): ఈత వస్తుందనే నమ్మకం ఓ యువకుడి పాలిటశాపమైంది. సరదాగా స్నేహితులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి బయ్యారం పెద్దచెరువులో ఈత కొడుతూ నీటిలో మునిగిపోయాడు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం సుభాష్‌నగర్‌కు చెందిన తెల్ల బోయిన కల్యాణ్(24) తన మిత్రులు లక్ష్మణ్, భాను, అరవింద్, రాకేష్, ప్రేమ్ కుమార్‌తో కలిసి బయ్యారం పెద్ద చెరువు అలుగుల వద్దకు వెళ్లారు. చెరువు వద్ద భోజనం చేసిన అనంతరం మిగతా మిత్రులకు ఈత రాకపోవడంతో వారు ఒడ్డున కూర్చోగా కల్యాణ్ ఈత వస్తుందనే నమ్మకంతో దిగాడు. కొంత సమయం పాటు ఈత కొట్టిన తర్వాత కల్యాణ్ నీటిలో మునిగిపోయాడు. దీంతో ఈ విషయాన్ని కల్యాణ్ కుటుంబసభ్యులతో పాటు పోలీసులకు తెలిపారు. గార్ల– బయ్యారం సీఐ తిరుపతి, గార్ల ఎస్సై రవి యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు. -
వామ్మో.. ఆ దూకుడు ఏందిరా నాయనా!
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో స్కూళ్లు లేకపోవడంతో పిల్లల ఆటపాటలతో భలే ఎంజాయ్ చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే పనిలేకపోవడంతో ఆటలతో సేద తీరుతున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గడ్పూర్ గ్రామ పంచాయతీ దుబ్బగూడెం వద్ద గల వ్యవసాయ బావిలో విద్యార్థులు ఇలా ఈత కొడుతూ కేరింతలు కొట్టారు. అయితే, బావుల్లో దిగడం, ఈత కొట్టడం ప్రమాదమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సుమా!. – గెల్లు నర్సయ్య యాదవ్, సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల అమ్మో డైనోసార్ సంగారెడ్డి రాజంపేట నుంచి నాగాపూర్ వెళ్లేదారిలో ఓ రైతు పొలం పక్కన పిచ్చిమొక్కల తీగలు చెట్టుపై డైనోసార్లా అల్లుకున్నాయి. దూరం నుంచి చూస్తే డైనోసార్ అనిపించేలా ఈ తీగలు అల్లుకున్నాయని స్థానికులు అంటున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి పొలం పచ్చగా..కడుపు నిండగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో ఎటుచూసినా వరి పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. పొలాల మధ్యలో నల్ల తల కలిగిన పక్షులు సైతం తిరుగుతూ సందడి చేస్తున్నాయి. పొలం నీళ్ల మధ్య బురదలోని కీటకాలను తింటూ కడుపు నింపుకుంటున్నాయి. రైతుల చప్పుడు కాగానే గాలిలో రివ్వున ఎగిరిపోతున్నాయి. – బి.శివప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి. -
కోకాకోలా సముద్రం.. ఈత కూడ కొట్టొచ్చు.. ఎక్కడంటే?
Brazil Coco Cola River Facts: ప్రపంచంలో మనకు తెలియని, ఊహలకు అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి సృష్టించిన ఈ భూమి మొత్తం వింతలు విశేషాలతో నిండి ఉంది. మనకు తెలిసే వరకు అది ఏదైనా ఒక ఆశ్చర్యమే. మరి కోకాకోలా ప్రవహించే మహాసముద్రం గురించి ఎప్పుడైనా విన్నారా.. అదేంటి కోకాకోలా సముద్రం కూడా ఉందా, నిజమేనా అనుకుంటున్నారా. అవును, మీరు విన్నది నిజమే. బ్రెజిల్‌లోని రియో గ్రాండే డెల్ నార్టేలోని కోకా కోలా సరస్సు ఉంది. అక్కడ మీరు ఈత కూడా కొట్టవచ్చు. ఇక్కడి సరుస్సులోని నీరు అచ్చం కోకా కోలా డ్రింక్ కలర్లోనే ఉంటాయి. ఈ ప్రదేశంలోని నీటి ముదురు గోధుమ మరియు నలుపు రంగు, ఇది ఖచ్చితంగా కోకా కోలా వలె కనిపిస్తుంది. ఒక్కసారి మనం అ లేక్ వద్దకు వెళితే నీటికి బదులు కోకాకోలానే సరస్సులో ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది.ఈ నీటిలో ఇనుము, అయోడిన్ గాఢత ఎక్కువ ఉండటం వల్ల ఈ నీటికి ఇలా రంగు ఉందని పరిశోధనల్లో తేలింది. దీని కారణంగానే ఇక్కడి నీటికి కోలా నీటిలా కనిపిస్తుంది. వేసవిలో బీచ్ జీవితాన్ని ఆస్వాదించడానికి ఇక్కడ నివసించే ప్రజలు తరచుగా ఇక్కడకు వస్తారు. తీరంవైపు ఉన్న నీరు లేత ముదురు రంగులో కనిపిస్తుంది. అదే సముద్రంలోకి వెళితే ముదురు రంగులోకి మారుతుంది. నీటికి ఉన్న వింత రంగు కారణంగా ప్రజలు ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది టూరిస్టులు తమ కుటుంబంతో విహారయాత్రకు రావడానికి ఇష్టపడుతుంటారు. ఈ ప్రాంతం టూరిస్టులతో నిత్యం సందడిగా ఉంటుంది. -
జలకన్యల విన్యాసాలు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవంతే!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలు సందడిగా మారాయి. ఓ వైపు కరోనా మహమ్మారి కొనసాగుతున్నా.. అథ్లెట్లు పతకాల కోసం పోటీపడున్నారు. అంతార్జాతీయ క్రీడల్లో తమ దేశానికి పథకం తీసుకురావలనే ఆశయంతో ప్రతీ క్రీకాకారుడు పోరాడుతున్నారు. ఒలింపిక్స్‌లో హాకీ, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ ఇలా..ఎన్నో రకాల పోటీలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ఆర్టిస్టిక్ స్విమ్మింగ్(కళాత్మక ఈత). ఈతలో ఈ రకమైనది ఒకటి ఉందని ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఈ పోటీల్లో పాల్గొంటున్న వుమెన్ స్మిమ్మర్స్ మాత్రం తమ ప్రతిభతో అదరగొడుతున్నారు. నీళ్లల్లోనూ స్ప్రింగ్‌లా కదులుతూ మిరాకిల్ సృష్టిస్తున్నారు.. ఆ ఫోటోలు మీకోసం.. -
Artistic Swimming: జలకన్యల విన్యాసాలు.. వావ్ అనాల్సిందే!
-
ఇదేం దోస్తానారా అయ్య: ఫ్రెండ్ షిప్‌డే నాడే దాడులు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ఈత సరదా యువకుల మధ్య చిచ్చురేపింది. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముగ్గురు గాయపడగా ఒక యువకుడు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక ఎన్టీటీపీఎస్ బూడిద చెరువు నుంచి వెలువడే నీళ్లు చఫ్టా ద్వారా కృష్ణానదిలో కలుస్తాయి. చఫ్టా వద్ద జాలువారే నీటిని వాటర్‌ఫాల్స్‌గా భావించి యువకులు ఈత కొట్టేందుకు వస్తుంటారు. ఆదివారం ఫ్రెండ్షిఫ్ డే కావడంతో అధిక సంఖ్యలో యువకులు అక్కడకు చేరుకున్నారు. బైక్‌ల విషయంలో మొదలై... స్టాండ్ వేసిన బైక్‌లు ఒకదానిపై ఒకటి పడటంతో ఇరువర్గాల మద్య గొడవ ప్రారంభమైంది. అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న యువకులు ఘర్షణకు దిగారు. హైవే వద్దకు చేరుకునే సమయానికి యువకుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. తోపులాటతో ప్రారంభమై చివరికి కర్రలు, రాళ్లు, పడిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ముఖ్యంగా ముగ్గురు యువకులను తీవ్రంగా చావబాదారు. కిలేశపురంలో యువకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. నగరానికి చెందిన యువకులు దేవిశెట్టి దివాకర్, కరమద్ది సాయి, కోట్ల అరుణ్, ముద్రబోయిన నాగేశ్వరరావు, తెనాలి శ్రావణ్‌కుమార్, తాసెట్టి శరత్, చలసాని నాగరాజు, షేక్ షాహీల్, బొమ్మశెట్టి కుమార్ పేద కుటుంబాలకు చెందిన వారు. చదువుల పేరుతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి సరదా కోసం వీరు చేస్తున్న పనులు తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చాయి. ఈ సంఘటనపై స్పందించిన సీఐ శ్రీధర్‌కుమార్ మాట్లాడుతూ.. కిలేశపురంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు వర్గాలపై కేసులు పెడతామన్నారు. 10 మంది అరెస్ట్... ఇప్పటి వరకు 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. మిగిలిన వారి కోసం విజయవాడ చిట్టినగర్, పాలప్యాక్టరీ ప్రాంతాల్లో గంజాయి స్థావరాల వద్ద గాలిస్తున్నామన్నారు. అక్కడ జరిగింది గ్యాంగ్‌వార్ కాదన్నారు. ఘటనలో పాతనేరస్తులు లేరని, ఒక్కరు కూడా చనిపోలేదని, స్థానికులు గొడవలో పాల్గొనలేదన్నారు. అందరూ నున్న, ప్రకాశ్‌నగర్, సింగ్‌నగర్ ప్రాంతాలకు చెందిన యువకులని వెల్లడించారు. -
త్వరలోనే పెళ్లి.. అత్తింటికి వచ్చి కాబోయే అల్లుడు మృతి
కొలిమిగుండ్ల/ తాడిపత్రి రూరల్: త్వరలో పెళ్లి కావాల్సిన యువకుడు.. సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన ఆదివారం కర్నూలు జిల్లాలోని లొక్కి గుండం జలపాతం వద్ద చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన అఖిల్‌సాయి (21)కి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంటకు చెందిన అమ్మాయితో మూడు రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. నాగుల చవితి ముహూర్తాలకు వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అఖిల్‌సాయి అత్తగారి ఊరుకు వచ్చి యువతితో పాటు మరో ఇద్దరితో కలసి లొక్కిగుండంలో ఈతకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతూ అఖిల్‌సాయి గుండంలో చిక్కుకుపోయి గల్లంతయ్యాడు. ఎంత సేపటికీ బయటకు రాక పోవడంతో అమ్మాయి.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది. వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చీకటి కావడంతో లైట్లు, తాళ్ల సాయంతో వెతికి తొమ్మిది గంటల సమయంలో మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.