
నాగర్ కర్నూల్: జిల్లాలోని పెద్ద కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది పోతినేని చెరువులో ఈతకు దిగిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.సరదాగా స్నానం కోసమని వెళ్లిన ఆ చిన్నారులను పోతినేని చెరువు మింగేసింది. మృతి చెందిన చిన్నారులు గణేష్ రెడ్డి (13) రక్షిత (10) శ్రావణ్ (7) లుగా గుర్తించారు. ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో తీవ్ర విషాదచ్చాయలు అలుముకున్నాయి.
చిన్నారులు గల్లైంతన తర్వాత సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ముగ్గురు మృతదేహాలను మాత్రమే చెరువు నుంచి బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గతవారం అన్నమయ్య జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో మొలకలచెరువు నలుగుర్ని మింగిసేన సంగతి తెలిసిందే. మొలకలచెరువు పెద్దచెరువు వద్ద తల్లిదండ్రులతో కలిసి బట్టలు ఉతకడానికి లావణ్య (12) నందకిషోర్ (10)లు అక్కడికి వచ్చారు. చెరువులో దిగుతుండగా మునిగిపోతున్న సమయంలో చిన్నారులు కేకలు వేశారు.
అక్కడే ఉన్న లావణ్య తండ్రి మల్లేష్ చిన్నారులను రక్షించే క్రమంలో మునిగిపోయాడు. చిన్నారులు లావణ్య, నంద కిషోర్ లతో కలిసి పక్కంటి చిన్నారి నందిత(11) కూడా చెరువులో దిగి మునిగిపోయింది.