ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తు చేసిన గుజ‌రాత్‌ | Gujarat Titans vs Sunrisers Hyderabad Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2025:ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తు చేసిన గుజ‌రాత్‌

Published Fri, May 2 2025 7:12 PM | Last Updated on Fri, May 2 2025 11:32 PM

Gujarat Titans vs Sunrisers Hyderabad Live Updates

PC: BCCI/IPL.com

IPL 2025 Gujarat Titans vs Sunrisers Hyderabad Live Updates:
ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తు చేసిన గుజ‌రాత్‌
ఐపీఎల్‌-2025లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క‌థ దాదాపు ముగిసిన‌ట్లే.  ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ తేలిపోయింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 38 ప‌రుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి పాలైంది. 225 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 186 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది. 

లక్ష్య​​ చేధనలో ఓపెనర్లు మంచి అరంభం ఇచ్చినప్పటికి, మిడిలార్డర్ విఫలమం కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శ‌ర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ద్ కృష్ణ, సిరాజ్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. ఇషాంత్ శ‌ర్మ, కోయిట్జీ త‌లా వికెట్ సాధించారు. 

ఓటమి దిశగా ఎస్‌ఆర్‌హెచ్‌
స‌న్‌రైజ‌ర్స్ వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయింది. 6 ప‌రుగుల వ్య‌వ‌ధిలో 3 వికెట్లు కోల్పోయింది. క్లాసెన్(23).. ప్ర‌సిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔట్ కాగా.. సిరాజ్ బౌలింగ్‌లో అనికేత్ వర్మ(3), మెండిస్‌(0) ఔటయ్యారు. 17 ఓవర్లకు సన్‌రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 

ఎస్‌ఆర్‌హెచ్ మూడో వికెట్ డౌన్‌
అభిషేక్ శ‌ర్మ రూపంలో ఎస్ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 74 ప‌రుగులు చేసిన అభిషేక్ ఇషాంత్ శ‌ర్మ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.  15 ఓవర్లకు సన్‌రైజర్స్ మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ క్లాసెన్‌(22), అనికేత్ వ‌ర్మ‌(0) ప‌రుగుల‌తో ఉన్నారు.

అభిషేక్ హాఫ్ సెంచ‌రీ
గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు.  14 ఓవర్లకు సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శ‌ర్మ‌(69), క్లాసెన్‌(16) ప‌రుగుల‌తో ఉన్నారు.
ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ డౌన్‌..
ఇషాన్ కిష‌న్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 13 ప‌రుగులు చేసిన కిష‌న్‌.. కోయిట్జీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 11 ఓవర్లకు సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శ‌ర్మ‌(49), క్లాసెన్‌(10) ప‌రుగుల‌తో ఉన్నారు.

ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ డౌన్‌..
225 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ ట్రావిస్ హెడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 20 ప‌రుగులు చేసిన హెడ్‌.. ప్ర‌సిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 50  పరుగులు చేసింది.

చెలరేగిన గుజరాత్ బ్యాటర్లు.. ఎస్‌ఆర్‌హెచ్ ముందు భారీ టార్గెట్‌ 
అహ్మదాబాద్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌(76) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోస్ బట్లర్‌(64), సుదర్శన్‌(48) పరుగులతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ మూడు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్‌, అన్సారీ తలా వికెట్ సాధించారు.

గుజరాత్ రెండో వికెట్ డౌన్‌
శుబ్‌మ‌న్ గిల్ రూపంలో గుజ‌రాత్ రెండో వికెట్ కోల్పోయింది. 76 ప‌రుగులు చేసిన గిల్‌.. దుర‌దృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ రెండు వికెట్ల న‌ష్టానికి 120 ప‌రుగులు చేసింది.

శుబ్‌మ‌న్ గిల్ ఫిప్టీ..
గుజ‌రాత్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవ‌లం 25 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 120 ప‌రుగులు చేసింది. క్రీజులో బ‌ట్ల‌ర్‌(19), గిల్‌(52) ఉన్నారు.

గుజరాత్ తొలి వికెట్‌​ డౌన్‌..
సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన సుదర్శన్‌.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌(42), బట్లర్‌(12) ఉన్నారు.
దంచి కొడుతున్న గుజరాత్ ఓపెనర్లు..
నరేంద్ర మోదీ మైదానంలో గుజరాత్ ఓపెనర్లు బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. క్రీజులో సుదర్శన్‌(45), శుబ్‌మన్ గిల్‌(36) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న గుజ‌రాత్‌
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్ట‌పోకుండా 36 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయిసుద‌ర్శ‌న్‌(26), గిల్(10) ఉన్నారు. 

ఐపీఎల్‌-2025లో అహ్మదాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు స‌న్‌రైజ‌ర్స్ చాలా కీల‌కం. ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే హైద‌రాబాద్.. ఈ మ్యాచ్‌లో క‌చ్చితంగా గెల‌వాల్సిందే

ఎస్ఆర్‌హెచ్ త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు. గుజ‌రాత్ మాత్రం ఓ మార్పుతో బ‌రిలోకి దిగింది. క‌రీమ్ జ‌న‌త్ స్ధానంలో జ‌ట్టులోకి కోయిట్జీ వ‌చ్చాడు.

తుది జ‌ట్లు
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement