
నాగర్ కర్నూల్: జిల్లాలోని చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు ఐపీఎస్ అధికారి దుర్మరణం చెందారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో పగవరపల్లిదోమల పెంట మధ్యలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నట్లు గుర్తించారు.
వీరంతా కారులో మహారాష్ట్ర నుంచి బయల్దేరి శ్రీశైలం వెళుతున్నట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.