IPS officer
-
కీచక ఐపీఎస్: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు
సాక్షి, చెన్నై: చెన్నై ట్రాఫిక్ విభాగంలో ఐపీఎస్ అధికారి కీచకుడయ్యాడు. మహిళా పోలీసును లైంగికంగా వేధించడంతో ఆమె డీజీపీ శంకర్ జివ్వాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీఎస్‌ను సస్పెండ్ చేశారు. విశాఖ కమిటీ విచారణకు ఆదేశించారు. గతంలో మహిళా ఐపీఎస్‌కు డీజీపీ స్థాయి అధికారి ఒకరు వేధింపులు ఇవ్వడం, ఐజీ స్థాయి అధికారి తన సహచర అధికారిణికి వేధింపులు ఇవ్వడం వంటి ఘటనలు తమిళనాట పోలీసు యంత్రాంగంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక చోట కింది స్థాయి అధికారులపై వేధింపుల పిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో గురువారం ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా పోలీసులు ఒకరు డీజీపీ శంకర్ జివ్వాల్ను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఎదుర్కొంటున్న వేదింపు గురించి ఆయనకు వివరించారు. చెన్నై కమిషరేట్‌లో ఏడవ అంతస్తులో›ట్రాఫిక్ జాయింట్ కమిషననర్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి డి. మహేశ్‌కుమార్ ఈ వేదింపులకు గురి చేసినట్టు ఫిర్యాదు చేయడం తక్షణం, విచారణ జరగడం జరిగింది. విచారణలో ఆయనపై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించడంతో తక్షణం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ఈ కేసును డీజీపీ సీమా అగర్వాల్, ఐపీఎస్ అధికారిణులతో కూడిన విశాఖ కమిటికి అప్పగించారు. ఈ కమిటీ తన విచారణపై దృష్టి పెట్టింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మహేశ్కుమార్పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. -
సంజయ్‌పై కక్ష సాధింపు చర్యలు.. రాజకీయ, వ్యక్తిగత ప్రతీకారమే!
విజయవాడ, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధికారి, గత సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్‌పై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులకు దిగింది. ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సర్కార్.. ఇప్పుడు అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణల విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాల్లో ఉంది. ఒకవైపు ఆయన న్యాయపోరాటం చేస్తున్నవేళ.. మరోవైపు విచారణకు రావాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఐడీ ఛీఫ్‌గా సంజయ్(Sanjay) వ్యవహరించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడి స్కిల్ స్కాం కేసు దర్యాప్తు ఈయన పర్యవేక్షణలోనే జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ, వ్యక్తిగత ప్రతీకారంలో భాగంగానే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా.. 30 రోజుల్లో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని.. స్పందించకపోతే చర్యలు తీసుకుంటామంటూ నోటీసులో హెచ్చరికలు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్సాక్షి, అమరావతి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టును కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి, గత సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్(Subramanyam Sriram)వాదనలు వినిపిస్తూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌పై ఏసీబీ చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వివరించారు. ప్రభుత్వం మారిన వెంటనే తనను దురుద్దేశపూర్వకంగా ఈ తప్పుడు కేసులో ఇరికించారని తెలిపారు. అగ్ని యాప్ తయారీలో అక్రమాలు జరిగాయని ఏసీబీ చెబుతోందని, వాస్తవానికి ఆ యాప్ పనితీరుకు టెక్నాలజీ సభ అవార్డు సైతం ప్రదానం చేసిందన్నారు. యాప్ తయారీకి నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచామని, అందులో లోయస్ట్ బిడ్డర్ అయిన సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు అగ్నిమాపక శాఖ పనులు అప్పగించిందన్నారు. ఆ వెంటనే పనులు ప్రారంభించిన సౌత్రికా, యాప్ తయారీని సకాలంలో పూర్తి చేసిందని తెలిపారు. అగ్ని యాప్ తయారీ పూర్తయి, దాని పనితీరు సంతృప్తికరంగా ఉన్న తరువాతే నగదు విడుదల చేశారని పేర్కొన్నారు. పైగా.. మార్కెట్ ధరకంటే 5 శాతం తక్కువకే ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే, ఏసీబీ మాత్రం హడావుడిగా డబ్బు చెల్లించామంటూ నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో సంజయ్ లబ్ధి పొందారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చాల్సి ఉందని, అందువల్ల సంజయ్‌ని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన ముందస్తు బెయిల్(Anticipatory Bail)ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఐపీఎస్ అధికారిపై చంద్రబాబు ప్రభుత్వం ప్రేమ
అమరావతి: బదిలీ చేసి 10 రోజులు కాకుండానే ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడికి పోస్టింగ్ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం. కనీసం తిరుపతి తొక్కిసలాట ఘటనలో జరిగిన మరణాలపై విచారణ కూడా కాకుండానే తిరిగి పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర చర్చకు దారి తీసింది. తిరుపతి వెంకటేశ్వరస్వామి భక్తుల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ భక్తులతో పాటు రాష్ట్ర ప్రజలు విస్తు పోతున్నారు. ఈ విధంగా సుబ్బారాయుడిపై చంద్రబాబు మరోసారి తన మమకారం చాటుకున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన సమయంలో అధికారులను తిట్టినట్టు బాబు పెద్ద హైడ్రామా చేసిన విషయం తెలిసిందే. కానీ ఇలా బదిలీ చేసిన ఎస్పీకి 10 రోజులు కాకుండానే పోస్టింగ్ ఇవ్వడంపై తీవ్ర ధుమారం రేపుతుంది. -
జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులకు ముందస్తు బెయిల్
సాక్షి, అమరావతి: సినీ నటి జత్వానీ (kadambari jethwani) కేసులో ఐపీఎస్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులకు హైకోర్టు (andhra pradesh high court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఐపీఎస్ కాంతి రాణా టాటా, విశాల్ గున్నితో పాటు ఏసీపీ హనుమంతరావు ఇతర పోలీసు అధికారులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు (anticipatory bail) చేస్తూ తీర్పు వెల్లడించింది.మంగళవారం జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ,న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో కొద్ది రోజుల క్రితం డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్ దేశ్‌పాండే వివరించారు.జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు.విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు. చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు?జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేసింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు. అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్ర పూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. -
‘బీఎండబ్ల్యూ ప్రధాని కోసం.. నా కారు మారుతి 800’
ఈ మాటలన్నది మాజీ ప్రధాని మన్మోహన్సింగ్. ఆయన నిరాడంబరతను ప్రస్తుత యూపీ మంత్రి, ఒకప్పుడు మన్మోహన్సింగ్ బాడీగార్డ్‌గా పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ అసిమ్ అరుణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘2004 నుంచి దాదాపు మూడేళ్ల పాటు మన్మోహన్‌కు బాడీగార్డుగా పనిచేశాను. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ప్రధానికి భద్రత కలి్పస్తుంది. క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్‌కు నాయకత్వం వహించే అవకాశం నాకు లభించింది. క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా నేను ప్రధానికి దగ్గరగా ఉండాల్సి వచ్చేది. ఏదైనా కారణాలవల్ల ఆయన వెంట ఒక అంగరక్షకుడు మాత్రమే ఉండాల్సి వస్తే.. నేనే ఉండేవాడిని. నీడలా ఆయనతో ఉండటమే నా బాధ్యత. డాక్టర్ సింగ్ వద్ద కేవలం ఒక కారు ఉండేది. అది మారుతి 800. ప్రధానమంత్రి కాన్వాయ్‌లోని నల్ల బీఎండబ్ల్యూ కార్ల వెనుక అది పార్క్ చేసి ఉండేది. కాన్వాయ్ తీసే ప్రతీసారి ఆయన ఆ కారువైపు ఆతీ్మయంగా చూసేవారు. ఎందుకని అడిగితే.. ‘ఈ బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించడం నాకు ఇష్టం లేదు అసిమ్. నా వాహనం అదే(మారుతి)’ అనేవారు. ఈ కారు మీ లగ్జరీ కోసం కాదు.. సెక్యూరిటీ ఫీచర్లున్నాయి కాబట్టి మీరు ఇదే వాడాలి’ అని వివరించేవాడిని’’ అంటూ గుర్తు చేసుకున్నారు. 2004లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) బ్లాక్ క్యాట్ కమాండోగా శిక్షణ పొందిన తొలి ఐపీఎస్ అధికారి అసిమ్ అరుణ్. -
కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..
మనం పురాణాల్లో భక్త కబీర్, రామదాసులాంటి వాళ్లు భక్తులుగా ఎలా మారారో కథల్లో చదివాం. వారి భక్తి పారవశ్యంతో దైవానుగ్రహాన్ని ఎలా పొందారో కథలు కథలుగా చదివాం. అయితే అలాంటి సఘటనే రియల్‌గా చోటు చేసుకుంది. అచ్చం ఆ భక్తాగ్రేసుల మాదిరిగా మారిపోయి సాధు జీవితాన్ని గడిపోతుంది. అంతటి అత్యున్నత సివిల్ సర్వీస్‌లో ఉన్న ఆమె అన్నింటిని పరిత్యజించి ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసింది. ఆమె చెబితే గానీ తెలియనంతగా ఆహార్యం, జీవన విధానం మారిపోయింది. ఇంతకీ ఎవరామె..? ఆధ్యాత్మికత వైపుకి ఎలా ఆకర్షితురాలైంది అంటే..ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షలో విజయం సాధించడమంటే మామాలు మాటలు కాదు. మంచి ర్యాంకుతో ఐఏఏస్ లేదా ఐపీఎస్లాంటివి దక్కితే ఆ రేంజ్, హోదానే వేరెలెవెల్. ఎంతటి వారైనా వారి ముందు నిల్చొక తప్పదు. అంతటి ఐపీఎస్ అత్యున్నత పదవిని అలంకరించింది భారతి అరోరా. 1998 బ్యాచ్‌కి చెందిన ఈ మాజీ అధికారిణి హర్యానాలోని పలు జిల్లాల్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సేవలందించింది. అలాగే కర్నాల్‌లో ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా పనిచేశారు. ఆమె కెరీర్ మొత్తం బాబు పేలుళ్లకు సంబంధించిన కేసులను చాకచక్యంగా చేధించింది. అంతేగాదు ఎస్పీగా ముక్కుసూటి వైఖరితో.. ప్రముఖ రాజకీయ నాయకుడుని అరెస్టు చేసి వార్తల్లో నిలిచారు. సాహసోపేతమైన నిర్ణయాలతో నాయకులకే చెమటలు పట్టించిన చరిత్ర ఆమెది. నేరాలను అదుపు చేసేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా.. వెనుకడుగు వేయని ధీర వనిత భారతి అరోరా. అలాంటి ఆమె అనూహ్యంగా ఆధ్యాత్మికత వైపుకి ఆకర్షితురాలైంది. భక్తురాలిగా మార్పు ఎలా అంటే..2004లో బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు భారతి. అక్కడే ఆమెకు కృష్ణ భక్తిపై అమితమైన మోహం ఏర్పడింది. అలా ఆ పరంధామునిపై అమితమైన భక్తిని పెంచుకుంది. అదే ఏ స్థాయికి చేరుకుందంటే..సర్వం పరిత్యజించి కృష్ణునికి అంకితమైపోవాలన్న భక్తిపారవశ్యానికి లోనైంది. ఆ నేపథ్యంలోనే ఇంకా పదేళ్ల సివిల్ సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కృష్ణ భక్తురాలిగా మారిపోయింది. చెప్పాలంటే అచ్చం మీరాభాయిలా కృష్ణుడుని ఆరాధిస్తూ..సాధువులా జీవితం గడుపుతోంది మాజీ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా. (చదవండి: 75 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా నటుడు నానా పటేకర్...ఇప్పటికీ ఆ అలవాటు..!) -
ఎంత విషాదం.. తొలి పోస్టింగ్‌కు వెళుతూ యువ ఐపీఎస్ దుర్మరణం
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాంగ్‌రూట్, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఐపీఎస్ అధికారి మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ట్రైనింగ్ పూర్తి చేస్తుకున్న అతడు..తన తొలి పోస్టింగ్‌ను చేపట్టేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం మరింత దురదృష్టకరం. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల హర్ష్ బర్దన్ క్ణాటక కేడర్‌కు చెందిన 2023 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. సోమవారం తన తొలి పోస్టింగ్ స్వీకరించేందుకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న పోలీస్ వాహనం టైరు పగిలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో వాహనం రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టి అనంతరం చెట్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో బర్దన్ తలకు బలమైన గాయం తగలంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ యువ ఐపీఎస్ మరణించాడు. డ్రైవర్‌కు స్పల్ప గాయాలయ్యాయి.మరోవైపు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంఘటన స్థలంలో పోలీస్ వాహనం ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. ఐపీఎస్ మృతిపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు. సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం లభించిన సమయంలో ఇలా జరగడం దురదృష్ణకరమని అన్నారు.‘హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి హర్ష్ బర్ధన్ మృతి చెందడం బాధాకరం. ఆయన ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళుతుండగా ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్ణకరం. ఎన్నో ఏళ్లు శ్రమించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుఉ ఇలా జరగకూడదు.హర్ష్ బర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’ అని కన్నడలో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. -
‘మకుటం’ లేని మహిళామణులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన ప్రభుత్వం, ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో చర్యలు తీసుకున్నారు. వీటిలో భాగంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగంలోని మహిళా ఐపీఎస్‌ల పరిస్థితి మకుటం లేని మహిళామణుల మాదిరిగా మారింది. ఇక్కడ పని చేస్తున్న ఉమెన్ ఐపీఎస్‌ల సంఖ్య దాదాపు 30 వరకు ఉంది. అయితే యూనిట్ ఆఫీసర్లుగా పిలిచే కీలకమైన ఫోకల్ పోస్టుల్లో ఉన్న వారు మాత్రం కేవలం ముగ్గురే. త్వరలో ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడైనా ఈ పరిస్థితులు మార్చే ప్రయత్నం చేస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫోకల్లోనూ రెండు రకాలైన పోస్టులు.. పోలీసు శాఖలో సాధారణంగా రెండు రకాలైన పోస్టులు ఉంటాయి. శాంతిభద్రతల విభాగం వంటి ప్రాధాన్యం గల వాటిని ఫోకల్ అని, సీఐడీ, ట్రాఫిక్ వంటి ప్రాధాన్యం లేని వాటిని నాన్–ఫోకల్ పోస్టులని వ్యవహరిస్తుంటారు. అయితే ఈ ఫోకల్ పోస్టుల్లోనూ రెండు రకాలైనవి ఉన్నాయి. ఏదైనా జిల్లా లేదా కమిషనరేట్‌కు నేతృత్వం వహించే అవకాశం ఉన్న ఎస్పీ ఆపై స్థాయి హోదాలోని పోస్టులను యూనిట్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ఎస్పీ హోదాలోనే ఉన్నప్పటికీ... కమిషనరేట్లలోని జోన్లకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా (డీసీపీ) పని చేసే వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, అధికారం ఉండదు. ఈ నేపథ్యంలో ఇవీ ఫోకలే అయినప్పటికీ అక్కడి పని చేసే వారిని యూనిట్ ఆఫీసర్‌గా పరిగణించరు. ‘33’ కాదు కదా ‘10’ కూడా లేదు... పోలీసు విభాగంలో వివిధ స్థాయిల్లో జరిగే రిక్రూట్మెంట్లో సైతం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అయితే వీరికి పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే పోస్టింగ్స్లోనూ అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో భావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు, 9 కమిషనరేట్లు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే మొత్తమ్మీద ఉన్న 39 యూనిట్లలో పదికి పైగా మహిళా ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో పని చేయాలి. అయితే వాస్తవానికి పది శాతం కూడా యూనిట్ ఆఫీసర్లుగా మహిళా ఐపీఎస్‌లు లేరు. నిర్మల్ జిల్లాకు జానకీ శర్మిల, కామారెడ్డి జిల్లాకు సీహెచ్ సింధు శర్మ ఎస్పీలుగా ఉండగా... సిద్ధిపేట కమిషనరేట్‌కు బి.అనురాధ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురూ మినహా మరే ఇతర యూనిట్‌కు మహిళా ఐపీఎస్ నేతృత్వంలో లేదు. కేవలం సీఐడీ, ఎస్ఐబీ వంటి విభాగాలు మాత్రమే ఉన్నాయి. ఈసారైనా ఈ సీన్ మారేనా..? ఈ ముగ్గురు మహిళా ఐపీఎస్ల్లోనూ కేవలం సింధు శర్మ మాత్రమే డైరెక్ట్ ఐపీఎస్ కావడం గమనార్హం. మిగిలిన ఇద్దరూ రాష్ట్ర పోలీసు విభాగంలో అడుగుపెట్టి, నిరీ్ణత కాలం పని చేసిన తర్వాత ఐపీఎస్ హోదా పొందిన వారే. సింధు శర్మ ప్రస్తుతం నిజామాబాద్ కమిషనరేట్‌కు సైతం ఇన్చార్జ్గా ఉన్నారు. రాజకీయపరంగా అత్యంత సున్నితమైన ఈ రెండు యూనిట్లను ఆమె సమర్థంగా నిర్వహిస్తున్నారనే పేరు పొందారు. ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల మొదటి వారంలో పెద్ద స్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటి నేపథ్యంలో మహిళా ఐపీఎస్ అధికారులకు సముచిత ప్రాధాన్యం లభిస్తుందని ఆయా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం ఈ కోణంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. -
పవర్ఫుల్ ఝాన్సీ
లక్ష్మీ రాయ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. గురుప్రసాద్ దర్శకత్వం వహించారు. తమిళ, కన్నడ భాషల్లో ఆల్రెడీ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కిందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు. ‘‘ప్రేమ, యాక్షన్ అంశాలతో రూపొందిన సినిమా ఇది.మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో లక్ష్మీ రాయ్ అద్భుతంగా నటించారు. డ్రగ్స్ సప్లై చేస్తూ కాలేజీ అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఓ ముఠా ఆటను అడ్డుకునే పవర్ఫుల్ ఝాన్సీ పాత్రలో లక్ష్మీ రాయ్ నటించారు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేసి, సినిమాను నవంబరులో రిలీజ్ చేస్తాం’’ అని ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. -
చేయి తగిలిందని పోలీస్ మార్క్ కేసు!
గచ్చిబౌలి: పబ్‌లో చేయి తగిలిందని ఓ డాక్టర్ మీద కేసు నమోదు చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఫెనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని తబులా రసా పబ్‌కు ఓ ఐపీఎస్ ఆఫీసర్ భార్యతో కలిసి వెళ్లారు. అదే పబ్‌కు కొంత మంది డాక్టర్లు వెళ్లారు. ఐపీఎస్ భార్య వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మదీనాగూడకు చెందిన ఓ డాక్టర్ చేయి తగిలింది. పొరపాటు జరిగిందని సదరు డాక్టర్ ఆమెకు సారీ చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆమె జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ తర్వాత క్షణాల మీద గచ్చిబౌలి పోలీసులు పబ్‌కు చేరుకున్నారు. సదరు డాక్టర్‌ను గచ్చిబౌ పీఎస్‌కు తరలించారు. నేను కావాలని చేయలేదని, యాదృచి్ఛకంగా జరిగిందని చెప్పినా పోలీసులు శాంతించలేదు. మద్యం ఎక్కువ తాగి అసభ్యంగా ప్రవర్తించాడా అనేది నిర్ధారించుకునేందుకు బ్రీత్ ఎనలైజర్ చేశారు. మద్యం అతిగా తాగలేదని తేలినట్లు సమాచారం. గంటల తరబడి స్టేషన్లోనే కూర్చోబెట్టారు. మరుసటి రోజు పబ్ నిర్వాహకులతో ఫిర్యాదు తీసుకొని ఆ డాక్టర్‌పై కేసు నమోదు చేసి, నోటీసు ఇచ్చి పంపించారు. మహిళలను కించపరిచే వ్యవహరించినా, అసభ్యంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాని ఐపీఎస్ భార్య కావడంతో చిన్న విషయానికి పోలీసులు హంగామా చేశారనే ప్రచారం జరుగుతోంది. సామాన్యుల ఫిర్యాదుపైనా పోలీసులు ఇలానే వ్యవహరిస్తే బాగుండేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం తబులా రసా పబ్ కేసుపై నోరు మెదపడం లేదు. కేసు గురించి మాకు తెలియదని, కేవలం పబ్‌లలో తనిఖీలు మాత్రమే చేశామని గచ్చిబౌలి పోలీసులు బుకాయించడం గమనార్హం. -
19 ఏళ్లకే గుండెపోటు? ఐపీఎస్ అధికారి కుమార్తె అనుమానాస్పద మరణం
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో శనివారం రాత్రి 19 ఏళ్ల విద్యార్థిని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీలో విద్యార్థిని అనికా రస్తోగి అపస్మారక స్థితిలో గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. దీంతో అనికా కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. మరోవైపు ఆమె గుండెపోటుతో మరణించినట్టు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. దీంతో అనికా హఠాన్మరణంపై గుండెపోటు టీనేజర్ల పాలిట శాపంగా మారుతోందా? చదువుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? అసలేమైంది లాంటి అనేక సందేహాలు వెల్లువెత్తాయి.మృతురాలు మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1998 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి సంజయ్ రస్తోగి కుమార్తె. ప్రస్తుతం ఈయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)లో ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. అనికా బీఏ ఎల్ఎల్బీ మూడో సంవత్సరం చదువుతోంది. శనివారం రాత్రి ఆమె హాస్టల్ రూమ్‌లోని అపస్మారక స్థితిలో పడి ఉండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, హాస్టల్ గదికి లోపలి నుంచి తాళం వేసి ఉందని, లోపల అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు ప్రకటించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూడా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆషియానా పోలీసులు తెలిపారు. -
జమ్ముకశ్మీర్ డీజీపీగా.. ఏపీ కేడర్ ఐపీఎస్ నలిన్ ప్రభాత్ నియామకం
జమ్ముకశ్మీర్‌కు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా(డీజీపీ) సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కేబినెట్ నియామకాల కమిటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్ కశ్మీర్లో డీజీపీగా ఆర్ఆర్ స్మైన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్ 30 ముగియనుంది. కాగా స్మైన్ 1991 బ్యాచ్‌కు చెందిన జమ్మూకశ్మీర్ కేడర్ ఐపీఎస్ అధికారి. 11 నెలలపాటు డీజీపీగా సేవలు అందించారు. ఈ తర్వాత పదవీ విరమణ చేయనున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రభాత్. అయితే ఆంధ్రప్రదేశ్ కేడర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతం (AGMUT) కేడర్‌కు అతని డిప్యుటేషన్‌ను కేంద్రం ఆమోదించింది. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(NSG)కి అధిపతిగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30 వరకు జమ్మూ కాశ్మీర్లో స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎస్డీజీ)గా నియమితులయ్యారు.అక్టోబర్ 1న డీజీపీ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఆర్టికల్ 370 రద్దు అనంతరం సెప్టెంబర్ 30వ తేదీలోపు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. మరో వారం, పది రోజుల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగనుంది. దీంతో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్దరించడం, అసెంబ్లీ ఎన్నికలు సైతం ప్రశాంతంగా నిర్వహించేందుకు నళిన్ ప్రభాత్‌ను జమ్మూ కశ్మీర్‌కు కేంద్రం పంపిందనే ఓ చర్చ సైతం కొనసాగుతుంది.1968లో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జన్మించిన నళిన్ ప్రభాత్.. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ఎంఏ చేశారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పనిచేశారు. కరీంనగర్, కడప, వరంగల్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా నళిన్ ప్రభాత్ పనిచేసిన సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వాటిని ఎదుర్కోవడంలో ఆయన చూపిన తెగువ, చొరవకు ప్రశంసలతో పాటుగా అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.మూడు పోలీసు గ్యాలెంట్రీ మెడల్స్‌తో సహా అనేక గౌరవాలను అందుకున్నారుగ్యాలంట్రీ మెడల్స్, పరాక్రమ్ పతక్(విశిష్ట సేవా పతకం), ఆంత్రిక్ సురక్ష పతకం సహా అనేక మెడల్స్ అందుకున్నారు. 2004 నుంచి కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతూ వచ్చారు. మొదట కొన్నాళ్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF)లో పనిచేసిన ఆయన, ఆ తర్వాత ఇండో-టిబెటన్ పోలీస్ ఫోర్స్(ITBP) 14వ బెటాలియన్(శ్రీనగర్), 21వ బెటాలియన్(శ్రీనగర్), 16వ బెటాలియన్(లడఖ్)లకు కమాండెంట్‌గా పనిచేశారు. తర్వాత సీఆర్పీఎఫ్లో సౌత్ కాశ్మీర్ ఆపరేషన్ రేంజ్ డీఐజీగా మూడేళ్లపాటు పనిచేసిన ఆయన, కొన్నాళ్లు చండీగఢ్ రేంజ్, బస్తర్ ఆపరేషన్స్ రేంజ్‌లలో డీఐజీగా పనిచేశారు. 2010 డిసెంబర్ నుంచి రెండేళ్ల పాటు సీఆర్పీఎఫ్లో ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, జమ్ము-కాశ్మీర్ జోన్, శ్రీనగర్ సెక్టార్లలో సేవలందించారు. ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కాశ్మీర్ ఆపరేషన్స్ సెక్టార్‌కు నేతృత్వం వహించారు.ఇలా సుదీర్ఘకాలం జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో వివిధ కేంద్ర పారామిలటరీ బలగాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు ఈ ప్రాంతంపై సమగ్ర అవగాహన, పట్టు ఉంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఇదే ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఏరికోరి జమ్ము-కాశ్మీర్ డీజీపీగా నియమించింది. -
AP: సీనియర్ ఐపీఎస్‌లపై కూటమి సర్కార్ వివక్ష
సాక్షి, అమరావతి: ఏపీలో సీనియర్ ఐపీఎస్‌లపై వివక్ష కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతున్నా వారికి మాత్రం ఇంకా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో, సర్కార్ తీరుపై సీనియర్ ఐపీఎస్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, కూటమి సర్కార్ సీనియర్ ఐపీఎస్‌లపై వివక్ష చూపిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఐపీఎస్‌లకు పార్టీ రంగు పులిమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పోస్టింగ్ ఇవ్వకపోవడమే కాకుండా వారిని ప్రతీరోజూ డీజీపీ ఆఫీస్‌లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రోజూ ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీస్‌లో హాజరు వేసుకోవాలని ఆదేశించింది. ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్‌లోనే రోజంతా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు.. డీజీపీ కూడా ఏదైనా పని అప్పగిస్తే వెంటనే వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ తీరుపై సీనియర్ ఐపీఎస్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణకు కొత్త బాస్
-
క్యాన్సర్‌తో భార్య మృతి.. నిమిషాల్లో ఐపీఎస్ భర్త సూసైడ్
గువహతి: భార్య క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న భర్తకు డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. ఈ బాధను దిగమింగుకోలేక భార్య చనిపోయిన వార్త తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే ఆ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ విషాద ఘటన మంగళవారం(జూన్18) సాయంత్రం అస్సాంలో జరిగింది. అస్సాంలోని స్టేట్ హోమ్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ శైలాదిత్య చెటియా(2009బ్యాచ్ ఐపీఎస్ అధికారి) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య క్యాన్సర్‌తో చనిపోయిందని తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే శైలాదిత్య ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని, ఈ ఘటనతో అస్సాం పోలీసు శాఖ మొత్తం విచారంలో మునిగిపోయినట్లు ప్రకటించారు. -
IAS కూతురికి IPS తండ్రి సెల్యూట్
-
ట్రైనీ ఐఏఎస్‌గా పోలీస్ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు.. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.ఉమాహారతి ట్రైనీ ఐఏఎస్‌గా తెలంగాణ పోలీస్ అకాడమీకి రావడంతో అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. గర్వంతో ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేసి.. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Proud father, who is SP rank police officer, salutes his trainee IAS daughter N Uma Harathi when she visited #Telangana Police Academy #TGPA today. N Venkateshwarlu works as Deputy Director, TGPA, while his daughter topped #UPSC civils exam 2022 securing All India 3rd rank. pic.twitter.com/xM1haCHO2m— L Venkat Ram Reddy (@LVReddy73) June 15, 2024 -
వెండితెరపై కిరణ్ బేడీ బయోపిక్.. టైటిల్ ఇదే!
భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి జీవితం వెండితెరపైకి రానుంది. ‘బేడి: ది నేమ్ యు నో.. ది స్టోరీ యూ డోన్ట్’ అనే టైటిల్‌తో ఆమె బయోపిక్ తెరకెక్కనుంది. ‘వన్ వే, అనదర్ టైమ్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు అందుకున్న దర్శక–నిర్మాత, రచయిత కుశాల్ చావ్లా ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ స్లేట్ పిక్చర్స్ పతాకంపై గౌరవ్ చావ్లా ఈ సినిమాను నిర్మించనున్నారని, వచ్చే ఏడాది ఈ సినిమా విడుదయ్యేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ‘‘కిరణ్ బేడీగారు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాత్రమే కాదు... ఆమె జీవితంలోని వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక 1966లో జాతీయ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌గా వార్తల్లో నిలిచారు కిరణ్ బేడీ. ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎన్నో సంస్కరణలు చేశారు. ‘పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేశారు. అలాగే రామన్ మెగసెసే అవార్డ్స్‌తో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు కిరణ్ బేడీ. ఇక వెండితెరపై ఆమె పాత్రను ఎవరు చేస్తారు? అనేది చిత్రబృందం ప్రకటించలేదు. -
అల్లునిపై మాజీ ఐపీఎస్ నిఘా?
యశవంతపుర: కుటుంబ కలహాలతో మాజీ ఐపీఎస్.. ప్రస్తుత ఐఏఎస్ అయిన అల్లుని ఫోన్ కాల్ డేటాను సేకరించారనేది వివాదమైంది. ఐఎఎస్ అధికారి డాక్టర్ ఆకాశ్ ఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ ఐపీఎస్ అధికారి సురేశ్ టిఆర్, బెంగళూరులోని హెబ్బగోడి సీఐ ఐయ్యణ్ణరెడ్డితో పాటు ఐదు మందిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సురేశ్ కుమార్తెతోనే ఆకాశ్‌కు పెళ్లయింది. అయితే వజ్రాల వాచ్, బెంజ్ కారు, మరింత కట్నం కావాలని వేధిస్తున్నాడని భార్య అతనిపై కేసు పెట్టింది. ఇది కోర్టులో కొనసాగుతోంది. ఇంతలో 2022 ఫిబ్రవరి నుంచి 2023 జనవరి వరకు ఆకాశ్ ఫోన్ కాల్ డేటా రికార్డ్‌ను సీఐ ఐయ్యణ్ణరెడ్డి సేకరించి వేధించారని ఆకాశ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇక ప్రస్తుత రేవ్ పార్టీ కేసులో సీఐ ఐయ్యణ్ణరెడ్డి నిర్లక్ష్యం చూపారని రూరల్ ఎస్పీ చార్జ్ మోమో ఇచ్చినట్లు తెలిసింది. -
ఏబీవీ.. ఎనీటైం బాబు వెంటే
సాక్షి, అమరావతి: ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి. ‘ఎనీటైమ్ బాబు వెంటే’ (ఏబీవీ)గా పేరు తెచ్చుకున్న ఆయన ఐపీఎస్ అధికారిగా కంటే.. టీపీఎస్ (టీడీపీ పొలిటికల్ సర్విస్) అధికారిగా పనిచేయడానికే ఎక్కడలేని ఆసక్తి చూపుతారు. చంద్రబాబు సీఎంగా ఉండగా 2014–19 వరకు ఆయన అడ్డగోలుగా చెలరేగిపోయారు. ఇష్టారాజ్యంగా అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. బంధువులు, బినామీల పేరిట అమరావతిలో భూదోపిడీకీ తెగబడ్డారు.ప్రభుత్వ అధికారిక విధుల కంటే టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారు. ముఖ్యంగా.. 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మందిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరి్పంచడంలో ఆయనదే కీలకపాత్ర. కేంద్ర భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ డేటాచోరీకి పాల్పడటం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. కొన్నేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆ అధికారి ప్రస్తుతం ఎన్నికల్లో మరోసారి టీడీపీ రాజకీయ లబ్ధికోసం సివిల్ సర్విస్ నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తున్నారు. తెలుగుదేశం తరఫున రెబల్స్‌గా బరిలో ఉన్న వారిని బెదిరిస్తూ.. టీడీపీ ఏకపక్ష వైఖరితో విసిగిపోయి కినుక వహించిన జనసేన, బీజేపీ నేతల భరతంపడుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా టీడీపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆ అధికారి బరితెగింపు ఎలాగుందంటే.. టీడీపీ రెబల్స్‌కు బెదిరింపులు.. పార్టీ కోసం పనిచేసిన నేతలకు కాకుండా లోకేశ్‌కు ముడుపులు చెల్లించుకున్న బడా బాబులకే ఈ ఎన్నికల్లో చంద్రబాబు టికెట్లు కేటాయించడంతో ఆ పారీ్టలో అసమ్మతి భగ్గుమంది. దాంతో పలువురు టీడీపీ రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోవైపు.. బీజేపీ, జనసేన పారీ్టలకు టీడీపీ అరకొరగా సీట్లు కేటాయించడంపట్ల ఆ రెండు పారీ్టల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీచేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండిపోయారు. ఈ పరిణామాలు టీడీపీ విజయావకాశాలు దెబ్బతీయడం ఖాయమని స్పష్టమైంది. దీంతో బెంబేలెత్తిన చంద్రబాబు తన నమ్మినబంటు అయిన ఆ వివాదాస్పద ఐపీఎస్ అధికారిని రంగంలోకి దించారు. ఇంకేముంది.. ఆ అధికారి టీడీపీ రెబల్స్‌గా బరిలో ఉన్న నేతలే లక్ష్యంగా బెదిరింపుల పర్వానికి దిగారు. ఉదా.. ∗ నూజివీడులో టీడీపీ రెబల్ అభ్యరి్థగా నామినేషన్ వేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తాజాగా వెనక్కి తగ్గడం వెనుక ఆ అధికారి బెదిరింపులే కారణం. సదరు అధికారి కూడా నూజివీడు నియోజకవర్గానికే చెందిన వ్యక్తే. ఈయన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో ఇటీవల రెండు మూడుసార్లు భేటీ అయ్యారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ముద్దరబోయిన తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవడం గమనార్హం. ∗ అలాగే, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీచేసి తీరుతానని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ప్రకటించారు. ఆ మేరకు ఆ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ర్యాలీలు కూడా నిర్వహించి చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆయనకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు వచి్చంది. చంద్రబాబు పిలిపించారని భావించిన రమణకు విజయవాడ వచ్చాక ఝలక్ తగిలింది.టీడీపీ తరఫున ఆ ఐపీఎస్ అధికారే రమణతో మాట్లాడినట్లు సమాచారం. నిజానికి.. 2014లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కలమట వెంకట రమణను అప్పట్లో ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరేలా వ్యవహారం నడిపింది ఈ అధికారే. అందుకే ఇప్పుడు కూడా ఆయనకే చంద్రబాబు బాధ్యత అప్పగించారు. రెబల్‌గా పోటీ చేయకూడదని, పోటీచేస్తే ఆయన ఆరి్థక మూలాలు దెబ్బతీస్తామని.. గతంలో ఎక్కడెక్కడ నల్లధనాన్ని పెట్టుబడిగా పెట్టిందీ ఆధారాలతో బయటకుతీస్తానని స్పష్టంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కలమట వెంకటరమణ పోటీచేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ∗ జగ్గయ్యపేట, గన్నవరం, జగ్గంపేట, ఎస్.కోట, విజయనగరం తదితర నియోజకవర్గాల్లో బరిలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన రెబల్ అభ్యర్థుల వద్దకూ తన అనుచరులను పంపించి బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన మనుషులను వారి వద్దకు పంపించి మరీ వారి్నంగులు ఇప్పిస్తున్నారని సమాచారం. ఆ అధికారి తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ∗ ఇక విజయవాడ పశి్చమ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి అనుకూలంగా ఆ అధికారి రంగంలోకి దిగారు. టీడీపీ అసంతృప్త నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ను తనదైన శైలిలో బెదిరించినట్లు సమాచారం. 2014లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీలో చేరడం వెనుక ఈ వివాదాస్పద అధికారే క్రియాశీలక పాత్ర పోషించారు. సుజనాచౌదరికి అనుకూలంగా ముస్లింలతో సమావేశం నిర్వహించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు ముస్లింలతో ఓ సమావేశం నిర్వహించి సుజనాకు ఓటు వేయాలని చెప్పాల్సి వచి్చందని జలీల్‌ఖాన్ సన్నిహితులే చెబుతున్నారు. కానీ, సుజనాచౌదరికి ముస్లింలు ఓటు వేసేదేలేదని కూడా వారు స్పష్టంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నుంచి వచి్చన సుజనాకు టికెట్ కేటాయించడం సంప్రదాయ బీజేపీవాదులకు తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీంతో ఆ నేతలు ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. దీన్ని గుర్తించిన ఆ అధికారి అసంతృప్త బీజేపీ నేతలతో తన స్టైల్లో మాట్లాడారు. వన్‌టౌన్‌లో దశాబ్దాలుగా వారు నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలను దెబ్బతీస్తామని హెచ్చరించారు. -
ఎల్లో బ్యాచ్ చాప్టర్ క్లోజ్.. లీగల్ యాక్షన్ కి దిగిన ఐపీఎస్‌లు
-
దుష్ప్రచారాన్ని కట్టడి చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలతోపాటు ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న పత్రికలు, మీడియా చానళ్లు నిరాధార ఆరోపణలతో తమపై చేస్తున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. కీలకమైన ఎన్నికల తరుణంలో ఐపీఎస్ అధికారులతోపాటు యావత్ పోలీసు వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పక్కా పన్నాగంతోనే ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశించి 19 మంది ఐపీఎస్ అధికారుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం ప్రతినిధులు కాంతిరాణా టాటా, రవీంద్రబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు శనివారం సమర్పించారు. ఆ వినతిపత్రంతో పాటు ఇటీవల ఐపీఎస్ అధికారులపై టీడీపీ, బీజేపీ, జనసేన అనుకూల మీడియాలో వచ్చిన 17 నిరాధారమైన వార్తా కథనాలను జత చేశారు. ఫిర్యాదులో ముఖ్యాంశాలు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలతోపాటు ఆ పార్టీలకు వత్తాసు పలుకుతున్న పత్రికలు, టీవీ చానళ్లు పక్కా కుట్రతోనే దుష్ప్రచారం సాగిస్తున్నాయి. ముందుగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేస్తారు. అనంతరం అవే ఆరోపణలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారు. వారు చేసేఆరోపణలకు ఎలాంటి ఆధారాలుండవు. కానీ పదే పదే అసత్య ఆరోపణలు చేయడం ద్వారా పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నది ఆ పా ర్టీల కుట్ర. దాంతో పోలీసు వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోంది. అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఆ ఆరోపణలను పునరుద్ఘాటిస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే పోలీసు అధికారులకు వ్యతిరేకంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థత మొదలైన నిందలు వేస్తారు. ప్రతిపక్ష పా ర్టీల ఆరోపణలను ఆ పార్టీలకు కొమ్ముకాస్తున్న పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తాయి. మీడియా చానళ్లు పదే పదే వాటినే ప్రసారం చేస్తాయి. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఆ దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తాయి. మళ్లీ మరో అసత్య ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావిస్తాయి... మళ్లీ అదే తంతు సాగుతుంది. ఇలా ఈ దుష్ప్రచారాన్ని పదే పదే కొనసాగిస్తారు. కొన్ని ప్రధానపత్రికలు, టీవీ చానళ్లు ప్రతిపక్ష పార్టీల కుట్రలో భాగస్వాములవడం దురదృష్టకరం. ఈ దుష్ప్రచారంతో గత రెండు నెలల్లోనే 30మందికి పైగా పోలీసు అధికారులు మనోవేదనకు గురయ్యారు. ఈసీ నిర్ణయాలపైనా దుష్ప్రచారం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, వాటికి వత్తాసు పలికే మీడియా పదే పదే చేస్తున్న దుష్ప్రచారం తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తోంది. ఇటీవల ఓ ఐజీ, కొందరు ఎస్పీలు, జిల్లా కలెక్టర్లను ఈసీ బదిలీ చేసింది. అనంతరం వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమిస్తూ ఈ నెల 4న ఉత్తర్వులిచ్చింది. öత్తగా నియమితులైన ఆ అధికారులు ఇంకా బాధ్యతలు తీసుకోకముందే వారికి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన అనుకూల మీడియా మళ్లీ దుష్ప్రచారం మొదలెట్టింది. ‘వీళ్లా కొత్త ఎస్పీలు ... సగానికి పైగా వైకాపా విధేయులే’అని కథనాన్ని ప్రముఖంగా ప్రచురించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. పోలీసు వ్యవస్థను నిర్విర్యం చేసే కుట్ర ఇలా రోజూ పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచారం పోలీసు వ్యవస్థ మనో స్థైర్యాన్ని, చొరవను దెబ్బతీస్తోంది. వాస్తవానికి అధికార యంత్రాంగం ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పని చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి విధులు నిర్వహిస్తోంది. కాబట్టి ఆ మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కొన్ని పరిమితులకు లోబడి వ్యవహరించాల్సి వస్తోంది. పోలీసు అధికారులు ఎన్నికల విధుల నుంచి పూర్తిగా వైదొలిగేలా చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు, వారికి కొమ్ముకాసే మీడియా కుట్ర పన్నుతోంది. వాస్తవానికి సక్రమంగా ఎన్నికల నిర్వహణ కోసం ఈసీకి విజ్ఞప్తి చేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు అందుకు విరుద్ధంగా మీడియాను అడ్డంపెట్టుకుని పోలీసు అధికారులపై దుష్ప్రచారానికే ప్రాధాన్యమిస్తోంది. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నిస్తోంది. తద్వారా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. నిబద్ధతతో పని చేస్తున్న పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి క్రియాశూన్యంగా చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేనలు కుట్ర పన్నుతున్నాయి. వారి కుట్రతో రాజ్యంగబద్ధ సంస్థలపై ప్రజల్లో సందేహాలు కలిగిస్తే సమాజంలో వైషమ్యాలు చెలరేగే ప్రమాదం ఉంది. మావోలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచి్చన నేపథ్యంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బృహత్తర బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంది. ఇంతటి కీలక తరుణంలో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకూ పోలీసు యంత్రాంగం మనోస్థైర్యం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాబట్టి పోలీసు వ్యవస్థపై జరుగుతున్న దుష్ప్రచారం కట్టడి చేయాలి. ఆ కుట్రకు పాల్పడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, ఆ పార్టీలకు వత్తాసు పలుకుతున్న పత్రికలు, టీవీ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. -
అన్నీ ఎదురుదెబ్బలే, 4 సార్లు ఫెయిల్ : సక్సెస్ చేయి అందుకుంది
అసాధారణమైన సంకల్ప శక్తి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు. బాధలనుంచే సంతోషాన్ని, సక్సెస్‌ను అందుకోవచ్చు. ఢిల్లీకి చెందిన అన్షికా జైన్ సక్సెస్ స్టోరీ చదివితే దీన్ని అక్షరాలా నిజం అంటారు. ఇంతకీ అన్షిక ఏం సాధించారో ఈ కథనంలో తెలుసుకుందాం. ఢిల్లీకి చెందిన అన్షికా అయిదేళ్ల ప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో అమ్మమ్మ , మేనమామల వద్దే పెరిగింది. వారే ఆమె జీవితంలో ప్రధానంగా మారిపోయారు. ఆమె జీవితంలో బలమైన స్తంభాలుగా నిలిచారు. ఆమె ఉన్నతికి బాటలు వేశారు. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న అన్షిక అమ్మమ్మ తాను సివిల్ సర్వెంట్ కావాలని కలగంది. కానీ అది సాకారం లేదు. అందుకే మనవరాలిని ఆ వైపు ప్రోత్సహించింది. అన్షిక కూడా అమ్మమ్మ డ్రీమ్‌ను నెరవేర్చాలని నిర్ణయించుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలోని రాంజాస్ కాలేజీలో ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత, దేశంలోని అతిపెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది అన్షికకు. కానీ ఐపీఎస్ కావాలనేది కోరికతో దానిని తిరస్కరించింది. యూపీఎస్సీ కోసం సిద్ధమవుతోంది. ఇక్కడే మరోసారి ఆమెకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2019లో తనకు పెద్ద దిక్కుగా ఉన్న అమ్మమ్మను కోల్పోయింది. ఏకైక సపోర్ట్ సిస్టమ్ మాయం కావడంతో చాలా బాధపడింది అన్షిక. కానీ అమ్మమ్మ డ్రీమ్ గుర్తు చేసుకుంది. పట్టుదలతో ప్రిపరేషన్‌ను కొనసాగించింది. నాలుగు సార్లు విజయం దక్కకపోయినా పట్టు వీడలేదు. 2020లో జస్ట్ ఒక్క నంబరులో అవకాశాన్ని కోల్పోయింది. చివరికి అయిదో ప్రయత్నంలో AIR-306 ర్యాంకు సాధించింది. అలా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ కావాలనే ఆమె కోరిక ఫలించింది. 2023, జూన్ 5 ఏఐఎస్ అధికారి వాసు జైన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అన్షిక ఐపీఎస్ కల సాకారంలో వాసు జైన్ పాత్ర కూడా చాలా ఉందిట. -
తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ : ఈ బాలీవుడ్ నటిని గుర్తు పట్టారా?
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన చాలామంది నటులను చూశాం. అలాగే అటునటులుగా, ఇటు డాక్టర్లుగా కొనసాగిన వారి గురించీ విన్నాం. కానీ యాక్టర్ నుంచి పోలీసు అధికారి కావడం గురించి విన్నారా? 2010 బ్యాచ్‌కి చెందిన ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌ను పరిచయం చేసుకుందాం.. రండి..! ఆకర్షణీయమైన ఎంటర్ టైన్మెంట్ రంగంనుంచి ఐపీఎస్ అధికారిగా మారింది ప్రముఖ బాలీవుడ్ నటి సిమల ప్రసాద్. సంకల్పం, పట్టుదల ఉంటే చాలా నిరూపించారు. ఐఏఎస్ అధికారి భగీరథ్ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి మెహ్రున్నీసా పర్వేజ్‌ల కుమార్తె సిమల ప్రసాద్. నటిని కావాలన్న ఆశయంతో బాలీవుడ్లో నటిగా అడుగు పెట్టిన తర్వాత కూడా తన మరో లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు. (రణపాలతో ఆరోగ్య ప్రయోజనాలు : పేరులోనే ఉంది అంతా!) భోపాల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ చదువు, ఆ తరువాత కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నృత్యం, నటనపై ఆసక్తిని పెంచుకుంది. మరోవైపు తండ్రి ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ, సివిల్ సర్వీస్ మార్గంవైపు చూడలేదు. నటనపై ఆసక్తితో “అలిఫ్”, “నక్కష్” మూవీల్లో అవకాశాలను దక్కించుకున్నారు. ఈ క్రమంలో “అలీఫ్” సినిమాలో షమ్మీ పాత్రకు గాను విమర్శకులు ప్రశంసలు దక్కాయి. అలా నటి కావాలనే ఆమె కల నెరవేరింది. ఇలా నటనను కొనసాగిస్తూనే భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారామె. (గర్ల్ ఫ్రెండ్ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!) తరువాత మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అలా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదా వరించింది. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ కావడం కూడా ప్రారంభించింది. ఇక్కడితో ఆమె ఆగిపోలేదు. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షపై దృష్టిపెట్టారు. అంతేకాదు తొలిప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్ లేకుండానే పరీక్షలో విజయం సాధించి ఐపిఎస్ అధికారిణి కావడం విశేషం. -
TGO అధ్యక్షురాలు మమతకు షాక్..బదిలీ వేటు.!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపైనే దృష్టి సారించిన కొత్త ప్రభుత్వం రాజధాని నగరంలో కీలకమైన జీహెచ్ఎంసీలోనూ బదిలీలు చేపట్టింది. అడిషనల్ కమిషనర్‌గా పని చేస్తున్న జె.శంకరయ్యను ఇప్పటికే టీఎస్టీఎస్ ఎండీగా పంపించిన సర్కారు... తాజాగా కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు జోనల్ కమిషనర్లను బదిలీ చేసింది. వారి స్థానంలో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీంతో గ్రేటర్‌లోని ఆరు జోన్లకుగాను మూడు జోన్లలో ముగ్గురు జోనల్ కమిషనర్లు మహిళలే కావడం గమనార్హం. ఎన్నాళ్లకు.. ఎట్టకేలకు.. ఇప్పటి వరకు తాను కోరుకున్న ప్రాంతాల్లో తప్ప ఎక్కడికీ కదలబోననే విధంగా వ్యవహరించిన కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం)కు బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఇటీవల జీహెచ్ఎంసీకి బదిలీపై వచి్చన అభిలాష అభినవ్‌ను కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. మరో ఐఏఎస్ అధికారి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ (రెవెన్యూ,ఐటీ)గా ఉన్న స్నేహ శబరీ ను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా మార్చారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా జీహెచ్ఎంసీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న బి.శ్రీనివాసరెడ్డిని ఆయన మాతృసంస్థ అయిన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్‌కు బదిలీ చేశారు. ► వీరితో పాటు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ)లో ఎస్ఈగా ఉన్న వెంకటరమణను మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఆర్డీసీ)కు బదిలీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఊహించినట్లుగానే దీర్ఘకాలికంగా జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న వారిని, డిప్యుటేషన్‌పై వచ్చి కీలక స్థానాల్లో ఉన్నవారిని ప్రభుత్వం బదిలీ చేసింది. వీరి ని పంపించేందుకు సమయం పట్టవచ్చనే అభిప్రాయాలు వెలువడినప్పటికీ జాప్యం లేకుండా బదిలీలు చేసింది. త్వరలోనే మరికొన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది. అంతర్గత బదిలీలు సైతం ఎన్నికల స్పెషలాఫీసర్‌గా పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ వై. శ్రీనివాసరెడ్డిని ఫలక్‌నుమా డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా నియమించారు. అక్కడ డీసీగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న లావణ్యను ఫలక్‌నుమా ఏఎంసీగా అక్కడే ఉంచారు. సంతోష్ నగర్ డీసీగా ఉన్న వి.నరసింహను కుత్బుల్లాపూర్ డీసీగా బదిలీ చేశారు. కుత్బుల్లాపూర్ డీసీ ఎ. నాగమణిని సంతోష్ నగర్ డీసీగా బదిలీ చేశారు. డీసీ (ఫైనాన్స్)గా ఉన్న ఎల్.శ్రీలతను చారి్మనార్ డీసీగా బదిలీ చేశారు. చారి్మనార్ డీసీగా ఉన్న ఢాకు నాయక్‌ను కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మరిన్ని మార్పులు.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో త్వరలోనే పలు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అధికారుల బదిలీలతో పాటు పనుల్లోనూ మార్పులు చోటు చేసుకునే వీలుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో స్పష్టత వచ్చాక ఆమేరకు మార్పులు జరగనున్నాయి. మున్సిపల్ పరిపాలన శాఖను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మూసీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. నగరానికి సంబందించి మొదటి సమీక్ష సమావేశాన్ని ఈ నది గురించే నిర్వహించడం.. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షలోనూ మూసీని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. -
నల్లగొండ ఎస్పీగా చందనాదీప్తి
నల్లగొండ క్రైం: జిల్లా ఎస్పీ అపూర్వరావు బదిలీ అయ్యారు. ఆమెను ప్రభుత్వం సీఐడీ ఉమెన్ ప్రొటక్షన్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అపూర్వరావు 2023, జనవరి 26న నల్లగొండలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న చందనాదీప్తిని ప్రభుత్వం నియమించింది. 2012 బ్యాచ్‌కు చెందిన చందనా దీప్తి ట్రెయినీ ఐపీఎస్‌గా నల్లగొండ జిల్లాలో విధులు నిర్వహించారు. ఇక్కడి రాజకీయ, ఆర్థిక, సామాజిక, నేరాలపై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. ట్రెయినీ ఐపీఎస్‌గా నల్లగొండలో విధులు చందనాదీప్తి 1983లో వరంగల్‌లో జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో సాగింది. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేశారు. సివిల్స్ వైపు దృష్టి సారించి హైదరాబాద్‌లోని కోచింగ్ తీసుకుని రెండో ప్రయత్నంలో ఐపీఎస్ ర్యాంకు సాధించారు. ఐపీఎస్‌గా సెలక్ట్ అయ్యాక నల్లగొండలో ట్రెయినీ ఐపీఎస్‌గా విధులు నిర్వహించారు. తర్వాత తాండూరు ఏఎస్పీగా, నిజామాబాద్ ఓఎస్డీగా, మెదక్ ఎస్పీగా, నార్త్ జోన్ డీసీపీగా విధులు నిర్వహించారు. మెదక్ ఎస్పీగా ఉన్న సమయంలో ‘ఆస్క్ మెదక్ ఎస్పీ’ పేరుతో ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేసుకుని ఆ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. చిట్యాల పోలీస్స్టేషన్లోనూ.. చిట్యాల : నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా బదిలీపై వచ్చిన చందనాదీప్తి మూడు నెలల పాటు చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో కొంతకాలం ఐపీఎస్ ట్రెయినీ విధుల్లో భాగంగా ఎస్ఐగా విధులను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ ముఠా సమాచార కమిషనర్ ఫేక్ ఐడీకార్డులు సృష్టించి కార్ల నంబర్ ప్లేట్లపై సమాచార కమిషనర్‌గా పేర్లతో రాసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద ఉచితంగా వెళ్తున్న వాహనాలను అప్పట్లో ఆమె పట్టి వేశారు. అనంతరం ఫేక్ ఐడీ కార్డులు సృష్టించిన ముఠా సభ్యులను పట్టుకుని కేసులు నమోదు చేశారు. -
HYD: మాజీ ఐఏఎస్ భన్వర్‌లాల్ ఇంటిని ఖాళీ చేసిన ఐపీఎస్ నవీన్ కుమార్
సాక్షి, హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్‌లాల్ ఇంటిని ప్రస్తుతం ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఖాళీ చేయించారు. తన ఇల్లుని ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని, ఐపీఎస్ అధికారి నవీన్‌పై భన్వర్‌లాల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. భన్వర్‌లాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీసీఎస్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో వివాదాస్పదంగా మారిన ఇంటిని నవీన్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. చదవండి: హైదరాబాద్: రిటైర్డ్ IASకు ప్రజెంట్ IPS టోకరా! కేసు వివరాలు ఏంటంటే.? IAS అధికారిగా సుదీర్ఘ కాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన భన్వర్‌లాల్ 2017లో రిటైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు. జూబ్లీహిల్స్‌లో భన్వర్‌లాల్‌కు ఓ భవంతి ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో అద్దె ఒప్పందం చేసుకున్నారు. దీని కాల పరిధి అయిదు సంవత్సరాలు. ఈ రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం భన్వర్‌లాల్ జూబ్లిహిల్స్‌లోని తన నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్ల కోసం అద్దెకు ఇచ్చారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా.. ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్ లాల్ ఆరోపణ. భన్వర్ లాల్ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు? 2019 తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి IPS అధికారి నవీన్‌కుమార్ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరమీదికి వచ్చాయి. ఈ డాక్యుమెంట్లు తమ ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ తరహాలో రూపొందించిన నకిలీ పత్రాలని భన్వర్‌లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ కలిసి తయారు చేశారని, వీటికి IPS అధికారి నవీన్‌కుమార్ సహకరించారన్నది భన్వర్ లాల్ ఆరోపణ. పోలీసులు ఏం చేశారు? భన్వర్‌లాల్ ఆరోపణలతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. డాక్యుమెంట్లను విచారించి అవి ఫేక్ అని తేల్చారు. డిసెంబర్ 22న ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన ఐపీఎస్ అధికారి నవీన్‌కుమార్ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లను రూపొందించి భన్వర్‌లాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు. IPS అధికారి నవీన్‌కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ అకాడమీలో గత ఆరేళ్లుగా తన సేవలను కొనసాగిస్తున్న నవీన్ కుమార్.. గతంలో వికారాబాద్‌లో ఎస్పీగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డీసీపీగా విధులు నిర్వహించారు. ఆయన ఆచూకీని తెలుసుకున్న పోలీసులు ఇవ్వాళ అదుపులోకి తీసుకున్నారు.గత నెల 17 న భన్వర్ లాల్ భార్య మనీలాల్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అరెస్టులు ఈ నెలలో జరిగాయి. -
సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్
ఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్ నియమితులయ్యారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఆమె.. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ ప్రత్యేక డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ప్రత్యేక డైరెక్టర్ రాహుల్ రస్గోత్రాను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కొత్త డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం నియమించింది. ఈయన మణిపూర్ క్యాడర్‌కు చెందిన 1989-బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుత ఐటీబీపీ చీఫ్ అనీష్ దయాళ్ సింగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈయన చాలా కాలం పాటు దేశ అంతర్గత భద్రత, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(IB)కోసం పనిచేశారు. డిసెంబర్ 11న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై దయాళ్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వివేక్ శ్రీవాస్తవను ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
హైదరాబాద్: రిటైర్డ్ IASకు ప్రజెంట్ IPS టోకరా!
సాక్షి, హైదరాబాద్: IPS అధికారి నవీన్ కుమార్‌ను సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు (CCS) అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి పోలీసులు IPS అధికారి నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు ఏంటంటే.? IAS అధికారిగా సుదీర్ఘ కాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన భన్వర్‌లాల్ 2017లో రిటైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు. జూబ్లీహిల్స్‌లో భన్వర్‌లాల్‌కు ఓ భవంతి ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో అద్దె ఒప్పందం చేసుకున్నారు. దీని కాల పరిధి అయిదు సంవత్సరాలు. ఈ రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం భన్వర్‌లాల్ జూబ్లిహిల్స్‌లోని తన నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్ల కోసం అద్దెకు ఇచ్చారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా.. ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్ లాల్ ఆరోపణ. భన్వర్ లాల్ కుటుంబ సభ్యులు ఏం ఆరోపిస్తున్నారు? 2019 తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి IPS అధికారి నవీన్‌కుమార్ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరమీదికి వచ్చాయి. ఈ డాక్యుమెంట్లు తమ ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ తరహాలో రూపొందించిన నకిలీ పత్రాలని భన్వర్‌లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ కలిసి తయారు చేశారని, వీటికి IPS అధికారి నవీన్‌కుమార్ సహకరించారన్నది భన్వర్ లాల్ ఆరోపణ. పోలీసులు ఏం చేశారు? భన్వర్‌లాల్ ఆరోపణలతో రంగంలోకి దిగిన CCS పోలీసులు.. డాక్యుమెంట్లను విచారించి అవి ఫేక్ అని తేల్చారు. డిసెంబర్ 22న ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన IPS అధికారి నవీన్‌కుమార్ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లను రూపొందించి భన్వర్‌లాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు. IPS అధికారి నవీన్‌కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ అకాడమీలో గత ఆరేళ్లుగా తన సేవలను కొనసాగిస్తున్న నవీన్ కుమార్.. గతంలో వికారాబాద్‌లో SPగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో DCPగా విధులు నిర్వహించారు. ఆయన ఆచూకీని తెలుసుకున్న పోలీసులు ఇవ్వాళ అదుపులోకి తీసుకున్నారు. గత నెల 17 న భన్వర్ లాల్ భార్య మనీలాల్ CCS పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అరెస్టులు ఈ నెలలో జరిగాయి. నన్ను టార్గెట్ చేసి కేసు పెట్టారు: నవీన్‌కుమార్ తనను టార్గెట్ చేసి కేసు పెట్టారని, 41 సీఆర్పీసీ నోటీసు ఇచ్చారని నవీన్‌కుమార్ తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న సివిల్ వివాదంలో పోలీసులు కలుగ జేసుకుంటున్నారని, త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని నవీన్‌కుమార్ అన్నారు. రిమాండ్ రిపోర్ట్ ఇదీ చదవండి: ప్రజాభవన్: ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. సీఐ సస్పెండ్ -
ఆమ్రపాలి మన ఆడపడుచే!
ఒంగోలు: ఆమ్రపాలి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులోని నరసాపురం అగ్రహారం ఆమె స్వగ్రామం. దీనిని స్థానికంగా అగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తారు. రైల్వే గేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది ఎన్.అగ్రహారం గ్రామం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమ్రపాలి ఒంగోలు వాసికావడం గర్వకారణం. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి 39వ ర్యాంక్ సాధించి, ఐఏఎస్‌లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. తండ్రి కాటా వెంకటరెడ్డి ఫ్రొఫెసర్.. ఎన్.అగ్రహారానికి చెందిన ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు. మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. పద్మావతి స్వగ్రామం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. ఆయన చిన్నతనంలో ఎలిమెంటరీ విద్య ఆలకూరపాడు పాఠశాలలోనే జరిగింది. హైస్కూలు విద్య టంగుటూరు, ఇంటర్మీడియేట్, డిగ్రీ సీఎస్ఆర్ శర్మ కళాశాలలో, పీజీ విద్య విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటీలో పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో ఎకనమిక్స్ ఫ్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఎన్.అగ్రహారంలో ఉంది. కుటుంబమంతా ఉన్నతాధికారులే.. ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి కూడా ఐఆర్ఎస్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపికయిన ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి ప్రస్తుతం కర్ణాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. మానస గంగోత్రి 2007 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఐఆర్ఎస్లో 184వ ర్యాంక్ సాధించింది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్. తమిళనాడు ఐఏఎస్ కేడర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఉమెన్ వెల్ఫేర్‌లో డైరెక్టర్‌గా చేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉపెన్నికకు రెండు సార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అమ్రపాలి భర్త ఐపీఎస్ అమ్రపాలికి 2018 ఫిబ్రవరి 18న తేదీన వివాహం జరిగింది. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన షమీర్ శర్మ జమ్మూ పట్టణానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్సీగా పనిచేస్తున్నాడు -
తెలంగాణాలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు: కొత్త ఎస్పీలు, కమిషనర్లు
సాక్షి, హైదరాబాద్:తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పోస్టుల నియామకాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. పది జిల్లాలకు కొత్త ఎస్పీలు, వరంగల్, నిజమాబాద్‌కు కొత్త కమిషనర్ల నియామకం జరిగింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలీకేరి, మేడ్చల్ కలెక్టర్గాగౌతం, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా క్రిస్టినా నియమితులయ్యారు. అలాగే వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా , నిజామాబాద్ కమిషనర్‌గా కల్మేశ్వర్‌ని ఎంపిక చేశారు. కాగా రానున్న తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈసీ ఏకంగా 20 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా నలుగురు జిల్లాల కలెక్టర్ల, 13 మంది IPS అధికారులను బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీల నివేదికను పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రతిపాదిక జాబితా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈసీకి పంపగా ఇందులోని పలువురి పేర్లను ఖరారు చేసింది. పోలీసు కమిషనర్లు, ఎస్పీల జాబితా వివరాలు ►సంగారెడ్డి - చెన్నూరి రూపేష్ ►కామారెడ్డి- సింధు శర్మ ►జగిత్యాల- సన్‌ప్రీత్ సింగ్ ►మహబూబ్ నగర్ - హర్షవర్ధన్ ►నాగర్ కర్నూల్- గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ►జోగులాంబ గద్వాల్- రితిరాజ్ ►మహబూబాద్ - డాక్టర్ పాటిల్ సంగ్రామ్ ►నారాయణపేట - యోగేష్ గౌతమ్ ►జయశంకర్ భూపాలపల్లి - ఖరే కిరణ్ ప్రభాకర్ ►సూర్యాపేట- బీ.కే.రాహుల్ హెడ్గే ►వరంగల్ పోలీసు కమిషనర్-అంబర్ కిషోర్ ఝా ►నిజామాబాద్ పోలీసు కమిషనర్ -కల్మేశ్వర్ సింగేనేవర్ -
మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి రాకేష్ బల్వాల్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మైతేయి, కుకీ వర్గాల మధ్య మొదలైన హింసాత్మక ఘర్షణలు నాలుగు నెలలుగా కొనసాగుతూనేన్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. కోట్ల విలువైన ఆస్తులు కాలి బూడిదయ్యాయి. తాజాగా జూలైలో కనిపించకుండా పోయిన మైతేయి వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైనట్లు ఫోటోలు బయటకు రావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాష్ట్రంలోని విద్యార్థులు ఘటనకు నిరసనగా ఇంఫాల్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ బల్వాల్ను మణిపూర్‌కు రప్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న రాకేష్ బల్వాల్ను.. తన సొంత కేడర్ అయిన మణిపూర్‌కు బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అల్లర్ల కట్టడి కోసం దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా మరింత మంది అధికారుల అవసరాన్ని పేర్కొంటూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన చేసిన దాదాపు ఒక నెల తర్వాత క్యాబినెట్ నియామకాల కమిటీ దీనిని ఆమోదించింది. ఎవరీ రాకేష్ బల్వాల్? రాకేశ్ బల్వాల్‌మణిపుర్ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మణిపుర్ కేడర్‌లో ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2018లో ఎన్ఐఏలో ఎస్పీగా పదోన్నతి పొంది నాలుగేళ్లపాటు పనిచేశారు. 2019లో పుల్వామా లో జరిగిన భీకర ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ బృందంలో రాకేశ్ సభ్యుడిగా ఉన్నారు. అనంతరం 2021 డిసెంబరులో పదోన్నతిపై AGMUT (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాలు) కేడర్‌కు బదిలీ అయ్యారు. జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గత కొన్నిరోజులుగా మణిపుర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన తిరిగి సొంత కేడర్ పంపించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. మరోవైపు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దాదాపు రాష్ట్రమంతటా AFSPA చట్టం పరిధిని విస్తరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ మెబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. అక్టోబర్ 1 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కోయంబత్తూరు డీఐజీ ఆత్మహత్య
చెన్నై: తమిళనాడులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కోయంబత్తూరుకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫోలీస్ (డీఐజీ) విజయ్ కుమార్ ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని డీఐజీ అధికారిక నివాసంలో శుక్రవారం ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్ర మానసిక ఒత్తిడితోనే విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఆయన మృతికి గల కారణలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా 45 ఏళ్ల విజయ్ కుమార్ రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని క్వార్టర్స్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గన్ పేలిన శబ్దం విన్న ఆయన ఇంటి భద్రతా సిబ్బంది.. వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే విజయకుమార్ తీవ్ర డిప్రెషన్లో ఉన్నారని, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నారని, అతన్ని కుటుంబాన్ని కొన్ని రోజుల క్రితమే చెన్నై నుంచి కోయంబత్తూరుకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి. చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు కాగా విజయ్ కుమార్ 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. ఈ ఏడాది జనవరిలో కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ముందు కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూర్లకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా(ఎస్పీ) అన్నానగర్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. డీఐజీ ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రిత్వ శాఖ అధిపతి అయిన సీఎం.. ట్విటర్లో స్పందిస్తూ ‘ పోలీస్ అధికారి విజయకుమార్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతి గురయ్యాను. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించింది. జిల్లా ఎస్పీతోపాటు హా వివిధ హోదాల్లో పనిచేసిన విజయ్ కుమార్ మరణం తమిళనాడు పోలీస్ శాఖకు తీరని నష్టం. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’అని పేర్కొన్నారు. ఉన్నది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
‘పవర్’ఫుల్ ఐపీయస్ ఆఫీసర్
మనం సాంకేతికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 70 సంవత్సరాల నూర్జహాన్ ఇంట్లో ఒక్కసారి కూడా బల్బ్ వెలగలేదు. ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు. విషయం తెలిసిన ఐపీయస్ ఆఫీసర్ అనుకృతిశర్మ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ఇంటికి కరెంట్ తీసుకు వచ్చింది. బామ్మ కళ్లలో వెలుగులు నింపింది. ఆ ఇంట్లో బల్బ్ వెలగడమే కాదు ‘మీరు చల్లగా ఉండాలి’ అంటున్నట్లుగా ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. దీంతో బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అనుకృతిని ఆలింగనం చేసుకొని స్వీట్లు పంచింది. ‘ఆమె ముఖంలో కనిపించిన సంతోషం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకృతి. అనుకృతి శర్మ దయాహృదయానికి నెటిజనులు జేజేలు చెప్పారు. ‘బామ్మ ఇంట్లోనే కాదు జీవితంలోనూ వెలుగులు నిండాలి’ అంటూ కామెంట్స్ పెట్టారు. -
RAW అధిపతిగా రవి సిన్హా నియామకం
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రవి సిన్హాను భారత నిఘా విభాగమైన రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(RAW) అధిపతిగా ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయానికి ‘నియామకాలపై కేంద్ర మంత్రుల కమిటీ’ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం రా చీఫ్‌గా పని చేస్తున్న సమంత్ కుమార్ గోయెల్ పదవీకాలం జూన్ 30, 2023న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో రా అధిపతిగా సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రవి సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రెటేరియట్ స్పెషల్ సెక్రెటరీగా ఉన్నారు. సిన్హా గత ఏడేళ్లుగా ‘రా’ ఆపరేషనల్ విభాగంలో సేవలు అందిస్తున్నారు. కాగా విదేశాల్లో అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను ‘రా’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. Ravi Sinha, IPS (CG:88) to be the new Secretary, Research & Analysis Wing. pic.twitter.com/vEr3hfokZJ — ANI (@ANI) June 19, 2023 చదవండి: పరువుహత్య చేసి.. బండరాళ్లు కట్టి మొసళ్లకు మేతగా పడేశారు -
సీబీఐ నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ సూద్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు కర్ణాటక డీజీపీగా పనిచేశారు. సీబీఐ డైరెక్టర్ గురించి మరిన్ని విషయాలు ► 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్, నిన్నటివరకు కర్ణాటక డీజీపీగా సేవలందించారు. ► సీబీఐ కొత్త డైరెక్టర్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ► ప్రవీణ్ సూద్ ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత UPSC ద్వారా IPS సర్వీసులోకి వచ్చారు. ► కర్ణాటక పోలీస్ శాఖలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. ► 1989లో మైసూరు ఏఎస్పీగా బాధ్యతలు, అనంతరం బళ్లారి, రాయచూరు ఎస్పీగా, ఆ తర్వాత బెంగళూరు డీసీపీగా పని చేశారు. ► 1999లో డిప్యుటేషన్ మీద మారిషస్ లో మూడేళ్ల పాటు పనిచేశారు. ► 2004-2007 మధ్య మైసూరు కమిషనర్ గా పని చేశారు. ► ఆ తర్వాత కర్ణాటక హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, అడిషనల్ డీజీపీగా, రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గానూ వ్యవహరించారు. ► ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద CBI (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఏర్పాటు అయింది కాబట్టి ఆ చట్టం 4A కింద డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ► ప్రవీణ్ సూద్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సూద్ అల్లుడే టీం ఇండియా క్రికెట్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్. ► ప్రవీణ్ సూద్ పలు విశిష్ట పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. సంవత్సరం పురస్కారం 1996 చీఫ్ మినిస్టర్ గోల్డ్ మెడల్ 2002 పోలీస్ మెడల్ 2006 ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ 2011 ప్రిన్స్ మైఖైల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు 2011 నేషనల్ e-గవర్నెన్స్ గోల్డ్ మెడల్ -
హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదు
హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఐపీఎస్ అధికారి కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు హంగామా చేసిందన్న ఆరోపణలతో ఆమెపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్కేఆర్ ఎన్క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసముంటున్నారు. అదే అపార్ట్మెంట్లోని టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ తన స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి నివాసం ఉంటున్నారట. అయితే ఐపీఎస్ అధికారి కారు పార్క్ చేసే స్థలంలో డింపుల్, ఆమె స్నేహితుడు తమ బీఎండబ్ల్యూ కారును పెట్టడంతోపాటు పలుమార్లు గొడవకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. డీసీపీ వాహనానికి ఉన్న కవర్‌ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్లను కాలితో తన్నడం వంటివి చేశారు. ఇదే క్రమంలో ఈ నెల 14న డీసీపీ వాహనాన్ని డింపుల్ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు కారును కాలితో తన్నుతూ వీరంగం సృష్టించింది. ఇదేంటని ప్రశ్నించిన డ్రైవర్‌తోనూ గొడవకు దిగింది. ఇదే విషయంపై డింపుల్, ఆమె స్నేహితుడు విక్టర్ డేవిడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలె డింపుల్ గోపీచంద్‌తో కలిసి రామబాణం అనే సినిమాలో నటించింది. -
‘ఐపీఎస్ కావాలన్నది నాన్న కల. అందుకే ఇష్టంతో కష్టపడి సాధించా’
పట్నంబజారు(గుంటూరు): ‘నేను ఐపీఎస్ కావాలన్నది నాన్న కల. అందుకే ఎంతో ఇష్టంతో కష్టపడి ఐపీఎస్ సాధించా.’ అని గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) నిచికేత్ షలేకే చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బాల్యం, చదువు మా తల్లిదండ్రులు విశ్వనాథ్, చంద్రసేన ఇద్దరూ ఉపాధ్యాయులే. మేము ఇద్దరం సంతానం. నేను పెద్దవాడిని. తమ్ముడు సివిల్ ఇంజినీర్. మహారాష్ట్రలోని పూణే సమీపంలోని ప్రింళై మా స్వగ్రామం. అక్కడ దగ్గర పట్ణణంలోనే నా చదువు అంతా పూర్తయింది. నా చిన్నప్పటి నుంచే నేను ఐపీఎస్ కావాలని నాన్న కలలు కనేవారు. ఐపీఎస్‌కు సిద్ధం ఇలా.. ఐపీఎస్ కోసం ఎంతో కష్టపడ్డాను. మా గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళి చదువుకునేవాడిని. ముందు రెండుసార్లు సివిల్స్‌కు యత్నించి విఫలమయ్యాను. అయినా పట్టుదల విడిచి పెట్టలేదు. కచ్చితంగా ఐపీఎస్ సాధించి తీరాలని 2019లో ప్రయత్నించి సెలెక్ట్ అయ్యాను. ఎక్కడెక్కడ పనిచేశానంటే.. ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాక కొద్ది రోజుల పాటు అకాడమీ, ఒడిశాల్లో శిక్షణ పొందాను. విధులు, బాధ్యతల గురించి తెలుసుకున్నాను. తొలి పోస్టింగ్ ఇక్కడే నాకు తొలి పోస్టింగ్ గుంటూరులోనే రావడం ఆనందంగా ఉంది. గుంటూరు ఈస్ట్ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టా. నేరాల నియంత్రణకు కృషి చేస్తా. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాం. చోరీల నియంత్రణకు చర్యలు చేపడతాం. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం. ప్రజలు నన్ను నేరుగా కలవచ్చు. నా కార్యాలయంలో నిత్యం అందుబాటులో ఉంటా. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. -
ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్.. హైకోర్టులో రూపకు ఊరట.. ఆ ఆంక్షలు రద్దు
యశవంతపుర: ఐఏఎస్ అధికారి డి.రోహిణి సింధూరిపై ఐపీఎస్ అధికారి డి.రూప పరువు నష్టం కలిగించే ప్రకటనలను చేయరాదని కింది కోర్టు విధించిన ఆంక్షలను హైకోర్టు రద్దు చేసింది. తన వాదనలను వినకుండా ఆంక్షలను విధించారని రూప దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస హరీశ్‌కుమార్ ధర్మాసనం ఈ మేరకు రద్దు చేసింది. కింది కోర్టు స్టే విధించిన తరువాత రోహిణి సింధూరి ఆ కోర్టులో సమర్పించిన పత్రాలను రూపకు అందించాలి. కానీ స్పీడ్ పోస్టులో పంపాం, స్టేని కొనసాగించాలని రోహిణి కోరారు. నోటీసులు పంపకుండా ఆంక్షలను అమలు చేస్తే అవి దానంతట అవే రద్దవుతాయని రూప తరఫున న్యాయవాది వాదనలు చేశారు. ఏమిటీ కేసు నెలన్నర కిందట రోహిణి సింధూరి వ్యక్తిగత ఫోటోలను రూప సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తీవ్రమైన ఆరోపణలు చేయడం తెలిసిందే. తరువాత ఇద్దరి మధ్య ప్రకటనల యుద్ధం నడిచింది. పత్రికలు, టీవీ చానెళ్లలో పతాక శీర్షికలకెక్కారు. దీంతో ప్రభుత్వం ఆగ్రహించి ఇరువురికీ ఏ బాధ్యతలు ఇవ్వకుండా బదిలీ చేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఐపీఎస్ రూపకు అనుకూలం అయ్యింది. -
ఐపీఎస్ రూపా Vs ఐఏఎస్ రోహిణి: కాల్ లీక్ ప్రకంపనలు.. ఆ ఆడియోలో ఏముంది?
బనశంకరి(కర్ణాటక): ఐపీఎస్ రూపా మౌద్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి మధ్య గత ఆదివారం నుంచి తలెత్తిన సంగ్రామం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది. వివాదం నేపథ్యంలో వారిద్దరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా సర్కారు బదిలీ చేయడం తెలిసిందే. కాల్ లీక్ ప్రకంపనలు తాజాగా రూపా మౌద్గిల్– సామాజిక కార్యకర్త గంగరాజు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. ఇందులో రూపా తీవ్ర ఆరోపణలు చేయడం ఉంది. కబిని వద్ద ఒక స్థలం డీల్ చేయడానికి భూ రికార్డుల కోసం రోహిణి సింధూరి నా భర్త, ఐఏఎస్ మౌనీశ్ వద్ద సమాచారం తీసుకుందని రూపా ఆ ఆడియోలో చెప్పారు. రూపా గతంలో చేసిన ఆరోపణలను మళ్లీ ఈ కాల్లో ప్రస్తావించారు. ఆడియో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే సారా మహేశ్ కేసును వెనక్కి తీసుకోవడానికి రాజీకోసం హెచ్డీ.కుమారస్వామి, హెచ్డీ.దేవేగౌడ, ఇద్దరు ఐఏఎస్‌ల ద్వారా రోహిణి ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెప్పారు. అంతేగాక ఆడియోలో గంగరాజుపైన రూపా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఆమెను సపోర్టు చేస్తున్నారా, నువ్వు ఫైల్ పట్టుకుని పదేపదే ఆమె వద్దకు వెళ్లడం తప్పా ఏముంది, కాల్ రికార్డు చేసుకుంటావా, చేసుకో, నాకు వచ్చే కోపానికి.. అంటూ అసభ్య పదజాలంతో దూషించడం రికార్డయింది. మైసూరులో ఆడియో విడుదల ఐపీఎస్ రూపాతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను బుధవారం మైసూరులో సామాజిక కార్యకర్త గంగరాజు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గొడవ మరింత జఠిలమయ్యే సూచనలే ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఆడియో హాట్ టాపిక్‌గా మారింది. రోహిణి సింధూరి ఆమె పరిచయాలను ఉపయోగించుకుని భర్త అన్నను బీజేపీలోకి చేర్చాలని చూస్తోంది అని ఆడియోలో రూపా పేర్కొన్నారు. తన భర్త మౌనీశ్ తీరుపైనా, కుటుంబ వ్యవహారాలపైనా రూపా ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రూపా నన్ను పావుగా వాడాలని చూశారు. ఈ సందర్భంగా మీడియాతో గంగరాజు మాట్లాడుతూ ఐపీఎస్ రూపా నాపై కోపంతో మాట్లాడారు. నాతో 25 నిమిషాలు మాట్లాడారు. రోహిణి సింధూరికి వ్యతిరేకంగా పోరాటం కోసం నన్ను ఉపయోగించుకునేందుకు ఆమె యత్నించారు. నాకు ఫోన్ చేసి భూ వ్యవహారాల గురించి సీబీఐ అధికారిలా ప్రశ్నించారు, రూపా నా మొబైల్ నుంచి ఫోటో తీసుకుని, వాట్సాప్ చాట్‌ను ఎమ్మెల్యే సా.రా మహేశ్‌కు పంపించారు. చదవండి: ఐపీఎస్ రూపా మౌద్గిల్‌ను కట్టడి చేయండి నన్ను అసభ్య పదజాలంతో మాట్లాడారు. రోహిణి అక్రమాల గురించి నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, మీడియా వద్ద వాటి గురించి మాట్లాడు అని చెప్పగా అందుకు నేను నిరాకరించానని ఆయన చెప్పారు. నా కుటుంబానికి ఏమైనా అయితే రూపానే కారణం. అధికారం మాటున ఆమె ఏమైనా చేయొచ్చని ఆయన ఆరోపించారు. ఆమె నా రాకపోకలను, కార్యకలాపాలపై నిఘా వేశారు, రూపాపై క్రిమినల్ కేసు వేస్తా అన్నారు. -
ఐపీఎస్ రూపా మౌద్గిల్‌ను కట్టడి చేయండి
బెంగళూరు: కర్ణాటకలో ఐపీఎస్ అధికారి రూపా మౌద్గిల్, ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి మధ్య సమరం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో వారిని ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దిరికీ పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. తన గురించి తప్పుడు ప్రచారం చేయకుండా, సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టకుండా నిషేధం విధించాలని కోరుతూ రోహిణి సింధూరి బెంగళూరులోని సిటీ సివిల్, సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఆమె తన పిటిషన్లో రూపా మౌద్గిల్‌తోపాటు 60 మంది పేర్లను ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. రూపా మౌద్గిల్‌ను, సోషల్ మీడియాను కట్టడి చేసేలా ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేయాలని రోహిణి తరపు న్యాయవాది కోరారు. సర్వీసు రూల్స్ ప్రకారం రోహిణి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారని, పోలీసులకు కూడా ఫిర్యాదు సమర్పించారని న్యాయస్థానం గుర్తుచేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
Karnataka: ఇద్దరు ఆఫీసర్లకూ ఝలక్
బెంగళూరు: కర్ణాటక మహిళా అధికారుల వివాదం ప్రభుత్వ జోక్యంతో సరికొత్త మలుపు తిరిగింది. ఇద్దరు మహిళా అధికారిణిలకు అక్కడి ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండానే.. ఇద్దరినీ బదిలీ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తక్షణమే ఈ బదిలీలు అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. బదిలీకి ముందుదాకా.. రూప కర్ణాటక హస్త కళల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఇక సింధూరి ఏమో ధర్మాధయ శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ బహిరంగ విమర్శలు చేసుకోవడం తెలిసిందే. మరోవైపు రూప భర్త మునీష్ మౌద్గిల్ ఐఏఎస్ అధికారి కాగా, ఆయన్ని పబ్లిసిటీ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది ప్రభుత్వం. వీళ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ, చర్యల తర్వాత పోస్టింగ్ విషయంలో ఒక స్పష్టత రావొచ్చని సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి వ్యక్తిగత విమర్శలతో ప్రజలనే కాదు.. ప్రభుత్వాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆదివారం ఫేస్బుక్లో.. రూపా, రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను ఉంచడంతో వ్యవహారం మొదలైంది. తన వ్యక్తిగత జీవితాన్ని రచ్చకీడ్చిందంటూ రూపపై రోహిణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మరోవైపు రూప, రోహిణిపై అవినీతి విమర్శలు చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరి వ్యవహారంపై సీఎం బసవరాజ్ బొమ్మై కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎస్ ద్వారా నివేదిక తెప్పించుకున్న ఆయన.. ఇద్దరిపై చర్యలు తప్పవనే సంకేతాలను నిన్ననే(సోమవారం) అందించారు. -
రూపా Vs రోహిణి.. ఇక ఊరుకోం, కళ్లు మూసుకుని కూర్చోలేదు, చర్యలు తప్పవు!
సాక్షి, బెంగళూరు: ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్– ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మధ్య మాటల పోట్లాట సోమవారం సర్కారు వద్దకు చేరింది. రోహిణిపై రూపా ఫేస్బుక్ ద్వారా రెండురోజులుగా తీవ్రమైన ఆరోపణల పరంపరను సాగించారు. రోహిణి కూడా ప్రత్యారోపణలు చేశారు. రూపా మానసిక వైద్యం చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ యంత్రాంగానికి రెండు కళ్ల వంటి ఐపీఎస్– ఐఏఎస్ అధికారులు, అందులోనూ ఇద్దరూ మహిళలు దూషణలకు దిగడంతో ప్రభుత్వం ఆలస్యంగానైనా మేలుకుంది. వారిద్దరినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మ సోమవారం విధానసౌధకు వేర్వేరుగా పిలిపించి వివరణలు తీసుకున్నారు. ఇకపై నోరు మెదపరాదని ఆదేశించినట్లు తెలుస్తోంది. రూపావన్నీ తప్పుడు ఆరోపణలు: రోహిణి సీఎస్‌ను కలిసిన తరువాత ఐఏఎస్ రోహిణి విధానసౌధ బయట మీడియాతో మాట్లాడారు. రూపా గురించి సీఎస్‌కు 4 పేజీల ఫిర్యాదు లేఖను అందజేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా, మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసి సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించిన ఐపీఎస్ అధికారి రూపామౌద్గిల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె నా వ్యక్తిగత జీవితంపై మాట్లాడింది, నేను సోషల్ మీడియాలో చురుకుగా లేను. వ్యక్తిగత ఆరోపణలు పట్ల నా భర్త మాట్లాడారని రోహిణి చెప్పారు. జాలహళ్లిలో ఉన్న ఆస్తి గురించి రూపా ప్రస్తావించారు, ఆ ఆస్తి నా భర్త తల్లికి చెందినదని, తమది కాదని పేర్కొన్నారు. సీఎస్‌ను కలిపిన రూపా ఐపీఎస్ అధికారి రూపా మౌద్గిల్ కూడా సీఎస్ వందితా శర్మను కలిసి వివరణ ఇచ్చారు. ఐఏఎస్ రోహిణి సింధూరి అవినీతి అక్రమాలకు పాల్పడిందని రూపా ఫిర్యాదు చేశారు. రోహిణిపై లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఫేస్బుక్లో తెలిపారు. ఐపీఎస్‌కు ఎంపీ మద్దతు ఐపీఎస్ అధికారిణి డి.రూపా అడిగిన ప్రశ్నలు నైతికంగా సరైనవేనని, వాటికి రోహిణి, ఆమె బంధువులు సమాధానం ఇవ్వాలని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు. మైసూరులో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రతాప్ సింహా మాట్లాడుతూ చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది కోవిడ్ బాధితులు మరణించారని, ఆ ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా చేసే బాధ్యత మైసూరు జిల్లాధికారిదని అన్నారు. ఆ సమయంలో జిల్లాధికారిగా ఉన్న రోహిణి సింధూరి దీనికి పూర్తి బాధ్యత వహించాలని, ఆమె బదులివ్వాలని అన్నారు. ఇక ఊరుకోం: న్యాయమంత్రి ఇద్దరు అధికారులూ ఇలాగే పరస్పర దూషణలకు దిగితే చర్యలు తప్పవని న్యాయ మంత్రి మాదుస్వామి విధానసౌధలో తెలిపారు. ఇప్పటివరకు వ్యక్తిగత విషయం అని ఊరుకున్నామని, విధానసౌధ వరకు వచ్చింది కాబట్టి ఇక మేము ఊరుకునేదిలేదని, ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధానసౌధ వద్ద మీడియా ముందుకు వస్తున్న ఐఏఎస్ రోహిణి సింధూరి వదిలిపెట్టేది లేదు: రోహిణి ఈ విషయాన్ని వదిలిపెట్టేదిలేదని రోహిణి హెచ్చరించారు. వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేయడం తగదు, ఏదైనా ఉంటే ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఈ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదు, అన్ని చర్యలకూ సిద్దంగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రొఫెషనల్‌గా మాట్లాడాలి కానీ పర్సనల్‌గా కాదన్నారు. రూప నాపై దుష్పచారం చేయడం తప్పు, చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటానని తెలిపారు. గెట్ వెల్ సూన్ అని కౌంటర్ ఇచ్చారు. ఇద్దరిపైనా చర్యలు తప్పవు: హోంమంత్రి జ్ఞానేంద్ర ఐపీఎస్– ఐఏఎస్‌ల గొడవను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. వారి వ్యవహారంపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేదని, చర్యలు తీసుకుంటామని, ఇద్దరు అధికారురూ హద్దుమీరి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి వ్యక్తిగత విషయం ఏమైనా చేసుకోని, కానీ మీడియా ముందు బహిరంగంగా మాట్లాడటం సరికాదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజాసేవకులని, కానీ వారు ఆ హోదాలకు అవమానం చేశారని ఆయన అన్నారు. సీఎస్, డీజీపీ తో మాట్లాడానని, సీఎం బొమ్మై సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చట్టపరంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. -
వ్యక్తిగత ఫొటోల దుమారం.. సర్కార్ సీరియస్
బెంగళూరు: కర్ణాటకలో ఇద్దరు ఉన్నతాధికారిణులు.. ప్రస్తుతం ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇద్దరు అధికారిణులు ఇలా బహిరంగంగా విమర్శలకు దిగడంపై కర్ణాటక ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇద్దరిపై చర్యలకు సిద్ధమని ప్రకటించింది ప్రభుత్వం. ‘సామాన్యులు కూడా ఇంతంగా విమర్శించుకోరు. వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం ఉన్నా.. మీడియా ముందు ఇలా ప్రవర్తించడం సరికాదు. వారి ప్రవర్తనపై చర్యలు తీసుకుంటాం’ అని కర్ణాటక హోంశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ముఖ్యమంత్రి బొమ్మైతో పాటు పోలీస్ చీఫ్‌తోనూ చర్చించింది హోం శాఖ. ఇదిలా ఉంటే.. ప్రస్తుత ఘర్షణ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సింధూరి భర్త వెల్లడించారు. గతంలో జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్యే మహేశ్‌తో.. ఒక రెస్టారెంట్లో రోహిణీ సింధూరి దిగిన చిత్రం వైరల్ అయింది. ఒక ఐఏఎస్ అధికారిణికి రాజకీయ నాయకుడిని కలవాల్సిన అవసరం ఏముందని ఆ సమయంలో ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్ ప్రశ్నించారు. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసింది. ఇక ఆదివారం సింధూరికి చెందిన వ్యక్తిగత ఫొటోలను, రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలనే గతంలో రోహిణి పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేశారని రూపా ఆరోపించారు. ఈ ప్రవర్తనతో వృత్తి పరమైన నియమాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. 2021 నుంచి 2022 మధ్య ఈ చిత్రాలను ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేసినట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే అవినీతి ఆరోపణలూ చేశారు. దీనిపై తాను ముఖ్యమంత్రి బొమ్మై, ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ ఆరోపణలపై రోహిణి ఘాటుగా స్పందించారు. రూపా తనపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా పరువుకు భంగం కలిగించేందుకు ఆమె నా సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ స్క్రీన్షాట్లను సేకరించారు. నేను వీటిని కొందరికి పంపినట్లు ఆమె అంటున్నారు. ఆ వ్యక్తులెవరో చెప్పాలని కోరుతున్నాను. మానసిక అనారోగ్యం అనేది పెద్ద సమస్య. వైద్యుల సహకారంతో దానిని తగ్గించాల్సిన అవసరం ఉంది. బాధ్యాతయుతమైన స్థానంలో ఉన్నవారు ఆ అనారోగ్యం పాలైతే.. అది మరింత ప్రమాదకరం’ అని మండిపడ్డారు. అలాగే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం రూప.. కర్ణాటక హస్త కళల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌గా సింధూరి విధులు నిర్వర్తిస్తున్నారు. -
ఐపీఎస్ రూపా Vs ఐఏఎస్ రోహిణి.. అసలు ఎందుకీ వివాదం?
బనశంకరి/ శివాజీనగర(కర్ణాటక): కన్నడనాట మహిళా ఐఏఎస్, మహిళా ఐపీఎస్ మధ్య సోషల్ మీడియా యుద్ధం తీవ్రంగా సాగుతోంది. ఐఏఎస్ రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఐపీఎస్ డి. రూపా మౌద్గిల్ ఫేస్బుక్లో తీవ్ర విమర్శలతో ఆదివారం పలు పోస్ట్‌లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూపా ప్రస్తుతం హోంగార్డ్స్ ఐజీగా ఉండగా, రోహిణి సింధూరి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌గా ఉన్నారు. నాకు ఏజీ ఎందుకు వాదించలేదు? గతేడాది మైసూరు కలెక్టర్‌గా పనిచేసిన రోహిణి సింధూరి బదిలీ సమయంలో క్యాట్‌లో కేసు వేయగా, ఆమె తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదించి సహకరించారని, కన్నడిగులైన తమలాంటి వారికి ఎందుకు ఇటువంటి వెసులుబాటు ఇవ్వలేదని రూపా ప్రశ్నించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో అనేక ఫోటోలను, సుదీర్ఘమైన వాదనలను పోస్ట్ చేశారు. తాను 3 సంవత్సరాల కిందట యాదగిరిలో పనిచేసి, బెంగళూరుకు బదిలీ అయినప్పుడు మరో అధికారి క్యాట్‌లో కేసు వేస్తే అప్పుడు నా తరఫున ఏజీ ఎందుకు వాదించలేదు అన్నారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను ఇతర ఐఏఎస్‌లకు పంపించారని, ఇది సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించడమేనని, ఇంకా అనేక ఆరోపణలను రూపా సంధించారు. మానసిక వైద్యం చేయించుకో: రోహిణి ఆగ్రహం ఐపీఎస్ రూప నా ప్రైవేటు పోటోలు విడుదల చేయడం పై న్యాయపోరాటం చేస్తానని ఐఏఎస్ రోహిణి సింధూరి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రూపా తనపై దుష్పప్రచారం సాగిస్తోందని ధ్వజమెత్తారు. రూపా మౌద్గిల్ మతి స్థిమితం కోల్పోయిందని రోహిణి మండిపడ్డారు. ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తపనతో ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆమెపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. నేను వ్యక్తిగత ఫొటోలను ఎవరికి పంపించాను అనేది ఆమె బహిరంగపరచాలని, బాధ్యతాయుత స్థానంలో ఉంటూ ఇష్టానుసారం నా ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిందని దుయ్యబట్టారు. కాగా, ఈ వ్యవహారం రాష్ట్ర పాలనా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: ఎస్ఐ పాడుపని.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కాలేజీ అమ్మాయి -
తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. ఐఏఎస్ హోదా పొందిన వారిలో.. కాత్యాయని, చెక్కా ప్రియాంక నవీన్ నికోలస్, కోరం అశోక్ రెడ్డి, బడుగు చంద్రశేఖర్ రెడ్డి, వెంకటనరసింహ రెడ్డి, అరుణ శ్రీ, హరిత, కోటా శ్రీవాస్తవా, నిర్మల కాంతివేస్లీ ఉన్నారు. ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ మరోవైపు తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పరిపాలన డీసీపీగా యోగేశ్ గౌతమ్, సీఐడీ ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. పీసీఎస్ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్ డీసీపీగా రాఘవేందర్‌రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీశ్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గత జనవరిలోనూ రాష్ట్రవ్యాప్తంగా 91 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: Telangana: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే! -
శెభాష్.. ఒకేసారి ఇద్దరు మహిళా డీజీపీలు
ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహిళా శక్తి గురించి తెలిసినప్పుడు ఒక కొత్త ఊపిరి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడా ఊపిరిని, ఉత్సాహాన్నీ రెట్టింపు చేస్తూ పంజాబ్‌లో ఒకేసారి ఇద్దరు మహిళలు డీజీపీలుగా పదోన్నతులు పొందారు. మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచారు. పంజాబ్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) స్థాయికి పదోన్నతి పొందిన ఏడుగురు పోలీసు అధికారుల పేర్లను హోం వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఆ ఏడుగురు అధికారుల్లో ఇద్దరు మహిళా ఐపీఎస్‌లు గౌరవప్రదమైన పాత్రను కైవసం చేసుకున్నారు. శశిప్రభ ద్వివేది, గురుప్రీత్ కౌర్ ఇద్దరు మహిళలు ఇలా ఒకేసారి డీజీపీలుగా పదోన్నతులు పొందడం ఇదే మొదటిసారి. ఈ పదోన్నతులు ఇప్పుడు పంజాబ్ పోలీసు ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న అధికారుల సంఖ్యకు సంబంధించి అత్యంత శక్తిమంతమైన శక్తులలో ఒకటిగా మారడానికి మార్గం సుగమం చేశాయి. గురుప్రీత్ కౌర్ డియో 1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అదే సంవత్సరం అధికారిగా నియమితులయ్యారు. గురుప్రీత్ ఇటీవల పదోన్నతి పొందిన బ్యాచ్‌లో అత్యంత సీనియర్ అధికారి. పంజాబ్ పోలీస్‌లో భాగమైన మొదటి మహిళా ఐపీఎస్ అధికారి. గతంలో మహిళా వ్యవహారాలను కవర్ చేసే బాధ్యతలు, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాను కలిగి ఉన్న కమ్యూనిటీ వ్యవహారాల విభాగానికి బాధ్యత వహించారు. చీఫ్ ఆఫ్ డ్రగ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (క్రైమ్)గా, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడిషనల్ డీజీపిగా పనిచేశారు. తన పదోన్నతిపై ఆమె స్పందిస్తూ ‘డీజీపీగా పనిచేసే అవకాశం లభించినందుకు ఆనందం’గా ఉందన్నారు. శశిప్రభ ద్వివేది అడిషనల్ ఛార్జ్ ఆఫ్ మోడర్నైజేషన్ (రైల్వేస్) అడిషనల్ డిజిపిగా పదోన్నతి పొందిన ద్వివేది 1993 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు. 1994లో ఆమె« విధుల్లో చేరారు. 2021లో పంజాబ్ లోక్‌పాల్ ఏడీజీపీగా నియమితులయ్యారు. ఆగస్టు 2022లో ద్వివేది గౌరవ వందనం స్వీకరించి, పోలీసుల పాసింగ్ ఔట్ పరేడ్‌ను పరిశీలించారు. ఏడీజీపీగా ఆమె ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌కు అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా జవాన్లందరిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ‘నిజాయితీగా, నిర్భయంగా విధులు నిర్వర్తించాలని, చట్టాన్ని గౌరవించాల’ని ఆమె సూచించారు. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగాన్ని ఎత్తిచూపుతూ, దశాబ్దాలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్ రాకెట్‌ను అంతమొందించేందుకు తగిన కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. -
పోలీస్ అకాడమీ సంచాలకుడిగా సందీప్ బాధ్యతలు
బండ్లగూడ: రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడామీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ శాండిల్య.. అకాడమీ సంచాలకుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య ఈనెల 3న జరిగిన పోలీస్ ఉన్నతాధికారుల బదిలీల ఉత్తర్వులను అనుసరించి రైల్వే, రోడ్ సేఫ్టీ విభాగం నుంచి బదిలీపై వచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. -
నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు
న్యూఢిల్లీ: నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా ఢిల్లీలో మకాం వేసిన శ్రీనివాస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ మోసాలు చేస్తున్నట్లు సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సీబీఐ, ఈడీ కేసులను సెటిల్మెంట్లు చేయిస్తానని వసూళ్లు చేసినట్లు తెలిపింది. ఢిల్లీలోని తమిళనాడు, మధ్యప్రదేశ్ భవన్లను అడ్డగా చేసుకొని ఈ దందాలకు పాల్పడినట్లు వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రాజకీయ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఢిల్లీలో పనులు చక్కబెట్టి కోట్లలో రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే నకిలీ అధికారిపై పలు కేసులు నమోదు కాగా.. ఏపీసీ 419, 420 కింద కేసులు నమోదు చేసింది. గత నెల 26న సీబీఐ ఏసీబీ వింగ్ శ్రీనివాస్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చదవండి: సీబీఐ విచారణకు హాజరైన మంత్రి గంగుల సీబీఐ సీనియర్ ఆఫీసర్నని చెప్పి యూసుఫ్ గూడకు చెందిన మేలపాటి చెంచునాయుడిని మోసం చేసినట్లు తెలిపింది. అలాగే ఢిల్లీలో వినయ్ హాండా కుమారుడికి సీబీఐలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు పేర్కొంది. మార్గానా వెంకటేశ్వర రావు, రవికి చెందిన 2000 వాహనాలను ఢిల్లీలో నో ఎంట్రీ స్థలంలోకీ అనుమతించేలా పోలీసులతో మాట్లాడాతానని పైసలు వసూలు చేసినట్లు వెల్లడించింది. పనులు చేయడానికి ప్రభుత్వ అధికారులకు ఖరీదైన బహుమతులు ఇవ్వాలంటూ బాధితుల వద్ద భారీ ఎత్తున డబ్బు దండుకున్నట్లు తెలిపింది. కాగా సీబీఐ అధికారిగా చలామణీ అవుతూ పనులు చేయిస్తానని చెప్పి అనేకమంది దగ్గర డబ్బులు దండుకుంటున్న శ్రీనివాస్‌ని మూడు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని చినవాల్తేరు కిర్లంపూడికి కు చెందిన ఇతన్ని ఢిల్లీలోని తమిళనాడు భవన్ల్ సీబీఐ అధికారులు అతుపులోకి తీసుకున్నారు. ఐపీఎస్ అధికారినని, సీబీఐ ప్రధాన కార్యాలయంలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నానని చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతుండటంతో అధికారులు అతన్ని పట్టుకున్నారు. -
దోపిడికి గురయ్యాను కాపాడాలంటూ ఎమర్జెన్సీ కాల్! తీరా చూస్తే...
ఉన్నతాధికారులు తమ కింద స్థాయి ఉద్యోగులు పనితీరును గమనించడం, పరీక్షించడం షరా మాములే. ఐతే అలాంటి సమయంలో కింద స్థాయి ఉద్యోగులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. ఇక్కడోక ఐపీఎస్ అధికారి స్థానిక పోలీసులు పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆమె ఏం చేసిందో వింటే షాక్ అవుతారు. వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి చారు నిగామ్ మారువేషంలో సన్‌గ్లాస్ ధరించి సాయుధ దోపిడికి గురయ్యానంటూ పోలీసుల ఎమర్జెన్సీ నెంబర్‌కి కాల్ చేసింది. తాను ఒక నిర్జన రహదారిపై ఉన్నానని కాపాడండి అంటూ పోలీసులను వేడుకుంది. దీంతో జౌరయ్య పోలీస్టేషన్‌లోని ముగ్గురు పోలీసులు వెంటనే స్పందించి... హుటాహుటిన ఆమె ఉండే ప్రదేశానికి వచ్చి ఆమెను విచారించి సత్వరమే తనిఖీలు చేయడం మొదలు పెట్టారు. తనను ఇద్దరు సాయుధ వ్యక్తులు దోచుకున్నారంటూ ఫేక్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. పాపం పోలీసుల సుమారు ఒక గంట పాటు ఆ ప్రాంతంలో ముమ్మరంగా విచారణ చేస్తుంటారు. ఐతే మారువేషంలో ఉన్న ఐపీఎస్ వారి పనితీరు అంతా గమనిస్తూ అకస్మాత్తుగా మీ పనితీరు బాగానే ఉందంటూ కితాబ్ ఇచ్చింది. అంతే ఒక్కసారిగా పోలీసులకు అసలేం జరుగుతుందో మొదటగా ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె తమ పై అధికారి అని తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ మేరకు జౌరయ్య పోలీసులు ఆ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. जनपदीय पुलिस के रिस्पांस टाइम व सतर्कता को चेक करने हेतु पुलिस अधीक्षक औरैया @ipsCharuNigam ने स्वयं की पहचान छुपाते हुए सुनसान रोड पर तमंचे के बल पर बाइक सवार अज्ञात व्यक्तियों द्वारा झूठी लूट की सूचना कंट्रोल रूम व डायल112 पर दी गयी जिसमे जनपदीय पुलिस की कार्यवाही संतोषजनक रही। pic.twitter.com/I4n3yJoUHP — Auraiya Police (@auraiyapolice) November 3, 2022 (చదవండి: ఎంత క్రూరం! చిన్నారిని కాలితో తన్నాడు.. మరి జనం ఊరుకుంటారా?) -
వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీసు అధికారి రాజీనామా
న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్, కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్‌ను పక్కా ప్రణాళికలతో మట్టుబెట్టిన ఐపీఎస్ మాజీ అధికారి కే విజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సంబంధిత హోంశాఖ అధికారులకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన విజయ్ కుమార్.. ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నట్లు వెల్లడించారు. ‘వ్యక్తిగత కారణాలతో హోంశాఖలో నిర్వర్తిస్తున్న నా బాధ్యతలకు స్వస్తి చెప్పి.. ప్రస్తుతం చెన్నైకి మారాను.’ అని విజయ్ కుమార్ తెలిపారు. మరోవైపు.. హోంశాఖ భద్రతా సలహాదారుగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, సహకారం అందించిన హోంశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఆయన సలహాలు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానే ఉపయోగపడ్డాయని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 1975 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విజయ్ కుమార్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ హోదాలో 2012లో పదవీ విరమణ చేశారు. అనంతరం హోంశాఖ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు గవర్నర్‌కు భద్రతా సలహాదారుగా విజయ్‌కుమార్‌ను కేంద్రం నియమించింది. అంతకుముందు తమిళనాడులో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్‌గా పని చేశారు. ఆ సమయంలోనే 2004లో పక్కా ప్రణాళికతో కిల్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టారు. చెన్నై పోలీస్ కమిషనర్‌గానూ, జమ్ముకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ ఐజీగానూ విజయ్‌కుమార్ విధులు నిర్వర్తించారు. ఇదీ చదవండి: పుష్పపై ‘ఫైర్’.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి.. -
స్టీఫెన్ రవీంద్రకు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్టు చేసిన రాఘవేంద్రరాజు, అమరేంద్రరాజు, రవి, మధుసూదన్ లు హత్యాయత్నం అనేది బూటకమని పేర్కొంటూ లోయర్‌కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను కొట్టివేయమని కోరుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పేట్ బషీరాబాద్ సీఐ ఎస్.రమేశ్ హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. లోయర్‌కోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చారు. విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేశారు. -
ఫుట్ పాత్ పైకి వచ్చిన ట్రక్.... రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం: వీడియో వైరల్
ఎప్పడూ ఎలాంటి ఘోరం జరుగుతుందో చెప్పలేం. మనం సురక్షితమైన ప్రదేశంలో ఉన్నప్పటకీ విధిరాత బాగోకపోతే ఏదైన జరగవచ్చు. మనకి భూమ్మీద ఆయుషు ఉంటే ఎంతటి ఘోరమైన ప్రమాదం నుంచే అయినా బయటపడవచ్చు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి పెద్ద పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి ఫుట్ పాత్ పై నిలబడి ఉండగా అనుహ్యంగా ఒక ట్రక్ అతనిపైకి దూసుకుపోతుంది. ఆ ట్రక్ చాలా ప్రమాదకరంగా అతని పైకి దూసుకుపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏం కాలేదు. ఆ వ్యక్తి ట్రక్కు గేట్ మధ్య ఇరుక్కుపోయాడు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ దీపాంశు కబ్రా ఈ వీడియోని ట్విట్టర్లో పోస్టు చేశారు. ఐతే ఈ వీడియో పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించడం విశేషం. Life is Sooooooo unpredictable! pic.twitter.com/tFZQ1kJf74 — Dipanshu Kabra (@ipskabra) July 7, 2022 (చదవండి: రెస్టారెంట్‌పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్) -
ఆయనకు ఆ స్కాంలో రూ.కోట్ల వాటా!
శివాజీనగర: పోలీస్ నియామక విభాగపు చీఫ్‌గా ఏడీజీపీ అమృత్ పాల్ నియమితులయ్యాక ఎస్ఐ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. ఇందులో కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవాలని ఆయన కుట్ర పన్నారని సీఐడీ విచారణలో తేలింది. ఈ స్కాంలో అమృత్‌పాల్‌ను మూడురోజుల కిందట అరెస్టు చేయడం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ప్రధాన నిందితులు, అభ్యర్థుల నుంచి వసూలు చేసిన సొమ్ములో అమృత్ పాల్‌కు కోట్లాది రూపాయల వాటా అందినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. సీఎంకు సిద్దు సవాల్ కాంగ్రెస్ సర్కారు హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాల అక్రమాలను విడుదల చేస్తానని సీఎం బసవరాజ బొమ్మై చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పందిస్తూ ఆధారాలుంటే విచారణ జరపాలని సవాల్ చేశారు. బుధవారం బెంగళూరులో మాట్లాడుతూ సీఎం ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆ సమయంలో బొమ్మై ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, అక్రమాలు జరిగాయని తెలిసినపుడు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. -
ఎస్ఐ స్కాం: అవును, బ్లూటూత్ వాడాను
బనశంకరి: బ్లూటూత్ పరికరం ఉపయోగించి పరీక్షలో సమాధానాలు రాశాను. ఇందుకోసం రూ. 40 లక్షలను ముట్టజెప్పాను అని ఎస్ఐ పోస్టుల స్కాంలో పట్టుబడిన అభ్యర్థి సునీల్ చెప్పాడు. అతన్ని సీఐడీ అధికారులు విచారించగా అక్రమాలను బయటపెట్టాడు. ఆర్డీ పాటిల్ బ్లూటూత్ పరికరం ద్వారా సమాధానాలు చెప్పాడని, ఇందుకోసం రూ.40 లక్షలు తీసుకున్నాడని సునీల్ చెప్పాడు. ఈ పరీక్షలో సునీల్ ఉత్తీర్ణుడు కావడం గమనార్హం. అదనపు డీజీపీపై బదిలీ వేటు ఎస్ఐ ఉద్యోగాల భర్తీలో భారీ కుంభకోణం ఐపీఎస్‌లకు ఇబ్బందిగా మారింది. పోలీస్ నియామక విభాగం అదనపు డీజీపీ అమృత్‌పౌల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఆంతరిక భద్రత విభాగానికి పంపించింది. ఇందుకు స్కామే కారణమని సమాచారం. త్వరలో మరికొందరు ఐపీఎస్‌లనూ బదిలీ చేయవచ్చని సమాచారం. అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు ఇటీవల మైసూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కర్ణాటక విశ్వవిద్యాలయం జియాగ్రఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్ ను బుధవారం మల్లేశ్వరం పోలీసులు అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే అరెస్టైన గెస్ట్ లెక్చరర్ సౌమ్య విచారణలో ఇచ్చిన సమాచారంతో నాగరాజ్‌ను అరెస్టుచేశారు. (చదవండి: ఎస్ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం) -
ఐపీఎస్ అధికారి సూట్ కేస్ చూసి షాక్ తిన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది!
Airport Security Opens IPS Officer Suit Case: నిజానికి చాలా పన్నీ ఇన్సిడెంట్లను చూస్తే కాస్త ఆశ్చర్యంగానూ, కామెడిగానూ ఉంటుంది. పైగా కొంతమంది అమాయకంగా చేస్తారో లేక సరదాగా చేస్తారో తెలియదు గానీ కొన్ని ఇషయాలు చాలా ఫన్నీగా ఉంటాయి. అచ్చం అలాంటి ఘటనే జైపూర్‌లో చోటు చేసుకుంది. వివారల్లోకెళ్తే.. జైపూర్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఒక ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా సూట్‌కేస్‌ని తెరిచి చూపించాల్సిందిగా కోరారు. భద్రతా దృష్ట్యా విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది బ్యాగ్‌లను ఓపెన్ చేయమని చెబుతుంటారు. ఆ విధంగా ఆ ఐపీఎస్ అధికారి సూట్‌కేస్‌ని ఓపెన్ చేయమని అడిగారు. అయితే అరుణ్ బోత్రా తన సూట్ కేస్ ఓపెన్ చేయగానే సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అక్కడంతా ఒకేటే నవ్వులు. ఇంతకీ ఆ సూట్‌కేస్‌లో ఏమున్నాయంటే పచ్చి బఠాణిలు. సూట్‌కేస్ మొత్తం బఠాణిలతో నిండి ఉంది. అయితే ఆయన ఆ బఠాణిలను కిలో రూ.40 చొప్పున కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన" జైపూర్ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది నా బ్యాగ్‌ని ఓపెన్ చేయమన్నారు" అనే క్యాప్షన జోడించి మరీ ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలతోపాటు జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్లైన్లో తెగ వైరల్‌గా మారింది. Security staff at Jaipur airport asked to open my handbag 😐 pic.twitter.com/kxJUB5S3HZ — Arun Bothra 🇮🇳 (@arunbothra) March 16, 2022 (చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో చైనా.. ఈసారి ఏం చేసిందంటే..?) -
రోగికి డ్యాన్స్ స్టెప్లతో ఫిజియోథెరఫీ వ్యాయామాలు!: వైరల్ వీడియో!
రోగులు తమ అనారోగ్యాన్ని మరిచిపోయేలా డాకర్లు కౌన్సిలింగ్‌లు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. పేషంట్ మరీ నిరాశ నిస్పృహలకు లోనైతే వాళ్లకు ప్రత్యేకంగా మానసికనిపుణుల పరివేక్షణలో ఉంచి చికిత్స అందిచడం వంటివి చేస్తారు. కానీ వాటన్నింటికి భిన్నంగా పక్షవాతం వచ్చిన రోగిని ఉత్సాహపరిచేందుకు నర్సు డ్యాన్స్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకెళ్తే... ఆ వీడియోలో నర్సు పక్షవాత రోగికి వినూత్న పద్ధతిలో కొన్ని ఫిజియోథెరపీ వ్యాయామాలు చేసేలా సహాయం చేసింది. నర్సు అతనికి కొన్ని డ్యాన్స్ స్టెప్పులు చూపుతున్నప్పుడు రోగి మంచం మీద పడుకుని ఉన్నాడు. అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాట కూడా ప్లే అవుతుంటుంది. అయితే పేషంట్ నర్సు స్టెప్పులను అనుకరించటానికి ప్రయత్నించాడు. వీడియో చివర్లో ఆమె రోగికి తన చేతులతో చేతి కదలిక వ్యాయామాలు చేయడంలో కూడా సహాయపడుతుంది. దీంతో ఆ పేషంట్ ముఖంలో నవ్వు చిగురించడమే కాకుండా తను కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ తనకు తెలియకుండానే చచ్చుబడిన అవయవాలను కదిపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఫిజియోథెరపీ సెషన్లో రోగికి సహాయం చేస్తున్న నర్సును ఆయన ప్రశంసించారు. नर्स ने बड़ी चतुराई से डांस करते हुए लकवाग्रस्त मरीज़ में उमंग और उत्साह भरकर फिजियोथेरेपी एक्सरसाइज करवा दी. मरीज़ जब ठीक हो जाते हैं, तो सभी डॉक्टर्स को धन्यवाद देते हैं. लेकिन नर्सेस और अन्य मेडिकल स्टाफ अपने प्रेम से जो इलाज करते हैं, उसके लिए 'धन्यवाद' बेहद छोटा शब्द है... pic.twitter.com/dLvXZVgfgh — Dipanshu Kabra (@ipskabra) January 24, 2022 -
చలికాలంలో ‘ఫన్నీ’ స్నానం.. వీడియో వైరల్
శీతాకాలంలో సాధారణంగా స్నానం చేయడానికే ఇష్టపడరు కొంతమంది! పైగా చన్నీటి స్నానం అంటే ఆమడ దూరం పరిగెడతారు. అలాంటి చలికాలంలో చలిని తప్పించకుంటూ చన్నీటి స్నానం చేసే ట్రిక్కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకెళ్తే.. ఆ వీడియోలో ఒక వ్యక్తి నది లేదా చెరువులో స్నానం చేస్తున్నట్లు కనిపించింది. అయితే ఆ వ్యక్తి చలిని తప్పించుకునే నిమిత్తం ముందు ఒక పెద్దప్లేటులో చలిమంట ఏర్పాటు చేసుకున్నాడు. నదిలో ఒక మునక వేస్తూ గజగజ వణికిపోతున్నాడు. మళ్లీ తన ముందున్న చలిమంట వైపు చేతులు చాచి చలి కాచుకుంటూ మళ్లీ ఇంకో మునక.. ఇలా ఫన్నీ ఫన్నీగా స్నానం చేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోకి ‘మై ఇండియా ఈజ్ గ్రేట్... ప్రామిసింగ్ ఇండియా’ అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ‘ఇది చన్నీటి ట్రిక్’ అని ఒకరు, మరోకరేమో ‘భారతీయులను ట్రిక్స్‌లో ఎవరూ ఓడించలేరు’ అంటూ రకరకాలుగా ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. Mera Bharat Mahaan.....☺️😊 होनहार भारत.....☺️☺️😊😊😊😊 pic.twitter.com/Ixnq5H1YY3 — Rupin Sharma (@rupin1992) January 11, 2022 (చదవండి: సెల్ఫీలతో మిలీనియర్ అయిన స్టూడెంట్.. ఎలా ఎదిగాడో తెలుసా?) -
ఆర్తిసింగ్ ఐపీఎస్..ఎంటరైతే చాలు..కాకలు తీరిన క్రిమినల్స్ గజగజ వణకాల్సిందే
దేశంలో దాదాపు అన్ని పోలీస్ కమిషనరేట్లలో దాదాపు అందరూ మగ అధికారులే కమిషనర్లు. సినిమాల్లో కూడా హీరోయే పోలీస్ కమిషనర్. కాని ఆర్తి సింగ్ ఈ సన్నివేశాన్ని మార్చింది. మహారాష్ట్రలోని అమరావతికి కమిషనర్‌గా చార్జ్ తీసుకుంది. ప్రస్తుతం దేశంలో ఈమె ఒక్కతే మహిళా పోలీస్ కమిషనర్. రావడంతోటే స్ట్రీట్ క్రైమ్‌ను రూపుమాపాలనుకుంది. ఎస్.. నేను చేయగలను అంటున్న ఆర్తి సింగ్ పరిచయం. 2009. దేశానికి ఎలక్షన్లు. కీలకమైన సమయం. మరోవైపు మావోయిస్టులు తమ కదలికలను పెంచారు. మహారాష్ట్రలోని ‘రెడ్ కారిడార్’ అయిన గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన దాడిలో 17 మంది పోలీసులు చనిపోయారు. ఆ సమయంలో అక్కడ గట్టి పోలీస్ ఆఫీసర్ అవసరం. మావోయిస్టుల దాడులను నిరోధించేందుకే కాదు ఎలక్షన్లు సజావుగా జరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలి. కాని చార్జ్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో పై అధికారులకు తట్టిన ఒకే ఒక్క పేరు ఆర్తి సింగ్. ఆమె 2006 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్. పెద్దగా అనుభవం లేదు. పైగా మహిళా ఆఫీసర్. ‘ఆమె ఏమి చేయగలదు’ అని గడ్చిరోలి ప్రాంతంలోని సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్లు అనుకున్నారు. కాని ఆమె చార్జ్ తీసుకున్నాక వారంతా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ సమయంలో ఆమె మావోయిస్టుల కదలికలను నివారించడమే కాదు... ఎలక్షన్లను బహిష్కరించండి అన్న వారి పిలుపును గెలవనీకుండా గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ జరిగేలా చూసింది. అందుకే ఆమె పోలీసుల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందింది. అందరూ మూడు నుంచి ఆరు నెలల కాలం చేసి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్లిపోయే చోట ఆమె మూడు సంవత్సరాలు పని చేసింది. ‘నేను చేయగలను అనుకున్నాను. చేశాను’ అంటుంది ఆర్తి సింగ్. ఆమె ఆ కాలంలో చాలా ఆయుధాల డంప్‌ను స్వాధీనం చేసుకుంది. అందుకే ఆమె ట్రాన్స్ఫర్ అయి వెళుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్మానం చేసి అవార్డులు ఇచ్చి పంపాయి. అదీ ఆర్తి సింగ్ ఘనత. ఆడపిల్ల పుడితే ఏంటి? ఆర్తి సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్. ఆ ప్రాంతంలో ఆడపిల్లల్ని కనడం గురించి స్త్రీలు వివక్ష ఎదుర్కొంటున్నా ఆర్తి కుటుంబంలో అలాంటి వివక్ష ఏదీ ఉండేది కాదు. ఆర్తి ఎంత చదవాలన్నా చదువుకోనిచ్చారు. ‘మా నాన్న సపోర్ట్ చాలా ఉంది’ అంటుంది ఆర్తి. ఆమె బెనారస్ హిందూ యూనివర్సిటీలో మెడిసిన్ చేసి డ్యూటీ డాక్టర్‌గా పని చేస్తున్నప్పుడు గైనకాలజీ వార్డ్‌లో ఆమెకు తల్లులు అందరి నుంచి ఎదురయ్యే ఒకే ఒక ప్రశ్న ‘ఆడిపిల్లా? మగపిల్లాడా?’– ఆడపిల్ల పుడితే వాళ్ల ముఖాలు మాడిపోయేవి. ‘ఆ పరిస్థితి చాలా విషాదం. తల్లిదండ్రులు ఆడపిల్లలను కాకుండా మగపిల్లలను ఎందుకు కోరుకుంటారంటే వారిని రక్షించలేమేమోనన్న ఆందోళనే. అందుకు వారు ఎన్నుకునే ఉపాయం. పెళ్లి. పెళ్లి చేసేస్తే ఆడపిల్ల సేఫ్ అనుకుంటారు. దాంతో బాల్య వివాహాలు, అపరిపక్వ వివాహాలు జరిగిపోతాయి. నేను ఈ పరిస్థితిని మార్చాలంటే డాక్టర్‌గా ఉంటే కుదరదనిపించింది. ఐఏఎస్ కాని ఐపిఎస్ కాని చేయాలనుకున్నాను. నేను పెద్ద ఆఫీసరయ్యి ఆడపిల్లల తల్లిదండ్రులకు సందేశం ఇవ్వాలనుకున్నాను’ అంటుంది ఆర్తి. అయితే బంగారంలాంటి డాక్టర్ చదువు చదివి ఉద్యోగం చేస్తూ కూడా యు.పి.ఎస్.సి పరీక్షలకు హాజరవ్వాలనుకోవడం రిస్క్. ‘కాని నేను చేయగలను అనుకున్నాను’ అంటుంది ఆర్తి సింగ్. ఆమెకు మొదటిసారి అవకాశం రాలేదు. రెండోసారి పంతంగా రాసి ఐ.పి.ఎస్ సాధించింది. కోవిడ్ వారియర్ మహారాష్ట్రలో మాలేగావ్ సెన్సిటివ్ ఏరియా. ఏడున్నర లక్షల మంది ఉండే ఈ టెక్స్టైల్ టౌన్లో మత కలహాలు ఏ పచ్చగడ్డీ వేయకనే భగ్గుమంటాయి. దానికి తోడు అక్కడే గత సంవత్సరం కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఆ సమయంలో అధికారులకు మళ్లీ గుర్తొచ్చిన పేరు ఆర్తి సింగ్. అక్కడ చార్జ్ తీసుకోవడం అంటే ఏ క్షణమైనా కరోనా బారిన పడటమే. కాని ఆర్తి సింగ్ ధైర్యంగా చార్జ్ తీసుకుంది. అంతేకాదు రెండు నెలల కాలంలో కరోనాను అదుపు చేసింది. ‘నేను డాక్టర్ని కనుక ఇల్లు కదలకుండా ఉండటం ఎంత అవసరమో ప్రజలకు సమర్థంగా చెప్పాను. మరోవైపు మా సిబ్బంది ఒక్కొక్కరు కరోనా బారిన పడుతుంటే ధైర్యంగా ఉండటం కష్టమయ్యేది. అయినా సరే పోరాడాను. అలాగే కలహాలకు కారణమయ్యే టిక్‌టాక్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు కట్టడి చేశాను’ అంటుంది ఆర్తి సింగ్. మహిళా కమిషనర్‌గా దేశంలోని కమిషనరేట్లలో అందరూ మగ ఆఫీసర్లు ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్తి సామర్థ్యాలను గుర్తించి విదర్భ ప్రాంతంలోని అమరావతి నగరానికి కమిషనర్‌గా వేసింది. ఆ నగరంలో స్ట్రీట్ క్రైం ఎక్కువ. రౌడీలు తిరగడం, చైన్ స్నాచింగ్‌లు, తన్నులాటలు, ఈవ్ టీజింగ్‌లు.. మోతాదు మించి ఉండేవి. ఆర్తి చార్జ్ తీసుకున్నదన్న వార్తకే అవి సగం కంట్రోల్ అయ్యాయి. మరి కొన్నాళ్లకు మిగిలిన సగం కూడా. ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేయడం ఆర్తి తీరు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆర్తి ‘నేను చేయగలను’ అనుకోగలిగితే స్త్రీలను చేయలేనిది ఏదీ లేదు అని నిరూపిస్తోంది. -
IND vs NZ: క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు బాధ్యత ఉన్నోడు!
IPS officer Asim Arun Cleaning Trash At Green Park Stadium.. ఆసిమ్ అరుణ్.. అతనొక ఐపీఎస్ ఆఫీసర్.. క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. అందరిలాగే టీమిండియా- న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ చూడడానికి కాన్పూర్ స్టేడియానికి వచ్చాడు. రోజంతా మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత అందరిలా మాత్రం వెళ్లిపోలేదు. తనో బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నానన్న మాటను గుర్తు చేస్తూ తన కర్తవ్యాన్ని చేసి చూపించాడు. మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు తిని పడేసిన ఆహార ప్యాకెట్లు.. వాటర్ బాటిల్స్‌తో పాటు చెత్తను సంచిలో పడేసి క్లీన్ చేశారు. చదవండి: Ravindra Jadeja: క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.. కోపంతో కొట్టాలనుకున్నాడు ఇదంతా గమనించిన స్టేడియం సిబ్బంది ఐపీఎస్ ఆఫీసర్ చేసిన పనికి ఫిదా అయ్యారు. తమ కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ఆయన చేసిన పనికి మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆసిమ్ అరుణ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''గ్రీన్ సిటీగా మార్చి కాన్పూర్ను అందంగా ఉంచాలనేది రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ఆయన కోరిక మేరకు ఈరోజు గ్రీన్‌పార్క్ స్టేడియంలో ఉన్న చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచడం సంతోషం కలిగించింది. అంటూ ట్విటర్లో ఫోటో షేర్ చేసి క్యాప్షన్ జత చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండోరోజు ఆటలో న్యూజిలాండ్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. తొలుత టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత టీమిండియా బౌలర్లకు వికెట్లు దక్కకుండా బ్యాటింగ్ చేసిన కివీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్లు టామ్ లాథమ్, విల్లీ యంగ్లు అర్థశతకాలతో మెరిసి తమ జోరు చూపెట్టారు. రెండోరోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. చదవండి: Tom Latham: మూడుసార్లు రివ్యూలో సక్సెస్.. టెస్టు చరిత్రలో రెండో బ్యాటర్‌గా #IndiaVsNewZealand An exciting noon filled with bundles of memories, it was an exciting moment for me to be part of live cricket match 🏏🏏. The motivational part for today's cricket match came when i saw @asim_arun sir's post for cleaning drive.@kanpurnagarpol @Uppolice pic.twitter.com/d0vZuXj4ZA — Utkarsh Gupta (@iamutkarshgupt) November 25, 2021 -
అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్‌పై ప్రశంసలు
SSP Sandeep Chaudhary of Srinagar helped Chana seller with 1 lakh సాక్షి, ఇంటర్నెట్: బోసి నవ్వులు చిందిస్తున్న ఈ తాతను చూడగానే.. మనసుకు ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది కదా. కానీ ఈ తాతకు వచ్చిన కష్టం తెలిస్తే.. గుండె బద్దలవుతుంది. కష్టానికి కారకులైన వారి మీద ఎక్కడాలేని కోపం వస్తుంది. కొందరు సోమరిపోతుల మాదిరి కాకుండా.. వయసు మీద పడి.. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినప్పటికి కూడా.. పని చేయడం మానలేదు ఈ తాత. రోడ్డు పక్కన కూర్చుని పల్లీ, బఠాణీలు అమ్ముకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు పల్లీలు అమ్ముతూ దాదాపు లక్ష రూపాయల వరకు పోగు చేశాడు. తాను చనిపోయాక అంత్యక్రియలకు అక్కరకు వస్తుందని ఈ మొత్తాన్ని దాచుకున్నాడు. కానీ దరిద్రులు తాత కష్టార్జితాన్ని దొంగిలించారు. దీని గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఈ విషయం ఓ ఉన్నతాధికారికి తెలిసింది. వృద్ధుడి కష్టం అతడిని కదిలించింది. దాంతో తాత పొగొట్టుకున్న లక్ష రూపాయలను తానే అందించాడు. సదరు ఉన్నతాధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివారలు.. (చదవండి: Mrs Vishnoi: నాన్న కావాలని ఉందన్నారు.. కానీ తిరిగి రాలేదు.. అయినా) జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహమాన్ అనే వృద్ధుడు రోడ్డు పక్క పల్లీలు, బఠాణీలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులు ఉన్నారో లేరే తెలియదు. ఒకవేళ ఉన్నా.. బతికున్నప్పుడు, మరణించిన తర్వాత కూడా తన వల్ల వారు ఇబ్బంది పడకూడదని భావించిన రెహమాన్.. రోడ్డు పక్కన పల్లీలు అమ్ముతూ తద్వారా వచ్చిన డబ్బును కూడబెట్టసాగాడు. ఇలా ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు దాచుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కొందరు దుండగులు రెహమాన్ అంత్యక్రియల కోసం దాచుకున్న మొత్తాన్ని దొంగిలించారు. పాపం జీవితాంతం కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము ఇలా దొంగలపాలవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు రెహమాన్. పోయిన సొమ్ము తిరిగి వస్తుందనే నమ్మకం ఏ కోశాన లేదు. అయినప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: 20ఏళ్ల అవమానాలు: బారాత్, డీజే, విందుతో వృద్ధ జంట పెళ్లి ) రెహమాన్ వ్యధ, బాధ శ్రీనగర్ సీనియర్ సూపరింటెండెంట్ పోలీసు అధికారి సందీప్ చౌదరీని కదిలించింది. రెహమాన్ వివరాలు తెలుసుకున్న సందీప్.. అతడు పొగొట్టుకున్న లక్ష రూపాయలను రెహమాన్‌కు అందజేశాడు. దీని గురించి శ్రీనగర్ మేయర్ పర్వైజ్ అహ్మద్ ఖాద్రీ తన ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. సందీప్ మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజనులు. Appreciative decision by Srinagar police & @Sandeep_IPS_JKP towards the old aged Channa seller to assist him with the money of one lakh that was looted from his home. Abdul Rehman had saved the laborious money for his last rites; he sells snacks and lives all alone! Salute sir pic.twitter.com/FL0tXvoUWB — Parvaiz Ahmad Qadri (@Parvaiz_Qadri) November 14, 2021 చదవండి: దారుణం: కాచుకోవాల్సిన వారే కాటికి పంపారు.. -
IPS Preeti Chandra: చంబల్‌ను గడగడలాడించింది.. ఆమె నిజంగానే శివంగి!
చంబల్‌లోయ అంటే మహా మహా పోలీస్ ఆఫీసర్లు కూడా ‘వద్దు సార్’ అంటారు పోస్టింగ్. ప్రీతి చంద్ర అక్కడ పోస్టింగ్ తీసుకుంది. సరిగ్గా మూడు నెలలు. బందిపోట్లు గడగడలాడారు. ‘దీని వెనుక పెద్దవాళ్లున్నారు’ అని కొన్ని కేసుల జోలికి రారు ఆఫీసర్లు. కాని ప్రీతి చంద్ర పెద్దవాళ్లు ఉన్న కేసుల్నే గట్టిగా పట్టుకుంటుంది. కటకటాల వెనక్కు తోస్తుంది. అందుకే ఆమెను రాజస్థాన్‌లో అందరూ లేడీ సింగం అని పిలుస్తారు. ఆమె శివంగి. నిజంగానే. అది 2020, మే నెల. లాక్డౌన్ నడుస్తోంది. రాజస్థాన్‌లోని జోద్పూర్ వెస్ట్ కమిషనర్‌గా విధుల్లో ఉన్న ప్రీతి చంద్ర పెట్రోలింగ్‌లో ఉంది. సరిగ్గా అప్పుడే రోడ్డు పక్కగా ఒక కారు ఆగింది. అందులో గర్భిణీ ఉంది. ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఆమెను కల్యాణ్‌పూర్ నుంచి జోద్‌పూర్‌కు కాన్పు కోసం తీసుకుని వస్తుంటే మధ్యలో నొప్పులు తీవ్రమయ్యాయి. ఇంకా సిటీకి దూరముంది. ప్రీతి చంద్ర వెంటనే రంగంలో దిగింది. గర్భిణిని సౌకర్యం కోసం తన ఇన్నోవా బ్యాక్సీట్లోకి మార్పించింది. దగ్గర్లోనే ఉన్న టెంట్ హాల్‌ను తెరిపించి షామియానా తెరలను చుట్టూ పోలీసులు పట్టుకుని నిలబడేలా చాటు ఏర్పాటు చేసింది. ఒక టీమ్‌ను డాక్టర్ కోసం పంపించి తనతో ఉన్న మహిళా కానిస్టేబుల్స్‌ను కాన్పు పనిలో సాయం పట్టమంది. డాక్టరు వచ్చేలోపే కాన్పు జరిగిపోయింది. తల్లీబిడ్డా క్షేమం. కాని ప్రీతి చంద్ర సకాలంలో స్పందించకపోతే ప్రమాదం జరిగి ఉండేది. ఆ తల్లికి ప్రీతి చంద్ర అంటే ఎంతో కృతజ్ఞత ఏర్పడింది. తన కూతురికి ఆమె పేరే పెట్టుకుంది– ప్రీతి అని. చంబల్‌ను గడగడలాడించింది! 2019లో ప్రీతి చంద్రాను కరోలి జిల్లాకు ఎస్పిగా వేశారు. కరోలీ జిల్లాలో చంబల్‌లోయ ఒక భాగం వస్తుంది. ఆ జిల్లాకు ఎస్.పి కావడం అంటే బందిపోట్ల తలనొప్పిని తెచ్చి పెట్టుకోవడమే. కాని ప్రీతి చంద్ర చార్జ్ తీసుకున్న మూడు నెలల్లోనే చంబల్‌ను గడగడలాడించింది. మగ ఆఫీసర్లు వెళ్లడానికి జంకే లోయలోని ప్రాంతాలను సందర్శించింది. వారంలో ఒకసారి చంబల్ లో క్యాంప్ చేసింది. సరిగ్గా మూడు నెలల్లో పదిమంది పేరుమోసిన బందిపోట్లను అరెస్ట్ చేసింది. వారికి ఇన్ఫార్మర్లుగా పని చేసేవారిని లోపల వేసింది. ఆ దెబ్బకు ఆ ప్రాంతంలోని బందిపోట్లు పరార్ అయ్యారు. కొందరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ప్రీతి చంద్రను అందరూ ‘లేడీ సింగం’ అని పిలవసాగారు. స్కూల్ టీచర్ నుంచి ఐపీఎస్ దాకా ప్రీతి చంద్ర రాజస్థాన్‌లో 2008 ఐ.పి.ఎస్ బ్యాచ్ ఆఫీసర్. ఆమెది సీకర్ జిల్లాలోని కుందన్ అనే చిన్న ఊరు. తండ్రి బి.ఎస్.ఎఫ్‌లో పని చేసేవాడు. తల్లి నిరక్షరాస్యురాలు. ‘మా అమ్మ జీవితంలో పెన్సిల్ కూడా పట్టుకుని ఎరగదు. కాని నన్ను, నా చెల్లెల్ని, మా తమ్ముణ్ణి బాగా చదివించాలని పట్టు బట్టింది. నేను ఐ.పి.ఎస్ అవడానికి ఆమే కారణం’ అంటుంది ప్రీతి. జైపూర్‌లో ఎం.ఏ, ఎం.ఫిల్ చేసిన ప్రీతి కొన్నాళ్లు స్కూల్లో పాఠాలు చెప్పింది. మరికొన్నాళ్లు జర్నలిస్ట్‌గా పని చేసింది. నిజానికి జర్నలిస్టుగానే ఎదగాలని అనుకుందిగాని యు.పి.ఎస్.సి రాసి ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐ.పి.ఎస్ అయ్యింది. ప్రీతి చంద్ర ఇప్పుడు బికనీర్‌కి ఎస్.పిగా ఉంది. బికనీర్‌కి ప్రథమ మహిళా ఎస్.పి ఆమె. ‘ఈ జిల్లా ఏర్పడి చాలా కాలం అయ్యింది. నా కంటే ముందు చాలామంది మహిళా అధికారులు ఉన్నారు. ఇన్నాళ్లకు ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. వ్యవస్థలో మహిళలకు అవకాశం ఇవ్వడం సంకుచితత్వం ఉంది. అలాగే మహిళలు కూడా బాధ్యతను స్వీకరించడం లో వెనుకంజ వేయడం మానాలి’ అంటుందామె. చదవండి: ఆమె చేయని మంచి పని లేదు, సేవా రంగం లేదు.. ఓ అలుపెరుగని సంచారి!! -
భీమ్లా నాయక్ పాటపై వివాదం: ఐపీఎస్ అధికారి అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’లోని పాటను విడుదల చేశారు. విడుదలైన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో పోలీస్‌గా నటిస్తున్న పవన్ కల్యాణ్ పాత్ర ఎలా ఉంటుందో పాటతో అర్ధమవుతోంది. అయితే ఆ పాటపై ఓ ఐపీఎస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని సాహిత్యాన్ని తప్పుబట్టారు. ‘మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం’ అని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానం పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నిన్న ఓ ట్వీట్ చేశారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎం.రమేశ్ భీమ్లా నాయక్ పాట విన్న అనంతరం ఓ ట్వీట్ చేశారు. ప్రజల రక్షణార్థం జీతాలు పొందుతున్న మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం అని స్పష్టం చేశారు. అనంతరం ప్రముఖ రచయిత రామజోగయ్యశాస్త్రి రాసిన సాహిత్యంపై స్పందిస్తూ ‘పోలీస్ పాత్రను వర్ణించేందుకు తెలుగులో ఇంతకన్నా గొప్ప పదాలు దొరకలేదంటే ఆశ్చర్యమేస్తోంది’ అని ఐపీఎస్ అధికారి రమేశ్ తెలిపారు. ‘పోలీసుల సేవలను పాటలో ఎక్కడా ప్రస్తావించలేదు’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ పాట సాహిత్యంపై కూడా కొందరు నెటిజన్లు సాధారణంగా ఉన్నాయని.. అంత గొప్పగా లేవని చెబుతున్నారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యానికి తగ్గట్టు పాటలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు నేరుగా రామజోగయ్యను ట్యాగ్ చేస్తూ చెప్పారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు రామజోగయ్య స్పందించారు. ‘మీ రేంజ్ లిరిక్స్ అయితే కాదు’ అని ఓ అభిమాని ట్వీట్ చేయగా ‘నెక్ట్స్ టైం బాగా రాస్తా తమ్ముడూ.. ప్లీజ్’ అని శాస్త్రి రిప్లయ్ ఇచ్చారు. మరి ఓ ఐపీఎస్ అధికారి చేసిన ట్వీట్‌కు రామజోగయ్యశాస్త్రి స్పందిస్తారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం భీమ్లా నాయక్ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆ పాటను తెలంగాణ జానపద కళాకారుడు, అరుదైన కిన్నెరను వాయించే దర్శనం మొగులయ్య పాడడం ప్రత్యేకంగా ఉంది. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి Thankfully, @TelanganaCOPs are #PeopleFriendlyPolice . We don’t break the bones of those whom we are paid to protect ! Surprisingly, @ramjowrites couldn’t find enough words in Telugu to describe the valour of a cop. No mention of service in the song. https://t.co/EsQVaW5p2s — M. Ramesh IPS (@DCPEASTZONE) September 2, 2021 -
సీఎం మీద పోటీకి సిద్ధమవుతున్న మాజీ ఐపీఎస్ అధికారి
లక్నో: వచ్చేఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎలక్షన్ బరిలో తాను నిలబడనున్నట్లు ప్రకటించారు మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్. పోలీసు ఉద్యోగానికి ముందస్తు పదవీవిరమణ చేసిన అమితాబ్ ఠాకూర్.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద పోటీ చేస్తారని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచి బరిలోకి దిగితే.. అమితాబ్ ఠాకూర్ కూడా అక్కడే పోటీ చేస్తారని ప్రకటించారు. ఏకంగా సీఎం మీదనే పోటీకి సిద్ధమవతున్న అమితాబ్ ఠాకూర్ నిర్ణయం దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న ఓ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమితాబ్ ఠాకూర్ ఈ ఏడాది మార్చి 23న ఉద్యోగానికి రాజీనామా చేశారు. వాస్తవంగా ఆయన సర్వీసు 2028 వరకు ఉన్నప్పటికి ప్రజాశ్రేయస్సు కోసం ఏడేళ్ల ముందుగానే పదవీవిరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అమితాబ్ ఠాకూర్ భార్య మాట్లాడుతూ.. ‘‘యూపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ అనేక అప్రజాస్వామిక, అక్రమ, నిర్బంధ, వేధింపు, వివక్ష చర్యలకు పాల్పడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అక్రమాలకు.. అమితాబ్ నమ్మిన ఆదార్శలకు మధ్య జరుగుతున్న పోరాటం. ఇందుకోసం యోగి ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే.. అమితాబ్ కూడా అక్కడే బరిలో నిలుస్తారు’’ అని తెలిపారు. 2017 లో, అమితాబ్ ఠాకూర్ తన కేడర్ని వేరే రాష్ట్రానికి మార్చమని కేంద్రాన్ని కోరారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ములాయం సింగ్ యాదవ్ తనను బెదిరించారని ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత, అమితాబ్ ఠాకూర్‌ని జూలై 13, 2015 న సస్పెండ్ చేశారు. ఆయనపై విజిలెన్స్ విచారణ కూడా ప్రారంభమైంది. -
ట్రైనీ ఐపీఎస్‌లను ఉద్దేశించి మోదీ ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలోని ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ట్రైనీలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. మోదీ వర్చువల్‌గా ట్రైనీ ఐపీఎస్‌లతో సంభాషిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హజరయ్యారు. గతేడాది సెప్టెంర్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ట్రైనీ ఐపీఎస్‌లతో సంభాషించారు. ఐపీఎస్ అధికారులు తమ ఉద్యోగం, యూనిఫామ్‌ని గౌరవించాల్సిందిగా సూచించారు. కరోనా కాలంలో పోలీసులు చేసిన సేవలు సామాన్యుల మదిలో నిలిచిపోయాయని మోదీ తెలిపారు. ‘‘అనుకోని.. అకస్మాత్తు ప్రమాదాలను గుర్తించి.. వాటిని సమర్థంగా ఎదుర్కొవడమే మీ వృత్తి. విధి నిర్వహణలో మీరు ఎంతో ఒత్తిడికి గురవుతారు. అలాంటి సమయంలో మీ శ్రేయోభిలాశులను కలిసి.. వారితో మాట్లాడండి.. వారి సూచనలు తీసుకొండి’’ అని మోదీ వారికి సూచించారు. -
ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు
తిమ్మాపూర్: ఎన్నికల్లో గెలవడం కోస మే నాయకులు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో పర్యటించారు. సర్పంచ్ మేడి అంజ య్యతో కలిసి గ్రామంలో పేదల జీవన శైలి గురించి తెలుసుకున్నారు. అనంత రం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూ రంలో ఉన్న మన్నెంపల్లి ప్రజలు ఇంకా పేదరికంలో మగ్గడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తులకు లక్షల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న పాలకులు వాటిని క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని కోరారు. వెనుకబడిన, బడుగు, బలహీ న వర్గాల అభివృద్ధి, రాజ్యాధికారమే ల క్ష్యంగా తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. అందరి బతుకులు మార్చాలనే లక్ష్యం తో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అందుకే మ న్నెంపల్లిని సందర్శించానన్నారు. ఉప ఎన్నికలో ఓట్ల కోసం వందల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేద, బడుగు, బలహీన వర్గాల విద్య, ఉపాధికోసం ఖర్చు చేస్తే వారి జీవితా లు బాగుపడతాయని పేర్కొన్నారు. -
ఐపీఎస్ కొలువుకు రాజీనామా.. శ్రీకృష్ణుడి సేవకు అంకితం
చండీగఢ్: పోలీసు ఉద్యోగానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఐపీఎస్ కొలువు అంటే మాటలు కాదు. ఇక ఐపీఎస్ ఉద్యోగం సాధించడం కూడా అంత సులువు కాదు. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ మంది ఏళ్ల తరబడి అహోరాత్రాలు శ్రమించి.. కష్టపడి చదువుతారు. అయినా కొందరికి ఉద్యోగం రాదు. అంతలా కష్టపడి సాధించిన ఉద్యోగాన్ని మధ్యలోనే వదులుకుంటారా.. అది కూడా దేవుని సేవ కోసం. చాలా కష్టం కదా. కానీ హరియాణాకు చెందిన ఓ మహిళా ఐపీఎస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. మిగతా జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె నిర్ణయం విన్నవారంతా షాకవుతున్నారు. ఆ వివరాలు.. ప్రస్తుతం హరియాణా అంబాలా రేంజ్లో ఇన్స్పెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా. ఈ క్రమంలో ఆమె తాను స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు భాతరి అరోరా రాష్ట్ర ప్రధాన సలహాదారుకు లేఖ రాశారు. దానిలో "50 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత, ఆల్ ఇండియా సర్వీసెస్ (డీసీఆర్బీ) నిబంధనలు, 1958 లోని రూల్ 16 (2) ప్రకారం, ఆగస్టు 1, 2021 నుంచి సర్వీసు నుంచి పదవీ విరమణ కోరుతూ.. నేను ఈ దరఖాస్తును స్వచ్ఛందంగా సమర్పించాను" అని తెలిపారు. “ఇప్పుడు నేను జీవితం అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురు నానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్దాస్, తులసీదాస్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో జీవించాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాంతం అంకితం చేయాలని నేను ఆరాటపడుతున్నాను’’ అని తెలిపారు భారతి అరోరా. ఇక దీనిపై ఫోన్ ద్వారా భారతి అరోరా పీటీఐతో మాట్లాడుతూ, ‘‘నా ఉద్యోగం అంటే నాకు ఎంతో గౌరవం, ఆసక్తి. ఇప్పటికే 23 ఏళ్లుగా విధులు నిర్వహించాను. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పయణించాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని భావిస్తున్నాను’’ అని తెలిపారు. ఐపీఎస్ అధికారిగా పని చేసిన భారతి అరోరా 2007 సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలు పేలుడు కేసును దర్యాప్తు చేశారు. అప్పుడు ఆమె పోలీసు సూపరింటెండెంట్‌గా (రైల్వే) విధులు నిర్వహించారు. పోలీసు పరిపాలనలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను ఏప్రిల్ 2021 లో కర్నాల్ నుంచి అంబాలా రేంజ్‌కు బదిలీ చేశారు. భారతి తన లేఖలో “నా సేవ పట్ల నేను ఎంతో గర్విస్తున్నాను. నాకు సేవ చేయడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి అవకాశం కల్పించినందుకు ఈ సేవకు నేను చాలా కృతజ్ఞతలు. నాకు సరైన మార్గాన్ని చూపించినందుకు హరియాణా రాష్ట్రానికి నా కృతజ్ఞతలు. నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఆగస్టు 1 నుంచి స్వచ్ఛందంగా సేవ నుంచి విరమించుకునేందుకు నన్ను అనుమతించమని నేను కోరుతున్నాను” అన్నారు. -
ముంబై పోలీస్ మాజీ బాస్‌పై అక్రమ వసూళ్ల కేసు
ముంబై: ముంబై పోలీస్ మాజీ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి పరంబీర్‌సింగ్, ఐదుగురు పోలీస్ అధికారులతోపాటు మరో ఇద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బిల్డర్‌పై ఉన్న కేసులను మాఫీ చేయించేందుకు వీరు రూ.15 కోట్లు డిమాండ్ చేశారని అధికారి ఒకరు గురు వారం వెల్లడించారు. మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఈ కేసుకు సంబంధించి సునీల్ జైన్, సంజయ్ పునామియా అనే ఇద్దరు బిల్డర్లను అరెస్ట్ చేశామ న్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో సచిన్ వాజే అనే పోలీస్ అధికారి అరెస్ట్ అనంతరం మార్చిలో ముంబై పోలీస్ కమిషనర్‌గా ఉన్న పరంబీర్‌సింగ్‌ను హోం గార్డ్ విభాగానికి డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది. అకోలా పోలీస్ ఇన్స్పెక్టర్ బీఆర్ ఘడే ఫిర్యాదు మేరకు పరంబీర్‌పై ఏప్రిల్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. అనిల్ దేశ్‌ముఖ్‌కు హైకోర్టులో చుక్కెదురు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాక రించింది. ఇదే కేసులో తీర్పుపై స్టే ఇచ్చి, అప్పీల్‌కు అవకాశమి వ్వాలన్న వినతిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. అనిల్ పిటిషన్ ‘కొట్టివేయదగినది’ అని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంబీర్‌సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై జయశ్రీ పాటిల్ అనే లాయర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనిల్‌పై ఉన్న ఆరోపణలపై దర్యాప్తు జరి పిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఏప్రిల్ 24వ తేదీన కేసు నమోదు చేసింది. -
మా ఆవిడ జిలేబీ తిననివ్వడం లేదు; నువ్వు ఇంటికి రా!
ముంబై: ఒక ఐపీఎస్ ఆఫీసర్ ట్విటర్ వేదికగా జిలేబీపై ఉన్న ఇష్టం గురించి వెల్లడించడం.. తన భార్య చేత ఇబ్బందులు పడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ సందీప్ మిట్టల్‌కు చిన్నప్పటి నుంచి జిలేబీలు అంటే ప్రాణం. తన చిన్నతనంలో 25 పైసలకే జిలేబీలు కొనుక్కొని తినేవాడు. అలా రోజుకు మూడు నుంచి నాలుగు జిలేబీలు ఎంతో ఇష్టంగా ఆరగించేవాడు. పెరిగి పెద్దయ్యాకా కూడా ఆ ఐపీఎస్ ఆఫీసర్‌కు జిలేబీలపై మక్కువ పోలేదు. తన భార్యకు తెలియకుండా చాలాసార్లు దొంగతనంగా తినేవాడు. అయితే ఈ విషయం తన భార్యకు తెలిసిపోవడంతో అప్పటినుంచి ఆమె అతన్ని జిలేబీలు తిననివ్వడం లేదు. దీంతో తన భార్యపై కోపాన్ని(ఫన్నీవేలో) ట్విటర్ వేదికగా రాసుకొచ్చాడు. '' చిన్నప్పటి నుంచి జిలేబీలు అంటే ఎంతో ఇష్టం. కానీ ఇప్పుడు మా ఆవిడ జిలేబీలు తిననివ్వడం లేదు'' అని ట్వీట్ చేశాడు. భర్త జిలేబీ విషయం తెలుసుకున్న అతని భార్య వినూత్న రీతిలో రిప్లై ఇచ్చింది. ''మీరు ఈరోజు ఇంటికి రండి..'' అంటూ అసంపూర్తిగా కామెంట్ చేశారు. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' బహుశా జిలేబీలు తిని తిని ఆ ఐపీఎస్ ఆఫీసర్‌కు షుగర్ వచ్చిదనుకుంటా.. పాపం ఐపీఎస్ ఆఫీసర్‌ను చూస్తే జాలేస్తుంది.. మీ చిన్నతనంలో జిలేబీల గురించి చెప్పి మాకు ఊరీలు తెప్పించారు..'' అని నెటిజన్లు కామెంట్స్ చేశారు. बचपन में २५ पैसे की एक बड़ी जलेबी आती थी। सोचते थे कि बड़े होने के बाद कमाएंगे और रोज़ तीन-चार जलेबी खाया करेंगे। अब कमाने लगे तो बीवी जलेबी खाने नहीं देती। pic.twitter.com/W9pxYWqnVY — Dr. Sandeep Mittal, IPS 🇮🇳 (@smittal_ips) July 17, 2021 आज आप घर आओ.... https://t.co/bBkz1CjoZi — Office of Dr. Richa Mittal🇮🇳 (@drairicha) July 18, 2021 -
రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త విప్లవం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, ఆదిలాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని ఐపీఎస్ అధికారి, సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త విప్లవం రాబోతోందని ఆయన అన్నారు. ఈ డెబ్బై, ఎనబై సంవత్సరాలలో అట్టడుగు వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. అక్షరం, ఆర్ధికం, ఆరోగ్యం ఎజెండాగా.. పూలే , అంబేద్కర్, కాన్షిరాం ఆశయాల కోసం పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ప్రజల్లో 1 శాతం మార్పు తీసుకువచ్చానని, ఇంకా తొంబై తొమ్మిది శాతం ప్రజల జీవితాలలో మార్పు కోసం పనిచేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజులలో అన్ని వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. సూర్యుడు తూర్పున ఉదయించి.. పశ్చిమాన అస్తమించేది.. ఎంత నిజమో.. ప్రవీణ్ కుమార్ పోటీ చేయకపోవడం అంతే నిజమని అన్నారు. సాంఘీక సంక్షేమ కార్యదర్శిగా గూడెం బిడ్డలు విదేశాలలో చదివేలా ప్రోత్సహించానని, ఇలా అన్ని వర్గాల బిడ్డలు అభివృద్ధి చెందాలనేది తన ఆకాంక్ష అని ఆయన అన్నారు. -
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన నిర్ణయం: ఐపీఎస్ పదవికి రాజీనామా
RS Praveen Kumar Resignation: సాక్షి, హైదరాబాద్: సంచలనాలు, సంస్కరణలకు చిరునామా అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ– మెయిల్ ద్వారా సమాచారం అందించారు. సోమ వారం ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. మరో ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసు కోవడంపై పోలీస్ శాఖ, ప్రస్తుతం ఆయన కార్యదర్శిగా ఉన్న గురుకుల సొసైటీల్లో కలకలం రేపుతోంది. వ్యక్తిగత కారణా లతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఏడీజీ హోదాలో యూసఫ్‌గూడ బెటాలియన్‌లో ఉన్న కొందరు ఆత్మీయులు, ఐపీఎస్ మిత్రులను కలుసుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయటికొచ్చారు. తర్వాత కొద్దిసేపటికే తన వీఆర్ఎస్ నిర్ణయాన్ని వెలువరించారు. రాష్ట్రవ్యాప్త గుర్తింపు.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రవీణ్‌కుమార్ కరీంనగర్, అనంతపూర్ జిల్లాలకు ఎస్పీగా, హైదరాబాద్‌లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్), తర్వాత గురుకుల సొసైటీకి కార్యదర్శిగా పనిచేశారు. కరీంనగర్ ఎస్పీ (2001 నుంచి 2004)గా పనిచేయడం ఆయనకు చాలా గుర్తింపు తెచ్చింది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేస్తూనే, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్న గ్రామంలోనే ఉండాలంటూ ఆయన ఇచ్చిన నినాదం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రులను ఎంతగానో ప్రభావితం చేసింది. ‘గురువా మా ఊర్లోనే ఉండు..’అన్న నినాదం జిల్లావ్యాప్తంగా ఉద్యమంగా మారింది. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇదీ ఆయన నేపథ్యం.. పూర్తిపేరు: రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ పుట్టింది: ఆలంపూర్, 1967 తల్లిదండ్రులు: ప్రేమమ్మ, బీఆర్ సవరన్న విద్యార్హతలు: వెటర్నరీ సైన్స్‌లో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ నుంచి మాస్టర్స్, హార్వర్డ్, మసాచుసెట్స్ వర్సిటీల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ అవార్డులు: పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ, ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, సెక్యూరిటీ మెడల్ (కేంద్ర హోం శాఖ), యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్ (వార్ క్రైం ఇన్వెస్టిగేటర్) సమీప బంధువులు: మాజీ ఎమ్మెల్యే సంపత్, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పోలీసు వెబ్సైట్ సృష్టికర్త హైదరాబాద్‌లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్)గా పనిచేసిన సమయంలో పోలీస్ శాఖలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. సైబర్ నేరాలు పెరుగుతుండటంతో సీసీఎస్‌లో సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు ఓ ఠాణా కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటి ఆధారంగానే ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్, సైబరాబాద్‌లకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు మంజూరయ్యాయి. నగర పోలీస్ వెబ్సైట్, ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్, ఆన్లైన్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, ఫారినర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తదితరాలకు శ్రీకారం చుట్టారు. పోలీసుల మధ్య ఎస్ఎంఎస్ల రూపంలో సమాచార మార్పిడికి హోషియార్, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ డిలీట్ దెమ్ కార్యక్రమాలు ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే. హుజూరాబాద్‌లో పోటీ చేసే ఉద్దేశం లేదు హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని, రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం కుందన్‌బాగ్‌లోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. వ్యక్తిగతంగా కొంత విశ్రాంతి కావాలని, 26 ఏళ్లు ప్రభుత్వ సర్వీసులోనే గడిచిపోయాయని, మిగిలిన విషయాలను పట్టించుకోలేదన్నారు. ఇకపై పూర్తిస్థాయిలో పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే పదవీ విరమణ చేశానని వెల్లడించారు. తాను వెళ్లిపోయినంత మాత్రాన గురుకులాల విద్యా సంస్థలకు వచ్చే ఇబ్బందేమీ లేదని వివరించారు. స్వేరోస్ తన సృష్టి కాదని, దాన్ని పూర్వ విద్యార్థులు స్థాపించారని, అందులో తాను అనుకోకుండా చేరానని చెప్పారు. స్వేరోస్‌లో లక్షలాదిమంది ఉన్నారని, దాంట్లో ప్రవీణ్ ఒకడని, తాను ఉన్నా లేకున్నా స్వేరోస్ ముందుకు సాగుతుందదని స్పష్టం చేశారు. pic.twitter.com/AnaEek8baJ — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 19, 2021 -
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ అధికారి..
సాక్షి, చెన్నై(తమిళనాడు): బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా అన్నామలైని నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. కరూరు జిల్లా వ్యవసాయ కుటుంబానికి చెందిన అన్నామలై ఇంజినీరింగ్, ఎంబీఏ పట్టబధ్రుడు. కర్ణాటక ఐపీఎస్‌కు చెందిన ఆయన 2018–19 వరకు పోలీసు అధికారిగా పలు హోదాల్లో పనిచేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా నియమితులై గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురుచ్చి నుంచి పోటీచేసి డీఎంకే అభ్యర్థి ఇళంగో చేతిలో 24 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.మురుగన్ కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో ఆయన స్థానంలో అన్నామలైని నియమించారు. అన్నామలైకి బీజేపీ తమిళనాడు శాఖ జాతీయ కో–ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన హయాంలో పార్టీ మరింత బలోపేతమై తమిళనాడులో అధికారం చేపట్టగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. -
వైరల్: ఐపీఎస్ ఆఫీసర్.. అప్పుడు 134 కేజీల బరువు.. ఇప్పుడు 104!
న్యూఢిల్లీ: పోలీస్ ఉద్యోగం అంటే నిత్యం సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఇతర ఉద్యోగాలతో పోలీస్తే వీరికి ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ఈ శాఖలో కొంత మంది అధిక బరువును కల్గి ఉండటం వల్ల దొంగలను పట్టుకువటానికి ఇబ్బంది పడుపడ్డ సంఘటనలు చూశాం. అయితే, ఇక్కడో పోలీస్ అధికారి తాను ఏవిధంగా బరువు తగ్గాడో ఫెస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివేక్ రాజ్ సింగ్ కుక్రెలే అనే ఐపీఎస్ ఆఫీసర్ చిన్నప్పటి నుంచి లావుగా ఉండేవాడినని, చిన్నతనం నుంచి మంచి ఆహారం తినడం అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. అందుకే మిగతా వారికన్నా కొంచెం లావుగా ఉండేవాడినని తెలిపారు. పెద్ద అయ్యాక కూడా లావుగా ఉండేవాడినని, ఈ క్రమంలో సివిల్స్‌కి ప్రిపెర్ అయ్యి ఐపీఎస్‌కు ఎంపీకైనట్లు చెప్పారు. ఆ తర్వాత ఐపీఎస్ శిక్షణ కోసం నేషనల్ పోలీస్ అకాడమిలో చేరారని, అక్కడ 46 వారాల పాటు అనేక కఠిన శిక్షణ కొనసాగిందన్నారు. ఈ క్రమంలో మొదట్లో 134 కేజీలుగా ఉన్న తన బరువు.. ప్రస్తుతం 104 కి తగ్గిందని తెలిపారు. 43 కేజీలు తగ్గానని, అది నాకు గొప్పగా అనిపిస్తుందని పేర్కొన్నారు. తనకు చిన్న తనం నుంచి ఆహరాన్ని వృథా చేయడం నచ్చేది కాదన్నారు. కాగా, ఇప్పుడు ఆకలి కన్న ఎక్కువగా తినడాన్ని కూడా తాను నేరంగా భావిస్తున్నానని అన్నారు. అయితే నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని.. బీపీ కూడా అదుపులో ఉందని పేర్కొన్నాడు. అనేక అధికారిక కార్యక్రమాలలో నడవటానికి ప్రాధాన్యత ఇస్తున్నానని, అందుకే బరువు క్రమంగా తగ్గుతూ వస్తుందని తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘ఆరోగ్యం పట్ల మీ నిబద్ధతకు హ్యట్సఫ్’, ‘ప్రస్తుతం స్లిమ్‌గా బాగున్నారు’, ‘బరువు తగ్గించు కోవడంతో మీరు మిగతా పోలీసు వారికి ఆదర్శం ’ ‘మీరు చేసిన పనికి మేము ఫిదా’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Viral: నేను పులిరాజును.. అయితే నాకేంటి! -
IPS Officer Rashmi Shukla: రష్మీశుక్లాను అరెస్టు చేయం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రకు చెందిన ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సౌత్‌జోన్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ రష్మి శుక్లాను అరెస్టు చేయబోమని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ముంబై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో ఈమె మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కమిషనర్‌గా విధులు నిర్వర్తించగా, ప్రస్తుతం చాంద్రాయణగుట్టలోని సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహించిన సమయంలో రష్మి మొత్తం 36 మంది రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటి వరకు ఆమెకు రెండు నోటీసులు జారీ చేశారు. ముంబై వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించిన రష్మిశుక్లా సదరు ఎఫ్ఐఆర్పై తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఆర్డర్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆ రాష్ట్ర హైకోర్టు మహారాష్ట్ర సర్కారుతో పాటు ముంబై పోలీసులకూ నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం జూన్ 14న ఈ కేసు విచారించేలా వాయిదా వేసింది. హైకోర్టు నోటీసులపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. కేసు తదుపరి విచారణ వరకు రష్మి శుక్లను అరెస్టు చేయమని, వాంగ్మూలం ఇవ్వడానికి ఆమె ముంబై రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. త్వరలో ముంబై సైబర్ క్రైమ్ పోలీసుల బృందమే హైదరాబాద్‌కు వెళ్లి ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేస్తుందని తెలిపింది. గత ఏడాది ముంబై పోలీసు విభాగంలో బదిలీలకు సంబంధించి పైరవీలు చేస్తూ ప్రముఖులు సాగించిన బేరసారాలను రష్మి ఫోన్ ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ నమోదు చేసిన కేసులోనూ ఈ ఆడియోలు కీలకంగా మారాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆ ఆడియో రికార్డుల్ని పరిశీలించాల్సి ఉందంటూ, సీబీఐ అధికారులు ముంబైలోని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆడియోలతో కూడిన సీడీ ఇప్పించాల్సిందిగా అందులో కోరారు. ఇప్పటికే హైదరాబాద్‌కు వచ్చివెళ్లిన సీబీఐ ప్రత్యేక బృందం రష్మి వాంగ్మూలం నమోదు చేసింది. చదవండి: తెలంగాణలో కరోనా నియంత్రణకు కొత్త ఆంక్షలు -
లైంగికంగా వేధించాడు: మహిళా ఐపీఎస్ ఫిర్యాదు
చెన్నై : స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్( లా అండ్ ఆర్డర్) తనను లైంగికంగా వేధించాడంటూ తమిళనాడుకు చెందిన మహిళా ఐపీఎస్ అధికారి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వివరాల ప్రకారం..విధుల్లో ఉన్న తనపై రాజేష్ దాస్ అనే స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లైంగికంగా వేధించాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళా ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేసింది. ఇటీవల పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బాధితురాలు పేర్కొంది. దీంతో పీఎం మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి చేపట్టిన భద్రతా సమావేశాల్లో సదరు డీజీపీని పాల్గొనకుండా సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ పుదుచ్చేరి, తమిళనాడులో పర్యటించనున్నారు. మరికొన్ని వారాల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో ప్రణాళిక, అభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి జయశ్రీ రఘునందన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు స్వయంగా ఓ ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపులకు గురికావడం చాలా బాధకరమైన ఘటన అని ప్రతిపక్ష నేత, డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ విమర్శించారు. నిందితుడిని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది చాలా సిగ్గుచేటని పేర్కొన్నారు. అదే సమయంలో ఫిర్యాదు చేసిన మహిళా ఐపీఎస్ అధికారిని ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. చదవండి : (ఎంపీ ఆత్మహత్య: 15 పేజీల లేఖ, వైరలవుతోన్న వీడియో) (పెళ్లి పేరుతో రూ.11కోట్లకు నకిలీ ఐపీఎస్ మోసం) -
కష్టం ఎక్కడికీ పోదు
నైపుణ్యం ఉన్నచోట వివక్షకు చోటుండదు.. అందరికీ అన్ని స్థాయుల్లోనూ సవాళ్లు ఎదురవుతాయి.. భయం వీడితే పరిష్కారం అదే దొరుకుతుంది.. లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమం తప్పకుండా ప్రయత్నించాలి అంటారు అంజిత చేప్యాల... తెలంగాణకు చెందిన ఏజీఎంయూటీ క్యాడర్ ఐపీఎస్. దేశరాజధానిలో రాష్ట్రపతి భవన్, ప్రధాని, హోంమంత్రుల నివాసాలతోపాటు ఇండియా గేట్ వంటి అత్యంత ప్రాముఖ్య ప్రదేశాలున్న లుటియన్స్ జోన్లో శాంతిభద్రతల పర్యవేక్షణాధికారిగా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. విజ్ఞాన్‌భవన్‌లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం, రైతుల సమావేశాల సమయంలో శాంతి భద్రతలు పర్యవేక్షించిన న్యూ ఢిల్లీ జిల్లా అదనపు డీసీపీ (శాంతి భద్రతలు) అంజిత.. సాధనతోనే ఈ స్థాయి సాధించానని చెబుతున్నారు. ఆమె ప్రస్థానం ఆమె మాటల్లోనే.... శిక్షణ అనంతరం ఢిల్లీలోసైబర్ క్రైం విభాగంలో తొలి బాధ్యతలు స్వీకరించా. శిక్షణ, విధుల సమయంలో సహచరుల్లో ఎలాంటి వివక్ష కనిపించ లేదు... నైపుణ్యం ఉన్నచోట వివక్షకు చోటుండదు.. నా విశ్వాసానికి బలం చేకూరింది. అప్పుడప్పుడే సైబర్ నేరగాళ్ల విశ్వరూపం బయటపడుతోంది.. వందలాది ఫిర్యాదులు వచ్చేవి.. ఇంజినీరింగ్ నేపథ్యం కావడంతో సులభంగానే అనేక సవాళ్లు చేధించా.. సొమ్ములు కట్టించుకొని సరకు అందించని ఆన్లైన్ షాపింగ్ టిమ్టారా.కామ్, కాల్‌సెంటర్ మాదిరి ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని సొమ్ములు కాజేసిన జిమ్తారా సంస్థ మోసాలు అరికట్టడంలో నా భాగస్వామ్యం కూడా ఉంది. మెట్రోపాలిటిన్ సిటీ.. రద్దీ రహదారులు.. వీటితోపాటు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నూతన సాంకేతిక ఏర్పాటుకు నేను ట్రాఫిక్ ప్రధాన కార్యాలయంలో డీసీపీగా బాధ్యతలు చేపట్టినప్పుడే అనుమతి వచ్చింది. రూ.1000 కోట్ల ప్రాజెక్టు అది. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సీసీటీవీ, క్యూ లెంగ్త్‌ను చూసి పనిచేసే ఆటోమేటిక్ సిగ్నలింగ్ ఇవన్నీ భవిష్యత్తులో ఢిల్లీ రహదారులపైకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు తొలిదశలో నేను కూడా భాగస్వామిని. రహదారులపై ట్రాఫిక్ ఒక ఎత్తు అయితే.. తాజా కరోనా సంక్షోభం నేపథ్యంలో రాజధాని నుంచి వలస కార్మికులు తిరిగి వెళ్లడం.. లక్షలాది మంది ఆనందవిహార్, ఐఎస్బీటీ ప్రాంతాలకు చేరుకోవడం చూస్తే హృదయం ద్రవించి వేసింది. ఈస్ట్‌జోన్ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న నేను వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశా. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వివరించడంతోపాటు ఆహారం, వైద్య సదుపాయం అందజేశాం. మాస్కులు పంపిణీ చేశాం. నవంబరు 11న డీసీపీ (శాంతిభద్రతలు)గా బాధ్యతలు స్వీకరించా.. 25 నుంచే రాజధాని సరిహద్దుల్లో రైతు ఉద్యమం ప్రారంభమైంది... చాలా రోజులు సవాల్‌గానే గడిచాయి. నేను నమ్మిన మాట నిజమైంది! శిక్షణ సమయంలో కార్యాలయంలో వివక్ష ఎదురవుతుందన్న భావన నాకెప్పుడూ అనిపించలేదు. మహిళలు సాహసాలు, అద్భుతాలు చేయాలంటే నేర్పు, ఓర్పు కన్నా ధైర్యం అవసరం అని నమ్మేదాన్ని. తొలిసారే సివిల్స్‌కు ఎంపిక కాలేదని నిరుత్సాహం చెందలేదు. కాలంతో పోరాడి అనుకున్నది సాధించా.. లక్ష్యం చేరుకోవాలంటే క్రమం తప్పకుండా ప్రయత్నించాలన్న మావయ్య నర్సింగ్‌రావు మాటలు గుర్తొచ్చాయి. వారిద్దరూ ప్రత్యేకం... చదువుకొనే రోజుల నుంచి నన్నెంతగానో ప్రోత్సహించింది మా అన్న సంపత్ రావు. ఈ దిశగా వెళ్లు.. ఇలా చేయడం వల్ల నలుగురికీ ప్రయోజనం కల్పించొచ్చు అంటూ సహోదరిని సేవాదారిగా మార్చడంలో అన్ని వేళలా ప్రోత్సహించారు. ఇక నా భర్త నవీన్‌కుమార్.. సివిల్స్‌లో మంచి ర్యాంకు వచ్చి ఎంపిక కాలేకపోయిన నన్నెంతగానో ఓదార్చారు. కోర్టు తీర్పుతో తిరిగి ఎంపిక అయిన తర్వాత అమెరికాలో గృహిణిగా స్థిరపడిన నన్ను విధుల వైపు మళ్లేలా చేశారు. వారిద్దరూ నాకు ఎంతో ప్రత్యేకం. పెద్దపల్లి జిల్లా మేడిపల్లి మా స్వగ్రామం.. రామగుండం, తెనాలి, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ వరకూ చదివాక తల్లిదండ్రులు మంగ, సత్యనారాయణరావుల ప్రోత్సాహంతో సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా ముందుకు సాగా.. మూడు ప్రయత్నాలు మిస్సయినా, నాలుగో యత్నంలో 2008 లో మంచి ర్యాంకు వచ్చింది. అయితే, ఆ సమయంలో జనరల్, రిజర్వేషన్ కేటగిరీల గందరగోళంతో నన్ను ఎంపిక చేయలేదు. తర్వాత ఏడాదే బాసరకు చెందిన నవీన్‌కుమార్‌తో వివాహం అయింది. మాకు ఇద్దరు పిల్లలు శాన్వి, మాహిర. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాల్సి వచ్చింది. 2010లో కోర్టు తీర్పుతో జనరల్ కేటగిరీ అభ్యర్థుల్ని తిరిగి ఎంపిక చేయడంతో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. –సూర్యప్రకాశ్ కూచిభట్ల, సాక్షి, న్యూఢిల్లీ ఫొటో: ప్రమోద్ మాధుర్ -
ఐఎఫ్ఎస్ భర్తపై ఐపీఎస్ భార్య ఫిర్యాదు
బనశంకరి: భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె సాదాసీదా మహిళ కాదు, ఓ ఐపీఎస్ అధికారిణి కావడం గమనార్హం. బాధితురాలు బెంగళూరు కబ్బన్‌పార్కు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన 2009 బ్యాచ్‌కు ఐపీఎస్ అధికారిణి వర్తికా కటియార్ బెంగళూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. 2011లో ఆమెకు భారతీయ విదేశాంగ సర్వీసు (ఐఎఫ్ఎస్) అధికారి నితిన్ సుభాష్‌తో వివాహమైంది. భర్త ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసేవారు. భర్త మద్యపానం, ధూమపానం తదితర దురలవాట్లకు లోనయ్యారని, వీటిని వదలిపెట్టాలని అనేకసార్లు మొరపెట్టుకోగా కోపంతో దాడి చేశాడని వర్తికా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016లో ఇదే విషయమై దౌర్జన్యం చేసి తన చేయి విరిచాడని తెలిపారు. దీపావళికి కానుక ఇవ్వలేదంటూ విడాకులు కావాలని బెదిరించాడని వర్తికా పేర్కొన్నారు. తన అమ్మమ్మ వద్ద రూ.5 లక్షలు, ఇంటి కొనుగోలుకని రూ. 35 లక్షల నగదు తీసుకున్నాడని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు నితిన్ సుభాష్, అతని కుటుంబసభ్యులు మొత్తం 7 మందిపై వరకట్న వేధింపులు, దాడులు, ప్రాణ బెదిరింపులు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఈ ఐపీఎస్ అధికారి నిజంగా ఉక్కు మనిషే..
ముంబై: 16 గంటల వ్యవధిలో 3.8 కిమీ ఈత, 180.2 కిమీ సైకిల్ రైడ్, 42.2 కిమీ పరుగును పూర్తి చేసి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి. పింప్రి చించ్వాడ్ పోలీసు కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ ప్రకాష్.. 2017లో ప్రతిష్టాత్మక ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ టైటిల్‌ను సాధించడంలో భాగంగా ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత సివిల్ సర్వెంట్‌గా ఆయన రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. కాగా, ప్రపంచంలో అత్యంత కష్టతరమైన ఫీట్లలో ఒకటిగా పరిగణించబడే ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్‌ను, కృష్ణ ప్రకాష్ అవలీలగా పూర్తి చేసి.. భారత దేశ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి సివిల్ సర్వెంట్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను భారత్‌లో మరే ప్రభుత్వ అధికారి కానీ సాయుధ దళాలు, పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన అధికారులు కానీ సాధించకపోవడం గమనార్హం. అథ్లెట్లకు కూడా సాధ్యం కాని ఈ ఫీట్‌ను సర్వీస్‌లో ఉన్న కృష్ణ ప్రకాష్ సాధించడంతో అతన్ని నిజంగా ఉక్కు మనిషే అంటున్నారు నెటిజన్లు. -
డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్
ఇరవై ఏళ్లలో నలభై బదిలీలు ఉమాభారతి మాజీ సీఎం, మాజీ మంత్రి. హుబ్లీలో ఆమెను అరెస్టు చేయవలసి వచ్చింది! ఎవరున్నారు అరెస్ట్ చెయ్యడానికి?! రూప, ఐపీఎస్! శశికళ శక్తిమంతురాలైన ఖైదీ. పరప్పన జైల్లో ఆమెను వీవీఐపీలా చూస్తున్నారు. ఈ విషయాన్ని ధైర్యంగా బయటపెట్టిందెవరు? రూప, ఐపీఎస్! బెంగళూరు ‘సేఫ్ సిటీ’.. వందల కోట్ల ప్రాజెక్ట్. టెండర్లలో గోల్మాల్ జరుగుతోంది. ఆ అవినీతి గుట్టును రట్టు చేసిందెవరు? రూప, ఐపీఎస్. ఏం పోలీస్ ఆఫీసర్! ఎంత పవర్ఫుల్!! ఆ పవర్‌కు ప్రతిఫలం ఏంటో తెలుసా? ఇరవై ఏళ్లలో నలభై ట్రాన్స్ఫర్లు!! జనవరి ఒకటిన మళ్లీ ఇంకో బదిలీ. నేరస్థులకు హ్యాండ్‌కఫ్స్ వేయవలసిన రూప..‘హ్యాండ్లూమ్స్’ ఎండీ సీట్లో కూర్చున్నారు. రూప 2000 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. కర్ణాటక క్యాడర్. యూపీఎస్సీలో ఆలిండియాలో 5వ ర్యాంకు. హైదరాబాద్‌లోనే.. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషల్పోలీస్ అకాడమీ’లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఎం.ఎ. సైకాలజీ చేసి ఐపీఎస్ వైపు వచ్చారు. నేరాన్ని, అవినీతిని తేలిగ్గా పసిగట్టేయడం ఆమె సహజ నైజమేమో అనిపిస్తుంది. అందుకే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి దేశంలోనే తొలి లేడీ బాస్ అయ్యారు రూప! యువతలో స్ఫూర్తిని నింపడానికి తరచు ‘టెడెక్స్’ టాక్స్ (టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, డిజైన్) కూడా ఇస్తుంటారు. ఇరవై ఏళ్ల క్రితమే ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఇప్పటికీ కొత్తగా జాయిన్ అయిన ఆఫీసర్లానే చురుగ్గా, వేగంగా ఉంటారు. ఉండకూడదని కాదు. ఇరవై ఏళ్లల్లో నలభైసార్లు ఆమె బదిలీ అయ్యారు. ప్రమోషన్ మీద కొన్నిసార్లు, ప్రమోషన్ పేరుతో చాలాసార్లు. ఆమె తెగింపు కొన్నిసార్లు ప్రభుత్వానికి ఉపయోగపడింది. చాలాసార్లు తలనొప్పి అయింది. హుబ్లీ అల్లర్ల కేసులో విచారణ కోసం వచ్చిన ఉమాభారతిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి రూప అవసరం అయ్యారు. జైళ్ల శాఖ డీఐజీగా ఉన్నప్పుడు శశికళకు ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయని బయటపెట్టినందుకు మాత్రం ప్రభుత్వానికి ఆమె తలనొప్పి అయ్యారు. నెల తిరగ్గానే అక్కడి నుంచి ఆమెను ‘ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ’ కమిషనర్‌గా బదిలీ చేశారు. తాజా ట్రాన్స్ఫర్ కూడా అటువంటిదే. నగర మహిళల భద్రత కోసం సౌకర్యాలు కల్పించే ‘సేఫ్ సిటీ ప్రాజెక్టు’ టెండర్లో ఒక ఏసీపీ డబ్బు మూట కట్టుకుంటున్నాడని ఆరోపించినందుకు అతడిపై ఎంక్వయరీ చెయ్యకుండా (అతడిపై సీబీఐ చార్జిషీటు ఉన్నప్పటికీ) ఆమెను హస్తకళల వస్తూత్పత్తి విక్రయ కేంద్రానికి ఎండీగా బదిలీ చేశారు! బదలీకి ముందు ఆమె కర్ణాటక రాష్ట్రానికి తొలి మహిళా హోంశాఖ కార్యదర్శి! అంతెత్తు నుంచి కిందికి తోసేశారు. అయితే రూప ఎప్పుడూ హోదాలను ఉన్నత స్థానాలుగా భావించలేదు. ఎంత ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా మనిషిగా ఉండటం కన్నా పెద్ద డిజిగ్నేషన్ లేదంటారు ఆమె. ‘‘ప్రభుత్వం నియమించుకున్న ఒక ప్రజాసేవకురాలిని మాత్రమే నేను’ అంటారు. ఇరవై ఏళ్ల క్రితం ధార్వాడ్ జిల్లా ఎస్పీగా ప్రారంభమైన రూప కెరియర్ అనేక మలుపులు తిరుగుతూ, అనేక శాఖలను తాకుతూ ప్రస్తుతానికి కర్ణాటక హస్తకళాకేంద్రం ‘కావేరీ ఎంపోరియం’కి చేరుకుంది. ‘‘నేనేమీ చిన్నతనంగా భావించడం లేదు. బాధ్యత ఏదైనా బాధ్యతే. తక్కువ ఎక్కువ ఉండదు. కర్ణాటక హోయసల సాంస్కృతిక హస్త కళలకు దేశవ్యాప్త గుర్తింపు ఉంది. లక్షలాది మంది చందనశిల్ప, బిద్రీ లోహ కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తాను’’ అంటున్నారు రూప. అయితే మరొకసారి ఆమెను బదిలీ చేయవలసిన అనివార్యతల్ని ప్రభుత్వం ఎదుర్కొనేలా ఉంది! రెండుసార్లు రాష్ట్రపతి అవార్డు పొందిన ఈ పవర్ఫుల్ సీనియర్ పోలీస్ ఆఫీసర్‌ను కక్ష సాధింపుగా మాత్రమే ప్రాధాన్యంలేని పోస్టులోకి మార్చారన్న అసంతృప్తి కర్ణాటక ప్రజల్లోనే కాదు, దేశవ్యాప్తంగానూ వ్యక్తం అవుతూ ఉండటమే అందుకు కారణం. రూప, ఐపీఎస్ ఈ నెలలోనే తన పోలీస్ డ్యూటీలోకి తను మళ్లీ వెనక్కి వచ్చేయొచ్చు. ఈసారి మరింత శక్తిమంతంగా! మ్యూజిక్ ఇష్టం రూప తండ్రి దివాకర్ రిటైర్డ్ ఇంజినీర్. తల్లి హేమావతి గృహిణి. కర్ణాటకలోని దావణగెరె వారి స్వస్థలం. ఇద్దరే సంతానం. రూప, రోహిణి. ఆమె చెల్లెలు రోహిణి ఐఆర్ఎస్ ఆఫీసర్. రూప పెళ్లి 2003లో మునీష్ మౌద్గిల్‌తో జరిగింది. ఆయన ఐఎఎస్ ఆఫీసర్. ఇద్దరు పిల్లలు అనఘ, రోషిల్. రూపకు మ్యూజిక్ అంటే ఇష్టం. లలిత సంగీతంలో కొంత ప్రవేశం కూడా ఉంది. 2018లో మహిళా దినోత్సవం కోసం ఒక స్ఫూర్తిదాయకమైన మ్యూజిక్ వీడియోను కూడా రూపొందించారు. 2019 లో రిలీజ్ అయిన ‘బయలాతడ భీమన్న’ చిత్రంలో ‘కెంపానే సూర్య’ అనే పాట పాడారు. రూప, ఐపీఎస్ : చేనేత అభివృద్ధి కార్పోరేషన్ ఎండీగా పదవీ స్వీకారం -
‘స్వామి అగ్నివేశ్ మేక వన్నె పులి’
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. నివాళులర్పిస్తున్నారు. అయితే రిటైర్డ్ పోలీసు అధికారి ఒకరు ఇంటర్నెట్ వేదికగా స్వామి అగ్నివేశ్‌ని ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలలోని హిందూ వ్యతిరేకి అని.. ఆయన మరణాన్ని మంచి పనిగా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే... రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరావు.. స్వామి అగ్నివేశ్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘స్వామి అగ్నివేశ్ మీరు కాషాయ వస్రాలు ధరించిన హిందూ వ్యతిరేకి. మీరు హిందూ మతానికి అపారమైన నష్టం చేశారు. మీరు తెలుగు బ్రాహ్మణుడిగా జన్మించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. మీరు మేక వన్నె పులి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి యమధర్మరాజు ఎందుకు ఇంత సమయం తీసుకున్నాడా అని నేను ఆవేదన చెందుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు నాగేశ్వర రావు. (చదవండి: దేవుళ్ల రథాలపై మరింత నిఘా..) GOOD RIDDANCE @swamiagnivesh You were an Anti-Hindu donning saffron clothes. You did enormous damage to Hinduism. I am ashamed that you were born as a Telugu Brahmin. మేక వన్నె పులి गोमुख व्याग्रं Lion in sheep clothes My grievance against Yamaraj is why did he wait this long! https://t.co/5g7oKL62pO — M. Nageswara Rao IPS (@MNageswarRaoIPS) September 11, 2020 ఈ వ్యాఖ్యల పట్ల నెటిజనులతో పాటు డిపార్ట్మెంట్కు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమే కాక మానవ జీవితానికి సిగ్గు చేటు అన్నారు. ఇక పోలీస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఓ వ్యక్తి ఇటువంటి ద్వేషపూరిత సందేశాలను ట్వీట్ చేస్తూ.. అతను ధరించిన పోలీసు యూనిఫామ్‌ను అపవిత్రం చేశాడు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడు. అతను దేశంలోని మొత్తం పోలీసు బలగాలను, ముఖ్యంగా యువ అధికారులను నిరుత్సాహపరిచాడు’ అంటూ ట్వీట్ చేసింది. GOOD RIDDANCE @swamiagnivesh You were an Anti-Hindu donning saffron clothes. You did enormous damage to Hinduism. I am ashamed that you were born as a Telugu Brahmin. మేక వన్నె పులి गोमुख व्याग्रं Lion in sheep clothes My grievance against Yamaraj is why did he wait this long! https://t.co/5g7oKL62pO — M. Nageswara Rao IPS (@MNageswarRaoIPS) September 11, 2020