చేయి తగిలిందని పోలీస్‌ మార్క్‌ కేసు! | Hyderabad Pub Case: Doctor Harassed IPS Officer Wife Case Full Details Inside | Sakshi

చేయి తగిలిందని పోలీస్‌ మార్క్‌ కేసు!

Sep 23 2024 9:03 AM | Updated on Sep 23 2024 9:34 AM

Hyd Pub Case: Doctor Harassed IPS Officer Wife Case Full Details

గచ్చిబౌలి: పబ్‌లో చేయి తగిలిందని ఓ డాక్టర్‌ మీద కేసు నమోదు చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఫెనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ లోని తబులా రసా పబ్‌కు ఓ ఐపీఎస్‌ ఆఫీసర్‌ భార్యతో కలిసి వెళ్లారు. అదే పబ్‌కు కొంత మంది డాక్టర్లు వెళ్లారు. ఐపీఎస్‌ భార్య వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మదీనాగూడకు చెందిన ఓ డాక్టర్‌ చేయి తగిలింది. పొరపాటు జరిగిందని సదరు డాక్టర్‌ ఆమెకు సారీ చెప్పారు. 

అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆమె జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ తర్వాత క్షణాల మీద గచ్చిబౌలి పోలీసులు పబ్‌కు చేరుకున్నారు. సదరు డాక్టర్‌ను గచ్చిబౌ పీఎస్‌కు తరలించారు. నేను కావాలని చేయలేదని, యాదృచి్ఛకంగా జరిగిందని చెప్పినా పోలీసులు శాంతించలేదు. మద్యం ఎక్కువ తాగి అసభ్యంగా ప్రవర్తించాడా అనేది నిర్ధారించుకునేందుకు బ్రీత్‌ ఎనలైజర్‌ చేశారు. మద్యం అతిగా తాగలేదని తేలినట్లు సమాచారం. గంటల తరబడి స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. 

మరుసటి రోజు పబ్‌ నిర్వాహకులతో ఫిర్యాదు తీసుకొని ఆ డాక్టర్‌పై కేసు నమోదు చేసి, నోటీసు ఇచ్చి పంపించారు. మహిళలను కించపరిచే వ్యవహరించినా, అసభ్యంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాని ఐపీఎస్‌ భార్య కావడంతో చిన్న విషయానికి పోలీసులు హంగామా చేశారనే ప్రచారం జరుగుతోంది. సామాన్యుల ఫిర్యాదుపైనా పోలీసులు ఇలానే వ్యవహరిస్తే బాగుండేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం తబులా రసా పబ్‌ కేసుపై నోరు మెదపడం లేదు. కేసు గురించి మాకు తెలియదని, కేవలం పబ్‌లలో తనిఖీలు మాత్రమే చేశామని గచ్చిబౌలి పోలీసులు బుకాయించడం గమనార్హం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement