
భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి జీవితం వెండితెరపైకి రానుంది. ‘బేడి: ది నేమ్ యు నో.. ది స్టోరీ యూ డోన్ట్’ అనే టైటిల్‌తో ఆమె బయోపిక్ తెరకెక్కనుంది. ‘వన్ వే, అనదర్ టైమ్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు అందుకున్న దర్శక–నిర్మాత, రచయిత కుశాల్ చావ్లా ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ స్లేట్ పిక్చర్స్ పతాకంపై గౌరవ్ చావ్లా ఈ సినిమాను నిర్మించనున్నారని, వచ్చే ఏడాది ఈ సినిమా విడుదయ్యేలా ప్లాన్ చేస్తున్నారని టాక్.
‘‘కిరణ్ బేడీగారు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాత్రమే కాదు... ఆమె జీవితంలోని వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక 1966లో జాతీయ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌గా వార్తల్లో నిలిచారు కిరణ్ బేడీ. ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎన్నో సంస్కరణలు చేశారు. ‘పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేశారు. అలాగే రామన్ మెగసెసే అవార్డ్స్‌తో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు కిరణ్ బేడీ. ఇక వెండితెరపై ఆమె పాత్రను ఎవరు చేస్తారు? అనేది చిత్రబృందం ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment