kiran bedi
-
వెండితెరపై కిరణ్ బేడీ బయోపిక్.. టైటిల్ ఇదే!
భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి జీవితం వెండితెరపైకి రానుంది. ‘బేడి: ది నేమ్ యు నో.. ది స్టోరీ యూ డోన్ట్’ అనే టైటిల్‌తో ఆమె బయోపిక్ తెరకెక్కనుంది. ‘వన్ వే, అనదర్ టైమ్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు అందుకున్న దర్శక–నిర్మాత, రచయిత కుశాల్ చావ్లా ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ స్లేట్ పిక్చర్స్ పతాకంపై గౌరవ్ చావ్లా ఈ సినిమాను నిర్మించనున్నారని, వచ్చే ఏడాది ఈ సినిమా విడుదయ్యేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ‘‘కిరణ్ బేడీగారు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాత్రమే కాదు... ఆమె జీవితంలోని వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక 1966లో జాతీయ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌గా వార్తల్లో నిలిచారు కిరణ్ బేడీ. ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎన్నో సంస్కరణలు చేశారు. ‘పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేశారు. అలాగే రామన్ మెగసెసే అవార్డ్స్‌తో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు కిరణ్ బేడీ. ఇక వెండితెరపై ఆమె పాత్రను ఎవరు చేస్తారు? అనేది చిత్రబృందం ప్రకటించలేదు. -
ఢిల్లీ మంత్రి జైలు విలాసాలపై ఘాటుగా స్పందించిన కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో శిక్షననుభవిస్తున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్ ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. జైలులో పోక్సో కేసులో నిందితుడైన ఖైదీతో మసాజ్ చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. జైలులో ఉంటూనే సకల రాజభోగాలు అనుభవిస్తున్నారు. గదిలోనే రుచికరమైన ఆహారం, తనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లాగిస్తూ ఇటీవల కెమెరాకు చిక్కారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా సత్యేంద్ర జైన్ జైలు విలాసాలపై పుదుచ్చేరి మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఘాటుగా స్పందించారు. మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియోథెరపీలో డిగ్రీ చేశాడా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. జైన్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ జాతీయా మీడియాతో గురువారం మాట్లాడారు. చదవండి: మసాజ్ వీడియో మరువకముందే మరొకటి.. జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు.. తీహార్ జైలు పాలకుల తప్పిదం.. ఢిల్లీ రాజకీయ పాలనకు అద్దం పడుతోందని మండిపడ్డారు. తమ సొంత మంత్రి జైలులో ఉంటే అధికారులు మాత్రం ఎలా చర్యలు తీసుకుంటారని సెటైర్లు వేశారు. ‘సొంత మంత్రి జైలులో ఉండటం చాలా అరుదైన సందర్భం.. లోపల ఉన్న జైలు బాస్ ఇప్పటికీ బాస్‌గా కొనసాగుతున్నాడు. అతను ఏదైనా చేయగలడు, అడగగలడు. అతని ఆదేశాలకు జూనియర్లు కట్టుబడి ఉంటారు. అవకతవకలు జరిగాయని సూపరింటెండెంట్ని ప్రభుత్వ సస్పెండ్ చేసింది. మరి మంత్రి సంగతేంటి? ఇలా ఎన్నికైన ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేసే వ్యవస్థ మనకు లేదా. ఆప్ నేతకు మసాజ్ చేస్తున్న ‘పెద్దమనిషి’ ఫిజియో కాదని తెలిసింది. అతను అత్యాచారం కేసులో నిందితుడని జైలు అధికారులు పేర్కొంటున్నారు. మరి అతనికి ఫిజియోథెరపీలో డిగ్రీ ఉందా.. లేదా రేప్ చేయడానికి ముందు అతను ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేశారా’ అంటూ ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అనుమతి ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ జైన్ సస్పెన్షన్ లేదా తొలగింపును రాష్ట్రపతికి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. కాగా భారత తొలి మహిళా ఐపీఎస్ అధికారిణీ అయిన కిరణ్ బేడీ.. 1993లో ఢిల్లీ జైళ్ల ఐజీగా నియమితులయ్యారు. తిహార్‌లో జైళ్ల డైరెకర్ట్ జనరల్‌గా ఉన్న సమయంలో పలు జైలు సంస్కరణలు ప్రవేశపెట్టినందుకు రామన్ మెగాసెస్ అవార్డు పొందారు. 2015లో బీజేపీలో చేరారు. చదవండి: అయినాసరే ఆడబిడ్డల్ని గమనిస్తూ ఉండాలి: కిరణ్ బేడీ -
అయినాసరే ఆడబిడ్డల్ని గమనిస్తూ ఉండాలి: కిరణ్ బేడీ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది శ్రద్ధా వాకర్ హత్యోదంతం. దేశ రాజధానిలో ప్రియుడి చేతిలో కిరాతకంగా హత్యకు గురైంది ఆమె. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచి.. ఆపై నగరంలో అక్కడక్కడ పడేశాడు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా. ఆలస్యంగా వెలుగు చూసి వార్తల్లో ప్రముఖంగా నిలిచిన ఈ కేసుపై మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో ఎలాంటి సంబంధం లేదని వాళ్లు చెప్పినా సరే ఆ మాటల్ని పట్టించుకోకూడదు. వాళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి అని తల్లిదండ్రులకు సూచించారామె. ఢిల్లీ ఉదంతంపై స్పందిస్తూ.. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ, ఆమె ఆచూకీ గురించి ఆలస్యంగా పట్టించుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కాబట్టి, జరిగిన దారుణానికి బాధ్యత ఆ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై కూడా ఉంటుంది అని కిరణ్‌బేడీ తెలిపారు. శ్రద్ధ తల్లిదండ్రులు ఆమె బాగోగుల గురించి మరింత పట్టించుకుని ఉండాల్సింది. ఆమె ఉంటున్న ఫ్లాట్ చుట్టుపక్కల వాళ్లు, యజమాని సైతం బాధ్యతగా వ్యవహరించి ఉండాల్సింది. ఒకరకంగా ఈ ఘటనకు ఆమె కుటుంబమే కారణంగా అనిపిస్తోంది. అంతేకాదు.. ఇది సమాజ వైఫల్యం, స్నేహితులది కూడా అని కిరణ్‌బేడీ ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆడపిల్లను పెంచే సామాజిక బాధ్యతపై ఆమె స్పందిస్తూ.. స్వతంత్ర భావజాలం అలవర్చుకునేలా అమ్మాయిలను పెంచాలని ఆమె తల్లులకు సూచించారు. ఆపై వారు(ఆడపిల్లలు) ఎలా ఉంటారో? ఎక్కడ జీవిస్తారో? అని ఆందోళన చెందొద్దని, వారికి భరోసా ఇవ్వడం కుటుంబం యొక్క బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రద్దా వాకర్ హత్య కేసు దర్యాప్తుపైనా స్పందించిన కిరణ్ బేడీ.. డేటింగ్ యాప్‌లో శ్రద్ధకు నిందితుడు అఫ్తాబ్ ఎలా దగ్గరయ్యాడు? అనే కోణంలోనూ తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టాలని అధికారులకు సూచించారామె. సంబంధిత వార్త: శ్రద్ధ శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో రొమాన్స్! -
'మామ్పవర్ 360’.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మహిళలను తిరిగి..
కెరీర్, కుటుంబం... వీటిలో విలువైనది ఏమిటి? అనే ప్రశ్నకు – విలువైన జవాబు... ‘రెండిటినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడం’ కుటుంబ బాధ్యతల్లో పడి విలువైన కెరీర్‌ను కోల్పోతున్న ప్రతిభావంతులైన మహిళలలో ‘మామ్పవర్ 360’తో స్ఫూర్తి నింపుతున్న లక్ష్మీ శేషాద్రి గురించి... బిడ్డకు తల్లి అయిన తరువాత ‘కెరీరా?’ ‘కుటుంబమా?’ అనే డోలాయమాన స్థితి ఎంతోమంది మహిళలకు ఎదురవుతుంది. చాలామంది కుటుంబాన్నే ఎంపిక చేసుకుంటారు. కెరీర్‌కు గుడ్‌బై చెబుతారు. నిజానికి వారు తమ రంగాలలో ప్రతిభావంతులు, ఎన్నో విజయాలు సాధించాల్సిన వారు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత జయశ్రీ ఉల్లాల్ ముందుకు ‘కుటుంబమా? కెరీరా?’ అనే ప్రశ్నలు వచ్చి నిలుచున్నాయి. కుటుంబం వైపే మొగ్గు చూపింది ఆమె మనసు. అయితే, ఆమె శక్తిసామర్థ్యాల గురించి తెలిసిన కుటుంబసభ్యులు ఇది సరికాదన్నారు. తన ప్రతిభ వృథా పోకూడదు అనుకున్నారు. జయశ్రీ మనసు మార్చుకుంది. కుటుంబ జీవితాన్ని, కెరీర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. జయశ్రీ ఉల్లాల్ కుటుంబ జీవితానికే పరిమితమై ఉంటే ‘అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్’ జాబితాలో ఆమె చోటు సంపాదించేది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్ల తాను వదులుకున్న కెరీర్లోకి మళ్లీ వచ్చి దూసుకుపోయింది. అయితే ఆ అదృష్టం చాలామందికి లేకపోవడం వల్ల ఇంటికే పరిమితమైపోతున్నారు. అలాంటి వారికి ‘మామ్పవర్ 360’ కొత్తశక్తిని ఇవ్వనుంది. లక్ష్మీశేషాద్రి ఈ సంస్థకు శ్రీకారం చుట్టింది. బెంగళూరుకు చెందిన లక్ష్మి ఇంజనీర్, సోషల్–ఎంటర్ప్రెన్యూర్, మిసెస్ ఇండియా యూనివర్స్–2016 మాతృత్వం తరువాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మహిళలను తిరిగి ట్రాక్‌పై తీసుకురావడానికి ‘మామ్పవర్ 360’ ద్వారా కృషి చేస్తోంది లక్ష్మీ శేషాద్రి. ‘ఎంపవర్ మామ్స్ ఆన్ ఏ 360 లెవెల్’ అనేది ఆమె నినాదం.మాతృత్వం తరువాత కెరీర్‌ను వదులుకున్న ప్రతిభావంతులైన మహిళలను ఒకే వేదికపై తీసుకురావడానికి, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ‘మామ్పవర్ 360’ క్రియాశీల పాత్ర పోషించనుంది. ‘మామ్ పవర్ కాన్ఫరెన్స్’ పేరుతో సదస్సులు నిర్వహిస్తారు. వీటికి ముఖ్య అతిథులుగా వివిధ రంగాలకు చెందిన మామ్–ఎచీవర్స్, మామ్–ఎంటర్‌ప్రెన్యూర్స్ హాజరవుతారు. తమ అనుభవాలను పంచుకుంటారు. ‘ఒకరితో ఒకరికి ఆత్మీయ సంభాషణకు వీలయ్యే అర్థవంతమైన వేదికకు రూపకల్పన చేయాలనేది నా లక్ష్యం. ఈ వేదికలో హోమ్‌మేకర్ మామ్, వర్కింగ్ మామ్, ఎంటర్ప్రైజింగ్ మామ్...ఉంటారు. మామ్పవర్ 360 ద్వారా ఆన్లైన్, ఆఫ్లైన్లలో టాక్ టు ఇన్స్పైరింగ్ ఉమెన్ కార్యక్రమాలు నిర్వహిస్తాం. కొత్త ఆలోచనలతో ముందడుగు వేయడానికి ఇవి ఉపకరిస్తాయి. ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇన్ఫ్లూయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్‌కు నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా మామ్పవర్ ఉపయోగపడుతుంది’ అంటుంది లక్ష్మీ శేషాద్రి. ప్యానల్లో కిరణ్ బేడి, రూప డి, నిరూప శంకర్, సిమ్రాన్ చోప్రా, గౌరీ కపూర్, డా.చైత్ర ఆనంద్, అను ప్రభాకర్, బిందు సుబ్రహ్మణ్యం... మొదలైన వారు ఉన్నారు. వృత్తి–వ్యకిగత జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అనే విషయంలో విలువైన సలహాలు ఇస్తారు. వీరితోపాటు ‘మదర్‌హుడ్ హాస్పిటల్స్’ టాప్ డాక్టర్స్, చైల్డ్ సైకాలజిస్ట్‌లు, ఫిట్నెస్, న్యూట్రిషన్, పేరెంటింగ్, రిలేషన్షిప్ ఎక్స్‌పర్ట్‌లు తమ సలహాలు అందిస్తారు. ‘గత రెండు సంవత్సరాలు...మహిళలకు కఠిన సమయం. ఇంటిపని, కుటుంబబాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో తమ శక్తిసామర్థ్యాల గురించి ఆలోచించే సమయం చిక్కడం లేదు. మామ్పవర్ 360 వేదిక ద్వారా తమను తాము పునరావిష్కరించుకునే అవకాశం మహిళలకు వస్తుంది’ అంటున్నారు మదర్‌హుడ్ హాస్పిటల్స్ సీయివో విజరత్న. -
ఉక్కు మహిళకు తగిన మహిళ.. కిరణ్ బేడి
1972లో 23 ఏళ్ల వయసులో ఐపీఎస్ సర్వీస్‌లోకి వచ్చిన కిరణ్ బేడి ప్రస్తుతం 72 ఏళ్ల వయసులో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నారు. నేరస్థులకు సింహస్వప్నంగా ఉంటూనే, నేర స్వభావం గల ఖైదీలను తిరిగి మనుషులుగా మార్చే విధంగా ఆమె జైలు సంస్కరణలను తీసుకొచ్చారు. తీహార్ జైలు ఇప్పుడు కొంచెం మానవత్వంతో ప్రవర్తిస్తోందంటే.. జైళ్ల ఇన్స్పెక్టర్ జనరల్‌గా బేడీ తీసుకున్న చర్యల కారణంగానే. ఆ క్రితం వరకు తీహార్‌లో శుభ్రత ఉండేది కాదు. ఖైదీలకు పోషకాహారం పెట్టేవాళ్లు కాదు. జైల్లో మానవ హక్కులన్నవే ఉండేవి కావు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా, యాంటీ టెర్రరిస్ట్ స్పెషలిస్టుగా కూడా మాదక ద్రవ్య సామ్రాజ్యాలపై, తీవ్రవాద కార్యకలాపాలపై బేడీ పట్టు బిగించారు. కిరణ్ బేడీ అమృత్సర్ అమ్మాయి. అక్కడి ఒక కాలేజ్‌లో పొలిటికల్ సైన్స్ టీచర్‌గా ఆమె కెరీర్ మొదలైంది. తర్వాత సివిల్స్ రాసి ఐ.పి.ఎస్. అయ్యారు. కెరీర్ మొదటి నుంచి కూడా ఆమె ఎంత స్ట్రిక్టుగా ఉండేవారో చెప్పడానికి ఇప్పటికీ ఒక సందర్భం ఉదాహరణల్లోకి వస్తుంటుంది. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏకంగా ప్రధాని ఇందిరాగాంధీ కాన్వాయ్‌లోని వాహనానికే ఆమె రాంగ్ పార్కింగ్ చలాన్ రాశారట! అందుకు శ్రీమతి గాంధీ ఆమెను ప్రశంసించి బ్రేక్ ఫాస్ట్‌కు పిలిచారని కూడా అంటారు. అయితే ఆ పిలవడం అన్నది అప్పుడు కాదు, వేరే సందర్భంలో అంటారు కిరణ్‌బేడీ. అయినా ఈ ఉక్కుమహిళ నుంచి స్ఫూర్తిని పొందడానికి సందర్భాలతో పనేముంది? అయినా ఏదో ఒక సందర్భం ఉండాలంటే మాత్రం.. ఈరోజు (జూన్ 9) కిరణ్ బేడీ జన్మదినం. -
షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన కిరణ్ బేడి... మండిపడుతున్న నెటిజన్లు
Shark Jumping Unbelievably High To Grab The Chopper: ప్రముఖులు, సెలబ్రెటీలు వైరల్ వీడియోలు పోస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్త ఉండాలి. లేదంటే నెటిజన్ల ట్రోలింగ్కి గురవ్వాల్సిందే. అచ్చం అలానే ఒక సినిమాలో సీన్‌ని వైరల్ వీడియో పోస్ట్ చేసి నెటజన్ల ఆగ్రహానికి గురయ్యారు మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ. అసలేం జరిగిందంటే...ఒక షార్క్ చేప సముద్రంలోంచి పైకి ఎగిరి హెలికాప్టర్ పై దాడి చేస్తున్న వైరల్ వీడియోని మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పైగా ఈ వీడియోకి నేషనల్ జియోగ్రాఫిక్ ఒక మిలియన్ డాలర్లు చెల్లించిందని కూడా ట్వీట్ చేశారు. నిజానికి ఇది 2017లో వచ్చిన ఫైవ్ హెడ్డ్ షార్క్ ఎటాడ్ చిత్రంలోని సన్నివేశం. దీంతో నెటిజన్లు ఈ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్‌కి గురై ఆమెను దారుణంగా ట్రోల్ చేయడవ మొదలుపెట్టారు. అంతేకాదు అత్యంత మేధావులైన ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులు ఇలాంటి ఫేక్ వీడియోని పోస్ట్ చేయడం ఏంటని ఒకరు, అయినా అసలు అదేలా సాధ్యం అని కూడా ఆలోచించకుండా ఈ వీడియోని పోస్ట్ చేశారంటు మరోకరు ఇలా రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో కిరణ్ బేడి స్పందించడమే కాకుండా మళ్లీ ఆ వీడియోని పోస్ట్ చేస్తూ పూర్తి వివరణ ఇచ్చారు. ఈ సన్నివేశం ఎక్కడ నుంచి వచ్చింది అనేదానికంటే అసలు అలా చేయాలనే ఊహ రావడం గ్రేట్ అని అన్నారు. అయినా ఇలాంటి సాహసోపేతమైన సన్నివేశాన్ని తీయాలనే ఆలోచన తట్టినందుకు మనం ప్రశంసించాలి అంటూ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. ఐతే ఆమె గతంలో కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు పోస్ట్ చేసి నెటిజన్ల ట్రోలింగ్కి గురయ్యారు. Watch this 🥹🥺🙄😳😲 pic.twitter.com/Io0PQb567U — Kiran Bedi (@thekiranbedi) May 11, 2022 (చదవండి: వైరల్ వీడియో: సింహాన్ని తరిమిన శునకం) -
కిరణ్ బేడీకి షాక్!
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాజకీయాలను ఎంతో సన్నిహితంగా గమనిస్తున్నవారిని సైతం ఆశ్చర్యపరిచే పరిణామం ఇది. అక్కడ ముఖ్యమంత్రి నారాయణస్వామి సారథ్యంలో కొనసాగుతున్న ప్రభుత్వం మరికొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వరకూ వుంటుందా...ఈలోగానే ఎమ్మెల్యేల రాజీనామాలతో కుప్పకూలుతుందా అని అందరూ ఆసక్తికరంగా చూస్తుండగా, ఎవరూ ఊహించని విధంగా అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పదవి కోల్పోయారు. వాస్తవానికి ఆమె అయిదేళ్ల పదవీకాలం కూడా మరో మూడు నెలల్లో ముగియాల్సివుంది. కానీ ఆమెను అలా సజావుగా రిటైర్ కానీయకుండా... కనీసం రాజీనామా చేయమని కూడా కోరకుండా ఉద్వాసన పలికి కేంద్రం భిన్నంగా వ్యవహరించింది. గవర్నర్లుగా వున్నవారికీ, ముఖ్యమంత్రులకూ పడని సంద ర్భాలు చోటుచేసుకోవటం కొత్తేమీ కాదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి చెందిన ప్రభు త్వాలుంటే ఈ వివాదం వుండదు. అలాగని విపక్షాలు ఏలుతున్న రాష్ట్రాలన్నిటా కూడా ఆ పరిస్థితి లేదు. గతంలో ఢిల్లీలో తరచుగా, ఈమధ్య పశ్చిమ బెంగాల్లో అప్పుడప్పుడు ఆ మాదిరి సమస్యలు ఏర్పడ్డాయి. ఇటీవలికాలంలో ఢిల్లీలో వివాదాలేమీ లేవనే చెప్పాలి. కానీ పుదుచ్చేరిలో అలా కాదు. 2016 మే నెలలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా వచ్చింది మొదలు కిరణ్ బేడీ నిరంతరం వివాదాల్లోనే వున్నారు. తనను తొలగించాక రాష్ట్ర ప్రజలనుద్దేశించి విడుదల చేసిన ప్రకటనలో లెఫ్టినెంట్ గవ ర్నర్గా రాజ్యాంగపరమైన, నైతికపరమైన బాధ్యతల్ని పవిత్ర కర్తవ్యంగా భావించి నిర్వర్తించినట్టు చెప్పుకున్నారు. ఆమె నిజంగా అలా అనుకునే ఈ నాలుగున్నరేళ్లూ పనిచేసివుండొచ్చు. కానీ ప్రజ లంతా అలా అనుకునేలా వ్యవహరించివుంటే వేరుగా వుండేది. దేశంలో తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా కిరణ్ బేడీ అందరికీ గుర్తుండిపోతారు. ఐపీఎస్ అధికారిగా ఆమె అందరి మన్ననలూ పొందిన సందర్భాలున్నాయి. అలాగే శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన అతి చిన్న అంశాల్లో అతిగా స్పందించి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలున్నాయి. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బ్రహ్మాండమైన రాజకీయ ఎత్తుగడగా లెక్కేసుకుని కిరణ్ బేడీని పార్టీలో చేర్చు కోవటమేకాక, ఆమెను సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించి బీజేపీ అధిష్టానం భంగపడింది. అయినా ఆ మరుసటి సంవత్సరం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ అవకాశం వచ్చింది. కానీ అక్కడ కూడా అంచనాలకు తగినట్టు ఆమె వ్యవహరించలేకపోయారు. కిరణ్ బేడీ తీరును నిరసిస్తూ 2019 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి నారాయణస్వామి వారం రోజులపాటు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎదుట ధర్నా సాగించిన సంగతిని ఎవరూ మరిచి పోరు. చివరకు సుదీర్ఘ చర్చలు నడిచి రాజీ కుదిరింది. కానీ ఆ తర్వాతైనా పెద్దగా మారిందేమీ లేదు. ప్రజలెన్నుకున్నవారు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించాలా, లెఫ్టినెంట్ గవర్నర్‌గా వున్నవారు సొంత చొరవతో దూసుకుపోతూ సమాంతరంగా పెత్తనం సాగించాలా అన్న వివాదం పుదుచ్చేరిలో చాన్నాళ్లుగా సాగుతోంది. పారిశుద్ధ్యం నుంచి అవినీతి వరకూ సమస్యలు తలెత్తినచోటల్లా కిరణ్ బేడీయే ప్రత్యక్షమవుతూ అధికారులకు ఆదేశాలు జారీచేయటం, వారిని మందలించటం వంటివి చేస్తుంటే జనం దృష్టిలో ప్రభుత్వం దోషిగా మారిన సందర్భాలున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నత్తనడకన పనులు సాగుతుండటం కిరణ్ బేడీలో అసహనం కలిగించి వుండొచ్చు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే వేరుగా వుండేది. అధికారులు సైతం అప్రమత్తంగా వ్యవహరించేవారు. లెఫ్టినెంట్ గవర్నర్ తీరు జన సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆటంకంగా మారిందని నారాయణస్వామి ఒకమారు ఆరోపించారు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఇద్దరి మధ్యా కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధానికి అంతేలేదు. ఆఖరికి నూతన సంవత్సర వేడుకలు ప్రజలు జరుపు కోవాలా, వద్దా అనే అంశంలోనూ ప్రభుత్వానికీ, ఆమెకూ మధ్య ఏకాభిప్రాయం లేదు. కరోనా కారణంగా ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని కిరణ్ బేడీ విజ్ఞప్తి చేయగా... కొన్ని శక్తులు ఈ వేడుకలను అడ్డుకోవాలని చూసినా ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారంటూ ఆ మర్నాడు నారాయణస్వామి ప్రకటించారు. కిరణ్ బేడీని తొలగించాలంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు వినతిపత్రం కూడా ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తీరు పెద్ద చర్చనీయాంశంగా మారితే అది అన్నా డీఎంకే–బీజేపీ కూటమికి నష్టం చేకూరుస్తుందని కేంద్రంలోని పెద్దలు భావించటం వల్లే తాజా పరిణామం చోటుచేసుకుందన్నది కొందరి విశ్లేషణ. అందులో నిజం లేకపోలేదు. ద్విచక్ర వాహనదారులకు తక్షణం హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలనడం, రేషన్ దుకాణాల్లో సరుకులిచ్చే బదులు నగదు బదిలీ చేయాలని కిరణ్ బేడీ పట్టుబట్టడం అధికార కూటమికి మాత్రమే కాదు... విపక్షానికి కూడా మింగుడు పడలేదు. ఎన్నికలు ముంగిట్లో వుండగా ఆమె ఇలా వ్యవహరించటం వల్ల కొంపమునుగుతుందని, కేందమ్రే ఆమెతో అలా చేయిస్తున్నదని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని విపక్షం భయపడింది. మొత్తానికి కిరణ్‌బేడీ పదవిలో వున్నçప్పటిలాగే పోగొట్టుకోవటంలోనూ సంచలనం సృష్టిం చారు. ఇక ఇన్నాళ్లూ ఆమెతో ఎడతెగని వివాదాల్లో చిక్కుకుని ప్రస్తుతం మైనారిటీలో పడిన నారాయణస్వామి సర్కారు పూర్తి పదవీకాలం పూర్తి చేసుకుంటుందా... కిరణ్ బేడీ తరహాలో ముందుగానే అధికారం నుంచి వైదొలగవలసి వస్తుందా అన్నది ఒకటి రెండురోజుల్లో తేలిపోతుంది. -
కిరణ్ బేడికి బై బై.. తమిళిసైకి బాధ్యతలు
సాక్షి చెన్నై/న్యూఢిల్లీ: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలక పరిణామాలు సంభవించాయి. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్రం పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపింది. మరొకరిని నియమించే వరకు ఆ బాధ్యతలు తమిళిసై నిర్వర్తిస్తారు. సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. మేలో జరగనున్న ఎన్నికల్లో కిరణ్ బేడీపై వ్యతిరేకతను ప్రతిపక్షాలు ప్రధాన ప్రచారాంశంగా మలుచుకోరాదనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత నెలలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన ఎ.నమశ్శివాయం ప్రధాన డిమాండ్లలో కిరణ్ బేడీ తొలగింపు ఒకటని సమాచారం. నారాయణ స్వామి ఏమంటున్నారు? మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ 2016 మేలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి నారాయణ స్వామి ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె పనితీరు అప్రజాస్వామికంగా ఉందంటూ నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. 2019లో, తిరిగి గత నెలలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసం ఎదుట నారాయణ స్వామి ధర్నాకు కూడా దిగారు. సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ..‘మా ఎమ్మెల్యే మల్లాడి నారాయణ స్వామిని కిరణ్ బేడీ పలుమార్లు వేధింపులకు గురి చేశారు. దీనిపై రాష్ట్రపతి కోవింద్‌కు కూడా ఫిర్యాదు చేశాం. రోజువారీ పరిపాలనా వ్యవహారాల్లోనూ కిరణ్ బేడీ జోక్యం చేసుకుంటున్నారు. సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’అని చెప్పారు. తన ప్రభుత్వానికి ఇప్పటికీ మెజారిటీ ఉందని సీఎం నారాయణ స్వామి ఎన్డీటీవీతో అన్నారు. కృష్ణారావు, కుమార్ల రాజీనామాలను ఆమోదించలేదనీ, అవి ఇంకా స్పీకర్ పరిశీలనలోనే ఉన్నాయన్నారు. నేడు రాహుల్ రాక బలం కోల్పోవడంతో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎం నారాయణస్వామి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలకు గాను 2016 ఎన్నికల్లో 15 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మిత్రపక్షాలుగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనవేలును ఆ పదవి నుంచి పార్టీ తొలగించింది. ఇటీవల మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే దీపా యన్దన్ సైతం రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసిన మల్లాడి కృష్ణారావు ఈనెల 15న ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్‌కుమార్ మంగళవారం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. స్పీకర్‌ను కలుపుకుని అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 10కి పడింది. మూడు డీఎంకే, ఒక స్వతంత్ర అభ్యర్థులను కలుపుకున్నా 14కి పరిమితం కాగలదు. ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3తో కలుపుకుని మొత్తం 14 సభ్యుల బలం ఉంటుంది. అధికార, ప్రతిపక్షాలకు సమబలం ఏర్పడడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఒక ఎమ్మెల్యేకు బీజేపీ గాలం వేస్తే మ్యాజిక్ ఫిగర్ 15 స్థానాలతో అధికారంలోకి రాగలదు. ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో పుదుచ్చేరి చేరుకున్న రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ దినేష్ గుండూరావుతో నారాయణస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాలోచనలు జరిపారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్నందున మంత్రివర్గమే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
పుదుచ్చేరి జిల్లా కలెక్టర్‌పై విష ప్రయోగం?
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి జిల్లా కలెక్టర్ పూర్వ గార్గ్‌పై విష ప్రయోగం జరిగిందన్న అభియోగాలతో సీబీ–సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఎం నారాయణస్వామి నేతృత్వంలో శుక్రవారం రాజ్‌నివాస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమం బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్లో అధికారులు గురువారం సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి సీసాలను అందజేశారు. కలెక్టర్ పూర్వగార్గ్ వాటర్ బాటిల్ తెరవగానే స్పిరిట్ వంటి రసాయనం వాసన గుప్పుమనడంతో తాగకుండా అధికారులకు అప్పగించారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. మిగతా బాటిళ్లలో మాత్రం స్వచ్ఛమైన నీరే ఉంది. జిల్లా కలెక్టర్‌కు అందజేసిన బాటిల్లోని నీరు మాత్రమే విషతుల్యంగా ఉండడంతో అధికారులు హతాశులయ్యారు.ఈ ఘటనను లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఖండించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కి వ్యతిరేకంగా సీఎం నారాయణస్వామి శుక్రవారం ధర్నా చేశారు. -
ఫోటోలు చూస్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి
పాత ఫొటోలు తిరగేస్తుంటాం. ఓ చోట వేళ్లు ఆగిపోతాయ్. ఏళ్లూ ఆగి, వెనక్కు వెళతాయి. ఓ ఐపీఎస్ వేళ్లు అలాగే ఆగాయి. కిరణ్ బేడీ ఫొటోలు పెట్టి..కనుక్కోండి ఎవరో అన్నాడు. ఈజీ పజిల్! ఉత్తేజాన్నిచ్చే పజిల్ కూడా.మనం నింపడం కాదు.. మనల్ని నింపే పజిల్.. బేడీ! ఒక పౌరుడిగా సోనూ సూద్ ఎలాంటి వారో, ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా దీపాంశు కబ్రా అలాంటి వారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆయన. ఈ కరోనా సమయంలో బాధితులకు ఆయన అందించని సహాయమే లేదు. అయితే ఈ స్టోరీ సోనూ సూద్‌ది గానీ, దీపాంశు కబ్రాది గానీ కాదు. సెప్టెంబర్ 15న దీపాంశు రెండు ఫొటోలు జతపరిచిన ఒక ఏకవర్ణ చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఈ వండర్ ఉమన్ ఆఫ్ ఇండియా ఎవరో ఊహించగలరా?’ అని ఆయన ప్రశ్న. ఆమె రాసిన పుస్తకం పేరు ఒకటేదైనా చెప్పమని కూడా ఆయన బ్రెయిన్ టీజర్ ఇచ్చారు. దీపాంశుకు ఇలాంటి పజిల్స్ పెట్టడం అలవాటు. వెంటనే అంతా ఉత్సాహంగా ఆ ‘చెప్పుకోండి చూద్దాం’లో పాల్గొన్నారు. ‘‘సర్.. మళ్లీ ఈజీ క్వొశ్చన్ అడిగారు! కరెక్ట్ ఆన్సర్స్ చెప్పీ చెప్పీ అలసిపోయాను సర్..’’ అని జోక్ చేస్తూ.. ‘‘ఆమె ఎవరో కాదు. ఈ దేశంలోని ప్రతి అమ్మాయికీ, ప్రతి మహిళకు ఇన్స్పిరేషన్. ఆమే.. కిరణ్ బేడీ’’ అన్నారు ఒకరు. ‘‘ఇప్పుడీమె పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్నారు’’ అని ఇంకొకరు.మిగతావి ఇలా ఉన్నాయి. ‘‘ఈ ఫొటోలు చూస్తుంటే నా ఒంటి మీద గూస్బంప్స్ వస్తున్నాయి సర్.’’ ‘‘భారతదేశ తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్, ప్రస్తుతం పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీ. ఆమె రాసిన ఒక పుస్తకం ‘ఇటీజ్ ఆల్వేస్ పాజిబుల్: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ తీహార్ ప్రిజన్’’ ‘‘తొలి ఐపీఎస్ మహిళా అధికారి మాత్రమే కాదు, టెన్నిస్ చాంపియన్ కూడా’’. ∙∙ కరెక్టే. ఆమె కిరణ్ బేడీనే. తేలిగ్గానే తెలుస్తోంది. నలభై ఐదేళ్ల క్రితం 1975 రిపబ్లిక్ డే పరేడ్‌లో మొత్తం పురుషులే ఉన్న ఢిల్లీ పోలీస్ దళాన్ని కిరణ్ బేడీ ముందుండి నడిపిస్తున్న ఫొటో ఒకటి, ట్రాఫిక్ డీసీపీగా ఏషియన్ గేమ్స్ ఏర్పాట్లకు ముందు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నప్పటి ఫొటో ఇంకొకటి.. ఈ రెండిటినీ కలిపి దీపాంశు కబ్రా పోస్ట్ చేశారు. ప్రత్యేక సందర్భంగా ఆయన ఈ ట్వీట్ చేయలేదు. ట్వీట్ చేయడంతో కిరణ్ బేyీ మళ్లీ సోషల్ మీడియాలో మరొకసారి ప్రాముఖ్యంలోకి వచ్చారు. దీపాంశు ప్రశ్నకు సమాధానంగా.. ‘‘కిరణ్ బేడీ మ్యామ్ చాలా స్ట్రాంగ్’’ అని షాలినీ అనే యువతి కామెంట్ పెట్టింది. అలాగే ఎక్కువ మంది బేడీ రాసిన పదిహేనుకు పైగా పుస్తకాలలో మరొకటి.. ‘వ్హాట్ వెంట్ రాంగ్.. అండ్ కంటిన్యూస్’ని ప్రస్తావించారు. అపరాధుల జీవితాల్లోని నీలి నీడల సంకలనం అది. 1972లో 23 ఏళ్ల వయసులో ఐపీఎస్ సర్వీస్‌లోకి వచ్చిన కిరణ్ బేడి ప్రస్తుతం 71 ఏళ్ల వయసులో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నారు. నేరస్థులకు సింహస్వప్నంగా ఉంటూనే, నేర స్వభావం గల ఖైదీలను తిరిగి మనుషులుగా మార్చే విధంగా జైలు సంస్కరణలను తీసుకొచ్చారు. తీహార్ జైలు ఇప్పుడు కొంచెం మనిషిగా ప్రవర్తిస్తోందంటే.. జైళ్ల ఇన్స్పెక్టర్ జనరల్‌గా బేడీ తీసుకున్న చర్యల కారణంగానే. ఆ క్రితం వరకు తీహార్‌లో శుభ్రత ఉండేది కాదు. ఖైదీలకు పోషకాహారం పెట్టేవాళ్లు కాదు. జైల్లో మానవ హక్కులన్నవే ఉండేవి కావు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా, యాంటీ టెర్రరిస్ట్ స్పెషలిస్టుగా కూడా మాదక ద్రవ్య సామ్రాజ్యాలపై, తీవ్రవాద కార్యకలాపాలపై బేడీ పట్టు బిగించారు. కిరణ్ బేడీ అమృత్సర్ అమ్మాయి. అక్కడి ఒక కాలేజ్‌లో పొలిటికల్ సైన్స్ టీచర్‌గా ఆమె కెరీర్ మొదలైంది. తర్వాత సివిల్స్ రాసి ఐ.పి.ఎస్. అయ్యారు. కెరీర్ మొదటి నుంచి కూడా ఆమె ఎంత స్ట్రిక్టుగా ఉండేవారో చెప్పడానికి ఇప్పటికీ ఒక సందర్భం ఉదాహరణల్లోకి వస్తుంటుంది. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏకంగా ప్రధాని ఇందిరాగాంధీ కాన్వాయ్‌లోని వాహనానికే ఆమె రాంగ్ పార్కింగ్ చలాన్ రాశారట! అందుకు శ్రీమతి గాంధీ ఆమెను ప్రశంసించి బ్రేక్ ఫాస్ట్‌కు పిలిచారని కూడా అంటారు. అయితే ఆ పిలవడం అన్నది అప్పుడు కాదు, వేరే సందర్భంలో అంటారు కిరణ్‌బేడీ. అయినా ఈ ఉక్కుమహిళ నుంచి స్ఫూర్తిని పొందడానికి సందర్భాలతో పనిలేదు. అందుకే కదా దీపాంశు ట్విట్టర్లో ఈ వండర్ ఉమన్‌ను తలచుకుని, తలపింపజేశారు. -
దుకాణదారుల నిర్లక్ష్యం..ఇకపై సహించం : కిరణ్ బేడి
పుదుచ్చేరి : కరోనా నిబంధనలు ఉల్లంఘించే దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి బుధవారం హెచ్చరించారు. ఒక దుకాణదారుడు నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఆ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టివేసినట్లే అవుతుందన్నారు. అంతేకాకుండా షాపు యజమాని కుటుంబంతో సహా ఎంతోమంది జోవనోపాదిపై ఈ ప్రభావం పడుతుందన్నారు. కాబట్టి ప్రభుత్వ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఒకరిద్దరు దుకాణాదారుల నిర్లక్ష్యంతో వందల మందికి కరోనా సోకే అవకాశం ఉందని, దుకాణాదారులందరూ తమ ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోలన్నారు. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నా భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో మాత్రం విఫలమవుతున్నారని పేర్కొన్నారు. (అంబేడ్కర్ ఇంటిపై దాడి ) మార్కెట్ అసోసియేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లు కరోనా నివారణ చర్యల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కిరణ్ బేడీ కోరారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ నిర్వహిస్తూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు. పుదుచ్చేరి వ్యాప్తంగా రోజుకి 70 కిపైగా కేసులు నమోదవుతున్నందున ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇందులో ప్రజల సహకారం ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఇక గడిచిన 24 గంటల్లో పుదుచ్చేరిలో 112 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. (‘ఆర్థిక సంక్షోభం తీవ్రతరం’ ) -
కౌంట్‌డౌన్ మొదలైంది!
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడి నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో వసంతంలోకి అడుగు పెట్టారు. ఈసందర్భంగా తన సేవలను గుర్తు చేస్తూ పుదుచ్చేరి ప్రజలకు ఆమె ఓ లేఖ రాయడమే కాదు, చివరగా కౌంట్‌డౌన్ మొదలైందంటూ ముగించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి 2016లో మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఆమె బాధ్యతలు స్వీకరించడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య నాలుగేళ్లుగా అధికార వార్ కొనసాగుతూనే వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం తాను లెఫ్టినెంట్ గవర్నర్‌గా పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు ముగించి, ఐదో వసంతంలోకి అడుగు పెట్టడంతో ప్రజలకు కిరణ్ ఓ లేఖాస్త్రం సంధించారు. అందులో తాను బాధ్యతలు స్వీకరించడం, ప్రజాహితాన్ని కాంక్షిస్తూ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. రాజ్ నివాస్ సేవల్ని, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేశారు. ప్రజాహిత కార్యక్రమాల్ని ఎన్నడూ రాజ్ నివాస్ అడ్డుకోలేదని వివరించారు. రాజ్ నివాసన్ ప్రజల నివాస్‌గా మారిందన్నారు. వారంలో ఓ రోజు ప్రజలతో మమేకం అయ్యే రీతిలో కార్యక్రమాలు సాగిందని గుర్తు చేస్తూ, ఇప్పుడు కరోనా అందుకు అడ్డు వచ్చినట్టు పేర్కొన్నారు. మున్ముందు ఈ కార్యక్రమాలు కొనసాగేనా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగు లక్ష్యంగా.. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు లక్ష్యంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ పరమైన సిద్ధాంతాల్ని పునఃపరిశీలించాల్సి ఉందని వివరించారు. మద్యం దుకాణాల వేలం, ఆస్తి, వినోద పన్నుల బకాయిల వసూళ్లు, కొన్నేళ్లుగా చెల్లించకుండా ఉన్న ప్రభుత్వ స్థలాల లీజుకు సంబంధించిన అద్దెల వసూళ్లు అంశాలపై పునఃపరిశీలన తప్పనిసరిగా పేర్కొన్నారు. కరోనా రూపంలో పర్యాటక ఆదాయం పూర్తిగా కోల్పోవడం జరిగిందని పేర్కొంటూ, ప్రస్తుతం చేతిలో ఉన్న ఆస్తుల ఆధారంగా ఆదాయం పెంచుకోవాల్సిన ఉందన్నారు. విజయన్ కమిటీ నివేదికను అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నియమించ బడ్డ లేదా ఎంపిక చేసిన అధికారులు నిబద్ధత, నిజాయితీతో పనిచేసి ప్రజల జీవన ప్రమాణాల మెరుగు, ఆర్థిక పరిస్థితుల మెరుగు దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఇలా అన్ని విషయాల గురించి ప్రస్తావిస్తూ, చివరగా పుదుచ్చేరికి సేవ చేయడానికి వచ్చి నాలుగేళ్లు పూర్తి అయిందని, ఐదో ఏట అడుగు పెట్టానని, ఇక, తన కౌంట్‌డౌన్ మొదలైందని ముగించారు. ఈ దృష్ట్యా, మళ్లీ అవకాశం ఇచ్చినా, ఆ పదవిలో కిరణ్ కొనసాగేది అనుమానమేనా అన్న చర్చ బయలు దేరింది. -
నెటిజన్ల ఆగ్రహానికి గురైన కిరణ్ బేడీ
ప్రపంచ దేశాలకు పాకుతున్న కరోనా వైరస్ ప్రజలను కబలిస్తూ అల్లకల్లోకలం సృష్టిస్తోంది. ఓ వైపు ఈ మహమ్మారి విజృంభిస్తుంటే.. అంతకంటే వేగంగా కరోనా వైరస్‌పై నకిలీ వార్తలు ప్రచారమవుతున్నాయి. సోషల్ మీడియాలో కరోనాపై ఫేక్‌న్యూస్‌లు పోస్ట్ చేస్తూ కొంతమంది ఆకతాయిలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయితే కరోనాపై అసత్య ప్రచారాలు చేయవద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే నొక్కి చెబుతున్నాయి. అలాగే వదంతులను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరిస్తున్నాయి. అయిన్పటికీ అనేకమంది తప్పుడు వార్తలను నమ్మి మోసపోతున్నారు. తాజాగా ఈ బాధితుల్లోకి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చేరారు. (ఓ గాడ్! మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా?) ఇటీవల కిరణ్ బేడి ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఓ ప్రాంతంలో కోడిపిల్లలు గుంపులుగా తిరుగుతున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘‘కోడిగుడ్డు వల్ల కరోనా వస్తుందన్న మూఢనమ్మకంతో మనం వాటిని పడేస్తున్నాం. అయితే అవన్నీ ఒక వారం తర్వాత పొదిగి ఇలా కోడిపిల్లలు అవుతాయి. ఇది సృష్టి స్వభావం. జీవితానికి దాని సొంత మార్గాలు ఉంటాయి’’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కిరణ్ బేడీ నకిలీ వీడియోను షేర్ చేశాశారని నెటిజన్లు మండిపడుతున్నారు. సాధారణంగా మనం ఉపయోగించే ఎగ్స్ ఎలా పొదుగుతాయని నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నకిలీ వార్తలు పోస్ట్ చేసేముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. అంతేగాక ‘వాట్సాప్‌ను అన్ఇన్స్టాల్ చేయండి. నేను మళ్లీ చెబుతున్నాను. వాట్సాప్ అన్ ఇన్స్టాల్ చేయండి’ అంటూ కిరణ్ బేడీపై కొంతమంది సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. (అసత్య ప్రచారానికి చెక్‌పెట్టేలా.. ) Eggs which were thrown as waste because of corona , after one week hatched . The creation of nature 🤔 (Fwded) Life has its own mysterious ways.. pic.twitter.com/H7wMQqc7jc — Kiran Bedi (@thekiranbedi) April 5, 2020 -
పుదుచ్చేరి సీఎంకు షాక్
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అధికార సమరంలో మరోసారి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గవర్నర్ నిర్ణయాలతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి సర్కారుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తాజాగా ఎన్నికల కమిషనర్ నియామకంలో ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి సర్కారుకు పక్కలో బల్లెంలా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మారారు. సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికార సమరం రోజు రోజుకూ ముదురుతూనే ఉంది. ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం సిద్ధం కాగా, దానిని అడ్డుకున్నారు. ఉచిత బియ్యంకు బదులుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు పంపిణీకి తగ్గ ఉత్తర్వులు ఇచ్చి సీఎంకు ఆమె షాక్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులను కోర్టు సైతం సమర్థించింది. దీనిని వ్యతిరేకిస్తూ నారాయణ స్వామి అప్పీలుకు వెళ్లి ఉన్నారు. అదే సమయంలో పర్యాటకంగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్న పుదుచ్చేరిలో రాష్ట్ర ప్రభుత్వం క్యాసినో క్లబ్స్ (పేకాట) ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయంలో కిరణ్ జోక్యం చేసుకున్నారు. క్యాసినోకు నో చెప్పేస్తూనే, చెక్ పెట్టేశారు. ఈ పరిణామాలు సీఎం నారాయణ స్వామి సర్కారును ఇరకాటంలో పడేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో దెబ్బ ఆ సర్కారుకు తప్పలేదు. చదవండి: సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది! ఎన్నికల కమిషనర్ నియమకంలో.. పుదుచ్చేరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ బాలకృష్ణన్‌ను సీఎం నారాయణస్వామి ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి చెక్ పెడుతూ కిరణ్ కొత్త బాట వేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల అధికారి నియమకానికి సంబంధించి పత్రికలకు ప్రత్యేక ప్రకటనలు ఇచ్చి, అర్హులైన వారిని ఎంపిక చేయడం కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాలకృష్ణన్ బాధ్యతలు స్వీకరించడంతో, ఆయన నియమక ఉత్తర్వులను రద్దుచేస్తూ కిరణ్ మరో ఉత్తర్వులిచ్చారు. వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. కిరణ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని మంత్రి నమశివాయం కోర్టు తలుపులు తట్టారు. కొన్ని నెలలుగా విచారణలో ఉంటూ వచ్చిన ఈ పిటిషన్ గురువారం తిరస్కరణకు గురైంది. అఖిల భారత స్థాయిలో దరఖాస్తులను ఆహ్వానించి, అర్హులైన వారిని ఎన్నికల కమిషనర్ పదవికి ఎంపిక చేయడం అన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇది కొత్త మార్గం అని, దీనిని ఆహ్వానించాల్సిన అవసరం ఉందంటూ, ఎన్నికల కమిషనర్ నియమకాన్ని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి సమర్థించారు. ఎన్నికల కమిషనర్ నియమకంలో నారాయణ సర్కారు భంగ పాటే కాదు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా పరిస్థితి మారింది. వరుసగా తమ సర్కారుకు ఎదురు దెబ్బలు కోర్టు రూపంలో తగులు తుండడంతో నారాయణకు సంక్లిష్ట పరిస్థితులు తప్పడం లేదు. చదవండి: సీఎంకి షాక్ ఇచ్చేలా హైకోర్టు ఉత్తర్వులు -
సీఎంకి షాక్ ఇచ్చేలా హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి షాక్ ఇచ్చే రీతిలో శుక్రవారం మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అధికార వార్‌లో తన పంతాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ నెగ్గించుకున్నారు. పుదుచ్చేరిలో ఉచిత బియ్యంకు బదులుగా రేషన్ కార్డుదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయడానికి తగ్గట్టు కిరణ్ ఇచ్చిన ఉత్తర్వులకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీకి సైతం కిరణ్ అడ్డుకట్ట వేశారు. ఉచిత బియ్యంకు బదులుగా రేషన్ కార్డుదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేయాలని ఉత్తర్వుల్ని ఆమె జారీ చేశారు. ఆమె ఉత్తర్వులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం ఆమోద ముద్ర వేయడంతో, దీనిని అమలు చేయాల్సిన అవశ్యం నారాయణ సర్కారుకు ఏర్పడింది. ఉచిత బియ్యం పథకానికి తమ ప్రభుత్వ నిధుల్ని కేటాయించడం జరుగుతోందని, ఇందులో కేంద్రం జోక్యం తగదని ఇప్పటికే నారాయణ స్వామి స్పష్టం చేసి ఉన్నారు. అలాగే, కిరణ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సైతం సాగాయి. చివరకు ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రీన్ సిగ్నల్.. ఈ ఉత్తర్వుల వ్యవహారం కోర్టుకు చేరడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏడాదిన్నర కాలంగా ఉచిత బియ్యం పంపిణీ అన్నది ఆగిపోయింది. ఈ పిటిషన్ మీద శుక్రవారం తుది విచారణ న్యాయమూర్తి కార్తికేయన్ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు తమ వాదనలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అని, కేంద్రం తీసుకునే నిర్ణయాలు, ఉత్తర్వులు అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ఇచ్చిన ఉత్తర్వులకు రాష్ట్రపతి ఆమోదం సైతం లభించి ఉందని వాదించారు. నారాయణస్వామి ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు ఉచిత బియ్యం పంపిణీకి పట్టుబడుతూ వాదన వినిపించారు. రాష్ట్ర నిధుల్ని వెచ్చిస్తున్నప్పుడు, కేంద్రం జోక్యం ఏమిటో అని ప్రశ్నించారు. వాదనల అనంతరం నారాయణస్వామి సర్కారుకు షాక్ ఇచ్చే రీతిలో న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. -
పాపాయితో హైలెవల్ మీటింగ్‌కి
పుదుచ్చేరిలోని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆఫీస్‌లో మంగళవారం అత్యవసర సమావేశం జరుగుతోంది. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడి! వివిధ శాఖల కార్యదర్శులు ఈ హైలెవల్ మీటింగ్‌కి హాజరయ్యారు. వారిలో ఐటీ శాఖ నుంచి వచ్చిన ఓ మహిళా కార్యదర్శి కూడా ఉన్నారు. సమావేశం గంభీరంగా సాగుతోంది. అంతలో.. మీటింగ్ హాలు బయట నుంచి పసిబిడ్డ ఏడుపు! ఆ ఏడుపు వింటూ మహిళా కార్యదర్శి స్థిమితంగా ఉండలేకపోయారు. అది గమనించారు కిరణ్ బేడి. ‘ఏమైంది?’ అన్నట్లు ఆమె వైపు చూశారు. ‘‘బయట ఏడుస్తున్నది నా కూతురే. పది నెలలు. నేను కనిపించకపోతే ఏడ్చేస్తుంది. వాళ్ల అమ్మమ్మ దగ్గర కూర్చోబెట్టి వచ్చాను’’ అని చెప్పారు ఆ ఆఫీసర్. పసికందు ఏడుపు ఆపడం లేదు. ‘‘వెళ్లి పాపను తెచ్చుకోండి’’ అన్నారు కిరణ్ బేడీ. ఆమె ముఖంలో సంతోషం. పరుగున వెళ్లి, పాపను ఎత్తుకుని తనతోపాటు లోపలికి తెచ్చుకుంది. ఆమె రాగానే మళ్లీ మీటింగ్ మొదలైంది. తల్లి ఒడిలో కూర్చొని ఉన్న పాప కూడా ఏడుపు మాని కిరణ్ బేడీ వైపే గంభీరంగా చూడ్డం మొదలు పెట్టింది. ఆ తల్లీ బిడ్డల ఫొటోను కిరణ్ బేడీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘చైల్డ్ ఈజ్ హ్యాపీ’ అని కామెంట్ రాశారు. స్ట్రిక్ట్ ఆఫీసర్ అని కిరణ్‌బేడీకి పేరు. దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారి. కుటుంబ బాధ్యతల వల్ల మహిళలు ఉద్యోగాలను సరిగా చేయలేరు అనే మాటను కిరణ్ ఒప్పుకోరు. బిడ్డ ఏడుస్తుంటే పనిపై ధ్యాసపెట్టడం తల్లికి కష్టమే. బిడ్డ దగ్గర ఉంటే ఆ తల్లి ఇంకా బాగా పనిచేస్తుంది అంటారు ఆమె. ఇప్పుడీ ట్విట్టర్లో కూడా కిరణ్ బేడీ ‘చైల్డ్ ఈజ్ హ్యాపీ’ అన్నారు కానీ.. ‘మదర్ ఈజ్ హ్యాపీ’ అని అనలేదు. దానర్థం.. పిల్లల లాలన కూడా డ్యూటీలో భాగమేనని. పిల్లల బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు. వాళ్లసంతోషం తల్లిని సంతోషంగా ఉంచుతుంది. పనిలో తల్లి సామర్థ్యాన్ని పెంచుతుంది. -
నిరసనల మధ్య కిరణ్‌బేడీ యానాం పర్యటన
తూర్పుగోదావరి, యానాం: యానాం విచ్చేసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పర్యటన గురువారం ప్రజల నిరసనల మధ్య ప్రారంభమైంది. స్ధానిక ప్రభుత్వ అతిథి గృహం వద్దకు చేరుకున్న నియోజకవర్గ పరిధిలోని వందలాదిమంది ప్రజలు నల్లజెండాలు, బెలూన్లు, ధస్తులు ధరించి ఆమె పర్యటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అడ్డుకుంటున్నారని, యానాం అభివృద్ధికి సంబంధించిన ఫైల్స్‌ను ఆమోదించకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఉచితబియ్యం పథకానికి సంబంధించి బియ్యం ఇవ్వడం లేదని, అభివృద్ధి పనులకు సంబంధించి కోట్లాది రూపాయలు నిలిపి వేశారని వారు ఆరోపించారు. పేదవర్గాలకు వ్యతిరేకంగా ఎల్జీ వైఖరి పేదవర్గాలకు వ్యతిరేకంగా ఎల్జీ కిరణ్‌బేడీ వ్యవహరిస్తున్నారని యానాం పర్యటన వల్ల ప్రజాసమస్యలు పరిష్కారం కాకపోగా, వేలాది రూపాయిల ప్రజాధనం ఆమె పర్యటకు, ఏర్పాట్లకు ఖర్చవుతున్నాయని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. గురువారం ఆయన çస్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహనిర్మాణాలు ఉన్నాయ ని చెబుతూ ఫ్రాన్స్‌తిప్ప, వెంకటరత్నం నగర్, అ య్యన్ననగర్, కురసాంపేట తదితర ప్రాంతాల్లోని భవనాలను తీసివేయాలని అన్యాయంగా ఎల్జీ ఆదేశాలు జారీ చేశారని వారికి విద్యుత్తు, తాగునీరు నిలుపుదల చేశారన్నారు. 2018లో యానాంకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరైతే నిర్మాణ పనులు చేపట్టకుండా నిలిపివేశారని, రూ.137కో ట్లతో చేపట్టే వరద నియంత్రణ çపనులను నిలిపివేశారని ఆరోపించారు. జీఎస్పీసీ కంపెనీ ఇచ్చిన రూ.19 కోట్లు వేట నష్టపరిహారంలో రూ.10 కోట్లు పంపిణీ చేసి మిగతా రూ.తొమ్మిది కోట్లు ఇవ్వకుండా నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఆమె అనుకూలంగా మీడియాలో ప్రచారానికి 12 మందిని పుదుచ్చేరి నుంచి రప్పించుకున్నారని, ఆమెకు ఆమెతో వచ్చిన వారికి కాకినాడలో ఒక ఖరీదైన హోటల్లో బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.52వేలు ఖర్చయ్యిందని ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. -
సీఎం.. నాతో పెట్టుకోవద్దు : గవర్నర్
పుదుచ్చేరి ప్రభుత్వంలో రాజ్యాంగాధినేత, ముఖ్యమంత్రి నడుమ వైషమ్యాలు కొత్తేమి కాదు. నారాయణస్వామి సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడి నియమితులైన రోజు నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే పరిణామాలు భగ్గుమంటున్నాయి. సాక్షి, చెన్నై: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంలో గవర్నర్ జోక్యం తగదని సీఎం నారాయణస్వామి, కేంద్రపాలిత ప్రాంతంలో గవర్నరే పాలనాధికారి అంటూ కిరణ్‌బేడి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. సీఎం అనేకసార్లు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ దశలో ఇరువురూ తాజాగా ఒకరిపై ఒకరు మరోసారి సవాళ్లు విసురుకున్నారు. పుదుచ్చేరి పాగూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తంగవేలు ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. నారాయణస్వామి, ఆయన కుమారుడు భూ అపహరణకు పాల్పడినట్లు, అందుకు ఆధారాలు కూడా ఉన్నట్లు తంగవేలు గవర్నర్ కిరణ్‌బేడీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తంగవేలు తనను కలిసి సీఎంపై చేసిన ఫిర్యాదులపై గవర్నర్ పత్రికాప్రకటన కూడా విడుదల చేశారు. నిరూపిస్తే రాజీనామా: సీఎం నారాయణస్వామి ‘నేను, నా కుమారుడు భూ అపహరణకు పాల్పడినట్లుగా ఆధారాలతో నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. అయితే ఆరోపణలు నిరూపించకుంటే ప్రజాజీవితం నుంచి తప్పుకునేందుకు కిరణ్‌బేడీ సిద్ధమా’ అని ముఖ్యమంత్రి నారాయణస్వామి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తంగవేలు గవర్నర్‌ను కలిసినపుడు తాను, తన కుమారుడు భూఅపరణ కేసులు ఎదుర్కొంటున్నట్లుగా ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. అంతేగాక అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె అనడమేగాక రాజ్‌నివాస్ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసిందని సీఎం చెప్పారు. ఈ ఆరోపణలను నారాయణస్వామి ఖండించారు. ఆధారాలు, పత్రాలు లేకుండానే కేవలం మౌఖికంగా ఆమె ఈ ఆరోపణలు చేశారని విమర్శించారు. ఫిర్యాదుపై విచారణ జరపకుండానే నిర్ధారించుకున్నారని అన్నారు. దీనిని బట్టి ఆమెకు పరిపాలన తెలియదని తేటతెల్లమైందని దుయ్యబట్టారు. తానే కాదు నా కుటుంబసభ్యులెవరైనా భూ అపహరణ కేసులను ఎదుర్కొంటున్నట్లు రుజువుచేస్తే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని పునరుద్ఘాటించారు. నిరూపించలేకుంటే ప్రజాజీవితం నుంచి తప్పుకునేందుకు ఆమె సిద్ధమాని ప్రశ్నించారు. నాతో ఢీకొనవద్దు: కిరణ్‌బేడి సీఎం నారాయణస్వామి విసిరిన సవాల్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. సీఎం సవాల్ విసరాల్సింది నాకు కాదు.. వారి ఎమ్మెల్యేకు. సదరు ఎమ్మెల్యేను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఆరోపణలు చేసింది వారి ఎమ్మెల్యేనే. తండ్రీ, కొడుకులు భూ అపహరణకు సంబంధించి ఆధారాలున్నట్లు చెప్పింది కూడా ఎమ్మెల్యే తంగవేలే. ఆధారాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని మీ ఎమ్మెల్యేకు సవాల్ విసరుకోండి. లేదా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆధారాలను సమర్పించాలని కోరండి. ఆధారాలుంటే సీబీఐకి అప్పగించాల్సిందిగా హితవు పలికాను కాబట్టి నాపై సవాళ్లు విసరొద్దు. సీబీఐ విచారణకు వస్తే ఆరోపణలను ఎదుర్కోండి. అంతేగానీ దయచేసి నాతో ఢీకొనవద్దు. -
సూర్యుడు ఓం అంటున్నాడు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న వీడియోలు నకిలీవా?, ఒరిజినల్‌వా అని తేల్చుకోలేని పరిస్థితి ఉంది. కొందరు సెలబ్రిటీలు సైతం తమ ట్విట్టర్ ఖాతాల్లో నకిలీ వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్ల ట్రోల్స్ బారిన పడిన వారు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ. ఇంతకీ విషయమేమిటంటే.. ‘సూర్యుడు ఓం అని పలుకుతున్నాడు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దాన్ని రికార్డు చేసింది’ అని ఆమె ఒక వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా శనివారం పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ ట్వీట్‌ను 7వేల మందికి పైగా రీట్వీట్ చేయడంతో పాటు వందల మంది దానిపై స్పందించారు. అయితే వాస్తవానికి ఇదో నకిలీ వీడియో. ఇది భారత వాట్సాప్ గ్రూపుల్లో చాలాకాలాంగా సర్క్యులేట్ అవుతోంది. అందులో ఎలాంటి ఓం వినిపించదు. దీంతో పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ‘‘సూర్యుడు.. ‘వాహ్ మోదీజీ.. వాహ్’ అని అనడం కూడా ప్రారంభిస్తాడు’’ అంటూ కిరణ్ బేడీపై వ్యంగ్య వ్యాఖ్యలు కనిపించాయి. అసలు సంగతి ఏంటంటే ‘సూర్యుడు నిశ్శబ్దంగా ఉండడు. సూర్యుడి గుండెచప్పుడు వినడం ద్వారా శాస్త్రవేత్తలు దానిలోని సౌర పదార్థాల ప్రవాహాలను, తరంగాలను, అలజడులను మరింత విస్తృతంగా శోధిస్తున్నారు. దీంతో గతంలో తెలియని అనేక సౌర రహస్యాలను తెలుసుకునేందుకూ వీలు ఏర్పడింది’ అని 2018లో నాసా ఒక ట్వీట్ చేసింది. -
మేడం.. ఇవేనా మీరు ప్రచారం చేసేది..!
పుదుచ్చేరి : సోషల్ మీడియా విసృతి పెరగడంతో వాస్తవాల కంటే అసత్య వార్తలే ఎక్కువగా ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌లో చాలామంది తమకు వచ్చిన మెజేజ్లలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే మరొకరికి ఫార్వార్డ్ చేస్తున్నారు. దాంతో మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. సచిన్ టెండూల్కర్, ఆనంద్ మహింద్ర వంటి వారు స్ఫూర్తిమంతమైన వార్తల్ని ప్రచారం చేస్తుండగా.. కొందరు ప్రముఖులు మాత్రం అనాలోచితంగా మెసేజ్‌లు ఫార్వార్డ్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ తాజాగా ఆ జాబితాలో చేరారు. ఎన్నో నెలలుగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఓ అసత్య వార్తను ఆమె ట్విటర్లో పోస్టు చేసి ట్రోలింగ్ బారిన పడ్డారు. ఆమె ఓ వీడియోను పోస్టు చేసి.. ‘సూర్యుడి నుంచి వస్తున్న ఓంకార శబ్దాన్ని నాసా రికార్డు చేసింది’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. నాసా గతంలో విడుదల చేసిన అసలు వీడియోను పోస్టు చేసి.. వాస్తవాలు తెలుసుకోండి మేడం..! అని కామెంట్లు చేస్తున్నారు. ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అత్యున్నత అధికారిగా ఉన్న వ్యక్తి ఇలాంటి నమ్మకాలను, అసత్యాలను ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ట్వీట్ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోండి అని ఎద్దేవా చేస్తున్నారు. కాగా, 40 రోజులపాటు సూర్యుడు, హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ (ఎస్‌వోహెచ్‌వో)కి చెందిన డేటాను మిచెల్సన్ డాప్లర్ ఇమేజర్ సాయంతో ఎ.కొసొవికెవ్ అనే శాస్త్రవేత్త ప్రాసెస్ చేశారు. ఈ వీడియోను 2018లో నాసా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. pic.twitter.com/ArRwljjDVE — Kiran Bedi (@thekiranbedi) January 4, 2020 -
సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది!
పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణస్వామిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కిరణ్ బేడీ పదవి బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచే సీఎం నారాయణస్వామిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. ప్రతిగా సీఎం నారాయణస్వామి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాగా.. గత కొద్దిరోజులుగా వీరిరువురి మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరుగుతోంది. పుదుచ్చేరి ఆదాయం పెంచుకునేందుకు కాసినోలు, మద్యం తయారీ సంస్థలు, లాటరీ కంపెనీలు స్థాపించాలని సీఎం నారాయణస్వామి భావిస్తుండగా, కిరణ్ బేడీ అందుకు అభ్యంతరం చెబుతుండడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నెలకొంది. చదవండి: 'పాకిస్తాన్ వెళ్లమంటారా అంటూ కేంద్రమంత్రి సీరియస్' ఈ క్రమంలో సీఎం నారాయణస్వామి కిరణ్ బేడీ గురించి ప్రస్తావిస్తూ.. ఆమె దెయ్యం, మనస్సాక్షి లేని వ్యక్తి, జర్మనీ నియంత హిట్లర్‌కు చెల్లెలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కిరణ్ బేడీ కూడా కాస్త ఘాటుగా స్పందించింది. సీఎం కాస్త హుందాగా నడుచుకుంటే మంచిదని హితువు పలికారు. కొన్నిరోజులుగా మీరు నన్ను అనేక పేర్లతో దూషిస్తున్న విధానం గమనిస్తున్నాను. ఇటీవలే మీ ప్రవర్తన హద్దుమీరింది. లెఫ్టినెంట్ గవర్నర్‌గా నేనెప్పుడూ ప్రజల క్షేమం గురించే ఆలోచిస్తాను. ఈ సందర్భంగా బుద్ధుడు పేర్కొన్న హితోక్తిని కూడా కిరణ్ బేడీ ప్రస్తావించారు. 'ఎవరైనా ఒకర్ని దూషించినప్పుడు రెండో వ్యక్తి ఆ తిట్లను స్వీకరించకపోతే, ఆ తిట్లు మొదటి వ్యక్తి వద్దే ఉంటాయి' అంటూ వ్యాఖ్యానించారు. -
మగపిల్లల్నే హద్దుల్లో పెంచాలి
ఇంట్లో ఆడపిల్లలకు జాగ్రత్త చెబితే ఆ పిల్ల ఒక్కటే సురక్షితంగా ఉంటుంది. ఇంట్లో మగపిల్లవాడిని.. ‘జాగ్రత్త’ అని హెచ్చరిస్తే బయటి ఆడపిల్లలంతా సురక్షితంగా ఉంటారు. ‘దిశ’ ఘటన తర్వాత అమ్మాయిల భద్రత కోసం అనేక మంది అనేక విధాలైన సలహాలు ఇస్తున్నారు. అందులో ఇదీ ఒకటిలా అనిపించవచ్చు. అయితే మిగతా సలహాల కన్నా ఇది ఫలవంతమైనది. ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు. ఒక జనరేషన్ మగపిల్లల్ని తల్లిదండ్రులు నియంత్రణలో పెంచితే.. ఇప్పుడు చాలామంది అంటున్నట్లు, ఆశిస్తున్నట్లు.. సమాజంలో మార్పు వస్తుంది. సమాజంలో మార్పు రావడం అంటే ఇంట్లో అబ్బాయిల్ని సంస్కారవంతంగా పెంచడం. ఈ సూచన ఇచ్చినవారు పుదుచ్ఛేరి గవర్నర్ కిరణ్ బేడీ. ‘‘తల్లిదండ్రులకు ఆడపిల్లల్ని మాత్రమే హద్దుల్లో పెంచడం తెలుసు. ఆ హద్దుల్నే మగపిల్లలకు ఏర్పరిస్తే, వాళ్ల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటే మహిళలపై నేరాలు వాటంతటవే తగ్గిపోతాయి’’ అని బేడీ అన్నారు. ఆవిడే ఇంకో సలహా కూడా ఇచ్చారు. పరీక్షల కోసం చదువులు కాకుండా.. విలువల కోసం విద్య అనే విధానం రావాలి అన్నారు. మరి దోషుల్ని శిక్షించడంపై బేడీ ఏమన్నారు? ‘శిక్ష తీవ్రంగా ఉండాలి. తప్పు చేసినవాళ్లకే కాదు, తప్పు చేయాలన్న ఆలోచన రాబోయిన వారు కూడా ఆ శిక్ష గుర్తొచ్చి హడలెత్తిపోవాలి అన్నారు కిరణ్ బేడీ. ‘దిశ’ దారుణ ఘటనపై స్పందించమని అడిగినప్పుడు ఆమె ఇలా అన్నారు. -
వకీల్ వర్సెస్ ఖాకీ: కిరణ్‌బేడీ మళ్లీ రావాలి!!
న్యూఢిల్లీ : పార్కింగ్ విషయంలో ఢిల్లీ పోలీసులు, న్యాయవాదుల మధ్య తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానలా మారింది. న్యాయవాదుల తీరును నిరసిస్తూ పోలీసులు ఆందోళన బాట పట్టారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద తమకు న్యాయం చేయాలన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. శనివారం నాటి ఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్ చూసి తప్పెవరిదో తేల్చాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిరసనకు ఐపీఎస్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. వివిధ రాష్ట్రాల పోలీసులు కూడా పెద్దఎత్తున వీరికి మద్దతు తెలుపుతున్నారు. ఆందోళన విరమించాలని ఉన్నతాధికారులు కోరుతున్నప్పటికీ తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించే వరకు ఆందోళన ఆపేది లేదని, దీనిపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులను కమిషనర్ పట్నాయక్ కేంద్ర హోంశాఖ అధికారులకు వివరించారు. ఈ ఘటనను సుమోటాగా తీసుకున్న ఢిల్లీ హైకోర్టు ఆదివారం విచారణ చేపట్టి, జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. స్పెషల్ కమిషనర్ (శాంతిభద్రతలు) సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయడంతోపాటు పలువురు పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. బార్ కౌన్సిల్ సభ్యులకు ఢిల్లీ హైకోర్టు సమన్లు పంపింది. గొడవ మొదలైంది ఇలా..! తీస్ హజారీ కోర్టు వద్ద పార్కింగ్ విషయంలో పోలీసులకు లాయర్లకు మధ్య శనివారం గొడవ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో 40 మంది లాయర్లకు కూడా గాయపడ్డట్టు సమాచారం. ఈ ఘటనపై సీరియస్ అయిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో ఇద్దరిపై వేటు వేయడమే కాకుండా గాయపడిన లాయర్లకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే లాయర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసులను బాధించింది. అదేవిధంగా సాకేత్ కోర్టులో ఓ పోలీసుపై పలువురు లాయర్లు దాడికి పాల్పడ్డారు. ఘర్షణకు పోలీసుల తీరే కారణమంటూ లాయర్లు సోమవారం నిరసన చేపట్టారు. లాయర్ల వల్లే ఘర్షణ వాతావరణం చోటుచేసుకుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘర్షణ తీవ్రం కావడంతోనే ముందు జాగ్రత్తగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలే న్యాయంకోసం ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలే, తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. అసాధారణరీతిలో రోడ్లపైకి రావడమే కాకుండా.. ఏకంగా పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుటే ఆందోళన చేపట్టారు. విధుల్లోకి రావాలంటూ సీనియర్ అధికారులు విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచి పోలీసులు నిరసనలు నిలిపివేయాలని కమిషనర్ పట్నాయక్ కోరారు. సోమవారం కూడా పోలీసులపై లాయర్లు దాడి చేయడం అనేది క్షమించరానిదన్న కమిషనర్ దీనిపై చట్టపరంగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. సంఘటన జరిగిన వెంటనే కొంతమంది పోలీసులు మాత్రమే నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్త దావానంలా వ్యాపించడంతో వందల సంఖ్యలో పోలీసులు తమ విధులకు బ్రేక్ ఇచ్చి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుని గొంతును కలిపారు. ఉన్నతాధికారులు స్పందించేవరకు వెనక్కి తగ్గేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటగంటకు నిరసనలో పాల్గొనే పోలీసుల సంఖ్య పెరిగిపోతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతేకాకుండా ఒక మార్గాన్ని ట్రాఫిక్ పోలీసులు మూసివేయడం జరిగింది. కిరణ్ బేడీ మళ్లీ రావాలి అంటూ పోలీసుల నినాదాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నిరసనకు దిగిన పోలీసు సిబ్బంది.. ఢిల్లీ సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి పోలీసులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. సీపీ అంటే ఎలా ఉండాలి.. కిరణ్ బేడీలా ఉండాలి అంటూ నినాదాలు చేశారు. కమిషనర్ గా మీరే కావాలంటూ దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీ ఫొటోలతో ప్లకార్డులు ప్రదర్శించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. తాము నిరసనలు చేపట్టేందుకు రాలేదని తమ బాధను పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చామని కొంతమంది పోలీసులు చెప్పారు. న్యాయవృత్తిలో ఉన్నవారే పోలీసులపై చేయి చేసుకుంటే సామాన్య ప్రజలు తమను లెక్కచేస్తారా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘హెల్మెట్ లేకపోవడం వల్లే సీఎం భార్య మృతి’
చెన్నై: ముఖ్యమంత్రి నారాయణ స్వామి భార్య హెల్మెట్ లేకుండా మృతి చెందినట్లు పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడి అన్నారు. పుదుచ్చేరి సీఎం, గవర్నర్ మధ్య ఘర్షణ వల్ల హెల్మెట్ చట్టం అమలులోకి రావడానికి చిక్కులు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడాన్ని నిరోధించడానికి నిర్బంధ హెల్మెట్ చట్టాన్ని సుప్రీం కోర్టు ప్రవేశపెట్టింది. అయితే తమిళనాడు, పుదుచ్చేరిలలో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం లేదు. ఇలా ఉండగా హెల్మెట్ లేకుండా వెళితే ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవాలని, వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలంటూ పోలీసు అధికారులకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర పోలీసు శాఖ హెల్మెట్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో నిమగ్నమైంది. పుదుచ్చేరి సీఎం గవర్నర్ మధ్య కోల్డ్‌వార్ కారణంగా ఈ వ్యవహారంలో అభిప్రాయబేదాలు తలెత్తాయి. హెల్మెట్ చట్టాన్ని అమలుపర్చడంలో చిక్కులు కొనసాగుతున్నాయి. ఇలా ఉండగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి భార్య కలైసెల్వి (52) 2013 మే 14న బంధువుతో బైకుపై వెళుతుండగా, పుదుచ్చేరి మురుగా థియేటర్ సిగ్నల్ సమీపంలో టెంపో వ్యాను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కిరణ్ బేడి శనివారం ప్రస్తావించారు. -
కిరణ్‌బేడీకి మద్రాస్ హైకోర్టు షాక్
-
ఐదో రోజుకు నారాయణస్వామి ధర్నా
పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి వైఖరికి నిరసనగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి రాజ్‌నివాస్ బయట చేస్తున్న ధర్నా ఆదివారం ఐదోరోజుకు చేరింది. సం క్షేమ పథకాలపై ప్రభుత్వ ప్రతిపాదనలకు బేడి ఆమోదం తెలపకుంటే నిరసనను తీవ్రతరం చేసి జైల్‌భరో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఉచిత బియ్య పంపిణీ పథకంతోపాటు మరో 39 సంక్షేమ పథకాల ప్రతిపాదనలు, పరిపాలనా సంబంధ నిర్ణయాల్ని లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బేడికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నాయకులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగరవేశారు. తమ నిరసన తెలిపేందుకు నల్ల జెండాలు ఎగరవేసే స్థాయికి చేరడం దురదృష్టకరమని నారాయణస్వామి పేర్కొన్నారు. విభేదాలపై ఫిబ్రవరి 21న బహిరంగ చర్చకు వస్తానని బేడి చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నానని చెప్పారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పుదుచ్చేరి వెళ్లి నారాయణస్వామి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. సంక్షేమ పథకాల అమలుకు అడ్డుపడుతున్న కిరణ్ బేడిని కేంద్రం వెనక్కి పిలవాల ని డిమాండ్ చేశారు. బేడి ప్రజాస్వామిక విలు వల్ని అణగదొక్కుతున్నారని ఆరోపించారు. -
అట్టుడుకుతున్న పుదుచ్చేరి..
సాక్షి, చెన్నై : ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదంతో పుదుచ్చేరి అట్టుడుకుతుంది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి.. ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కొన్ని రోజుల క్రితం పుదుచ్చేరి ప్రభుత్వం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలనే నియమాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని తక్షణమే పాటించాలంటూ కిరణ్ బేడి ప్రజలను ఒత్తిడి చేస్తుండటంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ బేడి చర్యలను వ్యతిరేకిస్తూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజ్‌భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ధర్నాకు పిలుపున్వివడంతో రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో భాగంగా బుధవారం నారాయణ స్వామి కిరణ్ బేడి ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీదే నిద్రపోయారు. సీఎంకు మద్దతుగా మంత్రులు, డీఎంకే కార్యకర్తలు కూడా అక్కడే బైఠాయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఈ విషయం గురించి నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను దశల వారిగా అమలు చేయాలి. అంతేతప్ప తక్షణమే జరిగిపోవాలంటూ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. కిరణ్ బేడి చర్యల వల్ల ప్రజల్లో మాపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆమె చర్యలను వ్యతిరేకిస్తూ.. రాజ్‌భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చాన’ని పేర్కొన్నారు. అంతేకాక నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే కిరణ్ బేడి తమను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. నారాయణస్వామి చేపట్టిన ధర్నాకు డీఎంకే కూడా మద్దతు పలకటంతో భారీ సంఖ్యలో జనాలు రాజ్ భవన్ ముందుకు చేరుకున్నారు. -
ట్రాఫిక్ పాఠాలు చెప్పిన కిరణ్ బేడీ
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతహాగా ఐపీఎస్ అధికారి. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌గా కొరడా ఝుళిపిస్తున్నారు. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ సర్కారుకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, మరో వైపు చాలా కాలం తర్వాత తనలోని ఐపీఎస్‌ను బయటకు తీశారు కిరణ్ బేడీ. సోమవారం నుంచి పుదుచ్చేరిలో హెల్మెట్ తప్పనిసరి చేశారు. అలాగే, సీట్ బెల్ట్ ధరించాల్సిందేనన్న హుకుం జారీ అయింది. ఉదయం నుంచే హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అన్నది అమల్లోకి రావడంతో కిరణ్ ఐపీఎస్ అవతారం ఎత్తక తప్పలేదు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటుగా, అవగాహన కల్పించే విధంగా పుదుచ్చేరిలోని పలు మార్గాల్లో ఆమె తిష్ట వేశారు. పోలీసులతో కలిసి వాహనదారులను బెంబేలెత్తించారు. హెల్మెట్ లేకుండా వెళ్లే వాళ్లను పిలిచి మరీ క్లాస్ పీకారు. పరిమితిని మించి ఓవర్ లోడింగ్‌తో సాగే వారి భరతం పట్టారు. ఓ మోటార్ సైకిల్ మీద ఇద్దరు మహిళల్ని ఎక్కించుకుని ఓ యువకుడు రాగా, అతిడికి తీవ్రంగానే క్లాస్ పీకారు. వెనుక ఉన్న మహిళల్లో ఓ యువతిని కిందకు దించేశారు. బస్సులో వెళ్లమని సలహా ఇచ్చారు. ఇక పిల్లల్ని ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాళ్లకు అయితే, కిరణ్ క్లాస్ ముచ్చెమటలు పట్టించక తప్పలేదు. సీట్ బెల్ట్ ధరించకుండా కార్లు నడిపిన వాళ్లను వదలి పెట్టలేదు. మంగళవారం నుంచి హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని హెచ్చరించి పంపించారు. -
‘మోదీకి నేనంటే చాలా ఇష్టం.. అందుకే’
సాక్షి, విశాఖపట్నం : దేశంలో నిరంకుశ పాలన అంతం కావాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్వాసన పలకడం ఒక్కటే మార్గమని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ‘ మేము(కాంగ్రెస్) ఆయనను బయటికి పంపాల్సిన అవసరం లేదు. ఆయన పాలన పట్ల ప్రతీ ఒక్కరిలో అసంతృప్తి రగులుతోంది. ఈ కారణంగా ఆయన సొంత మనుషులు, పార్టీ వాళ్లే ఏదో ఒకరోజు ఆయనను బయటికి నెట్టివేస్తారు. కేవలం ఇద్దరు మనుషుల చేతుల్లో బీజేపీ నలిగిపోతుందని ఆ పార్టీ నాయకులే నా దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం... ప్రధాని మోదీకి ముఖ్యమంత్రులతో మాట్లాడే సమయమే ఉండదని నారాయణ స్వామి విమర్శించారు. గతంలో ఆయన అపాయింట్మెంట్ కోసం ఆరు సార్లు ప్రయత్నిస్తే కనీసం రెండుసార్లైనా దొరికేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మోదీకి నేనంటే ఎంతో ఇష్టం. అందుకే కిరణ్‌బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పంపించారు’ అని నారాయణ స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా పాలన పరమైన విషయాల్లో కిరణ్‌బేడి అతిగా జోక్యం చేసుకుంటున్నారని, లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉండేకంటే ఓ చౌకీదార్‌లా ఉండేందుకే ఆమె ఉత్సాహం చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. -
గవర్నర్ కిరణ్ బేడీ ఎమ్మెల్యే అంబలగన్ మధ్య తీవ్ర వాగ్వాదం
-
లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఎమ్మెల్యే లెఫ్ట్‌రైట్..
ఉప్పలం : పుదుచ్చేరిలో గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వేదికపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే అంబలగన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కిరణ్ బేడీ సమక్షంలోనే ఆమె పనితీరును ఎమ్మెల్యే ఆక్షేపించడంతో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. కిరణ్ బేడీ పర్యవేక్షణలో తన నియోజకవర్గంలో ఎలాంటి పనులూ జరగలేదన్నారు. ఎన్నో ప్రాజెక్టులను ప్రకటించినా ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనకు సర్ధిచెప్పేందుకు కిరణ్ బేడీ ప్రయత్నించినా అంబలగన్ వినిపించుకోకుండా విమర్శల దాడి కొనసాగించారు. ఎమ్మెల్యే మైక్‌ను కట్ చేయాలని ఆమె అధికారులకు సూచించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆమెపై బిగ్గరగా కేకలు వేశారు. వేదిక దిగి వెళ్లిపోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ పదేపదే కోరినా నిరాకరించిన ఎమ్మెల్యే కిరణ్ బేడీనే సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. కిరణ్ బేడీపై ఎమ్మెల్యే అంబలగన్ విమర్శల దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. పుదుచ్చేరిలో అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తున్న బేడీని కేంద్రం వెనక్కిపిలవాలని ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య దూరం పెంచేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
చిన్న కష్టానికే అంతగా చలించిపోవడమా!!!
అమ్మ తిట్టింది...ఆత్మహత్య! ఒక్క మార్కు తక్కువొచ్చింది... ఆత్మహత్య!... ప్రతి చిన్నదానికీ ఏదో నిరాశ.. చేతిలోంచి జారిపడిన మట్టిముద్ద నేలపాలవుతుంది. మళ్ళీ లేవదు. అదే బంతి కిందపడితే వెంటనే పైకి లేస్తుంది. విద్యార్థులుగా మీరు నిభాయించుకోగలగాలి. తప్పయితే క్షమించండని అడగాలి. ఒప్పయితే ఒప్పని నిలబడాలి. ఒక్క మార్కు తక్కువొస్తే వచ్చేసారి కాలేజి ఫస్ట్ రా, యూనివర్శిటీ ఫస్ట్ రా...అదీ సాధన. అప్పడు నీవు చరిత్రకెక్కుతావు. ఇప్పుడు పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీ...ఒకనాడు తండ్రికి భారం కాకూడదని 20 కి.మీ. నడిచివెళ్ళి చదువుకుంది. ఐఏఎస్‌కి ప్రయత్నించింది. ఐపిఎస్‌కు ఎంపికయింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐపిఎస్ అధికారిగా రికార్డుకెక్కింది. ఇందిరాగాంధీ ఆమెకు ఆదర్శ మహిళ. ప్రధానమంత్రిగా శ్రీమతి గాంధీ ఉన్న కాలంలో జరిగిన ఏషియాడ్ క్రీడలప్పుడు ట్రాక్ ఇంచార్జిగా కిరణ్ బేడీని నియమించారు. ఒకరోజు విధుల్లో ఉండగా ట్రాక్ దగ్గర ప్రధానమంత్రి కారు ట్రాఫిక్ నియమాలకు విరుద్ధంగా పార్క్ చేసి ఉంది. అది ప్రధానమంత్రి కారు అని చెబుతున్నా పట్టించుకోకుండా క్రేన్‌తో వ్యాన్‌లో పెట్టించి పోలీస్ స్టేషన్‌కు తరలించింది. సామాన్యుడికి ఒక రూలు, ప్రముఖులకు మరో రూలా? ససేమిరా అంగీకరించేది కాదు. నియమోల్లంఘన జరిగితే ఎవరినీ లెక్కచేయకుండా విధులు నిర్వర్తించినందుకు చరిత్రలో బహుశా ఆమె పొందినన్ని బదిలీలు మరెవరూ పొంది ఉండలేదేమో. అయినా సరే. వెనకడుగు వేయలేదు. ఒకసారి రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాట్లను అత్యుత్తమంగా నిర్వహించినందుకు ఇందిరాగాంధీ ఆమెను ఆహ్వానించి తనతో కలిసి భోజనం చేసే అవకాశం కల్పించారు. కక్షసాధింపు బదిలీల్లో భాగంగా ఒకసారి ఆమెను తీహార్ జైలుకు డీజీగా పంపారు. ఒక్క తప్పుచేసి జీవితంలో ఇక్కడకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉత్తములుగా బతకాలని ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసి ఆమె దానిని అతి కొద్దికాలంలోనే ఆశ్రమంగా మార్చేసారు. అక్కడ విధుల్లో ఉన్నప్పుడే ఆమె ఒక పుస్తకాన్ని రాసారు. ఆ రోజున ఆమె ఉన్న స్థాయికి ప్రధానమంత్రిని అడిగినా వెళ్ళి ఆవిష్కరించి ఉండేవారు. కానీ పేరు మోసిన నేరస్థుడు, ఖైదీ ఛార్లెస్ శోభారాజ్‌తో ఆవిష్కరింపచేసారు. ఇన్ని కీర్తి ప్రతిష్టలు ఆవిడకేం ఒక్క రోజులో రాలేదు. జీవితంలో అన్ని కష్టసుఖాలకు ఓర్చి నిలబడింది. ఒక సంకల్పంపెట్టుకుంటే జీవితాంతం దానికోసం పరిశ్రమించాలి. అంతపెద్ద స్థాయికి వెళ్ళిపోయిన తరువాత కూడా ఎం.ఎస్. సుబ్బలక్ష్మిగారు ఒక కచ్చేరీ చేయాలంటే ఆరుగంటలు సాధన చేసి వెళ్ళేవారు. అదీ నిబద్ధత. దాన్ని జీవితంలో అలవాటు చేసుకోండి. అబ్దుల్ కలాం మంచి దార్శనికుడు. ఫెయిల్ (ఊఅఐఔ) అన్నమాటకు కొత్త నిర్వచనం చెప్పాడు. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ (ఊజీటట్ట అ్ట్ట్ఛఝp్ట ఐn ఔ్ఛ్చటnజీnజ) అంటే నేర్చుకోవడంలో ప్రథమ ప్రయత్నం చేసినవాడు.. అని. విఫలమయితే నిరాశపడకూడదు. మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో లే... మరోసారి ప్రయత్నించు. ‘‘నా దేశ విద్యార్థులు ఆ స్థాయిని అందుకోవాలి. ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి. వాళ్ళ వ్యక్తిత్వం పువ్వు వికసించినట్లు రేకురేకుగా వికసనం పొందాలి. వాళ్ళు అటువంటి ఆత్మ స్థయిర్యం పొందాలి.’’ అని కలాం కలలు కన్నాడు. ఆ కలలను నిజం చేయడమే ఆయనకు మీరు అర్పించే నివాళి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఫ్రాన్స్ విజయంపై కిరణ్ బేడీ ట్వీట్.. నెటిజన్ల ఫైర్!
న్యూఢిల్లీ : ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4 - 2 తేడాతో క్రొయేషియాపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్రాన్స్ జట్టుకి ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత పుదుచ్చేరి లెఫ్నినెంట్ గవర్నర్ కిరణ్ బేడి కూడా ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. కాస్తా భిన్నంగా చెప్పడంతో ట్విటర్ ఫాలోవర్స్ కిరణ్ బేడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. We the Puducherrians (erstwhile French Territory) won the World Cup. 👏👏🤣🤣 Congratulations Friends. What a mixed team-all French. Sports unites. — Kiran Bedi (@thekiranbedi) July 15, 2018 ‘పుదుచ్చేరి వాసులు(ఒకప్పటి ఫ్రెంచ్ పాలిత ప్రాంతం) ఫిఫా వరల్డ్ కప్ గెలిచారా...? అభినందనలు. క్రీడలే ఐక్యతకు చిహ్నం’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతమున్న పుదుచ్చేరి ఒకప్పడు ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కిరణ్ బేడి పుదుచ్చేరి వాసులను ఒకప్పటి ఫ్రెంచ్ వలసవాదులుగా గుర్తిస్తూ ఇలా ట్వీట్ చేశారు. కానీ నెటిజన్లకు కిరణ్ బేడి ట్వీట్ నచ్చలేదు. దాంతో వారు కిరణ్ బేడిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మేము భారతీయులం మేడమ్.. మీ ప్రచార కార్యక్రమాలు ఆపండి’ అని ట్వీట్ చేయగా మరికొందరు ‘నేను మాత్రం మీరు భారత భూభాగానికే గవర్నర్ అయ్యారని భావిస్తున్నాను. కానీ మీరు మాత్రం మమ్మల్ని ఫ్రెంచ్ వలసవాదులుగా గుర్తించి సంతోషిస్తున్నారు. ఏం చేస్తాం మా ఖర్మ. ఇంకా ఢిల్లీలో ఉన్న మూర్ఖులు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు. అదృష్టం అంత పని చేయలేదు’ అని ట్వీట్ చేశారు. There are other ways to celebrate a French victory than to be so servile I'm a born Pondicherrian, I don't feel I've won at all France won, and it's a game and I love the game.I don't need the crutch of a colonial mindset to enjoy Please do consider pulling this tweet down. — Alo Pal (@AloPal) July 15, 2018 మరొక నెటిజనైతే ఇంకాస్తా ఘాటుగానే స్పందించారు. ‘నేను పుదుచ్చేరి వాసిగానే జన్మించాను. ఫ్రెంచ్ టీం గెలిస్తే.. నేను గెలిచనట్లు అనుకోవడం లేదు. గెలిచింది ఫ్రాన్స్.. మేము కాదు. అయినా విజయాన్ని ఆస్వాదించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఒక వలసవాదిగానే గెలుపును ఆస్వాదించనవసరం లేదు. ముందు మీ ఆలోచనా విధనాన్ని మార్చుకొండి’ అంటూ విమర్శించారు. -
స్త్రీలోక సంచారం
పుదుచ్చేరి లñ ఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ నేడో, రేపో.. ఆ కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రి వేలు నారాయణస్వామిపై విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ మధ్య తెలెత్తిన వివాదాల కేసు విషయంలో.. ‘ప్రజాప్రతినిధుల పాలనా వ్యవహారాలకు గవర్నర్ అడ్డుతగలడం సరికాదు’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నారాయణ స్వామి ఉటంకిస్తూ, ఇది కిరణ్‌బేడీకి కూడా వర్తిస్తుందనీ, తన పాలనలో ఆమె జోక్యం చేసుకోవడం కోర్టు ధిక్కారం అవుతుందని అసందర్భంగా వ్యాఖ్యానించడంపై బేడీ ఆగ్రహంతో ఉన్నారు ::: కొద్ది రోజుల క్రితమే సోషల్ మీడియా నుంచి ‘క్విట్’ అయిన ఉక్రెయిన్ సంతతి హాలీవుడ్ నటి మిలా క్యునిస్ (35) తనెందుకు క్విట్ అయిందీ తొలిసారిగా వెల్లడించారు. సోషల్ మీడియాను ‘లౌడెస్ట్, యాంగ్రీయస్ట్, మోస్ట్ నెగటివ్’ అని అభిప్రాయపడిన మిలా, ‘కాస్మోపాలిటన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి వేదికలు.. దారిన పోయే ప్రతి దానయ్య అభిప్రాయానికీ చోటు ఇవ్వడంతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం నరకప్రాయం అవుతోంది’ అని వ్యాఖ్యానించారు. ‘పోటస్’ (ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్) పదవికి జరిగే ఎన్నికల్లో తనెప్పటికీ పోటీ చేసేది లేదనీ, అదేమీ నిష్కళంకమైన వ్యవహారం కాదని అమెరికన్ ప్రముఖురాలు, మీడియా మొఘల్ ఓప్రా విన్ఫ్రే అన్నారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తను పోటీ చేసే అవకాశాలున్నాయని కొద్దికాలంగా పదే పదే వస్తున్న వార్తల్ని ఖండిస్తూ, ‘నీచమైన, నికృష్టమైన, మోసపూరిత, దగాకోరు, వెన్నుపోటు రాజకీయ వ్యవస్థ.. నాలాంటి వాళ్లను మింగేస్తుంది. అందులో నేను ఇమడలేను’ అని వోగ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు ::: మహిళల డ్రైవింగ్‌పై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని సౌదీ అరేబియా జూన్ 24న తొలగించి వారమైనా కాకుండానే, నిషేధం ఎత్తివేతకు నిరసనగా ఒక మహిళ కారును తగలబెట్టి, పారిపోయిన దుండగుల కోసం మక్కా పోలీసులు గాలిస్తున్నారు. ఓ షాపింగ్‌మాల్ బయట పార్క్ చేసి ఉన్న తన కారును ఎవరో ఆగంతకులు దగ్ధం చేశారని సల్మా అల్‌షెరీఫ్ అనే 31 ఏళ్ల ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదుపై గత వారం రోజులుగా నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు ::: దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ జంగ్ సూక్.. సియోల్‌లోని ‘ఐవమ్ థియేటర్’లో చదువుతున్న భారతీయ విద్యార్థుల బృందాన్ని కలుసుకున్నారు. ఈ నెల 8 నుంచి 11 వరకు భర్త మూన్ జే ఇన్ (దక్షిణ కొరియా అధ్యక్షుడు) తో పాటు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో విద్యార్థులతో ముచ్చటించిన సూక్.. వారితో కలిసి ‘దంగల్’ సినిమాను చూసిన సందర్భంలో ఆమిర్ ఖాన్‌వే తను గతంలో మరో రెండు సినిమాలు చూసినట్లు కూడా చెప్పారు ::: అన్నా మే బ్లెస్సింగ్ అనే 92 ఏళ్ల మహిళను ఆరిజోనా పోలీసులు అరెస్టు చేసి, ఐదులక్షల డాలర్ల పూచీకత్తుపై మాత్రమే ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి వీలవుతుందని చెప్పడంతో తనను కారుణ్య మరణానికి అనుమతించమని ఆ వృద్ధ మహిళ విజ్ఞప్తి చేస్తున్నారు. తనను అనాథాశ్రమంలో చేర్చడానికి తన కొడుకు (72) చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకున్న అన్నా.. ఆ క్షణికావేశంలో అతడిని తుపాకీతో కాల్చి చంపడంతో ఆమెకీ పరిస్థితి దాపురించింది ::: బోన్ క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న మూడేళ్ల కాలిఫోర్నియా బాలిక స్కయ్ సర్వీన్ మెకార్మిక్.. అంతకుముందు ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం తన ఎముకల్లోని మూలుగ (బోన్ మ్యారో)ను దానం చేసిన హేడన్ ర్యాల్స్ అనే యువతి పెళ్లికి ‘ఫ్లవర్ గర్ల్’గా వెళ్లింది. పూలగుత్తి పట్టుకుని పెళ్లి కూతురు పక్కన తోడుగా ఉండేందుకు రమ్మని.. సరిగ్గా ఆ చిన్నారి బర్త్‌డే రోజే పిలుపు రావడంతో స్కయ్ తల్లిదండ్రులు కృతజ్ఞతాపూర్వకమైన సమ్మతిని తెలియజేస్తూ, తమ కూతురికి పునర్జన్మనిచ్చిన హేడర్ ర్యాల్స్ పెళ్లికి వెళ్లి వచ్చారు ::: వజ్రాల ఆభరణాలను విక్రయించే ప్రముఖ ఆస్ట్రేలియన్–బ్రిటిష్ కంపెనీ ‘రియో టింటో’.. తమ భారతీయ వాణిజ్య రాయబారిగా ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్‌ని ప్రకటించింది. ‘ఒకప్పుడు రాజులకు, రాణులకు మాత్రమే అందుబాటులో ఉన్న వజ్రాల ఆభరణాలు ఇప్పుడు సామాన్య పౌరులు కూడా కొనగలిగే ధరల్లో లభ్యం అవుతున్నాయని’.. ముంబైలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో మిథాలీ అన్నారు. -
మన్మోహన్ సింగ్‌పై కేజ్రీవాల్ ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ కాలేజీ డిగ్రీ నకిలీదంటూ ఆరోపించారు. అంతేకాకుండా ‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి విద్యావంతుడైన మేధావిని దేశ ప్రజలు మిస్ అవుతున్నారు. ఆయనలాంటి విద్యావంతుడినే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ’ ట్వీట్ చేశారు. అయితే గతంలో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించిన కేజ్రీవాల్.. మన్మోహన్ సింగ్‌ను ధృతరాష్ట్రుడితో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘అంతేకాకుండా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ.. మన్మోహన్ సింగ్‌ను ముందుకుతెచ్చి ప్రధానిని చేసింది. మరి ధృతరాష్ట్రుడి వంటి మన్మోహన్ సింగ్ తన ప్రభుత్వంలోని, కాంగ్రెస్ పార్టీలోని అవినీతిని అరికట్టడంలో విఫలమయ్యారంటూ’ గతంలో ట్వీట్ చేశారు. 2015 ఎన్నికల సమయంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడిని..‘బీజేపీ మన్మోహన్ సింగ్‌గా’ అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. People missing an educated PM like Dr Manmohan Singh Its dawning on people now -“PM तो पढ़ा लिखा ही होना चाहिए।” https://t.co/BQTVtMbTO2 — Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2018 -
నో టాయిలెట్..నో రైస్!: కిరణ్‌బేడి
పుదుచ్చేరి: బహిరంగ మల విసర్జన రహిత, పరిశుభ్రమైన గ్రామాలకే ఉచిత బియ్యం అందించాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి శనివారం జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ఆమె కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలానా గ్రామం చెత్త రహిత, బహిరంగ మల విసర్జన రహితమని మే 31 లోగా స్థానిక ప్రజాప్రతినిధితోపాటు పంచాయతీ అధికారి నుంచి పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ వస్తేనే అక్కడ ఉచిత బియ్యం పథకం అమలు చేయాలని పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం నిరంకుంశంగా ఉందని అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కిరణ్ బేడి తన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. జూన్ చివరి నాటికి పుదుచ్చేరిలోని అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో తన నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వెళ్లను..
యానాం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా తాను వెళుతున్నట్లు వస్తున్న వార్తలను పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తోసిపుచ్చారు. తాను ఏపీకి గవర్నర్‌గా వెళ్లనున్నట్లు వచ్చే వార్తలు నిరాధారమని ఆమె అన్నారు. ఆమె నిన్న (గురువారం) విలేకరులతో మాట్లాడుతూ తాను చేపట్టే కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో తనకు మంచి పేరు వస్తోందని, ఈ తరుణంలో పుదుచ్చేరిలోనే ఎల్జీగా పూర్తికాలం కొనసాగుతానన్నారు. ఇక ఏ రాష్ట్రానికి వెళ్లే ప్రసక్తే లేదని కిరణ్ బేడీ స్పష్టం చేశారు. కాగా కిరణ్ బేడీ వెళ్లిపోతున్నట్లు వచ్చిన వార్తలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ వర్గీయులు ...ఆమె క్లారిటీ ఇవ్వడంతో నిరుత్సాహానికి గురయ్యారు. -
పుదుచ్చేరిలో బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నామినేట్ చేసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ వైద్యలింగం షాకిచ్చారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు వి.స్వామినాథన్, కె.జి.శంకర్, ఎస్.సెల్వగణపతిలను సభలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ముగ్గురు ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు ఈడ్చుకొచ్చి పడేశారు. ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డ స్వామినాథన్.. స్పీకర్ వైద్యలింగంపై కోర్టు ధిక్కార కేసు వేయనున్నట్లు మీడియాకు తెలిపారు. -
బేడి, ఖేర్‌ల ట్వీటర్ ఖాతాలు హ్యాకింగ్
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తాల ట్వీటర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ పని వెనక టర్కీ కేంద్రంగా పనిచేస్తున్న, పాక్ అనుకూల అయిల్దిజ్ టిమ్ బృందం ఉన్నట్లు తెలిసింది. బేడి ఖాతాలో టర్కిష్, ఆంగ్ల భాషల్లో ట్వీట్లతో పాటు టర్కీ జెండా ఎమోజి కనిపించింది. ‘మా సోషల్ మీడియా అకౌంట్లను మూసివేస్తున్నందుకు నిరసన తెలుపుతున్నాం. మాపై నిషేధాన్ని తొలగించే వరకూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖాతాలకు ముప్పు తప్పదు’ అని టర్కిష్ భాషలో ట్వీట్ వచ్చింది. సమస్యను పరిష్కరించడానికి తమ బృందాలు కృషి చేస్తున్నాయని ట్వీటర్ వెల్లడించింది. -
ఒకే వేదికపై ఆ ఇద్దరు
సాక్షి, చెన్నై : ఆరు నెలల అనంతరం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఒకే వేదిక మీదకు వచ్చారు. పుదుచ్చేరిలో నారాయణస్వామి అధికారం చేపట్టినప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి పక్కలో బల్లెంలా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కిరణ్, ఆమె ప్రయత్నాల్ని తిప్పికొట్టే విధంగా సీఎం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కాలం నెట్టుకు వచ్చారు. గవర్నర్ కావాలనే తమ పథకాల్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, ప్రజల్ని పాలకులు రెచ్చగొట్టిన సందర్భాలు అనేకం. పలు సార్లు కిరణ్‌బేడీ పర్యటనలను కూడా అడ్డుకునే విధంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆరు నెలలుగా సీఎం నిర్ణయాల్ని గవర్నర్, గవర్నర్ నిర్ణయాల్ని సీఎం వ్యతిరేకించడం, అడ్డు పడడం వంటి చర్యలు సాగాయి. దీంతో వీరివురి సమస్యకు పరిష్కారం లేదా అనే సందేహం చాలమంది అధికారపార్టీ నేతల్లో ఉండేది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలో, బుధవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కావడం ప్రాముఖ్యత సంతరించుకుంది. వేదిక ముఖ్యమంత్రి, గవర్నర్లు అందరిని ఆశ్చర్యపరుస్తూ, ఆకర్షించే రీతిలో కనిపించారు. ఇప్పటికైనా ఇరువురు తమ పంతాలను పక్కన పెట్టి సమష్టిగా పుదుచ్చేరి ప్రగతికి శ్రమించాలని అటు ప్రజలు, ఇటు పార్టీల నేతలు ఆకాంక్షిస్తున్నారు. -
నన్ను కాదు.. మోదీనే!
తమిళనాట పట్టు సాధించడం లక్ష్యంగానే బన్వరిలాల్ పురోహిత్‌ను కేంద్రంలోని బీజేపీ పాలకులు ప్రథమ పౌరుడిగా రంగంలోకి దించారు. రాజకీయాల్లోనే కాదు, పాలనపరంగా పట్టున్న పురోహిత్, ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు మీద ప్రయోగించిన అస్త్రంగా చెప్పవచ్చు. ఇందుకు బలాన్ని చేకూర్చే రీతిలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. సాక్షి, చెన్నై : రాష్ట్ర గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల వరకు రాజ్‌భవన్ వరకే పరిమితం అన్నట్టుగా బన్వరి లాల్ పురోహిత్ వ్యవహరించారు. రెండు రోజుల క్రితం తమిళనాట ఇక, తానే పాలన అన్నట్టుగా ఆయన వేసిన తొలి అడుగు చర్చకు, వివాదానికి దారితీసింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఏ విధంగా మారారో, దానికి రెట్టింపుగా, ఏకంగా తమిళనాడు పాలనను పురోహిత్ తన గుప్పెట్లోకి తీసుకునే పనిలో పడ్డట్టు సమాచారం. అదే సమయంలో కిరణ్ బేడీని అనుసరిస్తూ పురోహిత్ ముందుకు సాగుతున్నారనే చర్చ బయలుదేరింది. అయితే, తనను కాదు, ప్రధాని నరేంద్ర మోదీని అనుసరిస్తూ పురోహిత్ పయనం అన్నట్టు కిరణ్ తాజాగా వ్యాఖ్యానించడం గమనించ దగ్గ విషయం. ప్రధాని పిలుపు మేరకే.. పురోహిత్ తనను అనుసరిస్తున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఓ మీడియాతో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన గవర్నర్ల మహానాడులో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా ఆదేశాలు వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రసంగాల్లో ప్రజలతో మమేకం కావాలని, ప్రజల్లో ఒకరిగా వారికి దగ్గర కావాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించినట్టు వివరించారు. అందుకే తాను, ప్రజల్లోకి వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు, ఆయన ఆకాంక్ష మేరకు పురోహిత్ తమిళనాడులో చొచ్చుకు వెళ్తున్నారేగానీ, తనను అనుసరించడం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడే దగ్గరుండి వారి సమస్యలు తెలుసుకునేందుకు వీలుందన్నారు. రాజ్‌భవన్‌కే పరిమితం కాదు గవర్నర్ అంటే, రాజ్‌భవన్‌కే పరిమితం కావాలన్న రూల్ లేదని, ప్రజల్లోకి వెళ్లేందుకు, సమావేశాలు నిర్వహించేందుకు తగ్గ అధికారాలు ఉన్నట్టు వివరించారు. గవర్నర్‌కు అధికారాలు లేనప్పుడు, ఎందుకు అన్ని ఫైల్స్ సంతకం కోసం, ఆమోదం కోసం రాజ్ భవన్‌కు వస్తున్నాయని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాజ్ భవన్‌కే పరిమితం కావాల్సిన అవసరం లేదని, ఇక ప్రతి గవర్నర్ ప్రజల్లోకి వెళ్తారని, వారికి దగ్గరగా ఉండి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని అన్నారు. -
కిరణ్ బేడీకి షాక్
పుదుచ్చేరి: పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి షాక్ తగిలినట్లయింది. ఆమె ప్రమాణస్వీకారం చేయించిన ముగ్గురు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదని అసెంబ్లీ కార్యదర్శి తేల్చారు. కిరణ్ బేడి నిర్ణయాన్ని శాసనసభ కార్యదర్శి విన్సెంట్ రాయ్ తప్పుబట్టారు. కేంద్రం నామినేట్ చేసిన ముగ్గురు వ్యక్తులతో బేడీ పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయించిన విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారం అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ ముగ్గురు ఎమ్మెల్యేలను నియమించడానికి నిబంధనలు ఒప్పుకుంటాయని ట్వీటర్ ద్వారా బేడీ పేర్కొన్నారు. కాగా, బేడీ నిర్ణయాన్ని అప్పట్లో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు వ్యతిరేకించాయి. -
కిరణ్‌బేడీకి షాక్
టీ.నగర్: పుదుచ్చేరిలో ఏడుగురు ఎమ్మెల్యేల బోర్డు అధ్యక్షుల పదవీకాలాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో గవర్నర్ కిరణ్‌బేడి నిర్ణయానికి చుక్కెదురైంది. ఈ అనూహ్య పరిణామాలతో పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా బదిలీ అయ్యారు. పుదుచ్చేరిలో 30కి పైగా బోర్డు అధ్యక్షుల పదవులు కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు, పార్టీ నిర్వాహకులకు అందజేయడం పరిపాటి. 2016 మేలో కాంగ్రెస్–డీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు ధనవేలు, విజయవేణి, బాలన్, తీప్పాయిందాన్, జయమూర్తి ఐదుగురు డీఎంకేలో శివ, గీతా ఆనందన్ బోర్డు అధ్యక్షులుగా పదవులు చేపట్టారు. ఏడుగురు బోర్డు అధ్యక్షులు ఏడాదిపాటు మాత్రమే పదవుల్లో కొనసాగే వీలుంది. అంతేకాకుండా వారి కార్యనిర్వహణ సామర్థ్యాన్ని బట్టి వారు పదవుల్లో కొనసాగే అవకాశం ఉందనే నిబంధన మేరకు గవర్నర్ కిరణ్‌బేడి అంగీకారం తెలిపారు. ఇలావుండగా ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా బోర్డు అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగించేందుకు మంత్రి వర్గం నిర్ణయించి గవర్నర్‌కు ఫైలు పంపింది. అయితే దీన్ని నిరాకరించిన గవర్నర్ బోర్డు అధ్యక్షుల ఏడాది కాలం కార్యాచరణ నివేదికను కోరుతూ నిషేధం విధించారు. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలు బోర్డు అధ్యక్షుల పదవుల్లో కొనసాగలేక తప్పుకున్నారు. తర్వాత ఈ ఫైలును ఏకాభిప్రాయం కుదరలేదంటూ కేంద్ర ప్రభుత్వానికి కిరణ్‌బేడి పంపారు. ఆ తర్వాత హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ముఖ్యమంత్రి నారాయణస్వామి కలిసి బోర్డు అధ్యక్షుల పదవీ కాలం కొనసాగింపునకు అనుమతిని ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారు. కేంద్ర హోంశాఖ నుంచి గురువారం పుదుచ్చేరి గవర్నర్, ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ అందింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సతీష్‌కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు మళ్లీ బోర్డు అధ్యక్షుల పదవుల్లో కొనసాగేందుకు అనుమతి అందజేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో కొద్ది రోజుల్లో బోర్డు అధ్యక్షులందరూ తమ పదవులను అందుకోనున్నారు. పుదుచ్చేరి సీఎస్ బదిలీ: గవర్నర్‌తో విభేదాల కారణంగా పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా బదిలీకి గురయ్యారు. పుదుచ్చేరి 2016 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో మంత్రివర్గం ఏర్పాటైంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కిరణ్‌బేడీని గవర్నర్‌గా నియమించగా కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా హోదా పెంచబడింది. అయినప్పటికీ ఆయన ఢిల్లీ వెళ్లకుండా పుదుచ్చేరిలో పనిచేస్తూ వచ్చారు. ఇలావుండగా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టగానే కిరణ్‌బేడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోసాగారు. దీంతో సీఎం నారాయణసామితో ఘర్షణ వైఖరి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా మనోజ్ ఫరిదా నిలిచారు. ఆ తర్వాత ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల వ్యవహారంలోను కేంద్ర హోంశాఖకు వ్యతిరేకంగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నట్లు గవర్నర్, బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా అకస్మికంగా ఢిల్లీకి బదిలీ అయ్యారు. ఆయనకు బదులుగా ఢిల్లీలో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ వచ్చిన అశ్విన్‌కుమార్ పుదుచ్చేరికి నియమితులయ్యారు. ఆయన త్వరలో పుదుచ్చేరికి వచ్చి పదవీ భాద్యతలు స్వీకరించనున్నారు. -
ఏమో... ఎవరికి తెలుసు?
పుదుచెర్రీ : మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచెర్రీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనను కలిసేందుకు వచ్చిన ఓ బాలుడికి అప్యాయ ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా గవర్నర్ కుర్చీలోనే అతన్ని కూర్చోబెట్టారు. రాజ్ నివాస్(పుదుచ్చేరి రాజ్ భవన్)కు ప్రజల సందర్శనార్థం అనుమతి ఉన్న విషయం తెలిసిందే. శనివారం ఓ కుటుంబం అక్కడికి రాగా.. అదే సమయంలో కిరణ్ బేడీ కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆ కుటుంబసభ్యులతో వెళ్లి ఆమెను కలిశారు. వారితో కాసేపు మాట్లాడిన బేడీ, బాలుడిని ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు, తన కుర్చీలో కూర్చోమని స్వయంగా కిరణ్ బేడీయే ఆ బాలుడితో అన్నారు. దీంతో, ఆ బాలుడు ఆ కుర్చీలో కూర్చుని ఆనందపడ్డాడు. ఈ విషయాన్ని కిరణ్ బేడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సందర్శనార్థం వచ్చే చిన్నారులను కొంచెం సేపు లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో కూర్చోబెడతానని ఆమె ట్విట్టర్లో తెలిపారు. ‘‘ఏమో దీనిని స్ఫూర్తి పొంది.. ఏదో ఓ రోజున వాళ్లే ఈ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతారేమో, ఎవరికి తెలుసు?’’అని ఆ ట్వీట్ లో స్ఫూర్తిదాయక ట్వీట్ ను బేడీ చేశారు. Our youngest visitor for today received a pleasant surprise when HLG @thekiranbedi asked him to sit in her chair! ☺ pic.twitter.com/7tjKE2YvMb — Lt. Gov. Puducherry (@LGov_Puducherry) October 28, 2017 -
గోడ దూకిన కిరణ్ బేడీ
సాక్షి, చెన్నై : ధైర్య సాహసాలకు మరోపేరైన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మరో సాహసం చేశారు. గురువారం ఆమె కరైకల్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సమయంలోనే అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, రోగులకు అందుతున్న సదుపాయాల గురించి అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో.. ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉన్న ‘అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్‘ గదిని గమనించారు. ఆ గదికి చుట్టూ 4 అడుగుల మేర ఇటుక గోడ నిర్మించి ఒక గేట్ పెట్టారు. అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ గదిని సందర్శించాలని కిరణ్ బేడీ ఆసుపత్రి అధికారులకు తెలిపారు. గేట్ చాలాకాలం పాటు మూసివుంచడంతో.. తాళం చెవులు ఎక్కడపెట్టారో అధికారులు మర్చిపోయారు. కొద్దిసేపు తాళం చెవుల కోసం ఎదురు చూసిన కిరణ్ బేడి.. చివరకు గోడను ఎక్కి అవతలకు దూకి షెడ్లోకి వెళ్లారు. దీంతో చేసేదీలేక.. కరైకల్ కలెక్టర్ ఆర్. కేశవన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీజే చంద్రన్, మరికొందరు అధికారులు కూడా గోడ దూకి షెడ్లోకి వెళ్లారు. -
మోదీ తల్లి డాన్స్ చేశారా?
చెన్నై: దీపావళి స్ఫూర్తిని వెల్లడించేందుకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తన ట్విటర్ పేజీలో ఒక వీడియోను షేర్ చేశారు. గుజరాతీ జానపద బాణికి లయబద్ధంగా వృద్ధ మహిళ నృత్యం చేస్తున్న ఈ వీడియో చూడగానే ఆకట్టుకుంది. ఈ వృద్ధురాలు మరెవరో కాదు, ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘97 ఏళ్ల వయసులోనూ దీపావళి స్ఫూర్తిని నింపుకుని తన సొంత గృహంలో దివాళి వేడుక చేసుకుంటున్న ఈమె ఎవరో కాదు ప్రధాని మోదీ మాతృమూర్తి’ అని కిరణ్ బేడి ట్వీట్ చేశారు. అయితే తర్వాత తప్పు తెలుసుకుని సవరించుకున్నారు. వీడియోలో కనిపించిన వృద్ధురాలు ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కాదని తెలిపారు. ‘వీడియోలో ఉన్న వృద్ధురాలిని గుర్తించడంలో పొరపాటు జరిగింది. కానీ అమ్మ ఉత్సాహానికి సెల్యూట్ చేస్తున్నాను. నేను కనుక 96 ఏళ్లు బతికితే ఆవిడలా ఉండాలని కోరుకుంటాన’ని మరో ట్వీట్ చేశారు. కాగా, ఈ వీడియోకు 13 వేల మంది పైగా లైక్ కొట్టగా, 4100 మంది రీట్వీట్ చేయడం విశేషం. దాదాపు వెయ్యి మంది కామెంట్లు పెట్టారు. కిరణ్ బేడి షేర్ చేసిన వీడియో ఇదే -
మోదీ తల్లి డాన్స్ చేశారా?
-
గవర్నర్‌పై కేసు పెడతాం : సీఎం వార్నింగ్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిపై పరువునష్టం దావా వేయనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. అధికారుల్ని, మంత్రుల్ని బెదిరిస్తున్న కిరణ్ బేడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలిపారు. పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడి మధ్య వివాదం సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ప్రైవేటు కళాశాలల్లో వైద్య సీట్ల భర్తీలో అవకతవకలు గవర్నర్-సీఎంల మధ్య వివాదానికి దారి తీశాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే అర్థంలో గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. కాగా, శనివారం హుటాహుటిన మీడియా సమావేశం ఏర్పాటుచేసిన సీఎం నారాయణస్వామి.. బేడీ వ్యాఖ్యలను ఖండించారు. తమ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోన్న కిరణ్ బేడిపై పరువునష్టం దావా వేయనున్నట్టు ప్రకటించారు. ‘‘అధికారుల్ని, మంత్రుల్ని బెదిరిస్తూ, హెచ్చరికలతో ముందుకు సాగుతున్న కిరణ్ బేడీపై అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. అసలు ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అర్హురాలేకాదు. కానీ కేంద్రం ఆమెను మాపై పడేసింది. ఇప్పుడు మాకు ఆమె శిరోభారంగా మారింది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా, అందుకు ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేరుస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు దారుణం, ఖండనీయం’’ అని సీఎం నారాయణస్వామి ఘాటుగా వ్యాఖ్యానించారు. -
గవర్నర్ ఫొటోకు క్షీరాభిషేకం
తిరువొత్తియూరు(పుదుచ్చేరి): ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అభివృద్ధి పనులకు ప్రోత్సాహం ఇస్తున్న గవర్నర్ కిరణ్‌బేడీ చర్యలకు మద్దతు తెలుపుతూ కొందరు అభిమానులు ఆమె ఫొటోను పాలతో అభిషేకించారు. గవర్నర్ చర్యలకు ఓ వైపు నుంచి మద్దతు, మరో వైపు నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఆమెతో తీవ్ర క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఆమెను హిట్లర్‌లా చిత్రీకరించిన బ్యానర్లతో వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనం కలిగించింది. ఇందుకు జవాబుగా అన్నట్లు యానాంలోని ఆమె అభిమానులు దుకాణం వీధిలో కిరణ్‌బేడి ఫొటోకు క్షీరాభిషేకం చేసి మద్దతు తెలిపారు. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది తెలుసుకున్న కిరణ్‌బేడీ ఇకపై అభివృద్ధి పనులకు ప్రోత్సాహం అందించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
సీఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్!
పుదుచ్చేరి: పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం, లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మధ్య మళ్లీ ఘర్షణ తారాస్థాయికి చేరింది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మంగళవారం కేంద్రం నామినేట్ చేసిన ముగ్గురు వ్యక్తులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించారు. బీజేపీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడు వీ స్వామినాథన్, పార్టీ కోశాధికారి కేజీ శంకర్, విద్యావేత్త ఎస్ సెల్వ గణపతిలతో ఆమె హడావిడిగా ప్రమాణస్వీకారం చేయించారు. దీనిపై నారాయణస్వామి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తమ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నది. మరోవైపు ఈ నియామకాలపై స్టే విధించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా గవర్నర్ ఎలా ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తారని, ఇది సమాఖ్యస్ఫూర్తికి వ్యతిరేకమని సీఎం వీ నారాయణస్వామి అంటుండగా.. ఆయన ఆరోపణలను కిరణ్ బేడీ తోసిపుచ్చారు. తాను రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నట్టు ఆమె తెలిపారు. ‘కేబినెట్ మంత్రులు నా దగ్గరకు వచ్చి.. మీరు ఎందుకు ప్రజలను కలుస్తున్నారు? వారి సమస్యలను ఎందుకు పరిష్కరిస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. మీరు రబ్బర్‌స్టాంప్‌లా ఉండాలని మంత్రులు అంటున్నారు’ అని కిరణ్ బేడీ అన్నారు. -
కిరణ్‌కు అభయం
►కేంద్రం అధికారాలు సీఎంకు హోం శాఖ వివరణ ►ఇక, సంకటంలో నారాయణ సర్కారు చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి కేంద్రం అభయం ఇచ్చింది. సీఎం నారాయణ స్వామి సర్కారును సంకటంలోకి నెట్టే రీతిలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సీఎం నారాయణ స్వామి ఇచ్చిన ఫిర్యాదుకు కేంద్ర హోం శాఖ ఇచ్చిన వివరణ మున్ముందు పుదుచ్చేరిలో ఎలాంటి వివాదాలకు ఆజ్యం పోస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందుకు అస్త్రంగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి పైగా అవుతున్నా, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణ స్వామి మధ్య నిత్యం సమరమే. వీరిద్దరి మధ్య చాప కింద నీరులా సాగుతున్న వివాదం చివరకు ముదిరి పాకాన పడింది. ప్రభుత్వానికి అండగా అన్నాడీఎంకే, డీఎంకే అండగా నిలవడంతో కిరణ్‌ను రీకాల్ చేయడానికి తగ్గ ప్రయత్నాలు సాగాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం, తమకు కల్పించిన హక్కులను కాలరాసే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపణలతో కిరణ్‌ను బర్తరఫ్ చేయాలని లేదా, వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదులు చేరాయి. అయితే, ఈ ఫిర్యాదుల్ని పరిశీలించిన కేంద్ర హోం శాఖ కిరణ్‌కు మరింత అభయాన్ని ఇస్తూ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్న అధికారాలను వివరిస్తూ సీఎం నారాయణ స్వామికి సవవిరంగా లేఖాస్త్రాన్ని సంధించడం గమనార్హం. నారాయణ ప్రభుత్వానికి సంకట పరిస్థితులు రాష్ట్రాల గవర్నర్ల కన్నా, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ అందులో వివరించారు. స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి వర్గంతో సంబంధం లేకుండా, ముందుకు సాగే అవకాశం ఉందని, అవసరం అయితే, అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు సైతం వీలుందని వివరించడం గమనార్హం. అలాగే, మంత్రివర్గం నుంచి వచ్చే ఫైల్స్‌లో ఏదేని అనుమానాలు ఉన్నా, అధికారుల్ని పిలిపించి సమీక్షించడం, అవసరం అయితే, సంబంధిత మంత్రితో మాట్లాడేందుకు సైతం అధికారం ఉన్నట్టు అందులో పేర్కొనడం బట్టి చూస్తే, మున్ముందు నారాయణ సర్కారుకు కిరణ్రూపంలో మరిన్ని సంకట పరిస్థితులు తప్పవని స్పష్టం అవుతోంది. అలాగే విభేదాలు తలెత్తినా, అభిప్రాయభేదాలు ఎదురైనా, సమస్యలు తాండవించినా.. కీలక నిర్ణయం తీసుకునేందుకు తగ్గ సిఫార్సును రాష్ట్రపతికి చేసే అధికారం కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్నట్టు అందులో హెచ్చరించి ఉండడం గమనార్హం. అయితే, వీటన్నింటి గురించి పట్టించుకోకుండా, పుదుచ్చేరి ప్రగతి తనకు లక్ష్యం అని నారాయణ ముందుకు సాగుతున్నారు. ఆగస్టులో పుదుచ్చేరి హార్బర్ నుంచి సరకుల రవాణా విస్తృతం, సెప్టెంబరులో పుదుచ్చేరి విమానాశ్రయం నుంచి విమాన సేవలు సాగేందుకు తగ్గ ఏర్పాట్లలో మునిగారు. -
కిరణ్ బేడీ రబ్బర్ స్టాంప్ కాదా?
న్యూఢిల్లీ: పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి, ఆయన మంత్రివర్గ సభ్యులపై రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సోమవారం అవినీతి ఆరోపణలు చేస్తూ చిందులు వేయడం సోషల్ మీడియాలో రోజంతా హల్చల్ చేసింది. తాను రబ్బర్ స్టాంప్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉండదల్చుకోలేదని, సమర్థురాలైన పాలనాధికారిగా ఉండాలనుకుంటున్నానని కూడా నొక్కి చెప్పారు. ఉన్నతాధికారులంతా తనకే రిపోర్ట్ చేయాలని, తన ఆదేశాలకే కట్టుబడి పనిచేయాలని కూడా ఆమె ఇదివరకే ఆదేశించారు. కిరణ్ బేడీ నిజంగా సమర్థరాలైన పాలనాధికారే అయినట్లయితే దేశ ప్రజస్వామ్య వ్యవస్థ గురించి, సమాఖ్య స్ఫూర్తి గురించి సరైన అవగాహన ఉండి ఉండాలి. నారాయణ స్వామి, ఆయన మంత్రివర్గ సభ్యులు, శాసన సభ్యులు అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనవారు. ముఖ్యమంత్రి మాటను కూడా ఖాతరు చేయకుండా కిరణ్ బేడీ ఏకపక్షంగా వ్యవహరించడం ఏ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తున్నట్లు? పుదుచ్చేరి ప్రైవేటు వైద్య కళాశాల సీట్ల యాజమాన్య కోటా సీట్ల భర్తీ విషయంలో అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. అందులో జోక్యం చేసుకునే అధికారం లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఉండదు. సీట్ల భర్తీలో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు అందితే తనకున్న అధికారాల మేరకు దర్యాప్తు జరిపించి అవినీతిపరులపైన చర్యలు తీసుకోవచ్చు. తానే 26 మంది విద్యార్థుల జాబితాను కళాశాల అధికారులకు ఇచ్చి వారందరికీ సీట్లు ఇమ్మని హుకుం జారీ చేసే అధికారం ఆమెకు ఎక్కడిది? అది అవినీతి, ఆశ్రితపక్షపాతం కిందకు రాదా? అవినీతి ఆరోపణలను నిరూపించినట్లయితే అందుకు ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నప్పుడు చట్ట ప్రకారం చర్యలకు సిద్ధం కావచ్చుగదా! కిరణ్ బేడీ రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. అధికారులు ‘వాట్సాప్’ గ్రూపును ఉపయోగించడాన్ని ముఖ్యమంత్రి గత జనవరిలో నిషేధించినప్పుడు జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పరిధాపై చర్యకు ఏప్రిల్ నెలలో ఆదేశించారు. అసెంబ్లీ స్పీకర్ వైథిలింగం ఆదేశాలపై పుదుచ్ఛేరి మున్సిపల్ కమిషనర్‌ను తొలగించిందుకు చీఫ్ సెక్రటరీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పుదుచ్చేరి ప్రభుత్వంపై లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పెత్తనం చెలాయించడమంటే కేంద్రం పెత్తనం సాగించడమే. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ రాష్ట్రాల పట్ల కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించాలని అనేవారు. బీజేపీ కూడా రాష్ట్రాలపై కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ సమాఖ్య స్ఫూర్తిని మంటగలుపుతోందని తరచూ విమర్శించేది. ప్రధాన మంత్రయ్యాక నరేంద్ర మోదీ అప్పుడప్పుడు సమాఖ్య స్ఫూర్తి అంటున్నారుగానీ, బీజేపీ ఒక్కసారి కూడా సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడటం లేదు. కేంద్రం కనుసన్నల్లో నడుచుకునే గవర్నర్లు రబ్బరు స్టాంపులుకాకుండా మరేమిటో! -ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
సీఎం, గవర్నర్ మాటల యుద్ధం
పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) కిరణ్ బేడీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీరిద్దరూ పరస్పరం విమర్శస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. కిరణ్‌బేడీ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న సీఎం.. అధికారులకు ఆంక్షలు విధించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవొద్దని, తప్పనిసరైతే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియలో అనవసరంగా కిరణ్‌బేడీ జోక్యం చేసుకుంటున్నారని గతవారం నారాయణస్వామి విమర్శించారు. మంత్రులను, ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడం మానుకోవాలని, అగౌరపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని అసెంబ్లీ వేదికగా ఆమెకు సూచించారు. నారాయణస్వామి వైఖరిని కిరణ్‌బేడీ తప్పుబట్టారు. ‘మీరు కోరుకుంటున్నది రబ్బర్ స్టాంపునా లేదా బాధ్యతాయుతమైన పాలకురాలినా’ అని నారాయణస్వామిని అని ప్రశ్నించారు. పుదుచ్చేరికి న్యాయం, నైతిక నిష్ఠ, మంచి పాలన కావాలని పేర్కొన్నారు. కాగా, కిరణ్ బేడీని పదవి నుంచి తొలగించాలని సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
కిరణ్‌బేడీపై నగ్మా సంచలన వ్యాఖ్యలు
పుదుచ్చేరి: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీపై ఆలిండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సినీనటి నగ్మా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ఫక్తు బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. విధులు నిర్వర్తించటానికి బదులుగా ఆమె కేంద్రానికి అనుకూలంగా పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు, పేదలకు రేషన్ బియ్యం పంపిణీతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు కాకుండా కిరణ్‌బేడీ అడ్డుపడుతున్నారని నగ్మా విమర్శించారు. గవర్నర్ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు. రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధికి సాయపడాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోందని నగ్మా ఆరోపించారు. -
తగ్గని కిరణ్
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ఏ మాత్రం తగ్గడం లేదు. సీఎం నారాయణ స్వామి సర్కారును ఢీ కొట్టే విధంగా ముందుకు సాగుతున్నారు. పీఎఫ్ నిధిలో రూ.36 కోట్లను దారి మళ్లించి ఉండడాన్ని ప్రస్తుతం వెలుగులోకి తెచ్చారు. సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ, సీఎం నారాయణ స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. గత వారం రోజులుగా కిరణ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ నేతృత్వంలో ఏర్పడ్డ అఖిల పక్షం తీవ్ర నినాదాల్ని అందుకుంది. ఆమెను బర్తరఫ్ చేయాలని, డిస్మిస్ చేయాలని, వెనక్కు తీసుకోవాలన్న నినాదాలతో ఢిల్లీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదుల్ని వెల్లువెత్తించారు. ఈ వివాదాల నేపథ్యంలో శనివారం కిరణ్‌బేడీ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో రెండు రోజుల పాటుగా బేటీలతో బిజీ అయ్యారు. ఆ పెద్దల అండదండాలతో కూడిన భరోసా దక్కిందో ఏమోగానీ దూకుడు పెంచే పనిలో లెఫ్టినెంట్ గవర్నర్ నిమగ్నం కావడం గమనార్హం. నారాయణ స్వామి ప్రభుత్వంతో ఢీ కొట్టే విధంగా సోమవారం ఆమె స్పందించారు. పీఎఫ్ నిధి దారి మళ్లించి ఉండడాన్ని పసిగట్టి, వెలుగులోకి తెచ్చారు. క్రిమినల్ కేసు నమోదుకు తగ్గ చర్యల్లో భాగంగా న్యాయ శాఖ అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్ణయించడంతో పుదుచ్చేరిలో సాగుతున్న అధికార ఆధిపత్య సమరానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. పీఎఫ్ దారి మళ్లింపు ప్రభుత్వ రంగ సంస్థలు, సహకారం సంస్థల్లోని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధిలో రూ.36 కోట్లను ఇతర పనులకు దారి మళ్లించినట్టు కిరణ్ గుర్తించారు. తన పరిశీలనలో వచ్చిన అంశాన్ని వెలుగులోకి తెస్తూ తొలుత ట్విట్టర్లో రూ.36 కోట్లు ఏమైనట్టు అని ప్రశ్నించడంతో నారాయణ స్వామి ప్రభుత్వ వర్గాలకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. దీంతో మంత్రి కందస్వామి సమాధానం ఇస్తూ, ఇది తమ హయాంలో జరిగింది కాదని, ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు తెర మీదకు తెచ్చి తమ మీద నిందలు వేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ సిద్ధమైనట్టున్నారని మీడియా ముందు విరుచుకు పడ్డారు. తాము గవర్నర్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దృష్ట్యా, తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా, చెడ్డ పేరు తీసుకొచ్చే రీతిలో ఆమె చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. దీంతో కిరణ్ స్పందించారు. మంత్రి వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకుని, అస్సలు ఆ నగదు దారి మళ్లింపు అన్నది క్రిమినల్ నేరంగా అభివర్ణిస్తూ, అందుకు తగ్గ చర్యలకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు గాను న్యాయ శాఖ అభిప్రాయాన్ని తీసుకునేందుకు నిర్ణయించి, ఆ శాఖ కార్యదర్శికి ఓ లేఖ రాయడం గమనార్హం. అందులో పీఎఫ్ నిధి దారి మళ్లింపు అన్నది క్రిమినల్ చర్య కిందకు వస్తుందన్న విషయం తన పరిశీలనలో తేలిందని గుర్తు చేశారు. పీఎఫ్ దారి మళ్లింపు ఎలా జరిగింది, పీఎఫ్ నిధి విషయంలో ఏమి జరుగుతున్నదో, మంత్రి 11 నెలలుగా ఏమి చేశారో, సమగ్ర వివరాలతో పాటుగా క్రిమినల్ కేసు విషయంలో అభిప్రాయం తెలియజేయాలని ఆ లేఖ ద్వారా కోరారు. అయితే, పీఎఫ్ దారి మళ్లింపు వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదుకు తగ్గ చర్యల్లో భాగంగా న్యాయ శాఖ అభిప్రాయాన్ని స్వీకరించేందుకు కిరణ్ నిర్ణయించడం పుదుచ్చేరిలో సాగుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. -
ఢిల్లీకి కిరణ్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి శనివారం ఢిల్లీ వెళ్లారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన పిలుపుతో కారైక్కాల్ పర్యటను అర్ధాంతరంగా రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి విమానం ఎక్కేశారు. అక్కడ హోంమంత్రితో భేటీ కానున్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీతోనూ బేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాల పేర్కొంటున్నాయి. పుదుచ్చేరిలో సాగుతున్న అధికార ఆధిపత్య సమరం రసవత్తరంగా మారింది. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, సీఎం నారాయణస్వామిల మధ్య సాగుతున్న వార్ రచ్చకెక్కడంతో పంచాయతీ ఢిల్లీకి చేరింది. సీఎం నారాయణస్వామి నేతృత్వంలో అఖిలపక్షం రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రుల అనుమతి కోసం ఎదురుచూస్తోంది. అపాయింట్మెంట్ కోసం ఓ వైపు ఎదురు చూస్తూనే మరోవైపు ఇప్పటికే ఫిర్యాదుల రూపంలో ఢిల్లీకి అన్ని వివరాలను చేర వేశారు. తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలను నిశితంగా కిరణ్‌బేడి పరిశీలిస్తూ, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో ఆగమేఘాలపై కిరణ్ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీకి కిరణ్: పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్‌లో పలు కార్యక్రమాలు, అభివద్ధి పనుల్లో పాల్గొనేందుకు కిరణ్ బేడి ముందస్తుగా నిర్ణయించారు. మూడు రోజుల పర్యటనగా కార్యచరణ సిద్ధమైంది. శుక్రవారం పర్యటన నిమిత్తం కారైక్కాల్‌కు వెళ్లారు. ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసుకుని రాజ్ భవన్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం ఆరున్నర గంటలకు రోడ్డు మార్గంలో చెన్నైకు చేరుకున్నారు. ఎనిమిదిన్నర గంటలకు మీనంబాక్కం విమానాశ్రయం నుంచి విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పుదుచ్చేరి ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహరాలు, అందుకు తాను ఆక్షేపణ తెలియజే యడానికి గల కారణాలు, తదితర అంశాలను నివేదిక రూపంలో ముందస్తుగా ఆమె సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అన్ని వివరాలతో కూడిన నివేదికను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆమె భేటీ కానున్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తనను ఇరకాటంలో పెట్టే విధంగా పుదుచ్చేరి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఢిల్లీ పెద్దల దష్టికి తీసుకెళ్లి, తన పంతా న్ని నెగ్గించుకునే పనిలో పడ్డట్టు సమాచారం. -
కిరణ్‌బేడి తొలి ప్రసంగానికి నో చాన్స్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి లెఫ్టినెంట్ గవర్నర్‌కు బదులుగా తాను అసెంబ్లీ ప్రారంభ సమావేశాల్లో తొలి ప్రసంగంచేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంతో మొదలుకావాల్సిన అసెంబ్లీని, తన ప్రసంగంతో మంగళవారం ప్రారంభించారు. పుదుచ్చేరిలో అధికారంపై పైచేయి సాధించడంపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, సీఎంల మధ్య సమరం సాగుతున్న విషయం తెలిసిందే. తనకు అవకాశం కల్పించాలని స్పీకర్ వైద్యలింగంకు కిరణ్‌బేడీ లేఖ రాసినా ఫలితం శూన్యం. -
రబ్బరుస్టాంపులా ఉండను: కిరణ్ బేడీ
హైదరాబాద్: పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, అక్కడి లెఫ్టినెంట్ జనరల్ కిరణ్ బేడీకి మధ్య పొరపొచ్చాలు ముదురుతున్నాయి. పాలనా బాధ్యతలు చూసుకోవాల్సిన తనను పుదుచ్చేరి ప్రభుత్వం రబ్బరు స్టాంపులా మాత్రమే ఉండమంటోందని మంగళవారమిక్కడ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూ్యలో బేడీ ఆరోపించారు. ఎల్జీ బాధ్యతలేమిటో తెలుసుకోవాలని వారికి చెప్పానని, ఈ విషయంలో తాను వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. ఎల్జీగా తన రెండేళ్ల పదవీకాలం ముగియగానే(వచ్చే ఏడాది మే 29) పదవి నుంచి తప్పుకుంటానని పునరుద్ఘాటించారు. -
గవర్నర్‌ను డమ్మీగా ఉండాలంటున్నారు!
హైదరాబాద్: పుదుచ్చేరి ప్రభుత్వం తానొక డమ్మీగా ఉండాలని కోరుకుంటోందని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారాయణసామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో కిరణ్ బేడీకి విభేదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన విధులు, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 35వ ఆలిండియా పోలీస్ ఈక్వెష్ట్రియన్ చాంపియన్‌షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. వచ్చే మే 29వ తేదీన పదవి నుంచి వైదొలగనున్నట్లు గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఒక లక్ష్యం కోసం పదవిని చేపట్టానని, పదవీకాలం ముగిసేవరకు ఉండాలని అనుకోవటం లేదని ఆమె చెప్పారు. ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మెమోరాండం ఇచ్చిన తర్వాతి రోజే ఆమె రిటైర్మెంట్ ప్రకటన చేశారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ రెండేళ్లపాటు మాత్రమే ఉండాలని మొదటే అనుకున్నానని చెప్పారు. అవినీతి, నేర నిర్మూలన కోసం పలు చర్యలు తీసుకున్నానని తెలిపారు. స్వచ్ఛ పుదుచ్చేరి లక్ష్యంగా తాను చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని ఆరోపించారు. పుదుచ్చేరి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దాని నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని కిరణ్ బేడి అన్నారు. -
డమ్మీగా ఉండాలంటున్నారు: కిరణ్ బేడీ
పుదుచ్చేరి ప్రభుత్వం తనను డమ్మీగా ఉంచాలనుకుంటోందని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అన్నారు. నారాయణసామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో విభేదాలు ఎక్కువైన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన విధులు, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 35వ ఆలిండియా పోలీస్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వచ్చే మే 29వ తేదీన పదవి నుంచి వైదొలగనున్నట్లు గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఒక లక్ష్యం కోసం పదవిని చేపట్టానని, పదవీకాలం ముగిసే వరకు ఉండాలని అనుకోవటం లేదని చెప్పారు. ఆమె పనితీరుపై 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మెమోరాండం ఇచ్చిన తర్వాతి రోజే ఆమె రిటైర్మెంట్ ప్రకటన చేశారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ రెండేళ్లపాటు మాత్రమే ఉండాలని మొదటే అనుకున్నానని చెప్పారు. అవినీతి, నేర నిర్మూలన కోసం ఆమె పలు చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛ పుదుచ్చేరి లక్ష్యంగా తాను చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని, పదవి నుంచి తప్పుకుంటానని గత ఆగస్టులో కిరణ్‌బేడీ చేసిన ప్రకటన సంచలనం రేపింది. పుదుచ్చేరి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దాని నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని అన్నారు. -
వచ్చే ఏడాది పదవి వదులుకుంటా: గవర్నర్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారాయణస్వామితో విభేదాలతో మరోసారి వార్తల్లోకి వచ్చిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి సంచలన ప్రకటన చేశారు. పదవీ త్యాగానికి సిద్ధపడుతున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది గవర్నర్గిరిని వదులుకుంటానని ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థతో చెప్పారు. 2018, మే 29 నాటికి తాను పదవిలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుందని, తర్వాత తాను పదవిలో కొనసాగనని అన్నారు. దీని గురించి ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కిరణ్ బేడి ప్రకటన రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం నారాయణస్వామితో ఏర్పడిన విభేదాల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం మొదలైంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పుదుదచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే కిరణ్‌బేడి ఈ నిర్ణయం వెలువరించడం గమనార్హం. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కిరణ్‌బేడి 2016, మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, అవినీతి అంతం కోసం పలు చర్యలు చేపట్టారు. -
గవర్నర్ వర్సెస్ సీఎం
► కిరణ్‌బేడీ, నారాయణస్వామి కోల్డ్‌వార్ ► ప్రభుత్వ అధికారుల తంటాలు టీనగర్: పుదుచ్చేరిలో గవర్నర్ కిరణ్‌బేడి, ముఖ్యమంత్రి నారాయణస్వామి మధ్య కోల్డ్‌వార్‌తో ప్రభుత్వ అధికారులు తంటాలు పడుతున్నారు. పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడి ప్రభుత్వ అధికారులను వెంటనే సంప్రదించేందుకు వాట్సప్ గ్రూప్‌లను ప్రారంభించి నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు, ప్రభుత్వ శాఖలతో నేరుగా చర్చలు జరిపేందుకు ఈ వాట్సాప్ గ్రూపులను వినియోగిస్తున్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్, పీసీఎస్ అధికారులు చోటుచేసుకున్నారు. గత 29వ తేదీన గవర్నర్ వాట్సాప్ గ్రూపులో సహకార సంఘాల రిజిస్ట్రార్ శివకుమార్ అసభ్య వీడియోను పంపడం చర్చకు దారితీసింది. అతన్ని వెంటనే గవర్నర్ బంగళాకు రప్పించిన కిరణ్‌బేడి సస్పెండ్ ఉత్తర్వులను అందజేశారు. అంతేకాకుండా సీబీసీఐడీ పోలీసులచే కేసు నమోదైంది. కాగా, గవర్నర్ చర్యలను నేతలు, అధికారులు ఖండించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉత్తర్వులను వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో ఉపయోగించేందుకు నిషేధం విధించారు. ఇది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులుగా అన్ని శాఖలకు సర్కులర్‌గా పంపారు. ఈ చర్య కారణంగా గవర్నర్ వాట్సాప్ గ్రూప్ నుంచి అధికారులు వైదొలిగారు. ఇలావుండగా పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి సోషల్ మీడియా నెట్వర్క్ వినియోగంపై నిషేధ ఉత్తర్వులను గురువారం గవర్నర్ కిరణ్‌బేడి రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వపు నిర్ణయాన్ని గవర్నర్ రద్దు చేయడంతో గవర్నర్, పాలకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు గవర్నరా? ముఖ్యమంత్రా? ఎవరి అదుపాజ్ఞలకు లోబడాలని తెలియకుండా అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రజా సంక్షేమ పనులకు ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనిపై సీఎం నారాయణస్వామి స్పందిస్తూ గవర్నర్‌తో నిర్వహణ రీతిగా కొన్ని లోపాలు ఉండొచ్చని, అయితే ఆమెతో ఎటువంటి ఘర్షణ లేదని అన్నారు. కుషు్బకు పాస్‌పోర్ట్ చిక్కులు: నటి కుషు్బకు పాస్‌పోర్టు చిక్కులు ఎదురయ్యాయి. ఆమె మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఈ విధంగా తెలిపారు. తన పాస్‌పోర్టు బుక్‌లో పేజీలు ఉపయోగించి పూర్తయిందని, అదనపు పేజీలను జతచేయాలని కోరుతూ పాస్‌పోర్టు కార్యాలయంలో అభ్యర్థించానని, అదే విధంగా పాస్‌పోర్టు రెన్యువల్ చేయాలని కోరినట్లు తెలిపారు. తన కోర్కెను పాస్‌పోర్టు అధికారి నిరాకరించారని, తనపై క్రిమినల్ కేసు ఉన్నందున రెన్యువల్ వీలుకాదని గత నెల 28న పాస్‌పోర్టు అధికారి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఇది చట్టవిరుద్ధమని దీన్ని రద్దు చేయాలని తెలిపారు. తాను ఈనెల 12న విదేశాలకు వెళ్లనున్నందున పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసేందుకు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి రాజేంద్రన్ వారంలోగా పాస్ట్‌పోర్టు సదరన్ రీజియన్ అధికారి కోర్టులో సంజాయిషీ పిటిషన్ దాఖలు చేయాలని కోరుతూ ఉత్తర్వులిచ్చారు. -
కిరణ్ బేడీని పదవి నుంచి తీసేయండి
పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పదవి నుంచి తొలగించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అధికారిక సమాచారం కోసం సోషల్ మీడియా వాడటాన్ని నిషేధిస్తూ సీఎం నారాయణ స్వామి తీసుకున్న నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ రద్దు చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. అధికారిక సమాచారం కోసం వాట్రాప్ వాడుకోవాలంటూ ఇటీవలే కిరణ్ బేడీ అధికారులకు సూచించారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా సమాచారం పంపడాన్ని రద్దు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. -
ముఖ్యమంత్రికి షాకిచ్చిన కిరణ్ బేడి
-
పుదుచ్చేరిలో బేడీ వర్సెస్ స్వామి
పుదుచ్చేరి/న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో సోషల్ మీడియా వాడకంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య వివాదం మరింత ముదిరింది. అధికారిక సమాచారం కోసం సోషల్ మీడియా వాడటాన్ని నిషేధిస్తూ సీఎం నారాయణ స్వామి తీసుకున్న నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ రద్దు చేశారు. కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న బేడీ.. తన ఆదేశాల కాపీని గురువారం ట్వీటర్లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లవని, మార్గదర్శకాలకు అవి విరుద్ధంగా ఉన్నాయన్నారు. అభివృద్ధి దిశగా పుదుచ్చేరి పయనించాలంటే సమాచార రంగంలో తిరోగమనం సరికాదని, అందువల్లే ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అధికారిక సమాచారం కోసం వా ట్సప్ వాడుకోవాలంటూ ఇటీవలే బేడీ అధికారులకు సూచించారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా సమాచారం పంపడాన్ని రద్దు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. -
ముఖ్యమంత్రికి షాకిచ్చిన కిరణ్ బేడి
పుదుచ్చేరి: ఢిల్లీలో మొన్నటివరకు మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్- సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య బాహాటంగా ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహా పరిస్థితి మరో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పునరావృతం అవుతుందా? అంటే పరిస్థితులు ఔననే సంకేతాలు ఇస్తున్నాయి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఆ ప్రాంత ముఖ్యమంత్రి వీ నారాయణస్వామికి తాజ్ షాక్ ఇచ్చారు. ఆయన జారీచేసిన ఆదేశాలను రద్దు చేశారు. అధికారిక కార్యకలాపాల కోసం సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధం విధిస్తూ సీఎం నారాయణస్వామి ఆదేశాలు జారీచేయగా.. ఆ ఆదేశాలు చెల్లవంటూ కిరణ్ బేడీ స్పష్టం చేశారు. సీఎం నారాయణస్వామిది కాంగ్రెస్ పార్టీ కాగా.. బీజేపీ కిరణ్‌బేడిని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. -
వాట్సాప్ రచ్చ
► కిరణ్‌బేడీపై వ్యతిరేకత ► శివకుమార్‌కు మద్దతు ► పొరబాటు జరిగినట్టు వివరణ వాట్సాప్‌లో అశ్లీల వీడియో వ్యవహారం పుదుచ్చేరిలో రచ్చకెక్కింది. తమతో సంప్రదింపులు జరపకుండా పుదుచ్చేరి సివిల్ సర్వీసు అధికారిపై గవర్నర్ చర్యలు తీసుకోవడాన్ని మంత్రులు వ్యతిరేకించే పనిలో పడ్డారు. పొరబాటున ఆ మెసేజ్ వెళ్లిందే గానీ, పని గట్టుకుని గవర్నర్‌కు పంపించ లేదంటూ శివకుమార్‌కు మద్దతుగా గళం విప్పే వారి సంఖ్య పెరిగింది. సాక్షి, చెన్నై: పుదుచ్చేరి ప్రగతి లక్ష్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తన అధికారాల మేరకు సరికొత్త సంస్కరణల బాటలో పయనిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారుల్ని ఏకం చేస్తూ వాట్సాప్ గ్రూప్‌ను రూపొందించారు. సహకార సంఘా ల రిజిస్ట్రార్ శివకుమార్ నెంబరు నుంచి ఆ గ్రూప్‌లోకి వెళ్లిన ఓ మెసేజ్ పెద్ద దుమారాన్నే రేపింది. అందులో అశ్లీల వీడియోలు ఉండడంతో గవర్నర్ ఆగ్రహానికి శివకుమార్ గురి కావాల్సి వచ్చింది. ఆయన్ను సీనియర్ ఎస్పీ రాజీవ్ రంజన్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమాచారంతో పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల్లో ఆగ్రహం రేగింది. వాట్సాప్ రచ్చ: తమతో సంప్రదింపులు జరపకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్న సీనియర్ ఎస్పీపై మంత్రులు నమశ్శివాయం, షాజహాన్, కందస్వామి నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శివాలెత్తి ఉన్నారు. పుదుచ్చేరి సివిల్ సర్వీసు పరీక్షల ద్వారా ఉన్నత పదవిలో ఉన్న అధికారిపై చర్యలు తీసుకోవాలంటే, ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని, అయితే, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శివకుమార్‌ను తమ వెంట తీసుకెళ్లి ఉన్నారు. ఈ సమాచారంతో రాజ్‌భవన్ వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో వివాదం ముదిరింది. శివకుమార్‌పై ఆగమేఘాలపై కేసు నమోదు కావడంతో గవర్నర్ తీరుపై మంత్రులు శివాలెత్తే పనిలో పడ్డారు. ఇన్నాళ్లు పుదుచ్చేరిలో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య సాగుతున్న అంతర్యుద్ధం తాజా రచ్చతో తెర మీదకు వచ్చినట్టు అయింది. గవర్నర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తే పనిలో పడ్డారు. పొరబాటు: బాధ్యత గల పదవిలో ఉన్న ఉన్నతాధికారి పనిగట్టుకుని గవర్నర్‌కు మెసేజ్ పంపించేందుకు ఆస్కారం లేదన్న విషయాన్ని పరిగణించాలని శివకుమార్‌కు మద్దతుగా గళం విప్పే వాళ్లు పుదుచ్చేరిలో ఉండడం గమనార్హం. ఓ అధికారి ఈ విషయంపై మాట్లాడుతూ శివకుమార్ రాత్రి భోజనం చేస్తున్న సమయంలో వాట్సాప్‌కు వచ్చిన ఓ మెసేజ్‌ను చూసి, తక్షణం తన ఎడమ చేతితో డిలీట్ చేయడానికి ప్రయత్నించారని, అది కాస్త పొరబాటున గ్రూప్‌కు ఫార్వార్డ్ కావడంతోనే ఈ వివాదం తలెత్తినట్టుగా పేర్కొన్నారు. జరిగిన పొరబాటును భూతద్దంలో పెట్టి మరీ రచ్చకెక్కడం శోచనీయమంటూ గవర్నర్ తీరును దుయ్యబట్టే పనిలో పడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసే పనిలో మంత్రులు నిమగ్నమయ్యారు. అధికారాల మేరకే: తాజా రచ్చ వ్యవహారంపై సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ తమ మంత్రులు ఎవ్వరూ సీనియర్ ఎస్పీతో దురుసుగా ప్రవర్తించలేదన్నారు. హఠాత్తుగా ఓ అధికారిని అదుపులోకి తీసుకుని ఉన్నట్టుగా వచ్చిన సమాచారంతో తమ మంత్రులు అక్కడికి వెళ్లారేగానీ, గవర్నర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో మాత్రం కాదన్నారు. గవర్నర్ తన అధికారాల మేరకు పనిచేస్తున్నారని, ఇక, తాము తమకున్న అధికారాల మేరకు పనిచేస్తున్నామంటూ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే పుదుచ్చేరిలో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఏ పాటిదో స్పష్టం అవుతోంది. -
కిరణ్‌బేడీకి అశ్లీల వీడియో పంపిన అధికారి
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) కిరణ్‌బేడీకి వాట్సాప్‌లో అశ్లీల వీడియో పంపించాడనే ఆరోపణలతో శివకుమార్ అనే ప్రభుత్వాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులతో కిరణ్‌బేడీ ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దాని ద్వారానే అన్ని శాఖల అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి సహకార సంఘాల రిజిస్ట్రార్ పేరుతో ఈ గ్రూపునకు మూడు ఫోల్డర్లలో ఓ వీడియో వచ్చింది. అయితే ఈ వీడియోలను చూసిన కిరణ్ బేడీ సహా అధికారులంతా బిత్తరపోయారు. అందులో 30కి పైగా అసభ్య మెసేజ్‌లు, వీడియోలు ఉన్నాయి. దీంతో వీటిని పంపిన అధికారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ మనోజ్ ప్రీతాను ఆమె ఆదేశించారు. దీనిపై సీనియర్ ఎస్పీ రాజీవ్‌రంజన్ విచారణ జరిపి శనివారం తెల్లవారుజామున రిజిస్ట్రార్ శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి అసంతృప్తి
-
కొత్త సీఎం వచ్చినా దూకుడు తగ్గించని గవర్నర్
చెన్నై: పారిశుధ్యంపై పోరు కోసం రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ పుదుచ్చేరిలో ఆమెకు ఎదురవుతున్న కష్టాలు ఏమిటో అన్న అంశంపై దృష్టి పెట్టే వాళ్లు అధికమయ్యారు. అక్కడి కాంగ్రెస్ పాలకులు, గవర్నర్ కిరణ్‌బేడీ మధ్య సాగుతున్న అంతర్యుద్ధంలో ఉద్యోగులు నలిగి పోతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించగానే, కొత్త ప్రభుత్వానికి పక్కలో బల్లెం అన్నట్టుగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడీని కేంద్రం నియమించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే పగ్గాలు చేపట్టిన కిరణ్‌బేడీ తన దూకుడును పెంచారు. సంస్కరణలు, కొత్త విధానాలు అంటూ పుదుచ్చేరి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, అక్కడి ప్రజల మనసు చూరగొనే రీతిలో దూసుకెళ్లారు. అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌తో సరితూగే విధంగా సీఎం అభ్యర్థిగా నారాయణస్వామిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడమే కాకుండా, రాజకీయ అనుభవం, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడగలిగే నారాయణ స్వామి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తన దూకుడును కిరణ్ బేడీ తగ్గించ లేదు. ఈ సమయంలో సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య విభేదాలు సాగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని సీఎం, గవర్నర్ ఇద్దరూ ఖండించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పుదుచ్చేరి ప్రగతి కోసం తామిద్దరం శ్రమిస్తున్నామని వారు స్పష్టం చేశారు. కాగా కొత్త ప్రభుత్వ పాలకులు తమ రాజకీయాన్ని ప్రదర్శించే పనిలో పడ్డట్టుంది. కిరణ్ బేడీ సంస్కరణలకు చెక్ పెట్టే రీతిలో సీఎం చాప కింద నీరులా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అందుకే పారిశుధ్య కార్మికుల ద్వారానే కిరణ్‌బేడీకి వ్యతిరేకంగా నిరసనలు సాగించేందుకు తగ్గట్టుగా వ్యూహ రచన చేసినట్టు తెలిసింది. ఆదివారం తమకు సెలవు కావాలంటూ కార్మికులు గళం విప్పారు. దీంతో గవర్నర్ ఆదేశాలు రాజ్‌భవన్ వరకే పరిమితం చేయాలని, తాము ఆదేశించే వాటినే అమలు చేయాలన్నట్టుగా ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు సైతం వెళ్లినట్లు సమాచారం. ఈ సీఎం నారాయణ స్వామి, గవర్నర్ కిరణ్ బేడీ మధ్య ఉద్యోగులు, కార్మికులు నలిగి పోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. పాలకులు చెప్పింది వినాలో, గవర్నర్ ఆదేశాలను అనుసరించాలో అన్న సందిగ్ధంలో వారు ఉన్నారు. పైకి తమ మధ్య విభేదాలు లేవన్నట్టుగా ఆ ఇద్దరూ చెప్పుకుంటున్నా, లోలోపల పాలనా పరంగా ఉన్న హక్కులపై అంతర్యుద్ధమే సాగుతున్నట్టు పుదుచ్చేరిలో చర్చ సాగుతుంది. ఈ చర్చ నేపథ్యంలో ఉద్యోగులతో జరిగిన సమాలోచనలో కిరణ్ తీవ్రంగా స్పందించారు. పై స్థాయి అధికారులు ఇతర ప్రాంతాలకు చెందిన వారైనా, కింది స్థాయిలో అమలు చేసే వాళ్లంతా స్థానికులు కావడం లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల బేఖాతరు చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ సాగుతున్న వ్యవహారాలు, తాజా పరిస్థితుల నేపథ్యంలోనే అధికారులు, కింది స్థాయి సిబ్బందికి హెచ్చరికలు చేయడంతోపాటుగా, ప్రజల మన్ననల్ని అందుకునే విధంగా రాజీనామా నినాదంతో కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించే పనిలో పడ్డట్టుగా పుదుచ్చేరిలో చర్చ హోరెత్తడం గమనార్హం. -
రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే..
పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్‌గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కోరారు. రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే ఆరోగ్యకరమైన పుదుచ్చేరిగా మారుతుందని అన్నారు. ప్రాస్పరస్ పుదుచ్చేరి కార్యక్రమాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలంటూ గతంలో కూడా కిరణ్ బేడీ రజనీకాంత్‌ను కోరారు. మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంగ్ గవర్నర్‌గా కిరణ్ బేడీ బాధ్యతలు చేపట్టాక ప్రతి శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మున్సిపల్ కార్మికులతో కలసి వ్యర్థపదార్థాలను తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కిరణ్ బేడీ కోరారు. ఇంటి పరిసరాలు, రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరికి అన్నివిధాలా సాయం చేస్తోందని, పుదుచ్చేరి ఇండస్ట్రియల్ కారిడర్గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. -
వీక్లీ ఆఫ్!
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గస్తీలో ఉండే పోలీసు సిబ్బందికి ఇక వీక్లీఆఫ్ వర్తింప చేస్తూ చర్యలు తీసుకున్నారు. దీంతో పుదుచ్చేరి పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసుల పాత్ర కీలకం. విమర్శలు, ఆరోపణలు ఉన్నా, పోలీసు యంత్రాంగం అన్నది లేకుంటే, పరిస్థితి ఆగమ్య గోచరమే. పోలీసులకు సెలవులు తక్కువే. నిత్యం విధుల్లో ఉంటూ ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు ప్రప్రథమంగా వారంలో ఓ రోజు సెలవు దొరికిన పక్షంలో ఆనంద తాండవమే. ఓ రోజు సెలవు దొరికితే చాలు, పోలీసుల కుటుంబాల్లోనూ ఆనందం వికసిస్తుంది. సెలవుల కోసం, పనిభారంతో అనేక చోట్ల పోలీసులు సతమతం అవుతూ వస్తుంటే, ప్రప్రథమంగా వీక్లీఆఫ్ ఇవ్వడానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నిర్ణయించడం ఆహ్వానించదగ్గ విషయమే. వీక్లీ ఆఫ్ : మాజీ ఐపీఎస్ అధికారిణిగా పోలీసుల కష్టాల్ని కిరణ్ బేడీ ప్రత్యక్షంగా తిలకించారన్నది జగమెరిగిన సత్యం. ఐపీఎస్ అధికారిణిగా, రాజకీయ నాయకురాలిగా అవతరించి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న కిరణ్‌బేడీ ప్రజలు, అధికారుల నుంచి మంచి మార్కుల్నే కొట్టేస్తున్నారు. ప్రజాహితం లక్ష్యంగా పుదుచ్చేరిలో దూసుకెళుతున్న కిరణ్ బేడీ, అందరి మన్ననలు అందుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తన సంస్కరణలతో అధికార వర్గాల్లో మార్పులు తీసుకొచ్చిన కిరణ్ బేడి , ప్రస్తుతం ప్రజల్లో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. పుదుచ్చేరిలో శాంతి భద్రతలు ఒకప్పుడు అధ్వానంగా ఉన్నాయి. కిరణ్ రాకతో కొంత మేరకు మెరుగు పడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసుల కష్టాల్ని గుర్తించిన ఈ లెఫ్టినెంట్ గవర్నర్ వారంలో ఓ రోజు సెలవు తీసుకునేందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు. పోలీసుల సేవల్ని ప్రశంసిస్తూ పుదుచ్చేరిలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గస్తీ సిబ్బందిని ఉద్దేశించి ప్రత్యేకంగా ఆమె కొనియాడారు. డీజీపీ ఆదేశిస్తే, వారంలో ఓ రోజు గస్తీ సిబ్బందికి సెలవులు ఇచ్చేందుకు సిద్ధం అని ప్రకటించారు. గస్తీ సిబ్బంది తమ తమ ప్రాంతాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, శాంతి భద్రతల పర్యవేక్షణలో గానీయండి, నేరగాళ్ల కదలికల్ని గుర్తించడంలో గానీ వారి కృషి అభినందనీయమని వ్యాఖ్యలు చేశారు. ఇంతలో వేదిక మీదున్న డీజీపీ సునీల్‌కుమార్ గస్తీ సిబ్బంది వారంలో ఓరోజు సెలవు ఇచ్చేందుకు సిద్ధం అని, ప్రకటించడంతో అందుకు కిరణ్ బేడి ఆమోదముద్ర వేయడం విశేషం. అయితే, ఈ వీక్లీ ఆఫ్ అన్నది అందరికీ ఒకే సారిగా ఇవ్వలేం అని, కొందరికి ఓ రోజు, మరి కొందరికి మరో రోజు అన్నట్టుగా వంతుల వారీగా కొనసాగిస్తామని డీజీపీ ప్రకటించారు. ఈ వీక్లీఆఫ్ అన్నది గస్తీ సిబ్బందికి మాత్రమేనని, తదుపరి అందరికీ వర్తింపచేయడానికి తగ్గ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. -
కలెక్టర్ బంఫర్ ఆఫర్.. కానుకగా ‘కబాలి’ టికెట్లు!
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న అభిమానగణం గురించే అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటే అభిమానులు పడి చస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పుదుచ్చేరి కలెక్టర్ తాజాగా అభిమానులకు ఓ ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛభారత్ లాంటి ప్రజాసేవల్లో పాల్గొన్నవారికి రజనీ తాజా సినిమా ‘కబాలి’ టికెట్లు కానుకగా ఇస్తామని ప్రకటించారు. ఊహించినట్టే ఈ ప్రకటనకు అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ట్విట్టర్లో తెలిపారు. ఈ నేపథ్యంలో రజనీకి కిరణ్ బేడి ఓ విజ్ఞప్తి చేశారు. పుదుచ్చేరి అభివృద్ధి కోసం ఆయన ఈ కేంద్రపాలిత ప్రాంతం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కోరారు. Request Super Star Rajani to b Brand Ambassador of #prosperouspuducherry to be #OpenDeficationFree #ODF @PMOIndia https://t.co/fbCXLCTKuF — Kiran Bedi (@thekiranbedi) 30 June 2016 -
ఎమ్మెల్యే కాళ్లకు మొక్కిన కిరణ్ బేడి!
పుదుచ్చేరి: ఆమె ఎక్కడున్నా తన ప్రత్యేకత చాటుకుంటారు. తొలి మహిళా ఐపీఎస్ గా ఘనత సాధించిన కిరణ్ బేడి తన ఉద్యోగ జీవితంలోనూ తనదైన ముద్ర వేశారు. తాజాగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఈ మాజీ ఐపీఎస్ తన మార్క్ చూపిస్తున్నారు. ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను బాధ్యతలు చేపట్టిన సందర్బంగా పుదుచ్చేరి ఎమ్మెల్యేలు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే విజయవేణి... కిరణ్ బేడికి సాలువా కప్పి పాదాభివందనం చేసింది. ఆమెను లేవదీసి కాళ్లు పట్టుకోవద్దని కిరణ్ బేడి ఉపదేశించారు. ఆత్మగౌరవంతో బతకాలని ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. అక్కడితో ఆగకుండా మహిళా ఎమ్మెల్యేకు తాను కూడా పాదాభివందనం చేశారు. దీంతో మహిళా ఎమ్మెల్యేతో పాటు అక్కక ఉన్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచారం చేస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కిరణ్ బేడి తనదైన శైలి చూపించారు. వీఐపీలు, రాజకీయ నేతల కార్లకు ఎలాంటి సైరన్లు ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రాజకీయ నేతలకు మినహాయింపు ఇవొద్దని ఆదేశించారు. పుదుచ్చేరిని క్లీన్ సిటీగా మార్చేందుకు అందరూ సహకరించాలని కిరణ్ బేడి పిలుపునిచ్చారు. అక్కడితో ఆగకుండా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నగరంలోని పరిసరాలను పరిశుభ్రం చేశారు. -
పుదుచ్చేరి సీఎంగా నారాయణస్వామి
పుదుచ్చేరి: కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి వి.నారాయణస్వామి పుదుచ్చేరి పదో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇక్కడి గాంధీ థిడాల్లో నారాయణ, మరో ఐదుగురు మంత్రుల చేత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ప్రమాణం చేయించారు. వీరిలో సీఎం పీఠం కోసం పోటీపడిన నమశ్శివాయమ్, మల్లాది కృష్ణారావు, ఎంఓహెచ్ఎఫ్ షాజహాన్, ఎం.కందసామి, కమలాకన్నన్ ఉన్నారు. యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు. వీరంతా గతంలో రాష్ట్ర మంత్రులుగా పనిచేసినవారే. 30 మంది సభ్యుల అసెంబ్లీలో 15 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా 69 ఏళ్ల నారాయణ గత నెలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఇక కుయ్.. కుయ్.. మోతలు వద్దు
పుదుచ్చేరి: మాజీ ఐపీఎస్ అధికారిణి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పాలనలో తన మార్క్ చూపుతున్నారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తానంటూ ఇటీవల వార్నింగ్ ఇచ్చిన కిరణ్ బేడీ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీల కార్లకు, వారి ఎస్కార్ట్, పైలట్ వాహానాలకు సైరన్లు వాడకంపై నిషేధం విధించారు. లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటరీ దేవా నిధి ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంతేగాక వీఐపీల వాహానాలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వరాదంటూ ట్రాఫిక్ పోలీసులకు కిరణ్ బేడీ ఆదేశాలు జారీ చేశారు. వీఐపీల కోసం ట్రాఫిక్‌ను ఆపరాదని, ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశించారు. కాగా వాహానాలకు సైరన్లు వాడకం విషయంలో అంబులెన్స్‌లు, ఫైర్ సర్వీసులు వంటి అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు. -
పుదుచ్చేరిలో కిరణ్ బేడీ హల్చల్
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ హల్ చల్ చేశారు. తన సర్వీసులో అసాంఘిక శక్తులు, రౌడీల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ.. లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలోనూ అదే మార్క్ చూపుతున్నారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తానని, అవినీతి పరుల అంతం చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. పుదుచ్చేరి మంత్రులు, అధికారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని కిరణ్ బేడీ స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో ఆక్రమణలను వారంలోగా తొలగిస్తామని చెప్పారు. ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం 1031 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. కిరణ్ బేడీ తీరు, వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇటీవల పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్‌కు పక్కలో బల్లెం!
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికార పగ్గాలు చేపట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్ముందు సంకట పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇందుకు కారణం పక్కలో బల్లెంలా ఆ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడి నియమితులు కావడమే. డైనమిక్ లేడీగా పేరెన్నికగన్న కిరణ్ బేడీని పుదుచ్చేరికి పంపుతూ కేంద్రం ఆదివారం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు ఎక్కువ. ప్రభుత్వం తరఫున ఏ పథకం తీసుకురావాలన్నా, అధికార బదిలీల్లోగానీ, నిధుల విడుదల్లో గానీ, అన్ని రకాల వ్యవహారాల్లో గవర్నర్ సంతకం, అనుమతి తప్పని సరి. ఈ అనుమతుల వ్యవహారంలో ఇది వరకు పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఢీకొట్టే స్థాయికి వెళ్లింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏతో కలిసి ఎన్ఆర్ కాంగ్రెస్ పయనించడంతో, లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వీరేంద్ర కఠారియాను మార్పించుకుంది. తదుపరి అండమాన్ గవర్నర్ ఏకే సింగ్‌కు అదనపు పగ్గాల్ని కేంద్రం అప్పగించింది. రెండేళ్లుగా ఏకే సింగ్ నెలలో రెండు మూడు రోజులు మాత్రమే పుదుచ్చేరిలో అడుగు పెట్టేవారు. దీంతో ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పరిస్థితులు మారాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ పతనమైంది. కాంగ్రెస్-డీఎంకే నేతృత్వంలోని కూటమి మెజారిటీ దక్కించుకుని అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా కొత్త గవర్నర్ నియమించ బడుతుండడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా డైనమిక్ లేడీగా పేరు గడించిన, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని నియమించడంతో కొత్త ప్రభుత్వానికి ఇక రోజూ సంకట పరిస్థితులే. లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడీ అధికార పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోన్నది. ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వానికి ఇక, అధికారాలు కరువైనట్టే అన్న ప్రశ్న ఆదివారం బయలు దేరింది. ఇందుకు కారణం, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ భేడి పూర్తి స్థాయిలో పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులు కావడమే. ఇక్కడ ప్రభుత్వం ఉన్నా, సంతకాలు, అనుమతుల కోసం గవర్నర్ ఎదుట నిలబడాల్సిందే. ఈ దృష్ట్యా, కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించి కిరణ్‌బేడీని ఇక్కడకు పంపించేందుకు నిర్ణయించినట్టు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ సర్కారుకు మున్ముందు ఇరకాటంలో పెట్టడానికే అన్నది జగమెరిగిన సత్యం. విధి నిర్వహణలో నిక్కచ్చితనం, నిజాయితీ ఆమె నైజం అన్న విషయం తెలిసిందే. అయితే, తనకు పదవి దక్కడంపై స్పందించిన కిరణ్ భేడి ప్రజా సేవకు తాను అంకితం అని ఆమె పేర్కొన్నారు. -
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బేడీ
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. బేడీ గతంలో ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేశారు. రిటైరైన తర్వాత సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఘోరంగా ఓడారు. కృష్ణానగర్ నుంచి పోటీచేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు బీజే పీ ప్రభుత్వం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ఎల్జీగా నియమితులైన బేడీకి కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. తాజాగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లకు గాను కాంగ్రెస్ డీఎంకే కూటమి 17 సీట్లను గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. -
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బేడీ
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. బేడీ గతంలో ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేశారు. రిటైరైన తర్వాత సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఘోరంగా ఓడారు. కృష్ణానగర్ నుంచి పోటీచేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు బీజే పీ ప్రభుత్వం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ఎల్జీగా నియమితులైన బేడీకి కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. తాజాగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లకు గాను కాంగ్రెస్ డీఎంకే కూటమి 17 సీట్లను గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.