నా ఫొటోతో నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారు | kiran bedi takes on arvind kejriwal | Sakshi
Sakshi News home page

నా ఫొటోతో నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారు

Published Mon, Jan 26 2015 5:44 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నా ఫొటోతో నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారు - Sakshi

నా ఫొటోతో నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారు

న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనైతిక పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ విమర్శించారు. తన అనుమతి లేకుండా తన ఫొటోతో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

సోమవారం 'సాక్షి'కి  కిరణ్ బేడీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మహిళలకు భద్రత, యువతకు ఉపాధి, పేదలకు తక్కువ ధరకే విద్యుత్, తాగునీరు అందించడమే తన లక్ష్యమని కిరణ్ బేడీ చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు అవసరమని పేర్కొన్నారు. మోదీ ఇచ్చిన సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ నినాదంపై ప్రజలను ఓట్లు అడుగుతున్నాని తెలిపారు. ఈ రోజు ఆమె కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement