హస్తినలో ఓటు వేసిన ప్రముఖులు | Kiran Bedi casts her vote, asks people to vote for development | Sakshi
Sakshi News home page

హస్తినలో ఓటు వేసిన ప్రముఖులు

Published Sat, Feb 7 2015 9:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

హస్తినలో ఓటు వేసిన ప్రముఖులు - Sakshi

హస్తినలో ఓటు వేసిన ప్రముఖులు

న్యూఢిల్లీ : ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆమె నీతి బాగ్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అలాగే ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, మాజీమంత్రి హర్షవర్థన్, రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తదితరులు ఓటు వేశారు.

కాగా శర్మిష్ట గ్రేటర్ కౌలాష్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆమె...తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్లో పర్యటించిన ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement