
'బీజేపీ వంద శాతం గెలిచి తీరుతుంది'
న్యూఢిల్లీ: హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్దన్ జోస్యం చెప్పారు. శనివారం కృష్ణనగర్లో పోలింగ్ కేంద్రానికి ఆయన తల్లితో కలసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం హర్షవర్థన్ విలేకర్లతో మాట్లాడుతూ... ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెలువడిన సర్వేలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఎన్ని సర్వేలు ఏం చెప్పిన వంద శాతం విజయం బీజేపీదే అని ఆయన స్పష్టం చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్కే ఘన విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు వెల్లడించిన విషయాన్ని విలేకర్లు ప్రశ్నించగా హర్షవర్థన్పై విధంగా స్పందించారు. 2013 డిసెంబర్లో జరిగిన న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హర్షవర్ధన్ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీ గెలుచుకున్న... ప్రభుత్వ ఏర్పాటకు బీజేపీ సుముఖత వ్యక్తం చేయలేదు.