Political News
-
తెరపైకి ‘హమ్ అదానీ కె హై’.. మళ్లీ జేపీసీ డిమాండ్
ఢిల్లీ: అదానీ గ్రూప్ సంస్థ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన వ్యవహారాలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.లంచం, మోసం చేశారనే అభియోగాలపై అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించడం తెలిసిందే. ఈ ఆరోపణలతో స్టాక్‌మార్కెట్ సైతం కుదేలైంది. మరోపక్క.. రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపుతోంది.‘మోదాని’ స్కామ్స్‌పై జేపీసీ ఏర్పాటు చేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అయితే.. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు బలం చేకూరుతోంది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే.. The indictment of Gautam Adani and others by the Securities and Exchanges Commission (SEC) of the US vindicates the demand that the Indian National Congress has been making since Jan 2023 for a Joint Parliamentary Committee (JPC) investigation into the various Modani scams. The…— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024न्यूयॉर्क के पूर्वी ज़िले के अमेरिकी अटॉर्नी कार्यालय द्वारा गौतम अडानी और उनसे जुड़े अन्य लोगों पर गंभीर आरोप लगाना उस मांग को सही ठहराता है जो भारतीय राष्ट्रीय कांग्रेस जनवरी 2023 से विभिन्न मोदानी घोटालों की संयुक्त संसदीय समिति (JPC) जांच के लिए कर रही है। कांग्रेस ने हम…— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024 ‘హమ్ అదానీ కె హై’ సిరీస్‌లో ఇప్పటివరకు వందలాది ప్రశ్నలు సంధించామని, మోదీ, అదానీ బంధంపై వేసిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం రాలేదని జైరాం రమేష్ విమర్శ గుప్పించారు.గతంలో.. అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక మార్కెట్ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాల్లోనూ డిమాండ్ చేశాయి.అదానీపై తాజా అభియోగాలివే..ఇదిలా ఉంటే.. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఆపై.. అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు వాళ్లు పేర్కొన్నారు. అలాగే..తద్వారా.. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపించారు. న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. దీంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఇదే సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(SEC) మరో సివిల్ కేసు నమోదు చేసింది. యూఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకు పైగా సమీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది. ఈ వార్తలపై అదానీ గ్రూప్ స్పందించాల్సి ఉంది. -
హీరో విజయ్‌కు ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
జట్టుగా వచ్చినా.. సింగిల్‌గా వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్టార్ హీరో విజయ్‌కు పరోక్షంగా సవాల్ విసిరారు ఈ యువనేత. వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని దీమా ప్రదర్శించారు. హీరో విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తొలి బహిరంగ సభలో తమపై పరోక్షంగా విమర్శలు చేసిన విజయ్‌పై డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్‌కు కౌంటర్ ఇచ్చారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా తమకు తిరుగులేదని, 2026లోనూ తిరిగి అధికారంలోకి వస్తామంటూ ‘దళపతి’కి పరోక్షంగా జవాబిచ్చారు. తంజావూరులో గురువారం జరిగిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు.తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. అక్టోబరు 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో మానాడు పేరుతో మొదటి బహిరంగ సభ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని ఇన్‌డైరెక్ట్‌గా స్టాలిన్ ఫ్యామిలీపై ఎటాక్ చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలను వదిలేసి తమను మాత్రమే విమర్శించడంతో విజయ్‌పై డీఎంకే నాయకులు మాటల దాడి పెంచారు.ఎంత మంది వచ్చినా మాదే గెలుపుఅయితే తమిళనాడు ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎంత మంది వచ్చినా డీఎంకే నీడను కూడా తాకలేరని తాజాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రజారంజక పాలన అందిస్తున్నామని, 2026 లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడోసారి డీఎంకే పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని వ్యతిరేకించేవారంతా జట్టు కట్టినా.. ఢిల్లీ నుంచి వచ్చినా, స్థానికంగా ఏ దిక్కు నుంచి వచ్చినా డీఎంకేనే గెలుస్తుంది. మా పార్టీని నాశనం చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతార’ని వార్నింగ్ ఇచ్చారు. కాగా, విజయ్ను ఉద్దేశించే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే విక్రవండిలో మానాడు సభ సందర్భంలో విజయ్‌కు ఉదయనిధి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.చదవండి: హీరో విజయ్.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభంవిజయ్ ఓడిపోతాడు..మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ.. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం పార్టీకి గెలుపు అవకాశాలు లేవని, విజయ్ కూడా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. మదురైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదన్నారాయన.చదవండి: ‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?69 సినిమాపై విజయ్ ఫోకస్కాగా, విజయ్ ప్రస్తుతం తన 69 సినిమాపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో ఇదే ఆయన అఖరి సినిమాగా ప్రచారం జరుగుతోంది. దళపతి రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా ఉంటుందని టాక్. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
ఇద్దరూ ఇద్దరే..! తగ్గేదేలే..!!
తెలంగాణలో విగ్రహాల పేరుతో సాగుతున్న రగడ చాలా అభ్యంతరకరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాని... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు నోటికి వచ్చినట్టు మాట్లాడడం పద్ధతిగా లేదు. తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం తలపెట్టింది. దానిని కేటీఆర్ వ్యతిరేకించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని ప్రకటించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు స్పందించారు. మిగతా వారి సంగతి ఏలా ఉన్నా సీఎం స్థానంలో ఉన్న రేవంత్ మాటలు మరి దురుసుగా ఉన్నాయి. 'నీ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రాణం ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం తీసివేస్తావా... నీకు అధికారం అనేది కలలో మాట. రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరకు పోతే వీపు చింతపడు అయితది. రాజీవ్ గాంధీ విగ్రహం తీయాడానికి తారిఖు చెప్పు. మా జగ్గన్నకు చెబుతా. ఆయన వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తది అంటూ అక్కడ ఆగకూండా రాజీవ్ గాంధీ విగ్రహంను ముట్టుకుంటే.. చెప్పు తెగకపోతే చూస్తా" అని హెచ్చరించారు.కేటీఆర్ అసలు ఈ వివాదాన్ని లేవనెత్తాల్సిన అవసరం లేదు. ఒక వేళ అభ్యంతరం ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టవద్దని... తెలంగాణ తల్లి విగ్రహంను ఏర్పాటు చేయాలని చెప్పవచ్చు. ఇప్పటికే మేధావులు పలువురు ఆ సూచన చేసారు. అంత వరకు ఆగకుండా కేటీఆర్ ఏకంగా రాజీవ్ విగ్రహాన్ని అధికారంలోకి వస్తే తొలగిస్తామని అంటూ... కాంగ్రెస్‌ను రెచ్చగోట్టారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మరి అన్యాయంగా కేసీఆర్ ప్రస్తావన తెచ్చి అవమానించిన తీరు బాగాలేదు. "పోద్దున్న నుంచి రాత్రి వరకు తాగి ఫార్మ్ హౌస్ లో పోర్లాడే కేసీఆర్ విగ్రహం సచివాలయం ముందు ఉండాలా అంటూ దారుణంగా మాట్లాడారు". అంతే కాక వాళ్ల అయ్య పోయేది ఎప్పుడు... వీడు పెట్టేది ఏప్పుుడు అంటూ పరుష భాషను వాడడం ఏ మాత్రం సరికాదు. ఇది ఆయన హోదాకు ఏ మాత్రం తగదు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఏట్లాపడితే అట్లా మాట్లాడి హైలైట్ అయ్యేవారు. ఇప్పటికి అలాంటి పంథాను కొనసాగించాలని అనుకుంటే తెలంగాణ సమాజం హర్షించదు. అనవసరంగా కేసీఆర్ పేరు బయటకు తీసుకువచ్చి అది కూడా పిల్లల ముందు మాట్లడడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఎంత కాదు అన్న కేసీఆర్... పదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు అనే విషయం మర్చిపోకుడదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమాన్ని నడిపి దేశం అంతటి దృష్టిని కేసీఆర్ ఆకర్షించారు. ఈ రోజు రేవంత్ సీఎంగా ఉన్నారంటే అది కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఫలితమే కదా! ఓడిపోయినంత మాత్రాన కేసీఆర్ విలువ తగ్గుతుందా! కేసీఆర్ కూడా గతంలో కొన్నిసార్లు అభ్యంతరకరంగా మాట్లడిన సందర్భరాలు లేకపోలేదు. అయినప్పటికి రేవంత్ కామెంట్స్ శ్రుతిమించాయని చెప్పకతప్పదు.ఇక్కడ విషయం ఏమిటంటే ఇంకా నాలుగేళ్ల వరకు ఎన్నికలు జరగవు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే రాజీవ్ గాంధీ విగ్రహం జోలికి ఎవరు వెళ్లరు. అలాంటిది రాజీవ్ విగ్రహంను టచ్ చేయి... చెప్పు తెగుద్ది అంటూ రేవంత్ మాట్లడాల్సిన అవసరమే లేదు. ఒక పక్క బీఆర్ఎస్కు మళ్లీ అధికారం రాదు అంటునే... రేవంత్ ఈ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? అయితే కేటీఆర్ వ్యాఖ్యల పుణ్యామా అని రేవంత్ సర్కార్‌కు ఒక ఐడియా వచ్చినట్టు అయ్యింది. వెంటనే సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని... స్థలాన్ని కూడా పరిశీలించారు.డిసెంబర్ తొమ్మిది నాటికి అంటే సోనియా గాంధీ పుట్టిన రోజు నాటికి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి ఇంత కాలం క్రెడిట్ అంతా కేసీఆర్‌దే అని చెప్పాలి. తెలుగు తల్లి బదులు తెలంగాణ తల్లి విగ్రహాలను తయారు చేయించి అనేక చోట్ల ప్రతిష్టించేలా చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ఆఫీసులో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. ఎందువల్లో కాని సచివాలయంలో మాత్రం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని రేవంత్ వాడుకుంటున్నారు.ఇక రేవంత్ కామెంట్స్‌పై కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. ఇందులోను అధ్వాన్నపు భాషా మాట్లడడం మర్యాదగా లేదు. తాము అధికారంలోకి రాగానే సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తను ఊడ్చిపారేస్తామని కేటీఆర్ అనడం పద్దతి కాదు. రాజీవ్ గాంధీ ఒక మాజీ ప్రధాని అన్నది గుర్తించుకోవాలి. రేవంత్, కేటీఆర్ రగడలో సంబంధం లేని రాజీవ్ గాంధీ, కేసీఆర్‌ల పేర్లు తీసుకుని వారిద్దరిని అవమానిస్తూ మాట్లాడి స్థాయిని దిగజార్చుకున్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా చీఫ్ మినిస్టర్ బధులు.. చీప్ మినిష్టర్ అని అనడం, డిల్లీ గులాం అనడం రేవంత్ మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కేటీఆర్ కామెంట్ చేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా చెత్త అన్న పదాన్ని వాడడం కేటీఆర్ తప్పు అయితే... కేసీఆర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం రేవంత్ తప్పు అని చెప్పాలి.అధికారం కొల్పోయిన బాధ కేటీఆర్‌కు ఉండవచ్చు. అయినా ఆయన కొంత సంయమనం పాటించి ఉంటే... వివాదం ఇక్కడి దాకా వచ్చేది కాదు. అదే టైంలో ఛాన్స్ దోరికింది కదా అని మాజీ సీఎం కేసీఆర్‌ను బూతులు తిట్టిన మాదిరిగా రేవంత్ మాట్లడడం ఆయన అధికార అహంకారాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాలు అన్నిటిని గమనిస్తే రేవంత్, కేటీఆర్ ఇద్దరూ మానసిక రుగ్మతతో ఉన్నారన్న అభిప్రాయం ప్రజలలో కలుగుతుంది. తెలంగాణ సమాజానికి కాని, తెలుగు ప్రజలకు కాని వీరి వ్యాఖ్యలు ఏ మాత్రం అదర్శవంతం కాదు. నేతలు తమను ప్రజలు మెచ్చుకునేలా మాట్లాడాలి కాని... ఆసహ్యించుకునేలా మాట్లడితే వారికే నష్టం. కాకపోతే బీజేపీకి చోటు ఇవ్వకుండా, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య డైలాగ్ వార్ నడుపుతుండడమే కొసమెరుపు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వదిలిపెట్టం, అవసరమైతే ఢిల్లీకి..: అరెస్టుపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: గత రెండు రోజుల అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. పోరాటాలు బీఆర్ఎస్కు కొత్తేం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని అన్నారాయన. పోరాటం మాకు కొత్త కాదు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతం. వదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. జై తెలంగాణ.. అంటూ తన అరెస్టుకు సంబంధించిన ఫొటోలతో సహా సందేశం ఉంచారాయన.పోరాటం మాకు కొత్త కాదు ✊ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతంవదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం… pic.twitter.com/ThGZAnjbf0— KTR (@KTRBRS) August 3, 2024నిరుద్యోగుల కోసం గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. -
వంధ్యత్వం కాదు.. అంధత్వం!
ప్రకృతిలోని జీవరాశులను ప్రేమించే వాళ్లంతా మాతృత్వం కలవారే! దీనికి జెండర్ లేదు. వాత్సల్యం, కరుణే దానికి కొలమానం! అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వాన్ని ఫాలో అవుతున్నవాళ్లకు అర్థమయ్యే ఉంటుంది ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకో! అవును, కమలా హ్యారిస్ గురించి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ ప్రస్తావన. రాజకీయ ఎన్నికల ప్రచారంలో హుందాతనం.. అగ్రరాజ్యంలోనూ పూజ్యమని అర్థమైంది. అవతలి పక్షాన్ని ఎదుర్కోవడానికి ముఖ్యంగా మహిళానేతల విషయంలో ఎక్కడైనా వాళ్ల దక్షత కన్నా వ్యక్తిగతేచ్ఛలే పరిగణనలోకి తీసుకునేట్టున్నారు.దీనికి అభివృద్ధి చెందిన దేశాలు, వర్తమాన దేశాలనే వ్యత్యాసం లేనట్టుంది. పిల్లల్లేని మహిళలు దుర్భర జీవితాన్ని గడుపుతారని, వాళ్లు సమాజానికి భారమే తప్ప వాళ్ల వల్ల ఒరుగుతున్నదేమీ లేదని రిపబ్లికన్‌పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వాక్రుచ్చాడు. ఈ కామెంట్.. పిల్లల్లేని కమలా హ్యారిస్నుద్దేశించేనని ప్రపంచమంతా గ్రహించి, ఆమె పక్షాన నిలిచింది. పిల్లలను కనాలా వద్దా అనేది పిల్లల్ని కనే శారీరక స్థితి, పెంచే సామాజిక పరిస్థితులను బట్టిమహిళ నిర్ణయించుకోవాలని, ఆ నిర్ణయాధికారం ఆమె హక్కని నాగరిక సమాజం గొంతు చించుకుని అరిచింది. దాని మీద ఉద్యమాలనూ లేవనెత్తింది.ఇంతలోతైన ఆలోచన, అంత విశాలమైన దృక్పథం లేని వాన్స్ లాంటి వాళ్లకు కనీసం దాన్ని ఓ పర్సనల్ చాయిస్‌గా గుర్తించాలనే స్పృహ కూడా లేనట్టుంది. పెళ్లి, పిల్లలు అనేది వ్యక్తిగతం. పిల్లల్లేని చాలామంది ఆడవాళ్లు అనాథలను చేరదీసి, ఇరుగుపొరుగు పిల్లలను పోగేసి.. బంధువుల బిడ్డలను అక్కున చేర్చుకుని వాళ్లను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దిన ఉదంతాలు కోకొల్లలు! ఇందుకు కమలా హ్యారిస్ కూడా ఉదాహరణగా నిలుస్తారు. కడుపున పుట్టిన పిల్లల్లేక΄ోయినా ఆమె అద్భుతమైన మాతృమూర్తి! తన భర్త పిల్లలకు అమ్మతనాన్ని పంచింది. జేడీ వాన్స్ వ్యాఖ్యల క్రమంలో ఆ పిల్లలు కమలా హ్యారిస్ చేయి వదల్లేదు.ఆమె భుజాల చుట్టూ చేయివేసి ఆమె మనోనిబ్బరాన్ని మరింత పెంచుతున్నారు. దీన్ని ప్రపంచమూ హర్షిస్తోంది. అలాంటి మాతృమూర్తి మీద నోరుపారేసుకున్న వాన్స్.. తండ్రైనా హృదయం లేనివాడిగా ముద్రపడ్డాడు. నిజానికి అమెరికా అధ్యక్ష్య పదవికి తమ అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్‌ని ప్రకటించగానే ఆపార్టీ విజయావకాశాలు అనూహ్యంగా పెరిగాయి. ఆ ధాటిని తట్టుకోలేక రిపబ్లికన్‌పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు ప్రతిపక్ష అభ్యర్థి జెండర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆమె వ్యక్తిగత జీవితం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.కమలా హ్యారిస్ మాతృత్వానికి.. అమెరికా అవసరాలకు లంకె ఏంటి? అక్కడే కాదు ఎక్కడైనా సరే.. స్త్రీల వ్యక్తిగత విషయాలకు.. దేశ పురోగతికి ఏమిటి సంబంధం? ఒకవేళ సంబంధమే ఉంది అనుకుంటే అప్పుడు పురుషుడి వ్యక్తిగత విషయాలూ అంతే ప్రభావం చూపిస్తాయి కదా! పెళ్లి, పిల్లలు.. ఎవరికైనా వాళ్ల వ్యక్తిగతమే! ఒకవేళ వాన్స్ అన్నదే తీసుకున్నా.. పెళ్లి, పిల్లలు అనే బాధ్యత లేని స్త్రీలు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పురోగతిలో చెప్పుకోదగ్గపాత్రేపోషిస్తున్నారు. మాతృత్వాన్ని మహత్తర అనుభూతిగా చూపి ఆ బంధనంతో స్త్రీలను కట్టిపడేసి.. తమకుపోటీలేకుండా చూసుకోవాలనుకున్న పురుషాధిపత్య భావజాలం అమెరికన్లలోనూ జాస్తి అని వాన్స్ ద్వారా మరోసారి రుజువైంది. :::సరస్వతి రమ -
విక్రవాండికి.. ఉదయనిధి!
సాక్షి, చైన్నె: విక్రవాండి ఉప ఎన్నికల్లో నేతల ప్రచారం హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే యువజన నేత, మంత్రి ఉదయ నిధి రెండు రోజుల పాటుగా నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. ఈవీఎంలలో చిహ్నాలను పొందు పరిచే కార్యక్రమంతో పాటు, పోలీసుల తపాల్ ఓట్ల నమోదు ప్రక్రియను గురువారం ఆ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి పళణి పర్యవేక్షించారు.వివరాలు.. విక్రవాండి అసెంబ్లీ స్థానానికి ఈనెల 10వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. డీఎంకే అభ్యర్థి అన్నియూరు శివాకు మద్దతుగా మంత్రులు ఆ నియోజకవర్గంలో తిష్ట వేశారు. గ్రామగ్రామానా తిరుగుతూ ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. పీఎంకే అభ్యర్థి సి. అన్బుమణికి మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాసు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి అభినయకు మద్దతుగా ఆ పార్టీ నేత సీమాన్ ఓట్ల వేటలో ఉన్నారు.ఈ పరిస్థితుల్లో డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రచార ప్రయాణానికి డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శి, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సిద్ధమయ్యారు. ఈనెల 7,8 తేదీలలో ఆయన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 8 గ్రామాలలో ఆయన ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించే విధంగా డీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి.పోస్టల్ ఓట్ల నమోదు..ప్రచారం ఓ వైపు ఉధృతంగా సాగుతుంటే, మరోవైపు ఎన్నికల సమయం సమీపించడంతో ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ విషయంపై ఆ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పళణి మాట్లాడుతూ, పోలీసులకు తపాల (పోస్టల్) ఓట్ల నమోదు తాలుకా కార్యాలయంలో శనివారం వరకు జరగనున్నట్లు వివరించారు. 370 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు.సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు 574 మంది తమ తపాల్ ఓట్లను నమోదు చేశారని తెలిపారు. ఈవీఎంలలో చిహ్నాలు, అభ్యర్థుల పేర్లను పొందు పరిచే పనులు శరవేగంగా జరుగుతున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 276 పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, 140 పోలింగ్ బూత్‌లలో వెలుపలు, పరిసరాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.44 సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను గుర్తించామని, ఇక్కడ పారా మిలటరీ భద్రతకు నిర్ణయించామన్నారు. ఈనెల 10 వ తేదీ విక్రవాండికి లోక్‌ల్ హాలిడే ప్రకటించనున్నామని, రెండు రోజులు టాస్మాక్ దుకాణాల మూతకు ఆదేశాలు ఇవ్వానున్నామన్నారు. తమకు ఇప్పటి వరకు 41 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
వామపక్షాలకు నూతనోత్తేజం!
పార్లమెంటు ఎన్నికలలో సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. రెండు సీట్లు గెలుపొంది వామపక్ష శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. బిహార్‌లోని అరా, కరాకట్ లోక్‌సభ స్థానాల నుండి లిబరేషన్ అభ్యర్థులు సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్‌లు విజయ బావుటా ఎగురవేశారు. భారత గడ్డపై ఫాసిస్టు శక్తుల పెరుగుదల అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చేందుకు లిబరేషన్ తన వంతు కృషి చేస్తూ ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా మారింది.అరా, కరాకట్, నలందా, కొడర్మ సీట్లలో బరిలో నిలిచింది. నలందా నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే సందీప్ సౌరభ్ రెండో స్థానంలో నిలిచారు. జార్ఖండ్‌లో కొడెర్మలో వినోద్ సింగ్ (బాగోదర్ ఎమ్మెల్యే) రెండో స్థానంలో నిలిచారు. బిహార్‌లో అజియాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా దానిని లిబరేషన్ నిలబెట్టుకుంది. ఇక్కడ శివ్ ప్రకాష్ రంజన్ విజయం సాధించారు.మొదట సాయుధ మార్గాన్ని అనుసరించిన లిబరేషన్ పార్టీ కాలక్రమంలో తన పంథాను మార్చుకుంది. ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్)ను ఏర్పాటు చేసి 1985 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల్లో పాల్గొంది. 1989 పార్లమెంటు, 1990 అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించింది. 1989లో తొలిసారిగా రామేశ్వర ప్రసాద్‌ను అరా నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి పంపింది. ఆ తర్వాత జయంతా రోంగ్పి అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ నుంచి పలుమార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఇద్దరు ఎంపీలను బిహార్ నుంచి పార్లమెంట్‌కు పంపింది.1995 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ పేరుతో పోటీ చేస్తోంది. 2010 ఎన్నికల్లో తప్ప మినహా ఆ పార్టీ ప్రతినిధులు మిగిలిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. గతంలో ఒంటరిగా పోటీ చేసి పదకొండు మంది సభ్యులను అసెంబ్లీకి పంపిన చరిత్ర లిబరేషన్‌కు ఉంది. జైలులో ఉండి శాసన సభకు గెలిచిన చరిత్రా ఉంది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లిబరేషన్ అపూర్వ విజయాల్ని సొంతం చేసుకుంది.19 స్థానాల్లో పోటీ చేసి 12 చోట్ల గెలిచింది. ఒక మహిళా ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రాతినిధ్యం కలిగి ఉంది. సీట్ల సంఖ్యలో తరుగుదల, పెరుగుదల ఉన్నప్పటికీ నికరమైన, స్థిరమైన ఓటు బ్యాంకు, బలమైన ప్రజా పునాది కలిగి ఉండటం విశేషం. జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం సుదీర్ఘ కాలంగా ఉంది. గతంలో అస్సాం, పంజాబ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. 25 రాష్ట్రాలలో పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణం కలిగి ఉంది.‘రణవీర్ సేన’ లాంటి ప్రైవేటు సైన్యాలను ఎదుర్కొన్న వీరోచిత చరిత్ర లిబరేషన్ది. అణచివేతలపైనా, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల తరబడి పోరాటాలు కొనసాగిస్తూ వస్తోంది. విద్య, వైద్యం, భూమిలేని పేదల కోసం, రైతుల హక్కుల కోసం, ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు నడిపింది. నిరంతరం పేదల కోసం పోరాడిన సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్‌లు పేదల హక్కుల్ని కాపాడడం కోసం పార్లమెంట్లో తమ గళాన్ని బలంగా వినిపించబోతున్నారు. – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, 78932 30218. -
టీడీపీకి గవర్నర్?.. రేసులో యనమల, అశోక్ గజపతి
ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న టిడిపి సీనియర్లు ఎన్డీఎ కోటాలో గవర్నర్ పదవివైపు ఆశగా ఎదురు చూస్తున్నారు...యనమల, అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్లు గవర్నర్ పదవి కోసం రేసులో ఉన్నారు...ఎన్డీఎలో టిడిపి అత్యంత కీలకం కావడంతో సీనియర్లలో ఒకరికి గవర్నర్ పదవి వస్తుందనే వార్తలు వస్తున్నాయి...గవర్నర్ రేసులో రేసులో ఎవరున్నారు...తెలుగుదేశం పార్టీలో గవర్నర్ పదవిపై జోరుగా చర్చ సాగుతోంది..సీనియర్లలో ఒకరికి గవర్నర్ వస్తుందంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్డీఎలో కీలక భాగస్వామిగా ఉండటంతో కేంద్రంలో టిడిపి సీనియర్లు కీలక పదవులను ఆశిస్తున్నారు..ముఖ్యంగా కొందరు సీనియర్లైతే గవర్నర్ పదవిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లు అయితే గవర్నర్ పదవిని ఆశిస్తున్నట్లు టిడిపిలో ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే యనమల, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లు ప్రత్యక్ష రాజకీయాలకి దూరమై తమ వారసులను రంగంలోకి దించి విజయం సాధించారు. చంద్రబాబు టిడిపి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ ఇద్దరూ కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు.యాదవ సామాజకి వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు 1983 లో రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి టిడిపి తరపున పోటీ చేసి గెలుపొందారు. లా పూర్తి చేసిన యనమల తొలి ప్రయత్నంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అప్పటి నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా కీలకమైన మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి కూడా నిర్వహించారు. స్పీకర్ గా వ్యవహరించిన యనమల 1994 టిడిపి సంక్షోభంలో ఎన్టీఆర్ వైపు కాకుండా చంద్రబాబు వైపు నిలిచి చంద్రబాబుకి దగ్గరయ్యారు. ఆ సమయంలో యనమల తీసుకున్న నిర్ణయమే చంద్రబాబుని ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది. అప్పటి నుంచి కూడా చంద్రబాబుకి యనమల అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు.చంద్రబాబు ఎపుడు అధికారంలో ఉన్నా కూడా యనమలకి అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖ ఇస్తూ వచ్చారు.1999 నుంచి 2004 వరకు టిడిపి ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ మంత్రిగా వ్యవహరించిన యనమల తొలిసారి వైఎస్సార్ హవాలో 2009 లో తొలిసారి ఓటమి చవి చూశారు.ఆ తర్వాత నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనకుండా 2014 లో ఎమ్మెల్సీగా ఎన్నికై మళ్లీ చంద్రబాబు క్యాబినెట్ లో రెండవ సారి ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఆ సమయంలోనే ఆయన రాజ్యసభ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో రాజ్యసభ దక్కకపోవడంతో ఆయన నిరాశ పడ్డారు. మళ్లీ ఈ ఎన్నికలలో తుని నియోజకవర్గంలో తన సోదరుడు యనమల కృష్ణుడు బదులు తన కూతురు దివ్యను రంగంలోకి దింపారు. యనమల కృష్ణుడు వైఎస్సార్ సిపిలో చేరినప్పటికీ కూడా యనమల తన కూతురు దివ్యను తుని నియోజకవర్గంలో నెగ్గించుకున్నారు. టిడిపి అధికారంలోకి రావడంతో యనమలకి మళ్లీ క్యాబినెట్ లో కీలక అమాత్య పదవి ఉంటుందని టిడిపి వర్గాలు భావించాయి. అయితే యనమల ఆలోచనలకి తగిన విధంగా కీలకమైన పదవి ఇవ్వడానికే చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యనమలని గవర్నర్ గా ఏదో ఒక రాష్ట్రానికి పంపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు టిడిపిలో చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీఎలో టిడిపి అత్యంత కీలకమైన పార్టీ కావడంతో ఒక గవర్నర్ పదవి తీసుకోవాలని టిడిపి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యనమల కూడా ఈసారైనా గవర్నర్ పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఉత్తరాంద్రలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన అశోక్ గజపతి రాజు కూడా గవర్నర్ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందిన అశోక్ గజపతి రాజు 1978లో తొలిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి జనతాపార్టీ అభ్యర్థిగా విజయనగరం విధాన సభనుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్ధాపించిన తెలుగుదేశం పార్టీ లో 1983, 1985, 1989, 1994, 1999, 2009 వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్థిక, రెవెన్యూ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇక 2014 లో విజయనగరం లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొంది ఎన్డీఎ ప్రభుత్వంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ సారి ఎన్నికలలో ఆయన నేరుగా పోటీ చేయకుండా తన కుమార్తె ఆదితి గజపతిరాజుని రంగంలోకి దింపి ప్రత్యక్ష రాజకీయాలకి దూరమయ్యారు. తొలిసారి తన వారసురాలిని రంగంలోకి దింపిన అశోక్ గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపించుకోగలిగారు. దీంతో ఆయన కూడా కేంద్రంలో కీలక పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.చంద్రబాబుకి ఉత్తరాంద్రలో అత్యంత సన్నిహితుడిగా అశోక్ గజపతి రాజు ఉండటంతో గవర్నర్ పదవి రేసులో ఆయన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అటు యనమల...ఇటు అశోక్ గజపతిరాజులలో ఒకరికి గవర్నర్ పదవి ఖాయమని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఒకవేళ అశోక్ గజపతిరాజుకి గవర్నర్ అవకాశం రాకపోతే రాజ్యసభకైనా పంపవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే సిఎం చంద్రబాబు ప్రధాని మోదీ వద్ద టిడిపికి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కేంద్రంలో టిడిపికి రెండు మంత్రి పదవులు దక్కాయి. ఉత్తరాంద్రకి చెందిన రామ్మోహననాయుడికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా క్యాబినెట్ పదవి దక్కింది. ఇక తొలిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి గుంటూరు ఎంపిగా గెలుపొందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కూడా కేంద్ర సహాయ మంత్రి పదవి లబించింది. టిడిపి నుంచి 16 మంది ఎంపిలగా గెలుపొందడంతో మూడు పదవులు ఆశించినప్పటికీ కూడా తాజా క్యాబినెట్ లో రెండే పదవులు దక్కాయి. విస్తరణలో మరో కేంద్ర సహాయమంత్రి పదవి వస్తుందని టిడిపి అంచనా వేస్తోంది. అదే సమయంలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ల కోసం ఒక గవర్నర్ పదవి ప్రతిపాధన కూడా మోదీ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది..మరి టిడిపి సీనియర్ల ఆశలు నెరవేరతాయా...గవర్నర్ దక్కుతుందా...చూడాలి... -
తెలంగాణ BJP కొత్త సారథి ఎవరు.. అధ్యక్ష పదవి రేసులో ఉన్నదెవరు?
సాక్షి, తెలంగాణ : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారు? కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎన్నికలన్నీ పూర్తయినందున ఇక పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. జాతీయ అధ్యక్షుడిని కూడా మోదీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. అందువల్ల ముందుగా ఆలిండియా పార్టీ అధ్యక్షుడిని నియమించి..ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారని అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నదెవరో చూద్దాం.ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. మంత్రి పదవుల పంపకమూ అయిపోయింది. ఇక పార్టీ పదవుల్లో నియామకాలే మిగిలాయి. కిషన్‌రెడ్డి ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా..కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మోదీ మూడో మంత్రివర్గంలో కూడా కిషన్‌రెడ్డికి బెర్త్ ఇచ్చారు. ఇక ఆయన పూర్తిగా మంత్రి బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాల్సి ఉంది. మరి తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనేదానిపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు.మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్‌ను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈటల పరాజయం పాలైనా... మల్కాజ్గిరి ఎంపీగా ఈటలకు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. అక్కడ భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు.అయితే తెరవెనక మరికొంత మంది నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందిరా గాంధీ గతంలో ప్రాతినిథ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సిఎం కెసిఅర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్‌కు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మంచి వాగ్ధాటి కల్గిన నేతగా..ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పకొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఇటువంటి అంశాలు కమలనాథులు పరిగణనలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్ఠానం పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కు, రాజధాని నగరం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణా నుంచి డికె అరుణకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే... సిఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్ఠానం ముందు పెట్టినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో డికె అరుణకు ఛాన్స్ ఇస్తారని కూడా మరో ప్రచారం జరుగుతోంది.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు బిసి నేతకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు కొత్త బాధ్యతలు ఇస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పేరాల చంద్ర శేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తర్వాతే తెలంగాణ పగ్గాలు ఎవరికిస్తారో తేలుతుంది. ఇదిలాఉంటే.. ఆషాడ మాసం ముగిసే వరకు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా.. ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఆషాడం ముగిసాకే కొత్త నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం : సామినేని
సాక్షి,కృష్ణా జిల్లా : ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని ,పేర్ని నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు చేయటం హేయమైన చర్య అని కృష్ణా జిల్లా జగ్గయ్య పేట వైస్సాఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మండిపడ్డారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైస్సాఆర్సీపీ సానుభూతిపరులపై జరుగుతున్న దాడుల్ని ఆయన ఖండించారు. కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో వైస్సాఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వరుస దాడులపై పోలీసులు తాత్కాలిక కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును మేం గౌరవిస్తాం. జగ్గయ్యపేటలో గెలిచిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌కు అభినందనలు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండేందుకు నాయకులు ప్రయత్నించాలని వైఎస్సాఆర్ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విజ్ఞప్తి చేశారు. -
మరో ఆరు రోజులే!
సాక్షి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ముగియడంతో ఇప్పుడు అందరితోపాటు అధికారుల చూపు లోక్‌సభ ఎన్నికల ఫలితాల వైపు మళ్లింది. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌యార్డులోని 17, 18, 19 నంబర్ల గోడౌన్ల స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన ఈవీఎంలో నిక్షిప్తమైన వరంగల్ ఎంపీ అభ్యర్థుల భవితవ్యం మరో ఆరు రోజుల్లో తేలనుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏం పనులు చేయాలి, రోజువారీగా ఏఏ అంశాలపై సమీక్షలు నిర్వహించాలనే దానిపై రిటర్నింగ్ అధికారులు సిద్ధమయ్యారు.ఈవీఎంలలో ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లలో ఓట్లను కంప్యూటర్లలో ఎలా నమోదు చేయాలో సిబ్బందికి వివరించారు. అదేసమయంలో స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు. సాయుధ బలగాల పహారాతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. తరచూ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.ప్రావీణ్యతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా స్ట్రాంగ్ రూంలను సందర్శిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు.కౌంటింగ్ సజావుగా సాగేలా..న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, డాక్టర్ సుక్భీర్సింగ్సంధుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, సన్నద్ధతపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ ప్రావీణ్య ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రకటించే కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతతోపాటు కౌంటింగ్ కేంద్రంలో ఫలితాలు వెల్లడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు.కౌంటింగ్ కేంద్రం వద్ద ఇంటర్నెట్ కనెక్షన్, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ప్రత్యేక కౌంటింగ్‌హాల్ ఉండేలా ఏర్పాట్లు ఉండాలని ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్ట్రాంగ్‌రూం నుంచి కౌంటింగ్‌హాల్‌కు ఈవీఎంల తరలింపునకు అవసరమైన మేర సిబ్బంది ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న దష్ట్యా ఉదయం 6 గంటలకే టేబుళ్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. పోలింగ్ శాతం ఆధారంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 28 టేబుళ్లు, కనిష్టంగా 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. పోలైన ఓట్లు, ఈవీఎంల ఆధారంగా టేబుళ్ల సంఖ్య పెంచనున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాలు ఉన్నాయి.కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్యకాళోజీ సెంటర్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. కౌంటింగ్ నిర్వహణపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినితానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు.ఏనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, ఫలితాలు వెల్లడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ కౌంటింగ్ హాల్లో అవసరమైన మేరకు టేబుళ్లు, సిబ్బందిని నియమించనున్నట్లు వివరించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమతుందని, అనంతరం ఈవీఎంలలోని ఓట్లు లెక్కించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ సూచించారు. ఎన్నికల ఫలి తాలు ప్రకటించిన తర్వాత శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీఓ, ఎన్నికల నోడల్ అధి కారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య, సీపీ అంబర్ కిషోర్ ఝా అభ్యర్థుల్లో గుబులు..ఈ నెల 13న ఎన్నికలు ముగిసినా ఎంపీ అభ్యర్థుల్లో మాత్రం లోలోన గుబులు ఉంది. పైకి గెలుస్తామని అందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా రోజుకో యుగంలా ఫీలవుతున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చేసరికి కాస్త మనస్సు అటువైపు మళ్లింది. సోమవారం ఆ ఎన్నిక కూడా ముగియడంతో తమ భవితవ్యం ఏమిటి అనే దిశగా ఆలోచన చేస్తున్నారు.ఒత్తిడి నుంచి బయటపడేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. అయినా ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం వారిని వెంటాడుతూనే ఉంది. ఇంకోవైపు ఆయా స్ట్రాంగ్ రూంల వద్ద తమకు నమ్మకమైన అనుచరులను పంపించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా అక్కడి దృశ్యాలను తిలకిస్తూ షిఫ్ట్‌ల వారీగా అక్కడే ఉంటున్నారు. ఏదేమైనా మరో ఆరు రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది. -
మోదీజీ మాటలకు అర్థాలు వేరులే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ఎందుకో ఆయన స్థాయికి తగినట్లు ఉండడం లేదు. తాజాగా ఇండియా టివీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆయన కాన్ఫిడెన్స్‌కు నిదర్శనమా? లేక అత్యాశకు ప్రతిబింబమా? అనే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. 2047 వరకు ఆయన వికసిత్ భారత్ కోసం పాటుపడుతూ.. ఆ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు. దేవుడు తననో ప్రత్యేక కార్యం మీద పంపాడని తనకు అనిపిస్తోందని ఆయన అన్నారు. దేవుడు తనకు దారిచూపించడమే కాకుండా శక్తినిచ్చాడని, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చే వరకు దేవుడు తనను పైకి పిలవడని విశ్వాసం ఉందని మోదీ పేర్కొన్నారు.⇒ ఇది వినడానికి బాగానే ఉంది. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఆయన మాట్లాడినట్లు అనిపించదు. నియంతల రాజ్యంలోనో, చక్రవర్గుల పాలనలోనో, లేక మతపరమైన నమ్మకాలు అధికంగా ఉన్న దేశాలలోనో ఇలాంటి ప్రసంగాలు చేస్తే తప్పక జనం వినాల్సి ఉంటుంది. కానీ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలలో అలా సాధ్యపడకపోవచ్చు. ఆయన వందేళ్లు పైబడి జీవించవచ్చు. 2047 సంవత్సరం అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి అయ్యే ఏడాది అన్నమాట. తప్పు లేదు. దేశం అభివృద్ది కోసం ఆయన అలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. కానీ తొంభై ఏళ్లు దాటిన తర్వాత కూడా అంత శక్తితో ఉంటారా? అనే సంశయం వస్తుంది.⇒ భారతీయ జనతా పార్టీలో అనుసరిస్తున్న ఒక విధానం ప్రకారం డెబ్బై ఐదేళ్లు దాటితే క్రియాశీలక పదవులలో ఉండరాదని చెబుతారు. అందువల్లే ఎల్.కె. అద్వాని, మురళీ మనోహర్ జోషి వంటివారు పదవుల నుంచి తప్పుకోవలసి వచ్చింది. కేవలం మర్యాదపూర్వక నేతలుగానే ఉన్నారు. ప్రస్తుతం మోదీ వయసు డెబ్బైనాలుగేళ్లు. ఈసారి గెలిస్తే టరమ్ పూర్తి అయ్యేసరికి ఆయన వయసు డెబ్బైతొమ్మిదేళ్లు అవుతుంది. ఒకపక్క ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డెబ్బైఏడు ఏళ్ల వయసు వచ్చిందని విమర్శలు చేస్తున్న బీజేపీ పెద్దలు అదే మోదీ విషయంలో భిన్నంగా ఎలా మాట్లాడతారో తెలియదు. ఆయన ఆశిస్తున్నట్లు 2047 వరకు పదవులలో ఉంటే అప్పటికీ తొంభై ఏడేళ్ల వయసు వస్తుందన్నమాట. అప్పటివరకు ఆయన అధికారంలో ఉండడం సాధ్యమా అంటే ఏమి చెబుదాం. అలా జరిగితే అద్బుతమే అని అనాలి.⇒ కొంతమంది బాగా వయసు వచ్చేవరకు పదవులలో ఉన్న సందర్భాలు లేకపోలేదు. సీనియర్ నేత మొరార్జీ దేశాయ్ 81 ఏళ్ల వయసులో జనతా పార్టీ పక్షాన దేశ ప్రధాని అయ్యారు. మూడేళ్లపాటు ఆయన పదవి నిర్వహించిన తర్వాత రాజకీయాలకు దాదాపు దూరం అయ్యారని చెప్పాలి. ఎల్.కె. అద్వాని ప్రస్తుతం 90 ఏళ్ల పైబడి జీవిస్తున్నారు. కానీ ఆయన పదేళ్ల క్రితమే యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరం అయ్యారని చెప్పవచ్చు. అమెరికా దేశ అధ్యక్షుడు బిడైన్ ప్రస్తుత వయసు 82 ఏళ్లు. మరో సారి ఆయన పోటీలో ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే ఆయన ప్రత్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత వయసు 78 ఏళ్లు. ఆయన కూడా పోటీ పడుతున్నారు. ఒకవేళ గెలిస్తే 82 ఏళ్ల వరకు అధికారంలో ఉండవచ్చు. అమెరికాలో అధ్యక్ష పదవి రెండు టరమ్లకే పరిమితం. మన దేశంలో అలాంటి నిబంధన ఏమీ లేదు. అందువల్ల ఒకసారి అత్యున్నత పదవిలోకి వచ్చినవారు దానిని వదలిపెట్టడానికి అంతగా ఇష్టపడరని జనం భావన.⇒ ప్రధాని మోదీ కూడా అదే తరహాలో ఉన్నారా అనే భావన వస్తుంది. ఆయన 2047 వరకు ప్రధానిగా ఉంటానని నేరుగా చెప్పకపోయినా, వికసిత్ భారత్ లక్ష్యం కోసం తనను దేవుడు పంపించాడని ఆయన ఫీల్ అవుతున్న తీరు చూస్తే అదే అనిపిస్తుంది. సాధ్యాసాధ్యాలను పక్కనబెడితే, నిజంగా ఆయన ఆ వయసు వరకు జీవించి ఉండి, దేశ ప్రధానిగా కొనసాగి, అభివృద్దికి దోహదపడితే అభ్యంతరం లేదు. కానీ ఈ మధ్యకాలంలో మోదీ చేస్తున్న ప్రకటనలు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయనలో తడబాటుతోపాటు పొరబడుతున్నారా అనే డౌటు వస్తుంది.⇒ ఉదాహరణకు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామాలయంపై బుల్ డోజర్ నడుపుతారని అనడం అత్యంత వివాదాస్పదం అయింది. మోదీ స్థాయికి అలా మాట్లాడకూడదని చెప్పాలి. అలాగే అవినీతి పరులను పార్టీలో చేర్చుకుంటూ, అవినీతిపరులని తానే ప్రకటించి మళ్లీ వారితో తానే పొత్తు పెట్టుకున్న తీరు గమనించిన తర్వాత మోదీ చెప్పేవాటికి, చేసేవాటికి చాలా తేడా ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. అలాగే ముస్లింలకు సంబంధించి ఆయన ఒక్కోసారి ఒక్కో మాట చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ లోక్ సభ ఎన్నికలలలో ఆశించినన్ని సీట్లు రావని మోదీ భయపడుతున్నారని, అందుకే హోదాకు తగ్గట్లు మాట్లాడడం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.⇒ మోదీ చెప్పినవాటిలో ఒక్కటి మాత్రం పూర్తి నిజం. ఈ భూమ్మీద ఇంకా తాను ఎక్కాల్సిన మెట్లేవీ లేవని ఆయన చెప్పారు. భారత దేశంలో ప్రధానమంత్రి పదవిని మించి మరొకటి లేదన్నది తెలిసిందే. మోదీ చరిత్ర చూస్తే ఇది ఒకరకంగా అనూహ్యమైన రీతిలో అసాధారణమైన తీరుగా ఎదిగారని చెప్పవచ్చు. కేవలం ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ విధంగా ఎదుగుతారని అనుకోలేం. కానీ మోదీ చేసి చూపించారు. ఇంత ఘనత సాధించిన మోదీ అంటే గౌరవమే కానీ, ఈసారి ఆయన ప్రసంగాలలో అభ్యంతర విషయాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి 400 సీట్లు వస్తాయని పదే, పదే చెబుతున్నా, అది ఎంతవరకు సాధ్యమన్నది సంశయంగా ఉంది.⇒ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్నాటక, బీహారు వంటి రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో బీజేపీ సీట్లు వస్తాయా అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు జాతీయ స్థాయి సెఫాలిజిస్టులు బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీకి కాస్త అటు, ఇటుగా సీట్లు సంపాదించవచ్చేమో కానీ, 400 సీట్లు వస్తాయని అంచనాలు వేయడం లేదు. నిజానికి మోదీకి కాంగ్రెస్ కూటమిలో సరైన ప్రత్యర్ధి లేకపోవడం ఆయనకు కలిసి వస్తున్న అంశం. రాహుల్ గాంధీ ఉన్నంతలో పోటీ ఇస్తున్నా, ఆయనలో మెచ్యూరిటీపై అనుమానాలు ఉన్నాయి. రాజకీయ వ్యూహాలలో కూడా వెనకబడి ఉంటున్నారు. కొన్నిసార్లు తెలివితక్కువగా కూడా ఉంటున్నారు. ఉదాహరణకు ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కాస్త సఖ్యత కోసం ప్రయత్నించవలసిన రాహుల్ పనికట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా పావులు కదపడం విస్తుపరుస్తోంది.⇒ తెలంగాణ రాజకీయాలలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలను ఏపీకి తీసుకువచ్చి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా ఇంకా కుట్రలు చేస్తున్నారన్న భావన కల్పించారు. అలాగే కర్నాటక, తెలంగాణలలో అధికారం కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడంలో కూడా పాత్ర పోషించారు. జాతీయ స్థాయి మానిపెస్టోలో ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం వంటి అంశాలవల్ల వారిపై నమ్మకం కుదరడం లేదు. ఇవన్ని మోదీకి కలిసివచ్చే పాయింట్లుగా ఉన్నాయి. మోదీ ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ వాటిని అందిపుచ్చుకోలేకపోతోందని చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీని ప్రయోగించి జైలుకు పంపించిన వైనం ప్రజలలో విమర్శలకు దారి తీసిందని చెప్పాలి.⇒ యూపీఏ పదేళ్ల పాలనలో ఈడీ 34 లక్షల రూపాయలు పట్టుకుందని, అవి పిల్లాడి స్కూల్ బ్యాగులోకి కూడా రావని అన్నారు. అదే, తన పదేళ్ల పాలనలో ఈడీ 2200 కోట్ల రూపాయలు పట్టుకుందని, వాటిని తరలించడానికి 70 టెంపోలు కావాలని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో లక్షల కోట్ల భారత సొమ్ము స్విస్ బ్యాంక్ ఖాతాలలో ఉన్నాయని, దానిని తెస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇవ్వవచ్చని మోదీ అన్నారు. ఆ సంగతి పక్కనబెట్టి మోదీ కొత్తరాగం అందుకున్నట్లుగా ఉంది. పైగా బ్యాంకులలో వేల కోట్లు ఎగవేసినవారికి పార్టీ టిక్కెట్లు ఇస్తూ, తాను అవినీతి పార్టీ అని చెప్పిన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వంటివి చూస్తే మోదీ మాటలకు అర్థాలు వేరులే అనే అభిప్రాయం కలుగుతుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చిన్నమ్మ స్వార్ధానికి మునిగిపోతున్న బీజేపీ..
-
ఆ గట్టూ నాదే..! ఈ గట్టూ నాదే..!!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ, ఆర్మూర్‌లలో పరిస్థితి ఒకలా ఉండగా, జిల్లా కేంద్రాలైన నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి సెగ్మెంట్లలో షబ్బీర్ అలీ పెత్తనం పట్ల పలువురు మొదటి, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు గుస్సా అవుతున్నారు. షబ్బీర్ పేరు చెప్పుకుని కొందరు నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు. దీంతో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగిన షబ్బీర్ అలీ ఓటమి చెందారు. ఓడినవారే నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జిగా ఉంటూనే తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలోనూ పెత్తనం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో షబ్బీర్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ ర్యాంకు పదవి వచ్చింది.నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి దక్కించుకోలేకపోయిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. మహేశ్ గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. మరోవైపు బీసీ కోటాలో కేబినెట్ రేసులోనూ ఉన్నారు. మహేశ్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో షబ్బీర్ కామారెడ్డిలో పెత్తనం చేస్తూనే నిజామాబాద్ అర్బన్‌లో హవా నడిపిస్తుండటం పట్ల ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్లో ఉండి పనిచేసిన పలువురు రౌడీషీటర్లను సైతం షబ్బీర్ కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారంటూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డిలోనూ పలువురు అవకాశవాదులను పార్టీలోకి చేర్చుకుని మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు అన్యాయం చేస్తున్నారని కార్యకర్తలు, నాయకులు వాపోతున్నారు. మరోవైపు షబ్బీర్ తమ్ముడు, మేనల్లుడు, ఇతర బంధువులు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు సీనియర్ కార్యకర్తలు పీసీసీ నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం గమనార్హం. -
కర్నూలులో కదం తొక్కిన జగనన్న జనాభిమానం (ఫొటోలు)
-
నరసాపురం సిద్ధం.. సీఎం జగన్ కోసం జన ప్రభంజనం (ఫొటోలు)
-
నారాసురుడిది ఆదినుంచీ రక్త చరిత్రే
రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే..జనంతో మమేకమవుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకోవడం ఒక మార్గం. పూటకో కుట్ర, రోజుకో కుతంత్రం పన్నుతూ.. రాజకీయంగా నీడనిచ్చిన వారికి వెన్నుపోటు పొడుస్తూ.. ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి మట్టుబెడుతూ రక్తపుటేరులు పారించడం రెండో మార్గం.. శకునిలోని కుటిలత్వం.. దుర్యోధనుడిలోని క్రూరత్వం.. దుశ్శాసనుడిలోని కిరాతకం.. ధృతరాష్ట్రుడిలోని కపటత్వం కలగలిసి దుష్టచతుష్టయ లక్షణాలను పుణికిపుచ్చుకున్నరెండున్నర ఎకరాల రైతు కుటుంబానికి చెందిన నారా చంద్రబాబునాయుడు రెండో మార్గాన్నే ఎంచుకున్నారు. విద్యార్థి దశలోనే ఏడుకొండలవాడి పాదాల చెంత ఎస్వీ యూనివర్సిటీని సం‘కుల’ సమరానికి వేదికగా మార్చారు.. కుల రాజకీయాలతో దాడులకు తెగబడ్డారు.విద్యార్థి నాయకుడి దశ నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాక.. కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలతో రక్తపుటేరులకు కేరాఫ్‌గా మారారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అడుగడుగునా రక్తపు మరకలే! సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పేదల పక్షాన నిలబడిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బస్సు యాత్రలో సంఘీభావం తెలిపేందుకు ఊరూరా వాడవాడన మేమంతా సిద్ధం అంటూ ప్రజలు తండోపతండాలుగా కదలివస్తూ నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజా క్షేత్రంలో ఒంటరిగా వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడానికి భయపడి జనసేన, బీజేపీతో జట్టుకట్టి.. మూడు పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేస్తుండటంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేక.. రాజకీయ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే భయంతో శనివారం తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో సాయంత్రం 5.20 గంటలకు ప్రసంగిస్తూ రాళ్లు, చేతికి ఏది దొరికితే దాంతో సీఎం జగన్‌పై దాడి చేయాలని చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారు. చంద్రబాబు ప్రోద్బలంతో కరుడుగట్టిన టీడీపీ మూకల ముఠా విజయవాడ సింగ్‌నగర్‌లో డాబా కొట్ల సెంటర్ వద్ద బస్సు యాత్రలో సీఎం జగన్ రోడ్‌షో నిర్వహిస్తారని ముందే గ్రహించి.. పక్కా ప్రణాళికతో హత్యాయత్నానికి తెగబడ్డారు. ఈ హత్యాయత్నంపై చంద్రబాబు తనయుడు లోకే‹శ్, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరును చూస్తుంటే ఇందులో బాబు హస్తం ఉందని సీఎం జగన్ అభిమానులే కాదు పలు రాజకీయ పార్టీల సీనియర్ నేతలు, సామాన్య ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ స్కాంలో అడ్డంగా సీఐడీ పోలీసులకు పట్టుబడి.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై బయటకొచి్చనప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి రీతిలో సీఎం జగన్‌ను దారుణంగా శిక్షిస్తానంటూ చంద్రబాబు ఆవేశంతో ఊగిపోవడాన్ని రాజకీయ పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప పాదయాత్రలో జనం నీరాజనాలు పలుకుతుండటం చూసి ఓర్వలేక విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో కోడికత్తితో హత్యాయత్నానికి తెగబడేలా కుట్ర చేశారు. చంద్రబాబు వ్యవహార శైలి మొదటి నుంచి ఇలానే ఉందని పలు ఘటనలను ఉదహరిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలే శ్వాసగా.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబు తన సహజ లక్షణాలైన కుట్రలు, కుయుక్తులకు మరింత పదును పెట్టారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో, టీడీపీలో.. నాదెండ్ల భాస్కర్‌రావు, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. వారిని అడ్డుతొలగించుకోకపోతే తాను ఎదగలేననే భావనతో.. ఆ ముగ్గురిని టీడీపీ నుంచి సాగనంపడానికి కుట్రలు చేశారు. 1984 జనవరి 9 నాటికి ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీఎత్తున సభ నిర్వహించారు. ఈ సభలో ఎన్టీఆర్‌పై మల్లెల బాబ్జీని ఉసిగొలిపి.. హత్యాయత్నం చేయించి.. ఆ నెపాన్ని తనపైకి నెట్టడానికి ప్రయత్నించారని నాదెండ్ల భాస్కర్‌రావు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత మల్లెల బాబ్జీకి ఇస్తానన్న రూ.3 లక్షల సుపారీ ఇవ్వకుండా చంద్రబాబు ద్రోహం చేశారని.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మల్లెల బాబ్జీ 1988లో ఆత్మహత్య చేసుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటుతో ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్పకూలింది. దీనికి నిరసనగా ఎన్టీ రామారావు శాంతియుతంగా ప్రజా పోరాటం చేశారు. కానీ.. ఎన్టీఆర్‌కు తెలియకుండా అప్పట్లో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించి.. అగ్నిగుండం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ‘ఒక చరిత్ర–కొన్ని నిజాలు’ పేరుతో రాసిన పుస్తకంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత 1985 ఎన్నికల్లో ఓటమి భయంతో పోటీ చేసేందుకు చంద్రబాబు జంకారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ దన్నుతో కర్షక పరిషత్ చైర్మన్‌గా దొడ్డిదారిన పదవి పొంది.. ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోపిడీ చేశారు. తన దోపిడీ గుట్టంతా నాటి సీఎం ఎన్టీఆర్ వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్రరావుకు తెలిసినందున పక్కా ప్రణాళికతో ఆయన్ను మట్టుబెట్టించి.. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించారని అప్పట్లో టీడీపీ నేతలే ఆరోపించారు. అప్పట్లోనే ఓ వర్గం నేతలను చంద్రబాబు చేరదీసి వర్గ రాజకీయాలకు తెరతీశారని ఎన్టీఆర్‌కు సీనియర్ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. మహానేత సహకారంతో మంత్రి పదవి దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో టి.అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత ఆయన పట్ల కనీసం కృతజ్ఞత ప్రదర్శించని స్వార్థ పరుడని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాక... 1983లో జరిగిన ఎన్నికల్లో తన మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానంటూ బీరాలు పలికిన చంద్రబాబు.. చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు. రాజకీయ అస్థిత్వం కోసం మామను బతిమాలి టీడీపీలో చేరారు. వద్దని వారించినా అల్లుడనే కనికరంతో చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీశారని టీడీపీ సీనియర్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విద్యార్థి దశలోనే సం‘కుల’ సమరం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20న జన్మించిన చంద్రబాబు.. విద్యార్థి దశలో తిరుపతిలోని గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాల, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సం‘కుల’ సమరాన్ని రాజేసి.. విద్యాలయాలను భ్రష్టుపట్టించారని నాటి సహ విద్యార్థులు చెబుతున్నారు. కుల రాజకీయాలతో ఎదిగిన చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. గల్లా రాజగోపాలనాయుడి శిష్యరికంతో 1978లో కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి.. చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం రాజకీయ భిక్ష పెట్టిన గల్లా రాజగోపాలనాయుడికి తీరని ద్రోహం చేశారనే విమర్శలు ఉన్నాయి. తొమ్మిదేళ్ల పాలనలో ఏరులై పారిన రక్తం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు.. 1995 – 2004 మధ్య కాలంలో రాజకీయాల్లో ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణిస్తూ వచ్చారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ను రాజేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన 415 మందిని వెంటాడి వేటాడి చంపేయడంలో కీలక భూమిక పోషించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యకమమ్యాయి. ఇలా హత్యకు గురైన వారిలో 300 మంది మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రక్కసిని రాజేసి వందలాది హత్యలకు కారణమయ్యారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కడప జిల్లాలో ఫ్యాక్షన్ తార స్థాయికి చేరడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కుట్రలు చేశారని టీడీపీ సీనియర్ నేతలే పలు సందర్భాల్లో ఆరోపించారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే రీతిలో ప్రత్యర్థులను మట్టుబెట్టారనే విమర్శలు ఉన్నాయి. 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తనకు రక్షణ కల్పించాలని పరిటాల రవి కోరారు. కానీ.. పరిటాల రవికి భద్రత కల్పించలేదు. 2005లో పరిటాల రవి హత్యకు గురైన తర్వాత రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చేలా టీడీపీ శ్రేణులను ఉసిగొల్పడంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని.. జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి మరీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయించారని ఆ పార్టీ సీనియర్ నేతలే వివిధ సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్ హత్య తమ అక్రమాలు, ఆగడాలను ప్రశి్నంచిన రాజకీయ నాయకుల్నే కాదు.. జర్నలిస్టులను సైతం టీడీపీ నేతలు మట్టుబెట్టారు. విజయవాడలో ‘ఎన్కౌంటర్’ అనే పక్షపత్రికకు పింగళి దశరథరామ్ వ్యవస్థాపక సంపాదకుడు, పబ్లిషర్‌గా వ్యవహరించేవారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అవినీతి, అక్రమాలను తన పత్రికలో ఎండగట్టారు. ఈ నేపథ్యంలో 1985 అక్టోబర్ 20వ తేదీ రాత్రి 9 గంటలకు విజయవాడలోని సత్యనారాయణపురంలో రిక్షాలో వెళ్తున్న దశరథరామ్‌ను గూండాలు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య చేయించింది చంద్రబాబేనని ప్రజలు ఇప్పటికీ భావిస్తుంటారు. వెన్నుపోటుతో ఎన్టీఆర్ కన్నుమూత కుట్రలు, కుయుక్తులతో టీడీపీలో ఎదిగిన చంద్రబాబు.. 1995లో రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన మామ ఎన్టీఆర్కే ద్రోహం తలపెట్టి వెన్నుపోటు పొడిచారు. వైస్రాయ్ హోటల్లో నిర్బంధించిన తన ఎమ్మెల్యేలను విడిపించుకోవడానికి వచ్చిన ఎన్టీ రామారావుపై చెప్పులతో దాడి చేయించిన నైజం చంద్రబాబుది అన్నది జగది్వదితం. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది ఎన్.హరికృష్ణలను మభ్యపెట్టి.. వారి సహకారంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే వారిద్దరినీ టీడీపీ నుంచి సాగనంపారు. చంద్రబాబుకు సహకరించి తప్పు చేశానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతో అధికారాన్ని కోల్పోయిన ఎన్టీఆర్.. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించిన ఘటనతో మరింత క్షోభకు గురై ఆ ఆవేదనతోనే కన్నుమూశారు. ఎన్టీఆర్ కన్ను మూయడానికి కొద్ది రోజుల ముందు చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన నేర చరిత్రను ఎత్తిచూపాయి. వంగవీటి రంగా హత్యలో కీలక పాత్ర రాష్ట్రంలో 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వంగవీటి మోహనరంగా.. ప్రజా పోరాటాలతో తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. రంగాను అడ్డుతొలగించుకోకపోతే కోస్తాలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారని చెబుతున్నారు. అందుకే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు తెలియకుండా కుట్ర చేసి.. 1988 డిసెంబర్ 26న ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత కోసం ఆమరణ దీక్ష చేస్తున్న రంగాను అతి దారుణంగా హత్య చేయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో ఏకరవు పెట్టారు. మహానేత కుటుంబంపై ఎప్పుడూ కక్షే ► రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కుటుంబం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఆ కుటుంబాన్ని కడతేర్చితే రాజకీయంగా తనకు తిరుగుండదని చంద్రబాబు భావించారని.. అందువల్లే వైఎస్ కుటుంబంపై కక్ష కట్టి.. మట్టుబెట్టేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ► 1999లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొంది. కడప జిల్లాపై వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి ముద్ర బలమైంది. ఆయన్ను హత్య చేస్తే.. వైఎస్ రాజశేఖరరెడ్డిని కడప జిల్లాకే పరిమితం చేయవచ్చునని.. తద్వారా ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకోవచ్చునని నాటి సీఎం చంద్రబాబు భావించారని చెబుతున్నారు. వైఎస్ రాజారెడ్డిని 1998 మే 23న పులివెందులకు సమీపంలో హత్య చేశారు. హత్య చేసిన వారికి నెల రోజులపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన అధికారిక నివాసంలోనే ఆశ్రయం కల్పించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యక్తమయ్యాయి. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్‌రెడ్డిని టీడీపీ ప్రభుత్వ హయాంలో క్షమాభిక్షపై విడుదల చేయడం ఆ విమర్శలకు బలం చేకూర్చుతోంది. ► 2019 ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర పన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో సామాన్యులు ఎవరూ ప్రవేశించలేని వీఐపీ లాంజ్‌లో.. తనకు అత్యంత సన్నిహితుడైన నేతకు చెందిన రెస్టారెంట్లో పని చేసే ఉద్యోగి ద్వారా వైఎస్ జగన్‌ను కడతేర్చేందుకు 2018 అక్టోబర్ 25న కుట్ర చేశారు. హత్యాయత్నం నుంచి వైఎస్ జగన్ బయటపడ్డ తర్వాత చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయనే ఈ కుట్రకు సూత్రధారి అనేలా ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ► 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి వేరుపడిన చంద్రబాబు.. అప్పట్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తిరుపతిలో రాళ్లతో దాడి చేయించారు. ఇప్పుడు తన రాజకీయ జీవితానికి ముప్పు ఏర్పడటంతో పవన్ కళ్యాణ్‌తో కలిసి అమిత్ షాతో కాళ్లబేరానికి దిగి.. మళ్లీ బీజేపీ పంచన చేరారు. ఇలా అడుగడుగునా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నారు. తాజాగా దుష్టచతుష్టయంతో కలిసి చెలరేగిపోతున్నారు. 2014–19 మధ్య అధికారం అండతో హత్యాకాండ ► రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచి్చంది. 2014–19 మధ్య టీడీపీ పాలనలో సాగిన హత్యాకాండలో 30 మందికి పైగా వైఎస్సార్సీపీ నేతలను మట్టుబెట్టారు. ► 2014 జూలై 3న అనంతపురం జిల్లా యల్లనూరు మండల వైఎస్సార్సీపీ నాయకుడు ప్రకాశం శెట్టిని టీడీపీ నేతలు హత్య చేశారు. ► 2014 ఆగస్టు 11న కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో వైఎస్సార్సీపీ గ్రామ పంచాయతీ ఉపసర్పంచి ఆలోకం కృష్ణారావు(55)ను టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. తర్వాత అదే గ్రామంలోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపైనా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ► 2014 ఆగస్టు 21న గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన అన్నదమ్ములు బూసి పెదనాగిరెడ్డి, చిననాగిరెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి చంపేశారు. ► 2014 ఆగస్టు 22న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ నేత మల్లిఖార్జునను హత్య చేశారు. ► 2014 సెపె్టంబరు 1న అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ ప్రాణం తీశారు. ► 2014 సెపె్టంబర్ 11న గుంటూరు జిల్లా చినగార్లపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త గోవింద్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. ► 2014 నవంబర్ 27న కర్నూలు జిల్లా పలుకురులో వైఎస్సార్సీపీ నేత ప్రభాకర్‌నాయుడు హత్యకు గురయ్యారు. ► 2014 డిసెంబర్ 30న నెల్లూరు జిల్లాలో అల్లం నరేంద్రను హత్య చేశారు. ► 2015 మార్చి 31న అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని సింగిల్ విండో కార్యాలయంలోనే టీడీపీ నేతలు కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందనే ఆరోపణలున్నాయి. ► 2015 ఏప్రిల్ 29న అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్సీపీ మండల మాజీ కనీ్వనర్ ప్రసాద్‌రెడ్డిని రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలే దారుణంగా హత్య చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 12 రాజకీయ హత్యలు జరిగాయి. ► 2015 మే 15న కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వసంతరావుపై దాడి చేసి చంపేశారు. ► 2015 అక్టోబర్ 14న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చింతకుంటలో వైఎస్సార్సీపీ నేత రాఘవరెడ్డిని హత్య చేశారు. ► 2016 డిసెంబర్ 9న వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం అలవలపాడు ఎంపీటీసీ సభ్యుడు గజ్జెల రామిరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మండల సర్వసభ్య సమావేశం ముగించుకొని వేంపల్లె నుంచి అలవలపాడు గ్రామానికి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి, ఆయన అనుచరులు సుమోతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికి చంపారు. ► 2017 మే 6న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గోవిందపల్లిలో వైఎస్సార్సీపీ నేత ఇందూరి ప్రభాకర్‌రెడ్డి, ఆయన బావ మరిదిని దారుణంగా హత్య చేశారు. ► 2017 మే 21న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని క్రిష్ణగిరి మండలం రామకృష్ణాపురం వద్ద హత్య చేశారు. -
కటకటాల్లోకే అవినీతి పరులు..మోదీ ఘాటు విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ మీరట్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాబోయే ఎన్నికలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం కాదని ‘వికసిత్ భారత్’ కోసమని అని అన్నారు. ►‘గత 10 ఏళ్లలో అవినీతికి వ్యతిరేకంగా మేం తీసుకున్న చర్యల్ని దేశం మొత్తం చూసింది. పేదల సొమ్మును దోచుకోకుండా మేం భరోసా ఇచ్చాం. అందుకే అవినీతిపరులు ఈ రోజు కటకటాల వెనుక ఉన్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ►రాబోయే ఎన్నికలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్డీయేకు అవినీతిపరులను కాపాడే ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని సూచించారు. ► నేను అవినీతిపరులను మాత్రమే విచారించడం లేదు. నా దేశ ప్రజలను ఎవరు దోచుకున్నారో, నా ప్రజల దోచుకున్న సంపదను తిరిగి వారికి చెందేలా చూడడమే అని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ► బీజేపీ ఇప్పటికే మూడోసారి గెలుపు కోసం సన్నాహాలు ప్రారంభించింది. రాబోయే ఐదేళ్ల కోసం మేము రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నాము. మొదటి 100 రోజుల్లో మనం ఎలాంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై వేగంగా పని జరుగుతోంది’ అని మోదీ అన్నారు. ►గత 10 సంవత్సరాలలో, మీరు అభివృద్ధి ట్రైలర్ మాత్రమే చూశారు. అసలు అభివృద్ది ముందున్నదన్న మోదీ.. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. -
‘400 సరే.. 200 సీట్లలో గెలవమనండి’.. బీజేపీకి దీదీ సవాల్
ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. కనీసం 200 లోక్‌సభ స్థానాల్లో గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తల గాయం నుంచి కోలుకున్న మమతా బెనర్జీ అనంతరం తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వివాదాస్పద మహిళా నేత, పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్‌సభ టీఎంసీ అభ్యర్ధి మహువా మొయిత్రా తరుపున ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ర్యాలీలో ‘బీజేపీ 400కి పైగా లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని అంటోంది. ముందుగా 200 సీట్ల బెంచ్‌మార్క్‌ను దాటాలని నేను బీజేపీకి సవాలు చేస్తున్నాను. 2021 పశ్చిమ బెంగాల్ 294 అసెంబ్లీ స్థానాలకు గాను 200పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ ప్రగల్భాలు పలికింది. కానీ 77 సీట్లతో సరిపెట్టుకుందని’ ఎద్దేవా చేశారు. #InPics | West Bengal chief minister Mamata Banerjee, along with TMC leader Mahua Moitra, holds a poll rally in Krishnanagar.#ElectionsWithNDTV #LokSabhaElection2024 pic.twitter.com/4iuTTL203Q — NDTV (@ndtv) March 31, 2024 సీఏఏని అనుమతించబోం ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చేందుకు ఒక ఉచ్చు. అందుకే రాష్ట్రంలో మేం సీఏఏని అనుమతించబోం. సీఏఏ కోసం దరఖాస్తు చేయడం వల్ల దరఖాస్తుదారు విదేశీయులుగా మారతారని, కాబట్టి దరఖాస్తు చేసుకోవద్దని ప్రజల్నిహెచ్చరించారు. బీజేపీని వ్యతిరేకించినందునే టీఎంసీ అభ్యర్థి మహువా మోయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘మా ఎంపీ మహువా మొయిత్రా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందున ఆమెను లోక్‌సభ నుండి బహిష్కరించారు’ అని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న బీజేపీ ఈ సందర్భంగా విపక్షాల ఇండియా కూటమిపై మమతా బెనర్జీ మండి పడ్డారు. ‘పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి లేదు. రాష్ట్రంలో సీపీఐ, కాంగ్రెస్ కూటములు బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి’ అని అన్నారు. -
ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ.. మాటల తూటాలు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురూవైంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయా పార్టీల క్యాడర్‌ను ఈ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో నేతలు ఒకరినొకరు చేసుకుంటున్న ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల విమర్శలు రాజకీయవర్గాల్లో రచ్చకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ ఎద్దేవా? బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ బీఆర్ఎస్ నేతలు సైటెర్లు వేశారు. గులాబీ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో జరిగింది. దుబ్బాకలో ప్రజలు తిరస్కరించిన ఆయన్నే బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించిందని కారు పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరును కూడా ఎండగట్టారు. నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చనోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా బీజేపీ సర్కారు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆయనకు నిధులెక్కడివి? బీఆర్ఎస్ నేతల విమర్శలను కమలం పార్టీ తిప్పికొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచాక రూ.వంద కోట్లు సొంత నిధులతో పీవీఆర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని వెంకట్రాంరెడ్డి ప్రకటించారు. ఇందులోంచి ఏటా రూ.20 కోట్లతో నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ వివరాలను పక్కాగా వెబ్సైట్లో ఉంచుతానని స్పష్టం చేశారు. ఆయనకు రూ.వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో రఘునందన్ ప్రశ్నించారు. ఇవి చదవండి: కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్‌కుమార్ -
‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు, ఎంపీ అభ్యర్థి రేఖా పత్రకి ప్రధాని ఫోన్
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ బాధితురాలు, బసిర్హట్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆమెతో ఫోన్లో స్వయంగా మాట్లాడారు. సందేశ్‌ఖాలీలో షాజహాన్ షేక్ ఆకృత్యాలను బయటపెట్టిన రేఖా పత్రను శక్తి స్వరూపిణి ( శక్తి అనే పదం దుర్గా, కాళీ వంటి దేవతల) తో పోల్చారు. ప్రధాని మోదీ: సందేశ్‌ఖాలీ ప్రజలు ఎలా ఉన్నారు. వారి పరిస్థితి ఇప్పుడెలా ఉంది? రేఖ పత్ర : తృణమూల్ కాంగ్రెస్ షాజహాన్ షేక్ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. కేంద్రం సహకారంతో మా కష్టాలు తీరాయి. ప్రధాని మోదీ : బసిర్హట్ నియోజకవర్గం అభివృద్ది చేసే బాధ్యతను మీకే అప్పగించాం. రేఖపత్ర : సందేశ్‌ఖాలీ మహిళల పట్ల మీరు దేవుడిలాంటి వారు. ఆ రాముడే మాతో ఉన్నట్లు భావిస్తున్నాం. ప్రధాని మోదీ: వారి ఆశీసులు పొందినందుకు నేను సంతోషిస్తున్నాను. మహిళామణులకు ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటాను. బీజేపీ అభ్యర్థిగా మీ ఎంపిక పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? రేఖ పత్ర : మొదట మీరు నన్ను లోక్‌సభ అభ్యర్ధిగా ప్రకటించడంపై పలువురు మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాతే వాళ్లల్లో చైతన్యం కలిగింది. తృణముల్ కాంగ్రెస్ నేతల సూచనల మేరకే తాము ఇలా ఆందోళన చేశామని, ఇకపై ఇలా చేయబోమని హామీ ఇచ్చారు. వారితో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను వారి కోసం పని చేస్తా. ప్రధాని మోదీ : మీకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారి బాగు కోసం పని చేప్తున్నందుకు అభినందనలు. మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టి గొప్ప పని చేశాం. రేఖ పత్ర : నాకు ప్రజా మద్దతు లభిస్తుందన్న నమ్మకం నాకుంది. ‘నేను నిరుపేదరాలిని. నా భర్త చెన్నైలో పనిచేస్తున్నారు. మేం బతకడానికి చాలా కష్టపడుతున్నాము. ఇక్కడ ప్రజలకు పని లభించేలా, వారు రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేను ఏదైనా చేయాలని అనుకుంటున్నారు. ప్రధాని మోదీ : మీ గెలుపు ఖాయం. ‘మీరు శక్తి స్వరూపిణి. శక్తివంతమైన నేతను జైలుకే పంపారు. బసిర్‌హట్‌లోనే కాదు, వెస్ట్ బెంగాల్ అంతటా మహిళల గౌరవం కోసం కలిసి పోరాడుదాం. మీకు నా పూర్తి మద్దతు ఉంది’. ‘బెంగాల్ దుర్గా మాత నెలవు. మీరు ఆ శక్తి స్వరూపం. సందేశ్‌ఖాలీ మహిళలు గొంతు ఎత్తడం అంత సులభం కాదు. ఈసారి బెంగాల్‌లోని నారీశక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని భావిస్తున్నాం’ అంటూ ప్రధాని మోదీ బసిర్హట్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రతో సంభాషణ ముగించారు. -
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరంటే
న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తే చేస్తోంది. తాజాగా రాజస్థాన్, తమిళనాడు ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధుల్ని ఖరారు చేస్తూ ఆరో జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్‌లో అజ్మీర్ లోక్‌సభ స్థానం నుండి రామచంద్ర చౌదరి, రాజ్‌సమంద్ నుండి సుదర్శన్ రావత్, భిల్వారా నుండి దామోదర్ గుర్జార్, కోటా నియోజకవర్గంలో ప్రహ్లాద్ గుంజాల్‌కు చోటు కల్పించింది. గుంజాల్ బీజేపీ అభ్యర్ధి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో తలపడనున్నారు. రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫేజ్ 1 (ఏప్రిల్ 19) 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 స్థానాలకు రెండో దశలో (ఏప్రిల్ 26న) పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులో తిరునెల్వేలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై సి రాబర్ట్ బ్రూస్‌కు చోటు కల్పించింది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की छठवीं लिस्ट। pic.twitter.com/KoXyKzYH87 — Congress (@INCIndia) March 25, 2024 -
‘నమస్తే అన్నా’..‘బాగున్నావా తమ్మీ’
దిస్పూర్, సాక్షి : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు తమ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ ప్రచారంలో ఒకేసారి రెండు ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురు పడితే ఎలా ఉంటుంది. అచ్చం ఇక్కడా అదే జరిగింది. మరి ఆ తర్వాత ఏమైంది. అస్సాం దిబ్రూఘర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, ‘ఇండియా’ బ్లాక్ కూటమి అభ్యర్థిగా లూరింజ్యోతి గొగోయ్ పోటీ చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో తమను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో అస్సాం దిబ్రూఘర్ జిల్లా హల్దీబారి నగర్ థాన్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖోవాంగ్‌లోని హల్దీబారి నఘర్ థాన్ అనే ప్రార్థనా స్థలంలో కలిసి కనిపించారు. అనుకోకుండా జరిగిన ఈ హఠాత్పరిణామానికి ఇరువురు నేతలు ఆశ్చర్యపోయినా అతని మోముపై చిరునవ్వు చిందించారు. ‘నమస్తే అన్నా’..‘బాగున్నావా తమ్మీ’ రాజకీయాల్లో ప్రత్యర్థులు కామన్. పార్టీల మధ్య, నేతల మధ్య కూడా విమర్శలు కామన్. అయితే.. ఇవి హద్దుల్లోనే ఉన్నాయనే సంకేతాలిచ్చారు ఇరు పార్టీల లోక్‌సభ అభ్యర్థులు. నిత్యం నువ్వెంత అంటే.. నువ్వెంత అనుకునే రాజకీయ నాయకులు కాస్త ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. నమస్తే అన్నా అంటే.. బాగున్నావా తమ్మీ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి పుచ్చుకుంటూ క్షేమ సమాచారం గురించి తెలుసుకున్నారు. అంతేకాదు పక్కపక్కనే కూర్చుని టీ తాగుకుంటూ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందంటూ మాట్లాడుకోవడం ఎన్నికల సిత్రాలు స్థానికుల్ని ఆకట్టుకుంటున్నాయి. విద్యార్ధి సంఘానికి అధ్యక్షులుగా బీజేపీ అభ్యర్థి సర్బానంద సోనోవాల్, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) అధ్యక్షుడు లూరింజ్యోతి గొగోయ్‌లు సీనియర్, జూనియర్. వారిద్దరూ గతంలో అస్సాంలోని పురాతన విద్యార్థి సంఘమైన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ) అధ్యక్షులుగా పనిచేశారు. సోనావాల్ మా సీనియరే ‘ఈ సందర్భంగా లూరింజ్యోతి గొగోయ్ మాట్లాడుతూ.. మేం ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మేం ఇక్కడ పనిచేస్తున్నాం. ప్రత్యర్ధులమే అయినా మేం విద్యార్ధి సంఘంలో కలిసి పనిచేశాం. అతను (సోనావాల్‌ని ఉద్దేశిస్తూ) మా సీనియర్ అంటూ సంభాషించారు. కాగా, డిబ్రూగఢ్ నియోజకవర్గంలో మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. -
నోరు తెచ్చిన చేటు.. తిరుగులేని బీజేపీ నేత కొంపముంచింది
బెంగళూరు, సాక్షి : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా వివాదస్పద చరిత్ర ఉన్న నేతలకు మొండి చేయిచూపిస్తుంది. తాజాగా, ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా పనిచేసిన ఓ నేతకు సీటు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసింది. అదే సమయంలో నోరు పారేసుకుని పార్టీ ఇస్తున్న అవకాశాల్ని చేజార్చుకోవద్దని హితువు పలుకుతోంది. బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే. కర్ణాటకలోని ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానంలో తిరుగులేని నేత. వరుసగా నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు.కానీ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కర్ణాటకలోనే కాదు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాస్పద మయ్యాయి. ఫలితంగా ఈసారి లోక్‌సభ సీటును హెగ్డేకి ఇవ్వలేదు. ఆయనకు బదులు మరో నేతకు ఇచ్చింది. ఇటీవల బీజేపీ అధిష్టానం ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో విజయం సాధించాలంటూ అభ్యర్ధులకు దిశా నిర్ధేశం చేసింది. ఆ తర్వాతే కర్ణాటక ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అది బీజేపీ మాత్రమే చేయగలుగుతుందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలను గెలుచుకోగలిగితే అది సాధ్యమన్న ఆయన.. ఆ సంఖ్య పొందాలంటే తమ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై కమలం అధిష్టానం హెగ్డేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా లోక్‌సభ ఎన్నికల కోసం 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్ధులతో ఆదివారం ఐదో జాబితా విడుదల చేసింది. అందులో అనంతకుమార్ హెగ్డేకు స్థానం కల్పించలేదు. ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానంలో ఈ సారి హెగ్డేకి బదులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన విశ్వేశ్వర హెగ్డే కాగేరికి సీటును ఖరారు చేసింది. ఇలా అనంత్ కుమార్ హెగ్డేతో పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే నేతలకు లోక్‌సభ సీటును తిరస్కరించింది. అలాంటి వారిలో ప్రగ్యాసింగ్ ఠాకూర్, దక్షిణ ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మలు ఉన్నారు. -
లోక్‌సభ ఎన్నికలు.. ఈ సారైనా తమిళసైకి అదృష్టం వరించేనా?
సాక్షి, చెన్నై : కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ...ఈసారి భారీ మెజార్టీ సాధనే లక్ష్యంగా పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయ బావుటా ఎగుర వేసేలా నిర్దేశించుకుంది. ఇందుకోసం వివాదాల్లేని నేతల్ని లోక్‌సభ అభ్యర్ధులుగా బరిలోకి దించుతుంది. పార్టీకి బలమైన అభ్యర్థులు లేనిచోట్లా ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులు, సిట్టింగ్ ఎంపీలకు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో ప్రస్తుతం గవర్నర్లుగా పనిచేస్తున్న ప్రముఖుల్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానిస్తుంది. తాజాగా తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్‌కు చెన్నై సౌత్ సీటును కేటాయించింది. ఈ మేరకు 9 మందితో తాజాగా విడుదల చేసిన మూడో జాబితాలో బీజేపీ అధిష్టానం తమిళిసైకి చోటు కల్పించింది. దీంతో తమిళసై సౌందరరాజన్ ఎవరు? అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళిసై సౌందరరాజన్ ఎవరు? నగర్ కమ్యూనిటీ వర్గానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కుమారి అనంతన్ కుమార్తే తమిళిసై సౌందరరాజన్. వ్యాపారవేత్త..రాజకీయవేత్త హెచ్ వసంతకుమార్ మేనకోడలు. తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె గైనకాలజిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. సోనాలజీ, ఫీటల్ థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. ఆమెకు చిన్నతనం నుంచే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుండగా విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేసి, బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001 లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007 లో అఖిల భారత కో-కన్వీనర్ గా, 2007లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014లో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా సేవలందించారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001లో మెడికల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2005లో ఆల్ ఇండియా కో-కన్వీనర్ (దక్షిణాది రాష్ట్రాల వైద్య విభాగం)గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా బీజేపీ రాష్ట్ర శాఖలో తమిళసై పనిచేశారు. 2007, 2010లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా, 2013లో జాతీయ కార్యదర్శిగా ఉన్నత బాధ్యలు చేపట్టారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై 2006, 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు. సెప్టెంబర్ 2019లో తెలంగాణ గవర్నర్‌గా సౌందరరాజన్ నియమితులయ్యారు. కిరణ్ బేడీని తొలగించిన తర్వాత ఆమెకు పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు తర్వలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు తమిళసై.