దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ యువ కాంగ్రెస్ పేరుతో విడుదలైన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.
సెంట్రల్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోదీని కించపరుస్తూ ‘మోదీ కా అస్లీ పరివార్’ క్యాప్షన్ జోడిస్తూ పలువురు ఫోటోలతో కూడిన పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టర్లపై సమాచారం అందుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ సందర్భంగా.. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, పోస్టర్లను తొలగించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే, ఆ పోస్టర్లలో పబ్లిషర్ పేరు, వాటిని ఎవరు విడుదల చేశారో తెలియాల్సి ఉందని అన్నారు.
140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబమే
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ‘జన విశ్వాస యాత్ర’ చేపట్టారు. ఆ యాత్రలో ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానికి కుటుంబం లేదని అన్నారు. లాలూ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ దీటుగా బదులిచ్చారు. 140 కోట్ల మంది భారతీయులు నా కుటంబమే అని వ్యాఖ్యానించారు.
‘మోదీ కా పరివార్’
లాలుప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ బీజేపీ అగ్రనేతలు స్పందించారు. ఎక్స్. కామ్ వేదికగా ఆ పార్టీ అగ్ర నేతలు తమ పేరు పక్కన ‘మోదీ కా పరివార్’ అని పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment