ఎలక్టోరల్‌ బాండ్లపై విచారణ జరిపించండి: కేసీ వేణుగోపాల్‌ | Parliament Session 2024 2nd July Live Updates And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

Parliament Session 2024: పార్లమెంట్‌ సమావేశాలు.. అప్‌డేట్స్‌

Published Tue, Jul 2 2024 8:48 AM | Last Updated on Tue, Jul 2 2024 1:51 PM

Parliament Session 2024 2nd july  2024 Updates

Updates

  • ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ అన్నారు.

  • లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై  మాట్లాడుతూ.. బీజేపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

  • బీజేపీలో  పాలనలో ఢిల్లీ ఎయిర్‌ పోర్టు, జబల్‌పూర్‌  ఎయిర్‌పోర్టుల రూఫ్‌లు కూలిపోయాయని అన్నారు. రాజ్‌కోట్‌  ఎయిర్‌పోర్టు రూఫ్‌ ధ్వంసం అయింది. 

  • అయోధ్యలో రోడ్లు అధ్వానంగాఉన్నాయి.  రామ మందిరంలో నీరు లీక్‌ అవుతోంది.  ముంబై హార్బర్‌ లింక్‌ రోడ్డుకు పగుళ్లు  వచ్చాయి. 

  • బీజేపీ పాలనలో బిహార్‌లో మూడు బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. ఇవాన్ని  కూడా ఎన్డీయే ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. 

  • ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారంలో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి సవాల్‌ విసురుతున్నా అని అన్నారు.

      

     

 

లోక్‌సభ స్పీకర్‌కు ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లేఖ

  • తను నిన్న లోక్‌సభలో మాట్లాడిన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్‌ను తొలగించటంపై షాక్‌కు గురయ్యా.
  • తన మాటాలను పునురుద్ధరించాలని స్పీకర్‌కు ఓం బిర్లాకు లేఖ రాసిన రాహుల్‌
  • తన వ్యాఖ్యల రికార్డుల నుంచి తొలగించటం ప్రజాస్వామ్య పార్లమెంట్‌ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమని రాహుల్‌ లేఖలో పేర్కొన్నారు.

      
     

 

  • రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో వైఎస్సాసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.
  • విశాఖ, చెన్నై కోస్టల్‌ కారిడార్‌పై రాజ్యసభలో ప్రస్తావించారు. 
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
  • ఏపీకి ప్రత్యేక హోదా  డిమాండ్ కాదు, అది ప్రజల హక్కు
  • ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం టీడీపీకి ఉంది
  • రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో  కూడా భాగస్వామ్యం పార్టీ
  • ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని  టీడీపీ అడగాలి
  • అన్యాయంగా విభజించడం వల్ల ఏపీ నష్టపోయింది
  • ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉంది
  • విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలి
  • టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు వారాల్లోనే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దారుణంగా దాడులు చేస్తుంది
  • పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను  ఆపివేయాలి
  • విశాఖ స్టీల్ ప్లాంట్ కు తగ్గిన గనులు కేటాయించి లాభాల్లోకి తీసుకురావాలి
  • ఏపీలో శాంతిని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి
  • ఏపీలో ఐదేళ్లలో 16 మెడికల్ కాలేజీలను మాజీ సీఎం వైఎస్‌ జగన్ స్థాపించారు.
  • తక్కువ ఖర్చుతో డాక్టర్లను తయారు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు
  • ఫ్యామిలీ డాక్టర్ పథకం  ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు
  • రైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయండి
  • గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో రైతుల పంటలకు తగ్గిన భీమా సౌకర్యం కల్పించాలి
  • రైల్వేలలో ప్రయాణికుల  భద్రతకు నిధులను పెంచాలి
  • రైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారించేందుకు చర్యలు తీసుకోవాలి
  • భద్రత చర్యలను వెంటనే అప్‌గ్రెడ్ చేయాలి
  • రైల్వే జోన్‌కు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించింది
  • నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టును పూర్తి చేయాలి
  • వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను వెంటనే పూర్తి చేయాలి
  • భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయాలి
  • విశాఖపట్నం మెట్రో రైలును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలి.

 

  • రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే వ్యవహరిస్తున్న తీరును ఛైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ తప్పుపట్టారు.  
  • ప్రతిసారి రాజ్యసభ ఛైర్మన్‌ను  అగౌరవపరచలేరు. దేశ చరిత్రలో రాజ్యసభ కార్యకలాపాల్లో సభ ఛైర్మన్‌ పట్ల ఇంత  నిర్లక్ష్యం ఎప్పుడూ జరగలేదు.
  • తాను ఎప్పుడూ ప్రతిపక్ష సభ్యుల గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాన్నారు.   

     
  • లోక్‌ సభలో రాష్ట్రపతి ప్రసంగం  ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది.
  • గత ఎన్నికల  ఇండియా కూటమి నైతిక విజయం సాధించింది: ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌
  • బీజేపీ 400 సీట్ల నినాదం విఫలమైంది.
  • జూన్‌ 4 నుంచి మత రాజకీయాలకు విముక్తి లభించింది
  • 400 సీట్లు గెలుస్తామని ప్రచారం చేసుకున్నారు.
  • వర్షాలు వస్తే  ఉత్తరప్రదేశ్‌లో నగరాలు చెరువులయ్యాయి. 
  • 2024 ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది.
  • ఎన్డీయే నడిచే సర్కార్ కాదు.. పడిపోయే ప్రభుత్వం: ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌
     

      

 

  • జులై 1వ తేదీన లోక్‌సభలో రాహుల్‌ స్పీచ్‌ నుంచి కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ వెల్లడించింది.  

  • హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్‌ చేసిన వ్యాఖ్యలతో పాటు, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, అగ్నివీర్‌, మోదీ, నీట్‌ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం పేర్కొంది. 

  • స్పీకర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

 

  • పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

 

  • ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు.
  • పార్లమెంట్‌లో ఎంపీలంతా  నిబంధనలను పాటించాలి: మోదీ
  • లోక్‌సభ ఎంపీల ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలి.
  • లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీలా వ్యవహరించవద్దు
  • ఎంపీలు అభివృద్దిపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు.
  • సమావేశాలు జరగుతున్నప్పడు ఎక్కువ సమయం సభలోనే ఉండాలి
  • ప్రధాని నరేంద్ర మోదీ,  ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు.

 

  • ప్రధాని మోదీ నేతృత్వలో జరిగినే ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొనడానికి పలువురు ఎంపీలు పార్లమెంట్‌కు చేరుకుంటున్నారు.

      

     

ఢిల్లీ: పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ సోమవారం ఉభయ సభల్లో వాడీవేడీగా సాగింది. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ.. నీట్‌, అగ్నిపథ్‌ వంటి అంశాలపై మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తూర్పారపట్టారు. హిందుత్వ, అగ్నిపథ్‌ పథకాలపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షం తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాహుల్‌ గాంధీ  క్షమాపణలు చేప్పాలని హోంశాఖ మంత్రి అమిత్‌ షా  డిమాండ్‌ చేశారు. 

ఇవాళ జరిగే లోక్‌సభ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై సాయంత్రం మాట్లాడానున్నారు. సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాటల తూటాలు పేల్చడంతో ఇవాళ ధీటైన సమాధానం ఇచ్చేందుకు మోదీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభలో ప్రసంగానికి ముందు ఎన్డీయే కూటమి పార్లమెంట్‌ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొనున్నారు.  ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మీటింగ్‌లో ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అధికారంలోకి వచ్చాక.. ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించిన మోదీ తొలిసారి ప్రసంగించనున్నారు. ఇవాళ కూడా లోక్‌సభలో వాడీవేడీగా ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య మాటలు యుద్ధం జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement