BJP Party
-
కవితకు ఎంపీ రఘునందన్ కౌంటర్
సాక్షి, సంగారెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందన్న కవిత వ్యాఖ్యలకు కౌంటిరచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. ఇప్పటికైనా ఆమెను డాక్టర్‌కు చూపించాలి అంటూ కామెంట్స్ చేశారు.సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌కి రైతులు గుర్తుకు రాలేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు. అధికారం పోయాక రైతులపై కేటీఆర్‌కు ప్రేమ పెరిగి రైతు ధర్నాలు చేస్తున్నాడు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. చెల్లె ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. మంచి డాక్టర్‌కి చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది.కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్‌కి అవమానం జరిగింది. కాంగ్రెస్ ఐదున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడూ అంబేద్కర్‌ని గౌరవించలేదు. కేవలం అంబేద్కర్ జయంతి, వర్థంతి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. 1950లో నామినేటెడ్ ప్రధానిగా ఉన్నప్పుడే జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. రెండోసారి ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల్లో ఐదు తరాలు రాజ్యాంగాన్ని అవమానించారు. ఆనాడు ప్రధాని మన్మోహన్‌ను కాదని యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగాన్ని లెక్కచేయలేదు.ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ రోడ్లపై తిరుగుతున్నారు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి పేదలు గుర్తుకు వస్తారు. ఆనాడు అధికారంలో ఉన్న బీసీలను, పార్టీ అధ్యక్షులుగా ఉన్న దళితులను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే. హస్తం పార్టీకి అధికారం ఉంటే ఒకలా ఉంటుంది.. లేకపోతే మరోలా మాట్లాడతారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అలా చేయడం బీజేపీతో కలిసిన్నట్టు కాదు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇదే సమయంలో ఇలా చేయడం బీజేపీ పార్టీతో కలిసినట్టు కాదు అని క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో ఎవరు ఉన్నా తాము ఇలాగే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.సీఎం ఒమర్ అబ్దుల్లా కన్వాల్‌లో జాతీయ చానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒమర్.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిశాను. నేను కేంద్రం తీరు పట్ల సానుకూలంగా ఏమీ లేను. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే వారు చేసే ప్రతిదాన్ని నేను అంగీకరిస్తున్నాను అని కాదు. బీజేపీ చేసే పనిని నేను అంగీకరిస్తున్నానని దీని అర్థం కాదు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన అంశాలపై మాత్రమే కేంద్రంతో అనుకూలంగా ఉంటున్నాం. అంతమాత్రాన మేము బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కాదు.రాష్ట్రం పురోగతి సాధించాలంటే కేంద్రం అవసరం ఎంతో ముఖ్యం. అభివృద్ధి జరగడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించడం మా ముందున్న లక్ష్యాలు. పార్టీలు ముఖ్యం కాదు.. కావాల్సింది అభివృద్దే. అవసరం లేని చోట నేను కేంద్రంతో పోరాటం ఎంచుకోవాలా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. గత సంవత్సరం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అనంతరం, రెండుసార్లు అమిత్ షాను కలిశారు. ఇటీవల సోనామార్గ్‌లో జరిగిన సొరంగం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని కలిశారు. దీంతో, ఒమర్..బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఒమర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
46 ఏళ్ల ‘పవార్’ రాజకీయానికి బీజేపీ చెక్ పెట్టింది: అమిత్ షా
ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో 1978 నుంచి శరద్ పవార్.. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ విజయంతో పవార్ రాజకీయాలకు ముగింపు పలికినట్టు అయ్యిందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం షిర్డీలో పర్యటించారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘మహారాష్ట్రలో 1978లో శరద్ పవార్ భిన్నమైన రాజకీయాలను మొదలుపెట్టారు. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారు. కానీ, 2024 ఎన్నికల్లో ప్రజలు వాటిని తిరస్కరించారు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ రాజకీయాలకు కూడా ప్రజలకు ముగింపు పలికారు. కుట్రపూరిత రాజకీయాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి. వాళ్లిద్దర్నీ మహారాష్ట్ర ప్రజలు ఇంటికి సాగనంపారు. బీజేపీతో పాటు నిజమైన శివసేన, ఎన్సీపీలను గెలిపించారు. వారి ఓటమితో మహారాష్ట్రలో అస్థిర రాజకీయాలకు ముగింపు పడిందన్నారు.ఉద్ధవ్ థాక్రే మమ్మల్ని మోసం చేశాడు. 2019లో ఆయన బాలాసాహెబ్ సిద్ధాంతాన్ని విడిచిపెట్టారు. ఈరోజు మీరు ఆయనకు తన స్థానాన్ని మీరే చూపించారు. ఆయన ద్రోహం ప్రజలకు అర్థమైంది. రాష్ట్రంలో బీజేపీ సాధించిన పెద్ద విజయానికి పార్టీ కార్యకర్తలే కారణం. అందరి శ్రమతోనే ఘన విజయం అందుకున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన శరద్ పవార్.. అనేక సహకార సంస్థలకు నేతృత్వం వహించారు. కానీ, రైతుల ఆత్మహత్యలను మాత్రం ఆయన ఆపలేకపోయారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతుల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది’ అంటూ కీలక కామెంట్స్ చేశారు.#WATCH | Maharashtra: Union Home Minister Amit Shah says, "... The victory (of BJP) in Maharashtra ended the politics of instability and backstabbing started by Sharad Pawar in 1978. Uddhav Thackeray betrayed us, he left the ideology of Balasaheb in 2019. Today you have shown him… pic.twitter.com/BzACZ9bOSJ— ANI (@ANI) January 12, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఎన్సీపీ నేత అజిత్ పవార్, శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. -
Telangana: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో త్వరలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అందరికంటే ముందుగా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, నిజామాబాద్-అదిలాబాద్-కరీంనగర్-మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కోమరయ్య, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి పేర్లను ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాలతో కిషన్‌రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డిల పదవీకాలం ఈ మార్చితో పూర్తి కానుంది. ఈ క్రమంలో.. ఏప్రిల్‌లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఒకవైపు ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, ముసాయిదాను సిద్ధం చేసింది. మరోవైపు.. రెండుసార్లు అవకాశం కల్పించినా ఓటర్ నమోదుకు పెద్దగా స్పందన రావడం లేదు. దీంతో.. ఎన్నికల ప్రకటన వెలువడే వరకూ అవకాశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.మరోవైపు 12 జిల్లాల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం 28వేల మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ఫైనల్ చేశారు. -
Delhi Elections: రమేష్ బిదురిపై బీజేపీ చర్యలు!
న్యూఢిల్లీ: మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన బీజేపీ నేత రమేష్ బిదురి(Ramesh Bidhuri)పై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆయన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ సీఎం అతిషితో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇటు ఆప్, అటు కాంగ్రెస్‌లు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఎన్నికల నుంచి తప్పించడమో లేదంటే నియోజకవర్గాన్ని మార్చడమో చేయాలని ఆలోచిస్తున్నారట.ఈ అంశంపై రెండుసార్లు భేటీ జరిగినట్లు సమాచారం. ఇక బీజేపీ ఈ మధ్యే తొలి జాబితా విడుదల చేయగా.. కల్కాజీ నుంచి సీఎం అతిషిపైనే రమేష్ బిదురిని బీజేపీకి పోటీకి దింపింది. ఈ క్రమంలోనే ఓ సభలో పాల్గొన్న ఆయన అతిషిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని అభ్యర్థిగా కొనసాగించడం పార్టీకి మంచిది కాదని బీజేపీ భావిస్తోందట!.కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదురిని తప్పించి.. ఆ స్థానంలో మహిళా అభ్యర్థిని అతిషిపై నిలపాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. ఈ మేరకు రమేష్‌తోనూ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజ్జర్ సామాజికవర్గపు బలమైన నేతగా పేరున్న రమేష్ బిదురి గతంలో.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పని చేశారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే..రమేష్ బిదురి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే.. నియోజకవర్గంలోని రోడ్లను ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. .. సీఎం ఆతీషి ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు’’ అంటూ రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
వాడీవేడిగా జేపీసీ తొలి భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో లోక్‌సభ, రాష్ట్రాల్లో శాసనసభలకు జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును సమీక్షిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశమే వాడీవేడి చర్చకు వేదికగా మారింది. బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యాంగం మౌలిక రూపాన్ని మార్చే కుట్ర జరిగిందని, ఈ బిల్లుకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విపక్ష పార్టీల సభ్యులు గట్టిగా వ్యతిరేకించారు. ప్రజాభీష్టం మేరకే ఈ బిల్లులను తెచ్చామని మూడోసారి పీఠంపై కూర్చున్న ఎన్డీఏ కూటమి సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో 39 మంది సభ్యులతో కొలువైన జేపీసీ తొలి భేటీ ఆద్యంతం తీవ్రస్థాయిలో వాదోప వాదాలతో కొనసాగింది. బుధవారం ఢిల్లీలో జేపీసీ సమావేశం తొలిరోజు సందర్భంగా సభ్యులందరికీ కేంద్ర న్యాయ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత బిల్లుల్లోని కీలక అంశాలు, నియమనిబంధనలను పూర్తిగా విడమరచి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మాట్లాడారు. జమిలి ఎన్నికలు ఎలా ఎన్నికల ఖర్చుగా భారీగా తగ్గించగల్గుతాయని నిలదీశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 స్థానాల్లో తొలిసారిగా ఈవీఎంలను వాడినప్పుడు ఖర్చు భారీగా తగ్గిందనడానికి ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు.దీటుగా బదులిచ్చిన ఎన్డీఏ కూటమిదీనిపై బీజేపీ సభ్యులు సమాధానం ఇచ్చే ప్రయ త్నం చేశారు. ‘‘ 1957లో ఇలాగే ఏకకాల ఎన్ని కల కోసం అప్పుడు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలను కాలపరిమితి ముగిసేలోపే కుదించారు. అప్పు డు రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఆయ నే నాడు రాజ్యాంగ పరిషత్‌కు చైర్మన్ కూడా. ఆనాడు ఇలాంటి నిర్ణయం తీసుకున్న దిగ్గజ ఎంపీలంతా నాడు నెహ్రూ హయాంలో పనిచేసిన వాళ్లే. ఆ లెక్కన వీళ్లంతా ఆనాడు రాజ్యాంగ ఉల్ల ంఘనకు పాల్పడినట్టా? అని బీజేపీ సభ్యుడు సంజయ్ జైశ్వాల్ ఎదురు ప్రశ్న వేశారు. తీవ్రంగా తప్పుబట్టిన విపక్షాలుబిల్లులను విపక్ష పార్టీల సభ్యులు తప్పు బట్టారు. ‘‘ విస్తృతమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించాలి. బిల్లులపై చర్చించేందుకు కనీసం ఏడాదిపాటు సమయం ఇవ్వాలి’’ అని కమిటీకి సారథ్యం వహిస్తున్న మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరిని విపక్ష సభ్యులు కోరారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ విధానం తేవాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. -
ఇదేం రాజకీయం.. తెలంగాణలో బీజేపీ బలమెంత?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు.. భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలమెంతా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీపై అనుచిత వాఖ్యలు చేయకపోతే బీజేపీ ఆఫీసుకి పోవాల్సిన అవసరం మాకేంటి?. మా ఇంటి ఆడబిడ్డలను తిడితే మనం ఊరుకుంటామా. ప్రియాంక గాంధీని తిడితే ఎందుకు ఊరుకోవాలి. మా యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుకు పోవడాన్ని పీసీసీ చీఫ్ తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతలు మా లైన్ దాటితే మేం పెద్ద మనసుతో సర్ది చెప్పుకున్నాం.కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చగొట్టేలా గాంధీ భవన్ వెళ్లి దాడి చేసి తగల పెట్టండి అని మాట్లాడుతున్నారు. బీజేపీ సంస్కారం ఏంటో, కాంగ్రెస్ సంస్కారం ఏంటో బయటపడింది. సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళ కార్యకర్తలకు సర్ది చెపుతారా? రెచ్చ గొడుతారా?. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా?. మా వాళ్లని కొట్టడానికి బీజేపీ నాయకులు అంత పెద్ద తోపులా?. మా యూత్ కాంగ్రెస్ వాళ్లని ఎందుకు రెచ్చగొడుతున్నారు?. తెలంగాణలో బీజేపీ బలం ఎంత?. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేసేంత బలం బీజేపీకి ఉందా?. మేం మా కార్యకర్తలకు ఏం చెప్తున్నాం? మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నారు?. ప్రియాంక గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి.డీకే అరుణ, రాజాసింగ్‌కు కౌంటర్..డీకే అరుణ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ప్రియాంక గాంధీని అవమానించిన బీదూరిని డీకే అరుణ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, రాజాసింగ్‌కి బీజేపీ ఆఫీసులోకి ఎంట్రీనే లేదు. రాజాసింగ్ డైలాగులు కొట్టడం మానుకోవాలి. ఆయన కంటే పెద్ద డైలాగులు మేము కూడా కొట్టగలం. రాజాసింగ్ ఏమైనా మాట్లాడుకోవచ్చు.. కానీ, కాంగ్రెస్ పార్టీ, నేతలపై మాట్లాడుతా అంటే నడవదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
Congress Vs BJP: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ ఆఫీసుపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ మోర్చా నాయకులు, కార్యకర్తలు.. బీజేపీ ఆఫీసు నుంచి గాంధీభవన్ ముట్టడికి బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు.. బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. గాంధీ భవన్ వైపు బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో, మరోసారి ఉద్రికత్త చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు.. బీజేపీ పార్టీ ఆఫీస్ వద్దకు కాషాయ పార్టీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. పార్టీ ఆఫీసుపై దాడి నేపథ్యంలో బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. బీజేపీ కార్యాలయంపైన కాంగ్రెస్ దాడి దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ లాగానే వ్యవహరిస్తోంది. తిరగబడి మేము కూడా దాడి చేస్తే ఢిల్లీలో మీ జాతీయ నాయకులు ఎక్కడ దాక్కుంటారు. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలి.కేటీఆర్ తప్పించుకుని ఎన్ని రోజులు తిరుగుతారు. చంచల్గూడా వెళ్లాలా లేక తీహార్ జైలుకు వెళ్లాలా అనేది కేటీఆర్ డిసైడ్ చేసుకోవాలి. కేటీఆర్ జైలుకు వెళితే సానుభూతి రాదు. డబ్బులు ఎక్కువై కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం భయంకరమైన అవినీతికి పాల్పడింది. లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారు. తెలంగాణ అధ్యక్ష పదవిపై ఎలాంటి చర్చ లేదు. దానిపై నన్ను ఎవరూ అడగలేదు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..‘బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దుండగులు దాడి చేయడం దారుణం. దాడుల వల్ల హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. తెలంగాణలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. శాంతిభద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. కేటీఆర్ కేసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్ ఇప్పుడు అధికారులను బలి పశువులను చేస్తున్నారు. నాడు కేటీఆర్ అధికారులను భయపెట్టి పని చేయించుకున్నారు. కేటీఆర్ నిర్దోషి అయితే నిలబడి ఎదుర్కోవాలి. అంతేగానీ కోర్టులకి వెళ్లి తప్పించుకోవడానికి చూడకూడదు.కాళేశ్వరంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. దానిపైన ప్రభుత్వం ఏం చేస్తుంది?. ధరణి స్కామ్‌పై ఏం కేసులు పెట్టారు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోంది. వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి చిన్న కేసులు పెడుతున్నారు. పెద్ద కేసుల నుంచి బీఆర్ఎస్ నేతలను తప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
కన్నీరు పెట్టిన ఆతిశీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. తన తండ్రిని దుర్భాషలాడుతూ బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆప్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బిధూరి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా నాన్న టీచర్. ఢిల్లీలోని వేలాది మంది పేద, మధ్య తరగతి పిల్లలకు పాఠాలు బోధించారు. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్లు. చాలా అనారోగ్యంతో ఉన్నారు. కనీసం సొంతంగా నడిచే స్థితిలో కూడా లేరు. ఎన్నికల్లో లబ్ధి కోసం అటువంటి వృద్ధుడి పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా? దేశ రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారిపోతాయని నేనెప్పుడూ అనుకోలేదు. రమేష్ బిధూరి దక్షిణ ఢిల్లీ నుంచి పదిసార్లు ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారో కల్కాజీ ప్రజలకు చెప్పాలి. ఎమ్మెల్యేగా నేను చేసిన ఐదేళ్ల పని కంటే పదేళ్లపాటు ఆయన గొప్పగా చేసిందేమిటో చూపించాలి. అప్పుడే ఆయన ఓట్లు అడగాలి’అని ఆతిశీ స్పష్టం చేశారు.#WATCH | Delhi: On BJP leader Ramesh Bidhuri's reported objectionable statement regarding her, Delhi CM Atishi says, " I want to tell Ramesh Bidhuri, my father was a teacher throughout his life, he has taught thousands of children coming from poor and lower-middle-class families,… pic.twitter.com/ojQr3w0gVW— ANI (@ANI) January 6, 2025 ఇదీ చదవండి: ఢిల్లీలో మేం సహకరించకుండా ఉండి ఉంటే..! -
టఫ్ ఫైట్ తప్పదా?
న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం(జనవరి4) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలకు గట్టి పోటీ తప్పదనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ నుంచి పర్వేష్ సింగ్ వర్మ పోటీ చేయనున్నారు. పర్వేష్‌సింగ్ వర్మ పూర్తి పేరు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. ఈయన ఢిల్లీ బీజేపీలో సీనియర్ నేత. వెస్ట్ ఢిల్లీ నుంచి 2014,2019లో రెండుసార్లు కమలం గుర్తుపై ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లోనైతే ప్రత్యర్థిపై ఏకంగా ఐదు లక్షల 78వేల పై చిలుకు ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు.ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడే పర్వేష్‌సింగ్ వర్మ. త్వరలో జరిగే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు పర్వేష్‌సింగ్ వర్మ గట్టిపోటీ ఇవ్వగలరని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.సీఎం అతిషిపై పోటీచేయనున్న రమేష్ బిదూరి ఎవరు..ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అతిషిపై పోటీ చేయనున్న రమేష్ బిదూరి బీజేపీ సీనియర్ నేత. న్యాయవాది కూడా అయిన బిదూరి రెండుసార్లు ఎంపీగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేత బిదూరి. 2019లో దక్షిణ ఢిల్లీ నుంచి ఆప్ నేత రాఘవ్ చద్దాను ఓడించి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన బిదూరి సీఎం అతిషికి సరైన ప్రత్యర్థని భావించి పోటీకి దించిందని తెలుస్తోంది. కాగా, అతిషిపై కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా పోటీ చేయనున్నారు. -
ఢిల్లీ బీజేపీ తొలి జాబితా విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 29 మంది పేర్లను ప్రకటించింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ తరఫున పర్వేష్ వర్మ పోటీ చేయబోతున్నారు. అలాగే కల్కాజీ నుంచి సీఎం అతిషిపై పోటీకి రమేష్ బిదురిని బీజేపీ రంగంలోకి దింపింది. ఢిల్లీ బీజేపీ(BJP) చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోరంటూ తొలి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి . ఈలోపు.. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం. తొలి జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. రేఖా గుప్తా, సుశ్రీ కుమారి రింకూలకు కమలం పార్టీ తొలి జాబితాతో అవకాశం కల్పించింది. ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్(Kailash Gehlot) కిందటి ఏడాది నవంబర్‌లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో నజఫ్‌గఢ్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి నెగ్గిన కైలాష్.. ఈసారి బీజేపీ తరఫున బిజ్వాసన్ నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే పదేళ్లపాటు షీలా దీక్షిత్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన అరవిందర్ సింగ్ లవ్లీ.. కిందటి ఏడాది బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఈ ఎలక్షన్స్‌లో ఈస్ట్ ఢిల్లీ గాంధీనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు.ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుండగా.. ఆలోపు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక.. 2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో.. ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్‌లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి.दिल्ली बीजेपी ने विधानसभा चुनाव को लेकर 29 उम्मीदवारों की लिस्ट जारी की Delhi BJP | #BJP pic.twitter.com/nFVRcxASCV— News24 (@news24tvchannel) January 4, 2025 -
అంతా మీ ఇష్టమా?.. మంత్రి సత్యకుమార్‌ను నిలదీసిన టీడీపీ నేత!
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి పాలనలో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పలుచోట్ల కూటమి నేతలను సొంత పార్టీ నేతలే ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. తాజా మంత్రి సత్యకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంత్రిని టీడీపీ నేత ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.గుంటూరులో మంత్రి సత్యకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలో పీజీ మెడికల్ కౌన్సిలింగ్‌పై మంత్రిని టీడీపీ నేత నిలదీశారు. మెడికల్ కాలేజీల్లో ఫీజు ఫైనల్ కాకుండా కౌన్సిలింగ్ ఎలా పెడతారని సదరు నేత ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వర్సిటీలో ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. అయితే, సత్య కుమార్ మాత్రం విద్యార్థులు పేరెంట్స్ మాట్లాడుతున్నప్పటికీ వారి మాటలను పట్టించుకోకుండా మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ప్రభాకర్ రెడ్డికి కాషాయ పార్టీ నేతలు కౌంటరిచ్చారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ పార్టీ కంట్రోల్ చేయాలని బీజేపీ నేత హితవు పలికారు.తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీనటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. బీజేపీ నేతలను హిజ్రాలతో పోల్చటం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేస్తారు. అధికారం లేకపోతే పలాయనం.. జేసీ విధానం. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇక, అంతకుముందు ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.అలాగే, అనంతపురంలో నా బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగి ఉంటుందని ట్రావెల్స్ మేనేజర్ అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, గురువారం రాత్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం బస్సు ప్రమాదం కుట్రపూరితంగా జరిగినట్లు ఆరోపించడం సంచలనంగా మారింది. ఫ్లైయాష్ వివాదమే కారణమా? నిజానికి.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జేసీ ప్రభాకర్‌రెడ్డికి మధ్య ఇటీవల తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీళ్లిద్దరి పంచాయతీ సీఎం వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలను ఉద్దేశించి ప్రభాకర్‌రెడ్డి విమర్శించి ఉండవచ్చునని తెలుస్తోంది. -
తులం బంగారం ఇచ్చారా?.. కాంగ్రెస్ నేతలను నిలదీయండి: కవిత
సాక్షి, నిజామాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేటీఆర్, తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయితే, తాము భయపడే వాళ్లం కాదు.. భయపెట్టే రకం అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో అభివృద్ధి చేయలేక తమపై కేసులు పెడుతున్నారని కామెంట్స్ చేశారు.ఎమ్మెల్సీ కవిత ఆదివారం నిజామాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశవహయ్యారు. అనంతరం కవిత మాట్లాడుతూ..‘దేశంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేటీఆర్, నాపై కేసులు పెడుతున్నారు. అయినా భయపడేది లేదు. నేను, కేటీఆర్ ఏ తప్పు చేయలేదు. మాపై కేసులు పెట్టినా, ఇంకా ఎవరి మీద అయినా అక్రమ కేసులు బనాయించినా.. నిప్పు కణికల్లాగా బయటకు వస్తాం.పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్రాన్ని ఎదురించినా కేసు.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిదన్నా కేసు. సీఎం పేరు మర్చిపోతే కేసు.. హీరో పేరు మర్చిపోతే కేసు. రైతులు భూమి ఇవ్వకపోతే కేసు. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే కేసులే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడినా కేసులే పెడుతున్నారు. అయినా మేము భయపడేది లేదు.. గట్టిగా నిలబడతాం. పోరాటం మాకేమీ కొత్త కాదు..ఎవరికైనా స్కూటీలు వచ్చాయా?. తులం బంగారం వచ్చిందా.. మహాలక్ష్మి వచ్చిందా?. ఎన్నెన్నో హామీలు ఇచ్చారు.. బీరాలు పలికారు. హామీలు నెరవేరాయా?. కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి.. ప్రశ్నించండి. రుణమాఫీ అన్నారు.. పూర్తిగా చేయలేదు.. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు.. దరఖాస్తులు చెత్త కుప్పలో పడేశారు. 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారు. నిరుద్యోగులు మహిళలు ఉద్యోగులు విద్యార్థులు అందరినీ కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసుల రాజ్యం నడుస్తోంది. ఇటు నుంచి సూర్యుడు అటు ఉదయించినా నిజామాబాద్‌లో రాబోయే రోజుల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. రాబోయే లోకల్ ఎలక్షన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ ఎగరడం ఖాయం’ అంటూ కామెంట్స్ చేశారు. -
కాంగ్రెస్‌కు కౌంటర్.. సోనియాపై జేపీ నడ్డా విమర్శలు
ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మాణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.మాజీ ప్రధాని మన్మోహన్‌కు స్మారకం నిర్మించడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. మన్మోహన్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని, స్మారకం నిర్మించే ప్రాంతంలో కాకుండా నిగంబోధ్లో అంత్యక్రియలు నిర్వహించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందిస్తూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు.తాజాగా జేపీ నడ్డా మాట్లాడుతూ..‘మన్మోహన్ మృతితో విషాదం నెలకొన్న సమయంలోనూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మన్మోహన్ స్మారకం కోసం స్థలాన్ని కేటాయించింది. ఆ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాం. మన్మోహన్ ప్రధానిగా ఉండగా.. సోనియా గాంధీ సూపర్ ప్రధానిగా వ్యవహరించి ప్రధాని పదవిని అవమానించారు. ఒక ఆర్డినెన్స్‌ను చించేయడం ద్వారా మన్మోహన్‌ను రాహుల్ గాంధీ కూడా అవమానించారు. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.This is the way Gandhi family treated Ex PM #ManmohanSingh .. Shameful act by Sonia Gandhi .. watch pic.twitter.com/Bi8UrbNOU5— #Bagri (@Bagriml) December 27, 2024ఇదే సమయంలో పీవీ అంశంపై కూడా నడ్డా స్పందించారు. ఈ సందర్బంగా నడ్డా మాట్లాడుతూ..‘పీవీ నరసింహారావు స్మారకం నిర్మించడానికి సోనియా గాంధీ అంగీకరించలేదు. కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచడానికి కూడా ఆమె అనుమతించలేదు. చివరకు ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోని నిర్వహించనీయలేదని ధ్వజమెత్తారు. అలాగే, 2015లో పీవీ కోసం ప్రధాని మోదీ స్మారకం ఏర్పాటు చేశారని, భారత రత్న కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దీంతో, ఆయన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.Sonia Gandhi, who insulted PM Dr #ManmohanSingh ji in this manner, ever apologized till date??? Was this not an insult to the Prime Minister of India, Manmohan Singh ? pic.twitter.com/6Yj4OavpTT— Ayesha (@KashmiriAyesha1) December 27, 2024 -
బీజేపీ Vs కాంగ్రెస్.. మన్మోహన్ స్మారక చిహ్నంపై రాజకీయం!
ఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మన్మోహన్‌కు స్మారక చిహ్నం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ కోరడంపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఖర్గే లేఖపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ హేయమైన ప్రవర్తనకు ఇది ఉదాహరణ అని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు.మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగుతున్నాయి. మరోవైపు, అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలోనే మన్మోహన్‌కు స్మారక చిహ్నం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో.. రాజనీతిజ్ఞులు, మాజీ ప్రధానులకు అంతిమ సంస్కారాలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలను నిర్మించిన సంప్రదాయాన్ని ఖర్గే గుర్తు చేశారు. భారత ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవి’ అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.అయితే, ఈ లేఖపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ హేయమైన ప్రవర్తనకు ఇది ఉదాహరణ అని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు. ఈ సందర్భంగా కేశవన్ మాట్లాడుతూ..‘స్మారకాలను నిర్మించే సంప్రదాయాల గురించి మోదీకి కాంగ్రెస్ లేఖరాయడం విడ్డూరంగా ఉంది. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పీవీకి స్మారకం నిర్మించలేదు. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో కేవలం ప్రధాని మోదీ ఆయనకు స్మారకం నిర్మించారు. 2024లో భారతరత్న ప్రకటించి సముచిత గౌరవం ఇచ్చారు. అంతేకాదు, ఢిల్లీలో పీవీ అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ కనీసం చోటు కూడా ఇవ్వలేదని మన్మోహన్ సింగ్ మీడియా సలహదారు సంజయ్ బారు తన పుస్తకంలో రాశారు. ఢిల్లీకి బదులు హైదరాబాద్‌లో నిర్వహించే విషయమై పీవీ పిల్లలతో సంజయ్ మాట్లాడానని తెలిపారు’ అని మండిపడ్డారు.ఇదిలా ఉండగా.. స్మారక చిహ్నంపై కేంద్రం హామీ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మిస్తామని ప్రకటించింది కేంద్రం. తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ సుధాంశు త్రివేది మాట్లాడుతూ..‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్మారక స్థలి నిర్మాణానికి అవసరమైన భూమి, ట్రస్టు ఏర్పాటుకు కొంత సమయం పడుతుంది. కేంద్ర క్యాబినెట్ స్మారక స్థలి నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గేకు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేస్తాము. మన్మోహన్ జీవించి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ సముచితంగా గౌరవించలేదు. ఇప్పుడు ఆయన స్మారక నిర్మాణంపై రాజకీయాలు చేస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్
కోయంబత్తూర్/చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెన్నైలోని ఓ కాలేజీ విద్యార్థినిపై లైంగిక దాడి కేసు విషయంలో డీఎంకే ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల వైఖరిని ఖండిస్తూ అన్నామలై కొరడాతో తనను తాను కొట్టుకున్నారు. శుక్రవారం కోయంబత్తూర్‌లోని తన నివాసం వెలుపల అన్నామలై పచ్చని ధోతీ ధరించి, చొక్కా లేకుండానే కొరడాతో పదే పదే కొట్టుకున్నారు. ఆయన చుట్టూ గుమికూడిన బీజేపీ కార్యకర్తలు లైంగిక దాడి బాధితురాలి ఎఫ్ఐఆర్ను పోలీసులు లీక్ చేయడాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే అంశంపై గురువారం అన్నామలై మీడియా సమావేశంలో పాదరక్షలను వదిలేశారు. తమిళనాడులో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు డీఎంకే ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా కాళ్లకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల్లో డబ్బు పంచబోమని కూడా చెప్పారు. డీఎంకే ప్రభుత్వం పాల్పడిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 48 రోజులపాటు ఉపవాసంతో ఉండి రాష్ట్రంలోని ఆరు ప్రముఖ మురుగన్ ఆలయాలను దర్శించుకుంటానని తెలిపారు. ఉత్తరం–దక్షిణ రాజకీయాలు బూచిగా చూపుతూ వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డీఎంకే సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డీఎంకే రాజకీయాలు చూసి రోత పుడుతోందని అన్నామలై చెప్పారు. అన్నామలై వర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన గుణశేఖరన్ పాతనేరస్తుడు. అతడు డీఎంకే వ్యక్తి కాబట్టే, పోలీసులు ఇప్పటిదాకా క్రిమినల్ కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ను లీక్ చేయడం బాధితురాలిని అవమానించడం, ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనన్నారు. అయితే, అన్నామలై చర్య నవ్వు తెప్పించేలా ఉందని డీఎంకే వ్యాఖ్యానించింది. TN-BJP president @annamalai_k ji whips himself as a mark of protest against the DMK govt for their 'apathy' in handling the case of the sexual assault of an Anna University student.He has vowed to walk barefoot until the DMK govt falls.Truly a fighter...👏🏻 pic.twitter.com/FD3FGgWKIu— Mr Sinha (@MrSinha_) December 27, 2024 -
కోడిగుడ్లతో బీజేపీ సీనియర్ ఎమ్మెలేపై దాడి
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఆర్ ఆర్ నగర్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడి(Muniratna Naidu)పై కొందరు ఆగంతకులు కోడిగుడ్డు విసిరారు. అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి మునిరత్న బెయిల్ మీద బయటకు వచ్చి రెండు నెలలు అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆయనకు ప్రజల్లోకి వచ్చింది ఇదే తొలిసారికాగా.. ఆ టైంలోనే దాడి జరగడం గమనార్హం.బుధవారం లక్ష్మీ నగర్లో నిర్వహించిన వాజ్‌పేయి(Vajpayee) శతజయంతి ఉత్సవాల్లో మునిరత్న పాల్గొన్నారు. తిరిగి తన అనుచరులతో వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపైకి గుడ్డు విసిరారు. ఆపై మంటతో కాసేపు ఆయన విలవిలలాడిపోయారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆయనకు రకరకాల వైద్య పరీక్షలు జరిపారు. చివరకు ఆయన బాగానే ఉన్నారని ప్రకటించి అర్ధరాత్రి పూట వైద్యులు డిశ్చార్జి చేశారు.ఇదిలా ఉంటే.. మునిరత్న నాయుడు రాజకీయాలతోనే కాదు.. సినిమాలతోనూ పేరు సంపాదించుకున్నారు. ఉపేంద్ర, దర్శన్ లాంటి అగ్ర తారాలతో ఆయన చిత్రాలను నిర్మించారు. 2013, 2018, 2020, 2024 ఎన్నికల్లో రాజరాజేశ్వరి నగర్(RR Nagar) నుంచి ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో కర్ణాటక కేబినెట్ మినిస్టర్‌గానూ పని చేశారు. అయితే.. In a dramatic incident on Wednesday, #BJP MLA #Munirathna was targeted with an egg during an event marking the birth anniversary of former Prime Minister #AtalBihariVajpayee in #Bengaluru's #NandiniLayout.Police have arrested three individuals in connection with the attack and… pic.twitter.com/TWavEBJADq— Hate Detector 🔍 (@HateDetectors) December 25, 2024ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయనపై అనూహ్యమైన ఆరోపణలు వచ్చాయి. సోషల్ వర్కర్‌గా పని చేసే ఓ మహిళ(40) ఫిర్యాదుతో ఈ బీజేపీ ఎమ్మెల్యేపై పలు నేరాల కింద కేసు నమోదయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మూడు రోజులుల్లో ఉండి బయటకు వచ్చారాయన. అయితే బయటకు వచ్చి కొన్నినిమిషాలకే.. అత్యాచారం కేసు(Rape Case)లో ఆయన్ని మరోసారి అరెస్ట్ చేశారు.వాపై నెలరోజులపాటు సెంట్రల్ జైల్లో గడిపిన ఆయనకు.. అక్టోబర్ మూడో వారంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఊరట ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. గుడ్డు దాడిపై రాజకీయం తమ పార్టీ సీనియర్ నేత మునిరత్నపై కోడిగుడ్డు దాడి కాంగ్రెస్ కార్యకర్తల పనేనని బీజేపీ(BJP) ఆరోపిస్తోంది. మునిరత్న మరో అడుగు ముందుకు వేసి.. ఇది తనను చంపేందుకు జరిగిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరికొందరు కాంగ్రెస్ నేతలు ఈ కుట్రలో భాగమయ్యారని అన్నారాయన. అయితే ఘటనపై నందిని లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. -
సంక్షోభం.. సినీ రంగానికా? రాజకీయానికా?
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప -2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన విషయం చిలికి,చిలికి గాలివానగా మార్చడానికి రాజకీయ నేతలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. సినీ పరిశ్రమపైనే తీవ్ర ప్రభావం చూపించేలా పరిస్థితులు ఏర్పడుతుండడం దురదృష్టకరం. వేలాది మందికి ఆధారంగా ఉన్న ఈ పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి.. కొత్త సంవత్సరంలో సంక్రాంతి(Sankranti) సందర్భంగా విడుదల కావల్సి ఉన్న సినిమాలపై ఈ ఉదంతం.. పరిణామాల ప్రభావం పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. దానికి కారణం వీరిలో కొందరు భారీ వ్యయంతో సినిమాలు తీయగా, ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షో లు, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించం అని ప్రకటించడమే అని చెబుతున్నారు. వినోద మాద్యమ రంగంలో వచ్చిన అనేక మార్పుల ప్రభావం ఆ పరిశ్రమను అతలాకుతలం చేస్తోందని చెప్పవచ్చు. ఆ దశలో అల్లు అర్జున్ ఘటన వ్యవహారాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది రేవంత్ ఈగో సమస్యగా మారినట్లుగా ఉంది. శాసనసభలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ ప్రముఖులను తప్పుపట్టారు. అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండి ఇంటికి వస్తే సినీ ప్రముఖులు, ఇతరులు క్యూ కట్టి పరామర్శిస్తారా అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. తొక్కిసాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు ఆస్పత్రిలో ఉంటే ఎందుకు పరామర్శించ లేదని ఆయన అన్నారు. నిజమే!ఆ బాలుడిని పరామర్శించాలని చెప్పడం తప్పు లేదు.కాని ఆ కారణంగా అర్జున్ ఇంటి వద్దకు వెళ్లడం తప్పన్నట్లుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం అంత సముచితంగా లేదు.పైగా కాలు పోయిందా?చేయి పోయిందా? కిడ్నీ పోయిందా?ఏమి జరిగిందని అర్జున్ వద్దకు వెళ్లారని ప్రశ్నించడం మరీ తప్పు అని చెప్పకతప్పదు. తమకు సంబంధించిన వ్యక్తి తప్పు చేసినా, చేయకపోయినా, ఏదైనా ఇబ్బందిలో ఉన్నాడని తెలిసినప్పుడు ఆయన సన్నిహితులు,అదే రంగానికి చెందినవారు వెళ్లి పలకరించి వస్తుంటారు.అంతెందుకు! ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి బెయిల్ పై జైలు నుంచి విడుదల అయినప్పుడు జైలువద్దకు వచ్చినవారితో కలిసి ఆయన ర్యాలీనే తీశారు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ పై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేసి పశ్చాత్తాప్తం ప్రకటించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నోరు పారేసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. అల్లు అర్జున్ ఆంధ్రా వెళ్లిపోవాలట..! ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యాపారాలు చేయాలట!. ఇలాంటి వ్యాఖ్యలను రేవంత్ సమర్దిస్తారా? సమర్దించరు. ఎందుకంటే స్వయానా ఆయన అల్లుడు ఆంధ్రకు చెందినవారన్న సంగతి తెలిసిందే. ఈ మాత్రం సోయ లేకుండా భూపాల్ రెడ్డి వంటి వారు వ్యర్ద ప్రసంగాలు చేస్తే అది కాంగ్రెస్ కు మరింత చేటు తెస్తుంది. మంత్రి సీతక్క అయితే.. పుష్ప సినిమాకుగానూ అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. అది తప్పయితే.. రేవంత్ ప్రభుత్వం ఆ సినిమాకు బెనిఫిట్ షోలు, ధరల పెంపుదలకు ఎందుకు అనుమతి ఇచ్చింది?. ఆ మాటకు వస్తే నక్సల్స్ కు సానుభూతిగా కొన్ని సినిమాలు వచ్చాయి.వాటిలో కొన్నిటికి అవార్డులు కూడా లభించాయి. కాని నక్సల్స్ ను ఏ ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా?. సీతక్క(Seethakka) ఎందుకు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చారు?. ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే సరిపోదని గుర్తించాలి. ఇదే టైంలో.. 👉బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, రఘునందన్ తదితరులు అల్లు అర్జున్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు. సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోందని,పగ పట్టినట్లు వ్యవహరిస్తోందని కూడా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నా.. బీజేపీ వాళ్లే దీనిని బాగా సీరియస్‌గా తీసుకున్నట్లు కస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బిజెపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యత్నిస్తోంది. భవిష్యత్తులో అల్లు కుటుంబాన్ని తమ పార్టీలోకి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అనేది చూడాలి. ఇక.. అర్జున్ పై కాంగ్రెస్ కాక తగ్గించకపోతే.. ఆ దిశగా అడుగులు పడ్డా ఆశ్చర్యం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనకు అర్జున్ దానికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వానికి మంటపుట్టించింది. అది అర్జున్ కు ఉన్న స్వేచ్చ అని ప్రభుత్వం భావించలేదు. పోలీసు ఉన్నతాధికారులంతా రంగంలో దిగి అర్జున్ ఏదో ఘోరమైన నేరం చేశారని చెప్పడానికి యత్నించారు. లేకుంటే ఈ కేసులో పదివేల వీడియోలు సేకరించవలసినంత అవసరం ఏముంది?. ఎక్కడో చోట అర్జున్ తప్పు దొరకకపోదా? అని వెతికారన్నమాట. దీనిని ప్రభుత్వ పెద్దలు వ్యక్తిగత ప్రతిష్టగా భావించారన్నమాట!. ఇదే సందర్భంలో.. 👉పోలీసులు సంధ్య థియేటర్ వద్ద అర్జున్ కు స్వాగతం చెప్పిన రీతిలో వ్యవహరించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఒక సస్పెండెడ్ పోలీస్ అధికారి అయితే మరీ రెచ్చిపోయి ఆంధ్ర-తెలంగాణ అంశాన్ని తెరపైకి తేవడం, అర్జున్ నటన గురించి వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమవారికి ఇచ్చిన భూముల ప్రస్తావన తేవడం, ఏకంగా తాటతీస్తాం,తోలు తీస్తాం అని హెచ్చరించడం శోచనీయంగా ఉంది. అర్జున్ కు పోలీసులు నోటీసు ఇచ్చి మూడున్నర గంటలు విచారించడం కూడా వేధింపులో భాగమే అనే అభిప్రాయం కలుగుతుంది. పైగా అర్జున్ ‘‘అలా జవాబిచ్చారు..ఇలా సమాధానం ఇచ్చారు..’’ అంటూ లీకులు ఇచ్చిన తీరు కూడా దీనిని ధృవపరుస్తుంది. ఏపీలో రెడ్ బుక్(Red Book) రాజ్యాంగం మాదిరి తెలంగాణలో కూడా పోలీసులు ప్రజల తోలు తీసే రాజ్యాంగం వచ్చిందేమో తెలియదు.మరో వైపు కొందరు ఓయూ జేఏసీ పేరుతో అర్జున్ ఇంటిపై దాడి చేయడం మరింత దారుణం. పేరుకు జేఏసీ అయినా.. అక్కడకు వెళ్లినవారంతా కాంగ్రెస్ వారేనని సోషల్ మీడియాలో ఆధార సహితంగా వీడియోలు వచ్చాయి. దీనిని ఖండించి , ఏకోన్ముఖంగా నిరసన చెప్పవలసిన సినిమా పరిశ్రమ పెద్దలు జడిసిపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ శాసనసభలో చేసిన విమర్శలతో వీరంతా భయపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే.. 👉అర్జున్ ఇంటిపై దాడి చేసినవారు అరాచకంగా రాళ్లు వేసి,పూలకుండీలు మొదలైనవాటిని ధ్వంసం చేసినా ఇంటిలో పనిచేసేవారిపై దౌర్జన్యానికి దిగినా సినీ ప్రముఖులు మాత్రం నోరు మెదపలేదు. అర్జున్ కు ,ఆయన తండ్రి అరవింద్ కు సంఘీబావం తెలపలేదు. ఇది పరిశ్రమ బలహీనతగా ఉంది. రేవంత్ కూడా అర్జున్ ఇంటిపై దాడిని నేరుగా ఖండించకుండా, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నానని ప్రకటన ఇవ్వడం ద్వారా ఆయనలో ఇంకా కోపం తగ్గలేదని చెప్పకనే చెప్పారనుకోవాలి.. ఇదే సందర్భంలో సడన్ గా బెనిఫిట్ షో లు రద్దు చేస్తామని సీఎం చెప్పడం సినీ పరిశ్రమ ప్రముఖులలో గుబులు రేపుతోంది. వచ్చే నెలలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో ప్రముఖ నటుడు వెంకటేష్ తదితరుల సినిమాలు విడుదల కావల్సి ఉంది. వీటిలో ఒక సినిమాకు ఐదువందల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయిందట!. అలాగే మరో సినిమాకు 150 కోట్లు ఖర్చు పెట్టారట!. ఈ భారీ బడ్జెట్ సినిమాలకు స్పెషల్ షో లు, ధరల పెంపు,బెనిఫిట్ షో లు వంటివి లేకపోతే.. సత్వరమే వారు పెట్టిన పెట్టుబడి రావడం కష్టం అయిపోతుంది. 👉ప్రముఖ నిర్మాత ,తెలంగాణ చలనచిత్రాభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రేవంత్ ను ఒప్పించి మళ్లీ బెనిఫిట్ షో లు, ధరల పెంపుదలకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకువస్తారన్న ఆశతో ఉన్నారట!. అందుకే ఇప్పుడు అర్జున్ తప్పుచేసినా, చేయకపోయినా.. ఆ ఘటన జోలికి వెళ్లకపోవడం బెటర్ అని భావిస్తున్నారట!. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ ధరల గురించి చర్చించి, షూటింగ్ లు కూడా జరిపేలా షరతులు పెడితే.. ఇంకేముంది సినిమావారిపై దాడి చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వంటివారు కాని, ఇటు ఎల్లో మీడియా కాని ఇప్పుడు నోరు మెదపడం లేదు. మెగాస్టార్ చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించి విందు ఇచ్చి పంపితే, ఆయనకు ఏదో అవమానం జరిగిందంటూ కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు స్వయానా చిరంజీవి మేనల్లుడు ఇంటిపైనే దాడి జరిగితే పవన్ కల్యాణ్‌తో సహా ఎవరూ నోరు విప్పడం లేదు. ఎందుకంటే.. పవన్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే ఉంటాయి కాబట్టి.👉నిజంగానే రేవంత్ తననిర్ణయానికి కట్టుబడి ఉంటే ఒకరకంగా ప్రయోజనం, మరో రకంగా నష్టం వాటిల్లవచ్చు. నిర్మాతలు చిన్న బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్దం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెంచాలని కోరవలసిన అవసరం ఉండదు. కానీ అగ్ర నిర్మాతలు ఇందుకు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ ఇది ముదిరితే సినీ పెద్దలు రేవంత్ ప్రభుత్వంపై ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదులు చేయవచ్చు!. అంతేకాక తాము ఇక్కడ షూటింగ్ లు చేయలేమని,వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని ప్రకటించినా, రేవంత్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అందువల్ల పరిశ్రమకు ఇబ్బంది రాకుండా, అలాగే ప్రేక్షకులకు సౌలభ్యంగా రాజీ కుదుర్చుకోవడం మంచిదని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Allu Arjun Issue:‘సూపర్స్టార్లా ఫీలైపోతున్న రేవంత్’
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. నటుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసులు(Telangana Police) వ్యవహరిస్తున్న తీరును రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతి లేకుండా ర్యాలీగా రావడం ముమ్మాటికీ తప్పేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం మరింత దుమారాన్ని రేపింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ను ఇబ్బంది పెడుతోందని ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మరో గొంతుక ఇప్పుడు రేవంత్‌కు వ్యతిరేకంగా వినిపించింది. అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తనను తాను ఓ సూపర్స్టార్లా ఫీలవుతున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. ‘‘తెలంగాణలో ఎవరు సూపర్ స్టార్ అనే విషయంలో ఆయన(రేవంత్ రెడ్డి ) పోటీ పడుతున్నారనుకుంటా. అల్లు అర్జున్ కంటే తానే సూపర్‌స్టార్‌నని ఆయన చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో నటిస్తున్నారు. తెలంగాణలో ఆయనే ఇప్పుడు మెయిన్ యాక్టర్. అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరి రచ్చ చేసిన వాళ్లలో ఇద్దరు ముగ్గురు ఆయన (రేవంత్ రెడ్డి ) నియోజకవర్గానికి చెందిన వాళ్లే. ఇది రాజకీయ దురుద్దేశంతో జరిగిన దాడేనని స్పష్టం అవుతోంది. .. అలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. ఒక నిండుప్రాణం పోవాలని అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అనుకోరు కదా. ఒకరిని బలిపశువు చేయడం, వేధించడం ముమ్మాటికీ తప్పే’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నామలై అన్నారు. #WATCH | Chennai: Tamil Nadu BJP president K Annamalai says, " I think he (Revanth Reddy) is trying to compete regarding who is the superstar in Telangana, he trying to show he is superstar than Allu Arjun...right now also he is acting in Congress, he is the main actor in… pic.twitter.com/zjqPDj5BCY— ANI (@ANI) December 24, 2024 ఇదీ చదవండి: అల్లు అర్జున్ను ఆనాడు అడ్డుకుని ఉంటే.. -
పార్లమెంట్ వద్ద తోపులాటలో ఎంపీలకు గాయాలు.. CISF కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: ఇటీవల పార్లమెంట్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ నిరసనల వేళ తోపులాట కారణంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఈ వ్యవహారంపై సీఐఎస్ఎఫ్(CISF) కీలక ప్రకటన చేసింది. ఆరోజున తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్ తెలిపారు.పార్లమెంట్ వద్ద తోపులాట వ్యవహారంపై సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదన్నారు. సెక్యూరిటీలో భాగంగా ఎలాంటి ఆయుధాల కూడా పార్లమెంట్ లోపలికి వెళ్లలేదు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ఎలాంటి విచారణ జరపడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ భద్రత బాధ్యతలు సీఐఎస్ఎఫ్ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇటీవల బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్ వద్ద కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్లపై పడిపోయారు. దీంతో, ఆయనకు గాయమైంది. అనంతరం, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, తనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul gandhi) తోసేయడం వల్లే గాయపడ్డినట్టు ఆరోపించారు. ఈ ఘటన సందర్బంగా మరో బీజేపీ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్ కూడా గాయపడ్డారు.పరస్పరం పోలీసులకు ఫిర్యాదుపార్లమెంటు ఘటనలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎంపీలపై బీజేపీ బృందం డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా రాహుల్‌పై కేసు నమోదైంది. బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ బృందం ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.ఉభయ సభల్లోనూ వాగ్వాదంఅంతకుముందు.. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఉభయ సభల్లో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇరు సభల్లో ప్రతిపక్ష సభ్యులు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీ, ఈసీపై సీఎం స్టాలిన్ సంచలన ఆరోపణ!
చెన్నై: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కారణంగా ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోందన్నారు. అలాగే, రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలను కేంద్రం నాశనం చేస్తోందని కామెంట్స్ చేశారు.తమిళనాడు సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా స్టాలిన్.. కేంద్రం ఎన్నికల నియమావళికి నిర్లక్ష్యపూరిత సవరణ చేసింది. ఎన్నికల పారదర్శకతను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం నిర్ణయాలతో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఎన్నికల నియమావళిలోని సెక్షన్ 93(2)(ఎ) సవరణతో ఎన్నికల్లో ఆందోళన కలుగుతోందన్నారు.అలాగే, ఎన్నికల బూత్‌లోని సీసీటీవీ ఫుటేజీని సమకూర్చాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సీసీటీవీ ఫుటేజీతో సహా ఎన్నికల పత్రాలను బహిరంగంగా తనిఖీ చేయకుండా ఈ సవరణను తీసుకొచ్చింది. రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలలో ఒక దానిని బీజేపీ నాశనం చేసింది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆందోళన నెలకొంది. భారత ఎన్నికల సంఘం మోదీ ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయింది. ఎన్నికల సంఘం తీరు దిగ్భ్రాంతికరం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.Democracy is facing its gravest threat under the BJP-led Union Government with the reckless amendment of Section 93(2)(a) of the Conduct of Election Rules, to kill the transparency in election.Consequent on the direction of the Punjab and Haryana High Court to furnish the CCTV… https://t.co/vkAaY2ynr3— M.K.Stalin (@mkstalin) December 23, 2024 -
Allu Arjun Controversy: రాజకీయ రగడ
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం, దానికి కొనసాగింపుగా నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ నిర్వహణ ‘రాజకీయ చిచ్చు’ రాజేసింది. నటుడి ఇంటిపై ఓయూ జేఏసీ ఆదివారం రాళ్ల దాడికి దిగగా.. ఘటనను ఖండిస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో అల్లు అర్జున్ తీరును అధికార కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇంతకీ ఎవరేమన్నారంటే..సినీనటుడు అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ను దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎదురుదాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు. యాదా ద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తన లీగల్ టీం ఒప్పుకోలేదని అల్లు అర్జున్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. .. అల్లు అర్జున్‌కు ఏదో అయినట్లు ఆయన ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అల్లు అర్జున్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, ఎక్స్ట్రా షోలు రద్దు చేస్తున్నామని.. టికెట్ ధరల పెంపునకు అను మతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు. అందులో భాగంగానే చిత్రపురి కాలనీలో జూనియర్, పేద ఆరి్టస్టులకు ప్లాట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. అల్లు అర్జున్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఎంపీ కిరణ్, ఎమ్మెల్సీ వెంకట్సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత.. సినీ నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే సంధ్య థియేటర్ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారేమోనని అనుకున్నామని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు బల్మూరి వెంకట్ చెప్పారు. కానీ ఆయన రియల్ హీరోలా కాకుండా.. రీల్ హీరోలా వ్యవహరించారని విమర్శించారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌పై ఎంపీ కిరణ్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. అర్జున్ ఏదో స్క్రిప్టు తీసుకొచ్చి చదివినట్టు మాట్లాడారన్నారు. అసలాయనేం చెబుతున్నారో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా హీరోలాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకుని.. తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవతి చనిపోయిన మర్నాడు.. అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఆరోపించారు. వారిలో పశ్చాత్తాపం కనిపించడం లేదు సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారశైలి దారుణంగా ఉందని, ఆయనలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన విషయాలను తప్పుపట్టేలా మాత్రమే ఆయన తీరు ఉందని, రేవతి కుటుంబంపై కనీస సానుభూతి కూడా ఆయన చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆ యన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు మూడీగా ఉంటున్నాడని అల్లు అరవింద్ అంటున్నారని, మరి రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణం ఐసీయూలో ఉలుకూ పలుకూ లేకుండా పడిఉన్న విషయం అరవింద్‌కు గుర్తు లేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ కారణంగా జరిగిన తప్పును సమరి్థంచుకోకుండా సరిదిద్దుకోవాల ని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం సీఎలీ్పలో ఆయ న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మానవత్వంతో ఆదుకునే ప్రయత్నం చేయకుండా, ప్రభుత్వం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ అల్లు అర్జున్ ఆరోపించడాన్ని ఆయన విమర్శించారు.ఇదీ చదవండి: 'స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్'సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తారా? : బీఆర్ఎస్ నేత శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలను వదిలేసి.. సినిమా పరిశ్రమ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. వారు ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రైతుభరోసా అందక, రుణమాఫీ కాక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించక, గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో.. వాటిపై చర్చ జరపకుండా అసెంబ్లీలో సినీ నటుడు అల్లు అర్జున్ను తిట్టేందుకు గంటల కొద్దీ సమయం కేటాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. దేవాల యం లాంటి చట్టసభలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యక్తిగత కక్షతో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.తెలుగు సినీ పరిశ్రమపై సీఎం పగ : బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. గాయపడిన శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సమస్య సద్దుమణుగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యులతో పక్కా ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా పరిశ్రమను దెబ్బతీసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు. సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై విద్యార్థులు మృత్యువాత పడుతుంటే ఎన్నడైనా బాధ్యత వహించారా? అని నిలదీశారు. సినీనటుడు అల్లు అర్జున్‌కు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆదివారం రాత్రి సంజయ్ పరామర్శించారు. అనంతరం బాలుని తండ్రితో కొద్దిసేపు మాట్లాడి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బండి వెంట బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప తదితరులు ఉన్నారు. పోలీసులపై అనుచితంగా మాట్లాడితే తోలుతీస్తాం పంజాగుట్ట (హైదరాబాద్): సినీ నటుడు అల్లు అర్జున్ను ఉద్దేశించి స స్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఏదైనా పశువు చనిపోయినా ఏం జరిగిందని ఆరా తీస్తాం. తన సినిమా చూసేందుకు వచ్చి, తొక్కిసలాటలో మహిళ చనిపోయి, పసిపిల్లాడు ప్రాణాపాయస్థితిలో ఉంటే పరామర్శించకుండా వెళ్లిపోయిన అల్లు అర్జున్‌కు మానవత్వం లేదు. ఆయనలో సక్సెస్ మీట్స్‌కు వెళ్ల్లలేకపోతున్నాననే ఆవేదనే తప్ప మనుషులు చనిపోయారన్న బాధ ఏ మాత్రం కనిపించడం లేదు’’అని ఓ ప్రెస్మీట్లో పేర్కొన్నారు. సెలబ్రిటీలు చట్టాన్ని గౌరవిస్తూ మాట్లాడాలన్నారు. తొక్కిసలాటతో ఎవరికీ సంబంధం లేదని, అది ప్రమాదమేనని అల్లు అర్జున్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు, నాయకులు పోలీసులపై అనుచితంగా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని.. అలా మాట్లాడితే తోలు తీస్తామని వ్యాఖ్యానించారు. విష్ణుమూర్తి వ్యాఖ్యలు అనధికారికం: డీజీపీ ఆఫీసు డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయం స్పందించింది. సబ్బతి విష్ణుమూర్తి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారని, ఆయన అనధికారికంగా ప్రెస్‌మీట్ పెట్టారని ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. -
అల్లు అర్జున్‌కు అండగా బండి సంజయ్
సాక్షి, ఢిల్లీ: తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని కామెంట్స్ చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్.. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు బాసటగా నిలిచారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద ఘటనలో మహిళ మరణాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించారు. శ్రీతేజ్ కోలుకోవాలని అందరూ కోరుకోవడంతోపాటు ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని మరీ.. సినిమా లెవల్లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గు చేటు. ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోంది. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచింది. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుంది. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చనిపోతుంటే ఏనాడైనా పరామర్శించారా?. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ఎవరైనా బాధ్యత వహించారా?. మీకో న్యాయం.. ఇతరులకు ఒక న్యాయమా?. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. లేనిపక్షంలో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ప్రభుత్వ అధికారిపై దాడి.. బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు మూడేళ్ల జైలు శిక్ష
జైపూర్: బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన కారణంగా కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో, ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రజావత్, అతడి సహాయకుడు 2022లో ఫారెస్ట్ అధికారి రవి కుమార్ మీనాపై దాడి చేశారు. రాజావత్ తన మద్దతుదారులతో కలిసి డీసీఎఫ్ ఆఫీసులోకి వెళ్లి సదరు అధికారిని బెదిరింపులకు గురి చేసి... అనంతరం అధికారిపై చేయి చేసుకున్నారు. అయితే, ఓ పనికి సంబంధించి సదరు అధికారితో వాగ్వాదం తర్వాత ఆగ్రహానికి లోనైనా రజావత్.. దాడి చేశారు. ఈ సందర్బంగా ఆయనతో పాటు అతని సహాయకుడు మహావీర్ సుమన్ కూడా ఉన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాతో వైరల్ అయ్యాయి.అయితే, ఈ ఘటనపై డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) రవికుమార్ మీనా ఫిర్యాదు మేరకు రజావత్, సుమన్లపై 2022 మార్చి 31న ఐపీసీ సెక్షన్లు 332, 353, 34, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నయాపురా పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణ సందర్బంగా తాజాగా రజావత్, సుమన్‌లకు ప్రత్యేక కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. సెక్షన్ 353 (ప్రభుత్వ అధికారి తన విధిని నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) సహా పలు సెక్షన్ల కింద కోర్టు వారిద్దరిని దోషులుగా నిర్ధారించారు. ఇదే సమయంలో దోషులకు ఒక్కొక్కరికి రూ.20,000 జరిమానా విధించింది.దోషిగా తేలిన అనంతరం మాజీ ఎమ్మెల్యే రజావత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక కోర్టు ఆదేశాలపై హైకోర్టులో అప్పీలు చేస్తాను. కోటలోని లాడ్పురా మాజీ ఎమ్మెల్యే కూడా ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్-3 కింద అభియోగాల నుంచి విముక్తి పొందారని చెప్పుకొచ్చారు. ఇక, కోర్టు తీర్పు నేపథ్యంలో రజావత్, సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.