
సాక్షి, మామునూర్: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాలో మామునూరు విమానాశ్రయం వద్ద ఇరు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో జై మోదీ అని బీజేపీ కార్యకర్తలు.. జై కాంగ్రెస్ అంటూ హస్తం పార్టీ నినాదాలు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాల నేతలు అడ్డుకున్నారు.
మామునూర్ ఎయిర్‌పోర్టు విషయమై వరంగల్‌లో ఉద్రిక్తత నెలకొంది. మామునూర్ విమానాశ్రయానికి ఇటీవల కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విమానాశ్రయానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో ప్రధాని మోదీకి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ శ్రేణులు శనివారం ఉదయం అక్కడికి చేరుకున్నాయి. విమానాశ్రయం వద్ద మోదీకి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు.
కాగా, బీజేపీ నేతలు అక్కడికి వచ్చిన సమయంలోనే కాంగ్రెస్ శ్రేణులు సైతం విమానాశ్రయం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే విమానాశ్రయం రెడీ అవుతోందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఇరు వర్గాలు మధ్య ఘర్షణ తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాల నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించడం గమనార్హం.

Comments
Please login to add a commentAdd a comment