warangal
-
వరంగల్ చపాట మిర్చికి జీఐ ట్యాగ్
సాక్షి, వరంగల్/సిద్దిపేట: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండిస్తున్న చపాట మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (జీఐ ట్యాగ్) లభించింది. ఇప్పటికే తెలంగాణ నుంచి పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, హైదరాబాద్ హలీమ్తోపాటు మరికొన్ని ప్రత్యేక ఉత్పత్తులు జీఐ గుర్తింపు దక్కించుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో దేశంలోని తీపి మిర్చి రకాల్లో ఒకటైన చపాట మిరప చేరింది.చపాట మిరపకు జీఐ ట్యాగ్ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రెండేళ్ల క్రితం దరఖాస్తు చేయగా.. ఇండియన్ పేటెంట్ ఆఫీస్ (ఐపీవో) తాజాగా ఆమోదించింది. ‘జియోగ్రాఫిక్ ఇండికేషన్స్ జర్నల్’ లోనూ చపాట రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. రెండేళ్ల క్రితం చపాట మిర్చికి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.లక్ష వరకు ధర పలికింది. తక్కువ ఘాటుతో ఎర్రని టమాటా పండులాంటి రంగు కలిగి ఉండటం ఈ మిర్చి ప్రత్యేకత. అందుకే దీనిని టమాటా మిర్చి అని కూడా పిలుస్తారు. -
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
సాక్షి, ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, జగ్గయ్యపేట.. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలతో సహా హైదరాబాద్‌లో కూడా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 7:27 గంటలకు రెండు నిమిషాల పాటు భూమి కంపించింది. దీంతో, ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. కాగా, ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా భూమి కంపించినట్టు అధికారులు చెబుతున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు స్టేట్స్లో ఇలా భూమి కంపించడం గమనార్హం. ఈ మేరకు సీఎస్ఐఆర్ ఓ ఫొటోను విడుదల చేసింది. Got a whatsapp forward video from Bhadrachalam, Telangana. A strong one 😮Credits to respective owner pic.twitter.com/i3OR9wFfM4— Telangana Weatherman (@balaji25_t) December 4, 2024 వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, రాజేంద్రనగర్, రాజేంద్రనగర్ సహా రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలోని చాలా జిలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అటు, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూమి కంపించింది. ఖమ్మంలోకి నేలకొండపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలోని చుండడ్రుగొండలో బుధవారం తెల్లవారుజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు ప్రజలు తెలిపారు. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.For the first time in last 20years, one of the strongest earthquake occured in Telangana with 5.3 magnitude earthquake at Mulugu as epicentre.Entire Telangana including Hyderabad too felt the tremors. Once again earthquake at Godavari river bed, but a pretty strong one 😮 pic.twitter.com/RHyG3pkQyJ— Telangana Weatherman (@balaji25_t) December 4, 2024అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భూమి కంపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గవ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. దీంతో, ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అలాగే, కేససముద్రం, మహబూబాబాద్, బయ్యారంలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.హన్మకొండ జిల్లా పరకాల డివిజన్లో భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే, వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో 5 నుండి 15 సెకండ్ల వరకు స్వల్పంగా కంపించిన భూమి. దీంతో, భయాందోళనలో స్థానికులు ఉన్నాయి. భూమి కంపించడంపై ఉదయాన్నే సిటి మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, తిరువూరు, నందిగామ, గుడివాడ, మంగళగిరి, జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీసినట్టు చెబుతున్నారు. బుధవారం ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. -
కాకతీయ జూపార్క్‌కు కరీనా ,శంకర్ ఆగయా..!
న్యూశాయంపేట : వరంగల్ నగరంలోని కాకతీయ జూపార్క్‌కు ఆడపులి కరీనా (15), మగ పులి శంకర్ (10) వచ్చేశాయి. పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న పెద్దపులుల దర్శన భాగ్యం త్వరలో కలగనుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా రెండు పెద్ద పులులతోపాటు అడవిదున్నల ఎన్క్లోజర్లు, రెండు జింకల ఎన్క్లోజర్లను ప్రారంభించనున్నట్లు అటవీశాఖాధికారులు తెలిపారు.ఐదేళ్ల కిందటే రావాల్సి ఉండే..కాకతీయ జూపార్క్‌లో పెద్ద పులులు, అడవిదున్నల కోసం ఐదేళ్ల క్రితమే ఎన్‌క్లోజర్ పనులు ప్రారంభించారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోకపోవడం.. బడ్జెట్ లేదనే నెపంతో పనులను మధ్యలోనే వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అటవీశాఖ మంత్రి కావడంతో జూపార్క్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్క్లోజర్ల పనులు పూర్తి చేసి రెండు పెద్ద పులులు, ఇతర జంతువులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.హగ్ డీర్.. బార్కిన్ డీర్ వైజాగ్ నుంచి రాక..కాకతీయ జూపార్క్‌కు రెండు జింక (హగ్ డీర్, బార్కిన్ డీర్)లను ఆంధ్రప్రదేశ్‌నుంచి తీసుకొచ్చినట్లు అటవీశాఖాధికారులు తెలిపారు. రెండు అడవిదున్నలు త్వరలో రానున్నట్లు చెప్పారు. సెంట్రల్ జూపార్క్ అథారిటీ అనుమతితో ఈ జంతువులను జూపార్క్‌కు తీసుకొస్తున్నట్లు వివరించారు. వాటి కోసం ప్రత్యేకమైన ఎన్క్లోజర్ల ఏర్పాటు చేశామన్నారు.సిద్ధసముద్రంలో పూడిక తీస్తే మేలు..జూపార్క్.. సిద్ధ సముద్రం చెరువు ప్రాంతంలో చుట్టూ ఎత్తయిన కొండల మధ్య 47.64 ఎకరాల్లో విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో వివిధ జంతువుల ఎన్క్లోజర్లకు పోను సిద్దసముద్రం చెరువు కొంతమేర ఉంటుంది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చెరువులో పూడిక తీసి బోటింగ్ సౌకర్యం కల్పిస్తామని పార్క్‌ను సందిర్శించిన సందర్భంగా తెలిపారు. ఆ తరువాత పట్టించుకోలేదు. కొండా సురేఖ అటవీశాఖ మంత్రి కావడం, జూపార్క్‌కు ప్రతేక నిధులు కేటాయించి సిద్ధసముద్రంలో పూడిక తీసి బోటింగ్ సదుపాయం కల్పించాలని పర్యాటకులు, నగరవాసులు కోరుతున్నారు.ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలి..కాకతీయ జూపార్క్‌కు రెండు పెద్ద పులులు వచ్చాయి. రెండు జింకలు వైజాగ్ నుంచి ఇటీవల తీసుకొచ్చాం. రెండు అడవిదున్నలు త్వరలో రానున్నాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేదాక సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఆ తరువాత సందర్శకులకు అనుమతిస్తాం.– భీమానాయక్, అటవీ ముఖ్య సంరక్షణాధికారి, భద్రాద్రి సర్కిల్ -
అనుమానం.. పెనుభూతమైంది
కేసముద్రం: అనుమానం.. పెనుభూతమైంది. ఓ ప్రబుద్ధుడు భార్యను ఉరివేసి హత్యచేశాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య కథనం ప్రకారం.. కేసముద్రంస్టేషన్‌కు చెందిన బత్తుల వీరన్నకు ఇదే మండలం బోడమంచ్యాతండాజీపీకి చెందిన అనూష(30)తో 2011లో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు రాజేశ్(6వ తరగతి) ఉన్నాడు. మొదట్లో వారి దాంపత్య జీవితం సవ్యంగానే సాగింది. కొంతకాలంగా వీరన్న తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. నాలుగు రోజుల క్రితం అనూష కుమారుడు రాజేశ్ బోడమంచ్యాతండాలో తన తాత ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి వీరన్న తన భార్య అనూషను ఉరివేసి హత్య చేశాడు. అనంతరం ఇంటి వెనక ఉన్న బావి దూలానికి భార్యను వేలాడ దీసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. ఆపై అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు ఘటనా స్థలికి చేరుకుని అనూష మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అనూషను భర్తే హత్యచేశాడంటూ ఆరోపించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు సిబ్బందితో చేరుకుని ఘటనా స్థలిని పరీశీలించారు. మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరన్న.. అనుమానంతోనే భార్య మెడకు ఉరేసి చంపిన అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించినట్లు రూరల్ సీఐ సర్వయ్య తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.తల్లికి తలకొరివి పెట్టిన చిట్టి చేతులు..ఒకవైపు తల్లి హత్యకు గురికాగా, మరోవైపు తండ్రి లేకపోవడంతో ధీనంగా కూర్చున్న చిన్నారి రాజేశ్‌ను చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన చిట్టి చేతులతో తల్లికి తలకొరివిపెట్టి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఈ హృదయ విదారకర ఘటనను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టుకున్నారు. -
మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభ’లో ఆయన మాట్లాడారు. మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రూ.6వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇది మహిళలు ఏది కావాలంటే అది అమలు చేసే ప్రభుత్వమని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతాం: పొంగులేటి ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరు శాతం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన తెలంగాణకో వరం: కోమటిరెడ్డి మూసీ ప్రక్షాళన తెలంగాణకు గొప్ప వరమని, ప్రధానంగా ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న నల్లగొండతో పాటు పలు ప్రాంతాలకు చెందిన లక్షలాది మందికి మేలు జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన గత పాలకు లు మూసీ కోసం రూ.7 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. వైఎస్ స్ఫూర్తితో ముందుకు: సీతక్క, కొండా సురేఖ నాడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహిళా సమాఖ్యలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తే, నేడు వడ్డీలేని రుణాతోపాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అంత గొప్ప దయగల నేత, సీఎం రేవంత్‌రెడ్డి అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి సీఎం కృషి: టీపీసీసీ చీఫ్ వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.6,000 కోట్లు కేటాయించడం చరిత్రలో రికార్డని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. సభలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, సలహాదారు శ్రీనివాసరాజు, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, మధుసూదనాచారి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు రావు: సీఎం రేవంత్
సాక్షి,వరంగల్: బీఆర్ఎస్పై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఫైరయ్యారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. మంగళవారం(నవంబర్ 19)వరంగల్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.‘ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం. 2014-19 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలు మంత్రులుగా ఉన్నారు. పాలకుర్తిలో ఒక రాక్షసుడు రాజ్యమేలుతుంటే కొండను బద్దలు కొట్టినట్లు కొట్టింది ఒక ఆడబిడ్డనే. తెలివిగల తెలంగాణ ప్రజలు అప్రమత్తమై కాంగ్రెస్‌ను గెలిపించారు. కాలోజీ కళాక్షేత్రం కట్టడానికి కేసీఆర్‌కు పదేళ్లు చేతులు రాలేదు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు పోటీ నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం’అని రేవంత్‌రెడ్డి తెలిపారు. -
విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు చేయండి: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను విజయవంతంగా మోసం చేసిందని.. విజయోత్సవాలను కాకుండా అపజయోత్సవాలు నిర్వహించాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకువెళ్లారని.. ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరనుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగాపడ్డారన్నారు. రైతులు దారుణంగా మోసపోయారని రోరపించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు.ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు ఏడాది అయినా అతీగతీ లేదని విమర్శించారు. డిక్లరేషన్‌లో చెప్పిన మొట్టమొదటి హామీ రూ.2లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసా దిక్కులేదని.. ఉపాధిహామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తామన్న 12వేలు ఇవ్వనేలేదన్నారు. పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేశారని విమర్శించారు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ రేవంత్ రెడ్డి? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేండ్ల వెనక్కి వెళ్లిందని.. కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టిందని విమర్శలు గుప్పించారు. -
పోరుగడ్డ నుంచి విజయోత్సవాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవు తున్న సందర్భంగా ఈ నెల 19 నుంచి ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. మంగళవారం వరంగల్‌లో ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఏడాది పాటు సాగ నున్నాయి. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం సాగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తమ పరి ధిలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. తొలిరోజు వరంగల్‌లో జరిగే ప్రజా విజయోత్సవాల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొనను న్నారు. బుధవారం సిరిసిల్ల జిల్లా వేములవాడ, గురువారం మహబూబ్‌నగర్‌లో జరిగే కార్యక్రమా ల్లో కూడా సీఎం పాల్గొననున్నారు. బహిరంగ సభలు జరిగే ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.వరంగల్‌లో లక్షమందితో సభప్రజా పాలన విజయోత్సవాలకు ఓరుగల్లు ముస్తా బైంది. లక్ష మంది మహిళలతో మంగళవారం బహి రంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. వేడుకలు నిర్వహించే హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానానికి ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా నామకరణం చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, ధనసరి సీతక్క, కొండ సురేఖ సహా మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొననున్నారు.సీఎం షెడ్యూల్ ఇదీ..సీఎం రేవంత్ మధ్యాహ్నం 2:30 గంటలకు హెలికాప్టర్లో హనుమకొండ కుడా గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. 3 గంటలకు ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేదికకు చేరుకుంటారు. 3:20కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి.. మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యల సభ్యులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు అక్కడి నుంచే వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, బీమా చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 సమయంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
కళామ తల్లికి దివ్య మణిహారం
హనుమకొండ అర్బన్: కళామతల్లి శిఖలో మరో మణిహారం కొలువుదీరనుంది. కళల కాణాచి వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత ప్రజా కవి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించను న్నారు. అధునాతన హంగులు, రాజసం ఉట్టిపడేలా రూ.95 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణం ఆకట్టుకుంటోంది. తెలంగాణ కళా, సాంస్కృతిక రంగానికి ఈ క్షేత్రం ఓ మణిహారంగా మారనుంది. ప్రధాన ఆకర్షణలివీ..» హనుమకొండ బాలసముద్రంలోని సర్వే నంబర్ 1066 ‘కుడా’ (హయగ్రీవాచారి కాంపౌండ్) భూమిలో 4.20 ఎకరాల్లో నిర్మించారు. » 1.77 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. » 1,127 మందితో ప్రధాన ఆడిటోరియం సీటింగ్ సామర్థ్యం » సెంట్రలైజ్డ్ ఏసీతో అత్యాధునిక ఆడియో, విజువల్ సిస్టమ్‌తో ప్రదర్శనలు » చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాల కోసం ప్రత్యేకంగా నాలుగు మినీ హాళ్లు » గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో కాళోజీ నారాయణరావు ఫొటోలు, జ్ఞాపకాలు, పురస్కారాలను ప్రదర్శిస్తారు. -
ఈ సినిమా గిట్ట ఆడకపోతే.. ఇలాంటి మాటలు వద్దు ఇక: విశ్వక్ సేన్ కామెంట్స్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మాస్ యాక్షన్‌తో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో హిట్ కొట్టిన యంగ్ హీరో మళ్లీ అలరించేదుకు రెడీ అయ్యాడు. యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో గుంటూరు కారం భామ మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వరంగల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా హిట్ కొట్టినా.. ఫ్లాఫ్ అయినా నేను సినిమాలు తీయడం ఆపేది లేదని ఛాలెంజ్ విసిరారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'మీకు ఎప్పటిలాగే ఛాలెంజ్ విసరాలా? ప్రతి సినిమాకు ఛాలెంజ్ కావాలా? మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమా గిట్ట ఆడకపోతే షర్ట్ లేకుండా చెక్‌పోస్ట్‌లో తిరుగుతా.. ఫిల్మ్ నగర్లో ఇల్లు ఖాళీ చేస్తా.. ఇకపై ఇలాంటివీ నేను మాట్లాడదలచుకోవట్లేదు. సినిమా హిట్ అయినా.. ఫ్లాఫ్ అయినా నా చొక్కా నా ఒంటిమీదనే ఉంటది.. నా ఇల్లు జూబ్లీహిల్స్లోనే ఉంటది.. నేను ఇంకో సినిమా చూస్తా. అది ఉన్నా.. దొబ్బినా మళ్లీ మళ్లీ సినిమా తీస్తా. పూరి జగన్నాధ్ రాసినట్టు, రవితేజ అన్న చెప్పినట్లు మాకు తెలిసిందల్లా ఒక్కటే.. సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టిన ఈ మూవీ తీసినం' అంటూ మాట్లాడారు. కాగా.. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. -
‘మామునూరు’లో మరో ముందడుగు
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రన్‌వే విస్తరణకు కావాల్సిన 205 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు స్వాదీనం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌కు సూచించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దశల వారీగా సమీక్షించి, మామునూరు విమానాశ్రయ స్థల సేకరణలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించడం, రోజుల వ్యవధిలోనే స్థల సేకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయించడంతో విమానాశ్రయ పనుల్లో ముందడుగు పడినట్టయ్యింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డీపీఆర్ వేగంగా సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆర్అండ్బీ శాఖ లేఖ కూడా రాసింది. వరంగల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రానున్న నేపథ్యంలో విమానాశ్రయానికి సంబంధించి ముందడుగు పడడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నెల రోజుల్లోనే పురోగతి ఇలా.. » ఈ ఏడాది అక్టోబర్ 23న రాజీవ్‌గాంధీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో బోర్డు మీటింగ్ నిర్వహించారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందాన్ని జీఎమ్మాఆర్ సంస్థ విరమించుకుంది. » ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి అధ్యక్షతన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. » మంత్రి కొండా సురేఖతోపాటు ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, ఎంపీ కడియం కావ్య తదితరులు భూనిర్వాసితులతో సమావేశమై వారి డిమాండ్లను కలెక్టర్‌కు విన్నవించాలని కోరారు. » ఆ తర్వాత కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యాన రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచడంతో అందుకు కావాల్సిన రూ.205 కోట్ల నిధులను మంజూరు చేసింది. సాధ్యమైనంత తొందరగా భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందరి దృష్టి పరిహారంపైనే.. ఎయిర్‌పోర్ట్‌కు సేకరించే భూములకు సంబంధించి ఎకరాకు గవర్నమెంట్ వ్యాల్యూ రూ.6లక్షలు ఉంది. భూనిర్వాసితులకు పరిహారం మూడింతలు చెల్లించాలనుకున్నా ఎకరాకు రూ.18 లక్షలు ఇచ్చే అవకాశముంది. రెవెన్యూ అధికారులు రూ.25 లక్షల వరకు చెల్లించే దిశగా ఆలోచన చేస్తున్నారు. రైతుల నుంచి ఒత్తిడి ఎక్కువైతే తమ విచక్షణాధికారాలు ఉపయోగించి ఇంకాస్త పెంచాలని యోచిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుండడంతో రైతుల నుంచి ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని అధికారులు హైరానా పడుతున్నారు. మరోవైపు ఎన్ని వ్యవసాయ బావులు, బోర్లు పోతున్నాయనే వివరాలను సోమవారం నుంచి రెవెన్యూ అధికారులు సేకరించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన తర్వాత ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించి పరిహారంపై స్పష్టతనిచ్చే అవకాశముంది. -
కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డనేనా?: మంత్రి పొన్నం
సాక్షి, వరంగల్: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలని కోరారు. కేంద్రం నుంచి రూపాయి తీసుకొచ్చే శక్తి లేని ఆయన.. తన మొద్దు నిద్ర వీడాలని సూచించారు.కిషన్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని, ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? అని నిలదీశారు. కలెక్టర్‌ను కొట్టిన వారిని సమర్థిస్తున్న మీరు కేంద్రమంత్రి పదవికి అర్హులేనా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఐఏఎస్పైన దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం బాధాకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారులను కొట్టిన వాళ్లు, కొట్టించిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. -
19న వరంగల్‌కు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 19న వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. స్వయం సహాయ బృందాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో సమావేశమై ఆ గ్రూపులకు సంబంధించిన ఆస్తుల పంపిణీ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు సచివాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి వరంగల్ పర్యటన రూట్ మ్యాప్, వేదిక ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. సభకు వచ్చే మహిళలు ఎక్కువ దూరం నడవకుండా పక్కాగా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను కోరారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు, పిల్లల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల చిత్రాలను సభ వద్ద ప్రదర్శించాలని సూచించారు. సీఎం సభ, ఇతర కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని కోరారు. నేడు, రేపు మహారాష్ట్రలో సీఎం ఎన్నికల ప్రచారం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శని, ఆదివారాల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటారు. అక్కడ నుంచి చంద్రాపూర్‌లో స్థానిక నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వరుసగా రాజురా, డిగ్రాస్, వార్దానియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొని రాత్రికి తిరిగి నాగ్పూర్చేరుకుంటారు. రెండోరోజు ఆదివారం ఉదయం నాగ్‌పూర్ నుంచి నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నయగావ్, భోకర్, షోలాపూర్నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అదే రోజు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. -
ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలి.. ఫ్లాట్ హెయిర్ కట్ నచ్చడం లేదు!
‘మాకు హీరో ప్రభాస్‌లాగా హెయిర్ స్టైల్ కావాలి.. జుట్టు పొడుగ్గా పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలి.. గాజులు వేసుకొనేందుకు పర్మిషన్ ఇవ్వాలి. టీచర్ల మాదిరిగా చీరలు కట్టుకోవాలని ఉంది’.. వరంగల్ జిల్లా రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్లలో సమస్యలు తెలుసుకొనేందుకు అధికారులు ఏర్పాటుచేసిన ఫిర్యాదుల బాక్సుల్లో విద్యార్థులు వేసిన వినతులు ఇవి. ఆహారం బాగా లేదనో, హోం వర్క్ ఎక్కువ ఇస్తున్నారో, పుస్తకాలు లేవనో ఫిర్యాదులు వస్తాయని అధికారులు ఆశించారు. కానీ, ఫిర్యాదు బాక్సుల్లో మాత్రం ఇలాంటి వినతులు కనిపించాయి.దీనిపై ఓ విద్యార్థిని ఒక సీనియర్ అధికారి ప్రశ్నించగా.. ‘స్థానిక బార్బర్ అబ్బాయిలందరికీ ఒకే రకమైన ఫ్లాట్ హెయిర్ కట్ ‘తాపేలి కట్’చేస్తున్నాడు. అది నచ్చడం లేదు. అందుకే హీరోల వంటి హెయిర్ కట్ కావాలని కోరాం’ అని తెలిపాడు. ఈ విషయంలో వారు సీరియస్‌గానే ఉన్నారని ఆ అధికారి చెప్పారు. ‘ఈ పిల్లలకు ఫోన్లు అందుబాటులో లేవు. తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడలేరు. అందుకే ఫిర్యాదు పెట్టెలను పెట్టించాం. వీళ్ల ఫిర్యాదులు ఆసక్తికరంగా ఉన్నాయి. తమ భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు’అని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కొంతమంది విద్యార్థులు పాఠశాలలో పూజలు ఏర్పాటు చేయాలని కోరారు. కొంతమంది విద్యార్థినులు సీనియర్లు తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్రభావమే... ఇదంతా సోషల్ మీడియా ప్రభావమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ‘క్యాంపస్‌లలో ఫోన్లను అనుమతించనప్పటికీ, చాలా పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ ల్యాబ్‌లు ఉన్నాయి. వాటి ద్వారా పిల్లలు సోషల్ మీడియాలో లేటెస్ట్ ట్రెండ్లను తెలుసుకుంటున్నారు. వాళ్లు తమ మనసులోని మాటలను చెప్పడం మంచిదే. వాళ్లపై ఏవి ప్రభావం చూపుతున్నాయో తెలియాలి’ అని పాఠశాల పిల్లలతో కలిసి పనిచేసే డెవలప్మెంట్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఒకరు చెప్పారు. కోవిడ్ –19కి ముందు ఎక్కువ ఫిర్యాదులు ఆహారం నాణ్యత, ఉపాధ్యాయుల శిక్షణ గురించి ఉండేవని.. ఇప్పుడు ఇలా ఉంటున్నాయని చెప్పారు.చదవండి: ముద్ద అన్నం.. తింటే కడుపు నొస్తోంది -
12 వేల మంది రైతులేరీ?
సాక్షి, వరంగల్: అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందాలన్న ఉద్దేశంతో చేపట్టిన కుటుంబ నిర్ధారణ ప్రక్రియ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. ఇందుకు అనేకమంది రైతులు స్థానికంగా లేకపోవడం ఒక కారణం. మరణించిన రైతు పేరుపై రుణమాఫీ ఉండడంతో సదరు మరణ ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డుతో సరిపోకపోవడం, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ముందుకు రాకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 12 వేల మంది రైతుల కుటుంబ నిర్ధారణ కాలేదని సమాచారం. కాగా మొత్తం 48,297 కుటుంబాలకు.. ఇప్పటి వరకు 36,279 కుటుంబాల నిర్ధారణ జరిగింది. ఈ వివరాలను ఆయా రైతుల కుటుంబాలతో సెల్ఫీ ఫొటోలను కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరడంతో.. నిర్ధారణ కాని 12 వేల మంది రైతులకు రుణమాఫీ వర్తించదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా చేసిన ఈ సర్వేతో.. చాలామంది సమయానికి రాలేక రుణమాఫీకి దూరమవుతున్నారని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు దశల్లో 2.63 లక్షల మందికి రూ.2,312 కోట్ల రుణమాఫీ చేయడం తెలిసిందే. ఏ జిల్లాలో ఎంత మంది రైతులు..వరంగల్ జిల్లాలో 8,252 మంది రైతులకు 6,263 మంది, హనుమకొండలో 8,359 మంది రైతులకు 6,934 మంది, జనగామలో 9,947 మంది రైతులకు 7,762 మంది, మహబూబాబాద్‌లో 10,937 మంది రైతులకు 6,652 మంది, భూపాలపల్లిలో 5,815 మంది రైతులకు 4,713 మంది, ములుగు జిల్లాలో 4,987 మంది రైతులకు 3,955 రైతు కుటుంబ సభ్యుల నిర్ధారణను వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. మొత్తంగా దాదాపు 12 వేల మంది రైతుల వివరాలు నమోదు కాలేదు. రుణమాఫీకి అర్హులైనా రేషన్ కార్డు లేకపోవడంతో అనేకమందికి రుణమాఫీ వర్తించలేదనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన కుటుంబాల నిర్ధారణ చేపట్టినట్టు వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. రైతులకు ముందస్తు సమాచారం అందించి పంచాయతీ, రైతు వేదికల్లో రేషన్ కార్డు లేని కుటుంబ సభ్యుల నిర్ధారణ చేపట్టామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరితో సెల్ఫీ తీసుకొని ఆన్లైన్లో వివరాలు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ సమయంలోనే స్థానికంగా ఉండకపోవడం, ఆధార్ కార్డు సమస్యలు, కొందరు విదేశాల్లో ఉండడం తదితర కారణాలతో కొన్ని కుటుంబాలు నిర్ధారణకు దూరంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే కుటుంబ నిర్ధారణ జరిగిన రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము ఎప్పుడు వేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. -
ఉపాధ్యాయులూ మేల్కొనండి!
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గడువు దగ్గర పడుతున్నా.. ఓటు నమోదుపై ఉపాధ్యాయులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.నవంబర్ 6 వరకు గడువు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30న ఓటరు నమోదు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 6వ తేదీ ఆఖరు తేదీగా ప్రకటించింది. గత ఎన్నికల ఓటరు జాబితా రద్దు చేశామని.. గతంలో ఓటు ఉన్న వారు కూడా తిరిగి నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు చెప్పారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఓటర్ నమోదుకు అవకాశం కల్పించారు. ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు దాటింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. అందులో ఇప్పటి వరకు 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. పెరిగిన ఉపాధ్యాయుల సంఖ్యఓటరు నమోదుకు ఆఖరి తేదీ నవంబరు 6. ఇంకా 10 రోజులు మాత్రమే గడువుంది. గత ఎన్నికల్లో 20,880 మంది ఓటర్లు ఉన్నందువల్ల ఈసారి ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది. ఓటర్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రధానంగా హైస్కూల్ ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, బీఈడీ కళాశాలల అధ్యాపకులతోపా టు ప్రభుత్వ రికగ్నైజ్డ్ హైస్కూళ్లు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఓటర్ నమోదుపై స్పందించాల్సి ఉంది. నివాసమే ప్రామాణికం..ఓటర్లుగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల నమోదు గడువు నవంబర్ 1 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తేదీ కంటే ముందు కనీసం 3 ఏళ్లు కచ్చితంగా బోధించి ఉండాలి. ఎన్నిచోట్ల పని చేసినప్పటికీ 3 ఏళ్లు బోధించినట్లు సర్వీస్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత విద్యాశాఖాధికారి సంతకం తప్పనిసరిగా ఉంటేనే ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతాన్నే ఎన్నికల సంఘం ఓటర్ నమోదుకు ప్రామాణికంగా నిర్ణయించింది. ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ చిరునామా ఆధారంగా ఓటు నమోదు చేసుకోవాలి. బోధన ఎక్కడ చేసినప్పటికీ అది ప్రామాణికం కాదు. ఉదాహరణకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నల్లగొండలో నివసిస్తున్న వ్యక్తి వరంగల్ జిల్లాలో పనిచేస్తే.. ఆ వ్యక్తి నల్లగొండ చిరునామాతోనే ఓటు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లో ఎక్కడైనా ఉపాధ్యాయుడు పని చేస్తూ.. కరీంనగర్ జిల్లాలో నివసిస్తుంటే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఓటు నమోదుకు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా వారి చిరునామాకు వెళ్లి.. దరఖాస్తుదారు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడా? లేడా? అనేది సిబ్బంది పరిశీలించాలి. ఒకవేళ అక్కడ నివాసం లేకుంటే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. ఉపాధ్యాయులు ఎక్కడ నివాసం ఉంటే.. అక్కడ ఓటు నమోదు చేసుకుంటేనే ఆ దరఖాస్తు చెల్లుబాటవుతుంది. నివాసం ప్రామాణికంగానే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి కోరుతున్నారు. -
మేడారం మినీ జాతర తేదీలు ఖరారు
సాక్షి, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పేరుగావించిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర జరగనుంది. ఈ మేరకు శనివారం సమావేశమైన మేడారం పూజారులు.. మినీ జాతర తేదీలను ప్రకటించారు. జాతరకు సంబంధించిన ఏర్పాటు ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖను మేడారం పూజారుల సంఘం కోరింది.కాగా ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలోనే వచ్చే భక్తులు ప్రస్తుతం ఏడాది పొడవునా తమకు అనుకూలమైన సమయంలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి వేల సంఖ్యలో తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనంలో కొలువైన వనదేవతలు జనం మధ్యకు రావడంతో అడవి అంతా జనసంద్రమవుతుంది. మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
పిక్నిక్ ప్లాన్ చేస్తున్నారా.. సరికొత్త హంగులతో లక్నవరం తప్పక చూడాల్సిందే (ఫొటోలు)
-
హైదరాబాద్–వరంగల్ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా విస్తరిస్తున్న వరంగల్‌కు భారీగా ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. త్వరలో ఇవి రాకపోకలు సాగించనుండగా, దశలవారీగా మొత్తం 82 ఎలక్ట్రిక్ బస్సులను వరంగల్–హైదరాబాద్ మధ్య నడపనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ (18), డీలక్స్ (14), సెమీ డీలక్స్ (21), ఎక్స్‌ప్రెస్ (29) కేటగిరీ బస్సులున్నాయి. ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ఈ బస్సులను నిర్వహిస్తుంది. తెలంగాణలో తొలిసారి ఒలెక్ట్రా కంపెనీ బ్యాటరీ బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ రెండు పర్యాయాలు బస్సులను సరఫరా చేసి నిర్వహిస్తోంది. మూడో ప్రయత్నంలో ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ టెండర్ దక్కించుకుంది. ఇటీవలే కొన్ని బస్సులను కరీంనగర్, నిజామాబాద్ నుంచి ప్రారంభించింది. కానీ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత జనాభా, విస్తీర్ణం పరంగా పెద్ద పట్టణమైన వరంగల్‌కు ఎక్కువ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు 82 బస్సులు కేటాయించారు. వీటిని వరంగల్–2 డిపో ఆధ్వర్యంలో నడుపుతారు. సింహభాగం బస్సులు హైదరాబాద్‌కే.. హైదరాబాద్–వరంగల్ మధ్య బస్సులు ఎక్కువగా ఉంటాయి. నిత్యం రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటుండటంతో ఎక్కువ సర్వీసులు తిప్పుతారు. ఈ నేపథ్యంలోనే రెండు ప్రాంతాల మధ్య అదనంగా కొత్త బస్సులను తిప్పాలని సంస్థ నిర్ణయించింది. జేబీఎం సరఫరా చేసేవరకు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతున్నారు. కాగా తొలిసారి హైదరాబాద్ వెలుపల (హైదరాబాద్–విజయవాడ కాకుండా) ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఇక వరంగల్‌కు సరఫరా చేసే ఎలక్ట్రిక్ బస్సుల్లో మూడొంతులు హైదరాబాద్ రూట్లోనే తిప్పనున్నారు. వరంగల్–2 డిపోలో సిద్ధం చేసిన సెంటర్లో బ్యాటరీ చార్జ్ చేసి పంపిన తర్వాత, తిరుగు ప్రయాణం కోసం మళ్లీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో చార్జింగ్ పాయింట్లు ఉన్నందున హైదరాబాద్‌కే ఎక్కువ బస్సులు తిప్పనున్నారు. కరీంనగర్, నిజామాబాద్‌ల్లో ఇప్పటికే చార్జింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. దీంతో కొన్ని బస్సులను వరంగల్ నుంచి ఆ రెండు నగరాలకు కూడా నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు తిప్పనున్నందున.. ప్రస్తుతం హైదరాబాద్–వరంగల్ మధ్య నడుస్తున్న డీజిల్ బస్సుల్లో కొన్నింటిని తప్పించి వరంగల్ నుంచి ఇతర ప్రాంతాల మధ్య నడపనున్నారు. -
కాంగ్రెస్‌లో ‘కొండా’ వర్గం కలకలం.. హస్తినకు హస్తం నేతలు
వరంగల్, సాక్షి: వరంగల్‌లో కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కాయి. రేపు (గురువారం) ఢిల్లీ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పయనం కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ను ఎమ్మెల్యేలు కోరినట్ల సమాచారం. మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ వర్గం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోండా సురేఖపై ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.చదవండి: TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా -
బతుకమ్మ పుట్టినిల్లు!
సాక్షి, వరంగల్: బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ పూల వేడుక. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం. ఈ మేరకు పలు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ గుర్తింపునకు చిహ్నంగానే ఆ ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో బతుకమ్మ ఆలయం నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. శ్రీశాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ కళావిరాట్ డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ గ్రామం బతుకమ్మకు పుట్టినిల్లని పలు చారిత్రక పరిశోధనల్లో తేల్చారు. అటు రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇటు కేంద్ర పర్యాటక శాఖను సమన్వయం చేసుకుంటూ, ఎన్ఆర్ఐలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించే బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతా అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించే దిశగా అడుగులు పడతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణమైతే ఓవైపు ఆధ్యాతి్మకంగా, మరోవైపు పర్యాటకంగా చౌటపల్లి విరాజిల్లనుంది. ఇప్పటికే చారిత్రక నగరంగా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో మరో చారిత్రక ప్రాంతం చేరనుంది. రూ.100 కోట్లతో ఆలయ నిర్మాణం గ్రామంలోని పదెకరాల్లో నిర్మించే బతుకమ్మ గుడికి రూ.100 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రూ.70 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా.. రూ.30 కోట్ల మేరకు భక్తుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే చౌటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేసిన బెంగళూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ దాఖోజు రవిశంకర్ దాదాపు రూ.15 కోట్లు బతుకమ్మ గుడి నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. బతుకునిచ్చిన అమ్మ!17వ శతాబ్దంలో తెలంగాణను నిజాం నవాబులు పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో ఓరుగల్లు పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వంగాల రామయ్య 16వ ఏటనే నిజాం ప్రభువులకు చెందిన వెండి నాణేల ముద్రణ కర్మాగారంలో పనిచేస్తూ అనతికాలంలోనే పాలకులను ఆకట్టుకొని కొంత మాన్యం పొందారు. ఆ ప్రాంతమే ఇప్పటి పర్వతగిరి మండలంలోని చౌటపల్లి. రామయ్య ఆ స్థలంలో ప్రజల సౌకర్యార్థం చెరువు తవ్వించి వసతులు కల్పించారు. సౌటమట్టి కలిగిన ప్రాంతం కనుక సౌటపల్లిగా, కాలక్రమంలో చౌటపల్లిగా మారింది. కొంత కాలానికి చౌటపల్లి గ్రామ శివారు గ్రామాల ప్రజలు కలరా సోకి చనిపోతున్నారని తెలిసి గ్రామ ప్రజలు రామయ్యను సంప్రదించారు. సమస్య పరిష్కారానికి ఆయన గాయత్రిదేవిని ఉపాసించాడు. ఆ తల్లి నామస్మరణలో మూడు రోజులు గడిపాడు. దీంతో గాయత్రీమాత ఆయనకు స్వప్నంలో కనిపించింది. అశరీర వాణిగా గ్రామ సౌభాగ్యానికి తన సంతానాన్ని ఆర్పించాలని, ప్రత్యేక పూజా విధానం, పాత్ర కాని పాత్రలో ఎంగిలిపడని పూలను పేర్చి గౌరీమాత స్వయంగా వెలుగొందిన గుమ్మడి పూలను పేర్చాలి. పేర్చిన పూలపై పెట్టి గౌరీమాతను నవదినాలు గ్రామంలో అందరూ కలిసి పూజించాలని ప్రబోధించినట్లు ప్రచారంలో ఉంది. బతుకునీయమ్మా.. బతికించమ్మా అనే పదాల నుంచే బతుకమ్మ అవిర్భవించిందని చెబుతున్నారు. దీనిపై చారిత్రక పరిశోధన చేసిన డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ వివరాలన్నీ పుస్తక రూపంలోకి తెచ్చారు. యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడి.. 40 ఏళ్ల పాటు నేను చేసిన చారిత్రక పరిశోధనలతో చౌటపల్లి బతుకమ్మ పుట్టినిల్లుగా తేలింది. అందుకే ఇక్కడా యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడిని నిర్మించాలనుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణ నమూనాకు యాదాద్రి టెంపుల్ డిజైనర్ ఆనంద్‌సాయి, స్థపతిగా పద్మశ్రీ వేణు ఆనందాచార్య వ్యవహరిస్తారు. తెలంగాణ తల్లి రూపశిల్పి బైరోజు వెంకటరమణాచార్యులు (బీవీఆర్ చార్యులు) ఇప్పటికే బతుకమ్మ చిత్రపటాన్ని విడుదల చేశారు. 2019లోనే బతుకమ్మపై బృంద నృత్యం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించాం. బతుకమ్మ గుడి నిర్మాణం పూర్తయ్యే వరకు అకుంఠిత దీక్షతో పనిచేస్తా. – డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య, శ్రీ శాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు -
వరంగల్ కేఎంసీలో డ్యాన్స్.. జోష్ (ఫొటోలు)
-
బీఆర్ఎస్ కుట్రలో భాగమే వరంగల్ ఆరు ముక్కలు: కడియం శ్రీహరి
సాక్షి, జనగామ: తెలంగాణలో అవినీతి, అక్రమాలకు మారుపేరు బీఆర్ఎస్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అలాగే, వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే జిల్లాను ఆరు ముక్కలు చేశారని చెప్పుకొచ్చారు. జిల్లాను ముక్కలు చేయవద్దు అన్నందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వమే కాలరాసింది. అవినీతి, అక్రమాలకు బీఆర్ఎస్ మారుపేరు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నారు. అందులో భాగంగానే జిల్లాను ఆరు ముక్కలు చేశారు. దీనిపై ప్రశ్నించినందుకే రెండో సారి నాకు మంత్రి పదవి ఇవ్వలేదు.కేసీఆర్ కుటుంబ చేతిలో తెలంగాణ బంధీ అయ్యింది. బీఆర్ఎస్ నేతలు సిగ్గులేకుండా ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇప్పట్లో తెలంగాణలో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. స్టేషన్ ఘనపూర్‌లో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదు. కోర్టులు, ప్రజాస్వామ్యంపై మాకు గౌరవం ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్.. అక్కడ భవనం కూల్చివేత -
Deepthi Jeevanji: గేలిచేస్తే గెలిచేసి...
పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో మన వరంగల్ బిడ్డ దీప్తి జీవాన్జీ కాంస్యం సాధించింది. 400 మీటర్ల టి20 విభాగంలో ఆమె ఈ ఘనతను లిఖించింది. పారా ఒలింపిక్స్‌లో ఏ విభాగంలో అయినా పతకం సాధించిన అతి చిన్న వయస్కురాలు దీప్తే. ఊర్లో అందరూ వెక్కిరించినా హేళనతో బాధించినా వారందరికీ తన విజయాలతో సమాధానం చెబుతోంది దీప్తి. ఒకనాడు హేళన చేసిన వారు నేడు ఆమె పేరును గర్వంగా తలుస్తున్నారు.మొన్నటి మంగళవారం (సెప్టంబర్ 3) పారిస్ పారా ఒలింపిక్స్‌లో దీప్తి పరుగు తెలుగు వారికీ దేశానికి గొప్ప సంతోషాన్ని గర్వాన్ని ఇచ్చింది. 400 మీటర్ల టి20 (బుద్ధిమాంద్యం) విభాగంలో దీప్తి 55.52 సెకండ్లలో మూడోస్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ ΄ోటీలో మొదటి స్థానంలో ఉక్రెయిన్‌కి చెందిన యూలియా (55.16 సెకండ్లు), రెండవ స్థానంలో టర్కీకి చెందిన ఐసెల్ (55.23) సెకన్లు నిలిచారు. ఇంకొన్ని సెకన్లలో ఆమెకు స్వర్ణమే వచ్చేదైనా ఈ విజయం కూడా అసామాన్యమైనదే ఆమె నేపథ్యానికి.షూస్ లేని పాదాలుదీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. పుట్టుకతో దీప్తి బుద్ధిమాంద్యంతో ఉంది. ఆమె రూపం కూడా పూర్తిగా ఆకారం దాల్చలేదు. దాంతో స్కూల్లో చుట్టుపక్కల అన్నీ హేళనలే. మాటల్లో వ్యక్తపరచడం రాని దీప్తి అన్నింటినీ మౌనంగా సహించేది. కొందరు ‘కోతి’ అని వెక్కిరించేవారు. స్కూల్లో ఆమె ఆటల్లో చరుకుదనం చూపించేసరికి తల్లిదండ్రులు కనీసం ఈ రంగంలో అయినా ఆమెను ్ర΄ోత్సహిస్తే కొంత బాధ తగ్గుతుందని భావించారు. పిఇటీ టీచర్ బియాని వెంకటేశ్వర్లు ఆమెను ్ర΄ోత్సహించారు. హనుమకొండలో స్కూల్ లెవల్లో ఆమె పరుగు చూసి ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ ్ర΄ోత్సహించాడు. రాష్ట్రస్థాయి ΄ోటీలకు హైదరాబాద్ రమ్మంటే షూస్ లేకుండా ఖాళీ పాదాలతో వచ్చిన దీప్తికి సహాయం అందించేందుకు నాగపురి రమేశ్ పూర్తి దృష్టి పెట్టాడు. దాంతో అంచలంచెలుగా ఎదిగిన దీప్తి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. పుల్లెల గోపిచంద్ కూడా ఆమె శిక్షణకు ఆర్థిక సహాయం అందించారు.బంగారు పరుగు2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. అదే సంవత్సరం బ్రిస్బే¯Œ ఆసియానియా ΄ోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిపతకం గెలిచింది. 400 మీటర్లను 57.58 సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మే 2024లో జపాన్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు పారిస్‌లో కాంస్యం సాధించడంతో ఆమె దేశ పతాకాన్ని తల ఎత్తుకునేలా చేసింది. ఒకప్పుడు గేలి చేసిన ఊరికి ఆమె పేరు ఇప్పుడు చిరునామాగా మారింది. -
లక్ష్య సాధకులు.. యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన అన్నదమ్ములు!
వరంగల్: ఆ అన్నదమ్ములు.. ఉన్నత ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నారు. దీనికి ఓ లక్ష్యం విధించుకున్నారు. ఈ మార్గంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా తట్టుకుని ప్రణాళిక ప్రకారం చదివి గమ్యం చేరుకున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా యూపీఎస్సీ ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు ఈ గిరిపుత్రులు. వారే నర్సంపేట పట్టణానికి చెందిన ఆంగోత్ భద్రయ్య–అరుణ దంపతుల కుమారులు సంతోశ్, ఆనంద్. ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫలితాల్లో సంతోశ్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌లో మైనింగ్ ఇంజనీర్, ఆనంద్ కేంద్ర కార్మిక శాఖలో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగం సాధించారు. ఒక ఉద్యోగం సాధించడమే కష్టంగా మారిన ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేసూ్తనే మరో ఉద్యోగానికి అదీ జాతీయ స్థాయి ఉద్యోగాలకు సన్నద్ధమై సాధించడం గొప్ప విశేషం.విద్యాభ్యాసం..సంతోశ్, ఆనంద్ ఇద్దరూ ప్రాథమిక విద్యను నర్సంపేటలో పూర్తి చేశారు. సంతోశ్ పదో తరగతి హనుమకొండ, ఇంటర్ హైదరాబాద్, కర్ణాటక ఎన్ఐటీలో ఇంజనీరింగ్, జైపూర్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం అల్ట్రాటెక్ సిమెట్స్ (ఆదిత్య బిర్లా)లో ఇంజనీర్‌గా, కొంత కాలం పేటీఎం సంస్థలో, జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థలో రెండు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. సివిల్స్ లక్ష్యంగా ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారు. ఒక పక్క ఉద్యోగం చేసూ్తనే.. మరోపక్క ఖాళీ సమయంలో పోటీ పరీక్షకు సన్నద్ధమై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌లో ఇంజనీర్ కొలువు సాధించారు. ఆనంద్ పదో తరగతి బిట్స్ స్కూల్, ఇంటర్, ఇంజనీరింగ్ హైదరాబాద్, వరంగల్ ఎన్ఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు. టీసీఎస్‌లో స్టాఫ్‌వేర్, ఆ తర్వాత చెన్నై పెట్రోలియం సంస్థలో హెచ్ఆర్ అధికారిగా పని చేసూ్తనే యూపీఎస్సీ ద్వారా కార్మిక శాఖలో ఉద్యోగం సాధించాడు.తల్లిదండ్రులు భద్రయ్య–అరుణతో ఆనంద్, సంతోశ్ (ఫైల్)ప్రణాళిక ప్రకారం చదివి.. లక్ష్యం చేరుకుని..ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడిన తమ బాబాయ్‌లు, తల్లిదండ్రులను సంతోశ్, ఆనంద్ ఆదర్శంగా తీసుకున్నారు. యూపీఎస్సీలో ఉన్నత ఉద్యోగం సాధించాలని లక్ష్యం విధించుకున్నారు. ఈ నేపథ్యంలో సంతోశ్ రెండు దఫాలు( గ్రూప్–ఏ) ప్రిలిమ్స్, మెయిన్స్ వరకు వెళ్లారు. అయితే ఆ ఫలితాలు నిరాశకు గురిచేశాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా మూడో ప్రయత్నంలో (గ్రూప్–బీ) గమ్యం చేరుకున్నాడు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌లో మైనింగ్ ఇంజనీర్ కొలువు సాధించాడు. ఇక ఆనంద్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. కేంద్ర కార్మిక శాఖలో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగం సాధించారు. ఈ అన్నదమ్ములు సుమారు సంవత్సరం కాలం పుస్తకాలతో దోస్తీ పట్టారు. ఎప్పుడూ చదువు ధ్యాసే. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యం చేరుకున్నారు. ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచారు.కుటుంబ నేపథ్యం..సంతోశ్, ఆనంద్ తల్లిదండ్రులు ఆంగోత్ భద్రయ్య–అరుణ దంపతులది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం భోజెర్వు గ్రామం జగ్గుతండా. భద్రయ్య తల్లిదండ్రులు ఆంగోత్ చీమా–మల్కమ్మ. ఈ దంపతులకు నలుగురు కుమారులు భద్రయ్య, తారాసింగ్, మోహన్, విజేందర్ ఉన్నారు. భద్రయ్య టీచర్‌గా, తారాసింగ్ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా, మోహన్ పిల్లల వైద్య నిపుణుడిగా, విజేందర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో తమ తండ్రి తప్ప అందరూ డాక్టరేట్‌లుగా ఉన్న తమ బాబాయ్‌లను స్ఫూర్తిగా తీసుకున్న సంతోశ్, ఆనంద్.. చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తూ వచ్చారు. ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం నర్సంపేటలో స్థిరపడింది. సంతోశ్, ఆనంద్ తల్లి అరుణ వైద్య ఆరోగ్యశాఖలో ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్–1 అధికారి, తండ్రి భద్రయ్య చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్నారు.