వరంగల్‌-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి | Road Accident On Warangal-Khammam Highway | Sakshi
Sakshi News home page

వరంగల్‌-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Published Sun, Jan 26 2025 11:59 AM | Last Updated on Sun, Jan 26 2025 12:16 PM

Road Accident On Warangal-Khammam Highway

సాక్షి, వరంగల్‌: వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

వివరాల ప్రకారం.. ఖిల్లా వరంగల్‌ మామునూరు నాలుగో బెటాలియన్ సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ సందర్భంగా రెండు ఆటోలపై లారీ పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. అయితే, లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement