
మరో కొత్త తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ దాదాపు 30కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటిలో ఓదెల 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్ తదితర తెలుగు చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ కూడా ఎలాంటి హడావుడి లేకుండా డిజిటల్ గా అందుబాటులోకి వచ్చింది.
కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. తల్లి కొడుకు సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో తీసిన ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కి ముందు చాలా హడావుడి చేశారు గానీ మూవీలో అంత సీన్ లేకపోయేసరికి ఓ మాదిరి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా)
ఇకపోతే ఇప్పుడు మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ.. యూకేలో ఉన్నవాళ్లు అద్దె విధానంలో మాత్రమే చూడొచ్చు. రాబోయే శుక్రవారం లేదా గురువారం ఇండియాలో అందుబాటులోకి రావొచ్చేమో?
అర్జున్ సన్నాఫ్ వైజయంతి విషయానికొస్తే.. సీన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి). ఈమెకు ఓ కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్). ఐపీఎస్ అవ్వడానికి రెడీగా ఉన్న ఇతడు.. తండ్రిని ఓ క్రిమినల్ చంపేశాడని పగతో రగిలిపోతుంటాడు. తల్లికి ఇదంతా ఇష్టముండదు. అనుకోని పరిస్థితిలో అర్జున్ ఆ హంతకుడిని అందరూ చూస్తుండగా చంపుతాడు. అప్పటి నుంచీ తల్లీకొడుకుల మధ్యలో ఒక గ్యాప్. చివరకు ఏమైంది? తల్లికొడుకులు కలిశారా? అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్)