vijaya shanthi
-
ఎన్టీఆర్‌కూ ఇచ్చి ఉండాల్సింది: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పలువురికి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ సీఎం సీనియర్ ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ఇచ్చి ఉంటే తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచేదని ఆమె కామెంట్స్ చేశారు. కాగా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ క్రమంలో విజయశాంతి ట్విట్టర్ వేదికగా..‘భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం. భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించిఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని… pic.twitter.com/Q95K2oFOSC — VIJAYASHANTHI (@vijayashanthi_m) February 9, 2024 ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనబడుతోంది. ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ఆరంభించి.. హీరోగా పదుల సంఖ్యలో సినిమాలు తీసి మెప్పించిన సీనియర్ నటుడు చంద్రమోహన్. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్..ఇలా ఏ పాత్రలో అయినే ఒదిగిపోయే దిగ్గజ నటుడాయన. 55 ఏళ్ల తన సినీ కెరీర్ లో 932 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. (చదవండి: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత) ♦ఇప్పటి తరానికి చంద్రమోహన్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే తెలుసు కానీ.. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో. ఆయనతో నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపించేవారు. అతన్ని నిర్మాత హీరో అనేవాళ్లు. ఎందుకంటే ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువశాతం విజయవంతం అయినవే. అందుకే నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. ఒకే ఏడాదిలో మూడు నాలుగు సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. ♦ చంద్రమోహన్‌పై ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన్ను హీరోయిన్లకు లక్కీ హ్యాండ్ అనేవాళ్లు. ఎందుకంటే ఆయనతో కలిసి నటిస్తే చాలు.. ఆ హీరోయిన్ స్టార్ అయిపోతుంది. అందుకే చాలా మంది హీరోయిన్లు చంద్రమోహన్‌తో నటించేందుకు ఆసక్తి చూపించేవాళ్లు. ♦ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరి సిరిమువ్వలు’ చిత్రంలో చంద్రమోహన్ హీరో. జయప్రద హీరోయిన్. అప్పటి వరకు జయప్రదకు గుర్తింపు లేదు. కానీ ఆ చిత్రంలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ♦దివంగత నటి శ్రీదేవి తొలి హీరో కూడా చంద్రమోహన్‌గారు. ‘పదహారేళ్ల వయసు’చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ చిత్రం తర్వాత శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇదీ చదవండి: ఎన్టీఆర్‌తో చేదు అనుభవం.. కానీ మంచే జరిగింది ♦ జయసుధకు కూడా చంద్రమోహన్ సినిమాతోనే స్టార్డమ్ వచ్చింది. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు జయసుధకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి భళే కాపురం, స్వర్గం, శ్రీమతి ఒక బహుమతి తదితర చిత్రాల్లో నటించారు. ♦ లేడి మెగాస్టార్ విజయశాంతి సైతం...చంద్రమోహన్‌తో నటించిన తర్వాతే స్టార్‌గా ఎదిగింది. 1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్ విజయశాంతి కలిసి నటించారు. ఆ తర్వాత విజయశాంతికి వరుసగా అవకాశాలు లభించాయి. వీరిద్దరు కాంబోలో వచ్చిన ‘ప్రతి ఘటన’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇలా చాలామంది హీరోయిన్లను స్టార్స్ చేస్తూ..‘లక్కీ హ్యాండ్’గా పేరు సంపాదించుకున్నాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బీజేపీలో పోటీపై సస్పెన్స్.. విజయశాంతి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పార్టీ సీనియర్ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరమైన విజయశాంతి మాటలు ఏమంటున్నాయంటే...? ట్విట్టర్ వేదికగా విజయశాంతి చేసిన ఓ ట్వీట్లో బీఆర్ఎస్పై పోటీ విషయంలో బీజేపీ ఎన్నడూ వెనక్కు తగ్గదని కార్యకర్తలు విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటంలో భాగంగా తాను కామారెడ్డి నియోజకవర్గం నుంచి, పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గజ్వేల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని కార్యకర్తలు అడగడం తప్పు ఏమీ కాదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేనప్పటికీ పార్టీ నిర్దేశిస్తే చేస్తానని పరోక్షంగా తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదు.. అని కార్యకర్తల విశ్వాసం. అందుకు, గజ్వేల్ నుండి బండి సంజయ్ గారు, కామారెడ్డి నుండి నేను అసెంబ్లీకి కేసీఆర్ గారిపై పోటీ చెయ్యాలని గత కొన్ని రోజుల మీడియా సమాచారం దృష్ట్యా, కార్యకర్తలు అడగటం తప్పు కాదు. అసెంబ్లీ ఎన్నికల… pic.twitter.com/j1tUfexznX — VIJAYASHANTHI (@vijayashanthi_m) October 17, 2023 రేపే అభ్యర్థుల ప్రకటన! ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం ఢిల్లీలో ప్రకటించే అవకాశముంది. ఢిల్లీలో బుధవారం జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. జాబితా బుధవారం రాత్రే ప్రకటించే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని పార్టీ నేతలు చెబుతున్నారు. జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ఇలా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 60–70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలు ఓ అంచనాకు రాగా ఏకాభిప్రాయం కుదిరని సింగిల్ క్యాండిడేట్ నియోజకవర్గాలు కొన్నింటిని రెండు లేదా మూడో జాబితాలో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలి జాబితాలో 35–40 మంది అభ్యర్థులు ఉండొచ్చునని చెబుతున్నారు. మొత్తమ్మీద ఇతర పార్టీల కంటే కూడా బీసీలు (దాదాపు 40 సీట్లు), మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశముందనే చర్చ జరుగుతోంది. మేనిఫెస్టోకు ఓపిక పట్టండి తెలంగాణలో బీజేపీ మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత కొరవడటంతో స్థానిక కాషాయ నేతలు దిగాలు చెందుతున్నారు. ఆయా అంశాలను కొందరు ముఖ్య నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో చివర్లో ఎన్నికలు జరగనుండటంతో ఎందుకు తొందర పడుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో మేనిఫెస్టో ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం. -
కమలంలో కాక!
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ అసంతృప్త నేతలు త్వరలోనే ఆ పార్టీ వీడాలనే తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అక్టోబర్ 1న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. అంతకుముందే పార్టీకి రాజీనామా చేయాలన్న విషయంలో అసంతృప్త నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ సమీకరణలు, పార్టీ పరిస్థితి, జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్నాక, ఇక పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవనే అభిప్రాయానికి వారు వచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే ఎవరెవరు ఏ పార్టీలోకి వెళతారో అన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కొందరు బీఆర్ఎస్ వైపు.. మరికొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్–బీజేపీ లోపాయికారి దోస్తీపై.. బీఆర్ఎస్–బీజేపీల మధ్య లోపాయికారి దోస్తీపై ప్రజల్లోనే అనుమానాలున్నాయని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో తాత్సారం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై విచారణ కమిటీ, కేసీఆర్ సర్కార్‌పై వచ్చిన ఇతర అవినీతి, అక్రమాల అరోపణలపై తగిన చర్యలపై ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా స్పష్టత ఇవ్వకపోవడంపై వీరంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివిధ కీలక అంశాలు లేవనెత్తినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రాజీనామా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్‌ను ఎలాగైనా గద్దెదించాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరామని, ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ నాయకత్వం చర్యలు కనిపించడం లేదంటూ ఓ మాజీ ఎంపీ ‘సాక్షి’కి స్పష్టం చేశారు. అసంతృప్త నేతల అభిప్రాయాలు, తమ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు, మొత్తంగా ఈ వ్యవహారంలో తమ దృష్టికోణం ఏమిటీ, అసలు ఏం చేయాలని అనుకుంటున్నామన్న దానిపై ఆయన పలు సంకేతాలిచ్చారు. వెంటనే కవిత అరెస్ట్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్, కేసీఆర్ సర్కార్ ఇతర అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి బీఆర్ఎస్–బీజేపీ ఒకటి కాదనే భరోసా ప్రజలు, కేడర్‌కు కల్పించాలనే తాము కోరుకుంటున్నట్టు తెలిపారు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి భరోసా లభించకపోవడంతో ఇక పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదనే అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. కేసీఆర్‌ను ఓడించే సత్తా ఉందని భావిస్తున్న పార్టీలోకి వెళ్లేందుకు కూడా తాము సిద్ధమని తెలిపారు. పైకి కనిపిస్తున్నట్టుగా ఆరేడుగురు నేతలే కాకుండా మరికొంతమంది నాయకులు కూడా వీరితో టచ్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. భేటీలే..భేటీలు మంగళవారం విజయశాంతి నివాసంలో జరిగిన సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తదితరులు హాజరైనట్టు సమాచారం. నవంబర్ 20వ తేదీ దాకా ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎలాంటి సమన్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన రోజే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గడిచిన వారంరోజుల్లోనే మూడునాలుగు పర్యాయాలు సమావేశమైన వీరు తాజాగా మరోసారి భేటీ కావడంపై కూడా చర్చ జరుగుతోంది. పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు జాతీయ, రాష్ట్రనాయకత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంపైనా ఈ నేతలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈటలకు ఇచ్చిన గుర్తింపు, ప్రాధాన్యం తమకెందుకు ఇవ్వడం లేదని, అందుకే బీజేపీలో కొనసాగాలా లేక కాంగ్రెస్‌లో చేరాలా అన్న అంశాలపై తమ శ్రేయోభిలాషులు, కార్యకర్తలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. -
కిషన్ రెడ్డి వచ్చినా కొత్త టెన్షన్.. తలలు పట్టుకున్న బీజేపీ నేతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో, తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇక, శనివారం ఉదయం తెలంగాణ బీజేపీ నేతలు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్‌లో రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్ పాల్గొన్నారు. ఇక, ఈ మీటింగ్ సందర్బంగా తెలంగాణలో బీజేపీ నేతల మధ్య సమన్వయం కోసం హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించే పనిలో హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. తెలంగాణ బీజేపీకి మరో కొత్త టెన్షన్ కలవరపెడుతోంది. బీజేపీ నేతల సమావేశాలకు ఏపీ నేతలు రావడంతో తెలంగాణ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి రాకను బీజేపీ నాయకురాలు విజయశాంతి వ్యతిరేకించారు. కిరణ్ కుమార్ మాకొద్దు అని రాష్ట్ర బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక, కిరణ్‌కుమార్‌రెడ్డిని స్థానిక నేతలు మరో చంద్రబాబులాగా భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ను ఫాంహౌస్ అరెస్టు చేస్తాం -
నేనంటే ఎందుకు అంత భయం మీకు..
-
నేను సినిమాలు చేస్తే జనాలు నన్ను క్షమించరు..
-
స్పీడ్ పెంచిన కిషన్ రెడ్డి.. తెలంగాణ కీలక నేతలతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ క్రమంలో టీఎస్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతల అత్యవసర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనపైన చర్చ, బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశం కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతోంది. ఇక, కిషన్ రెడ్డి తెలంగాణ అధ్యక్షుడి హోదాలో ఇది తొలి సమావేశం కావడం విశేషం. ఈ సమావేశానికి ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, జితేందర్ రెడ్డి, విజయశాంతి, ఏవీ.ఎన్.రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బాబు మోహన్, బూర నర్సయ్య గౌడ్, ఎండల లక్ష్మీనారాయణ, నందీశ్వర్ గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, రాణి రుద్రమ హాజరయ్యారు. ఇది కూడా చదవండి: బండి సంజయ్ ఎఫెక్ట్.. బీజేపీకి బిగ్ షాక్! -
బీజేపీలో కోల్డ్‌వార్ పాలిటిక్స్.. జేపీ నడ్డాకు వారు ముగ్గురు ఏం చెప్పారు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ముసలం కొనసాగుతోంది. పార్టీలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో అధిష్టానం ఇప్పటికే మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పార్టీలో వారికున్న సమస్యలను వివరించినట్టు సమాచారం. మరోవైపు.. నిన్న(ఆదివారం) నాగర్‌కర్నూలులో బీజేపీ సభ అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేపీ నడ్డాతో బీజేపీ నేతలు విజయశాంతి, రఘునందన్ రావు, వివేక్ విడివిడిగా మంతనాలు జరిపారు. ఇక, తెలంగాణలో బీజేపీ నేతల నుంచి ఫిర్యాదుల చేసిన నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది పార్టీ హాట్ టాపిక్‌గా మారింది. ఇక, రాబోయే వారం పది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నట్టు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దీనికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తెలంగాణలో మోదీ పర్యటన అనంతరం.. పార్టీ కీలక మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి నేతలకు పదవులు వస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్.. 600 కార్ల కాన్వాయ్‌తో.. -
పీసీసీ సర్వే.. ట్విట్టర్లో విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: పీసీసీ సర్వే ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 45, బీజేపీ 7, ఎంఐఎం 7 , మిగిలిన 15 సీట్లులలో త్రీవ్రమైన పోటీ... ఆ సర్వే నమ్మాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిచే ఆ సీట్లు ఏవో కూడా పీసీసీ తెలియజేస్తే ప్రజలకు అర్థం అయ్యే అవకాశం ఉంది.. లేదంటే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికలలో వచ్చిన ఫలితాల దృష్ట్యా (పోయిన కాంగ్రెస్ డిపాజిట్స్), ఆ సర్వే ఆసమంజసమైన అంశంగా అందరు అనుకునే అవకాశమున్నది. అంటూ పీసీసీ సర్వే పై కాషాయ పార్టీ నేత విజయశాంతి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. -
వేడి రాజుకుంది.. తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పాటు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నియామకం, ఇతర మార్పులు జరగనున్నాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం సమావేశమైన సీనియర్ నేతలు కొందరు ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వంటి అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. వారం క్రితం ‘అసంతృప్తి’ సెగ దాదాపు వారం రోజుల క్రితం కొందరు అసంతృప్త నేతలు సమావేశమై, సీనియర్లమైన తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు లభించడం లేదని, పార్టీ ముఖ్యనేత ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేతల మధ్య సమన్వయం కొరవడటం లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ నాయకత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కమిటీల్లో మార్పులు, బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకం అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం రాత్రి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీలో మార్పులపై జరుగుతున్నది ప్రచారం మాత్రమేనని అన్నారు. తాను పార్టీ కోసం కమిట్మెంట్తో కష్టపడి పనిచేస్తానని, బీజేపీలో ఏ పదవీ శాశ్వతం కాదని, నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పాటించేందుకు బిస్తర్ రెడీగా పెట్టుకున్నానంటూ వ్యాఖ్యానించారు. తాజాగా అనుకూల వర్గం భేటీ.. ఆదివారం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో జాతీయ కార్యవర్గసభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డా.బూర నర్సయ్యగౌడ్, డా.విజయ రామారావు, సుద్దాల దేవయ్య, సీహెచ్ విఠల్, రచనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్‌కు అనుకూల వర్గంగా భావిస్తున్న ఈ నేతలు.. ఇతర అంశాలతో పాటు రాష్ట్ర నాయకత్వ మార్పు, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించడంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బండి సంజయ్‌ను మార్చొద్దని, ఈటలకు కీలక పదవి ఇవ్వొద్దంటూ అధిష్టానాన్ని గట్టిగా కోరాలని నిర్ణయించినట్లు సమాచారం. తాము కూడా ఉద్యమకారులమేనని, జాతీయ కార్యవర్గసభ్యులుగా ఉన్నామని, సీనియర్ నేతలైన తమకు తెలియకుండానే కీలక నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈటలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని వ్యతిరేకించడంతో పాటు, ఆయనకు కీలక పదవి ఇవ్వొద్దని, తాము ఆయన కంటే సీనియర్లమని, తమకు కూడా తగిన గుర్తింపునిచ్చే పదవులు ఇవ్వాలని అభిప్రాయ పడినట్లు సమాచారం. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న తమకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ అంశాలన్నీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. తమతో కలిసి భోజనం చేసేందుకు రావాలనే ఆహ్వానంతో ఒక మాజీ ఎంపీ అక్కడకు వెళ్లగా, కొంతకాలంగా అంతగా చురుగ్గా లేని ఒకరిద్దరు నేతలు కూడా ఇదే విధమైన ఆహ్వానంతో అక్కడకు వెళ్లారని తెలుస్తోంది. అసలు ఆ పోస్టే ఉండదు.. బీజేపీలో ప్రచార కమిటీ చైర్మన్ అనే పదవి లేదని సమావేశానంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో అన్నారు. ‘రాష్ట్ర నేతలతో చర్చించకుండా అధ్యక్షుడి మార్పుపై జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. పదవులు ఇచ్చే ముందు లీకులు ఇచ్చే సంస్కృతి బీజేపీలో ఉండదు. దీనిపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వస్తున్న లీకులను పార్టీ క్యాడర్ నమ్మొద్దు. బీజేపీ స్టేట్ చీఫ్‌ను మారుస్తున్నారని కేసీఆర్ లీకులు ఇప్పిస్తున్నారు. బీజేపీ బలం తగ్గిందని చెప్పడానికే కాంగ్రెస్‌పై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. క్యాడర్‌ను కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. మాకు ఎలాంటి రహస్య అజెండా లేదు. బీజేపీ బలోపేతమే మాకు ముఖ్యం. పొంగులేటి, జూపల్లి కూడా బీజేపీలో చేరాలని కోరుతున్నా. శత్రువుకు శత్రువు.. మిత్రుడు అన్నట్టు కేసీఆర్‌ను కొట్టాలంటే పొంగులేటి, జూపల్లి బీజేపీ వైపు రావాలి..’ అని వ్యాఖ్యానించారు. భేటీపై స్పందించేందుకు ఈటల నిరాకరణ.. బీజేపీ సీనియర్ నేతలు ప్రత్యేకంగా భేటీ కావడంపై స్పందించేందుకు ఈటల రాజేందర్ నిరాకరించారు. ఇలాంటి వాటిపై తాను మాట్లాడనని, ఎలాంటి చిట్‌చాట్ చేయనని తన నివాసం వద్ద ఆయన మీడియాతో చెప్పారు. అధిష్టానం ఎలా స్పందిస్తుందో? సీనియర్ల భేటీ బీజేపీలో చర్చకు దారితీసింది. ఇది దేనికి సంకేతం? దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? సీనియర్ల అభ్యంతరాలను ఎలా తీసుకుంటుంది? ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకంపై ఈ సమావేశం ఎఫెక్ట్ పడుతుందా? అనే దానిపై పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. మీడియా ద్వారా లీకులు సరికాదు: విజయశాంతి బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి మార్పుపై మీడియా ద్వారా లీకులు సరికాదని విజయశాంతి అన్నారు. బీజేపీలో వార్తలు లీక్ చేసే పద్ధతి ఉండదని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యేవరకూ బండి సంజయ్ కొనసాగుతారని రాష్ట్రపార్టీ ఇన్చార్జి తరుణ్ చుగ్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఇదే అధికారిక ప్రకటన అని, ఊహాగానాలతో మీడియాలో వచ్చే కథనాలు అధికారిక ప్రకటనలు కావని స్పష్టం చేశారు. -
కేసీఆర్ లీక్స్ పట్టించుకోవద్దు.. బీజేపీ కేడర్‌కు జితేందర్ రెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి నివాసంలో బీజేపీ ముఖ్య నేతల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో విజయశాంతి, కొండా సురేఖ, నర్సయ్య గౌడ్, విఠల్ పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీలో పరిణామాల(మార్పులు, చేర్పులపై) చర్చించినట్టు సమాచారం. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టార్గెట్‌గా సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఇక, భేటీ అనంతరం జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళతాం. జరిగిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళతాం. కేసీఆర్ కొన్ని లీక్‌లు ఇస్తూ మా పార్టీ కేడర్‌లో అయోమయం సృష్టిస్తున్నారు. కేసీఆర్ దుష్ర్పచారాన్ని తిప్పికొడతాం. కేసీఆర్ కుట్రలను పట్టించుకోవద్దని పార్టీ కేడర్‌కు చెబుతున్నాం. హైకమాండ్‌లో చర్చ జరిగిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయి. లీక్స్‌పై పార్టీ కేడర్‌కు మెసేజ్ పంపేందుకే భేటీ అయ్యాం. మాది జాతీయ పార్టీ. మాకు ఓ విధానం ఉంటుంది. తెలంగాణ బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదు. పార్టీ బలోపేతంపై చర్చించాం. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తుపెట్టుకోవడం ఖాయం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కోమటిరెడ్డితో జూపల్లి భేటీ.. వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు -
బండి Vs అరవింద్.. విజయశాంతి స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటనపై కాషాయ పార్టీ నేత విజయశాంతి స్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై తన స్పందన తెలియజేశారు. తాను పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రమే.. తన అభిప్రాయం చెప్పగలను అంటూ క్లారిటీ ఇచ్చారు. కాగా, అరవింద్ ప్రకటనపై మీడియా ప్రశ్నలకు తాను సమాధానం ఇస్తున్నట్టు విజయశాంతి తెలిపారు. ఇక, విజయశాంతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత ఎవరైనా.. పార్టీ కార్యకర్త లేదా నేతలు.. పార్టీ అధ్యక్షుడి కామెంట్స్‌పై స్పందిస్తే.. అది పార్టీ సమావేశాల్లో జరిగినట్లైతే ఎప్పుడూ కూడా అది అంతర్గత ప్రజాస్వామ్య విధానంగానే పార్టీ పరిగణిస్తుంది. ఆ కామెంట్స్‌ని సమయం, సందర్భం, సమస్య పరిస్థితుల ప్రామాణికతతో విశ్లేషించడం, అవసరమైన నిర్ణయం చెప్పడం కూడా సహజంగా పార్టీ విధానం అని స్పష్టం చేశారు. ఇక, ఎంపీ అరవింద్ మాట్లాడిన సందర్బం మొత్తం నేను చూడలేదు. కానీ, అందులోని ఏదో ఒక అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న బీఆర్ఎస్ అనుకూల వర్గానికి మాత్రం ఒకటి చెప్పగలను. బండి సంజయ్ తన మాటలను వెనక్కి తీసుకోవాల్సి వస్తే.. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు వారు గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత కామెంట్స్‌ను అనేక సార్లు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని వందల సార్లు వారు ముక్కు నేలకు రాయాల్సి వస్తుందని గుర్తించాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, అంతుకుముందు.. ఎంపీ అరవింద్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై సంచలన కామెంట్స్ చేశారు. కవితపై సంజయ్ వ్యాఖ్యలను సమర్థించనని అన్నారు. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు. అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది అని సూచించారు. -
ఆమె నా ఆల్‌టైమ్ ఫేవరేట్ హీరోయిన్: మెగాస్టార్
ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ఓటీటీ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోనీలివ్‌లో ప్రసారమయ్యే ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి మొదటి గెస్ట్‌గా పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా.. తొలి ఎపిసోడ్లో చిరంజీవి ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఈ షో లో పాల్గొన్న మెగాస్టార్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆయన సినీ జీవితంలో ఎదురైన సంఘటనలను పంచుకున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన హీరోయిన్లపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పరిశ్రమలోని కొంతమంది నట దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే అప్పట్లో మెగాస్టార్‌తో స్క్రీన్ పంచుకున్నవారి గురించి స్మిత ప్రశ్నించారు. రాధికా శరత్ కుమార్, రాధ, విజయ శాంతి, శ్రీ దేవి లాంటి స్టార్లలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడానికి మెగాస్టార్ నిరాకరించారు. అందరితోనూ తనకు మంచి రిలేషన్ ఉందని.. మా మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని చెప్పుకొచ్చారు. అయితే వారిలో ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు. వాటి గురించి మెగాస్టార్ వివరించారు. సులభంగా, సహజంగా నటించే విషయంలో రాధిక ఫర్ఫెక్ట్ అని తెలిపారు. ఇక నాతో డ్యాన్స్ విషయంలో అయితే రాధ, విజయశాంతి జీవించేస్తారని అన్నారు. ఆ విషయంలో వారిద్దరి డ్యాన్స్ పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు. అయితే శ్రీ దేవితో గొప్ప వ్యక్తిగత, వృత్తిపరమైన రిలేషన్ పంచుకున్నానని వెల్లడించారు. అందువల్ల ఆమె ఎల్లప్పుడూ తన ఫేవరేట్ హీరోయిన్ అని చిరంజీవి పేర్కొన్నారు. దివంగత శ్రీదేవి గురించి మాట్లాడుతూ..' ఆమెతో పని చేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. తెలుగు సినిమాల్లో తమ జంట ఇప్పటికీ కూడా ఉత్తమ జంటగానే పరిగణిస్తారు. శ్రీదేవి నటన, డ్యాన్స్ బెస్ట్. అందుకే ఆమెతో 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'మోసగాడు', 'ఎస్పీ పరశురామ్' లాంటి సూపర్ హిట్ సినిమాలు చేయగలిగా.' అని అన్నారు మెగాస్టార్. -
చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ఎలాగైనా సాధించి, రాష్ట్ర ప్రజల్లో ఆ ఆనందాన్ని చూడాలన్న ప్రధాన ఆశయంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చిన్నట్లు చెప్పారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. తెలంగాణ వచ్చినా కూడా కేసీఆర్ దొర వద్ద ప్రజలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంత మంది త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే లాభం జరిగిందని మండిపడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 25 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ కుటుంబానికే లాభం జరిగిందని విజయశాంతి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కమిషన్లు తీసుకున్న కేసీఆర్ కుటుంబానికి, వారి బినామీలకే లబ్ది చేకూరిందన్నారు. ప్రాజెక్టుతో ప్రజలకు నీరు మాత్రం రావడం లేదని, రైతులు నష్టపోతున్నారన్నారని అన్నారు. ఒక పనికిమాలిన ప్రాజెక్టు కట్టారని దుయ్యబట్టారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ సర్కార్ 5 లక్షల కోట్ల అప్పులుగా మార్చిందని మండిపడ్డారు.. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలడిగితే చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌కు లేదా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఎందుకు అని నిలదీశారు ‘బీఆర్ఎస్ దేనికోసం పెట్టావ్. ఎవరికోసం పెట్టావ్.. తెలంగాణ డబ్బుల్ని బీఆర్ఎస్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్.. కేసీఆర్‌లో కమిట్మెంట్ లేదు. కేసీఆర్‌పై పోరాడానికి తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉంది. కానీ మమ్మల్ని ఇబ్బందిలు పెడుతున్నారు. సభలకు, పాదయాత్రలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు తొలుత మెదక్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేశాను. చేయాల్సిన అభివృద్ధి చేశాను. ఇప్పుడు నేను కొత్తగా పోటీ చేయాలి. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కేంద్ర డిసైడ్ చేస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్లో దేనికి పోటీ చేసేది త్వరలో తెలుస్తుంది. ఏ పార్టీలో చిన్న చిన్న గొడలు ఉంటాయి. వాటిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఒక టీం వర్క్‌లాగే ముందుకు వెళ్తున్నాం. బీజేపీ చాలా డిసిప్లెన్ పార్టీ’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఆమె ఇంకేం మాట్లాడారో తెలుసుకునేందుకు ఈ కింది వీడియో చూడండి. -
సమయం మారింది
ఓ గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే.. ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు ఎలా వ్యతిరేకత కనబరిచారు అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘శరపంజరం’. టి. గణపతిరెడ్డి, మామిడి హరికృష్ణ సహకారంతో నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలోని రెండో పాట ‘రావయ్యా నందనా రాజా నందన..’ పాటను ప్రముఖ నటి విజయశాంతి విడుదల చేశారు. మల్లిక్ ఎంవీకే స్వరపరచిన ఈ పాటను జానపద కళాకారుడు గిద్దె రాంనర్సయ్య రాసి, పాడారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఆనాడు దొరలు స్వార్థం కోసం ఆడవాళ్లని ఎలా వాడుకున్నారో తెలిసిన విషయమే. ఈనాటి దొర కూడా ఎలా చేస్తున్నాడో తెలిసిన విషయమే. సమయం మారింది కానీ వ్యక్తి మనస్తత్వం మారలేదనడానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలుస్తుంది’’ అన్నారు. -
'లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఓపెనింగ్ వికెట్ పడబోతోంది'
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బండి సంజయ్ పాదయాత్రపై దాడులు చేస్తున్నారని బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే బండి సంజయ్ పాదయాత్రపై దాడికి తెగబడ్డారని విమర్శించారు. సంజయ్ యాత్రను అడ్డుకోవడం, అరెస్టు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. 'టీఆర్ఎస్ చౌకబారు, చిల్లర రాజకీయాలు చేస్తోంది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. అసహనంతో, నిరాశ నిస్పృహలో దాడులకు పాల్పడుతున్నారు. పాదయాత్ర యధావిధిగా అనుమతివ్వాలని, జరిగిన ఘటనపపై విచారణ జరపాలని' ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మునుగోడు బీజేపీదే లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఓపెనింగ్ వికెట్ పడబోతోందని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. లిక్కర్ స్కామ్‌ను కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ నేతలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు కేసులకు భయపడరని.. రాబోయే మునుగోడు ఎన్నికలో బీజేపీ గెలవబోతోందని విజయశాంతి పేర్కొన్నారు. చదవండి: (బండి సంజయ్‌కు షాక్.. పాదయాత్రకు పోలీసుల బ్రేక్!) -
విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆ విషయం పార్టీ నేతలనే అడగండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం నన్ను నిశ్శబ్దంలో ఉంచిందన్నారు. ఈ మేరకు విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో మాట్లాడటానికి నాకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగండి. నేను అసంతృప్తిగా ఉన్నానో లేనో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోండి. నేను ఈ రోజు సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడుదాం అనుకున్నా. లక్ష్మణ్ వచ్చి మాట్లాడారు వెళ్లిపోయారు. నాకేం అర్థం కాలేదు. నా సేవలను ఏవిధంగా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్‌కే తెలియాలి. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని విజయశాంతి అన్నారు. చదవండి: (ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్) -
చిన్నమ్మతో ‘రాములమ్మ’ భేటీ
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళతో తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి భేటీ అయ్యారు. ఈ రహస్య భేటీ వివరాలు.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టి తీరుతానన్న ధీమాను శశికళ వ్యక్తం చేశారు. అలాగే, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వం, కో– కన్వీనర్ పళనిస్వామి మధ్య సాగుతున్న అంతర్గాత విబేధాలను తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా ఆ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయానికి అవకాశమే లేదంటూ కూడా శశికళ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు దగ్గరయ్యే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మతో చెన్నైలో బీజేపీ నేత విజయశాంతి భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. రహస్యంగా ఈ భేటీ జరిగినట్టు చిన్నమ్మ శిబిరం వర్గాల ద్వారా శనివారం వెలుగులోకి వచ్చింది. గతంలో ఓ మారు చిన్నమ్మతో విజయశాంతి భేటీ బహిరంగానే చెన్నైలో జరిగింది. అయితే, తాజా భేటీ రహస్యంగా జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: గుజరాత్ ఫైల్స్ బ్లాక్ చేసి నన్ను ద్వేషించారు: ప్రధాని మోదీ -
ఈ ఉత్సవాలు.. రాజకీయాలకు అతీతం
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాజకీయాలకతీతంగా తెలంగాణలోని ప్రతి జిల్లాలో రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవాలను నిర్వహిస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. మన భాషలు వేరైనా అంతా భారతీయులుగా ఉన్నామని, భిన్నత్వంలో ఏకత్వం చాటేందుకే సంస్కృతీ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రెండురోజుల పాటు నిర్వహించిన జాతీయ సంస్కృతీ మహోత్సవాల ముగింపు సమావేశం బుధవారం రాత్రి జరిగింది. కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళా ప్రదర్శనలను తిలకించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ 21 జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రధాని మోదీ నేతృత్వంలో రామప్పను అభివృద్ధి చేసే పనులు రెండు మూడు మాసాల్లో ప్రారంభిస్తామని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవం నిర్వహిస్తున్నామని, దానికి సీఎం కేసీఆర్‌తో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్, మంత్రులకు ఆహ్వానం పంపిస్తామని, అందరూ హాజరవుతారని తెలిపారు. మాజీ ఎంపీ, సాంస్కృతిక రాయబారి విజయశాంతి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో నిర్వహించాలని కోరారు. సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ‘ఒసేయ్ రాములమ్మ’లోని పాట పాడి విజయశాంతిని సినిమాలోని డైలాగ్ చెప్పాలని కోరగా.. ‘దొరా.. నీ కాళ్లు మొక్కం.. తల దించుకోం..’అని చెప్పడంతో, సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి డైలాగ్ చెప్పినట్లుందంటూ చప్పట్లు కొట్టారు. ఘల్లుమన్న ఓరుగల్లు: రాగం, తాళం, గానం, నృత్యంతో ఓరుగల్లు ఘల్లుమంది. సంస్కృతీ మహోత్సవ్‌లో భాగంగా దేశప్రజల జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, వేషధారణలు ప్రతిబింబించేలా కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ మహోత్సవానికి బుధవారం కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకాలేదు. -
భూ వేలాన్ని ఆపలేం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట, ఖానామెట్‌లోని ప్రభుత్వ భూముల్ని వేలం వేయడాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లో తుది విచారణకు లోబడి ఆ వేలం ప్రక్రియ ఉంటుందన్న ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అటువంటి ఆదేశాలు ఇస్తే కొనేవారు భయపడతారని, అలాగే తక్కువ ధరను కోట్ చేస్తారని, తర్వాత ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. అయితే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ భూములను వేలం వేయాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎంపీ ఎం.విజయశాంతి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఆక్రమణల నుంచి కాపాడలేక, నిధులను సమకూర్చుకునేందుకు ఈ భూముల్ని వేలం వేస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ప్రభుత్వమే కాపాడలేకపోతే ఎలా ? ‘ఆక్రమణదారుల నుంచి కాపాడలేక ప్రభుత్వ భూముల్ని వేలం ద్వారా విక్రయిస్తున్నామని ప్రభుత్వం పేర్కొనడం ఆశ్చర్యకరం. ప్రభుత్వమే తన భూముల్ని కాపాడుకోలేకపోతే ఇక ప్రజల భూముల్ని ఏం కాపాడుతుంది. భూముల్ని కాపాడేందుకు వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేయండి. ప్రతి జిల్లాకు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఒకవైపు చెబుతున్నారు. మరోవైపు ఉన్న భూముల్ని వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ప్రభుత్వం తానిచ్చిన ఆదేశాల అమలులో పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వేలం ప్రక్రియను ఎలా సమర్థించుకుంటుంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి’అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 8కు వాయిదా వేసింది. -
కేసీఆర్ నాకన్నా పెద్ద నటుడు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీలో చేరిక అనంతరం తొలిసారి హైదరాబాద్ చేరుకున్న విజయశాంతికి ఘన స్వాగతం లభించింది. ఆమె గురువారం మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ 2023లో కేసీఆర్‌ను గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ధీటుగా నిలబడేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి గుడ్‌బై!) ‘జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. నేను అప్పట్లో బీజేపీలో ఉండే తెలంగాణ కోసం పోరాడాను. కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. నేను 1998 జనవరి 26న బీజేపీలో చేరాను. ఆ తర్వాత తెలంగాణ కోసం నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను... పోరాడాను. అయితే కొన్ని కారణాల వల్ల నేను ఆ రోజు బీజేపీని వీడాను. కొన్ని పార్టీలు తెలంగాణ రావడానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ కారణంగానే పార్టీ బయటకు నుంచి వచ్చేశాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2005 తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి, అనేక సమస్యలపై పోరాటాలు చేశాను. ఆ తర్వాత టీఆర్ఎస్ పుట్టుకొచ్చింది. టీఆర్ఎస్కు ఎదురు ఉండకూడదని కేసీఆర్ భావించారు. ఉద్యమాలు చేసినవారిని ఆయన ఇబ్బంది పెట్టారు. ఒక దశలో అయితే కేసీఆర్ తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేయాలని ఒత్తిడి తెచ్చారు. అందుకోసం చాలామందిని నాతో చర్చలకు పంపారు. పార్టీని విలీనం చేయాలని ఇష్టం లేకున్నా.. పరిస్థితులను బట్టి పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది. (కాంగ్రెస్‌కు కేసీఆర్ స్లో పాయిజన్ ఎక్కించారు) టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఎంపీగా గెలిచాను. ఆ తర్వాత పార్లమెంట్లో రాష్ట్ర సాధన కోసం కొట్లాడాం. 2013లో నన్ను టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారు. అదంతా ప్రీ ప్లాన్డ్‌గానే చేశారు. తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కూడా పార్లమెంట్లో లేరు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తన కుటుంబంతో సోనియా గాంధీ కాళ్లమీద పడ్డారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ పార్టీ ఎదురు ఉండకూడదనే ఉద్దేశంతో టార్గెట్ చేశారు. నా కన్నా గొప్ప నటుడు కేసీఆర్. తనకన్నా బలమైన నేతలెవరూ ఉండకూడదనేది ఆయన ఆలోచన. కేసీఆర్‌లా మాట మార్చడం నాకు రాదు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మోసం చేసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది చనిపోయారు. వాళ్ల శవాల మీద కూర్చొని కేసీఆర్ పరిపాలిస్తున్నారు. కేసీఆర్ ఎన్నడూ తెలంగాణ ప్రజలను ప్రేమించలేదు. ఆయనకు డబ్బులే ముఖ్యం. ఏం చేసుకుంటారు దొర డబ్బుని. ఎల్లకాలం అబద్ధాలతో మోసం చేయలేరు. తెలంగాణ ప్రజల్లోనూ మార్పు వస్తోంది. కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపి, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి’ అని విజయశాంతి పిలుపునిచ్చారు. -
విజయశాంతి ప్రకటన.. కాంగ్రెస్‌లో కలకలం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో కొనసాగే అంశంపై రోజురోజుకూ అనుమానాలు పెరుగుతున్నాయి. ఆదివారం ఆమె విడుదల చేసిన ఓ ప్రకటన ఇందుకు ఊతమిచ్చేలా కనిపిస్తోంది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు సరిగ్గా వర్తించే సమయం సమీపించిందని అంటూనే రాష్ట్రంలో బీజేపీ బలపడిందని ఆమె పేర్కొనడం గాంధీ భవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘‘కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి, భయపెట్టి ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది’’అని విజయశాంతి పేర్కొన్నారు. అదే ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అంశాన్ని కూడా విజయశాంతి ప్రస్తావించారు. ‘‘మరికొంత ముందుగానే మాణిక్యం ఠాగూర్ రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి’’అని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. చాలా కాలంగా పార్టీ వ్యవహారాల్లో స్తబ్దుగా ఉంటున్న విజయశాంతిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఇటీవల కలిశాక ఆమె వ్యవహరిస్తున్న తీరులో మార్పు కనిపిస్తోందని, ఆమె బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ‘లేడీ అమితాబ్’మనసులో ఏముందో.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజయశాంతిని కలిసి బీజేపీలో చేరాలని ఆహ్వానించగా తనకు సమయం కావాలని చెప్పినప్పటికీ ఆమె బీజేపీలోకి వెళ్లపోతారనే ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ విజయశాంతి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. కాంగ్రెస్‌లో ఇలా పార్టీ ఇన్చార్జీలు వెళ్లి కలవడం చాలా అరుదు. అయితే విజయశాంతి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందనే ఆలోచనతో మాణిక్యం ఈ చర్యకు ఉపక్రమించారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆమె చెప్పిన విషయాలను బట్టి విజయశాంతి కాంగ్రెస్‌లో ఉంటారనే ధీమా టీపీసీసీ నేతల్లో వ్యక్తమైంది. కానీ వాయిదాల పద్ధతిలో విజయశాంతి విడుదల చేస్తున్న ప్రకటనలు మరో అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక రోజున ఆత్మ ప్రభోదానుసారం ఓటేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విజయశాంతి... టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ హోదాలో ఉండి కూడా కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరలేదు. పైగా ఆ పోస్టింగ్‌లో తన పేరు కింద హోదాను ప్రస్తావించేందుకు కూడా ఆసక్తి చూపలేదు. -
మహేశ్‌బాబుకు జన నీరాజనం..
సాక్షి, హన్మకొండ: హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన “సరిలేరు నీకెవ్వరు’ విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, హీరోయిన్ రష్మిక, లేడీ అమితాబ్ విజయశాంతి, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర, నటులు రాజేంద్రప్రసాద్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మూడు గంటల పాటు సాగిన వేడుకల్లో సత్య బృందం నృత్యాలు, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సమకూర్చిన పాటలతో గాయకులు అభిమానులను ఉర్రూతలూగించారు. అందరికీ ధన్యవాదాలు తనపై అభిమాన వర్ష కురిపించిన ప్రతి ఒక్కరికి హీరో మహేష్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. కేవలం ఐదు సినిమాలకే దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి అన్ని సూపర్ డూపర్ హిట్లను ఇవ్వడం సంతోషకర విషయం అన్నారు. అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ కా బాప్‌గా సినిమాను ఆదరించిన అభిమాన దేవుళ్లకు రుణపడి ఉంటానని తెలిపారు. భవిష్యత్‌లో కూడా మంచి సందేశాత్మకమైన చిత్రాలే కాకుండా అభిమానులకు నచ్చే విధంగా తీస్తానని హీరో అన్నారు. మంచిగున్నారా... హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ ‘హలో వరంగల్.. మంచిగున్నారా’ అంటూనే సినిమాలోని అర్థమవుతుందా అనే డైలాగ్‌ను చెప్పడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సభకు వేలాదిగా అభిమానులు హాజరుకాగా జేఎన్ఎస్ కిక్కిరిసిపోయింది. సినీ పరిశ్రమను వరంగల్ కు గుంజుకురండి రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ‘సినిమాలు అనగానే విజయవాడ, వైజాగ్‌కు వెళ్తున్నారు.. అలా కాకుండా సిని పరిశ్రమను వరంగల్ అడ్డాగా గుంజుకురావాలి’ అని సినీ ప్రముఖులను ఉద్దేశించి కోరారు. అందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో తన వంతుగా సహకరిస్తానని అన్నారు. కాగా నిర్మాత దిల్ రాజు తన ప్రసంగంలో సినీ పరిశ్రమను వరంగల్‌కు గుంజుకురావడం కష్టమైనదేనని చెప్పారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, నగర పోలీసు కమిషనర్ వి.రవీందర్, గ్రేటర్ మేయర్ గుండా ప్రకాశ్‌రావుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, సభ అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు పర్వతగిరిలో మంత్రి దయాకర్‌రావు స్వగృహానికి వెళ్లారు. చదవండి: నెవ్వర్ బిఫోర్ సంక్రాంతి -
రాములమ్మ మళ్లీ ఏడిపించింది అంటున్నారు
‘‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అంటారే.. అలా సరైన సమయంలో సినిమాల నుంచి విరామం తీసుకున్నా.. మళ్లీ సరైన సమయంలో తెరపైకి వచ్చా. ‘సరిలేరు నీకెవ్వరు’ లో నా పాత్రకు మంచి స్పందన వస్తోంది. అనేక మంది ఫో¯Œ చేసి అభినందిస్తున్నారు. మిగతా భాషల పరిశ్రమల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. మహిళలకు బాగా నచ్చింది. మహిళలు ఫో¯Œ చేసి ‘రాములమ్మా.. మళ్లీ ఏడిపించావ్’ అంటున్నారు.. మగవాళ్లూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు’’ అని విజయశాంతి అన్నారు. మహేశ్‌బాబు, రష్మిక మందన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ‘దిల్’ రాజు సమర్పణలో అనీల్ సుంకర, మహేశ్ బాబు నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. పదమూడేళ్ల విరామం తర్వాత ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతి పాత్రలో నటించిన విజయశాంతి విలేకరులతో పంచుకున్న విశేషాలు... ► చాలా ఏళ్ల నుంచి అనేక మంది సినిమా చేయమని అడిగారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల నటించాలనే ఆలోచన రాలేదు. ఆ సమయంలో సినిమా, రాజకీయాలంటూ ఇబ్బంది పడలేను. గతంలోనూ అనిల్ రావిపూడిగారు ఓ సినిమా కోసం సంప్రదించినప్పుడు చేయలేను అని చెప్పాను. మహేశ్ బాబు హీరో అని, ‘సరిలేరు నీకెవ్వరు’ కి అడిగినప్పుడు కథ విన్నాను.. నచ్చడంతో చేశా.. ఇప్పుడు ప్రేక్షకులకూ నచ్చింది. సంక్రాంతికి రియల్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ► గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం కొత్తగా అనిపించలేదు.. నటిగా నలభై ఏళ్ల అనుభవం చూశాను. మనతో నటించే ఆర్టిస్టులు మారారు కానీ సినిమా ఎప్పటికీ ఒకటే. నటనలో అదే పట్టు ఉంటుంది. సినిమా పరిశ్రమను మిస్ అవుతున్నాననే భావన కలగలేదు. ఇన్నేళ్లు హీరోయి¯Œ గా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే సులువు కాదు.. చాలా పెద్ద విషయమది. తెలుగమ్మాయిగా, ఏళ్లపాటు ఒక స్థాయిని కాపాడుకుంటూ సినిమాలు చేయడం ఒక చరిత్ర సృష్టించడమే. లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టుగానో, మరో పాత్రలకో వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. దేవుడు ఎక్కడో నాకు మేలు చేశాడు, ప్రేక్షకులు ఆదరించారు. ► భారతి పాత్ర హుందాగా సాగుతుంది.. ఎక్కువగా తక్కువగా చేయకూడదు. ఆరంభం నుంచి చివరిదాకా ఒకేలా కనిపించాలి. తన బాధను బయ టపెట్టకుండా మనసులోనే దాచుకుంటుంది. విల¯Œ తో మాట్లాడేటప్పుడు తక్కువ డైలాగులున్నా సూది పెట్టి గుచ్చుతున్నట్లు ఉంటుంది. ఓవర్‌గా యాక్ట్ చేయడానికి లేదు. ప్రకాష్ రాజ్‌తో కళ్లలోకి చూస్తూ ‘ఏంటి భయమేస్తుందా? అడగటం వంటి డైలాగ్‌లు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. ► కృష్ణగారి కుటుంబంతో నాకు ఏదో అనుబంధం ఉందనుకుంటా. ఈ బంధాన్ని దేవుడు నిర్ణయించినట్లు అనిపిస్తుంది. మహేశ్‌తో రీఎంట్రీ సినిమా చేస్తాననుకోలేదు.. ఆశ్చర్యం వేస్తోంది. ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా చేస్తున్నప్పుడు మహేశ్ చిన్న పిల్లాడు. ఇప్పుడు సూపర్‌స్టార్ అయ్యాడు కదా! ఎలా ఉంటాడో అనుకున్నా. కానీ, తొలిరోజు నాతో మాట్లాడిన తీరు, చూపించిన అభిమానం చూసి నా భయాలన్నీ పోయాయి. కొన్ని రోజుల తర్వాత సరదాగా మాట్లాడేవాడు. ► ఒక్కొక్క సినిమాకు ఒక్కో తరహా పాత్ర దక్కుతుంటుంది. ‘ప్రతిఘటన’ సినిమాలో నేను నేరుగా ఏదీ చేయను.. చివరలో మాత్రం విల¯Œ ను గొడ్డలితో నరికి చంపేస్తాను. ‘సరిలేరు నీకెవ్వరు’ మహేశ్ సినిమా. హీరోతో పాటు నా పాత్ర కథలో సమాంతరంగా సాగుతుంటాయి. ఓ సన్నివేశంలో భారతి పాత్రకు సెల్యూట్ చేస్తాడు మహేశ్. నటిగా నాకు ఓ స్థాయి ఉండటం వల్లే హీరో సెల్యూట్ చేస్తే ప్రేక్షకులకు నచ్చింది.. వేరే వాళ్లు నటిస్తే వాళ్లు ఒప్పుకోరు. ► అందరూ బాధ్యతగా ఉండాలన్న ఒక మంచి విషయాన్ని ఈ చిత్రంలో దర్శకులు చెప్పారు. అది విన్నప్పుడు నిజమే కదా! అనిపించింది. ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండాలి, సమాజాన్ని మనమే తీర్చిదిద్దాలి, ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకురావాలి. మహిళలకు గౌరవం ఇవ్వాలి, మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించడం మన సంప్రదాయం కాదు కదా? అదే విషయాన్ని అనిల్ రావిపూడి చక్కగా చెప్పారు. ► ఈ సినిమాలో నటించకూడదని తొలుత అనుకున్నా. అనిల్ పట్టుబట్టి నాతో సినిమా చేయించారు.. ఆయనకేదో లెక్క ఉండి ఉంటుంది.. అది సరిగ్గా రీచ్ అయ్యింది. ఇందుకు అనిల్‌గారికి కృతజ్ఞతలు. దర్శకులకు ఒక ఆలోచన ఉంటుంది.. కొడితే బంతి బౌండరీ దాటుతుంది. అన్ని పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంచుకున్నారు. రాజకీయాల్లో ఒత్తిడితో బీపీ వస్తుంటుంది.. సినిమా చేస్తున్నప్పుడు మనశ్శాంతిగా, హాయిగా ఉంది. ► మన దగ్గరున్న పేరున్న దర్శకులకు అనిల్ తక్కువేమీ కాదు. నలభై ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. అనిల్ గొప్ప దర్శకుడు అవుతాడు. ఇంత భారీ సినిమాని చాలా కూల్‌గా, ఒత్తిడి లేకుండా, గందరగోళం లేకుండా వేగంగా చిత్రీకరించారు. తను తీసిన ‘పటాస్, రాజా ది గ్రేట్, ఎఫ్2 ’ సినిమాలు చూశాను.. మంచి మానవీయత, సెంటిమెంట్ ఉంది. ఆయనకు రాములమ్మ కథ ఇచ్చినా తెరకెక్కించగలరు. నాతో ‘కర్తవ్యం, ప్రతిఘటన’ లాంటి హీరోయి¯Œ ఓరియంటెడ్ సినిమా చేయమని అనిల్‌ను కోరుతున్నా. ► ఇప్పటిదాకా 60 మంది హీరోలతో కలిసి పనిచేశాను. నాతో కలిపి 61 మంది అనుకోండి. 90వ దశకంలోనే నేను అత్యధిక పారితోషికం తీసుకున్నా. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరో తర్వాత నాదే ఎక్కువ పారితోషికం. నటిగా ఎంతోమందికి స్ఫూర్తినివ్వడం నా అదృష్టం. ‘కర్తవ్యం’ సినిమా చూసి, అనేక మంది మహిళలు పోలీసు వృత్తిలోకి వచ్చారు.. మగవాళ్లు స్ఫూర్తిపొందారు. ‘రౌడీ ఇ¯Œ స్పెక్టర్’ చిత్రంలో ఆటోరాణి, ‘భారతరత్న’ చిత్రంలో సైనిక అధికారిగా నటించాను. ఇవన్నీ ప్రభావవంతమైన పాత్రలు. కొంతమంది మినీ విజయశాంతి అని పేర్లు పెట్టుకున్నారు కూడా. నాకు ఇంత పేరు తీసుకొచ్చిన ప్రజలకు రుణపడి ఉంటా. రాజకీయాల్లో ఉన్నా, సినిమాల్లో ఉన్నా ప్రజలు బాగుండాలని కోరుకుంటా. ► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమంలో చిరంజీవిగారిని కలవడం గొప్ప అనుభూతి. ఆయన రాజకీయాల ప్రస్తావన తీసుకొస్తారని ఊహించలేదు. ఆయన మనసులోని సందేహాలన్నీ ఆ వేదికపై తీరిపోయాయి. రాజకీయాల్లో మా మధ్య కొంత దూరం పెరిగింది.. ఆ రోజు కార్యక్రమంలో అది సమసిపోయింది. ► సాధారణ పాత్రలు వస్తే చేయను. అలాంటి పాత్రలు చేసి ప్రేక్షకుల్లో నాకున్న గౌరవాన్ని తగ్గించుకోలేను. రొటీ¯Œ అత్త పాత్రలు లాంటివి అస్సలు అంగీకరించను. బలమైన, శక్తిమంతమైన పాత్రలు వస్తే ఏడాదికి ఒక్కటైనా చాలు ఒప్పుకుంటా. నేను ఎక్కువగా తినను, వ్యాయామం చేస్తుంటాను. ఈ సినిమా కోసం కొంత జాగ్రత్తలు తీసుకుని బరువు తగ్గాను. మనసు నిర్మలంగా ఉంటుంది కాబట్టి అది మొహంలో కనిపిస్తుంటుంది అంతే. -
‘కల్వకుంట్ల రాజ్యాంగం చెల్లదు’
హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేల విలీనం లేఖపై ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాం గం చెల్లుతుందే గానీ కల్వకుంట్ల రాజ్యాంగం చెల్లదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో గురువారం ఆయన పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రగతిభవన్‌ను సీఎం అధికారికంగా ఉపయోగిస్తున్నప్పుడు కేటీఆర్ అక్కడ ఉండటమే తప్పన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్‌లో కేటీఆర్ విందుకు ఆహ్వానించడం అధికార దుర్వినియోగమేనన్నారు. కేసీఆర్‌కు 88 ఎమ్మెల్యే సీట్లనిచ్చి గెలిపించారని అయితే ఆయన అభివృద్ధిపై కాకుండా ఫిరాయింపులపై దృష్టి సారిస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 70ఏళ్లలో పలు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు లేకుండా పాలన సాగించలేకపోయాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఫిరా యింపు చేయని వారినే గెలిపించారన్నారు. నిజామాబాద్, కరీంనగర్లో కర్రు కాల్చి ప్రజలు వాతపెట్టారని ఆ ఓటమి నుంచి టీఆర్ఎస్ పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలి: పొన్నం కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ కొనుగోలు చేయడం సిగ్గుచేటని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక దళితుడు ప్రతిపక్ష నేతగా ఉండడాన్ని జీర్ణించుకోలేని టీఆర్ఎస్, ప్రతిపక్షం లేకుండా చేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండ గా విలీన ప్రక్రియ ప్రయత్నాలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీనిపై మా ఎమ్మెల్యేలు నిరసనలు చేస్తే అరెస్టు చేసి కేసులు పెడతారా అని నిలదీశారు. గతంలో మేము చేసిన అనేక ఫిర్యాదులపై ఇప్పటివరకు స్పీకర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి: విజయశాంతి వేసే ఓట్లు ఏమౌతున్నాయో, ఓట్లు వేశాక గెలిచే అభ్యర్థులు ఎటు పోతారో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానీకం సతమతమవుతూ ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. గెలిచాక ఈ అభ్యర్థి మన పార్టీలోఉంటారా..? అనే కార్యకర్తల ఆవేదనకు సమాధానం చెప్పలేని స్థితిలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విలీనంపై సుప్రీంని ఆశ్రయిస్తాం: కుసుమ కుమార్(టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్) సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా చంపేశారని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్ విమర్శించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేకుండా 12 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా సీఎల్పీ విలీన లేఖను స్పీకర్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ అప్రజాస్వామిక విధానాలపై సుప్రీంకోర్టుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు
పరిగి: దొరపాలనను అంతం చేద్దామని, కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ ఎన్నికల క్యాంపెనింగ్ కమిటీ చైర్పర్సన్ విజయశాంతి కేసీఆర్ రూ.30 కోట్లు ఇచ్చి ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తున్నారు. రైతు ఆత్మగౌరవ సభలో విజయశాంతి ప్రాంతీయ పార్టీల గెలుపుతో ఒరిగేది ఏమీ లేదుఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డిఅన్నారు. ఆదివారం పూడూరు మండలం మన్నెగూడ సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు ఆత్మగౌరవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలవకుండా సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపును ఆపలేరని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని తప్పనిసరిగా గెలిపించాలని ఆమె కోరారు. కేసీఆర్ రూ. 30 కోట్లిచ్చి ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంచి వ్యక్తిత్వం, చరిత్ర ఉన్న కొండాను గెలిపిస్తే చేవెళ్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడతారని తెలిపారు. కేసీఆర్ దొరల పాలనను కొనసాగిస్తున్నారని, దానిని అంతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హీరోలా వచ్చి నీళ్లు తెస్తాడంట అనంతరం ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. చేతి గుర్తుకు ఓటేస్తే చేవెళ్లకు వేసినట్టు.. కారు ఓటేస్తే కరీంనగర్‌కు వేసినట్టని చెప్పారు. చేవెళ్ల గడ్డ మీద కనీసం ఒక్క మగాడు, మహిళ లేనట్లు రంజిత్‌రెడ్డిని కరీంనగర్ నుంచి దిగుమతి చేసుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్, కేసీఆర్ చెప్పే అబద్ధపు మాటలు ప్రజలు ఇంకా ఎక్కువ రోజులు నమ్మే పరిస్థితి లేదని, వారికి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఓ పక్క సాగు నీటి ప్రాజెక్టులు జిల్లాకు దూరం చేస్తూ టీఆర్ఎస్ సర్కారు మోసం చేస్తుంటే మరో వైపు సినిమా హీరోలా వచ్చి రంజిత్‌రెడ్డి సాగునీరు తెస్తాడంట అని ఆయన ఎద్దేవా చేశాడు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజుక్టు డిజైన్‌ను మార్చి ద్రోహం చేసింది సీఎం కాదా.. అని ప్రశ్నించాడు. సీఎం, పీఎం ఇద్దరూ ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీల ఎంపీలు గెలిచి సాధించేది ఏమీలేదన్నారు. సీఎం కేసీఆర్ అతిథిలా ఎన్నికలప్పుడే కనిపిస్తారని తెలిపారు. స్వప్రయోజనాల కోసమే పార్టీ మార్పు సభలో డీసీసీ అధ్యక్షుడు పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. సొంత ప్రయోజనాల కోసమే నేతలు పార్టీని వీడుతున్నారని విమర్శించారు. పార్టీని వీడినవారంతా తాలులాంటి వారని మిగిలిన వారంతా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులని అన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించి ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. స్థారికేతరుడైన రంజిత్‌రెడ్డి ఓడించి టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటర్లు న్యాయం, ధర్మం వైపు నిలబడాలని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మోసం చేసిన టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని కోరారు. మొదట్లో పాలమూరు ఎత్తిపోతల పథకంలో 10 టీఎంసీలు నియోజకవర్గ రిజర్వాయర్లకు కేటాయిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం 2.8 టీఎంసీలకు కుదించిందని మండిపడ్డారు. అనంతరం మాజీ మంత్రి గడ్డంప్రసాద్క్ముార్ మాట్లాడుతూ.. కేసీఆర్ కేవలం ఈవీఎంల ట్యాంపిరింగ్తో గెలిచి ప్రభు త్వం ఏర్పాటు చేశారు తప్పా వారికి ప్రజలు ఆశీస్సులు లేవని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ మాట్లాడుతూ.. కొందరు దుర్మార్గులు చేతిగుర్తుపై గెలిచి కారెక్కేందుకు సిద్ధమయ్యారని మాజీ మంత్రి సబితారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం టీజేఎస్ కోదండరాం, షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే మల్రెడ్డి రంగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర య్య మాట్లాడారు. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు శాంతిబాయి, నారాయణ్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, రాజేందర్‌రెడ్డి, సత్యనారాయణ, సునీతాసంపత్, లాల్‌కృష్ణ ప్రసాద్, వెంకటేష్, ఎర్రగడ్డపల్లి కృష్ణ, రాములు, షాహెద్, ఆంజనేయులు, రాంరెడ్డి, భీరెడ్డి, కనకం మొగులయ్య, పాల్గొన్నారు. -
వారిని తరిమి కొట్టాలి
నిజామాబాద్ సిటీ/నిజామాబాద్ : దేశం, రాష్ట్రం బాగు పడాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ను తరిమికొట్టాలని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. మోదీ దేశ ప్రజలను ఆర్థికంగా దెబ్బ తీస్తే, కేసీఆర్ అబద్ధాలతో రాష్ట్రాన్ని ఏలుతున్నారని విమర్శించారు. గురువారం నిజామాబాద్‌లోని చంద్రశేఖర్‌కాలనీలో నిర్వహించిన బహిరంగ సభలో విజయశాంతి ప్రసంగించారు. దేశానికి మోదీ, రాష్ట్రానికి కేసీఆర్ శనిలా మారారని, వారిని తరిమి కొడితేనే మనం బాగుపడుతామన్నారు. ఆర్థిక ఇబ్బందులే.. 2014 ఎన్నికల వేళ నల్లధనం తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ మాయ మాటలు చెప్పటంతో ప్రజలు గెలిపించారని, కానీ, ఆ తర్వాతే మోదీ అసలు స్వరూపం బయటపడిందని విజయశాంతి తెలిపారు. పెద్ద నోట్లు రద్దు చేసి అనేక మంది ప్రాణాలు పోడానికి కారణమయ్యాడని విమర్శించారు. జీఎస్టీ తీసుకువచ్చి చిన్న వ్యాపారాలు, పరిశ్రమలను దెబ్బతీశాడన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన మోదీ.. మళ్లీ నమ్మించి గొంతు కోయడానికి వస్తున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీల మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి రాహుల్‌ను ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మంతా అబద్ధాలే.. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని విజయశాంతి విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను గిన్నిస్‌బుక్ రికార్డులో ఎక్కించవచ్చని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా కేసీఆర్ మోదీకి గులాం, సలామ్ చేస్తున్నాడన్నారు. 15 మంది ఎంపీలు ఉన్నా ఐదేళ్లలో విభజన హామీలు సాధించుకోలేదు కానీ, ఇప్పుడు 16 మంది ఎంపీలు కావాలని అనడం సిగ్గుచేటనన్నారు. కేసీఆర్‌కు ఓటువేస్తే మోదీకి వేసినట్లేనని తెలిపారు. ఎంపీ కవిత జిల్లాకు చేసింది ఏమి లేదని విమర్శించారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని, దొరల పాలన పోవాలంటే కేసీఆర్‌కు కాకుండా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. నిజామాబాద్‌లో 180 మంది రైతులు నామినేషన్లు వేశారంటే ఇక్కడి రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. పసుపు, ఎర్రొజొన్న రైతుల సమస్యలకు పరిష్కారం చూపని కేసీఆర్‌పై రైతుల తిరిగిబాటు మొదలైందని, ప్రజలు సైతం ఈ విషయాన్ని గుర్తించుకుని కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి మధుయాష్కీగౌడ్, డీసీసీ చీఫ్ మానాల మోహన్‌రెడ్డి, నాయకులు గడుగు గంగాధర్, కేశ వేణు, సుభాష్‌జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ను అంతం చేయడం మీ తరం కాదు: విజయశాంతి
మెదక్‌జోన్: ‘కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా అంతం చేస్తానంటూ కంకణం కట్టుకున్నావా దొరా..’అని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ సోమవారం మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పట్టణంలో సింహగర్జన పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. విజయశాంతి మాట్లాడుతూ ‘సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా? నీ కొడుకు చిన్నదొర మంత్రి అయ్యేవాడా?’అని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఖతం చేయడం నీ జేజమ్మ తరం కాదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం వెళ్లేవారు వెళ్లిపోతున్నా కాంగ్రెస్‌లోకి యువరక్తం వస్తోందన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారంటూ చిన్నదొర చెప్పే మాటలు ఎవరూ నమ్మరని అన్నారు. మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్ యాదవ్ తనవైపే ఉన్నారంటూ కేసీఆర్ చెబుతున్నారే కానీ ఏనాడైనా వారు తెలంగాణకు వచ్చారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే రైతులకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేస్తామన్నారు. -
సోషల్ మీడియా వేదికగా పోరాటం
సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఉదంతంపై యావత్ మహిళాలోకం సోషల్ మీడియా వేదికగానే పోరాటం చేయాలని టీపీసీసీ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై షర్మిల పడుతున్న ఆవేదన.. సమాజంలో మహిళల దుస్థితికి అద్దం పడుతుందన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళా సెలబ్రిటీలపై విషం కక్కుతున్న ఈ సంస్కృతిని నియంత్రించాల్సిన అవసరముందని బుధవారం ఓ ప్రకటనలో విజయశాంతి పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళలను అణగదొక్కుతూ, వేధింపులకు గురిచేస్తూ.. పురుషాధిక్యత చాటుకునే ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయన్నారు. ఈ తరహా ఘటనలు మహిళలను మానసికంగా మరింత కుంగదీస్తాయన్నారు. షర్మిలకు న్యాయం జరిగే విషయంలో పోలీసులు, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్య తీసుకునే విధంగా యావత్ మహిళా లోకం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని.. 40 ఏళ్లుగా.. సినిమా, రాజకీయ రంగాల్లో మహిళా సాధికారత కోసం పోరాడిన వ్యక్తిగా తన స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానని ఆ ప్రకటనలో ఆమె వెల్లడించారు. -
ఉద్యమ ద్రోహులను పోషించారు
మంథని: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవినీతిపరులు.. ఉద్యమద్రోహులను పెంచి పోషించారని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వస్తే 4 కోట్ల మంది ప్రజలు అభివృద్ధి చెందుతారనుకుంటే కేవలం కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందన్నారు. కేసీఆర్ దొర బుద్ధి చూపి అందరినీ మోసం చేశారని ఆరోపించా రు. సీఎంగా రోజుకు 12 నుంచి 18 గంటలు పనిచేయాల్సిన కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఎక్కువకాలం కూర్చున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రజలను బాంచన్ కాళ్లుమొక్కుతా అనిపించాలని చూస్తున్నారని అన్నారు. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డలు దొరను బయటకు పంపుతారు కానీ అలా చేయరన్నారు. అక్కడ మోదీ... ఇక్కడ కేడీ ఇద్దరూ చీకటి ఒప్పందం చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ను ఎవరో శాసిస్తారని ప్రచారం చేస్తున్నారని, ఆ ధైర్యం ఎవరికీ లేదన్నారు. రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ యువతకు పెద్దపీట వేస్తుందన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుం కుమార్, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పిట్ట కథలు నమ్మకండి
హయత్‌నగర్: గారడీ మాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. మరోసారి ఆయన అధికారం కోసం బూటకపు మాటలు చెబుతున్నారని, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని కేసీఆర్‌కు ప్రజలను ఓట్లడిగేందుకు సిగ్గుండాలని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్‌నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, లింగోజిగూడ తదితర ప్రాంతాల్లో స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలసి ఆమె రోడ్ షోలో పాల్గొన్నారు. బంజారాకాలనీలో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. పార్లమెంట్లో కొట్లాడితే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కేసీఆర్‌పై నమ్మకంతో అధికారం అప్పగిస్తే ప్రజలకిచ్చిన వాగ్దానాలను పక్కబెట్టి తన కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెట్టుకున్నారన్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు జీహెచ్ఎంసీనీ అప్పగిస్తే నగరాన్ని మద్యంలో ముంచి యువకులకు, విద్యార్థులను మత్తుకు బానిసలను చేశారన్నారు. నల్లదనాన్ని బయటికి తెస్తానని చెప్పిన మోదీ నిర్ణయాల వల్ల నల్లదనం మరింత పేరుకుపోయే పరిస్థితి వచ్చిందని ఆమె విమర్శించారు. కథలు చెప్పేందుకు మళ్లొస్తున్నాడు కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు పిట్టల కథలు చెప్పేందుకు వస్తున్నారని, ఆయన్ను నమ్మవద్దని విజయశాంతి కోరారు. మార్పు కోసం ఈసారి టీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు, పించన్లు, డ్వాక్రా మహిళలకు మేలు జరిగే అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో మహాకూటమి నాయకులు పాల్గొన్నారు. -
అధికారమే ‘హస్తం’ లక్ష్యం
రాష్ట్రంలో అధికారాన్ని ‘హస్త‘గతం చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నేడు నామినేషన్ల ప్రక్రియ పూర్తికానుండడంతో ప్రచారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలతో పాటుగా ఛరిష్మా ఉన్న నేతలతో ప్రచారం చేయించాలని భావిస్తోంది. ఈనెల 28న వికారాబాద్, తాండూరులో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, వికారాబాద్: కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ స్థాయిల్లోనే బహిరంగ సభలను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఎక్కువమందిని తరలించడంతోపాటు నాయ కులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంటోంది. సోమవారం నామినేషన్లు ముగిసిన అనంతరం బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈనెల 23నుంచి రాష్ట్రంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సభలను ఏర్పాటుచేయాలని పార్టీ నిర్ణయించింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల కేంద్రాల్లో 28న బహిరంగసభలను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించింది. 28న నిర్వహించే సభల్లో సోనియాగాంధీ పాల్గొంటారా.. లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. వచ్చే నెల 2 నుంచి రెండు, మూడు రోజులపాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనేపథ్యంలో ఆయన కొడంగల్, పరిగిలో సభలను ఏర్పాటు చేసేందుకు నేతలు చర్యలు తీసుకుంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్‌లో నిర్వహించే సభలో రాహుల్‌గాంధీ పాల్గొనే అవకాశం మెండుగా ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈనెల 20 తరువాత రేవంత్ తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ప్రచారం నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ప్రచారం ప్రక్రియ వచ్చే నెల 5న ముగిసేవరకు నిత్యం కొనసాగనుంది. విజయశాంతి ప్రచారం.. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి విజయశాంతి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితర ముఖ్యులు ప్రచారంలో పాల్గొనని నియోజకవర్గాల్లో విజయశాంతి ప్రచారం చేసే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా మరికొంతమంది స్టార్డమ్ ఉన్న నేతలు, సినీ, సామాజిక రంగాల ప్రముఖులతో ప్రచారం నిర్వహించేలా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికలకు కేవలం 20 రోజులే సమయం ఉన్నందువల్ల ప్రచారంలో దూకుడు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. ప్రచారంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఉండాలని అభ్యర్థులకు సూచిస్తోంది. అయితే, తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్‌రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతోపాటు ఆయన వర్గంనేతలను బుజ్జగించే పనిలో పార్టీ పెద్దలు నిమగ్నమయ్యారు. నారాయణరావు ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నా.. ఇతర సీనియర్ నాయకులు అభ్యర్థికి సహకరించకపోయినా గెలుపు కష్టమేననే సంకేతాలు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి చేరినట్లు నేతలు చెబుతున్నారు. -
‘టీఆర్ఎస్ ఓటమి బాధ్యత టీడీపీది కూడా’
సాక్షి, హైదరాబాద్: పొత్తులతో టీడీపీ బాధ్యత తీరిపోలేదని, సీట్లు సాధించి ఉనికి చాటుకోవడానికి కాకుండా, టీఆర్ఎస్ ఓటమికోసం తెలుగుదేశం పార్టీ కృషి చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ క్యాంపెయినర్ విజయ శాంతి అన్నారు. శేరిలింగంపల్లి సీటుపై గాంధీభవన్‌లో జరిగిన పరిణామాలు ఇలాంటి అనుమానాలు కలిగిస్తున్నాయని అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. టీఆర్ఎస్ ఓటమి కోసం బాధ్యతగా పనిచేయాలన్నారు. సీట్ల సర్దుబాటు అనేది కాంగ్రెస్ పార్టీకి ఆమోదయోగ్యంగా ఉండాలని, టీఆర్ఎస్ పార్టీకి కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
‘ఆమె’ ప్రాతినిధ్యం ఎంత?
సాక్షి, హైదరాబాద్: ఓట్లపరంగా సగమున్నా.. సీట్ల కోసం పాట్లు తప్పడంలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎంతమంది మహిళలకు టికెట్లు లభిస్తాయన్న దానిపై స్పష్టతలేదు. కాంగ్రెస్ కనీసం పోటీ చేయనున్న తొంబై ఐదు స్థానాల్లో మహిళలకు పదిహేను స్థానాలు కేటాయించాలన్న డిమాండ్ ఉంది. అయితే, అధిష్టానం ఏ మేరకు కనికరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో మొత్తంగా 2.73 కోట్ల మంది ఓటర్లుండగా ఇందులో మహిళాఓటర్లు 1.35 లక్షల మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయించాలన్న డిమాండ్ ఉన్నా దాన్ని ఏ పార్టీ పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. 119 స్థానాలకుగానూ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అందులో నలుగురు సిట్టింగ్ మహిళాఅభ్యర్థులకు మాత్రమే టికెట్లు కేటాయించింది. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన 14 స్థానాల్లోనూ మరో ఇద్దరు, ముగ్గురికి మించి మహిళలుండే అవకాశం లేదు. దీంతో కాంగ్రెస్‌లో మహిళలకు ఎక్కువ టికెట్లు ఇవ్వడం ద్వారా మహిళాఓటర్లను తమ వైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి మహిళానేతలు విన్నవించుకుంటు న్నారు. ఆశావహులు ఎవరంటే... సిట్టింగ్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, డీకే అరుణ, పద్మావతిలకు టికెట్లు దాదాపు ఖరారు కానున్నాయి. వీరితోపాటు మాజీ మంత్రులైన సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కొండా సురేఖతోపాటు సీతక్కకు టికెట్లు దక్కడం ఖాయమే. వీటిని మినహాయిస్తే మరెక్కడా మహిళాసీట్ల కేటాయింపుపై స్పష్టత లేదు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నా ఎక్కడి నుంచి అన్నది తేలలేదు. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆర్మూర్ స్థానాన్ని ఆశిస్తుండగా, అది పొత్తుల్లో టీడీపీకి వెళుతుందా? లేక కాంగ్రెస్ నుంచి వేరే అభ్యర్థి ఎవరైనా బరిలో ఉంటారా.. అన్నది తేలాల్సి ఉంది. జుక్కల్ నుంచి మాజీ ఎమ్మెల్యే అరుణతార టికెట్ ఆశిస్తుండగా, మాజీ ఎమ్మెల్యే గంగారాం కూడా టికెట్ కోసం అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మాల సామాజిక వర్గం నుంచి గీతారెడ్డి కీలకనేతగా ఉన్నారని, మాదిగ సామాజిక వర్గం నుంచి మహిళలు ఎవరూ లేనందున తనకు టికెట్ ఇవ్వాలని అరుణతార కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు. రాష్ట్ర మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద కరీంనగర్ టికెట్ కోరుతుండగా, ఇక్కడ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నుంచి గట్టి పోటీ నెలకొంది. సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పేరు వినిపిస్తున్నా, పొత్తుల్లో భాగంగా అది టీడీపీకి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ రేణుకాచౌదరి, ఆదిలాబాద్ నుంచి జి.సుజాత, ఇల్లందు నుంచి హరిప్రియ, ఎల్లారెడ్డి నుంచి జమునా రాథోడ్ టికెట్లకై పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పది టికెట్లు కూడా మహిళలకు దక్కకపోవచ్చనే అభిప్రాయాన్ని గాంధీభవన్ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. -
విజయశాంతితో ఏఐసీసీ కార్యదర్శుల భేటీ
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతితో పార్టీ రాష్ట్ర పరిశీలకులు, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్ ఆమె నివాసంలో భేటీ అయ్యారు. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె సేవలను తిరిగి వాడుకోవాలనే ఉద్దేశంతోనే సమావేశమైనట్లు తెలి సింది. విజయశాంతి గత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ తిరిగి పోటీ చేసే అంశంపై వారు ఆమెతో చర్చించినట్లు తెలిసింది. దీనిపై కార్యకర్తలు, ముఖ్య నేతలతో మాట్లాడి, నాలుగు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటానని ఆమె వెల్లడించారు. మెదక్‌లో పార్టీ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఈ సీటుతో పాటు పూర్వ మెదక్ జిల్లాలో 8 స్థానాల్లో పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సైతం ఆమె మొగ్గు చూపినట్లు సమాచారం. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు జిల్లా అధ్యక్షులు గా ఇప్పటికే వచ్చిన పలువురు నేతల పేర్లపై విజయశాంతి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. భేటీ అనం తరం విజయశాంతి తన భర్త శ్రీనివాస్ ప్రసాద్‌తో కలసి రాష్ట్ర పర్యటనలో ఉన్న రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. -
విజయశాంతికి కీలక బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కమిటీ కొత్త నియామకం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూకుడు పెంచింది. పీసీసీ కమిటీలతో పాటుగా మరో తొమ్మిది అనుబంధ కమిటీలు నియమించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు సిద్ధమయ్యింది. దాదాపు సీనియర్లందరికీ కీలక బాధ్యతలు అప్పజెప్పిన రాహుల్ గాంధీ.. సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతిని కూడా రంగంలోకి దింపారు. స్టార్ క్యాంపెయినర్, తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు వంటి కీలక పదవులు కట్టబెట్టి ‘రాములమ్మ’కు ప్రాధాన్యం ఇచ్చారు. (చదవండి: రేవంత్ రెడ్డికి పదవి.. సీనియర్ల అసంతృప్తి!) పబ్లిసిటి కమిటీ ఈ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకట రెడ్డి నియమితులయ్యారు. అదే విధంగా కో- చైర్‌పర్సన్‌గా సౌదాగర్ గంగారాం, సభ్యులుగా దాసోజు శ్రవణ్, కూన శ్రీశైలం గౌడ్లను నియమించినట్లుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా పార్టీ వీడిన మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి పేరును తొలగించి రివైజ్డ్ కో- ఆర్డినేషన్ కమిటీని కూడా ప్రకటించింది. -
ప్రచార కమిటీ మంచిది: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: సీనియారిటీ, సామాజిక సమీకరణలు, జిల్లా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ ప్రచార కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రచార సారథిగా ఒక్కరిని నియమించే కంటే ప్రచార కమిటీని నియమించడం బాగుంటుందని చెప్పారు. సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.కె.అరుణ, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీలతో ఉమ్మడి కమిటీని నియమించే విషయాన్ని పరిశీలించాలని ఏఐసీసీకి సూచించారు. టీఆర్ఎస్ నేత కాంగ్రెస్‌లోకి... టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విద్యాసాగర్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ఘనంగా విజయశాంతి జన్మదిన వేడుకలు
మెదక్‌జోన్ : మాజీ ఎంపీ విజయశాంతి జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ నియోజకవర్గంలోని పలుగ్రామాలకు చెందిన కాంగ్రెస్, స్వచ్చంధ సంస్థ నాయకులు ఆదివారం హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణానికి చెందిన ద్వారకా చారిటబుల్ సొసైటీ చైర్మన్ మేడం బాలకృష్ట మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంకోసం అహర్నిశలు కృషి చేసిన ఘనత విజయశాంతికే దక్కుతుందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం విజయశాంతి పెట్టిన పార్టీని సైతం మరో పార్టీలో విలీనం చేసిన తెలంగాణ దేవత రాములక్కని కొనియాడారు.ఎంపీ ఫండ్స్ నుంచి ఊరూర బోరుబావులు, హైమాస్ట్ వీధి లైట్లు ఏర్పాటుచేసి మారుమూల పల్లెలకు తాగునీటితో పాటు వెలుతురులో ఉంచారని పేర్కొన్నారు. విజయశాంతిని కలిసిన వారిలో బొగుడభూపతిపూర్ ఎంపీటీసీ సభ్యురాలు రమ్య శ్రీనివాస్, సర్పంచ్ మంజుల యాదగిరి, మాజీ సర్పంచులు లక్ష్మీనారాయణ, నాయకులు నారాయణరెడ్డి, రాఘవవరెడ్డి, సంతోష్‌రెడ్డి, బాల్‌రాజు, సర్దన మాజీ సర్పంచ్ సుభాష్, పెంటయ్య, అరవింద్, వెంకట్, కిషన్‌రావు, భాను, శ్రీనివాస్, నాగరాజు, చిన్నశంకరంపేట నుండి ప్రవీణ్, మధు, కుమార్, మెదక్ పట్టణానికి చెందిన శ్రీనివాస్, సల్మాన్, మహేశ్, చౌదరి, ఖాళీల్, అనీల్, చిదంబరం ఉన్నారు. -
విజయశాంతి తరహాలో...
సాక్షి, చెన్నై : దక్షిణాదిలో ఇప్పుడు సంచలన నటి నయనతార రేంజే వేరు. ఆమె చిత్రాలు స్టార్ హీరోల చిత్రాలకు దీటుగా వసూళ్లను కొల్లగొడుతున్నాయి. యువ నటుల నుంచి, ప్రముఖ నటుల వరకూ నయనతార స్టార్‌డమ్‌ను ఉపయోగించుకోవడానికి తహతహ లాడుతున్నారనడం అతిశయోక్తి కాదు. నయనతార ప్రస్తుతం చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు తను నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్ని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. త్వరలో అజిత్‌తో విశ్వాసం చిత్రంలో జత కట్టడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా యువ క్రేజీ నటుడు శివకార్తికేయన్‌తో రెండోసారి నటించనున్నారు. రాజేశ్.ఎం ఈ చిత్రానికి దర్శకుడు. చాలా కాలం క్రితం లేడీ సూపర్‌స్టార్‌గా రాణించిన నటి విజయశాంతి మన్నన్ చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా నటించారు. పి.వాసు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో విజయశాంతి పాత్ర రజనీకాంత్ పాత్రకు దీటుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, అహంకారం కలగలిపిన ఆ పాత్రలో విజయశాంతి నటన ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నటి నయనతార కూడా లేడీసూపర్‌స్టార్ ఇమేజ్ను పొందారు. శివకార్తికేయన్‌కు జంటగా నటించనున్న చిత్రం వినోదానికి పెద్ద పీట వేసే కథ అయినా, నయనతార పాత్ర మాత్రం కోపం, పౌరుషం కలిగి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. -
మరో ఆకర్ష్‌కు తెరదీస్తున్న టీఆర్ఎస్
-
సుస్థిర పాలన కాంగ్రెస్‌కే సాధ్యం
తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్సే.. కేసీఆర్ మాటల మాంత్రికుడు టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మద్దూరులో కోదండరెడ్డి, విజయశాంతితో కలిసి రోడ్‌షో మద్దూరు, న్యూస్‌లైన్: దేశంలో సుస్థిర పాలన కాంగ్రెస్‌కే సాధ్యమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మద్దూరు మండల కేంద్రంలో ఎంపీ విజయశాంతి, కోదండరెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాప్టర్లో వారు మద్దూరుకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్ షో ప్రారంభం కాగా, పొన్నాల మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటల మాంత్రికుడని... ఆయన మాటలకు మోసపోవద్దని ప్రజలను కోరారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు దేవతగా మారిందని, కృతజ్ఞతగా ప్రజలందరూ చేతిగుర్తుకు ఓటు వేయూలని విజ్ఞప్తి చేశారు. జనగామ ఎమ్మెల్యేగా తనను, భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని కోరారు. అనంతరం పొన్నాల లక్ష్మయ్యను రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఖాజా ఆరీఫ్, విజయశాంతికి పొన్నాల వైశాలి శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మం డల శ్రీరాములు, నాయకులు గిరికొండల్‌రెడ్డి, బండి చంద్రయ్య, వెంకన్న, వెంకటేష్‌గౌడ్, జల్లి సిద్దయ్య, తిరుపతిరెడ్డి, గొర్రె సిద్దయ్య, మొగుళ్ల రాజిరెడ్డి, దాసరి ఆగారెడ్డి, బాల్‌రెడ్డి, బండి కష్ణమూర్తి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, పీఏసీఎస్ డెరైక్టర్లు రాచకొండ ఉప్పలయ్య, తిరుపతిరెడ్డి, రాచకొండ జయశీలాదేవి, సీపీఐ నాయకులు సీహెచ్.రాజారెడ్డి, టి.సత్యం పాల్గొన్నారు. కాగా, స్థానిక ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్ రోడ్‌షోకు గైర్హాజర్ కావడం చర్చనీయాం శంగా మారింది. రోడ్‌షోలో గాయని మధుప్రియ పాడిన పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. గిరిజనులతోపాటు వైశాలి నృత్యం చేయగా... పొన్నాల డప్పు కొట్టి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాహుల్ సభను విజయవంతం చేయాలి : పొన్నాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25వ తేదీన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వరంగల్‌కు రానున్నారని పొన్నాల తెలిపారు. ఈ మేరకు నిర్వహించనున్న బహిరంగ సభకు జనగామ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, తెలంగాణవాదులు, మిహ ళలు,యువకులు, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
కేసీఆర్.. అలీబాబా చాలీస్‌చోర్: విజయశాంతి
సాక్షి, సంగారెడ్డి: ‘ కేసీఆర్ ఒక అలీబాబా చాలీస్‌చోర్.. టీఆర్ఎస్కు ఓటువేస్తే దొంగోడి చేతికి తాళం చెవి ఇచ్చినట్లే’ అని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి అన్నారు. ఆదివారం ఆమె మెదక్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ‘దొరా.. నీ కాల్మొక్తా’ అని ప్రజలు వేడుకోవాల్సిన రోజులు వస్తాయన్నారు. ఉద్యమాల పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంది అంతా ఇంత కాదని ఆరోపించారు. దొరల తెలంగాణ కన్నా సీమాంధ్రతో కూడిన తెలంగాణే నయమన్నారు. -
కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకో: రాములమ్మ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గతంలో ఇచ్చిన మాట తప్పారని మెదక్ ఎంపీ విజయశాంతి (రాములమ్మ) మండిపడ్డారు. మాట తప్పడం కేసీఆర్ నైజమని ఆమె గుర్తు చేశారు. ఇచ్చిన మాట మీద నిలబడని కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్ కావాలని డిమాండ్ చేశారు. గురువారం మెదక్‌లో స్థానిక అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాములమ్మ గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్‌పై రాములమ్మ నిప్పులు చెరిగారు. తాను మెదక్ ఎంపీగా ప్రజలకు కోసం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా ఆ పార్టీ సీనియర్ నేతలు హరీష్‌రావు, పద్మా దేవేందర్ రెడ్డిలు అడ్డుకున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో వీధి దీపాలు, నీటీ మోటార్లు ఏర్పాటుకు నిధులు విడుదల చేసిన వాటిని ఆ సదరు నేతలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. తాను తెలంగాణ కోసం ఎప్పటి నుంచో పోరాడిన సంగతి ఈ సందర్బంగా రాములమ్మ గుర్తు చేశారు. నిన్నకాక మొన్న పుట్టిన టీఆర్ఎస్ తెలంగాణ కోసం పోరాటాం చేశాననడం విడ్డూరంగా ఉందని రాములమ్మ ఎద్దేవా చేశారు. -
సిట్టింగులకు ఫిట్టింగ్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు జట్టుకట్టడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. కుదిరితే పొత్తు, లేకుంటే విలీనంతోనే ఎన్నికలకు వెళ్లేందుకు ఇరుపార్టీల పెద్దల మధ్య ఒక మౌఖిక అంగీకారం కుదిరినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ దోస్తీ జిల్లాలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. మెదక్ జిల్లాలో ఆరు అసెంబ్లీ సీట్ల కోసం టీఆర్ఎస్ పట్టుబడుతుండగా, ఇందులో నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ వారే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మేరకు అత్యంత నమ్మదగిన వ్యక్తుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది. కొలిక్కివచ్చిన కసరత్తు! టీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీలు వచ్చే సాధారణ ఎన్నికల్లో కలిసే పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయటం, లేదా పొత్తు పెట్టుకోవడం అనే అంశంపై ఇరుపార్టీల నేతల మధ్య వారం రోజులుగా నెలకొన్న హై‘డ్రామా’ ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. వీలైనన్ని ఎక్కువ సీట్లు, రాష్ట్రంలో ‘ముఖ్య’మైన బాధ్యతలు అప్పగించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. పార్టీని విలీనం చేయమని ఒత్తిడి చేయడం తప్ప.. టీఆర్ఎస్ లేవదీసిన అభ్యంతరాలపై కాంగ్రెస్‌నేతలు సమాధానం చెప్పడం లేదు. దీంతో ఆగ్రహంగా ఉన్న టీఆర్ఎస్ అధినాయకత్వం బీజేపీతో పొత్తు పెట్టుకుంటామనే బెదిరింపు సంకేతాలను ఇప్పటికే కాంగ్రెస్‌కు పంపింది. దీంతో కలవరపడ్డ కాంగ్రెస్ నేతలు గులాబీ ముఖ్యనేతతో మాట్లాడినట్టు సమాచారం. శత్రుశేషం లేకుండా చూసుకునేందుకు.. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా పేరుగాంచిన మెదక్ జిల్లాపైనే కేసీఆర్ ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పైగా ఆయన సొంత జిల్లా కూడా ఇదే కావడంతో టీఆర్ఎస్కు బలమైన పునాదులు వేసుకోవడంతో పాటు శత్రుశేషం లేకుండా చేసుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందులోభాగంగానే సిద్దిపేట, మెదక్, దుబ్బాక, సంగారెడ్డి, జోగిపేట, గజ్వేల్, అసెంబ్లీ సీట్లు కావాలని కేసీఆర్ డిమాండ్ చేసినట్లు సమాచారం. వీటిలో సిద్దిపేట, మెదక్ మినహా మిగిలిన నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ ఆరు స్థానాలను కోరడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్ బహిష్కృత నేత, మెదక్ ఎంపీ విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్ల సమాచారం. సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ శతృత్వం ఉంది. వీలుచిక్కినప్పుడు కేసీఆర్‌పై, ఆయన కుటుంబసభ్యులపై విమర్శల వర్షం కురిపించడంతో పాటు అవసరమైతే కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ఇప్పటికే జగ్గారెడ్డి ప్రకటించారు. అందువల్లే అటు విజయశాంతికి, ఇటు జగ్గారెడ్డికి చెక్ పెట్టాలనే ఆలోచనతోనే మెదక్, సంగారెడ్డి సీట్ల కోసం టీఆర్ఎస్ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దామోదర సీటుకూ గండం కేసీఆర్ కోరుతున్న టికెట్లలో దామోదర రాజనర్సింహ సీటు కూడా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ తొలి సీఎం దళితుడే ఉంటాడని ప్రకటించిన కేసీఆర్, ఆ ఛాన్స్ దామోదర రాజనర్సింహకు ఇచ్చేందుకు మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే డిప్యూటీ సీఎంగా ఉన్న దామోదర రాజనర్సింహ సీఎం అయ్యేందుకు ప్రయత్నించినా రాష్ట్రపతి పాలనతో ఆ కోరిక నెరవేరలేదు. కానీ రేపొద్దున ఆయన గెలిచి ముఖ్యమంత్రి పదవికోసం దళితకోటాను తెరపైకి వస్తే ప్రమాదముంటుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అందువల్లే, కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటూ టీడీపీ తరఫున అందోల్ టికెట్ ఆశిస్తున్న మాజీమంత్రి, టీడీపీ నేత బాబూమోహన్‌ను టీఆర్ఎస్ నుంచి రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం. ఇక సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌లో టీఆర్ఎస్ పార్టీకి సహజ సిద్ధంగానే బలమైన పార్టీ కేడబ్ ఉంది. కాబట్టి ఈ మూడు సీట్లు కూడా తమకే కావాలని గులాబీ నేతలు అడుగుతున్నట్లు సమాచారం. -
రాములమ్మ ఝలక్
సాక్షి, సంగారెడ్డి: రాములమ్మ గులాబీ దండుకు ఝలక్ ఇచ్చారు. టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులకు అప్పగించిన రూ.1.36 కోట్ల విలువైన ఎంపీ లాడ్స్ పనులను ఆ పార్టీ బహిష్కృత నేత, మెదక్ ఎంపీ విజయశాంతి వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఆమె కలెక్టర్‌కు ఇటీవల లేఖ రాశారు. పనులు అప్పగించి ఆరు నెలలు దాటినా పూర్తిచేయలేదనే కారణంతోనే రద్దు చేయాలని ప్రతిపాదించినట్లు విజయశాంతి పేర్కొంటున్నా.. టీఆర్ఎస్ పార్టీపై ఉన్న కోపంతోనే విజయశాంతి ఈ నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతోంది. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎంపీ లాడ్స్ కింద ఏటా రూ.5 కోట్ల నిధులను ప్రతి ఎంపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిధుల కింద విజయశాంతి కమ్యూనిటీ భవనాలు, సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు తదితర రకాల పనులు చేపట్టారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు కోరిన వెంటనే అప్పట్లో పనులు అప్పగించారు. విజయశాంతి టీఆర్ఎస్ నుంచి సస్పెండైన తర్వాత పార్టీ కార్యకర్తలు మొహం చాటేశారు. ఈ నేపథ్యంలో దగ్గరకు రాని ఆ పార్టీ కార్యకర్తల నుంచి పనులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆమె సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రూ.1.36 కోట్ల మేర మంజూరు చేసిన పలు రకాల పనులను రద్దుచేయాలని కలెక్టర్‌కు లేఖ రాశారు. రద్దు చేసిన పనుల స్థానంలో కొత్త పనుల జాబితాను సైతం జత చేసినట్టు సమాచారం. విజయశాంతి కోరిక మేరకు పనుల రద్దుకు సాధ్యాసాధ్యాలను అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాల పర్యవేక్షణలో గల ఈ పనులు ఒక వేళ ఇప్పటికే ప్రారంభమైతే రద్దుకు ఆస్కారం వుండదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దశలో రద్దుకు ప్రతిపాదించిన పనుల స్థితిగతులపై సంబంధిత విభాగాల పర్యవేక్షక ఇంజనీర్ల(ఈఈ) నుంచి ప్రణాళిక శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఇంకా ప్రారంభం కాని పనులను ఎంపీ కోరిక మేరకు కలెక్టర్ రద్దు చేసే అవకాశాలున్నాయి. -
లైన్...క్లియర్
మెదక్, న్యూస్‌లైన్: మూడు దశాబ్దాల స్వప్నం సాకారం కాబోతోంది. మెతుకు సీమ ప్రజల పట్టువీడని పోరాటాలు.. ఆకలెరుగని దీక్షలు.. అలుపెరుగని ఆందోళనలు.. ప్రజా ప్రతినిధుల ప్రయత్నాలు..వెరసి మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుంది. దీంతో గురువారం రైల్వేశాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సధర్మ దేవరాయ్, ఈఈ రవీంద్రనాథ్, జేఈ వరుణ్‌కుమార్, డిప్యూటీ చీ్‌ఫ్ కమిషనర్ సుధాకర్, మెదక్ ఆర్డీఓ వనజాదేవి, మెదక్ డీఎస్పీ గోద్రూ, సీఐ విజయ్‌కుమార్‌లు మెదక్ పట్టణంలో కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. మూడు దశాబ్దాల ఉద్యమం మెదక్ -అక్కన్నపేటకు రైల్వేలైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ 1980లోనే ఊపిరి పోసుకుంది. ఈ ప్రయత్నంలో భాగంగా స్థానిక న్యాయవాది సుభాష్‌చంద్రగౌడ్ అధ్వర్యంలో రైల్వేసాధన సమితి ఏర్పడింది. మెదక్ ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డిలకు తోడు స్థానిక ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున రైల్వేలైన్ కోసం ఉద్యమాన్ని చేపట్టారు. అక్కన్నపేట నుండి మెదక్ పట్టణానికి సుమారు 17.20 కిలో మీటర్ల దూరం పుష్, పుల్(వచ్చి వెనక్కి వెళ్లేది)రైలు వేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కాస్ట్ ఆఫ్ షేరింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 శాతం నిధులివ్వడానికి అంగీకారం తెలిపారు. అనంతరం ఎంపీ విజయశాంతి కృషి మేరకు రైల్వేలైన్ సర్వేకు ఆమోదం లభించింది. ఈ మేరకు ఎంపీ కోటా నుండి రూ.కోటి విడుదల కాగా, రాష్ట్ర ప్రభుత్వం నుండి మరో రూ. కోటి నిధులు విడుదలయ్యాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టు వ్యయం రూ.129.32 కోట్లుగా నిర్ణయించిన అధికారులు 2012లో పింక్‌బుక్‌లో నమోదు చేశారు. మెదక్ -అక్కన్నపేట రైల్వే లైన్‌కు 80 గ్రామాల పరిధిలోని 131.14 హెక్టార్ల భూమితోపాటు అటవీశాఖకు చెందిన 66 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గతంలోనే అధికారులు తేల్చారు. అక్కన్నపేట నుంచి వచ్చేదారిలో లకా్ష్మపూర్, శమ్నాపూర్లతోపాటు మెదక్ పట్టణంలో రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మెదక్ పట్టణ శివారులోని సబ్‌స్టేషన్ వెనకాల గల డంప్‌యార్డ్ దగ్గర మెదక్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. నా శ్రమ ఫలించింది మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ కోసం తీవ్రంగా శ్రమించాను. కేంద్రమంత్రి మల్లికార్జున్‌ఖర్గే, రైల్వే ఇంజనీరింగ్ బోర్డు చైర్మన్ ఎస్.కె.జైన్, సీఎం, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటీవ్లతో నిరంతరం మాట్లాడుతూ లైన్ మంజూరు కృషి చేశాను. ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయించాను. రైల్వేలైన్ త్వరితగతిన పూర్తయితే ఈ ప్రాంత వాసుల రవాణా కష్టాలు తీరుతాయి. -విజయశాంతి, ఎంపీ, మెదక్ -
ఎంపీ నిధులిచ్చా.. అభివృద్ధి చేయలేదా?
నంగునూరు, న్యూస్‌లైన్: ‘అభివృద్ధి పనుల గురించి మీ ఎమ్మెల్యేకు ఎంపీ ఫండ్ నుంచి డబ్బులిచ్చా.. మీ ఊరిని అభివృద్ధి చేయలేదా?.. మీ దొర సిద్దిపేట నియోజకవర్గంలో అద్భుతాలు చేశానని గొప్పలు చెబుతున్నారే మరి’ అంటూ హరీష్‌రావుపై మెదక్ ఎంపీ విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం మండలంలోని ఖానాపూర్, నంగునూరులో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. రెండు గ్రామాల్లో జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తూ ‘తెలంగాణ’ను ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండాను సిద్దిపేటలో ఎగురవేయాలన్నారు. అభివృద్ధి చేసిన వారిని తిరిగి గెలిపించాలని, ఇంతకు మీ ఊరిలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ‘మా ఊరిలో అభివృద్ధి జరగలేదని స్థానికులు సమాధానం ఇచ్చారు. ‘నేనే కదయ్యా మీ ఎమ్మెల్యేకు అభివృద్ధి పనులు చేస్తానంటే ఎంపీ నిధులిచ్చాను. ఎంతో అభివృద్ధి చేశానని గొప్పలు చెబుతున్నారు, ఏమీ చేయలేదా’ అని ప్రశ్నించారు. ‘అలాంటి ఎమ్మెల్యేను వరుసగా ఎలా గెలిపిస్తున్నారు ఈసారి బుద్ధి చెప్పండి’ అంటూ విజయశాంతి ఆవేశంగా మాట్లాడారు. తెలంగాణతో పాటు అభివృద్ధి ముఖ్యమని అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసి వంద కోట్లు నిధులు అడిగానని అవి రాగానే ఈ ప్రాంతానికే ఖర్చు చేస్తామన్నారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ పార్టీ.. వచ్చే శీతాకాల సమావేశంలోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి నంగునూరులో బీసీ, శాలివాహణ భవనం, ఎస్సీ,బీసీ కాలనీలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు, ఖానాపూర్‌లో రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా నంగునూరు, ఖానాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వానరాశి నర్సయ్య, హన్మంతు, రాజు, సతీష్రెడితో పాటు వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు గంప మహేందర్‌రావు, నాయకులు సాకి ఆనంద్, సికిందర్, పార్టీ మండల అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి, సర్పంచ్ మరియమ్మ పాల్గొన్నారు.