
మెదక్‌జోన్: ‘కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా అంతం చేస్తానంటూ కంకణం కట్టుకున్నావా దొరా..’అని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ సోమవారం మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పట్టణంలో సింహగర్జన పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. విజయశాంతి మాట్లాడుతూ ‘సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా? నీ కొడుకు చిన్నదొర మంత్రి అయ్యేవాడా?’అని నిలదీశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఖతం చేయడం నీ జేజమ్మ తరం కాదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం వెళ్లేవారు వెళ్లిపోతున్నా కాంగ్రెస్‌లోకి యువరక్తం వస్తోందన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారంటూ చిన్నదొర చెప్పే మాటలు ఎవరూ నమ్మరని అన్నారు. మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్ యాదవ్ తనవైపే ఉన్నారంటూ కేసీఆర్ చెబుతున్నారే కానీ ఏనాడైనా వారు తెలంగాణకు వచ్చారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే రైతులకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment