
సాక్షి, గుంటూరు: రెడ్‌బుక్ రాజ్యాంగానికి డీఎస్పీ బలైపోయారు. పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీని అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టలేదని ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల మండలంలో జూలకల్లులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఈ కేసులో వైఎస్సార్‌సీపీ వారిని ఇరికించాలని ఓ ఉన్నతాధికారి ఆదేశించగా, ఆ తప్పు తాను చేయలేనని డీఎస్పీ జగదీష్ తోసిపుచ్చారు. దీంతో డీఎస్పీని హెడ్ క్వార్టర్ కు పిలిపించిన ఉన్నతాధికారి దూషించారు. పోస్టింగ్ ఇచ్చిన మూడు నెలలకే డీఎస్పీ జగదీష్‌ను బదిలీ చేశారు. డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై పోలీసులు నిప్పులు చెరుగుతున్నారు.
