Red Book
-
Ambati Rambabu: నారా లోకేష్ ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవాలి
-
వీర విధేయులతో ‘సిట్’
పచ్చ చొక్కాలు ధరించలేదు.. అదొక్కటే తక్కువ..! ఖాకీ దుస్తులు వేసుకున్నాగానీ రెడ్‌బుక్ కుట్రలు అమలు చేయడంలో నాలుగాకులు ఎక్కువే చదివారు..! ఇదీ చంద్రబాబు సర్కారు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తీరు!! వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సీఐడీ దర్యాప్తు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. కొండను తవ్వినప్పటికీ కనీసం ఎలుకను కూడా పట్టుకోలేక చేతులెత్తేసింది. దాంతో బరితెగించి బెదిరింపులకు పాల్పడి అక్రమ కేసుతో వేధించేందుకే సిట్‌ను ఏర్పాటు చేసింది. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులను ఏరికోరి మరీ సిట్‌లో సభ్యులుగా నియమించింది. ప్రభుత్వ పెద్దల అంచనాలను అందుకోవడమే లక్ష్యంగా సిట్ సభ్యులు దర్యాప్తు పేరుతో యథేచ్ఛగా వేధింపులకు తెగబడుతున్నారు. అక్రమ నిర్బంధాలు, బెదిరింపులు, వేధింపులతో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు ప్రమాణాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ సిట్ సభ్యులు సాగిస్తున్న వ్యవహారాలపై పోలీసు వర్గాల్లోనే తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. సిట్ సభ్యుల ట్రాక్ రికార్డే అంతేననే ఏకాభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. – సాక్షి, అమరావతిరెడ్బుక్ కోసమే.. తెలంగాణ నుంచి ఏపీకిసిట్లో మరో సభ్యుడు ఎల్.సుబ్బారాయుడి కుటుంబానికి టీడీపీతో బలమైన అనుబంధం ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కుటుంబం టీడీపీ తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన సుబ్బారాయుడును అందుకే చంద్రబాబు పట్టుబట్టి మరీ ఏపీకి డిప్యుటేషన్‌పై రప్పించుకుని రెడ్‌బుక్ కుట్ర అమలు బాధ్యతలను అప్పగించారు. తిరుపతి ఎస్పీగా ఉండగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలతో ఆయన వేధించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో టికెట్ల జారీలో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు దుర్మరణం చెందటానికి ఎస్పీగా ఆయన వైఫల్యమే ప్రధాన కారణం. అయినప్పటికీ సుబ్బారాయుడును ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టింది. ఆ వెంటనే ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమించి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. అనంతరం మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడిగా నియమించింది.పచ్చ బాస్‌కు వీరవిధేయుడుసిట్ ఇన్చార్జ్గా నియమితులైన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు వ్యవహార శైలి ఆది నుంచి తీవ్ర వివాదాస్పదమే. అసలు డీజీ స్థాయి అధికారి చీఫ్‌గా ఉన్న సీఐడీకి అప్పగించిన కేసును... ఐజీ స్థాయి అధికారి అయిన రాజశేఖర్‌బాబు నేతృత్వంలోని సిట్‌కు అప్పగించడం వెనుకే పక్కా కుట్ర దాగుంది. సాధారణంగా జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను సిట్ లాంటి దర్యాప్తు సంస్థలకు ఇన్చార్జిగా నియమించరు. వారు తమ జిల్లా, పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ఇతర కీలక బాధ్యతలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.సాధారణంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారికి సిట్ ఇన్చార్జ్ లాంటి బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకు విరుద్ధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబును సిట్ ఇన్చార్జ్గా నియమించడం గమనార్హం. టీడీపీకి ఆది నుంచి వీరవిధేయుడుగా ఉన్న ట్రాక్ రికార్డు ఆయన సొంతం. గతంలో అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్నప్పటి నుంచి టీడీపీకి వీర విధేయుడనే ముద్రను చెరిపేసుకునేందుకు ఆయన ఏనాడూ ప్రయత్నించ లేదు. పైగా అదే తనకు అదనపు అర్హతగా భావించారు. గతేడాది టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే విజయవాడ పోలీస్ కమిషనర్‌గా నియమితులైన ఆయన రెడ్‌బుక్ కుట్రను అమలు చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు వెనుక మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించారు. వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరాల చట్టాన్ని ప్రయోగించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసుల్లో 75 శాతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 కింద కేసుల నమోదు చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో రాజశేఖర్‌బాబు అరాచక పర్వానికి అడ్డుకట్ట పడింది. చెబితే చాలు.. ఎంత అడ్డగోలు పనైనా చేసేందుకు సదా సిద్ధంగా ఉంటారనే ఏకైక అర్హతతోనే ఆయన్ని సిట్ చీఫ్‌గా నియమించినట్టు తెలుస్తోంది. ఇక వలపు వల (హనీట్రాప్) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని, అక్రమ కేసులను దగ్గరుండి పర్యవేక్షించింది రాజశేఖర్బాబే! ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు అధినేత సజ్జన్ జిందాల్‌ను వేధించారు. దాంతో రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను జేఎస్‌డబ్ల్యూ గ్రూపు మహారాష్ట్రకు తరలించేసింది.‘స్పా’ంటేనియస్ అధికారి కొల్లి శ్రీనివాస్సిట్లో మరో సభ్యుడైన ఒంగోలు విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్ ట్రాక్ రికార్డు అత్యంత వివాదాస్పదం. గతంలో విజయవాడలో అదనపు డీసీపీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు. ‘స్పా’లలో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడం వెనుక ఆయనే ప్రధాన సూత్రధారి. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి వీఆర్‌కు పంపింది. ఇప్పుడు టీడీపీ సర్కారు ఆయన్ను సిట్ సభ్యుడిగా నియమించింది.ఆ ఇద్దరూ అంతే...!సిట్‌లో మిగిలిన ఇద్దరు సభ్యులు సీఐడీ అదనపు ఎస్పీ ఆర్.శ్రీహరిబాబు, నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ పి.శ్రీనివాస్ తీరు కూడా అంతే. గతంలో ఆర్.శ్రీహరి బాబు గురజాల డీఎస్పీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కాల్ రికార్డుల వివరాలను అక్రమంగా సేకరించి ఇతరులకు చేరవేశారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు బ్లాక్ మెయిలింగ్ కుట్రలకు సహకరిస్తూ ఎమ్మెల్యేల కాల్ డేటాను అక్రమంగా సేకరించి ఇచ్చారు. దాంతో నాడు శ్రీహరిబాబును వైఎస్సార్సీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అదే అర్హతగా భావించి ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయన్ను సిట్ సభ్యుడిగా నియమించింది. సిట్‌లో మరో సభ్యుడిగా ఉన్న నంద్యాల డీఎస్పీ పి.శ్రీనివాస్ అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్ర పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఆయన కుటుంబం టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. ఎస్సై, సీఐగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధులు నిర్వహించిన శ్రీనివాస్ టీడీపీకి అనుకూలంగా పని చేయాలని ఇతర అధికారులపై ఒత్తిడి తేవడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఐలు, ఎస్సైల పోస్టింగుల్లో ఆయన మాటే చెల్లుబాటైందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అంతటి టీడీపీ వీర విధేయుడు కాబట్టే ఆయన్ను సిట్‌లో సభ్యుడిగా చేర్చారు. -
పోలీసుపై రెడ్ బుక్ రూల్
టీడీపీ కూటమి పెద్దల పైశాచికత్వం..శాంతిభద్రతలు అస్తవ్యస్తం ఓవైపు వేటు వేసి.. మరోవైపు కొత్తవారు కావాలంటూ కేంద్రానికి లేఖలు ‘రెడ్‌బుక్ కుట్ర’కు సెల్యూట్ చేస్తేనే పోస్టింగ్... నిబంధనలు పాటిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్’ తాము చెప్పినవారిని వేటాడితేనే పోస్టింగ్.. విధులు నిక్కచ్చిగా నిర్వర్తిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్.. పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తామంటేనే పోస్టింగ్.. ఖాకీ చొక్కా వేసుకున్నాం కదా .. చట్టం ముందు అందరూ సమానం అంటే మాత్రం నో పోస్టింగ్..ఇదీ పోలీసు శాఖపై చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తున్న దుర్నీతి. సాక్షి, అమరావతి: సీనియర్ అధికారులను.. వెంటాడి వేటాడి పోస్టింగ్‌లు ఇవ్వకుండా మనో వ్యథకు గురిచేస్తూ.. మంచి అధికారులను కుట్రలు చేసి పక్కనపెట్టి పాలన సాగిస్తూ.. ఉన్న అధికారులను రెడ్ బుక్ రూల్ కోసం వాడుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. శాంతిభద్రతల పరిరక్షణకు ఉద్దేశించిన పోలీసు వ్యవస్థతో ఆడుకుంటోంది. రాజకీయ స్వార్థంతో భ్రషు్టపట్టిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉందన్నదీ సంబంధం లేకుండా విధులు నిర్వర్తించే పోలీసులపై కక్ష కట్టి వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల తర్వాత కూడా రాష్ట్రంలో ఏకంగా 199 మంది పోలీస్ అధికారులకు పోస్టింగులు లేవంటే రెడ్ బుక్ కుట్ర ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. ⇒ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే పోలీస్ శాఖలో హోదా ఉన్న అధికారే. అయితే, చంద్రబాబు ప్రభుత్వ వేధింపులకు బలైనవారిలో అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులే కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే నలుగురు ఐపీఎస్‌లు, నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలు ఉండడం గమనార్హం. వీరందరికీ పోస్టింగులు ఇవ్వలేదని సాక్షాత్తు రాష్ట్ర శాసనసభకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఇంతమంది పోలీసు అధికారులను వెయిటింగ్లో ఉంచడం దేశ చరిత్రలోనే లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక కక్షపూరితంగా ఐదుగురు ఐపీఎస్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది కూడా.వెయిటింగ్లో నలుగురు ఐపీఎస్‌లు2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యలకు తెగించింది. 24 మంది ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. అధికారంలో ఉన్న పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ విధానాలను అమలు చేసే ఐపీఎస్‌పై ప్రతాపం చూపించింది. ఐదు నెలల తరువాత దశలవారీగా కొందరు ఐపీఎస్‌లకు అదీ అప్రాధాన్యమైన పోస్టింగులు ఇచ్చింది. కానీ, నేటికీ నలుగురిని వెయిటింగ్‌లోనే ఉంచింది. సీనియర్ ఐపీఎస్‌లు కొల్లి రఘురామ్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, జాషువాలు అందుబాటులో ఉన్నా సరే వారి సేవలను వినియోగించుకోవడం లేదన్నది సుస్పష్టం.కుట్ర పన్ని.. కక్షకట్టి రెడ్‌బుక్ కుట్రతో ఐదుగురు ఐపీఎస్‌లపై చంద్రబాబు ప్రభుత్వం కక్షకట్టింది. సీనియర్ ఐపీఎస్‌లు పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్‌కుమార్, ఎన్.సంజయ్, టి.కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేసింది. వలపు వల విసిరి బడా బాబులను బ్లాక్‌మెయిలింగ్ చేయడమే పనిగా పెటు్టకున్న కాదంబరి జత్వానీ అనే ముంబై మోడల్‌తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేయడం అందర్నీ విస్మయపరిచింది. ⇒ చంద్రబాబు రాజగురువు రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను వెలికితీశారనే కక్షతోనే ఎన్.సంజయ్‌పై అక్రమ కేసులు బనాయించి సస్పెండ్ చేశారు. కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కళ్లల్లో ఆనందం చూడడం కోసం డీజీ పీవీ సునీల్‌కుమార్‌ను వివరణ కూడా కోరకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించిన అభియోగాలపై ఆయనను సస్పెండ్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం.తమ కుట్రల అమలు కోసం కేంద్రానికి లేఖలు ఉన్న అధికారులనేమో వేధిస్తూ.. తమకు మరో ముగ్గురు ఐపీఎస్‌లు కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. మరీ ముఖ్యంగా యూపీ కేడర్‌లో పనిచేస్తున్న అధికారి కోసం పట్టుబడుతోంది. ఆయనైతే తమ కుట్రల అమలుకు, ప్రత్యర్థులను వేటాడేందుకు సమర్థంగా ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. అయితే, డిప్యూటేషన్ నిబంధనలు అనుమతించకపోవడంతో కేంద్రం నుంచి స్పందన రాలేదు. కీలకమైనప్పటికీ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే క్షేత్రస్థాయి పోలీసులను కూడా చంద్రబాబు సర్కారు వేధిస్తోంది. నాన్ క్యాడర్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు కలిపి మొత్తం 195 మందికి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి పోస్టింగులు ఇవ్వకపోవడమే దీనిని నిదర్శనం. పాలనాపరమైన అంశాలతో నలుగురైదుగురిని స్వల్ప కాలం వెయిటింగ్లో ఉంచడం సాధారణం. తర్వాత ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సద్వినియోగం చేసుకోవడం రివాజు. ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసింది. ఇలా పక్కనపెట్టినవారిలో నాన్ క్యాడర్ ఎస్పీలు పి.సత్తిబాబు, పి.వెంకటరత్నం, బి.లక్ష్మీనారాయణ, ఎ.సురేశ్‌బాబు ఉన్నారు. 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలనూ వెయిటింగ్లో పెట్టింది.జీతాలివ్వకుండా ‘పచ్చ’ పైశాచికత్వం ఏకంగా 199 మంది పోలీసులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. వెయిటింగ్లో ఉన్నారని చెప్పి వీరికి 10 నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఆర్ధికంగా పోలీసు అధికారులు ఇబ్బందులు పడుతూ ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీసు అధికారులు ఇంతటి దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసుల సెల్యూట్
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లాలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలిని ఎత్తుకెళ్లిన టీడీపీ నేతలను వదిలేసి.. జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ కీలక నేతలపై ఎస్సైతో కేసు పెట్టించడం చర్చనీయాంశమైంది. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక రోజున వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు భారతిని టీడీపీ నేతలు బలవంతంగా ఎత్తుకెళ్లారు.టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయకపోగా.. చివరకు పోలీసులతోనే ఫిర్యాదు చేయించి వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఓ దళిత మహిళను టీడీపీ నేతలు కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశి్నంచిన వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఎస్ఐ ఫిర్యాదుతో.. ఉప ఎన్నిక రోజున వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బాగేపల్లి టోల్‌ప్లాజా నుంచి రామగిరి తీసుకెళ్లాల్సిన పోలీసులు.. మార్గంమధ్యలోని చెన్నేకొత్తపల్లి నుంచి తిరుగు పయనమయ్యారు. ఎంపీటీసీ సభ్యులను సకాలంలో సమావేశ మందిరానికి తీసుకురాలేకపోవడానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కారణమంటూ చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుకొండలో కిడ్నాప్‌నకు గురైన ఎంపీటీసీ సభ్యురాలు రామగిరిలోనే తప్పిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. చెన్నేకొత్తపల్లి ఎస్సై ఫిర్యాదు మేరకు పెనుకొండ ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. 25 మందిపై ఎఫ్ఐఆర్ శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపు దుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్‌రెడ్డి సహా రాప్తాడుకు చెందిన శేఖర్, మరూరు వెంకటేశ్, డోలా రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, యలక్కుంట్ల అమర్నాథ్రెడ్డి, నరసింహారెడ్డి, కురుబ నాగిరెడ్డి, రామాంజినేయులు, ఓబుగారి హరినాథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మీనుగ నాగరాజు, బాబురెడ్డి, ఎం.గోవిందరెడ్డి, చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, మాధవరాజు, రఘునాథరెడ్డి, సుబ్బిరెడ్డి, ఎస్టీడీ శ్రీనివాసరెడ్డి, నీరుగంటి నరసింహులు, చీమల కేశవయ్య, ఎస్.రవీంద్రరెడ్డిపై కేసు నమోదు చేశారు. వీరందరిపైనా బీఎన్ఎస్ సెక్షన్లు 192, 132, 125, 351 (2), 79, 223 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. -
ఎర్రబుక్కు తెల్లమొహం!
ఎర్ర పుస్తకం తెల్లమొహం వేసినట్లయింది. రాజ్యాంగ విధి విధానాలను కూడా ప్రైవేటీకరించబోయిన తెంపరితనానికి చెంపలు వాయించినట్లయింది. ఇష్టారీతిన పోలీసు రాజ్యాన్ని నడుపుతామంటే, పౌరహక్కుల్ని చిదిమేస్తామంటే అంగీకరించేది లేదని ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానం ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించింది. ఇప్పుడదే హెచ్చరికను జనతా న్యాయస్థానం కూడా జారీ చేసినట్లయింది. రాష్ట్రంలో 56 మండల పరిషత్తు అధ్యక్ష ఉపాధ్యక్ష స్థానాలకు, కడప జిల్లా పరిషత్తు అధ్యక్ష స్థానానికి మొన్న ఉపఎన్నికలు జరిగాయి. ఓట్లు వేసింది ఎంపీటీసీలు, జడ్పీటీసీలే. వీరు క్షేత్రస్థాయి ప్రజా ప్రతినిధులు. జనం గుండె చప్పుళ్లను నిరంతరం వినగలిగేవాళ్లు. ప్రజల నాడీ స్పందనను ముందుగా పసిగట్టగలిగేవాళ్లు.ఉపఎన్నికల్లో అధికార కూటమి పన్నిన వ్యూహం ఫలించ లేదు. విపక్షమైన వైసీపీ ఘనవిజయాన్ని నమోదు చేసింది. కడప జడ్పీతో సహా 40 స్థానాలను ఆ పార్టీ అవలీలగా గెలవగలిగింది. కూటమికి 10 స్థానాలు దక్కాయి. మిగిలినచోట్ల ఎన్నిక వాయిదా పడింది. వైసీపీ టిక్కెట్‌పై గెలుపొందిన స్థానిక ప్రతినిధులు ఆ పార్టీ పక్షాన్నే నిలవడంలో వింతేముందని ఇప్పుడు కూటమి చిలుకలు పలుకుతుండవచ్చు. కానీ ఏపీలో ఈ తొమ్మిది నెలల పూర్వరంగం అర్థమైన వారికి వైసీపీ గెలుపులో వింతే కాదు, అద్భుతం కూడా కనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో బలంగా వేళ్లూనుకున్న పార్టీ వైసీపీ. ఆ సంగతి కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. అందుకే కూటమి కట్టుకున్నారు. కుయుక్తులను ఆశ్రయించారు. ఎన్నికల్లో ఈ కూటమి చేసిన దుష్ప్రచారం, వెదజల్లిన విషం, పలికిన అసత్యాలు, చేసిన బూటకపు బాసలు అనే నిచ్చెనమెట్ల మీదుగా చేరుకున్న అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతిపక్ష పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే సంకల్పానికి అధికార కూటమి వచ్చినట్టు దాని చర్యలు నిరూపిస్తున్నాయి. ఇటువంటి ప్రయ త్నాలు సత్ఫలితాలనివ్వవని గతంలో అనేక గుణపాఠాలు న్నాయి. అయినా అధికార మత్తులో ఉన్నప్పుడు అవి స్ఫురించక పోవచ్చు. ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు.... ... కానీ మూర్ఖుని మనసును సమాధానపరచడం మాత్రం సాధ్యంకాద’ని భర్తృహరి చెప్పిన సుభాషితం మనకు ఉండనే ఉన్నది.ప్రభుత్వ వైఖరిని విమర్శించిన వారి మీద, ఎన్నికల హామీలను అమలు చేయలేదేమని అడిగిన వారి మీద వందలాది కేసులు నమోదయ్యాయి. టెర్రరిస్టుల మీద పెట్టాల్సిన కేసులను సోషల్ మీడియా విమర్శకుల మీద ఎందుకు పెడు తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తున్నా పోలీసు యంత్రాంగం ఖాతరు చేయడం లేదు. రక్షక భటులే అర్ధరాత్రి పూట సివిల్ డ్రెస్సుల్లో ఇళ్లలోకి చొరబడి విమర్శకులను బరబరా లాక్కొని వెళ్తున్నారని, రాష్ట్రమంతటా తిప్పుతున్నారనీ, కుటుంబ సభ్యులకు సమా చారం కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు తరచుగా వినిపి స్తున్నాయి. పోసాని కృష్ణమురళి పదేళ్ల కింద ప్రెస్మీట్లో చేసిన విమర్శలపై టెర్రరిస్టు కేసు పెట్టి జైల్లోకి నెట్టారు. నడివీధుల్లో విపక్ష కార్యకర్తలను విచ్చుకత్తులతో నరుకుతున్న దృశ్యాల వీడియోలను చూడవలసి వచ్చింది. ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు జరిగాయి. పార్టీ ఆఫీసులను కూల్చేశారు. పంట చేల విధ్వంసం జరిగింది. పండిన తోటలను నరికేశారు. మీడియా మీద అప్రకటిత సెన్సార్షిప్ అమలైంది. తమకు గిట్టని వార్తా చానెళ్ల ప్రసారాలను నిలిపివేసేలా కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో వచ్చిన స్థానిక ఉపఎన్నికల సందర్భంగా కూటమి నాయకత్వం మరింత రెచ్చిపోయింది. స్థానిక ప్రతి నిధులను లొంగదీసుకోవడానికి సామ దాన భేద దండో పాయాలను ప్రయోగించారు. ప్రలోభాల ఎరలు వేశారు. కేసులు పెడతామని బెదిరించారు. ఉపాధిని దెబ్బతీస్తామని హెచ్చరించారు. పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని స్వయంగా ప్రభుత్వమే అధికార జులుమ్కు దిగినప్పుడు స్థానిక ప్రతినిధులను లొంగదీసుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. పైగా రాజ్యసభల్లో, శాసన మండళ్లలో అధికార హోదాలు వెలగబెట్టిన బడాబడా ఆసాములే సర్కార్ కొరడా ముందు సాగిలపడి పోయిన ఉదంతాలు కళ్లముందటే కనిపిస్తున్నాయి. స్థానిక పదవులను గెలుచుకోవడానికి అధికార పార్టీ బరి తెగించిందనీ, పలుచోట్ల ప్రతినిధులను అడ్డుకున్నారనీ, ప్రలోభపెట్టారనీ ‘సాక్షి’ మీడియానే కాదు, ‘ప్రజాశక్తి’ పత్రిక కూడా రాసింది. ఇలా అధికార యంత్రాంగం బరితెగించి ప్రవర్తించినప్పుడు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ స్వీప్ చేయడం కష్టం కాదనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ, వైసీపీ స్థానిక ప్రతినిధులు అరుదైన ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రదర్శించారు. పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. నిర్బంధాలను ధిక్క రించి తమను నమ్మి గెలిపించిన పార్టీ పక్షానే దృఢంగా నిలబడ్డారు. తమ పదవులేమీ ప్రభావం చూపగలిగేంత పెద్దవి కాదు. అయినా సరే విశ్వసనీయతకే వారు పట్టం కట్టారు. గోడ దూకిన బడా ఆసాములు ఈ పరిణామం తర్వాత ఎలా తలెత్తుకుంటారో చూడాలి. ‘స్టేట్ టెర్రరిజమ్’ అనదగ్గ స్థాయిలో నిర్బంధకాండను ప్రయోగించినా ఈ క్షేత్రస్థాయి ప్రతినిధులు దృఢంగా నిలవడానికి రెండు ముఖ్యమైన కారణాలు కనిపి స్తున్నాయి. మొదటిది – రెండు నెలల క్రితం పార్టీ కార్య కర్తలనుద్దేశించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగం. కార్యకర్తలెవరూ అధైర్యపడవలసిన అవసరం లేదనీ, వారికి తాను అండగా నిలబడతాననీ ప్రకటించారు. జగనన్న 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తాడో చేసి చూపెడతానని భరోసా ఇచ్చారు.జగన్ ప్రకటన తర్వాత గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలకు మంచి ప్రేరణ లభించిందనీ, వారు ధైర్యంగా నిలబడుతున్నారనీ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండో ప్రధాన కారణం – క్షేత్రస్థాయి వాస్తవికత. ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి చేసిన బూటకపు హామీల బండారం ప్రజ లందరికీ అర్థమైంది. వైసీపీ సర్కార్ మీదా, జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగతంగా కూటమి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రజాశ్రేణులు ఇప్పుడు భావిస్తున్నాయి. మోసపోయామన్న భావన వారిని వెంటాడుతున్నది. ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నది. వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి భయపడటం లేదు. బహిరంగంగానే కూటమి సర్కార్‌ను విమర్శిస్తున్నారు. ఈ పరిణామం కూడా వైసీపీ కార్యకర్తలు ఎదురొడ్డి నిలబడేందుకు దోహదపడింది.జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కూటమి సర్కార్ తన ధోరణిని మార్చుకోకపోగా అదే అసత్య ప్రచారాన్ని మరింత ఎక్కువగా ఆశ్రయిస్తున్నది. తేలిపోయిన ఆరోపణల్నే మళ్లీ మళ్లీ ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అప్పుల లెక్కల్ని గుర్తు చేసుకుంటూ జనం నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. శనివారం నాడు జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా అలవాటు ప్రకారం అప్పుల కథను మరోసారి వినిపించారు. ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్లున్న అప్పు, గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లుగా మారి, బడ్జెట్ ప్రసంగంలో ఏడు లక్షల కోట్లుగా రూపాంతరం చెంది, ఆవిర్భావ సభలో తొమ్మిదిన్నర లక్షల కోట్లుగా పరిణామం చెందింది.అప్పుల కథతోపాటు అసలు విషయాన్ని కూడా ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. ‘‘బయట నుండి (ప్రభుత్వంలోకి రాకముందు) చూసినప్పుడు ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయవచ్చని అనుకున్నా, ఇప్పుడు చూస్తే తొమ్మిదిన్నర లక్షల కోట్ల అప్పుంది. దీనిపై వడ్డీ కట్టాలి. ఇప్పుడు సంక్షేమాన్ని అమలుచేస్తే మధ్యలోనే ఆగిపోతుంది. కనుక ముందుగా అభివృద్ధి చేసి, వచ్చే ఆదాయంతో సంక్షేమం చేద్దా’’మని ఈ సభలో చెప్పుకొచ్చారు.ఈ తూచ్ మంత్రాన్ని ఆయన ఆవిర్భావ సభలో మాత్రమే చెప్పలేదు. ఈ వార్షిక బడ్జెట్లో కూడా ఆయన దీన్ని పొందు పరిచారు. కాకపోతే అంకెల్లో చెప్పడం వల్ల సరిగ్గా అర్థం కాలేదు. ‘సూపర్ సిక్స్’గా పేర్కొన్న ఆరు అంశాలను ఆయన చెప్పి నట్టుగా అమలు చేస్తే 70 వేల కోట్ల పైచిలుకు నిధులు అవసరమవుతాయని అంచనా. అయితే బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం 17 వేల కోట్లు మాత్రమే చూపెట్టారు. కేటాయింపు చూపినంత మాత్రాన అమలు చేస్తారని అర్థం కాదు. గత బడ్జెట్లో కూడా ‘తల్లికి వందనం’, ‘అన్నదాతా సుఖీభవ’ పథకాలకు అరకొర కేటాయింపులు చూపెట్టారు. కానీ,అందులో అణా పైసలు కూడా ఖర్చుపెట్టలేదన్నది జనం అనుభవంలోకి వచ్చిన సత్యం.మొన్నటి మంగళవారం జోలెతో పాడుకున్న వేలంతో కలిపి తొమ్మిదిన్నర మాసాల్లో బాబు సర్కార్ ఒక లక్షా 52 వేల కోట్ల పైచిలుకు అప్పులు చేసి జాతీయ రికార్డును నెలకొల్పింది. ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు 98,088 కోట్లయితే, ష్యూరిటీ సంతకం పెట్టి కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 23,700 కోట్లు, ఇక రాజధాని పేరుతో ఇప్పటివరకు చేసిన అప్పు 31,000 కోట్లు. వెరసి 1,52,788 కోట్లు. ఇంతటి జగదేక అప్పారావు ప్రభుత్వం జగన్ సర్కార్‌ను అప్పులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేయబూనడాన్ని దాష్టీకం అనాలో, దగుల్బాజీతనం అనాలో తెలుసుకోవాలి. ఈ అప్పుల చిట్టా వ్యవహారం ఇక ఎంతమాత్రమూ దాచేస్తే దాగేది కాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇస్తున్న సమాచారాన్ని బట్టి, కాగ్ రిపోర్టుల ఆధారంగా, బడ్జెట్ పత్రాల సాక్షిగా జనంలోకి వాస్తవాలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిందన్న ప్రచారాన్ని ఇప్పుడెవ్వరూ నమ్మడం లేదు.జగన్ ప్రభుత్వ హయాంలో విధ్వంసం జరిగిందనే మాట చంద్రబాబుకు ఊతపదంగా మారింది. చివరికి కలెక్టర్ల సమా వేశంలో కూడా ‘గత ప్రభుత్వం విధ్వంసం చేసింద’ని మాట్లా డారు. ఇలా కలెక్టర్ల సమావేశాన్ని రాజకీయాలకు వాడుకున్న ముఖ్యమంత్రి ఈయన తప్ప మరొకరు ఉండకపోవచ్చు. తాను చెప్పిందే వేదం, తన పచ్చ కోడి కూస్తేనే సమాచారం తెలిసేది అనే భ్రమల్లోంచి ఆయనింకా బయటపడలేదు. పదేపదే అబద్ధాన్ని వల్లెవేస్తే అది నిజమైపోతుందనే పాతకాలపు గోబెల్స్ థియరీని పట్టుకొని వేళ్లాడుతున్నారు. ఇప్పుడు విధ్వంసం గురించి ఎక్కువ మాట్లాడితే జనం రికార్డుల్ని తిరగేస్తారు.విధ్వంసం ఎవరిదో వికాసం ఎవరి వల్ల జరిగిందో తెలుసుకుంటారు. సమాచారం ఇప్పుడు ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. అది ప్రజల హక్కు.పౌరుల భావప్రకటనా స్వేచ్ఛపై శుక్రవారం నాడు సర్వో న్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అధికార మత్తులో జోగుతున్న మన వ్యవస్థలకు కనువిప్పు కావాలి. భావ ప్రకటనా స్వాతంత్య్రం లేనినాడు రాజ్యాంగం హామీ పడిన గౌరవ ప్రదమైన జీవన హక్కు సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేటతెల్లం చేసింది. ఈ హక్కును రక్షించడంలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యతను కోర్టులు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు హితవు చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ అనే కాంగ్రెస్ ఎంపీ పెట్టిన పోస్టుపై గుజరాత్ పోలీసులు పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ తీర్పుపై సంపాదకీయం రాసిన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ‘కేసును కొట్టివేయడంలో ఆశ్చర్యం లేదు. అసలు సుప్రీంకోర్టు దాకా ఈ కేసు రావడమే దిగ్భ్రాంతిని కలిగిస్తు న్నద’ని వ్యాఖ్యానించింది. ప్రతాప్‌గఢీ పెట్టిన పోస్టుకూ,ఆంధ్రాలో ప్రేమ్ కుమార్ అనే దళిత యువకుడి సోషల్ మీడియా పోస్టుకూ సారూప్యతలున్నాయి. కానీ ఆ యువకుడిని మన పోలీసు యంత్రాంగం ఎంతగా వేధించిందో తెలిసిందే. ఇప్పటి కైనా పోలీస్ యంత్రాంగం జీ హుజూర్ పద్ధతుల్ని విడిచి పెట్టక పోతే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని గ్రహిస్తే మంచిది. పోలీసు యంత్రాంగానికే కాదు... రెడ్‌బుక్ వంటి గ్రంథాల రచయితలకు కూడా సుప్రీం వ్యాఖ్యలు వాతలు పెట్టినట్టే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
విర్రవీగుతున్నావా లోకేష్ రాజా?.. రెడ్‌బుక్‌పై అంబటి సెటైర్లు
సాక్షి, గుంటూరు: నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనిది వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీయేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని, అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఇంకా అంబటి రాంబాబు ఏమన్నారంటే... ఆయన మాటల్లోనే..తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ అని చెప్పారు. ఆనాడు ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే, ఆదే కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానంటూ ఆనాడు చంద్రబాబు బీరాలు పలికిన విషయం మరిచిపోయారా? ఈ రోజు టీడీపీని చంద్రబాబే స్థాపించినట్లుగా మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.ఏనాడైన తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా?తమది పేదల కోసం ఎగిరేజెండా అని చంద్రబాబు చాటుకుంటున్నారు. ఏనాడైనా తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా? ఎర్రజెండాలు, బీజేపీ, బీఎస్పీ ఆఖరికి కాంగ్రెస్, జనసేన జెండాలను కూడా తమ పక్కన పెడితే కానీ ఆయన జెండా ఎగరలేదు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళే ధైర్యంలేని పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీది. దాని గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ చేయాలని అనుకున్నాం, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చూస్తే చేయలేకపోతున్నామని అంటున్నారు.దీనినే రేవుదాటిన తరువాత తెప్ప తగలేయడం అనేది. చంద్రబాబు చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేయడమే. చంద్రబాబుకు ఊసరవెల్లి ఆదర్శం. సిద్దాంతాలతో పనిలేకుండా అధికారమే పరమావధిగా ఎవరితోనైనా జత కడతారు. ఇది కార్యకర్తల పార్టీ, శాశ్వతంగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇదే పార్టీలోని కార్యకర్తలను ఆయన ఈసడించుకుంటున్నారు. తన కుమారుడి పదవి కోసం ఈ పార్టీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధికారం కోసం బీజేపీతో, తరువాత కమ్యూనిస్ట్ లతో, మళ్ళీ బీజేపీతో, ఇప్పుడు జనసేనతో జత కట్టారు. అవసరం తీరిన తరువాత ఆ పార్టీలను పక్కకుతోసేయడంలో చంద్రబాబు దిట్టరెడ్బుక్ అంటూ విర్రవీగుతున్న లోకేష్ రాజాచంద్రబాబు వారసత్వంను లోకేష్ రాజా పుణికిపుచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా సంపాదించారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి అయిన తరువాత అధికార మదంతో మాట్లాడుతున్నారు. తన రెడ్‌బుక్ చూసి రాష్ట్రంలో అందరూ వణికిపోతున్నారని విర్రవీగుతున్నాడు లోకేష్ రాజా. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలు వెళ్ళకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయావా లోకేష్ రాజా.జైలులో చంద్రబాబుకు వెన్నుపూస కింద వరకు దద్దుర్లు వచ్చాయని, రాత్రిపూట దోమలు కుడుతున్నాయని, శరీరంపై పొక్కులు మొలుస్తున్నాయని వాపోయారు. 750 మంది డ్రగ్స్ తీసుకునే నేరచరిత్ర ఉన్న ఖైదీలున్న జైలులో మా నాన్నను వేశారంటూ లోకేష్ వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా? ఈ రోజు అధికారం ఉందని తన రెడ్‌బుక్ చూసి గుండెపోటు, బాత్రూమ్లో జారి పడిపోతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న లోకేష్ రాజాకు ముందుంది ముసళ్ళ పండుగ. ఈ రోజు నీవల్ల వేధింపులకు గురవుతున్న ప్రతి ఒక్కరూ తమ బుక్కుల్లో లోకేష్ పేరు రాసుకుంటున్నారు రాజా. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎగతాళి దినోత్సవంగా మారుస్తూ మాట్లాడుతున్న దానికి ఏదో ఒకరోజు జవాబు దొరుకుతుంది రాజా. హామీలు అమలు చేయని మీ అసమర్థతపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై మీరు పెడుతున్న కేసులపై న్యాయస్థానాల స్పందన చూసిన తరువాత అయినా సిగ్గు తెచ్చుకోవాలి. రెడ్‌బుక్ రాజ్యాంగం, వాగ్దానాల అమలు చేయకుండా పారిపోయే మోసగాళ్ళు మీరు. పార్టీ ఆవిర్భావం మీది కాదు, నందమూరి తారక రామారావుది. ఆయన పార్టీని మీరు మోసపూరితంగా వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు. అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్న పార్టీ. వాపుచూసి బలం అనుకుంటోంది, శక్తిలేని పార్టీ. తెలుగుదేశం ఒక పేకమేడ లాంటివి. వారినీ వీరిని అడ్డంపెట్టుకుని బతుకుతున్న రాజకీయ జీవితాలు.దోపిడీనే చంద్రబాబు నైజంతాజాగా విజయం సాధించగానే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాను అన్నారు. సూపర్ సిక్స్ ను అమలు చేస్తానని అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా అమరావతి నిర్మాణానికి హుండీలు పెట్టారు, చందాలు ఇవ్వమని అడిగారు, ఇటుకలు అమ్ముకున్నారు. అమరావతికి రెండు గాజులు ఇచ్చి అమరావతిని దోచుకున్నారు. ఇప్పుడు 26వేల కోట్లు అమరావతి అంటున్నారు. దీనిలోనూ దోపిడీ.కాంట్రాక్టర్ల కోసం పోలవరంను తాకట్టుపెట్టారు. డయాఫ్రం వాల్ వేసేసిన తరువాత జగన్ కాఫర్ డ్యాంలను క్లోజ్ చేయలేదంటూ అర్థంలేని మాటలు మాట్లాడారు. సింపుల్‌గా ఇన్వెస్ట్ చేయడం.. భారీగా బాగుపడటం చంద్రబాబు నైజం. రెండెకరాల నుంచి ప్రారంభించారు, నేడు వేల కోట్లు సంపాధించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు. అధికారంను అడ్డం పెట్టుకుని దోచుకోవడం, జనానికి పంచడం, ఓట్లు కొనుగోలు చేయడం చంద్రబాబుకు అలవాటు. -
పోలీసుల కస్టడీకి వల్లభనేని వంశీ
-
రెడ్‌బుక్ పాలనలో పనిచేయలేం!
-
విడదల రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ, ఎస్పీ జాషువాపై కేసులు
-
‘రెడ్‌బుక్’కు సహకరించని వారిపై బదిలీ వేటు!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలకు సహకరించని పోలీస్ అధికారులకు పొగబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, సీఐడీ విభాగంలో ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌లను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసేందుకు సిద్ధపడుతోంది. దీర్ఘకాలిక సెలవు నుంచి తిరిగొచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను కీలక పోస్టులో నియమించాలని భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీకి ప్రభుత్వం ఉపక్రమించింది. ఐజీ నుంచి డీజీ స్థాయి అధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో భాగంగా.. ⇒ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీని బదిలీచేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయనపట్ల టీడీపీ ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశాఖపట్నం వంటి కీలక నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకోవాలని అమరావతిలోని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అందుకు శంఖబత్ర బాగ్చీ సహకరించడంలేదని ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో విశాఖపట్నం సీపీగా ప్రస్తుత గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అక్రమాలకు ఆయన ఏకపక్షంగా కొమ్ముకాసిన విషయం తెలిసిందే. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం ఆపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన వివాదంపై దర్యాప్తు కోసం నియమించిన సిట్‌లో ఆయన్నే సభ్యునిగా చేర్చారు. ఈ నేపథ్యంలో.. నిబంధనలతో నిమిత్తం లేకుండా టీడీపీ పెద్దల ఆదేశాలను అమలుచేస్తారనే నమ్మకంతోనే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని విశాఖ పోలీస్ కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ అలాగే, నిబంధనల మేరకు మాత్రమే పనిచేసే అధికారిగా గుర్తింపు పొందిన సీఐడీ విభాగంలో ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్‌ను కూడా బదిలీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్ ఇన్చార్జ్గా ఈయన ఉన్నారు. దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడికి ఆయన ఏమాత్రం లొంగలేదు. నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తా.. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోతానని వినీత్ స్పష్టంచేసి సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయన్ను బదిలీచేస్తే అభాసుపాలవుతామని ప్రభుత్వ పెద్దలు వెనుకంజ వేశారు. అందుకే ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ పేరుతో ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి అప్రాధాన్య పోస్టుకు పరిమితం చేయాలని చూస్తున్నారు. ⇒ ఇక దీర్ఘకాలిక సెలవు ముగించుకుని వచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను ప్రభుత్వం కీలక పోస్టులో నియమించనుంది. ఆయనకు పోలీసు శాఖలో పోస్టు ఇస్తారా లేదా ఇతర శాఖలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఐటీ శాఖలో ఆయన్ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ మరోవైపు.. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి కేటాయించిన డీజీ స్థాయి అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్ ఇంకా రాష్ట్రంలో రిపోర్టు చేయలేదు. మరో ఐపీఎస్ అభిషేక్ మహంతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు ఏపీలో రిపోర్ట్ చేసిన అనంతరం వారిని ఏ పోస్టుల్లో నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈ వారంలోనే బదిలీ చేసే అవకాశాలున్నాయని పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
పోసాని జైలు నుండి విడుదలపై అంబటి రియాక్షన్
-
టీడీపీ, పోలీసులపై పేర్ని నాని ఫైర్
-
రెడ్‌బుక్ తంత్రం.. సిట్ కుతంత్రం!
సాక్షి, అమరావతి : పోలీస్ స్టేషన్‌కు ఉండాల్సిన అర్హతలు ఉండవు.. ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందో చెప్పరు.. కానీ అది పోలీస్ స్టేషనే. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరో చెప్పరు కానీ అది పోలీస్ స్టేషనే. ఇదంతా ఏమనుకుంటున్నారు? ఇది రెడ్‌బుక్ రాజ్యాంగ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా సిద్ధం చేసిన రాజ్యాంగేతర శక్తి. దీనిపేరు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్). వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట ప్రభుత్వం బరితెగిస్తోంది. అందుకోసమే ఏర్పాటు చేసిన సిట్ ద్వారా అరాచకాలకు తెగబడుతోంది. చట్టంలో పేర్కొన్న నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతోనే సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రలోభపెట్టి, బెదిరించి, వేధించి మరీ అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసే కుట్ర దాగుంది. చట్ట విరుద్ధంగా సిట్ ఏర్పాటు సిట్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోనే ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. కేవలం కక్ష సాధింపే లక్ష్యంగా సిట్‌ను ఏర్పాటు చేశారనేది జీవోనే స్పష్టం చేస్తోంది. చట్టంలో నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను పూర్తిగా ఉల్లంఘించారని స్పష్టమవుతోంది. ఏదైనా వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసే సిట్‌ను ఓ పోలీస్ స్టేషన్‌గా పరిగణించాలి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సిట్‌ను ఓ పోలీస్ స్టేషన్‌గా గుర్తిస్తున్నట్టు పేర్కొంది. కానీ అసలు పోలీస్ స్టేషన్‌కు చట్ట ప్రకారం ఉండాల్సిన నిబంధనలను మాత్రం గాలికి వదిలేయడం గమనార్హం. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా పోస్టుగానీ, ప్రదేశంగానీ పోలీస్ స్టేషన్‌గా పరిగణిస్తారు’ అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కోసం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా ‘స్థానిక ప్రాంతం’ కూడా అయ్యుండాలని చట్టం స్పష్టం చేసింది. అంటే పోలీస్ స్టేషన్‌కు స్థానిక ప్రాంతం ఏదన్నది స్పష్టం చేయాలి. కానీ మద్యం విధానంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ‘స్థానిక ప్రాంతం’ ఏదన్నది పేర్కొన లేదు. స్థానిక ప్రాంతం అన్నది లేకుండా ఏదైనా పోస్టునుగానీ, ప్రదేశాన్నిగానీ పోలీస్ స్టేషన్‌గా గుర్తించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు కచి్చతంగా స్టేషన్ హౌస్ అధికారిగానీ లేదా ఆఫీసర్ ఇన్చార్జ్ ఆ పోలీస్ స్టేషన్‌కు బాధ్యుడిగా ఉండాలి. మరి సిట్‌ను పోలీస్ స్టేషన్‌గా ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ఇన్చార్జ్ ఎవరన్నది పేర్కొన లేదు. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సిట్‌ను ఏర్పాటు చేసినట్టేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటైన సిట్ ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందన్నది కూడా ప్రభుత్వం వెల్లడించ లేదు. ఫలితంగా బాధితులెవరైనా సిట్‌పై ఫిర్యాదు ఎవరికి చేయాలన్నది స్పష్టత లేదు. తద్వారా పోలీస్ స్టేషన్‌కు ఉండాల్సిన అర్హతలు ఏవీ సిట్‌కు లేవని తేల్చి చెబుతున్నారు. అబద్ధపు వాంగ్మూలాలుసిట్ అధికారులు ఈ కేసులో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతరులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తూ బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేయిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. అసలు అభియోగాలు ఏమిటన్నది చెప్పకుండానే వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయిస్తుండటమే ఇందుకు నిదర్శనం. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 2(క్యూ) ‘చేయకూడని పని ఏదైనా చేసినా, చేయాల్సిన పని చేయకుండా ఉన్నా అది నేరం’ అని నిర్వచించింది. అటువంటి నేరం చట్ట ప్రకారం శిక్షార్హం అని కూడా పేర్కొంది. మద్యం విధానంపై నమోదు చేసిన కేసులో పలువురు అధికారులు, ఇతరులను దర్యాప్తు పేరిట వేధిస్తున్న సిట్.. అసలు నేరం ఏమిటన్నది చెప్పకపోవడం గమనార్హం. ఎందుకంటే చేయకూడని పని చేసినా, చేయాల్సిన పని చేయకపోయినా ఆ ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యులు అవుతారు. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం.. ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రభుత్వ అధికారి సంబంధిత బాధ్యులకు తెలియజేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఏ పౌరుడైనా సరే తనకు ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకుగానీ, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులకుగానీ తెలియజేయాలని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 33 పేర్కొంటోంది. మరి ప్రభుత్వ అధికారులకు మరింత బాధ్యత ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కక్ష సాధింపు కోసమే బరితెగింపు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ పోలీస్ స్టేషన్‌కు ఓ స్థానిక ప్రాంతాన్ని గుర్తిస్తే.. సిట్ కార్యకలాపాలు అక్కడి నుంచే నిర్వహించాలి. సాక్షులు, నిందితులను ఎక్కడ అదుపులోకి తీసుకున్నా సరే ఆ పోలీస్‌స్టేషన్‌గా గుర్తించిన ఆ ప్రదేశానికి తీసుకెళ్లి విచారించాలి. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసు నమోదు చేసింది కాబట్టి ప్రభుత్వ అధికారులు, పూర్వ అధికారులు, ఇతర సాక్షులుగా భావిస్తున్న వారిని దర్యాప్తు పేరుతో ఓ పరిధికి మించి వేధించడం సాధ్యం కాదు. అక్రమంగా నిర్బంధిస్తే బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సిట్‌ను పోలీస్ స్టేషన్‌గా గుర్తించింది. తద్వారా సిట్‌ను ఓ అరాచక శక్తుల అడ్డాగా, ప్రభుత్వ అధికారిక వేధింపులకు కేంద్రంగా, పోలీసు దాదాగిరీ డెన్‌గా తీర్చిదిద్దింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు దాంతో విచ్చలవిడిగా చెలరేగి పోతున్నారు. దర్యాప్తు పేరిట ఇప్పటికే పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పూర్వ అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులు, ఇతరులను దర్యాప్తు పేరిట తీవ్రంగా వేధించారు. వారిని గుర్తు తెలియని ప్రదేశాల్లో అక్రమంగా నిర్బంధించి శారీరకంగా మానసికంగా హింసించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేకపోతే వారిపైనా, వారి కుటుంబ సభ్యులపైనా అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తామని బెంబేలెత్తించారు. -
దర్యాప్తు ముసుగులో దాదాగిరీ!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కారు పోలీసు గూండాగిరీకి తెగిస్తోంది! అందుకోసం సిద్ధం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రాజ్యాంగేతర శక్తిగా మలుచుకుంది! గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన మద్యం విధానాలపై అక్రమ కేసులతో బరితెగిస్తోంది. ఈ క్రమంలో సీఐడీ ద్వారా అక్రమ కేసుతో వేధించేందుకు పన్నిన పన్నాగం ఫలించకపోవడంతో ‘సిట్’ను తెరపైకి తెచ్చింది. ప్రలోభపెట్టో.. వేధించో.. హింసించో... తిమ్మిని బమ్మిని చేయాలని సిట్‌ను ఆదేశించింది. దర్యాప్తు పేరిట వేధింపులకు కుతంత్రం పన్నింది. సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడన్నది గుర్తించకుండా బరితెగించి సాగిస్తున్న ఈ కుట్ర ఇలా ఉంది..!సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ..?నిబంధనల ప్రకారం సిట్‌ను ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా ప్రకటించి ఎక్కడి నుంచి పని చేస్తుందో అధికారికంగా నోటిఫై చేయాలి. అంటే సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని గుర్తించాలి. కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసిన కూటమి సర్కారు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా ప్రకటించింది. అయితే ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ అన్నది నోటిఫై చేయలేదు. సిట్ పోలీస్ స్టేషన్ భౌతికంగా ఎక్కడ ఉందో వెల్లడించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.దర్యాప్తు పేరుతో వేధింపుల కుట్ర...సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని ఇప్పటివరకు గుర్తించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉంది. పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా గుర్తిస్తే అక్కడి నుంచే సిట్ విధులు నిర్వహించాలి. ఈ కేసులో నిందితులనుగానీ సాక్షులనుగానీ విచారించాలంటే నోటీసులు జారీ చేసి అక్కడకే పిలవాలి. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే విచారించాలి. సక్రమ కేసు అయితే ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా నమోదు చేసిన అక్రమ కేసు కాబట్టే కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది. ఈ కేసులో సాక్షులా? నిందితులా? ఇతరులా? అనేది స్పష్టం చేయకుండా పలువురిని ఇప్పటికే విచారణ పేరుతో వేధించింది. వారిని ఎక్కడ విచారించిందో రహస్యంగా ఉంచింది. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్, ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తదితరులను రోజుల తరబడి గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి దర్యాప్తు పేరిట వేధించింది. ఎక్కడికి తరలించారో వారి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. అదే రీతిలో మద్యం డిస్టిలరీల ప్రతినిధులను కూడా దర్యాప్తు పేరిట బెంబేలెత్తించారు. తాము చెప్పినట్లు చేయకుంటే వారి వ్యాపారాలను దెబ్బ తీస్తామని హడలెత్తించారు. వారిని ఏ ప్రాంతంలో విచారించారో స్పష్టత లేదు. సిట్ అధికారులతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ప్రైవేటు వ్యక్తులు ఈ కేసు దర్యాప్తు పేరిట పలువురిని తీవ్రంగా వేధించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేదంటే వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులపై సైతం అక్రమ కేసులు బనాయించి వేధిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అదే రీతిలో బెదిరించగా ఆయన సమీప బంధువులను కూడా తీవ్రంగా వేధించినట్లు సమాచారం. అజ్ఞాత ప్రదేశాల్లో ఈ వ్యవహారాలను సాగించారు. అదే పోలీస్ స్టేషన్‌ను గుర్తించి అధికారికంగా ప్రకటిస్తే నిందితులు, సాక్షులు, ఇతరులను అక్కడే విచారించాల్సి ఉంటుంది. అందుకే సిట్ పోలీస్ స్టేషన్ అన్నది ఎక్కడో ప్రకటించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.సీసీ టీవీ కెమెరాలు లేవు... జనరల్ డైరీ లేదు..సిట్ దర్యాప్తు ప్రహసనంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడాన్ని ఇటీవల హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్న కేసు విచారణ సందర్భంగా పోలీసు శాఖపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వ తీరు మారలేదని సిట్ వ్యవహారం వెల్లడిస్తోంది. విచారణ పేరుతో ఎవరెవర్ని పిలుస్తున్నారు..? ఎంతసేపు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు..? ఏ సమయంలో వచ్చారు... తిరిగి ఎప్పుడు వెళ్లారు..? వారితో పాటు న్యాయవాదులు వచ్చారా..? ఇలా ఏ ఒక్క అంశం అధికారికంగా రికార్డు కావడం లేదు. ఇక ఈ కేసుకు సంబంధించి జనరల్ డైరీ (జీడీ) నమోదు చేయడం లేదు. తద్వారా దర్యాప్తు ప్రాథమిక ప్రమాణాలను సిట్ బేఖాతరు చేస్తోంది. దాంతో ఈ కేసు దర్యాప్తులో సిట్‌కు జవాబుదారీతనం లేకుండా పోయింది. దర్యాప్తు పేరుతో ఎంతమందిని వేధించినా...శారీరకంగా, మానసికంగా హింసించినా తమను ప్రశ్నించకుండా ఉండాలన్నదే సిట్ లక్ష్యం. ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిట్ దర్యాప్తు ప్రమాణాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.డిస్టిలరీ ప్రతినిధికి చిత్రహింసలు..అక్రమ కేసులతో వేధిస్తున్న సిట్ అరాచకాలకు తెలంగాణకు చెందిన ఓ డిస్టిలరీ ప్రతినిధి జైపాల్‌రెడ్డికి ఎదురైన చేదు అనుభవమే నిదర్శనం. దర్యాప్తు పేరుతో జైపాల్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన సిట్ అధికారులు ఆయన్ను తీవ్రస్థాయిలో హింసించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి మూడు రోజులపాటు తీవ్ర వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ ఇన్‌చార్జీగా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆయనపై విరుచుకుపడినట్లు సమాచారం. జైపాల్‌రెడ్డిని తీవ్రంగా హింసించి బెంబేలెత్తించారు. అయినప్పటికీ తాను అవాస్తవాలను వాంగ్మూలంగా ఇవ్వబోనని ఆయన నిరాకరించడంతో సిట్ అధికారుల కుట్ర బెడిసికొట్టింది. ఇదే రీతిలో పలువురు సాక్షులు, డిస్టిలరీల ప్రతినిధులను సిట్ బృందం అక్రమ నిర్భందాలతో వేధిస్తూ అరాచకానికి తెగబడుతోంది. ఈ కుతంత్రాన్ని అమలు చేసేందుకే సిట్ పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా గుర్తించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. -
గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా
-
ఇప్పటికైనా మించిపోయింది లేదు! ఇకనైనా..
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్యా రాజకీయాల మరక లేదు.. రాజకీయం ముసుగులో నేరాలను ఉపేక్షించం.. కక్ష రాజకీయం చేయను: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. పై రెండు వార్తలు ఒకే రోజూ పత్రికల్లో వచ్చాయి. వీటిల్లో ఒకటి ఏపీలో ప్రస్తుత అరాచక పరిస్థితులకు అద్దం పడుతూంటే... రెండోది వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజలను ఏమార్చే ప్రయత్నానికి మచ్చు తునకలా కనిపిస్తుంది. చంద్రబాబుకు పేరు ప్రతిష్టలు మెండని.. వ్యవస్థలపై పట్టున్న రాజకీయవేత్త అని అంటూంటారు. అయితే ప్రజాస్వామ్యంలో అందరిని అన్నిసార్లూ మోసం చేయలేరు అనేందుకు హైకోర్టు తాజా వ్యాఖ్యలు ఒక నిదర్శనం. నిజానికి గౌరవ న్యాయమూర్తులు రఘునందనరావు, మన్మధరావులకు మనం నమస్కారం చేయాలి. తమ వ్యాఖ్యలతో వీరు పది నెలలుగా ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచక పర్వానికి(Red Book Atrocities) కొంతైనా బ్రేక్ వేశారని అనిపిస్తుంది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త, ఆ పార్టీ అధికార ప్రతినిది అవుతు శ్రీధర్ రెడ్డి కేసులో కాని, మాదిగ మహాసేన నాయకుడు కె.ప్రేమ్ కుమార్ కేసులో కాని హైకోర్టు పరిశీలన ఏ ప్రభుత్వానికైనా కనువిప్పు కలిగించాల్సినవే. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ వైఖరి మార్చుకున్నట్లు కనిపించదు. ప్రముఖ నటుడు 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)పై పెట్టిన ఆయా కేసులలో బెయిల్ వచ్చినా, కుట్రపూరితంగా సీఐడీ మళ్లీ పీటీ వారంట్ తీసుకుని ఆయనను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తోంది. ఇదంతా రెడ్‌బుక్ దారుణాల కిందకే వస్తుంది. కక్ష రాజకీయాలే అవుతాయి. వైఎస్సార్సీపీ వాళ్లపై దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం, తప్పుడు కేసుల బనాయింపు వంటి అకృత్యాలు పది నెలలుగా సాగుతున్నా న్యాయ వ్యవస్థ సైతం వీటిని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదన్న అభిప్రాయం ఉండేది. దాంతో ఏపీలో పౌరులు ప్రత్యేకించి విపక్షం కాని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు కానీ జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 👉సూపర్‌సిక్స్ పేరుతో ఇష్టారీతిన ఎన్నికల హామీలిచ్చి.. వాటి అమలు చేతకాక ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ హింసాకాండకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. హైకోర్టు తాజా తీర్పు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తోంది. పౌరులను ఆధారాల్లేకుండా.. కేవలం ఊహలపై ఆధారపడి అరెస్టులు చేస్తారా? అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలీసులు తమని తాము చట్టానికి అతీతులుగా భావిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఇందులో వాస్తవం ఉంది. సోషల్ మీడియా, ఇతర చిన్న కేసుల్లోనూ నోటీసులివ్వకుండా హైదరాబాద్‌సహా ఎక్కడ ఉన్నా ఆకస్మికంగా అరెస్టులు చేయడం.. వారిని క్రిమినల్స్ మాదిరిగా ట్రీట్ చేస్తూండటాన్ని గౌరవ హైకోర్టు గుర్తించడం మంచి పరిణామం. 'రేపు కోర్టుల్లోకి వచ్చి కూడా అరెస్టులు చేస్తారా?".. అనే తీవ్రమైన వ్యాఖ్యలను న్యాయమూర్తులు చేశారంటే పరిస్థితి ఏమిటన్ని అర్థమవుతుంది. అదే సమయంలో చిన్న చిన్న కేసుల్లోనూ మేజిస్ట్రేట్లు పోలీసులు తీసుకొచ్చిన నిందితులను రిమాండ్‌కు ఆదేశించడం కూడా ఆందోళన కలిగించే విషయమే. కొంతమంది మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్లు విధిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.👉గతంలో ముఖ్యమంత్రి, మంత్రులను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలకు చకచకా బెయిల్ వచ్చిన తీరు, కొన్ని కేసులలో అసలు రిమాండ్‌కే పంపకుండా వదలివేసిన వైనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మాజీ మంత్రి రోజాపైన దారుణమైన దూషణకు దిగిన టీడీపీ మాజీ మంత్రి ఒకరికి కోర్టు రిమాండ్ విధించకుండా వదలిపెట్టింది. అదే.. పోసాని కృష్ణ మురళీకి మాత్రం వరస రిమాండ్లు విధిస్తున్నారు. పోసాని, అవుతు శ్రీధర్ రెడ్డిలు టీడీపీ, జనసేనల వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు స్పందిస్తూ జవాబు ఇచ్చారు. అందులో అభ్యంతరం ఉంటే, అసలు ప్రేరేపించిన వారిపై కూడా కేసులు పెట్టాలి కదా! ఆ పని చేయకుండా ఒక పక్షంపైనే కేసులు పెడుతున్నారు. 👉చట్టంలోని కొన్ని సెక్షన్ 111ను ఎంతగా దుర్వినియోగం చేస్తున్నది హైకోర్టు గమనించింది. సోషల్ మీడియాలో పోస్టు పెడితే బలవంతపు వసూళ్ల కింద అమలు చేయవలసిన సెక్షన్లో కేసు పెట్టారని హైకోర్టు తెలిపింది. లోకేష్ బృందానికి ఈ రెడ్ బుక్ ఏదో సరదాగా ఉండవచ్చు. ప్రస్తుతం అధికారం ఉంది కనుక తాము ఏమి చేసినా చెల్లుతుందని విర్రవీగవచ్చు. అధికారాన్ని ఇలా అరాచకాలకు ఉపయోగించుకుంటే అదే రెడ్ బుక్ వారి పాలిట పాముగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చేసేది చేస్తూనే సుద్దులు చెబుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను రెచ్చగొడతారు. నేతలు తన సమక్షంలోనే బూతులు మాట్లాడినా, సోషల్ మీడియా యాక్టివిస్టులు బూతు పోస్టులు పెట్టినా దానికి స్వేచ్ఛ అనే కవరింగ్ ఇస్తారు. వైఎస్సార్సీపీ వాళ్లు స్పందిస్తే మాత్రం దానినే ఫోకస్ చేస్తూ ప్రచారం చేస్తుంటారు.కావలి గ్రీష్మ అనే ఒక చిన్న స్థాయి నేత తన సమక్షంలోనే బూతులు మాట్లాడితే నవ్వుతూ విన్నారే తప్ప వారించలేదు. ఆ తర్వాత ఆమెను శాసనమండలి సభ్యురాలిని చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబాన్ని టీడీపీ సోషల్ మీడియా ఎంత నీచంగా ట్రోల్ చేసిందీ అందరికి తెలుసు. అయినా చంద్రబాబు దానిని ఖండించినట్లు కనిపించలేదు. అంతెందుకు చంద్రబాబుసహా లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి వంటి కూటమి నేతలు వాడిన బూతు పదజాలానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 👉ఇప్పుడు అధికారం రాగానే తాను బూతులను అరికట్టానని ఆయన సభలలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నదంతా టీడీపీ కక్ష రాజకీయమే అయినా, తాము ఏమీ ఎరగనట్లు మాట్లాడారు. అంతేకాదు. నలభై ఐదేళ్ల చరిత్రలో తనపై హత్య రాజకీయాల మరక లేదని చంద్రబాబు చెబుతున్నారు. అసలు ఈ ప్రస్తావన తేవలసిన అవసరం ఏమిటో తెలియదు. రాజకీయం ముసుగులో నేరాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మంచిదే. కాని నిజంగా టీడీపీని అలాగే నడుపుతున్నారా? లేక కేవలం ప్రత్యర్ధి పార్టీలపై అభియోగాలు మోపడానికి ఇలా మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. 👉చంద్రబాబు తోడల్లుడు, ఈ మధ్యే కలిసిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యలు రాసిన పుస్తకాలలో చంద్రబాబు నేరపూరిత రాజకీయాలపై ఏమి రాశారో అందరికి తెలిసిన విషయమే. వాటిపై ఏనాడైనా వివరణ ఇచ్చి ఉంటే చంద్రబాబును ఒప్పుకోవచ్చు. ఎవరు తనపై ఏ ఆరోపణ చేసినా ఏమి పట్టనట్లు ఉండడం ఆయన ప్రత్యేకత. అందుకే వైఎస్సార్సీపీ నేతలు తరచూ వంగవీటి రంగా, పింగళి దశరథ్‌రామ్, మల్లెల బాబ్జీ తదితరుల హత్య కేసులలో వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే కేసులు పెట్టించుకోండని తన కార్యకర్తలకు చెబుతారు. అధికారంలోకి రాగానే ఎదుటి పక్షంపై కేసులు పెట్టండని చెబుతారు. నిజంగా ఈ వయసులో చంద్రబాబు తన కక్ష రాజకీయాలను మానుకుని మంచి పేరు తెచ్చుకునేలా పాలన చేయడమే కాకుండా.. తన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ గోలకు అడ్డుకట్ట వేయకపోతే వారికే నష్టం జరుగుతుందని చెప్పక తప్పదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబుగారూ.. భయపడుతున్నారా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో చెప్పిన విషయాలు గమనించదగినవే. తన సీనియారిటీని కూడా పక్కనబెట్టి ఆయన ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవలి ఎన్నికలకు ఎలాగోలా కష్టపడి మోదీని, అమిత్ షాలను ప్రసన్నం చేసుకుని పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది. బీజేపీ వారి వద్ద భయం, భయంగా గడపాల్సిన పరిస్థితిలో బాబు ఉన్నారేమో అన్న అనుమానం రాజకీయ వర్గాలలో కలుగుతోంది. .. బీజేపీ అభ్యర్ధిగా ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడడం ఒక ఉదాహరణ. బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కూడా చంద్రబాబుకు షాక్ వంటిదేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధులను తానే నిర్ణయిస్తాననే దశ నుంచి.. తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారి ఎంపికను మౌనంగా ఆమోదించే దుస్థితిలో చంద్రబాబు పడ్డారని సొంత పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ జుట్టు బీజేపీ చేతిలో ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అందుకే సందర్భం అయినా కాకపోయినా మోదీని పొగడడం, బీజేపీ విధానాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని పలువురు భావిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు పలుమార్లు బీజేపీని తీవ్రంగా విమర్శించారు. మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అందుకోసం ఆయన ఎన్ని పాట్లు పడింది తెలుసు. 1996, 1998 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని తీవ్రంగా విమర్శించారు ఈయన. ఆ రోజుల్లో వామపక్షాలతో పొత్తులో ఉన్నారు. 1998 లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీకి సరిగ్గా 12 సీట్లు తక్కువ అవడం, బీజేపీ వారు ఈయన్ని సంప్రదించడం, వెంటనే కనీసం మిత్రపక్షాలతో కూడా చెప్పకుండా ఎగిరి గంతేసినట్లు మద్దతు ఇచ్చేశారు. దాంతో 1999లో లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించడానికి అవకాశం వచ్చింది. ఇక.. కార్గిల్ యుద్ద వాతావరణం, వాజ్‌పేయిపై ఏర్పడిన సానుభూతి చంద్రబాబుకు కలిసి వచ్చాయి. 👉తదుపరి ఒక దశలో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవడానికి సిద్దమైనట్లు కనిపించారు. గుజరాత్ మారణకాండ, మత హింసకు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు భావించారు. బీజేపీ నాయకత్వం మోదీని తప్పిస్తోందన్న సమాచారాన్ని నమ్మి ఆయనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మోదీని హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వనని హెచ్చరించారు. కానీ బీజేపీ తన వైఖరి మార్చుకునేసరికి ఈయన ఇరకాటంలో పడ్డారు. బీజేపీని వదలుకోవడానికి సిద్ద పడలేదు. పార్లమెంటులో ఓటింగ్ సమయానికి టీడీపీ ఎంపీలు లేకుండా వెళ్లిపోయారు. 2004లో బీజేపీతో కలిసి పోటీచేసినా ఓటమి చెందారు. ఆ తర్వాత జీవితంలో బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని ప్రకటించారు. 👉కట్ చేస్తే.. 2009లో వామపక్షాలతోపాటు బీీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకున్నారు. అయినా విజయం సాధించలేకపోయారు. దాంతో పంథా మార్చుకుని 2014 నాటికి మోదీకి దగ్గరవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆరోజుల్లో వైఎస్సార్సీపీతో పొత్తుకు బీజేపీ యత్నించినా, జగన్ ఒప్పుకోకపోవడం కూడా చంద్రబాబుకు ఉపయోగపడింది. మొత్తం మీద కలిసి పోటీ చేయడం, జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా మద్దతుఇవ్వడం, అధికారంలోకి రావడం జరిగింది. 2018 నాటికి బీజేపీతో మళ్లీ విబేధించారు. 👉 2019 ఎన్నికలలో బీజేపీ గెలవకపోవచ్చని, మోదీ మళ్లీ ప్రధాని కారని నమ్మినట్లు చెబుతారు. దాంతో ఆయన బీజేపీపైన, మోడీపైన చాలా తీవ్రమైన విమర్శలు చేసేవారు. మోదీని టెర్రరిస్టులతో పోల్చారు. వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తూ మోదీ భార్యను ఏలుకోలేని వాడని, ముస్లింలను బతకనివ్వడని ఇలా పలు ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. దాంతో ఏపీలో ఒంటరిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మోదీ తిరిగి ప్రధాని అవడంతో వెంటనే ప్లేట్ తిరగేశారు. బీజేపీకి దగ్గరవడానికి అన్ని వ్యూహాలు అమలు చేశారు. ముందుగా పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారని అంటారు. 👉పవన్ తొలుత బీజేపీకి దగ్గరై, తదుపరి టీడీపీని కలపడానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఆ విషయాన్ని ఆయన దాచుకోలేదు. బీజేపీతో టీడీపీని కలపడానికి తాను బీజేపీ పెద్దలతో చివాట్లు తిన్నానని కూడా ప్రకటించారు.ఈసారి కూడా వైసీపీతో స్నేహం చేయడానికి బీజేపీ ముందుకు వచ్చినా, జగన్ సిద్దపడలేదు.అది చంద్రబాబుకు కలిసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ అండ, ఎన్నికల కమిషన్ అనుకూల ధోరణి, సూపర్ సిక్స్ హామీలు తదితర కారణాలతో అధికారంలోకి రాగలిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోదీని పొగుడుతున్న తీరు కాస్త ఆశ్చర్యం అనిపించినా, గత చరిత్ర తెలిసిన వారెవ్వరూ ఇది మామూలే అని భావిస్తుంటారు. 👉ఒకప్పుడు తానే మోదీకన్నా సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని నుంచి పాఠం నేర్చుకున్నానని అంటున్నారు. దానికి కారణం ఏమిటంటే మోదీ వరసగా గెలుస్తూ వస్తూ అధికారం నిలబెట్టుకున్నారట. గతంలో సీబీఐ, ఈడి వంటి వాటిని మోదీ ప్రయోగిస్తున్నారని ఆరోపించే వారు. బహుశా దాని ద్వారానే మోదీ అధికారం నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం కలిగిందేమో తెలియదు. దానిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఏపీలో పోలీసులతో వైసీపీ వారిపై అడ్డగోలు కేసులు పెట్టించడం, వేధింపులకు పాల్పడుతున్నారన్న అనుమానం కలిగేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయి. మనం మంచి పనులు చేయడంతో పాటు ప్రజలకు సరిగా చెప్పాలని ఆయన అంటున్నారు. 1995 నుంచి చంద్రబాబు వాడుకుంటున్న విధంగా మీడియాను మరెవరైనా వాడుకోగలిగారా? అయినా తను ఓడిపోయినప్పుడు ప్రచారం సరిగా లేదని అంటున్నారు. చంద్రబాబు ప్రజలకు విపరీతమైన హామీలు ఇవ్వడంతో పాటు పొత్తుల వ్యూహాలలో సఫలం అయినప్పుడు గెలిచారు. హామీలు నెరవేర్చక ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడినప్పుడు ఓటమి చెందారు. కాకపోతే ఆ విషయం చెప్పరు. 2004, 2019లలో ఓటమికి ప్రచార లోపమే కారణం అంటున్న చంద్రబాబు 2009లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయారో చెప్పలేదు. 👉2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బాగా పనిచేయబట్టి,ఆయన ప్రజలకు బాగా చెప్పగలిగినందువల్లే గెలిచారని అనుకోవాలా? 2024లో జగన్ ఓటమికి కూడా అదే కారణం అని ఎందుకకు అనుకోరాదు? పైగా టీడీపీ జగన్ టైమ్ లో చెప్పినన్ని అబద్దాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా చేసిన అసత్య ప్రచారాలు, వదంతులు అన్ని చూస్తే అది ఒక ప్రపంచ రికార్డు అవుతుందేమో! ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆకాశమే హద్దుగా హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఎగనామం పెట్టడం జరుగుతుంటున్నది సర్వత్రా ఉన్న భావన. 2014లో ఇచ్చిన రైతు రుణమాఫీ తదితర వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్ల టీడీపీకి బాగా అప్రతిష్ట వచ్చిందన్న సంగతి జనం మర్చిపోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. మోడీ వల్ల దేశం బాగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు తెలిపారు. మరి గతంలో అందుకు విరుద్ధంగా ఎందుకు మాట్లాడింది ఎప్పుడూ వివరణ కూడా ఇవ్వలేదన్నది వాస్తవం. జనాభా నియంత్రణ వద్దని చెబుతూ ఏకంగా యూపీ, బీహారు రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని అనడం మరీ విడ్డూరంగా ఉంది. గతంలో ఆ రెండు రాష్ట్రాలు సరిగా పనిచేయక దేశానికి నష్టం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాల ఆదాయం కూడా ఆ రాష్ట్రాలకు పోతోందని వాదించిన చంద్రబాబు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు. 👉కొత్త డిలిమిటేషన్ వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతున్నప్పటికి ఆయన ఆ మాట అనలేకపోతున్నారు. వైసీపీ సభ్యులొకరు కేంద్రంలో టీడీపీపైనే ప్రభుత్వం ఆధారపడినప్పటికీ అని ఆయా అంశాలు ప్రస్తావిస్తుండగా, లోకేష్ జోక్యం చేసుకుని అలా చెప్పవద్దని, తాము బేషరతుగా కేంద్రంలోని ఎన్డీయేకి మద్దతు ఇస్తున్నామని అన్నారు. లోకేష్ కూడా అలా మాట్లాడారంటే.. బీజేపీ అంటే వీరు భయపడుతున్నారని చెప్పడానికి ఇవన్ని సంకేతాలు అవుతాయి. ఒకప్పుడు ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తాకట్టు పెట్టిందనే విమర్శను పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పెద్ద ఎత్తున చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం వైఖరి ఎలాంటి విమర్శలకు అవకాశం ఇస్తున్నదో ఊహించుకోవచ్చు. ఏది ఏమైనా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన వాగ్దానాల అమలుకన్నా, ప్రత్యర్ధులను వేధించి, జైళ్లలో పెట్టి అధికారాన్ని కొనసాగించాలన్న లక్ష్యం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు మరింత అప్రతిష్ట పాలవుతారు తప్ప ప్రయోజనం ఉండదు. అధికారం అనే పొర కళ్లను వాళ్లను కప్పేసి ఉంటుంది కనుక ఆ హితోక్తి వారి చెవికి ఎక్కకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మొత్తం చినబాబే చేశారు! రెడ్‌బుక్ ఎఫెక్ట్‌తో అంతా..
ఇచ్చిన మాటను గాలికి వదిలేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూడాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే.. శాసనమండలి ఎన్నికలు!. మొత్తం ఐదు సీట్లలో.. టీడీపీ మూడు స్థానాలు, జనసేన, బీజేపీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అయితే ఈ ఎంపికలన్నీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ సొంత టీమ్ కోసమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీకి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ మాటకే పార్టీలో ఎక్కువ చెల్లుబాటు అవుతున్నట్లు సమాచారం. సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టి, గతంలో తాము చేసిన బాసలకు తిలోదకాలు ఇచ్చి ఈ ఎంపికలు జరిపారన్న భావన టీడీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. ఉన్నవి మూడు సీట్లే. కాబట్టి అందరిని సంతృప్తి పరచడం కష్టమే. కాని ఎంపిక చేసిన వారిని ఇతర ఆశావహులతో పోల్చి చూసినప్పుడు విమర్శలు వస్తున్నాయా? ప్రశంసలు వస్తున్నాయా? అనేది పరిశీలనకు వస్తుంది. ఆ రకంగా చూస్తే ఈ ఎంపికలు అంత సంతృప్తి కలిగించలేదని అంటున్నారు. 👉పార్టీలో 42 ఏళ్లు వేర్వేరు పదవులు నిర్వహించిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు టీడీపీ రిటైర్మెంట్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. 1995లో యనమల స్పీకర్‌గా ఉండడం వల్లే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తోసేసి చంద్రబాబు తేలికగా సీఎం అయ్యారని అంటారు. చంద్రబాబుకు రాజకీయ సలహాలు ఇస్తుంటారని కూడా ప్రచారం ఉంది. లోకేష్ నాయకత్వం వచ్చాక ఈయనను మెల్లగా పక్కన పెట్టారు. అయితే యనమల కుమార్తెకు మాత్రం ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఇంకో కూతురి భర్త ఎంపీ అయ్యారు. వియ్యంకుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా మైనస్ కావచ్చు. అయితే.. టీడీపీలో ఆయా కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వలేదా అన్న చర్చ రావచ్చు. అది వేరే సంగతి. 👉ఇక అందరి దృష్టిని ఆకర్షించేది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలనుకున్నప్పుడు వర్మ సీటు వదలుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ఆయన(వర్మ) ఎమ్మెల్సీ అయిపోయినట్లేనని ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా.. రెండుసార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయ్యాయి. కాని వర్మకు అవకాశం ఇవ్వకుండా హామీని గాలికి వదలివేసి అవమాన భారం మిగిల్చారు. ఇప్పుడు వర్మ కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వర్మకు పదవి ఇస్తే పిఠాపురంలో పోటీ కేంద్రం అవుతారన్నది పవన్ భయమట. ఏది ఏమైనా మాట ఇచ్చి ఎలా తప్పవచ్చో చెప్పడానికి వర్మ వ్యవహారం ఉదాహరణ అవుతుంది. కొంతకాలం క్రితం వరకు కనీసం తన వాయిస్ వినిపించే వారు. కాని ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ భయమో, మరేదైనా కారణంతోనో వర్మ కనీసం నిరసన కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో పడ్డారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. 👉వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను ఎలా ప్రలోభ పెట్టారో.. ఏకంగా ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అన్నారు. కాని ఆయనకు పదవి హుళక్కి అయింది. పలువురు ఇతర ప్రముఖులు దేవినేని ఉమ, ప్రభాకర చౌదరి, బుద్దా వెంకన్న, వంగవీటి రాధాకృష్ణ మొదలైన వారంతా గత ఎన్నికలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డారు. అప్పుడు వారిని ఓదార్చడానికి ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇస్తామన్నారు. కాని వారికి ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా రాలేదు. వైఎస్సార్సీపీ నుంచి పార్టీ మారిన జంగా కృష్ణమూర్తి పరిస్థితి అంతే. 👉ఒక్క బీటీ నాయుడుకు మాత్రం ఎమ్మెల్సీ పదవి తిరిగి వచ్చారు. చంద్రబాబుకు బాగా ఉపయోగపడ్డారని టీడీపీ మీడియా ఒక ప్రచారం చేస్తోంది కాని, ఆయనను మించి ఎవరూ లేరా? అనే సందేహం కూడా వస్తుంది. బీదా రవిచంద్రకు పదవి ఇవ్వడం మామూలుగా అయితే అభ్యంతరం ఉండదు. కాని, వైఎస్సార్సీపీ నుంచి ఆయన సోదరుడు టీడీపీలోకి వచ్చి మళ్లీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇప్పుడు రవిచంద్రకు కూడా పదవి దక్కింది. ఇక కావలి గ్రీష్మకు ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి ఉంది. ఆమెను ఎమ్మెల్సీ చేయడం విశేషం. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తెగా కన్నా, ఆమె మహానాడులో చంద్రబాబు సమక్షంలోనే వేలాది మంది చూస్తుండగా, తొడలు గొట్టడం, అభ్యంతరక భాషలో వైఎస్సార్సీపీ వారిని దూషించడం వంటి కారణాలే ప్రామాణికతగా పదవి వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. మరి ఆమె మండలిలో ఇంకెలాంటి బూతులకు దిగుతారోనన్న వ్యాఖ్యలు టీడీపీలో వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులను ఎంకరేజ్ చేసినట్లు వ్యవహరించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబుతున్నారు. ఎల్లోమీడియా మాత్రం సహజంగానే ఈ టీడీపీ ఎమ్మెల్సీ ఎంపికలకు బిల్డప్ ఇస్తూ బలహీనవర్గాలకు పెద్ద పీట అని రాసి ప్రచారం చేశాయి. జనసేన అభ్యర్దిగా పవన్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేశారు. కొద్ది నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. కాని ఎందువల్లో ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నందున ఇవ్వకతప్పదేమో!. 👉ఎల్లో మీడియా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని, కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రమే ఇస్తారంటూ కథనాలు రాసింది. అందుకు పవన్ కూడా ఓకే అన్నట్లు చెప్పాయి. కాని ఏమైందో కాని, మరుసటి రోజు నాగబాబు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయబోతున్నారని జనసేన ప్రకటించింది. విశేషం ఏమిటంటే గతంలో పవన్ తన బంధువులకు పదవులు ఇవ్వడం కోసం పార్టీని పెట్టడం లేదని గొంతెత్తి మరీ చెప్పారు. అంతేకాక కుల రాజకీయాలపై ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడారు. ఇప్పుడు జనసేన అంటే ఒక సామాజిక వర్గ పార్టీనే అన్న భావన కలిగించేలా పదవులు కేటాయిస్తున్నారు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా అదే వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు తన సోదరుడు నాగబాబుకు ఇచ్చుకున్నారు. తనతో పాటు కందుల దుర్గేష్ కూడా అదే వర్గం వారు కావడం గమనార్హం. నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. దీంతో జనసేనలో ఇతర సామాజిక వర్గాలకు అసలు ప్రాధాన్యత లేదన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడడానికి ఆస్కారం కలిగింది. 👉గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి ఎమ్మెల్సీ అవుతున్నారు. వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై బీజేపీ లో ఆక్షేపణ ఉండకపోవచ్చు. కాని ఈ పదవిని ఆశిస్తున్న ఇతర సీనియర్ లు కొందరికి ఆశాభంగం అవుతుంది. వీర్రాజుకు పదవి రావడం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. కాని బీజేపీ అధిష్టానాన్ని కాదనే పరిస్థితి వీరికి లేదు. వీర్రాజు నామినేషన్ చివరి క్షణంలో వేసిన తీరును బట్టి హైకమాండ్ కావాలనే ఆయనకు పదవి ఇచ్చిందని, తద్వారా టీడీపీకి, పురందేశ్వరికి చెక్ పెట్టే ఆలోచన చేసి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. గతంలో వీర్రాజు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2014-19 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎక్కడకక్కడ కడిగి పారేసేవారు. నీరు-చెట్టు స్కీమ్ కింద తెలుగు తమ్ముళ్లు రూ.13 వేల కోట్లు దోచేశారని సంచలన ఆరోపణ కూడా చేశారు.ఇప్పుడు వాటన్నిటిని మరచి పోయి టీడీపీతో స్నేహం చేయకతప్పదు. ప్రధాని మోదీనే టీడీపీ పెద్దలు దారుణంగా దూషించినా పొత్తు పెట్టుకోగా లేనిది, వీర్రాజుది ఏముందిలే అనేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఎంపికల వల్ల టీడీపీ, జనసేనలలో కొంతమేర అంతర్గతంగా లుకలుకలు రావచ్చు. తెలంగాణలో ప్రముఖ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అధిష్టానం ఆమెను ఎంపిక చేసిందని చెబుతున్నారు. మరో నేత అద్దంకి దయాకర్ గతసారి ఎన్నికలలో తన సీటును వదలుకుని ప్రచారానికి పరిమితం అయ్యారు. అయినా టిక్కెట్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ ఉన్నప్పటికీ ఎట్టకేలకు సాధించగలిగారు. మరో సీటును శంకర్ నాయక్ అనే నేతకు కేటాయించారు.ఇంకో స్థానం సిపిఐకి కేటాయించారు. కాగా బీఆర్ఎస్ పక్షాన దాసోజు శ్రావణ్ కు ఇవ్వడం ద్వారా గతంలో ఆయనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసినట్లయింది. అప్పట్లో కేసీఆర్ నామినేట్ చేసినా, గవర్నర్ ఆమోదం జాప్యం అవడం, ఇంతలో ఎన్నికలు రావడం ,కాంగ్రెస్ గెలవడం వంటి కారణాలతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. ఇప్పటికి ఆయనకు పదవి లభించింది. తెలంగాణలో ఈ ఎంపికలు.. ఏపీతో పోల్చితే కాస్త బెటర్ గా ఉన్నట్లే కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పోసానిపై పైశాచికం!
సాక్షి, అమరావతి: సినిమాల్లో విలన్లు.. వృద్ధులు, మహిళలను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు చూపిస్తారు..! అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది!! తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. రోజుకో కేసులో అరెస్ట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ రోడ్డు మార్గంలో ఏకంగా 2,501 కి.మీ. తిప్పి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది! 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. దీంతో చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలను ఆపలేదు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు పక్కా పన్నాగంతో పోసాని కృష్ణ మురళిపై వివిధ జిల్లాల్లో అక్రమ కేసులు పెట్టారు. అనంతరం వరుస అరెస్టులతో దాష్టీకానికి తెగించారు. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు మొదట అరెస్ట్ చేయగా అక్కడ నుంచి రాష్ట్రమంతా తిప్పుతూ వరుసగా అరెస్ట్‌ల పర్వం కొనసాగించారు. 17 అక్రమ కేసులు బనాయించగా నాలుగు కేసుల్లో అరెస్టు చేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని పోసాని కృష్ణ మురళి నివాసంపై పోలీసులు దండెత్తారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. రాత్రంతా వాహనంలో తిప్పి ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 12 గంటలకు ఓబులవారిపల్లెకు తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు పోసానిని ఏకంగా 9 గంటల పాటు విచారించడం గమనార్హం.ఫలించిన న్యాయ పోరాటం..నేడు జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశంవిశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తదితర పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన అక్రమ కేసుల్లో పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసి ఆ జిల్లాలకు వరసగా తరలించాలని పోలీసులు భావించారు. అయితే పోసాని న్యాయ పోరాటం ఫలించింది. ఆయనపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది. ఇక పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి. విశాఖ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఆదోని ఇన్చార్జి అపర్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణ మురళి బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. -
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే.. చూస్తూ ఊరుకోం
ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు.స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కూడా కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడటం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి కూడా వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది.– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలురెడ్ బుక్ రాజ్యాంగంలో.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో.. చట్టాలను కాలరాస్తూ.. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ.. పౌరుల స్వేచ్ఛను హరిస్తూ ఎడాపెడా అక్రమ అరెస్టులకు బరి తెగిస్తున్న ఖాకీలపై హైకోర్టు కన్నెర్ర చేసింది..! ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీల అధినేతలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు అడ్డగోలుగా కేసులు బనాయించడంపై నిప్పులు చెరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్‌లు చేస్తున్నా... మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని కూడా తప్పుబట్టింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే నడుచుకోవాలని మందలించింది. ఊహల ఆధారంగా ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే.. రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని ఘాటుగా వ్యాఖ్యానించింది.భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి.ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి. – ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుసాక్షి, అమరావతి: టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్‌రెడ్డికి కింది కోర్టు రిమాండ్ విధించడం చట్ట విరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. ఈమేరకు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పు కాపీ అందిన వెంటనే శ్రీధర్‌రెడ్డిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను ధర్మాసనం ఆదేశించింది. న్యాయమా?.. అన్యాయమా? అన్నదే ముఖ్యం...ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఎలాంటి రుజువులు లేకుండా పోలీసులు తమ ఊహ ఆధారంగా అరెస్ట్‌లు చేస్తామంటే కుదరదని పేర్కొంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఆరెస్టులు చేస్తూ పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. మేజిస్ట్రేట్లు సైతం ఏమీ చూడకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తులు ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, పోలీసులు చర్యలు న్యాయమా? అన్యాయమా? అన్నదే ముఖ్యమని తేల్చి చెప్పింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పౌరుల హక్కులను, స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందంది. పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలను తాము ఎంత మాత్రం అనుమతించబోమంది. చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదని పోలీసులకు తేల్చి చెప్పింది. ఎలా పడితే అలా అరెస్టులు చేసి మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంది. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే, రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించింది. అంతా బాగుందని చెప్పేస్తే, తాము మౌనంగా ఉండిపోతామని అనుకోవద్దని పోలీసులకు తేల్చి చెప్పింది. శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేసి హాజరుపరిచినప్పుడు మొదట మేజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించారని, దీంతో ఆయన్ను స్వేచ్ఛగా వదిలేయాల్సిన పోలీసులు మళ్లీ అరెస్ట్ చూపారని పేర్కొంది. మేజిస్ట్రేట్ సైతం రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలను లోతుగా పరిశీలించకుండా శ్రీధర్‌రెడ్డికి రిమాండ్ విధించారని ధర్మాసనం ఆక్షేపించింది. ప్రతీ దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారంది. శ్రీధర్‌రెడ్డి అరెస్ట్ విషయాన్ని సైతం సరైన పద్ధతిలో సంబంధీకులకు తెలియచేయలేదని ప్రస్తావించింది. రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 47(1) కింద అరెస్ట్ విషయాన్ని తెలియచేయలేదని తెలిపింది. అందువల్ల శ్రీధర్‌రెడ్డి నిర్భంధం అక్రమమని ధర్మాసనం తేల్చి చెప్పింది. సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్ విషయాన్ని నిర్భంధంలో ఉన్న వ్యక్తికి వెంటనే తెలియచేసి తీరాల్సి ఉంటుందని పేర్కొంది. శ్రీధర్‌రెడ్డిని హాజరుపరిచినప్పుడు సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్‌కు గల కారణాలను నిందితునికి తెలియచేయలేదన్న కారణంతో మేజిస్ట్రేట్ రిమాండ్‌ను తోసిపుచ్చారు. సెక్షన్ 47(1) పోలీసులు చట్టం నిర్ధేశించిన విధి విధానాలను పాటించని పక్షంలో నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయాలని చట్టం చెబుతోంది. ఈ కేసు విషయానికి వస్తే పోలీసులు చట్టపరమైన విధి విధానాలను పాటించకపోయినా కూడా నిందితుడికి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. తద్వారా మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారు. అందువల్ల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే శ్రీధర్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చునని పోలీసులకు సూచించింది.రిమాండ్‌పై భార్య న్యాయ పోరాటంతన భర్త అవుతు శ్రీధర్‌రెడ్డికి రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమంటూ ఎం.ఝాన్సీ వాణిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపించగా ప్రభుత్వం తరఫున యతీంద్ర దేవ్ వాదనలు వినిపించారు.రీల్ పోస్టు చేయడం.. బలవంతపు వసూలా?సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ తీరును వ్యంగ్యంగా చిత్రీకరించి ఫేస్బుక్లో సదరు రీల్‌ను పోస్ట్ చేసిన మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. ప్రేమ్ కుమార్ పోస్ట్ చేసిన రీల్‌కు, బలవంతపు వసూళ్లకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. ఆయన బలవంతపు వసూళ్లకు పాల్పడటంతో పాటు తరచూ నేరాలు చేసే వ్యక్తి అని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనడంపై మండిపడింది. దేని ఆధారంగా ఇలా రాశారంటూ నిలదీసింది. అరెస్ట్ సమయంలో ఆయన వద్ద రూ.300 దొరికాయి కాబట్టి వాటిని బలవంతపు వసూళ్లుగా చెబుతున్నారా? అంటూ మండిపడింది. మేజిస్ట్రేట్లు కూడా యాంత్రికంగా రిమాండ్ విధించేస్తున్నారంది. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఏం పేర్కొన్నారు? అందులో పేర్కొన్న సెక్షన్లు నిందితునికి వర్తిస్తాయా? లాంటి విషయాలను లోతుగా పరిశీలించకుండానే రిమాండ్ విధించేస్తున్నారని పేర్కొంది. రొటీన్‌గా రిమాండ్ ఉత్తర్వులు..తమ ముందుకు వస్తున్న కేసులను పరిశీలిస్తే మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు పేర్కొంది. మేజిస్ట్రేట్లు రొటీన్‌గా రిమాండ్ ఉత్తర్వులిచ్చేస్తున్నారంది. మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నా, తాము మాత్రం బుర్రలు ఉపయోగించే విచారణ జరుపుతున్నామని వ్యాఖ్యానించింది. నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో అతడు ఎక్కడ ఉంటే అక్కడి పంచాయితీదారుల సమక్షంలోనే జరగాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ప్రేమ్‌కుమార్ అరెస్ట్ విషయంలో కర్నూలు పోలీసులు అక్కడ పంచాయతీదారులను గుంటూరుకి తీసుకురావడంపై హైకోర్టు ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. ఇలా చేయడానికి చట్టం అనుమతిస్తోందా? అని నిలదీసింది. ప్రేమ్‌కుమార్ వ్యంగ్యంగా నాటక రూపంలో ఓ రీల్ చేసి పోస్టు చేశారని, ఇందులో బలవంతపు వసూళ్ల అంశం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. ఇలాంటి తీరును ఎంత మాత్రం సహించేది లేదని, ప్రేమ్‌కుమార్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారో పోలీసులు చెప్పి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కర్నూలు త్రీ టౌన్ ఎస్‌హెచ్‌వో అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి జోక్యం చేసుకుంటూ, జిల్లా ఎస్పీని సైతం అఫిడవిట్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, మిగిలిన ప్రతివాదులు కూడా కౌంటర్లు దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చని పేర్కొంటూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను కర్నూలు పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ కొరిటిపాటి అభియన్ గత ఏడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది.సెక్షన్ 111 ఏ సందర్భంలో పెట్టొచ్చంటే...కిడ్నాపింగ్, దొంగతనం, వాహన దొంగతనం, బలవంతపు వసూళ్లకు పాల్పడం, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఇతర అక్రమ వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మడం వంటి వాటికి పాల్పడిన వారికి మాత్రమే సెక్షన్ 111 వర్తిస్తుంది. ఈ నేరాలు రుజువైతే మరణశిక్ష, జీవితఖైధు, రూ.10 లక్షలకు తగ్గకుండా జరిమానా విధించవచ్చు. సోషల్ మీడియా పోస్టులు ఈ నేరాల కిందకు రాకపోయినప్పటికీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆ పోస్టులను వ్యవస్థీకృత నేరంగా చూపుతూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై సెక్షన్ 111 కింద కేసులు బనాయిస్తున్నారు. బెయిల్ రాకుండా చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారు. ప్రస్తుత కేసులో కూడా పోలీసులు ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్ల కింద కేసు పెట్టారు. -
అక్రమ కేసులపై తగిన మూల్యం చెల్లించక తప్పదు: రజని
-
కోడిగుడ్డుపై ఈకల కోసం.. షాడో సీఎం పాకులాట
తమకు గిట్టనివారిపై కక్ష ఎలా తీర్చుకోవాలో, తమకు కావల్సిన వారిని ఎలా అందలం ఎక్కించాలో తెలుసుకోవాలంటే ఏపీకి వెళ్లాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలు కచ్చితంగా కేస్ స్టడీ అవుతాయి. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించే తీవ్రవాద పార్టీలు రాజ్యంపై దాడులు చేస్తుంటాయి. కానీ, చిత్రంగా ఏపీలో అధికారంలో ఉన్న రాజకీయ కూటమి ప్రజలపై, ప్రతిపక్షంపైన ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, సినిమా కళాకారులను సైతం వదలడం లేదు. కూటమి ప్రభుత్వం ఏదో ఒక అక్రమ కేసు పెట్టి వేధింపులకు దిగుతోంది.షాడో సీఎంగా భావిస్తున్న నారా లోకేష్ తీసుకు వచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. కొద్దిరోజుల క్రితం సీనియర్ ఐపీఎస్ అధికారి, గతంలో సీఐడీ అధిపతిగా పనిచేసిన దళిత అధికారి పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం శోచనీయం. దానికి ప్రభుత్వం చెప్పిన కారణం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన గత ప్రభుత్వ సమయంలో అనధికారికంగా విదేశాలకు వెళ్లి వచ్చారట. ఆయన అలా టూర్ చేసినప్పుడు సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందట. బహుశా ఇలాంటి పిచ్చి కారణంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ.. ఏ అధికారిపైనా ఇలాంటి చర్య తీసుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లడం, రావడం కూడా జరిగి కొన్నేళ్లు అయింది. ఎప్పుడూ ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆయన వల్ల దేశానికి, లేదా రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారం ఏదీ బయటకు వెళ్లినట్లు ఆరోపణలు రాలేదు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. నిజంగా మన దేశ ప్రముఖులు ఎవరైనా కీలక సమాచారం లీక్ చేసే అవకాశం ఉందనుకున్నా, అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం ఉంటే వెంటనే చర్య తీసుకుంటుంది. అలాంటిది ఏమీ జరగలేదు. పైగా రాష్ట్రాలలో అంత ప్రమాదకరమైన సున్నిత సమాచారం ఏదీ ఉండదు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న సునీల్ కుమార్‌కు ఆ మాత్రం తెలియకుండా ఉండదు. అసలు కారణం ఏమిటంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పలు స్కాంలను పరిశోధించి, సాక్ష్యాధారాలతో సహా పలు కేసులు పెట్టడంలో సునీల్ కుమార్ ముఖ్య భూమిక పోషించారన్నది టీడీపీ పెద్దలకు ఉన్న కోపం. ఆ కేసులలో పనిచేసిన అప్పటి అధికారులు పలువురిపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు. అంతేకాక డీజీపీ ఆఫీసుకు వచ్చి రిపోర్టు చేసి కూర్చోవాలని ఆదేశించింది. దీనిని రిటైర్డ్ ఐపీఎస్‌లు ఖండించారు కూడా. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.ఇక సునీల్ కుమార్‌పై ఏవైనా ఆరోపణలు చేసి కేసులు పెట్టాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసి ఉంటుంది. ఇందుకోసం ఇద్దరు, ముగ్గురు రిటైర్డ్ పోలీసు అధికారులకు బాధ్యత అప్పగించిందని కూడా వార్తలు వచ్చాయి. అయినా సునీల్ కుమార్‌పై స్కాంల ఆరోపణలు చేయడానికి అవకాశం వచ్చినట్లు లేదు. దాంతో రెడ్ బుక్ సృష్టికర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి దళిత ఐపీఎస్ అధికారిని ఈ రకంగా సస్పెండ్ చేయించి ఉండవచ్చన్న అభిప్రాయం వస్తోంది. తీరా చూస్తే సునీల్ కుమార్ అనధికారంగా విదేశీ యాత్రలు చేయలేదని వెల్లడవుతోంది. ఆయన ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకునే విదేశీ టూర్‌కు వెళ్లారు. ఆయన వ్యక్తిగత హోదాలోనే వెళ్లారు. అందుకు సొంతంగానే ఖర్చు పెట్టుకున్నారు. ప్రభుత్వం వద్ద ఏదైనా నిర్దిష్ట సమాచారం ఉంటే దానికి సంబంధించి ముందుగా సునీల్ కుమార్‌కు నోటీసు ఇవ్వాలి. కానీ, ఆ పని చేయకుండా సస్పెండ్ చేశారంటేనే అందులోని దురుద్దేశం అవగతమవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.సీనియారిటీ, ట్రాక్ రికార్డు రీత్యా ఏపీకి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నందున, కేంద్రానికి తప్పుడు నివేదిక పంపేందుకు ఇలా సస్పెండ్ చేసి ఉండవచ్చని కొందరు రిటైర్డ్ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి పట్ల ఇంత ఘోరంగా వ్యవహరించిన ప్రభుత్వం, ఒక చిన్నస్థాయి అధికారి పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించిందో చూడండి. గతంలో చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిపై స్కిల్ స్కాం కేసులో అభియోగాలు వచ్చాయి. ఆయనను విచారించాలని అప్పట్లో సీఐడీ తలపెట్టింది. దానిని గమనించిన తెలుగుదేశం పెద్దలు అతనిని ఢిల్లీ నుంచి చెప్పా పెట్టకుండా అమెరికాకు పంపించేశారని అంటారు. దాంతో విచారణకు ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ, కూటమి అధికారంలోకి రావడంతోనే ఆ సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా మొత్తం జీతభత్యాలను చెల్లించేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.అంతేకాదు, ఈయన ఇంటిపై కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కనుగొన్నట్లు అప్పట్లో సీబీడీటీ ప్రకటించింది. ఆ తర్వాత కేసును విజయవంతంగా మేనేజ్ చేసుకున్నారు. అది వేరే సంగతి. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎలా ఎత్తివేస్తుందంటే ఏమి చెబుతాం. అదంతే.. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర భూషణ్ అనే అధికారి టీడీపీ హయాంలో 2018లో అనుమతులు లేకుండానే విదేశాలకు వెళ్లి వచ్చారట. తదుపరి ఏడాదికి ఆయన తిరిగి వస్తే, అప్పటి ప్రభుత్వం విదేశీ యాత్రలకు ఆమోదం తెలిపిందంట. దీనిపై ఎవరు వివరణ ఇవ్వాలి?. గతంలో ఒక డాక్టర్ రోడ్డుపై నానా రచ్చగా వ్యవహరించి, పోలీసుల మాట వినకుండా ప్రవర్తిస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ ఉదంతాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ, దళితులకు ఇంత అవమానం చేస్తారా అంటూ దుష్ప్రచారం చేశారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఆనాటి ప్రభుత్వంపై విష ప్రచారం సాగించింది.ఇప్పుడేమో ఒక దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై మాత్రం ఇంత దారుణంగా కక్ష కట్టారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మంచి పేరున్న ఒక దళిత అధికారిని విద్వేషపూరితంగా సస్పెండ్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇది కేవలం కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని అన్నారు. సునీల్ కుమార్ ఏమైనా గూఢచారి విభాగంలో ఉన్నారా, ఆయన ప్రతీ మూమెంట్ చెప్పడానికి అని ప్రశ్నించారు. ఆయనకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే కదా అని వ్యాఖ్యానించారు. సునీల్ ప్రజల ధనంతో టూర్ కు వెళ్లలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రజల సొమ్ముతో ఎలా విదేశాలు తిరిగి వస్తున్నారని, వారిద్దరి టూర్ షెడ్యూల్ వెల్లడించాలని, ఎన్ని ఉల్లంఘనలు జరిగాయో తెలుస్తుందని కూడా ప్రవీణ్ సవాల్ చేశారు.దళిత వర్గాల వారి పిల్లలు విదేశాలలో చదువుకోవద్దా?. ఆ పిల్లలను చూడడానికి దళితులు వెళ్లవద్దా?. ఆధిపత్య వర్గాలే విదేశాలకు వెళ్లాలా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కుమార్ అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు ఉండదు. గూఢచర్య పరికరాల కొనుగోలు కేసులో ఆరోపణలు ఉన్న ఒక అధికారిని గత ప్రభుత్వం సస్పెండ్ చేస్తే, కూటమి ప్రభుత్వం దానిని ఎత్తివేయడమే కాకుండా, మొత్తం జీతం కూడా చెల్లించింది. అంత పెద్ద ఆరోపణ ఉన్నా తమకు మద్దతు ఇస్తున్నందున ఆ అధికారిపై కేసు ఎత్తివేయడం ఒకవైపు చేస్తూ, తమకు గిట్టని మరో అధికారిపై ఏదో ఒక పిచ్చి కారణం చూపి కేసులు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతోంది. దళిత సంఘాలు ఈ పరిణామాలపై మండిపడుతున్నాయి. తెలుగుదేశం నేతలకు గత హయాంలో తప్పుడు కేసులు పెట్టారన్న సందేహం వస్తే దానిపై విచారణ చేయవచ్చు. ఆ స్కాంల ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఇలా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారి కుంభకోణాలను సమర్ధంగా వెలుగులోకి తీసుకువస్తే ఇలాంటి కక్షలు ఎదుర్కోవలసి వస్తుందన్న భయం అధికారవర్గంలో ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి, సమాజానికి, అధికార వ్యవస్థకు ఎంత ప్రమాదమో ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చెప్పండి.. చేసేస్తాం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్రలకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సెల్యూట్ చేస్తుండటం యావత్ పోలీసు శాఖను విభ్రాంతికి గురిచేస్తోంది. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులతో మరింతగా విరుచుకు పడాలని ఆయన జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు టార్గెట్ పెట్టి మరీ ఒత్తిడి చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు సీబీఐ దర్యాప్తు చేస్తున్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రాష్ట్ర పోలీసు శాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం విస్మయ పరుస్తోంది. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగన్న సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు తొలుత పులివెందుల, ఆ తర్వాత కడప రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో గురువారం మృతి చెందాడు. కాగా, ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని కూటమి ప్రభుత్వ పెద్దలు పన్నాగం పన్నారు. రంగన్న మృతితోపాటు మరికొన్ని సహజ మరణాలపై దర్యాప్తు కోసం సిట్‌ను నియమించారు. వివేకా హత్య కేసును ఐదేళ్లుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరి రంగన్న తదితరుల సహజ మరణాలపై ఏపీ పోలీసులు సిట్ పేరుతో దర్యాప్తు చేయడం ఏమిటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కానీ, డీజీపీ గుప్తా మాత్రం ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం విస్మయ పరుస్తోంది. వెలగపూడిలోని సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత డీజీపీ గుప్తా.. తాజా సిట్ గురించి మంత్రులకు వివరించారు. పైగా ‘రంగయ్య మృతి అనుమానస్పదమే’ అని చెప్పారు. ఇంకా సిట్ దర్యాప్తే మొదలు పెట్టకుండా రంగన్న మృతి అనుమానాస్పదమని డీజీపీ ఏకపక్షంగా మంత్రులకు వివరించడం పోలీసు శాఖ ప్రతిష్టను రాజకీయ ప్రయోజనాల కోసం పణంగా పెట్టిననట్టేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా సిట్ నివేదిక ఎలా ఉండబోతోందన్నది స్పష్టమవుతోందని చెబుతున్నారు. వేధించకపోతే వేటేస్తాం..‘వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసుల జోరు పెంచండి’ అని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు తేల్చిచెప్పారు. ఇదే ప్రధానాంశంగా ఆయన ఇటీవల టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా కూటమి నేతలు చేస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని.. ప్రాథమిక ఆధారాలు లేకుండానే అక్రమ కేసులు నమోదు చేసేయాలని ఆయన విస్పష్టంగా ఆదేశించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఏయే నేతలపై ఫిర్యాదు చేయాలన్నది టీడీపీ ప్రధాన కార్యాలయం నిర్ణయిస్తుందని, ఆ ఫిర్యాదులు అందిన వెంటనే అరెస్టులకు తెగబడాలని డీజీపీ నిర్దేశించారని సమాచారం. ఈ సందర్భంగా న్యాయ, సాంకేతిక అంశాలను కొందరు ఎస్పీలు ప్రస్తావించగా, డీజీపీ గుప్తా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. చెప్పినట్టు వేధించాల్సిందేనని, లేకుంటే బదిలీ వేటేస్తామని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. మరోవైపు సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ద్వారా కూడా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసుల జోరు పెంచామని కూడా ఆయన వారితో చెప్పడం గమనార్హం. ఎవరు ఎంతగా అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నదాన్ని బట్టి ఎస్పీలు, కమిషనర్ల పనితీరు నివేదికలు ఆధారపడి ఉంటాయని కూడా వ్యాఖ్యానించినట్టు సమాచారం.తీసుకోండి ఫిర్యాదులు.. పెట్టండి కేసులు» పోసాని కృష్ణ మురళిపై ఒక్కసారిగా అబద్ధపు ఫిర్యాదులు జోరందుకున్నాయి. ఆయనపై రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో పోలీసులు చకచకా అక్రమ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేసి.. అన్నమయ్య, పల్నాడు, కర్నూలు జిల్లాలు తిప్పుతూ వేధింపులకు తెగబడ్డారు. » మాజీ మంత్రి విడదల రజినీని తాజాగా లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెపై ఓ క్వారీ యజమాని ద్వారా అవాస్తవ ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు ఇప్పించారు. ఆ ఫిర్యాదు ప్రతి దుమ్ము దులిపిన ఏసీబీ అధికారులు ఆమెను అక్రమ కేసుతో వేధించేందుకు సన్నద్ధమవుతున్నారు. » పర్చూరు నియోజకవర్గంలో గతంలో ఓట్లను తొలగించారనే ఆరోపణలతో ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసింది. అందుకోసం కుట్ర పూరితంగా టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో ఫిర్యాదు చేయించింది. ఆ వెంటనే ఓట్ల తొలగింపుపై దర్యాప్తునకు సిట్‌ను నియమించింది. టీడీపీ అస్మదీయ అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్‌ను సిట్ ఇన్చార్జ్గా డీజీపీ సూచించడం గమనార్హం. ఆయన ఇప్పటికే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, విజయ్‌పాల్ తదితరులపై చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కొట్టివేసిన అభియోగాలపై తాజాగా కేసు నమోదు చేసి మరీ వేధింపులకు పాల్పడుతూ దామోదర్ హల్చల్ సృష్టిస్తున్నారు. ఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలంటూ గుంటూరు జీజీహెచ్ అధికారులను వేధిస్తున్నారు. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న ఈయనకు సిట్ బాధ్యతలు అప్పగించడం పక్కా ప్రభుత్వ పన్నాగమే. » ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సీఐడీ నమోదు చేసిన అక్రమ కేసులోనూ డీజీపీ గుప్తా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను వేధించి అబద్ధపు వాంగ్మూలం ఇప్పించారు. తాజాగా ప్రభుత్వ మాజీ సలహాదారుడు రాజ్ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆయన సమీప బంధువులను వేధిస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే అక్రమ కేసులు నమోదు చేస్తామని రాజ్ కసిరెడ్డి సమీప బంధువుల ఇళ్లకు పోలీసులు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. -
‘సాక్షి’పై సర్కారు అక్కసు
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం నినదిస్తున్న ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతి రేక విధానాలను నిలదీస్తున్న ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులకు తెగబడుతోంది. రెడ్‌బుక్ కుట్రలో తాజా అంకంగా.. కేసు నమోదు చేయాలని రియ ల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)ను ఆదేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ‘వాట్సాప్ గవర్నెన్స్’ విధానం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ యాప్ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించేదిగా ఉందని పలువురు నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో.. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కు పరిరక్షణకు బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా సాక్షి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్పందించింది. ‘మన మిత్ర.. మరో మారీచుడు’ శీర్షికన గతనెల 3న ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ అంశాలను కూడా ఇందులో ప్రస్తావించింది. ఆ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే అమాంతంగా పెరిగిపోతున్న సోషల్ మీడియా వేధింపులు, సైబర్ నేరాలు బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం వాటిల్లే పరిస్థితి తలెత్తడం అందర్నీ ఆందోళనపరిచింది. కానీ, ఆ కథనం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. ‘సాక్షి’ పత్రికపై కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసు వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
రెడ్‌బుక్ రూల్స్‌లో పవన్ వాటా! తిలాపాపం.. తలా పిడికెడు
ఏపీలో ఎవరి మనోభావాలు ఎప్పుడు గాయపడతాయో తెలియడం లేదు. దారిన పోతున్న వాళ్లకు బుర్రలో ఓ ఆలోచన పుడుతుంది.. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదూ చేస్తారు. సదరు వ్యక్తి టీడీపీ, జనసేనలకు చెందిన వాడైతే.. యాక్షన్ తక్షణం మొదలవుతుంది కూడా. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు ఐపీఎస్ అధికారులుసహా అంతా వాయువేగంతో స్పందిస్తారు. అదే వైఎస్సార్సీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే.. దాన్ని పక్కన పడేయాల్నది రెడ్ బుక్(Red Book) ఆదేశం. ప్రముఖ నటుడు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని కృష్ణ మురళీ విషయంలో ఇదే జరిగింది. ఎప్పుడో 2017లో పోసాని తనకు ఇచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలలో ఒకటి, రెండు కులాల ప్రస్తావన ఉందట. దాన్ని ఆయన 2023లో గుర్తు చేశారట. ఆ విషయం జనసేన నేతగా చెప్పుకుంటున్న మణి అనే వ్యక్తికి సడన్‌గా గుర్తుకొచ్చింది. ఇంకేముంది.. ఫిర్యాదు రెడి.. పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లడం.. ఎవరో ఒక బందిపోటును, ఉగ్రవాదిని, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తిపట్ల వ్యవహరించినట్లు ఆయన్ను అరెస్టు చేసి 15 గంటలు ప్రయాణించి మరీ తిరుపతి సమీపంలోని రైల్వేకోడూరు వద్ద ఒక పోలీస్ స్టేషన్‌కు తరలించడం... చకచకా జరిగిపోయాయి. అక్కడితో ఆగిపోయిందా.. ఊహూ లేదు. ఒక పెద్ద ఐపీఎస్ అధికారి మిగిలిన కేసులన్నిటిని పక్కన పడేసి మరీ పోసానిని తొమ్మిది గంటలపాటు విచారించారు. ఈ రకమైన ఫిర్యాదు.. వ్యవహారం రెండూ రికార్డు బుక్కులకు ఎక్కేస్తాయి. పక్కాగా! అరవై ఆరేళ్ల పోసానిని హింసించడం ద్వారా పోలీసులు రెడ్ బుక్ సృష్టికర్తలను సంతోషపెట్టి ఉండవచ్చు. కానీ.. ఆత్మ పరిశీలన చేసుకుంటే మాత్రం మనోవేదనకు గురి కాక తప్పదు. పోలీసు అధికారులందరిని తప్పు పట్టడం లేదు.పోసాని మీద పెట్టిన కేసులో సెక్షన్లు చూడండి.. సెక్షన్ 111ను న్యాయాధికారి ఆమోదిస్తే నిందితుడికి బెయిల్ రావడం కూడా కష్టం అవుతుంది. ఈ సెక్షన్ ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని పలుమార్లు ఉన్నత న్యాయ స్థానాలు హెచ్చరించాయి కూడా. పోసాని ఒక ప్రముఖ కళాకారుడు. వందకుపైగా సినిమాలకు కథలు, సంభాషణలు రాసి పేరు తెచ్చుకున్న వ్యక్తి. రాజకీయంగా కొంతకాలం ప్రజారాజ్యంలోను, ఆ తర్వాత వైఎస్సార్సీపీ లోనూ ఉన్నారు. కొంత ఆవేశపరుడు కూడా. రాజకీయ ప్రత్యర్థుల ఘాటు విమర్శలకు బదులిచ్చే క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ.. చిత్రంగా ఆయన ఎవరిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారో వారి మనోభావాలు గాయపడినట్లు ఫిర్యాదులు రాలేదు. వారి అభిమానులో, పార్టీ కార్యకర్తలెవరికో మనోభావాలు గాయపడ్డాయట. దానిపై వారు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ గొడవలు ఎందుకులే.. అని పోసాని అసలు రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి, ఇంటికే పరిమితం అయ్యారు. అయినా రెడ్ బుక్ టార్చర్ ఆగదట. ఆ విషయాన్ని ఆ బుక్ సృష్టికర్తలే చెప్పారు. పోసానిపై ఆ కేసులు కాకుండా, మరో కొత్త కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ కేసు వివరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2017లో నంది అవార్డును తిరస్కరించి తన అభిప్రాయాలు చెప్పడం ఏమిటి? దానిపై జనసేన నేత ఎవరికో ఇప్పుడు బాధ కలగడం ఏమిటి? అసలు ఆయనకు ఈ కేసుతో ఏమి సంబందం? అంతేకాదు.. వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి చెబితే ఆ భాష వాడారని ఎల్లో మీడియాకు లీక్. దీనిని ఎవరైనా నమ్ముతారా? కేవలం వైసీపీ ముఖ్యనేతలను వేధించాలన్న తలంపు కాకపోతే. టీడీపీ, జనసేన, బీజెపి కూటమి కొత్త ట్రెండ్ సృష్టించింది. వచ్చే ఎన్నికలలో కూటమి ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వస్తే కేసులు ఎలా పెట్టవచ్చు.. ఒకటికి పది పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎలా తిప్పవచ్చు? పిచ్చి కేసులనైనా ఎలా హ్యాండిల్ చేయవచ్చు? ఒక కేసులో బెయిల్ వస్తే, మరో కేసులో ఎలా అరెస్టు చేయవచ్చు? అన్నది నేర్పినట్లుగా ఉంది. రెడ్ బుక్ అంటే ఈ పిచ్చి యవారాలు చేయడమా అన్న భావన కలిగినా మనం చేయగలిగింది లేదు. ఎప్పుడో నంది అవార్డులపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం మీద ఒక ఐపీఎస్ అధికారి తొమ్మిది గంటలు విచారణ చేశారంటే ఏమని అనుకోవాలి. కేవలం పోసానిని హింసించడం తప్ప మరొకటి అవుతుందా? పోసాని రిమాండ్ పై తెల్లవారుజాము వరకు గౌరవ న్యాయాదికారి వద్ద వాదనలు జరిగాయి. న్యాయాధికారి ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదని చెప్పడం సమంజసంగానే ఉన్నా, ఆ తర్వాత రిమాండ్ కు పంపడం ఎందుకో అర్దం కాదు. ఏడేళ్ల శిక్ష పడే కేసులు అయితేనే రిమాండ్ కు పంపాలన్నది ఉన్నత న్యాయ స్థానం ఇచ్చిన గైడ్ లైన్ అని వైఎస్సార్సీపీ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి చెప్పారు. దానిని గౌరవ కోర్టు పట్టించుకోలేదని ఆయన చెబుతున్నారు. దీనిపై పై ఏమి చేయాలో ఆలోచిస్తున్నామని అన్నారు. లీగల్ పండితుల సంగతేమో కాని, సాధారణ పౌరులకు మాత్రం ఇక్కడే కొన్ని విషయాలు అర్థం కాలేదు.గతంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన, ఆయన కుటుంబంపైన, మంత్రులపైన ఎవరైనా నీచమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అరెస్టులు జరిగితే ఆ కేసుల్లో నిందితులలో కొందరిని రిమాండ్ కు పంపకుండా బెయిల్ ఇచ్చి పంపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తి అప్పటి మంత్రి రోజాను ఉద్దేశించి దారుణమైన అవమానకర వ్యాఖ్య చేస్తే పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ఆయనకు వెంటనే బెయిల్ లభించింది. మరికొందరి విషయంలోను అలాగే జరిగింది. అంటే ఆనాటి పోలీస్ వ్యవస్థ గట్టి సెక్షన్ల కింద కేసులు పెట్టలేదా? పెట్టినా న్యాయ వ్యవస్థ సీరియస్ గా తీసుకోలేదా? లేక ఆనాటి ప్రతిపక్ష టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రచారాల నేపథ్యంలో ఆయా వ్యవస్థలు ఉదాసీనంగా పనిచేశాయా? టీడీపీ లాయర్ల మాదిరి వైఎస్సార్సీపీ లాయర్లు న్యాయ వ్యవస్థను ఒప్పించలేకపోతున్నారా? ఇలా పలు సందేహాలు వస్తాయి. కాని వీటికి సమాధానం ఇప్పట్లో దొరకకపోవచ్చు. ఇదేకాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు లేదా మరెవరైనా టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెడుతున్న తీరు కూడా భవిష్యత్తులో ప్రభుత్వాలకు మార్గదర్శకం అయ్యే అవకాశం ఉంది. వారు కూడా తమ నేతలను అవమానించడంతో మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రం అంతటా కేసులు పెట్టవచ్చు. ఒక కేసులో బెయిల్ వస్తే,వెంటనే అదుపులోకి తీసుకుని మరిన్ని స్టేషన్ ల చుట్టూ తిప్పవచ్చు. ఇప్పుడు పోసాని విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. ఆయనను రాజంపేట నుంచి నరసరావుపేటలో నమోదైన కేసులో అరెస్టు చేసి అక్కడకు తరలించారు. 16 కేసులు నమోదు చేసినందున ఇంకెన్ని జైళ్లకు తిప్పుతారో చూడాలి. ఆయనకు ఆరోగ్య సమస్య వస్తే దానిని అవహేళన చేసేలా ఒక సీఐ స్థాయి అదికారి మాట్లారంటే, ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు అయితే అప్పటి జగన్ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా చూసుకుంది? ఆయన అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఏఐజీ ఆస్పత్రి ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా బెయిల్ వచ్చింది. కాని చిత్రంగా ఆయన బెయిల్ వచ్చిన వెంటనే గంటల తరబడి ఊరేగింపు చేయగలిగారు. ఇప్పుడు ఆ విషయాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావించి పోసాని విషయంలో ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. పోసాని కులాల పేరుతో దూషించారట. ప్రజలలో వర్గ విభేదాలు సృష్టించారట.ఆ కేసు వివరాలు చదివితే ఎవరైనా నమ్ముతారా? ఫలానా కమిటీలో ఫలానా కులం వారే ఉన్నారని చెబితే దూషించడం ఎలా అవుతుందో పోలీసులకే తెలియాలి. దానివల్ల ప్రజలలో వర్గ విభేదాలు వచ్చి ఉంటే అప్పుడే గొడవలు అయి ఉండాలి కదా! ఒకాయన ఢిల్లీలో చెట్టు కింద కూర్చుని కులాలు, మతాల గురించి ప్రస్తావించి దూషణలకు దిగితే.. ఆయనపై కేసు పెడితే భావ స్వేఛ్చ అని, ఇంకేదో అని టీడీపీ, జనసేన వారు, ఎల్లో మీడియా గుండెలు బాదుకున్నారే. పైగా ఆయనకు అధికారంలోకి వచ్చాక మంచి పదవి కూడా ఇచ్చారే. అంతెందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు తమ సభలలో దూషణలతో పాటు కొన్నిసార్లు బూతు పదాలు వాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అప్పట్లో జగన్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం తప్పని ఈ అనుభవాలు చెబుతున్నట్లుగా ఉంది. అంతెందుకు.. ప్రధాని మోదీని టెర్రరిస్టు అని, దేశంలోనే ఉండడానికి అర్హుడు కాదని.. ఇంకా అంతకన్నా ఘాటైన వ్యాఖ్యలు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేస్తే బీజేపీ వారి మనోభావాలు ఎందుకు దెబ్బ తినలేదో తెలియదు! అసలు మోదీ మనోభావాలు గాయపడలేదా? ఇక పవన్ కల్యాణ్ తనను తెలుగుదేశం పార్టీవారు ఎన్ని రకాలుగా అవమానించింది స్వయంగా ఆయా సభలలో చెప్పారే. అప్పుడు కూడా జనసేన వారి మనోభావాలకు ఏమీ కాలేదా? మళ్లీ అంతా ఒకటయ్యారే! అలాంటిది నంది అవార్డులపై ఏడేళ్ల క్రితం పోసాని చేసిన వ్యాఖ్యలతో ఏదో జరిగిపోయిందా? కోర్టులలో ఏమవుతుందన్నది వేరే విషయం. కాని ప్రజల కోర్టులో మాత్రం కూటమి ప్రభుత్వం ఇలా అక్రమ కేసులు పెడుతున్నందుకు దోషిగానే ఎప్పటికైనా నిలబడుతుంది. మరో సంగతి చెప్పాలి. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీపై ఒక కల్పిత కేసు పెట్టి అరెస్టు చేయడమే కాకుండా, జైలులో మరో మనిషితో సంబంధం ఉండని సెల్లో పెట్టడం దారుణంగా ఉంది. ఇది కూడా కొత్తగా సృష్టించిన చెడు సంప్రదాయంగానే కనిపిస్తుంది. పోసాని, తదితర వైఎస్సార్సీపీ నేతలను ఈ తరహాలో వేధించడం చంద్రబాబు ప్రభుత్వ డైవర్షన్ రాజకీయాలలో భాగమా? లేక లోకేష్ రెడ్ బుక్ లో ఒక ఛాప్టరా? లేక పవన్ కూడా ఆ రెడ్ బుక్‌లో వాటా తీసుకున్నారా? అనేదానిపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి.శాసనమండలిలో వైసీపీ అడిగిన ప్రశ్నలకు టీడీపీకి సౌండ్ లేకపోవడం, ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా ఉదంతం, పవన్‌ను సంతృప్తిపరచడం ,సూపర్ సిక్స్ హామీల గురించి జనం మాట్లాడుకోకుండా.. ఈ కేసుల గురించి చర్చించుకోవాలనుకోవడం, వైఎస్సార్సీపీని అణగతొక్కడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ రెడ్ బుక్ ను ప్రయోగిస్తోందన్న భావన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వంశీ, పోసాని తదితర బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నైతిక స్థైర్యం చెప్పడమే కాకుండా, న్యాయపరంగా పూర్తిగా అండగా నిలడడం సబబుగా ఉంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన పోసానిని రెడ్ బుక్ పేరుతో గిల్లీ మరీ తిరిగి రాజకీయ రంగంలోకి తీసుకు వస్తున్నారేమో! ఇప్పటికే వందలు, వేల సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు కూటమి రెడ్ బుక్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కూటమి సర్కార్ ప్రతీకార రాజకీయాలతో వారంతా రాటుతేలి పార్టీకి మరింత గట్టిగా పని చేసేవారుగా తయార అవుతున్నారనిపిస్తోంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెడ్ బుక్ రాజ్యాంగంతో మీడియాపై ఆంక్షలు
-
సాక్షి దెబ్బకు దిగొచ్చిన నారా లోకేష్
ప్రెస్మీట్లలో ‘‘సాక్షి.. ఎక్కడమ్మా?’’ అంటూ ఇంతకాలం వెటకారం ప్రదర్శిస్తూ వచ్చిన చినబాబు.. ఇప్పుడు ఆ ఛానెల్ కెమెరా కనిపిస్తే ముఖం తిప్పేసుకుంటున్నారు. ఆయన తెచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం.. తొమ్మిది నెలల పాలనలో అమలుకాని కూటమి ప్రభుత్వ హామీలు.. ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్సార్సీపీ వినిపిస్తున్న గళమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ఇవాళ అణచివేత చర్యలకు దిగగా.. సాక్షి దానిని అంతే ధీటుగా ఎదుర్కొంది.సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి పాలన(Kutami Rule)లో అరాచకాలు ఏనాడో తారాస్థాయిని చేరాయి. అయితే రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తూ ఈ మధ్య మీడియా స్వేచ్ఛను కూడా హరించి వేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో కవరేజ్ కోసం సాక్షి ఛానెల్(Sakshi Channel) సహా నాలుగింటిపై ఆంక్షలు విధించడం చూశాం. ఇప్పుడు.. ఇవాళ.. శాసన మండలిలోనూ ప్రత్యక్ష ప్రసారాలు రాకుండా చానెల్స్‌ను అసెంబ్లీలోకి అనుమతించలేదు.ఏపీ శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల దెబ్బకు మంత్రి నారా లోకేష్(Nara Lokesh Babu) వణికిపోయారు. వాళ్లు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడ్డారు. చివరకు.. నీళ్లు నమిలిన గొంతుతోనే.. తమ లెక్కలన్నీ తప్పుడువేనని.. తమదంతా డబ్బా ప్రచారమేనని నిజాలు ఒప్పేసుకున్నారు. ఈ క్రమంలోనే.. ఇవాళ అసెంబ్లీ శాసన మండలిలో సమాచారశాఖ సాక్షికి లైవ్ ప్రసారాలను నిలిపివేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.సాక్షి మాత్రమే కాదు.. మరో మూడు మీడియా చానెల్స్‌కు లైవ్ ప్రసారం ఇవ్వకుండా అసెంబ్లీలోకి అనుమతించలేదు. కేవలం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లకు అనుకూలంగా ఉన్న ఛానెల్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ పరిణామంపై సాక్షి గళమెత్తింది. ఈ పరిణామంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను.. ప్రశ్నించే ప్రతినిధులను చూపించేందుకు అనుమతి ఇవ్వాలని పోరాడింది. ఈ దెబ్బకు కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. ఐ అండ్ పీఆర్ ఛానెల్లో శాసన మండలి ప్రసారాలు పునఃప్రారంభం అయ్యాయి. మొన్నటిదాకా సాక్షి మీడియా సంస్థ మీద అవాక్కులు చవాక్కులు పేల్చిన లోకేష్.. ఇప్పుడు ఆ ఛానెల్నే చూసి భయపడే స్థాయికి చేరుకున్నారనే చర్చ ఒకవైపు రాజకీయ వర్గాల్లో.. మరోవైపు సోషల్ మీడియాలోనూ నడుస్తోంది ఇప్పుడు . -
అధికారం అండతో.. బరితెగింపు
మదనపల్లె : రెడ్‌బుక్ రాజ్యాంగం అండతో టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారు. అధికారంలో ఉన్నది తామేనన్న అహంతో కళ్లు కనిపించక ఏకంగా రెవెన్యూ అధికారులపైనే దాడులకు పాల్పడుతున్నారు. ఆక్రమణలకు అడ్డువచ్చిన అధికారులను మారణాయుధాలతో హత్యచేసేందుకు వెనుకాడటం లేదు. రెండురోజుల క్రితం మదనపల్లె మండలం తట్టివారిపల్లె పంచాయతీ దేవతానగర్...సర్వే నంబర్.1029లో ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై మారణాయుధాలతో దాడికి పాల్పడి, జేసీబీకి నిప్పుపెట్టి బెదిరింపులకు పాల్పడిన భూకబ్జాదారుడు టీడీపీ నాయకుడేనని తెలిసింది. టీడీపీలోని ప్రధాన నాయకుల అండదండలతో మదనపల్లె పట్టణం, మండలంలో సుమారు రూ.2కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలాలను తప్పుడు పత్రాలతో ఆక్రమించుకోవడమే కాకుండా, వాటిని యథేచ్ఛగా ఇతరులకు లీజు అగ్రిమెంట్‌పై విక్రయించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరింత జోరు పెంచినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే దేవతానగర్‌లోని ప్రభుత్వ గయాలు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడం, అడ్డువచ్చిన రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడటం జరిగింది. రెవెన్యూ అధికారులపై భూకబ్జాదారుడి దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన నిందితుడు చలపతి ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయో నిగ్గుతేల్చాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో వారు ఆగమేఘాలపై...దేవతానగర్ సర్వేనెం.1029లోని ప్రభుత్వ గయాలు స్థలం, బీకే.పల్లె సర్వేనెంబర్.516/1లో 6 సెంట్ల స్థలంలో రెండు పునాదులు, రెండు షాపురూములు, కోమటివానిచెరువు సమీపంలోని ఎస్బీఐ కాలనీలో ఇంటిస్థలం, సీటీఎం క్రాస్‌రోడ్డులో ఇంటిస్థలం ఆక్రమించినట్లు నిర్ధారించారు. దీంతో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, ఆక్రమణలను తొలగించడంతో పాటుగా, అక్రమనిర్మాణాలను నేలమట్టం చేయాల్సిందిగా ఆదేశించారు. బుధవారం రాత్రి వరకు పట్టణంలోని ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు, గురువారం ఉదయం సీటీఎం క్రాస్‌లోని అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే..ఆ స్థలంలో భైరవేశ్వర ఎలక్ట్రికల్స్, హార్డ్వేర్స్ పేరుతో దుకాణం ఉండటంతో ఖాళీ చేయాల్సిందిగా అధికారులు కోరారు. దుకాణదారుడు...తాను రూ.10లక్షలకు చలపతి నుంచి స్థలాన్ని కొనుగోలు చేశానని, 20లక్షలకు పైగా ఖర్చుచేసి దుకాణాన్ని నిర్మించుకున్నానన్నారు. రెవెన్యూ అధికారులు ఉన్నఫళంగా దుకాణాన్ని కూల్చేస్తే తన పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. జేసీబీకి అడ్డుగా కుటుంబ సభ్యులతో బైఠాయించాడు. ప్రభుత్వ స్థలాన్ని కొనుగోలు చేయడం నేరం కిందకే వస్తుందని, పై అధికారుల ఆదేశాలు తాము తప్పక పాటించాల్సిందేనని, పోలీసుల సహాయంతో ఆక్రమణల తొలగింపునకు పూనుకున్నారు. భవనాన్ని నేలమట్టం చేశారు. అయితే... అక్కడ గుమికూడిన ప్రజలు, గ్రామస్తులు..రెవెన్యూ అధికారిపై దాడిచేశాడని ఆక్రమణల తొలగింపుకు హడావిడి చేస్తున్నారే కానీ, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు, భూకబ్జాదారుడైన టీడీపీ నాయకుడు చలపతికి మధ్య జరిగిన పోరులో అమాయకుడు తన కష్టార్జితాన్ని 30 లక్షలకు పైగా నష్టపోయి, రోడ్డున పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణ తొలగింపులో తాలూకా సీఐ కళా వెంకటరమణ, సర్వేయర్ రెడ్డిశేఖర్, వీఆర్వోలు, పోలీసులు పాల్గొన్నారు. -
కూటమి సర్కార్ వికటాట్టహాసం.. పోసానికి 14 రోజుల రిమాండ్
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు కూటమి సర్కారు పాతరేసింది. భావ ప్రకటన హక్కు ఓ వర్గం వారికేనని హూంకరిస్తోంది. రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు, ప్రతి విమర్శలు.. కామెంట్లు సహజం అన్న స్ఫూర్తిని మంటగలిపింది. ప్రశ్నించే వారిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పోలీసులను అడ్డు పెట్టుకుని రాక్షస పాలన సాగిస్తోంది. చట్టం, కోర్టులు అంటే ఏమాత్రం గౌరవం లేనట్లు లెక్కలేనితనంతో బరితెగించింది. పదేళ్ల కిందట నంది అవార్డు తిరస్కరిస్తూ వ్యాఖ్యలు చేస్తే.. దానిపై సంబంధం లేని వారెవరో ఇప్పుడు ఫిర్యాదు చేస్తే.. మరెక్కడో కేసు.. పొరుగు రాష్ట్రంలో అరెస్టు.. స్వయంగా జిల్లా ఎస్పీ పర్యవేక్షణ.. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిది అక్రమ అరెస్టు అని చెప్పేందుకు ఇంత కంటే నిదర్శనం అవసరమా?⇒ పక్కా కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పోసానిని వేధిస్తోందని స్పష్టమవుతోంది. అతనో అంతర్జాతీయ టెర్రరిస్ట్ అన్నట్లు పోలీసులు వ్యవహరించిన తీరు నివ్వెర పరుస్తోంది. రేపటి తేదీ వేసి ఈ రోజే (27వ తేదీ వేసి.. 26నే) అరెస్ట్ చేయడం.. అదీ వేరే రాష్ట్రంలో ఆ రాష్ట్ర పోలీసుల ప్రమేయం లేకుండా బలవంతంగా ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేయడం.. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అక్కడి నుంచి ఎత్తుకు రావడం.. 15 గంటల పాటు ఎక్కడుంచారో చెప్పక పోవడం.. తుదకు ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నప్పుడు ఏకంగా జిల్లా ఎస్పీ రావడం.. ఉన్నతాధికారులు గంట గంటకూ ఆరా తీయడం.. ఇవన్నీ చూస్తుంటే ఓ వ్యూహం ప్రకారం ప్రభుత్వ పెద్దలే వెనకుండి నడిపించారని తేటతెల్లమవుతోంది.⇒ పోసానిపై ఇచ్చిన ఫిర్యాదు దేశ ద్రోహానికి సంబంధించింది కాదు.. స్మగ్లింగ్‌కు సంబంధించిందీ కాదు.. హత్యా నేరం అంతకంటే కాదు.. ఆయన వయసు 66 ఏళ్లు.. పైగా గుండె సమస్యతో బాధ పడుతున్నారు.. ఇలాంటి వ్యక్తిని ఇంతగా వేధించాల్సిన అవసరం ఏముంది? ఒక మామూలు కేసు ఇది.. ఇలాంటి కేసులో ఇంత హంగామా, భయభ్రాంతులకు గురి చేయడం అవసరమా? రాత్రిళ్లు అరెస్టు చేయడం ఏమిటి? విచారణ జరుగుతున్న చోటుకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రావడం ఎంత వరకు అవసరం? న్యాయవాదులను, వైఎస్సార్సీపీ నేతలను పోసానితో మాట్లాడటానికి ఎందుకు అంగీకరించ లేదు? ఇదంతా కుట్ర కాదా? ఇవన్నీ రెడ్‌బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కావా? దీనిని బరితెగింపు అనాలా.. కండ కావరం అనాలా.. అధికార మదం అనాలా.. లేక ఇంకేమనాలి?సాక్షి, అమరావతి/ఓబులవారిపల్లె/రైల్వేకోడూరు అర్బన్/ సాక్షి, రాయచోటి: రెడ్‌బుక్ రాజ్యాంగమే పరమావధిగా రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడం కోసం నిబంధనలకు తిలోదకాలు వదిలింది. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఎప్పుడో పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఆయన నివాసంలోకి అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలోని పోలీసు బృందం అక్రమంగా చొచ్చుకెళ్లి, అదుపులోకి తీసుకున్నది మొదలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేసింది. 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎవరి వద్దకు తీసుకెళ్లారో బయటకు పొక్కకుండా సస్పెన్స్ కొనసాగించింది. జనసేన పార్టీ నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో పోసానిపై క్రైం నంబరు 65/2025, అండర్ 196, 353(2), 111 ఆర్/డబ్ల్యూ 3(5) ఆఫ్ ది బీఎన్ఎస్ యాక్టు–2023 కింద కేసు నమోదైతే సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో బృందాన్ని పంపడం సందేహాలకు తావిస్తోంది. మహా శివరాత్రి పండుగ రోజు అని కూడా చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు. ఎన్నికల అనంతరం రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నానని చెప్పినప్పటికీ వినకుండా, అదే రోజు రాత్రికి రాత్రే జిల్లాకు తీసుకు వచ్చిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పైగా నోటీసులో 27వ తేదీ వేసి, 26వ తేదీన అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు విస్తుపోతున్నాయి. ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు పోసాని కృష్ణమురళిని తీసుకొస్తున్న పోలీసులు ఒత్తిడికి గురిచేయొద్దన్న వైద్యులు పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకు వచ్చిన అనంతరం తొలుత వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో స్థానిక పీహెచ్సీ వైద్యుడు గురు మహేష్.. బీపీ, షుగర్, పల్స్ పరిశీలించారు. అన్నీ సాధారణంగానే ఉన్నాయని, తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. అయితే గుండె సమస్య కారణంగా సాఫ్ట్‌గా విచారించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైతే పోసాని కృష్ణమురళి ఆరోగ్యం నార్మల్‌గానే ఉందని వైద్యులు తెలియజేశారు. కాగా, పోసానిని కలవడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతిని«ధి, మాజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సుదర్శన్‌రెడ్డి, పార్టీ లీగల్ సెల్ జిల్లా కనీ్వనర్ నాగిరెడ్డి తదితరులను పోలీసులు అనుమతించ లేదు. తాము పోసానికి వ్యక్తిగత న్యాయవాదులమని, పోసాని వద్ద కాకుండా పక్క గదిలో ఉంటామని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా లీగల్ సెల్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగినా వినిపించుకోలేదు. రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఇతర నేతలను సైతం పోలీసులు అడ్డుకున్నారు.హైకోర్టు ఆదేశాల ధిక్కారం ‘కేసులో నిందితుడిని న్యాయవాది కలిసి మాట్లాడవచ్చు. లేదంటే పక్క గదిలో కూర్చోవచ్చు’ అన్న హైకోర్టు ఆదేశాలను పోలీసులు ధిక్కరించారు. పోసాని కృష్ణ మురళి ఏం చేశారని అతడిపై ఈ సెక్షన్లతో కేసు నమోదు చేశారు? అసలు ఫిర్యాదు ఎవరు చేశారన్నది చెప్పాలి కదా.. ఎవరి ఆదేశాలతో ఇలా చేస్తున్నారు?’ అని వైఎస్సార్సీపీ లీగల్ అడ్వయిజర్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనలో సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేయలేదు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తోంది.’ అని కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు.ధైర్యంగా ఉండండి.. మేమంతా తోడుగా ఉన్నాం పోసాని సతీమణి కుసుమలతను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పోసాని భార్య పోసాని కుసుమలతతో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణ మురళికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, తామంతా తోడుగా ఉంటామని ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు జిల్లా ఎస్పీఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు పోసాని కృష్ణ మురళిని తీసుకొచ్చిన అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అక్కడికి చేరుకున్నారు. ఆయన నేరుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి కేసు పూర్వాపరాలను పరిశీలించడంతోపాటు పోసానిని కూడా విచారించినట్లు సమాచారం. ప్రభుత్వ న్యాయవాదులను స్టేషన్‌కు పిలిపించి మంతనాలు సాగించారు. ఈ కేసులో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇటు పోలీసులకు, అటు న్యాయవాద వర్గాలకు మార్గ నిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్ నుంచి సమీపంలోని ప్రధాన రహదారి వరకు అటు, ఇటుగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎవరినీ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసు స్టేషన్ సమీపంలో ఆందోళనకు దిగాయి. వయోభారం, ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టడం సరికాదని నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపుగా కేసులు నమోదు చేసిందని ధ్వజమెత్తారు. అర్ధరాత్రి 2.. కొనసాగిన వాదనలు పోసాని కృష్ణ మురళిని ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో విచారణ పేరుతో గురువారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9.10 గంటలకు వరకు వేధింపులకు గురి చేశారు. ఆయనకు కొంత మేర అనారోగ్య సమస్యలున్నా అన్ని గంటలపాటు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. పోలీసుస్టేషన్ ద్వారం వద్దకు వాహనాన్ని తీసుకెళ్లి పోసానిని ఎక్కించుకుని రైల్వేకోడూరులోని మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు. పోసాని తన వెంట తెచ్చుకున్న బ్యాగుతో వాహనంలో ఎక్కి కూర్చున్నారు. పోసాని కొంత మేర నిస్సత్తువతో కనిపించారు. రాత్రంతా వాహనంలో జర్నీ చేయడం, నిద్రలేమితోపాటు అనారోగ్య సమస్యలు, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టడంతో నీరసించిపోయారు. కాగా ఉదయం 5 గంటలదాకా కొనసాగిన వాదనలు. సుమారు 7 గంటలు కొనసాగిన వాదనలు. సుదీర్ఘ వాదనల అనంతరం 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విదించింది. కాసేపట్లో కడప జైలుకు పోసాని తరలింపు.త్రిబుల్ వన్ సెక్షన్ల దుర్వినియోగం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది హామీలు నెరవేర్చడానికని, అయితే వాటిని గాలికి వదిలేసి ఇష్టంలేని వ్యక్తులపై త్రిబుల్ వన్ (111) సెక్షన్లతో కేసులను నమోదు చేస్తోంది. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతిపక్ష నాయకులపై మూడేళ్ల క్రితం నమోదైన కేసులను తిరగదోడి వేధిస్తోంది. అధికారం మారాక అధికార బలంతో కేసులు పెడుతున్నారా.. అని సుప్రీంకోర్టు తప్పు పట్టినప్పటికీ, 111 సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తోంది. వైఎస్సార్సీపీ నాయకులపై వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసులను పెడుతోంది. వైఎస్సార్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలపై పెట్టిన పోస్టులకు సంబంధించి ప్రతి జిల్లాలో ఫిర్యాదులు చేసినా, కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేయలేదా? పోసాని కృష్ణ మురళి పోస్టులకు సంబంధించి కోర్టులు చూసుకుంటాయి. 111 సెక్షన్ దుర్వినియోగం అవుతోందన్న పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇలా చేయడం చట్ట వ్యతిరేకం. మా అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా వచ్చాం. – పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మాజీ అసిస్టెంట్ అడ్వొకేట్ జనరల్ -
పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
పోసాని అరెస్ట్ అప్డేట్స్.. 👉ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్ట్ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కుతంత్రంలో తాజా పర్వం. ఏనాడో చేసిన సాధారణ వ్యాఖ్య ఆధారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది. గతంలో కుట్రపూరితంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఆయనపై టీడీపీ, జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేశాయి. పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చిన పోలీసులుపీఎస్లో ముగిసిన పోసాని విచారణఓబులవారి పల్లె పీఎస్‌లో ముగిసిన పోసాని విచారణ9గంటల పాటు పోసానిని విచారించిన ఎస్పీ విద్యాసాగర్విచారణ అనంతరం ఓబులవారి పల్లి పీఎస్ నుంచి రైల్వే కోడూరు కోర్టుకు తరలింపుపోసానిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్న పోలీసులు అన్నమయ్య జిల్లాడాక్టర్ గురుమహేష్, ఓబుల వారిపల్లి పి.హెచ్.సి సుదీర్ఘ విచారణ అనంతరం మరోసారి పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులుపోసాని ఆరోగ్య పరిస్థితి నార్మల్ గానే ఉంది,భుజం నొప్పితో బాధపడుతున్నారుకార్డియాక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారుప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గానే ఉందిఓబులవారి పల్లి పోలీస్ స్టేషన్ లో 8 గంటలుగా కొనసాగుతున్న విచారణ..అన్నమయ్య జిల్లా:మరికాసేపట్లో రైల్వే కోడూరు కోర్టుకు పోసాని కృష్ణమురళిని హాజరుపరచనున్న పోలీసులుపోసాని కృష్ణమురళి తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డికక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోసాని కృష్ణమురళి పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారుపోసాని కృష్ణమురళి పై 111 సెక్షన్ నమోదు చేయడం దుర్మార్గంఆర్గనైజ్డ్ క్రైం చేసిన వారిపై మాత్రమే 111 సెక్షన్ నమోదు చేయాలిఉన్నత న్యాయస్థానాలు చంద్రబాబు ప్రభుత్వానికి పదేపదే చివాట్లు పెట్టినా పద్ధతి మార్చుకోలేదువైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో పోస్టింగ్స్ పెట్టినా ఒక్క కేసు నమోదు చేయలేదురాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదువైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం- పొన్నవోలు సుధాకర్ రెడ్డి పీఎస్ వద్ద వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులున్యాయవాదులను పీఎస్‌లోకి అనుమతించడం ేలేదుపోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు:న్యాయవాదులుహైకోర్టులో రిట్ పిటిషన్‌వేస్తాం: వైఎస్సార్సీపీ ప్రస్తుతం పోసాని ఆరోగ్యంగానే ఉన్నారు: డాక్టర్ గురుమహేష్బీపీ, షుగర్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయిగతంలో పోసాని గుండె నొప్కికి ట్రీట్మెంట్ తీసుకున్నారుపోలీసుల విచారణకు పోసాని సహకరిస్తున్నారుపోసాని స్ట్రెస్ ఫీలయితే ఇబ్బందులు ఎదురవుతాయి ఓబులవారిపల్లి పీఎస్‌కు పోసాని..ఎట్టకేలకు పోసానిని ఓబులవారిపల్లి పీఎస్‌కు పోసాని పోలీసులు తీసుకువచ్చారు.ఈ సందర్బంగా ఓబులవారిపల్లి పీఎస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పీఎస్‌లోనే పోసానికి వైద్య పరీక్షలు చేసే అవకాశం.వైద్య పరిక్షల అనంతరం పోసానిని అనంతపురం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. 👉పోసాని అరెస్ట్ విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడారు. అరెస్ట్ నోటీసుల్లో 27వ తేదీ(ఈరోజు తేదీ) వేశారు పోలీసులు. పోసాని కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్ట్ సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్‌గా పోలీసులు పేర్కొన్నారు. కానీ, పోలీసులు ఇచ్చిన ఫోన్ నెంబర్లో ఓబులాపల్లి పీఎస్ అంటూ చెప్పుకొచ్చారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోసాని ఎక్కడ?పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు.బుధవారం రాత్రి 8:25 గంటలకు పోసాని అరెస్ట్.13 గంటలుగా పోలీసుల అదుపులోనే పోసాని.ఇప్పటికీ పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దానిపై కచ్చితమైన సమాచారం ఇవ్వని పోలీసులు.పోసానిని రాజంపేట పీఎస్‌కు తరలిస్తారని సమాచారం.పోసాని ఆరోగ్య పరిస్థితిపై భార్య, కుమారుడు ఆందోళన.ఆయన తరఫు న్యాయవాదులకు సమాచారం ఇవ్వని పోలీసులు.వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లోని ఏ పీఎస్‌కు తీసుకెళ్తారనే దానిపై రాని స్పష్టత. పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్ట్‌తో బట్టబయలైన పోలీసుల కుట్ర బుధవారం రాత్రి పోసానిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ.. అతని కుటుంబ సభ్యులకి ఇచ్చిన నోటీసుల్లో మాత్రం గురువారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న పోలీసులు ఇది నిబంధనల్ని ఉల్లఘించడం కాదా చంద్రబాబూ? ఇలాంటి పోలీసుల్ని ఏం చేయాలి?… pic.twitter.com/iFcfOCBNU7— YSR Congress Party (@YSRCParty) February 27, 2025👉అన్నమయ్య జిల్లా..పోసానితో ఫోన్లో మాట్లాడిన హైకోర్టు న్యాయవాది బాలన్యాయవాది బాల కామెంట్స్..సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా రాత్రి అరెస్టు చేయడం చట్ట విరుద్ధంనోటీసులు ముందుగా ఇవ్వకుండా, వయసు రీత్యా ఇబ్బందులు పోలీసులు ఇబ్బందులు పెట్టారుబెయిల్ పిటిషన్, రిజెక్షన్ ఆఫ్ అరెస్టు పిటిషన్‌ను రైల్వే కోడూరు కోర్టులో దాఖలు చేస్తున్నాంకాసేపట్లో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంది.అనంతరం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా..పోసాని అరెస్టును ఖండించిన తిరువూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామి దాస్స్వామి దాస్ కామెంట్స్..రాజ్యాంగ విరుద్ధంగా అరెస్టు చేయటం కక్షపూరిత చర్యలే అనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసులు రాత్రి వేళ తరలించడం అన్యాయంకూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో భవిష్యత్తులో అదే గతి వారికీ పడుతుంది ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అన్యాయంబేషరతుగా పోసానిని విడుదల చేయాలి కృష్ణాజిల్లా..పోసాని అక్రమ అరెస్ట్‌ను ఖండించిన మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ పేర్ని కిట్టుపేర్ని కిట్టు కామెంట్స్..ఏపీలో అరెస్టుల పర్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తుచేస్తోంది ఇలాంటి ఘటనలు ఇంతకుముందెన్నడూ ఎక్కడా జరగలేదుసోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్టులు చేస్తున్నారుమరి మీరు పెట్టిన పోస్టుల సంగతేంటి?.ఇప్పుడు జరుగుతున్న అరెస్టులకు పర్యవసానం కచ్చితంగా అనుభవిస్తారురూల్స్ దాటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న అధికారులను గుర్తు పెట్టుకుంటాం కర్నూలు జిల్లా..ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి కామెంట్స్..రాష్ట్రంలో అరాచక పాలన తప్ప ప్రజాపరిపాలన లేదురోజుకు ఒకరిని అక్రమ అరెస్ట్ చేస్తున్నారుపోసానిని అరెస్ట్ చెయ్యడం అక్రమంఏ కేసులో ఆయనను అరెస్ట్ చేస్తూన్నారో కుటుంబ సభ్యులకు తెలియ చెయ్యాలి కాని ఏమాత్రం చెప్పడం లేదు.చంద్రబాబు.. రానున్న కాలంలో మీకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిక.విశాఖ..పోసాని అరెస్ట్‌పై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఫైర్..పవన్, లోకేష్ ఇద్దరి దగ్గర రెడ్ బుక్స్ ఉన్నాయి..ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టులేక అక్రమ కేసులు పెడుతున్నారు..పోసాని అరెస్ట్ పవన్ కళ్యాణ్ ఆలోచనే..ప్రపంచ వ్యాప్తంగా ఏపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తగిన గుణపాఠం చెప్తారు..భవిష్యత్ లో ఇంతకంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి..ప్రభుత్వం కేసులు పెడితే.. ఎదురించి నిలబడతాం..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారు? ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసానిపై కేసు నమోదు..ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదుజనసేన నాయకుడు మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుజనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి ఫిర్యాదు నేపథ్యంలో అరెస్టుచెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జోగినేని మణిపవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదుహైదరాబాద్లోని తన స్వగృహంలో నిన్న రాత్రి పోసాని అరెస్టురాజంపేట కోర్టులో ప్రవేశపెడతామని తెలిపిన పోలీసులువ్యవస్థీకృత నేరమంటూ ఆఘమేఘాలపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు24వ తేదీన ఫిర్యాదు చేస్తే పూర్తి విచారణ జరగకుండానే నిన్న రాత్రి అరెస్టుతన ఆరోగ్యం బాగా లేదని, చికిత్స అనంతరం వస్తానని పోసాని కోరినా వినని పోలీసులు 111, ఇతర సెక్షన్ల కింద కేసులు..సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదు చేశారు.శివరాత్రి పూట రెడ్ బుక్ రాజ్యాంగంలో రెచ్చిపోతున్న @ncbn ప్రభుత్వం. రాజకీయ కక్ష సాధింపే లక్ష్యంగా అక్రమ అరెస్టులుపోసాని కృష్ణమురళిని హైదారాబాద్ లోని ఆయన ఇంట్లోకి అక్రమంగా చొరబడి అరెస్టు చేసిన పోలీసులు.. ఇప్పటికే రాజయికీయాలకి దూరంగా ఉన్న పోసాని.. ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి… pic.twitter.com/ZnjBhYmwvJ— YSR Congress Party (@YSRCParty) February 26, 2025 -
ఫోన్ లాక్కుని నలుగురు పోలీసులు చుట్టుముట్టారు: పోసాని భార్య కుసుమలత
సాక్షి, అమరావతి/గచ్చిబౌలి: చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రెడ్‌బుక్ కుట్రకు బరితెగించింది. టీడీపీ కూటమి నియంతృత్వ పాలన రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని అక్రమంగా అరెస్ట్ చేసి తన రాజకీయ వికృతరూపాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించింది.అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లాకు తరలించారు. గతంలో కుట్రపూరితంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఆయనపై టీడీపీ, జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేశాయి. తద్వారా తాము ఎప్పుడు అనుకుంటే అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి తరలించేందుకు ముందస్తు పన్నాగం పన్నాయి. ఆ ఫిర్యాదులపై పోసాని కృష్ణ మురళిని ఇప్పటివరకు విచారించడంగానీ ఇతరత్రా దర్యాప్తు ప్రక్రియగానీ కొనసాగలేదు. కానీ హఠాత్తుగా బుధవారం ఆయన్ను అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించడం గమనార్హం. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా స్పష్టంగా చెప్పలేదు.పోసాని అనంతరం ఆయన సతీమణి కుసుమలత స్పందించారు. ఈ సందర్బంగా కుసుమలత మాట్లాడుతూ..‘మా ఆయనను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. రాత్రి 8:50 గంటలకు పోలీసులు వచ్చారు. రాత్రి 9:10 గంటల వరకు తీసుకెళ్లిపోయారు. ఎలాంటి సమయం ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ఆయన అరెస్ట్‌పై చాలా అనుమానాలున్నాయి. ఆయనను ఎటూ కదలనివ్వలేదు. నలుగురు పోలీసులు చుట్టుముట్టారు. నోటీసులు తీసుకుని నేడు వస్తామన్నా పోలీసుల వదల్లేదు. పోలీసులు పోసాని ఫోన్ లాక్కున్నారు. పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు. మా ఆయన తప్పును మాత్రమే తప్పు అని చెప్పారు.. దానికే ఆయనను అరెస్ట్ చేయాలా?. ఆయన అరెస్ట్‌పై మాకు ఆందోళన, భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం, పోసాని కుమారుడు మాట్లాడుతూ.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదు అని తెలిపారు. ఫిర్యాదు ఎవరు చేశారు?అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్లో గతంలో నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఆయన్ను పోలీసులు బలవంతంగా తమ వాహనంలో తరలించారు. అసలు సంబేపల్లి పోలీస్ స్టేషన్లో తనపై ఎవరు ఫిర్యాదు చేశారు..? ఏ విషయంలో ఫిర్యాదు చేశారో చెప్పాలని ప్రశ్నించినా పోలీసులు సరైన సమాధానమే ఇవ్వలేదు. ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఓ నోటీసు ఇచ్చి తమతో తీసుకుపోయారు. 111, ఇతర సెక్షన్ల కింద కేసులు..సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదు చేశారు.నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశంపోసానిని గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు నిర్ధారించారు. పోలీసు వాహనంలో అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నట్లు తెలిపారు. కోర్టుకు హాజరు పరిచేముందు పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఓబులవారిపల్లె పీఎస్, సంబేపల్లె పీఎస్‌లలో పోసానిపై కేసులు నమోదైనట్లు చర్చించుకుంటున్నారు. గురువారం ఉదయం రాజంపేట లేదా రైల్వేకోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. పోసానికి దారిలో వైద్య పరీక్షలు చేయించినట్లు సమాచారం. -
రెడ్‌బుక్ రాజ్యాంగం..బాబు నియంతృత్వం.. చినబాబు నిరంకుశత్వం
రెడ్‌బుక్ రాజ్యాంగ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా విధ్వంసానికి బరితెగిస్తోంది. టీడీపీ కూటమి నియంతృత్వ పాలన రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. పౌరుల ప్రాథమిక హక్కులను పాశవికంగా అణచివేస్తోంది. చట్టబద్ధ దర్యాప్తు ప్రక్రియను భ్రష్టు పట్టిస్తోంది. ధర్మబద్ధ న్యాయ ప్రక్రియను మంటగలుపుతోంది. అందుకోసం పోలీసు శాఖ ద్వారా అధికారిక గూండాగిరీకి పాల్పడుతోంది. సీఐడీ విభాగాన్ని తమ కక్ష సాధింపు చర్యలకు సాధనంగా చేసుకుంటోంది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పచ్చ కుట్రలకు అంతకంతకూ పదునుపెడుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు తీరే చంద్రబాబు కుతంత్రానికి తాజాగా మరో తార్కాణం. ఏకంగా 164 సీఆర్పీసీ పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదుకు తెగబడటం బాబు కుట్రకు పరాకాష్ట.ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్ట్ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కుతంత్రంలో తాజా పర్వం. ఏనాడో చేసిన సాధారణ వ్యాఖ్య ఆధారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి వికటాట్టహాసం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ రాజ్యాంగ అమానుష పాలనలో మరెన్ని దారుణాలను చూడాల్సి వస్తుందోనని యావత్ రాష్ట్రం బెంబేలెత్తిపోతోంది. సాక్షి, అమరావతి/సాక్షి రాయచోటి/రాయచోటి, గచ్చిబౌలి: చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రెడ్‌బుక్ కుట్రకు బరితెగించింది. ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని అక్రమంగా అరెస్ట్ చేసి తన రాజకీయ వికృతరూపాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించింది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నారు. గతంలో కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఆయనపై టీడీపీ, జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేశాయి. తద్వారా తాము ఎప్పుడు అనుకుంటే అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి తరలించేందుకు ముందస్తు పన్నాగం పన్నాయి. ఆ ఫిర్యాదులపై పోసాని కృష్ణ మురళిని ఇప్పటివరకు విచారించడంగానీ ఇతరత్రా దర్యాప్తు ప్రక్రియగానీ కొనసాగలేదు. కానీ హఠాత్తుగా బుధవారం ఆయన్ను అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించడం గమనార్హం. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా స్పష్టంగా చెప్పలేదు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్లో గతంలో నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి ఆయన్ను పోలీసులు బలవంతంగా తమ వాహనంలో తరలించారు. అసలు సంబేపల్లి పోలీస్ స్టేషన్లో తనపై ఎవరు ఫిర్యాదు చేశారు..? ఏ విషయంలో ఫిర్యాదు చేశారో చెప్పాలని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించినా పోలీసులు సరైన సమాధానమే ఇవ్వలేదు. ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఓ నోటీసు ఇచ్చి తమతో తీసుకుపోయారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం లేదు... పోసాని అరెస్ట్ గురించి ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎక్కడికి తీసుకు వెళుతున్నారో కూడా చెప్పలేదు. యూనిఫాంలో ఇద్దరు పోలీసులు, మఫ్టీలో మరో ఇద్దరు పోలీసులు వచ్చి ఆయన్ను బలవంతంగా తమతో తీసుకుపోయారు. పోసాని అనారోగ్యంతో ఉన్నారని, కనీసం మందులు అయినా తీసుకెళ్లనివ్వాలని కుటుంబ సభ్యులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదు. తమ న్యాయవాది వచ్చే వరకు ఆగాలని అభ్యర్ధించినా ఆలకించకుండా బలవంతంగా తమతో తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం పోలీసులు ఎవర్ని అయినా అరెస్ట్ చేస్తే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబ సభ్యులకు తెలపాలి. వారు న్యాయ సహాయం పొందేందుకు అవకాశం కల్పించాలి. కనీసం ఈ ప్రాథమిక సూత్రాలను కూడా పాటించకుండా పోలీసులు పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్ట్ చేసి తమతో తీసుకుపోయారు. కాగా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నట్టు సంబేపల్లి పోలీసులు చెప్పారు. కానీ ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చిన సమాచారంలో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ నంబరు ఇవ్వడం గమనార్హం. అంటే ఉద్దేశపూర్వకంగానే వేర్వేరు పోలీస్ స్టేషన్ల వివరాలు ఇచ్చి ఆయన కుటుంబ సభ్యులకు సందిగ్దంలోకి నెట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేస్తున్నందున తరువాత న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తకుండా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకే ఈ ఎత్తుగడ వేశారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే పక్కా ముందస్తు కుట్రతోనే పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసినట్టు తేటతెల్లమవుతోంది. 111, ఇతర సెక్షన్ల కింద కేసులు..సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదు చేశారు.నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశంపోసానిని గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు నిర్ధారించారు. పోలీసు వాహనంలో అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నట్లు తెలిపారు. కోర్టుకు హాజరు పరిచేముందు పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఓబులవారిపల్లె పీఎస్, సంబేపల్లె పీఎస్‌లలో పోసానిపై కేసులు నమోదైనట్లు చర్చించుకుంటున్నారు. గురువారం ఉదయం రాజంపేట లేదా రైల్వేకోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. పోసానికి దారిలో వైద్య పరీక్షలు చేయించినట్లు సమాచారం.ముందస్తు కుట్రతోనే అక్రమ ఫిర్యాదులు...పోసాని కృష్ణ మురళిని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాదే ముందస్తు కుట్రలకు తెరతీసింది. అందులో భాగంగానే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతోపాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేశారు. ఒకే రోజు ఆంధ్ర ప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేయడం గమనార్హం. వాటిలో కొన్ని కేసులను ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది కూడా. కాగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శాసనసభ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీసింది. అందులో భాగంగానే గతంలో ఎప్పుడో చేసిన ఫిర్యాదుపై ప్రస్తుతం స్పందిస్తూ పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసింది. -
చెప్పినట్లు చేసి తీరాల్సిందే!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కక్ష సాధింపు కుట్రలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మరింత బరి తెగిస్తోంది. న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఏకంగా సీఆర్పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించే కుట్రను వేగవంతం చేసింది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, సంస్థ ఉద్యోగి సత్యప్రసాద్‌లతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే లక్ష్యంగా వేధింపులను తీవ్రతరం చేసింది. ప్రధానంగా వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగం పన్నింది. ఉన్నతాధికారులపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం!చంద్రబాబు ప్రభుత్వం గతేడాది జూన్ 12న అధికారంలోకి రాగానే రెడ్‌బుక్ కక్ష సాధింపులకు తెరతీస్తూ వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అదే నెల 24న అక్రమ కేసు నమోదు చేసింది. అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందారు. దాంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సీఐడీ మరో అక్రమ కేసు నమోదు చేసింది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మార్గదర్శకత్వంలో సాగుతున్న ఈ కుట్రను ప్రస్తుతం పోలీసు శాఖను శాసిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లను ఉద్దేశపూర్వకంగా పేర్కొనకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా చేయాలన్నది అసలు పన్నాగం. కేసు దర్యాప్తు పేరిట వాసుదేవరెడ్డిని బెదిరించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించాలని ప్రభుత్వ పెద్దలు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్‌కు విస్పష్టంగా ఆదేశించారు. అప్పటి నుంచి విచారణ పేరిట సీఐడీ బృందాలు వాసుదేవరెడ్డిని వేధిస్తూనే ఉన్నాయి. ఆయన్ను కొద్ది రోజుల పాటు అనధికారికంగా నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డాయి. ప్రధానంగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి చెప్పినట్లుగా నడుచుకున్నామని, మద్యం వ్యవహారాలను వారిద్దరే పూర్తిగా పర్యవేక్షించారంటూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వక పోవడంతో ప్రభుత్వ పెద్దలు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఈ కేసులో మరింతగా బరి తెగించేందుకు సీఐడీ సన్నద్ధమైంది. రప్పించి.. రహస్యంగా రికార్డింగ్!రెడ్ బుక్ కుట్రలో భాగంగా సీఐడీ పెద్దలు.. బెవరేజస్ కార్పొరేషన్ ఉద్యోగులు, డిస్టిలరీల ప్రతినిధులను రప్పించి మాట్లాడుతున్నారు. వారు వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచుతామని నమ్మబలుకుతున్నారు. సాధారణ సంభాషణలు, పిచ్చాపాటి తరహాలో మాట్లాడుతున్నప్పటికీ కార్యాలయంలో రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా మొత్తం వ్యవహారాన్ని రికార్డింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం వారిని మరోసారి పిలిపించి వీడియో రికార్డింగులను చూపించి బెదిరిస్తున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. సీఐడీ అదుపులో సత్యప్రసాద్...అబద్ధపు వాంగ్మూలం నమోదు కుట్రలో భాగంగా బెవరేజస్ కార్పొరేషన్ పూర్వపు ఉద్యోగి సత్య ప్రసాద్‌ను సీఐడీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన్ను విజయవాడకు తరలించి కొద్ది రోజులుగా తమదైన శైలిలో విచారించి బెంబేలెత్తిస్తున్నారు. సత్య ప్రసాద్ కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సీఐడీ అధికారుల బెదిరింపులు, వేధింపులు కొంత ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. వారు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేందుకు సత్య ప్రసాద్ సమ్మతించినట్టు సమాచారం! దీంతో ఆయనతో న్యాయస్థానంలో వాంగ్మూలం ఇప్పించేందుకు సీఐడీ అధికారులు రెండు రోజులుగా సన్నాహాలు వేగవంతం చేశారు. వాంగ్మూలం నమోదు చేయించగానే కుట్రలో తరువాత అంకానికి తెరతీయనున్నారు.ఇక టార్గెట్ రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి..!సత్య ప్రసాద్‌ను బెదిరించి దారికి తెచ్చుకున్న సీఐడీ అధికారులు గతంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఆచూకీ కోసం కొద్ది రోజులుగా ఆరా తీస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది స్పష్టమైన సమాచారం అందగానే అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం సీఐడీ అధికారుల బృందాలను ఇప్పటికే హైదరాబాద్ పంపారు. వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నది సీఐడీ అధికారుల లక్ష్యం.అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకుంటే అంతు చూస్తాం..!వాసుదేవరెడ్డితోపాటు బెవరేజస్ కార్పొరేషన్లో గతంలో పని చేసిన సత్య ప్రసాద్‌తో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించే కుట్రను సీఐడీ వేగవంతం చేసింది. వారిద్దరినీ కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్న సీఐడీ అధికారులు.. ఈ వారంలో సీఆర్పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇక నిరీక్షించే ఓపిక లేదని.. అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు. ఈ మేరకు సీఐడీ అధికారులు ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా వాంగ్మూల నమోదు ప్రక్రియ పనులు మొదలు పెట్టడం గమనార్హం.తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు!రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌తోపాటు పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించేందుకు సీఐడీ సన్నద్ధమవుతోంది. తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు సృష్టించాలనే కుతంత్రాన్ని రచిస్తోంది. సీఐడీ అధికారులు తాము కోరుకుంటున్న సమాచారాన్ని ముందుగానే పెన్ డ్రైవ్‌లు, సీడీలు, హార్డ్ డిస్క్‌లలో స్టోర్ చేస్తారు. అనంతరం వాటిని వెంటబెట్టుకుని తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలు, డిస్టిలరీల కార్యాలయాల్లో తనిఖీలకు బయలుదేరుతారు. అవన్నీ ఆ నివాసాలు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో లభించినట్లు ప్రకటిస్తారు. తద్వారా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ కేసులతో వేధించాలని సీఐడీ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది! -
మీడియాపైనా ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాకముందే రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని 9 నెలలుగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, తప్పులను ప్రశ్నించే గొంతులను నిరంకుశంగా నొక్కేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయించి, అరెస్టులు చేయించి, జైళ్లకు పంపించి దుర్మార్గంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం తన పైశాచికత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపెట్టింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా నాలుగు ప్రధాన టెలివిజన్ చానళ్లతో పాటు పలు మీడియా సంస్థలను అసెంబ్లీ సమావేశాల కవరేజీకి రాకుండా చేసింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విశేషాలను ప్రజలకు అందించేందుకు టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్టీవీ రిపోర్టర్లను, కెమెరామెన్లను ప్రభుత్వం అనుమతించలేదు. ఎంట్రీ పాసులు ఇవ్వకుండా ఇలా ఎందుకు బహిష్కరించారనేది కూడా చెప్పలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా చానళ్లుగానీ, పత్రికలుగానీ వ్యవహరిస్తే వివరణ కోరుతూ ముందస్తు నోటీసులు ఇవ్వడం పరిపాటి. ఆ తరువాతే ఏవైనా చర్యలు తీసుకోవడం అనేది నిబంధనల ప్రకారం జరగాలి. కానీ.. అలాంటిదేమీ లేకుండా కేవలం రాజకీయ కారణాలతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా గతంలో మీడియాకు ప్రవేశం ఉన్న మార్గాల్లోనూ అనేక ఆంక్షలు విధించింది. అసెంబ్లీ గేటు నుంచి మీడియాను అనుమతించలేదు. పాసులు ఉన్నప్పటికీ వెనుక నుంచే రావాలని చెప్పి అధికారులు పంపించేశారు. దీంతో అసెంబ్లీ బయట మండుటెండలోనే మీడియా ప్రతినిధులు తమ విధులను నిర్వర్తించాల్సి వచ్చింది. వారికి కనీసం తాగునీరు కూడా లభించకపోవడంతో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇంత దారుణమైన పరిస్థితులను మీడియా గతంలో ఏనాడూ ఎదుర్కోలేదని, తమ విధులను మాత్రమే తాము నిర్వర్తిస్తున్నామని, తమపైనా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పక్షపాత ధోరణి తగదు: ఏపీయూడబ్ల్యూజేరాష్ట్ర శాసనసభ సమావేశాల కవరేజీ కోసం కొందరికి పాసులు ఇచ్చి, కొన్ని పత్రికలు, చానళ్ల రిపోర్టర్లను అనుమతించకపోవడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఏచూరి, ‘సామ్నా’ అధ్యక్షుడు నల్లి ధర్మారావు, విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మీడియా పట్ల పక్షపాత ధోరణులు కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధికారిక సమావేశాలకు కూడా కొన్ని పత్రికలు, చానల్స్‌ను పిలవకపోవడం తగదన్నారు. శాసనసభ స్పీకర్, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించి, ప్రభుత్వ కార్యక్రమాలకు, అసెంబ్లీ సమావేశాలకు టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీతో పాటు మిగిలిన అన్ని చానల్స్, పత్రికలకు అనుమతి ఇచ్చి, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరారు.ఈ వైఖరి మంచిదికాదు: ఏపీడబ్ల్యూజేఎఫ్అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కొన్ని మీడియా సంస్థలకు పాసులు నిరాకరించడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఏపిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్లు వీసం శ్రీనివాసరావు, కె.మునిరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టసభల్లో జరిగే కార్యకలాపాలను మీడియా సంస్థల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన ప్రభుత్వం, అసెంబ్లీ అధికారులు మీడియా విషయంలో అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ, సాక్షి మీడియా సంస్థలకు మీడియా పాసులు నిరాకరించడం సరైన విధానం కాదన్నారు. ఈ విషయంపై స్పీకర్ జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించి మీడియా సంస్థలన్నిటికీ పాసులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. -
ప్రజా సమస్యలపై పోరాటం దిశగా వైఎస్ జగన్ దిశానిర్దేశం
-
అసెంబ్లీ సమావేశాల్లో సాక్షిపై ఆంక్షలు
సాక్షి, అమరావతి: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. ఆ రాజ్యాంగం ఇప్పుడు అసెంబ్లీని సైతం తాకింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశాల కవరేజీ విషయంలో టీవీ చానల్స్‌పై కూటమి ప్రభుత్వం నిషేధం విధించింది.తమ అనుకూల మీడియాతో ఇష్టానుసారం కథనాలు ఇచ్చుకుంటున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మీడియా స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలో ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు తొలిసారి మీడియా కవరేజీపై ఆంక్షలు విధించింది చంద్రబాబు సర్కార్. అసెంబ్లీ సమావేశాల కవరేజ్ దూరంగా ఉండాలని నాలుగు టీవీ చానెల్స్‌పై ఆంక్షలు విధించారు. అందులో సాక్షినే ప్రముఖంగా ఉండడం ఎందుకో తెలిసిందే. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇలా మీడియాపై నిషేధం విధించగా, ఈ చర్యను పలువురు జర్నలిస్టులు ఖండిస్తున్నారు. -
రెడ్‌బుక్‌పై కన్నెర్ర.. కూటమికి ఇక బ్యాడ్ టైం!
ఆంధ్రప్రదేశ్‌లో భారత రాజ్యాంగం కాకుండా... తెలుగుదేశం నేతల రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలవుతోందని హైకోర్టు సాక్షిగా మరోసారి స్పష్టమైంది. పోలీసుల శాఖ పనితీరును చూసి హైకోర్టే నిర్ఘాంతపోయిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు.. ఆంధ్రప్రదేశ్‌లో హింస, విధ్వంసం, అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్న తీరును.. రాష్ట్ర ప్రజలు కళ్లారా చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలే లక్ష్యంగా కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. వీరిపైకి పోలీసులను ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నట్లు విమర్శలున్నాయి. పోలీసులు కేసులు పెట్టకుండా ఇష్టారాజ్యం అరెస్టులు చేసి పౌర హక్కులు, మానవహక్కులను హరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ గొప్పగా చెప్పుకుంటున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ ‘పిచ్చికుక్క’తో పోలుస్తున్నది! ఈ తరహా పాలన వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అర్థం చేసుకోవడం లేదు. పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్న వారిపై కేసులు పెట్టడం లేదు. నిబంధనల ప్రకారం కోర్టుల్లోనూ ప్రవేశపెట్టడం లేదు. దీంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ఎనిమిది నెలల పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా, న్యాయ వ్యవస్థ సైతం ఆశించిన స్థాయిలో స్పందించినట్లు కనబడదు. సోషల్ మీడియా కార్యకర్తలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్య తీసుకున్నా ఫర్వాలేదు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్న తీరును న్యాయ వ్యవస్థ గమనిస్తే బాగుంటుంది. కొంతమందిపై పది, ఇరవై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న సంగతిని గౌరవ న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ(Judicial System) దృఢంగా ఉండకపోతే పోలీసు శాఖ ఎలా ధమ్కీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందో హైకోర్టు వారికి స్వయంగా అనుభవం అవడం విశేషం. పల్నాడు జిల్లా మాచవరం పోలీసులు చేసిన అక్రమ అరెస్టులపై కొద్దిరోజుల క్రితం వచ్చిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్య చేసింది. పోలీసులకు తమ ఆదేశాలంటే గౌరవం లేదని, సీసీటీవీ ఫుటేజి సమర్పించాలని కోరినప్పుడే అది మాయమవడం ఏమిటి? అని గౌరవ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ ఫుటేజీ ఎలా మిస్టీరియస్‌గా కనిపించకుండా పోతోందని హైకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన గౌరవ న్యాయమూర్తులకు ప్రజలు ధన్యవాదాలు తెలపాలి. ఈ మాత్రం అన్నా స్పందించకపోతే ఏపీలో కూటమి ప్రభుత్వం మరింతగా పెట్రేగిపోతుంది. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీ మిస్ అవుతుంటే ఉన్నతాధికారులు ఏమి చర్య తీసుకున్నారని కూడా హైకోర్టు అడిగింది. చిత్రమేమిటంటే కోతుల కారణంగా సీసీటీవీ సర్క్యూట్ కాలిపోయిందని పోలీసులు చెప్పడం.. ‘ఇది మేం నమ్మాలా?’ అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కాలిపోయిన సీసీటీవీ పరికరాలను తామే చూస్తామని న్యాయమూర్తులు ప్రకటించారు. విశేషం ఏమిటంటే ఈ కేసులో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లాయర్ చెప్పగా, పిటిషనర్‌కు ఏమైనా హాని ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇందులో చాలా వాస్తవం ఉందని చెప్పాలి. అనేక చోట్ల బాధితులు కోర్టులకు వెళ్లకుండా పోలీసులు వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో రోజుల తరబడి నిందితులను ఉంచి వేధిస్తున్నారు. ఈ కేసులో గత ఏడాది నవంబర్ 3వ తేదీన ఒక వ్యక్తిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 7వ తేదీన కాని అతని అరెస్టు చూపలేదు. ఈ నాలుగు రోజులు అతని పట్ల ఎలా వ్యవహరించారో తెలుసుకోవడానికి సీసీటీవీ పుటేజీ కోరుతూ అతని సోదరులు కోర్టుకు ఎక్కారు. ఈ కేసులో సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి ఇంక్రిమెంట్లు కట్ చేశారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? అతను తప్పు చేసినట్లు అంగీకరించినట్లే కదా! చేసే అరాచకం చేసి, సీసీటీవీ ఫుటేజి మిస్ చేస్తే ఎవరు ఏమి చేయలేరన్న ధైర్యం పోలీసు శాఖలో ఏర్పడిందని భావించాలి. దీనికి కారణం పోలీసు శాఖ నిబంధనలు కాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతల రెడ్‌బుక్ ఫాలో అవడమే కారణం అని వేరే చెప్పనవసరం లేదు. కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని టీడీపీ ముఖ్యనేతలు వైఎస్సార్సీపీ వారిని భయపెట్టి లొంగదీసుకోవడానికి యత్నిస్తున్నారని చెబుతున్నారు. 👉ఈ మధ్య సోషల్ మీడియాలో పనిచేసే మిత్రుడు ఒకరిపై తప్పుడు కేసు పెట్టారు. ఆయన ఎప్పుడూ అసభ్య పోస్టులు పెట్టలేదు. కోర్టును ఆశ్రయించగా, బెయిల్ వచ్చింది కాని, వారం, వారం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు హాజరవ్యాలని షరతు పెట్టింది. దాంతో ఆ మిత్రుడు నిత్యం అక్కడికి వెళ్లవలసి వస్తోంది. తీరా అక్కడకు వెళ్లాక పోలీసు అధికారులు అందుబాటులో ఉండకుండా గంటల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారట!. అదేమని అడిగితే పైనుంచి ఒత్తిడి ఉందని వారు చెబుతున్నారట. రెడ్ బుక్(Red Book) పేరుతో యాతనలకు గురి చేస్తున్నారన్నమాట. 👉కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma)ను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారణ చేశారని వార్తలు వచ్చాయి. ఆయన ఎప్పుడో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఏదో పోస్టు పెట్టారని చెప్పి, ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని అంటూ ఎవరో టీడీపీ కార్యకర్త కేసు పెట్టగానే పోలీసులు వాయువేగంతో స్పందించి విచారణకు పిలిచారు. వర్మకు ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనను ఈపాటికి జైలులో ఉంచేవారేమో తెలియదు. 👉రఘురామ కృష్ణరాజు(Raghurama Krishna Raju) పెట్టిన మరో కేసులో గుంటూరు ప్రభుత్వ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా అలాగే తొమ్మిది గంటలు విచారించారు. రఘురామ కృష్ణంరాజు కులాలు, మతాల మధ్య ద్వేషం రెచ్చగొట్టేలా నిత్యం మాట్లాడారన్న కేసు ఎటు పోయిందో కాని, తనను హింసించారన్న ఆయన చేసిన ఆరోపణపైనే పోలీసులు ఇప్పుడు శ్రద్ధ పెట్టారని అనుకోవాలి. 👉ముంబైకి చెందిన జత్వాని అనే నటికి పట్టుకువచ్చి నలుగురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. జిందాల్ అనే పారిశ్రామిక వేత్తపై కూడా అక్రమ కేసు పెట్టడంతో ఏపీకి రావల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా పోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 👉మరో ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ పై ఇరవైకి పైగా కేసులు పెట్టి తీవ్రంగా వేధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. 👉మరో వైపు తమ కుటుంబాలపై అసభ్య పోస్టింగ్‌లు పెట్టారని పలువురు YSRCP నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా అతిగతీ లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై ఎంత నీచంగా పోస్టులు పెట్టారో తెలిసిందే!. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుమార్తెలపై దారుణంగా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టుకు వెళ్లి తన కేసును వాదించుకుంటున్నారు. 👉గన్నవరం లో జరిగిన ఒక ఘటనలో పోలీసులు తనతో బలవంతంగా వైఎస్సార్సీపీ వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని టీడీసీ ఆఫీస్‌లో పనిచేసే సత్యవర్దన్ అనే వ్యక్తి కోర్టులో చెప్పి కేసును ఉపసంహరించుకున్నారు. దీనికి ప్రతిగా సత్యవర్ధన్ సోదరుడితో బలవంతంగా కేసు పెట్టించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలులో పెట్టి వేధిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎంత విధ్వంసానికి పాల్పడుతున్నా పోలీసులు వారి జోలికే వెళ్లడం లేదు. కూటమికి చెందిన పార్టీల వారు ఎన్ని అరాచకాలకు పాల్పడినా, చివరికి మహిళలను వేధింపులకు గురి చేసినా, పోలీసులు వారిపై కేసులు పెట్టడానికి వెనుకాడుతున్నారు. ఉదాహరణకు.. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక జనసేన నాయకుడుపై ఒక మహిళ కేసు పెడితే ఇంతవరకు ఆయనపై చర్యే తీసుకోలేదు. పైగా ఆ మహిళపైనే ఎదురు కేసు పెట్టి రెడ్ బుక్‌ను రాజస్థాన్‌కు కూడా పంపించి, హడావుడిగా ఆమెను అరెస్టు చేయించిన తీరు ఏపీలో మహిళలకు ఉన్న భద్రత ఏమిటో తెలియచేస్తుంది. అనేక చోట్ల మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సుగాలి ప్రీతి మృతి విషయమై సీబీఐ దర్యాప్తు చేయిస్తానని ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీలో మహిళలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితిపై వార్తలు వచ్చాయి. గతంలో ప్రసంగాలు చేస్తూ మహిళల జోలికి ఎవరైనా వెళితే తోలు తీస్తామని భారీ ప్రకటనలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు నోరు విప్పడం లేదు. మరో వైపు మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గౌరవ న్యాయస్థానం ఈ మాత్రం గట్టిగా ఉండడం సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పాలి. ఏది ఏమైనా ఏపీలో ప్రజల హక్కులకు ఏ స్థాయిలో విఘాతం కలుగుతున్నదో వివరించడానికి ఇవే పెద్ద నిదర్శనం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!
ఎలాగైతేనేం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు.. మంత్రి అయిన లోకేష్‌లు తమ కక్ష తీర్చుకున్నారు. కాకపోతే వారు ధైర్యంగా కాకుండా చాటుమాటు కేసులు పెట్టి ప్రత్యర్ధులను దెబ్బతీసే యత్నం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించి వారు ఆనందపడుతుండొచ్చు. దావోస్‌లో తాను చెప్పినట్లు రెడ్ బుక్ చాప్టర్ మూడును ప్రయోగించానని లోకేష్ సంతోషపడుతుండొచ్చు. కానీ ఆయన ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. రాజకీయాలలో ఇది ఏ మాత్రం పనికిరాదు. చంద్రబాబు ఇంతకాలం ఇలాంటి ఆటలు ఎన్ని ఆడినా.. తనకేమీ సంబంధం లేదన్నట్లు నటించేవారు. లోకేష్ అలాకాకుండా పచ్చిగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. దీనివల్ల ఆయన భవిష్యత్తులో ఏదైనా ఆపదలో చిక్కుకుంటే తనను తాను రక్షించుకోలేని పరిస్థితి రావచ్చు. ఆ సంగతిని గుర్తు పెట్టుకోవడం మంచిదని హితవు చెప్పినా.. అధికార కైపులో ఉన్న ఆయనకు వినిపించకపోవచ్చు. రెచ్చగొట్టే మీడియా, భజంత్రీగాళ్ల మాటలు సమ్మగా ఉంటాయి. కాని అవి ఎక్కువకాలం ఉపయోగపడవు. వల్లభనేని వంశీ తప్పు చేశాడా? లేదా? అనేది ఇక్కడ చర్చకాదు. తప్పు చేసి ఉంటే అరెస్టు చేయడం, జైలులో పెట్టడం సాధారణంగా జరిగేవి. కాని అసాధారణమైన రీతిలో ఏపీ పోలీసులు స్పందిస్తున్న తీరు, డీజీపీ స్థాయిలో ఉన్నవారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న వైనం మాత్రం ఏపీ సమాజానికి మంచిది కాదు. ఇలాంటి వాటివల్ల జనంలో ఫస్ట్రేషన్ పెరిగితే అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ సంగతిని అంతా గుర్తుంచుకోవాలి. వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్(Gannavaram TDP Office)పై దాడి చేయించారన్నది అభియోగం కావొచ్చు. అంతవరకు కేసు పెడితే పెట్టవచ్చు. కాని అంతకుముందు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?. వంశీనికాని, గన్నవరం వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాని టీడీపీ నేతలు రెచ్చగొట్టారా? లేదా?. వంశీని అనరాని మాటలు అన్నారా? లేదా?. అయినా టీడీపీ ఆఫీస్ పై దాడి చేయాలని ఎవరూ చెప్పరు. అప్పట్లో విజయవాడ నుంచి ఒక టీడీపీ నేత గన్నవరం దండెత్తివెళ్లారా? లేదా?. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయా? లేదా?. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభ్యంతరకర భాషలో ఆ టీడీపీ నేత దూషించారా? లేదా?. చివరికి ఈ గొడవలు చిలికి, చిలికివానగా మారి వంశీ కుటుంబ సభ్యులను టీడీపీ సోషల్ మీడియాలో అనరాని మాటలతో వేధించారు. ఆ క్రమంలో చంద్రబాబు(Chandrababu) కుటుంబ సభ్యులపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రియలైజ్ అయి క్షమాపణ కూడా చెప్పారు. అయినా టీడీపీ నేతలు ఆయనను వెంటాడుతూనే ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే.. టీడీపీ ముఖ్యనేతల కుటుంబాలలోని వారిని ఎవరైనా ఏమైనా అంటే గోలగోలగా ప్రచారం చేసే ఆ పార్టీవారు.. ఎదుటివారి కుటుంబాలపై నీచంగా కామెంట్స్ పెడుతుంటారు. టీడీపీ చంద్రబాబు కబ్జాలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధి రాజకీయ పార్టీలవారిని వ్యక్తిగత హననం చేయడం ఒక లక్షణంగా మార్చుకుంది. చంద్రబాబు తాను సత్యసంధుడనైనట్లు, ప్రత్యర్దులు విలువలు లేని వ్యక్తులన్నట్లు మాట్లాడుతూ మీడియాలో వార్తలు వచ్చేలా చేసుకోవడంలో నేర్పరి అని చెప్పాలి. తొలుత ఆయనే రెచ్చగొడతారు. లేదా ఆయన పార్టీవారితో రెచ్చగొట్టిస్తారు. దానికి ప్రతిస్పందనగా ప్రత్యర్ధి పార్టీవారు తీవ్ర స్థాయిలో స్పందిస్తే.. దానినే విస్తారంగా వ్యాప్తి చేసి.. ‘చూశారా!నన్ను అంత మాట అన్నారో?’ అంటూ సానుభూతి పొందే యత్నం చేస్తుంటారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా తాన అంటే తందానా అంటాయి. గత సీఎం జగన్‌ను చంద్రబాబు కాని, లోకేష్ కాని ఎన్నేసి మాటలు అన్నారు!. ‘సైకో’ అనే పదంతో మొదలు పెడితే.. అనేక అభ్యంతరకర పదాలు వాడడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అయినా అప్పటి ప్రభుత్వం వారి జోలికి వెళ్లలేదు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆరోజుల్లో రెడ్ బుక్ పేరుతో అనేక చోట్ల పోలీసు అధికారులను, ఆయా నేతలను లోకేష్ బెదిరించిన వైనంపైనే ఎన్నో కేసులు పెట్టి ఉండవచ్చు. కాని అప్పుడు దానికి సంబంధించిన కేసులే పెట్టలేదు. పోలీసు అధికారులు కోర్టులో దీనిపై పిటిషన్ వేసినా అది విచారణకే వచ్చినట్లు లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్(Lokesh) పేరుతో సాగుతున్న ఈ అరాచకం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. వచ్చేసారి టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందంటే ఇంతకన్నా ఎక్కువగా రెడ్ బుక్ టీడీపీవారికి చుట్టుకుంటుందన్న సంగతి మర్చిపోకూడదు. దీనిని వైఎస్సార్సీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అన్యాయంగా ,అక్రమంగా తమ పార్టీవారిని వేధించేవారందరి సంగతి తేల్చుతామని జగన్ చెబుతున్నారు. చట్టబద్దంగానే చేస్తామని ఆయన కూడా అన్నారు. చంద్రబాబుకు ఈ విషయాలు తెలియనివి కావు. కాని ఆయన చేతిలో ఏమి ఉన్నట్లు లేదు. లోకేష్ బ్యాచ్ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నా.. వారించలేకపోతున్నారు. ఫలితంగా ఆయన కూడా బాధ్యత వహించవలసి వస్తోంది. తద్వారా ఏపీ ఇమేజీనే చంద్రబాబు, లోకేష్‌లు నాశనం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. వీరి కక్షలకు తోడు ఎల్లో మీడియా పనిలో పనిగా తమ కక్షలు తీర్చుకుని టీడీపీని మరింత గబ్బు పట్టిస్తోంది. ఎల్లో మీడియా రాసే చెత్త వార్తలకు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అందులో వాస్తవం ఉంటే తప్పు లేదు. కాని వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా.. కూటమి ప్రభుత్వం నిస్సహాయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు లేదంటే ఆ ప్రతినిధులు ఆడించినట్లు ఆడక తప్పడం లేదు. వంశీ విషయానికి వస్తే ఆయనపై ఏ కేసు పెట్టాలి. చంద్రబాబు,లోకేష్ లు నిజంగానే తమ మనోభావాలు గాయపడ్డాయని అనుకుంటే తమ కుటుంబంలోని వారిపై చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఆ పాయింట్‌ను తమ రాజకీయ అవసరాల కోసం అదే పనిగా వాడుకున్నారు కనుక. ఆ క్రమంలో తమ కుటుంబానికి ఇబ్బంది అని తెలిసినా పదే,పదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ విషయం జోలికి వెళ్లలేదు. చంద్రబాబు, లోకేష్‌లను ఎవరో ఏదో అన్నారని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్న టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు కుటుంబానికి జరిగిన పరువు నష్టంపై మనోభావాలు దెబ్బతిన్నాయా, లేదా? దీనిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. నిజంగానే ఆ పాయింట్‌ను పైకి తీసుకువస్తే.. వంశీ కుటుంబ సభ్యులపై టీడీపీవారు చేసిన అసభ్యకర, అసహ్యకర పోస్టింగ్‌లు, మాజీ సీఎం జగన్ కుటుంబంపై పెట్టిన నీచాతినీచ పోస్టింగులు అన్ని జనం దృష్టికి వస్తాయని సందేహించారా?. చంద్రబాబు,లోకేష్ లకు చిత్తశుద్ది ఉంటే తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టి ఉండాలి. అలాగే వంశీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు కూడా తీసుకోవాలని చెప్పగలగాలి. ఆ పని చేయకుండా ఏదో ఒక పిచ్చి కేసులో వంశిని ఇరికించాలని చూడడం పిరికితనంగా కనిపిస్తుంది. టీడీపీ ఆఫీస్(TDP Office) పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ మీదట కారణం ఏమైనా కాని దాడి కేసు ఫిర్యాదుదారు అసలు తనకు సంబంధం లేదని, తనను ఎవరూ దూషించలేదని కోర్టులో అఫిడవిట్ వేయడంతో ప్రభుత్వం పరువు పోయింది. నిజానికి చాలా కేసులలో రెడ్ బుక్ ఆదేశాల ప్రకారం ఎవరో ఒకరితో బలవంతంగా కేసులు పెట్టించి విపక్షంవారిని అరెస్టులు చేస్తుంటారు. ఈ కేసులో ఫిర్యాదుదారు ఎదురుతిరిగారు. దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు-లోకేష్ రెడ్‌బుక్ సర్కార్ హుటాహుటిన పోలీసులపై గుడ్లురిమి, ఫిర్యాదుదారు సోదరుడు ఒకరిని పట్టుకుని వంశీపై కిడ్నాప్ తదితర కేసులు పెట్టించి ఆగమేఘాలపై అరెస్టు చేసింది. తద్వారా తన అహాన్ని లోకేష్ తీర్చుకుని ఉండవచ్చు. కాని అది చట్టబద్దంగా చేయాలి తప్ప మొరటుగా ఇలా చేస్తే అది ఫ్యాక్షన్ రాజకీయంగా మారుతుంది. రాయలసీమలోనే ఈ తరహా ఫ్యాక్షన్ రాజకీయం ఉంటుందని అనుకుంటారు. కాని దానిని ప్రభుత్వమే కృష్ణా జిల్లాకు కూడా తీసుకు వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో రాశారట. 2019 ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వ ఓటమి వరకు ఆయన ఆ పార్టీ తరపునే పని చేశారు కదా!. ఒకసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయినా.. తదుపరి రెండుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ పక్షాన గెలిచారు కదా?. మరి అన్ని కేసుల వ్యక్తిని ఎందుకు టీడీపీ ప్రోత్సహించింది?.. అంటే దానికి జవాబు ఉండదు. టీడీపీ నేతలు కొందరు ఆయనను పశువు అని, అదని తిడుతున్నారు. మరి అదే నిజమైతే ఆ పశువుతో పాటు సుమారు రెండు దశాబ్దాలు కలిసి నడిచినవారు ఏమవుతారు!. అసలు దాడి కేసు ఏమిటి?. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం ఏమిటి?ఈ చట్టం కింద అయితే వెంటనే బెయిల్ రాకుండా చేయవచ్చన్నది వ్యూహం. ఇందుకోసం పనికట్టుకుని ఆ వర్గానికి చెందినవారిని తీసుకు వచ్చి కేసులు పెట్టిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక టీడీపీ-జనసేన కూటమికి నేతలు ఎన్ని అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టకపోవచ్చు. కానీ అది పోయిన రోజు వారిపై కూడా ఇలాంటి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది కదా!. పోలీసులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని వంశీ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై కోర్టువారు ఎలా స్పందిస్తారో తెలియదు. ఏది ఏమైనా వంశీని ఇప్పుడు అరెస్టు చేసినా.. రేపు కొడాలి నాని ,పేర్ని నాని వంటివారిపై రెడ్ బుక్ ప్రయోగించినా అది తాత్కాలికమే అవుతుంది. మరి జగన్ ప్రభుత్వం(Jagan Government) కూడా టీడీపీ నేతలపై కేసులు పెట్టింది కదా? అని అనవచ్చు. వాటిలో మెజార్టీ కేసులు పూర్తి ఆధారాలతో పెట్టినవే. దర్యాప్తులో వాస్తవం అని తేలిన తర్వాతే ఆ కేసులు పెట్టారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధులు అక్రమ మార్గాల ద్వారా టిడిపి ఆఫీస్ అక్కౌంట్ కు చేరాయని సిఐడి విచారణలో తేలిందా?లేదా?. ఆ విషయంపై ఇంతవరకు టీడీపీ సమాధానం ఎందుకు ఇవ్వలేదు. ఆ మాటకు వస్తే 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పీఎస్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి.. రూ.2 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రకటించిందా? లేదా?. దానిపై ఇంతవరకు నోరు తెరిచారా?. అలాగే రాజధానికి సంబంధించిన అనేక కేసులలో సాక్ష్యాలు సేకరించడానికే కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు. ఆ తర్వాతే చర్యలు చేపట్టారు. అంతే తప్ప ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎవరినిపడితే వారిని అరెస్టు చేయలేదు. అయినా ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారే. ఇప్పుడు అసలు వాస్తవాలు,విచారణలతో నిమిత్తం లేకుండా.. ఏదో రకంగా కేసులు పెట్టడం, విధ్వంసాలకు పాల్పడడం, వేధింపులకు గురి చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారే. పైగా రెడ్ బుక్ చాప్టర్ 3 ప్రారంభించామని ఏ మాత్రం భీతి లేకుండా చెప్పుకున్నారే!. ఇదేనా ప్రజాస్వామ్యం. సూపర్ సిక్స్,ఇతర హామీలు నెరవేర్చలేక.. ఇలాంటి రాజకీయాలు చేయడం శోచనీయం. అసలు పని మానేసి ప్రభుత్వం ఈ విధంగా రాజకీయ రాక్షసపాలన సాగిస్తే ఏదో ఒక రోజు అదేవారి పతనానికి హేతువు అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ -
రెడ్‌బుక్ రాజ్యాంగం.. న్యాయ ప్రక్రియ అపహాస్యం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/విజయవాడ లీగల్/ పటమట (విజయవాడ తూర్పు) : రెడ్‌బుక్ రాజ్యాంగంతో విధ్వంసం సృష్టించడం, అక్రమ అరెస్టులకు తెగబడటమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం చెలరేగిపోతోంది. అందుకు జీ.. హుజూర్ అంటూ పోలీసు వ్యవస్థ ప్రభుత్వ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులకు భంగం కలిగిస్తూ, అత్యంత కీలకమైన న్యాయ విచారణ ప్రక్రియ ప్రమాణాలను కూడా ఉల్లంఘిస్తూ బరి తెగిస్తున్నారు.గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అక్రమ అరెస్ట్ ద్వారా తమ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల తీవ్రత.. రాజ్యాంగ ఉల్లంఘనలో బరితెగింపును మరోసారి బాహాటంగా చాటి చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు పేరుతో వల్లభనేని వంశీపై నమోదు చేసిన అక్రమ కుట్ర కేసు బెడిసి కొట్టడంతో ప్రభుత్వ పెద్దలు తమ కుతంత్రానికి మరింత పదును పెట్టారు. పోలీసు దర్యాప్తు ప్రాథమిక విధి విధానాలు, న్యాయ విచారణ ప్రక్రియ ప్రమాణాలను ఉల్లంఘిస్తూ మరో అక్రమ కేసుతో విరుచుకు పడటం పట్ల సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సత్యవర్థన్‌ను విచారించకుండానే వంశీ అరెస్ట్ సత్యవర్థన్‌ను వల్లభనేని వంశీ బెదిరించి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారనే కట్టుకథను పోలీసులు తెరపైకి తెచ్చారు. అందుకోసం ఆయన తమ్ముడు కిరణ్‌ను తమదైన శైలిలో బెదిరించి మరీ రంగం సిద్ధం చేశారు. ఆయన్ను ఏకంగా మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి, బెదిరించి మరీ తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకు ఒప్పించారు. ఆ తర్వాత ఆయన తన అన్న సత్యవర్థన్‌ను బెదిరించి వాంగ్మూలం ఇప్పించి కేసు ఉపసంహరింపజేశారని ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. కానీ ఆ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాధ్యతాయుతంగా ముందుగా సత్యవర్థన్‌ను విచారించాలి. ఆయన అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు సరైందా కాదా అన్నది నిర్ధారించుకోవాలి. ఈ దర్యాప్తు ప్రమాణాలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. విశాఖపట్నంలో ఉన్న సత్యవర్థన్‌ను తీసుకువచ్చేందుకు పోలీసు బృందాలు అక్కడకు వెళ్లాయి. మరోవైపు సత్యవర్థన్‌ను విచారించకముందే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నాయి. తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారన్న కనీస సమాచారం ఇవ్వకుండానే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి బలవంతంగా విజయవాడకు తరలించారు. 164 సీఆర్పీసీ వాంగ్మూలం అంటే లెక్కేలేదుదర్యాప్తు, విచారణ ప్రక్రియలో సీఆర్పీసీ 164 వాంగ్మూలం ఎంతో కీలకమైంది. పోలీసులు అక్రమ అరెస్టు్టలు, బెదిరింపులకు పాల్పడకుండా నిరోధించేందుకు రాజ్యాంగం సీఆర్పీసీ 164 వాంగ్మూలానికి అవకాశం కల్పించింది. అంటే సాక్షులు, బాధితులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ధైర్యంగా, స్వచ్ఛందంగా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వొచ్చు. న్యాయ విచారణ ప్రక్రియలో ఆ వాంగ్మూలానికి అత్యంత విలువ ఉంటుంది. స్వచ్ఛందంగానే వాంగ్మూలం ఇస్తున్నారు కదా అని న్యాయమూర్తి అడిగి మరీ నమోదు చేస్తారు. ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇస్తే అది క్రిమినల్ నేరం కూడా అవుతుందన్నది పోలీసులకు పూర్తి అవగాహన ఉంది. అయినా సరే చంద్రబాబు మెప్పు కోసం రాజ్యంగ నిబంధనలు, న్యాయ ప్రక్రియ ప్రమాణాలను ఉల్లంఘించి మరీ బరితెగించారు. సత్యవర్థన్ స్వచ్ఛందంగా న్యాయమూర్తి ఎదుట సీఆర్పీసీ 164 వాంగ్మూలం ఇస్తే... ఆ వాంగ్మూలం తప్పని ఆయన అన్నయ్యతో ఫిర్యాదు చేయించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనం.కస్టడీ పిటిషన్‌పై సోమవారం విచారణకృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్‌ను పోలీసు కస్టడీకి కోరుతూ శుక్రవారం విజయవాడ పటమట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం వంశీమోహన్ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను పది రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని, అతని సెల్ ఫోన్‌ను సీజ్ చేసేందుకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఇదిలా ఉండగా ఈ కేసులో పెద్ద అవుటపల్లికి చెందిన వేల్పూరు వంశీని, గన్నవరానికి చెందిన వీర్రాజులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. కుట్ర బట్టబయలు.. చంద్రబాబు, లోకేశ్ ఆగ్రహంగన్నవరం టీడీపీ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అక్రమ కేసు బనాయించిన కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు, లోకేశ్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ కాగితాలపై తన సంతకం తీసుకుని తనకు తెలియకుండానే తన పేరిట ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని సత్యవర్థన్ న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. దాంతో రెడ్‌బుక్ కుట్రలో భాగంగానే వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు చేశారన్నది న్యాయస్థానం సాక్షిగా బట్టబయలైంది. తమ కుట్ర బహిర్గతం కావడంతో చంద్రబాబు, లోకేశ్‌లు ఆగ్రహంతో చిందులు తొక్కినట్టు సమాచారం. ఎలాగైనా వంశీని అరెస్ట్ చేయల్సిందేనని స్పష్టం చేశారు. దాంతో డీజీపీ కార్యాలయం కేంద్రంగా అప్పటికప్పుడు కొత్త కుట్రకు తెరతీశారు. వంశీది పైచేయి అయిందని అక్కసుముదునూరి సత్యవర్ధన్ కోర్టులో ఇచ్చిన కీలక వాంగూ్మలం కూటమి ప్రభుత్వానికి అవమానభారంగా మారింది. గత సోమవారం ఆయన స్వచ్ఛందంగా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు హాజరై కేసును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఆఫిడవిట్ సమర్పించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన ప్రభుత్వ పెద్దలు.. ఈ కేసును పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేపై చిందులు తొక్కారు. ఈ కేసులో కీలకమైన ఫిర్యాదుదారుడిని కంట్రోల్లో ఉంచుకోవడంలో వైఫల్యం చెందారంటూ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వల్లభనేని వంశీమోహన్ ఈ కేసులో పైచేయి ఎలా సాధిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఎలాగైనా సరే వంశీమోహన్‌ను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయాల్సిందేనని మౌఖిక ఆదేశాలు ఇచ్చారని సమాచారం. దీంతో పోలీసులు సత్యవర్ధన్ తల్లిదండ్రులు, సోదరుడిని తమ అధీనంలోకి తీసుకుని.. వారిని తీవ్రంగా బెదిరించి, ప్రలోభపెట్టి కథ నడిపించారు. తమకు అనుకూలంగా ఫిర్యాదు తీసుకుని బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కుట్రలో భాగంగా సత్యవర్ధన్ కేసు వాపసు తీసుకోవడంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు టీడీపీ మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవితో కూడా ఫిర్యాదు చేయించి, ఆ మేరకు వంశీమోహన్‌పై ఇంకో కేసు నమోదు చేశారు. హైకోర్టు తీర్పునూ ఖాతరు చేయలేదురెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వల్లభనేని వంశీమోహన్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. ఏ కేసు నిమిత్తం వంటి వివరాలు, ఎఫ్ఐఆర్ కాïపీ ఇవ్వకుండానే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఆయన్ను విజయవాడకు తీసుకువచ్చిన తర్వాత కనీస వైద్య సాయం అందించేందుకు కూడా పోలీసులు నిరాకరించారు. ఆయన సతీమణి పంకజ శ్రీ, న్యాయవాదులను కలిసేందుకు కూడా అంగీకరించలేదు. తుదకు ఆమె ఆందోళనకు దిగడంతో కలిసేందుకు అంగీకరించారు. ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లే విషయంలో, కోర్టు నుండి రిమాండ్‌కు తరలించే సమయంలో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా ఆయన్ను ఇబ్బందులకు గురిచేశారు. కాగా, ఈ కేసులో వంశీపై ఈ నెల 20వ తేదీ వరకు ఎటువంటి తొందరపాటు చర్యలొద్దన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వం, పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని వైఎస్సార్సీపీ నేతలు, ఆయన అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీలో లోకేష్ రెడ్ బుక్ వైరస్.. కరోనా కంటే డేంజర్
-
వల్లభనేని వంశీ అరెస్టు.. 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్/పటమట/కృష్ణలంక (విజయవాడ తూర్పు)/కోనేరు సెంటర్ (మచిలీపట్నం): కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. ఉదయం ఏడు గంటలకు అయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ క్లాజ్ 140 (1), 308, 351 (3) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతకుముందు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏడీసీపీ రామకృష్ణ తన బృందంతో హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని వంశీ కోసం గాలింపు చేపట్టారు. రాయదుర్గం మైహోం భుజాలోని తన ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకెళ్లి వంశీకి బీఎన్ఎస్ 47 (1) నోటీసును అందించి ఉన్నపళంగా అరెస్టు చేశారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో మధ్యాహ్నం విజయవాడకు తీసుకొచ్చారు. కొద్దిసేపు భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఉంచి, అనంతరం కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న సెంట్రల్ ఏసీపీ కె. దామోదరరావుతోపాటు లా అండ్ ఆర్డర్ ఏడీసీపీ జి. రామకృష్ణ రాత్రి తొమ్మిది గంటల వరకు వంశీని ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం.. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరోవైపు.. వంశీ అనుచరులైన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన ఏలినేని వెంకట శివరామకృష్ణప్రసాద్ (35), కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన నిమ్మ లక్ష్మీపతి (35)లను కూడా పటమట పోలీసులు గురువారం రాత్రి అరెస్టుచేశారు. వైద్య పరీక్షల నిమిత్తం వారినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం.. వంశీని కోర్టులో హాజరుపరచగా అర్ధరాత్రి 2 గంటల వరకు వాదనలు కొనసాగాయి. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనట్లుగా..ఇక రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులతో బరితెగిస్తోందనడానికి వంశీ అరెస్టే ఉదాహరణ. ఎందుకంటే.. ఏకంగా న్యాయమూర్తి ఎదుట స్వచ్ఛందంగా 164 సీఆర్పీసీ కింద నమోదుచేసిన వాంగ్మూలాన్ని కూడా బేఖాతరు చేస్తూ అక్రమ కేసులకు టీడీపీ కూటమి సర్కారు తెగిస్తోంది. అసలు వంశీపై అక్రమ కేసుకు ప్రాతిపదికగా పోలీసులు చెబుతున్న గన్నవరం టీడీపీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్థన్ ఫిర్యాదే అబద్ధమని కోర్టు సాక్షిగా ఇటీవల తేలిపోయింది. ఖాళీ కాగితాలపై తన సంతకం తీసుకుని ఫిర్యాదు చేశారని.. అసలు ఫిర్యాదులో ఏముందో కూడా తనకు తెలియదని సత్యవర్థన్ సాక్షాత్తూ న్యాయమూర్తి ఎదుట స్పష్టంచేశారు. వంశీ తనను బెదిరించనేలేదని.. తనపై దౌర్జన్యం చేయలేదని స్వచ్ఛందంగా వెల్లడించి తన ఫిర్యాదును వాపసు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఇది అవమానంగా భావించి ఎలాగైనా వంశీని అరెస్టుచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో సుదీర్ఘ చర్చల అనంతరం సత్యవర్థన్ కిడ్నాప్ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పోలీసులు సైతం కోర్టులోని పరిణామాలన్నింటినీ బేఖాతరు చేస్తూ రెడ్‌బుక్ కుట్రనే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సత్యవర్థన్ తమ్ముడు కిరణ్‌పై ఒత్తిడి తెచ్చి అవాస్తవ ఆరోపణలతో మరో అబద్ధపు ఫిర్యాదును ఈ నెల 12న ఇప్పించారు. మాజీ ఎమ్మెల్యే వంశీ, కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, గంటా వీర్రాజు తదితరులు తన సోదరుడిని కిడ్నాప్ చేసి కేసు వాపసు తీసుకునేలా బెదిరించి, భయపెట్టారని అందులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన వెంటనే పటమట పోలీసులు వంశీపై అక్రమ కేసు నమోదు చేశారు. అంటే.. తమకు అసలు న్యాయ వ్యవస్థ అంటే ఏమాత్రం లెక్కలేదన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నది వంశీ అరెస్టు ద్వారా స్పష్టమవుతోంది.కాగా, వంశీ అరెస్టుపై విజయవాడ పటమట పోలీసుస్టేషన్లో గురువారం హైడ్రామా నడిచింది. హైదరాబాదు నుంచి వంశీని పటమట స్టేషన్‌కు తీసుకొస్తారని పోలీసులు లీకులు ఇవ్వడంతో మీడియా అంతా అక్కడికి చేరుకుంది. చివరికి భవానీపురం స్టేషన్‌కు, అక్కడ వంశీని కారుమార్చి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో రైటర్, ఇతర సిబ్బంది కేసుకు సంబంధించిన పత్రాలను రహస్యంగా తరలించారు. వంశీని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన పోలీసులు వల్లభనేని వంశీకి రిమాండ్..14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారి చేశారు. కాగా విజయవాడ సబ్ జైల్‌కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్థన్ స్టేట్మెంట్ రికార్డు..మరోవైపు ముదునూరు సత్యవర్థన్ గురువారం సాయంత్రం పటమట పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ను పోలీసులు రహస్యంగా స్టేషన్లో ఉంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. వంశీ అరెస్టు నేపథ్యంలో సత్యవర్థన్ స్టేట్మెంట్ను రికార్డు చేయటం చర్చనీయాంశంగా మారింది.మాజీమంత్రి పేర్ని నాని హౌస్ అరెస్టు..వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నానిని పోలీసులు గురువారం హౌస్ అరెస్టుచేశారు. తెల్లవారుజామున ఆయన ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకుని బయటికెళ్లేందుకు వీల్లేదని నోటీసులిచ్చారు.ఎఫ్ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు..నా భర్తపై నమోదుచేసిన కేసు ఎఫ్ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు. ఎందుకు అరెస్టుచేశారో చెప్పడంలేదు. రిమాండుకు తీసుకెళ్లినప్పుడు ఇస్తామంటున్నారు. ఎఫ్ఐఆర్ లేకపోతే లీగల్‌గా వెళ్లడానికి అవకాశం ఉండకూడదని ఇలా చేస్తున్నారు. హైదరాబాద్‌లో మా ఇంటికొచ్చి అరెస్టుచేశారు. నోటీసు ఇవ్వకుండా ఎందుకు అరెస్టుచేస్తున్నారని ప్రశ్నిస్తే అప్పటికప్పుడు పేపర్‌పై రాసిచ్చారు. అక్రమ కేసులో ఇరికించేందుకే ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తుంటే తెలంగాణ సరిహద్దుల వద్దే ఏపీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్మోహనరావు సహాయంతో ఇక్కడకు చేరుకున్నాను. – పంకజశ్రీ, వంశీ సతీమణిచంద్రబాబు ఒత్తిడితోనే వంశీ అక్రమ అరెస్టుమాజీ మంత్రి అంబటిసీఎం చంద్రబాబు ఒత్తిడితోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వంశీ అక్రమ అరెస్టు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసులపై డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు అంబటి రాంబాబు, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులతో కూడిన వైఎస్సార్సీపీ బృందం గురువారం అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ కార్యాలయానికి వెళ్లింది. అయినా డీజీపీ కలవలేదు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ తాను ఆ ఫిర్యాదు చేయలేదని, సాక్షి సంతకం తీసుకొని, దానితో వంశీపై తప్పుడు ఫిర్యాదు నమోదు చేశారంటూ మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. దీంతో చంద్రబాబు, లోకేశ్ కుతంత్రాలు బట్టబయలయ్యాయని చెప్పారు. సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేసి, బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారంటూ అతని సోదరుడితో ఫిర్యాదు చేయించారని తెలిపారు. వంశీని పోలీసులు క్షణాల్లో అరెస్ట్ చేశారన్నారు. బుధవారం ఓ వివాహ వేడుకలో దెంగులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన రచ్చలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పైనా తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు.తప్పుడు కేసులతో వంశీపై కక్షసాధింపువల్లభనేని వంశీపై పోలీసులు బనాయించిన తప్పుడు కేసును తక్షణం ఉపసంహరించుకోవాలి. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసులను పావుగా వాడుకుని వంశీపై తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదుచేశారు. రాష్ట్రంలో చట్టాలను ఎలా తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో వంశీ అరెస్టు ఉదంతం ఒక నిదర్శనం. అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలి. – మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేఅరెస్టు చేయొద్దని కోర్టు చెప్పినా..వల్లభనేని వంశీని అరెస్టుచెయ్యొద్దని కోర్టు ఆదేశాలున్నా, పోలీసులు వాటిని ధిక్కరించి మరీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటవుతుందనే పిచ్చి భ్రమల్లో నుంచి కూటమి నాయకులు బయటకు రావాలి. నియంత పాలన ఎంతోకాలం సాగదు. అన్యాయం జరిగిందని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే, బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. – జూపూడి ప్రభాకర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితప్పుడు ఫిర్యాదు చేయించి..ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతోంది. వంశీపై రాజకీయ కక్ష సాధింపులకే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వంశీ కేసు పూర్తిగా నీరుగారిపోతోందని చంద్రబాబు, లోకేశ్ కక్షపూరితంగా సత్యవర్థన్ కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి వారితో తప్పుడు ఫిర్యాదు చేయించారు. ఇలాంటి దుర్మార్గ విధానాలకు ప్రభుత్వ పెద్దలే పాల్పడుతుంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా? – వేల్పుల రవికుమార్,వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
పరిశ్రమలు మూతపడుతున్నాయ్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉందని.. ఉన్న పరిశ్రమలు సైతం మూతబడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మిగతా అన్ని రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి ఎంతో కొంత పాజిటివ్‌గా ఉంటే.. ఏపీలో మాత్రం మైనస్ 2.94 శాతంగా ఉందని వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ముందస్తు అంచనాల మేరకు రాష్ట్ర వృద్ధి 12.94 శాతంగా ఉన్నప్పటికీ.. పారిశ్రామిక వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ వెనకబడి ఉందన్నారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని, దీన్ని అధిగమించేందుకు పాలనలో స్పీడ్ పెంచి వినూత్న ఆలోచనలు చేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌కు కొంత మంది వ్యక్తులు, కార్యదర్శులు ఏడాది నుంచి ఆర్నెల్లు, మూడు నెలలు సమయం తీసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికేతర ఫైళ్లు ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండకూడదన్నారు. వ్యవస్థను మెరుగు పరిచేందుకే ఇటీవల ఫైళ్ల క్లియరెన్స్ డేటా విడుదల చేసినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్ పథకాలతో రాష్ట్ర బడ్జెట్‌ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు.కేంద్ర పథకాల నుంచి రెండు శాతం నిధులు తెస్తే రాష్ట్రానికి పెద్ద బలం చేకూరుతుందన్నారు. యూసీలు అందచేసి మార్చిలోగా అదనంగా నిధులు రాబట్టేలా అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ఏటా 15 శాతం వృద్ధి సాధించడం ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. ఏటా 15 శాతం వృద్ధి సాధిస్తేనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలమని చెప్పారు.అటవీ మార్గంలో శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు అటవీ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఎనిమిది నెలల్లోనే రూ.22,507 కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. వాట్సాప్‌లో మరిన్ని సేవలు.. రాబోయే రోజుల్లో ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లోనే అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం వాట్సాప్‌లో 161 సేవలిస్తున్నామని, రాబోయే 45 రోజుల్లో 500 సేవలు కల్పించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. టీటీడీ సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తెస్తామన్నారు. ప్రభుత్వం పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సేకరించాలన్నారు. వాట్సాప్‌లో క్యూ ఆర్ కోడ్ లేదా పౌరుల ఆధార్ అథెంటిఫికేషన్ కోరే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అఖిల భారత సర్విస్ అధికారుల నుంచి గ్రూప్ వన్ అధికారుల వరకు ఏప్రిల్‌లో గ్రామాల్లో బస చేయాలని, దీనికి సంబం«ధించి త్వరలోనే విధివిధానాలను సీఎస్ జారీ చేస్తారని తెలిపారు. గతంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమాలను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. అంతకు ముందు అర్జీల పరిష్కారంపై సీఎస్ విజయానంద్ ప్రజెంటేషన్ ఇస్తూ ఇప్పటి వరకు 7,42,301 అర్జీలు వస్తే 60.7 శాతమే పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాల నుంచే ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, పల్నాడు, కృష్ణా జిల్లాల నుంచి అతి తక్కువ ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.వాట్సాప్‌లోనే అన్ని రకాల ధ్రువపత్రాలిస్తాం మంత్రి లోకేశ్ వెల్లడిసాక్షి, అమరావతి: ప్రజలకు కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళవారం జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్ కోసం శాఖలన్నీ తమ సమాచారాన్ని ఆర్టీజీఎస్‌లోని డేటా లేక్‌కు అనుసంధానం చేయాలని కోరారు. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయా లంటే అన్ని శాఖల సహకారం అవసరమన్నారు. రేషన్ కార్డులు మొదలు అన్నీ కూడా ప్రజలకు సులభంగా ఆన్లైన్లోనే అందించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని.. తద్వారా క్యూఆర్ కోడ్‌తోనే రేషన్ పొందే సదుపాయం లభిస్తుందని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని, ప్రజల సంతృప్తి శాతాలను కూడా వాట్సాప్ ద్వారా మదింపు వేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. వేధింపులు, రెడ్‌బుక్‌తోనే తిరోగమనంఒకవైపు పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటూ.. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ.. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఏపీ పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉందని.. అధికారుల్లో స్పీడ్ పెరగాలని వ్యాఖ్యలు చేయడంపై ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని చూపించడమే ఈ దుస్థితికి కారణమని పేర్కొంటున్నారు. రెడ్‌బుక్ పాలన చేసింది మీరు..! అధికారంలోకి రాగానే దాడులు, అరెస్టులతో విధ్వంసానికి తెర తీసింది మీరు..! ఇక మేం ఏం చేయగలం..? అని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మెరుగు పడాల్సింది తమ పనితీరు కాదని.. ప్రభుత్వంలో ఉన్న వారే కక్షపూరిత ధోరణిని విడనాడాలని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి పరిశ్రమ, ప్రతి టెండర్‌ను ప్రభుత్వ పెద్దలకు నచ్చినవారికే కట్టబెడుతూ అర్హతలు లేకపోయినా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, దీనివల్ల పెద్ద పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి రెడ్‌బుక్ పాలన సాగిస్తామని పదేపదే ప్రకటనలు చేయడం ఏమిటని అధికారులు విస్తుపోతున్నారు. తమ మాట వినని పారిశ్రామికవేత్తలను వేధిస్తూ అరెస్టులకూ వెనుకాడకపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో పర్సంటేజీల కోసం కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ యాజమాన్యాన్ని తీవ్రంగా వేధించిన టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు తమకు కప్పం చెల్లించలేదని ఫ్యాక్టరీపై దాడులకు తెగబడటాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు సైతం తీసుకోలేదు. ఇక విశాఖలో కాలుష్య నియంత్రణ మండలిని ముందుపెట్టి అరవిందో ఫార్మాను తీవ్రంగా వేధించారు. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న సజ్జన్ జిందాల్‌ను ముంబై మోడల్ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తీవ్ర వేధింపులకు గురి చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తలొగ్గకపోవడంతో ఆయన సెలవుపై వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చాక డజను మందికిపైగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా కక్షపూరితంగా వేధింపులకు దిగింది. ఇక ఏ నియోజకవర్గంలోనూ కూటమి ఎమ్మెల్యేల ఆమోదం లేకుండా ఒక్క పని కూడా జరిగే పరిస్థితి లేదు. జ్యుడీషియల్ ప్రివ్యూను ఎత్తివేసి నచ్చినోళ్లకు పనులు కట్టబెడుతున్నారు. ఇవన్నీ చేస్తూ ప్రభుత్వ పెద్దలు తిరిగి తమకు క్లాస్ తీసుకోవడం ఏమిటని అధికార యంత్రాంగం విస్తుపోతోంది. -
రెడ్‌బుక్ కుట్రతో.. గాడి తప్పిన పోలీసింగ్
సాక్షి, అమరావతి: ⇒ విజయవాడ వరదల్లో ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు తగినంత మంది పోలీసుఅధికారులనువినియోగించని ప్రభుత్వం ఫలితం.. దాదాపు 50మంది దుర్మరణం ⇒ వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీని పర్యవేక్షించేందుకు తిరుపతిలో తగినంత మంది పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించని ప్రభుత్వం.. ఫలితం.. తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల మృతి ⇒ సైబర్ నేరస్తులు చెలరేగిపోతున్నా సైబర్ పోలీసు వ్యవస్థను పటిష్టం చేయని ప్రభుత్వం ఫలితం.. గత ఏడాదిలో ఏకంగా రూ.1,229 కోట్లు కొల్లగొట్టిన సైబర్ ముఠాలు ⇒ ఇక రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, లైంగిక దాడులు అంతులేకుండా సాగిపోతున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైఫల్యాలకు అంతన్నదే లేదు. రాష్ట్రంలో పోలీసింగ్ అన్నదే కనిపించకుండా పోయింది. శాంతిభద్రతలు దిగజారిపోయాయి. అయినా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో సమర్ధులైన పోలీసు అధికారులు తగినంత మంది లేరా? లేకేం.. ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే.. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడం. ఇది నిఖార్సైన నిజం. ఎందుకంటే.. అధికారులపై రెడ్‌బుక్ కక్ష. సీనియర్ ఐపీఎస్‌ల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అనేక మంది పోలీసు సిబ్బందిపై రెడ్‌బుక్ కక్ష. డజన్ల కొద్దీ అధికారులను వెయిటింగ్లో, వేకెన్సీ రిజర్వ్‌లోనో లేదంటే సస్పెన్షన్‌లోనే పెట్టేసి, చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేస్తోంది. శాంతి భద్రతలు దిగజారుతున్నా, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, మహిళలపై అత్యాచారలు పెచ్చుమీరిపోయినా, దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోయినా, సామాన్యుల కష్టార్జితం సైబర్ ముఠాల పాలవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో మునిగిపోయి, అధికారులందరినీ పక్కన పెట్టేసింది. ‘వెయిటింగ్’లో పెట్టు...‘వీఆర్’లో ఉంచూ వెయిటింగ్, వేకెన్సీ రిజర్వ్ (వీఆర్).. ఈ రెండు పదాల మధ్యే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు వ్యవస్థ కునారిల్లిపోతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అత్యధిక మంది పోలీసు అధికారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది. ఐదుగురు ఐపీఎస్ అధికారులను వెయిటింగ్లో ఉంచి, మరో నలుగురు ఐపీఎస్ అధికారులను కక్ష పూరితంగా సస్పెండ్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం అంతటితో ఆగ లేదు. నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు కలిపి మొత్తం 59 మందిని వెయిటింగ్‌లోనే ఉంచింది. పరిపాలన పరమైన అంశాలతో నలుగురైదురుగురికి స్వల్ప కాలం వెయిటింగ్లో ఉంచడం సర్వసాధారణం. తర్వాత వారిని ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సది్వనియోగం చేసుకోవడం రివాజు. కానీ ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసి, వారందరినీ పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. వారిలో నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, ఒక ఏఆర్ డీఎస్పీ ఉన్నారు. – ఇక శాంతి–భద్రతల పరిరక్షణ, ఇతర పోలీసు విధుల్లో అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి పోలీసు అధికారులపట్ల కూడా చంద్రబాబు ప్రభుత్వం అదే దురీ్నతి ప్రదర్శిస్తోంది. ఏకంగా 90 మంది సీఐలకు పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచడం విభ్రాంతి కలిగిస్తోంది. గుంటూరు రేంజ్లో 28 మంది, కర్నూలు రేంజ్లో 21 మంది, ఏలూరు రేంజ్లో 24 మంది, విశాఖపట్నం రేంజ్లో 17 మంది సీఐలను ‘వీఆర్’లో పెట్టింది. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 120 మంది ఎస్సైలను ‘వీఆర్’లో ఉంచింది. దీంతో పని చేసే పోలీసు అధికారుల సంఖ్య రాష్ట్రంలో తగ్గిపోయింది. అమాంతంగా పెరిగిన నేరాలు– ఘోరాలు అధికారులపై చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను వెయిటింగ్లో, వీఆర్‌లో పెట్టడంతో పోలీసు వ్యవస్థ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయలేకపోతోంది. దాంతో శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయి. దోపిడీలు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. 2024లో సైబర్ నేరాలపై ఏకంగా 7.23లక్షల ఫిర్యాదులు వచ్చినా పోలీసు వ్యవస్థ సత్వరం స్పందించలేకపోయింది. దాంతో సైబర్ ముఠాలు సామాన్యుల నుంచి ఏకంగా రూ.1,229 కోట్లు కొల్లగొట్టాయి. రాష్ట్రంలో 17,282 దోపిడీలు, దొంగతనాలు జరిగినా ఆ కేసులను పోలీసు శాఖ ఛేదించలేకపోతోంది. రోడ్డు ప్రమదాలు భారీగా పెరుగుతున్నా రహదారి భద్రతకు తగినంత మంది పోలీసులకు నియోగించలేకపోతోంది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కక్ష రాజకీయాలకే పరిమితమవుతూ ప్రజల భద్రతను గాలికొదిలేసింది. -
‘రెడ్‌బుక్’ ఎఫెక్ట్..! కాష్పటేల్కు సెనేట్ షాక్
వాషింగ్టన్:అమెరికాలోనూ కక్ష సాధింపు రాజకీయాల కాలం నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉన్నట్లుగానే అక్కడా రిపబ్లికన్లు ఒక ‘రెడ్‌బుక్’ రాసి పెట్టుకున్నారు. అందులో వారు టార్గెట్‌గా చేసుకున్న ప్రత్యర్థుల పేర్లు రాసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరిపై ఎలా కక్ష తీర్చుకోవాలనేది ముందే డిసైడయ్యారు. ఈ కక్ష సాధించే సంప్రదాయమే ట్రంప్ 2.0లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) చీఫ్‌గా నామినేట్ అయిన కాశ్‌పటేల్ మెడకు చుట్టుకుంది. తాము కక్ష తీర్చుకోవాల్సిన డెమోక్రాట్లు చాలా మంది ఉన్నారని కాష్ పటేల్ గతంలో వ్యాఖ్యానించారు. కాష్ మాట్లాడిన ఈ మాటలే ప్రస్తుతం ఆయన ఎఫ్‌బీఐ చీఫ్‌గా పదవి చేపట్టేందుకు అడ్డంకిగా మారింది.ఈ మాటల వల్లే కాష్ పటేల్ నామినేషన్‌ను గత వారం అమెరికా ఎగువ సభ సెనేట్ ఆమోదించలేదు. కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమించడాన్ని డెమోక్రాట్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తానన్న కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమిస్తే అది రాజకీయ నియామకమే అవుతుందని వారు పేర్కొన్నారు.కాష్ పటేల్ రెడ్‌బుక్‌లో పలువురు డెమోక్రాట్ నేతలతో పాటు ట్రంప్ కేసులు వాదించిన ప్రాసిక్యూటర్లు, బైడెన్ హయాంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా ట్రంప్ గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే నామినేట్ చేయడం గమనార్హం. -
రెడ్‌బుక్ కుట్రకే ‘పచ్చ’ సిట్!
సాక్షి, అమరావతి: రెడ్ బుక్ కుట్రలో తాజా అంకానికి చంద్రబాబు ప్రభుత్వం తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోళ్లపై అక్రమ కేసు నమోదు చేసిన సీఐడీ చేతులెత్తేయడంతో టీడీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దాంతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పేరిట కొత్త పన్నాగం పన్నింది. తాము చూసి రమ్మని చెబితే.. కాల్చి వచ్చేసేంతటి టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ను నియమించడం గమనార్హం. సిట్ చీఫ్‌గా నియమించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు అందులోని సభ్యుల ట్రాక్ రికార్డే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను తేటతెల్లం చేస్తోంది. తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు ఇప్పించి, అక్రమ కేసులతో వేధించడమే ధ్యేయంగా సిట్‌ను నియమించారన్నది సుస్పష్టం. అందుకే సిట్‌కు అపరిమిత అధికారాలు కట్టబెడుతూ మరీ కుతంత్ర కార్యాచరణకు ఉపక్రమించింది. సిట్ సభ్యుల ట్రాక్ రికార్డు ఇలా ఉంది.అక్రమ కేసులు పెట్టడంలో అందెవేసిన చేయి అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలు అన్నట్టుగా సిట్ చీఫ్‌ను చూస్తే చాలు చంద్రబాబు ప్రభుత్వ కుట్ర తేటతెల్లమవుతుంది. టీడీపీ వీర విధేయుడిగా గుర్తింపు పొందిన అత్యంత వివాదాస్పద అధికారి ఎస్వీ రాజశేఖర్ బాబు. అనంతపురం జిల్లాలో పోస్టింగు నుంచి నేటి వరకు ఆయన టీడీపీకి అత్యంత అనుకూల అధికారిగా ముద్ర పడ్డారు. ఆ ముద్రను తొలగించుకునేందుకు ఆయన ఏనాడూ ప్రయత్నించక పోవడం గమనార్హం. గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆయన్ను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా నియమించింది. అప్పటి నుంచి ఆయన రెడ్‌బుక్ కుట్రను అమలు చేయడమే ఏకైక లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు వెనుక మాస్టర్‌మైండ్‌గా పని చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరాల చట్టాన్ని ప్రయోగించడం దేశ వ్యాప్తంగా విస్మయ పరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసుల్లో 75 శాతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. అక్రమంగా నిర్బంధించి రోజుల తరబడి శారీరకంగా హింసించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనం. ఇలా కేసుల నమోదు చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో రాజశేఖర్‌బాబు అక్రమ కేసుల కుట్రకు తెరపడింది. ఇక వలపు వల (హనీట్రాప్) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబయికి చెందిన కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులను దగ్గరుండీ పర్యవేక్షించిందీ రాజశేఖర్ బాబే. చంద్రబాబు ఆదేశాలతో ఆయన చేసిన నిర్వాకంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు అధినేత సజ్జన్ జిందాల్‌ను వేధించారు. దాంతో హడలిపోయిన జేఎస్‌డబ్ల్యూ గ్రూపు రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను మహారాష్ట్రకు తరలించేసింది. ఇలా ప్రభుత్వ పెద్దలు చెబితే చాలు ఎంతటి అక్రమానికైనా తెగించే ఏకైక అర్హతతోనే రాజశేఖర్ బాబును సిట్ చీఫ్‌గా నియమించారు.పట్టుబట్టి తెలంగాణ నుంచి రప్పించి..సిట్‌లో మరో సభ్యుడు ఎల్.సుబ్బారాయుడు టీడీపీ వీరవిధేయ కుటుంబీకుడు. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కుటుంబం టీడీపీ తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. అందుకే తెలంగాణ క్యాడర్‌కు చెందిన సుబ్బారాయుడును పట్టుబట్టి చంద్రబాబు మరీ ఏపీకి రప్పించుకున్నారు. అనంతరం రెడ్‌బుక్ కుట్ర కేసుల నమోదు బాధ్యతలను అప్పగించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలతో ఆయన హడలెత్తించారు.ఇటీవల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగి, ఆరుగురు భక్తులు దుర్మరణం పాలవ్వడం పూర్తిగా పోలీసు వైఫల్యమే. అందుకు సుబ్బారాయుడిని సస్పెండ్ చేయాల్సిన ప్రభుత్వం కేవలం బదిలీతో సరిపెట్టింది. అది కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమించి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. తాజాగా సిట్‌లో సభ్యుడిగా నియమించింది. టీడీపీ ఎంతంటే అంతే..సిట్‌లో మరో సభ్యుడు నంద్యాల డీఎస్పీ పి.శ్రీనివాస్ తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదం. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఆయన కుటుంబం టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. ఎస్సై, సీఐగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధులు నిర్వహించిన శ్రీనివాస్.. టీడీపీకి అనుకూల అధికారిగా ముద్ర పడ్డారు. గత ఏడాది ఎన్నికల ముందు కూడా ఆయన పలువురు పోలీసు అధికారులకు ఫోన్లు చేసి మరీ టీడీపీకి అనుకూలంగా పని చేయాలని ఒత్తిడి తేవడం వివాదాస్పదమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్ మాటే నంద్యాల జిల్లాలో శాసనంగా మారింది. జిల్లాలో సీఐలు, ఎస్సైల పోస్టింగుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అసాంఘికాలకు ఊతంఒంగోలు విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు ఎస్పీగా ఉన్న కొల్లి శ్రీనివాస్‌ను కూటమి ప్రభుత్వం సిట్‌లో సభ్యునిగా నియమించింది. గతంలో విజయవాడలో అదనపు డీసీపీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఆయన సొంతం. స్పాలలో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడం వెనుక ఆయనదే ప్రధాన పాత్ర. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి వీఆర్‌కు పంపింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఆయన్ను సిట్ సభ్యునిగా నియమించింది. అక్రమంగా కాల్ రికార్డ్స్ ఆయన ఘనతసిట్లో మరో సభ్యుడు ప్రస్తుతం సీఐడీ అదనపు ఎస్పీగా ఉన్న ఆర్. శ్రీహరి బాబు ట్రాక్ రికార్డు మరింత వివాదాస్పదం. గతంలో ఆయన గురజాల డీఎస్పీగా ఉన్నప్పుడు పలువురు ఎమ్మెల్యేల కాల్ రికార్డుల వివరాలను అక్రమంగా సేకరించి ఇతరులకు చేరవేశారు. బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే ఉద్దేశంతోనే కాల్ రికార్డుల డేటాను అక్రమంగా సేకరించడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ కాల్ రికార్డుల కుట్ర వెనుక సూత్రధారి నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కావడం గమనార్హం. దాంతో శ్రీహరిబాబును వైఎస్సార్సీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఫోకల్ పోస్టింగు ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన శ్రీహరి బాబును సిట్ సభ్యునిగా చేర్చడం కూటమి ప్రభుత్వం కుట్రకు తార్కాణం. -
దేవాలయాలకు పాకుతున్న ‘రెడ్‌బుక్’ సంస్కృతి!
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగ విష సంస్కృతి కోరలు చాస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకూ పాకుతోంది. ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల, తిరుపతి దేవస్థానంలోనూ ఈ రకమైన నీచ రాజకీయాలు ప్రవేశించాయి. తమకు గిట్టనివారిపై మాత్రమే సాగుతున్న రెడ్‌బుక్ కుట్రలతో పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట ఏర్పడుతోంది. సాటి అధికారులపైనే కుట్రలకు దిగుతుండటం బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారి కావచ్చు.టీటీడీ ఇటీవల కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై కేసులు పెట్టింది. ప్రభుత్వ సలహాదారు.. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తిరుమల సందర్శించిన సందర్భంగా ఆయనకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వలేదని, అధికారులు ప్రోటోకాల్‌ను కూడా ఉల్లంఘించారని ఈ ఛానళ్లలో కొన్ని కథనాలు ప్రసారం కావడమే నిర్వాహకులు చేసిన ఘోర తప్పిదం. ఈ కథనాల కారణంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని, వారి మనోభావాలు గాయపడ్డాయని ఆరోపణలు చేసి జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ నిర్వాహకుడు వైఎన్ఆర్తోపాటు ఇతరులపై కేసులు నమోదు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఓ శాటిలైట్ ఛానెల్ యజమానే. ఆ ఛానెల్లో ఎన్ని అసత్య కథనాలు ప్రసారమయ్యాయో ప్రజలకు, విమర్శకులు అనేకులకు తెలిసిన విషయమే.టీడీపీ భజంత్రీ ఛానెల్‌గా మాత్రమే ఉండాలని అనుకుంటున్న బీఆర్ నాయుడు వీటిని పట్టించుకోకపోవచ్చు. అది వారి ఇష్టం కానీ.. అందరూ తనలానే అధికార పార్టీకి అణిగిమణిగి ఉండాలని కోరుకోవడమే అభ్యంతరకరం. టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని అంటున్నారు. ఎవరివల్ల? దాని గురించి చెప్పగలిగే ధైర్యం టీటీడీకి ఉందా?. దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దిక్కుమాలిన రాజకీయం చేసిందెవరు?. భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని అసత్య ఆరోపణలు చేయడం వల్ల కదా టీటీడీ ప్రతిష్ట మసకబారలేదా?. సీఎం వంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా ఆయన చేసిన ఆరోపణలతో టీటీడీ పరువు ఏపీలోనే కాదు.. ప్రపంచం అంతటా పోయింది వాస్తవం కాదా?కోట్లాది హిందువులు ఏ దేశంలో ఉన్నా అంతా బాధపడ్డారా? లేదా? తీరా చూస్తే ఆయనే మళ్లీ మాటమార్చారు. సిట్ అని, సీబీఐ అని రకరకాలుగా విచారణలు చేయించారు. వాటి సంగతి ఏమైందో తెలియదు.టీటీడీ ఈవో శ్యామలరావు లడ్డూలో కల్తీ జరగలేదని తొలుత చెప్పి, ఆ తర్వాత చంద్రబాబుకు వంత పాడేలా మాట్లాడినప్పుడు పరువు పోలేదా? వారిపై టీటీడీ కేసులు పెట్టిందా?. అధికారం అంతా వారి చేతిలోనే ఉంది కనుక ఎవరూ వారి జోలికి వెళ్లలేరు. ఎవరైనా తమ మనోభావాలు గాయపడ్డాయని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా పోలీసులు పట్టించుకోరు. ఎప్పుడో మూడు, నాలుగేళ్ల క్రితం తమ నేత చంద్రబాబు, తదితరులను దూషించారని, దానివల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ వారు ఎవరైనా కేసు పెడితే మాత్రం పోలీసులు ఆగమేఘాల మీద హైదరాబాద్ వెళ్లి మరి ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వంటివారిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తారు. దీనినే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. పలుకుబడి లేనివారినైతే అరెస్టు చేసి వేధిస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి చూద్దాం. చంద్రబాబు తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేయడమే దారుణం అనుకుంటే పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి సనాతని వేషం కట్టి అయోధ్యకు పంపిన లడ్డూలలో సైతం కల్తీ నెయ్యి కలిపారని టీటీడీ పరువు మంట కలిపారు. తీరా చూస్తే అయోధ్యకు పంపిన లడ్డూలను బోర్డు సభ్యులు ఇద్దరు స్వచ్ఛమైన నెయ్యితో వ్యక్తిగతంగా తయారు చేయించారని వెల్లడైంది. అంటే పవన్ తప్పుడు ఆరోపణ చేసినట్లే కదా!. మరి టీటీడీ ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తే ఒకప్పుడు ఎంత హోదాలో ఉన్నా కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి లేదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్ల కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాటకు గురై ఆరుగురు మరణిస్తే టీటీడీకి మచ్చ రాలేదు. దీనికి సంబంధించిన అధికారులపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని ముఖ్యమైన అధికారుల జోలికి వెళ్లలేదు.ఇదే సమయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పడానికి కూడా తొలుత మొరాయించారు. క్షమాపణతో సరి పెట్టుకున్నారే తప్ప.. తను చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇది జరిగింది కనుక నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని మాత్రం ప్రకటించలేదు. నిజంగా టీటీడీ ప్రతిష్ట దారుణంగా దెబ్బతీసిన వారిపై ఎలాంటి చర్యలు లేవు కానీ, యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై మాత్రం కేసులు పెట్టేశారట. వారు నిజంగానే పొరపాటు మాట్లాడి ఉంటే ఖండన ఇచ్చి అదే రకంగా వార్తలు ప్రసారం చేయాలని కోరి ఉంటే సరిపోయేది. అలా కాకుండా కేసులు పెట్టారంటే అది కక్ష కాక మరేమిటి?. టీటీడీలో రెడ్‌బుక్ పాలన ఇంకేమిటి? అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ రెడ్‌బుక్‌ను పిచ్చి కుక్కలతో పోల్చి అవి ఎవరి మీద ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు.టీటీడీలోనే కాదు.. వైఎస్సార్సీపీ నేతలు అనేక మందిపై రెడ్‌బుక్ పేరుతో కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపై దారుణమైన రీతిలో కేసులు పెట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయడమే వీరి లక్ష్యం. తాజాగా మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీ భూముల ఆక్రమణ అంటూ ఓ కథ సృష్టించి ఏదోలా కేసు పెట్టాలని చూస్తున్నారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు ఇచ్చిన వివరణ చూస్తే అది ఎప్పుడో పాతికేళ్ల క్రితం కొన్న భూములు. వాస్తవం ఉన్నా, లేకపోయినా రెడ్‌బుక్ ప్రకారం కేసులు పెట్టడానికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిత్యం ప్రభుత్వాన్ని ఉసికొల్పుతున్నాయి. రెడ్‌బుక్ సృష్టికర్త లోకేష్ అయినా మర్చిపోతారేమో కానీ, ఈ ఎల్లో మీడియా మాత్రం తమ కక్షలు తీర్చుకోవాడానికి మాత్రం పూర్తిగా వాడుకునే పనిలో ఉంది. వీరి వ్యవహార శైలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నంగా ఒక వైపు కనిపిస్తుంది.మరోవైపు ప్రభుత్వాన్ని వీరే నడుతున్నట్లుగా ఇష్టారాజ్యంగా వైఎస్సార్సీపీ వారిపై, తమకు గిట్టనివారిపై కథనాలు ఇస్తున్నారు. దీనివల్ల కూటమికి కూడా భవిష్యత్తులో నష్టమే తప్ప మరొకటికాదు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై రెడ్‌బుక్‌ను ప్రయోగించారు. పలువురికి పోస్టింగ్‌లు నెలల తరబడి ఇవ్వడం లేదు. కొందరిని అరెస్టు చేయడానికి యత్నిస్తున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అభియోగంపై విచారణకు వేసిన సిట్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్‌ను కూటమి పెద్దలు ఆదేశించినట్లుగా నివేదిక ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారట. ఆయన అలా కుదరదని, వాస్తవ పరిస్థితిని నివేదిస్తానని చెప్పారట. కాదు.. కూడదంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అన్నారట. దాంతో డీజీపీ, మరో ఉన్నతాధికారి ఆయనను బదిలీ చేయాలని నిర్ణయించారట. ఇదంతా మీడియాలో వచ్చిన సమాచారమే.ఇలా పోలీసు శాఖలోని వారు కూడా తమ పదవులు, పోస్టింగ్‌ల కోసం అధికారంలో ఉన్నవారికి వంతపాడే పనిలో ఉంటే అది వ్యవస్థకు ఎంతవరకు ప్రయోజనమో ఆలోచించాలి. ఇలా తప్పుడు కేసులు పెట్టించడం కొనసాగిస్తే, అదే రెడ్‌బుక్ కూటమి నేతల మెడలకు కూడా ఎప్పుడో ఒకప్పుడు చుట్టుకునే అవకాశం ఉంటుంది. పామును పెంచితే ఎంత ప్రమాదమో, రెడ్‌బుక్ అంటూ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తే కూడా అంతే ప్రమాదం అన్న సంగతిని నేతలు ఎప్పటికి గుర్తిస్తారో !.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సీఐడీ కుట్ర విఫలం.. ఇక సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపులు రోజు రోజుకూ వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానంపై అవాస్తవ ఆరోపణలతో, అక్రమ కేసులతో వేధించేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ అక్రమ కేసుతో పన్నిన పన్నాగం బెడిసి కొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అవినీతిపై ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. దాంతో బాబు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసింది. తాము చెప్పింది చెప్పినట్టు చేసే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తెర వెనుక ఉంటూ పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ద్వారా ఈ కుట్రను అమలు చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. కాగా సిట్‌కు నేతృత్వం వహించనున్న రాజశేఖర్ బాబుపైనే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండటం గమనార్హం.కొండను తవ్వి.. ఎలుకను కూడా పట్టలేని సీఐడీవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో సీఐడీ అక్రమ కేసు కుట్ర బెడిసికొట్టింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై సీఐడీ ద్వారా కేసు నమోదు చేసింది. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అవాస్తవ ఆధారాలను సృష్టించాలని, అక్రమ కేసులు బిగుసుకునేలా చేయాలని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అక్రమ కేసుల బనాయింపులో తాము చెప్పిన లక్ష్యాలు సాధిస్తే ఆయనకు డీజీపీ పోస్టు ఇస్తామని కూడా ప్రలోభ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఐడీ ఆరు నెలలుగా చేయని హడావుడి లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డితోసహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వాసుదేవరెడ్డిని పలుసార్లు విచారణ పేరిట వేధించారు. ఆయన్ను అక్రమంగా రోజుల తరబడి నిర్బంధించి తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. తాము చెప్పినట్టు చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని, లేకపోతే అంతు చూస్తామన్న హెచ్చరికలతో సీఐడీ అధికారులు బరితెగించారు. డిస్టిలరీల్లో తనిఖీల పేరిట హడావుడి చేశారు. ఇంత చేసినప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించ లేకపోయారు. అవాస్తవ ఆధారాలతో కనికట్టు చేసేందుకు చేసిన యత్నాలు ఫలించ లేదు.సీఐడీ చీఫ్‌పై చినబాబు ఆగ్రహం రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపుల కేసులను తాము చెప్పినట్టు చేయడం లేదని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్పై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. చినబాబే అందరి ముందు ఆయనపై పరుష పద జాలంతో విరుచుకు పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకానొక దశలో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను బదిలీ చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. కుట్రకు పదునుపెట్టేందుకే సిట్‌మద్యం అక్రమ కేసు పేరిట వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తకుట్రకు తెరతీసింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యాన్నార్ విఫలమయ్యారని భావించిన ప్రభుత్వ పెద్దలు తమ అస్మదీయ అధికారి రాజశేఖర్ బాబును తెరపైకి తెచ్చారు. ఆయన నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి సిట్ వంటి ప్రత్యేక దర్యాప్తు బృందానికి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారి నేతృత్వం వహిస్తారు. అంటే డీజీపీ, సీఐడీ, ఏసీబీ తదితర విభాగాల్లోని ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ జిల్లా పోలీసు యంత్రాంగాల బాధ్యతలు నిర్వర్తించే పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు సిట్ బాధ్యతలు అప్పగించరు. ఎందుకంటే వారికి వారి జిల్లా శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలు చాలా ముఖ్యం. అయితే అందుకు విరుద్ధంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా ఉన్న రాజశేఖర్‌బాబును సిట్ చీఫ్‌గా నియమించడం గమనార్హం. అంటే తాము చెప్పినట్టు చేసే అధికారి, ఎంతటి అక్రమ కేసునైనా పెట్టి వేధించే అధికారికే బాధ్యతలు అప్పగించాలన్నదే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని స్పష్టమవుతోంది. రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ సిట్ తెరవెనుక పాత్ర పోషించనున్నారు. ఆయన చెప్పినట్టుగా రాజశేఖర్‌బాబు దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడుతారన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే అసలు రాజశేఖర్‌బాబు ట్రాక్ రికార్డు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న విషయాన్ని పోలీసు వర్గాలే ప్రస్తావిస్తున్నాయి. మద్యం దందాతోపాటు పలు వ్యవహారాల్లో ఆయన అవినీతి బాగోతాన్ని కేస్ స్టడీలతోసహా ఉటంకిస్తున్నాయి. అసలు మద్యం వ్యవహారంపై సిట్ సంగతి తర్వాత.. అసలు సిట్‌కు నేతృత్వం వహిస్తున్న పోలీస్ అధికారుల అవినీతి బాగోతం మరోసారి బట్టబయలవుతోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. సిట్ సభ్యులు వీరే.. సిట్ చీఫ్: ఎస్వీ రాజశేఖర బాబు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్సభ్యులు: ఎల్. సుబ్బారాయుడు, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీ (చంద్రబాబుకు వీర విధేయ అధికారి. అందుకే తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి తిరుపతి ఎస్పీగా నియమించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రభుత్వ వైఫల్యం.. భక్తుల తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు. అయినా సరే ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చింది. ప్రస్తుతం సిట్‌లో సభ్యునిగా నియమించింది.)– కొల్లి శ్రీనివాస్, అదనపు ఎస్పీ, విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగం– ఆర్.శ్రీహరి బాబు, అదనపు ఎస్పీ, సీఐడీ– పి.శ్రీనివాస్, డీఎస్పీ, డోన్– కె.శివాజీ, సీఐ– సీహెచ్.నాగ శ్రీనివాస్, సీఐ -
ఈ అరాచకాలపై ఎవ్వరూ నోరు మెదపరేం?
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి నేతల అరాచకాలు నానాటికీ శ్రుతి మించిపోతున్నాయి. పట్టపగలే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కిడ్నాప్‌లు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ.. చోద్యం చూస్తూ ఉండిపోయింది. టీడీపీ గుండాల దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు, రెండో బాస్ లోకేష్‌లు పట్టనట్లు ఉంటున్నారు. మరోవైపు.. ఆమధ్య ఏపీలో శాంతిభద్రల గురించి ఆందోళన వ్యక్తం చేసిన పవన్.. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నా మౌనంగా ఉండిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత అన్యాయాలు జరిగాయో కళ్లారా చూసింది ఏపీ. అధికార పార్టీలు ఎన్నికల ప్రక్రియను అవహేళన చేసేశాయి. బలం లేనిచోట్ల కూడా బలవంతంగా కూటమి నేతలను గెలిపించుకుంది. ప్రలోభాలు, బెదిరింపులు, దాడులతో.. వైఎస్సార్సీపీ నుంచి సభ్యులను తమ దారికి తెచ్చుకున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత.. తాము బెదిరింపులతోనే ఓటేశామని భూమన వద్ద వైఎస్సార్సీపీ సభ్యులు మొరపెట్టుకున్న పరిస్థితి చూసిందే. హిందూపురం సహా మరికొన్ని చోట్లా అదే పరిస్థితి. పాలకొండ, పిడుగురాళ్ల, తునిలో అయితే కూటమి ఎఫెక్ట్‌తో రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి.చివరికి ఎమ్మెల్సీలకూ రక్షణలేని దుస్థితితో పోలీసు బాసులు ఉన్నారు. నిర్మోహమాటంగా కూటమి తెచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగానికే సెల్యూట్ చేస్తున్నారు. ఏపీలో అఘాయిత్యాలపై ప్రశ్నించిన పవన్.. ఆ తర్వాత ఏమైందోగానీ చల్లబడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల సంగతి సరేసరి. టీడీపీ దాడులపై ప్రశ్నించే దమ్ము వాటికి లేకుండా పోయింది. దీంతో వైఎస్సార్సీపీ ఒంటరి పోరు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఈ అరాచకాలతో ప్రజాస్వామ్య వాదులు భయపడుతున్నారు. న్యాయస్థానాలు, మానవ హక్కుల సంఘాలు ఇప్పటికైనా ఏపీ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు. -
కూటమి సర్కార్‌కు లోకేష్ రెడ్‌బుక్‌తో ముప్పు!
సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలను అమలు చేసే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నట్ట? లేనట్టా?. హామీలైతే ఇచ్చాను కానీ.. అమలు చేయలేని పరిస్థితి ఉందని ఆయన పదే పదే చెబుతున్నా టీడీపీ జాకీ మీడియా మాత్రం ‘‘అబ్బెబ్బే.. బాబు అలా అనలేదు... ఇలా అనలేదు’’ అని గొంతు సవరించుకుంటోంది. ఎందుకు మరి? ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా.. ప్రజల దృష్టిని హామీల నుంచి మళ్లించేందుకు నానా తంటాలూ పడుతన్నాయెందుకు?. ఇటీవల చంద్రబాబు ఒక మీడియా సమావేశం పెట్టారు. నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు కొన్నింటిని వక్రీకరించి.. గత ప్రభుత్వాన్ని నిందించాలన్నది ఈ సమావేశం ఉద్దేశం. ఇందులోనే ఆయన ‘సూపర్ సిక్స్’పై ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పేశారు. డబ్బులున్నా ఇవ్వడం లేదని, నమ్మకం పెట్టుకున్నామని ఫీలింగ్స్‌తో ఉంటున్నారని అన్న బాబు.. కేంద్రం ఇతర ఖర్చుల కోసం ఇచ్చిన నిధులను సంక్షేమానికి పెట్టలేనని తేల్చేశారు. ఆర్థిక పరిస్థితి రీత్యా ప్రభుత్వమైనా అవస్థలు పడాలని లేదంటే రైతులైనా అవస్థలు పడాలని తన మనసులోని మాట చెప్పేశారు. అంటే.. రైతు భరోసా ఇవ్వలేనని అర్థమన్నమాట. తల్లికి వందనం ఈ ఏడాది కాదని ఇప్పటికే టీడీపీ నాయకత్వం తేల్చేసింది. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3000ల ఊసు అస్సలు ఎత్తడం లేదు. ఇవి కాకుండా.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల్లోని వారికి యాభై ఏళ్లకే ఇస్తామన్న పింఛన్, ఇతర ఎన్నికల హామీల సంగతి సరేసరి. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయమయ్యే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీల అమలు సాధ్యం కాదని ఎన్నికల సమయంలోనే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విస్పష్టంగా చెప్పినా.. తాము సంపద సృష్టిస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని కూడా కూటమి నమ్మబలికింది. కానీ ఈ మాటలన్నీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్క వరకే! ఆ తరువాత స్వరం మారింది. రోజుకో డైవర్షన్ రాజకీయాలతో అసలు సంగతిని నెమ్మదిగా ప్రజల మనసుల్లోంచి చెరిపేసేందుకు తలో సన్నాయి నొక్కు నొక్కడం మొదలుపెట్టారు. పైగా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్నింటికీ జగన్‌దే బాధ్యతన్నట్టుగా తలకూ.. మోకాలికి ముడివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్ర్రజ్యోతి వంటి వార్తా పత్రికలు ప్రజల పక్షాన నిలవాలన్న ప్రాథమిక జర్నలిజమ్ సూత్రాన్ని ఎప్పుడో గాలికి వదిలేసి.. చంద్రబాబుకు వత్తాసు పలికే పనిలో బిజీ అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తాయని, సాక్షి మీడియాలో వచ్చిన వార్తల్లో తప్పులున్నాయని అనుకుందాం. అలాంటప్పుడు ఫలానా తేదీ నుంచి ఫలానా హామీ అమలవుతుందని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? కారణం ఒక్కటే. ఎల్లో మీడియా పైరవీలు, వ్యాపారాలు సాగాలంటే ఇలాగే పచ్చి అబద్దాలు ప్రచారం చేయాలి. వారికి గిట్టుబాటు అయితే ప్రజలందరికి స్కీములు వచ్చినట్లే అన్నమాట. చంద్రబాబు చెప్పిన విషయాలు కొన్నిటిని గమనించండి. కేంద్రం విశాఖ స్టీల్ కు రూ.11 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ.. ఆ డబ్బును తాను సంక్షేమ పథకాలకు వాడలేనని బాబు అంటున్నారు. విశాఖ స్టీల్ ఇచ్చిన డబ్బుతో ఈయనకు ఏమి సంబంధం? పోలవరం ప్రాజెక్టు నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి ఎలా వస్తాయి? అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది అప్పు తప్ప గ్రాంట్ కాదు. అయినా బాబు ఈ మాటలన్నారంటే.. ఆయన అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమైపోతుంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా ఆసాములకు ఉపయోగపడేలా నిధులు తీసుకు వచ్చి ఖర్చు చేస్తాం కాని, పేదలకు ఇస్తామన్న స్కీములకు మాత్రం డబ్బు తేలేమని చెప్పినట్లే కదా! దానికి తగినట్లే ఒక్క అమరావతి మినహా మిగిలిన చోట్ల మాత్రమే భూముల ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా ఛార్జీల రూపంలో ప్రజలను మరోసారి బాదుతారన్నమాట. ఇదెంత వరకూ న్యాయం?. మరో వైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీకి ఏడు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి వెళ్లారు. దానిని చంద్రబాబు కాదనలేదు. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? అయినా ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఎందుకు చెబుతున్నారు? ఏపీలో ఆర్దిక వ్యవస్థను పునరుద్దరించడానికి తొమ్మిది, పదేళ్లు పడుతుందట.. అంటే దాని అర్దం అప్పటివరకు ఈ స్కీములు అమలు చేయలేమని చెప్పడమే! పోలవరం, అమరావతి వంటి వాటిని అభివృద్ది చేసి అప్పుడు ఆదాయం సంపాదించి ఖర్చు చేస్తారట. అసలు సంపద సృష్టి అన్నది తన తర్వాతేనని, పీ-4 అంటే పేదలను భాగ్యవంతులను చేసే స్కీములన్నీ తన వద్ద ఉన్నాయని, తన మంత్రజాలంతో అన్నిటిని మార్చి వేస్తానని చంద్రబాబు చెబితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాన, తందానా అన్నారా? లేదా? ఇక చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏమి చెప్పారు. తన వద్ద అన్ని లెక్కలు ఉన్నాయని, అన్ని స్కీములు అధికారం వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని, ఒకవేళ అమలు చేయలేకపోతే చొక్కా కాలర్ పట్టుకోండని ఓపెన్ గా చెప్పారా? లేదా? ఇప్పుడేమో ఎవరైనా హామీలను గుర్తు చేసినా, ప్రశ్నించినా, వారిపై రెడ్ బుక్ అంటూ కేసులతో వేధిస్తున్నారే! అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ ‘రెడ్ బుక్’ను పిచ్చి కుక్కలతో పోల్చుతున్నారు. అవి ఎప్పుడు ఎవరిని కరుస్తాయో చెప్పలేం. లోకేష్ అర్థం చేసుకోవల్సింది ఏమిటంటే.. ఆ పిచ్చికుక్క ప్రమాదం టీడీపీకి కూడా పొంచి ఉంది. జీఎస్డీపీ 15 శాతం చొప్పున పెరిగితేనే స్కీములు అమలు చేస్తారట. ప్రజలు అర్థం చేసుకోవాలట. గత ప్రభుత్వం అప్పులు చేసిందని పదే, పదే గోబెల్స్ ప్రచారం కొనసాగించారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని, దానికి వైసీపీ కారణమని తప్పుడు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడ్జెట్ లో రూ.ఏడు లక్షల కోట్లు అని వారే చెప్పారు. అందులో కూడా విభజన నాటి అప్పు, చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పు కలిపి మూడున్నర లక్షల కోట్లు ఉన్న సంగతిని దాచేస్తారు. జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచం అంతటిని గడగడలాడించిన కరోనా విషయాన్ని ఏమార్చి అప్పులు అని ఊదరగొడతారు. ఏపీ శ్రీలంక మాదిరి మారిందని ఆరోజుల్లోనే ప్రచారం చేశారు. కానీ ఎన్నికల హామీలు ,సూపర్ సిక్స్ ప్రకటించడానికి మాత్రం చంద్రబాబుకు ఇవేవి అడ్డు కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించి హామీలు అమలు చేస్తామని మాటవరసకైనా అనలేదు. పైగా తమ అంత మొనగాళ్లే లేరని డబ్బా కొట్టుకున్నారు. 2014లో విభజిత ఏపీ అప్పులపై వడ్డీ కింద ఏడాదికి రూ.7488 కోట్లు వ్యయం చేస్తే, చంద్రబాబు టరమ్ పూర్తి అయ్యే 2018 నాటికి వడ్డీ చెల్లింపులు రూ.15342 కోట్లకు చేరింది. అంటే టీడీపీ హయాంలో ఎంత అప్పు తెచ్చింది తెలియడం లేదా? అయినా దాన్నంతటినీ వైసీపీ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తుంటారు. తాజాగా చంద్రబాబు సర్కార్ మరో రూ. 6,000 వేల కోట్ల అప్పు సేకరిస్తోంది. పోనీ ఆదాయపరంగా పరిశీలించినా జగన్ పాలనలోనే అధికంగా కనిపిస్తుంది. జగన్ పాలన కాలంలో జీఎస్డీపీ, జీఎస్టీ వంటి వాటిలో ఏపీ దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉంది. అప్పట్లో 12 శాతం వృద్ది కనిపిస్తే, చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో ఆదాయం - ఆరు శాతంగా ఉంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నమాట. కాగ్ గణాంకాల ప్రకారం 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర ఆదాయంలో ఏకంగా 185 శాతం లోటు నమోదైందని మీడియాలో వార్తలు వచ్చాయి. టీడీపీ బడ్జెట్ లో రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే, డిసెంబర్ వరకు 1.13 లక్షల కోట్లే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు,అమ్మకం పన్ను ఇలా అన్ని అంశాలలో నెగిటివ్ గ్రోత్ నమోదు చేసుకుంది. సంపద సృష్టిస్తానని హోరెత్తించిన చంద్రబాబు ప్రభుత్వం సాధించింది ఏమిటంటే ఉన్న సంపదను కూడా కోల్పోవడం అన్నమాట. పోనీ అప్పులు ఏమైనా తగ్గాయా అంటే లేదు. డిసెంబర్ వరకు రూ.డెబ్బై వేల కోట్లకు పైగా తీసుకు వచ్చారు. అది కాకుండా ఇతరత్రా మరో రూ.ఏభై వేల కోట్లకు పైగా అప్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క అమరావతికే రూ.31వేల కోట్ల అప్పు సమకూర్చుకోవడానికి సన్నద్దం అవుతున్నారు. ఇదంతా ఏపీ ప్రజలు తీర్చవలసిన రుణాలే. పోనీ పరిశ్రమలు ఏమైనా కొత్తగా వస్తున్నాయా అంటే అదీ లేదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు దావోస్ వెళ్లి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే, చంద్రబాబు అండ్ కో భారీ బృందంతో వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. దీనికి కారణం రెడ్ బుక్ పేరుతో పారిశ్రామికవేత్తలను వేధించడం, జిందాల్ వంటివారిని టీడీపీ ప్రభుత్వం తరిమేయడం కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు స్కీములు అమలు చేయలేమని ఇంత ఓపెన్ గా చెబుతున్నా, జనసేన పక్షాన ఉప ముఖ్యమంత్రి పవన్ నోరు విప్పకపోవడం. సీజ్ ద షిప్ అని, తోలు తీస్తామని అంటూ డంబాలు పలుకుతూ ఇన్ని రోజులు తిరిగిన పవన్.. సూపర్ సిక్స్ , ఎన్నికల ప్రణాళిక హామీల గురించి చంద్రబాబు చేతులెత్తేసినట్లుగా మాట్లాడినా ప్రశ్నించలేకపోతున్నారు. రెడ్ బుక్ గురించి సదే,పదే మాట్లాడే లోకేష్ కూడా.. తండ్రి మాదిరే బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కీములు అమలు చేయకపోతే చొక్కా కాలర్ పట్టుకోవచ్చన్న ఆయన హామీ ప్రకారం.. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ లను నిలదీయవచ్చా!. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్