
వ్యక్తిగత గోప్యత హక్కు కోసం నినదిస్తే చంద్రబాబు ప్రభుత్వం
కక్షసాధింపు.. పత్రికపై కేసు నమోదు చేయాలని ఆర్టీజీఎస్‌కు ఆదేశం
కేసు వేసేందుకు పీపీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం నినదిస్తున్న ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతి రేక విధానాలను నిలదీస్తున్న ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులకు తెగబడుతోంది. రెడ్‌బుక్ కుట్రలో తాజా అంకంగా.. కేసు నమోదు చేయాలని రియ ల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌టీజీఎస్)ను ఆదేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
‘వాట్సాప్ గవర్నెన్స్’ విధానం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ యాప్ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించేదిగా ఉందని పలువురు నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో.. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కు పరిరక్షణకు బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా సాక్షి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్పందించింది.
‘మన మిత్ర.. మరో మారీచుడు’ శీర్షికన గతనెల 3న ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ అంశాలను కూడా ఇందులో ప్రస్తావించింది. ఆ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇప్పటికే అమాంతంగా పెరిగిపోతున్న సోషల్ మీడియా వేధింపులు, సైబర్ నేరాలు బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం వాటిల్లే పరిస్థితి తలెత్తడం అందర్నీ ఆందోళనపరిచింది. కానీ, ఆ కథనం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. ‘సాక్షి’ పత్రికపై కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసు వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment