Sakshi News Paper
-
గుండెపోటుతో ‘సాక్షి’ ఉద్యోగి మృతి
ఖైరతాబాద్(హైదరాబాద్): గుండెపోటుతో సాక్షి దినపత్రికలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతానికి చెందిన పి.శేషాచలపతిరావు(55) కుటుంబ సమేతంగా హైదరాబాద్ నగరానికి విచ్చేసి అల్వాల్‌లో నివాసముంటూ బంజారాహిల్స్‌లోని సాక్షి దినపత్రిక కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో బస్టాప్‌లోని ఫుట్‌పాత్‌పై పడిపోయాడు. అచేతనంగా పడి ఉన్న ఆయనను ప్రయాణికులు గమనించి 100 డయల్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్ఐ అమర్నాథ్, ఏఎస్ఐ శ్రీరాములు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. వివరాల కోసం ఆరా తీయగా బ్యాగులో సాక్షి దినపత్రిక ఐడీ కార్డు, బస్ పాస్ లభించాయి. దీంతో కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి, వారంతా వైజాగ్‌కు వెళ్లినట్లు తెలుసుకొని భార్య, బావమరిది, వదినకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
అసెంబ్లీలో అప్పు లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల | మధ్య వాగ్వాదం
-
దూసుకెళ్తున్న సాక్షి
-
దేశంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికల్లో ఎనిమిదో స్థానంలో ‘సాక్షి’
సాక్షి, అమరావతి: ‘సత్యమేవ జయతే’ నినాదంతో తెలుగు నేలపై 2008 మార్చి 23వతేదీన ప్రారంభమైన ‘సాక్షి’ పత్రిక ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతోంది. ఉన్నది ఉన్నట్టుగా.. నాణానికి రెండో వైపు వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ‘సాక్షి’ అశేష పాఠకాదరణతో తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ నిర్వహించిన ఆడిటింగ్‌లో నిత్యం 12,47,492 కాపీలతో (15,480 వేరియంట్ సహా) దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రికల్లో ‘సాక్షి’ ఎనిమిదో స్థానంలో నిలిచింది.ఆంధ్రప్రదేశ్‌లో 8,66,582, తెలంగాణలో 3,71,947, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ మెట్రో ఎడిషన్లలో 8,963 సర్క్యులేషన్‌తో ‘సాక్షి’ పాఠకాదరణలో దూసుకెళ్తున్నట్లు ఏబీసీ వెల్లడించింది. తొలి మూడు స్థానాల్లో హిందీ పత్రికలుతాజాగా ఏబీసీ నిర్వహించిన ఆడిటింగ్‌లో హిందీ పత్రికలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దైనిక్ భాస్కర్ (హిందీ) పత్రిక 30,73,304 సర్క్యులేషన్‌తో అగ్రస్థానంలో నిలిచింది. 24,42,728 సర్క్యులేషన్‌తో దైనిక్ జాగరణ్ (హిందీ) రెండో స్థానంలో నిలవగా.. అమర్ ఉజాలా (హిందీ) 17,05,529 సర్క్యులేషన్‌తో మూడో స్థానంలో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా (ఇంగ్లీష్) నాలుగో స్థానంలో నిలిచింది. -
‘సాక్షి’పై కక్ష.. అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: సాక్షి పత్రికపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. విజయవాడ వరదల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. వరదల్లో అవినీతి చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. పేదలకు, నష్టపోయిన వారికోసం వచ్చిన విరాళాల్లోనూ అవినీతి చేశారని.. ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ, ప్రజాసంఘాలపై ఎదురుదాడి చేశారంటూ దుయ్యబట్టారు.‘‘మీడియా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది. సాక్షి పత్రిక, ఎడిటర్ మురళిపై కేసులు పెట్టడం దుర్మార్గం. సాక్షి టీవీని ఆపేయాలంటూ సాక్షాత్తూ మంత్రులే పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజాగొంతుకను నొక్కేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా నిరంతరం మేం ప్రజల పక్షాన పోరాడతాం. మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.సాక్షిని టార్గెట్ చేయడం సరికాదు: మేయర్ రాయన భాగ్యలక్ష్మివరదల్లో అవినీతి జరిగిందని అందరికీ తెలుసు. ఎంతో కొంత అవినీతి జరగకుండా ఎలా సాధ్యమని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే చెబుతున్నారు. వరదల్లో ఎంత ఖర్చుపెట్టారా లెక్కలిచ్చింది కూడా వాళ్లే. ఎన్యుమరేషన్ జరగలేదని వరద బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కలెక్టరేట్ వద్ద నిత్యం వందల్లో బాధితులు ధర్నాలు చేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛ లేకుండా అణగదొక్కాలని చూస్తున్నారు. ప్రజలకు నిజం తెలియజేసే ఏకైక మీడియా సాక్షి మాత్రమే. సాక్షి మీడియాను టార్గెట్ చేయడం సరికాదు.చంద్రబాబు నియంతృత్వానికి ఇది నిదర్శనం: మల్లాది విష్ణు రాష్ట్రంలో ప్రజలపక్షం , ప్రతిపక్షం ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. సాక్షి పత్రికపై ప్రైవేట్ వ్యక్తులతో కేసులు పెట్టించడం పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు. ప్రభుత్వ రాక్షసత్వానికి..నియంతృత్వానికి ఇది నిదర్శనం. గత ఐదేళ్లలో వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియాలో ఎన్నో అసత్య కథనాలు ప్రచురించారు. గతంలో ఏనాడైనా ఇలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డామా?. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయించి కేసులు పెట్టించామా?. తప్పుడు ఆరోపణలపై సాక్షి పత్రిక ద్వారా వాస్తవాలను తెలియజేశాం. సాక్షి లేకపోతే ఏపీలో ప్రజలకు నిజాలు.. వాస్తవాలు తెలిసే పరిస్థితి ఉండదుప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కక్ష సాధింపు పెరిగిపోయింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్నారు. సాక్షి పత్రికపై కేసు పెట్టడం అమానుషం. మీ తప్పులను ఎత్తిచూపిస్తున్నందుకు ప్రైవేట్ కేసులు వేయడం సరికాదు. కేబుల్ టీవీలో సాక్షి ప్రసారాలను నిలిపివేశారు. వరదల్లో అనేక మంది నష్టపోయారు. వరద బాధితులకు అండగా నిలిచిన సాక్షిపై కేసులు పెట్టడం దుర్మార్గం. తక్షణమే సాక్షిపై పెట్టిన కేసులు ఎత్తేయాలి. -
సాక్షి పత్రికపై కేసులు.. సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ
-
KSR Live Show: ప్రకటనల ఆరోపణలపై చంద్రబాబుకు దిమ్మదిరిగేలా కౌంటర్..
-
హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ‘ఈనాడు’ అసత్య ఆరోపణలు
సాక్షి, అమరావతి: ‘సాక్షి’ దినపత్రిక తన సర్కులేషన్ పెంచుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ‘ఈనాడు’ అడ్డగోలుగా చేస్తూ వచ్చిన ఆరోపణలు అసత్యమని ఢిల్లీ హైకోర్టు సాక్షిగా తేలిపోయాయి. వలంటీర్లు విస్తృత సర్క్యులేషన్ కలిగిన ఏ దినపత్రికనైనా కొనుగోలు చేయవచ్చంటూ ప్రభుత్వం జీవో జారీ చేయగా దీనివల్ల సాక్షి సర్క్యులేషన్ ఆమాంతం పెరిగిపోయిందంటూ ఈనాడు ప్రమాణపూర్వకంగా చెప్పిన మాటలు, శుద్ధ అబద్ధమని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి. ప్రభుత్వ జీవో వల్ల సాక్షి నిజంగానే లబ్ధి పొంది ఉంటే ఆ పత్రిక సర్క్యులేషన్ మిమ్మల్ని దాటిపోయి ఉండాలి కదా? మరి ఏబీసీ గణాంకాలు మరో రకంగా ఉన్నాయి కదా? అంటూ హైకోర్టు ధర్మాసనం సూటిగా సంధించిన ప్రశ్నలకు ఈనాడు వద్ద సమాధానమే లేకుండా పోయింది. సాక్షి సర్క్యులేషన్ విషయంలో తన ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో చేసేదేమీ లేక ఈనాడు వెనక్కి తగ్గింది. హైకోర్టు సైతం సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించేందుకు అనుమతినిచ్చింది. దీంతో చేసేదేమీ లేక సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించకుండా ఏబీసీని నిరోధించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని ఈనాడు ఉపసంహరించుకుంది. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ దినపత్రికనైనా కొనుక్కునేందుకు వలంటీర్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఈనాడు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంలో తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రతీమ్ సింగ్ ఆరోరా ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జనసేనకు షాకిచ్చిన హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్.. వైఎస్సార్సీపీలో చేరిక
-
ఏపీ విద్యా వ్యవస్థ దేశానికే రోల్ మోడల్..
-
‘సాక్షి’లో ఏం రాశారు..?
కౌటాల(సిర్పూర్): కౌటాల మండలంలో బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కుమురం భీం చౌరస్తాలో గల ఓ టీస్టాల్లో ఆయన కాసేపు సాక్షి పేపర్ చదివా రు. ప్రతిరోజూ దినపత్రికలు చదవడం అలవాటని ఆయన తెలిపారు. అనంతరం స్థానికులు, కార్యకర్తలతో మాట్లాడారు. వ్యాపారం ఎలా ఉందని టీస్టాల్ యజమాని శర్మను అడిగి తెలుసుకున్నారు. తనకు ఇల్లు లేదని, ప్రభుత్వం నుంచి మంజూరు చేయించాలని శర్మ కోరడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. -
నాకు మాస్టర్ గా జీవితం ఇచ్చింది రాకేష్ మాస్టర్
-
చరణ్ అన్న క్యూట్ గ ఉంటాడు..
-
సుఖేష్ చంద్రశేఖర్ చాట్స్‌పై స్పందించిన కవిత
-
ప్రభాస్,ఎన్టీఆర్,చరణ్,బన్నీ వెనుక పడుతున్నబాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్
-
‘సాక్షి’ రక్తదాన శిబిరానికి విశేష స్పందన
లబ్బీపేట(విజయవాడతూర్పు): సాక్షి దినపత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. సాక్షి సిబ్బందితోపాటు శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. సాక్షి 15వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. సాక్షి సిబ్బందితోపాటు విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్ కళాశాల విద్యార్థులు, అజిత్‌సింగ్‌నగర్, సత్యనారాయణపురం, పటమట, ఆటోనగర్ తదితర ప్రాంతాలకు చెందిన శ్రేయోభిలాషులు కలిపి మొత్తం 60 మంది రక్తదానం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రక్తదాన శిబిరం మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని సాక్షి బ్రాంచి మేనేజర్ ఆర్.యశోదరాజ్, క్లస్టర్ ఇన్చార్జి ఎన్.వెంకటరెడ్డి, బ్యూరో ఇన్చార్జి ఒ.వెంకట్రామిరెడ్డి పర్యవేక్షించారు. విశాఖ ఆర్కే బీచ్‌లో చెత్త, వ్యర్థాలు సేకరిస్తున్న సాక్షి సిబ్బంది విశాఖలో ఆర్కే బీచ్‌ను శుభ్రం చేసిన ‘సాక్షి’ సిబ్బంది బీచ్‌రోడ్డు: ‘సాక్షి’ దినపత్రిక 15వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం యూనిట్ ఆధ్వర్యాన ఆర్కే బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ‘సాక్షి’ అడ్మినిస్ట్రేటివ్, ఎడిటోరియల్, రిపోర్టింగ్, యాడ్స్, సర్క్యులేషన్, టీవీ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది గురువారం బీచ్‌లో చెత్త, వ్యర్థాలు సేకరించి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందించారు. విశాఖ సాగరతీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మరింత అందంగా ఉంటుందని, పర్యాటకులను ఆకర్షిస్తుందని ఈ సందర్భంగా విశాఖపట్నం యూనిట్ బ్రాంచి మేనేజర్ చంద్రరావు అన్నారు. -
‘ఏదైనా పత్రిక కొనుగోలుకు ఆర్థిక సాయం’ జీవోలను రద్దు చేయండి
సాక్షి, అమరావతి: విస్తృత సర్కులేషన్ ఉన్న ఏదైనా ఓ దినపత్రికను కొనుగోలు చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్, సెక్రటేరియట్లకు నెలకు రూ.200 మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈనాడు) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ జీవోలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరింది. వలంటీర్లు, సెక్రటేరియట్ల ‘సాక్షి’ దినపత్రిక కోనుగోళ్లను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ (ఏబీసీ)ను ఆదేశించడంతో పాటు నిర్దిష్ట కాలాల్లో సాక్షి పత్రికకు ఇచ్చిన సర్కులేషన్ సర్టిఫికేషన్‌ను పునః సమీక్షించాలని కూడా ఏబీసీని ఆదేశించాలంటూ ఉషోదయ డైరెక్టర్ ఐ.వెంకట్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో పలు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులను, ఏబీసీ సెక్రటరీ జనరల్‌తో పాటు వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డిలతో పాటు వారికి చెందిన కంపెనీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వుల జారీపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 14న మధ్యంతర ఉత్తర్వులపై తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ లోపు ప్రధాన వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పలు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు, ఏబీసీ సెక్రటరీ జనరల్‌తో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈనాడు న్యాయవాదుల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తోసిపుచ్చారు. జీవోలో ఎక్కడా కూడా ప్రభుత్వం సాక్షి దినపత్రికను మాత్రమే కొనాలని చెప్పలేదన్నారు. విస్తృత సర్కులేషన్ ఉన్న ఏ పత్రికనైనా కొనుగోలు చేసే వెసులుబాటు వలంటీర్లకు ఇచ్చిందన్నారు. -
గరం గరం వార్తలు @08:30 Pm 07 డిసెంబర్ 2022
-
ముగిసిన మునుగోడు ఉపఎన్నికల ప్రచారం
-
వైఎస్ఆర్ జిల్లాలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
-
తెలంగాణ రాజ్ భవన్ లో బతుకమ్మ సంబరాలు
-
ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’కి ఆరు బహుమతులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల ఫలితాలను గురువారం ప్రకటించారు. ఇందులో బంగారు తెలంగాణ విభాగంలో సాక్షి దినపత్రిక సూర్యాపేట ఫొటో జర్నలిస్టు అనమల యాకయ్యకు ద్వితీయ బహుమతి, పల్లె, పట్టణ ప్రగతి విభాగంలో సాక్షి హైదరాబాద్ సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎన్.రాజేశ్‌రెడ్డి, ఇదే విభాగంలో సిద్దిపేట సాక్షి ఫొటో జర్నలిస్టు సతీశ్‌లకు కన్సోలేషన్ బహుమతి, అలాగే ఉత్తమ వార్తా చిత్రం విభాగంలో సాక్షి సంగారెడ్డి జిల్లా ఫొటో జర్నలిస్టు బి.శివప్రసాద్‌కు తృతీయ బహుమతి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో సాక్షి దినపత్రిక మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ ఫొటో జర్నలిస్టు వి.భాస్కర్ ఆచారికి తృతీయ బహుమతి, ఇదే విభాగంలో సాక్షి యాదాద్రి ఫొటో జర్నలిస్టు కె.శివకుమార్‌కు కన్సోలేషన్ బహుమతి లభించింది. సమాచార, పౌరసంబంధాల శాఖ వివిధ విభాగాల్లో పోటీలకు జూలై 9న ఎంట్రీలను ఆహ్వానించింది. దీనికి స్పందనగా 96 మంది మొత్తం 1,200 ఫొటోలను ఈ పోటీలకు పంపారు. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.నాగరాజు, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ గోవిందరాజు చక్రధర్, హిందూ దినపత్రిక మాజీ చీఫ్ ఫొటోగ్రాఫర్ హెచ్. సతీష్ సభ్యులుగా ఉన్న కమిటీ విజేతలను ఎంపిక చేసింది. మొదటి బహుమతి కింద రూ. 20,000, ద్వితీయ బహుమతికి రూ.15,000, తృతీయ బహుమతికి 10,000, కన్సోలేషన్ బహుమతికి రూ.5,000 నగదు అలాగే జ్ఞాపిక, సర్టిఫికెట్ అందచేస్తారు. ఈనెల 25న విజేతలకు బహుమతులను అందచేస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చెప్పాడంటే చేస్తాడంతే..!!
-
ప్రభుత్వ పాఠశాలలపై ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాసింది
-
హైదరాబాద్ రాంగోపాల్ పేట్ తకీల పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి