విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయంలో రక్తదానం చేస్తున్న దృశ్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): సాక్షి దినపత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. సాక్షి సిబ్బందితోపాటు శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.
సాక్షి 15వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. సాక్షి సిబ్బందితోపాటు విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్ కళాశాల విద్యార్థులు, అజిత్‌సింగ్‌నగర్, సత్యనారాయణపురం, పటమట, ఆటోనగర్ తదితర ప్రాంతాలకు చెందిన శ్రేయోభిలాషులు కలిపి మొత్తం 60 మంది రక్తదానం చేశారు.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రక్తదాన శిబిరం మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని సాక్షి బ్రాంచి మేనేజర్ ఆర్.యశోదరాజ్, క్లస్టర్ ఇన్‌చార్జి ఎన్.వెంకటరెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి ఒ.వెంకట్రామిరెడ్డి పర్యవేక్షించారు.
విశాఖ ఆర్‌కే బీచ్‌లో చెత్త, వ్యర్థాలు సేకరిస్తున్న సాక్షి సిబ్బంది
విశాఖలో ఆర్‌కే బీచ్‌ను శుభ్రం చేసిన ‘సాక్షి’ సిబ్బంది
బీచ్‌రోడ్డు: ‘సాక్షి’ దినపత్రిక 15వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం యూనిట్ ఆధ్వర్యాన ఆర్‌కే బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ‘సాక్షి’ అడ్మినిస్ట్రేటివ్, ఎడిటోరియల్, రిపోర్టింగ్, యాడ్స్, సర్క్యులేషన్, టీవీ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది గురువారం బీచ్‌లో చెత్త, వ్యర్థాలు సేకరించి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందించారు. విశాఖ సాగరతీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మరింత అందంగా ఉంటుందని, పర్యాటకులను ఆకర్షిస్తుందని ఈ సందర్భంగా విశాఖపట్నం యూనిట్ బ్రాంచి మేనేజర్ చంద్రరావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment