Red cross society
-
గాజాకు ఇజ్రాయెల్ డెడ్లీ వార్నింగ్
గాజాను గుప్పిట పట్టిన ఇజ్రాయెల్ సైన్యం .. అక్కడి ప్రజల విషయంలో అత్యంత కఠిన వైఖరిని అవలంభించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ సమాజం పిలుపు ఇచ్చినా సరే మానవతా దృక్ఫథంతో వ్యవహరించేది లేదని తేల్చేసింది. బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్ని హమాస్ విడుదల చేసేదాకా.. గాజా పౌరులకు కనీసం మంచి నీళ్లు కూడా అందవని స్పష్టం చేసింది. మంచి నీరు, కరెంట్ కోతతో గాజా ప్రజలు అల్లలాడిపోతున్నారంటూ గాజా క్షేత్రస్థాయి పరిస్థితులపై కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో.. కనికరించి మానవతా సాయానికి ముందుకు రావాలంటూ రెడ్ క్రాస్ ఇజ్రాయెల్‌ను అభ్యర్థించింది. మరికొన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్‌ను ఇదే కోరాయి. అయితే ఈ పిలుపుపై ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘గాజాకు మానవతా సాయమా?.. ఎట్టి పరిస్థితుల్లో అది వీలు పడదు. బంధీలుగా ఉంచిన ఇజ్రాయెల్ పౌరులు సురక్షితంగా ఇంటికి చేరేంత వరకు గాజా ప్రజలకు కరెంట్, మంచి నీళ్లు.. మనుషులకే కాదు ఆఖరికి అక్కడి వాహనాలు కదిలేందుకు కావాల్సిన చమురు కూడా అందదు. మాకు ఎవరూ నీతులు బోధించకండి’’ అని స్పష్టం చేశారాయన. శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూప్ మెరుపుదాడి తర్వాత.. గాజా స్ట్రిప్‌లో మొత్తం 150 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని, విదేశీయుల్ని తమ బంధీలుగా ఉంచుకుంది. ఆ తర్వాత జరుగుతున్న పరస్పర దాడులతో భాగంగా.. గాజాను పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించుకుంది. ఇందుకు కోసం జరిపిన దాడుల్లో 1200 మందిని చంపింది. 5వేల మందిని గాయపర్చింది. ఇక ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పవర్ ప్లాంట్ ఇంధనం కొరత కారణంగా పని చేయడం ఆగిపోయింది. దీంతో ఆస్పత్రులకు సైతం కరెంట్ సరఫరా నిలిచిపోయి.. పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్‌క్రాస్ సానుకూలంగా స్పందించాలంటూ ఇజ్రాయెల్‌ను కోరుతోంది. -
రక్తదానం జీవన దానమే!
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, దీనిపై అపోహలను తొలగించి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రక్తదానం అంటే జీవన దానమే అని స్పష్టం చేశారు. కృత్రిమ శ్వాస పరిజ్ఞానం (సీపీఆర్) పట్ల ప్రజల్లో విస్తృత అవగావన కల్పించాలన్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ సొసై టీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఏటా ఒకసారైనా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె 50సార్లకుపైగా రక్తదానం చేసిన దాతలు, అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను టీసీఎస్, ఎస్బీఐ స్టాఫ్ కళాశాల, ఉస్మానియావర్సిటీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ హనుమకొండ, నిజామాబాద్ యూనిట్లు ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను పొందడాన్ని అభినందిస్తూ ఇందుకు కృషి చేసిన స్థానిక ప్రతినిధులు డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి, ఈవీ శ్రీనివాస్, బుస్సా అంజన్నకు సైతం ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 139 సార్లు రక్తదానం చేసిన అంజయ్య, 50 సార్లు రక్తదానం చేసిన అతడి భార్య పి.మనోరమతో పాటు కొత్తగా పెళ్లైన దంపతులు కుర్రె సిద్ధార్్థ, శ్రీలేఖ, మరో పీజీ వైద్య విద్యార్థిని ఈ కార్యక్రమంలో రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ తెలంగాణ చైర్మన్ అజయ్‌మిశ్రా, వైస్ చైర్మన్ సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలి రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. బుధవారం ఆమె రాజ్‌భవన్‌లో ఎన్ఐఆర్డీ, పీఆర్ సీనియర్ అధికారులతో కేంద్ర ప్రాయోజిత పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటివనరుల మ్యాపింగ్‌తోపాటు వాటి నిర్వహణ, పునరుజ్జీవనానికి ప్రాధాన్యతతో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వయం సహాయక బృందాల మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కష్టసాధ్యంగా మారుతున్నందున ప్రపంచస్థాయిలో ప్రత్యేకంగా ఈ–మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే దిశలో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. -
‘సాక్షి’ రక్తదాన శిబిరానికి విశేష స్పందన
లబ్బీపేట(విజయవాడతూర్పు): సాక్షి దినపత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. సాక్షి సిబ్బందితోపాటు శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. సాక్షి 15వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. సాక్షి సిబ్బందితోపాటు విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్ కళాశాల విద్యార్థులు, అజిత్‌సింగ్‌నగర్, సత్యనారాయణపురం, పటమట, ఆటోనగర్ తదితర ప్రాంతాలకు చెందిన శ్రేయోభిలాషులు కలిపి మొత్తం 60 మంది రక్తదానం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రక్తదాన శిబిరం మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని సాక్షి బ్రాంచి మేనేజర్ ఆర్.యశోదరాజ్, క్లస్టర్ ఇన్చార్జి ఎన్.వెంకటరెడ్డి, బ్యూరో ఇన్చార్జి ఒ.వెంకట్రామిరెడ్డి పర్యవేక్షించారు. విశాఖ ఆర్కే బీచ్‌లో చెత్త, వ్యర్థాలు సేకరిస్తున్న సాక్షి సిబ్బంది విశాఖలో ఆర్కే బీచ్‌ను శుభ్రం చేసిన ‘సాక్షి’ సిబ్బంది బీచ్‌రోడ్డు: ‘సాక్షి’ దినపత్రిక 15వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం యూనిట్ ఆధ్వర్యాన ఆర్కే బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ‘సాక్షి’ అడ్మినిస్ట్రేటివ్, ఎడిటోరియల్, రిపోర్టింగ్, యాడ్స్, సర్క్యులేషన్, టీవీ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది గురువారం బీచ్‌లో చెత్త, వ్యర్థాలు సేకరించి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందించారు. విశాఖ సాగరతీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మరింత అందంగా ఉంటుందని, పర్యాటకులను ఆకర్షిస్తుందని ఈ సందర్భంగా విశాఖపట్నం యూనిట్ బ్రాంచి మేనేజర్ చంద్రరావు అన్నారు. -
2024 నాటికి క్షయరహిత తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: 2025 నాటికి క్షయరహిత దేశం సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో క్షయ నిర్మూలనకు విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహించాలని రెడ్‌క్రాస్ వలంటీర్లను గవర్నర్ తమిళిసై కోరారు. 2024 నాటికి క్షయరహిత తెలంగాణ సాధించాలని ఆమె లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆమె మంగళవారం రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం, మందులు అందించడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే, అన్ని జిల్లాల రెడ్‌క్రాస్ శాఖలకు ఎన్నికలు జరపాలని, మండల, డివిజన్ స్థాయిల్లో రెడ్‌క్రాస్ శాఖలను ఏర్పాటు చేయాలని గవర్నర్ సూచించారు. జూనియర్, యూత్ రెడ్‌క్రాస్, యాక్టివ్ వలంటీర్ల నమోదుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. -
దొడ్డ మనస్సులు వారిని నడిపిస్తున్నాయ్
విధి వారి జీవితాల్లో విషాదం నింపింది. దొడ్డ మనస్సులు వారిని నడిపిస్తున్నాయి. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో కాళ్లు కోల్పోయి వీల్ చైర్లకు.. పాకడానికి పరిమితమైన వారిని కృత్రిమ కాళ్లు నడిపిస్తున్నాయి. జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఎంతో మంది నిర్భాగ్యులకు జైపూర్ కృత్రిమ కాళ్లు, చేతులు అందిస్తోంది. మూడు రోజులుగా దివ్యాంగులు కృత్రిమ అవయవాల కోసం కొలతలు ఇచ్చేందుకు తరలివచ్చారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని ఆనంద పరవశులు అవుతున్నారు. నెల్లూరు (అర్బన్): సేవకు ప్రతి రూపం పేరును సార్థకం చేస్తూ జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దివ్యాంగులకు నాలుగైదేళ్లకోసారి జైపూర్ కృత్రిమ కాలు, చేతులు అందిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్లకు పైగా కృత్రిమ అవయవాలు పొందేందుకు దివ్యాంగులకు బ్రేక్ పడింది. దెబ్బతిన్న కృత్రిమ అవయవాలను మార్చుకోవాలనుకునే అభాగ్యులు, కొత్తగా ప్రమాదాలు, జబ్బుల కారణంగా కాలు, చేయి పోగొట్టుకున్న వారు కృత్రిమ అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సారథ్యంలో కలెక్టర్ చక్రధర్‌బాబు సహకారంతో ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు సుమారు 600 మందికి పైగా దివ్యాంగులకు జైపూర్ కృత్రిమ కాలు, చేయి ఏర్పాటు చేసేందుకు పూనుకోవడం రెడ్‌క్రాస్ తొలిసారిగా ఈ బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించింది. దివ్యాంగుల జీవితాల్లో కొంత మేరకైనా వెలుగులు ప్రసాదించేందుకు పూనుకుంది. ఈ శిబిరాన్ని కలెక్టర్ చక్రధర్‌బాబు ప్రారంభించి అభినందించారు. సుమారు 600 మందికి ఉపకరణాలు అనేక మంది దివ్యాంగులు కృత్రిమ అవయవాలను కావాలని అడుగుతుండడంతో రెడ్‌క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ విషయాన్ని కలెక్టర్ చక్రధర్‌బాబు వద్దకు తీసుకెళ్లి 200 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ 200 మంది కాదు కనీసం 500 మందికైనా కృత్రిమ అవయవాలు ఇవ్వండి.. అంటూ ప్రోత్సహించారు. ఈ క్రమంలో 500 మందికి కృత్రిమ కాలు, చేతులను ఏర్పాటు చేసేందుకు ఈ నెల 23 నుంచి స్థానిక మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న రెడ్‌క్రాస్ కార్యాలయంలో మూడు రోజుల పాటు కొలతలు తీసుకునేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే తొలి రోజే 540 మంది తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సుమారు 600 మించివచ్చని రెడ్‌క్రాస్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. సంస్థల సహకారం భేష్ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి రాయచూరుకు చెందిన రాజ్మల్ కేమ్ భండారి ఫౌండేషన్, జైపూరుకు చెందిన భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయతా సమితి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. తాము 1000 మందికైనా కృత్రిమ కాలు, చేయి అమర్చేందుకు సాయం చేస్తామంటూ ముందుకువచ్చాయి. వీరి సేవా నిరతికి దివ్యాంగులు తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రూ 1.50 కోట్ల ఖర్చు రెడ్‌క్రాస్ సంస్థ భోజనం, ఇతర వసతుల కోసం చేసే ఖర్చుతో పాటు ఫౌండేషన్ సంస్థలు అందించే కృత్రిమ కాలు, చేతుల ఏర్పాటుకయ్యే ఖర్చును పరిశీలిస్తే సుమారు రూ 1.50 కోట్లు ఖర్చు కానుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఊహించిన వారి కన్నా ఎక్కువ మంది వస్తుండటంతో ఖర్చు కూడా పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. రెడ్‌క్రాస్ సంస్థకు రుణపడి ఉంటా నేను నెల్‌కాస్ట్ కంపెనీలో కార్మికుడిని. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో 5 నెలల క్రితం నా కాలును డాక్టర్లు తొలగించారు. దీంతో ఇంటికే పరిమితమయ్యాను. జైపూర్ కాలు గురించి వినడమే తప్ప ఎవరి వద్దకు వెళ్లి ఏర్పాటు చేయించుకోవాలో తెలియలేదు. రెడ్‌క్రాస్ నా విషయం తెలుసుకుని కృత్రిమ కాలు ఏర్పాటు శిబిరానికి రావాలని నా ఫోన్‌కు మెసేజ్ పంపించారు. ఇప్పుడు వచ్చి కొలతలు ఇచ్చాను. నన్ను పిలిపించి కృత్రిమ కాలు ఏర్పాటు చేయిస్తున్న రెడ్‌క్రాస్ వారికి రుణపడి ఉంటా. – కాకాణి రామకృష్ణ, బత్తలాపురం, ఓజిలి మండలం ఏడు నెలల క్రితమే ప్రణాళిక కొంత మంది తమకు కృత్రిమ చేయి, కాలు ఏర్పాటు చేయమని కోరారు. అవయవాలు కోల్పోయిన దివ్యాంగులకు జైపూర్ కాలు చేయి ఏర్పాటు చేయించాలని 7 నెలల క్రితమే అనుకున్నాం. తమ పాలకవర్గ సభ్యులతో చర్చించాను. అందరి సహకారంతో కలెక్టర్‌కు తెలిపాం. కలెక్టర్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. రాజ్మల్ కేమ్ భండారి ఫౌండేషన్, భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయతా సమితి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయించాం. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ నాలాంటి పేదకు వరం కృత్రిమ కాలు నేను లారీ క్లీనర్‌ను. నాకు జరిగిన ప్రమాదంలో 2014లో ఆపరేషన్ చేసి డాక్టర్లు కాలు తీసేశారు. తర్వాత కొంత మంది దాతలు లోకల్‌గా తయారైన కాలును అమర్చారు. అయితే అది సెట్ కాలేదు. స్టీలు రాడ్ కూడా ఇచ్చారు. సెట్ కాలేదు. విధిలేని పరిస్థితుల్లో ఇంటికే పరిమితమయ్యాను. అయితే ఇప్పుడు రెడ్‌క్రాస్ ఖరీదైన, క్వాలిటీ ఉన్న జైపూర్ కాలును ఏర్పాటు చేసేందుకు కొలతలు తీసుకున్నారు. నాలాంటి పేదకు కృత్రిమ కాలు వరం. – ఎస్కే సందాని, వెంకటేశ్వరపురం, నెల్లూరు కందుకూరు రామమ్మ.. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఈమె కూలి పని చేసుకునే నిరుపేదరాలు. దురదృష్టవశాత్తు ఆమెకు డయాబెటీస్ మిల్లిటస్ (షుగర్) వ్యాధికి గురైంది. షుగర్ కంట్రోల్ తప్పింది. కాలుకు గాయమై రక్త సరఫరా తగ్గిపోయింది. దీంతో రక్తసరఫరా తగ్గిన వరకు కాలును తీసేయాలని లేదంటే మిగతా కాలు కూడా పనికి రాదని డాక్టర్లు తెలిపారు. బాధాకరమైనప్పటికీ ఆమెకు డాక్టర్లు ఆపరేషన్ చేసి ఒక కాలును తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు మించి పోయింది. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైంది. నడిచేందుకు వీలులేకుండా పోయింది. రెడ్‌క్రాస్ ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల శిబిరం గురించి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతం వెందోడుకు చెందిన రామమ్మ చెల్లెలు కుమార్తె పావనికి తెలిసింది. దీంతో పావని తమ పిన్నిని నెల్లూరు రెడ్‌క్రాస్ కార్యాలయానికి తీసుకువచ్చింది. కృత్రిమ కాలు ఏర్పాటుకు కొలతలు ఇచ్చింది. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ తనకు కృత్రిమ కాలు కాలు ఏర్పాటు చేస్తే నడుస్తానని ఆనందంగా చెప్పింది. -
‘యువతకు ఏపీ గవర్నర్ పిలుపు’
సాక్షి, విజయవాడ: రెడ్ క్రాస్ సొసైటీ గిన్నిస్ రికార్డ్ సాధించేందుకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఎనిమిది గంటలు నిర్విరామంగా రక్తదానం కోసం సంతకాల సేకరణ చేపట్టడం శుభపరిణామం అని ఆయన తెలిపారు. లయోలా కళాశాలలోని దేవయ్య మెమోరియల్ ఆడిటోరియంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా 97 మిలియన్ల వాలంటీర్లను రెడ్ క్రాస్సంస్థ కలిగి ఉందన్నారు. ఏపీలో 13 జిల్లాల్లో 132 శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలో రెడ్ క్రాస్ లక్షా 24 వేల మంది వాలంటీర్లను కలిగి ఉందని ఆయన తెలిపారు. యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. వంద ఏళ్లుగా రెడ్ క్రాస్ సొసైటీ సర్వీస్ చేస్తోందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పేషేంట్లకు రక్తం అందించే అతిపెద్ద స్వచ్చంద సంస్థ రెడ్ క్రాస్ అని గవర్నర్ కొనియాడారు. రక్త దాతల నమోదు ప్రక్రియాలో పాల్గొని విద్యార్థులు ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల నుండి సంతకాల సేకరించి 28 రోజుల్లో రాష్టంలో ఏ రెడ్‌క్రాస్ బ్రాంచ్‌లో అయినా రక్తాన్ని డోనేట్ చేసేలా సొసైటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎనిమిది గంటల పాటు నిర్విరామంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిన్నిస్ రికార్డులో 30 కళాశాల విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొని.. 1500 వందల సభ్యుత్వాలు నమోదు చేశారు. దీంతో గిన్నిస్ రికార్డ్ సాధ్యమని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి రిషి తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు ఎంపీ కేశినేని నాని, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
‘మెడికల్ కాలేజి జిల్లా ప్రజల చిరకాల కోరిక’
సాక్షి, పశ్చిమ గోదావరి: గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని మంత్రి ఆళ్ల నాని ఆన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం మామిళపల్లి జయప్రకాశ్ రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి మేరుగైనా సేవలు అందించాలని ఆయన తెలిపారు. త్వరలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కళశాల ప్రారంభంకానుందని ఆళ్ల నాని వెల్లడించారు. మెడికల్ కాలేజి జిల్లా ప్రజల చిరకాల కోరిక అని ఆళ్ల నాని గుర్తు చేశారు. -
నేటి నుంచి రాష్ట్రపతి దక్షిణాది విడిది
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం నుంచి 28 వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో వార్షిక దక్షిణాది విడిది చేయనున్నారు. ఈమేరకు రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అజయ్‌కుమార్ సింగ్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం రాజ్ భవన్లో రెడ్ క్రాస్ సొసైటీ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్న కోవింద్.. 23న పుదుచ్చేరిలోని పాండిచ్చేరి వర్సిటీ 27వ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. 25న కన్యాకుమారి సందర్శనకు వెళ్లనున్నారు. 27న రాష్ట్రపతి నిలయంలో రాష్ట్ర పాలకులు, అధికారులు, వివిధ రంగాల్లో ప్రముఖులకు ఆయన ఆతిథ్యం ఇవ్వనున్నారు. -
సమష్టి కృషితోనే ఆరోగ్య తెలంగాణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి సమష్టిగా కృషి చేయా లని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భవ పథకాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చన్నారు. సోమవారం హన్మకొండ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో జూనియర్, యూత్ రెడ్ క్రాస్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడా రు. జిల్లాలో తలసేమియా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కాగా, రూ.3.7 లక్షలతో చేపట్టనున్న భవన విస్తరణకు గవర్నర్ శంకు స్థాపన చేశారు. అంతకుముందు గవర్నర్ దంపతులు హన్మకొండలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని, ఖిలా వరంగల్‌లో కాకతీయ కట్టడాలను సందర్శించారు. సౌండ్ అండ్ లైటింగ్ షోను వీక్షించారు. నీటిలో తెలియాడే ఇటుకలను పరిశీలించిన అనంతరం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ లో రాత్రి బస చేశారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తారు. యాదాద్రీశుడిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని సోమవారం గవర్నర్ తమిళిసై కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు గవర్నర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గాంధీలో గవర్నర్ తండ్రికి వైద్య పరీక్షలు గాంధీ ఆస్పత్రి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తండ్రి అనంతన్ (86)కు సికిం ద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ రోగిలా గాంధీ ఆస్పత్రి ఈఎన్టీ విభాగానికి ఆయన వచ్చారు. ఈఎన్టీ విభాగాధిపతి ప్రొఫెసర్ శోభన్‌బాబు.. వినికిడి యంత్రాన్ని అమర్చుకోవాలని సూచించారు. -
రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలి..
సాక్షి, విజయవాడ : రక్తదానంపై యువకులు, విద్యార్థులు మరింత స్పూర్తి నింపుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లయోలా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం వల్ల ఎంతో ప్రాణాలను రక్షించగలుతామన్నారు. పెద్దమొత్తంలో విద్యార్థులు తరలివచ్చి రక్త దానం చేయడం సంతోషంగా ఉందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు జరుతుందని ప్రశంసించారు. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సమయంలో సేవా కార్యక్రమాలు అందించడంలో ముందుంటుందని కొనియాడారు. రక్తదానంపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. సమానత్వం సాధించేలా యువత కృషి చేయాలని సూచించారు. -
రెడ్‌క్రాస్ సొసైటీకి అవార్డుల పంట
కాకినాడ : జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు లభించాయి. వి శాఖలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మ¯ŒS వై.డి.రామారావు, పూర్వ అధ్యక్షుడు డాక్టర్ పి.దుర్గరాజు, కార్యదర్శి సిహెచ్.నరసింహరావు, కోశాధికారి జి.శివరామకృష్ణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నుంచి ఈ అవార్డులు అందుకున్నారు. జిల్లా రెడ్‌క్రాస్ సభ్యులకు 50 స్వర్ణ పతకాలతో పాటు చైర్మ¯ŒS రామారావుకు 2012–13 సంవత్సరానికి గాను సేవా అవార్డు లభించింది. 2013–14కు జి.శివరామకృష్ణ సేవా అవార్డు, పూర్వ అధ్యక్షుడు డాక్టర్ పి.దుర్గరాజుకు బంగారు పతకం అందుకున్నారు. సభ్యత్వాలతోపాటు పలు సేవా కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో 18 అవార్డులలో అత్యధికంగా తూర్పుగోదావరికే దక్కాయని వై.డి.రామారావు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
కర్నూలు రెడ్‌క్రాస్‌కు గోల్డ్‌మెడల్
కర్నూలు(హాస్పిటల్): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కర్నూలు శాఖకు బంగారు పతకం లభించినట్లు ఆ సంస్థ జిల్లా చైర్మన్ జి. శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను విశాఖ పట్టణంలో శుక్రవారం రాత్రి స్టేట్ రెడ్‌క్రాస్ జనరల్ బాడీ మీటింగ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగిందన్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా జిల్లా రెడ్‌క్రాస్‌కు వచ్చిన బంగారు పతకాన్ని తాను అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రాణరక్షణలో ప్రథమ చికిత్స కీలకం
రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణరావు గుంటూరు మెడికల్: ప్రథమ చికిత్స ప్రాణరక్షణలో ఎంతో కీలకమని, ప్రమాదం జరిగిన మొదటి పది నిమిషాలు గోల్డెన్ పీరియడ్‌గా, ఆ సమయం రోగి ప్రాణం నిలపటంలో ఎంతో దోహదపడుతుందని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ గౌరవాధ్యక్షుడు జస్టిస్ డాక్టర్ లక్ష్మణరావు అన్నారు. నాలుగురోజులుగా గుంటూరు జిల్లా పరిషత్ కాంపౌండ్‌లోని రెడ్‌క్రాస్ కార్యాలయంలో జరుగుతున్న ప్రథమ చికిత్స, ప్రథమ స్పందన శిక్షణ శిబిరం ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణ పొందిన వారు ఓర్పుతో, సహనంతో సేవలందించాలని కోరారు. గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ వడ్లమాని రవి మాట్లాడుతూ నవ్యాంధ్రలో రెడ్‌క్రాస్ సేవలు ఇంకా విస్తృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జీవైఎన్ బాబు, తెనాలి కార్యదర్శి భానుమతి, వినుకొండ కార్యదర్శి ప్రసాద్, కో–ఆర్డినేటర్ అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్లుగా మూత.. జీతాల మోత!
రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుల నిర్వాకం మూతపడినా రూ.20 లక్షల జీతాలు చెల్లింపు సాక్షి, గుంటూరు : ఐదేళ్లుగా తలుపులు తెరిచిన దాఖలాలు లేవు.. అందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం నెలనెలా జీతాలు చెల్లిస్తూనే ఉన్నారు.. ఇదీ రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు నిర్వాహకుల నిర్వాకం. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌ను 2005లో గుంటూరు జిల్లాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇందులో నగరానికి చెందిన అనేక మంది ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. 2011 వరకు బ్లడ్‌బ్యాంకును సమర్థవంతంగా నిర్వహించారు. ఎందరో నిరుపేద రోగులకు అతి తక్కువ ధరల్లో వివిధ గ్రూపుల రక్తాన్ని అందించే రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్ ఐదేళ్లుగా మూతపడటంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు చికిత్స నిమిత్తం వచ్చే పేదలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పేద రోగులకు ప్రాణదానం.. రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు గతంలో రోజుకు 35 నుంచి 40 మంది రోగులకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఎందరికో ప్రాణదానం చేసింది. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల కంటే సుమారు రూ.400 తక్కువ ధరకు రక్తాన్ని అందించి నిరుపేద రోగులకు ఊరట కలిగించింది. ప్రస్తుతం ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల్లో బ్లడ్ యూనిట్ ధర రూ.1300 ఉంది. అదే రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌లో యూనిట్ రూ.800 నుంచి రూ.1000 లోపు ధరకే అందించేవారు. బ్లడ్ బ్యాంకు చేస్తున్న సేవలను గుర్తించి అనేక మంది తమ రక్తాన్ని ఇక్కడే ఇచ్చేవారు. బ్లడ్‌బ్యాంకులో బ్లడ్ కాంపోనెంట్ సెపరేట్ మిషన్ పెట్టి ఆధునికీకరణ చేయాలని నిర్ణయించిన కమిటీలోని కొందరు సభ్యులు అందుకు సుమారు రూ.20 లక్షల నిధులు అవసరమవుతాయని గుర్తించారు. దీనితో పాటు బ్లడ్‌బ్యాంకు ఆధునికీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఐదేళ్లుగా మూతబడిన ఈ బ్లడ్‌బ్యాంకును నేటికీ తెరవలేదు. ప్రైవేటు నిర్వాహకుల దోపిడీ... రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు మూతబడటంతో ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పేదలను దోపిడీ చేస్తున్నారు. విషజ్వరాల బారిన పడినవారు ప్లేట్లెట్లు తగ్గిపోయి ప్రాణాపాయ స్థితికి చేరిన సమయంలో వారిని సాధారణ స్థితికి తేవడం కోసం ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ రక్తం నుంచి వేరు చేసేందుకు ప్రత్యేక వైద్య పరికరం అవసరం. ప్లేట్లెట్ల కోసం అధిక మొత్తంలో ప్రైవేట్ బ్లడ్‌బ్యాంక్ నిర్వాహకులు రోగుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. ఐదేళ్లలో రూ.20 లక్షల జీతాల చెల్లింపు.. బ్లడ్‌బ్యాంకు మూతపడి ఐదేళ్లవుతున్నా అందులో పనిచేసే మెడికల్ ఆఫీసర్‌కు నెలకు రూ.10 వేలు చొప్పున, టెక్నీషియన్లు ముగ్గురికి రూ.6 వేలు చొప్పున, సబ్ స్టాఫ్‌కు రూ.15 వేలు చొప్పున జీతాలు చెల్లిస్తూ వస్తున్నారు. వీరు బయట వేరే సంస్థల్లో పనిచేస్తున్నా నెలనెలా జీతాలు అందుతూనే ఉన్నాయి. ఈ విధంగా రూ.20 లక్షల వరకు జీతాల కింద చెల్లించారు. బ్లడ్ కాంపోనెంట్ సెపరేట్ మిషన్ ఏర్పాటు చేయాలంటే రూ.20 లక్షలు నిధులు భారంగా మారిందని మూసివేసిన నిర్వాహకులు.. పనిచేయకుండానే ఉద్యోగులకు జీతాల రూపంలో రూ.20 లక్షల వరకు చెల్లించటం పలు అనుమానాలకు తావిస్తోంది. గత ఏడాది సమావేశం నిర్వహించిన కొందరు నిర్వాహకులు రెండు నెలల్లో బ్లడ్‌బ్యాంకును తెరిచేందుకు చర్యలు చేపడతామంటూ తీర్మానించారు. ఈ సమావేశం జరిగి ఏడాది దాటుతున్నా ఇంతవరకు బ్లడ్‌బ్యాంక్ తెరుచుకోలేదు. ఇప్పటికైనా దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతులు రాగానే తెరుస్తాం.. రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌కు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మూడు నెలల క్రితం బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి తనిఖీలు చేశారు. అనంతరం నివేదికను ఢిల్లీకి పంపారు. ఢిల్లీ నుంచి అనుమతులు రాగానే బ్లడ్‌బ్యాంక్‌ను తెరుస్తాం. సిబ్బందికి జీతాల చెల్లింపు నిజమే. మళ్లీ బ్లడ్‌బ్యాంకు తెరిచినప్పుడు సిబ్బంది అవసరం కాబట్టి చెల్లిస్తున్నాం. – జీవైఎన్ బాబు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ -
రాష్ట్రావతరణ ఏర్పాట్లు చేసుకోవాలి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ శ్రీదేవి మహబూబ్‌నగర్ న్యూటౌన్: జూన్ 2న వైభవంగా నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ టీ.కే. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఏజేసీ బాలాజీ రంజిత్‌ప్రసాద్ అన్ని మండలాల అధికారులతో వీడియోకాన్ఫరెన్స నిర్వహించారు. ఫరూఖ్‌నగర్ మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల ముందు నుంచే గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి జూన్2లోపు పండుగ వాతావరణం తీసుకురావాలని సూచిం చారు. నిర్ణయించిన సమయానికే జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని తెలిపారు. దేవాలయాలు, మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించి రాష్ట్ర అభివృద్ధికి ప్రార్ధనలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో పండ్లు, స్వీట్లు, బట్టలు పంపిణీ చేయాలని, రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నా రు. అమరవీరుల కుటుంబాలను సత్కరించాలని, ప్రధాన కూడళ్లలో స్వాగత తోరణాలు, విద్యుద్దీపాలతో అలంకరించాలని అధికారులకు తెలిపారు. వేడుకల్లో ప్రజా ప్ర తినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, మేధావులు, ప్రజలందరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలన్నారు. కవిసమ్మేళనాలు, ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. అవార్డుల కోసం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారు వెబ్సైట్ జ్ట్టిఞ://్టజఝఛట.ఞ్చ్ఛఠిజీజ్చుట్చఝ.జీ లో దరఖాస్తులను ఈ నెల 22 నుంచి 26 వరకు సమర్పించుకోవాలని సూచించారు. అనంతరం ఏజేసీ బాలాజి రంజిత్ ప్రసాద్ మాట్లాడుతూ త్యాగాల ఫలితంగా రాష్ట్రం సిద్ధించిందని, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వీసీలో డీఆర్ఓ భాస్కర్, డీసీఓ వెం కటేశ్వర్లు, మున్సిపల్ చెర్మైన్ దేవ్‌సింగ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టాల్లో ప్రాణదాత
► రక్తనిధి కేంద్రాల్లో నిండుకున్న నిల్వలు ► రక్తహీన బాధితులకు అందని వైనం ► దాతల సహకారం కోసం ఎదురుచూపు నరసరావుపేట టౌన్ : ప్రాణాపాయంలో ఉన్న వేలాది మందికి రక్తాన్ని అందించిన రక్తనిధిని కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రాణదాతకు బ్లడ్‌ప్యాకెట్‌ల కొరత ఏర్పడింది. సేవల్లో రాష్ట్రంలోనే మొదటగా నిలిచిన నరసరావుపేట ఏరియా వైద్యశాల బ్లడ్‌బ్యాంక్‌లో మొట్టమొదటిసారిగా ఈ పరిస్థితి నెలకొంది. రక్తహీనతతో బాధపడే వారికి సరిపడా బ్లడ్ అందుబాటులో లేకపోవడంతో రక్తనిధి కేంద్రం నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారు. దాతలు ముందుకు రాకుంటే బ్లడ్‌బ్యాంక్ నిర్వహణ కష్టతరంగా మారనుంది. వివరాల్లోకి వెళితే నరసరావుపేట ఏరియా వైద్యశాలలో రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహణలో కొనసాగుతున్న బ్లడ్‌బ్యాంక్‌లో రక్త నిల్వలు అడుగంటాయి. ఈ బ్లడ్‌బ్యాంక్ ద్వారా జిల్లాలోని సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, బాపట్ల బ్లడ్ స్టోరేజ్ సెంటర్లకు రక్తపు నిల్వలు సరఫరా అవుతుంటాయి. ఒక్కొక్క సెంటర్‌కు నెలకు సుమారు 30 నుంచి 40 యూనిట్ల రక్తాన్ని పంపుతుంటారు. వీటితో పాటు ప్రతి రోజు ఏరియా వైద్యశాలలోని రోగులకు 10 నుంచి 20 యూనిట్ల బ్లడ్ అవసరముంది. ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న తెల్లకార్డుదారులు ఈ బ్లడ్‌బ్యాంక్ సేవలనే పొందుతుంటారు. ఎప్పుడూ వంద నుంచి 150 యూనిట్ల బ్లడ్ ఇక్కడ అందుబాటులో ఉండేది.ప్రస్తుతం కేవలం ఒకరోజుకు సరిపడా 20 యూనిట్ల బ్లడ్ మాత్రమే అందుబాటులో ఉంటోంది. దీంతో అత్యవసరమైన వారికి మాత్రమే అందిస్తున్నారు. పేదలు అధిక ధరకు ప్రైవేటు బ్లడ్‌బ్యాంక్‌లలో కొనుగోలు చేయాల్సి వస్తోంది. రెడ్‌క్రాస్ నిర్వహణలో కొనసాగుతున్న గుంటూరు బ్లడ్‌బ్యాంక్ ప్రస్తుతం మూతపడగా, రేపల్లెలో ఉన్న రక్తనిధి కేంద్రంలో బ్లడ్ కొరత ఉందని సమాచారం. క్యాంపుల నిర్వహణ లేమితో... బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పలు కళాశాలల్లో రక్తదాన క్యాంపులు నిర్వహించి విద్యార్థుల వద్ద రక్తాన్ని సేకరిస్తుంటారు. వాటిని బ్లడ్‌బ్యాంక్‌లో భద్రపరచి అవసరమైన వారికి అందిస్తుంటారు. విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో రెండు నెలల నుంచి క్యాంపుల నిర్వహణ సాధ్యంకాలేదు. దీంతో బ్లడ్ సేకరణ కష్టతరంగా మారి ఈ పరిస్థితి తలెత్తినట్లు వైద్యవర్గాలు చెపుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి దాతలు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ముందుకు వచ్చి సేవా తత్పరతతో రక్తదానం చేయాలి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సామాజిక స్పృహ కలవారు వెంటనే రక్తదానం చేయాలి.- డాక్టర్ బాబురెడ్డి,బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి -
ఆఫీసు మూత.. వేతనాలు మోత
మూడేళ్ళుగా ఆ తలుపులు తెరుచుకోలేదు. రక్త నిల్వలూ లేవు. ఎవరికీ సరఫరా కావడం లేదు. ఉద్యోగులు ఎవరూ ఇక్కడ పనిచేయడం లేదు. అయినా వారికి నెలనెలా జీతాలు చెల్లించేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే నాథులు లేరు. ఇదీ గుంటూరులోని రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు నిర్వాహకుల తీరు. సాక్షి, గుంటూరు : జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌లో నగరానికి చెందిన అనేక మంది ప్రముఖులు మెంబర్లుగా ఉన్నారు. చాలా ఏళ్లపాడు ఎంతో సమర్థంగా దీనిని నడిపి ఎందరో నిరుపేద రోగులకు అతి తక్కువ ధరకే వివిధ గ్రూపుల రక్తాన్ని అందించారు. కానీ గడచిన మూడేళ్లుగా ఇది మూతపడింది. ఫలితంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చికిత్స నిమిత్తం వచ్చే అనేక మంది పేద రోగులు రక్తం అందక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గతంలో రోజుకు 35 నుంచి 40 మంది రోగులకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఈ బ్లడ్ బ్యాంకు ఎందరికో ప్రాణదానం చేసింది. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల కంటే సుమారు రూ. 400లు తక్కువ ధరకు రక్తాన్ని అందించి నిరుపేద రోగులకు ఆలంబనగా నిలిచింది. ప్రస్తుతం ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల్లో బ్లడ్ యూనిట్ ధర రూ. 1450లు ఉండగా రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌లో యూనిట్ రూ. 1050లకే అందించేవారు. బ్లడ్ బ్యాంకు చేస్తున్న సేవలను గుర్తించి అనేక మంది తమ రక్తాన్ని ఇక్కడే ఇచ్చేవారు. అయితే బ్లడ్‌బ్యాంకులో కాంపౌనెంట్ సపరేట్గా పెట్టి ఆధునికీకరణ చేయాలని నిర్ణయించిన కమిటీలోని కొందరుసభ్యులు అందుకు సుమారు రూ. 20 లక్షల నిధులు అవసరమవుతాయని గుర్తిం చారు. ఈ మొత్తాన్ని సమకూర్చేవరకు బ్లడ్‌బ్యాంకును మూసివేయాలని నిర్ణయించారు. కానీ పనులు మాత్రం చేపట్టలేదు. పేదల అవసరాలు తీర్చలేదు. మూడేళ్ళల్లో రూ. 15 లక్షల జీతాలు చెల్లింపు బ్లడ్‌బ్యాంకు మూతపడి మూడేళ్ళు గడుస్తున్నా అందులో పనిచేసే మెడికల్ ఆఫీసర్‌కు నెలకు రూ. 10వేలు చొప్పున, టెక్నీషియన్లు ముగ్గురికి రూ. 6వేలు చొప్పున, సబ్ స్టాఫ్‌కు రూ. 15వేలు చొప్పున జీతాలు చెల్లిస్తూ వస్తున్నారు. వీరు బ్లడ్ బ్యాంకు మూసివేయడంతో వేరే చోట హ్యాపీగా పనిచేసుకుంటూ అక్కడ, ఇక్కడా జీతాలు పుచ్చుకుంటున్నారు. ఈ విధంగా మూడేళ్ళల్లో సుమారు రూ. 15 లక్షలు వీరికి జీతాల కింద చెల్లించారు. కాంపోనెంట్ సపరేటర్‌ను ఏర్పాటు చేయాలంటే రూ. 20లక్షలు భారంగా భావించిన నిర్వాహకులకు బ్లడ్‌బ్యాంకులో పనిచేయకుండానే ఉద్యోగులకు రూ. 15లక్షల మేర జీతాలు ఎలా చెల్లించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే కొందరు నిర్వాహకులు గురువారం హడావుడిగా కమిటీ సమావేశం నిర్వహించి రెండు నెలల్లో బ్లడ్‌బ్యాంకును తెరిచేందుకు చర్యలు చేపడతామంటూ తీర్మానించడం గమనార్హం. ఏదేమైనా బ్లడ్‌బ్యాంకుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ స్పందించి బ్లడ్‌బ్యాంకును తెరిచేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
నిండుగా రక్తనిల్వలు
సాక్షి, ఒంగోలు: ప్రజాగొంతుక ‘సాక్షి’ దినపత్రిక జిల్లాలోని బ్లడ్‌బ్యాంకుల్లో రక్తనిల్వలను పెంచడానికి చేసిన కృషి ఫలించింది. జిల్లాలో ప్రస్తుతం రెడ్‌క్రాస్ రక్తనిల్వల కేంద్రాల్లో సరిపడా నిల్వలు పెరిగాయి. ప్రభుత్వ వైద్యకేంద్రాల్లో రక్తనిల్వలు నిండుకున్నాయని గుర్తించిన వెంటనే ‘సాక్షి’ సమరశంఖం పూరించింది. రెడ్‌క్రాస్ సొసైటీ నిల్వల కేంద్రాల పనితీరు..రోజువారీ క్షతగాత్రులకు అవసరమైన రక్తనిల్వల యూనిట్లపై ప్రచురించిన వరుస కథనాలతో అధికార యంత్రాంగంతో పాటు విద్యార్థి, ప్రజా, స్వచ్ఛంద సంఘాలు, వివిధ ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు కదిలాయి. కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ స్వయంగా రెడ్‌క్రాస్ సొసైటీ పనితీరుపై దృష్టిపెట్టి.. ఎప్పటికప్పుడు ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలపై స్పందించి సమీక్షలు చేశారు. కొద్దిరోజుల్లోనే ఆయన జిల్లాలో రక్తనిల్వలను పరిపూర్ణం చేశారు. ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలతో పాటు ఒంగోలు, కందుకూరు, కనిగిరి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకుల్లో అవసరమైనంత మేర రక్తనిల్వలు అందుబాటులోకి వచ్చాయి. అన్నిచోట్లా తెరుచుకున్న కేంద్రాలు.. జిల్లాలో దాదాపు 33 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. కొన్ని ప్రత్యేక ప్రాంతాలు మినహా అన్నిచోట్లా కార్మిక, కర్షక, సామాన్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలే అధికంగా ఉంటాయి. అయితే, జాతీయరహదారి పక్కనే ఉన్న జిల్లాప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలతో పాటు ఫ్లోరైడ్ పీడిత ప్రభావం నేపథ్యంలో రోజూ వందలాది మంది రోగపీడితులు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళల్లో రక్తహీనత సమస్య కూడా అధికంగానే ఉందని గైనిక్ వైద్యనిపుణులు ఇప్పటికే సర్వేల ద్వారా నిగ్గుతేల్చారు. మాతాశిశు మరణాల రేటు ఏమాత్రం తగ్గలేదు. రోడ్డుప్రమాద బాధితులతో పాటు గర్భిణులకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినప్పుడు రక్తం ఎక్కించాలంటే.. నెలకిందటి వరకు కనాకష్టమయ్యేది. రక్తనిల్వల కేంద్రాల్లో రోజుకు సగటున 50 యూనిట్ల రక్తం అవసరం కాగా కేవలం 20 యూనిట్లు అందడం కూడా కష్టమైంది. సరిపడా రక్త నిల్వలు లేనందున రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌స్టోరేజీ కేంద్రాలు కూడా మూతపడిపోయాయి. రెడ్‌క్రాస్ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ చలమయ్య తన పదవికి రాజీనామా చేసి వైదొలగడంతో.. ఈ విషయాన్ని గుర్తించిన ‘సాక్షి’ సమరశంఖం పూరించింది. వరుస కథనాలతో స్పందించిన కలెక్టర్ విజయకుమార్ జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి బాధ్యతలను జెడ్పీసీఈవో ప్రసాద్‌కు అప్పగించారు. ఆ సొసైటీలో ఎక్స్అఫిషియో సభ్యులుగా జిల్లా రెవెన్యూ అధికారితో పాటు స్టెప్ సీఈవో, సీపీవో, డీఎంహెచ్వోలను నియమించారు. మూతపడిన రెడ్‌క్రాస్ కేంద్రాలన్నీ మళ్లీ తెరుచుకున్నాయి. సమష్టి బాధ్యతగా రక్తదాన శిబిరాలు : తొలుతగా జూలై ఎనిమిదో తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ సిబ్బంది యూనిట్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో 183 యూనిట్లు రక్తం అందించారు. కనుమళ్లలోని ఎంఎల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు 63 యూనిట్లు, ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కాలేజీ విద్యార్థులు 26 యూనిట్లు అందజేశారు. అదేవిధంగా ఒంగోలు వాసవీక్లబ్ ప్రతినిధులు 21 యూనిట్లు రక్తదానం చేశారు. చీరాల, వేటపాలెం, కందుకూరు, కనిగిరి రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకుల్లో ప్రస్తుతం సరిపడా రక్తనిల్వలున్నాయి. -
‘మండలి’ సేవలు మరువలేనివి
సంస్మరణ సభలో వక్తల ఉద్ఘాటన ఘనంగా మండలి వెంకటకృష్ణారావు జయంతి నేతలు, అభిమానుల నివాళి అవనిగడ్డ : దివంగత ప్రజానాయకుడు మండలి వెంకటకృష్ణారావు దివిసీమ అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదని కేంద్ర సాహిత్య అకాడ మీ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు 88వ జయంతి సందర్భంగా స్థానిక గాంధీక్షేత్రంలో సోమవారం ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యార్లగడ్డ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు ప్రభావితులైన వెంకటకృష్ణారావు 1969లో అవనిగడ్డలో గాంధీక్షేత్రాన్ని ఏర్పాటుచేసి ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారన్నారు. నేటి తరం నాయకులు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. మరో ముఖ్యఅతిథి, అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. వెంకటకృష్ణారావు జీవితాంతం సమాజసేవే పరమావధిగా భావించారని పేర్కొన్నారు. 1977 నవంబరు 19న సంభవించిన ఉప్పెనకు మరుభూమిగా మారిన దివిసీమను ప్రపంచ దేశాల్లోని స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో దివ్యసీమగా మార్చిన ఘనత మండలి వెంకటకృష్ణారావుకే దక్కుతుందన్నారు. 1975లో ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం ద్వారా తెలుగుభాషా వికాసానికి ఎంతో కృషి చేశారన్నారు. సభలో ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి ఎంపీపీలు బండె నాగ వెంకటకనకదుర్గ, యార్లగడ్డ సోమశేఖరప్రసాద్, మోర్ల జయలక్ష్మి, అవనిగడ్డ జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరు వెంకటేశ్వరరావు (బుల్కి), డీసీఎంఎస్ డెరైక్టర్ మురాల సుబ్బారావు, అన్నపరెడ్డి సత్యనారాయణ, రెడ్‌క్రాస్‌సొసైటీ జిల్లా కార్యదర్శి డాక్టర్ ఇళ్లా రవి, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వీడీఆర్ కుమార్, చల్లపల్లి రోటరీక్లబ్ మాజీ అధ్యక్షుడు మత్తి శ్రీనివాసరావు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ (రాజా) తదితరులు మాట్లాడుతూ వెంకట కృష్ణారావు సేవలను ప్రస్తుతించారు. తొలుత అవనిగడ్డ వంతెన సెంటరులోని మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి నాయకులు, అభిమానులు పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం సేవాశ్రమంలో ఉన్న మండలి వెంకటకృష్ణారావు సమాధి వద్ద అంజలి ఘటించారు. రక్తదాన శిబిరానికి విశేషస్పందన మండలి జయంతిని పురస్కరించుకుని పట్టాభి రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. శిబిరాన్ని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రారంభించగా 205మంది రక్తదానం చేశారు. దాతలను నాయకులు అభినందించారు. 710మందికి కంటి వైద్యం గాంధీక్షేత్రంలో నిర్వహించిన ఉచిత మెగా నేత్రవైద్యశిబిరం ఏర్పాటు చేశారు. దివిసీమ పరిసర ప్రాంతాల నుంచి 710మంది పరీక్షలు చేయించుకున్నారు. 195మందిని శస్త్రచికిత్సల నిమిత్తం ఎంపికచేయగా మరో 200 మందికి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. -
పేదలకు మెరుగైన సేవలు
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం: ఇండియన్ రెడ్‌క్రాస్ ద్వారా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చే స్తానని మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు ఎ.పి.జితేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయంలో ఓఎన్జీసీ ఆర్ధిక సహాయంతో 18 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రక్త విడిభాగాల యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ తాను రెడ్‌క్రాస్‌లో శాశ్వత సభ్యుడినని, రెడ్‌క్రాస్ ద్వారా పేద ప్రజలకు సేవ చేయడం అదృష్టమన్నారు. సొసైటీ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు ఎంపీ నిధులతో పాటు, ఇతర సంస్ధల ద్వారా సహాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. తాను పార్లమెంటు సభ్యుడిగానే కాక టీఆర్ఎస్ పార్టీ తరపున ఫ్లోర్ రీడర్‌గా ఉన్నందున కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జిల్లాకు సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు కావడం, ప్లేట్లెట్ల కోసం జిల్లా ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తుండటంతో జిల్లా ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రెడ్‌క్రాస్‌లో రక్తవిడిభాగాల యంత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సర్టిషికేషన్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ఎంఎల్సీ నాగేశ్వర్ కూడా రూ. 10 లక్షలు కేటారుుంచినట్లు తెలిపారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా వికలాంగుల పునరావస కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు శాశ్వత భవన నిర్మాణానికై గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను రూ. 5కోట్ల సహాయం కోరినట్లు తెలిపారు, ఇందుకు 2 ఎకరాల స్థలం కూడా అవసరమని, స్థలం సమకూరగానే నిర్మాణం పనులు ప్రారంభమవుతాయన్నారు. ఎంఎల్సీ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వైద్యం కోసం జిల్లా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుుండా జిల్లాలోనే అధునాతన యంత్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రెడ్‌క్రాస్ ద్వారా ప్రజలకు తనవంతు సహకారమందిస్తామన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సేవలను మారుమూల ప్రాంతాలకు విస్తరించాలన్నారు. మున్సిపల్ చైర్మన్ రాధాఅమర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వికలాంగుల పునరావస కేంద్రం ప్రారంభం...... జిల్లా ఆస్పత్రిలో తాత్కాలికంగా ఏర్పా టు చేసిన జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాన్ని ఎంపీ జితేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు వికలాంగుల పరికరాలను పరిశీలించారు. రెడ్‌క్రాస్ ఉపాధ్యక్షుడు నటరాజ్, కోశాధికారి మద్దిఅనంతరెడ్డి, సభ్యులు యాదయ్యగుప్త, అమర్, భీంరెడ్డి, లక్ష్మణ్, జయరాజ్, కార్యదర్శులు బాలయ్య, జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ శ్యామెల్, డీసీహెచ్ఎస్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
రోగుల సేవలో తరించే... నర్సింగ్
అప్‌కమింగ్ కెరీర్ ఆత్మసంతృప్తితోపాటు అధిక వేతనాన్ని ఇచ్చే పవిత్రమైన వృత్తి.. నర్సింగ్. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రోగిని పగలు రాత్రి కనిపెట్టుకొని ఉండి, సొంత మనిషిలా సేవలు చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారిస్తే కలిగే ఆనందం వెలకట్టలేనిది. నర్సింగ్ కోర్సులను అభ్యసిస్తే దేశ విదేశాల్లో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతుండడం నేటి యువతను ఆకర్షిస్తోంది. అందుకే ఈ కెరీర్లో అడుగుపెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ⇒ కోర్సు చేస్తే కొలువు ఖాయం భారత్‌లో నర్సుల కొరత తీవ్రంగా ఉంది. అభివృద్ధి చెందిన యూరప్ దేశాల్లో ప్రతి 150 మందికి ఒక నర్సు అందుబాటులో ఉండగా మనదేశంలో 2250 మందికి ఒకరు మాత్రమే ఉండడం గమనార్హం. వృత్తిలో అనుభవం కలిగిన నర్సులకు అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, సౌదీ అరేబియా, సింగపూర్ లాంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మనదేశంలో చాలామంది విద్యార్థులు నర్సింగ్ కోర్సులు పూర్తిచేసిన వెంటనే విమానం ఎక్కేస్తున్నారు. నర్సు అంటే సాధారణంగా మహిళలే గుర్తుకొస్తారు. కానీ, ఇటీవల యువకులు సైతం ఇందులోకి అడుగుపెడుతున్నారు. పురుషుల వార్డులు, ఓటీ, ఓపీడీ, ఆర్థోపెడిక్ కేర్, క్యాజువాల్టీ, ఎమర్జెన్సీ వార్డుల్లో పురుష నర్సుల సేవలకు డిమాండ్ పెరుగుతోంది. ⇒ విధులేంటి? నర్సుల ప్రధాన విధి రోగులను కనిపెట్టుకొని ఉండడం. అవసరమైన సేవలు అందించడం. వైద్యులు సిఫార్సు చేసిన మందులు, టీకాలను వేళకు ఇవ్వడం. రోగుల్లో వస్తున్న మానసిక, శారీరక మార్పులను పసిగట్టి డాక్టర్లకు సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఔషధాలకు, చికిత్సలకు రోగుల స్పందిస్తున్న తీరును పరిశీలించాలి. తదనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ రంగంలో సవాళ్లు కూడా ఉంటాయి. పగలు, రాత్రి పనిచేయాల్సి ఉంటుంది. నర్సింగ్ కోర్సు చేసిన వారికి వెంటనే ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో.. హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, రెడ్ క్రాస్ సొసైటీ, నర్సింగ్ కౌన్సిళ్లు వంటి వాటిలో ఉద్యోగాలు ఉంటాయి. ఆసక్తి ఉంటే నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు. ⇒ విదేశాల్లో అవకాశాలు అపారం ‘‘సానుకూల దృక్పథం, సేవ చేయాలనే ఆలోచన ఉన్నవారికి అనువైన కెరీర్.. నర్సింగ్. ఈ వృత్తి స్టడీ, వర్కింగ్ స్టయిల్ మిగిలిన వాటితో పోల్చితే పూర్తి విభిన్నం. దీంతో దీన్ని కెరీర్‌గా ఎంచుకునేందుకు గతంలో ఎక్కువమంది ఆసక్తి చూపలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. నర్సింగ్ పూర్తిచేసిన వారికి విదేశాల్లో భారీ వేతనాలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇక్కడా బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రారంభంలో తక్కువ జీతం అందినా.. మున్ముందు పదోన్నతులు, వేతనాలు పెరిగేందుకు స్కోప్ ఉన్న కెరీర్ నర్సింగ్. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మరింత అనుకూలంగా ఉంటుంది’’ - ఒనిలాసాలిన్స్, ప్రిన్సిపల్, అపోలో నర్సింగ్ కళాశాల, హైదరాబాద్ -
తలసీమియా వ్యాధిగ్రస్తులకు..
తలసీమియా వ్యాధిగ్రస్తులకు కర్నూలు(హాస్పిటల్) : తలసీమియా వ్యాధికి గురైన చిన్నారులకు రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధిలో ఉచితంగా రక్తం అందిస్తున్నట్లు సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు చెప్పారు. బుధవారం రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడారు. తాము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా రెడ్‌క్రాస్ తలసీమియా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు రక్తదాతల సంఘం, స్వచ్ఛంద సంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత సహకరించాలని కోరారు. ఈ వ్యాధికి గురైన ప్రతి ఒక్కరికి నెలకు రెండు ప్యాకెట్ల రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృష్టితో రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఇప్పటిదాకా రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా 99 మంది చిన్నారులకు రక్తదానం చేశామని, బుధ వారం ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన అనిల్ అనే చిన్నారి 100వ తలసీమియా వ్యాధి గ్రస్తునిగా నమోదయ్యాడని చెప్పారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటయ్య, మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు. -
రక్తనిధి.. సేకరణ ఏదీ?
వికారాబాద్, న్యూస్‌లైన్: మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంతముఖ్యమో రక్తమూ అంతే. నిత్యం ఎంతోమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి అభాగ్యుల ప్రాణ రక్షణకు రక్తం అత్యవసరమవుతుంది. కొన్నిసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించేటప్పుడు రక్తం అవసరమవుతుంది. సరైన రక్తం ఎక్కించి ఇలాంటి సందర్భాల్లో రోగికి ప్రాణదానం చేయవచ్చు. సరైన గ్రూపు రక్తం దొరక్క ఎందరో ప్రాణాలు విడిచి ఉంటారు. రక్తం అందక పశ్చిమ రంగారెడ్డి పరిధిలో రెండేళ్ల క్రితం వరకూ 642 మంది గర్భిణులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నట్లు సమాచారం. రక్తం కోసం హైదరాబాద్‌కు వెళ్లిన వారు తిరిగి వచ్చే సరికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఈలోగా క్షతగాత్రులు, గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో రక్తం అవసరాన్ని గుర్తించి రెండేళ్ల క్రితం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య ఉద్దేశం .. దారిధ్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో గర్భిణులు ప్రసవ సమయంలో రక్తం లేకుండా చనిపోకూడదని భావించిన రాష్ర్ట ప్రభుత్వం రక్తనిధి కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. వీటి నిర్వహణ బాధ్యతను రెడ్‌క్రాస్ సొసైటీలకు అప్పగించింది. మొక్కుబడిగా... వికారాబాద్‌లో మొదట హంగూ ఆర్భాటాలతో ప్రారంభమైన ఈ రక్తనిధి కేంద్రం నేడు మొక్కుబడిగా కొనసాగుతోంది. ఒక డాక్టర్, ఐదుగురు స్టాఫ్ నర్సులు, ముగ్గురు టెక్నీషియన్లు, ఒక వాచ్‌మన్, ఒక హెల్పర్, స్వీపర్, ఒక సెక్యూరిటీ ఇక్కడ విధులు నిర్వర్తించాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు, ముగ్గురు టెక్నీషియన్లు మాత్రమే పనిచేస్తున్నారు. ప్రస్తుత నిల్వ 20 యూనిట్లు మాత్రమే.. ఐదు వేల యూనిట్ల వరకు రక్తాన్ని నిల్వ ఉంచే సామర్థ్యం వికారాబాద్ రక్తనిధి కేంద్రానికి ఉందని, అయితేప్రస్తుతం ఇక్కడ నిల్వ ఉన్నది 20 యూనిట్లు మాత్రమేనని డాక్టర్ పవన్‌కుమార్ వెల్లడించారు. రక్తనిధి కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ1000 యూనిట్ల రక్తాన్ని మాత్రమే రక్తదాన శిబిరాల ద్వారా సేకరించారు. ఇందులో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు 400 యూనిట్ల రక్తాన్ని, హైదరాబాద్‌లోని విద్యానగర్ కేంద్రానికి 350 యూనిట్ల రక్తాన్ని సరఫరా చేశారు. -
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం 1200 మంది మృతి?
మనీలా: ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని శక్తిమంతమైన తుపాను అతలాకుతలం చేసింది. తుపాను బీభత్సానికి 1200 మందికి పైగా మరణించి ఉంటారని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెడ్‌క్రాస్ సంస్థ అంచనా వేసింది. అయితే ప్రభుత్వం మాత్రం 138 మంది మరణించారని పేర్కొంది. కాగా, 315 కి.మీ వేగంతో ఈ తుపాను ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతంలోని దీవులపై శుక్రవారం విరుచుకుపడింది. సునామీ తరహాలో మూడు మీటర్ల ఎత్తున ఎగిసిపడిన అలల ధాటికి తీరంలో ఉన్న వేలాది ఇళ్లు నేలమట్టమైపోయాయి. తీరం నుంచి ఒక కిలోమీటర్ వరకూ కూడా తుపాన్ ప్రభావం బలంగా పడింది. అంతా సర్వనాశనం అయిపోయిందని తుపాను తీవ్రతకు తీవ్రంగా నష్టపోయిన లెట్ పట్టణంలో పర్యటించిన మంత్రి మార్ రోక్సస్ ఆవేదన వెలిబుచ్చారు. టకోబాన్ పట్టణంలో తుపాను బీభత్సానికి 100 మందికి పైగా మరణించారని, తీరాన్ని అనుకుని ఉన్న ఎయిర్పోర్ట్ టెర్మినల్ అలల దెబ్బకు కకావికలమైందని అధికారులు తెలిపారు. రోడ్లన్నీ పాడైపోయాయని, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని వెల్లడించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. -
రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, న్యూస్‌లైన్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు యు వత రక్తదానం చేయాలని రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక నవోదయ ఆస్పత్రిలో వైద్య విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి నాలుగు నెలలకోసారి రక్తదానం చేయవచ్చన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రితోపాటు ఇతర ఆస్పత్రులకు ప్రతిరోజూ ఎంతో మంది వివిధ శస్త్ర చికిత్సల కోసం, ప్రమాదాల్లో గాయపడిన వారు వస్తుంటారన్నారు. అలాంటి వారికి రక్తం చాలా అవసరం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ కార్యదర్శి ఎం.బాలయ్య, వైస్ చైర్మన్ నటరాజ్, సభ్యులు యాదయ్యగుప్తా, చంద్రమౌళి, నవోదయ ఆస్పత్రి డెరైక్టర్ రవీందర్‌రెడ్డి, వైద్యులు కిరణ్మయి, సిబ్బంది ఎల్లస్వామి, రవి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.