
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం నుంచి 28 వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో వార్షిక దక్షిణాది విడిది చేయనున్నారు. ఈమేరకు రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అజయ్‌కుమార్ సింగ్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం రాజ్ భవన్‌లో రెడ్ క్రాస్ సొసైటీ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్న కోవింద్.. 23న పుదుచ్చేరిలోని పాండిచ్చేరి వర్సిటీ 27వ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. 25న కన్యాకుమారి సందర్శనకు వెళ్లనున్నారు. 27న రాష్ట్రపతి నిలయంలో రాష్ట్ర పాలకులు, అధికారులు, వివిధ రంగాల్లో ప్రముఖులకు ఆయన ఆతిథ్యం ఇవ్వనున్నారు.