mobile app
-
ఎల్ఆర్ఎస్తో ముప్పు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) జనానికి చుక్కలు చూపిస్తోంది. గడువులోగా స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు దరఖాస్తు చేసుంటున్నవారిని సాంకేతిక చిక్కుముడులు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఫీజుల లెక్కలు సైతం గందరగోళానికి గురిచేస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న నాటి మార్కెట్ విలువతో సంబంధం లేకుండా ఒక్కో ప్లాట్‌కు ఒక్కో విధంగా ఫీజు విధించడంతో దరఖాస్తుదారులు అమీర్‌పేట్‌లోని హెచ్ఎండీఏ (HMDA) కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. కొంతమంది దరఖాస్తుదారులకు ఎల్ఆర్ఎస్ (LRS) ఫీజు కంటే ఓపెన్ స్పేస్ ఫీజులు ఎక్కువగా వస్తున్నాయి. కొందరికి భూమి మార్పునకు సంబంధించిన ఫీజులు తేలడం లేదు. మరోవైపు సాంకేతిక సమస్యల కారణంగా అధికారులు సైతం ఎలాంటి పరిష్కారం చూపలేక చేతులెత్తేస్తున్నారు.మార్చి 31వ తేదీ లోపు ఫీజు చెల్లిస్తే 25 శాతం తగ్గింపు లభిస్తుందనే ఉద్దేశంతో జనం ఆసక్తి చూపుతున్నారు. కానీ ఫీజులు చెల్లించిన వారికి ఇప్పటి వరకు ప్రొసీడింగ్స్ రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఫీజు చెల్లించిన వారికి మార్చి అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ప్రొసీడింగ్స్‌ను ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. దీంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3.44 లక్షల దరఖాస్తులు ఉండగా.. ఇప్పటి వరకు కనీసం 10 వేల దరఖాస్తులు కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ ప్రకటించిన తర్వాత ఒక్కో జోన్ పరిధిలో కనీసం వెయ్యి దరఖాస్తులను కూడా పరిష్కరించలేకపోయినట్లు అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వెంటాడుతున్న సాంకేతిక చిక్కులు.. ఎల్ఆర్ఎస్ పథకానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)సాంకేతిక వ్యవస్థను రూపొందించింది. దీనిపై హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల్లోని పట్టణ ప్రణాళికా విభాగాలకు అవగాహన కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం వెబ్‌సైట్‌తో పాటు అధికారుల పనిని సులభతరం చేసేలా ఓ మొబైల్ యాప్‌ను కూడా రూపొందించారు. కానీ.. ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలులో రకరకాల చిక్కులు ఎదురవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.‘ఒక్కోసారి సేకరించిన డాటా మొత్తం డిలీట్ అవుతోంది. దాంతో మరోసారి డాటా నమోదు చేసుకోవాల్సి వస్తోంది. ఒక పనిని ఒకటికి రెండుసార్లు చేయడంతో జాప్యం జరుగుతోంది’ అని ప్లానింగ్ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో మొబైల్ యాప్ (Mobile App) పని చేయడం లేదు. దీంతో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. సాధారణంగా ఎల్ఆర్ఎస్ ఫీజు నమోదైన తర్వాత స్థల మార్పిడికి చెల్లించాల్సిన ఫీజు వివరాలు కూడా నమోదు కావాలి. కానీ ఇందులో ఏదో ఒకటి మాత్రమే నమోదు కావడంతో అలాంటి ఫైళ్లను పెండింగ్ జాబితాలో పెట్టేస్తున్నారు.దరఖాస్తుదారుల్లో గందరగోళం.. ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది. ఆ ఏడాది ఆగస్టు వరకు దరఖాస్తు చేసుకున్నవాళ్లకు మాత్రమే ఇప్పుడు క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుంది. ఆ సంవత్సరం ప్రభుత్వం నిర్ణయించిన భూముల మార్కెట్ ధర ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. ఈ ఫీజుల లెక్కల్లోనూ రకరకాల తప్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో దరఖాస్తుదారులు గందరగోళానికి గురవుతున్నారు. చదవండి: మా గ్రామాలను ఎఫ్‌సీడీఏలో కలపండిఇలా తప్పుడు ఫీజులు నమోదైన దరఖాస్తులను పరిశీలించి సవరించేందుకు సాంకేతికంగా మార్పులు చేయాల్సివస్తోంది. ఈ సవరణలు అధికారులు స్వయంగా చేసేందుకు అవకాశం లేదు. సీజీజీలోనే సవరణ జరగాలి. ఆ విధంగా మరికొంత జాప్యం జరుగుతోంది. హెచ్ఎండీఏలోని శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ (Ghatkesar) జోన్ల పరిధిలో ఇలాంటి తప్పులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. కేవలం రూ.4000 చొప్పున ఓపెన్ స్పేస్ ఫీజు నమోదు కావాల్సి ఉండగా.. కందుకూరు మండలం పులిమామిడిలో ఒక స్థలంలో ఓపెన్ స్పేస్ ఫీజు ఏకంగా రూ.లక్షకు పైగా రావడంతో అధికారులే విస్మయానికి గురయ్యారు.ఒత్తిడి పెంచడంతోనే.. సీజీజీ రూపొందించిన టెక్నాలజీలో తరచూ మార్పులు, చేర్పులు చేయడంతోనే ఈ ఇబ్బందులు, పొరపాట్లు జరుగుతున్నట్లు టెక్నికల్ సిబ్బంది చెబుతున్నారు. మొదట్లో హెచ్ఎండీకు మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని తర్వాత నీటిపారుదల, రెవిన్యూ శాఖలకు కూడా విస్తరించాల్సి వచ్చింది. ఆ తర్వాత చెరువులు, కుంటలు, నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలను మరోసారి మార్పు చేయాల్సి వచ్చింది. ఇలా తరచూ టెక్నాలజీలో మార్పుల వల్ల కూడా తప్పులు చోటుచేసుకుంటున్నాయని సీజీజీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ఆన్లైన్ కోచింగ్‌లకు బీఐఎస్?
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి అనంతరం డిజిటల్ ఎడ్యుకేషన్‌పై ఆధారపడటం బాగా పెరిగింది. హోం ట్యూషన్లు మొదలు సివిల్స్ కోచింగ్ వరకు అంతా వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లలో ఆన్లైన్ కోచింగ్‌లు సర్వసాధారణంగా మారాయి. అయితే, ఒక్కో కోచింగ్ సెంటర్ ఒక్కో తరహా మెటీరియల్‌ను తమ ఇష్టానుసారంగా తయారు చేసి వినియోగదారులకు అందిస్తోంది. ఆన్లైన్లో కోచింగ్ క్లాస్‌లు తీసుకునే ఫ్యాకల్టీ విద్యార్హతలపైనా ఎక్కడా పెద్దగా పట్టింపు లేదు.దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ కోచింగ్ సెంటర్లకు, వారు ఇచ్చే మెటీరియల్ నాణ్యత, ఫ్యాకల్టీ నిపుణత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను రంగంలోకి దించేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆన్లైన్ కోచింగ్ తీసుకునే విద్యార్థులను సైతం వినియోగదారులుగా పరిగణిస్తూ బోధనతోపాటు ప్రొఫెషనల్ కంటెంట్ తయారీలోనూ నాణ్యత పెంచడమే ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. బీఐఎస్ మార్క్ తీసుకురావడం వల్ల ఆన్లైన్లో విద్యాప్రమాణాలు మెరుగయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.విద్యార్థులు సైతం ఆన్లైన్ కోచింగ్ సెంటర్ల ద్వారా పొందే స్టడీ మెటీరియల్ తగిన విధంగా ఉండేలా యాజమాన్యం సైతం జాగ్రత్తలు తీసుకుంటుందని పేర్కొంటున్నారు. నానాటికీ ఆన్లైన్ కోచింగ్ సెంటర్లు, క్లాసుల ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో వెబ్సైట్లతోపాటు మొబైల్ యాప్‌లకు ఇది వర్తింపజేయనున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల కోచింగ్ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ విద్యలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం చాలా ఉందని విద్యావేత్త, ఎన్సీఈఆర్టీ మాజీ డైరెక్టర్ జేఎస్ రాజ్‌పుత్ అభిప్రాయపడ్డారు. మార్గదర్శకాలు కావాలి నాణ్యత లేని కంటెంట్, బలహీనమైన డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు విద్యార్థులకు సరైన విద్యను అందించలేవు. అందుకే ఆన్లైన్ విద్యలో నాణ్యతను పెంచడానికి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం. –అభాష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీభారత ఇ–లెర్నింగ్ మార్కెట్ విలువ (రూ.లలో) 2023లో : 88 వేల కోట్లు 2029 నాటికి: 2.46 లక్షల కోట్లు (అంచనా) (అరిజ్టన్ అడ్వైజరీ సంస్థ నివేదిక) -
స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట!.. వచ్చేసింది మొబైల్ యాప్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసగాళ్లు, మోసపూరిత చర్యలు ఎక్కువవుతున్నాయి. స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో.. వాటికి అడ్డుకట్ట వేయడానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) మొబైల్ యాప్ ప్రారంభించింది.డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మోసపూరిత కమ్యూనికేషన్లను సులభంగా రిపోర్ట్ చేయడానికి 'సంచార్ సాథీ' (Sanchar Saathi) మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా అనుమాస్పద కాల్స్ వచ్చినప్పుడు మొబైల్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం మొబైల్ ఫోన్ బ్లాక్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.సంచార సాథీ పోర్టల్ 2023లో కేంద్ర టెలికామ్ శాఖ అందుబాటులో తీసుకువచ్చింది. కాగా తాజాగా మొబైల్ యాప్ లాంచ్ చేసింది. దీని ద్వారా మోసాల నుంచి ప్రజలను కాపాడవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని వినియోగించవచ్చు.''సంచార్ సాథి యాప్ ఇప్పుడు లైవ్‌లో ఉంది. మీ డిజిటల్ భద్రత కోసం స్కాన్ చేయండి.. అవసరమైన సాధనాలను యాక్సెస్ చేయండి'' అని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ట్వీట్ చేసింది. మొబైల్ యాప్ పరిచయం చేసిన సందర్భంగా.. టెలికామ్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ఇది ప్రజల భద్రతను కాపాడే సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుందని అన్నారు.SANCHAR SAATHI APP is now LIVE!Scan for your digital safety today and access essential tools at your fingertips!#SancharSaathiMobileApp pic.twitter.com/TNKhRHUE4O— DoT India (@DoT_India) January 17, 2025సంచార్ సాథీ ఉపయోగాలు➤అనుమానిత కాల్స్ లేదా మెసేజస్ వచ్చినప్పుడు యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయచ్చు. ➤మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. అవసరమైన నెంబర్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అనవసరమైన వాటిని బ్లాక్ చేసుకోవచ్చు.➤మొబైల్ ఫోన్ పోయినప్పుడు లేదా దొంగతనానికి గురైనప్పుడు బ్లాక్ చేసే సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది.ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డ్‌లు లింక్ అయ్యాయో చెక్ చేయడం ఎలా?▸సంచార్ సాథీ అధికారిక వెబ్సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి.▸వెబ్‌సైట్‌ను కిందికి స్క్రోల్ చేస్తే.. సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కనిపిస్తుంది. దానికి కింద మొబైల్ కనెక్షన్లను చూడటానికి ఆప్షన్ ఎంచుకోవాలి.▸మొబైల్ కనెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తరువాత.. మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.▸అక్కడ మీ 10 అంకెల మొబైల్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.▸దానికి కింద అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.▸క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత మీ ఫోన్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.▸ఓటీపీ ఎంటర్ చేసిం తరువాత మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని నెంబర్స్ లింక్ అయ్యాయో డిస్ప్లే మీద కనిపిస్తాయి.▸అక్కడ మీరు అనవసరమైన నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు.ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి సిమ్ కార్డు.. ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు.ఇదీ చదవండి: ఫోన్ పోయిందా? ఇలా చేస్తే.. కనిపెట్టేయొచ్చు -
తెలుగులోనూ కుంభమేళా సమాచారం
రోజూ సరాసరి కోటిమంది హాజరయ్యే అవకాశం ఉన్న మహా కుంభమేళా ప్రాంతంలో సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాల తాజా సమాచారం ఎప్పటికప్పుడు వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో సైతం మొత్తం 11 భాషల్లో వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా కుంభమేళా సమాచారం భక్తులు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. వాట్సాప్‌లో 88878–47135 ఫోన్ నంబర్‌కు హెచ్ఐ (హాయ్) అని మెసేజ్ చేసి 11 భాషల్లో తమకు నచ్చిన బాషను ఎంపిక చేసుకుని ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో తమకు కావాల్సిన కుంభమేళా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. భక్తుని ఫోన్ నంబర్ ‘కుంభ్ సహాయక్ యాప్’ (kumbh sahayak app) ద్వారా భక్తులు తాము వెళ్లదలుచుకున్న పుష్కర ఘాట్లతో పాటు ఆ ప్రాంతంలో ఉండే ఆలయాలకు ఎలా వెళ్లాలో సూచించే ఏర్పాట్లను సైతం యాప్‌లో పొందుపరిచారు. యాప్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ సమాచారం సైతం సుదూర ప్రాంతాల్లో ఇంటి వద్దనే ఉండే సామాన్య భక్తులకు సైతం తెలిసేలా ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న అనంతరం తమ ఫోన్ నంబర్ యాప్‌లో నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే యాప్ ద్వారా సమగ్ర వివరాలను తెలుసుకోవచ్చు. -
ర్యాంకు ఆధారంగా ఇందిరమ్మ ఇల్లు
సాక్షి, హైదరాబాద్: ఏడు ప్రశ్నలతో పేదరిక స్థాయి నిర్ధారణ.. దాని ఆధారంగా ర్యాంకుల కేటాయింపు.. ఆ ర్యాంకులను బట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి స్థూలంగా చేపట్టిన ప్రక్రియ ఇది. ఏడాది క్రితం ప్రజా పాలన కింద అందిన 80.63 లక్షల దరఖాస్తుల నుంచి గ్రామాలవారీగా అర్హుల జాబితాను మొబైల్యాప్ ద్వారా సిద్ధం చేసే ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ నెల 21 నుంచి 25 వరకు జరిగే గ్రామ సభల్లో ఈ జాబితాపై చర్చించి మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించే లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుపేదల నిర్ధారణకు ఏడు ప్రశ్నలుఅసలైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని కృత నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. దరఖాస్తులను మాన్యువల్‌గా కాకుండా మొబైల్ యాప్ ద్వారా జల్లెడ పట్టి ప్రాథమిక జాబితాలు సిద్ధం చేసింది. ఈ యాప్‌లో ఏడు రకాల ప్రశ్నలను నిక్షిప్తం చేశారు. దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందులోని వివరాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను సరిచూసి యాప్‌లో పొందుపరిచారు. అందరికంటే పేదలు, ఇందిరమ్మ ఇల్లు అవసరం ఉన్నవారి వివరాలను ప్రాధాన్యత క్రమంలో సిద్ధం చేశారు. గ్రామాలవారీగా అర్హులు.. వారిలో ముందు వరుసలో ఉన్నవారిని గుర్తించి ఓ జాబితాను రూపొందించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే 95 శాతం పూర్తయింది. మరో ఐదారు రోజుల్లో మొత్తం పూర్తి చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పేదరిక స్థాయి ఆధారంగా ర్యాంకులు..పేదల్లో నిరుపేదలు, ఇంటి అవసరం ఎక్కువగా ఉండి.. దానిని సమకూర్చుకునే స్తోమత లేనివారి జాబితాను ప్రాధాన్యతా క్రమంలో రూపొందించారు. వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి ఆధారంగా యాప్‌లో కొన్ని ర్యాంకులు కేటాయించారు. తొలుత ఏడు ప్రశ్నలకు సమాధానాలు సేకరించటం ద్వారా పేదరికాన్ని నిర్ధారిస్తారు. సొంత ఇల్లు ఉందా లేదా? ఉంటే దాని పైకప్పు ఎలాంటిది? ఇంటి విస్తీర్ణం, కుటుంబ ఆదాయం, వృత్తి, ఆదాయ మార్గం లాంటి వివరాలతో కుటుంబ స్థాయిని ధ్రువీకరిస్తారు. ఈ ప్రశ్నలతోపాటు ఆధార్ కార్డు ఆధారంగా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి, గతంలో ప్రభుత్వ పథకంలో ఇల్లు పొందిందీ లేనిదీ.. తదితర వివరాలు సేకరిస్తారు. ఇంటి పన్ను, ఆదాయ పన్ను చెల్లింపు, కారు లాంటి పెద్ద వాహనం ఉందీ లేనిదీ, బ్యాంకు రుణాల వంటివాటిని గుర్తిస్తారు. పట్టాదారు పాసుపుస్తకం ఉంటే భూమి వివరాలను కూడా సేకరిస్తారు. ఇలా 360 డిగ్రీల కోణంలో వివరాల సేకరణ ఉంటుంది. నిరుపేద వితంతువు, సంపాదన మార్గం లేనివారు, దివ్యాంగులు, సఫాయి కర్మచారీలు, పనికి ఆహార పథకం కూలీలు, వ్యవసాయ కూలీలు, సాధారణ కూలీలకు ర్యాంకులు కేటాయించటం ద్వారా పేదల్లో నిరుపేదలకు ఎక్కువ ర్యాంకు ఇస్తారు.21 నుంచి గ్రామ సభలు..యాప్ ద్వారా రూపొందించిన జాబితాను అధికారులు జిల్లా కలెక్టర్లకు పంపుతున్నారు. కలెక్టర్లు వాటిని సరిచూసుకుని ప్రాధాన్యతా క్రమంలో అర్హుల జాబితాను రూపొందించి జిల్లా ఇన్చార్జి మంత్రికి అందిస్తారు. గ్రామాలవారీగా లబ్ధిదారుల జాబితాను రూపొందించి గ్రామ సభలో ప్రదర్శనకు ఉంచుతారు. ఈ నెల 21 నుంచి 25 వరకు జరిగే గ్రామ సభల్లో ఆ జాబితాపై చర్చిస్తారు. అందులో వచ్చే అభ్యంతరాల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి తుది జాబితాను ఖరారు చేసి గ్రామ సభ ఆమోదం తీసుకుంటారు. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపి.. జాబితాలోని వారికి ఇళ్లను మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుంది. పునాదుల ప్రక్రియ పూర్తయ్యాక తొలివిడత రూ.లక్షను విడుదల చేస్తారు.పరిశీలించే అంశాలు..360 డిగ్రీల వెరిఫికేషన్ఇంటి పన్ను, ఆదాయపన్ను కడుతున్న వారు.. కారు ఉన్నవారు. ఆధార్ ద్వారా..పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా భూమి వివరాలుపేదరిక ర్యాంకువితంతువు, సింగిల్ చైల్డ్, దివ్యాంగులు,సఫాయి కర్మచారీ, పనికి ఆహారపథకం కూలీలు,వ్యవసాయ కూలీలు. -
ఇంటి పెద్ద, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ‘రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే, పదేళ్ల తర్వాత ఆయన రూ.7 లక్షల కోట్ల అప్పుతో అస్తవ్యస్త పరిస్థితుల రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. మేం క్రమంగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటే ఆ పార్టీ నేతలు అడ్డు తగులుతున్నారు. పిల్ల చేష్టలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వారికి ఇంటి పెద్దగా, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి. అలాగే వదిలేస్తే ఎవరికీ మంచిది కాదు.లేనిపక్షంలో వారిని నియంత్రించేందుకు చివరకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పరోక్షంగా కేటీఆర్, హరీశ్‌రావులను హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ అప్లికేషన్‌ను పలువురు మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. హోమ్ వర్క్ చేయని విద్యార్థుల్లా..‘కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగించి తీర్చిదిద్దిన రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే.. అప్పుల కుప్పగా మార్చి అప్పుల మిత్తి కట్టేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితికి దిగజార్చిన రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను ఏడాదిలో మేము చేసి చూపుతున్నాం. దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు.. హోమ్ వర్క్ చేయని విద్యార్థులు, హోమ్ వర్క్ చేసిన వారి పుస్తకాల్లోని కాగితాలను చింపేసిన తరహాలో వ్యవహరిస్తున్నారు. మేము చేసే మంచి పనుల లబ్ధి ప్రజలకు చేరకుండా వారు మారీచ సుబాహుల తరహాలో అడ్డుపడుతున్నారు. మా పాలన కూడా వారి తరహాలోనే ఉండాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ పంథాను కేసీఆర్ మార్చేశారు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చొరవ చూపేందుకు వీలు కలి్పంచారు. ఆ పంథాను కేసీఆర్ మార్చేశారు. భారత్, పాకిస్థాన్ సైనికులు ఎదురుపడితే కాల్పులు జరుపుకొంటున్న చందంగా పాలక, ప్రతిపక్షాల మధ్య శత్రుత్వాన్ని పెంచారు.ప్రజాతీర్పును గుర్తించి ఇప్పటికైనా కేసీఆర్ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ప్రజా వ్యతిరేకతకు నిజామే తలవంచారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును కేసీఆర్ ఇంకా గుర్తిస్తున్నట్టు లేదు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి. శాసనసభకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేయాలి. తన సీనియారిటీకి అనుగుణంగా విలువైన సూచనలు ఇవ్వాలి. మేమంతా ఎదుగుతున్న నేతలమే.. మా మంత్రులు తుమ్మల, జూపల్లి లాంటి వారు తప్ప మిగతా వారమంతా ఎదుగుతున్న నేతలమే. సభలో ప్రతిపక్ష నేత కుర్చీని ఖాళీగా ఉంచటం సరికాదు. కేసీఆర్ పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ సూచనలతో మార్గదర్శనం చేయాలి. మా ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన మంచి పనులను గుర్తించాలి. ఏడాది పూర్తయిన సందర్భంగా చేస్తున్న విజయోత్సవాల్లో పాల్గొనాలి. ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి మంత్రి పొన్నం ద్వారా ఆహ్వానాలు పంపుతాం. కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ హాజరుకావాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. పేదల ఇళ్లకు రూ.5 లక్షలిస్తున్నది తెలంగాణ ఒక్కటే.. ‘పేదల ఇళ్ల నిర్మాణ పథకానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. పేదలు పక్కా ఇంటిని కలిగి ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరాగాంధీ చేశారు. దేశంలో గుడి లేని ఊరుంటుందేమో గానీ ఇందిరమ్మ కాలనీ లేని పల్లె ఉండదనటంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయ భూముల సీలింగ్ యాక్టు ద్వారా భూములు సేకరించి పేదలకు పంచిన ఆమె, వారి సొంతింటి కలను నిజం చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం అదే స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. తొలి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. నిరుపేదల జాడ తేల్చే యాప్ పేదల్లో అతి పేదలకు ఇళ్లు దక్కేలా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధునికతను వినియోగించుకుంటున్నాం. ఆ దిశలోనే ఇప్పుడు నిరుపేదల జాడ తేల్చేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. అర్హులకే లబ్ధి కలిగేలా, అక్రమాలు లేకుండా దీన్ని వినియోగిస్తాం. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని వారికి సొంతింటి లబ్ధి కలిగేలా ప్రత్యేకంగా ఇళ్లను కేటాయిస్తాం. ప్రస్తుతం ప్రకటించిన కోటాతో ప్రమేయం లేకుండా వారికి ఇళ్లను ఇస్తాం. లబ్ధిదారులకు స్తోమత ఉంటే ఇంటిని విస్తరించుకోవచ్చు..’ అని రేవంత్ తెలిపారు. ఎంత భారం అయినా నిధులిస్తాం: భట్టి నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా సొంత పక్కా ఇంటిని సమకూర్చాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టామని, ఎంత భారమైనా దానికి కావాల్సిన నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనతో ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నా.. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన రూ.22,500 కోట్ల నిధులను మాత్రం సమకూర్చి తీరతామన్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం సమకూర్చటం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని పేర్కొన్నారు. అతిపేదలకు సొంతిల్లే లక్ష్యం: పొంగులేటి పేదల్లో అతి పేదలకు సొంతింటిని సమకూర్చటమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమకు అందిన లక్షల దరఖాస్తుల్లో అతిపేదలు, నిరుపేద వితంతువులు, వికలాంగులను గుర్తించి ఇళ్లను అందిస్తామని చెప్పారు. ఈ పథకంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూస్తామన్నారు. యాప్‌ను ఆవిష్కరించిన తర్వాత.. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నమూనాలను, డిజైన్లను సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ పనులు పరిశీలించిన సీఎం ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని సూచన సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం లోపల ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ నెల 9న విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం తన చాంబర్ నుంచి నడుచుకుంటూ నేరుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలానికి వచి్చన సీఎం.. విగ్రహం ముందు గ్రీనరీ పనులు, భారీ ఫౌంటైన్, ఆకట్టుకునేలా ఏర్పాటు చేస్తున్న లైటింగ్ సిస్టం పనితీరు గురించి ఆరా తీశారు. గేటు–2, గేటు 4లను అనుసంధానిస్తూ వేస్తున్న రోడ్లను చూశారు. సచివాలయానికి వచ్చే సందర్శకులకు ఆహ్లాదం పంచేలా రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు, పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు.గేటు–4 పక్కన ప్రధాన గేటు ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. పనులన్నీ విగ్రహావిష్కరణకు ముందురోజే పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. విగ్రహం ఏర్పాటులో ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటూ జరగకూడదని, విగ్రహాన్ని తెచ్చేటప్పుడు, వేదికపై ఏర్పాటు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అక్కడ పని చేస్తున్న కూలీలతో కూడా రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ , టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అదానీ ఎయిర్‌పోర్ట్స్ ‘ఏవియో’ యాప్
న్యూఢిల్లీ: అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ తాజాగా ‘ఏవియో’ డిజిటల్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. విమానాశ్రయాల్లో ప్యాసింజర్ల ట్రాఫిక్, బ్యాగేజ్ ఫ్లో, గేట్ల దగ్గర పట్టే వెయిటింగ్ సమయం, కన్వేయర్ బెల్టుపై బ్యాగ్‌లు మొదలైన వివరాలను రియల్–టైమ్‌లో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ (సీఐఎస్ఎఫ్), ఎయిర్‌లైన్స్, ఎయిర్పోర్ట్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్‌కి ఈ యాప్ యాక్సెస్ ఉంటుంది. ప్రయాణికుల రద్దీ, బ్యాగేజ్ ఫ్లోను పర్యవేక్షించేందుకు ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు/మేనేజర్లు ఏవియోను ఉపయోగిస్తారు. విమానయాన రంగ సంస్థలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ ప్లాట్‌ఫాం సహాయకరంగా ఉండగలదని సంస్థ తెలిపింది. అదానీ గ్రూప్ సంస్థ అయిన అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ దేశీయంగా ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
అదో దా‘రుణ’ యాప్
సాక్షి, అమరావతి: లోన్ యాప్ మోసాలు ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధించినా వివిధ లోన్ యాప్‌లు అనధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. అక్రమ మార్గాల ద్వారా మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్ యాప్ నిర్వాకం వెలుగుచూసింది. ఈ యాప్ సులభంగా రుణాలు ఇస్తామని సామాన్యులను బురిడీ కొట్టిస్తోంది. లోన్ ఇచి్చన అనంతరం భారీ వడ్డీలు వేస్తూ ఖాతాదారులను వేధిస్తోంది. రుణాలు చెల్లించలేని వారి వ్యక్తిగత సమాచారాన్ని దురి్వనియోగం చేస్తూ వారిని బ్లాక్మెయిల్ చేస్తోంది.వారి ఫొటోలను మారి్ఫంగ్ చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో రుణాలు తీసుకున్న వారు బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్లకు తమ ఏజెంట్లను పంపించి మరీ దాడులు చేయిస్తూ వారి ఆస్తులను రాయించుకుంటున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్యాప్పై గడచిన ఆరు నెలల్లోనే ఏకంగా 1,062 కేసులు నమోదు కావడం గమనార్హం. నిషేధించినా సరే.. ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్ యాప్ మోసాలపై సైబర్ పోలీసులకు సవాల్‌గా మారింది. వాస్తవం ఏమిటంటే.. ఆ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లోనే నిషేధించింది. ఆ సమాచారాన్ని గూగుల్‌తోపాటు ఇతర సెర్చ్ ఇంజన్ల యాజమాన్యాలకు కూడా సమాచారమిచి్చంది. అయినా సరే.. ఆ యాప్ స్మార్ట్ ఫోన్లలో ఎలా అందుబాటులో ఉంటోందన్నది అంతు చిక్కడం లేదు. గత నాలుగేళ్లలో మొత్తం 1,600 లోన్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వాటిలో అత్యధికం చైనా కేంద్రంగా నిర్వహిస్తున్న యాప్‌లే ఉండటం గమనార్హం. నిషేధించాం కాబట్టి ఇక ఆ యాప్‌లు మోసాలకు పాల్పడలేవని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కానీ ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్ యాప్ మోసాలు కొనసాగుతుండటం విస్మయానికి గురి చేస్తోంది.ఆ యాప్‌ను డిలీట్ చేయండి ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సైబర్ పోర్టల్ స్పందించింది. ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్ యాప్‌ను తాము నిషేధించినట్టు తెలిపింది. అయినా వివిధ గేట్‌వేల ద్వారా ఆ యాప్ స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉంటున్నట్టు గుర్తించినట్టు పేర్కొంది. కాబట్టి.. మొబైల్ ఫోన్ వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లలో ఉన్న ఆ యాప్‌ను డిలీట్ చేయాలని సూచించింది. తద్వారా ఆ యాప్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.నిషేధించినా సరే ఇతర మార్గాల ద్వారా మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటున్న యాప్‌లపై నేషనల్ సైబర్ పోర్టల్ సమగ్ర దర్యాప్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే తగిన కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొంది. లోన్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా మోసపోతే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని నేషనల్ సైబర్ పోర్టల్ కోరింది. -
భారత్‌లో గూగుల్ ‘జెమిని’ యాప్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్ ‘జెమిని’ ఆండ్రాయిడ్ యాప్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ సహా తొమ్మిది భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. ఐఫోన్ యూజర్ల కోసం గూగుల్ యాప్ ద్వారా మరికొన్ని వారాల్లో జెమిని యాప్‌ను ప్రవేశపెడతామని పేర్కొంది. భారత్‌లో విద్యార్థుల నుంచి డెవలపర్ల వరకు వివిధ వర్గాల వారు ఉత్పాదకతను పెంచుకునేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు దీన్ని ఉపయోగించుకుంటున్నారని జెమిని ఎక్స్పీరియన్సెస్ వైస్ ప్రెసిడెంట్ అమర్ సుబ్రమణ్య ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. తాజాగా గూగుల్‌కి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జెమిని 1.5 ప్రో ఫీచర్లు కూడా భారత్‌లోని యూజర్లకు అందుబాటులో ఉంటాయని వివరించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
రాయవరం: ఈ మధ్యకాలంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ఒకరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరోరోజు ఈదురు గాలులతో కూడిన అకాలవర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు అయోమయానికి గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌లు రూపొందించింది. డామిని, మేఘ్‌దూత్, రెయిన్ అలారం.. యాప్‌లు ఆవిష్కరించింది. వీటిద్వారా వాతావరణ పరిస్థితులను అంచనా వేయవచ్చని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.ప్రధానంగా వర్షాకాలం మొదలుకానున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతల వివరాలు, వర్షాల రాక సమాచారాన్ని కూడా యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఉరుములు, మెరుపుల నుంచి రక్షించుకోవడం, వర్షం పరిస్థితులను అంచనా వేయడం సులభమవుతంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ శాఖ రూపొందించిన ఈ యాప్‌లు రైతులకు సాగులో తోడ్పడనున్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా వీటిని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. వాతావరణ సమాచారం మొత్తం మన అరచేతిలో ఉన్నట్టే. ‘డామిని’లో ఉరుములు, మెరుపుల హెచ్చరిక ఒక్కోసారి వాతావరణంలో అప్పటికప్పుడు మార్పులు సంభవించి ఉరుములు, మెరుపులు వస్తాయి. పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇలాంటి హెచ్చరికలను తెలిపేందుకు డామిని యాప్ ప్రయోజనకరంగా ఉంటుంది. మెరుపు ఎప్పుడు వస్తుంది? మెరిసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండాల్సిన తీరును ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. లొకేషన్ ఆధారంగా మెరుపులు వచ్చే అవకాశం ఉందో? లేదో? కూడా తెలుస్తుంది. పిడుగు పడినప్పుడు తోటివారికి అందించాల్సిన వైద్యసహాయం వంటి ప్రాథమిక సమాచారాన్ని తెలియజేస్తుంది. రైతులకు, రైతుకూలీలకు బయటి ప్రాంతాల్లో పనిచేసేవారికి ఈ యాప్ ఎంతో తోడ్పడుతుంది. వాతావరణ సమగ్ర వివరాలతో ‘మేఘదూత్’ మేఘదూత్ యాప్‌లో వాతావరణానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. వర్షపాతం వివరాలు, గాలిలో తేమ, గాలి వేగం, గాలి వీచే దిశ, నమోదైన ఉష్ణోగ్రతలు, రానున్న 24 గంటల్లో వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. గడిచిన వారం రోజులు, రానున్న మరో నాలుగు రోజుల వాతావరణ వివరాలు కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. వర్ష సూచనకు ‘రెయిన్ అలారం’ వర్షం ఎప్పుడు పడుతుంది. వర్షపాతం వివరాలు, రానున్న కాలంలో వర్ష సూచనలను రెయిన్ అలారం యాప్ తెలియజేస్తుంది. మనం నివసిస్తున్న ప్రాంతంలో వాతావరణ, వర్ష సూచనలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో తెలియజేస్తుంది. -
సెబీ నుంచి అప్డేటెడ్ మొబైల్ యాప్ సారథి2.0
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పర్సనల్ ఫైనాన్స్‌పై విస్తృత సమాచారంతో సారథి2.0(Saarthi2.0) మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఇన్వెస్టర్లకు ఉద్దేశించిన ఈ యాప్‌లో సమీకృత టూల్స్‌కు చోటు కలి్పంచింది. సంక్లిష్టమైన ఫైనాన్షియల్ కాన్సెప్్ట్సను సరళతరం చేయడమే లక్ష్యంగా అప్డేటెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టినట్లు సెబీ పేర్కొంది. వినియోగదారులకు సులభరీతిలో అర్ధమయ్యే విధంగా సమాచారాన్ని క్రోడీకరించినట్లు తెలియజేసింది. యాప్‌లో ఫైనాన్షియల్ కాల్క్యులేటర్లు, కేవైసీ విధానాలు వివరించే మాడ్యూల్స్, ఎంఎఫ్‌లు, ఈటీఎఫ్లతోపాటు స్టాక్ ఎక్సే్ఛంజీలలో షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు, ఇన్వెస్టర్ల సమస్యల పరిష్కార విధానాలు తదితర పలు అంశాలను చేర్చినట్లు వివరించింది. -
ఆర్బీఐ మొబైల్ యాప్
ముంబై: రిటైల్ మదుపుదార్లు ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడాన్ని సులభతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. దీనితో పాటు నియంత్రణపరమైన అనుమతులకు సంబంధించి ప్రవాహ్ పోర్టల్, ఫిన్‌టెక్ సంస్థల డేటా కోసం ఫిన్‌టెక్ రిపాజిటరీని ప్రారంభించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ఈ మూడింటిని ఆవిష్కరించారు. ప్రస్తు తం చిన్న ఇన్వెస్టర్లు రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ (జీ–సెక్)లో ఇన్వెస్ట్ చేయడానికి వీలుంది. ఇందుకోసం రిటైల్ డైరెక్ట్ స్కీము కింద ఆర్బీఐ వద్ద రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంటును తెరవాల్సి ఉంటోంది. దీన్ని ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుంచి, ఐవోఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 60 ఫారంలతో ప్రవాహ్.. నియంత్రణ సంస్థపరమైన వివిధ రకాల అనుమతులకు సంస్థలు, వ్యక్తులు దర ఖాస్తు చేసుకునేందుకు ప్రవాహ్ పోర్టల్ ఉపయోగపడుతుంది. వివిధ విభాగాలకు సంబంధించి ఇందులో 60 అప్లికేషన్ ఫారంలు ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పెంచనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. అప్లై చేసుకున్న వారు నిర్దిష్ట దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు, అలాగే దానిపై తీసుకున్న నిర్ణయాన్ని నిర్ణీత వ్యవదిలో దరఖాస్తుదారుకు తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఫిన్‌టెక్ రిపాజిటరీ.. ఫిన్‌టెక్ సంస్థలు, వాటి కార్యకలాపాలు, టెక్నాలజీపరంగా చేకూరే ప్రయోజనాలు మొదలైన డేటాకి ఈ రిపాజిటరీ కేంద్రంగా ఉంటుంది. ఫిన్‌టెక్ కంపెనీలను నియంత్రణ సంస్థ కోణంలో మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు, వాటికి తగిన విధానాలను రూపొందించేందుకు ఇది ఉపయోగపడగలదు. నియంత్రిత సంస్థలు, ఆర్బీఐ నియంత్రణలో లేని ఫిన్‌టెక్‌లు కూడా ఈ రిపాజిటరీకి సమాచారం సమరి్పంచవచ్చు.మరోవైపు, ఆర్బీఐ నియంత్రణలో మాత్రమే ఉన్న సంస్థలు (బ్యాంకు లు, బ్యాంకింగ్‌యే తర ఆర్థిక సంస్థలు) వర్ధమాన టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి సంబంధించిన వివరాల కోసం ఎంటెక్ (ఈఎంటెక్) రిపాజిటరీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఫిన్‌టెక్, ఎంటెక్ రిపాజిటరీలను ఆర్బీఐ అనుబంధ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్) నిర్వహిస్తుంది. -
ఇక ఆ బ్యాంక్ యాప్ వాడుకోవచ్చు.. ఆర్బీఐ ఊరట
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ ఆర్బీఐ ఊరట కలిగించింది. బీవోబీ వరల్డ్ మొబైల్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు తాజాగా బీవోబీకు అనుమతినిచ్చింది.బీవోబీ వరల్డ్ యాప్ ద్వారా వినియోగదార్లను చేర్చుకోరాదంటూ 2023 అక్టోబర్ 10న ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వర్తించే మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా వినియోగదార్లను చేర్చుకుంటామని బీవోబీ తెలిపింది.'బీవోబీ వరల్డ్' యాప్ అనేది పెద్ద సంఖ్యలో కస్టమర్ల కోసం ఒక ప్రాథమిక ఛానెల్, వీడియో కేవైసీ ద్వారా ఖాతా తెరవడాన్ని సులభతరం చేస్తుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఓ మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్‌ని ఆర్బీఐ నిషేధించడం ఇదే తొలిసారిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో, కొత్త కస్టమర్లను డిజిటల్‌గా ఆన్‌బోర్డ్ చేయకుండా కోటక్ బ్యాంక్‌ను కూడా ఆర్బీఐ నిషేధించింది. -
ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్..! కారణం..
ప్రభుత్వ మొబైల్ యాప్‌లకు ప్రత్యేకమైన లేబుల్ వాడనున్నారు. ఈమేరకు ప్లేస్టోర్‌లో ప్రభుత్వ యాప్‌లకు లేబుల్వాడేందుకు గూగుల్ సిద్ధమైంది. ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ లావాదేవీలతోపాటు ఓటీటీ యుటిలిటీ బిల్లు చెల్లింపులు, క్రెడిట్ కార్డుల చెల్లింపుల వరకూ..దాదాపు డిజిటల్‌గానే జరుగుతున్నాయి. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయి. వీటిని కట్టడిచేసేందుకు ఈ మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది.ప్లేస్టోర్‌లో లక్షల్లో యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో వినియోగదారులకు ఏది నమ్మకమైన యాప్..ఏది కాదో అనే అంశంపై స్పష్టత కరవవుతోంది. కొన్ని ప్రభుత్వ యాప్‌లో వ్యక్తిగత సమాచారం పంచుకోవాల్సి ఉంటుంది. అయితే అలా మన వివరాలిస్తున్న యాప్ అసలు ప్రభుత్వ ఆమోదం పొందిందా..లేదా అనే విషయాన్ని ధ్రువపరుస్తూ కొత్త మార్పులు తీసుకురానున్నారు. ప్లేస్టోర్‌లోని ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్ ఉపయోగించనున్నారు. దాంతో ఆ యాప్‌లను వెంటనే గుర్తించే వీలుంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ మేరకు యాప్‌లో లేబుల్ ఉంచేందుకు గూగుల్ సైతం సిద్ధమైందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..‘ఎక్స్’ (ట్విటర్)లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసే వీలు ఉండటంతో ప్రభుత్వ ఖాతాలను తేలిగ్గా గుర్తించడానికి గ్రే టిక్ ఇవ్వడంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్న వారిని తేలిగ్గా గుర్తించవచ్చు. ఇదే తరహాలో గూగుల్ ప్లే స్టోర్ లేబుల్ తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లకు గూగుల్ ప్లే స్టోర్‌లో ఇకపై లేబుల్ కనిపిస్తుంది. -
త్వరలో ఆర్బీఐ కొత్త మొబైల్ యాప్.. ఎందుకంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కొత్తగా ఓ మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ యాప్‌తో ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు కానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను 2021 నవంబర్‌లో ప్రారంభించింది. ఆర్బీఐ డైరెక్ట్ పోర్టల్ ద్వారా ప్రస్తుతం ప్రైమరీ, సెకండరీ మార్కెట్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయొచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు వేలంలో ఈ సెక్యూరిటీలను అమ్మడం/ కొనడం చేసే వీలుంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో రిటైల్ డైరెక్ట్ పోర్టల్‌కు సంబంధించిన మొబైల్ యాప్‌ను తీసుకురానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇదీ చదవండి: హోమ్ రోబోటిక్స్ విభాగంలోకి ప్రపంచ నం.1 కంపెనీ..? ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలను తెలియజేసే క్రమంలో యాప్‌కు సంబంధించిన అంశాన్ని దాస్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాప్ సిద్ధమవుతోందని, త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పారు. ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.14.13 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తొలి అర్ధభాగంలోనే రూ.7.5 లక్షల కోట్లు సేకరించాలనుకుంటోంది. -
యాప్‌ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే..
మొబైల్ అప్లికేషన్ స్టోర్స్ నుంచి యాప్‌లు లేదా ఇతరత్రా సాఫ్ట్వేర్లను కొనుగోలు చేస్తున్న వారిలో చాలా మంది సబ్‌స్కిప్షన్ వలలో చిక్కుకుంటున్నారు. ముందుగా చెప్పకుండా తర్వాత వడ్డించే ఛార్జీలతో (హిడెన్ చార్జీలు) నానా తంటాలు పడుతున్నారు. ఆన్లైన్ రీసెర్చ్ సంస్థ లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో సగం మంది పైగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఉచిత యాప్‌ను లేదా వన్–టైమ్ సర్వీస్‌ను ఎంచుకున్న వినియోగదారులు ఆ తర్వాత సబ్‌స్కిప్షన్ ఉచ్చులో పడుతున్న సందర్భాలు పెరుగుతున్న నేపథ్యంలో లోకల్‌సర్కిల్స్ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. డార్క్ ప్యాటర్న్‌లను (మోసపూరితంగా కస్టమర్లను ఆకర్షించడం) నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) నవంబర్ 30న ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 13 రకాల డార్క్ ప్యాటర్న్‌లను ప్రస్తావించింది. అప్పటికప్పుడు వెంటనే చర్యలు తీసుకునేలా తొందరపెట్టడం, సబ్‌స్కిప్షన్ వల వేయడం, విసిగించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. తాజాగా లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైన మరిన్ని విషయాలను చూస్తే.. యాప్ ప్లాట్‌ఫాంలు, ఎస్ఏఏఎస్ ప్లాట్‌ఫాంల ద్వారా వన్–టైమ్ సాఫ్ట్వేర్ లేదా సర్వీస్ అంటూ తమకు అంటగట్టిన వాటిల్లో చాలా మటుకు సబ్స్క్రిప్షన్ కోసం పన్నిన పన్నాగాలేనని సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది వినియోగదారులు తెలిపారు. కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు జరిపేటప్పుడు ముందుగా చెప్పని బోలెడన్ని హిడెన్ చార్జీలు తెరపైకి వచ్చినట్లు 71 శాతం మంది పేర్కొన్నారు. యాప్ ప్లాట్‌ఫాంలు, ఎస్ఏఏఎస్ ప్లాట్‌ఫాంల ద్వారా తాము కొన్నది ఒకటైతే తమకు అందినది మరొకటని 50 శాతం మంది వినియోగదారులు తెలిపారు. యాప్ ప్లాట్‌ఫాంల ద్వారా తాము డౌన్లోడ్ చేసుకున్న కొన్ని యాప్‌లలో మాల్వేర్ ఉందని, ఫలితంగా తమ డివైజ్‌ల నుంచి ప్రైవేట్ సమాచారం చోరీకి గురైందని 25 శాతం మంది వినియోగదారులు వివరించారు. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమ్‌ల కోసం ప్రభుత్వంతో ఒప్పందం.. ఎందుకంటే.. యాప్‌లు లేదా సాఫ్ట్వేర్ సర్వీసుల యూజర్లపై 2023 డిసెంబర్ 1 నుంచి 2024 జనవరి 30 వరకు 331 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేకు 44,000 పైచిలుకు సమాధానాలు వచ్చాయి. -
మూడొంతులకు పైగా కులగణన పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణన ప్రక్రియ నాలుగింట మూడు వంతులకుపైగా పూర్తయింది. కులగణనను ఈ నెల 19 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా డేటా సేకరించింది. దీని ప్రకారం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 1.67 కోట్ల కుటుంబాల్లో 4.89 కోట్ల మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కులగణన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో చేపట్టేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను కూడా సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు వారి పరిధిలో ఇంటింటికీ వెళ్లి గత 8 రోజులుగా ప్రజల సామాజిక, ఆరి్థక స్థితిగతుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 1,33,65,550 కుటుంబాలకు సంబంధించిన 3.39 కోట్ల మంది వివరాలను నమోదు చేశారు. ఇప్పటివరకు మొత్తం 79.59 శాతం కుటుంబాల వివరాల నమోదు పూర్తవగా.. శనివారం 3.60 శాతం కుటుంబాల వివరాలను నమోదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 86.71 శాతం కుటుంబాల వివరాల నమోదు పూర్తి కాగా, అత్యల్పంగా పల్నాడు జిల్లాలో 71 శాతం పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. -
వీచాట్, క్యాస్పర్స్కైపై నిషేధం.. కారణం ఇదే..
కెనడా ప్రభుత్వం చైనా మెసేజింగ్ అప్లికేషన్ వీచాట్‌ను, రష్యన్ యాంటీవైరస్ ప్రోగ్రామ్ కాస్పర్స్కైను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వీచాట్ యాప్ విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగించే యాప్స్‌లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా దక్షిణాసియా వాసులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం తెలిపింది. వీచాట్ యాప్ నుంచి కీలకమైన డేటా లీక్ అవుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు లభించకపోయినప్పటికీ.. రిస్క్‌ను అంచనావేసి ముందు జాగ్రత్తగా ప్రభుత్వ పరికరాల నుంచి దీన్ని తొలగించాలని ఆదేశించినట్లు కెనడా ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలు అనితా ఆనంద్ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై వీచాట్ యజమాని అయిన టెన్సెంట్ సంస్థ స్పందించలేదు. మరోవైపు రష్యాకు చెందిన క్యాస్పర్స్కైపై కూడా చర్యలు తీసుకొంటున్నట్లు వెల్లడించారు. దాంతో కంపెనీ వర్గాలు మాట్లాడుతూ కెనడా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని, నిరాశను కలిగించిందని తెలిపాయి. ప్రభుత్వ ఆందోళనలను పరిష్కరించడానికి సంస్థకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ రెండు అప్లికేషన్లను డౌన్లోడ్ చేయకుండా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
సెల్ఫోన్లలో ‘ఆరోగ్యశ్రీ’
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుదారుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాము చేయించుకున్న చికిత్సలు, వైద్య పరీక్షల వివరాలను లబ్దిదారులు ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. భవిష్యత్‌లో ఎప్పుడైనా మెడికల్ రిపోర్టులు అవసరమైతే ఈ యాప్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. కార్డుదారులకు అవసరమైన చికిత్సలు ఏఏ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయో తెలియజేసే వివరాలన్నీ ఈ యాప్‌లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వలంటీర్లు చేపట్టిన మొదటి విడత ఇంటింటి సర్వే సమయంలోనే.. ఈ యాప్‌ను ఆరోగ్యశ్రీ కార్డుదారులు తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు వలంటీర్లు తమకు కేటాయించిన క్లస్టర్ల పరిధిలోని లబ్దిదారుల ఫోన్లలో దీనిని డౌన్లోడ్ చేయించి.. దాని ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు నంబర్ లేదా సంబంధిత కుటుంబసభ్యుని ఆధార్ నంబర్‌ను యాప్‌లో నమోదు చేస్తే.. ఆ కుటుంబానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ వివరాలన్నీ అందులో ప్రత్యక్షమవుతాయి. వారంతా ఈ పథకం ద్వారా పొందిన చికిత్సల వివరాలను తెలుసుకోవచ్చు. చికిత్స సమయంలో జరిగిన వైద్య పరీక్షల రిపోర్టులు కూడా అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైనా ఆ వైద్య పరీక్షల రిపోర్టులు అవసరమైతే ఈ యాప్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందించినందుకు సంబంధిత ఆస్పత్రికి ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించిందన్న వివరాలను కూడా వారు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు. నెల్లూరు జిల్లాలో అత్యధికం.. వలంటీర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కార్డుదారుల మొబైల్ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్‌కు సంబంధించిన కార్యక్రమం నవంబర్ 29 వరకు కొనసాగనుంది. దీనికి సంబంధించిన పురోగతిని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు 6,83,635 మంది ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఈ యాప్‌ను తమ ఫోన్లలో నిక్షిప్తం చేసుకున్నారు. బుధవారం ఒక్క రోజే 1,81,507 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అత్యధికంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లక్ష మందికి పైగా, ఏలూరు జిల్లాలో 99,427 మంది, కాకినాడ జిల్లాలో 85,166 మంది డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు చెప్పారు. -
ED Attachment: మూడు ఆండ్రాయిడ్ యాప్‌లు..రూ.150 కోట్ల మోసం!
అధిక రాబడి వస్తుందని ప్రజల్లో ఆశ చూపించి మోసానికి పాల్పడుతున్న మొబైల్ యాప్ నిర్వాహకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. యాప్ నిర్వాహకులైన వైభవ్ దీపక్ షా, సాగర్ డైమండ్స్, ఆర్‌హెచ్‌సీ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన రూ.59.44 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పవర్ బ్యాంక్ యాప్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉత్తరాఖండ్, దిల్లీ పోలీసులు(స్పెషల్ సెల్), కర్ణాటక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు చెప్పారు. భారత ప్రజలను మోసం చేసేందుకు చైనాకు చెందిన కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల సహాయంతో దేశంలో షెల్ కంపెనీలను సృష్టించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తమ పెట్టుబడులపై భారీ మొత్తంలో సంపాదించవచ్చని ప్రజల్లో ఆశ చూపించి మోసం చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని పవర్ బ్యాంక్ యాప్, టెస్లా పవర్ బ్యాంక్ యాప్, ఈజీప్లాన్ అనే మూడు అప్లికేషన్ల ద్వారా ప్రజలను మోసగిస్తున్నట్లు అధికారులు గుర్తించామన్నారు. ఈ యాప్‌ల ద్వారా ప్రజల నుంచి రూ.150 కోట్ల మేర మోసం చేసినందుకు దిల్లీ పోలీస్ సైబర్ సెల్ జూన్ 2021లో అనేక మందిని అరెస్టు చేసింది. ఈ యాప్‌లు కస్టమర్ల నుంచి చెల్లింపులను సురక్షితం చేసిన తర్వాత వినియోగదారు ఖాతాలను బ్లాక్ చేసేవని ఈడీ తెలిపింది. ఇలా కూడగట్టిన డబ్బును నిందితులు, ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు బోగస్ దిగుమతుల సాకుతో విదేశాలకు భారీగా నిధులు మళ్లించారని వెల్లడైంది. అయితే రూ.10.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ రికవరీ చేసింది. రూ.14.81 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
కొత్త కస్టమర్లను యాప్‌లో చేర్చుకోవద్దు.. ఆర్బీఐ షాక్!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తమ ‘బీవోబీ వరల్డ్’ మొబైల్ యాప్‌లో కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చింది. యాప్‌లో కస్టమర్లను చేర్చుకునే ప్రక్రియకు సంబంధించి పర్యవేక్షణాపరమైన లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు వాటిని సరిచేసి, సంబంధిత ప్రక్రియను పటిష్టం చేసినట్లు ఆర్బీఐ సంతృప్తి చెందితే తప్ప కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి ఉండదు. దీనివల్ల ప్రస్తుత బీవోబీ వరల్డ్ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలంటూ బ్యాంకుకు సూచించింది. ఆర్బీఐ సూచించిన అంశాలను ఇప్పటికే సరిదిద్దినట్లు, ఇతరత్రా ఏవైనా లోపాలుంటే వాటిని కూడా సరిచేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఆర్బీఐ ఆదేశాలను అమలు చేసే క్రమంలో కస్టమర్లకు సర్వీసులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది. -
‘మహాదేవ్’ లూటీ రోజుకు రూ.200 కోట్లు
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. బాలీవుడ్ ప్రముఖ నటులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యాప్‌పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత నెలలో భారత్‌లో 39 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వా«దీనం చేసుకుంది. యాప్ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ యాప్ బాగోతం బయటపడింది. ► ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణానికి చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ దుబాయ్‌లో మకాం వేసి, మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ► కొత్తకొత్త వెబ్సైట్లు, చాటింగ్ యాప్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆన్లైన్లో బెట్టింగ్‌ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ► తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్‌లో గ్రూప్‌లు ఏర్పాటు చేస్తారు. వారితో నేరుగా ఫోన్లలో మాట్లాడరు. వాట్సాప్ ద్వారానే సంప్రదిస్తుంటారు. ► కస్టమర్లను బెట్టింగ్ యాప్‌లో సభ్యులుగా చేర్చి, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత వారితో నగదు జమ చేయించుకుంటారు. ఈ వ్యవహారాన్ని మహాదేవ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు పర్యవేక్షిస్తుంటారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్ నిర్వాహకుల బినామీ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ► యాప్‌లో బెట్టింగ్‌లు కాస్తే తొలుత లాభాలు వచి్చనట్లు నమ్మిస్తారు. దాంతో కస్టమర్లో ఆశ పెరిగిపోతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రేరేపిస్తారు. చివరకు అదంతా నష్టపోయేలా బెట్టింగ్ యాప్‌లో రిగ్గింగ్ చేస్తారు. మళ్లీ కొత్త బకరా కోసం వేట మొదలవుతుంది. ► మహాదేవ్ బెట్టింగ్ యాప్ సంపాదన ప్రతిరోజూ రూ.200 కోట్లు ఉంటుందని ఈడీ దర్యాప్తులో తేలింది. ► భారత్, మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈలో మహాదేవ్ యాప్‌నకు వందలాది కాల్ సెంటర్లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. నాలుగు దేశాల్లో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. ► భారత్‌లోని 30 కాల్ సెంటర్లను అనిల్ దమానీ, సునీల్ దమానీ నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని ఈడీ అరెస్టు చేసింది. ► బెట్టింగ్ యాప్ జోలికి రాకుండా ఉండడానికి పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు నిర్వాహకులు హవాలా మార్గాల్లో లంచాలు ఇచి్చనట్లు వెల్లడయ్యింది. ► బెట్టింగ్ సిండికేట్ నడిపిస్తున్న ఓ యాప్‌ను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. ► ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఓ పెళ్లి నిర్వహణకు రూ.200 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. దీనిపై దర్యాప్తు చేయగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ గురించి బయటపడింది. ఈ పెళ్లిలో రణబీర్ కపూర్, శ్రద్ధాకపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్‌తోపాటు మరికొందరు బాలీవుడ్ నటులు ప్రదర్శన ఇచ్చారు. వారికి హవాలా మార్గంలో రూ.కోట్లలో చెల్లింపులు చేసినట్లు తేలింది. పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలను చార్టర్డ్ విమానంలో దుబాయ్‌కి తీసుకెళ్లారని ఈడీ అధికారులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అక్రమాలు అరికట్టేందుకు ‘ఈ మొబైల్ మైనింగ్ యాప్’
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ విభాగంలో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఈ మొబైల్ మైనింగ్ యాప్’కు రూపకల్పన చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసీ)తో కలసి గనులు, భూగర్భ వనరుల శాఖ రూపొందించిన మొబైల్ యాప్‌ను శనివారం ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గనుల శాఖ డీఎం కాత్యాయనిదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖనిజాలు, ఇటుక, ఇసుక తదితరాల రవాణా సమయంలో తనిఖీలు చేసి అనుమతులు ఉన్నాయా లేదా? అనే అంశాన్ని గనుల శాఖ సిబ్బంది తక్షణమే తెలుసుకునేందుకు ఈ యాప్ దోహదం చేస్తుందని మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేయడం, అనుమతులు ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో ఖనిజాల తరలింపు.. తదితరాలకు అడ్డకట్ట వేయడంతో పాటు జరిమానాల విధింపునకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. జరిమానా విధింపు, చెల్లింపు అంశాల్లో పారదర్శకతతో పాటు, ఆన్లైన్లో చెల్లింపులు ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఖనిజ రవాణా సమాచారాన్ని డీలర్లు, లీజు హోల్డర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, అనుమతుల నిర్ధారణ కూడా ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఈ యాప్ ఉపయోగంలోకి వస్తే క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసే గనుల శాఖ ఏడీలు, అసిస్టెంట్ జియాలజిస్టులు, టెక్నీíÙయన్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్లకు విధుల నిర్వహణ సులభతరమవుతుందని మంత్రి వెల్లడించారు. -
గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్! రంగంలోకి ఫోన్‌పే..
గూగుల్ (Google), యాపిల్ (Apple) ఆధిపత్యానికి చెక్ పెడుతూ మరో కొత్త యాప్ స్టోర్ రాబోతోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే (PhonePe) తన మొబైల్ యాప్ స్టోర్‌ను డెవలపర్ల కోసం తెరుస్తోంది. ఇండస్ యాప్‌స్టోర్ (Indus Appstore) అనే పేరుతో మొబైల్ యాప్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్లో తమ యాప్‌లను ప్రచురించడానికి ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లను ఆహ్వానిస్తోంది. ఈ యాప్‌స్టోర్‌లో యాప్‌లను ఉంచడానికి కానీ, డౌన్లోడ్ చేసుకునేందుకు కానీ ఎటువంటి రుసుము ఉండదని తెలుస్తోంది. (High Severity Warning: ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్‌కు హై సివియారిటీ వార్నింగ్!) ఇండస్ యాప్‌స్టోర్ డెవలపర్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు ఫోన్‌పే ధ్రువీకరించింది. ప్లాట్‌ఫామ్‌లోని యాప్ లిస్టింగ్‌లు మొదటి సంవత్సరం ఉచితంగా ఉంటాయని, ఆ తర్వాత నామమాత్రపు వార్షిక రుసుము వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇండస్ యాప్ స్టోర్‌లో డెవలపర్లు తమ యాప్‌లను ఇంగ్లిష్ కాకుండా మరో 12 భారతీయ భాషల్లో లిస్ట్ చేయవచ్చు. అలాగే ఆయా భాషల్లోని తమ యాప్ లిస్టింగ్‌లకు ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. యాప్‌లకు సంబంధించి తలెత్తే సమస్యల పరిష్కారానికి గూగుల్, యాపిల్ యాప్ స్టోర్ల లాగే ఇండస్ యాప్ స్టోర్ కూడా భారత్ కేంద్రంగా ఈ-మెయిల్ లేదా చాట్‌బాట్ ద్వారా 24x7 అంకితమైన సపోర్ట్ వ్యవస్థను అందిస్తున్నట్లు పేర్కొంది. యాప్‌స్టోర్ ప్రారంభానికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా ఇండస్ యాప్‌స్టోర్ తమ వైబ్సైట్లో ప్రచురించింది. ఇండస్ యాప్‌స్టోర్ యూజర్లకు ఎలా అందుబాటులోకి రానున్నదో కూడా చూపించింది. అయితే ఈ యాప్‌స్టోర్ ఎప్పుడు లాంచ్ అవుతుందన్న దానిపై ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. -
జీఎస్టీ రివార్డ్ స్కీమ్.. సెప్టెంబర్ 1 నుంచే..
GST reward scheme: జీఎస్టీ బిల్లు అప్లోడ్ చేస్తే నగదు బహుమతులిచ్చే 'మేరా బిల్ మేరా అధికార్' (Mera Bill Mera Adhikaar Scheme) జీఎస్టీ రివార్డ్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. కొనుగోలుదారులు ప్రతి ఒక్కరూ బిల్లును అడిగి తీసుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకం తొలుత ఆరు రాష్ట్రాల్లో అమలు కానుంది. అమలయ్యే రాష్ట్రాలు ఇవే.. 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ రివార్డ్ స్కీమ్‌ను మొదటి దశలో అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు, పుదుచ్చేరి, డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) తెలిపింది. ఈ మేరకు స్కీమ్ వివరాలతో ట్వీట్ చేసింది. అందుబాటులోకి మొబైల్ యాప్ 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ యాప్‌ను సీబీఐసీ ఇప్పటికే ఐవోఎస్, ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైన వస్తువు కొలుగోలు చేసినప్పుడు విక్రేత ఇచ్చిన బిల్లును ఈ యాప్‌లో అప్లోడ్ చేయడం ద్వారా నగదు బహుమతులు పొందవచ్చు. అప్లోడ్ చేసే బిల్లులో విక్రేత జీఎస్టీఐఎన్, ఇన్వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తానికి సంబంధించిన వివరాలు ఉండాలి. రూ. కోటి వరకూ ప్రైజ్ మనీ జీఎస్టీ నమోదు చేసుకున్న దుకాణాలు, సంస్థలు ఇచ్చే బిల్లులను 'మేరా బిల్ మేరా అధికార్' యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. ఇలా అప్లోడ్ బిల్లులన్నీ నెలకోసారి, మూడు నెలలకోసారి లక్కీ డ్రా తీస్తారు. విజేతలకు రూ. 10 వేల నుంచి రూ. 1 కోటి వరకు నగదు బహుమతులు అందజేస్తారు. లక్కీ డ్రాకు అర్హత పొందేందుకు కనీస కొనుగోలు విలువ రూ. 200 ఉండాలి. ఒక నెలలో గరిష్టంగా 25 బిల్లులను అప్లోడ్ చేయవచ్చు. ఇదీ చదవండి: ‘జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పోతోంది’.. ఎవరన్నారీ మాట? Mera Bill Mera Adhikaar Scheme! 👉 Launch from States of Haryana, Assam, Gujarat & UTs of Dadra & Nagar Haveli, Daman & Diu & Puducherry on 01/09/23. 👉Invoice incentive scheme which allows you to earn cash prizes on upload of GST Invoices.#Mera_Bill_Mera_Adhikaar pic.twitter.com/imH9VkakiY — CBIC (@cbic_india) August 22, 2023 -
కెనరా బ్యాంక్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్.. ఇక్కడ మామూలు రూపాయిలు కాదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తాజాగా యూపీఐ ఇంటరాపరబుల్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. వ్యాపారుల యూపీఐ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డిజిటల్ కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిపేందుకు ఇది ఉపయోగపడగలదని బ్యాంక్ ఎండీ కె. సత్యనారాయణ రాజు తెలిపారు. అలాగే ప్రత్యేకంగా సీబీడీసీ బోర్డింగ్ ప్రక్రియ అవసరం లేకుండా ప్రస్తుతం తమకున్న యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారానే వ్యాపారులు డిజిటల్ కరెన్సీలో చెల్లింపులను పొందవచ్చని ఆయన వివరించారు. అనుసంధానించిన ఖాతా నుంచి కస్టమర్లు తమ సీబీడీసీ వాలెట్‌లోకి కరెన్సీని లోడ్ చేసుకోవచ్చని, దాన్ని సీబీడీసీ వాలెట్ ఉన్న ఎవరికైనా బదలాయించవచ్చని, అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని, స్వీకరించవచ్చని రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 నగరాల్లో దీన్ని కస్టమర్లు, వ్యాపారులకు పైలట్ ప్రాతిపదికన దీన్ని ఆఫర్ చేస్తున్నట్లు వివరించారు. -
జీఎస్టీ బిల్లు ఉంటే చాలు.. రూ.కోటి వరకూ నగదు బహుమతులు
GST reward scheme: చాలా కాలంగా ఎదురుచూస్తున్న 'మేరా బిల్ మేరా అధికార్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. దీని ద్వారా ఏదైనా కొనుగోలుకు సంబంధించిన జీఎస్టీ ఇన్‌వాయిస్‌ని మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేసి రివార్డ్ పొందవచ్చు. ఇన్వాయిస్ ప్రోత్సాహక పథకం కింద రిటైలర్ లేదా హోల్‌సేల్ వ్యాపారి నుంచి తీసుకున్న ఇన్వాయిస్ను యాప్‌లో అప్లోడ్ చేసినవారికి నెలవారీగా, త్రైమాసికంవారీగా లక్కీ డ్రా తీసి రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకూ నగదు బహుమతులు ఇవ్వనున్నట్లుగా సంబంధిత అధికారులు పీటీఐ వార్తా సంస్థతో పేర్కన్నారు. 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌లో అప్లోడ్ చేసే ఇన్వాయిస్లో విక్రేతకు సంబంధించిన జీఎస్టీఐఎన్, ఇన్వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తం వివరాలు ఉండాలి. ఒక వ్యక్తి ఒక నెలలో గరిష్టంగా 25 ఇన్వాయిస్లను యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అయితే ఈ ఇన్వాయిస్ కనీసం రూ. 200 కొనుగోలు విలువను కలిగి ఉండాలి. ప్రతి నెలా లక్కీ డ్రాలు కంప్యూటరైజ్డ్ లక్కీ డ్రాల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. ప్రతి నెలా 500కు పైగా లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. ప్రైజ్ మనీ రూ.లక్షల్లో ఉంటుంది. అలాగే త్రైమాసానికి రెండు చొప్పున లక్కీ డ్రాలు తీస్తారు. ఇక్కడ రూ. 1 కోటి వరకూ నగదు బహుమతి ఉంటుంది. ఈ పథకం తుది దశకు చేరుకుందని, ఈ నెలలోనే దీన్ని ప్రారంభించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. జీఎస్టీ ఎగవేతను అరికట్టడానికి , వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లకు మించిన సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ని తప్పనిసరి చేసింది. 'మేరా బిల్ మేరా అధికార్' స్కీమ్ బీ2సీ కస్టమర్ల విషయంలో కూడా ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అంగీకరిస్తుంది. తద్వారా కొనుగోలుదారు లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హత పొందవచ్చు. ఇదీ చదవండి: Revised I-T rules: ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా! -
ఒక్క క్లిక్‌తో.. ఆర్టీసీ బస్సు ఎక్కడుందో చెబుతుంది.. డౌన్లోడ్ ఇలా..
సాక్షి, హైదరాబాద్/ఆఫ్జల్‌గంజ్: లక్షలాది మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత సులభతరం చేసేందుకు టీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, వివిధ రకాల ఫీచర్లతో రూపొందించిన ఆర్టీసీ బస్ వెహికల్ ట్రాకింగ్ మొబైల్ యాప్ ‘గమ్యం’ను ఆ సంస్థ ఎండీ సజ్జనార్ శనివారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ‘గమ్యం’ యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో తిరిగే పుష్పక్, మెట్రో బస్సులతో పాటు దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, జిల్లాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులను కూడా ‘గమ్యం’ యాప్ ద్వారా ట్రాకింగ్ చేయవచ్చు. సుమారు 4,170 బస్సులను వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. ప్రయాణికులు తాము ఎంపిక చేసుకున్న బస్సు ఎక్కడుందో, ఎంతసేపట్లో తాము ఎదురుచూసే బస్‌స్టేషన్‌కు చేరుకుంటుందో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దశలవారీగా ఆర్టీసీలోని అన్ని బస్సులను ట్రాకింగ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. అక్టోబర్ నాటికి అన్ని బస్సులకు ట్రాకింగ్ సదుపాయం వస్తుందని అధికారులు తెలిపారు. కొత్తగా 776 బస్సులు: ఎండీ సజ్జనార్ ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ, ‘గమ్యం’ యాప్ ద్వారా ప్రతి బస్సు వాస్తవ స్థితి కచ్చితంగా తెలుస్తుందన్నారు. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ప్రయాణికుడు తాను ప్రయాణం చేసే బస్సును ప్రతి క్షణం ట్రాక్ చేయవచ్చునన్నారు. ప్రతి రోజూ 45 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రవాణారంగంలో పోటీని ఎదుర్కొనేందుకు అత్యాధునిక హంగులతో రూపొందించిన 776 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. చదవండి: బిల్లుల లొల్లి.. మళ్లీ!.. గవర్నర్ వద్ద నిలిచిపోయిన 12 బిల్లులు ’’ ‘గమ్యం’ మొబైల్ యాప్‌లో ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడమే కాకుండా, బస్సు నడిపే డ్రైవర్, కండక్టర్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ బస్సు ఎక్కడుందో తెలిసిపోతుంది. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు’’ అని ఎండీ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. రవీందర్, ఈడీలు పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, జేడీ (వి అండ్ ఎస్) సంగ్రామ్ సింగ్ పాటిల్, డిజిటల్ ఐటీ కన్సల్టెంట్ దీపా కోడూర్, మ్యాప్ మై ఇండియా ప్రతినిధి హర్మ న్ సింగ్ అరోరా, చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ విజయ పుష్ప, సీఈ రాజశేఖర్, రంగారెడ్డి ఆర్.ఎం. శ్రీ శ్రీధర్ పాల్గొన్నారు. మహిళల భద్రతక ‘ఫ్లాగ్ ఏ బస్’ ఫీచర్ ►మహిళా ప్రయాణికుల భద్రత కోసం గమ్యం యాప్ లో ‘ఫ్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. రాత్రి వేళల్లో బస్టాప్‌లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. ►రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. యాప్‌లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్లో స్క్రీన్‌పై ఆటోమేటిక్‌గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్‌ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ►అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉంది. డయల్ 100, 108కి కూడా ఈ యాప్‌ను అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. ►బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహా యం, రోడ్డు ప్రమాదం, తది తర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపో ర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. ►‘TSRTC Gamyam'’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tsrtc.telangana.gov.in నుంచి కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ►ఈ యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివ రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ►ఇప్పటికే మొబైల్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్న వాళ్లు అప్డేట్ చేసుకో వడం తప్పనిసరి. -
‘ఎస్బీఐ యోనో’ ఇక అందరిది.. ఆ యూపీఐ యాప్‌లకు గట్టిపోటీ!
SBI YONO App: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ యోనో మొబైల్ యాప్ సేవలను మరింత విస్తృతం చేసింది. ఇకపై ఈ యాప్‌ను ఎస్బీఐ కస్టమర్లు మాత్రమే కాకుండా ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేని వారు కూడా ఎస్బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని స్టేట్ బ్యాంక్ కల్పించింది. తమ డిజిటల్ బ్యాంకింగ్ యాప్ సేవలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను ఎస్బీఐ తీసుకొచ్చినట్లు చెబుతోంది. ‘యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్’ చొరవ ద్వారా స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి యూపీఐ సేవలను ఏ బ్యాంక్ కస్టమర్ అయినా పొందవచ్చని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. యూపీఐ సేవలతో పాటు కార్డ్ లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని కూడా ఎస్బీఐ కల్పించింది. ఐసీసీడబ్ల్యూ సౌకర్యం ఉన్న ఏటీఎంలలో ఏ బ్యాంక్ కస్టమర్ అయినా ఎస్బీఐ యోనో యాప్‌లోని ‘యూపీఐ క్యూఆర్ క్యాష్’ అనే ఆప్షన్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేనివారికి కూడా యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఎస్బీఐ యోనో యాప్.. ఇప్పుడున్న ఫేన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర బ్యాంక్ కస్టమర్లు యోనో యాప్‌ను ఉపయోగించండిలా.. ఎస్బీఐ యోన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ‘న్యూ టు ఎస్బీఐ’ను క్లిక్ చేసి ‘రిజిస్టర్ నౌ’పై నమోదు చేసుకోండి. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను ధ్రువీకరించి యూపీఐ చెల్లింపులకు నమోదు చేసుకోండి యూపీఐ ఐడీని సృష్టించడానికి మీ బ్యాంక్‌ని ఎంచుకోండి ఎస్బీఐ పే కోసం రిజిస్ట్రేషన్‌ని నిర్ధారిస్తూ ఒక మెసేజ్ మీ మొబైల్‌కు వస్తుంది అందించిన ఆప్షన్ల నుంచి ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా ఎస్బీఐ యూపీఐ హ్యాండిల్‌ను సృష్టించండి లాగిన్ చేయడానికి, చెల్లింపులు చేయడానికి ఆరు అంకెల శాశ్వత ఎంపిన్‌ను సెట్ చేసుకోండి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, కాంటాక్ట్స్‌కు డబ్బు పంపడం, ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేసుకోవడం వంటివి ప్రారంభించండి ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కార్డ్ లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు -
14వ విడత సాయం.. పీఎం కిసాన్‌కు ఈ–కేవైసీ తప్పనిసరి
సాక్షి, అమరావతి: ప్రతి విడతకు ఈ–కేవైసీ ఉంటేనే పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నిధులు జమచేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 14వ విడత పీఎం కిసాన్ పథకానికి రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రామాణీకరణ తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రామాణీకరణను పూర్తిచేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.ఎస్.జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిపై ఆయన గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ–కేవైసీ ప్రామాణీకరణ ఉద్దేశం వారి వాస్తవికతను ధ్రువీకరించుకోవడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో అర్హులైన లబి్ధదారుల ఈ–కేవైసీ ప్రామాణీకరణను ఈ నెలాఖరులోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ–కేవైసీ పూర్తిచేయడానికి మూడు పద్ధతులకు కేంద్రం అనుమతించినట్లు తెలిపారు. ఆధార్ లింక్ అయిన మొబైల్ ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా ఈ–కేవైసీ పూర్తిచేయాలని సూచించారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఫేస్ అథెంటికేషన్ మొబైల్ యాప్ ద్వారా ఈ–కేవైసీ పూర్తిచేయాలని చెప్పారు. ఇప్పటికే ఫేస్ అథెంటికేషన్ మొబైల్ యాప్ ద్వారా 45,636 మంది ఈ–కేవైసీ పూర్తిచేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 39,48,002 రికార్డులకు ఈ–కేవైసీ పూర్తిచేశారని, ఇంకా 6,47,068 రికార్డులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటన్నింటిని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. -
వన్-వ్యూ ఫీచర్: ఒకే యాప్‌లో అన్ని బ్యాంకు ఖాతాల వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ బ్యాంకుల్లోని ఖాతాల వివరాలన్నింటినీ ఒకే చోట చూసుకునేందుకు వీలుగా యాక్సిస్ బ్యాంక్ తమ మొబైల్ యాప్‌లో వన్–వ్యూ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ రంగ బ్యాంకు ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని సంస్థ తెలిపింది. దీనితో యాక్సిస్ బ్యాంక్‌యేతర ఖాతాలను కూడా తమ కస్టమర్లు.. అకౌంట్లకు జోడించుకుని బ్యాలెన్స్‌లు, వ్యయాలు, లావాదేవీల స్టేట్మెంట్లను ఒకే చోట చూసుకునేందుకు వీలుంటుందని బ్యాంకు ప్రెసిడెంట్ సమీర్ శెట్టి తెలిపారు. అకౌంట్ అగ్రిగేటర్ విధానాన్ని ఉపయోగించి ఈ కొత్త తరహా బ్యాంకింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఫీచర్‌తో పలు మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను చూసుకోవాల్సిన శ్రమ తప్పుతుందని, లింకు చేసిన ఖాతాల నుంచి కస్టమర్లు లావాదేవీల వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని లేదా ఈమెయిల్‌కు పంపుకోవచ్చని తెలిపారు. ఒకవేళ వద్దనుకుంటే ఎప్పుడైనా ఆయా ఖాతాల లింకును తీసివేయొచ్చని వివరించారు. -
రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే..
ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా.. భారత్‌కు చెందిన పారిశ్రామికవేత్త వ్యవస్థాపకురాలు. సింగపూర్‌లో పిల్లల కోసం లిటిల్ పాడింగ్టన్ అనే ప్రీ స్కూల్‌ను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పుడక్కడ బాగా పాపులరైన ప్రీ స్కూల్. దీంతోపాటు పిల్లల కోసం ఆమె ప్రారంభించిన మొబైల్ యాప్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. కోటి డౌన్లోడ్లు లిటిల్ పాడింగ్టన్ ప్రీ స్కూల్‌ను నిర్వహిస్తూనే కోవిడ్ సమయంలో క్రియేటివ్ గెలీలియో అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఇది 3 నుంచి 8 సంవత్సరాల పిల్లలకు విద్యను అందించడానికి ఉద్దేశించిన స్టార్టప్. ఈ అప్లికేషన్ భారత ఉపఖండంలో దాదాపు కోటి మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ వీడియోలు, గేమిఫికేషన్, వ్యక్తిగతీకరించిన అభ్యాస ప్రక్రియల ద్వారా పిల్లల విద్యలో సహాయం చేస్తుంది. పిల్లలకు ఇష్టమైన పాత్రలైన చక్ర, బాహుబలి, శక్తిమాన్, బిగ్ బీస్ జూనియర్ తదితర క్యారెక్టర్లు పాఠాలు చెబుతాయి. వ్యాపార నేపథ్యం లేకుండానే.. ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆమెకు ఎలాంటి వ్యాపార నేపథ్యం లేదు.. ఎటువంటి బిజినెస్ కోర్సులు ఆమె చేయలేదు. కానీ ఈ కంపెనీలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ కంపెనీ గత ఏడాది ఫండింగ్ రౌండ్లో సుమారు రూ.60 కోట్లు సమీకరించింది. 40 మిలియన్ డాలర్ల (రూ. 330 కోట్లు) వాల్యుయేషన్‌తో తమ కంపెనీ రౌండ్‌ను పెంచిందని ప్రేరణ చెప్పారు. తక్కువ మార్కెటింగ్ ఖర్చులతో తన ఎదుగుదల క్రమబద్ధంగా జరిగిందన్నారు. 30 మంది సిబ్బంది ఉండగా ఏడాదిలోనే రెట్టింపు అంటే 60 మందికి పెంచినట్లు తెలిపారు. ఇండోసియా, వియత్నాంలో తమ సంస్థలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు అప్పట్లో ఆమె పేర్కొన్నారు. ఆమె సింగపూర్ వెంచర్లో ఇప్పుడు ఏడు పాఠశాలలు ఉన్నాయి. పెరుగుతున్న జనాభా, ఉపాధ్యాయుల లోటును తీర్చడానికి ఆన్లైన్ విద్యను ప్రారంభించారామె. Honored to be featured in the current edition of @EntrepreneurIND's #Shepreneurs- Women to Watch 2023. Thank you for the feature @PunitaSabharwal https://t.co/IvZLcfsm0b — Prerna Jhunjhunwala (@prernaj87) April 3, 2023 ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
హార్ట్ పేషంట్ల కోసం ప్రత్యేక యాప్.. ఆవిష్కరించిన ఫార్మా దిగ్గజం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం లుపిన్‌లో భాగమైన లుపిన్ డిజిటల్ హెల్త్ (ఎల్డీహెచ్) తాజాగా హృద్రోగ చికిత్స పొందిన పేషంట్ల కోసం లైఫ్ పేరిట మొబైల్ యాప్ ప్రోగ్రాంను ఆవిష్కరించింది. చికిత్స పొందిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షలు, డాక్టర్లను మళ్లీ సంప్రదించాల్సిన సందర్భాలు మొదలైన వాటిని పర్యవేక్షించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి, అవసరాన్ని బట్టి ఆరు పరికరాల నుంచి సేకరించే డేటా అంతా .. వాటికి అనుసంధానమైన లైఫ్ మొబైల్ యాప్‌లో నిక్షిప్తమవుతుంది. కంపెనీ తరఫు నుంచి నియమితులైన హెల్త్ కోచ్‌లు తదితర సిబ్బంది పేషంటుకు కావల్సిన తోడ్పాటు అందిస్తారని బుధవారమిక్కడ విలేకరులకు ఎల్డీహెచ్ సీఈవో సిద్ధార్థ్ శ్రీనివాసన్ తెలిపారు. డాక్టరే స్వయంగా సిఫార్సు చేయాల్సిన ఈ ప్రోగ్రాం సబ్స్క్రిప్షన్ నెలకు రూ. 500 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌తో పాటు గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడా ఇది అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం 400 మంది వరకు డాక్టర్లు తమ ప్లాట్‌ఫాంలో చేరారని, వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 75 మంది వరకు ఉన్నారని ఎల్డీహెచ్ బిజినెస్ హెడ్ రాజేష్ ఖన్నా తెలిపారు. ఆగస్టు నాటికి 5,000 మందిని డాక్టర్లకు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థలో 350 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారని, మరిన్ని కొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక యాప్! రూపొందించిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం -
ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక యాప్!
న్యూఢిల్లీ: ఈ–ట్రాన్ ఎలక్ట్రిక్ కార్ల కస్టమర్లకు చార్జింగ్ పాయింట్ల వివరాలను అందుబాటులో ఉంచడంపై లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి ఇండియా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వివిధ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. మైఆడికనెక్ట్ యాప్‌లో ’చార్జ్ మై ఆడి’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది చార్జింగ్ పాయింట్లకు అగ్రిగేటర్‌గా పనిచేస్తుంది. ఇదీ చదవండి: హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు దీనికోసం ఆర్గో ఈవీ స్మార్ట్, చార్జ్ జోన్, రీలక్స్ ఎలక్ట్రిక్, లయన్చార్జ్, జియోన్ చార్జింగ్ అనే అయిదు పార్ట్నర్లతో జట్టు కట్టింది. దీంతో ఈ–ట్రాన్ యజమానులకు 750 పైచిలుకు చార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. తాము వెళ్లే రూట్లో ఉండే పాయింట్ల సమాచారం ముందుగా తెలిస్తే కస్టమర్లు తమ ప్రయాణ ప్రణాళికలను వేసుకునేందుకు సులువవుతుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఆడి ఇండియా ప్రస్తుతం ఈ–ట్రాన్ శ్రేణిలో 50, 55, స్పోర్ట్‌బ్యాక్, జీటీ మొదలైన వాహనాలను విక్రయిస్తోంది. ఇదీ చదవండి: ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్ -
80 ఏళ్లు పైబడ్డ వారికి ‘ఇంటి నుంచే ఓటు’
బెంగళూరు: 80 ఏళ్లు పై బడ్డ వారికి ఇంటినుంచే ఓటేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని అమలు చేస్తున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘80 ఏళ్లు దాటిన వారు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయడాన్నే మేమూ ప్రోత్సహిస్తాం. అలా వెళ్లలేని వారికోసం తొలిసారిగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘ఇందుకోసం ‘సక్షమ్’ పేరిట మొబైల్యాప్ రూపొందించాం. అందులోకి వెళ్లి ఇంటి నుంచి ఓటేసే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఎన్నికల సిబ్బంది వారింటికి వెళ్తారు. వారిచ్చే ఫామ్ 12డి ద్వారా ఓటేయవచ్చు. మొత్తం ప్రక్రియను వీడియో తీస్తాం. గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం’’ అని వివరించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్లైన్లోనే దాఖలు చేసేందుకు వీలుగా సువిధ పేరిట మరో మొబైల్ యాప్ రూపొందించినట్టు సీఈసీ వెల్లడించారు. సమావేశాలు, ర్యాలీలకు కూడా దీని ద్వారానే అనుమతి కోరవచ్చన్నారు. అభ్యర్థి గురించి ఓటర్లకు అవగాహన కోసం నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) ఉద్యమం కూడా చేపట్టినట్టు చెప్పారు. ‘‘నేరచరిత్ర ఉన్న వారిని అభ్యర్థిగా ఎంచుకునే పార్టీలు అందుకు కారణాలను తమ వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఇ–విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు’’ అన్నారు. కర్నాటకలో ఎన్నికల తేదీని త్వరలో నిర్ణయిస్తామన్నారు. -
టీటీడీ మొబైల్ యాప్ ప్రారంభం
తిరుమల: భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా ‘టీటీ దేవస్థానమ్స్’ పేరుతో రూపొందించిన మొబైల్ యాప్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్ యాప్ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్ చేసుకోవచ్చన్నారు. విరాళాలు కూడా ఇదే యాప్ నుంచి అందించవచ్చని చెప్పారు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ యాప్ ద్వారా చూడవచ్చని తెలిపారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్ ద్వారా క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని తెలిపారు. నూతన యాప్ సేవలపై భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని పొందుపరుస్తామని చెప్పారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ భక్తులు లాగిన్ అయ్యేందుకు యూజర్ నేమ్‌తోపాటు ఓటీపీ ఎంటర్ చేస్తే చాలని, పాస్వర్డ్ అవసరం లేదని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను ఐదు నుంచి ఆరు నెలలు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని వెల్లడించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిషోర్, జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనీష్ షా, ఐటీ సలహాదారు అమర్, ఐటీ జీఎం సందీప్ పాల్గొన్నారు. చదవండి: వైద్యచరిత్రలో మరో మైలురాయి.. మారేడుమిల్లి ఘటనతో చలించిపోయి.. -
ఒక్క క్లిక్‌తో ఈజీగా బస్సు జాడ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు బయలుదేరే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తాము బయలుదేరి వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో మొబైల్ ఫోన్లో తెలుసుకొనే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ‘టీఎస్ ఆర్టీసీ బస్ ట్రాకింగ్’యాప్‌ను వినియోగంలోకి తెచ్చింది. ప్రయాణికులు గూగుల్ ప్లే స్లోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని బస్సు జాడ తెలుసుకోవచ్చు. ప్రస్తుతం బుకింగ్ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతోపాటు బస్ ట్రాకింగ్ లింక్‌ను కూడా అధికారులు ఎస్సెమ్మెస్ రూపంలో పంపిస్తున్నారు. ఆ లింక్‌పై క్లిక్ చేయగానే బస్సు ఎక్కడుందో ప్రయాణికులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ట్రాకింగ్ యాప్ వివరాల ఆధారంగా బస్సు వచ్చే సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. ‘‘ప్రస్తుతం ముందస్తు రిజర్వేషన్ చేసుకునే 1,800 బస్సు సర్వీస్‌లకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించాం. సంక్రాంతి సందర్భంగా రిజర్వేషన్ సౌకర్యం ఉన్న 600 ప్రత్యేక బస్సులకు కూడా ట్రాకింగ్ సౌకర్యాన్ని అనుసంధానం చేశాం. త్వరలో హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్ప్రెస్లుసహా మిగిలిన సర్వీస్‌లకు ట్రాకింగ్ సదుపాయం కల్పిస్తాం. ఒక్క క్లిక్‌తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు’’అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. ►గూగుల్ ప్లేస్టోర్ నుంచి, టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ►ఈ యాప్‌లో ప్రయాణికులు వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ►హైదరాబాద్ నగరంతోపాటు జిల్లా సర్వీస్‌లకు సంబంధించిన సమాచారాన్ని వేర్వేరుగా పొందుపర్చారు. ►ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే బస్సుల వివరాలతోపాటు అవి ప్రస్తుతమున్న లొకేషన్‌ను తెలుసుకోవచ్చు. ►ప్రయాణికులు సమీపంలోని బస్టాప్, సర్వీస్, బస్సు నంబర్లను ఎంటర్ చేసి వివరాలను పొందవచ్చు. ►అత్యవసర పరిస్థితులు తలెత్తితే రిపోర్ట్ చేసే సదుపాయాన్ని ఈ యాప్‌లో కల్పించారు. ►బస్సు బ్రేక్‌డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. -
సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభం
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ వెర్షన్ 2.0 మొబైల్ అప్లికేషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా కోర్టు కార్యకలాపాలను న్యాయమూర్తులు, న్యాయవాదులు, కేంద్ర శాఖల నోడల్ అధికారులు రియల్ టైమ్‌లో వీక్షించవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు. ఐఓఎస్ వెర్షన్ మరో వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. యాప్‌లో లాగిన్ కావడం ద్వారా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు. కేసులు, ఉత్తర్వులు, తీర్పులు, పెండింగ్ కేసుల స్థితిగతులను తెలుసుకొనేందుకు వీలవుతుందని చెప్పారు. ఇదీ చదవండి: ఎంసీడీ.. ఆప్, బీజేపీ మధ్య అధికార పోరుకు కొత్త వేదిక -
AP: మరిన్ని కొత్త ఫీచర్లతో సీఎం యాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచి, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూపొందించిన సీఎం యాప్‌ను మరింత ఆధునీకరించి రైతులకు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉండేలా పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది . ఆర్బీకే కేంద్రంగా అందించే సేవల కోసం ఏపీ మార్క్‌ఫెడ్ అభివృద్ధి చేసిన సీఎం యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్స్ ద్వారా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో రైతులతో పాటు వ్యాపారులు అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుంది. చదవండి: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు రైతులు తాము పండించిన పంటకు మార్కె ట్లో రేట్లు, నాణ్యత తదితర వివరాలన్నీ తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. వ్యాపారులు కొనుగోలు చేసిన పంట, ఏ సీజన్లో సాగు చేశారు, ఎప్పుడు కోతకు వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎప్పుడు లోడింగ్ చేశారు.. ఏ గోదాములో ఎంత కాలం నిల్వ చేశారు.. కోసినప్పుడు నాణ్యత ఎలా ఉంది.. ప్రస్తుతం నాణ్యత ఎలా ఉంది.. ఇలా ప్రతి విషయాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ యాప్ సేవలను ఆర్బీకేలలో పొందే అవకాశాన్ని కల్పించారు. ఉత్పత్తులకు రంగులు సీఎం యాప్‌లో కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన క్యూఅర్ కోడ్ (సీల్) విధానం తీసుకొచ్చారు. బ్యాగ్‌పై ముద్రించే క్యూఆర్ కోడ్ ద్వారా ఆ ఉత్పత్తిని ఏ ఆర్బీకే పరిధిలో ఏ గ్రామానికి చెందిన రైతు నుంచి కొన్నారో ట్రేడర్ తెలుసుకోవచ్చు. నాణ్యత ప్రమాణాలను బట్టి ఉత్పత్తికో రంగు కేటాయించారు. సాధారణ నాణ్యతకు తెలుపు, అత్యుత్తమ నాణ్యతతో ఉంటే నీలం, సేంద్రియ పంటలకు ఆకుపచ్చ రంగు కేటాయించారు. ఈ–వేలంలో కొనుగోలుదారులు వారికి కావాల్సిన ఉత్పత్తులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. నాణ్యతను ట్రాక్ చేయవచ్చు... కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్) ఫీచర్ ద్వారా ప్రతి లాట్ నుంచి ర్యాండమ్‌గా 2 లేదా 3 బ్యాగ్‌లను ఫొటోలు తీస్తే చాలు... వాటిపై ఉండే క్యూఆర్ కోడ్‌తో వాటి నాణ్యత, పండించిన గ్రామం, ఎప్పుడొచ్చాయి, రైతు పేరు, సేకరణ తేదీ వంటి మొత్తం వివరాలు వెంటనే వస్తాయి. ఆన్లైన్, ఈ–వేలంలో పాల్గొనే వ్యాపారులకు ఇది చాలా ఉపయోగకరం. ఫార్మర్ ఆప్షన్‌తో ధరల వివరాలు సీఎం యాప్‌లో కొత్తగా ఫార్మర్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా రైతులు పంట ఉత్పత్తుల మార్కెట్ ధరల వివరాలను స్వయంగా తెలుసుకోవచ్చు. వ్యవసాయ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, రైతు బజార్లు, రాష్ట్ర, కేంద్ర గిడ్డంగులు, రైతు సాధికార సంస్థ, ఆయిల్ఫె డ్, నాఫెడ్ వంటి సంస్థలు కూడా వినియోగించుకునేలా ఈ యాప్‌ని అప్‌గ్రేడ్ చేశారు. యాప్ ద్వారా ప్రస్తుతం వాయిస్ అసిస్టెన్స్, ఈ–క్రాప్, ఎస్ఎంఎస్ హెచ్చరిక, ఆటో సేకరణ షెడ్యూల్, బయోమెట్రిక్, జియో ఫెన్సిం గ్, ఈ–సైన్, ఆధార్ ఆధారిత చెల్లింపులు, ఆటో–జనరేషన్ బిల్లు, గూగల్ మ్యాప్స్, రియల్ టైమ్ పేమెంట్ ట్రాకింగ్ తదితర సేవలు అందిస్తున్నారు. సకాలంలో చెల్లింపులు జరిగేలా రియల్‌టైమ్ గవర్నెన్స్‌ను కూడా తీసుకొచ్చారు. రసాయన అవశేషాలనూ తెలుసుకోవచ్చు సీఎం యాప్‌లో ఇకపై పంట పండించిన విధానం, పద్ధతులను కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా నేచురల్ ఫార్మింగ్, సేంద్రియ ఫార్మింగ్ ఆప్షన్లు తీసుకొచ్చారు. వీటి ద్వారా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించే రైతుల నుంచి నేరుగా కొనవచ్చు. యాప్‌లో రైతు సాధికార సంస్థ, ప్రైవేటు ఏజెన్సీల కెమికల్ పరీక్షల రిపోర్టులను అప్లోడ్ చేస్తారు. దీనివల్ల పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. -
అటెండెన్స్ యాప్‌తో డుమ్మాలకు చెక్.. గంటలోనే సమాచారం
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. మనబడి నాడు–నేడుతో ఎన్నో బడుల రూపురేఖలు మారిపోయాయి. మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తెచ్చారు. రోజుకో మెనూతో పౌష్టికాహారం అందిస్తున్నారు. విద్యాకానుక అందజేస్తున్నారు. బోధనపై ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు స్కూల్ అటెండెన్స్ యాప్‌ను తెచ్చారు. దీంతో పిల్లలు సరైన సమయానికి పాఠశాలలకు వెళ్లి చదువుకునే అవకాశం ఉండడంతో వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు(టౌన్): పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు రిజిస్టర్లో నమోదు చేస్తుంటారు. కొంతమంది పిల్లలు బడికి వెళ్లకుండా క్లాసులకు డుమ్మా కొట్టేవారు. దీంతో వారు చదువులో వెనుకంజలో ఉండేవారు. ఈ విషయంలో విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అంతంతమాత్రంగానే ఉండేది. విద్యార్థుల హాజరు పక్కాగా ఉండాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ అటెండెన్స్ యాప్‌ను కొంతకాలం క్రితం ప్రారంభించింది. సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి విద్యార్థుల హాజరును మాన్యువల్ పద్ధతితోపాటు ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేస్తున్నారు. యాప్‌లో రోజూ ఉదయం 10 గంటల్లోపే వివరాలు నమోదు చేస్తున్నారు. వీరు భోజనం కూడా చేస్తారా లేదా అనే విషయాన్ని మరో విండోలో ఉంచుతారు. ఈ ప్రక్రియను ప్రధానోపాధ్యాయుడు పరిశీలించి హెచ్ఎం లాగిన్ ద్వారా ఆన్లైన్ చేయనున్నారు. ఏమి చేస్తారంటే.. రోజూ అటెండెన్స్ యాప్‌లో విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. విద్యార్థి గైర్హాజరైన సమాచారాన్ని హెచ్ఎం లాగిన్‌లో అప్లోడ్ చేయడం ద్వారా ఈ విషయం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వెళ్తుంది. అనంతరం హాజరు కాని విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో వెళ్తుంది. ఆ పాఠశాల ఉపాధ్యాయులతోపాటు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు సైతం గైర్హాజరైన విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడతారు. అలాగే విద్యార్థి వరుసగా మూడు రోజులు గైర్హాజరైతే సంబంధిత సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వలంటీర్‌కు సమాచారం పంపుతారు. దీంతో వారు స్వయంగా విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు ఎందుకు గైర్హాజరయ్యారన్న కారణం తెలుసుకుంటారు. రోజూ బడికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారు. దీంతో పిల్లలు చదువుపై దృష్టి సారిస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. రాణించాలంటే.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లలను బడిలో చేర్పించి పని ఉన్న సమయంలో తమ వెంట తీసుకెళ్తుంటారు. దీని వల్ల వాళ్లకి చాలా పాఠాలపై అవగాహన ఉండదు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి అందుతుందని నిబంధన విధించింది. ఈ విధంగానైనా తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపిస్తారని భావించింది. కాగా విద్యార్థి బడికి వచ్చే బాధ్యతను తల్లిదండ్రులకే వదిలేయకుండా ప్రభుత్వం అటెండెన్స్ యాప్‌ను తెచ్చింది. దీంతోపాటు రోజూ క్రమం తప్పకుండా స్కూల్‌కి వస్తేనే చదువు మెరుగుపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉంది. వీరు ఉన్నత విద్యలో రాణించాలంటే బేసిక్ లెవల్ గట్టిగా ఉండాలని ప్రభుత్వం భావించింది. పిల్లలు సక్రమంగా బడికి వచ్చే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: నాడు-నేడు తొలివిడత స్కూళ్లకు ఈ–కంటెంట్) బడికి రావాలన్నదే లక్ష్యం ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా బడికి వచ్చి చదువులో రాణించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే కార్పొరేట్ పాఠశాలలకు మించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఏర్పాటు చేశారు. పిల్లలపై పర్యవేక్షణకు కొత్తగా అటెండెన్స్ యాప్‌ను అమల్లోకి తెచ్చారు. ఆయా తరగతి టీచర్ హాజరును యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు కూడా బడికి రెగ్యులర్‌గా వస్తారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – పి.రమేష్, నెల్లూరు డీఈఓ -
Train General Tickets: లైన్లో ఎందుకు.. ఆన్లైన్ ఉండగా!
సాక్షి, హైదరాబాద్: టికెట్ కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పని లేదు. లైన్లో నించోవలసిన అవసరం లేదు. ప్రయాణానికి కనీసం 15 నిమిషాల ముందు టిక్కెట్ కొనుక్కోవచ్చు. ఆ మాటకొస్తే రైలెక్కే ముందే టిక్కెట్ తీసుకోవచ్చు. పైగా టిక్కెట్ కోసం ఎక్కడికీ పరుగెత్తవలసిన అవసరం లేదు. అన్ రిజర్వ్డ్ టిక్కెట్ బుకింగ్‌లలో యూటీఎస్ మొబైల్ యాప్ అప్రతిహతంగా దూసుకుళ్తుంది. అన్ని ప్రధాన రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్ లలో సాధారణ టిక్కెట్ ల కోసం ప్రయాణికులు యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెటింగ్ సిస్టమ్) మొబైల్ యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. కోవిడ్ అనంతరం యూటీఎస్‌కు అనూహ్యమైన ఆదరణ పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 7.5 లక్షల మంది ప్రయాణికులు యూటీఎస్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోగా దసరా సందర్భంగా ఈ ఐదు రోజుల్లోనే సుమారు 50 వేల మంది ప్రయాణికులు యూటీఎస్‌లో టిక్కెట్లు తీసుకొని సొంత ఊళ్లకు బయలుదేరారు. నో ‘క్యూ’... జంటనగరాల నుంచి ప్రతి రోజు సుమారు 85 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 100 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 2 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.వీరిలో కనీసం 1.5 లక్షల మంది సాధారణ ప్రయాణికులే.ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని జనరల్ బోగీలు,ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణం చేసేవారే. రైల్వేస్టేషన్లలో జనరల్ టిక్కెట్లు విక్రయించే బుకింగ్ కేంద్రాల వద్ద రద్దీ తీవ్రంగా ఉంటుంది.దసరా వంటి పర్వదినాల్లో టిక్కెట్ల కోసం తొక్కిసలాటలు, పోలీసుల లాఠీ చార్జీ వంటి ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో రద్దీ నియంత్రణకు దక్షిణమధ్య రైల్వే యూటీఎస్ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. కోవిడ్‌కు ముందుకు కొంత మేర ఆదరణ కనిపించినా కోవిడ్ కాలంలో జనరల్ టిక్కెట్లకు కూడా గుర్తింపు తప్పనిసరి చేయడంతో యూటీఎస్ వినియోగం తగ్గుముఖం పట్టింది. ఇటీవల యూటీఎస్‌కు విస్తృత ప్రచారం కల్పించడంతో లక్షలాది మంది ఈ యాప్‌ను వినియోగించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో 6 వేల చొప్పున యూటీఎస్ బుకింగ్‌లవుతుండగా, పండుగలు, సెలవు రోజుల్లో 10 వేల నుంచి 15 వేల మంది ప్రయాణికులు యూటీఎస్ నుంచి టిక్కెట్లు తీసుకుంటున్నారు. ఈజీగా బుకింగ్... ►మొబైల్ ఫోన్లో యూటీఎస్ యాప్ ఉంటే చాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా జనరల్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ►ఇంటి నుంచి రైల్వేస్టేషన్‌కు బయలుదేరే క్రమంలోనే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. ►రైల్వేస్టేషన్లో రైలు బయలుదేరడానికి ముందుకు కూడా టిక్కెట్లు తీసుకోవచ్చు. ►యూటీఎస్ టిక్కెట్ల పైన దక్షిణమధ్య రైల్వే రాయితీ సదుపాయం కూడా అందజేస్తోంది. -
చైనా ‘ఉద్యోగ’ యాప్‌పై ఈడీ చర్యలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సెలబ్రిటీ వీడియోలను ‘లైక్’ చేయడం, ‘అప్లోడ్’ చేయడం వంటి పలు విభాగాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలను కల్పిస్తామని అనేక మంది యువకులను మోసగించిన చైనీస్ ‘నియంత్రిత’ మొబైల్ యాప్– ‘కీప్షేర్’పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు ప్రారంభించింది. బెంగుళూరు కేంద్రంగా యాప్‌తో కలిసి పనిచేస్తున్న 12 అనుబంధ సంస్థల పై దాడిజరిపి రూ.5.85 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఈడీ పేర్కొంది. ఈ యాప్ నిర్వాహకులు యువత నుంచి అక్రమంగా, మోసపూరితంగా డబ్బు వసూలు చేసినట్లు కూడా ఈడీ ప్రకటన తెలిపింది. ‘‘చైనీయులు ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నారు. అనేక మంది భారతీయులను డైరెక్టర్లుగా, అనువాదకులుగా (మాండరిన్ నుండి ఇంగ్లీష్– ఇంగ్లీష్ నుంచి మాండరిన్, హెచ్ఆర్ మేనేజర్లు, టెలి కాలర్లుగా నియమించుకున్నారు’’ అని ఈడీ తెలిపింది. వాట్సాప్, టెలి గ్రామ్‌ల ద్వారా ఉపాధి కల్పనకు సంబంధించి చైనీయులు విస్తృతంగా ప్రకటనలు చేశారని తెలిపింది. ఇండియన్ల డాక్యుమెంట్లు పొందారని, బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేయించారని వివరించింది. -
ఒక్క క్లిక్‌తో సమాచారమంతా..
మీరు ఏదైనా పారిశ్రామిక పార్కులో యూనిట్ ఏర్పాటుకోసం స్థలం ఎక్కడ ఉంది? ఎంత విస్తీర్ణం ఉంది? సరిహద్దులు ఏంటి? ప్రధాన రోడ్డుకు ఎంత దూరంలో ఉంది? ఇటువంటి వివరాల కోసం నేరుగా పారిశ్రామిక పార్కుకు వెళ్లాల్సిన అవసరంలేదు.. మొబైల్లో సింగిల్ క్లిక్ చేస్తే చాలు!! సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కు సమస్త సమాచారాన్ని మొబైల్ యాప్ రూపంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) పోర్టల్ ఆధారిత మొబైల్ యాప్‌ను తయారుచేయాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. పారిశ్రామిక పార్కుల్లో ఉన్న పరిస్థితిని మొబైల్ యాప్‌లో పక్కాగా చూపించేందుకు డ్రోన్ సహాయంతో కూడా సర్వేచేసి.. ఇందులో ఫొటోలు, వీడియోల రూపంలో నిక్షిప్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏజెన్సీని ఎంపికచేసే పనిలో ఏపీఐఐసీ పడింది. మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక ఇంటి నుంచే పారిశ్రామిక పార్కుల్లో ఎక్కడెక్కడ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి? వాటి ధర ఎంత అనే వివరాలన్నీ తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. పరిశ్రమల అనుమతుల కోసం ఇప్పటికే సింగిల్ విండో విధానాన్ని పక్కాగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరింత సులభంగా వారికి సమాచారం చేరవేసేందుకు ఈ మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ అవకాశంలేదు వాస్తవానికి ఏపీఐఐసీకి చెందిన సమాచారం ఇప్పటికే ఆన్లైన్లో లభిస్తోంది. పారిశ్రామిక పార్కుల వారీగా ఖాళీ ప్లాట్ల వివరాలు లభించడంతో పాటు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే, పక్కాగా ఆ ప్లాటును నేరుగా ఆన్లైన్లోనే చూసేందుకు మాత్రం అవకాశంలేదు. దానిని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లాల్సిందే. ఆ ఖాళీ ప్లాటు విస్తీర్ణం ఎంత? ధర ఎంత అనే వివరాలు ఉంటున్నాయి. అయితే, నిర్దిష్టంగా సరిహద్దులు ఏమిటనే వివరాలు అందుబాటులోలేవు. అయితే, కొత్తగా తయారుచేయనున్న యాప్‌లో మాత్రం సమస్త సమాచారం.. కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు ఏపీఐఐసీ సమాయత్తమవుతోంది. యాప్‌తో ఇవీ ఉపయోగాలు.. ఏపీఐఐసీ తయారుచేస్తున్న మొబైల్ యాప్ ద్వారా సింగిల్ క్లిక్‌లో సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. అవి ఏమిటంటే... ► పారిశ్రామిక పార్కుల్లో ఖాళీగా ఉన్న ప్లాట్ల వివరాలు. ► ఆయా ప్లాట్ల సరిహద్దులు, విస్తీర్ణం, ధర వగైరా అన్ని అంశాలు. ► సదరు ప్లాటుకు రోడ్డు, రైల్వే మార్గం ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చు. ► ఖాళీ ప్లాటును కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు. ► భవిష్యత్తులో ప్లాటు కొనుగోలు ధరను కూడా ఆన్లైన్లో చెల్లించే ఆప్షన్ వచ్చే అవకాశముందని సమాచారం. అన్ని వివరాలు ఒకే యాప్‌లో రాష్ట్రంలో ఎక్కడెక్కడ పారిశ్రామిక పార్కులు ఉన్నాయనే వివరాలతో పాటు వాటి వాస్తవ భౌగోళిక స్థితిని తెలుసుకునేందుకు కూడా యాప్ ఉపయోగపడుతుంది. పరిశ్రమలు ఏర్పాటుచేయాలనుకునే వారు ఇంటి నుంచే ఒక్క మొబైల్ క్లిక్‌తో స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మాది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నాం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి మొబైల్ యాప్ తయారుచేస్తున్నాం ఇప్పటికే ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన సమాచారం వెబ్ ఆధారిత పోర్టల్‌లో లభిస్తోంది. కానీ, ఒక యాప్ రూపంలో దీనిని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇందులో పారిశ్రామిక పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఖాళీలు.. వాటి ధరల వివరాలతో పాటు దగ్గరలోని రైల్వేస్టేషన్, రోడ్డు మార్గం వివరాలన్నీ లభిస్తాయి. వాటి ఫొటోలు, సరిహద్దులు ఆన్లైన్లోనే చూసుకోవచ్చు. – సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఎండీ -
అరచేతిలో 87 రకాల సేవలు.. ఈ యాప్ ఉంటే మీ వెంట పోలీస్ ఉన్నట్టే!
దొండపర్తి(విశాఖ దక్షిణ): ఈ యాప్ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఎటువంటి ప్రమాదం, సమస్య వచ్చినా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే క్షణాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసే అద్బుతమైన అవకాశం ఇందులో ఉంది. అదే ‘ఏపీ పోలీస్ సేవ’యాప్. అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ యాప్ రూపొందించారు. ఈ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే.. పోలీస్‌స్టేషన్ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఇంటి దగ్గర నుంచే పొందవచ్చు. అందుకే మొబైల్లో ఈ యాప్ ఉంటే.. మన వెంట పోలీస్ ఉన్నట్టే! ఆరు విభాగాల్లో 87 రకాల పోలీస్ సేవలు పోలీస్ స్టేషన్లో ప్రజలకు అందే సేవలను ఆరు విభాగాలుగా విభజించారు. శాంతిభద్రతలు. ఎన్ఫోర్స్మెంట్, పబ్లిక్ సేవలు, రహదారి భద్రత, ప్రజా సమాచారం, పబ్లిక్ అవుట్ రీచ్ ఇలా ఆరు విభాగాల్లో పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. శాంతి భద్రతలు నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ స్థితిగతులు, దొంగతనాలపై ఫిర్యాదులు, రికవరీలు, తప్పిపోయిన కేసులు, దొరికిన వారు, గుర్తు తెలియని మృతదేహాలు, అరెస్ట్ వివరాలు, అపహరణకు గురైన వాహనాల వివరాలను పొందవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ ఇంటి పర్యవేక్షణ, ఈ–బీట్, ఈ–చలానా స్టేటస్‌లను తెలుసుకోవచ్చు. పబ్లిక్ సేవలు నేరాలపై ఫిర్యాదులు, సేవలకు సంబంధించిన దరఖాస్తులు, ఎన్వోసీలు, వెరిఫికేషన్లు, లైసెన్స్‌లు, అనుమతులు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు. రహదారి భద్రత బ్లాక్ స్పాట్లు, ప్రమాదాల మ్యాపింగ్, రోడ్డు భద్రతా గుర్తులు, బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాలు, ఆస్పత్రులు, మందుల దుకాణాల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రజా సమాచారం పోలీస్ డిక్షనరీ, సమీప పోలీస్ స్టేషన్ల వివరాలు, టోల్ ఫ్రీ నంబర్లు, వెబ్సైట్ల వివరాలు, న్యాయ సమాచారం, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. పబ్లిక్ అవుట్ రీచ్ సైబర్ భద్రత, సోషల్ మీడియా, కమ్యూనిటీ పోలీసింగ్, స్పందన వెబ్సైట్, ఫ్యాక్ట్ చెక్ సేవలు, తదితరవన్నీ పొందుపర్చారు. ఎక్కడ ఉన్నా.. ఫిర్యాదు చేసుకోవచ్చు.. పోలీస్ సేవ యాప్ ద్వారా ఉన్న చోట నుంచే వేధింపులు, నేరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, పోలీస్ సేవల్లో లోపాలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఐడీ నంబర్‌తో సహా ఫిర్యాదుదారుడి మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. అలాగే సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారనే విషయాన్ని కూడా మెసేజ్‌లో తెలియజేస్తారు. పిటిషన్ ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని సైతం ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసలుబాటును కలి్పంచారు. ఎఫ్ఎస్ఐఆర్ నమోదు నుంచీ.. ఏదైనా కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి నిందితులను కోర్టులో హాజరుపరచడం విచారణ, సాక్షులు, కేసులో ట్రయల్స్, ఇలా మొత్తం 24 దశల్లో కేసు సమగ్ర సమాచారం మెసేజ్ రూపంలో తెలుస్తుంటాయి. ఎఫ్ఐఆర్ కోసం స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. యాప్ ద్వారా సులభంగా ఎఫ్ఐఆర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ–చలానా వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న చలానాలను పరిశీలించి చెల్లించవచ్చు. మహిళ భద్రతకు ప్రాధాన్యం పోలీస్ సేవ యాప్‌లో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు. సేఫ్టీ సేవ ద్వారా 12 రకాల సేవలను అందుబాటులో ఉంచారు. దిశ, సైబర్ మిత్ర యాప్, వన్ స్టాప్ సెంటర్, ఏపీ స్టేట్ ఉమెన్ కమిషన్, ఉమెన్ ప్రొటెక్షన్ తదితర 12 మాడ్యూళ్లను అనుసంధానం చేశారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘పోలీస్ సేవ’యాప్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో సైబర్ నేరాలకు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదులపై తక్షణం స్పందించి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ‘పోలీస్ సేవ’ను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే దిశ యాప్‌ను తప్పకుండా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. తద్వారా క్షణాల్లో పోలీసు సాయం పొందుతారు. – సి.హెచ్.శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ -
TSRTC: అరచేతిలో ఆర్టీసీ బస్సు
సాక్షి, హైదరాబాద్: ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునే సాంకేతిక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఫోన్లలో ‘టీఎస్ఆర్టీసీ బస్‌ట్రాకింగ్’ యాప్ ద్వారా బస్సుల కచ్చితమైన జాడను తెలియజేసే ట్రాకింగ్ సేవలను మంగళవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్ ఏసీ బస్సులతో పాటు, హైదరాబాద్ నుంచి విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, ఏలూరు, విశాఖపట్టణం, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే దూరప్రాంత బస్సుల్లోనూ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 96 డిపోల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన 4170 బస్సులను ట్రాకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. దీంతో ఇంటి నుంచి బయలుదేరిన ప్రయాణికుడు తాను ఎక్కవలసిన బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు. అలాగే ప్రయాణికుడు ఎదురు చూసే బస్టాపునకు ఆ బస్సు ఎంత సమయంలో చేరుకుంటుందనే సమాచారం కూడా మొబైల్ యాప్ ద్వారా తెలిసిపోతుంది. ప్రయాణికులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘టీఎస్ఆర్టీసీ బస్‌ట్రాకింగ్’ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ టీఎస్ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రయోగాత్మకంగా 140 బస్సులను గుర్తించారు, వీటిలో కంటోన్మెంట్, మియాపూర్–2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్ బస్సులలో ట్రాకింగ్ సేవలను ప్రవేశపెట్టారు. అలాగే శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం, తదితర రూట్లలో నడిచే మరో 100 బస్సుల్లోనూ ట్రాక్ సేవలను ప్రవేశపెట్టారు. త్వరలో నగరంలోని అన్ని రిజర్వేషన్ సేవలు, ప్రత్యేక తరహా సేవలను కూడా ట్రాకింగ్ యాప్‌లో అందుబాటులోకి తేనున్నారు. అత్యవసర సేవలు సైతం... ఈ మొబైల్ యాప్‌లో బస్సుల ప్రస్తుత లొకేషన్, సమీప బస్ స్టాప్‌ను వీక్షించడంతో పాటు మహిళా హెల్ప్‌లైన్ సేవలను కూడా అందజేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళా ప్రయాణికులు ఈ హెల్ప్‌లైన్ సహాయం కోరవచ్చునని ఎండీ పేర్కొన్నారు. కండక్టర్, డ్రైవర్, తదితర సిబ్బంది ప్రవర్తనపైన కూడా ప్రయాణికులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. (చదవండి: కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు ) -
అవినీతి నిరోధానికి ఏసీబీ మొబైల్ యాప్ ప్రారంభం
-
లంచం అడిగితే ఈ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చు: సీఎం వైఎస్ జగన్
-
‘ఏసీబీ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్.. యాప్ ఎలా పనిచేస్తుందంటే?
సాక్షి, అమరావతి: అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. గతంలో సీఎం ఆదేశాలమేరకు ఏసీబీ ఈ యాప్ తయారు చేసింది. స్పందనపై నిర్వహించిన సమీక్షలో సీఎం.. యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఒకటే మాట చెబుతున్నామని.. ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట చాలా స్పష్టంగా చెప్పామన్నారు. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. చదవండి: Fact Check: 'ఆ పథకాల రద్దు అవాస్తవం.. ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదు' సీఎం ఇంకా ఏమన్నారంటే: ♦చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని లాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా పంపాం ♦ఎక్కడైనా, ఎవరైనా కూడా.. కలెక్టరేట్ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే.. ఎవరైనా చేయాల్సింది ఒక్కటే. ♦తమ చేతుల్లోని ఫోన్లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్ చేసి... బటన్ ప్రెస్‌చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయండి.. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది ♦అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వస్తున్నాం ♦ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుంది ♦ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉంది ♦అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది ♦మన స్థాయిలో అనుకుంటే.. 50శాతం అవినీతి అంతం అవుతుంది ♦మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది ♦అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యం: ♦ఎవరైనా పట్టుబడితే.. కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి: యాప్ ఎలా పనిచేస్తుందంటే...: ♦పౌరులు నేరుగా యాప్‌ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ♦గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్ ♦యాప్ డౌన్లోడ్ చేయగానే మొబైల్ నంబర్‌కు ఓటీపీ ♦ఓటీపీ రిజిస్టర్ చేయగానే వినియోగానికి యాప్ సిద్ధం ♦యాప్‌లో 2 కీలక ఫీచర్లు ♦యాప్‌ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్‌రిపోర్ట్ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ♦లాడ్జ్ కంప్లైంట్ ఫీచర్ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.. ఫిర్యాదుకు తనదగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం ♦ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్ ఫోన్‌కు రిఫరెన్స్ నంబరు ♦త్వరలో ఐఓఎస్ వెర్షన్లోనూ యాప్‌ను సిద్ధంచేస్తున్న ఏసీబీ -
ఎయిమ్స్ సేవలకు ‘ఈ–పరామర్శ’
మంగళగిరి: రాష్ట్ర ప్రజలందరి సౌకర్యార్థం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఆస్పత్రి మొబైల్ యాప్ ద్వారా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘ఈ–పరామర్శ’ యాప్‌ను ఉపయోగించి.. ప్రజలు తమకు అవసరమైన వైద్య సేవలను ఇక సులభంగా పొందవచ్చు. నేరుగా ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకునే వారితో పాటు టెలీమెడిసన్ ద్వారా వైద్య సేవలు అవసరమైనవారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆస్పత్రి అధికారులు చెప్పారు. దీనివల్ల రోగులకు సమయంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని చెప్పారు. మొబైల్ ఫోన్లోని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘ఎయిమ్స్ మంగళగిరి ఈ–పరామర్శ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి.. రోగి తన వివరాలు నమోదు చేసుకోవచ్చు. అందులోని టెలీకన్సెల్టెన్సీ ద్వారా జనరల్ మెడిసన్, దంత, నేత్ర, ఎముకల వైద్యంతో పాటు 12 రకాల వైద్య సేవలను పొందవచ్చు. అవసరమైన విభాగంలో వివరాలు నమోదు చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు, శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు వైద్యులు అందుబాటులోకి వచ్చి చికిత్సకు సంబంధించిన సలహాలిస్తారు. నేరుగా ఎయిమ్స్‌కు వెళ్లి ఓపీలో రూ.10 చెల్లించి చికిత్స తీసుకున్న వారు.. తమ రిపోర్టులను యాప్‌లో తెలుసుకునే అవకాశముంది. యాప్ ద్వారానే రోగులు తమ ఆరోగ్య సమస్యలను డాక్టర్లకు వివరించవచ్చు. -
పోస్ట్ ఇన్ఫో యాప్.. క్షణాల్లో డిజిటల్ సేవలు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): తపాల శాఖ పూర్వకాలం నాటి పద్ధతులకు స్వస్తి పలుకుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో వినియోగదారులకు సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తోంది. కేవలం ఉత్తరాల బట్వాడా లాంటి సేవలకే పరిమితమైతే మనుగడ కష్టమని గ్రహించిన తపాలా శాఖ.. మార్కెట్లోకి వచ్చిన ప్రతి సేవనూ తామూ అందిస్తామని సగర్వంగా ప్రచారం చేస్తోంది. ఆధార్ కార్డు నమోదు, సవరణలు, పాస్‌పోర్టు దరఖాస్తు తదితర ఎన్నో సేవలు అందిస్తూ వినియోగదారులకు చేరువ అవుతోంది. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్, సేవింగ్స్ డిపాజిట్ల సేకరణలో కూడా వినూత్న పంథా అనుసరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింటా తానూ ఉన్నానని చాటిచెబుతోంది. త్వరితగతిన సమాచారం నిమిత్తం ఇప్పుడు ప్రజలంతా మొబైల్ ఫోన్ల మీదనే ఆధార పడుతున్నారు. అన్ని రకాల సేవలు ఫోన్ల ద్వారా సులభంగా పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తపాలా శాఖ కూడా మొబైల్ యాప్ ‘పోస్ట్ ఇన్ఫో’ తీసుకొచ్చింది. పోటీ ప్రపంచంలో బ్యాంకులు, ఇతర సేవలందించే వివిధ సంస్థలకు దీటుగా ఈ యాప్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడు చేసుకోవచ్చు. యాప్ ద్వారా తొమ్మిది రకాల సేవలు పొందే సౌకర్యం ఉంది. ప్రీమియం, వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ లెక్కలు సైతం వెంటనే తెలుసుకోవచ్చు. ఇప్పటికే పోస్ట్ బ్యాంక్ యాప్ వినియోగంలో ఉంది. పలు రకాల సేవలు అందించే తపాలా శాఖ ఏటీఎం సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది. యాప్‌లో ఫీచర్స్ ఇవే.. సుకన్య సమృద్ధి యోజన పథకం రికరింగ్ డిపాజిట్ పథకం. టైం డిపాజిట్లో ఏడాది నుంచి ఐదేళ్ల వరకు చేసే డిపాజిట్లపై ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. ఇంట్రస్ట్ కాలిక్యులేటర్ ఏ డిపాజిట్ పథకంలో ఎంత సొమ్ము కడితే ఎంత మొత్తం తిరిగి పొందవచ్చు. దానికి సంబంధించిన వివిధ పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. ఆర్టికల్ ట్రాకింగ్ వినియోగదారులు పంపిన స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు, పార్శిల్, ఈఎంవో ఎక్కడ ఉన్నాయి. అవతలి వ్యక్తులకు ఎప్పుడు చేరుతుందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. సర్వీస్ రిక్వెస్ట్ ఇంటి వద్ద సేవలు పొందేందుకు, డోర్ డెలివరీ వంటి సదుపాయాలకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. కంప్లైంట్స్ ట్రాకింగ్ వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయి. దానికి సంబంధించిన సమాచారం ఇంకా ఏమైనా కావాలా అనే అంశాలు తెలుస్తాయి. ఇన్సూరెన్స్ పోర్టల్ తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ రకాల బీమా పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. ఫీడ్ బ్యాక్ పోస్టల్ సేవలకు సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే వివరంగా తెలుసుకోవచ్చు. సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. పోస్టేజ్ కాలిక్యులేటర్ వినియోగదారులు పంపించే పార్సిళ్లు, పోస్టల్ కవర్లు, ధరలు, ఎంత బరువుకు ఎంత చెల్లించాలి. సాధారణ, స్పీడ్ పోస్టులో పంపితే ఎంత ఖర్చు అవుతుంది. అన్న విషయాన్ని చాలా సులభంగా, స్పష్టంగా తెలుసు కోవచ్చు. పోస్టల్ ఆఫీస్ సెర్చ్ దేశంలో ఏ పిన్ కోడ్ అయినా తెలుసుకోవచ్చు. ఊరి పేరు నమోదు చేయగానే సంబంధిత పిన్‌కోడ్ వస్తుంది. పిన్‌కోడ్ నంబర్ తెలిస్తే డెలివరీ కావాల్సిన పోస్ట్ ఆఫీసు ఎక్కడ ఉంది. ఏ తపాలా ప్రధాన కార్యాలయం పరిధిలో ఉందో కూడా ఇట్టే తెలుసుకోవచ్చు. యాప్‌తో ఉపయోగాలు పోస్ట్ ఇన్ఫో యాప్‌తో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి అందుతాయి. మొబైల్ ఫోన్ల ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్నాం. తపాలా వినియోగదారులంతా ఈ యాప్‌ను డౌన్లోడు చేసుకోవడం ద్వారా కొత్త సేవలు పొందవచ్చు. – సోమశేఖరరావు, సీనియర్ సూపరింటెండెంట్, తపాలాశాఖ, విశాఖ -
Andhra Pradesh: లంచమడిగితే ‘యాప్’తో కొట్టండి
సాక్షి, అమరావతి: అవినీతి నిరోధానికి ప్రభుత్వం ప్రజల చేతికే వజ్రాయుధాన్ని అందిస్తోంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరుల అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించింది. లంచాలు, అవినీతి లేకుండా ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టంగా చెప్పారు. అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఓ మొబైల్ యాప్‌ను రూపొందించాలని పోలీసు శాఖపై ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఆదేశించారు. దీంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ‘14400 యాప్’ ను రూపొందించింది. లంచగొండుల పాలిట సింహస్వప్నంలా దీనిని రూపొందించారు. ఈ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే ఆవిష్కరించనున్నారు. తక్షణం ఫిర్యాదుకు అవకాశం రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం వినూత్న రీతిలో ‘దిశ’ యాప్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే ఆదుకొనేందుకు , పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మహిళలు ఫిర్యాదు చేసేందుకు, రూపొందించిన ఈ యాప్ విజయవంతమైంది. అదే తరహాలో అవినీతిపై ప్రజలు తక్షణం ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీనికి రూపకల్పన చేసింది. ఆడియో, వీడియో, ఫొటో ఆధారాలతో సహా ఫిర్యాదు అవినీతిపై ఫిర్యాదుల కోసం ఏసీబీ కొంతకాలంగా 14400 టోల్‌ఫ్రీ నంబరును నిర్వహిస్తోంది. ఈ నంబరుతో ఫిర్యాదు మాత్రమే చేయగలరు. ఫిర్యాదుదారులు సాక్ష్యాధారాలు సమర్పించేందుకు అవకాశాలు తక్కువ. క్షేత్రస్థాయిలో అవినీతిపై ప్రత్యక్షంగా ఆధార సహితంగా ఫిర్యాదు చేయడం సాధ్యం కాదు. టోల్‌ఫ్రీ నంబరుకు వచ్చే ఫోన్ కాల్స్‌పై ఏసీబీ అధికారులు స్పందించి తరువాత ఆకస్మిక దాడులు, తనిఖీలు చేస్తారు. బాధితుల ద్వారా లంచం ఎరవేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొంటారు. ఇవన్నీ కాలయాపనతో కూడుకున్నవి. అవినీతి అధికారులు, సిబ్బంది జాగ్రత్తపడే అవకాశం ఉండేది. కొందరు అధికారులు నేరుగా లంచాలు తీసుకోకుండా వారి ఏజెంట్లకు ఇవ్వమని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలకు ముగింపు పలుకుతూ అవినీతిని తక్షణం ఆధార సహితంగా ఫిర్యా దు చేసేందుకు అవకాశం కల్పించేందుకే 14400 యాప్‌ను ఏసీబీ రూపొందించింది. విస్తృత అవగాహన దిశ యాప్ తరహాలోనే ఏసీబీ 14400 యాప్‌పై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. అందుకోసం జిల్లా, మున్సిపాలిటీ, మండల, పంచాయతీ స్థాయిలో అవగాహన సదస్సులు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అవగాహన కల్పిస్తారు. కరపత్రాలు, టీవీ, పేపర్లలో ప్రకటనల ద్వారా యాప్ ఉపయోగాలను ప్రజలకు తెలియజేస్తారు. అవినీతి అంతం దిశగా కీలక ముందడుగు ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 14400 యాప్‌ను రూపొందించాం. ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి లేకుండా చేయాలన్న లక్ష్య సాధన కోసమే ఈ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తేనున్నాం. ప్రజలు సులభంగా, ఆధార సహితంగా ఫిర్యాదు చేసేందుకు యాప్ అవకాశం కల్పిస్తుంది. ఏసీబీ అధికారులు కూడా తక్షణం చర్యలు తీసుకునేందుకు సాధ్యపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ఈ యాప్‌ను ఆవిష్కరిస్తారు.’ – డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి యాప్ పని చేస్తుందిలా.. ► 14400 మొబైల్ యాప్‌లో ‘లైవ్ రిపోర్ట్’ ఉంటుంది. ► అధికారులు, సిబ్బంది లంచాలు అడుగుతున్నా, ఇతరత్రా అవినీతికి పాల్పడుతున్నా ఆ యాప్‌లో లైవ్ రిపోర్టింగ్ ఫీచర్ ద్వారా తక్షణం ఫిర్యాదు చేయవచ్చు. ► లైవ్ రిపోర్టింగ్ ఫీచర్లో ఫొటో,వీడియో, ఆడియో, ఫిర్యాదు నమోదు ఆప్షన్లు ఉన్నాయి. ► లంచం తీసుకుంటున్న లైవ్ ఫొటో తీసి ఆ యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు ► లంచం అడుగుతున్నప్పుడు మాటలను లైవ్‌లో రికార్డ్ చేసి అప్లోడ్ చేయవచ్చు. ► లైవ్ వీడియో కూడా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. ► లైవ్ రిపోర్ట్‌కు అవకాశం లేకపోతే.. బాధితులు అప్పటికే రాసి ఉంచిన ఫిర్యాదు కాపీగానీ సంబంధిత ఫొటోలు, ఆడియో, వీడియో రికార్డింగ్‌లను కూడా యాప్ ద్వారా అప్లోడ్ చేయవచ్చు. ► అనంతరం లాడ్జ్ కంప్లైంట్ ( ఫిర్యాదు నమోదు) ఆప్షన్‌లోకి వెళ్లి సబ్మిట్ ప్రెస్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేరుతుంది. ఫిర్యాదు చేసినట్టు వెంటనే మెసేజ్ వస్తుంది. ► వెంటనే ఆ ఫిర్యాదు ఏసీబీ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక సెల్‌కు వెళుతుంది. అక్కడి సిబ్బంది ఫిర్యాదును సంబంధిత జిల్లా ఏసీబీ విభాగానికి పంపుతారు. ► వెంటనే సంబంధిత అధికారులు ఆ ప్రభుత్వ అధికారి, సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్టుగానీ ఇతరత్రా కఠిన చర్యలుగానీ తీసుకుంటారు. ► కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ కేసు పురోగతిని ఏసీబీ ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపరుస్తుంది. -
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..
కరీంనగర్ అర్బన్: ప్రభుత్వ కొలువులకు సన్నద్ధమయ్యే వారి కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది వారధి సంస్థ. పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం, మాక్ టెస్ట్, సిలబస్, తదితర అంశాలను విపులంగా పొందుపరిచారు. ఏ ఉద్యోగమైనా సదరు సమాచారం లభించనుంది. కాగా.. మంగళవారం టీటి హబ్ టవర్‌లో టీమ్–అప్ సంస్థ అధినేత ఎం.కె.చైతన్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంకతో కలసి ‘వారధి సొసైటీ మొబైల్ యాప్‘ను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభించారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రూప్ 1,2 పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటి సారిగా టీం–అప్ సంస్థ ద్వారా రూపొందించిన యాప్‌లో మాక్ టెస్ట్, స్టడీ మెటీరీయల్స్, పలు రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, టీం–అప్ సంస్థ కో ఫౌండర్ ఏ.రంజిత్, వారధి సెక్రటరీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. యాప్ వినియోగం ఇలా... టీం–అప్ సంస్థ సీఈఓ ఎంకే చైతన్య మాట్లాడుతూ.. యాప్ సేవలను పొందడానికి ఫోన్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఒకవేళ ఇంతకు ముందు వారధిలో మెంబర్ అయినట్లైతే వారి వారధి అకౌంట్లో లాగిన్ అవ్వాలి. ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుండి వారధి అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. చదవండి: Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు -
ఒక వికృత సాంకేతిక దాడి
ఏవైనా విషయాలు తమ సాధారణ పరిజ్ఞానాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు మనిషి అధిక తెలివిని సంపాదించాలనుకుం టాడు. కానీ కొంత మంది అర్ధ తెలివి లేదా మూర్ఖ త్వానికి దిగిపోతారు. ఇది ఎప్పుడు సాధ్యమౌతుం దంటే–తమ ఆడియెన్స్ కూడా అర్ధ తెలివిని ఆమోదించేవారు అయినప్పుడు! తాము సుప్రీం అని, తాము ఏది చెప్పినా చెల్లుతుందని, తమకు మెజారిటీ సపోర్ట్ ఉందనే వాతావరణం వల్ల ఇదంతా జరుగుతుంది. ప్రణాళికా బద్ధంగా ద్వేష పూరితమైన యాటిట్యూడ్ బలపడటం వల్ల కలెక్టివ్ విచక్షణ చచ్చిపోతుంది. ముస్లిం స్త్రీలను ఆన్లైన్ సేల్కు పెట్టి, దాని మీద మార్కెట్ క్రియేట్ చేద్దామనుకున్న వాళ్ళ మానసిక తత్వం కూడా ఇందులో భాగమే! ఒక అమ్మాయిని ఊహత్మకంగా సేల్కు పెట్టి, ఆమెను ఓన్ చేసుకున్నట్టుగా చూపే ఈ మానసిక వైపరీత్యం పైన చెప్పిన కారణాల వల్ల పుట్టుకొస్తుంది. ఇది సాధారణ ఎమోషన్ మాత్రమే కాదు. ఒక ప్రణాళికాబద్ధమైన కమ్యూనికేషన్. మనిషిలో ఒక హేతు రహితమైన బయాస్‌ను సృష్టించడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?) ‘సల్లీడీల్స్’, ‘బుల్లీబాయి’ యాప్‌లతో ముస్లిం స్త్రీల మీద చేస్తున్న అమానవీయ దాడి ఇటువంటిదే. ఇప్పటికి ఈ కేసులో 21 ఏళ్ళ అబ్బాయి, 18 ఏళ్ళ అమ్మాయి అరెస్ట్ అయ్యారు. దీని వెనుక ఇంకా పెద్ద స్థాయివాళ్లు ఉంటారు. ఈ యాప్‌లను ‘గిట్ హబ్’ అనే వెబ్సైట్ హోస్ట్ చేసింది. జూలైలోనే కొంత మంది వికృత మానసిక వాదులు సల్లీ డీల్స్ యాప్‌ను మొదలు పెట్టారు. అప్పుడు కొంత దీనికి వ్యతిరేకత వచ్చే సరికి తీసివేసినా, ఆ తర్వాత ఎవరి మీదా ఎటువంటి చట్టపరమైన చర్యలూ తీసుకోలేదు. ఆ ధైర్యం తోటే మళ్ళీ ఈ కొత్త యాప్ జనవరి 1, 2022న తిరిగి ప్రారంభించారు. కనీస ప్రతిస్పందన కరువైన రోజుల్లో ఇటువంటి వైపరీత్యాలు నార్మలైజ్ కావడం మామూలే. (చదవండి: నిజాలకు పాతరేసి.. అబద్ధాన్ని అందలం ఎక్కిస్తే...) ముస్లింలు మైనారిటీగా ఉన్న ఈ దేశంలో లోక్ సభలో వారి సంఖ్య 27. అందులో తృణమూల్, కాంగ్రెస్ నుండే ఎక్కువ. అదే 1980లో చూస్తే, మన పార్లమెంట్లో 47 మంది ముస్లిం ఎంపీలు ఉండేవాళ్ళు. పార్లమెంట్లో మెజారిటీ కలిగిన బీజేపీలో ముస్లింల సంఖ్య సున్న. మొత్తం మీద తాజా సంఘటనను తాలిబన్లు ప్రత్యక్షంగా ఆడవాళ్ళను బానిసలుగా తీసుకోవడం లాంటి వికృత చర్యకు సారూప్యంగా చూడవచ్చు. ద్వేషం, బలహీనుల పట్ల మదమెక్కిన ఆధిపత్యం ఎంత దాకా తీసుకెళ్తాయో ఇటువంటి చర్యల వల్ల తెలుస్తుంది. అసలు ఈ యాప్‌లకు పోర్న్ యాప్‌ల పేర్లు పెట్టడంలోనే తమను ఎవరూ ఏమీ చేయలేరనే మనిషి ధీమా అర్థమవుతోంది. దీని పూర్వాపరాలు చూడ్డానికి కావాల్సిన హైపోథసిస్ చేసే విచక్షణ జ్ఞానాన్ని మనిషిలో చంపే ఫాసిస్ట్ మనస్తత్వం ఇది. తమ మతం లేదా తమ కులపు ఆడవాళ్ళు వేరు, ఇతర ఆడవాళ్ళు వేరు. అదో విభిన్నమైన జాతిగా ఒక వైరుధ్యాన్ని ఊహాకల్పన చేయడం ఈ యాప్‌ల ప్రధాన లక్ష్యం. ఇటువంటి చర్యలను మనం ఒక ప్రజా బాహుళ్యంగా ఆపకపోతే, దీనికి వ్యతిరేకంగా కనీస ప్రతి స్పందన చూపకపోతే, అంబేడ్కర్ నొక్కివక్కాణించిన ‘రాజ్యాంగ నీతి’ ఏదైతే ఉందో దాన్ని తుంగలో తొక్కినవారం అవుతాము. రేపు బాధ్యతగా తయారు చేయాల్సిన తరాన్ని ఈ రోజే మనం నాశనం చేసిన వాళ్ళమౌతాము. (చదవండి: సిగ్గు పడాల్సిన భారత జాతీయ నేరం వధూహత్య) - పి. విక్టర్ విజయ్ కుమార్ రచయిత, విమర్శకుడు pvvkumar@yahoo.co.uk -
సల్లిడీల్స్ యాప్ సృష్టికర్త అరెస్ట్
న్యూఢిలీ/ఇండోర్: ముస్లిం మహిళల్ని అవమానించడమే లక్ష్యంగా బుల్లి బాయ్ యాప్ కంటే ముందే వచ్చిన సల్లి డీల్స్ యాప్ సృష్టికర్తని మధ్యప్రదేశ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోర్‌లో బీసీఏ చదివిన అంకురేశ్వర్ ఠాకూర్ (26) ఈ యాప్ రూపొందించాడని అనుమానంతో ఢిల్లీ పోలీసులు అతనిని శనివారమే అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అంకురేశ్వర్ తన నేరాన్ని అంగీకరించాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఐఎఫ్‌ఎస్‌ఒ) కెపీఎస్ మల్హోత్రా ఆదివారం వెల్లడించారు. ముస్లిం మహిళల్ని ట్రోల్ చేయడం కోసం తాను ఈ యాప్‌ని రూపొందించినట్టు అతను చెప్పాడన్నారు. సల్లి డీల్స్ కేసులో ఇదే మొదటి అరెస్ట్. జనవరి 2020లో ఠాకూర్ ట్రేడ్ మహాసభ అనే ట్విటర్ గ్రూపులో చేరాడు. జ్చnజ్ఛటజీౌn అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్‌లో చేరాడు. ఆ గ్రూపు సభ్యులు ముస్లిం మహిళలని ట్రోల్ చేయడంపైనే చర్చలు జరిపేవారు. ఈ నేపథ్యంలో ఠాకూర్ సల్లి డీల్స్ యాప్‌ని డిజైన్ చేసి గత ఏడాది జులైలో గిట్‌హబ్ ప్లాట్‌ఫారమ్‌లో ఉంచాడు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్చి వేలానికి పెట్టాడు. ఈ విషయంలో మీడియాలో ప్రధానంగా రావడంతో అతను తన సోషల్ మీడియా అకౌంట్లన్నీ డిలీట్ చేశాడు. కాగా పోలీసుల అదుపులో ఉన్న బుల్లి బాయ్ యాప్ సృష్టికర్త నీరజ్ బిష్ణోయ్ విచారణలో తాను సల్లిడీల్స్ను రూపొందించిన వారితో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఠాకూర్‌ని అరెస్ట్ చేశారు. -
సరైన పనే చేశా: బిష్ణోయ్
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్చి బుల్లి బాయ్ యాప్‌లో వేలానికి పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్ తన పనిని సమర్థించుకున్నాడు. ముస్లిం మహిళల్ని వేధించడం కరెక్టేనని విచారణలో చెబుతున్నట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. బుల్లి బాయ్ యాప్‌ను రూపొందించడానికి వినియోగించిన పరికరాలన్నీ నీరజ్ దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ యాప్‌ని నీరజ్ నవంబర్‌లో రూపొందించాడని డిసెంబర్ 31న ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇక నీరజ్ ముస్లిం మహిళలనే కాకుండా ముంబై పోలీసుల్ని హేళన చేయడానికి ట్విట్టర్లో పలు ఖాతాలను సృష్టించాడు. ముస్లిం మహిళల ఫోటోలను వేలానికి పెట్టినప్పటికీ వాటిని అమ్మలేదని, నీరజ్ అసలు ఉద్దేశ్యం వారిని కించపరచి వేధించడమేనని పోలీసులు చెబుతున్నారు. భోపాల్‌లో వెల్లూరు ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న నీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో అతనిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా యాజమాన్యం తెలిపింది. -
నిజాలకు పాతరేసి.. అబద్ధాన్ని అందలం ఎక్కిస్తే...
సోషల్ మీడియా వేదికగా కొందరు ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి గౌరవానికి, ప్రైవసీకి తీవ్ర విఘాతం కలిగించారు. సామాజిక మాధ్యమాల ఖాతాల్లోంచి ముస్లిం మహిళల ఫొటోలను సేకరించి, ఓ యాప్‌లో వేలానికి పెట్టడం కలకలం రేపింది. ‘బుల్లీబాయ్’ పేరుతో రూపొందించిన బ్లాగ్‌లో ముస్లిం మహిళల ఫొటోలను విక్రయానికి పెట్టారు. వందల సంఖ్యలో ఫొటోలు ఆ యాప్‌లో ఉన్నాయి. ‘బుల్లీబాయ్ ఆఫ్ ది డే’ పేరుతో రోజుకు ఒక ముస్లిం మహిళ ఫొటోను వేలం వేయటం ఈ యాప్ ప్రత్యేకత. (ఇందుకు కారకుల్లో ఒకరిని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్‌కి తెర పడింది). సలీ డీల్స్‌కు క్లోనింగే బుల్లీబాయ్ అనుకుంటున్నారు. బుల్లీబాయ్ తరహాలోనే ‘సలీ డీల్స్’ పేరుతో ఆర్నెల్ల క్రితం గిట్‌హబ్‌లో ఓ బ్లాగ్/యాప్ ఇలాంటి చర్యలకే ఒడి గట్టింది. మతరాజకీయాలు చేస్తూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సాంకేతికతతో ముస్లిం వ్యతిరేక భావవాతావరణం కల్పిస్తూ కొందరు రెచ్చగొడుతున్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మెజారిటీ మతవాద ప్రతినిధులు తమ ‘భావజాలాన్ని’ నమ్మేలా సృష్టిస్తున్న వాతావరణంలో.. మైనారిటీలు వాస్తవాల్ని, సత్యాన్ని కాపాడుకోవడం కష్టం అవుతోంది. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు తమ అభిప్రాయాలే నిజం అంటూ భ్రమ కల్పిస్తున్నారు. తాము ప్రచారం చేయదలచుకున్న ఫేక్ న్యూస్‌ను నమ్మేలా ‘భావవాతావరణా’న్ని మీడియా ద్వారా సృష్టిస్తున్నారు. ఈ ట్రెండ్ గత ఐదేళ్ళుగా దేశంలో బాగా పెరిగిపోతోంది. ముస్లింల జనాభా బాగా పెరిగిపోతోందని.. ముస్లిం పురుషులు నలుగురిని పెళ్ళి చేసుకుంటున్నారనీ.. ఇలా అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఈ మతవాదులు చేస్తున్నది గోబెల్స్ ప్రచారం. ఒక అబద్ధాన్ని వందసార్లు ప్రచారం చేస్తే 101వ సారి నిజం అవుతుందన్నది గోబెల్స్ సిద్ధాంతం. వాస్తవానికి దేశంలో ఇప్పుడున్న స్థితి ఏమిటంటే... 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీగా ఉన్నారు. లక్షద్వీప్ (లక్ష మంది), జమ్ము–కశ్మీర్ (కోటీ 30 లక్షల మంది)ల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీ. పంజాబ్‌లో సిక్కులు; నాగాలాండ్ (20 లక్షలు), మిజోరం (10 లక్షలు), మేఘాలయ (30 లక్షలు)ల్లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. 2021 నాటికి దేశంలో 110 కోట్ల మంది హిందువులు ఉండగా, ముస్లింల జనాభా 20 కోట్లు మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అంటే.. 80 శాతం హిందువులుంటే, 20 శాతం ముస్లింలు ఉన్నారు! వాస్తవం ఇలా ఉండగా.. ముస్లింల సంఖ్య పెరిగిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తూ ఇదే నిజం అని నమ్మించేలా భావ వాతావరణం కల్పిస్తున్నారు. మనుషుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన మత విషయాన్ని పబ్లిక్ చర్చకు పెట్టి, రెచ్చగొడుతూ ఓట్లు రాల్చుకుంటున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన ’ధర్మ సంసద్’ సమావేశం నడిచిన తీరు ముస్లింలపై జరుగుతున్న అసత్య ప్రచారానికి అద్దం పడుతోంది. ఈ ధర్మసంసద్‌లో హిందూ సాధువులు.. హిందూ మతాన్ని కాపాడుకోడానికి ఆయుధాలు చేపట్టాలని, ముస్లిం... ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాను పెరగనివ్వకూడదని ఇచ్చిన పిలుపును ఏవిధంగా అర్థం చేసుకోవాలి? మత విద్వేషం నిజాన్ని కప్పేస్తుంది. ఈ దేశంలో పుట్టి పెరిగిన ముస్లింలను శత్రువులుగా ముద్రవేయడాన్ని దేశభక్తికి కొలమానంగా చూడటం, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు ముస్లింలను దూరం చేయాలనుకోవడం కరెక్టేనా? ప్రజలకు వాస్తవాల ఎరుకను కలుగ జేయవలసిన బాధ్యత లౌకికవాదులందరికీ ఉంది. - డా. ఎంకే ఫజల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ -
ప్రముఖ మహిళల ఫొటోలు యాప్‌లో వేలానికి
న్యూఢిల్లీ: ప్రముఖ ముస్లిం మహిళల ఫొటోలను యాప్‌లోకి అప్లోడ్ చేసి వేలానికి పెట్టిన దారుణ వికృత చేష్ట ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై భిన్న వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత జులైలో ‘సలీ డీల్స్’ పేరిట జరిగిన అరాచకాన్ని గుర్తుచేస్తూ ‘బుల్లి బాయ్’ యాప్ ఒకటి తెరమీదకొచ్చింది. దాదాపు 100 మంది ప్రముఖ ముస్లిం మహిళలు, మహిళా పాత్రికేయుల ఫొటోలను వారి ట్విట్టర్ ఖాతాల నుంచి సేకరించి వాటిని బుల్లి బాయ్ యాప్‌లో అప్లోడ్ చేసి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వేలానికి పెట్టారు. దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు, ముంబై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. యాప్ కార్యకలాపాలకు వేదికగా వాడుతున్న ‘గిట్‌హబ్’ ప్లాట్‌ఫామ్‌లోని యూజర్ ఐడీని బ్లాక్ చేశామని మంత్రి తెలిపారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల ఆన్లైన్ నెట్‌వర్క్‌లోకి హ్యాకింగ్ యత్నాలపై ఆయా సంస్థలను అప్రమత్తం చేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్), ఢిల్లీ, ముంబై పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటాయని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, బుల్లి బాయ్ వెబ్సైట్లో తన ఫొటోను వాడారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా జర్నలిస్ట్ ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ డెవలపర్లు, ట్విట్టర్ హ్యాండిల్ హోల్టర్లపై ముంబై సైబర్ విభాగం మరో కేసు నమోదు చేసింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు మహిళా జాతీయ కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ సూచించారు. మహిళలను అవమానించడం, మత విద్వేషంపై ప్రజలు గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వారికి అధికార అండదండలు: మెహబూబా ముఫ్తీ ఆరోపణ యాప్ ద్వారా ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకున్న వారికి ‘అధికార అండదండలు’ అందుతున్నాయని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. అధికారంలో ఉన్న వారు వెనకుండి నడిపించడం వల్లే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు స్వేచ్ఛగా తప్పించుకు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. -
మొబైల్ యాప్‌ను లాంచ్ చేసిన బిస్లెరీ..! 24x7 ఇంటి వద్దకే డెలివరీ..!
ప్యాకేజ్డ్ వాటర్ దిగ్గజం బిస్లెరీ ఇంటర్నేషనల్ డీ2సీ(డైరక్ట్ టూ కన్స్యూమర్) కాన్స్ప్ట్ను ప్రోత్సహిస్తూ Bisleri@ Doorstep అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ సహాయంతో వినియోగదారులు నేరుగా ప్యాకేజ్డ్ వాటర్‌ను ఇంటికి డెలివరీ పొందే సౌకర్యాన్ని బిస్లెరీ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చును. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో బిస్లెరీ డోర్ డెలివరీ సేవలను కంపెనీ అందిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్, అహ్మాదాబాద్, చెన్నై తదితర నగరాల్లో అందుబాటులో ఉంది. బిస్లెరీ మినరల్ వాటర్‌ను నిరంతరాయంగా సరఫరా పొందడం కోసం కస్టమర్లు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 122 ఆపరేషనల్ ప్లాంట్, 4500 డిస్ట్రిబ్యూటర్స్‌తో దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లో 24X7 ప్యాకేజ్డ్ వాటర్‌ను డెలివరీ చేయనున్నట్లు బిస్లెరీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్-19 రాకతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ డెలివరీ సేవలను ప్రారంభించినట్లు బిస్లెరీ సీఈవో అంజెలో జార్జ్ వెల్లడించారు. చదవండి: రెండు నెలల్లో రూ.15 లక్షల కోట్ల సంపద హాంఫట్..! -
Hyderabad: మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మెట్రో రైల్ ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గురువారం అత్యధిక జనసాంద్రత కలిగిన మెట్రో స్టేషన్లతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ట్రైన్స్ అన్నింటా షుగర్ బాక్స్ నెట్వర్క్స్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటర్నెట్కు వెన్నెముకగా నిలిచే హైపర్ లోకస్ ఎడ్జ్ క్లౌడ్ ఆధారిత సాంకేతికత రూపశిల్పి షుగర్ బాక్స్ నెట్వర్క్స్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్‌తో భాగస్వామ్యం చేసుకుని డిజిటల్ కనెక్టివిటీని మరింతగా మెరుగుపరుస్తుంది. ఈ క్రమంలో దేశంలోనే తొలి ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో రైల్ తమ ప్రయాణికులకు కంటెంట్‌ను ఉచితంగా డౌన్లోడ్, స్ట్రీమ్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా అందిస్తుంది. దీంతో వినోదం, విద్య, ఈ– కామర్స్, ఫిన్‌టెక్ విభాగాలలో కంటెంట్‌ను పొందవచ్చు. విమానాలలో ఏ విధంగా అయితే సేవలు లభ్యమవుతాయో అదే రీతిలో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల నగరంలో షుగర్ బాక్స్ నెట్వర్క్స్ నిర్వహించిన అధ్యయనంలో మెట్రో రైల్ ప్రయాణికులు ప్రయాణ సమయాన్ని దాదాపు 60 నిమిషాలు తమ ఫోన్లలోనే గడుపుతున్నట్టు వెల్లడైంది. నేపథ్యంలో షుగర్ బాక్స్ యాప్ ప్రయాణ సమయంలో రెండవ అత్యంత ప్రాధాన్యతా యాప్‌గా నిలిచింది. (చదవండి: ఐఐటీ హైదరాబాద్.. నియామకాల్లో జోరు) ప్రయాణికులకు వారి ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన సేవలను అందించగలుగుతున్నామని షుగర్ బాక్స్ నెట్వర్క్స్ కో ఫౌండర్, సీఈవో రోహిత్ పరాంజపీ చెప్పారు. హైదరాబాద్ స్మార్ట్ నగరంలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఓ అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ, సీఈఓ కేవీబీరెడ్డి తెలిపారు. (చదవండి: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు) -
ఖమ్మంలో ఈ–ఓటింగ్ అంతంతే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అట్టహాసంగా చేపట్టిన ఈ–ఓటు మొబైల్ యాప్ ప్రయోగం ఖమ్మం కార్పొరేషన్లో పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. దేశంలోనే తొలిసారిగా ఖమ్మంలో మొబైల్ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ఈనెల 8 నుంచి 18 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. అయితే, ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా పాలనాయంత్రాంగం యాప్‌పై ఓటర్లలో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేయించడంలో నిర్లక్ష్యం వహించింది. అధికారులు 10 వేల మంది ఓటర్లతో యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా 38.3 శాతం మంది అంటే 3,830 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బుధవారం నిర్వహించిన మాక్ ఈ–ఓటింగ్‌లో 2,128 మంది మాత్రమే ఓటేశారు. అంటే ఈ–ఓటింగ్ 55.56 శాతం నమోదైంది. (చదవండి: కరోనా ఎండమిక్ స్టేజ్‌కు చేరుకుంటున్నట్టేనా?) -
సాలీడు పురుగులంటే భయమా? ఈ యాప్‌తో..
గాలి భయం, నేల భయం, నిప్పు భయం, నీరు భయం.. ఇలా మనిషికి అంతా భయంమయం. నల్లిని చూసినా, పిల్లిని చూసినా.. భయంతో, అసహ్యంతో కుంగిపోతుంటాడు. అయితే కొందరు ఆ భయాల్ని పొగొట్టుకునేందుకు రకరకాల థెరపీలను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో సాలీడు పురుగులంటే భయపడేవాళ్ల కోసం ఓ యాప్‌ను రూపొందించారు స్విట్జర్లాండ్ సైంటిస్టులు. స్విట్జర్లాండ్ బాసెల్ యూనివర్సిటీ రీసెర్చర్లు ‘డబ్బ్‌డ్ ఫోబిస్’ పేరుతో ఓ కొత్త యాప్‌ను డెవలప్ చేశారు. ఇందులో అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో రూపొందించిన సాలీడు పురుగుల బొమ్మలు డిస్ప్లే అవుతాయి. వీటి ద్వారా నిజమైన సాలీడు పురుగుల వల్ల కలిగే భయాన్ని దూరం చేసుకోవచ్చని రీసెర్చర్లు చెప్తున్నారు. సాలీడు పురుగుల వల్ల మనిషికి కలిగే భయాన్ని అరాచ్నోఫోబియా(అరాక్నోఫోబియా) అంటారు. దీని నుంచి బయటపడేందుకు చాలామంది మానసిక వైద్యులు, థెరపిస్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే డబ్బ్‌డ్ ఫోబిస్ పూర్తిగా ఫ్రీ యాప్. అగుమెంటెడ్ రియాలిటీ 3డీ స్పైడర్ బొమ్మల వల్ల.. రియల్ లైఫ్ స్పైడర్లు ఎదురైనప్పుడు కలిగే భయాన్ని ఫేస్ చేయొచ్చు. మొత్తం పది లెవల్స్‌లో ఈ యాప్ ట్రీట్మెంట్(సెల్ఫ్) చేసుకోవచ్చు. రీసెంట్గా ఈ యాప్ వల్ల అరాచ్నోఫోబియా బయటపడ్డ కొందరి అభిప్రాయాల్ని ‘యాంగ్జైటీ డిజార్డర్స్’ అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు. వీళ్లంతా సుమారు రెండువారాలపాటు ఆరున్నర గంటలపాటు శిక్షణ తీసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో థెరపీ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చాయని రీసెర్చర్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్లేస్టోర్‌లో డమ్మీ ఫోబిస్ యాప్‌లు చాలానే ఉన్నాయి. కానీ, ఏఆర్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్‌తో కూడిన డబ్బ్‌డ్ ఫోబిస్ యాప్ రావడానికి కొంత టైం పడుతుందని చెప్తున్నారు. చదవండి: ఔరా.. అద్దాలలో ఈ స్మార్ట్ అద్దాలు వేరయా! -
వామ్మో ఆ యాప్.. మెడ మీద కత్తిరా బాబోయ్!
సాక్షి,కెరమెరి(ఆసిఫాబాద్): గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరును విశ్లేషించేందుకు, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు నూతనంగా తీసుకొచ్చిన డీఎస్ఆర్(డైలీ శానిటేషన్ రిపోర్టు) యాప్ ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే అదనపు భారం మోస్తున్న తమకు ఈ యాప్ మెడ మీద కత్తిలా ఉందని కార్యదర్శులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యంతో సహా పల్లె ప్రగతి పనుల పురోగతి నమోదు కోసం ప్రభుత్వం డీఎస్ఆర్ యాప్ తీసుకొచ్చింది. పల్లె ప్రగతి పనులు పరిశీలన, వీధుల శుభ్రం, రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు, మరణాల నమోదు, విద్యుత్ బిల్లులు ఇలా ప్రతి సమాచారాన్ని ప్రస్తుత డీఎస్ఆర్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఈ యాప్‌ను మార్చారు. కొత్త ఆప్షన్లను ఇందులో చేర్చారు. కొత్త డీఎస్ఆర్ ఆప్‌ను ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. కాని చాలా మంది ఇంకా ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోలేదు. దీన్ని వినియోగించడానికి నిరాకరిస్తున్నారు. నేటి నుంచి దీన్ని వాడకంలోకి తేవాలని కోరుతుండగా, కొద్ది మంది మాత్రమే ఇన్స్టాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి ఇది.. పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే ఉన్న యాప్‌ను తొలగించి కొత్తది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందులో పంచాయతీ కార్యాలయం చిత్రాలను లోపలి నుంచి ఒకటి, బయటి నుంచి మరొకటి తీసి అనుసంధానం చేయాలి. ఇది ఈ కార్యాలయ, ప్రాంతానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా పనిచేస్తుంది. ఆ తర్వాత రోడ్లు వీధులు, తదితర ఐదు ఫొటోలు అప్లోడ్ చేయాలి. పాత తేదీని తీసిన ఫొటో అయితే అప్లోడ్ కాదు. పంచాయతీ కార్యదర్శులు ఖచ్చితంగా లోకేషన్లో ఉండి పనిచేసేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. ఇది ప్రధానంగా ఇబ్బందికి కారణం. దీని ప్రకారం కార్యదర్శులు తప్పక ఉదయం 5 గంటలలోపు హాజరును యాప్‌లో నమోదు చేయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా తెరచుకోదు. స్వీయా చిత్రం తీసుకుంటేనే హాజరు నమోదవుతుంది. తర్వాత డైయిలీ శానిటేషన్ రిపోర్టును ఆన్లైన్లో చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అదనపు పనిభారంతో సతమతమవుతున్న తమకు ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుందని కార్యదర్శులు పేర్కొంటున్నారు. సిగ్నల్స్ రాని వారి పరిస్థితి? కొత్త విధానంతో కార్యదర్శులు సంకట స్థితిలో పడ్డారు. కార్యదర్శులు అందరూ స్థానికంగా నివాసం ఉండడం లేదు. నివాసిత ప్రాంతానికి దూరంగా ఉన్నా పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము లేచి బయలుదేరితే తప్పా 5 గంటల్లోపు కార్యాలయానికి చేరుకునే పరిస్థితి లేదు. ఇక మహిళా కార్యదర్శులు ఇక్కట్లకు గురికావాల్సిందే. వేళాపాళా లేకుండా కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించాల్సి రావడంతో లోలోనా కుమిలిపోతున్నారు. జిల్లాలో సెల్‌ఫోన్ సంకేతాలు సరిగా అందని పంచాయతీలు దాదాపు 200 వరకూ ఉన్నాయి. అక్కడ ఈ విధానాన్ని ఎలా అమలు చేయాలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ విధానం ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు.కొత్తయాప్‌ను మెడ మీద కతిక్తలాంటిదని పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకిస్తున్నారు. ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు పనులు తామే చేస్తున్నామని, పాఠశాలల్లో స్వీపర్లను తొలగించడంతో తమ సిబ్బంది ద్వారా పనిచేయించాల్సి వస్తుందని అంటున్నారు. ఊర్లో అన్ని సమస్యలు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. నాయకులు, పై స్థాయి అధికారులు వచ్చినా ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాప్‌లో పేర్కొన్న నిబంధనలు మార్చాలని విన్నవిస్తున్నారు. చదవండి: ఒక్కగానొక్క కూతురు.. అల్లారు మద్దుగా పెంచారు.. పుట్టిన రోజునే.. -
ఇంటికే ఆర్టీసీ కార్గో.. యాప్ వచ్చేస్తోంది!
సాక్షి, హైదరాబాద్: కార్గో సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. కార్గో సేవల బుకింగ్ కోసం వారం, పదిరోజుల్లో మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వినియోగదారులు ఇక ఇంటి వద్ద నుంచే కార్గో సేవలను పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి అంతర్జాతీయ వాణిజ్య దిగ్గజసంస్థలు అందజేస్తున్న తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో కార్గో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చి సేవలను విస్తృతపరచనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో వినియోగదారులు తమ పార్శిళ్ల కోసం బస్స్టేషన్లకు, ఆర్టీసీ పార్శిల్ కేంద్రాలకు పరుగెత్తాల్సిన పరిస్థితి ఇక ఉండదు. బుకింగ్‌ల కోసం కూడా బస్స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం కూడా ఏర్పడదు. యాప్‌తో మరింత చేరువ ఇప్పటివరకు 15 లక్షలకుపైగా పార్శిళ్లను ఆర్టీసీ కార్గో సేవల ద్వారా తరలించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచి 60 శాతానికిపైగా పార్సిళ్లు్ల తెలంగాణ జిల్లాలకు, ఏపీలోని వివి ధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఇప్పటికీ వినియోగదారులే తాము పంపించాల్సిన వస్తువులను సమీప బస్స్టేషన్ల వరకు తీసు కొస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు కొంతమేర భారంగానే ఉంది. దీంతో వినియోగదారులు ఇంటి నుంచి బస్స్టేషన్ల వరకు వెళ్లడాన్ని అదనపు ఖర్చుగా భావిస్తున్నారు. ‘‘ఈ ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ కార్గోకు, వినియోగదారులకు మధ్య మరో సంస్థను అందుబాటులోకి తేవాలనుకుంటున్నాం. ఈ సంస్థ వినియోగదారుల నుంచి సేకరించిన వస్తువులను ఆర్టీసీ కార్గోకు అందజేస్తుంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి కార్గోకు వచ్చిన వస్తువులను తిరిగి వినియోగదారుల ఇళ్ల వద్ద అందజేస్తుంది’’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 150 బస్సుల ద్వారా కార్గో సేవలను అందిస్తున్నారు. -
Andhra Pradesh: ఒక్క బటన్ నొక్కితే చాలు.. ముంగిటికే అన్నీ
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ యువతి తన స్నేహితురాళ్లతో కలసి ఉదయం వాకింగ్ చేస్తుండగా 6.30 గంటలకు ఓ యువకుడు వచ్చి వేధించి తనను ప్రేమించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఆ యువతి అందుకు నిరాకరించడంతో ఆ యువతి చెయ్యి పట్టుకుని లాగి, దాడి చేశాడు. దాంతో ఆమె మెడ, మొహం మీద గాయాలు అవ్వడంతోపాటు కంటి సమీపంలో రక్తం గడ్డకట్టింది. అతను కత్తి చూపిస్తూ తనను ప్రేమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించి వెళ్లాడు. వెంటనే యువతి 6.45 గంటలకు దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ నొక్కింది. దిశ కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే అనకాపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు 6.55 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి నిందితుడిని అరెస్టు చేశారు. సాక్షి, అమరావతి: అవసరం ఏదైనా.. ఒక్క బటన్ నొక్కితే చాలు ప్రభుత్వ యంత్రాంగం సేవలన్నీ అరచేతిలోకే అందుబాటులోకి వస్తున్నాయి. పౌరసేవల్లో రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విప్లవాన్ని తేవడంతో అత్యంత వేగంగా ఫలాలు అందుతున్నాయి. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి తొలగింది. మొబైల్ ఫోన్లో యాప్ ద్వారా సమాచారం అందిస్తే చాలు ప్రభుత్వ యంత్రాంగం తక్షణం స్పందించి నిర్దిష్ట సేవలను అందిస్తోంది. ప్రజలకు వ్యయ ప్రయాసలను నివారిస్తూ పౌర సేవలన్నీ సత్వరం, మెరుగైన రీతిలో వారి చెంతకే చేరుస్తోంది. అందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు ప్రత్యేక యాప్‌లను రూపొందించాయి. వీటిని లక్షలాదిగా డౌన్లోడ్ చేసుకుంటూ ప్రభుత్వ సేవలను సులభంగా పొందుతున్నారు. ప్రభుత్వ చొరవ పట్ల జాతీయస్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు వ్యయ ప్రయాసలను నివారించి ప్రభుత్వ సేవలను వారి చెంతకే విజయవంతంగా అందిస్తున్న కొన్ని యాప్‌ల గురించి తెలుసుకుందాం. చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా పోలీసు శాఖ ► మహిళా భద్రతకు భరోసా ‘దిశ’ మహిళలు, యువతుల భద్రతకు పూర్తి భరోసానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆధునిక సాంకేతిక అద్భుతం ‘దిశ’ యాప్. మహిళల మొబైల్ ఫోన్లో ఈ యాప్ ఉంటే చాలు పోలీసుల భద్రతా వలయంలో ఉన్నంత సురక్షితంగా ఉండొచ్చు. మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా.. వేధింపులకు గురైనా యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు... నిమిషాల్లో పోలీసులు అక్కడకు చేరుకుని భద్రత కల్పిస్తారు. ఎస్‌వోఎస్ బటన్ నొక్కేందుకు అవకాశం లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్‌ను అటూ ఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్ కంట్రోల్‌కు సమాచారం చేరిపోతుంది. ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, మొబైల్ ఫోన్‌ను అటూ ఇటూ ఊపినా సరే బాధితురాలి వివరాలు, ప్రస్తుతం ఉన్న ప్రదేశం వివరాలు దిశ కమాండ్ కంట్రోల్‌కు తెలుస్తాయి. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సమాచారం అందించి బాధితురాలి రక్షణకు పోలీసులను పంపిస్తారు. ప్రయాణాల్లో రక్షణ కోసం మై ట్రావెల్ ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఉంది. సమస్యాత్మక ప్రదేశాలను పోలీసు శాఖ జియో ట్యాగింగ్ చేసి మహిళలను అప్రమత్తం చేస్తోంది. దిశ యాప్ ద్వారా పోలీసులు రికార్డు స్థాయిలో మహిళల వేధింపులకు సమర్థంగా అడ్డుకట్ట వేస్తున్నారు. మహిళల భద్రతకు ఇంత భరోసా ఇస్తున్నందువల్లే ఇప్పటికే రాష్ట్రంలో 40 లక్షల మందికిపైగా దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. చదవండి: ఏపీలో తక్కువ వ్యయంతో సరుకు రవాణా ►అరచేతిలో స్టేషన్.. పోలీస్ సేవా యాప్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు ‘పోలీస్ సేవా యాప్’ రూపొందించారు. ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ కాపీల డౌన్లోడ్, నిందితుల అరెస్టు వివరాలు, పొగొట్టుకున్న పత్రాలకు సంబంధించిన ఫిర్యాదులు, బయట ఊర్లకు వెళ్లాల్సి వస్తే మన ఇంటిపై ప్రత్యేకంగా పోలీస్ పహారా కోసం వినతి, వాహనాల దొంగతనంపై ఫిర్యాదులు, ఈ–చలానా వివరాలు, సైబర్ భద్రత, సోషల్ మీడియాలో పోస్టులపై ఫ్యాక్ట్ చెక్, కమ్యూనిటీ పోలీసింగ్, సమీపంలోని ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకుల వివరాలు, రహదారి భద్రత, సభలు– సమావేశాలకు పోలీసు అనుమతులు.. ఇలా మొత్తం 87 రకాల పోలీసు సేవలను ఈ యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇంత సౌలభ్యంగా ఉండటంతో పోలీస్యాప్ను ఇప్పటి వరకు 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. విద్యా శాఖ ► మనబడికి పోదాం యాప్... రాష్ట్రవ్యాప్తంగా 6 – 14 సంవత్సరాల వయసు కలిగిన బడి బయటి పిల్లలను గుర్తించడం కోసం మనబడికి పోదాం యాప్ రూపొందించారు. బడికి దూరమైన పిల్లలను గుర్తించి తగిన తర్ఫీదుతో దగ్గరలోని పాఠశాలలో వయసుకు తగ్గ తరగతిలో చేర్పిస్తారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా చదువు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ యాప్‌లో అలాంటి పిల్లలను గుర్తించడం, స్కూళ్లలో చేర్పించడం లాంటి పనుల సమాచారాన్ని పొందుపరుస్తారు. మనబడి నాడు–నేడు యాప్ (ఎస్టీఎంఎస్)... మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పది రకాల మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నారు. పాఠశాలల స్థాయిలో పనుల ప్రగతిని ఈ యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఈ– హాజరు యాప్.. ఈ యాప్ ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. దీక్ష.. విజ్ఞానాన్ని పంచుకునేందుకు డిజిటల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్‌తో కూడిన వేదిక ఇది. టీచర్లు, స్టూడెంట్ల కోసం దీన్ని రూపొందించారు. ఈ యాప్‌లో పాఠ్యపుస్తకాలను డిజిటలైజ్ చేసి పొందుపరిచారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు వివిధ కోర్సులు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. వైద్య– ఆరోగ్య శాఖ ఐదు రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించే ‘ఈ సంజీవని – ఓపీడీ’ యాప్ స్పెషలిస్ట్ వైద్యుల సలహాలు కావాలంటే వ్యయ ప్రయాసలకు ఓర్చి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ–సంజీవని– ఓపీడీ’ యాప్ మీ మొబైల్ ఫోన్లో ఉంటే చాలు. రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే ఐదు రకాల స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ఈ యాప్ ద్వారా సంప్రదించవచ్చు. స్పెషలిస్ట్ వైద్యులు యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చి తగిన వైద్య సలహాలు ఇచ్చి అనంతరం వైద్యం సాయం అందిస్తారు. అందుకోసం జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో 13 ఈ–సంజీవనీ హబ్‌లను ఏర్పాటు చేశారు. రోగుల పాలిట ఆపద్భంధువుగా మారిన ఈ యాప్ విజయవంతమైంది. 2019 నవంబర్ నుంచి ఇప్పటివరకు 39 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో కొత్తగా మరో 14 ఈ–సంజీవని హబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం 27 హబ్‌లు అవుతాయి. వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖలు ఆర్బీ యూడీపీ యాప్‌తో పంటల నమోదు విత్తనం నుంచి విపణిలో పంటల విక్రయం వరకు అన్నీ సేవలను యాప్ ద్వారా వ్యవసాయ శాఖ అన్నదాతలకు అందుబాటులోకి తెచ్చింది. విత్తనాల కొనుగోలు, పంటల బీమా నమోదు, పెట్టుబడి రాయితీ పొందడం, బ్యాంకు నుంచి రుణాలు, పంటలు నష్టపోతే పరిహారం పొందడం... ఇలా అన్నింటికీ కీలకం ‘పంటల నమోదు’. ఇంత కీలకమైన ఈ–క్రాపింగ్ ప్రక్రియను వ్యయ ప్రయాసలు లేకుండా నమోదు చేసేందుకు ‘రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫాం’ పేరుతో యాప్‌ను రూపొందించారు. భూ రికార్డుల ఆధారంగా పంట వివరాలతో ఆన్లైన్లోనే జియో ఫెన్సింగ్ చేస్తారు. విత్తనాలు వేసిన రెండువారాల తర్వాత వీఏఏ, వీహెచ్‌లు పొలాలకు వెళ్లి పరిశీలించి ఫోటో తీసి ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేస్తారు. అన్నీ పక్కాగా ఉంటే మొబైల్‌కు డిజిటల్ రసీదు పంపుతారు. తద్వారా వ్యవసాయానికి సంబంధించిన అన్ని సేవలను రైతులు పొందేందుకు అర్హులవుతారు. పశు సంరక్షక్ యాప్ పశువైద్యాన్ని పాడి రైతుల గుమ్మం వద్ద అందించేందుకు పశుసంవర్ధక శాఖ ‘పశు సంరక్షక్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పశువుల నుంచి సేకరించే మూత్రం, పేడను పశువ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపి ఫలితాలను యాప్‌లో నమోదు చేస్తారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రబలే సీజనల్ వ్యాధుల గురించి పాడి రైతులు అవగాహన పెంచుకుని నివారణ చర్యలు చేపట్టవచ్చు. సీఎం యాప్‌తో పంటలకు మద్దతు ధర పంటలకు మెరుగైన ధర అందించేందుకు మార్కెటింగ్ శాఖ సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్స్) రూపొందించింది. రాష్ట్రంలో వ్యవసాయ పంటల ధరల హెచ్చుతగ్గులను విశ్లేషించడం ద్వారా కనీస మద్దతు ధరను నిర్ణయించడం, నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయడానికి ఈ యాప్ దోహదపడుతుంది. ఈ–మత్స్యకార యాప్ మత్స్య శాఖ అందించే అన్ని సేవలను అనుసంధానిస్తూ ‘ఈ– మత్స్యకార’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ‘అప్సడా’ రిజిస్ట్రేషన్లు, ఇన్పుట్ సరఫరా, మత్స్య సాగుబడి, కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన లాంటి కార్యక్రమాలన్నీ ఈ యాప్ ద్వారానే నిర్వహిస్తున్నారు. చేపలు, రొయ్యల చెరువుల నమోదు, వినూత్న ఆక్వా కల్చర్ యూనిట్ల నమోదు అంతా ఈ యాప్ ద్వారానే జరుగుతోంది. రైతులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా కల్పించారు. ఈ యాప్ ద్వారా క్వాలిటీ ఇన్పుట్స్ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. జియో ట్యాగింగ్ ద్వారా ఈ క్రాప్ నమోదు చేస్తున్నారు. విపత్తుల వేళ పంట నష్టాన్ని అంచనా వేసి ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. విద్యుత్తు శాఖ విద్యుత్ శాఖలో ‘ఈ–విప్లవం’ రాష్ట్రంలోని 1.89 కోట్ల మంది వినియోగదారులకు సేవలందించేదుకు మూడు విద్యుత్తు పంపిణీ సంస్థలు మొబైల్ యాప్‌లు రూపొందించాయి. కొత్త సర్వీసులు పొందడం, బిల్లుల చెల్లింపులు, వినియోగదారుల సేవలు, విద్యుత్తు వినియోగం, చెల్లింపుల వివరాలు, సరఫరా పరిస్థితి, వినియోగించిన విద్యుత్తు వివరాలు, స్వయంగా మీటర్ రీడింగ్ నమోదు చేసే సౌలభ్యం తదితర సేవలన్నీ ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. హెట్టీ విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ‘కైజాలా’ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరే ఏ రోజు విద్యుత్తు సరఫరా ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘ఏపీ విద్యుత్ ప్రవాహ్’ యాప్‌ను తెచ్చారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు 1912 టోల్‌ఫ్రీ నెంబర్ సదుపాయం ఉంది. పురపాలక శాఖ 92 రకాల సేవలు... నగర, పురపాలికలు, నగర పంచాయతీల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు ‘పురసేవ’ యాప్ దోహదం చేస్తోంది. ఈ యాప్‌లో మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించి 92 రకాల సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఫోటోలు, వీడియోల ద్వారా ప్రజలు సమస్యలపై ఫిర్యాదు చేసే సదుపాయం యాప్‌లో ఉంది. ఆస్తి, నీటి పన్నులు ఈ యాప్ ద్వారా చెల్లించవచ్చు. యాప్ ద్వారా గత నాలుగు నెలలుగా పట్టణ ప్రజల నుంచి అందిన 3, 287 ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించారు. ఎన్నో ఉపయోగాలు ఉన్నందున ఈ యాప్‌ను ఇప్పటివరకు 10.15 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళా–శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహార పంపిణీకి ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ యాప్ తల్లీబిడ్డలకు పౌష్టికాహార పంపిణీని పర్యవేక్షించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్ నమోదు, పౌష్టికాహార పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. అంగన్వాడీలకు వ్యాన్ల ద్వారా పాల సరఫరాను పర్యవేక్షించేందుకు ‘మిల్క్ యాప్’ రూపొందించారు. పాల వ్యాన్లకు జియో ట్యాగింగ్ కూడా చేశారు. 24 గంటల్లోపే విత్తనాలు, ఎరువులు 15 ఎకరాల్లో వరి, పసుపు పంటలు వేశా. ఆర్బీకే 2.0 యాప్ ద్వారా విత్తనాలు, ఎరువులు బుక్ చేసుకున్నా. ఆన్లైన్లో డబ్బులు చెల్లించా. 24 గంటలు తిరక్కుండానే రైతు భరోసా కేంద్రం సిబ్బంది వాటిని సరఫరా చేశారు. మార్కెట్లో దుకాణాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేకుండాపోయింది. – గుంటక భాస్కరరెడ్డి, రైతు, పెద ఒగిరాల, కృష్ణా జిల్లా -
ఎల్ఐసీ ఆనంద మొబైల్ యాప్ ఆవిష్కరణ
ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ ఏంజెట్లు, మధ్యవర్తుల కోసం ఆత్మ నిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్ (ఆనంద) పేరుతో మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. కంపెనీ చైర్పర్సన్ ఎంఆర్ కుమార్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ యాప్ ద్వారా ద్వారా డిజిటల్‌గా కేవైసీ పక్రియను పూర్తి చేయవచ్చు. కాగితం అవసరం లేకుండా పాలసీలను డిజిటల్ రూపంలో మంజూరు చేయవచ్చు. ఏజెంట్ ఇంటికి రావల్సిన పనిలేకుండానే కస్టమర్లు కొత్తగా ఎల్ఐసీ పాలసీ తీసుకోవచ్చని ఎంఆర్ కుమార్ తెలిపారు. -
అదిరిపోయే వీడియో ఎడిటింగ్ యాప్స్ మీకోసం..
పిండి కొద్ది రొట్టెలాగే... టెక్నాలజీ కొద్ది వీడియో! టెక్నాలజీతో ‘బొమ్మ అదిరిపోయింది’ అనిపించడానికి బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకొని మీ వీడియోలకు సాన పెడితే ‘శబ్భాష్’ అనిపించుకోవడం ఎంతసేపని! వీడియో ఎడిటింగ్‌కు మీరు కొత్త అయితే ‘ఎడోబ్ ప్రీమియర్ ఎలిమెంట్స్’ బెటర్. ‘క్రియేట్ - ఎడిట్- ఆర్గనైజ్ -షేర్ యువర్ వీడియోస్’ అంటున్న ఎడోబ్ ప్రీమియర్ ఎలిమెంట్స్‌కు ఈజీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌గా పేరుంది. స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవచ్చు. సెకండ్ల వ్యవధిలో వీడియోలను షార్ప్‌గా తీర్చిదిద్దవచ్చు. పర్ఫెక్ట్లెంత్తో మ్యూజిక్‌ను సెట్ చేయవచ్చు. ‘ఫైనల్ కట్ ప్రో’ను ప్రొఫెషనల్ టూల్‌గా చెబుతుంటారు. టాప్ యూట్యూబర్స్ దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. లాంగ్ టర్మ్ యూట్యూబర్స్కు ఎక్కువగా ఉపయోగపడే ‘ఫైనల్ కట్’లో ఫిల్టర్స్, మల్టీఛానెల్ ఆడియో టూల్స్, అడ్వాన్స్డ్ కలర్ గ్రేడింగ్ ఫీచర్లు ఉన్నాయి. మొబైల్‌ఫోన్ ఉపయోగించే సోషల్ మీడియా వీడియో క్రియేటర్స్ కోసం ‘ఎడోబ్ యాప్ ప్రీమియర్ రష్’ ఉపయోగపడుతుంది. వాయిస్ అండ్ మ్యూజిక్ మధ్య సౌండ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేసే ‘ఆటో డకింగ్’ సదుపాయం అందుబాటులో ఉంది. ఆకట్టుకునే మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్స్ ఉన్నాయి. ‘షాట్‌కట్’ సాఫ్ట్‌వేర్‌తో సులభంగా వీడియోలు ఎడిట్ చేయవచ్చు. ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మెరుగైన వీడియో, ఆడియో టూల్స్, 4కే లాంటి వైడ్‌రేంజ్ ఫార్మట్స్ ఉన్నాయి. ‘వీమియో’ అనేది బెస్ట్ ఏఐ-అసిస్టెడ్ ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనిపించుకుంది. వేలాది ఫోటోలు, వీడియోలు ఉన్న స్టాక్లైబ్రరీతో యాక్సెస్ కావచ్చు, లైసెన్స్డ్ మ్యూజిక్ లైబ్రరీ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను వాడుకోవచ్చు. ‘ఇన్వీడియో’ అనేది ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్. సోషల్ మీడియా కోసం మాత్రమే కాకుండా కంపెనీ వెబ్సైట్ల కోసం ఆకట్టుకునేలా వీడియోలు క్రియేట్ చేయవచ్చు. అయిదువేలకు పైగా ప్రీ-మేడ్ టెంప్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్రీస్టాక్ లైబ్రరీ నుంచి ఫోటో,వీడియోలు,మ్యూజిక్‌ను ఉపయోగించవచ్చు. టెక్స్ - టు - వీడియో టూల్లాంటి స్రై్టకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ‘వుయ్వీడియో’ అనేది క్లౌడ్-బేస్డ్ ఆన్లైన్ ఎడిటర్. స్టాక్వీడియో లైబ్రరీ నుంచి వేలాది ఇమెజెస్, వీడియోలు, మ్యూజిక్‌తో యాక్సెస్ కావచ్చు. గ్రీన్‌స్క్రీన్, స్క్రీన్ రికార్డింగ్, కలర్గ్రేడింగ్... మొదలైన అడ్వాన్స్డ్ ఎడిటింగ్ టూల్స్‌తో వీడియోలకు సినిమాటిక్ లుక్ ఇవ్వొచ్చు. స్లైడ్షోలు,ప్రచారయాత్రలతో పాటు సోషల్ మీడియాలో మార్కెటింగ్ వీడియోలు క్రియేట్ చేయడానికి పర్ఫెక్ట్ వీడియో మేకర్ బైటబుల్. స్టన్నింగ్ టెంప్లెట్స్ దీని సొంతం. వీడియోలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడానికి హై రిజల్యూషన్‌తో కూడిన ఫోటోలు, స్టాక్వీడియోలు ఉన్నాయి. ఇక మీరు రెడియా! త్రినేత్రం అనుభవాన్ని మించిన జ్ఞానం ఏంఉంటుంది! తన అపారమైన అనుభవంతో అమెరికన్ ఫిల్మ్ఎడిటర్, డైరెక్టర్, సౌండ్ డిజైనర్ వాల్టర్ మర్చ్ ‘ఇన్ ది బ్లింక్ ఆఫ్ యాన్ ఐ’ అనే మంచి పుస్తకం రాశారు. వీడియో లేదా ఫిల్మ్ ఎడిటింగ్‌కు సంబంధించి బోలెడు విషయాలు తెలుసుకోవచ్చు. డిజిటల్ ఎడిటింగ్‌లో వచ్చిన మార్పులు, డిజిటల్ ఎడిటింగ్ ఉపయోగాలు, పరిమితులు...మొదలైనవి తెలుసుకోవడానికి ఉపయోగపడే పుస్తకం ఇది. -
ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ప్రతి మహిళకు దిశ యాప్ అవసరమని, దిశ యాప్‌పై ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం జగన్ పేర్కొన్నారు. మంగళవారం ‘దిశ’ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామానికి చేరుకున్న సీఎం జగన్.. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలిని, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలని సీఎం జగన్ అన్నారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన కలిచివేసిందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని గుర్తుచేశారు. ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్ చెప్పారు. ఫోన్లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టం కూడా చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దిశ కేసుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టామని, దిశ కేసుల విచారణ కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లు మాట్లాడుతూ.. నేరం జరగడానికి ముందే దాన్ని నియంత్రించాలనుకోవడం గొప్ప చర్య అని, సీఎం జగన్ నిర్ణయాలతో మహిళలకు నిజమైన స్వేచ్ఛ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు సీఎం జగన్ లాంటి గొప్ప ముఖ్యమంత్రిని తాము చూడలేదని వాలంటీర్లు చెప్పారు. చదవండి: విద్యారంగ ప్రక్షాళన తర్వాత ఖాళీల భర్తీ కోవిడ్‌పై పోరులో మంచిపేరు వచ్చిందనే.. తప్పుడు రాతలు -
దాల్చిని @ యాప్
మహిళలు ఆఫీసులలో పనులను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. గొప్ప గొప్ప ప్రాజెక్టులను అవలీలగా క్లియర్ చేయవచ్చు. కానీ, వారు ఇంటికి తిరిగి రాగానే కుటుంబసభ్యుల నుంచి ‘తినడానికి ఏముంది?’ అనే సాధారణ ప్రశ్నను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఉదయం పనికి వెళ్ళే ముందు కూడా ఆ రోజుకు కావాల్సినవన్నీ అమర్చిపెట్టి వెళుతుంటారు. వంట అనేది మహిళలకు ఓ పెద్ద సమస్య. దీనినే తన వ్యాపారానికి అవకాశంగా మలుచుకుంది ప్రేరణ. దాల్చిని పేరుతో మొబైల్ యాప్, ఐఓటి వెండింగ్ మెషిన్ల ద్వారా ఇంటి వంటను అందిస్తోంది. 2009లో ఐఎమ్‌టిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులో రజత పతకం సాధించిన ప్రేరణకు ఎనిమిదేళ్ల కార్పొరేట్ అనుభవం ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం మహిళలకు రోజువారీ వంట ఒత్తిడి నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని దాల్చిని ద్వారా అందిస్తోంది ప్రేరణ. భార త సంప్రదాయ ఇళ్లలో వండిన ఆహారం కోసం ఏర్పాటు చేసిన భౌతిక మార్కెట్ ఇది. ఐఓటి ఆధారిత వెండింగ్ మెషిన్ల ద్వారా టిఫిన్ సేవల నెట్‌వర్క్‌నూ అందిస్తోంది. 36 ఏళ్ల ప్రేరణ మాట్లాడుతూ– ‘ఇంట్లో వండిన భారతీయ వంటకాలు, రొట్టెలు, స్నాక్స్ వంటివి ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంచే లక్ష్యంతో దాల్చిని ప్రారంభమైంది’ అని వివరించింది. వైవిధ్యమైన పాత్రలు వ్యాపారిగా, వృత్తి నిపుణురాలిగా, ఆరేళ్ల అమ్మాయికి తల్లిగా ప్రేరణ తన పని గంటల ప్రకారం సమయానుసారంగా కుటుంబసభ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో ఇబ్బందిని గుర్తించింది. దీనినే అవకాశంగా మలుచుకున్న ప్రేరణ... చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘పట్టణ వయోజన శ్రామిక జనాభాలో 69 శాతానికి పైగా పని కోసం బయల్దేరినవారికి ఇంట్లో వండిన ఆహారం లభించదు. హోమ్ టిఫిన్ సేవల్లో ప్రజలు మరింత రుచి, నాణ్యత, నమ్మకం కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసమే దాల్చిని ఏర్పాటయ్యింది’ అని వివరిస్తుంది ప్రేరణ. మహిళలే కీలకం ఐఓటీ వెండింగ్ మెషన్ దాల్చిని మెనూలో సోయా మసాలా క్రాకర్స్, మహారాష్ట్ర చివ్డా, మామ్ స్టైల్ అజ్వైని పరాఠా, హెల్తీ దాల్ పరాఠా, పార్సీ కేక్ రస్క్, గ్రీన్ బఠానీ మినీ సమోసా, గోబీ మంచూరియా, వెజిటబుల్ బిర్యానీ, మల్టీగ్రెయిన్ కుకీలు, సాస్‌తో వడాపావ్‌లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న తర్వాత, ఆర్డర్ ద్వారా చెల్లింపులు ఉంటాయి. యాప్ ద్వారా ‘ఆర్డర్లలో ముప్పై శాతం రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు స్వీకరిస్తాం. వ చ్చిన ఆర్డర్ల ప్రకారం ఆ ప్రాంతంలోని ఇంటి మహిళలకు సమాచారం చేరుతుంది. వారి ద్వారా సమయానుకూలంగా ఆర్డర్ చేసినవారికి వంటను అందిస్తాం. కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో మహిళదే కీలకమైన బాధ్యత. పనిచేసే మహిళా నిపుణులకు ఇది సవాల్ లాంటిది. ఇతర వృత్తులలోని మహిళలకు వంట చేసే బాధ్యతను పంచుకునేందుకు తమ ఇంటి నుండి టిఫిన్ సేవలను నడుపుతున్నవారికి దాల్చిని అవకాశం కల్పిస్తుంది. ఇళ్లలోని మహిళా చెఫ్‌లకు అవకాశాలు కల్పించే మంచి యాప్ ఇది. తద్వారా వారు గుర్తింపును పొందుతున్నారు’ అని వివరిస్తుంది ప్రేరణ. -
ఇక ఎక్కడికెళ్లినా రేషన్ తిప్పలు ఉండవు!
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని అమలు చేసే ప్రణాళికలో మరో అడుగు ముందుకు పడింది. శుక్రవారం కేంద్రప్రభుత్వం మేరా రేషన్ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యాప్ ఇంగ్లి్లష్, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళే రేషన్ కార్డ్ హోల్డర్లకు మేరా రేషన్ మొబైల్ యాప్ ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ప్రకటించారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో భాగస్వామ్యం అయ్యాయని ఆయన తెలిపారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలైన అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అనుసంధానం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య మొత్తం 15.4 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు వన్ నేషన్ వన్ రేషన్ కింద జరిగాయని వివరించారు. 2019 ఆగస్టులో 4 రాష్ట్రాల్లో ప్రారంభించిన ఈ వ్యవస్థను 2020 డిసెంబర్ నాటికి తక్కువ వ్యవధిలో వేగంగా విస్తరించగలిగామని అన్నారు. ప్రస్తుతం వన్ నేషన్ వన్ రేషన్ వ్యవస్థలో దేశంలోని దాదాపు 69 కోట్ల ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రతీ నెల సగటున 1.5 –1.6 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు నమోదు అవుతున్నాయని పాండే తెలిపారు. -
పబ్జీ నిషేధంపై చైనా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పబ్జీ సహా 118 చైనా యాప్‌లను భారత్ నిషేధించడంపై డ్రాగన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొబైల్ యాప్‌లపై నిషేధం నిర్ణయంతో చైనా ఇన్వెస్టర్లు, సర్వీస్ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలను భారత్ ఉల్లంఘించిందని ఆరోపించింది. చైనా మొబైల్ యాప్‌లను భారత్ నిషేధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, భారత్ నిర్ణయం విచారకరమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గో ఫెంగ్ అన్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారడంతో పాటు డేటా గోప్యత ఆందోళనలపై పబ్జీ సహా 118 చైనా యాప్‌లను భారత్ బుధవారం నిషేధించిన సంగతి తెలిసిందే. నిషేధిత మొబైల్ యాప్‌ల జాబితాలో బైడు, బైడు ఎక్స్‌ప్రెస్ ఎడిషన్, అలీపే, టెన్సెంట్ వాచ్‌లిస్ట్, ఫేస్‌యూ, విచాట్ రీడింగ్, క్యామ్‌కార్డ్ సహా పలు యాప్‌లున్నాయి. తాజా నిషేధంతో భారత్ నిషేధించిన చైనా యాప్‌ల సంఖ్య 224కు పెరిగింది. భారత్-చైనా సరిహద్దుల్లో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై భారత్ నిషేధించడం గమనార్హం. గతంలో జూన్ 29న టిక్‌టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. లడఖ్‌లో చైనా దళాలతో ఘర్షణ నేపథ్యంలో అప్పట్లో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి : పబ్జీ ‘ఆట’కట్టు -
‘వైఎస్సార్ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం తెలుసుకోవచ్చు. అలాగే సదరు పరికరాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రజల కోసం కొత్తగా రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను కూడా సరైన సమయంలో ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ యాప్‌లో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులు వేసే పంటలను ఈ-క్రాప్ కింద నమోదు చేయడం, పొలంబడి కార్యక్రమాలు, సిసి ఎక్స్పెరిమెంట్స్, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాలను సందర్శించడం, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణతోపాటు పంటల బీమా పథకం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను సిద్దం చేయడం, రైతులకు ఇన్పుట్స్ పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఆర్బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీనిని ఉన్నతస్థాయిలోని అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. (రైతు భరోసా కేంద్రంలోనే ఇ– క్రాపింగ్: సీఎం జగన్) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) డిజిటల్ రిజిస్టర్‌ను నిర్వహించడం, ఆర్బీకే ఆస్తులను పరిరక్షించడం, ఎక్కడైనా పరికరాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సకాలంలో రిపోర్ట్ చేయడం, డాష్‌బోర్డ్‌లో ఆర్బీకే కార్యక్రమాలను పర్యవేక్షించడం, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల కార్యకలాపాలను పర్యవేక్షించడం, వివిధ పథకాలకు సంబంధించి సర్వే చేయడం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్నులను తీసుకోవడం కూడా ఈ యాప్ ద్వారా సాధ్యపడుతుంది. ఆర్‌బికె పెర్ఫార్మ్న్స్ డాష్‌బోర్డ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్బీకే పనితీరును పరిశీలించడం, సరిపోల్చడం, మెరుగైన పనితీరు కోసం ఎప్పటికప్పుడు సిబ్బందికి దిశానిర్ధేశం చేసేందుకు వీలుగా దీనిని రూపొందించారు. (ధనికులకు బాబు.. పేదలకు జగన్) రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారి అవసరాలను తీర్చడం, వారికి మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాచారం పొందేలా ఈ యాప్ రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.(ఆర్బీకేల నుంచే పండ్లు, కూరగాయల విత్తనాలు, మొక్కలు) -
భారత్‌లో ట్రెండింగ్ యాప్‌ను తొలగించిన గూగుల్
న్యూఢిల్లీ: స్వదేశీ యాప్స్‌గా చెప్పుకుంటున్న వాటికి గూగుల్ వరుసగా షాకిస్తోంది. ఇప్పటికే టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన మిట్రాన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌లో ట్రెండింగ్ యాప్‌గా ఉన్న "రిమూవ్ చైనా యాప్స్" అనే యాప్‌ను సైతం ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగుల్ యాప్స్ పాలసీ నిబంధనలు అతిక్రమించిన కారణంగా దీన్ని తీసేసినట్లు పేర్కొంది. ఇక రిమూవ్ చైనా యాప్స్ విషయానికి వస్తే.. అది ఏం చేస్తుందనేది దాని పేరులోనే ఉంది. ఇది మన ఫోన్లో ఉన్న చైనా యాప్‌లను గుర్తించి, వాటి సమాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్స్ పక్కనే రెడ్ కలర్లో డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేయగానే సదరు యాప్ అన్ ఇన్స్టాల్ అవుతుంది. ఈ యాప్‌ను వన్ టచ్ యాప్ ల్యాబ్స్ అనే సంస్థ రూపొందించింది. 4.8 రేటింగ్‌తో దూసుకుపోయిన ఈ యాప్‌ను 5 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. (ప్లే స్టోర్‌లో కనిపించని మిట్రాన్) కాగా కరోనా కల్లోలానికి చైనానే కారణమంటూ అమెరికా సహా పలు దేశాలు చైనాను వేలెత్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. అటు కరోనా అంశంతోపాటు సరిహద్దుల్లో ఘర్షణ కారణంగా భారతీయుల్లోనూ చైనాపై వ్యతిరేకత ఏర్పడింది. ఈ క్రమంలో చైనా వస్తువులను దూరం పెట్టాలన్న నినాదంతో పాటు, చైనా యాప్స్‌పై తిరుగుబాటు కూడా మొదలైంది. ఫలితంగా టిక్‌టాక్ రేటింగ్స్ పడిపోయాయి. దానికి పోటీగా వచ్చిన మిట్రాన్ 5 మిలియన్ల డౌన్లోడ్లతో విశేషాదరణ పొందింది. కానీ అంతలోనే గూగుల్ టిక్‌టాక్‌కు పాత రేటింగ్‌నే కేటాయించడం, మిట్రాన్‌ను తొలగించడం చకచకా జరిగిపోయింది. (గూగుల్ ప్లే స్టోర్‌లో డేంజరస్ యాప్స్ హల్చల్) -
‘కిసాన్ రథ్’ ఆవిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయోత్పత్తుల రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ అగ్రిగేటర్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘కిసాన్ రథ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ యాప్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆవిష్కరించారు. వ్యవసాయ క్షేత్రాల నుంచి ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు 5 లక్షల ట్రక్కులు, 20 వేల ట్రాక్టర్లు ఈ మొబైల్ ప్లాట్‌పామ్‌లో అందుబాటులో ఉన్నాయి. ‘లాక్డౌన్ సమయంలో రైతుల తమ ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన ట్రాక్టర్లు, ట్రక్కులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను మండీలు, ఇతర మార్కెట్లకు తరలించడానికి కిసాన్ రథ్ యాప్ ఉపయోగపడుతుంద’ని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రైతుల ఇబ్బందులను తొలగించడానికి కొద్దిరోజుల క్రితం ఇండియా అగ్రి ట్రాన్స్పోర్ట్ కాల్ సెంటర్‌ను మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వ్యవసాయోత్పత్తుల రవాణాపై కాల్ సెంటర్ దేశంలో రాష్ట్రాల మధ్య పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు ఇతర వ్యవసాయోత్పత్తుల రవాణా సులభతరం చేయడానికి కేంద్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 14488 నంబర్‌లోగానీ, 18001804200 నంబర్లో గానీ కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు. చదవండి: లాక్డౌన్లో 4.6 లక్షల ఫోన్‌కాల్స్ -
యూపీఎస్సీ 2020 సన్నద్ధమవుదామిలా..
యూపీఎస్సీ ఇపీఎఫ్ఓ 2020 పరీక్ష కోసం సన్నద్ధమవుదామిలా.. యూపిఎస్సి ఇపిఎఫ్ఓ పరీక్షకు సన్నద్ధమవడానికి ముందు సిలబస్‌ను టాపిక్‌లుగా విడదీసుకోవడం అత్యంత ముఖ్యం. ఈ పరీక్ష అక్టోబర్‌లో జరుగుతుంది. కాబట్టి ఒక ప్రణాళిక వేసుకొని సంసిద్ధం అవడానికి తగిన సమయం ఉంది. ఉన్న సమయాన్ని సద్వినియోగించుకుంటూ పక్కా టైంటేబుల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీరే విజేతలవుతారు. యూపీఎస్సీ ఇపీఎఫ్ఓ 2020 పరీక్ష: లింక్ కోసం క్లిక్ చేయండి 1. భారత స్వాతంత్ర్యోద్యమ పోరాటం ఈ విభాగానికి సంబంధంచి 1857 సిపాయిల తిరుగుబాటు టాపిక్ నుంచి ప్రారంభించాలి. బిపిన్ చంద్ర రచించిన ఇండిపెండెన్స్ ఫర్ ఇండిపెండెన్స్ పుస్తకం ఉపయోగపడుతుంది . లేదా ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడరన్ ఇండియా (స్పెక్ట్రమ్) కూడా సరిపోతుంది. చారిత్రక సంఘటనలు, వాటిలో పాల్గొన్న ముఖ్యమైన వ్యక్తుల గురించి గుర్తుంచుకోవాలి. దీనికోసం హైలెట్స్ పాయింట్స్‌ని కలరింగ్ చేసుకోవడం ద్వారా రివిజన్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. 2. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇండియన్ పాలిటీపరీక్షలో చాలా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉన్న టాపిక్ ఇది. భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, రాష్ర్టపతి, పార్లమెంట్ మొదలైన అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. రాజ్యంగ సవరణలు, అధికారాలు లాంటి అంశాల గురించి దృష్టి పెట్టాలి. ఇండియన్ పాలిటీకి సంబంధించిన సిలబస్‌ను కవర్ చేయడానికి ఎం. లక్ష్మీకాంత్ రాసిన పుస్తకాన్ని చదవండి. -ఎకానమీ ఎకానమీకి సంబంధించి ఎక్కువశాతం అనలైటికల్ ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికవ్యవస్థకు సంబంధించి ఇప్పుడున్న స్థితిగతులను బాగా ఫాలో అవ్వాలి. యూనియన్ బడ్జెట్, ఎకనామిక్ సర్వే , ఏఆర్సి వంటి ప్రభుత్వం ప్రచురించిన అన్ని సంబంధిత నివేదికలను చదవాల్సి ఉంటుంది. 11వ తరగతి ఎన్సీఆర్టీ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, రమేష్ సింగ్ రాసిన ఇండియన్ ఎకానమీ వంటి పుస్తకాలను చదవొచ్చు. 3. కంప్యూటర్ అప్లికేషన్ ఈ విభాగానికి సంబంధించి 11, 12వ తరగతి కంప్యూటర్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ పుస్తకాలను తిరగేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్‌పై ఫోకస్ ఎక్కువగా చేస్తే సరిపోతుంది. 4. పారిశ్రామిక సంబంధాలు, కార్మిక చట్టాలు ఈ విభాగంలో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసే వార్షిక నివేదికలు, ఇయర్ ఎండింగ్ రివ్యూ రిపోర్టులు, లేబర్ లా రిఫార్మ్స్, గవర్నెన్స్ రిఫార్మ్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, లాంటి ఈపీఎఫ్‌వోలో చేర్చిన ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించండి. కార్మిక చట్టాలు, ఇండస్ర్టియల్ అంశాలకు సంబంధించిన ప్రస్తుత వార్తలను ఎప్పటికప్పుడూ తెలుసుకోవాలి. దీనికి సంబంధించి కార్మిక శాఖ, పిఐబి ఇండియా యొక్క అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి కూడా డాటా సేకరించి నోట్స్ రాసుకోవాలి. 5. జనరల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ టాపిక్‌లో ముఖ్యంగా బేసిక్స్‌పై దృష్టిపెట్టాలి. ఫార్ములాలు, ట్రిక్స్ తో ప్రాబ్లమ్స్‌ని ఎంత త్వరగా సాల్వ్ చొయోచ్చన్నది మీ ప్రాక్టిస్పైనే ఉంటుంది. ప్రతిరోజు టెస్ట్ పేపర్స్‌ని సాల్వ్ చేయాలి. గ్రేడ్ అప్ అనే ఆన్లైన్ యాప్‌ని డౌన్లోడ్ ద్వారా ఎక్స్పర్ట్స్ క్లాసెస్‌ని వినే సౌలభ్యం ఉంది. యూపీఎస్సీ ఇపిఎఫ్ఓ 2020 పరీక్షలో మంచి రిజల్ట్ రావాలంటే ప్రిపరేషన్‌ను ఇప్పటినుంచే ప్రారంభించండి. ప్రతీ టాపిక్‌పై ఎంతో కొంత నాలెడ్జ్ ఏర్పరుచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యమైన పాయింట్లని నోట్‌డౌన్ చేసేకొని ఎప్పటికప్పుడు రివైజ్చేయండి. ఆల్ ది బెస్ట్ ... -
కరోనా యాప్ రాబోతుంది
సాక్షి, విజయవాడ: కరోనా కట్టడికి ప్రభుత్వం సూచనలు విస్మరిస్తున్న వారిని నిలవరించేందుకు పోలీస్ యంత్రాంగం ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ప్రధానంగా విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో అనుమానితులను క్వారంటైన్ చేసినప్పటికీ పలువురు నిర్దేశిత ఇంటిని, ఆసుపత్రిని దాటి వచ్చేస్తున్నారు. తప్పించుకుని పారిపోయిన సంఘటనలూ వెలుగులోకి వచ్చాయి. అలాంటి వారిని గుర్తించి తిరిగి క్వారంటైన్ చేయాల్సి వస్తోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీన్ని కట్టడి చేయడానికి కరోనా యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు గుంటూరు ఐజీ ప్రభాకరరావు చెప్పారు. (కరోనా సోకిందేమోనని దంపతుల ఆత్మహత్య) అనుసంధానం ఇలా.. క్వారంటైన్ ఉన్న వారి ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసి జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు. నిరీ్ణత ప్రాంతాన్ని అధిగమించగానే సంబంధిత పోలీస్ ఉన్నతాధికారికి అలర్ట్ మెసేజ్ వస్తుంది. తక్షణం ఆ ప్రాంత బాధ్యులైన అధికారికి సూచనలు పంపి క్వారంటైన్‌ను కొనసాగింపజేయడానికి వీలవుతుంది. తొలుత పది మీటర్ల పరిధిలోనే ఉంచాలని భావించినప్పటికీ దాన్ని యాభై లేదా వంద మీటర్ల పరిధి వరకు విస్తరించాలనే ఆలోచన చేస్తున్నారు. ఐ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేయడానికి కూడా పరిశీలనలు చేస్తున్నారు ఏదైనా నిర్దేశిత ప్రాంతం వరకే ప్రత్యేకంగా మెసేజ్ (గ్రూప్ మెసేజ్ తరహాలో) పంపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఓల్డ్ గుంటూరులో 5000 మందికి అలెర్ట్ మెసేజ్‌లు పంపాలనుకుంటే అక్కడికే పరిమితమయ్యేలా డేటా మైగ్రేషన్ ద్వారా పరిశీలిస్తున్నారు. కరోనా సమాచారమే కాకుండా ప్రజలకు నిత్యం అవసరమైన సమాచారాన్ని కూడా పంపాలనేది ఆలోచనగా ఉంది. గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించినట్లు ఐజీ తెలిపారు. వాట్సాప్‌లలో తప్పుడు సమాచారంతో మెసేజ్‌లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకునేలా వ్యవస్థ ఏర్పాటవుతోందన్నారు. క్వారంటైన్లో ఉండకుండా బయటకు వచ్చిన వారిపైన, విదేశాల నుంచి ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమాచారం ఇవ్వకుండా దాచినట్లయితే వారిపైన కేసులు నమోదు చేయనున్నామన్నారు. వైద్య పరిరక్షణలో భాగంగా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఐపీసీ 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నాయని ఐజీ ప్రభాకరరావు వివరించారు. -
డీప్‌ఫేక్ వీడియోలతో పోర్న్ క్లిప్‌లు
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడవారిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వీడియో అమెరికాలో కలకలం రేపింది. తరువాత అది నకిలీదని తేలింది. ఓ హాలీవుడ్ హీరోయిన్ పోర్న్ క్లిప్ ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. అందులో ఉన్నది తాను కాదన్నా ఎవరూ నమ్మలేదు. కానీ, ఆమె చెప్పేది నిజమే. మనకు నచ్చిన సెలబ్రిటీల శరీరానికి సామాన్యుల ముఖాలను అంటించి మురిసిపోయే వీలున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ‘డీప్‌ఫేక్’సాఫ్ట్వేర్ సృష్టిస్తోన్న మాయాజాలమిది.(ముసలి మొహం ప్రైవసీ మాయం!) ఈ యాప్ వచ్చిన కొత్తలో తమకు ఇష్టమైన హీరో, గాయకులు, రాజకీయ నాయకులను అనుకరిస్తూ.. పలు ఫొటోలు, వీడియోలు సృష్టించి, వాటిని సోషల్ మీడియా వేదికలపై పంచుకునేవారు. వాటికి వచ్చే లైకులు చూసి సంబరపడిపోయే వారు. అక్కడి వరకే పరిమితమైతే సరిపోయేది. కానీ, కొందరు మరో అడుగు ముందుకేసి.. సంచలనం సృష్టించాలని, తమ టీవీ చానళ్లకు రేటింగులను పెంచాలనే దురుద్దేశంతో డీప్‌ఫేక్‌ను వాడుకుని సెలబ్రిటీల ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు సందేశాలు, అసభ్య వీడియోలు సృష్టించి వాటిని వైరల్ చేస్తున్నారు. అవి నకిలీవని నిరూపించుకునేందుకు బాధితులు నానా తంటాలు పడుతున్నారు. పలు దేశాల్లో నిషేధం.. టిక్‌టాక్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌తో డ్యాన్సులు, డబ్‌స్మాష్‌తో భారీ డైలాగులు చెబుతూ చాలామంది సంబరపడిపోతారు కదా! ఈ యాప్ కూడా దాదాపు అలాంటిదే. కాకపోతే.. అడ్వాన్స్డ్ వర్షన్. ఎంపిక చేసుకున్న సెలబ్రిటీ, అనుసరించాలనుకున్న ముఖం కవళికలను ఈ సాఫ్ట్వేర్ ముందే పసిగడుతుంది. మీ బాడీకి ఏ సెలబ్రిటీ శరీరమైతే సరిగ్గా సరిపోతుందో సూచిస్తుంది. దాని ప్రకారం.. మీరు ఏదో వీడియోను చేసి, అందులో మీకు నచ్చిన సందేశం ఇచ్చేయాలి. తరువాత మీ ముఖంపై ఎంపిక చేసుకున్న సెలబ్రిటీ ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుతుంది. (టిక్‌టాక్‌లో మరో డేంజర్ చాలెంజ్) అలా.. మీకు నచ్చిన ప్రముఖుల ముఖంలో మీ ముఖం ఇమడ్చడం, లేదా మీ ముఖంలో ప్రముఖుల ముఖం అమర్చే ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇది. ముఖ కవళికలను ఎవరూ గుర్తుపట్టనంత స్పష్టంగా, నాణ్యంగా ఫొటోలు, వీడియోలు సృష్టించడం దీని ప్రత్యేకత. ఇంకో విషయమేమిటంటే.. ఇందులో సెలబ్రిటీల గొంతుతోనే వీడియో వస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలోని ప్లేస్టోర్లలో ఈ సాఫ్ట్వేర్లను అందించే యాప్‌లు అనేకం ఉన్నాయి. వీటిలో చాలా యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిషేధించాయి. ఉగ్రవాదులు, సైబర్ నేరగాళ్లు ఈ యాప్‌ల సాయంతో మోసాలు, దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని, వీటిని నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. (సిమ్ కావాలంటే ముఖం స్కాన్ చేయాల్సిందే) -
అరచేతిలో 'షీ సేఫ్'!
సాక్షి, సిటీబ్యూరో: ‘మీరు గృహ హింసకు గురవుతున్నారా.. ఆన్లైన్ వేదికగా ఆకతాయిలు వేధిస్తున్నారా.. సైబర్ నేరాల బారిన పడ్డారా.. జీవితంపై విరక్తి చెంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా..’కారణాలేమైతేనేం మీ మొబైల్లో ‘షీ సేఫ్’యాప్ నిక్షిప్తం చేసుకుంటే చాలు. నేరాలు, ఒత్తిడి తదితరాల బారి నుంచి ఎలా బయటపడాలో మార్గదర్శక్‌లు దగ్గరుండి మరీ మీకు మార్గదర్శనం చేసి అవసరమైన సహాయాన్ని అందిస్తారు. అది పోలీసుపరంగా, న్యాయపరంగా, షీ టీమ్‌ల పరంగా.. ఇలా ఎవరి వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందో అటువైపుగా మార్గదర్శనం చేసి ఆ బాధల నుంచి విముక్తి కల్పిస్తారు. ఇలా మహిళల భద్రతకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సరికొత్తగా రూపొందించిన ‘షీ సేఫ్’యాప్ అతివలకు ఎంతో ఉపయుక్తకరం కానుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ఈ యాప్‌ను వచ్చే మహిళా దినోత్సవం పురస్కరించుకొని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అధికారికంగా అందుబాటులోకి తెచ్చేలా చూస్తున్నారు. ఆ తర్వాత రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంత ముఖ్య వివరాలను జోడించి ఈ యాప్‌ను సరికొత్తగా అతివల భద్రత కోసం తీసుకొచ్చే అవకాశాలున్నాయి. మార్గదర్శనం చేస్తారు ఈ యాప్‌ను నిక్షిప్తం చేసుకున్న మహిళలు ఎవరైనా గృహహింస, ఆన్లైన్ వేధింపులు, సైబర్ నేరాల విషయాల్లో మార్గదర్శక్‌ల సహాయం కోరవచ్చు. మీరు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఈ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మార్గదర్శక్‌లు, షీ బృందాలు, మహిళా పోలీసు స్టేషన్లు, భరోసా కేంద్రాలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుంది. హాక్ ఐను కూడా దీంతో అనుసంధానం చేశారు. అలాగే మహిళల భద్రత గురించి ఎస్సీఎస్సీ నిర్వహించే భద్రత కార్యక్రమాలు, అవగాహన సదస్సు వివరాలను తెలుసుకోవచ్చు. ‘సేఫ్ స్టే’చేయవచ్చు.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో 2 లక్షల మందికి పైగా సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏ హాస్టల్స్ ఉండేందుకు సురక్షితమనే వివరాలను కూడా ‘ప్రాజెక్టు సేఫ్ స్టే’ఫీచర్లో పొందుపరిచారు. ఇప్పటికే ఏఏ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలున్నాయి, భద్రత ఎలా ఉంది, సందర్శకుల రిజిస్టర్ నమోదు చేస్తున్నారా తదితర అంశాలపై అధ్యయనం చేసిన ఎస్సీఎస్సీ, సైబరాబాద్ పోలీసులు వందకుపైగా హాస్టళ్ల పేర్లను చేర్చారు. ఇలా ఐటీ కారిడార్‌లో ఏఏ హాస్టళ్లలో ఉండటం మంచిదనే విషయాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఫొటో తీసి అప్లోడ్ చేయండి.. మీరు సంచరించే ప్రాంతాల్లో ఎక్కడైనా వీధి దీపాలు వెలగకుండా చీకటిగా ఉంటే ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి ఈ యాప్‌లో అప్లోడ్ చేసే ఫీచర్‌ను అందుబాటులో ఉంచారు. ఇలా మీరు ఆ చిత్రాన్ని, ప్రాంతాన్ని నమోదు చేస్తే ఎస్సీఎస్సీ సభ్యులు సంబంధిత విభాగాల ద్వారా ఆయా ప్రాంతాల్లో లైట్లు వెలిగేలా చూస్తారు. అలాగే ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఈ–లెర్నింగ్స్, భద్రత అవగాహన మాడ్యూల్స్‌ను యాక్సెస్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఐటీ కారిడార్‌లో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగుల కోసం నడుపుతున్న షీ షటిల్ బస్సుల ప్రయాణ వివరాలు అందుబాటులో ఉంచారు. అలాగే హాక్ ఐ యాప్ కూడా ఈ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేసుకునేలా రూపకల్పన చేశారు. సైబరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్‌కి కూడా యాక్సెస్ చేశారు. హాక్ ఐ అత్యవసర పరిస్థితుల్లో.. హాక్ ఐ అనేది అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించడానికి మరియు ఏదైనా సంఘటనలను నివేదించడానికి సంబంధించిన యాప్. అయితే షీ సేఫ్ యాప్ ముఖ్యంగా మహిళలు బాధలో ఉన్నప్పుడు మార్గదర్శక్‌లను సంప్రదించవచ్చు. తద్వారా సాయం పొందొచ్చు. మహిళలను అప్రమత్తంగా ఉంచటానికి ఇందులో రోజువారీ నోటిఫికేషన్లు వస్తుంటాయి. నిరంతరం మహిళల భద్రత గురించి వివరాలుంటాయి. ఈ యాప్ మహిళల భద్రతకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది. డౌన్లోడ్ చేసుకోండిలా... గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి ‘షీ సేఫ్’అని టైప్ చేయగానే యాప్ వస్తుంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ స్టోర్ ద్వారా కూడా నిక్షిప్తం చేసుకునేలా ఫీచర్లు రూపొందించారు. -
జనగణనలో మొబైల్ నంబర్!
న్యూఢిల్లీ: జనగణన సమయంలో కుటుంబ పెద్ద మొబైల్ నెంబర్ వివరాలను కూడా సమాచారం కోసం వచ్చిన ఉద్యోగులకు(ఎన్యూమరేటర్లు) ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 31 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించాల్సిందిగా జనగణన అధికారులను ఆదేశించామని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, మొబైల్ నెంబర్‌ను జనగణనకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి మాత్రమే వినియోగిస్తామని, మరే ఇతర అవసరాలకు వాడబోమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇతర ప్రశ్నలతో పాటు కుటుంబపెద్ద ఫోన్ నెంబర్, ఇంట్లో ఉన్న టాయిలెట్లు, టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్, సొంత వాహనాలు, కంప్యూటర్, ల్యాప్‌టాప్, తాగు నీటి వసతి.. తదితర సమాచారాన్ని ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్యలో కుటుంబ సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. కుటుంబ పెద్ద ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతర ఏ సామాజిక వర్గానికి చెందుతారనే వివరాలూ సేకరిస్తారు. ఇల్లు సొంతమా?, ఇంట్లోని గదులెన్ని? ముఖ్యమైన ఆహారం ఏమిటి?, వంటకు వాడే ఇంధనం ఏమిటి? తదితర ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ సారి పేపర్‌పై కాకుండా ఈ వివరాలన్నింటినీ మొబైల్ యాప్‌లో నిక్షిప్తం చేస్తారు. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను కూడా రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. -
ఈ రబీ నుంచే ఈ-కర్షక్
ఆరుగాలం కష్టించి పండించిన పంట ప్రకృత్తి విపత్తుల వలనో మరేఇతర కారణంగానో చేతికందకుండా పోతే ఆ రైతు బాధ వర్ణనాతీతం. దురదృష్టవశాత్తు ప్రతి యేడాదీ రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.. ఒకసారి అనావృష్టి, మరోసారి అతివృష్టితో పంట నష్టం జరిగి విలవిలలాడుతున్నారు. అయితే వారికి సాంత్వన నిచ్చేలా ప్రభుత్వం బీమా పథకాలు అమలు చేస్తోంది. అయితే గతంలోవలే బీమా నమోదుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, కేవలం యాప్ ద్వారా ఇంటివద్దే కూర్చుని నమోదయ్యే సౌలభ్యాన్ని ప్రభుత్వం కలి్పంచింది. సాక్షి, ముప్పాళ్ల/సత్తెనపల్లి/కారంపూడి: రైతులు రానున్న రోజుల్లో మీసేవా కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వ్యవసాయశాఖ సిబ్బంది వద్ద ఈ–కర్షక్ యాప్‌లో పంట వివరాలు నమోదు చేసుకుంటే చాలు, పంటల బీమా వర్తించినట్లే. ఆ మేర వ్యవసాయశాఖ ఈ రబీ నుంచే ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యవసాయశాఖ పంటల బీమాపై సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. గత ఏడాది రబీ వరకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద ఎంపిక చేసిన ఏజెన్సీకి రైతులే బీమా ప్రీమియం చెల్లించేవారు. ఆ తర్వాత ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. గడిచిన ఖరీఫ్‌కు కూడా ప్రభుత్వమే ప్రీమియంను రైతులు బ్యాంకులు, మీ సేవ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది నవంబరులో రబీ పంటల బీమాకు షెడ్యూల్ విడుదల చేసినా...సంబంధిత వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నమోదు ప్రక్రియలోనూ మార్పులు చేసింది. ఇకపై ఈ–కర్షక్ యాప్‌లో పంటలు నమోదు చేసుకున్న వారికి బీమా వర్తింపచేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రైతులకు వెసులుబాటు కలగనుంది. ఇకపై ఇదే కీలకం... ఇకపై ఏటా ఖరీఫ్, రబీ సీజన్లో ఈ–కర్షక్ యాప్ ద్వారా రైతులు వేసిన పంటలను నమో దు చేస్తారు. వ్యవసాయశాఖ ద్వారా అమలు చేసే రాయితీ పథకాలు మొత్తం దీని ఆధారంగానే అందజేస్తారు. రైతులు గ్రామ సచివాలయానికి వెళ్లి మొబైల్ అప్లికేషన్ నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జేడీఏ కార్యాలయంలో ఒక నోడల్ అధికారిని నియమిస్తారు. అంతర్పంటలు, పండ్లతోటలు, కూరగాయల సాగు, మొదటి, రెండు, మూడు పంటలు దేనికి దానికి యాప్‌లో సమగ్ర వివరాలు నమోదు ఆప్షన్లు ఇచ్చారు. నమోదు ఇలా.... గ్రామ సచివాలయంలో ఉన్న వీఏఏ/హెచ్ఏ/ఎస్ఏఏ,వీఆర్ఓల సమన్వయంతో తమ పరిధిలో ఉన్న రైతులు తాము వేసిన పంటల తాలుకు వివరాలను మొబైల్ అíప్లికేషన్ నందు నమోదు చేయాలి. సీజన్‌వారీగా ఖరీఫ్, రబీ మరియు వేసవి పంట కాలంలో విడివిడిగా నమోదు చేయాలి. గ్రామ సచివాలయ స్థాయి నమోదు ప్రక్రియను సంబంధిత వ్యవసాయాధికారి పర్యవేక్షించి నమోదయిన డేటాను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అ«దీకృతం చేయవలసి ఉంటుంది. సమాచారాన్ని జేడీఏ కార్యాలయంలో కేటాయించిన అధికారి పర్యవేక్షణ అనంతరం జిల్లా జేడీఏ కార్యాలయంలో నియమించిన అధికారి కమిషనరేట్ కార్యాలయానికి సమాచారం అందిస్తూ ఉంటారు. ప్రయోజనం ఇలా... ఇకపై బ్యాంకు ద్వారా రుణం పొందేవారు..ఆయా బ్యాంకుల్లో బీమా కింద రిజి్రస్టేషన్ చేయించుకోనవసరం లేదు. రుణం పొందని వారు కామన్‌సరీ్వసు సెంటర్లో నమోదు చేసుకోనవసరం లేదు. ఏ బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అక్టోబరు 1, 2019 తర్వాత బ్యాంకులు పంట రుణం నుంచి బీమా ప్రీమియం వసూలు చేసి ఉంటే, దానిని తిరిగి రైతులకు చెల్లిస్తారు. బ్యాంకులు రైతుల వద్ద వసూలు చేసిన ప్రీమియం సొమ్మును కంపెనీకి జమ చేసి ఉంటే తిరిగి చెల్లిస్తారు. అర్హత కలిగిన అన్ని క్లెయిమ్‌లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సంబంధిత సాగుదారుని ఆధార్ అనుసంధానం బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది. నోడల్ ఏజన్సీగా వ్యవసాయశాఖ నూతన విధానం అమలుకు వ్యవసాయశాఖను నోడల్ ఏజెన్సీగా ఎంపిక చేశారు. పంటల బీమా పథకంలో చేరడానికి ముందుగా ఆధార్ కలిగిన సాగుదారుడి వివరాలు ఇ–కర్షక్ అనే ఆండ్రాయిడ్ యాప్‌లో నమోదు చేస్తారు. అందుకోసం నిరీ్ణత గడువు విధించారు. రబీలో శనగపంటకు జనవరి 31, మిగిలిన అన్నిపంటలకు ఫిభ్రవరి 15 గడువుగా పేర్కొన్నారు. సొంత రైతు, కౌలు రైతు అనే వివరాలు ఇ–కర్షక్‌యాప్ ద్వారా గుర్తిస్తారు. -
నేటి నుంచి రాష్ట్రపతి దక్షిణాది విడిది
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం నుంచి 28 వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో వార్షిక దక్షిణాది విడిది చేయనున్నారు. ఈమేరకు రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అజయ్‌కుమార్ సింగ్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం రాజ్ భవన్లో రెడ్ క్రాస్ సొసైటీ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్న కోవింద్.. 23న పుదుచ్చేరిలోని పాండిచ్చేరి వర్సిటీ 27వ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. 25న కన్యాకుమారి సందర్శనకు వెళ్లనున్నారు. 27న రాష్ట్రపతి నిలయంలో రాష్ట్ర పాలకులు, అధికారులు, వివిధ రంగాల్లో ప్రముఖులకు ఆయన ఆతిథ్యం ఇవ్వనున్నారు. -
యాహూ! సరికొత్తగా...
ఒకప్పుడు ఇంటర్నెట్ సెర్చి ఇంజిన్‌గా, ఈ–మెయిల్‌కు పర్యాయపదంగా వెలిగిన యాహూ ఆ తర్వాత మిగతా సంస్థల నుంచి పోటీ ని తట్టుకోలేక వెనుకబడిపోయింది. అయితే, పూ ర్వ వైభవాన్ని సంపాదించుకునేందుకు యాహూ మెయిల్ తాజాగా ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్స్‌తో పాటు మొబైల్ యాప్‌ను రీబ్రాండింగ్ చేయడం ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. పోటీ సంస్థలు గూగుల్‌కి చెందిన జీమెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ వంటివి తమ యాప్స్‌ను ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు, సర్వీసులతో రీ–బ్రాండ్ చేసుకుంటూనే ఉన్న నేపథ్యంలో యాహూ తాజా ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 22 కోట్ల మంది యూజర్లు.. యాహూ మెయిల్‌కు ప్రపంచవ్యాప్తంగా 22.76 మిలియన్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్స్ మొదలైన వివిధ డివైజ్‌ల ద్వారా వీరిలో చాలా మంది ఈమెయిల్ సర్వీసులు ఉపయోగించుకుంటున్నారు. మొత్తం యూజర్లలో ప్రతి నెలా 7.5 కోట్ల మంది యూజర్లు కేవలం తమ మొబైల్స్, ట్యాబ్లెట్స్ ద్వారానే యాహూ మెయిల్‌ను ఉపయో గిస్తున్నారు. యాహూ మెయిల్ వినియోగదారుల్లో 60 శాతం మంది అమెరికాయేతర దేశాలవారే. ప్రస్తుతం ఉన్న యూజర్లు మరో ఈమెయిల్ సేవల సంస్థ వైపు మళ్లకుండా తమవద్దే అట్టే పెట్టుకునే దిశగా కొత్త మొబైల్ యాప్ ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు భారత్‌లో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, గుజ రాతీ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. కొత్త ఫీచర్స్‌లో కొన్ని .. అన్నింటికన్నా ప్రధానంగా మిగతా సంస్థలతో పోలిస్తే యాహూ మెయిల్ అత్యధికంగా 1 టెరాబైట్ (టీబీ) స్టోరేజీ స్పేస్ అందిస్తోంది. సుమారు 250–300 సినిమాలకు సరిపడేంత స్టోరేజీ ఇది. పోటీ సంస్థ జీమెయిల్ కేవలం 15 జీబీ స్టోరేజీ ఇస్తోంది. ఈ పరిమితి దాటితే.. అప్పటికే ఉన్న మెయిల్స్ కొన్నింటిని డిలీట్ చేసుకుని.. ఆ మేరకు పెరిగిన స్పేస్‌ను వాడుకోవాల్సి ఉంటోంది. లేదా నెలవారీ కొంత మొత్తం చెల్లించి అదనంగా స్టోరేజీ స్పేస్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఇక, ఇన్‌బాక్స్‌లో స్పామ్ బాదరబందీ లేకుండా కాంటాక్ట్స్ నుంచి వచ్చే మెయిల్సే కనిపించేలా .. యాహూ మెయిల్ యూజర్లు..‘పీపుల్ వ్యూ’ పేరిట మరో కొత్త ఫీచర్ వినియోగించుకోవచ్చు. పీపుల్, ట్రావెల్, రిసీట్స్ వంటి మూడు కేటగిరీల్లో కింద మెయిల్స్‌ను విడగొట్టుకోవచ్చు. ఇవే కాకుండా పలు రకాల ఫిల్టర్స్, అటాచ్మెంట్ ఆప్షన్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి. మిగతా ఈ–మెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ తరహాలోనే బహుళ ఈ–మెయిల్ ఖాతాలను యాహూ మెయిల్ యాప్‌నకు అనుసంధానించుకోవచ్చు. పెద్ద ఫోన్స్‌ను ఒంటి చేత్తో ఆపరేట్ చేసేటప్పుడు కూడా సులువు గా ఉపయోగించుకోగలిగేలా యాప్‌లో ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మెయిల్ ప్రో రీబ్రాండింగ్.. యూజర్లకు ఉచిత సర్వీసులు అందిస్తున్నప్పటికీ.. మెయిల్స్‌లో ప్రకటనల ద్వారా యాహూ మెయిల్‌కు కొంత ఆదాయం లభిస్తుంది. దీనితో పాటు ప్రకటనల బాదరబందీ లేని సబ్స్క్రిప్షన్ ఆధారిత యాహూ మెయిల్ ప్రో సర్వీసును కూడా సంస్థ గతంలో ప్రవేశపెట్టింది. సుమారు 6–7 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ సర్వీసును కూడా ప్రస్తుతం రీబ్రాండ్ చేస్తోంది. అలాగే, కొత్త యాహూ మెయిల్ అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్స్‌లో ప్రీ–ఇన్స్టాల్ చేసేలా ఫోన్స్ తయారీ సంస్థలతోనూ చర్చలు జరుగుతున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఎంటర్ప్రైజ్ ఈ–మెయిల్ విభాగంలో ప్రవేశించే యోచనేదీ లేదని.. సాధారణ యూజర్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నాయి. -
ఇక మొబైల్‌యాప్‌తో.. జనాభా లెక్కలు
న్యూఢిల్లీ: ఈ సారి జనభా లెక్కలను గణించడం కోసం మొబైల్ యాప్‌ను వినియోగించబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘2021లో గణించబోయే జనాభాలెక్కల కోసం మొబైల్ యాప్‌ను వినియోగించబోతున్నాం. పేపర్ సెన్సస్ నుంచి డిజిటల్ సెన్సెస్ వైపు ప్రయాణించబోతున్నాం’ అన్నారు. చివరిసారిగా 2011లో జనాభా లెక్కలని గణించిన సంగతి తెలిసిందే. అప్పటికి మన దేశ జనాభా 121 కోట్లు. ఈ క్రమంలో 2021, మార్చి 1 నుంచి నూతన జనాభా లెక్కలను గణించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంచు కురిసే ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2020 అక్టోబర్ నుంచే జనాభాను గణించన్నుట్లు తెలిపారు. -
స్మార్ట్ దోపిడీ
సాక్షి, సిటీబ్యూరో: తత్కాల్ టికెట్ల కృత్రిమ కొరతను సృష్టించి ప్రయాణికులపై పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్న ఏజెంట్లు, దళారులు బుకింగ్ విషయంలో సరికొత్తగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఓవైపు ప్రయాణికులను దోచుకుంటూ... మరోవైపు ఐఆర్సీటీసీకి, రైల్వే ఆదాయానికి గండి కొడుతున్నారు. ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లలో సాధారణ ప్రయాణికులకున్న వెసులుబాటును అవకాశంగా తీసుకొని వందలకొద్దీ నకిలీ ఐడీలను, పాస్‌వర్డులను సృష్టించి దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్లు సైతం రూపొందించారు. ఈ మొబైల్ యాప్‌ల ద్వారానే క్షణాల్లో వందల కొద్దీ టికెట్లు బుక్ చేస్తున్నారు. తత్కాల్ టికెట్ల కోసం క్యూలైన్లో పడిగాపులు కాయాల్సిన పని లేకుండా, ఆన్లైన్ బుకింగ్‌ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా యాప్‌ల ద్వారా దళారుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఐఆర్సీటీసీ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సమయం కంటే తక్కువ సమయంలో.. కేవలం ఒకట్రెండు సెకన్ల వ్యధిలోనే యాప్ ద్వారా బుక్ చేయడంతో దళారులకు నిర్ధారిత టికెట్లు (కన్ఫర్మ్) లభిస్తున్నాయి. గ్రేటర్లో ఈ తరహా యాప్ ఆధారిత అక్రమ బుకింగ్ దందా పెద్ద ఎత్తున సాగుతున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, విజిలెన్స్ విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చేపడుతున్న చర్యలను సైతం ఏజెంట్లు, దళారులు టెక్నాలజీ సహాయంతో ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ఆర్పీఎఫ్కు సవాల్‌గా మారారు. వ్యవస్థీకృతంగా దోపిడీ... దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులలో 60 శాతానికి పైగా మంది ఐఆర్సీటీసీ ఆన్లైన్లోనే రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇందుకోసం ఎక్కువ మంది ఏజెంట్లను, దళారులను ఆశ్రయిస్తున్నారు. ఐఆర్సీటీసీ లెక్కల ప్రకారం సుమారు 6వేల మంది ఏజెంట్లు నమోదై ఉన్నారు. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆన్లైన్ బుకింగ్‌లలో 80శాతం వారి గుప్పిట్లోనే ఉన్నాయి. నగరంలోని కూకట్పల్లి, మియాపూర్, సైనిక్‌పురి, ఈసీఐఎల్, మంగళ్‌హట్, జీడిమెట్ల, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్ తదితర అన్ని ప్రాంతాల్లో ఏజెంట్ల వ్యవస్థ విస్తరించుకొని ఉంది. ఈ ఏజెంట్లు ప్రయాణికుల అవసరాలను పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. తత్కాల్ చార్జీలపైన రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పండుగలు, ప్రత్యేక సెలవు దినాల్లో దోపిడీ మరింత తీవ్రంగా ఉంటుంది. ఇందుకోసం కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. రూ.1,000 తత్కాల్ టికెట్‌ను రూ.1,500 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తున్నారు. రద్దీ సమయాల్లో ఇది రూ.3,000 వరకు కూడా చేరుకుంటోంది. హైదరాబాద్ నుంచి విశాఖ, భువనేశ్వర్, బెంగళూర్, తిరుపతి, ముంబై, ఢిల్లీ, పట్నా, కోల్‌కతా తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఎమర్జెన్సీ.. ఏజెంట్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. సైబర్ నేరగాళ్లే సృష్టికర్తలు... ఇటీవల మంగళ్‌హట్‌కు చెందిన ఒక ఏజెంట్‌ను ఆర్ఫీఎఫ్ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద లభించిన నకిలీ ఐడీలు, ఆధార్ పత్రాలు, మొబైల్ యాప్‌లు చూసి పోలీసులే విస్తుపోయారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో అమాయక ప్రజల వద్ద నుంచి సేకరించిన ఆధార్ పత్రాల ఆధారంగా ఏజెంట్లు వందల కొద్దీ ఈ–మెయిల్ ఐడీలను సృష్టిస్తున్నారు. ఈ ఆధార్ పత్రాలను రూ.2వేలకు 10 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సాధారణ ప్రయాణికుల్లా టికెట్లు బుక్ చేసుకునేందుకు ఈ ఆధార్లు, మెయిల్ ఐడీలు దోహదం చేస్తున్నట్లు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారి అశ్వినీకుమార్ ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు ఐఆర్సీటీసీ ఆన్లైన్ బుకింగ్‌ల కోసం ఆ సంస్థ అధికారిక వెబ్సైట్ నుంచి కాకుండా మొబైల్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకోవడం వల్ల ఏజెంట్లను గుర్తించి పట్టుకోవడం సమస్యగా మారుతోంది. సైబర్ నేరగాళ్లు పదుల సంఖ్యలో యాప్‌లను సృష్టించి ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. వీఎన్ఎక్స్, రెడ్‌మిక్స్, ఏఎన్ఎంఎస్ వంటి యాప్‌లు రిజర్వేషన్ బుకింగ్‌ల కోసం వినియోగిస్తున్నారు. ఈ మొబైల్ యాప్‌లలోనే ప్రయాణికుల పేర్లు, ఆధార్ నంబర్, మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా తదితర వివరాలను తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ముందు రోజే నమోదు చేస్తారు. టిక్కెట్ బుక్ చేయాల్సిన రోజున సరిగ్గా ఉదయం 10గంటలకు ఒకే ఒక్క క్లిక్‌తో ఐఆర్సీటీసీ పేమెంట్ గేట్‌వేకు సమాచారాన్ని చేరవేసి డబ్బులు చెల్లించేస్తున్నారు. తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది సెకన్లలోనే ఈ పని పూర్తవుతుంది. పేమెంట్ గేట్‌వే నుంచి సమాచారం ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్)కు చేరుతుంది. పీఆర్ఎస్ ద్వారా వెంటనే టికెట్లు వచ్చేస్తాయి. నిర్ధారిత టికెట్లు ఏజెంట్ల వద్ద మాత్రమే లభిస్తాయనే నమ్మకంతో ప్రయాణికులు సైతం వారినే ఆశ్రయిస్తున్నారు. నిజాయతీగా క్యూలైన్లలో నించున్నవాళ్లు, ఆన్లైన్లో బుకింగ్‌ల కోసం ఎదురు చూసేవాళ్లు మాత్రం దారుణంగా నష్టపోతున్నారు. -
అరచేతిలో ఆర్టీసీ సమాచారం
మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్లాలనుకుంటున్నారా..? అలాగే మీరు వెళ్లే ఊరికి బస్సులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఆ బస్సు ఎక్కడుందో తెలుసుకోవాలా.. బస్సులో ఆకతాయిల వేధింపులా...? సమస్య ఏదైనా.. సమాచారం తెలుసుకోవాలన్నా చాలా సులువు. అదేంటో తెలుసుకుందామా..? సమస్యలపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా..? మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఆర్టీసీ సేవలన్నీ పొందే వెసులుబాటు ఉంది. ఆర్టీసీ లైవ్‌ట్రాక్ యాప్ ద్వారా ఆర్టీసీ సేవలు సులువుగా తెలుసుకోవచ్చు. ఆర్టీసీ లైవ్ ట్రాక్ యాప్ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రయాణం కొనసాగించడానికి ఏపీఎస్ ఆర్టీసీ సాంకేతికతను వినియోగిస్తోంది. ఆర్టీసీ లైవ్ ట్రాక్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని సేవలు పొందే వీలు ఉంటుంది. దూర ప్రాంతాలకు టిక్కెట్ రిజర్వేషన్ చేసుకోవడానికి ఆర్టీసీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. దీంతో బస్ స్టాండ్లలో బారులు తీరాల్సిన బాధ తప్పుతుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి....? గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఏపీఎస్ ఆర్టీసీ లైవ్ ట్రాక్ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఈ యాప్ దగ్గరలోని బస్టాండు ఎక్కడ ఉందో జీపీఎస్ ద్వారా తెలియజేస్తుంది. ప్రారంభ, గమ్య స్థానాలను యాప్‌లో నమోదు చేయగానే రెండు ప్రదేశాల మధ్య ఎన్ని బస్సులు ఉన్నాయో? ఏ సమయానికి ఉన్నాయో? డ్రైవర్, కండక్టర్ వివరాలు అందులో కనిపిస్తాయి. రిజర్వేషన్ చేసుకున్న తర్వాత సర్వీసు నంబరు ఆధారంగా బస్సు ఎక్కడుందో యాప్ ద్వారా తెలిసిపోతుంది. మనకు కావాల్సిన బస్సు నంబరు యాప్‌లో నమోదు చేయగానే అది ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుస్తుంది. నిరీక్షణకు తెర గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు ఏ సమయానికి వస్తాయో తెలియని పరిస్థితి. అయితే కొన్ని సమయాల్లో ముందు సమాచారం చెప్పకుండానే రద్దు చేస్తుంటారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే బస్సు ఎక్కడుంది? ఏ సమయానికి వస్తుంది.? తెలిసిపోతుంది. దీనివల్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు–వెలుగు బస్సుల్లో ఆక్యుపెన్సీ శాతం పెరిగిందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల వారే ఈ యాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతి బస్సులో జీపీఎస్ ‘ట్రాకింగ్’ పరికరాన్ని అమర్చారు. దీంతో బస్సును ట్రాకింగ్ చేయడం సాధ్యపడుతోంది. గత ఏడాది అధికారులు ప్రయాణికులకు విస్తతంగా అవగాహన కల్పించారు. ప్రయాణికులు దీన్ని వినియోగించుకుంటే భద్రత, సుఖవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందనడంలో సందేహం లేదు. మహిళలకు భద్రత ఈ యాప్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది బస్సు ఏ సమయానికి ఉందో తెలియక రోడ్డుపై నిరీక్షిస్తుంటారు. ఆ సమయంలో మహిళలు, ఆకతాయిల వేధింపులు, చైన్ స్నాచర్స్ నుంచి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ యాప్ ద్వారా బస్సు వచ్చే సమయానికి అక్కడికి చేరుకోవచ్చు. ఒకవేళ బస్సులో ఇబ్బందులు ఎదురైతే ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లైవ్ ట్రాక్ ద్వారా పోలీసులు బస్సున్న చోటికి నిమిషాల్లో చేరుకుంటారు. -
నిమజ్జనానికి సులువుగా వెళ్లొచ్చు ఇలా..
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 12వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 13న తెల్లవారు జామున 4 గంటల వరకు 8 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి 30 నిమిషాల నుంచి 45 నిమిషాలకు ఒకటి చొప్పున ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ సర్వీసులు నడుస్తాయి. లింగంపల్లి–ఫలక్‌నుమా, సికింద్రాబాద్–ఫలక్‌నుమా, సికింద్రాబాద్–నాంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి మధ్య ఈ అదనపు రైళ్లు నడుస్తాయి. ఎంఎంటీఎస్... ‘హైలైట్స్’ యాప్ నగరంలో రైళ్ల రాకపోకల సమాచారం కోసం ‘హైలైట్స్’ మొబైల్ యాప్ ఎంతో దోహదం చేస్తుంది. ప్రయాణికులు ఈ మొబైల్ యాప్ ద్వారా ఎంఎంటీఎస్ రైళ్ల ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రధాన రైళ్ల వేళలు ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు లభిస్తాయి. జంటనగరాల్లో ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులకు సదుపాయాన్ని అందజేస్తున్నాయి. నాంపల్లి– లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి రోజు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. పలువురు ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంఎంటీఎస్‌పైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఇలాంటి ప్రయాణికులకు ‘హైలైట్స్’ యాప్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు వివిధ రూట్లలో నడిచే రైళ్లను ప్రత్యక్షంగా ఈ యాప్ ద్వారా తెలుసుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఏ ట్రైన్ ఏ రూట్లో ఎక్కడి వరకు వచ్చిందనేది ఈ యాప్ ద్వారా తేలిగ్గా తెలుసుకోవచ్చు. మూడేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చిన ఈయాప్‌ను ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. (ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్ గణపతి దర్శనం ఎలా?.. ఇక్కడ క్లిక్ చేయండి) -
కిడ్నీ జబ్బును గుర్తించే ‘యాప్’
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌లో కిడ్నీ సమస్యలతో ఏటా ఏకంగా లక్షమంది మరణిస్తున్నారు. అక్కడ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో ప్రతి ఐదుగురుల్లో ఒకరు కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న వారేనని, సకాలంలో వారి సమస్యను గుర్తించక పోవడం వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నారని లండన్‌లోని రాయల్ ఫ్రీ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణలు తెలియజేస్తున్నారు. సకాలంలో గుర్తించినట్లయితే డయాలసిస్ లేదా కిడ్నీ ఆపరేషన్ల వరకు వెళ్లకుండా రోగులను రక్షించే అవకాశం ఉంటుందని వారంటున్నారు. సకాలంలో వైద్యులు జబ్బును గుర్తిస్తే మరణిస్తున్న ప్రతి ముగ్గురు రోగుల్లో ఒక్కరిని రక్షించవచ్చని అంటున్నారు. వైద్యుల ఆకాంక్షను సాకారం చేస్తూ గూగుల్ కంపెనీ ‘అక్యూట్ కిడ్నీ ఇంజూరి’ని 14 నిమిషాల్లో గుర్తించే విధంగా ఓ మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. ‘స్ట్రీమ్స్’గా పిలిచే ఈ యాప్‌ను ‘గూగుల్స్ డీప్‌మైండ్’గాను అభివర్ణిస్తున్నారు. కిడ్నీ రోగిని గుర్తించడంలో ప్రతి రోగికి ఈ యాప్ ద్వారా రెండు లక్షల రూపాయల ఖర్చు కూడా తగ్గుతుందని ‘నేచర్ డిజిటల్ మెడిసిన్’ పత్రిక తాజా సంచిక వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక విజ్ఞాన పద్ధతుల ద్వారా రోగుల్లో 87.6 శాతం ఎమర్జెన్సీ కేసులను గుర్తించగలుగుతుంటే గూగుల్ యాప్ ద్వారా 96.7 ఎమర్జెన్సీ కేసులను గుర్తించ గలుగుతున్నారట. ఆస్పత్రుల్లో ఉంటే ఐటీ టెక్నాలజీని ఉపయోగించి ఓ రోగికి సంబంధించిన సమస్త డేటాను ఈ యాప్ సేకరిస్తుంది. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు, రక్త పరీక్షల వివరాలు సేకరించి ఒక చోట నమోదు చేస్తుంది. రోగి రక్తంలో ‘క్రియాటినిన్’ ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే సదరు వైద్యుడికి వెంటనే సందేశం పంపిస్తుంది. ఈ ‘స్ట్రీమ్స్’ యాప్ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని రాయల్ ఫ్రీ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ క్రిస్ స్ట్రీతర్ తెలియజేశారు. -
ఆ యాప్‌లో అసభ్యకర సందేశాలు!
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో చిన్నపిల్లలను ఉద్దేశించి రూపొందించిన సాంటా క్లాస్ అనే మొబైల్ యాప్ అసభ్యకర సందేశాలను పంపిస్తోంది. పండుగ నేపథ్యంలో చిన్నపిల్లలను సర్ప్రైజ్ చేయడానికి తల్లిదండ్రులకు ఓ సాధనంగా ఉండేందుకు రూపొందించిన ఈ యాప్ వారికి లేని తలనొప్పిని తెచ్చిపెడుతోంది. నార్త్ కరోలినాకు చెందిన ఓ కుటుంబం ఈ యాప్ బారిన పడి తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ యాప్‌లో తన కూతురికి వచ్చిన అసభ్యకరమైన సందేశాన్ని చూసి అవాక్కైంది. అష్లే అడామ్స్ 8 ఏళ్ల కూతురు ఎంతో కుతూహలంగా ఐఓఎస్ యాప్ స్టోర్ ద్వారా ఈ సాంటా యాప్‌లోకి వెళ్లింది. ‘హాయ్’ అని టైప్ చేసింది. అయితే ఆ మెసేజ్‌కు బదులుగా వచ్చిన సందేశాన్ని చూసి నిర్ఘాంతపోయింది. హాయ్ మెసేజ్ సాంటా ఫీచర్స్ ‘నువ్వేం డ్రెస్ వేసుకున్నావ్’ అనే జుగుప్సాకరమైన సందేశాన్ని పంపించింది. ఈ సందేశం చూసి తాను షాక్ గురయ్యానని ఆ చిన్నారి తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే ఆ మొబైల్ తీసుకొని పలు ప్రశ్నలతో యాప్ పరీక్షించిన అష్లే.. యాప్ తీరుపై పోలీసులతో పాటు యాపిల్ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అయితే యాపిల్ కంపెనీ థర్డ్‌పార్టీ యాప్ అయిన సాంటాపై ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయం తెలియరాలేదు. ఇక ఆ మధ్య అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ ఇలానే బూతులు తిడుతోందని అమెజాన్‌కు ఫిర్యాదు వచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: అలెక్సా బూతులు తిడుతోంది!) -
కిలాడీ ‘యాప్’తో జర జాగ్రత్త!
సాక్షి, అమరావతి : సైబర్ నేరాల్లో సరికొత్త బురిడీ విజయవాడ కమిషనరేట్ పరిధిలో బహిర్గతమైంది. ‘ఎనీ డెస్క్’ యాప్‌తో బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టే నేరాలు ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భవానీపురం వాసిని సైబర్ నేరస్తులు ఇదే తరహాలో మోసం చేసి రూ.68 వేలు కొల్లగొట్టారు. బాధితుడి చరవాణిలోకి చొరబడి బ్యాంకు ఖాతాల వివరాలను తస్కరించి ఈ నేరానికి పాల్పడ్డారు. నకిలీ కస్టమర్ కేర్ నంబరుతో వల విజయవాడ భవానీపురానికి చెందిన ఓ యువకుడు గత ఫిబ్రవరి 25వ తేదీన తన ఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి వెయ్యి రూపాయలు ఆంధ్రా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసేందుకు ప్రయత్నించాడు. అందులో విఫలం కావడంతో ఇంటర్నెట్లో ఎస్ బ్యాంక్ కస్టమర్ కేర్ ఫోన్ నంబరు కోసం వెతికాడు. సైబర్ నేరగాళ్లు నకిలీ కస్టమర్‌కేర్ నంబరును ఇంటర్నెట్లో నమోదు చేసిన విషయం తెలియని బాధితుడు.. ఆ నంబర్‌కు ఫోన్ చేశాడు. అదే అదనుగా బాధితుడికి ఎస్ బ్యాంక్ కస్టమర్ కేర్ 9939017073 నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అకౌంట్ నుంచి డబ్బు బదిలీ కాలేదని ఫిర్యాదు చేశారా?’ అని ప్రశ్నించగా భవానీపురం వాసి ‘అవును’ అని సమాధానం ఇవ్వగా.. ‘మీకు ఫోన్‌పే, గూగుల్‌పే యాప్స్ ఉన్నాయా?’ అని అటు నుంచి మళ్లీ అడిగారు. ‘గూగుల్‌పే లేదు నా ఫోన్లో ఫోన్‌పే మాత్రమే ఉంది’ అని వివరించాడు. అయితే ఆ సమయంలో బాధితుడి ఫోన్లో సిగ్నల్స్ సరిగా లేకపోవడం అతడి తమ్ముడి ఫోన్లో నుంచి కస్టమర్‌కేర్ సభ్యుడితో మాట్లాడుతూ అతడు చెప్పినట్లు ఫోన్‌పే ఆపరేట్ చేస్తుండగా.. ‘మీకు ఆపరేట్ చేయడం సరిగా రావడం లేదు’ అంటూ బాధితుడి ఫోన్లో ‘ఎనీ డెస్క్’ యాప్‌ను నిక్షిప్తం చేయాలని అవతలి వ్యక్తి సూచించాడు. ఆ తరువాత ఎనీడెస్క్ యాప్ ద్వారా వచ్చే కోడ్‌ను చెప్పమని నేరస్తుడు చెప్పడంతో అలాగే చేశారు. అనంతరం ఐదు నిమిషాలకే బాధితుడికి చెందిన యాక్సిస్, ఆంధ్రాబ్యాంకుల ఖాతాల నుంచి డబ్బు మాయమైపోయింది. యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.43 వేలు, మళ్లీ నిమిషానికి ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నుంచి రూ.20 వేలు, మరొకసారి రూ.5 వేలు మోసగాడి బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యాయి. విషయం గ్రహించిన బాధితుడు విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాప్ చొరబడితే అంతే.. అంతర్జాల సదుపాయం కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎనీడెస్క్ యాప్‌ను నిక్షిప్తం చేస్తే ఇక అంతే సంగతులు అని సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్ ఏ ఫోన్లో ఉంటుందో.. అందులోని సమస్త సమాచారాన్ని సైబర్ నేరస్తులు వీక్షించే వీలు కలుగుతుంది. ఈ క్రమంలో బాధితుల ఫోన్లోని బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల క్రమంలో చరవాణికి వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లూ నేరస్తులకు కనిపిస్తాయి. అందుకే ఆ యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ చరవాణిలో నిక్షిప్తం చేయరాదని పోలీసులు సూచిస్తున్నారు. -
ప్రకటనలు చూస్తే పైసలొస్తాయ్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :ప్రకటనలు చూస్తే మనకేం వస్తుంది? కొత్త ఉత్పత్తులు లేక ఆఫర్ల గురించి తెలుస్తుంది. అంతే కదా!!. కానీ, యాడ్ చూస్తే చాలు మన జేబులోకి డబ్బులొస్తే? ఇది అక్షరాలా నిజం. క్విక్యాడ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే ఇది సాధ్యమే. ప్రకటనల రంగంలో సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది హైదరాబాదీ స్టార్టప్ క్విక్యాడ్స్. మరిన్ని వివరాలు సీఈఓ సుమంత్ రాగిరెడ్డి మాటల్లోనే.. ‘‘యూజర్లు తమ ఫోన్లలో క్విక్యాడ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా మంది మా యాప్‌లో అడ్వర్టయిజ్‌మెంట్స్ ప్రసారమవుతాయని అనుకుంటారు. కానీ అది తప్పు యాప్‌లో ఏమీ ఉండదు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న మొబైల్స్‌లో యూజర్లు ఫోన్ మాట్లాడడం పూర్తవగానే యాడ్ వీడియో వస్తుంది అంతే! దీన్ని పూర్తిగా చూస్తే.. యూజర్లకు డిజిటల్ వాలెట్‌లోకి డబ్బులొస్తాయి. నెలకు 200–800 వరకు ఆదాయం వస్తుంది. రూ.6 కోట్ల ఆదాయం.. 193 దేశాల్లో 3 రకాల సాఫ్ట్వేర్ పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ప్రస్తుతానికి ఇండియన్ పేటెంట్, కాపీరైట్స్ హక్కులు వచ్చాయి. ఇప్పటివరకు రూ.52 లక్షల ఆదాయం వచ్చింది. 4 నెలల్లో ఏపీ, మహారాష్ట్ర, అస్సాంలకు విస్తరించనున్నాం. ఆగస్టు నుంచి నైజీరియా, కెన్యా దేశాల్లో సేవలను ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది కాలంలో కార్పొరేట్లో 50, లోకల్లో 5 వేల కంపెనీలకు, 6–7 లక్షల యూజర్లకు చేరుకోవాలని, రూ.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెటట్టుకున్నాం. రూ.1.5 లక్షలకు ఫ్రాంచైజీ.. ప్రస్తుతానికి యూజర్లకు క్విక్ యాడ్ డిజిటల్ వాలెట్లో మనీని జమ చేస్తున్నాం. వీటిని యూజర్ కావాలంటే రీచార్జ్‌లు, మూవీ టికెట్స్ తదితరాలకు వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఈ సొమ్ముతో యూజర్ పేరు మీద బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించాం. యూజర్ బీమా ప్రీమియం ఈ సొమ్ముతో కంపెనీయే చెల్లిస్తుంది. ఇప్పటివరకు రూ.1.2 కోట్ల పెట్టుబడి పెట్టాం. నాలుగున్నర నెలల్లో బ్రేక్ ఈవెన్‌కు వస్తాం. క్విక్యాడ్స్ ఫ్రాంచైజీలు ఇస్తున్నాం. రూ.1.5 లక్షల చార్జీ. ఇప్పటివరకు తెలంగాణలో 25 ఫ్రాంచైజీలు ఇచ్చాం. అడ్వర్టయిజ్మెంట్ మెటీరియల్స్, సాఫ్ట్వేర్, టెక్నికల్ సపోర్ట్ అంతా కంపెనీదే’’ అని సుమంత్ తెలిపారు. 1.6 లక్షల యూజర్లు;74 మంది క్లయింట్లు.. ప్రస్తుతం మాకు 1.6 లక్షల మంది యూజర్లతో పాటు, 74 కంపెనీలు క్లయింట్స్‌గా ఉన్నాయి. గీతమ్, కేఎల్, విజ్ఞాన్ యూనివర్సిటీలు, ప్రైడ్ హోండా, జేఎస్ఆర్ గ్రూప్, శ్రీ తారక జువెల్లర్స్ వంటి కంపెనీలు జాబితాలో ఉన్నాయి. త్వరలోనే కేఎఫ్‌సీ, బీఎస్ఎన్ఎల్, ఎస్బీఐలతో ఒప్పందం చేసుకోనున్నాం. 10, 20, 30 సెకన్ల నిడివి గల యాడ్ వీడియోలుంటాయి. ధరలు రూ.5 వేల నుంచి రూ.12 లక్షల వరకూ ఉంటాయి. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీతెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
లాండ్రీకార్ట్ యాప్‌ను ఆవిష్కరించిన సమంత..
బంజారాహిల్స్: భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరైన ప్రస్తుత తరుణంలో లాండ్రీ కార్ట్ ఓ వరంగా ఉపయోగపడుతుందని సినీ నటి సమంత అన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ సతీమణి సబిత సుకుమార్, అలేఖ్య, గిరిజ, శరత్‌లతో కలిసి నెలకొల్పిన లాండ్రీకార్ట్ సంస్థ మొబైల్ యాప్ సర్వీస్‌ను ఆదివారం ఆమె బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా లాండ్రీకార్ట్ వ్యవస్థాపకురాలు సబితా సుకుమార్ మాట్లాడుతూ .. యాడాదిన్నర పాటు గ్రౌండ్‌వర్క్ చేసిన తర్వాత గత ఏడాది జూన్‌లో దీన్ని ప్రారంభించామన్నారు. సినిమా నేపధ్యంతో ముడిపడిన సంస్థ కాదన్నారు. మధ్యతరగతి వర్గాలవారిని దృష్టిలో పెట్టుకుని తక్కువ వ్యయంతో సర్వీసులు అందించాలని ప్రారంభించామన్నారు. ఈ యాప్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించడం, ఒక స్పూర్తిగా నిలుస్తుందని సమంత చెప్పారు. -
‘టిక్‌టాక్ మొబైల్ యాప్‌పై నిషేధం’
సాక్షి, చెన్నై : యువత, చిన్నారుల్లో ఆదరణ పొందిన టిక్‌టాక్ మొబైల్ యాప్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది. ఈ యాప్‌తో అశ్లీల కంటెంట్ వ్యాప్తి అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చైనాకు చెందిన వీడియో షేరింగ్ మొబైల్ యాప్ డౌన్లోడ్పై నిషేధం విధించాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎన్ కురుబకరన్, జస్టిస్ ఎస్ ఎస్ సుందర్‌లతో కూడిన మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టిక్‌టాక్ యాప్‌తో రూపొందిన వీడియోలను ప్రసారం చేయరాదని బెంచ్ మీడియా సంస్థలను కూడా ఆదేశించింది. పిల్లలు సైబర్, ఆన్లైన్ బాధితులు కాకుండా నిరోధించేందుకు అమెరికా తరహాలో బాలల ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకువచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఈ సందర్భంగా కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. చిన్నారులు తమ వీడియోలను అపరిచితులతో షేర్ చేసుకునే క్రమంలో ఈ యాప్‌ను వినియోగించే ప్రక్రియలో అక్కడ పొందుపరిచే అశ్లీల లింక్‌లకు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా మొబైల్ యాప్స్‌లో చోటుచేసుకునే ప్రమాదాలను పసిగట్టకుండా మన పిల్లలపై వీటిని పరీక్షింపచేయడం దురదృష్టకరమని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా ఈ యాప్‌ను ఇదే కారణంతో ఇండోనేషియా, బంగ్లాదేశ్‌ల్లో నిషేధించారని పేర్కొంది. -
అనుమతులన్నీ.. సువిధతోనే!
సాక్షి,సిటీబ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే ర్యాలీలు, సమావేశాలు, ప్రదర్శనలు, మైక్‌సెట్, వాహనాలు, హోర్డింగుల వంటి వినియోగానికి సంబంధిత ఎన్నికల అధికారులు, పోలీసుల నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే. ఇప్పటి వరకు అనుమతులను రాతపూర్వకంగా ఇచ్చేవారు. అధికారులు కొన్ని కమిటీల ఏర్పాటు ద్వారా అనుమతులు ఇచ్చేవారు. ఈసారి ఎన్నికల్లో అంతా ‘సువిధ క్యాండిడేట్’ యాప్ ద్వారానే సాగుతోంది. అనుమతుల కోసం అభ్యర్థులు, పార్టీలు 48 గంటల ముందుగా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. సంబంధిత అధికారులు అనుమతులు ఇస్తారు. యాప్ ద్వారా ఎలాంటి ఆరోపణలు, వివాదాలు, వివక్షకు తావులేకుండా అందరికీ ఒకే విధమైన సేవలను ఈసీఐ అందించనుంది. -
సి విజిల్‌కు సెల్ఫీలు, టాయిలెట్ల ఫొటోలు
ఎన్నికల అక్రమాలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఎన్నికల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేయడం కోసం ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన సి విజిల్ యాప్‌కు సెల్ఫీలు, టాయ్లెట్లు, రహదార్ల ఫొటోలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ఫిర్యాదులు నిజమైనవే అయినా పూర్తి సమాచారం లేకపోవడంతో వాటిపై చర్య తీసుకోవడానికి వీలుండటం లేదు. మార్చి 10 నుంచి ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. అయితే, వాటిలో చాలా వరకు ఫేక్ పోస్టింగ్‌లేనని ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. కర్ణాటకలో ఈ యాప్‌నకు ఎక్కువగా సెల్ఫీలు వస్తున్నాయి. బిహార్‌లో రోడ్లు, టాయ్లెట్ల ఫొటోలు దీనికి అప్లోడ్ చేస్తున్నారు. తమకు ఇప్పటి దాకా 186 ఫిర్యాదులు అందాయని వాటిలో 111 ఫేక్‌లేనని కర్ణాటక ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ చెప్పారు. 44 కేసులపై చర్య తీసుకున్నామన్నారు. సి విజిల్‌కు అందే ఫిర్యాదుల్లో 24 శాతం అవాస్తవాలే ఉంటున్నాయన్నారు. బిహార్‌లో అయితే సగానికిపైగా ఫిర్యాదులు సంబంధం లేనివేనని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి శ్రీనివాస్ చెప్పారు. తమకందిన ఫిర్యాదుల్లో 109 సంబంధం లేనివని, 41 కేసులు నిజమైనవని తేలిందని ఆయన తెలిపారు. -
ఆన్‌లైన్‌లోనూ నామినేషన్
సాక్షి, యాదాద్రి :కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్లను ఆన్లైన్లో స్వీకరించే ప్రక్రియను ప్రవేశపెట్టింది. సువిధ యాప్ ద్వారా నామినేషన్ ఫారం 2ఏ పూర్తి చేసి దరఖాస్తు చేయొచ్చు. అలాగే నామినేషన్ వేసే అభ్యర్థి అఫిడవిట్‌ను పీడీఎఫ్ కాపీ ఆన్లైన్లో అప్డేట్ చేయాలి. అయితే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్ధేశించిన సమయం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను ఆన్లైన్ సిస్టమ్ తీసుకుంటుంది. అలాగే సెలవు రోజులైన 21, 23, 24 రోజుల్లో నామినేషన్లను స్వీకరించదు. ఈఆర్ఓ, ఏఆర్‌ఓతోపాటు కంప్యూటర్ కేంద్రాల నుంచి కూడా నామినేషన్ అప్లోడ్ చేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి అభ్యర్థులకు కల్పిస్తోంది. నామినేషన్ వేయడానికి జనరల్ అభ్యర్థి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ చలాన్‌ను యాప్‌లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. -
అరచేతిలో.. ఎన్నికల సమాచారం
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. మరో కొద్దిరోజుల్లో ఎన్నికల నిర్వహించనున్న నేపథ్యంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నిల కమిషన్ వేగవంతం చేసింది. పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లను అందుబాటులో ఉంచడంతోపాటు, ఇప్పటికే ఓటు హక్కు ఉన్న వారు జాబితాలో పేరుందో లేదో చూసుకోవాలని సూచిస్తూ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శని, ఆదివారాల్లో అర్హత ఉన్నవారు ఓటర్లుగా పేర్లు సవరించుకునేందుకు ప్రతి పోలింగ్ స్టేషన్ లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో కొత్తవి నమోదు, మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు. ఓటరు నమోదు ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని ఎన్నికల సంఘం చెపుతుంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం గతానికి భిన్నంతగా వెబ్సైట్లు, యాప్‌లను రూపొందించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్ తాజాగా ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌లో ఓటరు ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న వారు దీన్ని డౌన్ లోడ్ చేసుకుని సేవలు పొందవచ్చు. అందుబాటులో సమగ్ర సమాచారం ఈ నూతన యాప్‌లో ఎన్నిలక ప్రక్రియకు సంబంధించిన సమగ్ర పమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ యాప్‌లో పొందుపర్చింది. ఓటు నమోదు నుంచి ఎన్నికల అనంతరం ఫలితాలు వరకూ అన్ని ఈ యాప్‌లో చూసుకునేలా ఈ యాప్ రూపొందించారు. మీ ఓటు ఉందో లేదో పరిశీలించుకోవచ్చు. ఓటు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ఫారాలు డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు, పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు, ఎన్నికల నిర్వహణ సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు వంటి తదితర పూర్తి సమాచారం ఈ యాప్ నుంచి పొందవచ్చు. యాప్‌లో సేవలు ఇలా ♦ ఈ యాప్ ద్వారా మీ ఓటు వివరాలు నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఎపిక్ నంబరు ఉంటే దాన్ని యాప్‌లో నమోదు చేసి మీ ఓటు వివరాలు కనిపిస్తాయి. ♦ ఎపిక్ నంబరు లేని పక్షంలో ఓటరు పేరు, తండ్రిపేరు, రాష్ట్రం, నియోజకవర్గం నమోదు చేస్తే సంబంధిత ఓటు వివరాలు కనిపిస్తాయి. ♦ ఓటరు సర్వీస్ ట్యాగ్ ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చు, ఓటు బదిలీ చేసుకోవచ్చు. తొలగించమని అభ్యర్థించవచ్చు, ఓటరు గుర్తింపు కార్డులోని తప్పులు సరిదిద్దుకోవచ్చు, నియోజకవర్గం పరిధిలో ఓటు బదిలీ చేసుకోవచ్చు. ♦ దీనికోసం ఓటు నమోదుకు ఫారం–6, తొలగింపునకు ఫారం–7, చేర్పులు, మార్పులకు ఫారం–8. బదిలీకి ఫారం 8ఏ యాప్‌లోనే వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ♦ ఏదైనా సమస్య ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన లేదా మీ ఓటు తొలగించినా ఈ యాప్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం మీ మొబైల్ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. ♦ ఈవీఎం ట్యాగ్ క్లిక్ చేయడం ద్వారా ఈవీఎం యత్రాలు ఏవిధంగా పనిచేస్తాయో అవగాహన కల్పించడం, ఈవీఎం సహాయంతో వేసిన ఓటును పరిశీలించుకునే వీవీప్యాట్ ఏవిధంగా పనిచేస్తుందో వంటి సమాచారం వీడియోల రూపంలో పొందుపర్చారు. ♦ ఎలక్షన్ ట్యాగ్ క్లిక్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రస్తుతం నిర్వహించనున్న ఎన్నికల వివరాలు, వచ్చే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు. ఎన్నికల్లో పో టీ చేయడానికి ఉన్న అర్హతలను తెలుసుకునే అవకాశం, గతంలో జరిగిన జనరల్, అసెంబ్లీ ఎన్నికలతో పాటు, బైఎలక్షన్స్ డేటాను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఎన్నికల ఫలితాలను ఇంట్లోనే కూర్చునే ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 1955 నుంచి 2014 ఎ న్నికల ఫలితాలు బుక్లెట్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ♦ ఎన్నికల కమిషన్ తీసుకునే ఏదైనా కొత్త నిర్ణయం, సర్కులర్లు, పత్రికా ప్రకటనలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. యాప్ చాలా ఉపయోగకరం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకూ ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తున్నాం. అప్పటివరకు ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు రూపొందించిన ఈ ఓటరు హెల్ప్‌లైన్ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఎన్నికల అక్షరాస్యత సాధించేందుకు ఈ కొత్త యాప్ చాలా ఉపయోగపడుతుంది.– సృజన, జాయింట్ కలెక్టర్ -
ఈ యాప్ వాడుతున్నారా? ఆర్బీఐ హెచ్చరిక
సాక్షి, ముంబై: డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ వినియోగదారులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. డిజిటల్ లావాదేవీలు జరిపే మొబైల్ ఫోన్ యూజర్లు ఆయా యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ‘ఎనీ డెస్క్’ అనే ఓ మొబైల్ యాప్ ద్వారా ‘యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (యూపీఐ) ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలో కొన్ని మోసాలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఎనీ డెస్క్ అనే యాప్ ఆన్లైన్ లావాదేవీలు జరిపే యూజర్లతోపాటు, బ్యాంకులు, ఇతర ఆపరేటర్లు అప్రమత్తంగా వుండాలని ఆర్బీఐ ప్రకటించింది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన అనంతరం ఈ యాప్ లోని లోపాల కారణంగా డేటా చోరీ అవుతోందని తెలిపింది. యూజర్ల మొబైల్స్‌లోని డేటాను చోరీ చేసి, తద్వారా నేరగాళ్లు మోసపూరిత లావాదేవీలకు ఉపయోగపడుతోందని ఆరోపించింది. అంటే యాప్ ద్వారా వినియోగదారుల ఫోన్లను ఆధీనంలోకి తీసుకొని వారి ఖాతాల్లోని డబ్బును కొందరు సైబర్ నేరగాళ్లు మాయం చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐకు చెందిన సైబర్ భద్రత, ఐటీ పరిశోధన విభాగం ఫిబ్రవరి 14వ తేదీన ప్రకటనను కూడా విడుదల చేసింది. మరోవైపు ఈ యాప్ ద్వారా ఏప్రిల్, 2018, జనవరి 2019 మధ్య రూ. 6.4 లక్షల కోట్ల విలువైన388 కోట్ల లావాదేవీలు జరిపిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెబ్సైట్ తెలిపింది. -
ఓఎల్ఎక్స్లో కారు ఎరగా చూపి మోసం
పశ్చిమగోదావరి, తణుకు: సెకండ్ హ్యాండ్ వస్తువులు విక్రయించడానికి వేదిగా ఉన్న ఓఎల్ఎక్స్ యాప్‌లో కారు విక్రయిస్తానని చెప్పి మోసం చేసి ఒక వ్యక్తి నుంచి రూ. 2.19 లక్షలు కాజేసిన సంఘటన తణుకులో చోటు చేసుకుంది. తణుకు పట్టణానికి చెందిన ఒక వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలోని తార్నాకకు చెందిన మరో వ్యక్తి మోసం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట్రాయపురం ఆంధ్రాసుగర్స్‌లో ఫైనాన్స్ మేనేజర్‌గా పని చేస్తున్న తాళ్లూరి వెంకటసత్యరాజేష్ అనే వ్యక్తి ఓఎల్ఎక్స్లో కారు చూసి కొనేందుకు బేరం మాట్లాడుకున్నారు. తార్నాకకు చెందిన అపరిచిత వ్యక్తి తాను మైనింగ్ శాఖలో గెజిటెడ్ అధికారినని పరిచడం చేసుకున్నాడు. దీంతో అతన్ని నమ్మిన రాజేష్ పలు దఫాలుగా మొత్తం రూ. 2,19,990 నగదును అతని బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. అయితే కారు గురించి అడగ్గా రిపేరుకు ఇచ్చానంటూ మాయమాటలు చెబుతూ వస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు అతన్ని ఫోన్లో నిలదీయడంతో ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు రాజేష్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కుంభమేళా కోసం ప్రత్యేక మొబైల్ యాప్
లక్నో: అలహాబాద్‌లో జనవరి 15 నుంచి జరగనున్న కుంభమేళా కోసం నార్త్ సెంట్రల్ రైల్వే(ఎన్సీఆర్) ప్రత్యేకంగా ’రైల్ కుంభ సేవా మొబైల్ యాప్’ ను ఆవిష్కరించింది. కుంభ మేళాలో పాల్గొనేందుకు అలహాబాద్‌ను సంద ర్శించే భక్తులు, పర్యాటకులు, ఇతర ప్రయా ణికులకు అవసరమైన సమాచారాన్ని అందించ డానికి ఈ యాప్‌ను రూపొందిం చినట్టు ఎన్సీఆర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అమిత్ మాల్వియ తెలిపారు. ఈ యాప్ కుంభమేళా ప్రత్యేక రైళ్లకు సంబంధించిన సమాచారం, రిజర్వ్ సీట్లు, రిజర్వు కాని సీట్ల వివరాలను తెలియజేస్తుందని ఆయన చెప్పారు. ఏ సమ యంలోనైనా, ఎక్కడినుంచైనా కుంభమేళా కు సంబంధించిన సమాచారం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. భక్తులు తమ ప్రస్తుత స్థానంతో పాటు, అలహాబాద్‌లోని అన్ని రైల్వేస్టేషన్లు, మేళా ప్రాంతం, ప్రధాన హోట ళ్ళు, బస్స్టేషన్లు, ఇతర సౌకర్యాలకు సంబం ధించిన సమాచారం కూడా ఈ యాప్ ద్వారా పొందొచ్చని చెప్పారు. పార్కింగ్, అల్పాహార గదులు, వేచి ఉండు గదుల సమాచారం కూడా ఈ యాప్ అందిస్తుందన్నారు. -
అటకెక్కిన టీమ్ వర్క్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల్లో అవకతవకల నిరోధానికి ప్రవేశపెట్టిన ‘టీమ్’ (టాస్క్ ఎలక్ట్రానిక్ అసెస్మెంట్ అండ్ మానిటరింగ్) యాప్ అటకెక్కింది. యాప్‌ను అట్టహాసంగా ప్రారంభించినా ఆనక దాని ఉనికినే పట్టించుకోవడం మానేశారు. ఇప్పటి దాకా యాప్ ద్వారా పనులు నమోదు చేయకుండా పాతపద్ధతి (మెజర్మెంట్స్ బుక్స్)లోనే పనుల నమోదు, బిల్లుల చెల్లింపు చేస్తున్నారు. ఈ యాప్ వినియోగం ద్వారా ప్రతి పనికి కచ్చితమైన లెక్కతోపాటు పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, నిధులు దుబారా కాకుండా చూసేందుకు వీలుంటుందని అధికారులు ప్రకటించారు. మెజర్మెంట్ బుక్స్(ఎంబీ)లో వివరాలను కాంట్రాక్టర్లే నమోదు చేయడం.. సంబంధిత ఇంజినీర్లు సైతం పరస్పర సహకారంతో సంతకాలు పెట్టడం వంటి చర్యల వల్ల జీహెచ్ఎంసీ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ‘టీమ్’ యాప్‌తో దాన్ని కట్టడి చేయవచ్చని భావించారు. వర్క్ ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు ప్రతిరోజు పురోగతిని ఫొటోలతో సహా అప్లోడ్ చేయడం.. బిల్లుల చెల్లింపు సైతం యాప్ లెక్కల మేరకే ఆన్ లైన్లో చేస్తామని ఆగస్టులో యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు ప్రకటించారు. వాస్తవానికి గత జనవరిలోనే ఈ యాప్‌ను ప్రారంభిస్తామని చెప్పినా, ఎనిమిది నెలల జాప్యంతో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. యాప్ ద్వారా పనుల నమోదుకు దాదాపు రూ.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ట్యాబ్‌లను ఇంజినీర్లకు అందజేశారు. అయినా పనుల నమోదు నుంచి బిల్లుల చెల్లింపుల దాకా అన్నీ ‘ఎంబీ’ ద్వారానే జరుగుతుండడం గమనార్హం. ప్రతి పనికీ పక్కా లెక్క.. ‘టీమ్’ యాప్‌ను వినియోగించేందుకు ఇంజినీరింగ్ పనుల్లో ప్రతి పనికీ ప్రత్యేక నంబర్‌ను కేటాయిస్తారు. పనులు ప్రతిపాదనల నుంచి కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపు వరకు సమస్త వివరాలు ఆ నంబర్‌తో యాప్‌లో నమోదు చేయగానే తెలుస్తాయి. పని ఎప్పుడు పూర్తయింది.. ఎంత మొత్తం చెల్లించింది కూడా తెలుస్తుంది. ఒకే పనికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు బిల్లు చేసుకునేందుకు కుదరదు. మొత్తం నాలుగు మాడ్యూల్స్‌గా యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. మాడ్యూల్–1 కాంట్రాక్టర్‌తో పనుల ఒప్పందం పూర్తవగానే చేపట్టాల్సిన పనులు ఇందులో నమోదు చేస్తారు. ఒక్కో పనికి ప్రత్యేక నెంబర్ కేటాయించి పని కొలతల పరిశీలన, బిల్లుల తయారీ, ఆర్థిక విభాగానికి పంపించడం వంటివి ఇందులో ఉంటాయి. మాడ్యూల్–2 పనిలో నాణ్యత లోపాలుంటే ఆ వివరాలు, దాని ఫలితాలు ఇందులో నమోదు చేస్తారు. ఇందుకు పనులు జరిగిన రోడ్ల నుంచి ర్యాండమ్‌గా శాంపిల్స్ తీస్తారు. శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించి ఫలితాన్ని యాప్‌లో నమోదు చేస్తారు. మాడ్యూల్–3 చేయాల్సిన పని అంచనాల తయారీ నుంచి ఉన్నతాధికారుల తనిఖీ వరకు ఇందులో అప్లోడ్ చేస్తారు. పనుల విలువ రూ.10 కోట్లకు మించితే చీఫ్ ఇంజినీర్ తనిఖీ చేయాల్సి ఉంటుంది. మాడ్యూల్–4 ఈ విభాగంలో కాంట్రాక్టు రేట్ల విశ్లేషణ ఉంటుంది. నిర్మాణ సామగ్రి ఎంత దూరం నుంచి తెచ్చారు. అందుకు రవాణా చార్జీలెంత తదితర వివరాలు నమోదు చేస్తారు. డిజిటల్ సంతకాలు.. పనుల కొలతల ధ్రువీకరణకు అధికారుల డిజిటల్ సంతకాలు వినియోగిస్తారు. నగరంలో ప్రస్తుతం పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్(పీపీఎం) పేరిట వివిధ ప్రాంతాల్లో రోడ్ల పనులు జరుగుతున్నాయి. వీటిలో బీటీ, సీసీతో పాటు పేవర్‌బ్లాక్‌లు, మైక్రో సర్ఫేసింగ్ వంటి రకాల పనులు ఉన్నాయి. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ. 720 కోట్లు మంజూరు చేసింది. ప్రయోజనాలున్నా.. ట్యాబ్‌తో పాటు వెబ్‌లో నమోదు చేసే సదుపాయం వల్ల ఒకే పనిని రెండు పర్యాయాలు నమోదు చేయడాన్ని అడ్డుకోవడంతో పాటు జియో ట్యాగింగ్‌కు అవకాశం ఉంది. నేవిగేషన్‌తో ఇంటిగ్రేట్ చేసిన ఈ యాప్‌లో పనులు జరిగే ప్రాంతం నుంచే వాటి పురోగతి ఫొటోలు అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ వినియోగంతో ఏటా నాలుగు లక్షలకు పైగా పేపర్లు ఆదా అవుతాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. ‘టీమ్’ యాప్ ద్వారా ఏటా దాదాపు పదివేల పనులను ఆన్లైన్లో రికార్డు చేయవచ్చని, నిర్వహణ పనులతో పాటు ప్రాజెక్టు పనులకు కూడా ఉపయోగించవచ్చని ప్రకటించింది. కానీ అమలు మాత్రం జరగడం లేదు. ప్రభుత్వఅనుమతి కావాలి ‘టీమ్’ యాప్ ద్వారా పనుల నమోదు.. బిల్లుల చెల్లింపు సదుపాయం ఉన్నప్పటికీ, ఆన్లైన్ ద్వారా చెల్లింపులకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశాం. కానీ ఇంతవరకు ఆమో దం రాలేదు. కనీసం కమిషనర్ నుం చి తగిన ఉత్తర్వు అయినా అందాలి. ఇవేవీ లేకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేం. ఇంజినీరింగ్ పనుల చెల్లింపులు చేయలేం. ఆన్లైన్లో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు అకౌంట్స్ విభానికి యాక్సెస్ ఉండాలి. ఈ కారణాల వల్ల పాత పద్ధతిలోనే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి.– జియావుద్దీన్, చీఫ్ ఇంజినీర్ -
రిటైల్ ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ ‘జీ–సెక్’ ప్లాట్‌ఫామ్
ముంబై: రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీలను సులభంగా కొనుగోలు చేయటానికి వీలుగా ఎన్ఎస్ఈ వెబ్ పోర్టల్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఎన్ఎస్ఈ గోబిడ్’ పేరిట రూపొందించిన ఈ మొబైల్ అప్లికేషన్‌ను సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి సోమవారం ముంబైలో ఆవిష్కరించారు. ట్రెజరీ బిల్లులు 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల కాల వ్యవధి కోసం, ఇతర ప్రభుత్వ బాండ్లలో (ఏడాది నుంచి 40 ఏళ్ల కాల వ్యవధి) ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఈ యాప్ ఉపకరిస్తుంది. ‘‘దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిన తరుణంలో ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఈ యాప్ తీసుకురావడం కీలక మైలురాయిగా భావిస్తున్నాం. నాన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసేందుకు సెబీ స్టాక్ ఎక్సేంజ్‌లను అనుమతించాకే... ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనడం ప్రారంభమైంది’’ అని అజయ్‌త్యాగి ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆఫర్ చేసే రాబడుల కంటే ప్రభుత్వ బాండ్లు మెరుగైన రాబడులను ఇస్తున్నట్టు చెప్పారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిథ్యం ప్రస్తుతం తక్కువగా ఉందని, ఇది పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైతే మెరుగుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్లపై రాబడి 7.80– 7.83 శాతం మధ్య ఉంది. -
రూ. 5 నుంచి రూ.1,000 విరాళమివ్వండి
న్యూఢిల్లీ: దేశసేవలో మమేకమయ్యే బీజేపీకి తగినంత ఆర్థిక తోడ్పాటునిచ్చేందుకు, పారదర్శకత పెంచేందుకు యాప్ ద్వారా విరాళాలివ్వాలని ప్రజలకు ప్రధాని మోదీ సూచించారు. ‘‘పారదర్శకత సందేశాన్ని చాటిచెప్పేందుకు ‘నరేంద్ర మోదీ మొబైల్ యాప్’ ద్వారా విరాళాలను ఇవ్వండి. రూ.5 నుంచి రూ.1,000 వరకు మీకు తోచినంత సాయం చేయండి’’ అని మంగళవారం మోదీ ట్వీట్ చేశారు. తన donations.narendramodi.in వెబ్సైట్ లింక్‌ను ట్వీట్లో జతచేశారు. ప్రధాని పిలుపుమేరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లు చెరో రూ.1,000 విరాళమిచ్చారు. రూ.1,000 విరాళం రశీదును అమిత్ ట్వీట్ చేశారు. ప్రజాజీవితంలో పారదర్శకతను పెంచడంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు ఇలా చిన్న చిన్న మొత్తాలను విరాళంగా ఇవ్వాలని అమిత్ కోరారు. -
యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లు
న్యూఢిల్లీ: అన్రిజర్వ్డ్ రైల్వే టికెట్లను యూటీఎస్ (అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్)మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసే సదుపాయాన్ని నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈశాన్య సరిహద్దు, పశ్చిమ మధ్య రైల్వే జోన్లలో మినహా మిగిలిన 15 జోన్లలో ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల సౌకర్యార్దం రైల్వే శాఖ నాలుగేళ్ల క్రితం ముంబైలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం ఢిల్లీ–పల్వాల్, చెన్నై నగరాలకు దీనిని విస్తరించింది. నాలుగేళ్లలో సుమారు 45 లక్షలు మంది వినియోగదారులు ఈ యాప్ ద్వారా తమ పేరును నమోదు చేసుకున్నారని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ యాప్ ద్వారా రోజుకు సగటున 87వేల టికెట్లను కొనుగోలు చేస్తున్నారని, అంతేకాకుండా అన్రిజర్వ్డ్ టికెట్ల అమ్మకాల వల్ల రైల్వే శాఖ రోజుకు రూ.45 లక్షలు ఆర్జిస్తోందని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా ఫ్లాట్‌ఫాం టికెట్లు, నెలవారీ పాసులను సైతం కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. -
త్వరలో రైళ్లలో ‘జీరో–ఎఫ్ఐఆర్’
న్యూఢిల్లీ: వేధింపులు, దొంగతనం, మహిళలపై నేరాల వంటివి రైళ్లలో చోటుచేసుకున్నప్పుడు ప్రయాణికులు ఉన్నపళంగా మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు త్వరలో అందుబాటులోకి రానుంది. ఇలా వచ్చిన ఫిర్యాదులను ‘జీరో ఎఫ్ఐఆర్’గా పేర్కొంటారు. ఈ ఫిర్యాదు అందిన వెంటనే రైల్వే రక్షక దళ (ఆర్పీఎఫ్) సిబ్బంది స్పందించి దర్యాప్తు ప్రారంభిస్తారని ఆర్పీఎఫ్ డీజీ అరుణ్ చెప్పారు. ప్రస్తుతం ఏదైనా నేరం జరిగితే ప్రయాణికులు ఫిర్యాదు చేయాలంటే సంబంధిత పత్రాన్ని టీటీఈ నుంచి తీసుకుని, నింపి తర్వాతి స్టేషన్లో ఆర్పీఎఫ్ లేదా జీఆర్పీ సిబ్బందికి అందజేయాల్సి ఉంది. ఈ జాప్యాన్ని నివారించి, నేరం రైల్లో ఎప్పుడు, ఏ ప్రదేశంలో జరిగినా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఈ యాప్‌ను రైల్వే తీసుకొస్తోంది. ఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ), టీటీఈ, టీసీ తదితరులకు ఈ యాప్ అనుసంధానమై ఉంటుంది. ఆఫ్లైన్లోనూ పనిచేసే ఈ యాప్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా పానిక్ బటన్ కూడా ఉంటుంది. -
‘టెక్’ ఎలక్షన్స్!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో ఐటీ పరి జ్ఞానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా వినియోగించుకోబోతోంది. పారదర్శకత కోసం పది రకాల ఐటీ అప్లికేషన్స్‌ను వాడనుంది. జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్న జిల్లా కలెక్టర్లకు ఈ అప్లికేషన్ల వినియోగంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఐటీ అప్లికేషన్ల వినియోగంపై కలెక్టర్లకు తర్ఫీదునిచ్చింది. వారంపాటు బ్యాచుల వారీగా కలె క్టర్లకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజకీయ పార్టీలతో పాటు పోటీ చేసే అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి కోరితే.. ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి ముం దు అనుమతులు జారీ చేసేందుకు ‘సువిధ’ పేరుతో యాప్‌ను ఈ ఎన్నికల్లో వినియోగించనున్నారు. ఎన్ని కల సమయంలో ఎక్కడైనా అక్రమాలు, అవినీతి, డబ్బుల పంపిణీ చోటు చేసుకున్నా.. ఎన్నికల ప్రవ ర్తన నియమావళిని ఉల్లంఘించినా సామాన్య ప్రజ లు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమా చారం అందించే వీలుగా ‘సీ–విజిల్’పేరుతో మరో మొబైల్ యాప్ రూపొందించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనల ఫొటోలు, వీడియోలను తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకుంటారు. ఎన్నికల సంఘం ఈ యాప్ ఫిర్యాదులపై సమీక్ష జరుపుతుంది. వీవీప్యాట్లపై అవగాహన అత్యంత పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఐటీ పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ చెప్పారు. యాప్‌ల వినియోగంపై జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రజత్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా ఉప ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్న జాయింట్ కలెక్టర్లు, వారి బృందంలోని ఐటీ అధికారులకు ఐటీ అప్లికేషన్ల వినియోగంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తొలిసారిగా వినియోగించబోతున్న వీవీప్యాట్ యంత్రాల పట్ల అధికారులకు అవగాహన లేదని, శిక్షణలో భాగంగా వాటిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నా మన్నారు. ఓటర్ల నమోదు కోసం ఈ నెల 15, 16వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రచారోద్యమ కార్యాక్రమా నికి వచ్చిన స్పందనపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో డూప్ ఓట్ల గుర్తింపు ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓటర్లును గుర్తిం చేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నట్లు రజత్ కుమార్ పేర్కొన్నారు. ప్రధానంగా ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, వయసు, ఫొటోలు, చిరు నామాల్లో పోలికల ఆధారంగా ఈ సాఫ్ట్వేర్ డూప్లి కేట్ ఓటర్లను గుర్తిస్తుందన్నారు. డూప్లికేట్ ఓటర్లను తొలగించడంలో చట్టబద్ధంగా వ్యవహ రిస్తామని, 7 రోజుల ముందుకు సంబంధిత వ్యక్తులకు నోటీసులు అందజేస్తామన్నారు. మరణించిన వ్యక్తుల పేర్లను మాత్రమే సుమోటోగా తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందన్నారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు, వివరాల్లో మార్పులు, చేర్పుల కోసం తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు. బలంవతపు తీర్మానాలపై కఠిన చర్యలు.. ఫలానా పార్టీ లేదా అభ్యర్థికే ఓటేయాలని గ్రామాల్లో ప్రజలతో చేయిస్తున్న ప్రతిజ్ఞలు, తీర్మానాలపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యా దులు అందలేదని రజత్‌కుమార్ తెలి పారు. తీర్మానాలు, ప్రతిజ్ఞలు ఓటర్ల వ్యక్తిగత విషయాలని, అయితే, బలవంతంగా తీర్మా నాలు, ప్రతిజ్ఞలు చేయిస్తున్నట్లు తమ దృష్టి కొస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వ హణ తేదీలపై సమాచారం లేదని, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తమను సంప్రదించాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయితే కేంద్ర ఎన్నికల సంఘమే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుందని స్పష్టం చేశారు. -
ఎన్నికల కోడ్ అతిక్రమణలపై ‘సీ–విజిల్’
న్యూఢిల్లీ: ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించే రాజకీయ పార్టీలు, అభ్యర్థులను కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం మొబైల్ యాప్‌ను రూపొందించింది. త్వరలో ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజో రాం రాష్ట్రాల ఓటర్లకు ఈ యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఓపీ రావత్ ఆదివారం వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఓటర్లను శక్తిమంతుల్ని చేయడమే తమ లక్ష్యమన్నారు. సీ–విజిల్ యాప్ సాయం తో సాధారణ ఓటర్లు కూడా తమ ప్రాంతం లోని ఉల్లంఘనల ఫొటోలు తీసి ఎన్నికల అధికారికి పంపవచ్చు. ఫిర్యాదుదారు ఏ ప్రాంతం నుంచి ఆ ఫొటోలను పంపారో తెలుసుకునే సాంకేతిక వెసులుబాటు కూడా ఉంది. పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడి వేధింపులకు గురయ్యే ఫిర్యాదుదారు తమ వివరాలను రహస్యంగా ఉంచాలనుకుంటే అందుకోసం యాప్‌లో ప్రత్యేక ఏర్పాటు ఉంది. -
రైళ్లలో భద్రతకు ‘రైల్ సురక్ష’ యాప్
రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలను సత్వరమే పరిష్కరిం చడం కోసం రైల్వే శాఖ ‘రైల్ సురక్ష’ పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఇది ఈ నెలాఖరు నుంచి సెంట్రల్ రైల్వే పరిధిలోని దూరప్రాంత, లోకల్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు తన సమస్యను యాప్‌లో పెట్టాలి. ఆ సందేశం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో ఉన్న కంట్రోల్ రూం(182)కు చేరు తుంది. అక్కడి సిబ్బంది వెంటనే ఫిర్యాదు దారుడి ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించి దగ్గరలోని రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్)లేదా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)లను అప్రమత్తం చేస్తారు. దాంతో అధికారులు ఫిర్యాదుదారు దగ్గరకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. -
10 రోజులు.. పది లక్షలు
సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో): ఇంటి వద్ద నుంచే సాధారణ తరగతి రైల్వే టికెట్లను బుక్ చేసుకునేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెటింగ్ సిస్టమ్) మొబైల్ యాప్‌నకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన పది రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో జనరల్ బోగీల్లో పయనించేందుకు నేరుగా తమ మొబైల్ ఫోన్ నుంచే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ పది రోజుల కాలంలో ఏకంగా 50 వేల మంది ప్రయాణికులు యూటీఎస్ యాప్ ద్వారా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించారు. మరో 60 వేల మంది ఎప్పుడైనా ప్రయాణం చేసేందుకు అనుగుణంగా తమ వివరాలను యాప్‌లో నమోదు చేసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణికులు ఈ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకొనే సదుపాయాన్ని ఈ నెల 16 నుంచి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రైల్వేస్టేషన్లలోని సాధారణ బుకింగ్ కౌంటర్ల వద్ద ఉండే రద్దీ, పండుగలు, వరస సెలవుల కారణంగా సకాలంలో టిక్కెట్లు దొరక్క ప్రయాణాలను రద్దు చేసుకోవడం వంటి ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు ఊరట కల్పించేందుకు ఈ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లకు మాత్రమే పరిమితమైన మొబైల్ బుకింగ్ సదుపాయాన్ని యూటీఎస్ ద్వారా అన్ని రైళ్లలోని అన్రిజర్వ్డ్ బోగీలకు విస్తరించారు. దీంతో అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, ప్యాసింజర్ రైళ్లలోనూ ప్రయాణానికి 3 గంటలు ముందు స్మార్ట్ఫోన్లలో యూటీఎస్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. యూటీఎస్ వెరీ యూస్ఫుల్... దక్షిణమధ్య రైల్వేలోని సుమారు 600 రైల్వేస్టేషన్ల నుంచి ప్రతి రోజు 10.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 1.5 లక్షల మంది స్లీపర్, ఏసీ రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణం చేస్తుండగా, 9 లక్షల మంది సాధారణ ప్రయాణికులే. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచే ప్రతి రోజు 2.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, వరంగల్, కాజీపేట్, వంటి పెద్ద స్టేషన్లతో పాటు, చిన్న స్టేషన్ల నుంచి రోజువారీ అవసరాల కోసం సమీప స్టేషన్ల నుంచి ప్రధాన పట్టణాలు, నగరాలకు రాకపోకలు సాగించేవారూ లక్షల్లోనే ఉంటారు. వీరందరూ జనరల్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాయాల్సిందే. యూటీఎస్ యాప్‌తో ఇలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఎలాంటి గందరగోళం లేకుండా, లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రయాణానికి 3 గంటల ముందు ఇంటి దగ్గర నుంచే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. 130 స్టేషన్లలో వినియోగం... దక్షిణమధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లతో పాటు పొరుగు జోన్లకు రాకపోకలు సాగించే రైళ్లలో సైతం యూటీఎస్ ద్వారా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించారు. ఈ 10 రోజుల్లో 130 స్టేషన్ల నుంచి 50 వేల మంది ప్రయాణం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ప్రయాణం చేసిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. నగరంలోని లింగంపల్లి, హైటెక్‌సిటీ, తదితర ఎంఎంటీఎస్ స్టేషన్లు, విజయవాడ, తిరుపతి, వరంగల్ వంటి పెద్ద స్టేషన్ల నుంచి కూడా యూటీఎస్ రాకపోకలు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు ప్రయాణికులు తాము బయలుదేరే రైల్వేస్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల జీపీఎస్ పరిధిలో ఉంటే చాలు. ఒకసారి టిక్కెట్ బుక్ చేసుకున్న తరువాత 3 గంటల పాటు అది చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఒక్క పరిమితిని దృష్టిలో ఉంచుకొని యూటీఎస్‌ను వినియోగించుకోవాలి. ఆర్–వాలెట్‌పై 5 శాతం బోనస్... ప్రయాణికులు తమ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్, ఇతర సదుపాయాల నుంచి యూటీఎస్ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి. టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు ఆన్లైన్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించవచ్చు. అయితే దక్షిణమధ్య రైల్వే ప్రవేశపెట్టిన ఆర్–వాలెట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే టిక్కెట్ చార్జీలపైన 5 శాతం బోనస్ లభిస్తుంది. -
మొబైల్ ఆప్ ద్వారా సెక్స్ రాకెట్ దందా.. అరెస్ట్
రాంచీ : జార్ఖండ్‌లో హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టురట్టయ్యింది. ఆన్ లైన్ ద్వారా రెసిడెన్షియల్ ఏరియాలో రూం బుక్ చేసుకొని అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న నాలుగు జంటలను రాంచీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంచీలోని వింద్ర ప్యాలెస్‌లో గత రెండు నెలలుగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు. కమర్షియల్ హోటల్ పేరిట ఓ కాంప్లెక్స్‌ను రెంట్‌కు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. మొబైల్ ఆప్ ద్వారా రూంను బుక్ చేసుకొని అవివాహిత జంటలను గదిలోకి అనుమతిస్తారు. దీని కోసం వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా చుట్టుపక్కల వారి ఈ దందాను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసలు దాడులు నిర్వహించి నాలుగు జంటలను, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ రాకెట్ వెనుక ఉన్న మరికొంత మందిని త్వరలోనే పట్టుకుంటామని పోలీలుల పేర్కొన్నారు. -
స్కూల్ బస్సులు @ ఆన్లైన్
సాక్షి, సిటీబ్యూరో: మీ పిల్లలు పయనించే స్కూల్ బస్సు సామర్థ్యాన్ని, ఆ బస్సు నడిపే డ్రైవర్ల అర్హత, అనుభవం వంటి వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా...స్కూల్ బస్సుల కండీషన్‌పై సందేహాలు ఉన్నాయా...డోంట్వరీ. ఇప్పుడు ప్రతి బడి బస్సు జాతకం మీకు ఆన్లైన్లో లభించనుంది. మీ పిల్లలు వెళ్లే స్కూల్ మాత్రమే కాదు. ఏ విద్యాసంస్థకు చెందిన వాహనాల వివరాలైనా ఆన్లైన్లో ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాదు. ‘స్కూల్ బస్సు’ మొబైల్ యాప్ ద్వారా కూడా బడి బస్సుల వివరాలను పొందవచ్చు. గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు 10,050 స్కూల్ బస్సుల వివరాలను ఆన్లైన్లో ఉంచేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు పిల్లల భద్రత దృష్ట్యా ప్రతి స్కూల్ యాజమాన్యం విధిగా తమ స్కూల్ బస్సులకు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని రవాణాశాఖ సూచించింది. బస్సుల నిర్వహణలో ఎలాంటి జాప్యానికి, అలసత్వానికి తావు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ ‘సాక్షి’తో చెప్పారు. నిర్ణీత గడువులోగా ఫిట్నెస్ పరీక్షలకు హాజరుకాని వాటిని జఫ్తు చేయనున్నట్లు హెచ్చరించారు. సిబ్బంది వివరాలు ఉండాల్సిందే... ప్రతి సంవత్సరం మే రెండో వారం నుంచి జూన్ మొదటి వారం వరకు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. బస్సుల సామరŠాధ్యన్ని పరీక్షించడంతో పాటు వాటిని నడిపే డ్రైవర్లు, అటెండర్ల వివరాలను, అర్హతలను కూడా రవాణాశాఖ పరిగణనలోకి తీసుకుంటుంది.ఈ సారి ఫిట్నెస్ కోసం స్లాట్ బుక్ చేసుకొనే సమయంలో బస్సుల వివరాలతో పాటు వాటిని నడిపే ఇద్దరు డ్రైవర్లు, అటెండర్ల అర్హత, డ్రైవింగ్ లైసెన్సు, అనుభవం, ఫొటోలు కూడా అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు. ప్రతి బస్సుకు ఒక ప్రధాన డ్రైవర్, మరో ప్రత్యామ్నాయ డ్రైవర్ తప్పనిసరి.ఇలా స్లాట్ బుకింగ్ సమయంలోనే వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల ఏ బస్సును ఏ డ్రైవర్లు నడుపుతున్నారో, బస్సు నడిపే సమయంలో విధినిర్వహణలో ఉన్న అటెండర్ గురించి తెలుసుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఆర్టీఏ అధికారులే కాకుండా తల్లిదండ్రులు కూడా స్కూల్ బస్సుల పర్యవేక్షకులుగా వ్యవహరించేందుకు అవకాశం లభిస్తుందని జేటీసీ తెలిపారు. ఈ వివరాలన్నింటినీ ‘స్కూల్ బస్’ మొబైల్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. గత రెండేళ్లుగా బస్సుల వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేస్తున్నప్పటికీ దీనిని మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు, సిబ్బంది వివరాలను కూడా ఈ సారి తప్పనిసరి చేశారు. ముందస్తుగా ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోని దుర్ఘటనలు ఎదురైనప్పుడు చేపట్టివలసిన చర్యలకు కూడా ఆన్లైన్ సమాచారం దొహదం చేస్తుందని రవాణాశాఖ భావిస్తోంది. బస్సుల్లోసీసీ కెమెరాలు... మరోవైపు స్కూల్ బస్సుల భద్రతను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటును కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. బస్సు లోపలివైపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా డ్రైవర్ నైపుణ్యాన్ని అంచనా వేయడంతో పాటు పిల్లల పట్ల సిబ్బంది ప్రవర్తన, పిల్లలను జాగ్రత్తగా బస్సు ఎక్కించేందుకు, తిరిగి ఇళ్ల వద్ద దించేందుకు సిబ్బంది చూపే శ్రద్ధ వంటి వివరాలను తెలుసుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ నిబంధనలు తప్పనిసరి.... ♦ ప్రతి స్కూల్ బస్సు కచ్చితమైన నిబంధనలు పాటించాలి. అన్నివిధాలుగా సమర్ధవంతంగా ఉంటేనే అధికారులు ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలను అందజేస్తారు. ♦ బస్సు పసుపు రంగులో ఉండాలి.రంగు పాలిపోయినట్లుగా కాకుండా స్పష్టంగా కనిపించాలి.విద్యార్ధులు బస్సులోకి ఎక్కడం,దిగడం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించే విధంగా కన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి.బస్సులోపలి భాగంలో ఒక పెద్ద పారదర్శకమైన అద్దం ఏర్పాటు చేయాలి.దీనివల్ల లోపల ఉన్న పిల్లలు కూడా డ్రైవర్‌కు కనిపిస్తారు. ♦ బస్సు ఇంజన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టింగ్విషర్),పొడి అందుబాటులో ఉండాలి.అత్యవసర ద్వారాం ఉండాలి.ఫస్ట్ ఎయిడ్‌బాక్స్ ఏర్పాటు చేయాలి. ♦ సదరు పాఠశాల/కళాశాల పేరు,టెలిఫోన్ నెంబర్,మొబైల్ నెంబర్,పూర్తి చిరునామ బస్సుకు ఎడమవైపున ముందుభాగంలో స్పష్టంగా రాయాలి. ♦ వాహనానికి నాలుగువైపులా పై భాగం మూలాల్లో (రూఫ్‌పై కాదు) బయటివైపు యాంబర్ (గాఢ పసుపు పచ్చని) రంగుగల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి.పిల్లలు దిగేటప్పుడు,ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి. ♦ సదరు వాహనం స్కూల్ బస్సు అని తెలిసేవిధంగా ముందుభాగంలో పెద్ద బోర్డుపైన 250ఎం.ఎం.కు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్ధులు (ఒక అమ్మాయి,ఒక అబ్బాయి) నల్లరంగులో చిత్రించి ఉండాలి. ఆ చిత్రం కింద ‘‘స్కూల్ బస్సు’’ లేదా ‘‘ కళాశాల బస్సు’’ అని నల్ల రంగులో కనీసం 100ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి.అక్షరాల గాఢత సైజు కనీసం 11ఎం.ఎం.ఉండాలి. ♦ బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్‌తో ఉండాలి.సైడ్ విండోలకు అడ్డంగా 3 లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి.సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ మంది ఉండొద్దు. ♦ ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు 325 ఎం.ఎం.ల ఎత్తుకు మించకుండా ఉండాలి.అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి. ♦ బస్సులో ప్రయాణించే విద్యార్ధుల పేర్లు,తరగతులు,ఇళ్ల చిరునామాలు,ఎక్కవలసిన, దిగవలసిన వివరాలు బస్సులో ఉండాలి. డ్రైవర్ల అర్హతలు ... ♦ డ్రైవర్ వయస్సు 60ఏళ్లకు మించకుండా ఉండాలి.పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్యపట్టికను విధిగా నిర్వహించాలి. ♦ యాజమాన్యం తమ సొంత ఖర్చుతో డ్రైవర్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తపోటు,షుగరు,కంటి చూపు వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ♦ డ్రైవర్‌కు బస్సు డ్రైవింగ్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ♦ డ్రైవర్,అటెండర్‌కు యూనిఫాం తప్పనిసరి. ♦ ఈ అంశాలపై పేరెంట్స్ కమిటీ అప్రమత్తంగా ఉండాలి. వీటిపై ప్రిన్సిపాల్‌తో చర్చించాలి. ♦ ఫస్ట్‌యిడ్ బాక్సులో మందులు, ఇతర పరికరాలు కూడా తనిఖీ చేయాలి. -
ఒత్తిడిని చిత్తు చేసే యాప్
సాక్షి, కోల్‌కతా : నిత్యం జీవితంలో ఒత్తిడి అన్ని వయసుల వారినీ వేధిస్తోంది. ఆధునిక జీవితంలో ప్రధాన సవాల్‌గా పరిణమించిన ఒత్తిడిని అధిగమించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన నిపుణుల బృందం ఓ మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను యూజర్లు తమ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని విశ్లేషించడం, దాన్ని సమర్ధంగా ఎదుర్కొనేలా నిపుణులు డిజైన్ చేశారు. ధ్యాన్యాండ్రాయిడ్ పేరిట ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. జూన్ 10న ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. రెండు వెర్షన్లలో లభ్యమయ్యే ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూజర్ భావోద్వేగాలను సమస్థితిలో ఉంచుతూ కుంగుబాటును నియంత్రంచేలా ఈ యాప్ పనిచేస్తుంది. యూజర్ల ఒత్తిడి స్థాయిలను అంచనా వేస్తూ ధ్యానం ద్వారా వారికి స్వాంతన చేకూర్చేలా డిజైన్ చేశారు. పలు ప్రశ్నల ద్వారా యూజర్ల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఈ యాప్ పరిశీలిస్తుంది. రియల్ టైమ్‌లో యూజర్లు ఎంత ఒత్తిడికి గురువుతున్నారన్నది ఈ యాప్ పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇక మెడిటేషన్ పరంగా సులభమైన శ్వాస, యోగ ఎక్సర్‌సైజ్‌లను యాప్ సూచిస్తుంది. థర్మల్ ఇమేజింగ్, సంగీతం, వైబ్రేషన్ల ద్వారా థ్యాన మందిరంలో ఉన్నామన్న భావనను యూజర్లకు కల్పిస్తూ వారిని ఒత్తిడి రహిత స్థితికి చేర్చడంలో తోడ్పడుతుంది. -
పిడుగు నుంచి కాపాడిన యాప్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో పడుతున్న పిడుగుల కారణంగా 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. గత మంగళవారం ఒక్క రోజే ఏపీలో 41,025 పిడుగులు పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఏదో ఒక చోట పిడుగులు పడుతూనే ఉన్నాయి. మిన్ను విరిగి మనమీదే పడ్డట్టుగా ఉరుములు.. పిడుగులు.. భయానక వాతావరణాన్ని సృష్టించినప్పటికి మృతుల సంఖ్య తక్కువగా ఉండటానికి ఓ మొబైల్ యాప్ కారణం అంటున్నారు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు. కుప్పం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, ఇస్రో అధికారుల సహాయంతో లైటెనింగ్ ట్రాకర్ సిస్టమ్ యాప్‌ని రూపొందించారు. విద్యుదయస్కాంత తరంగాలను విశ్లేషించడం ద్వారా ఉరుములు, పిడుగులు ఏ ప్రాంతాల్లో పడతాయో ముందే గుర్తించగలుగుతారు. ఎవరైతే ఈ యాప్‌ని వినియోగిస్తున్నారో వారికి 45 నిమిషాల ముందుగానే సరిగా ఏ ప్రాంతంలో పిడుగులు పడుతాయో సమాచారం అందుతుంది. వాతావరణ నిపుణుడు కెటీ కృష్ణ మాట్లాడుతూ.. కేవలం లైటింగ్ ట్రాకింగ్ యాప్ సహాయంతో చాలా మంది ప్రాణాలు రక్షించగలిగామని తెలిపారు. ఈ యాప్ సహాయంతో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తరపున 20.14 లక్షల మంది మొబైల్ వినియోగదారులకి ఊరుములు, పిడుగులకు సంబంధించిన ముందస్తు సమాచారం అందజేశామని తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ సాఫ్ట్‌వేర్‌ని(వజ్రపథ్) వినియోగించామన్నారు. ప్రస్తుతానికి ఇది కేవలం బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని దీనిని ఇతర మొబైల్ సర్వీస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. -
రైల్వే ఫిర్యాదుల కోసం మదద్ యాప్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు తమ సమస్యలను ఫిర్యాదు చేసేందుకుగాను మదద్ అనే మొబైల్ యాప్‌ను రైల్వే శాఖ రూపొందించింది. ఈ యాప్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. ప్రయాణ సమయంలో ఎదురయ్యే సమస్యల్ని ఇప్పటివరకు ట్వీటర్, ఫేస్బుక్ గ్రీవియెన్స్ సెల్లోనే ఫిర్యాదు చేసే అవకాశముంది. త్వరలో అందుబాటులోకి రానున్న మదద్ యాప్‌ద్వారా రైళ్లలోని ఆహార నాణ్యత, పారిశుధ్యం వంటి వాటిపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీంతోపాటుగా అత్యవసర సేవల్ని కూడా పొందవచ్చు. ఇచ్చిన ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే అవకాశముంది. -
విద్యా కార్యక్రమాల పర్యవేక్షణకు ‘టీఎస్ స్కూల్’
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా కార్యక్రమాల అమలును ఎప్పటికప్పుడు తెలుసుకుని, అవసరమైన చర్యలు చేపట్టేందుకు బుధవారం విద్యాశాఖ ‘టీఎస్ స్కూల్’ పేరుతో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతీ పాఠశాలలకు జియోఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది. దీంతో క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్ (సీఆర్పీ) పాఠశాలకు వెళ్తేనే యాప్ ఓపెన్ అవుతుంది. సీఆర్పీలు పాఠశాలలకు వెళ్లి అక్కడి నుంచే పిల్లలు, టీచర్ల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు వంటి వివరాలను యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. -
‘పెట్టుబడి’ పంపిణీకి యాప్!
సాక్షి, హైదరాబాద్: ‘పెట్టుబడి’చెక్కుల సొమ్ము తీసుకునేందుకు బ్యాంకులకు వచ్చే రైతులను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ ను సిద్ధం చేస్తోంది. ఏ బ్యాంకులోనైనా సొమ్ము తీసుకునేలా ఆర్డర్ చెక్కులు ఇస్తుండటంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అదీకాక చెక్కులను ఇతరులు తస్కరించి దుర్వినియోగం చేయకుండా చేసేందుకు కూడా యాప్‌ను తయారు చేస్తున్నట్లు వెల్లడిం చాయి. మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్న జాతీయ సమాచార కేంద్రానికే పెట్టుబడి సొమ్ము తీసుకునే రైతుల జాబితా తయారీ బాధ్యతను వ్యవసాయ శాఖ అప్పగించింది. గ్రామసభలో చెక్కు అందుకున్న రైతు బ్యాంకులో సొమ్ము తీసుకునేందుకు వెళ్తే, అతని పాస్‌బుక్ నంబర్‌ను యాప్ లో ఎంటర్ చేస్తే రైతు వివరాలన్నీ వస్తాయి. వాటిని పరిశీలించాక వచ్చిన వ్యక్తి సంబంధిత రైతేనని తేలిన తర్వాతే డబ్బు చేతికి ఇస్తారు. రేపటి నుంచి చెక్కుల మేళా బ్యాంకులు ముద్రించిన తొలివిడత చెక్కులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నాయి. వాటిని జిల్లాలకు పంపేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచి మూడు రోజులపాటు బ్యాంకులు ఏర్పాటు చేసే కేంద్రా ల్లో వ్యవసాయ శాఖ వర్గాలు స్వీకరిస్తాయి. -
ఓలా చేతికి మొబైల్ యాప్
సాక్షి,న్యూఢిల్లీ: క్యాబ్ అగ్రిగేటర్ ఓలా ముంబైకి చెందిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టికెటింగ్ అండ్ కమ్యూటింగ్ యాప్ రిడ్లార్ను కొనుగోలు చేసింది. డిజిటల్ రవాణా సేవలను వినియోగదారులకు అందించే క్రమంలో ఈ చర్య తీసుకున్నామని కంపెనీ మంగళవారం ప్రకటించింది. తద్వారా రిడ్‌లార్ ఆవిష్కరణలతో మేళవించి వినియోగదారులకు మల్టీ మోడల్ మొబిలిటీ సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భీష్ అగర్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అటు ఓలా ద్వారా పట్టణ ప్రాంతాల్లో వన్‌స్టాప్ డెస్టినేషన్లాంటి సేవలను విస్తరించడంతోపాటు సరసమైన ధరలో నిరంతరాయ సేవలందించడంపై రిడ్‌లార్ వ్యవస్థాపకుడు బ్రిజ్రాజ వాఘాని సంతోషం వ్యక్తం చేశారు. రిడ్లార్కు చెందిన 64గురు ఉద్యోగులు ఓలాలో జాయిన్ అవుతారు. అలాగే మొత్తం ఆపరేషన్స్ బాధ్యతలను బ్రిజ్రాజ్ వాఘాని చేపడతారు. కాగా రిడ్‌లార్ యాప్ ముంబై, ఢిల్లీ సహా మరికొన్నినగరాల్లో తన సేవలను అందిస్తోంది. 2015లో టాక్సీ ఫర్ష్యూర్ను స్వాధీనం చేసుకున్నసంగతి తెలిసిందే. -
కడక్‌నాద్ కోళ్లపై మధ్యప్రదేశ్‌కే హక్కులు!
నల్ల కోళ్లు.. అదేనండి కడక్‌నాద్ కోళ్లపై ప్రాదేశిక గుర్తింపు(జీఐ) హక్కులను మధ్యప్రదేశ్ దక్కించుకుంది. అనాదిగా గిరిజనులు పెంచి పోషిస్తున్న కడక్‌నాద్ కోళ్ల జాతిపై ప్రాదిశిక గుర్తింపు హక్కుల కోసం మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల మధ్య గత ఏడాది నుంచి వాదప్రతివాదాలు జరగుతూ వచ్చాయి. చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయం మధ్యప్రదేశ్‌కే జీఐ హక్కు ఇస్తూ మార్చి 28న జర్నల్ 104లో నోటిఫై చేసినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రి అంతర్ సింగ్ ఆర్య ప్రకటించడంతో వివాదానికి తెరపడింది. ఝబువ, అలిరాజ్పుర్ జిల్లాలకు చెందిన గిరిజనులు కడక్‌నాద్ కోళ్లను అనాదిగా పరిరక్షిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోని 21 సహకార సంఘాలలో సభ్యులైన 430 మంది గిరిజనులు కడక్‌నాద్ కోళ్లను సాకుతూ, పిల్లలను, మాంసాన్ని అమ్ముకొని జీవిస్తున్నారు. గ్రామీణ్ వికాస్ ట్రస్టు 2012లో గిరిజనుల తరఫున ప్రాదేశిక గుర్తింపు కోరుతూ ధరఖాస్తు చేసింది. ఝబువలో 1978లో తొలి కడక్‌నాద్ కోడి పిల్లల హేచరీ ఏర్పాటైంది. అయితే, ఛత్తీస్‌ఘడ్‌లోని 120 స్వయం సహాయక బృందాల ద్వారా 1600 మంది గిరిజన మహిళలు కడక్‌నాద్ కోళ్ల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నందున వీరికే జీఐ హక్కులు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. చివరికి మధ్యప్రదేశ్‌కే జీఐ మంజూరైనందున ఇకపై ఈ కోళ్ల జాతిపై సర్వహక్కులు ఝబువ, అలిరాజ్పుర్ జిల్లాల గిరిజనులకే దక్కాయి. అంటే ‘కడక్‌నాద్’ పేరుతో నల్ల కోళ్లను ఇక మరెవరూ అమ్మటానికి వీల్లేదు. అందేకే, దేశంలో ఎక్కడివారైనా కడక్‌నాద్ కోళ్ల లభ్యతను తెలుసుకొనేందుకు, సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా MP Kadaknath పేరిట హిందీ/ఇంగ్లిష్ మొబైల్ యాప్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కడక్‌నాద్ కోళ్లకు ఎందుకింత క్రేజ్? కడక్‌నాద్ కోడి మాంసం రుచికరమైనదే కాకుండా పోషక విలువలు, ఔషధ గుణాలను కలిగి ఉంది. సాధారణ జాతుల కోడి మాంసంలో మాంసకృత్తులు 18% ఉంటే.. ఇందులో 25–27% ఉంటాయి. ఐరన్ అధికం. కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ అని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. వాతావరణ మార్పులను దీటుగా తట్టుకోవడం ఈ కోళ్లకు ఉన్న మరో ప్రత్యేకత. మధ్యప్రదేశ్ ప్రభుత్వ హేచరీలలో ఏటా రెండున్నర లక్షల కడక్‌నాద్ కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. మన కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ కోడి పిల్లలను తెప్పించి, మన రైతులకు అందజేస్తే వారి ఆదాయం పెరుగుతుంది. -
ప్లే స్టోర్ నుంచి సీఎం యాప్ అదృశ్యం
బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి అదృశ్యమైంది. ఈ యాప్ యూజర్లు వ్యక్తిగత డేటాను ఓ ప్రైవేట్ కంపెనీకి విక్రయిస్తుందనే ట్విటర్ యూజర్ల ఆరోపణల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్లే స్టోర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారిక యాప్ కూడా కనిపించడం లేదు. వీటి లింక్‌లను క్లిక్ చేస్తే.. ‘ ప్రస్తుతం ఆ కంటెంట్ మీ దేశంలో అందుబాటులో లేదని, వీలైనంత త్వరగా మీరు ఇష్టపడే కంటెంట్ మరిన్ని దేశాలకు తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. దయచేసి మళ్ళీ చెక్ చేయ్యండి’ అని చూపిస్తోంది. ఫ్రెంచ్ సెక్యురిటీ రీసెర్చర్ బాప్టిస్ట్ రాబర్ట్ కూడా సీఎం సిద్ధరామయ్య అధికారిక యాప్ యూజర్ల డేటాను ప్రైవేట్ కంపెనీకి అమ్ముతున్నట్టు ధృవీకరించారు. యూజర్ పేరు, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, జెండర్ వంటి వాటిని ప్రైవేట్ కంపెనీకి పంపుతున్నట్టు తెలిపారు. ఆ యాప్ ఓపెన్ చేసిన ప్రతీసారి ఇంటర్నెట్ స్పీడు తగ్గిపోయేదని, సరియైన పరిశీలన చేసుకోలేకపోయేవాడనని తెలిపారు. ఇలా యూజర్ల డేటా ప్రైవేట్ కంపెనీకి చేరుతున్నట్టు ఆయన గుర్తించారు. ఇటీవలే ఫేస్బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరి చేసిందనే ఆరోపణల్లో కాంగ్రెస్ పార్టీ ఇరుక్కున సంగతి తెలిసిందే. కేంబ్రిడ్జ్ అనలిటికాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు. మరోవైపు మరికొన్ని రోజుల్లో కర్నాటక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యాప్ అదృశ్య కావడం చర్చనీయాంశమైంది. -
వాటర్ కనెక్ట్ యాప్‌ను ఆవిష్కరణ
-
నేనెక్కడ ఉన్నాను..!
సాక్షి, హైదరాబాద్: నగదురహిత సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా దేశంలోనే మొట్టమొదటి ‘డిజిపే రైల్వేస్టేషన్’గా నిలిచిన కాచిగూడ రైల్వేస్టేషన్.. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందజేయడంలో మరో సారి ఆదర్శప్రాయమైన స్టేషన్‌గా ప్రశంసలు అందుకొంది. కాచిగూడ స్టేషన్ సేవలను వివరించే మొబైల్ యాప్ ‘రైల్స్టేషన్ ఇన్ఫో’, బ్లూటూత్ సాయంతో స్టేషన్ లోపల పరిసరాలను తెలుసుకొనే ‘నవ్రస్’(నావిగేషన్ ఫర్ రైల్వేస్టేషన్స్) అనే మరో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ ఈ యాప్‌లను గురువారం ప్రారంభించారు. అనంతరం 400 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌ప్లాంట్‌ను సందర్శించారు. కాచిగూడ స్టేషన్ అవసరాలకు సరిపోయేలా సోలార్ పవర్‌ప్లాంట్ నుంచి విద్యుత్ లభిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే 6.4 మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉందని, వచ్చే ఏడాదికి దీనిని 7.4 మెగావాట్లకు పెంచేవిధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్‌లను ప్రవేశపెట్టడం ద్వారా కాచిగూడ స్టేషన్ దేశం లోని అన్ని రైల్వేలను మరోసారి ఆకర్షించిందని చెప్పారు. నగరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులు, కొత్తవారికి ఈ యాప్‌లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. కాగా, ఈ యాప్‌లను ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైల్స్టేషన్ ఇన్ఫో ద్వారా.. - కాచిగూడ రైల్వేస్టేషన్ పూర్తి సమాచారం లభిస్తుంది. - ఎంఎంటీఎస్, లోకల్, ప్రత్యేక రైళ్ల వేళలు తెలుసుకోవచ్చు. - వెయిటింగ్ హాల్స్, ప్లాట్‌ఫామ్స్‌పై ఉన్న కేటరింగ్ స్టాల్స్ జాడ తెలుస్తుంది. - లైసెన్స్ కలిగిన పోర్టర్స్ ఫోన్ నంబర్లు, బ్యాడ్జి నంబర్లు లభిస్తాయి. - రిటైరింగ్ రూమ్స్ ఆన్లైన్ బుకింగ్ సదుపాయం ఉంటుంది. - విచారణ కార్యాలయం, పార్సిల్స్, బుకింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ కార్యాలయాల వివరాలు లభిస్తాయి. - తాగునీటి సదుపాయం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. - టోల్‌ఫ్రీ నంబర్ 8121281212కు వచ్చిన ఫిర్యాదులపై చేపట్టిన చర్యలు కూడా తెలుసుకోవచ్చు. - బ్లూటూత్ సాయంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్ లోపలి ప్రాంతాలను తెలుసుకోగలుగుతారు. - తాము నిలబడి ఉన్న ఒక మీటర్ పరిధి నుంచి మొత్తం స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫామ్‌లపైన ఎక్కడ ఏమున్నాయో నావిగేషన్ సాయంతో కనిపెట్టవచ్చు. - రూట్‌మ్యాప్ ద్వారా అన్ని వివరాలు తెలుస్తాయి. -
ఒక్క క్లిక్‌తో నల్లా కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసులకు శుభవార్త. నల్లా కనెక్షన్ కోసం వినియోగదారులు పడే అవస్థలకు ఇక ఫుల్స్టాప్ పడనుంది. ఇందుకోసం జలమండలి వాటర్ కనెక్ట్ యాప్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి గృహ వినియోగ (డొమెస్టిక్) నల్లాల కోసం ఇంటి నుంచే ఒక్క మొబైల్ క్లిక్‌తో నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు అవసరమైన ఇంటి నిర్మాణ ప్లాన్, సేల్‌డీడ్, ఆక్యుపెన్సీ ధ్రువీకరణపత్రం డాక్యుమెంట్లను స్కాన్ చేసి మొబైల్ ద్వారానే అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది. ఈ వాటర్ కనెక్ట్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా దరఖాస్తులను సమర్పించిన వినియోగదారులకు 15 రోజుల్లో నల్లా కనెక్షన్ జారీ కానుంది. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఎండీ దానకిశోర్‌లు ‘వాటర్ కనెక్ట్’ యాప్‌ను ఆవిష్కరించారు. ఇంకుడు గుంతలపై మరింత సమాచారం అందజేసేందుకు జలమండలి రూపొందించిన జలంజీవం యాప్, జలంజీవం వెబ్సైట్లనూ ప్రారంభించారు. అంతకుముందు జలం జీవం కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి... చిత్రాలను వీక్షించారు. -
మొబైల్ యాప్‌లో ‘రైల్వేస్టేషన్’
సాక్షి, హైదరాబాద్: మీరు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నారా? అక్కడ లభించే సేవల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక మీరు ఏ సిబ్బందిని సంప్రదించాల్సిన పనిలేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్‌ను ఓపెన్ చేస్తే చాలు. స్టేషన్ సేవలు ప్రత్యక్షమవుతాయి. కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న యాప్ సేవలను దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ గురువారం ప్రారంభించనున్నారు. ‘రైల్వేస్టేషన్ ఇన్ఫో’అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కాచిగూడ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే 60 ఎంఎంటీఎస్ రైళ్ల టైం టేబుల్, లోకల్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలతోపాటు బుకింగ్, రిజర్వేషన్ సేవలు, విశ్రాంతి గదులు, క్యాంటీన్, హోటళ్లు, టాయిలెట్లు, పోర్టల్ సేవలు ఎక్కడ లభిస్తాయో తెలుసుకోవ చ్చు. ప్రయాణికుల ఫిర్యాదులపై అధికారుల స్పందన తెలుసుకోవచ్చు. నవరస్ అనే మరో యాప్: స్టేషన్ నేవిగేషన్ సదుపాయం ‘నవ్రస్’ అనే మరో మొబైల్ యాప్ ద్వారా లభిస్తుంది. ఈ నావిగేషన్ సూచీ ఆధారంగా ప్రయాణికులు ఎవరి సాయం లేకుండా ఒక చోట నుంచి మరో చోటకు నేరుగా వెళ్లిపోవచ్చు. రైల్వేస్టేషన్‌కు కొత్తగా వచ్చే వారికి, పర్యాటకులకు ఈ యాప్ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ రెండు యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కాచిగూడ స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన 400 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌గ్రిడ్‌ను కూడా జీఎం ప్రారంభించనున్నారు. -
అర చేతిలో పౌర సేవలు!
సాక్షి, హైదరాబాద్: ‘భారతీయులు సులువుగా, వేగంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. సాంకేతికత పట్ల మక్కువ, అందిపుచ్చుకునే విషయంలో విజ్ఞత భారతీయుల్లో ఎక్కువ. ప్రపంచంలో మరే దేశంలో వినియోగించుకోని విధంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లను దేశంలో వినియోగిస్తున్నారు. పెద్దగా చదువుకోకపోయినా, సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియకున్నా దాని వల్ల కలిగే ఫలితాలను ప్రజలకు స్పష్టంగా వివరిస్తే అద్భుతాలు సాధించవచ్చు. మొబైల్ ఫోన్‌తో వివిధ రకాల పౌర సేవలందించేందుకు ప్రవేశపెట్టిన టీ–యాప్ ఫోలియోను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తారని నమ్మకముంది’అని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సేవలను మొబైల్ ఫోన్ ద్వారా పౌరులకు అందించేందుకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) శాఖ రూపొందించిన ‘టీ–యాప్ ఫోలియో’యాప్‌ను మంత్రి బుధవారం ఆవిష్కరించారు. ఏడాదిలో 1,000 రకాల సేవలు వివిధ శాఖల సేవలన్నీంటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి యాప్ రూపంలో నిక్షిప్తం చేయడం ద్వారా మొబైల్ గవర్నెన్స్ (ఎం–గవర్నెన్స్) సేవల వైపు అడుగులు వేశామని కేటీఆర్ చెప్పారు. ‘మొబైల్ యాప్ ద్వారా అన్ని రకాల సేవలను అందించడంలో కర్ణాటక తర్వాత దేశంలో రెండో రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో యాప్‌ను రూపొందించాం. తెలుగు, ఆంగ్లంలో యాప్‌ను వినియోగించుకోవచ్చు. తొలుత 150 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ల్యాండ్ రికార్డులు, రేషన్ సరఫరా, అత్యవసర సహాయం తదితర సేవలను దీని ద్వారా పొందవచ్చు. ఏడాదిలో 1,000 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’అని వివరించారు. ప్రజల చేతి వేళ్లపై పాలన.. సాంకేతిక పరిజ్ఞానం ఎన్ని పుంతలు తొక్కినా సాధారణ ప్రజలకు ప్రయోజనం లేకపోతే నిరర్థకమని సీఎం కేసీఆర్ అంటుంటారని కేటీఆర్ గుర్తు చేశారు. మొబైల్ ఫోన్ల ద్వారా సమాచార శూన్యం నుంచి సమాచార విప్లవం వచ్చిందని.. దేశ జనాభాకు సమాన సంఖ్యలో దేశంలో మొబైల్ ఫోన్లు ఉన్నాయన్నారు. ప్రజల చేతి వేళ్లపై పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో యాప్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ‘హైదరాబాద్ నగరంలో పౌర సేవల కోసం తెచ్చిన ‘మై జీహెచ్ఎంసీ’యాప్‌ను ఇప్పటివరకు 3 లక్షల మంది, ‘మై ఆర్టీఏ’యాప్‌ను 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. బ్లాక్ చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కొత్త సాంకేతిక పరిజ్ఞానాల గురించి నిత్యం పత్రికల్లో వస్తోంది, ప్రజలకు సేవలందించేందుకు ఈ సాంకేతికతను ఉపయోగించుకుంటాం. ల్యాండ్ రికార్డుల నిర్వహణలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరం’అని పేర్కొన్నారు. ‘మీ–సేవ’ నిర్వాహకులకు ఆందోళన వద్దు రాష్ట్రంలో 4,500కి పైగా మీ–సేవ కేంద్రాలున్నాయని, వాటి ద్వారా ఉపాధి పొందుతున్న వారి ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ–యాప్ ఫోలియోను ప్రవేశపెట్టిన నేపథ్యంలో మీ–సేవ కేంద్రాలకు నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మీ–సేవ కేంద్రాల ద్వారా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజల సౌలభ్యత కోసమే టీ–యాప్ ఫోలియోను తీసుకొచ్చామని, మీ–సేవ కేంద్రాల నిర్వాహకుల పొట్టగొట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఫస్టియర్ విద్యార్థులకు పరీక్ష జరగనుండగా.. మార్చి 2నుంచి సెకండియర్ విద్యార్థులకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.06 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 123 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం చిరునామా సులువుగా తెలుసుకునేందుకు వీలుగా అధికారులు ‘ఎగ్జామ్ సెంటర్ లొకేటర్’ మొబైల్ యాప్‌ని రూపొందించారు. ఈ యాప్‌లో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేస్తే పరీక్ష కేంద్రానికి దారులను చూపిస్తుంది. విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నిఘానేత్రం నడుమ.. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రశ్నాపత్రాల బండిళ్లను సీసీ కెమెరాల ముందే తెరుస్తారు. ఎనిమిది సిట్టింగ్ స్క్వాడ్, నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. వీటికితోడు హైపర్ కమిటీ, కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) కూడా పరీక్షల నిర్వహణ తీరును నిత్యం పర్యవేక్షిస్తాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. అలాగే ప్రతి కేంద్రంలో ప్రథమ చికిత్స పెట్టె, ఒక ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. దాదాపు అన్ని పరీక్ష కేంద్రాలను చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ముందే వెళ్తే మంచింది.. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఉదయం 8 గంటల నుంచే పరీక్ష హాళ్లలోకి విద్యార్థులను అనుమతిస్తారు. తప్పనిసరిగా హాల్‌టికెట్‌ను తీసుకెళ్లాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలనూ లోనికి అనుమతించరు. పరీక్ష సమయాన్ని మించి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పరీక్షకు ఒకరోజు ముందుగానే వెళ్లి కేంద్రాలను చూసుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వెంక్యానాయక్ సూచించారు. ముందుగా చూసుకోవడం వల్ల కేంద్ర చిరునామా, రవాణా సౌకర్యాలు, చేరుకోవడానికి పట్టే సమయం తదితర అంశాలపై అవగాహన వస్తుందన్నారు. ఒత్తిడి, ఆందోళనకు గురికావొద్దని విద్యార్థులకు సూచించారు. ప్రశాంతంగా ఆలోచిస్తూ పరీక్షలు రాయాలని చెప్పారు. తొలుత సమాధానాలు తెలిసిన ప్రశ్నలను ఎదుర్కోవాలన్నారు. ఆహారం విషయంలో జాగ్రత్త ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది. నీరసం రాకుండా పరీక్షకు వెళ్లేముందు అల్పాహారం తీసుకోవడం ఉత్తమం. పళ్లరసం ఉంటే మేలు. సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలకే ప్రాధాన్యం ఇవ్వాలని డైటీషియన్లు సూచిస్తున్నారు -
‘వాక్ విత్ జగన్‘ మొబైల్ యాప్ ఆవిష్కరణ
సాక్షి, పూతలపట్టు : చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయం కొనసాగుతోంది. ఆయన పాదయాత్రకు ప్రజలనుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు అండగా మేమున్నామంటూ వైఎస్ జగన్‌తో కలిపి అడుగులు వేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లడానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం 'వాక్ విత్ జగన్' అనే ప్రత్యక యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్‌లో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర వివరాలతోపాటు ఇతర విషయాలను పొందుపరిచారు. ఇందులో ప్రతిరోజు వైఎస్ జగన్ ఎన్నికిలోమీటర్లు, ఎన్నిఅడుగులు వేస్తున్నారో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పాదయాత్రలో జననేతపాటు మనం ఎన్ని అడుగులు పాల్గొన్నామో కూడా ఇందులో ఉంటుంది. మనం నడిచిన దూరాన్ని షోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను ఇందులో పొందుపరచనున్నట్లు వారు ప్రకటించారు. తద్వార సమస్యలు అందరికీ తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. -
‘వాక్ విత్ జగన్‘ మొబైల్ యాప్ ఆవిష్కరణ
-
యాక్షన్ షురూ
సాక్షి,చెన్నై: రాజకీయ అరంగేట్రానికి తొలి అడుగుగా సినీ నటుడు కమల్ హాసన్ మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తున్నారు. అభిమానులకు అందుబాటులో ఉండేందుకు ఈ యాప్‌ను ప్రారంభిస్తున్నామని కమల్ వెల్లడించారు.తన రాజకీయ ప్రస్థానానికి మొబైల్ యాప్ నాంది పలుకుతుందని అన్నారు. అభిమానులు తన వెన్నంటి నిలుస్తారనే నమ్మకం తనకుందని..గతంలో తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సహకరించినట్టే రాజకీయ ప్రయాణంలోనూ ఉదారంగా నిధులిస్తారని కమల్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఆర్థిక లావాదేవీలన్నింటికీ మొబైల్ యాప్ కేంద్రంగా ఉంటుందని చెప్పారు.తాను స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచనని, అక్కడ మూలుగుతున్న ధనాన్ని వెనక్కిరప్పిస్తానని మంగళవారం 63వ బర్త్‌డే జరుపుకోనున్న కమల్ తెలిపారు. రాజకీయాలపై తాను తొందరపాటు నిర్ణయం తీసుకోబోనని, సినిమా పాత్రకు సంసిద్ధమయ్యేందుకే తాను మూడు నెలల సమయం తీసుకుంటానని చెప్పారు. హిందూ తీవ్రవాదంపై ఇటీవల కమల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. తాను బెదిరింపులకు భయపడనని దీనిపై మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తనపై జాతి వ్యతిరేక ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని, దేశంలో నెలకొన్న అతివాదంపైనే తాను మాట్లాడానని, ఉగ్రవాదానికి..అతివాదానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. -
రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా
సాక్షి, చెన్నై: తమిళనాట ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశం ఖరారైంది.తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్దామని అభిమానులకు కమల్ పిలుపునిచ్చారు. వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపుల కోసం తన 63 వ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 7న ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం చెన్నై శివారులోని కేలంబాక్కంలో దాదాపు పదిహేను వందల మంది అభిమానులతో కమల్ హాసన్ సమావేశమయ్యారు. అభిమానుల సంక్షేమ సంఘం 39 వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ భేటీలో అవినీతి నిర్మూలన, నదీ జలాల పరిరక్షణ, తమిళనాడు ప్రగతిపై కమల్ మాట్లాడారు. అనంతరం అభిమానులతో విడిగా కొద్దిసేపు మంతనాలు జరిపారు. ‘నేను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా. పార్టీ ఏర్పాటుచేసి ప్రజల్లోకి వెళ్దాం. పార్టీ పెట్టాలంటే కోట్లు అవసరమంటున్నారు. విరాళాలు ఇచ్చేందుకు, సేకరించేందుకు సిద్ధమా!’ అని వారిని ప్రశ్నించారు. విరాళాల కోసం తమిళనాడు ప్రజల ముందు చేతులు చాపేందుకు సిగ్గుపడనని ఆయన చెప్పారు. ‘పార్టీ ఏర్పాటు చేయడం ఒక్క రోజు పని. కానీ అంతకుముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ దిశగా ముందుకు సాగుదాం’ అని అభిమానులకు సూచించారు. అణిచివేత రాజకీయాల్లో ఒక భాగమని, ఎంత మంది నిన్ను బెదిరిస్తున్నారు అన్నది ముఖ్యం కాదని, నువ్వు ఏం చేయబోతున్నావు అన్నదే ముఖ్యమని కమల్ పేర్కొన్నారు. దెబ్బలు తినేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే అదే సమయంలో పదే పదే దెబ్బలు తినేందుకు తాను మృదంగం కానని చెప్పారు. చెన్నై వరదలను ప్రస్తావిస్తూ.. ‘ప్రకృతి విపత్తులకు ధనిక, పేద భేదం ఉండదు. మనం ప్రేమించిన వ్యక్తుల్ని కోల్పోయాక మేల్కొనడం కంటే ముందస్తుగా విపత్తు నివారణ చర్యలు తీసుకోవాలి’ అని కమల్‌హాసన్ సూచించారు. « -
అక్కణ్ణుంచి మన డబ్బు వెనక్కి తెస్తా!
‘‘ఎంత మంది మనల్ని వ్యతిరేకిస్తున్నారన్నది ముఖ్యం కాదు. మనం ఏం చేయాలనుకుంటున్నామన్నదే ముఖ్యం. ఎవరేమన్నా నేను ముందుకు వెళతాను. అన్ని వ్యతిరేకతలను తీసుకోవడానికి నేను సిద్ధం. ఎదుర్కోవడానికి కూడా సిద్ధమే’’ అని కమల్‌హాసన్ అన్నారు. కమల్‌హాసన్ ‘నర్పణి ఇయక్కమ్’ (వెల్ఫేర్ అసోసియేషన్) 39వ వార్షికోత్సవం చెన్నైలో జరిగింది. ఈ సమావేశంలో కమల్ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్నారు. ‘‘నేను రాజకీయల్లోకి వస్తాను. పొలిటికల్ పార్టీ పెడతాను. స్విస్ బ్యాంక్‌లో నేను డబ్బు దాచుకోలేదు. అక్కడ ఉన్న మన డబ్బును వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను’’ అన్నారు. పొలిటికల్ పార్టీ కార్యకలాపాలు సజావుగా జరగడానికి ఓ మొబైల్ యాప్‌ని రూపొందించారట. పుట్టినరోజు (ఈ నెల 7)నాడు ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. పార్టీకి ఫండ్ ఇవ్వాలనుకుంటే ఆ వివరాలు ఈ యాప్‌లో ఉంటాయట. బర్త్‌డే నాడు ‘విశ్వరూపం–2’ ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలనుకుంటున్నారట. -
ఎర్రర్ నేరాల టెర్రర్
అందుబాటులోకి వస్తోన్న ఆధునిక టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు అందిపుచ్చుకుంటున్నారు. నగరంలో ప్రతిరోజూ కనిష్టంగా 10 మంది మోసపోతున్నారని పోలీసులే అంగీకరిస్తున్నారు. ‘నయా’ నేరగాళ్లు కంప్యూటర్, సెల్‌ఫోన్ ఆధారంగా చేసుకుని ప్రజలను తేలికగా మాయచేస్తున్నారు. నేరం జరిగినట్టు గుర్తించేలోగా భారీగా నష్టం జరిగిపోతోంది. దీనివల్ల ఎంతోమంది జీవితాలు తల్లకిందులైపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. నేరస్తులను పట్టుకున్నా జరిగిన నష్టం మాత్రం పూడ్చలేనంతగా ఉంటోంది. ఇక నగదు రికవరీ లాంటివి దాదాపు అసాధ్యమే. – సాక్షి, సిటీబ్యూరో సెల్‌ఫోన్ కెమెరాలు వచ్చాక వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పడింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా రహస్య జీవితాన్ని చిత్రీకరించి నెట్లో పెట్టేస్తున్నారు. ఇలా చేసేవారిలో మాజీ భర్తలు, ప్రియులు ముందుంటున్నారు. గడిచిన వారం రోజుల్లో సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయియించిన బాధితురాళ్ల ఉదంతాలే ఇందుకు నిదర్శనం. ఈ విషయంలో మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎంతటి పరిచయస్తుడైనా అతన్ని వ్యక్తిగత విషలు తెలుసునే అవకాశం ఇవ్వొద్దు. ఇన్సూరెన్స్‌పై బోనస్ అంటూ.. ఇటీవల ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్, హెర్బల్ సీడ్స్ వ్యాపారం, వడ్డీ లేని రుణాల పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్ పెరిగిపోయాయి. ఆకర్షణీయంగా పలకరించే అవతలివారు మనకు సంబంధించిన కొన్ని విరాలను ముందే చెప్తారు. దీంతో వారు ఆయా బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన వారే అని నమ్మేస్తాం. వల్లోపడిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ప్రారంభించి అందినకాడికి దండుకుంటారు. హెర్బల్ సీడ్స్ వ్యాపారం పేరు చెప్పే వారు ఏకంగా వాటిని విక్రయించే వ్యక్తుల్నీ తామే పరిచయం చేస్తామని, తమ కంపెనీ ద్వారానే కొనిపిస్తామంటూ ఎర వేస్తుంటారు. కంప్యూటర్ ‘కీ’లాగర్స్.. ప్రస్తుతం అన్ని లావాదేవీలు ఇంటర్నెట్, కంప్యూటర్ ద్వారానే చేస్తున్నారు. ఇలా నిర్వహించే లావాదేవీలను తెలుసుకునేందుకు ‘కీ లాగర్స్’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఎవరైనా ఓ కంప్యూటర్ను వినియోగించి వెళ్లిపోయాక వారు ఏం టైప్ చేశారో ఈ సాఫ్ట్‌వేర్‌తో తేలిగ్గా తెలుసుకోవచ్చు. నెట్ కేఫ్‌ల్లోని సిస్టమ్స్‌లో వీటిని ఏర్పాటు చేసి చూస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్ కార్డు వివరాలు ఉంటే ఎదుటి వ్యక్తిని నిండా ముంచుతున్నారు. వైరస్‌తో విచ్చలవిడిగా స్మిష్షింగ్ సెల్‌ఫోన్ కేంద్రంగా ఇటీవల ‘స్మిష్షింగ్’గా పిలిచే వైరస్ పంపిస్తున్నారు. మీరు అత్యంత విలువైన కస్టమర్ అని.. కొన్ని అదనపు సదుపాయాలు అందిస్తున్నామని, దీనికోసం కొంత మొత్తం నెలవారీగా చెల్లించాలని సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్) వస్తుంది. సర్వీసులు కావాలంటే ‘ఎస్’, వద్దనుకుంటే ‘నో’ నొక్కి పంపమంటూ అందులో ఉంటుంది. అయితే ఏది నొక్కినా.. సైబర్ నేరగాళ్లు పంపే వైరస్ మీ ఫోన్లోకి చేరిపోతుంది. ఇక అప్పటి నుంచి ఫోన్ ద్వారా నిర్వహించే బ్యాంకింగ్, క్రెడిట్‌కార్డ్ లావాదేవీలన్నీ నేరగాళ్లకు చేరిపోతాయి. దీంతో మీ ప్రమేయం లేకుండానే నగదు మాయమైపోతుంది. ప్రొఫైల్స్‌తో పెనుముప్పు ఉపాధి అవకాశాలను వెతుక్కునే వారి సౌకర్యార్థం అనేక వెబ్సైట్లు ‘ప్రొఫైల్స్’ పేరుతో సదుపాయాలు అందిస్తున్నాయి. ఎవరైనా తవు ఫొటోతో పాటు ఇతర వివరాలనూ ఇందులో పొందుపరచవచ్చు. ఎవరైనా అమ్మాయి ఫొటోలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు దొరికితే కొందరు సైబర్ నేరగాళ్లు ద్వంద్వార్థాలతో ప్రొఫైల్స్‌లో పెట్టేస్తున్నారు. దీంతో సదరు యువతికి వేధింపు ఫోన్‌కాల్స్ తప్పట్లేదు. మరికొన్ని సందర్భాల్లో మార్ఫింగ్ ద్వారా పోర్న్ ఫొటోలకు ఈ యువతులు తలలు పెట్టి పరువు తీస్తున్నారు. అందుకే యువతులు, మహిళలు తమ ఫొటోలు పరాయి వ్యక్తుల చేతిలో పడకుండా జాగ్రత్తపడాలి. ఫొటో స్టూడియోలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉచితమని ఆశపడితే అంతే.. కొత్తగా యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ తయారు చేశాం.. పరిశీలను కొద్ది రోజులు ఉచితం.. ఇలాంటి ప్రకటనలు ఇంటర్నెట్లో ఊరిస్తుంటాయి. ఆశపడి డౌన్లోడ్ చేసుకుంటే నిండా మునిగినట్లే. ఇలా ఉచితంగా అందించే వాటి వెనుక ఓ ప్రొగ్రామింగ్ నిబిడీకృతమై ఉంటుంది. దీన్ని ‘ట్రోజన్ హార్స్’ అంటారు. అంటే ఏదైనా సదుపాయాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో నిక్షిప్తమై ఉన్న ప్రొగ్రామింగ్ మన కంప్యూటర్లో జరిగే ప్రతి లావాదేవీని సైబర్ నేరగాడికి అందిస్తుంది. ఇలా మన ఆర్థిక వ్యవహారాలు వారికి చేరిపోతున్నాయి. రింగ్‌తో విష్షింగ్ మొదలు సాంకేతికంగా ‘విష్షింగ్’గా పిలిచే ప్రక్రియలో నేరం ఫోన్ చేయడంతో ప్రారంభమవుతుంది. రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఫోన్ ఎత్తగానే అవతలి వారు మీ బ్యాంకు, క్రెడిట్‌కార్డ్ కంపెనీ నుంచి చేస్తున్నట్లు మాట్లాడతారు. ప్రస్తుతం ఉన్న సదుపాయాలను మరింతగా పెంచుతున్నామనో, అనివార్య కారణాల వల్ల మీకు అందిస్తున్న సేవల్ని నిలిపి వేయాల్సి వస్తోందనో చెప్పి హడావుడి చేస్తారు. ఆపై మొల్లగా కార్డు/ఖాతా నెంబరు నుంచి అన్ని వివరాలనూ సంగ్రహించేస్తారు. ఈ వివరాలన్నీ కూడా మన సెల్ఫోన్లో మీటలు నొక్కడం ద్వారానే ఫీడ్ చేయిస్తారు. ఆపై వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) కూడా తీసుకుంటారు. వీటిని వినియోగించి మీ ఖాతాలకు ఖాళీ చేసేస్తారు. నగరంలో కొన్ని కేసులు ఇలా.. ⇒ ఫార్వర్డ్ ట్రేడింగ్‌లో పెట్టుడబడి పెడితే 24 గంటల్లోనే డబ్బు రెట్టింపు అవుతుందంటూ ఫోన్ ద్వారా ఎర వేసి నగరానికి చెందిన మరియదాస్ ఫ్రాన్సిస్ జయరాజ్ నుంచి రూ.11 లక్షలు గుంజారు. ⇒ చాటింగ్ సైట్ ద్వారా ఓ యువతికి పరిచయమైన దుండగుడు ఆమెతో స్నేహంగా మెలిగాడు. ఆపై మార్ఫింగ్ చేసిన ఆమె ఫొటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. తీవ్రస్థాయిలో భయపెట్టి ఆమె అర్ధనగ్న చిత్రాలు ఫేస్బుక్ ద్వారా పంపేలా చేసుకుని బ్లాక్‌మెయిలింగ్ పెంచాడు. ⇒ సికింద్రాబాద్‌లోని ఎస్డీ రోడ్లో నివసించే శ్రీనివాస్ సైబర్ నేరగాళ్ల వేసిన ఈ–మెయిల్ ఉచ్చులో చిక్కుకున్నాడు. అమెరికా కంపెనీకి హెర్బల్ సీడ్స్ సరఫరా చేసే కాంట్రాక్ట్ అంటే ఆసక్తి చూపడంతో వివిధ పేర్లతో ఇతడి నుంచి రూ.8.5 లక్షలు కొట్టేశారు. ⇒ నారాయణగూడ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మహ్మద్ అబ్దుల్ ఫారూఖ్‌కు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఎలాంటి వడ్డీ లేకుండా, ఏడాది తర్వాత వాయిదాలు చెల్లించేలా రూ.20 లక్షల రుణం ఇస్తామన్నారు. వివిధ రకాల ఫీజుల పేర్లు చెప్పి రూ.62 లక్షలు స్వాహా చేశారు. ⇒ బంజారాహిల్స్‌కు చెందిన విద్యార్థి ఫెరోజ్ ఖాన్‌కు రూ.3.6 కోట్లు లాటరీ వచ్చిందంటూ ఎస్సెమ్మెస్ పంపారు. ఆ నగదు పొందడానికి వివిధ రకాలైన కోడ్స్ చార్జీల పేరు చెప్పి రూ.22 లక్షలు దోచేశారు. ⇒ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ మహిళ చిలకలగూడ వాసికి ఎర వేసింది. తాము కోటీశ్వరులమని, తమ కుమార్తె పేరిట బ్యాంకులో రూ.1.7 కోట్లు ఉన్నాయంటూ నమ్మించింది. స్నేహం నటిస్తూ ఆ నగదు తీసుకోవాలని సూచిస్తూ ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో అతడి ఎనిమిదేళ్ల కష్టార్జితం రూ.76 లక్షలు కాజేసింది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ⇒ క్రెడిట్/ డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి. దుకాణ యజమానులు సైతం ఎవరైనా కార్డు ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు వారి సంతకాన్ని కార్డుపై ఉన్న దాంతో సరిచూడాలి. దీని వల్ల ఇతరులు ఆ కార్డులను వినియోగించడానికి అవకాశముండదు. ⇒ ప్రతి కార్డుకి వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ (కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ) నెంబర్ ఉంటుంది. దీన్ని గుర్తుంచుకుని, కార్డుపై చెరిపేయాలి. ⇒ మీ కార్డులను స్వైప్ చేయడానికి ఎవరికైనా ఇచ్చినప్పుడు.. మీ దృష్టి ఆ ప్రక్రియపైనే ఉంచండి. దీనివల్ల స్కిమ్మింగ్‌కు అవకాశాలు తక్కువవుతాయి. ⇒ మీ క్రెడిట్ కార్డును చాలా కాలం పాటు వినియోగించకుండా ఉంటే... ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపి దాని అకౌంట్‌ను తాత్కాలికంగా మూసేయండి. ⇒ ఆన్లైన్ ద్వారా వ్యవహారాలు సాగించేట్లయితే.. మీరు వినియోగిస్తున్న సైట్ అడ్రస్ (జ్టి్టp://)తో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి. ⇒ కార్డులను పొగోట్టుకున్న వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించండి. ⇒ మీ కార్డు ద్వారా లావాదేవీలు జరిగిన ప్రతిసారీ ఆ సమాచారం ఈ–మెయిల్, ఎస్ఎమ్మెస్ ద్వారా మీకు వచ్చేలా చూసుకోండి. ⇒ ఎగ్జిబిషన్లు, సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్‌లో ఏర్పాటు చేసే గిఫ్ట్ కూపన్లు, లక్కీ డిప్స్, వోచర్స్‌కు సంబంధించిన కాగితాల్లో సెల్‌ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీలను గుడ్డిగా రాయకూడదు. ఆ నిర్వాహకులు ఈ విధంగా సేకరించిన డేటాను అనేక నకిలీ సంస్థలకు సైతం విక్రయిస్తున్నాయి. ⇒ మనం ఒక పోటీలోనో, కార్యక్రమంలోనో పాల్గొంటే మాత్రమే బహుమతులు వస్తాయి. అలాంటివి ఏమీ లేకుండా మీరు బహుమతులు గెలుపొందారని, లక్కీ కపుల్స్‌గా ఎంపికయ్యాని వచ్చే ఫోన్లు ఎంత వరకు వాస్తవమో ఆలోచించండి. ⇒ మార్కెటింగ్ సంస్థలు అనేక ఎత్తులను ప్రయోగిస్తాయి. వినియోగదారులను కలిసిన కంపెనీ ప్రతినిధులు ఎన్నో ఉపయోగాలున్నాయని చెప్తూ.. ఆశ పెడతారు. అయితే సొమ్ము చెల్లించిన తరవాత చేసుకునే అగ్రిమెంట్లో మాత్రం వీటి ప్రస్తావని ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏజెంట్లు చెప్పిన విషయాలు, అగ్రిమెంట్లో ఉన్న వివరాలు ఒకేలా ఉన్నాయా? అన్నది సరిచూసుకోవాలి. ⇒ ఏదైనా క్లబ్లో మెంబర్‌గా చేరే ముందు ఆ సంస్థ గురించి, వారిచ్చే సౌకర్యాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలి. సైబర్ నేరాలు ఎన్నెన్ని రూపాలో.. కంప్యూటర్ హ్యాకింగ్, వివిధ రకాల వైరస్‌లను, డిసిమినేషన్, చాట్ రూమ్స్‌ను ఆధారంగా చేసుకుని చేసే ఇంటర్నెట్ రిలే చాట్ (ఐఆర్సీ) క్రైమ్, లాటరీలు వచ్చాయంటూ, వ్యాపార భాగస్వాములుగా మారతామంటూ నిండా ముంచే నైజీరియన్ ఫ్రాడ్స్, ఆర్కూట్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా మోసాలు చేసే సోషల్ ఇంజినీరింగ్, సైబర్ స్టాకర్‌గా పిలిచే ఆన్లైన్ ద్వారా వేధింపులు.. సైబర్ నేరాలే. ఇవన్నీ ఇటీవల పెరిగిపోతున్నాయి. వీటికంటే ‘అకౌంట్ టేకోవర్’ అనే నేరం వేగంగా విస్తరిస్తోందని సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు. అంతేగాక ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ‘సెల్ఫోన్ల’నూ వదదలదం లేదు. -
పింఛను సెటిల్మెంట్కు మొబైల్ యాప్
న్యూఢిల్లీ: ఇకపై పదవీ విరమణ పొందిన కేంద్రప్రభుత్వ ఉద్యోగులంతా మొబైల్లో పింఛన్ వివరాలు తెల్సుకోవచ్చు. రిటైరయ్యాక రావాల్సిన పింఛనుసెటిల్మెంట్ కోసం కేంద్రం బుధవారం మొబైల్ యాప్‌ను ప్రారంభించ నుంది. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఈ యాప్ ద్వారా చేయవచ్చు. ఇలాంటి వాటి కోసం ‘పెన్షనర్స్ పోర్టల్’ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇకపై మొబైల్ ద్వారానే సేవలు పొందేందుకు, పింఛను స్థితిగతులను, రావాల్సిన పింఛన్ మొత్తాన్ని తెలుసుకునేందుకు యాప్‌ను ప్రారంభిస్తున్నారు. ఉద్యోగుల సేవలకుగాను ‘అనుభవ్’పేరుతో రిటైరైన వారికి పురస్కారం ఇవ్వనున్నారు. -
ఆధార్ డేటా హ్యాక్ చేసిన టెకీ..
బెంగళూరు: తాను రూపొందించిన మొబైల్ ఆప్ ద్వారా ఆధార్ డెటాను హ్యాక్ చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి అభినవ్ శ్రీవాత్సవ్(31) బెంగళూరు ఓలా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ-హాస్పిటల్ అప్లికేషన్‌తో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి అక్సెస్ పొంది అక్రమంగా ఆధార్ డెటాను పొందాడు. దీన్ని గుర్తించిన యూనిక్ ఆధార్ ఐడెంటిఫికేషన్ అథారిటీ శ్రీవాత్సవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆధార్ డేటాబెస్తో శ్రీవాత్సవ్ ఐదు మొబైల్ అప్లికేషన్ రూపొందించాడు. వీటిలోని ఆధార్ ఈ కేవైసీ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి 50 వేల సార్లు డౌన్లోడ్ అయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీనితో నిందితుడు ప్రకటనల పేరిట రూ.40 వేలు ఆర్జించాడు. అయితే ఈ ఆప్ ను గుర్తించిన అధికారులు గత నెలనే డీఆక్టివేట్ చేశారు. పోలీసులు నిందితుడి నుంచి సీపీయూ, ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్స్, ఆరు పెన్ డ్రైవ్‌లు, రూ.2.25 లక్షలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. -
జీఎస్టీ ‘మొబైల్ యాప్’
పన్నుల చెల్లింపులో పారదర్శకతకు వాణిజ్యపన్నుల శాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ అమలు నేపథ్యంలో పన్ను ఎగవేతలను అరికట్టేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. బిల్లులు ఇవ్వడం, వాటిని అప్లోడ్ చేయడంలో కొందరు డీలర్లు పారదర్శకంగా వ్యవహరించడం లేదని గుర్తించిన నేపథ్యంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. డీలర్లు పన్నుతో ఒకటి, పన్ను లేకుండా మరొక బిల్లు ఇస్తున్నారని.. రోజువారీ బిల్లుల సంఖ్యను తమ కు అనుకూలంగా మార్చుకుంటున్నారని దృష్టికి వచ్చింది. గతంలో ఉన్న యాప్ ప్రతిపాదనలకు మెరుగులు దిద్ది అందుబాటులోకి తేవాలని నిర్ణయిం చారు. ఈ యాప్‌లో వినియోగదారులు తమ బిల్లులను అప్లోడ్ చేయవచ్చు. ఎక్కువ బిల్లు వేసినా, బిల్లు ఇవ్వకపోయినా సదరు సమాచారాన్ని యాప్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. బిల్లు అప్లోడ్ చేసే వినియోగదారులకు లాటరీ పద్ధతిలో ప్రోత్సాహకాలూ ఇవ్వనున్నారు. ఈ ప్రతిపాదనను సీఎంకు పంపారు. ఆయన ఆమోదం లభిస్తే త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది. -
ఆయకార్ సేతు
ఇది ఒక ఉచిత మొబైల్ యాప్. ఆదాయ పన్ను శాఖ ఈ యాప్‌ను అందిస్తోంది. పన్ను చెల్లింపుదారులు దీని సాయంతో ఆదాయ పన్ను శాఖ అందిస్తున్న పలు సేవలను పొందొచ్చు. ‘ఆయకార్ సేతు’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ♦ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ♦ పన్ను చెల్లింపుదారులు వారికి ఉన్న సందేహాలను నివృతి చేసుకోవచ్చు. ♦ దగ్గరిలోని టీపీఎస్ కార్యాలయాన్ని గుర్తించవచ్చు. ♦ ట్యాక్స్ టూల్ సాయంతో వివిధ రకాల పన్ను లెక్కింపులు చేసు కోవచ్చు. హా లైవ్ చాట్‌లో ట్యాక్స్ నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. ♦ ఆన్లైన్లోనే పన్నులు చెల్లించవచ్చు. ♦ పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ♦ దగ్గరిలోని ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ వివరాలు తెలుసుకోవచ్చు. -
పన్ను చెల్లింపుదార్ల కోసం ఐటీ యాప్
న్యూఢిల్లీ: పన్నుల చెల్లింపులు, పాన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైన వాటిని మరింత సులభతరం చేసేలా ఆదాయ పన్ను శాఖ తాజాగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆదాయ పన్ను శాఖకు, అసెసీలకు మధ్య వారధిలా ఉపయోగపడేలా రూపొందించిన ఈ ’ఆయకర్ సేతు’ యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది పనిచేస్తుంది. పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన సర్వీసులు అందించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు మంత్రి చెప్పారు. దీనితో పన్నుల చెల్లింపులు, పర్మనెంట్ అకౌంటు నంబరుకు దరఖాస్తు చేయడం, పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయడం వంటి పనులను ఎవరి సహాయం అవసరం లేకుండా ఇంటి వద్ద కూర్చునే అసెసీ సులభంగా పూర్తి చేసుకోవచ్చని ఆయన వివరించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే కాకుండా 7306525252కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో యాప్ ద్వారానే ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఆప్షన్‌ను కూడా సీబీడీటీ అందుబాటులోకి తేనుంది. పన్నుల చెల్లింపునకు సంబంధించిన కీలకమైన తేదీలు, ఫారమ్‌లు, నోటిఫికేషన్స్ మొదలైనవి రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఐటీ శాఖ పంపనుంది. ఎస్ఎంఎస్ అలర్ట్‌లు కావాలనుకునే వారు ఆయకర్ సేతు మాడ్యూల్లో తమ మొబైల్ నంబర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
మార్కెట్లోకి రవీంద్ర జడేజా యాప్
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా తన పేరిట మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రస్తుత టీమిండియా సభ్యులలో సొంత యాప్‌ను తెచ్చిన మొదటి ఆటగాడు అతనే కావడం విశేషం. అమెరికాకు చెందిన ఎస్కేప్ ఎక్స్ అనే సంస్థ దీనికి సాంకేతిక సహకారం అందించింది. తన యాప్ విడుదల పట్ల సంతోషం వ్యక్తం చేసిన జడేజా... అభిమానులతో మాట్లాడేందుకు, తనకు సంబంధించిన ఫొటోలు, వీడియో అందుబాటులో ఉంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. -
నష్టాలకు ఆర్టీసీ రైట్.. రైట్!
♦ వజ్ర మినీ బస్సుల విషయంలో ముందుకెళ్తున్న వైనం ♦ లోపాలు సరిదిద్దకుండా మరిన్ని కొత్త మార్గాల ఎంపిక ♦ త్వరలో కరీంనగర్, గోదావరిఖనిలకు బస్సులు ♦ ఉన్నవాటికే ప్రయాణికులు లేక ఖజానాకు భారం ♦ 20 శాతానికి మించని ఆక్యుపెన్సీ రేషియో ♦ తీరు మార్చకుండా మరిన్ని ఏసీ బస్సులు నడిపేందుకు సిద్ధమైన ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: ఓ ప్రయోగం విఫలమై నష్టాలు మిగులుస్తోంది. అప్పుడేం చేయాలి.. నష్టాలను అధిగమించేందుకు ఉన్న మార్గాల ను అన్వేషించాలి. సమస్యకు మూలం ఎక్క డుందో గుర్తించి సరిదిద్దాలి. ఆ తర్వాత దాన్ని విస్తరించే ప్రయత్నం చేయాలి. కానీ తీవ్ర నష్టాలు, అప్పులతో కునారిల్లి జీతాలు చెల్లిం చేందుకు దిక్కులు చూసే దుస్థితిలో ఉన్న ఆర్టీసీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీనికి తాజా నిదర్శనమనే వజ్ర ఏసీ మినీ బస్సుల విస్తరణ యత్నం. యాప్ ద్వారానే టికెట్లు.. ఇప్పటి వరకు ప్రయాణికులు బస్టాండ్లకు వెళ్లి బస్సులెక్కే పద్ధతి కొనసాగుతూ వచ్చింది. దీనికి భిన్నంగా కాలనీల నుంచే బస్సులు నడిపితే ‘ప్రయాణికుల ముంగిటకు ఆర్టీసీ’ నినాదం అమలులోకి వచ్చినట్లవుతుందనే ఉద్దేశంతో కొత్త ఆలోచనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంకురార్పణ చేశారు. ఆయన ఆదేశాల మేరకు వజ్ర పేరుతో మినీ ఏసీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించిన విష యం తెలిసిందే. బస్సుల్లో టికెట్ ఇచ్చే పద్ధతి లేకపోవటం, నేరుగా నగదు చెల్లించి టికెట్లు బుక్ చేసుకోకుండా మొబైల్ యాప్ ద్వారా కొనే పద్ధతి, బస్టాండ్లు ప్రయాణికులుండే చోట ఆపి అప్పటికప్పుడు వచ్చే వారిని ఎక్కిం చుకోకపోవటంతో ఆ ప్రయోగం దారుణంగా విఫలమైంది. దీనికి తోడు కొత్తగా కొనుగోలు చేసిన బస్సుల్లో తీవ్ర సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తు న్నాయి. దీంతో సమస్యలను పరిష్కరిం చేం దుకు దృష్టి సారించాల్సింది పోయి అదే పద్ధతిలో మరిన్ని బస్సులను కొత్త ప్రాంతా లకు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొత్త మార్గాల్లో కూడా.. ప్రస్తుతం హైదరాబాద్–వరంగల్, హైద రాబాద్–నిజామాబాద్ మార్గాల్లో 46 బస్సులు తిరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త గా హైదరాబాద్–గోదావరిఖని, హైదరా బాద్–కరీంనగర్ మధ్య కొత్త బస్సులను తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం తిరుగుతున్న బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం వరకు మాత్రమే ఉండటంతో తీవ్ర నష్టాలొస్తున్నాయి. పైగా వరంగల్ మార్గంలో ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద, నిజామాబాద్ మార్గంలో సుచిత్ర జంక్షన్ వద్ద టికెట్ల జారీని ప్రైవేటు ఏజెంట్లకు అప్పగించారు. అక్కడ సాధారణ బస్సులకు టికెట్లు ఇచ్చేందుకు ఆర్టీసీ కండక్టర్లుంటున్నా.. వజ్ర టికెట్ల జారీ బాధ్యతను మాత్రం ప్రైవేటు ఏజెంట్లకు ఇవ్వటంతో ఒక్కో టికెట్‌పై కమీషన్ రూపంలో ఆర్టీసీ రూ.18 వరకు వారికి చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా నష్టాలు మరింత పెరిగాయి. సీఎం ఆదేశించారని.. సీఎం ఆదేశంతో ప్రారంభమైన పథకం కావటంతో, నష్టాలొచ్చినా దాన్ని అలాగే కొనసాగించాలన్న ఆలో చనతో అధికారులున్నారు. కరీంనగర్, రామగుండం, గోదావరి ఖనిలకు కూడా బస్సులు నడపాలని ముఖ్య మంత్రే ఆదేశించారని అధికారులు చెబుతున్నారు. ఆయన ఆదేశాల మేరకే కొత్తగా ఆ పట్టణాలకు 16 బస్సులు తిప్పాలని నిర్ణయించారు. వీటికి కూడా ఆన్లైన్, యాప్ ద్వారా టికెట్లు బుక్ చేయించుకునే పద్ధతే అను సరించనున్నారు. నష్టాలను మరింతగా పెంచుకునే ఆలోచనతోనే అధికారులు ఉన్నట్టు కనిపిస్తోంది. టిమ్ ద్వారా టికెట్లు జారీ, ఎక్కడ ప్రయాణికులు ఉన్నా ఎక్కించుకోవటం, బస్టాండ్ల వద్దకు వెళ్లాలని ఆయా డిపోల మేనేజ ర్లు కోరుతున్నారు. ఇటీవల ఉన్నతా ధికారులతో జరిగిన సమీ క్షలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిం చారు. కానీ మార్పులు చేస్తే సీఎం ఆదేశాన్ని విస్మ రించినట్టవుతుందనే మార్పులు చేసేం దుకు అధికారులు జంకుతున్నారు. -
‘యాప్’తో కాపలా..
- దొంగలకు పోలీసుల సాంకేతిక ముకుతాడు – లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌తో ఇళ్లకు భద్రత – యాప్ ఉన్న ఇంట్లోకి దొంగలు పడితే పోలీస్ స్టేషన్లో సైరన్ – సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌కు యాప్ అనుసంధానం – ఇళ్ల దొంగతనాల నివారణకు యాప్‌ను డౌన్లోడ్ చేసుకొండి – జిల్లా పోలీసు శాఖ మరో కార్యక్రమానికి శ్రీకారం కర్నూలు: ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లాలనుకుంటున్నారా... దొంగల భయంతో ఇంత కాలం హడలి పోయారా... ఏళ్లపాటు కష్టపడి దాచుకున్న సొమ్మును దొంగలు దోచుకు పోతారన్న భయంతో ఇబ్బంది పడ్డారా... ఇకపై అలాంటి భయమేమీ అవసరం లేదు. మీరు చేయాల్సిందంతా ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళ్లేటపుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడమే తరువాయి... మీరు తిరిగి ఇంటికొచ్చే వరకు ఎన్ని రోజులైనా భద్రత కల్పించే సరికొత్త కార్యక్రమానికి జిల్లా పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఇళ్లకు భద్రత కల్పించి దొంగలకు ముకుతాడు వేసే కార్యక్రమం అమలులోకి తెస్తున్నారు. ముందుగా కర్నూలు, నంద్యాలలో లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌ను అమలు చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాల్లో అమలు చేసేందుకు కార్యచరణ రూపొందించారు. తాళం వేసిన ఇళ్ల సమాచారం అందిన వెంటనే ఇళ్లపై యాప్‌తో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి నిఘా వేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. అనుమానితులు ఇంట్లోకి వెళితే యాప్ కెమెరా ఫొటో స్నాప్ షాట్స్, వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌కు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడమెలా: ఆండ్రాయిడ్ ముబైల్‌లోని గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌తో ఇంటి అడ్రస్సుతో పాటు సెల్ నెంబరు పొందు పరిచి నివాసం ఉండే ఇంటి నుంచే రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీ నెంబరుతో యూజర్ ఐడీ వస్తుంది. ఊళ్లకు కానీ, యాత్రలకు కానీ, సొంత పనులపై బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు యూజర్ ఐడీతో యాప్‌లోని పోలీసు రిక్వెస్ట్ వాచ్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం అందించిన ఇళ్లపై పోలీసు రిక్వెస్ట్ వాచ్ ఉంటుంది. పలానా రోజు నుంచి పలానా రోజువరకు ఊళ్లకు వెళ్తున్నామని పోలీసులకు తెలియజేయాలి. వెళ్లే ముందు ఇంటి పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తే పోలీసులు సంబంధిత ఇంటికెళ్లి ఇంటి లోపల వైఫై కెమెరా మోడం అతికించి పెడతారు. అప్పటి నుంచి తిరిగి వచ్చే సమయం వరకు ఆ ఇళ్లు పోలీసు నిఘాలో ఉంటుంది. ఎవరైనా అనుమానితులు ఇంటిలోకి వెళితే తక్షణమే సంబంధిత స్టేషన్‌కు సమాచారం చేరుతుంది. బీట్ కానిస్టేబుల్ వెంటనే నిఘా ఉంచి దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఈ విధానం దోహదపడుతుంది. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ అమలుపై సంబంధిత టెక్నిషియన్లతో జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ఎస్పీ ఆకె రవికృష్ణ ముఖ్య అతిధిగా హాజరై యాప్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ షేక్షావలి, డీఎస్పీలు రమణమూర్తి, బాబూ ప్రసాద్, హరినాథరెడ్డి, సీఐ ములకన్న, ఈ–కాప్స్ ఇంచార్జి రాఘవరెడ్డి, ఎస్ఐలు, వివిధ పోలీస్స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. -
ఆంధ్రా బ్యాంకు నుంచి మొబైల్ యాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ తాజాగా తమ ఖాతాదారుల కోసం మొబైల్ యాప్ ఆవిష్కరించింది. ఏబీ తేజ్ (తొలి దశ) యాప్‌ను సెంటర్ ఫర్ టెలికమ్యూనికేషన్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వ్యవస్థాపకులు టి. హనుమాన్ చౌదరి ఆవిష్కరించినట్లు బ్యాంకు తెలిపింది. ఈ యాప్‌తో కస్టమర్లు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయానికి సత్వరం నమోదు చేసుకోవచ్చని, యాక్టివేట్ కూడా చేసుకోవచ్చని వివరించింది. అలాగే రోజంతా లావాదేవీలు జరిపేందుకు, మొబైల్.. డీటీహెచ్ మొదలైన వాటికి రీచార్జ్ చేసుకునేందుకు కూడా యాప్ ఉపయోగపడుతుందని బ్యాంకు తెలిపింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా ఆంధ్రా బ్యాంక్ పథకాలు, సర్వీసుల గురించి దీని ద్వారా తెలుసుకోవచ్చని వివరించింది. మరిన్ని ఫీచర్స్‌తో రెండో దశ యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు ఆంధ్రా బ్యాంకు తెలిపింది. -
ఈ యాప్ స్పెషల్ గా టెకీలకే..
బెంగళూరు : ఇటీవల ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న ఉద్యోగాల కోతతో చాలామంది టెకీలు జాబ్స్ ఎలా దొరుకుతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలకే ఐటీ ఇండస్ట్రి తిరోగమనంలో ఉంది, జాబ్ పోతే, మరో ఉద్యోగం ఎలా వెతుకోవాలా? అని సతమతమవుతున్నారు. టెకీల ఆందోళనను గమనించిన ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్, వారికి సాయం చేయడం కోసం ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకొచ్చింది. 'స్టార్టప్ జాబ్స్' పేరిట ఈ యాప్ ను లాంచ్ చేసింది. ఎక్కడ ఖాళీలున్నా ఈ యాప్ వెంటనే టెక్నాలజీ ప్రొఫిషనల్స్ కు అలర్ట్ లను పంపిస్తుంది. టెక్నాలజీ, సేల్స్, మార్కెటింగ్ ఆపరేషన్స్ లాంటి స్టార్టప్స్ లో ఎంపికచేసిన జాబ్ ఓపెనింగ్స్ ను ఈ యాప్ ఆఫర్ చేస్తోంది. అభ్యర్థులు ఈ యాప్ లో తమ వీడియో ప్రొఫైల్స్ అప్ లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. దీంతో కంపెనీలు అభ్యర్థులు ప్రొఫైల్స్ ను చూసి, ఇంటర్వ్యూకు పిలువవచ్చు. కంపెనీలు తమ ప్రొఫైల్స్ ను చూసిన తర్వాత వెంటనే స్టేటస్ అప్ డేట్లను కూడా అభ్యర్థులు పొందుతారు. బెంగళూరుకు చెందిన హెచ్ఆర్ టెక్ స్టార్టప్ ఈ-పోయిస్ సిస్టమ్స్ ఈ యాప్ ను అభివృద్ది చేసింది. లండన్ బిజినెస్ స్కూల్ అల్యూమినీ సచిన్ అగర్వాల్, బిశాన్ సింగ్ ఈ స్టార్టప్ ను స్థాపించారు. హెచ్‌పీ, సిమెన్స్, ఫ్లిప్ కార్ట్, ఫస్ట్ సోర్స్, ఓలా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్ దీనికి కస్టమర్లు. ఈ క్లిష్టతరమైన మార్కెట్లో తమకు నెప్పే ఉద్యోగాలను వెతుకోవడంలో ఈ యాప్ టెకీలకు ప్రత్యామ్నాయ మార్గమని 10వేల స్టార్టప్ కార్యక్రమ అధినేత కేఎస్ విశ్వనాథన్ చెప్పారు. -
సోలార్ వ్యాపారం ఇక ఈజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సోలార్ ఎనర్జీ రంగంలోకి ప్రవేశించాలని ఉన్నవారికి ఎలాంటి అనుభవం లేకున్నా వ్యాపారం చేసేందుకు వీలుగా ‘సన్‌ప్రో’ మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. సౌర విద్యుత్ రంగంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఫ్రేయర్ ఎనర్జీ భారత్‌లో తొలిసారిగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం 150 కంపెనీలు 40 రకాల పరికరాల వివరాలను యాప్‌లో జోడించాయి. ఔత్సాహిక వ్యాపారులు కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా సౌర విద్యుత్ పరిష్కారాలను అందించేందుకు వీలుగా యాప్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సౌరభ్ మర్దా తెలిపారు. సహ వ్యవస్థాపకురాలు రాధిక చౌదరితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 80 మంది వ్యాపారులు ఇప్పటి వరకు చేతులు కలిపారని, కంపెనీకి రూ.60 కోట్ల ఆర్డర్ బుక్ ఉందని చెప్పారు. ఫ్రేయర్ ఎనర్జీ 2016–17లో రూ.12 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్లు ఆశిస్తోంది. -
ఆర్‌యూలో మొబైల్ యాప్ విడుదల
కర్నూలు (ఆర్యూ) : రాయలసీమ యూనివర్సిటీలో మొబైల్ యాప్‌ను వైస్ చాన్సలర్ వై.నరసింహులు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీలో ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతున్న మహమ్మద్ ఇలియాస్.. స్పోకన్ ఇంగ్లిష్ యాప్ తయారు చేశారన్నారు. మున్ముందు ఈ యాప్‌ను ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఇలియాస్‌కు త్వరలో ల్యాప్‌టాప్‌ను బహుకరిస్తామన్నారు. ఇలియాస్ మాట్లాడుతూ.. ఆత్మకూరుకు చెందిన తన తండ్రి బాషా లారీ డ్రైవర్ అని, తల్లి కమ్రున్బి గృహిణి అన్నారు. తనకు సహకరించిన అధ్యాపకులు రవికుమార్, జేమియాలకు కృతజ్ఞతలు తెలిపారు. -
103 నగరాల్లో నీట్ నిర్వహిస్తాం
న్యూఢిల్లీ: విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేందుకు నేషనల్ ఎంట్రన్స్ కం ఎలిజిబిలిటీ టెస్ట్(నీట్)ను దేశవ్యాప్తంగా 103 నగరాల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పరీక్ష రాసే దాదాపు 12 లక్షల మంది అభ్యర్థులు తేలిగ్గా తమ సమీపంలోని పరీక్ష కేంద్రాన్ని తెలుసుకునేందుకు మోబైల్ యాప్‌ను కూడా అభివృద్ధి చేసినట్లు మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ తెలిపారు. ఈ పరీక్షను ప్రాంతీయ భాషల్లో కూడా రాసే వీలుకల్పిస్తున్నట్లు వైద్య శాఖ కేంద్ర మంత్రి జేపీ నడ్డా వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్‌ను నిర్వహిస్తారు. -
హోటల్ గదుల బుకింగ్ స్టార్టప్ ‘రూమ్స్‌టునైట్’ మూసివేత
న్యూఢిల్లీ: చివరి నిమిషంలో హోటల్ గదుల బుకింగ్‌కు వీలు కల్పించే మొబైల్ యాప్ ‘రూమ్స్‌టునైట్’ కార్యకలాపాలు అర్థంతరంగా నిలిచిపోయాయి. 1.5 కోట్ల డాలర్ల (రూ.100 కోట్లు) నిధుల సమీకరణలో విఫలం కావడం, ఉన్న పరిమిత నిధులు కాస్తా ఆవిరైపోవడంతో సంస్థ తన కార్యకలాపాలను నిలిపేసింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో సంస్థ యాప్ అందుబాటులో లేదు. సంస్థ వెబ్సైట్ ఓపెన్ చేసినా... బుకింగ్‌కు సంబంధించిన ఫంక్షన్లు పనిచేయడం లేదు. బెంగళూరు కేంద్రంగా రూమ్స్‌టునైట్ కార్యకలాపాలు 2015లో ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా 325 ప్రాంతాల్లోని 4,000 హోటళ్లు కంపెనీ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. సీఈఓగా దీని వ్యవస్థాపకుడు సురేష్జాన్ వ్యవహరిస్తున్నారు. 90–95 మంది ఉద్యోగులను ఐడీఎస్ నెక్స్›్ట బిజినెస్ సొల్యూషన్స్ అనే మరో కంపెనీకి బదలాయించారు. -
29 నుంచి టీటీడీ మొబైల్యాప్
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను భక్తులకు మరింత చేరువ చేసేందుకు మొబైల్యాప్ రూపొందించినట్టు టీటీడీ ఈవో డాక్టర్ డి.సాంబశివరావు గురువా రం ‘సాక్షి’కి తెలిపారు. ఈనెల 29న హేమలంబి నామ ఉగాది పర్వదినం సందర్భంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. టీసీఎస్ సహకారంతో టీటీడీ రూపొందించిన ఈ యాప్‌కు సరైన పేరు సూచించాలని భక్తుల ను ఈవో కోరారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోపు onlineservices @tirumala. org వెబ్‌సైట్‌కు, వాట్సాప్ నంబరు 93993 99399కు తెలియజేయాలని ఈవో కోరారు. ఈ నెల 29న శ్రీవారి ఆలయంలో ఉగాదిని పురస్క రించుకుని ఆస్థానం నిర్వహించనున్నారు. -
పరీక్ష కేంద్రాల గుర్తింపునకు సీబీఎస్ఈ యాప్
న్యూఢిల్లీ: పరీక్షలు సమీస్తున్న వేళ విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలను గుర్తించడానికి సాయం చేసేలా సీబీఎస్ఈ ఓ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ‘ఎగ్జామ్ లొకేటర్’గా పిలిచే ఈ యాప్ రోల్‌నంబర్ ఆధారంగా విద్యార్థి తన పరీక్ష కేంద్రం ఎక్కడో సులువుగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా విద్యార్థి... పరీక్ష కేంద్రం చిరునామా, చిత్రాలు, జియోలొకేషన్లను సులువుగా గుర్తించి, అక్కడికి ఎలా చేరాలో తెలుసుకుంటాడని సీబీఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు మొబైల్ నంబర్ ద్వారా నమోదుచేసుకుంటే వన్ టైం పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. దీని ద్వారా విద్యార్థి యాప్‌లోకి లాగిన్ కావాలి. -
జీఎస్టీపై కేంద్రం మొబైల్ యాప్
న్యూఢిల్లీ: త్వరలో అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేకంగా మొబైల్ యాప్ ఆవిష్కరించింది. జీఎస్టీలో కొంగొత్త మార్పులు, చేర్పులకు సంబంధించిన అప్డేట్ సమాచారాన్ని పన్ను చెల్లింపుదారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వార్ తెలిపారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ డివైజ్‌లకు ఇది అందుబాటులో ఉంటుందని, తర్వాత ఐఓఎస్ వెర్షన్ కూడా ప్రవేశపెడతామని ఆయన వివరించారు. జీఎస్టీ విధానానికి మారేందుకు మార్గదర్శకాలు, ముసాయిదా చట్టం, రిజిస్ట్రేషన్..రిటర్నులు.. రీఫండ్ మొదలైన వివరాలన్నీ ఈ యాప్‌లో ఉంటాయి. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ తదితర పరోక్ష పన్నుల స్థానంలో ప్రవేశపెట్టనున్న జీఎస్టీని జులై 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య తుది చర్చలు జరుగుతున్నాయని గాంగ్వార్ వివరించారు. -
శివరాత్రి జాతరకు ముస్తాబైన వేములవాడ
-
నేటి నుంచి ఎములాడ జాతర
తొలిసారి గుడి సమాచారం కోసం మొబైల్ యాప్ సాక్షి, సిరిసిల్ల: ప్రముఖ శైవక్షేత్రం, దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామి దేవస్థానం శివరాత్రి మహా జాతరకు ముస్తాబైంది. ఈనెల 23 నుంచి 25 వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి దాదాపు ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడ్డాక వచ్చిన తొలిసారిగా వచ్చిన శివ రాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు ఉత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కోసం ప్రత్యే కంగా భీమేశ్వరాలయం పక్కన సాంస్కృతిక కళాప్రదర్శనలు నిర్వహించనున్నారు. అందుబాటులోకి మొబైల్ యాప్.. శ్రీ రాజరాజేశ్వరస్వామి భక్తుల కోసం తొలి సారి ‘వేములవాడ మహాశివరా త్రి’మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. టోల్‌ఫ్రీ నంబర్ 18004252037ను ఏర్పాటు చేశారు. -
పన్ను చెల్లింపులు ఇక ‘స్మార్ట్’
• నిమిషాల్లో పాన్ నంబర్ • త్వరలో ఐటీ శాఖ మొబైల్ యాప్... న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల్లోనే పాన్ నంబర్ అందించే విధంగా ఆదాయ పన్ను శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ తయారీపై కసరత్తు చేస్తోంది. ఆన్లైన్లో సత్వరం పన్ను చెల్లింపులు, రిటర్నుల ట్రాకింగ్ మొదలైన సదుపాయాలు కూడా ఈ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ ప్రాథమిక స్థాయిలోనే ఉందని, ఆర్థిక శాఖ అనుమతులు పొందిన తర్వాత పైలట్ ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరింత మందిని పన్నుల పరిధిలోకి తెచ్చే దిశగా ఆధార్ ఆధారంగా నిమిషాల్లో పాన్ నంబర్ జారీ చేయాలని యోచిస్తున్నట్లు వివరించాయి. ఇప్పటిదాకా 111 కోట్ల మేర ఆధార్ నంబర్లు జారీ అయినట్లు అంచనా. ఆధార్ నంబర్ ప్రస్తుతం కొత్త సిమ్ కార్డులు తీసుకునేందుకు, బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, సబ్సిడీల బదలాయింపు మొదలైన వాటి కోసం ఉపయోగపడుతోంది. గణాంకాల ప్రకారం ఏటా 2.5 కోట్ల మంది ప్రజలు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పైగా పాన్ కార్డుహోల్డర్లు ఉన్నారు. రూ. 50,000కు మించిన నగదు విత్‌డ్రాయల్‌కు, రూ.2 లక్షలకు మించిన నగదు కొనుగోళ్ల లావాదేవీలకు ప్రభుత్వం పాన్ నంబర్ తప్పనిసరి చేసింది. మరిన్ని భద్రతా ఫీచర్స్ గల కొత్త పాన్ కార్డులను ఈ ఏడాది జనవరి 1 నుంచే ఐటీ శాఖ జారీ చేయడం ప్రారంభించింది. ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు.. అసెసీల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ–నివారణ్ సదుపాయాన్ని ఆదాయ పన్ను శాఖ దేశవ్యాప్తంగా 60 ఆయకర్ సంపర్క్ కేంద్రాల్లో (ఆస్క్) ప్రారంభించింది. త్వరలో మరో 100 ఆస్క్లలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు అధికారి తెలిపారు. ఇందుకోసం చాలా సులభతరమైన ఒక్క పేజీ ఫారం నింపాల్సి ఉంటుంది. ఫిర్యాదును ట్రాక్ చేసేందుకు అధికారులు ప్రత్యేక నంబరు కేటాయిస్తారు. -
ఉగాది నాటికి టీటీడీ యాప్
సాక్షి, తిరుమల: భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) త్వరలో శ్రీవారి పేరుతో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకుగాను టీసీఎస్ సంస్థతో దేవస్థానం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యాప్‌ను ఉగాది నాటికి అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు బుధవారం తెలిపారు. తిరుమలలో బస, దర్శనం, సేవా టికెట్లు, లడ్డూ ప్రసాదం, ఈ– హుండీ, ఈ–డొనేషన్, డీమ్యాట్ ఖాతాలతో పాటు భక్తులకు అవసరమయ్యే సేవలు ఈ యాప్‌లో అందుబాటులోకి వస్తాయని వివరించారు. యాప్ అందుబాటులోకి వస్తే టీటీడీ సేవలు భక్తుల చేతుల్లోకి చేరుతాయని, నెట్ సెంటర్లకు వెళ్లి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఇక ఉండదని అన్నారు. ఇంటర్నెట్ ద్వారా భక్తులకు అందించే సౌకర్యాలను విస్తరించనున్నట్లు చెప్పారు. ఇంటర్నెట్ అడ్వాన్స్ రిజర్వేషన్ కోటాలో తిరుమలలోని గదుల సంఖ్యను పెంచే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఇక కొత్తగా రూ.300 టికెట్లతో పాటే ఒక్కొక్కరు రూ.50 చెల్లించి రెండు లడ్డూలు కూడా ఆన్లైన్లోనే కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఇంటర్నెట్లో రూ.300, రూ.50 సుదర్శనం టికెట్ల కోటాను కూడా త్వరలో పెంచుతామని వెల్లడించారు. 2016లో శ్రీవారికి హుండీ రూపంలో రూ.1,018 కోట్ల ఆదాయం లభించిందని, ఈ–హుండీ ద్వారా నెలకు రూ.కోటి పైబడి విరాళాలను భక్తులు సమర్పిస్తున్నట్లు చెప్పారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్)లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పేరుతో ఉన్న డీమ్యాట్ ఖాతా సంఖ్య 1601010000384828 ద్వారా షేర్లను సర్టిఫికెట్ల రూపంలో భక్తులు సమర్పిస్తున్నట్లు వివరించారు.