సాక్షి,సిటీబ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే ర్యాలీలు, సమావేశాలు, ప్రదర్శనలు, మైక్‌సెట్, వాహనాలు, హోర్డింగుల వంటి వినియోగానికి సంబంధిత ఎన్నికల అధికారులు, పోలీసుల నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే. ఇప్పటి వరకు అనుమతులను రాతపూర్వకంగా ఇచ్చేవారు. అధికారులు కొన్ని కమిటీల ఏర్పాటు ద్వారా అనుమతులు ఇచ్చేవారు. ఈసారి ఎన్నికల్లో అంతా ‘సువిధ క్యాండిడేట్’ యాప్ ద్వారానే సాగుతోంది. అనుమతుల కోసం అభ్యర్థులు, పార్టీలు 48 గంటల ముందుగా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. సంబంధిత అధికారులు అనుమతులు ఇస్తారు. యాప్ ద్వారా ఎలాంటి ఆరోపణలు, వివాదాలు, వివక్షకు తావులేకుండా అందరికీ ఒకే విధమైన సేవలను ఈసీఐ అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment