
పింఛను సెటిల్‌మెంట్‌కు మొబైల్ యాప్
న్యూఢిల్లీ: ఇకపై పదవీ విరమణ పొందిన కేంద్రప్రభుత్వ ఉద్యోగులంతా మొబైల్‌లో పింఛన్ వివరాలు తెల్సుకోవచ్చు. రిటైరయ్యాక రావాల్సిన పింఛనుసెటిల్‌మెంట్ కోసం కేంద్రం బుధవారం మొబైల్ యాప్‌ను ప్రారంభించ నుంది.
కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఈ యాప్ ద్వారా చేయవచ్చు. ఇలాంటి వాటి కోసం ‘పెన్షనర్స్ పోర్టల్’ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇకపై మొబైల్ ద్వారానే సేవలు పొందేందుకు, పింఛను స్థితిగతులను, రావాల్సిన పింఛన్ మొత్తాన్ని తెలుసుకునేందుకు యాప్‌ను ప్రారంభిస్తున్నారు. ఉద్యోగుల సేవలకుగాను ‘అనుభవ్’పేరుతో రిటైరైన వారికి పురస్కారం ఇవ్వనున్నారు.