pension
-
ఆ రూ.200 కోట్లు ఎటుపోయాయి?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అధిక పెన్షన్ కాంట్రిబ్యూషన్ సొమ్ముపై గందరగోళం నెలకొంది. ఉద్యోగులు చెల్లించిన సుమారు రూ.125 కోట్లు, వాటిపై వడ్డీ కలిపి.. మొత్తం రూ.200 కోట్ల మొత్తానికి లెక్కతేలకుండా పోయింది. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ స్కీమ్ కోసం పదేళ్ల కింద ఉద్యోగులు చెల్లించిన సొమ్ము ఏమైందో తెలియడం లేదని.. ఇప్పుడు అధిక పెన్షన్ కోసం మొదటి నుంచీ లెక్కేసి మొత్తం డబ్బులు కట్టాలంటున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యవహారాన్ని పరిష్కరించాల్సిన ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ పీఎఫ్ బకాయిలు సకాలంలో చెల్లించకపోవటం, పీఎఫ్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకోవటం, విషయం కోర్టు వరకు వెళ్లటం, అయినా బకాయిలు చెల్లించక ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం దాకా ఇప్పటికే ఎన్నో ఆందోళనకర పరిణామాలు జరిగాయి. దానికితోడు అధిక పెన్షన్ల వ్యవహారం మరో వివాదానికి కారణమవుతోంది.అసలేం జరిగింది?ఉద్యోగులకు అధిక పెన్షన్ కోసం 1995 నవంబరులో భవిష్యనిధి సంస్థ ఆప్షన్లను కోరింది. భవిష్య నిధి వ్యవహారాల కోసం ఆర్టీసీలో ప్రత్యేకంగా పీఎఫ్ ట్రస్టు ఉంటుంది. ఆ ట్రస్టు ఉమ్మడి ఆర్టీసీ ఉద్యోగుల నుంచి హయ్యర్ పెన్షన్ కాంట్రిబ్యూషన్‌ను వసూలు చేసి ఈపీఎఫ్ఓకు జమ చేసింది. 2014 ఆగస్టు వరకు ఇది కొనసాగింది. మొత్తంగా 16,307 మంది ఇలా హయ్యర్ పెన్షన్ కోసం వారి వేతనాల నుంచి 8.33 శాతం చొప్పున కాంట్రి బ్యూషన్ చెల్లించారు. అందులో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు 7,373 మంది ఉన్నారు. వారు హ య్యర్ పెన్షన్‌కోసం చెల్లించిన మొత్తం సుమారు రూ.125 కోట్ల వరకు ఉంది. కానీ సాంకేతిక కారణాలతో వారి ఆప్షన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీనితో అప్పటివరకు వారు చెల్లించిన కాంట్రిబ్యూషన్ సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉన్నా.. ఈపీఎఫ్ఓ వద్దే ఉండిపోయింది. పీఎఫ్ వ్యవహారాలు చూసేందుకు ఆర్టీసీలో ప్రత్యేకంగా ట్రస్టు ఉన్నా.. అది పట్టించుకోలేదు. ఉద్యోగులు చెల్లించిన సొమ్ము రూ.125 కోట్లకు వడ్డీ కలిపి రూ.200 కోట్ల వరకు అవుతుందని.. ఆ సొమ్ము లెక్క తేలడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.ఇప్పుడూ పూర్తిగా కట్టాలంటూ నోటీసులతో..సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ఓ గతేడాది మరోసారి హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్లు తీసుకుంది. అప్పట్లో తిరస్కరణకు గురైనవారిలో కొందరు రిటైరవగా.. మిగతావారిలో చాలా వరకు హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్లు ఇచ్చారు. ఈసారి వేతనాల నుంచి 8.33 శాతం కాంట్రిబ్యూషన్తోపాటు ఎంప్లాయీస్ హయ్యర్ పెన్షన్ స్కీం నిర్వహణ చార్జీల పేరిట మరో 1.16 శాతం మొత్తాన్ని చెల్లించాలని ఈపీఎఫ్ఓ సూచించింది. స్కీం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం సొమ్మును చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది. గతంలో ఆప్షన్ రిజెక్ట్ అయి ఇప్పుడు మళ్లీ ఆప్షన్ ఇచ్చినవారు.. అప్పట్లో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి, మిగతా మొత్తాన్ని వసూలు చేసుకోవాలని అభ్యర్థించారు. కానీ స్పందన లేదు. ఈ విషయాన్ని పీఎఫ్ ట్రస్టు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు..హయ్యర్ పెన్షన్ ఆప్షన్లను తిరస్కరించిన వెంటనే ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని వాపసు చేయాల్సి ఉంది. కానీ ఎన్ని సార్లు కోరినా ఎవరూ పట్టించుకోలేదు. సమస్య ఎక్కడుందో చెప్పేవారు కూడా లేకపోవటం విడ్డూరం. ఈ విషయంలో చొరవ చూపాల్సిన ఆర్టీసీ మిన్నకుండిపోతోంది. ఇప్పటికైనా దీన్ని పరిష్కరించి 7,373 మంది ఉద్యోగులకు ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉంది – ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావుఏపీలోనూ ఇదే సమస్య..ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి 8,934 మంది ఉద్యోగులు కూడా ఇదే తరహాలో ఎదు రుచూస్తున్నారు. వారు అప్పట్లో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి తాజా కాంట్రిబ్యూషన్‌ను లెక్కించాల్సి ఉంది. దీన్ని ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టు సీరియస్‌గా తీసుకుని కొలిక్కి తేవాల్సి ఉంది– ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత దామోదర్వెంకట్రావు.. ప్రస్తుతం ఆర్టీసీలో డిపో క్లర్కు. 1996లో ఆయన కండక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో.. హయ్యర్ పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓకు ఆప్షన్ ఇచ్చారు. కాంట్రిబ్యూషన్‌గా రూ.2.60 లక్షలు చెల్లించారు. ఆయన ఆప్షన్ రిజెక్ట్ అయింది. కానీ ఈ విషయం వెంకట్రావుకు తెలియలేదు. సమాచారం ఇవ్వాల్సిన ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పట్టించుకోలేదు. తాజాగా 2022లో ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ కోసం మళ్లీ ఆప్షన్ స్వీకరించింది.దీనికి వెంకట్రావు దరఖాస్తు చేసుకోగా.. 1996 నాటి నుంచి ఇప్పటివరకు కలిపి కాంట్రిబ్యూషన్ రూ.4.80 లక్షలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ నోటీసు ఇచ్చింది. ఇదేమిటని ఆయన ఆరా తీయగా.. 1996లోనే తన దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలిసింది. అప్పట్లో చెల్లించిన మొత్తం మినహాయించి మిగతాది చెల్లిస్తానని ఆయన చెబితే.. మొత్తం చెల్లించాల్సిందేనని ఈపీఎఫ్ఓ నుంచి సమాధానం వచ్చింది. మరి నాడు చెల్లించిన సొమ్ము ఏమైందో అంతుపట్టని పరిస్థితి. తెలంగాణ ఆర్టీసీలో వేల మంది ఉద్యోగుల సమస్య ఇది.. -
చిక్కిపోతున్న పింఛన్లు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య నెలనెలకూ చిక్కిపోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఐదు నెలల్లోనే ఏకంగా 1,35,690 మందికి పింఛన్ ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు.. ఈ ఏడాది మేలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా, తాజాగా నవంబర్ 1న (శుక్రవారం) 64,14,174 మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేసేందుకు డబ్బు విడుదల చేశారు. గత ఐదు నెలల్లో కొత్తగా ఒక్కరికి కూడా ప్రభుత్వం సామాజిక పింఛన్లు మంజూరు చేయలేదు. పైగా ఏళ్ల తరబడి ప్రతి నెలా పింఛను తీసుకుంటున్న వారికి కోతలు పెట్టేందుకు ఎక్కడలేని ఉత్సాహం కనబరుస్తోంది. ఇక అక్టోబర్‌లో జరిగిన పంపిణీకి, ప్రస్తుత నెలలో జరుగుతున్న పంపిణీ మధ్య నెల రోజుల వ్యవధిలోనే పింఛన్ల సంఖ్య 24,710కి తగ్గిపోయాయి. సాధారణంగా లబ్ధిదారుల్లో మరణాలు ఎంత ఎక్కువగా ఉన్నాయనుకున్నా, ప్రతినెలా 10–15 వేలకు మించవని గణాంకాలు చెబుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఎడాపెడా పింఛన్ల తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నారు. పంపిణీలో ఆధిపత్యం కోసం గొడవలురాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రతి నెలా అవ్వాతాతలకు అందజేసే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రాజకీయ రంగు పులిమింది. ఈ పంపిణీ పూర్తిగా తమ కనుసన్నల్లోనే జరగాలని టీడీపీ నాయకులు రాష్ట్రంలో అత్యధిక చోట్ల స్థానికంగా పింఛన్లను పంపిణీ చేసే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని హెచ్చరిస్తూ, పంపిణీ చేసే ఉద్యోగుల వెంట లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పెత్తనం చెలాయిస్తున్నారు. కూటమిలోని టీడీపీ–జనసేన–బీజేపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. నవంబరు 1 (శుక్రవారం) పింఛన్ల పంపిణీ జరగాల్సి ఉండగా, ఒకరోజు ముందు గురువారం దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతలపాడులో టీడీపీ–జనసేన నాయకులు ఎవరికి వారు కొన్ని ప్రత్యేకించిన ఏరియాల్లో పింఛను పంపిణీ తమ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరగాలంటూ పట్టుబట్టి, ఘర్షణలు పడటం గమనార్హం. సిబ్బందికి షోకాజ్ నోటీసులువలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పుకునేందుకు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఉదయం 6.15 వరకు పింఛన్ల పంపిణీ ప్రారంభించలేదంటూ ఒక్క మచిలీపట్నం పరిధిలోనే 70 మంది వార్డు సచివాలయాల ఉద్యోగులకు నగర కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో 14 మందికి, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట మండలంలో 28 మందికి, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 15 మందికి, బాపట్ల జిల్లా అద్దంకిలో ఆరుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్టు తెలిపారు. ఇవి కేవలం తమకు అందిన సమాచారం మేరకు మాత్రమేనని, ఇంకా పలు ప్రాంతాల్లో ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయని వాపోయారు. ఒక్క జూలై నెలలోనే దాదాపు 4 వేల మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారని.. ఇలా ప్రతి నెలా జారీ చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఇదిలా ఉండగా, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామానికి చెందిన నత్తల వజ్రమ్మ (62) కావలిలో తన కూతురు శిరీష (33)వద్దకు వెళ్లింది. 1వ తేదీ పింఛను తీసుకునేందుకు కూతురితో కలిసి వస్తూ.. కావలిలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లీ కూతుళ్లు ఇద్దరూ మృతి చెందారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో కుప్పం–3 సచివాలయం వద్దకు వృద్ధులను పిలిపించి పింఛన్లు పంపిణీ చేశారు. వరదయ్యపాళెం మండలం ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న అనిత.. చిన్నపాండూరు సచివాలయ పరిధిలోని యానాదివెట్టు, రాచర్ల గ్రామాల్లో ఫించన్లు పంపిణీ చేశారు. సమస్యల నడుమ పంపిణీనవంబరు 1వ తేదీ (శుక్రవారం) సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.76 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరిగినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. అయితే పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగులు సర్వర్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంపిణీ సమయంలో లబ్ధిదారులకు డబ్బులు అందజేసిన అనంతరం ఆయా లబ్ధిదారుల నుంచి వేలి ముద్రలు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య సర్వర్ పనిచేయక పోవడంతో దాదాపు రెండు గంటల పాటు పంపిణీ నిలిచిపోయింది. మరోవైపు.. వేలిముద్ర నమోదుకు ఉపయోగించే స్కానర్లకు సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్కు ప్రభుత్వం డబ్బులు చెల్లించని కారణంగా అవి పని చేయలేదు. అప్పటికప్పుడు వాటి స్థానంలో వేరే స్కానర్లు మార్చాల్సి వచ్చింది. దీంతో పలు ప్రాంతాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెట్ల కింద, సచివాలయాల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రాణం మీదకు తెచ్చిన పింఛన్కాశీబుగ్గ: పింఛను పంపిణీ ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చింది. శ్రీకాకుళం జిల్లా, పలాసలోని, వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో బైనపల్లి దానమ్మ వితంతువు పింఛన్ కోసం మండుటెండలో నిరీక్షించింది. ఉదయం ఏడు గంటల లోపల నామమాత్రంగా పనిచేసిన సర్వర్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పింఛన్ల పంపిణీ మళ్లీ మధ్యాహ్నానికి గానీ ప్రారంభం కాలేదు. అప్పటి వరకూ నిరీక్షించిన దానమ్మ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గతంలో పింఛన్ ఇంటికి వచ్చి అందించేవారని, ఇప్పుడు ఎండలో పడిగాపులు కాయాల్సి వస్తోందని పింఛనుదారులు వాపోతున్నారు. -
Telangana: పింఛన్లు పెంచరా? మాటకు కట్టుబడరా?
అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రూ.2 వేలు నెలవారీ పింఛన్ తీసుకుంటున్న వారందరికీ రూ.4 వేలు ఇస్తామనీ, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామనీ హామీ ఇచ్చారు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా పెన్షన్ పెంచి ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా పెంచలేదు. వృద్ధులు, ఒంటరివాళ్లు, వికలాంగులు పలు కారణాలతో సొంతంగా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఫించన్ వల్ల వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా జీవితం గడుపగలుగుతారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి హామీ ఇచ్చినట్టు పింఛన్ డబ్బులు పెంచితే వాళ్లు నిశ్చింతగా బతుకుతారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయం.మాయమాటల కాంగ్రెస్ ప్రభుత్వం మాటతప్పి మరోమారు ప్రజలను మోసపుచ్చింది. కాంగ్రెస్ పాలనలో మాటలకూ, చేతలకూ పొంతన ఉండదని ఇంకోమారు రుజువయింది. ‘‘వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు అందరికీ పెన్షన్... నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన్రు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా పెన్షన్ పెంచి ఇస్తాం...’’ అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 జూలై నెలలో స్వయంగా పలికిన పలుకులివి! ఈయనే ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... ‘‘ఒక్క నెల ఆగితే పెన్షన్ డబుల్ అయితది. డిసెంబర్ తొమ్మిదినాడు ఇందిరమ్మ రాజ్యంలో మీ ఖాతాలో రూ.4 వేలు పడుతాయి’’ అని కోతలు కోశారు. అయితే, అధికారంలోకి వచ్చి 10 నెలలైనా కాంగ్రెస్ బడా నేతలు ఇచ్చిన హామీలు ఆచరణలోకి రాలేదు.అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 42 పేజీల మేనిఫెస్టోలోని చాప్టర్–2లో పేర్కొన్న ఆరో గ్యారెంటీలో ఏం చెప్పారు? ఇంతకుముందు రూ.2 వేలు నెలవారీ పింఛన్ తీసుకుంటున్న వారందరికీ తాము అధికారంలోకి వచ్చాక చేయూత కింద రూ.4 వేలు ఇస్తామనీ, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామనీ రాతపూర్వకంగా చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా... పెంచలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ లబ్ధిదారులకు ద్రోహం చేస్తున్నారు. పింఛను పెంపు లెక్కను పరిగణనలోకి తీసుకుంటే 10 నెలలుగా ప్రతి అవ్వ, తాతకు, దివ్యాంగుడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 వేల రూపాయిలు బాకీ పడిందని చెప్పవచ్చు. ఉలుకూ లేదు పలుకూ లేదురాష్ట్రంలో ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారితో పాటు అదనపు వ్యక్తి ఉంటే, ఇంట్లో ఇద్దరు వృద్ధులకూ పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు చెప్పారు. దీంతో పది లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతారనీ, ఈ లెక్కన దాదాపు 55 లక్షల మందికి కాంగ్రెస్ పెన్షన్ అందిస్తుందనీ గొప్పలు చెప్పారు. ఇప్పుడు దీని గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. రెండు మూడు రోజుల్లో ఆసరా పింఛన్ దారులకు తీపి కబురు అందిస్తాననీ, ఆ బాధ్యత తనదేననీ ఈ ఏడాది జూన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పి నెలలు గడుస్తున్నా ఇప్పుడు దీనిపై నోరు మెదపడం లేదు! ఇక, ఇతర మంత్రుల సంగతి సరేసరి... ఉలుకూ, పలుకూ లేదు!వృద్ధులు, ఒంటరివాళ్లు, వికలాంగులు పలు కారణాలతో సొంతంగా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ప్రభుత్వం అందించే పింఛన్ వల్ల వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా బతుకుతూ తృప్తిగా ఉంటారు. ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లతో లబ్ధిదారులు గౌరవంగా జీవించడమే కాకుండా కష్టమైన పనులు చేయాల్సిన అవసరం లేకుండా జీవితం గడుపగలుగుతారు. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం వారికి హామీ ఇచ్చినట్టు పింఛన్ డబ్బులు పెంచితే వాళ్లు నిశ్చింతగా బతుకుతారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయం.మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రూ.200 పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకొంది. 2014 ఎన్నికల సమయంలో పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్... ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పింఛన్లను రూ.200 నుంచి రూ. 1,000, దివ్యాంగులకు రూ.500 నుంచి 1,500 రూపాయలకు పెంచారు. 2018 ఎన్నికల సమయంలో మరోసారి పింఛన్లు పెంచుతామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే వృద్ధులు, వితంతువులు, ఇతర కార్మికుల పింఛన్లను రూ.1,000 నుంచి రూ. 2,016, దివ్యాంగులకు రూ.1,500 నుంచి 3,016 రూపాయలకు పెంచింది. మారుతున్న కాలమాన పరిస్థితులు, వయసుతో వచ్చే వివిధ ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని 2020 మార్చిలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ అర్హత వయసును 65 ఏళ్ళ నుండి 57 ఏళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించడంతో వృద్ధాప్య కేటగిరిలో అదనంగా సుమారు 8 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీంతో పాటు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి మరో లక్ష మందిని ఆసరాకు జోడించింది. దీంతో పథకంలో లబ్ధిదారుల సంఖ్య దాదాపు 45 లక్షలు దాటింది. అయితే కాలక్రమేణ పింఛన్ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా కొత్తవారికి పింఛన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం చొరవ తీసుకోలేదు. సమయానికి సదర్ క్యాంపులు నిర్వహించకపోవడం వల్ల కొత్తగా దివ్యాంగులుగా మారిన వారు చేయూత పథకంలో చేరడం కష్టంగా మారింది. ఇవన్నీ గడిచిన పది నెలల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనతలుగా చెప్పుకోవచ్చు.మంచిర్యాలలో 2023 జూన్ 9న జరిగిన సభలో దివ్యాంగుల పింఛన్‌ను రూ.3,016 నుంచి రూ.4,106కు పెంచుతున్నట్టు కేసీఆర్ ప్రకటించిన తర్వాతి నెల నుండే అవి అమలులోకి వచ్చాయి. ఇది బీఆర్ఎస్ విశ్వసనీయత! దేశంలోనే బీడీ కార్మికులకు సైతం ఆసరా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది బీఆర్ఎస్కు పేదల పట్ల ఉన్న నిబద్ధత! కేవలం వృద్ధులే కాకుండా చేనేత కార్మికులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, వికలాంగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇలా అందరికీ కేసీఆర్ ‘ఆసరా’గా నిలిచిన సంగతిని కాంగ్రెస్ కప్పిపెట్టవచ్చుగానీ, బీఆర్ఎస్ తీసుకొచ్చిన మార్పు లబ్ధిదారుల మనసుల్లో ఇప్పటికీ ఉంది, ఎన్నటికీ చెరిగిపోదు. బాకీ చెల్లించాలిఆసరా పింఛన్ పేరును చేయూత పింఛన్‌గా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తను ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినట్టు పింఛన్ పెంచి ఇవ్వడం లేదు. అసలు సంగతి ఇలా ఉంటే, కొసరుగా... కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో చేయూత పింఛన్ దారులకు రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కూడా అందిస్తామనీ, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామనీ హామీ ఇచ్చారు. కానీ, ఏ హామీనీ నెరవేర్చకుండా, అభాగ్యుల పింఛన్ డబ్బులను దారి మళ్లించి, వారిని రేవంత్ రెడ్డి నట్టేట ముంచారు. ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలను, సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయాలి. లేదంటే, అది తీవ్ర అసమానతలకు దారి తీస్తుంది. కాబట్టి, హామీ ఇచ్చినట్టు దివ్యాంగుల పెన్షన్ వెంటనే రూ.4,016 నుంచి రూ. 6 వేలకు పెంచాలి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులకు రూ. 2,016 నుంచి రూ. 4 వేలకు పెంచాలి. పింఛన్ డబ్బులను ప్రతి నెలా 5వ తేదీలోపే ఇవ్వాలి. పది నెలలుగా బాకీ పడ్డ పింఛన్ పైసలన్నీ వెంటనే చెల్లించాలి. ఈ డిమాండ్లు సాధించేవరకు లబ్ధిదారుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుంది.-వ్యాసకర్త మాజీ మంత్రి, ఎమ్మెల్యే-టి.హరీశ్ రావు -
చింతమనేని హుకుం.. దెందులూరు టీడీపీ, జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో..జనసేన నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు.గ్రామాల్లో కేవలం టీడీపీ నేతలే పెన్షన్లు పంచుతారంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హుకుం జారీ చేశారు. ప్రభాకర్ ఆదేశాలతో ఆగ్రహానికి గురైన జనసేన నేతలు సైతం తామూ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటామని తేల్చి చెప్పారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.జనసేన నేతలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. పిడుగులు గుద్దులు గుద్దుతూ రెచ్చిపోయారు. ఈ ఘటనలో జనసేన పైడి చింత పాడు అధ్యక్షుడు మౌరు రామ కృష్ణతో పాటు పలువురికి గాయాలయ్యాయి. రామకృష్ణను అత్యవసర చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రోడ్డెక్కిన దివ్యాంగులు
మహారాణిపేట: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తరలివచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా ఇంకా ఈ హామీ అమలుకు నోచుకోలేదని, ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 85 శాతం అంగవైకల్యం ఉన్నవారికి కూడా పెంచిన పెన్షన్ అమలు చేయడంలేదని ఆక్షేపించారు.వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తుల డేవిడ్‌రాజు, జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు, మహిళా ఉపాధ్యక్షురాలు ఎస్.మల్లేశ్వరి ఆధ్వర్యాన సోమవారం పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఇక్కడికి తరలివచ్చారు. తాము వివిధ సమస్యలతో సతమతమవుతున్నామని, వాటి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని అక్కిరెడ్డి అప్పారావు అన్నారు. పెంచిన పెన్షన్ అమలుకోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని.. పలు జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి దివ్యాంగులను అర్హులుగా గుర్తిస్తున్నారని.. కానీ, విశాఖలో ఎలాంటి క్యాంపులు నిర్వహించడం లేదన్నారు. సాంకేతిక కారణాలు చూపుతూ పెన్షన్లను నిలుపుదల చేయడం తగదన్నారు. తండ్రికి ఇల్లు ఉందంటూ పిల్లలకు పెన్షన్ నిలిపేయడం సరికాదన్నారు. ఇలా జిల్లాలో దాదాపు 100 మందికి పింఛన్లు నిలిచిపోయాయన్నారు. సదరం సర్టిఫికెట్ ఆధారంగా పింఛను ఇవ్వాలని.. ఒంటరి దివ్యాంగులకు కూడా రేషన్ కార్డులివ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వారు వినతిపత్రం సమర్పించారు. జిల్లా నలుమూలల నుంచి ట్రై సైకిళ్లు, దివ్యాంగుల స్కూటర్లు, ఇతర వాహనాల మీద దివ్యాంగులు భారీగా తరలివచ్చారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై భారీగా రిటైర్మెంట్ సొమ్ము
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై రిటైర్మెంట్ సొమ్ము భారీగా పెరగనుంది. ఈ మేరకు నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో నిబంధనలను ప్రభుత్వం సవరించింది. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ సివిల్ ఉద్యోగుల సర్వీస్ సంబంధిత విషయాలను నియంత్రించడానికి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021ని నోటిఫై చేసింది.కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి ఎన్పీఎస్ కింద ఉద్యోగి ప్రాథమిక వేతనంలో యజమాని చెల్లించే మొత్తాన్ని 14 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రతిపాదించారు. కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్స్,పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే పెన్షనర్ల సంక్షేమ విభాగం ఎన్పీఎస్ కింద చెల్లించే మొత్తాలను వివరిస్తూ కొత్త ఆఫీస్ మెమోరాండమ్‌ను విడుదల చేసింది.సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021లోని రూల్ 7 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఉద్యోగి జీతంలో 14 శాతాన్ని వారి వ్యక్తిగత పెన్షన్ ఖాతాకు ప్రతి నెలా జమ చేస్తుంది. మెడికల్ లీవ్, ఉన్నత విద్య కోసం వెళ్లడం కొన్ని సందర్భాలలో మినహా ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్ చెల్లించని సమయంలో ప్రభుత్వం కూడా తన వంతు మొత్తాన్ని చెల్లించదు.ఇక ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు పెన్షన్ కాంట్రిబ్యూషన్స్ ఉద్యోగికి చెల్లించే జీవనాధార భత్యంపై ఆధారపడి ఉంటాయి. సస్పెన్షన్ కాలం తరువాత ఒకవేళ అది జీతం చెల్లించాల్సిన డ్యూటీ లేదా సెలవుగా వర్గీకరిస్తే ఆ మేరకు ప్రభుత్వం చందాలను సర్దుబాటు చేస్తుంది. ఉద్యోగులు ఫారిన్ సర్వీస్‌లో ఉన్నప్పుడు ఎన్పీఎస్ చందాలకు సంబంధించి కూడా మెమోరాండం వివరించింది. ఇవి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తాయి. -
పెన్షన్ల కోత .. పింఛన్ల కోసం అవ్వ తాతకు పడిగాపులు
-
పెన్షన్ కోసం 2 కిలోమీటర్లు పాక్కుంటూ వెళ్లిన 80 ఏళ్ల బామ్మ
కియోంఝర్(ఒడిశా): వృద్ధాప్య పెన్షన్ కోసం పండుటాకులాంటి బామ్మ పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది. పెన్షన్ కావాలంటే పంచాయతీ ఆఫీస్‌దాకా వచ్చి నువ్వే తీసుకో అని అధికారులు తెగేసి చెప్పడంతో 80 ఏళ్ల బామ్మ 2 కి.మీ.లు పాక్కుంటూ వెళ్లింది. శనివారం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ కావడంతో అధికారులపై అందరూ మండిపడుతున్నారు. ఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్ చరణ్ మాఝీ సొంత జిల్లా కియోంఝర్లోని రైసాన్‌లో ఘటన జరిగింది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ నడవలేని దుస్థితి. ఇలాంటి వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ అందజేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ వాటిని అమలుచేసిన నాథుడే లేడు. శనివారం గ్రామ పంచాయతీలో పెన్షన్లు ఇస్తున్న విషయం తెల్సుకుని బామ్మ బురద ఉన్న ఎర్రమట్టి బాట గుండా పాకుతూ వచ్చి పెన్షన్ తీసుకున్నారు. వృద్ధురాలు ఇంత కష్టపడి కార్యాలయానికి వస్తుంటే పట్టించుకోరా? అని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గీతా ముర్మును కొందరు నిలదీశారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఇకపై బామ్మకు ఇంటి వద్దే పెన్షన్ ఇస్తామని మాటిచ్చారు. ఆమెకు ఒక చక్రాల కుర్చీని సైతం అందజేశారు. ఇకపై ఇంటి వద్దే రేషన్ సైతం అందిస్తామని స్పష్టంచేశారు. -
కొత్త పెన్షన్ విధానానికి కేంద్రం ఆమోదం.. కీలకాంశాలు..
కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్)ను అమలు చేసేలా విధానాలు రూపొందించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ యూపీఎస్ విధానం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తోంది. వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. దాంతో 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) స్థానంలో కొత్త యూపీఎస్‌ను అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షలకు చేరుతుందని చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విధానానికి ఆమోదం లభించింది.యూపీఎస్ విధానంలోని కీలకాంశాలు..ప్రస్తుతం అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, ప్రభుత్వం మరో 10 శాతం జమచేసి పెట్టుబడి పెట్టేది. ఉద్యోగి పదవీ విరమణ పొందాక ఆ మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందించేవారు. అయితే యూపీఎస్‌లో మాత్రం రిటైర్డ్ అయ్యే 12 నెలల ముందు వరకు ఎంత వేతనం ఉందో అందులో సరాసరి 50 శాతం పెన్షన్ రూపంలో చెల్లిస్తారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కనీస సర్వీసు 25 సంవత్సరాలు ఉంటే పూర్తి పెన్షన్‌కు అర్హులు. ఒకవేళ 25 ఏళ్లు పూర్తి అవ్వకపోతే దామాషా ప్రకారం 10-25 ఏళ్లలోపు పెన్షన్ లెక్కించి ఇస్తారు.కనీసం 10 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటేనే యూపీఎస్ కిందకు వస్తారు. అలా కేవలం పదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు కనిష్ఠంగా రూ.10,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఆపై 25 ఏళ్లలోపు సర్వీసు ఉన్న వారికి దామాషా ప్రకారం పెన్షన్ చెల్లిస్తారు. 25 ఏళ్ల సర్వీసు దాటితే పూర్తి పెన్షన్ వస్తుంది.ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. కాబట్టి యూపీఎస్ కింద ఇచ్చే పెన్షన్‌లోనూ ఏటా ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి ఇస్తారు. దాంతో కిందటి ఏడాది కంటే ప్రస్తుత ఏడాదికి ఎక్కువ పెన్షన్ అందుతుంది.యూపీఎస్ విధానంలో చేరిన పెన్షనర్లు మరణిస్తే అప్పటివరకు తాము తీసుకుంటున్న పెన్షన్‌లో 60 శాతం వారి భాగస్వామికి ఇస్తారు.యూపీఎస్ నిబంధనల ప్రకారం 1/10వ వంతు సుపర్ అన్యూయేషన్(మొత్తం సర్వీసును లెక్కించి చెల్లించే నగదు) చెల్లిస్తారు. బేసిక్ వేతనంలో 1/10వ వంతును పరిగణనలోకి తీసుకుని ప్రతి ఆరు నెలలకు ఒకసారి దీన్ని లెక్కిస్తారు. సర్వీసు పూర్తయిన వెంటనే ఒకేసారి ఈ మొత్తాన్ని అందిస్తారు. ఈ చెల్లింపునకు, పెన్షన్‌కు ఎలాంటి సంబంధం ఉండదు.కొత్త యూపీఎస్ విధానానికి మారాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రభుత్వాలను అనుసరించి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్ అమలుకు సిద్ధంగా ఉండాలి.నేషనల్ పెన్షన్ స్కీమ్ కంటే యూపీఎస్ కొంత మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ యూపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను భర్తీ చేయదని కొందరు చెబుతున్నారు. ఇదిలాఉండగా, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతుండగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఏమిటని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కేజీ బేసిన్లో మరో బావి నుంచి ఉత్పత్తిరాష్ట్రాల వాటాపై పర్యవేక్షణయూపీఎస్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని కేంద్రం కోరుతోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో కొన్ని రాష్ట్రాలు చెల్లించాల్సిన వాటాను జమ చేయకపోవడంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పదవీ విరమణ అనంతరం ఎలాంటి అవినీతికి పాల్పడకుండా కేవలం గ్రాట్యుటీ, పెన్షన్ డబ్బుమీదే ఆధారపడే ఉద్యోగులకు కొత్త విధానం కొంత ఊరట చేకూరుస్తుందనే వాదనలున్నాయి. కానీ ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలు తప్పకుండా వాటి వాటాను సైతం జమచేసేలా పర్యవేక్షణ ఉండాలని విశ్లేషకులు కోరుతున్నారు. -
రాహుల్ జీ.. మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నా?
కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న యూనిఫైడ్ పెన్షన్ పథకంపై ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సెటైర్లు వేశారు. యూపీఎస్‌లో ‘యూ’ అంటే.. యూటర్న్స్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్ కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. పెన్షన్ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారని అన్నారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీని నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా..ఎన్నికల ప్రచారంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌పై హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల హామీని అమలు చేస్తారా? అని ప్రశ్నించారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పేరుతో ప్రచారం చేసింది. అది అమలు చేయడం సాధ్యం కాదని తెలుసుకుని లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చే ధైర్యం చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసమే అవికాని హామీలు ఇచ్చింది. ఇప్పుడు వాటిపై ప్రజల్లో నమ్మకం పోయిందని రవి శంకర్ ప్రసాద్ నొక్కాణించారు. కాగా,కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయనుంది. ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి వచ్చే యునైటెడ్ పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ అవుతుంది. ఈ పథకంలో ఉద్యోగులు 10 శాతం చెల్లించాల్సి ఉండగా..ప్రభుత్వం 18.5 శాతం చెల్లించనుంది. -
బ్యాంకు వారికి.. ఆ హక్కు లేదు!
ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – గ్రాట్యుటీని బ్యాంకు వారు లోన్ బకాయిల రీత్యా జమ కట్టుకోవచ్చా?ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న మాధవరావు (పేరు మార్చాము) అనే ఒక వ్యక్తి కోవిడ్ సమయంలో సేవలు నిర్వహిస్తూ కన్నుమూశారు. ఆయన మరణానంతరం తన వారసులకు –భార్యకు రావలసిన కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ వంటి అంతిమ ఆర్థిక ప్రయోజనాలు (టెర్మినల్ బెనిఫిట్స్) భార్య అకౌంట్లోకి వచ్చాయి. అయితే, అలా అకౌంట్ లోకి వచ్చిన వెంటనే సదరు బ్యాంకు అధికారులు పెన్షన్ మొత్తాన్ని మాధవ రావు బతికుండగా తీసుకున్న లోన్ బకాయి కింద జమ కట్టుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించిన సదరు ఉద్యోగి భార్యను ‘ఇది మా హక్కు‘ మీ ఆయన మా బ్యాంకులో లోను తీసుకోవడమే కాక, తన టెర్మినల్ బెనిఫిట్స్ నుంచి కూడా రికవరీ చేసుకోవచ్చు అని మాకు రాసి ఇచ్చారు. అంతేకాక మీ భర్త పని చేసిన డిపార్ట్మెంట్ వారికి, మా బ్యాంకుకు మధ్య ఒక ఒప్పందం కూడా ఉంది. అందువలన మేము ఆ మొత్తాన్ని లోను కింద జమ కట్టుకున్నాము‘ అని చెప్పి ఆవిడని వెళ్ళిపొమ్మన్నారు. అప్పుడు ఇద్దరు మైనర్ పిల్లల తల్లి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.వాదోపవాదాలు విన్న తర్వాత, పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకుని, మరీ ముఖ్యంగా సి.పి.సి లోని సెక్షన్ 60 (1) నిబంధనల ప్రకారం ‘‘టర్మినల్ బెనిఫిట్స్ లోనుంచి వచ్చిన నిధులను, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్) వంటి సామాజిక సంక్షేమ పథకాల ద్వారా సంక్రమించిన నిధులను ఏ బ్యాంకు అయినా, కోర్టు అయినా అలా తీసుకోవడానికి, అటాచ్మెంట్ చేయడానికి వీలు లేదు’’ అని తీర్పునిస్తూ ‘‘ఆ మహిళ అకౌంట్లో నుంచి లోను బకాయి పేరుతో బ్యాంకు వారు తీసేసుకున్న డబ్బులు మొత్తం తిరిగి ఆ మహిళకు చెల్లించవలసిందే’’ అని ఆదేశించింది. అప్పటికీ కూడా బ్యాంకు వారు తిరిగి చెల్లించక΄ోవడంతో గౌరవ హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు కూడా వేయాల్సి వచ్చింది. మొత్తానికి సదరు మహిళకి ఆ డబ్బులు మొత్తం బ్యాంకు వారు తిరిగి చెల్లించారు. బ్యాంకు వారికి లోన్ రికవరీ చేసే అధికారం వున్నప్పటికీ, చట్ట పరిధిలో ఉండి మాత్రమే రికవరీ చేయాల్సి వుంటుంది. లోన్ తీసుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... బ్యాంకు లోన్ తీసుకున్నెప్పుడు ‘లోన్ ఇన్సూరెన్స్’ అనే పథకాన్ని ఎంచుకోవాలి. అంటే, రుణ బకాయీలు ఉండగా లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినా, ఏదైనా శాశ్వత వైకల్యం వంటివి కలిగి ఉపాధి కోల్పోయిన సమయాలలో వారు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా ఉండచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ వారు మీ బదులు లోన్ కడతారు. మీ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. కొన్ని లోన్ఖాతాలకి లోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినప్పటికీ, బ్యాంకు వారు కూడా లోన్ ఇన్సూరెన్స్ గురించి అందరికీ చెప్పి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకునేలా చేస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
కేంద్రంపై ‘సుప్రీం’ ఆగ్రహం.. రూ.2లక్షల జరిమానా..!
ఢిల్లీ : పెన్షన్ల జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయకపోవడపై కేంద్రంపై సీరియస్ అయ్యింది.భారత సైన్యంలో రీటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్‌ర్యాంక్ వన్ పెన్షన్ చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని మండిపడింది.ఈ క్రమంలో కేంద్రానికి రెండు లక్షలు జరిమానా విధించింది. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన సుప్రీం కోర్టు నవంబర్ 14లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. లేదంటే పెన్షన్ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది సుప్రీం కోర్టు. పెన్షన్ విషయంలో దాఖలైన పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. -
పెన్షన్ల పంపిణీపై టీడీపీ నేతల లొల్లి ఎమ్మెల్యేను నిలదీసిన కార్పొరేటర్
-
కడప టీడీపీలో ‘పెన్షన్ల’ రగడ.. ఎమ్మెల్యే Vs కార్పొరేటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప నగర పాలక సంస్థలో పెన్షన్ల పంపిణిపై టీడీపీ సభ్యుల మధ్య రగడ రచ్చరచ్చగా మారింది. కడప ఎమ్మెల్యే మాధవి, 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య మాటల తూటాలు పేలాయి. తన ప్రమేయం లేకుండా పెన్షన్లు పంపిణి చేశారంటూ ఉమాదేవి మండిపడ్డారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా పంపిణి చేశారంటూ కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డిని నిలదీశారు. గతంలో పల్స్ పొలియో కార్యక్రమం కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించే వారని ఉమాదేవి అన్నారు.సొంత పార్టీ కార్పొరేటర్‌నే కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి.. పెన్షన్ల పంపిణికి ప్రత్యేకంగా ఎవరికి ప్రోటోకాల్ లేదని.. సొంతంగా డివిజన్‌ను ఎవరు రాయించుకొలేదంటూ వ్యాఖ్యానించారు. కిరిటాలు పెట్టి.. డప్పులు కొట్టి ఎవరు మిమ్మల్ని పిలవరని.. సమాచారం తెలిస్తే వచ్చి ఉండాల్సిందంటూ ఎమ్మెల్యే మాధవీ ఉచిత సలహా ఇచ్చారు. సొంత పార్టీ కార్పోరేటర్‌నే ఎమ్మెల్యే మాధవీ కించపరిచేలా మాట్లాడటంపై ఉమాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
పెన్షన్ అందక 90 ఏళ్ల వృద్ధురాలి ఆవేదన
-
శ్రీకాకుళం జిల్లా: టీడీపీ ఇష్టారాజ్యం.. పెన్షన్ల నిలిపివేత
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఆముదాలవలస నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రాజకీయ కక్షతో పలు చోట్ల పెన్షన్ నిలిపివేయించారు. ఆముదాలవలస నియోజకవర్గంలో పెనుబర్తి గ్రామంలో 19 మందికి పెన్షన్ ఆపేశారు. టీడీపీ నేతల ఆదేశాలతోనే తమకు పెన్షన్ నిలిపివేశారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.నిన్నటి నుంచి పెన్షన్ కోసం లబ్ధిదారులు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. సచివాలయంలో ఎవరూ లేకపోవడంతో పెన్షన్ కోసం లబ్ధిదారులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.కాగా, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ కొందరికి పింఛన్లు ఇవ్వకపోవడం వాగ్వాదానికి దారి తీసింది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇవ్వలేక పోతున్నామని చెప్పడంతో గ్రామంలో పింఛన్ అందని వారంతా ఒక చోటకు చేరి ఆందోళనకు దిగారు. సచివాలయానికి తాళం వేసి రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సుమారు 22 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగ గుర్తింపు సర్టిఫికెట్ పొంది పింఛన్ పొందుతున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం మూడు గంటలకు పింఛన్లు అందజేశామని సచివాలయం వెల్ఫేర్ అధికారి రవికుమార్ చెప్పారు.ఐదేళ్లు ఎలాంటి వివక్షకు తావులేకుండా ఠంచన్‌గా, పారదర్శకంగా అందించిన పింఛన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోమవారం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగింది. ఇంటివద్ద అందించాల్సిన పెన్షన్లను కొన్నిచోట్ల చెట్ల కింద, రచ్చబండ వద్ద, ప్రైవేట్ స్థలాల్లో ఇస్తామని తిప్పడంతో పడిగాపులు కాసి అవస్థలు ఎదుర్కొన్నారు. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా పంపిణీ మొత్తం ప్రతి చోటా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది.మరోవైపు, పింఛన్ల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల స్థానిక టీడీపీ నాయకులు చేతివాటం చూపినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల సహా పలు చోట్ల కమీషన్ల కింద రూ.500 మినహాయించుకుని ఫించన్ ఇస్తున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 2014–19 మధ్య కూడా టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు లంచాల వసూళ్లకు తెగబడి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే వాతావరణం కనిపించినట్లు వాపోతున్నారు. -
500 ఇస్తేనే పెన్షన్ .. మళ్లీ మొదలైన అవినీతి
-
పండుటాకులపై టీడీపీ కక్ష !
ఇక్కడ కన్పిస్తున్న వ్యక్తి పేరు పి.నరసింహులు. టీఓపల్లె గ్రామానికి చెందిన ఇతను 2014 టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి డప్పు కళాకారుడిగా పింఛన్ పొందుతున్నాడు. కొన్నేళ్ల క్రితం కాలుకు ప్రమాదం జరిగింది. పింఛన్ డబ్బులు మీదే ఆధారపడి భార్యను పోషించుకుంటున్నాడు. ‘గత నెల వరకూ పింఛన్ వచ్చింది.. ఈ నెలలో ఇవ్వలేదు. ఇదేమనడిగితే ఉన్నతాధికారులు ఆపమన్నారని చెబుతున్నా’రని వాపోయాడు.ఇక్కడ కన్పిస్తున్న వ్యక్తి పేరు ఆలూరు సీతారాములు. టీఓపల్లె పంచాయతీ రేపల్లెకు చెందిన ఇతనికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తున్న రూ.200ల వికలాంగ పింఛన్ పొందుతున్నాడు. గత నెల వరకూ వికలాంగత్వ పింఛను పొందాడు. ఈ నెలలో పింఛన్ కోసం వెళ్లగా తనకు ఇవ్వడం లేదని వాపోయాడు. తన వికలాంగ సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే ఇస్తామని అధికారులు చెబుతున్నారని. కావాలనే గ్రామంలోని టీడీపీ నాయకులు తన పింఛను ఆపిస్తున్నారని, తన చేతిని చూసి కూడా పింఛన్ ఆపటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.చాపాడు : ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ‘మీ భద్రతే .. మా బాధ్యత’ అంటూ ఊదరగొట్టింది. అవన్నీ మాటలకే అంటూ మరోసారి రుజువు చేసింది. అన్ని అర్హతలున్నా పింఛన్ ఇవ్వకుండా నిరుపేద పండుటాకులకు, దివ్యాంగులకు మోసం చేసింది. మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలోని మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామ పంచాయతీలో 94 మంది పింఛన్ దారులకు డబ్బులు పంపిణీ చేయకుండా వారి కన్నీళ్లకు కారణమైంది. స్వయానా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మూడు పంచాయతీలకు చెందిన 94 మంది పింఛన్‌దారులకు అర్హతలను పునర్విచారణ చేసిన తర్వాతనే డబ్బులు పంపిణీ చేయాలని కలెక్టర్ విజయరామరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం జరిగిన పింఛన్ పంపిణీలో ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన 94 మందికి పింఛన్ డబ్బులను ఆపాలని ఎంపీడీఓ రహంతుల్లయ్య ఆయా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచి పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూసిన సదరు లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది. పదేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నామని ఈ సారి తమకెందుకు పింఛన్ డబ్బులు ఇవ్వలేదని, తామేమి పాపం చేశామని బాధితులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ వర్గీయులన్న కారణంగా పింఛన్లు ఆపారని ఆయా గ్రామాల్లో చర్చించుకుంటున్నారు.ఎంపీడీఓ ఏమన్నారంటే..మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామాల్లో 94మందికి పింఛన్లను ఆపడంపై ఎంపీడీఓ రహంతుల్లయ్యను వివరణ కోరగా.. ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని, డీఆర్డీఏ పీడీ నుంచి 94 మంది పింఛన్లను వెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. రెండు మూడు రోజుల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత పింఛన్ల పంపిణీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.పింఛన్ డబ్బులు అందని బాధితులు..మండలంలోని మడూరు పంచాయతీలో వృద్ధాప్య పింఛను పొందుతున్న ఎం.శివారెడ్డి, మబ్బులు, కె.మహమ్మద్ షరీఫ్, మాలబాల సుబ్బారెడ్డి, కట్టుబడి సాసేన్ వలి, మాబు షరీఫ్, సాకం చిన్న సుబ్బారెడ్డి, పర్లపాటి షేక్ రసూల్, బాషా, రామిరెడ్డి, వెంకటసుబ్బయ్య, కల్లెగాల్ల చెన్నమ్మ, చంటి సుబ్బయ్య, ఆవుల గుర్రప్ప, కాలేబు, సానెపల్లె బయపురెడ్డి, లక్షుమ్మ, ఆళ్లగడ్డ దానం, బొగ్గుల రాజమ్మ, సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, శేషారెడ్డి, పెద్ద లక్ష్మీరెడ్డి, వికలాంగులైన లక్ష్మీప్రియ, సాకం నాగసూయమ్మ, సుభానీ, మహబూబ్ బాషా, రంగాగాళ్ల లలితమ్మ, సుబ్బమ్మ, డప్పు పింఛన్‌దారులు సుబ్బరాయుడు, కల్లగాల్ల సుబ్బరాయుడు, చిన్నటిగాళ్ల సుబ్బరాయుడు, చెప్పులు కుట్టేవారు అంకన్న, పెద్ద ఓబయ్య, బాల ఓబయ్య, అభయహస్తం, వితంతువు మునెమ్మ ఉన్నారు. అలాగే అన్నవరంలో.. వృద్దాప్య పింఛన్ దారులు పల్లవోలు ప్రసాద్‌రెడ్డి, ఆలూరు పీరయ్య, బాషా, వీరనారాయణ, గంగిరెడ్డి, నాగిరెడ్డి, రామచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, కుల్లాయిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, పెద్ద కొండారెడ్డి, కాసా వెంకటసుబ్బారెడ్డి, ఎల్లారెడ్డి, సంజీవరెడ్డి, జాకోబ్, చిన్న సుబ్బరాయుడు, వికలాంగులైన ఆదినారాయణరెడ్డి, చింతకుంట పైద్దీన్, ఇందిరమ్మ, కానాల మేరి, గంగయ్య, రామిరెడ్డి, రామ ఓబులరెడ్డి, అశ్వని, రామసుబ్బమ్మ, బంక మమత, చేనేత నారాయణ పింఛన్ ఆపేసిన వారిలో ఉన్నారు. టీఓపల్లెలో.. వృద్దాప్య పింఛన్ పొందుతున్న చెన్నూరు సుబ్బమ్మ, వీరమ్మ, సుబ్బారెడ్డి, ఏ.వెంకటసుబ్బారెడ్డి, కుంచెం సుబ్బ మ్మ, పిచ్చయ్య, మద్దిలేటి, రామయ్య, వెంకటసుబ్బ య్య, శివారెడ్డి, గంగమ్మ, కొండారెడ్డి, వికలాంగులైన సాంబశివారెడ్డి, శ్రీదేవి, తిరుపాలమ్మ, గురుస్వామి, రంగరాజు, సాంబశివారెడ్డి, డప్పు కళాకారులు వెంకటసుబ్బయ్య, చిన్నమ్మ, నరసింహులు, రాముడు, చేనేతలైన సుబ్రమణ్యం, వెంకటసుబ్బయ్య, సుబ్బరాయుడులకు పింఛన్ డబ్బులను ఆపారు.76 ఏళ్లు ఉన్నా వృద్ధాప్య పింఛన్ ఆపడం న్యాయమాపదేళ్లుగా వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాను. గతంలో టీడీపీ, గత ఐదేళ్ల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా పింఛన్ సజావుగా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావటం మొదటి నెలే నాకు పింఛను ఇవ్వకుండా ఆపటం ఎంత వరకు న్యాయం. 76 ఏళ్లు ఉన్న నా పత్రాలను పరిశీలించిన తర్వాతనే ఇస్తామని చెప్పటం బాధాకరం.– ముదిరెడ్డి శివారెడ్డి, వృద్ధుడు, మడూరు గ్రామం -
ఏపీలో మొదలైన పెన్షన్ కష్టాలు (ఫోటోలు)
-
ఈసారీ బ్యాంకు ఖాతాల్లోనే పింఛను డబ్బులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అవ్వాతాతలకు వచ్చే నెల నుంచి పంపిణీ చేసే పింఛన్‌ను కూడా ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. మే నెలలో ఇంటివద్ద పింఛను పొందిన వారికి ఈసారి కూడా 1–5 తేదీల మధ్య ఇంటివద్దే ఆ డబ్బు అందిస్తారు. జూన్ ఒకటికి కొత్తగా 80 ఏళ్లు వచ్చిన వారికి కూడా ఇంటి వద్దే పింఛన్ డబ్బు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ బుధవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఐదేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీనే ఠంచన్‌గా పింఛన్ లబ్ధిదారులందరికీ వలంటీర్ల ద్వారా ఇంటివద్దే అందించేది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేప«థ్యంలో ఎన్నికల కోడ్ పేరుతో టీడీపీ చేసిన ఫిర్యాదులతో వలంటీర్లను ఎన్నికల సంఘం ఈ కార్యక్రమం నుంచి దూరంగా ఉంచింది. దీంతో రెండు నెలలుగా అవ్వాతాతలు, దివ్యాంగులు, తదితరులకు అందించే పింఛన్ల పంపిణీలో మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. పింఛన్లను లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్లకు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం ఇంటి వద్దనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో పింఛను డబ్బులను పంపిణీ జరిగింది. జూన్ నెలలోనూ ఇదేవిధంగా జరగనుంది. 73% లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమ రాష్ట్రవ్యాప్తంగా 65,30,808 మందికి పింఛన్లు పంపిణీ చేస్తారు. ఇందుకోసం రూ.1,939.35 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. లబి్ధదారుల్లో 47,74,733 మంది (73.11 శాతం)కి డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లో ఒకటో తేదీనే జమ చేస్తారు. మిగిలిన 17,56,105 మంది (26.89 శాతం)కి ఇంటి వద్దే పంపిణీ చేయనున్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా పెన్షన్ పంపిణీ చేయాలని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇతర రాష్ట్రాల కోఆపరేటివ్ బ్యాంకులలో బ్యాంకు ఖాతా ఉన్న లబ్దిదారులకు కూడా డీబీటీ రూపంలో కాకుండా జూన్ 1 – 5 తేదీల మధ్య ఇంటి వద్దనే పంపిణీ చేస్తారు. -
ఏపీ : చంద్రబాబు కుట్ర.. ఎండల్లో పింఛన్‌దార్ల అష్టకష్టాలు (ఫొటోలు)
-
ఫించన్ ఎత్తేశారు!
రాకముందే అవ్వాతాతలకు అవస్థలు 14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ పేదవాడికీ, ఏమీ చేయని చంద్రబాబు ఈనాడులో ఇచి్చన ప్రకటన చూశారా? సూపర్ సిక్స్‌లో అవ్వాతాతల పెన్షన్‌ను అప్పుడే ఎత్తేశారు. సూపర్ సిక్స్‌లో అవ్వాతాతల పెన్షన్ మీకు ఎక్కడైనా కనిపించిందా? చంద్రబాబు రాకమునుపే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనకా వాననకా తిరగాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇక పొరపాటున చంద్రబాబు పాలన వస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ ఇది జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు, సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘ఈ ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు తన బాణాన్ని నేరుగా పేద సామాజికవర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురి పెట్టాడు. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు, చేస్తున్న అన్యాయాన్ని మీరంతా చూస్తున్నారు. అయ్యా చంద్ర బాబూ...! 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చి న పెన్షన్ ఎంత? కేవలం వెయ్యి రూపాయలు కాదా? ఆ పెన్షన్‌ను రూ.3 వేలు చేసింది ఎవరు? ఆ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు? చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో అవ్వాతాతల పెన్షన్‌ను అప్పుడే ఎత్తేశారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లాపెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు, సాయంత్రం ప్రకాశం జిల్లా కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. సాధ్యం కాని హామీలతో వల.. మరో 10 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి కావు. ఐదేళ్ల మీ భవిష్యత్తు, ఇంటింటికీ పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్లీ మోసపోవడమే! చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. సాధ్యం కాని హామీలతో వల వేస్తున్నాడు. వదల బొమ్మాళీ వదలా.. అంటూ పసుపు పతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి మీ ఇంటి తలుపుతట్టి లకలకా అంటూ ఐదేళ్లు రక్తం తాగేందుకు వస్తుంది. మరోసారి మోసగించేందుకే చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాడు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే ఆ పెద్దమనిషి పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకొస్తుందా? నాడు అవస్థలతో 39 లక్షలు.. నేడు ఠంఛన్‌గా 66 లక్షలు ఓ అవ్వాతాతా.. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా? ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకూ ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ అరకొరగా తీసుకున్న దుస్థితి. మీ బిడ్డ జగన్ హయాంలో ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా రూ.3వేలు చొప్పున పెన్షన్ నేరుగా మీ ఇంటికే అందిస్తున్నాడు. ఆ పాపిష్టి కళ్లు పడనంతవరకూ.. చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకూ ఇంటికే పెన్షన్ సజావుగా అందేది. సూర్యోదయానికి ముందే, ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతల ఇంటికే మనవళ్లు, మనవరాళ్ల రూపంలో వలంటీర్లు వచ్చి చిరునవ్వుతో పింఛను అందించి మంచి చేసిన కాలం మనదే. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో.. తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి వలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకూడదంటూ ఉత్తర్వులు ఇప్పించాడు. చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో ఆగలేదు. ఇంకా కడుపుమంట చల్లారక ఏం చేశాడో తెలుసా? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేటట్టుగా వాళ్ల పెన్షన్ బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు. దీంతో ఎన్నికల కమిషన్ అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చింది. అవ్వాతాతలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇంత ఎండలో క్యూలలో నిలబడలేక చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే ఆ దౌర్భాగ్యపు పని చేసిన చంద్రబాబు ఆ నెపాన్ని మీ బిడ్డపై వేస్తున్నాడు. చంద్రబాబు, దుష్ట చతుష్టయం, ఎల్లోమీడియా వీళ్లంతా కలిసి ఆ నెపాన్ని మీ బిడ్డ మీద వేస్తున్నారు. ఆ ఈనాడు కథనాలు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చూస్తే.. వీళ్లంతా మనుషులేనా? అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనను 14ఏళ్లు మీరంతా చూశారు. మీ బిడ్డ 59 నెలల పాలన కూడా చూశారు. పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వచ్చిన పరిస్థితులు చూశారు. చంద్రబాబు ఏ ఒక్క రోజూ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. పెన్షన్ ఇంటికి పంపిన పరిస్థితి అంతకంటే లేదు. మీ కోసమే నా తొలి సంతకం.. నేను ఇవాళ ప్రతి అవ్వకూ, తాతకూ చెబుతున్నా. అవ్వాతాతా..! ఒక్క నెల ఓపిక పట్టండి. జూన్ 4వ తేదీ దాకా ఓపిక పట్టండి. మీ బిడ్డ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. నా మొట్ట మొదటి సంతకం మీకోసం పెడతా అని అవ్వాతాతలకు మాటిస్తున్నా. మీ మనవళ్లు, మనవరాళ్లుగా వలంటీర్లు సూర్యోదయానికి ముందే ఇంటికే వచ్చి చిరునవ్వుతో పెన్షన్లు అందించే పరిస్థితులు మీ బిడ్డ మళ్లీ తెస్తాడు. విద్యా విప్లవం.. మహిళా సాధికారత గతంలో ఎప్పుడూ జరగని విధంగా గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలకు స్కూళ్లు తెరిచే సమయానికే విద్యాకానుక, ఇంగ్లిష్ మీడియం, బైజూస్ కంటెంట్, మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లను అందుబాటులోకి తెచ్చాం. నాడు–నేడుతో కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాం. ఇంగ్లిష్ మీడియంతో వేసిన అడుగులు నుంచి సీబీఎస్ఈ, ఐబీ దాకా మన ప్రయాణం కొనసాగుతోంది. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. తొలిసారిగా 6వ తరగతి నుంచే క్లాస్రూమ్ లలో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన పేద పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. పిల్లలు ఇబ్బంది పడకుండా బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ సమకూర్చాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువులు అభ్యసిస్తున్న 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెనతోపాటు వసతి దీవెన కూడా అందిస్తున్నాం. తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను మన కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చాం.పిల్లలను బడికి పంపిస్తే చాలు చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ సున్నావడ్డీ, ఆసరా ఇస్తున్నాం. ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు 22 లక్షల ఇళ్లు కూడా కడుతున్నాం. గ్రామాల్లోనే మహిళా పోలీసు, దిశ యాప్, రాజకీయ సాధికారత కోసం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. లంచాలు లేని సమాజం గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రతి 60–70 ఇళ్లకు వలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా ఇంటికే పెన్షన్, పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ జరుగుతోంది ఈ 59 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి కాకముందు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయని ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశాడు. నాకు ఓటు వేయని వారినీ కోరుతున్నా.. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్. పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా మీ ఓటు ఎంత కీలకమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా ఒక్కటే కోరుతున్నా. మీ ఇంటికి వెళ్లి అవ్వాతాతలు, భార్యాపిల్లలతో కూర్చుని మాట్లాడండి. ఎవరి హయాంలో, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇంటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్‌లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి నా అక్కచెల్లెమ్మలకు అందుతుంది. ఆ మోసాలు మీరంతా చూశారు.. మీ బిడ్డను నమ్మి మీరంతా అధికారం ఇచ్చినందువల్ల దేవుడి దయతో ఐదేళ్లలో ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తేగలిగాం. ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99శాతం హామీలను అమలు చేశాం. 2014లో ఒకసారి చంద్రబాబును నమ్మారు! ఆ కూటమిని నమ్మి ఓటు వేశారు! చంద్రబాబు మేనిఫెస్టో మాయలు, మోసాలు ఎలా ఉంటాయో మీరంతా చూశారు. ఈ 59 నెలల్లో మీ జగన్ పాలన చూస్తున్నారు. మీ బిడ్డ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు. కొత్త మోసాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న వారికి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని కోరుతున్నా. మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్సింకులోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, ఆసుపత్రులు, వ్యవసాయం బాగుండాలన్నా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మన అభ్యర్థులను ఆశీర్వదించండివైఎస్సార్సీపీ నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ముదునూరి ప్రసాదరాజు, గుడాల గోపి, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకరరావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్ కుమార్ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా. గతంలో ఇవి ఉన్నాయా?» పిల్లలకు విద్యాకానుక, వారి చేతుల్లో ట్యాబ్‌లు గతంలో ఎప్పుడైనా చూశారా? » రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టికాహారంతో గోరుముద్ద చూశారా? » తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, ఇంటివద్దే అందించిన పౌర సేవలు, పథకాలను చూశారా? » ఇంటికే రూ.3 వేల పెన్షన్ కానుక, ఓ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, చేదోడు, లా నేస్తం, రూ.25 లక్షలదాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష గతంలో మీరు చూశారా? » వీటన్నింటితో పాటు మీ ఊరిలోనే గ్రామ సచివాలయం, నాడు–నేడుతో బాగుపడిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఓ ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల చేతుల్లో దిశ యాప్ గతంలో ఉన్నాయా? » మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇవన్నీ సజావుగా కొనసాగి పథకాలు అందుతాయి. 2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ చేస్తానన్నాడు... జరిగిందా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామని ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? » ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఏ ఇంటికైనా ఇచ్చాడా? » అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? » ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? » సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మించాడా? నరసాపురం, పెదకూరపాడు, కనిగిరిలో ఎవరికైనా కనిపిస్తున్నాయా? » ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు. »ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో మీ ముందుకొచ్చి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కార్ అంటూ మరోసారి వంచనకు సిద్ధమైన మోసగాళ్లతో రాజకీయ యుద్ధం చేస్తున్నాం. నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరిక సాక్షి, నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలు, సంఘాల ముఖ్య నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. తూర్పు గోదావరి జల్లాకు చెందిన బీసీ పోరాట సమితి జిల్లా అ«ధ్యక్షుడు రేలంగి శేఖర్, మూల్ నివాసి సంఘ్ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు, జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ నేత మారూరి రామలింగారెడ్డి, మార్వాడి కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారీకి సీఎం జగన్ వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహా్వనించారు. -
ఈ పాపం చంద్రబాబుదే.. అవ్వాతాతల ప్రాణాలు తీస్తూ రాజకీయాలా? (ఫొటోలు)
-
ఎటువంటి ‘చార్జీ’లు లేకుండానే పింఛన్ ఇవ్వండి
సాక్షి,అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలతో అవ్వాతాతల పింఛన్ సొమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పింఛన్ సొమ్మును ఎలాంటి చార్జీలకు మినహాయించుకోకుండా ఇవ్వాలని బ్యాంక్‌లను రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) ఆదేశించినట్లు సెర్ప్ అధికారులు గురువారం తెలిపారు. అవ్వాతాతలు తమ బ్యాంక్ అకౌంట్లను చాలా కాలంగా ఉపయోగించని కారణంగా ఆ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేదు.దీంతో ఆయా అకౌంట్లకు బ్యాంక్‌లు చార్జీలు విధిస్తున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం..అవ్వతాతలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారు పింఛన్ డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఎటువంటి చార్జీలను బ్యాంక్‌లు తీసుకోకుండా చర్యలు తీసుకుంది. కాగా, మొత్తం లబి్ధదారులు 65.94 లక్షల మందిలో 48.92 లక్షల మందికి వారి బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, వారందరి బ్యాంక్ ఖాతాల్లో బుధవారమే అధికారులు డబ్బులు జమ చేయగా, అందులో 74,399 మందికి వారి సాంకేతిక కారణాలు కారణంగా సొమ్ము జమ కాలేదు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ అందేలా వారి ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీకి చర్యలు తీసుకుంటామని సెర్ప్ అధికారులు తెలిపారు. కాగా, మే నెలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 65,49,864 మంది లబి్ధదారులకు పింఛన్ల పంపిణీ నిమిత్తం రూ.1,945.39 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా గురువారం సాయంత్రం వరకు డీబీటీ విధానంలో 48.92 లక్షల మంది లబి్ధదారులలో 48.17 లక్షల మందికి వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. దివ్యాంగులు, మంచం/వీల్‌చైర్‌కు పరిమితమైన వారిలో 16.57 లక్షల మందికి వారి ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయించగా, అందులో 15.13 లక్షల మందికి గురువారం నాటికి పంపిణీ పూర్తయినట్లు వివరించింది. డీబీటీ విధానంలో 98.47% మందికి, లబి్ధదారుల ఇంటి వద్దనే పంపిణీ చేసేవారిలో 91.34% మందికి పంపిణీ పూర్తయినట్లు పేర్కొంది. -
ఠంఛన్‌గానే పింఛన్
సాక్షి, అమరావతి: మే 1న మేడే సందర్భంగా సెలవు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఠంచనుగా పింఛన్ అందించింది. 48,92,503 లబ్ధిదారులకు రూ.1,471.22 కోట్లను నేరుగా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికి లేదా వీల్‌చైర్‌కే పరిమితమైన మరో 16,57,361 మందికి వారి ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.474.17 కోట్లను విడుదల చేయగా బుధవారం ఉదయం నుంచి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పంపిణీని ప్రారంభించారు.గత ఐదేళ్లుగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్లను అందజేసింది. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ కుట్రలతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరగకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రతినెలా ఒకటినే ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును అందుకునే లబ్ధిదారులు గత నెల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడంతో అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ కష్టాలకు చంద్రబాబే కారణమని వారు మండిపడుతున్నారు. ప్రతి నెలా 1నే వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారని.. ఇప్పుడు చంద్రబాబు కుట్రలతో వలంటీర్ల సేవలకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడిన ఇబ్బందులు తమకు పచ్చమూక కుట్రలతో మళ్లీ వచ్చాయని ధ్వజమెత్తుతున్నారు.అవ్వాతాతలకు పచ్చమూక తెచ్చిన కష్టాలు..చంద్రబాబు, ఆయన సన్నిహితుల కుట్రలతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అవ్వాతాతలకు పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేవు. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లోనే బ్యాంకులు ఉన్నాయి. దీంతో మండల కేంద్రాలకు 10–15 కిలోమీటర్ల దూరంలో గ్రామాల్లో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎవరో ఒకరి సహాయం లేకుండా బ్యాంకులకు వారు వెళ్లలేరు. దీంతో ఎవరో ఒకరిని బ్యాంకు వరకు రావాలని సహాయమడగాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు వేసవి కూడా కావడంతో పింఛన్ల నగదు తీసుకోవాలంటే అవ్వాతాతలు చాలా కష్టపడాల్సి వస్తోంది. గత ఐదేళ్ల నుంచి తమ ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును నేరుగా అందుకున్న అవ్వాతాతలు బ్యాంకులకు ఎలాగోలా కష్టపడి వెళ్లినా నగదు విత్ డ్రా చేసుకోవడం తెలియదు. ఇందుకోసం వేరేవారిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇలా చంద్రబాబు, ఆయన ముఠా పన్నిన కుట్రలతో అవ్వాతాతలకు కష్టాలు తప్పడం లేదు.పింఛన్ కోసం వెళ్లి మృత్యువాతపింఛన్ కోసం అన్నమయ్య జిల్లా రాయచోటి కెనరా బ్యాంక్ దగ్గరికి వచ్చిన ముద్రగడ్డ సుబ్బన్న (80) బుధవారం వేసవి తాపానికి గురై కుప్పకూలి చనిపోయాడు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకులవరం గ్రామం పిచ్చుకగుంట్లపల్లెకు చెందిన సుబ్బన్న 1వ తేదీ కావడంతో తన పెన్షన్ డబ్బులు బ్యాంకులో జమ అయ్యాయో, లేదో తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. అయితే మే డే కారణంగా బ్యాంకుకు సెలవు కావడంతో తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో ఎండ వేడికి తాళలేక బ్యాంకు సమీపంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. సమీపంలో ఉన్న వ్యక్తులు నీళ్లు చల్లి మంచినీరు తాగించినా ప్రాణాలు దక్కలేదు.పింఛను నేరుగా ఇవ్వడం లేదని మృతివలంటీర్ల ద్వారా నేరుగా పింఛన్ ఇవ్వనీయకుండా చంద్రబాబు కుట్రలు చేశారని మనస్తాపానికి గురైప ఒక వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు కళ్లా వీధికి చెందిన ఖలీల్ బేగ్ (75) ప్రతి నెలా ఇంటి వద్దనే వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేవాడు. అయితే ఈసారి పింఛన్ బ్యాంకులో వేస్తున్నారని.. అక్కడి నుంచి తెచ్చుకోవాలని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవే ఆలోచనలతో ఇంటిలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. చంద్రబాబు కుట్రలతో ఇబ్బందులునాకు వృద్ధాఫ్య పింఛన్ వస్తోంది. ఆధార్‌కు లింక్ చేసినా ఇప్పుడు నా బ్యాంక్ ఖాతా పని చేయడం లేదు. పింఛన్ వస్తుందో, లేదో అని భయంగా ఉంది. రెండు నెలల క్రితం వరకు వలంటీర్లు ఇంటికి వచ్చి తలుపు కొట్టి పింఛన్ రూ. 3 వేలు చేతిలో పెట్టేవారు. చంద్రబాబు కుట్రలకు మాలాంటి ముసలోళ్లు ఇబ్బందులు పడుతున్నారు. – గుంజి లక్ష్మీదేవిఇంత ఎండలో బ్యాంకుకు ఎలా వెళ్లేది?పింఛన్ సొమ్మును ఈసారి బ్యాంక్‌లో వేస్తారని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంక్‌కు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నాలాంటి వృద్ధులకు ఇబ్బందే. వలంటీర్లు ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి ఇచ్చేవారు. మాలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. చంద్రబాబు వల్లే మాకీ కష్టాలు. – బొబ్బ సుందరమ్మ, ఆత్మకూరు, పల్నాడుజిల్లా వలంటీర్ ఉంటే ఉదయాన్నే పింఛన్..నాకు వితంతు పింఛన్ వస్తోంది. మంచం మీద నుంచి పైకి లేవలేను. వలంటీర్ ఉన్నప్పుడు ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాడు. బాబు ఓర్వలేక వలంటీర్లను అడ్డుకున్నారు. ఇప్పుడు పింఛన్‌ను బ్యాంకు ఖాతాలో వేస్తామంటున్నారు. నేను బ్యాంక్‌కు వెళ్లలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. జగనన్న వస్తే మళ్లీ కష్టాలు తీరతాయి.– తాతపూడి రాహేలమ్మ, వెలిగండ్ల, ప్రకాశం జిల్లా బాబు మంచి చేయడు.. చేయనివ్వడు..వలంటీర్ల ద్వారా మాకు వచ్చే పింఛన్లను అడ్డుకుంది చంద్రబాబే. ఆయన మంచి చేయడు.. ఎవరైనా చేస్తుంటే చేయనివ్వడు. ఐదేళ్లుగా ఇంటివద్దే పింఛన్ అందుకున్నాను. గత రెండు నెలలుగా చంద్రబాబు, ఆయన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేశ్ కుట్రలతో మాకు కష్టాలు తెచ్చిపెట్టారు. ఇప్పుడు పింఛన్ తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోంది. నా బ్యాంకు ఖాతా ఇప్పుడు వినియోగంలో కూడా లేదు. – గంగాబాయి, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా